Krishna Sagar Rao
-
అసలు వారి ఎజెండా పాకిస్థాన్ జెండా: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మారాయన్నారు. భారతదేశం నడి బొడ్డున ఎంఐఎం మీటింగ్‌లో ఒక అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిందని, గతంలో ఎంఐఎం సీనియర్ నేత వారీస్ పఠాన్ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు ఎక్కడకు వెళ్లారని ధ్వజమెత్తారు. భారతదేశ ముస్లీంలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను.. ఎంఐఎం పార్టీ వ్యాఖ్యాలను ఖండించాలని పిలుపునిచ్చారు. సీఏఏ వ్యతిరేక ఊరేగింపులకు భారదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్ జెండా అంటూ కృష్ణ సాగర్ విమర్శించారు. సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం -
ఒవైసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దారుస్సలాం మైదానంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. సోమవారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. దారుస్సలాంలో జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభించడం మొదటిసారి జరిగిందని పేర్కొన్నారు. బారిస్టర్ చదివిన ఎంపీ అసద్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా లోక్‌సభలో బిల్లును చింపడంపై మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి మసిపూసి మారేడు కాయ చేసి ప్రచారం చేస్తున్నారంటూ బాధపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనుమానాలుంటే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ.. ఇస్లామిక్ దేశాల్లోని ముస్లింలకు కూడా లేదన్నారు. గతంలో అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ రెండోసారి రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవడంపై ఎందుకు స్పందించలేదని ఎంపీ అసదుదద్దీన్ను కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. -
‘మంత్రి ఈటలకు బీజేపీ సంఘీభావం’
సాక్షి, హైదరాబాద్ : సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. తెలంగాణ కోసం పోరాడిన ఈటలపై ఎంత ఒత్తిడి ఉందో ఆయన మాటలను బట్టి తెలుస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో రాజకీయ అనిశ్చితితో గ్రూపు రాజకీయాలు మొదలై తిరుగుబాటు జరుగుతోందన్న వాదనను ఈటల వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని తెలిపారు. మంత్రి పదవి ఎవరో ఇచ్చిన భిక్ష కాదన్న మాటలు కేసీఆర్‌ను ఉద్దేశించినవని అర్థమవుతోందని, దీనిపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలకు ఎప్పుడు వివరణ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ కేసీఆర్‌కు బహిరంగంగా ఛాలెంజ్ చేసినట్టేననీ, టీఆర్ఎస్ అంతానికి ఇది ఆరంభమన్నారు. పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ గ్రూపులున్నాయని దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. (చదవండి: మంత్రి పదవి భిక్ష కాదు) -
‘కేటీఆర్ ప్రాస కోసం గోస పడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ.. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కనీస విచారణ జరపడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థుల మృతిపై రాష్ట్రపతికి తొందరగా నివేదిక పంపకపోతే ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కృష్ణసాగర్ రావు ప్రస్తావిస్తూ.. ‘కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ ఎలాగో, టీఆర్ఎస్కు కేటీఆర్ అలా తయారయ్యారు. కేటీఆర్ ప్రాస కోసం గోస పడుతున్నారు. అతని కష్టం చూస్తే జాలేస్తోంది. ఆయన మాట్లాడేది అర్థం కాక కొంతమంది జనాలు చప్పట్లు కొడితే కేటీఆర్ మాత్రం సంబరపడుతున్నారు. బీజేపీ నాయకులం ఎంత ప్రయత్నించినా కేటీఆర్‌లాగా వ్యక్తిగత దూషణలు చేయడం రాదు. రాష్ట్రానికి అదృశ్య ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతను మభ్యపెట్టడానికి తన కొడుకుతో ఎదురుదాడి చేయిస్తే సరిపోదు. గడిచిన ఆరు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని కేటీఆర్‌కు సవాలు విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బాధ్యతాయుతమైన పార్టీ అనుకున్నాం, కానీ ఆ పార్టీ నేతల మాటలు చాలా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీలోకి వచ్చేది చెత్త నాయకులు అంటున్నారు, మరి ఆ చెత్త నాయకులను తయారు చేసింది కాంగ్రెస్ అని ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావును వేదికపై నుంచి గెంటివేస్తే కాంగ్రెస్ నాయకులు కనీసం ఖండించలేదని గుర్తు చేశారు. -
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్ రావు
సాక్షి, హైదరాబాద్ : సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరడంతోనే టీఆర్ఎస్లో కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్ బీజేపీని కాపీ కొడుతుందని ఆరోపించారు. సభ్యత్వ నమోదు వల్ల టీఆర్ఎస్కు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్నారు. కేసీఆర్ కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు తప్ప మిగతా ఎవరికి టీఆర్ఎస్లో గౌరవం లేదన్నారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో ఉంటేనే ప్రజల కోసం పని చేయగల్గుతామనే ఉద్దేశంతో తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కేసీఆర్‌కు రాద్ధాంతం చేయడం తప్ప ఎలాంటి సిద్ధాంతం లేదు.. అందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణసాగర్ రావు మండి పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవహారంలో ఒక్క కేసులోనైనా శిక్షలు వేశారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిలబడగల్గుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించింది.. అందుకు లావణ్య వ్యవహారమే ఉదాహరణ అన్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడం కేసీఆర్ వల్ల అయ్యేపని కాదన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చినందు వల్లే పలువురు నాయకులు బీజేపీలోకి వస్తున్నారన్నారు. -
అభివృద్ధి కోసం బీజేపీకే ఓటేయండి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన అవసరం లేదని, బీజేపీకి ఓటు వేస్తే మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం బీజేపీకే ప్రజలు పట్టంకట్టాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ చావుకు దగ్గరలో ఉందని, ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పార్టీని వీడిపోతున్నారన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ కొత్త పథకం ప్రకటించిందని, రాహుల్‌గాంధీ అమలుకు నోచుకోని హామీలను ఇస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పేదలను వాడుకుని వదిలేసిందన్నారు. హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి భగవంతరావు మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై అనర్హత వేటు వేయాలన్నారు. హైదరాబాద్‌లో ఆయనకు రెండు ఓట్లు ఉన్నాయని, ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఆ విషయాన్ని గుర్తించి ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అక్బరుద్దీన్ ఒవైసీ కూడా తన నామినేషన్ పత్రాల్లో భూమికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన నామినేషన్‌ను కూడా తిరస్కరించాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న కృష్ణసాగర్. చిత్రంలో భగవంతరావు -
‘ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళతారు’
సాక్షి, హైదరాబాద్: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాఫెల్ డీల్ మీద సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రఫెల్ డీల్‌లో లేనిపోని వివాదం సృష్టింపచి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పై ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత సర్కార్ అని క్లారిటీ ఉంది. సుప్రీం కోర్టు తీర్పుతో అది మరింత స్పష్టమైంది. రాహుల్, కాంగ్రెస్ పార్టీ నేతలు చవకబారు రాజకీయాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పుతో బహిర్గతమైంది. అవినీతి లేని ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ తల్లడిల్లుతోంది. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతామని అనుకున్న రాహుల్ గాంధీ కలలు ఆవిరి అయ్యాయి...ఇప్పుడు రాహుల్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ అసత్యాలు మాట్లాడుతారని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాహుల్ అనుకూడని మాటలు అన్నారు. ఈ తీర్పుతో దొంగలు ఎవరో దొరలు ఎవరో తేలిపోయిందని కృష్ణ సాగర్ రావు చెప్పారు. -
‘కేసీఆర్‌ను ఏ పార్టీలు విశ్వసించవు’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసీఆర్‌కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం.. టీఆర్ఎస్కు ఇదే చివరి ప్రభుత్వం’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావ్ విమర్శలు గుప్పించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తే ఆయ ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమవుతోందన్నారు. తాడు, బొంగరం లేని కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ఏ పార్టీలు విశ్వసించవన్నారు. మజ్లీస్‌ను పట్టుకుని ఊరుగేదామని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. మజ్లీస్‌ని జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని కేసీఆర్ నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డూరమని విమర్శించారు. దేశానికి ఒక సుప్రీం కోర్టు కాకపోతే.. రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 2019లో రెండు జాతీయ కూటముల మధ్యే యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు 2019కి ఎలాంటి గీటురాయి కావని వివరించారు. -
‘టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వం’
సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయనే నానుడి ఉందని, అది కాంగ్రెస్‌కు జరుగబోతుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన అనాలోచిత నిర్ణయం కారణంగా అభివృద్ధిపై జరగాల్సిన చర్చ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌పై జరిగిందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ మళ్లీ అమరావతికి సర్దుకోవాలని ఎద్దేవా చేశారు. రేపు (మంగళవారం) వెలువడే ఫలితాలు కాంగ్రెస్, టీడీపీ చెంప చెల్లుమనిపిస్తాయని జోస్యం చెప్పారు. టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి గడ్డం గీసుకునే యోగం లేదని, కొందరు కాంగ్రెస్ నేతలకు డబుల్ డిజిట్ ఓట్లు కూడా రావని అన్నారు. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేది లేదని, తాము ఆ పార్టీకి వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైతే టీఆర్ఎస్పై పోరాడింది తామేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా ఆహ్వానిస్తామని, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ముందుగానే గవర్నర్‌ను కలుస్తున్నారని పేర్కొన్నారు. తాము పక్కరాష్ట్ర సీఎంను నెత్తిన పెట్టుకునే తిరగలేదని, చంద్రబాబు అడ్రస్ గల్లంతుకావడం ఖాయమని తెలిపారు. ఓ వ్యక్తికి, శక్తికి వ్యతిరేకంగా నేతలంతా ఢిల్లీలో సమావేశం అవుతున్నారని, అధికారం కోసమే వాళ్లు కూటమి కడుతున్నారని మండిపడ్డారు. -
నిబంధనలను అతిక్రమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ఒంటరి పోటీ ద్వారా తమ పార్టీ సామర్థ్యం బయట పడిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారని, ప్రజాస్వామ్యంలో తాము ఈ ప్రయత్నం చేయడమే గెలుపుగా భావిస్తున్నామన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 20 రోజుల్లో కేంద్రంలో తాము ఏం చేస్తున్నామన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని, ఎన్ని సీట్లిచ్చిన బాధ్యతగా పనిచేస్తామని పేర్కొన్నారు. చింతమడకలో సీఎం కేసీఆర్ ఓటువేసిన తర్వాత టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి కోడ్ ఉల్లంఘించారన్నారు. ఎన్నికల బూత్ దగ్గర నిలబడి తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని, పవనాలు తమవైపే వీస్తున్నాయని చెప్పడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎం ఇలా చేయడం ఘోరమని, ఆయన వైఖరిని ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన అభ్యర్థిత్వాన్ని కొట్టివేయాలని, అనర్హుడిగా ప్రకటించాలని కోరినట్లు వెల్లడించారు. కల్వకుర్తిలో జరిగిన దాడిలో తమ పార్టీకి సంబంధం లేదని, అది కాంగ్రెస్ పార్టీ చేసిన సింపతి డ్రామా అని పేర్కొన్నారు. దాడిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘కాంగ్రెస్ భుజాలపై చంద్రబాబు స్వారీ’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం సోనియా గాంధీ మేడ్చల్ సభ జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టి పక్క రాష్ట్రమైన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడమేంటని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అంత చులకనగా కనిపిస్తున్నారా? అని అన్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబును ఇదివరకే ప్రజలు తిరస్కరించినందును సోనియా సభకు రాలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భుజాలపైకి ఎక్కి చంద్రబాబు స్వారీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో కూటమికి ఓటు వేస్తే ఓటుకున్న గౌరవం పోతుందని ఆయన అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డికి జీవితంలో గడ్డెం గీసుకునే యోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కామెడీ షోలో రాహుల్ గాంధీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని.. సోనియా గాంధీ మెయిన్ ఆర్టిస్ట్ అని పోల్చారు. రంగురంగుల కండువాలతో ఫోటోలు దిగడానికే సభను పెట్టుకున్నారని.. అందులో కోదండరాం జోకరుగా మారిపోయాడని విమర్శించారు. మజ్లీస్ మద్దతు లేకుండా టీఆర్ఎస్ అధికారంలోకి రాదని.. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందని అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. -
మజ్లిస్‌పై కృష్ణసాగర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చూసిందన్న అసదుద్దీన్.. టీఆర్ఎస్ నుంచి ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్తో కాపురం చేసేందుకు మజ్లీస్ సిద్ధమయిందని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. ఒవైసీ వాళ్ల వద్దకు వెళ్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓ రాజకీయ వ్యభిచారి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మద్యం అమ్మకాల్లో, నేరాల పెరుగుదలలో, దేశ ద్రోహులను పెంచడంలో, మీడియా మీద అంక్షలు పెట్టడంలో, అవినీతిలో, అబద్దాలు చెప్పడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నంబర్ 1 స్థానంలో నిలిచిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని.. ఈ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారుతాయని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన 500 కోట్లతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. అలాగే మంగళవారం టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరుల కోసం రాజీనామా చేశానని చెప్పిన విశ్వేశ్వర్‌రెడ్డి.. వారి కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. కారుకు పంక్చర్ కాబోతుందనే పార్టీ మారుతున్న విశ్వేశ్వరరెడ్డి.. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాడని వ్యాఖ్యానించారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పరిస్థితి మరింత బ్రష్టు పట్టిందని విమర్శించారు. -
కాంగ్రెస్ జాబితా..చంద్రబాబు ముద్ర
హైదరాబాద్: కాంగ్రెస్ జాబితా చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇపుడు కాంగ్రెస్ జాబితా పరిశీలిస్తే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార రెడ్డి పట్టుకోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ విడుదల చేసిన 65 అభ్యర్థులు ప్రజలతో ఉన్న నేతలు కాదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. మహా కూటమి ఓనర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. ఈ తెలంగాణ వ్యతిరేక కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారో కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మెజార్టీ సీట్లు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి, లోకేష్ హోంమంత్రి అవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కబ్జా చేశారని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీని నేతలు చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కుమార స్వామి మాదిరిగా టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినా చంద్రబాబు సీఎం పదవి చేపడతారని, కర్ణాటక మోడల్ రాజకీయాన్ని కాంగ్రెస్ తెలంగాణలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఓటేస్తారా లేక అన్నిరంగాల్లో విఫలమైన టీఆర్ఎస్కు ఓటేస్తారా లేక తెలంగాణ ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్‌కు ఓటేస్తారా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. మిషన్ భగీరథతో నీళ్లు రాకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడెందుకు ఓట్లు అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. -
‘వాళ్లు గెలిస్తే కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే ఎక్కువగా నాశనం చేస్తారని, కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో రాచరికపు పాలన ఉందన్నారు. రాహుల్ రెండు సభలకు జనం సరిగా రాలేదని, రాహుల్ మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్టు ఉందని, సభలు కామెడీ షో లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ ఏ రాష్ట్రంలో ఉన్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదన్నారు. అవినీతి ఆరోపణ లేకుండా కేంద్రంలో, ఇతర రాష్ట్రాల్లో పాలన చేస్తుంటే! రాఫెల్ అనే ఒక గడ్డిపోచ పట్టుకుని వాదిస్తున్నారని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘రాఫెల్ రేట్లు తెలవదు అని చెప్పి అవినీతి ఎలా జరిగింది అంటారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రాహుల్ కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడు కానీ.. కొత్త పార్టీకి కాదు. రాహుల్ కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజలు బీజేపీకి ఓటెయ్యాలి. కొత్తగా కాంగ్రెస్ పాలన చూడాల్సింది ఏమీ లేదు. రాహుల్ చెప్పే కథలు వినడానికి తెలంగాణ ప్రజలు తెలివి లేని వారు కాదు. తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ వస్తుంది. మిగిలిన 4 రాష్ట్రాలు కూడా బీజేపీనే గెలవబోతోంది’’అని అన్నారు. -
‘టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమిగా ప్రభుత్వం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒకే కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య ఎంఐఎం బ్రోకర్‌గా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్కు ఓటు వేసినట్లేనన్నారు. లక్షల ఉద్యోగాలు భర్తిచేస్తామన్న కేసీఆర్ వేల సంఖ్యల్లో కూడా నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. ఉత్తమ్ కుమార్ గాంధీభవన్‌లో కూర్చొని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికే బీజేపీని టీఆర్ఎస్తో ముడిపెడుతున్నారని విమర్శించారు. మోసపూరిత పార్టీలకు బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. -
‘ఆ పార్టీకి భయపడే కేసీఆర్ రాలేదా’
సాక్షి, హైదరాబాద్: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడంపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి భయపడే ముఖ్యమంత్రి భద్రాచలం రాలేదా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సీతారాముల కళ్యాణానికి రాకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు అవమానంగా భావిస్తున్నారని అన్నారు. నిజాం కాలం నుంచి కళ్యాణం రోజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. భద్రాచలంలో గులాబీ రంగు జెండాలు కట్టుకోవడం గుర్తుంది కానీ, దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడం గుర్తు లేదా అని ప్రశ్నించారు. మజ్లిస్‌కు భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని ముఖ్యమంత్రి, దీన్ని కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. రాజకీయల కోసం భారీగా ఖర్చు చేసే కేసీఆర్‌కు సెలవు రోజున భద్రాద్రికి రావడానికి ఏం అడ్డం వచ్చిందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని సీఎం కేసీఆర్ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రభుత్వ వ్యవహారాల వల్లే నిర్మల్‌లో అల్లర్లు జరుగుతున్నాయని తాము భావించాలా అని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా ప్రభుత్వ వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో వీడియో ఫుటేజ్‌ను హైకోర్టుకు అందిస్తానని అని హామీ ఇచ్చిన ప్రకాశ్‌ను ఆ కేసు నుంచి తప్పించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు లాయర్ హరీశ్ సాల్వేను రంగంలోకి దించడంతోనే ప్రభుత్వం తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని అన్నారు. అడ్వకేట్ జనరల్ చేయలేని పనిని హరీశ్ సాల్వే ఏం చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీరును చూసి ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారని, త్వరలోనే వాళ్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు. -
‘ఎంఐఎం హఠావో.. హైదరాబాద్ బచావో’
సాక్షి, హైదరాబాద్ : ఆకాశానికి హద్దు లేదు.. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు పద్దులేదు అన్న చందంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిథి కృష్ణసాగర్ రావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంపై బట్ట కాల్చి మీద వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు ఎవరో కూడా తెలియకుండా కేసీఆర్ కుటుంబం ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. ప్రతిదీ కేంద్రానిదే భాద్యత అని అంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో రైతులకు ఏం ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదట మీరేంచేశారో చెప్పిన తరువాత కేంద్రం గురించి మంత్రి హరీష్ మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులకు వెన్నుదన్నుగా నిలిచే విధంగా బడ్జెట్ రూపొందించిందని వ్యాఖ్యానించారు. కేంద్రం చూపిన విధంగా రైతులకు నేరుగా మార్కెట్లో అమ్ముకునే విధంగా మంత్రి హరీష్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై టీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్న వాదనలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎక్కడ బడితే అక్కడ కేసీఆర్ గొప్పోడిగా చెప్పుకునే అసదుద్దీన్ ఎందుకు అభివృద్ధి కావడం లేదని అడిగారు. భారత్ సైనికులకు మతం ఉండదనే విషయం అసదుద్దీన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసద్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి మాటలను మరోసారి చేయొద్దని బీజేపీ హెచ్చరిస్తోందని తెలిపారు. ఎంఐఎం హఠావో.. హైదరాబాద్ బచావో అనే నినాదంతో బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అసదుద్దీన్ ఓటమి చవిచూసే విధంగా పార్టీ కొత్త నేతలను ప్రోత్సహిస్తుందని వివరించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో మాట్లాడినందుకు సల్మాన్ నాజరీని అల్ ఇండియా ముస్లిం లా బోర్డు నుంచి అసదుద్దీన్ తొలగించారని చెప్పారు. ప్రమాదకరమైన రాజకీయాలకు అసదుద్దీన్ తెరలేపుతున్నారని విమర్శించారు. -
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే టూర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. జనం బాధలపై పవన్‌కు అవగాహన లేదని, కేవలం రాజకీయ అవకాశ వాదంతోనే యాత్ర పేరుతో రోడ్డెక్కారన్నారు. ఇది సీఎం కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా, సినిమా విభాగాల కన్వీనర్లు సుధాకరశర్మ, సీవీఎల్ఎన్ రావుతో కలసి మీడియాతో మాట్లాడారు. జనసేన స్థాపించి ఏళ్లు గడుస్తున్నా ఓ విధానం అంటూ లేదని విమర్శించారు. కేసీఆర్, చంద్రబాబు భజన చేస్తూ పవన్ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. పవన్‌ది విడుదలకు ముందే ఫ్లాప్ అయిన పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తిట్టుకున్న కేసీఆర్, పవన్ ఇప్పుడు ఎందుకు ఒక్కటయ్యారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించాలని చెప్పారు. -
గ్రామస్వరాజ్యం చిన్నాభిన్నం చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: పంచాయితీరాజ్ చట్టానికి సవరణలపై కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లీకులు నిజమైతే తాము తీవ్రంగా వెతిరేకిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు తెలిపారు. ఈ సవరణ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రతిపాదనలు చూస్తే నవ్వొస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సర్పంచ్ల హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం కావాల్సిన అవసరముందన్నారు. గ్రామ స్వరాజ్యం చిన్నాభిన్నం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయితీలకు రావడం సీఎం తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ చట్టం సవరణ కోసం ఏర్పాటు చేసిన ఉపసంఘం ఉత్తుత్తిదే అన్నారు. గ్రామ సర్పంచ్‌లపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని.. ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే సర్పంచ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే దీనికోసం తాను సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. ఎవరు పార్టీని వీడిన నష్టంలేదని.. పార్టీ నాయకుల కోసం కాదని.. దేశం కోసం పనిచేస్తుందని తెలిపారు. -
రాష్ట్రం డ్రగ్స్ డెన్‌గా మారింది: బీజేపీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ డెన్‌గా మారిందని బీజేపీ ఆరోపించింది. సర్కార్ ‘ఓపెన్ గేట్’ మద్యం పాలసీ కారణంగా యువత పెడదోవ పడుతోందని విమర్శించింది. మన దేశ సంస్కృతి, హైదరాబాద్ సంప్రదాయం కాని రాక్, పబ్ కల్చర్ హైదరాబాద్‌లో పెచ్చుమీరిందని బీజేపీ అధికారప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. విదేశీ సంస్థలు, కంపెనీలు కలిసి నగరంలో ఏడాదంతా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటి వల్లనే మద్యం, డ్రగ్స్ వాడకం పెరిగిందని చెప్పారు. డ్రగ్స్ ప్రభావానికి నగర వాసులు ముఖ్యంగా యువతీ యువకులు లోనవుతున్నారని వివరించారు. హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వశాఖల సాయంతో దేశ, విదేశీ సంస్థలు చేపట్టే కార్యక్రమాలు మద్యం, డ్రగ్స్ విక్రేతల కల్పతరువులుగా మారాయని ఆరోపించారు. టీఆర్ఎస్ హామీ ఇచ్చిన ‘బంగారు తెలంగాణ’ బదులు ‘ఉడ్తా తెలంగాణ’ గా రాష్ట్రం మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎవరికి ఎలాంటి రకం డ్రగ్స్ కావాలన్నా అందుబాటులోకి వచ్చేశాయని అన్నారు. సముద్ర తీరంలో ఉండే ముంబై, గోవాలకు వెళ్లి ఎంజాయ్ చేసే యువత ప్రస్తుతం హైదరాబాద్‌లోనే డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని తెలిపారు. -
‘అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందించాలి’
హైదరాబాద్: సమాజాన్ని విభజించేలా ఉన్న మజ్లిస్ నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. హిందుత్వ శక్తులు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కృష్ణసాగర్ డిమాండ్ చేశారు. అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. పాత నేరస్తుడైన అక్బర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీ గెలిచే అవకాశం ఉందనే భయంతోనే అక్బర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఓ పరాన్న జీవి అని ఇంతుకుముందు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ మద్దతుతో బతుకుతోందని వ్యాఖ్యానించారు. యూపీలో లాగానే ఇక్కడ కూడా ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తారనే భయం ఎంఐఎంను వెంటాడుతుందన్నారు. మతం పేరుతో ఓట్లు అడుగుతున్న మజ్లిస్‌పై వీడియోతో సహా ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు ఇస్తామని తెలిపారు. -
కుటుంబ సంపాదనను విరాళమిస్తున్నారా?
పోలీసులకు రూ.500 కోట్లు బహుమతిస్తామన్న సీఎం ప్రకటనపై బీజేపీ సాక్షి, హైదరాబాద్: పోలీసు వ్యవస్థ గౌరవం, ఔన్నత్యాన్ని తగ్గించేలా సీఎం కేసీఆర్ వ్యవహ రిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమ ర్శించారు. పోలీసులకు రూ.500కోట్లను బహు మానం ఇస్తామని సీఎం ప్రకటించడంపై మాట్లా డుతూ.. తమ కుటుంబ సంపాదనను కేసీఆర్ విరా ళంగా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. శనివారం కృష్ణసాగర్ విలేకరులతో మాట్లాడారు. పోలీసుల గౌరవం తగ్గించేలా సీఎం సమా వేశం సాగిందని, ఆ వ్యవస్థ అంతర్గత అంశాలను సీఎం బహిరంగ ప్రదర్శ నకు పెట్టడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్న హోంశాఖ, క్రైం విభాగ సమావేశాల పేర్లను మార్చాలని కేసీఆర్ ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉగ్రవాదులు విరుచుకుపడితే సీఎం, రాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలన్నారు. -
ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు నీడనిస్తోంది: బీజేపీ
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర పరిపాలనను తమ కుటుంబ పరిపాలనగా భావిస్తున్న పార్టీలకు ఇక భవిష్యత్తు ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ విస్తరణే ధ్యేయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారని చెప్పారు. అమిత్‌షా పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ స్పష్టత రాబోతోందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సర్కార్ నిద్రపోతోందని, పాతబస్తీలో ఐఎస్ఐఎస్ ప్రచారం చేస్తుంటే తెలంగాణ పోలీసులు ధర్నా చౌక్‌లో ప్టకార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రభుత్వం పోలీసులతో, అధికారులతో డ్రామాలు వేయిస్తోందని ఘాటుగా విమర్శించారు. రైతుల విషయంలో ప్రభుత్వం అధ్వాన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యానికి మద్దతు ధర ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం పాతబస్తీని ఎంఐఎంకు తాకట్టు పెట్టారని ఒవైసీ బ్రదర్స్‌కు , ఉగ్రవాదులకు నీడనిచ్చే పార్టీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో యోగిలాంటి నాయకులు రాష్ట్రానికి వస్తారని అన్నారు. -
పవన్ మానసిక స్థితి సరిగ్గా లేదు: బీజేపీ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మానసిక సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నట్లు ఉందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఎద్దేవా చేశారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడానికి రాజకీయాలంటే సినిమా కాదని ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దేశం మొత్తాన్ని టీం ఇండియాలా నడిపిస్తున్న ప్రధాని పనితీరుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సమగ్ర జాతీయత అనేది బీజేపీ ప్రాథమిక సిద్ధాంతమని, అంతే తప్ప ఉత్తర, దక్షిణ లాంటి విభేదాలేమీ లేవని చెప్పారు. పవన్ తన సినిమాల్లో మాదిరిగా ట్విట్టర్లో చిత్ర విచిత్రంగా పోస్టింగ్స్ పెడుతున్నారని, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ అన్న ప్రజారాజ్యం పెట్టి మంచి ధరకు దాన్ని అమ్మేశారని.. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటని కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. కేంద్రాన్ని విమర్శించేటప్పుడు దానికి ఆధారాలు ఉండాలని, ఇలాంటి ట్విట్టర్ కామెంట్లు రాజకీయ నిరుద్యోగతనానికి నిదర్శనమని విమర్శించారు. -
కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..
హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కావడం లేదని సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఏ అంశాల ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై పట్టుదల ఉంటే ఐదు రోజుల్లో ప్రత్యేక సమావేశం పెట్టి వారికి 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సవాల్ చేశారు. గురువారం పార్టీ నాయకులు సుధాకరశర్మ, డి.వాసులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ఆశ చూపించి గత ఎన్నికల్లో కేసీఆర్ ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రస్తుతం ముస్లిం రిజర్వేషన్ల ద్వారా రాష్ట్రంలో మత పరమైన రాజకీయాలు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓబీసీలకు పథకాల ఆశ చూపి సీఎం కేసీఆర్ తమ రిజర్వేషన్లలో కోత పెట్టె ప్రయత్నం చేస్తున్న విషయాన్ని బీసీలు గమనిస్తున్నారని అన్నారు.