Krishnamachari Srikkanth
-
గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్ క్రిష్టమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.ఐర్లాండ్‌తో జూన్ 5 నాటి మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.శుబ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడుఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘శుబ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడు.అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్ గైక్వాడ్‌కు టీమ్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.కానీ సెలక్టర్లకు శుబ్‌మన్ గిల్ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.తమకు నచ్చిన ఆటగాళ్లకేసెలక్షన్ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు.. శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో “Gill playing ahead of Rutu baffles me. Be is out of form and Rutu has had a better t20i career than gill. Gill will keep failing and he ll keep getting chances, he has favouritism of the selectors, this is just too much of favouritism” Krishnamachari Srikanth in his YT vid pic.twitter.com/PJmeiihxVx— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 1, 2024 -
'కోహ్లిని అలా చూసి చాలా బాధపడ్డా.. 11 మంది బ్యాటర్లతో ఆడాలి'
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్ములేపినప్పటికి .. బౌలర్లు మాత్రం మరోసారి చేతులెత్తేశారు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా ఆర్సీబీ బౌలర్లు బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్‌ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలింగ్ చాలా దారుణంగా ఉందని శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు. "ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ వంటి సీనియర్ బౌలర్లు కూడా పూర్తిగా తేలిపోయారు. నిన్నటి మ్యాచ్‌లో విల్ జాక్స్ మినహా మిగితా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీకి నేను ఇచ్చే సలహా ఒక్కటే. రాబోయో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 11 మంది బ్యాటర్లతో ఆడాలి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ రెండు ఓవర్లు, ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ 4 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అదే విధంగా విరాట్ కోహ్లి కూడా బౌలింగ్ చేయాలి. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే అన్ని పరుగులు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే కోహ్లి ఒక మంచి బౌలర్. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు స్టేడియం బయటకు బంతులను కొడుతుంటే కోహ్లి ముఖం వాడిపోయింది. కోహ్లిని అలా చూసిన నేను చాలా బాధపడ్డాను. బ్యాటింగ్ చేసే సమయంలో కూడా కోహ్లి చాలా కోపంగా ఉన్నాడు. అందుకు కారణం ఆర్సీబీ బౌలర్లే" అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
సెంచరీ కోసం స్వార్ధం.. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముంది..?
బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతమైన సెంచరీ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసినప్పటికీ విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీ మార్కును చేరుకునే క్రమంలో స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, కోహ్లి సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో కూడా సహకరించాడని (వైడ్ ఇవ్వకుండా) కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో కోహ్లికి టీమిండియా మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బాసటగా నిలిచాడు. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముందని కోహ్లిని ట్రోల్ చేస్తున్న వారిని ప్రశ్నించాడు. క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్లే ఈ విషయంలో కోహ్లిని నిందిస్తారని అన్నాడు. మామూలుగా సెంచరీ చేయడమంటేనే విశేషం. అలాంటిది వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో, అందులోనూ ఛేదనలో మూడంకెల స్కోర్‌ను చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. What is wrong in what virat did? I question ppl who don't understand cricket,note it is a huge deal to score A century in a world cup,@imVkohli deserves this & much more! kudos to a team man like @klrahul who deserved it against Aus in Chennai ! Enjoy when u still can #INDvsBAN — Kris Srikkanth (@KrisSrikkanth) October 19, 2023 అలాంటప్పుడు కోహ్లి చేసింది తప్పెలా అవుతుందని నిలదీశాడు. వాస్తవానికి కోహ్లి సాధించిన దాని గురించి పొగడాల్సింది పోయి, విమర్శలు చేయడమేంటని ప్రశ్నించాడు. ఛేదనలో ఒత్తిడికి లోనుకాకుండా, సహనం కోల్పోకుండా చివరివరకు బ్యాటింగ్ చేసినప్పుడు సెంచరీ మార్కును చేరాలనుకోవడంలో తప్పేమీ లేదని అన్నాడు. కోహ్లి ఈ సెంచరీకి వందకు వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లి స్వార్ధపరుడని విమర్శిస్తున్న జనాలు.. కొన్ని మ్యాచ్‌ల పాటు అతను సెంచరీ చేయకపోతే దుమ్మెత్తిపోయరా అని ప్రశ్నించాడు. ఇక అంపైర్ వైడ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం (కోహ్లి 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు) అనేది అతని పరిధిలోని అంశమని, దీనికి కోహ్లి సెంచరీని ముడిపెట్టడం సమంజసం కాదని ట్విటర్ వేదికగా కోహ్లిని విమర్శిస్తున్న వారికి చురకలు పెట్టాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
‘భారీ విజయాలపై ఇంగ్లండ్ దృష్టి పెట్టాలి.. లేదంటే కష్టమే'
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మరో విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంగ్లండ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఆదివారం అఫ్గానిస్తాన్‌తో పెద్దగా సవాలైతే ఎదురుకాదు. ఢిల్లీలో అఫ్గాన్ స్పిన్నర్లకు పిచ్ నుంచి సానుకూలత లేకపోతే మ్యాచ్ ఏకపక్షమయ్యే ఫలితంలో ఏ మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పొచ్చు. అయితే గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ బరిలోకి దిగేందుకు, ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్నెస్ ఎంతో కీలకం. ఏడాది క్రితం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ ఇంగ్లండ్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేశాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో అతను ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడని ఇదివరకు ఎన్నో సార్లు రుజువు చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆ్రస్టేలియా చిత్తుగా ఓడటం ఇంగ్లండ్ సహా సెమీస్ బరిలో ఉంటామనుకున్న మిగతా జట్ల ఉత్సాహంపై నీళ్లుచల్లింది. ఎందుకంటే ఇంగ్లండ్ కూడా న్యూజిలాండ్ చేతిలో అలాంటి పరాజయాన్నే చవిచూసింది. ఇలాంటి అత్యల్ప స్కోర్ల మ్యాచ్‌లతో నాకౌట్ దశ చేరేందుకు చివరికొచ్చేసరికి రన్‌రేట్ కీలకమవుతుంది. కాబట్టి సెమీస్‌లో ఎవరూ ఖాయమని అనుకోవడానికి లేదు. అయితే ఇంగ్లండ్... అఫ్గాన్ తదితర జట్లపై భారీ విజయాలపై దృష్టి పెడితే మంచిది. ఢిల్లీ లాంటి పిచ్‌పై ఇంగ్లండ్ బ్యా టర్లు చెలరేగేందుకు చక్కని అవకాశం కలి్పస్తుంది. చదవండి: విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం -
'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
వన్డే వరల్డ్‌కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంచుకున్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. "రాబోయే ఏడు వారాలు క్రికెట్ అభిమానులకు అన్ని రకాల వినోదం ఉండబోతుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ భారత్‌కు తిరిగి వస్తోంది. సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడతాయి. లీగ్ దశ ముగిశాక ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ దశ సెమీఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా. మాజీ విజేత భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్లను కచ్చితమైన టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణిస్తాను. భారత బ్యాటర్లతోపాటు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. చివరి నిమిషంలో గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రావడం భారత్‌కు మరింత మేలు చేసే విషయం. ఇక ఇంగ్లండ్ దూకుడైన ఆటతో తమకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకుంది. బెన్ స్టోక్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా మారింది. బౌలింగ్‌లోనూ కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద టోరీ్నల్లో, కీలక సమయాల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటు. అందుకే ఆ జట్టు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడటంద్వారా చాలా మంది ఆ్రస్టేలియా ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు కీలకం కానుంది. ప్రపంచకప్‌లో అత్యంత నిలకడమైన జట్లలో ఒకటిగా న్యూజిలాండ్‌కు పేరుంది. కేన్ విలియమ్సన్ రూపంలో ఆ జట్టులో సూపర్‌స్టార్ ఉన్నా... మిగతా ఆటగాళ్లు కూడా చివరి వరకు పోరాడేందుకు వెనుకాడరు. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ లేకపోవడం ఆ జట్టుకు లోటుగా ఉన్నా అతడి లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో చాలా మంది ఉన్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్ -
ఏపీఎల్ నిర్వహణ భేష్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నిర్వహణ చాలా బాగుందని.. యువ క్రికెటర్లకు ఇదొక మంచి వేదిక అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఏపీఎల్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించడానికి ముందు ఆదివారం ఆయన విశాఖలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకెంతో ఇష్టమైన ప్రదేశమిది. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. విశాఖ వేదికగా అనేక టోర్నిల్లో ఆడాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరు అద్భుతం. ఏపీలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీఎల్ తరహా టోర్నిల ద్వారా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుంచి దేశానికి మరింత మంది ప్రాతినిధ్యం వహించేలా ఏసీఏ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి’ అని సూచించారు. ‘టెస్ట్, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించేవిధంగా యువ క్రికెటర్లు తమను తాము మలుచుకోవాలి. సచిన్ ప్యాషన్‌తో ఆడితే.. కోహ్లి ప్యాషన్‌తో పాటు అగ్రెసివ్‌గా ఆడుతాడు. అది వారి స్టయిల్. నేను కూడా అగ్రెసివ్‌గానే ఆడేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఆటతీరుతో పాటు చిత్తశుద్ధి, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. నాకు మీడియాతో మంచి అనుబంధం ఉంది. మీడియా ఒక ఆటగాడిని ఎలివేట్ చేసేందుకు చాలా దోహదపడుతుంది. అది ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం’ అని శ్రీకాంత్ అన్నారు. ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఎల్ సీజన్–2కు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్, ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వెంకట్రావు పేరుతో ‘స్టాండ్’ గర్వకారణం అనంతరం విశాఖ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు ఏసీఏ మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావు పేరు పెట్టగా.. దానిని కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీఏ కార్యదర్శిగా వెంకట్రావు సేవలందిస్తున్న రోజుల్లోనే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పారు.ఆయన పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, అంపైర్ కమిటీ చైర్మన్‌గా, క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా, 2003 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు మేనేజర్‌గా తాను అందించిన సేవలకు ఇదో జ్ఞాపికగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రమణమూర్తి ఏపీఎల్‌లో తలపడుతున్న బెజవాడ టైగర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: భారత మాజీ కెప్టెన్
ICC ODI World Cup 2023 Winner Prediction: 2019 ప్రపంచకప్.. ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్.. అనూహ్య రీతిలో టై అయిన మ్యాచ్.. అవును.. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో టై.. ఊపిరి బిగపట్టుకుని అభిమానులంతా జగజ్జేత ఎవరా? అని ఆసక్తికగా ఎదురుచూస్తున్న తరుణంలో సూపర్ ఓవర్ మరింత హీట్ పెంచింది. బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చివరాఖరికి ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌నే విజయం వరించింది. ఫైనల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచిన బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత భారత్ వేదికగా ఈసారి ప్రపంచకప్ జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్ అక్టోబరు 5న మొదలై నవంబరు 19న ముగియనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే హాట్ ఫేవరెట్లపై చర్చ మొదలైంది. ఈసారి విజేత ఎవరంటే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి ఫేవరెట్లలో టీమిండియా ముందుంది. అయితే, ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయలేం. వాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. మరోవైపు.. ఇంగ్లండ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియన్లకు ఇండియాలో కూడా బాగా ఆడగల సత్తా ఉంది. నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఈ మూడు జట్లలో ఒకటి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుంది’’ అని శ్రీకాంత్ అంచనా వేశాడు. టీమిండియాకు సొంతగడ్డపై ఆడటం సానుకూలాంశమని.. ఇక ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆసీస్‌కు భారత్‌లో టోర్నీ ఉండటం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ చరిత్ర ఘనం కాగా ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలవగా.. ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగనుంది. ఇక 1983లో కపిల్ డెవిల్స్ భారత్‌కు తొట్టతొలి ప్రపంచకప్ అందించగా.. 2011లో మహేంద్ర సింగ్ ధోని రెండోసారి వన్డే వరల్డ్‌కప్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు స్వదేశంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది!! చదవండి: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! 2011 టోర్నీ మొత్తం ధోని కిచిడీనే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి.. -
ధోని చేతిలో మరో వజ్రాయుధం అతడు మరో బ్రావో...
-
BGT: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పొట్లం అయిపోతారు: భారత మాజీ కెప్టెన్
Border Gavaskar Trophy 2023 India vs Australia: ‘‘కాస్త దృష్టి పెట్టండి.. ఏదో ఒక అద్భుతం చేయండి బాస్!’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆస్ట్రేలియా మేనేజర్‌కు సందేశం పంపాడు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మీకు మరిన్ని చేదు అనుభవాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. స్పిన్నర్ల దెబ్బ.. విలవిల్లాడిన ఆసీస్ ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 9న ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఆరంభమైంది. అయితే, భారత స్పిన్నర్ల మాయాజాలం, స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల ధాటికి తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ చతికిలపడింది. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ రెండు మ్యాచ్‌లను రెండున్నర రోజుల్లోనే ముగించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగులు, 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరింత చేరువైంది. మరోవైపు.. మిగిలిన ఇండోర్(మార్చి 1-5), అహ్మదాబాద్(మార్చి 9-13) టెస్టుల్లో గనుక ఆసీస్ ఓడితే.. శ్రీలంకతో ప్రమాదం ఎదుర్కోకతప్పదు. ఆస్ట్రేలియా టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురై.. లంక న్యూజిలాండ్ గడ్డపై కివీస్‌ను వైట్‌వాష్ చేస్తే.. ఫైనల్ చేరడం ఖాయమనుకున్న ఆసీస్‌కు పరాభవం తప్పదు. ఇక ఇప్పటికే గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహాఆరుగురు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పొట్లం అయిపోతారు జాగ్రత్త! తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసీస్ మేనేజర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ సౌలభ్యం కోసం నేను ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతున్నా.. ఏదో ఒకటి చేయండి బాస్! ఈ సిరీస్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఏదో ఒకటి చేయండి అబ్బాయిలు.. లేదంటే మీరు ‘పొట్లం’ అయిపోతారు జాగ్రత్త! పొట్లం అంటే ప్యాకెట్ అని అర్థం. అయినా మీరిప్పటికే ప్యాకెట్ అయిపోయారు లెండి!’’ అని చిక్కా సెటైర్లు వేశాడు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అన్న అర్థంలో ఆసీస్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు. పోటుగాళ్లలా బిల్డప్ ఇచ్చి ఇప్పుడు చతికిలపడ్డారంటూ పరోక్షంగా పంచులు వేశాడు. చదవండి: Azam Khan: తుపాన్ ఇన్నింగ్స్.. 42 బంతుల్లోనే.. 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో.. T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. -
Ind Vs SL: వాళ్లిద్దరికి ఛాన్స్‌లు ఇవ్వాలి! ఇషాన్ ట్రిపుల్ సెంచరీ చేసేవాడేమో!
India vs Sri Lanka, 1st ODI: టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు శ్రీలంకతో తొలి వన్డేలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్‌లో సత్తా చాటిన సూర్యకు వన్డేలోనూ అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో మేనేజ్మెంట్ నిర్ణయం తనకు నచ్చలేదన్నాడు. గువహటి వేదికగా టీమిండియా- శ్రీలంక మధ్య వన్డే సిరీస్ మంగళవారం ఆరంభమైంది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌లో ఆడిన.. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్, శతక వీరుడు సూర్య కుమార్ యాదవ్ సహా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు మొదటి వన్డేలో చోటు దక్కలేదు. మ్యాచ్ ఫలితం మార్చగలరు! ఈ నేపథ్యంలో సిరీస్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో భారత మాజీ కెప్టెన్ శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న తరుణంలో సూర్య, ఇషాన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వీరికి ఉందని.. ఈ ఇద్దరికి జట్టులో స్థానం కోసం మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘వన్డే క్రికెట్లో ఆది నుంచే ప్రభావం చూపగల బ్యాటర్లు కావాలి. సారీ సూర్య! సూర్య ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌ను ఎప్పుడైనా ఎలాగైనా మలుపు తిప్పగలడు. శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో నిలకడగా ఆడగలడని నిరూపించుకున్న వాడే. కానీ.. సూర్య వన్డే ఫార్మాట్లో తనను తాను నిరూపించుకోవాలంటే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అతడు తుది జట్టులో ఉంటే అద్భుతాలు చేయగలడు. సూర్య విషయంలో నాకు చాలా బాదేసింది. మై డియర్ సూర్య నీకు తుది జట్టులో చోటు దక్కలేదు. సారీ!’ ఇక ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసేవాడేమో! కానీ దురదృష్టం అతడిని వెంటాడింది’’ అని చిక్కా అన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. గిల్ అర్థ శతకం, ఆకట్టుకోని అయ్యర్ అయితే, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చే క్రమంలో ఇషాన్‌పై వేటుపడింది. ఇందుకు అనుగుణంగా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గిల్ 60 బంతుల్లో 70 పరుగులు సాధించడం విశేషం. మరోవైపు.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 28 పరుగులకే పెవిలియన్ చేరడం గమనార్హం. చదవండి: Ind Vs SL-Playing XI: తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! Ind Vs Aus: టీమిండియాకు భారీ షాక్! కీలక ఆటగాడు దూరం! ఇలాగైతే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేదెట్లా?! రిచర్డ్స్, సచిన్, కోహ్లి, రోహిత్! కానీ ఇలాంటి బ్యాటర్ శతాబ్దానికొక్కడే! సూర్యను ఆకాశానికెత్తిన దిగ్గజం -
WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా
ICC ODI World Cup 2023- Team India: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్లుగా ఎదుగుతున్న ఓ ఇద్దరు ఆటగాళ్లకు తన జట్టులో చోటు ఇచ్చేది లేదని పేర్కొన్నాడు. తానే గనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిలో ఉంటే ప్రపంచకప్ జట్టు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వాళ్లు నలుగురు చాలు స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్‌కప్ జట్టులో శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు లేదు. ఇక పేసర్ల విషయానికొస్తే.. నలుగురు చాలు. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటే సరిపోతుంది. షమీ సో-సోగా ఆడతాడు. కాబట్టి తను అవసరం లేదు. దీపక్ హుడా జట్టులో ఉంటే బాగుంటుంది. వీళ్లందరికి జట్టును గెలిపించగల సత్తా ఉంది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల యూసఫ్ పఠాన్ వంటి రేసు గుర్రాలు జట్టులో ఉండాలని కోరుకుంటాం కదా! నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషభ్ పంత్. క్రిష్ణమాచారి శ్రీకాంత్ పంత్ ఉంటేనే పదింట మూడు మ్యాచ్‌లను గెలిపించినా నేను వాళ్లకే పెద్దపీట వేస్తాను. కీలక సమయంలో జట్టును గెలిపించే వాళ్లు కావాలి. పంత్ అలాంటి వాడే! ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు. రిషభ్ పంత్‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా అభిమానిగా కాకుండా.. చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడానంటూ ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ సొంతగడ్డపై ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ 20 మందితో జట్టును సిద్ధం చేస్తున్న వేళ శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్న తరుణంలో చిక్కా.. అతడికి తన జట్టులో చోటివ్వనని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మకు జోడీగా రాహుల్‌తో పాటు యువ ప్లేయర్లు ఇషాన్ కిషన్, గిల్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. చదవండి: Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! -
‘పాపం పంత్’.. తప్పంతా వాళ్లదే! కొన్నాళ్లు అతడికి బ్రేక్ ఇస్తేనే వరల్డ్‌కప్‌లో
India tour of New Zealand, 2022- ‘‘ముందు అతడికి బ్రేక్ ఇవ్వండి. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి రావొచ్చని చెప్పండి. నిజానికి మేనేజ్మెంట్ తన విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది’’ అని టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినప్పటికీ పంత్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస వైఫల్యాలు.. అయినా అవకాశాలు అయినప్పటికీ, న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ వికెట్ కీపర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మెగా ఈవెంట్ అనంతరం కివీస్‌లో పర్యటనలో భాగంగా భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా చేసిన స్కోర్లు.. వరుసగా 6, 11. ఇక ఆరంభ వన్డేలో నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతడికి రెండో వన్డలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పంత్‌పై విమర్శల వర్షం కురిపిస్తూ.. సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఫ్యాన్స్ బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో.. మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పు పంత్‌ది కాదు! ఎన్నడరా ఇది.. ‘‘రిషభ్ పంత్ విషయంలో మేనేజ్మెంట్ సరిగా లేదు. అతడిని సరిగ్గా హాండిల్ చేయలేకపోతున్నారు. తనకు కొంతకాలం బ్రేక్ ఇవ్వొచ్చు కదా! ఇంకో రెండు మూడు మ్యాచ్‌లలోనూ ఇలాగే వైఫల్యం చెందితే.. ఆ తర్వాత విశ్రాంతినివ్వడం లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయడం చేస్తారా? నిజానికి రిషభ్ పంత్‌కు యాజమాన్యం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. అతడి ఆట తీరు నన్ను పూర్తిగా నిరాశ పరిచింది. ఎన్నడ పంతూ ఇది’’ అని చిక్కా.. పంత్ పట్ల మేనేజ్మెంట్ వైఖరిని విమర్శించాడు. లోపాల్ని సరిదిద్దుకుంటేనే.. ‘‘నీకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే ఎంతో బాగుండేది. ఒకవేళ ఈ మ్యాచ్‌లలో నువ్వు మెరుగ్గా స్కోరు చేసి ఉంటే.. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ వస్తుంది. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ టోర్నీ ఉంది కదా! ఇప్పటికే చాలా మంది.. ‘‘పంత్ అస్సలు సరిగ్గా ఆడటం లేదు.. అతడికి జట్టులో చోటు అవసరమా?’’ అంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సమయంలో నీపై ఒత్తిడి పెరగడం సహజం. కాబట్టి లోపం ఎక్కడ ఉందో నీకు నీవుగా తెలుసుకో! ప్రతిసారి ఎందుకు అంత తొందరగా వికెట్ పారేసుకోవాల్సి వస్తుందో ఆలోచించుకో’’ అని మాజీ ఓపెనర్ శ్రీకాంత్ యూట్యూబ్ వేదికగా పంత్‌కు సలహాలిచ్చాడు. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్ -
WC 2024: నేనే చీఫ్ సెలక్టర్ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు!
T20 World Cup 2024- Team India Captain: భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌లోనే ఇంటి బాటపట్టి అభిమానులను నిరాశపరిచింది. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. పటిష్టమైన జట్టుగా నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్న భారత్‌కు ఇలాంటి పరాభవం ఎదురుకావడాన్ని ఫ్యాన్స్ సహా మాజీ ఆటగాళ్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే టీ20 వరల్డ్‌కప్ నాటికి సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకత, జట్టు కూర్పు గురించి పలువురు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు అంశం గురించి బీసీసీఐ సీరియస్‌గా ఆలోచించాలని సూచిస్తున్నారు. రోహిత్ శర్మను పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి కొత్త నాయకుడిని సిద్ధం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షో మ్యాచ్ పాయింట్లో ఈ మేరకు చిక్కా మాట్లాడాడు. శ్రీకాంత్- ఇర్ఫాన్ పఠాన్ నేనే గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే ‘‘ఒకవేళ నేనే గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే 2024 వరల్డ్‌కప్ నాటికి హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉండేలా చేస్తాను. ఈరోజు నుంచే జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తా. న్యూజిలాండ్ పర్యటన నుంచి సన్నాహకాలు మొదలుపెడతా. నిజానికి ప్రపంచకప్ టోర్నీకి రెండేళ్ల ముందు నుంచే అన్ని రకాలుగా జట్టును సిద్ధం చేసుకోవడం ఉత్తమం కదా! ఇందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవాలి. ఏడాది పాటు ప్రయోగాలు చేయండి. దీంతో 2023 నాటికి ఓ అవగాహన వస్తుంది’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ప్రపంచకప్‌లు ఎలా గెలిచామనుకుంటున్నారు ఇక జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘1983, 2011, 2007లో ప్రపంచకప్‌లు ఎలా గెలిచామనుకుంటున్నారు! జట్టులో ఫాస్ట్‌బాల్ ఆల్‌రౌండర్లు ఉండాలి. గతంలో ఉన్నారు కూడా! వాళ్లతో పాటు సెమీ ఆల్‌రౌండర్లు కూడా అవసరం. మనకు ఒక్క హుడా సరిపోడు.. చాలా మంది కావాలి’’అని ఈ మాజీ సారథి అన్నాడు. ఒకరు కాదు ఇద్దరు కావాలి ఇక శ్రీకాంత్ అభిప్రాయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. ‘‘హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. తనకు గాయాల బెడద కూడా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందే మీ ఈ నాయకుడు గాయపడితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కడు కాదు ఇద్దరు సారథులు కావాలి. ఒకరు అందుబాటులో లేకపోయినా వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు సిద్ధంగా ఉండాలి. అందుకోసం మరో కెప్టెన్‌ను కూడా సిద్దం చేసుకోవాలి. అలాగే ఓపెనింగ్ జోడీలకు కూడా సరైన ప్రత్యామ్నాయాలు వెదకాలి’’ అని పేర్కొన్నాడు. చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
కృష్ణమాచారి తెచ్చిన తంట.. మాజీ క్రికెటర్ బదానికి తీవ్ర గాయం!
టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. మరో మాజీ ప్లేయర్ హేమంగ్ బదానిని బ్యాట్‌తో తీవ్రంగా గాయపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీరిద్దరు ఎప్పుడు క్రికెట్ ఆడారనేగా మీ డౌటు. అదేం లేదు లెండి. ఆసియాకప్‌లో భాగంగా అఫ్గనిస్తాన్, శ్రీలంక మ్యాచ్ ప్రారంభానికి ముందు కామెంటరీ బాక్స్‌లో శ్రీకాంత్.. బ్యాట్‌తో ఒక షాట్ గురించి వివరించాడు. ఈ సమయంలో అతని పక్కనే ఉన్న బదానికి పొరపాటున బ్యాట్ తాకింది. బ్యాట్ బలంగా తాకడంతో బదాని కాసేపు నొప్పితో విలవిల్లాడాడు. అయితే కాసేపయ్యాకా బదాని గట్టిగా తగలడంతో కాసేపు నొప్పి పెట్టింది.. ఇప్పుడు సర్దుకుంది అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం బదాని ట్విటర్ వేదికగా స్పందించాడు. ''నా గాయం గురించి ఆరా తీసిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. బ్యాట్ తగిలినప్పుడు చాలా నొప్పిగా అనిపించింది. దేవుడి దయవల్ల ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకున్నా. తొందరగా కోలుకొని త్వరలోనే మీ ముందుకొస్తా'' అని వివరించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(37),గుర్బాజ్(40) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా ఒక్కడే ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్గాన్ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. #HemangBadani #KrisSrikanth#AsiaCup I am in terrible pain but luckily no fracture: Hemang Badani 👇 pic.twitter.com/uSx0Wduz1t — Express Cricket (@IExpressCricket) August 28, 2022 చదవండి: Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్ Mickey Arthur: హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ మాజీ కోచ్ -
Asia Cup: అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు.. నేనైతే: టీమిండియా మాజీ కెప్టెన్
Asia Cup 2022- India Squad Announced: ఆసియా కప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి స్థానం లేకపోవడం పట్ల టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ తానే గనుక ప్రస్తుత సెలక్టన్ టీమ్ చైర్మన్ అయి ఉంటే కచ్చితంగా షమీకి జట్టులో చోటు ఇచ్చేవాడినని ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. నలుగురు స్పిన్నర్లను తీసుకునే బదులు ఈ వెటరన్ పేసర్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. స్టార్ల పునరాగమనం! కాగా ఆగష్టు 27న ఆరంభం కానున్న ఆసియా కప్-2022 ఈవెంట్ నేపథ్యంలో బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా.. ఇన్నాళ్లు గాయంతో దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పునరాగమనం చేశాడు. ఇక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి సహా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజకు కూడా చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా భువనేశ్వర్ కుమార్ సహా యువ ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లు జట్టులో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కచ్చితంగా అతడికి జట్టులో స్థానం ఉండేది! ఈ మేరకు.. ‘‘నా జట్టులో అయితే షమీకి కచ్చితంగా చోటు ఉంటుంది. నేను గనుక ఇప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉండి ఉంటే అతడిని ఎంపిక చేసేవాడిని. రవి బిష్ణోయిని పక్కన పెట్టి షమీకి చోటిచ్చేవాడిని. నిజానికి అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండాల్సింది. అయితే, అశ్విన్- అక్షర్ పటేల్‌లలో ఎవరంటే సీనియర్‌కే నా ఓటు’’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ(PC: BCCI) ఏదేమైనా జట్టు ఎంపిక బాగానే ఉందని.. ఇది టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి బ్లూ ప్రింట్ లాంటిదని చిక్కా అభిప్రాయపడ్డాడు. కేవలం అక్షర్ పటేల్ విషయంలోనే తాను చింతిస్తున్నానన్న శ్రీకాంత్... ఆస్ట్రేలియా పిచ్‌లపై రాణించగల ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ప్రపంచకప్ జట్టులో స్థానం లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దీపక్ హుడా సైతం బ్యాట్, బాల్‌తో రాణించగలడని.. అందుకే జట్టులో స్థానం దక్కిందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు అలా.. ఐపీఎల్-2022లో ఇలా! గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో మహ్మద్ షమీ.. ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన షమీ.. అరంగేట్ర సీజన్లోనే జట్టు విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు తరఫున అతడికి పొట్టి ఫార్మాట్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఈవెంట్‌కు షమీ ఎంపిక కాకపోవడం గమనార్హం. ఆసియా కప్-2022కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. చదవండి: Hardik Pandya: టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! కచ్చితంగా సిద్ధమే.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో.. CWG 2022: కోవిడ్ అని తేలినా టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ ఆల్‌రౌండర్ -
WC 2022: వరల్డ్ నెం.1 బౌలర్‌గా..! ప్లీజ్ చేతన్ అతడిని సెలక్ట్ చేయవా!
T20 World Cup 2022: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే నంబర్ 1 బౌలర్‌గా ఎదిగే సత్తా అతడికి ఉందని కొనియాడాడు. రానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి అతడిని తప్పక ఎంపిక చేయాలని టీమిండియా సెలక్టర్లకు సూచించాడు. కాగా 23 ఏళ్ల అర్ష్‌దీప్ ఐపీఎల్-2022లో రాణించిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్ దిగ్గజాల చేత ప్రశంసలు అందుకున్న ఈ ఫాస్ట్‌బౌలర్.. అనతికాలంలోనే బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్నాడు. అర్ష్‌దీప్ అరంగేట్రం(PC: BCCI) ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2022 నేపథ్యంలో టీమిండియా పలు ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు సహా యువ బౌలర్లను పరీక్షిస్తోంది. భువీని కాదని.. వాళ్లిద్దరి చేత! ఇందులో భాగంగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో టీ20లో సీనియర్ పేసర్, డెత్‌ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్‌ను కాదని అర్ష్‌దీప్, ఆవేశ్ ఖాన్లకు బంతిని ఇచ్చాడు. మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో యువకులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపాడు. ఇక ఆవేశ్‌తో పోలిస్తే అర్ష్‌దీప్ ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శనతో అతడి కంటే ఓ అడుగు ముందే ఉన్నాడు. ప్లీజ్.. చేతు! ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్.. అర్ష్‌దీప్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్లో భవిష్యత్ కాలంలో వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా ఎదగగలడు. తనొక అద్బుతం అంతే! అర్ష్‌దీప్ సింగ్.. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో అతడు ఉంటాడు. కమాన్ చేతు.. ప్లీజ్ అర్ష్‌దీప్ పేరును పరిగణనలోకి తీసుకో’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మకు విజ్ఞప్తి చేశాడు. కాగా అర్ష్‌దీప్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే విండీస్‌తో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన అమెరికా వేదికగా శని, ఆదివారాల్లో జరుగనున్న చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచి ట్రోఫీ సొంత చేసుకోవాలని భావిస్తోంది. చదవండి: Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్.. -
Ind Vs WI: సూర్య కెరీర్ నాశనం చేయడానికే ఇలా! తగ్గేదేలే అంటున్న రోహిత్ శర్మ!
India Vs West Indies T20 Series- Suryakumar Yadav: ఇంగ్లండ్ పర్యటనలో తనదైన ఆట తీరుతో అభిమానుల మనసు కొల్లగొట్టాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో స్థానంలో బరిలోకి దిగి వరుసగా 39(19 బంతుల్లో), 15(11 బంతుల్లో), 117(55 బంతుల్లో) పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. సూర్య మాత్రం తన తొలి సెంచరీ నమోదు చేసి ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకున్నాడు. అంతేకాదు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంకు సాధించాడు. అయితే, వెస్టిండీస్ టూర్లో సీన్ మారిపోయింది. పూర్తిగా నిరాశపరిచాడు! విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌లలో సూర్యను ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దించారు. కానీ, ఈ రెండు సందర్భాల్లోనూ అతడు పూర్తిగా విఫలమయ్యాడు. రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగిన సూర్యకుమార్ తొలి టీ20లో 16 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేశాడు. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో జేసన్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రెండో టీ20లో 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఒబెడ్ మెకాయ్ బంతికి దొరికిపోయాడు. విండీస్ వికెట్ కీపర్ డెవాన్ థామస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే కొనసాగితే కెరీర్ నాశనం! దీంతో టీమిండియా అభిమానులు సూర్యను ఓపెనర్‌గా పంపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ‘‘అతడు ఓపెనర్ కాదు. ఆ విషయం మీకూ తెలుసు. కానీ ఎందుకిలా చేస్తున్నారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా ఆడేవాడు. ఇప్పుడు మాత్రం వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నాడు. ఇదంతా చూస్తుంటే సూర్య కెరీర్‌ను నాశనం చేసేందుకే మేనేజ్మెంట్ ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరు ఏ స్థానంలో మెరుగ్గా ఆడగలరో మీకు తెలియదా? తెలిసీ ఎందుకిలా చేస్తున్నారు’’ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది సూర్య ఓపెనర్‌గా పనికిరాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా తగ్గేదేలే: రోహిత్ శర్మ ఇదిలా ఉంటే.. రెండో టీ20లో ఓటమి తర్వాత కూడా తాము ప్రయోగాలకు వెనుకాడబోమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక టాస్ సమయంలోనూ.. రోహిత్ మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బ్యాటర్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఏ ఒక్కరిపైనో ఆధారపడాలని మేము భావించడం లేదు. అందుకే ఇలా మార్పులు చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2022 సమీపిస్తున్న తరుణంలో అన్ని విధాలా సన్నద్ధం కావడానికే ఈ ప్రయోగాలు అని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ అభిమానులు.. ‘‘ఇది ఇలాగే కొనసాగితే సూర్య కెరీర్ ముగిసిపోవడానికి ఎంతో కాలం పట్టదు. దయచేసి బ్యాటింగ్ ఆర్డర్లో అతడి స్థానం మార్చండి ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పంత్ ప్లేస్‌లో సూర్య.. సూర్య ప్లేస్‌లో పంత్! ఇక భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సైతం.. ‘‘అతడి(సూర్య)ని ఓపెనర్‌గా పంపొద్దు. విఫలమవుతున్నాడు. ఇదే కొనసాగితే ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. ఇది అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విండీస్ పర్యటనలో పంత్.. సూర్య ప్లేస్‌లో అంటే నాలుగో స్థానంలో ఆడుతుండగా.. సూర్య.. రోహిత్‌కు జోడీగా ఓపెనర్‌గా రావడం గమనార్హం. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన.. విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. కాగా వెస్టిండీస్- టీమిండియా మధ్య మంగళవారం(ఆగష్టు 2)న మూడో టీ20 జరుగనుంది. చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే! Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Watch as the #MenInMaroon celebrate clinching victory in the second match of the @goldmedalindia T20 Cup, presented by Kent Water Purifiers #WIvIND 🏏🌴 pic.twitter.com/UV5Sl2zfAc — Windies Cricket (@windiescricket) August 1, 2022 -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు! అయినా ద్రవిడ్‌తో నాకేంటి పని?
India Vs West Indies T20 Series 2022: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. వరుసగా రెండు అర్ధ శతకాలు సాధించడం(54, 63)తో పాటు.. మూడో వన్డేలో 44 పరుగులతో రాణించాడు. అయితే, విండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. టీ20 ఫార్మాట్లో తనకు పోటీగా మారుతున్న దీపక్ హుడా, సంజూ శాంసన్‌ను కాదని యాజమాన్యం తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. పాపం హుడా! ఇదిలా ఉంటే దీపక్ హుడా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించడంతో పాటు విండీస్‌తో వన్డే సిరీస్‌లో తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. మొదటి వన్డేలో 27 పరుగులు చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లో 33 పరుగులు చేయడంతో పాటుగా.. ఒక వికెట్ తీశాడు. ఇక మూడో వన్డేలో అతడికి ఆడే అవకాశం రాలేదు. టీ20 మొదటి మ్యాచ్‌లోనూ యాజమాన్యం ఛాన్స్ ఇవ్వలేదు. ఆల్‌రౌండర్లు ఉండాలి కదా! ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హుడాను ఈ మ్యాచ్‌లో ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్లో ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుందన్న అతడు.. హుడాకు తుది జట్టులో స్థానం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ మేరకు శ్రీకాంత్ ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడాడు. ‘‘హుడా ఎక్కడ? ఇటీవలి టీ20 మ్యాచ్‌లతో పాటు వన్డేల్లోనూ అతడు రాణించాడు. తప్పకుండా జట్టులో ఉండాల్సిన వ్యక్తి. టీ20 క్రికెట్లో ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది కదా! బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు.. అయినా బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎవరైనా పర్లేదు! మొత్తానికి సదరు ఆటగాళ్లు జట్టులో ఉండాలి’’ అని పేర్కొన్నాడు. అయితే, ఎక్స్పర్ట్ ప్యానెల్లో సభ్యుడైన టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాత్రం ఎవరైతే బాగా ఆడుతున్నారో వారికే ద్రవిడ్ భాయ్ ప్రాధాన్యం ఇస్తాడంటూ శ్రీకాంత్‌తో విభేదించాడు. ఇందుకు ఘాటుగా స్పందించిన చిక్కా.. ‘‘ఇక్కడ రాహుల్ ద్రవిడ్ ఆలోచనల గురించి అవసరం లేదు. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అది కూడా ఇప్పుడే చెప్పు’’ అని అడిగాడు. పరోక్షంగా టీమిండియా హెడ్‌కోచ్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇక చిక్కా ప్రశ్నకు బదులుగా.. ‘‘అవును.. ఈ మ్యాచ్‌లో హుడా ఉండాల్సింది. కచ్చితంగా అతడిని తీసుకోవాల్సింది’’ అని ఓజా పేర్కొన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ సేన 68 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి టీ20: ►వేదిక: బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 190/6 (20) ►వెస్టిండీస్ స్కోరు: 122/8 (20) ►విజేత: ఇండియా... 68 పరగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దినేశ్ కార్తిక్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు) చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Well played to @BCCI 🇮🇳 on 5 match series opener victory in the @goldmedalindia T20I Cup, powered by Kent Water Purifiers #WIvIND pic.twitter.com/eA7Wzfril1 — Windies Cricket (@windiescricket) July 29, 2022 -
ఇలాంటి పిచ్‌లతో కష్టం
ఊహించినట్లుగానే ఇంగ్లండ్ మెరుపు బ్యాటింగ్ లైనప్ ఆ జట్టుకు విజయాన్ని అందించింది. ఈ రోజుల్లో ఎంత భారీ స్కోరు చేసినా గెలుపుపై నమ్మకం ఉంచలేం. అందులోనూ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎలా ఆడాలో ఇటీవల బాగా ఒంటబట్టించుకున్న ఇంగ్లండ్‌తో అయితే అది మరీ కష్టం. ఏ దశలో కూడా ఆతిథ్య జట్టు తడబడకపోవడం చూస్తే ఈ ఫార్మాట్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలమో అర్థమవుతోంది. బంతికి, బ్యాట్‌కు మధ్య హోరాహోరీ పోరు జరిగే విధంగా పిచ్‌లో ఎంతో కొంత జీవం ఉంచాలి. కేవలం బౌండరీలు బాదడంలోనే పోటీ పడినట్లుగా మ్యాచ్ అనిపించకూడదు. అదే రోజు ప్రత్యర్థిని ఆలౌట్ కూడా చేయకుండా 92 పరుగులను కాపాడుకోవడం కూడా మనం చూశాం. ఈ రకంగా మరీ బౌలింగ్ పక్షాన కూడా అనుకూలత ఉండరాదు. నెమ్మదైన, టర్నింగ్ పిచ్‌లు రూపొందించడం తప్పు కాదు కానీ అదే అలవాటుగా మారిపోకూడదు. 50 ఓవర్ల క్రికెట్ బాల్యావస్థలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై కూడా సగటున ఓవర్‌కు నాలుగు పరుగులే వచ్చేవి. ఆ తర్వాత బరువైన బ్యాట్లు రావడం, తెల్ల బంతి పూర్తిగా స్వభావం మార్చుకోవడం, మధ్యాహ్నం సమయంలో మ్యాచ్‌లు మొదలు కావడంతో పాటు పస లేని పిచ్‌లు రావడంతో బంతికో పరుగు చొప్పున చేయడం సాధారణంగా మారిపోయింది. నా దృష్టిలో 150–160 స్కోరు చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు కూడా సమాన విజయావకాశం ఉంటే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. అభిమానులు అలాంటి మ్యాచ్‌లు చూసేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు టి20ల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి నిర్వాహకులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారి పరిస్థితి కూడా వన్డేలలాగే మారుతుంది. ఇక చివరి టి20 విషయానికి వస్తే ఇంగ్లండ్ చాలా బలంగా కనిపిస్తుండగా, ముందుగా బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వికెట్‌ను చూస్తే ఎంతటి లక్ష్యమైనా ఛేదించవచ్చని అనిపిస్తుంది. ఈ స్థితిలో టాస్ కీలకం. పాక్ ఫీల్డింగ్ ఎంచుకొని ఇంగ్లండ్‌ను 200 లోపు కట్టడి చేయగలిగితే సిరీస్ సమం చేసేందుకు వారికి మంచి అవకాశం లభిస్తుంది. -
స్టోక్స్ ఆట చూడతరమా!
ఇంగ్లండ్‌లో వర్షాన్ని, క్రికెట్‌ను విడదీసి చూడలేము. సాఫీగా సాగుతున్న మ్యాచ్ ఫలితాన్ని వాతావరణం శాసించడం చాలా నిరాశకు గురి చేసింది. జరిగిన ఆటలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ టామ్ బాంటన్ ఆకట్టుకున్నాడు. మైదానాల్లో ప్రేక్షకులను అనుమతించేందుకు మరికొన్ని రోజులు పడుతుంది. అదృష్టవశాత్తు క్రికెట్లో అందునా టి20 ఫార్మాట్‌ను టెలివిజన్ వీక్షకులకు కనులవిందుగా ఉంటుంది. రాబోయే కొన్ని వారాల్లో క్రికెట్ మ్యాచ్‌లు వరుసగా జరగబోతున్నందున ఓ అభిమానిగా చాలా ఆనంద పడుతున్నాను. వ్యక్తిగతంగా నేను బెన్ స్టోక్స్ ఆటను చూడాలనుకుంటున్నాను. కెరీర్ ఆరంభంలో బౌలర్‌గా జట్టులోకి వచ్చి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు టాప్ ఆర్డర్‌కు ఎదిగిపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు అతను పూర్తి విశ్వాసంతో ఆడతాడు. ఇతర జట్లలోని ఆల్‌రౌండర్లతో పోలిస్తే స్టోక్స్ అత్యుత్తమం అని చెప్పవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ స్టోక్స్ ఆధిపత్యం చలాయించడం అతని గొప్పతనాన్ని చాటి చెబుతోంది. అలనాటి మేటి ఆల్‌రౌండర్లతో స్టోక్స్‌ను ఇప్పుడే సరిపోల్చడం తగదుగానీ అతను తన ఆట ముగించేలోపు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నిలిచిపోతాడని నమ్మకంతో ఉన్నాను. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆడిన ఇన్నింగ్స్... ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఒంటిచేత్తో గెలిపించిన ఇన్నింగ్స్ అతని మానసిక దృఢత్వాన్ని సూచిస్తోంది. బౌలర్‌గా అతను వికెట్లు తీసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఫీల్డింగ్‌లోనూ పాదరసంలా కదులుతాడు. జట్టులో అతని పాత్ర ఎలాంటిదో అంకెల ద్వారా నిర్ణయించలేము. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల కొరత ఉన్న దశలో స్టోక్స్ కొత్త ఆశాకిరణం. రాబోయే ఐపీఎల్లో స్టోక్స్ ఆటను చూడాలని కుతూహలంతో ఉన్నాను. ఇక ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య నేడు జరిగే రెండో టి20 మ్యాచ్‌లో ఇరు జట్లూ సమతూకంతోనే కనిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్‌ది కాస్త పైచేయిగా ఉంది. వరుణ దేవుడు కరుణిస్తే మాత్రం అభిమానులకు ఉత్కంఠభరిత పోరును తిలకించే అవకాశం లభిస్తుంది. -
ఫేవరెట్ ఇంగ్లండ్
అత్యంత అరుదైన, క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం కావడానికి తోడ్పడిన ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో నియమ నిబంధనలు పాటించాలంటే చాలా క్రమశిక్షణ, అంకితభావం కావాలి. సరైన సన్నాహాలు లేకుండానే క్రికెటర్లు బరిలోకి దిగి గత ఆరు టెస్టుల్లో నాణ్యమైన క్రికెట్‌ను ఆడారు. ఎంత పేరున్న క్రీడాకారులైనా విరామం తర్వాత బరిలోకి దిగి ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం తీసుకుంటారు. ఇక నేటి నుంచి మొదలయ్యే ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లోనూ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్లకు ఈ సిరీస్ ఐపీఎల్ టోర్నీకి ప్రాక్టీస్‌లా పనికొస్తుంది. పాకిస్తాన్ జట్టుకేమో తమ యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించే అవకాశం లభించనుంది. అన్ని ఫార్మాట్లలో రాణించే బ్యాట్స్‌మన్‌గా పేరున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పైనే అందరి దృష్టి ఉండనుంది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో పాక్ సమతూకంగా కనిపిస్తోంది. టెస్టు ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంచి ఆలోచన. వన్డే, టి20 ఫార్మాట్లలో ఇంగ్లండ్ విజయరహస్యం కూడా ఇదే అంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్‌లో ఇతర జట్లూ దీనిని అనుసరించే అవకాశముంది. బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ టి20 జట్టులోనూ తమ స్థానాలను నిలబెట్టుకుంటారు. అయితే ఇంగ్లండ్ టెస్టు జట్టులోని ఇతర ఆటగాళ్లకు టి20ల్లో ఆడే చాన్స్ రాకపోవచ్చు. సొంతగడ్డపై ఆడనుండటం, జట్టులో పవర్ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఉండటంతో టి20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయలేము. మొత్తానికి టి20 సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అనుకుంటున్నాను. రెండు జట్లకు నా తరఫున అభినందనలు. ఉత్తమ జట్టునే విజయం వరిస్తుందని ఆశిస్తున్నాను. -
శ్రీకాంత్‌గా నటించడం ఓ వరం
చెన్నై: ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్‌గా నటించడం వరం అని యువ నటుడు జీవా పేర్కొన్నారు. పూర్వ భారత క్రికెట్ క్రీడా జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్ బయోపిక్‌ను 83 పేరుతో చిత్రంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో ప్ర పంచకప్ను సాధించిన జట్టులో కృష్ణమాచారి శ్రీ కాంత్ భాగస్వామ్యం ఎంతో ఉందన్నది అందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆయన ఒక క్రికె ట్ క్రీడాకారుడిగా తమిళనాడుకు పేరు తీసుకొచ్చారు. కాగా ఈ 83 చిత్రంలో కృష్ణమాచారి శ్రీ కాంత్ పాత్రలో నటుడు జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆ పాత్రకు నటుడు జీవాను ఎంచుకోవ డం గురించి చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్ తెలుపుతూ చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్ గురించి ఆ లోచించగా ఆయన చలాకీతనం, వేగం, బ్యాటింగ్‌లో తనదైన స్టైల్ ప్ర ధానాంశాలు అనిపించాయన్నారు. అదేవిధంగా 1983లో ప్రపంచకప్ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న 83 చిత్రంలో అప్పటి జట్టులో ఉన్న వారి పాత్రల్లో నటులను ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అప్పుడు కృష్ణమా చారి శ్రీకాంత్ పాత్రలో ఎవరిని నటింపజేయాలన్న విషయంలో ఆయన మా దిరి చలాకీగా ఉండే నటుడి కోసం అన్వేషించగా నటుడు జీవా బాగా నప్పుతారని భావించామన్నారు. జీవాలోనూ మంచి క్రికెట్ క్రీడాకారుడు ఉండటంతో 83 చిత్రానికి మరింత బలం చేకూరిందని చెప్పారు. కాగా కృష్టమాచారి శ్రీకాంత్ బ్యాటింగ్ స్టైల్ ను అనుచరించడం కోసం జీవా చాలా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్రలో జీవా కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని దర్శకుడు అన్నారు. కాగా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించడం గురించి జీవా మాట్లాడు తూ క్రికెట్ క్రీడ అంటే తనకు చిన్న వయసు నుంచే ఇష్టం అన్నారు. అలాంటిది 83 చిత్రంలో కృష్ణమా చారి శ్రీకాంత్ పాత్రలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో పట్టరాని ఆనందం కలిగిందన్నారు. తన జీవితంలో రెండు లక్ష్యాలు ఒకే సా రి నెరవేరుతున్నట్లు భావన కలిగిందని అన్నా రు. నటుడు అయిన తరువాత తనకు ఇష్టమైన రంగం క్రికెట్ అని పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ వి ధి విధానాలను తమిళనాడులో పరిచయం చే సింది కృష్ణమాచారి శ్రీకాంత్నేనని అన్నారు. అలాంటి పాత్రలో నటించడం తనకు వరం లాంటిదని జీవా పేర్కొన్నారు. ఈ పాత్రకు తనను ఎంపిక చేసిన దర్శకుడు కబీర్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన ని అన్నారు. ఇక ఇండియాలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రణ్‌వీర్‌సింగ్‌తో కలసి ఈ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నా రు. కాగా 83 చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
‘నేనైతే ధావన్‌ను ఎంపిక చేయను’
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా గాయం కారణంగా భారత క్రికెట్ జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ రీఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్నాడు. పూర్తి ఫిట్నెస్తో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమయ్యాడు. అయితే తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, మిగతా రెండులు జరిగితే ధావన్ పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడో లేదో తెలుస్తుంది. ఇటీవలే తన క్లాస్ శాశ్వతం అంటూ ప్రకటించిన ధావన్.. ఆడటం-ఆపేయడం చేస్తూ ఉన్నప్పటికీ తానేమీ ఆటను మరిచిపోలేదన్నాడు. తప్పకుండా పరుగులు సాధించి సత్తాచాటతానని ధీమా వ్యక్తం చేశాడు.(ఇక్కడ చదవండి: రాహుల్ భర్తీ చేశాడు.. కానీ నా క్లాస్ శాశ్వతం!) అయితే అసలు భారత క్రికెట్ జట్టులో ధావన్ అనవరసం అనే విధంగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు. తానే గనుక చీఫ్ సెలక్టర్‌గా ఉంటే ధావన్‌ను ఎంపిక చేయనన్నాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ధావన్ ఓపెనర్‌గా అనవసరమన్నాడు. ‘ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పరుగుల్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు సత్తాచాటిన అది వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీకి ప్రామాణికంగా తీసుకోకూడదు. నా దృష్టిలో రాబోయే వరల్డ్ టీ20కి ధావన్ అనవసరం. అతను వద్దే వద్దు. నేనే చీఫ్ సెలక్టర్ స్థానంలో ఉండి ఉంటే ధావన్‌ను ఎంపిక చేయను. ఓపెనర్‌గా ధావన్ కంటే కేఎల్ రాహులే అత్యుత్తమం. ఇక్కడ రాహుల్‌కు ధావన్‌కు పోటీనే లేదు. వీరిద్దరిలో రాహులే విన్నర్. విజేత ఒక్కడే ఉంటాడు’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
సీకే నాయుడు అవార్డుకు ఎంపికైన శ్రీకాంత్, అంజుమ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఈ ఏడాదికి గానూ భారత దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళల జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రాలు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును వచ్చే నెల 12వ తేదీన ముంబైలో జరిగే బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఇవ్వనుంది. వీరిద్దరూ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ వారిని సీకే నాయుడు అవార్డుతో సత్కరిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైకు చెందిన శ్రీకాంత్... భారత్‌కు 1981–1992 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేసిన ఈ 60 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్... భారత్ 1983లో తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడు. అంతేకాకుండా అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే భారత్ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెల్చుకోవడం విశేషం. 1989లో ఇతని సారథ్యంలోనే సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 42 ఏళ్ల అంజుమ్ చోప్రా తన కెరీర్లో 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టి20లు ఆడింది. -
‘సెమీస్‌లో అతనిదే కీలక పాత్ర’
మాంచెస్టర్: టీమిండియా ప్రధాన పేస్ ఆయుధం జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. భారత్ సెమీస్‌కు చేరడంలో బుమ్రా ముఖ్య పాత్ర పోషించాడని కొనియాడాడు. ఇక న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి సెమీ ఫైనల్లో సైతం బుమ్రానే కీలక పాత్ర పోషిస్తాడని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.‘వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు బౌలింగ్‌లో బుమ్రా ప్రధాన ఆయుధం. కొత్త బంతితో అతను అద్భుతాలు చేయగలడు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న జోడీని కూడా విడదీయగలిగే సత్తా అతని సొంతం. దీనికితోడు ఎప్పటిలాగే డెత్ ఓవర్లలోనూ అదే జోరు సాగిస్తున్నాడు. లీగ్ దశలో ఇంగ్లండ్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో అదే నిరూపితమైంది’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంచితే బ్యాటింగ్ విభాగంలో ఐదు శతకాలతో రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మను కూడా ఈ మాజీ క్రికెటర్ ప్రశంసించాడు. ‘నిదానంగా, ప్రశాంతంగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న రోహిత్ మొదటి పవర్‌ప్లేలో పరుగులు రాకున్నా.. ఎక్కడా ఇబ్బందికి లోనుకావడం లేదు. చాలామంది ఆటగాళ్లు ఈ విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శిస్తారు. కానీ రోహిత్ అలా కాదు. నిదానంగా ఇన్నింగ్ ఆరంభించినా.. చివర్లో ప్రమాదకరంగా మారుతున్నాడు’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. మంగళవారం మాంచెస్టర్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తొలి సెమీ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే.