Loneliness
-
ఆ ఊరు వాంరదరికీ ఒకటే కిచెన్..!
ఊళ్లో పేదరికం కనిపిస్తుంది’ అనే మాట వినిపిస్తుంటుంది. అయితే గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో ‘పేదరికం’ కంటే ఒంటరితనమే ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి ఒక గ్రామం... చందనంకి. ఒంటరితనం బాధితులైన ఈ ఊరి వృద్ధులు ‘కమ్యూనిటీ కిచెన్’లతో ఒంటరితనానికి దూరం కావడమే కాదు కొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారు.గుజరాత్‌లోని మెహసానా జిల్లా చందనంకి గ్రామంలో... పిల్లల కేరింతలు కనిపించవు. యువకుల ఆకతాయి మాటలు వినిపించవు. వృద్ధులు తప్ప ఎవరూ కనిపించని ఆ ఊళ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లుగా ఉంటుంది. ఊరే ఒక వృద్ధాశ్రమంగా మారినట్లు అనిపిస్తుంది.అసలు ఈ ఊరి వాళ్లు ఎక్కడికి వెళ్లారు?చాలామంది పట్టణాల్లో స్థిరపడ్డారు. వారి కొడుకులు, కూతుళ్లు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో చదువుకుంటున్నారు. ఒకప్పుడు సందడికి చిరునామాగా ఉన్న ఆ ఊరు ఇప్పుడు నిశ్శబ్దానికి నిర్వచనంలా మారింది. కేవలం అయిదు వందల మంది మాత్రమే ఆ ఊళ్లో ఉంటున్నారు. వారిలో అత్యధికులు వృద్ధులే. ‘మా అబ్బాయి ఎప్పుడోగానీ నన్ను చూడడానికి రాడు’ అంటుంది ఒక బామ్మ.‘నన్ను నీతోపాటు తీసుకెళ్లరా అని మా అబ్బాయితో ఎన్నో సార్లు అంటాను. కాని నా మాట పట్టించుకోడు’ అంటుంది కోపంగా మరో బామ్మ. ‘నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు. మాతోపాటు వచ్చేయ్ అంటారు పిల్లలు. కాని నేను ఆ పట్టణాల్లో ఉండలేను. ఇక్కడే పుట్టాను. ఇక్కడే చస్తాను’ ఊరి మీద ప్రేమ వ్యక్త పరుస్తుంది ఇంకో బామ్మ. ఒంటరి దీపాలుగా మారిన బామ్మలకు ఊళ్లోనే ఉండిపోవడానికి వేరు వేరు కారణాలు ఉండవచ్చు. అయితే అందరినీ ఏకం చేసిన కారణం... ఒంటరితనం.ఒంటరితనం మాట ఎలా ఉన్నా ఊళ్లో చాలామంది వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. అయినప్పటికీ వారిని పట్టించుకునేవారు లేరు. అనారోగ్యంతో వంట చేసుకోవడం వారికి ఇబ్బందిగా మారింది. ఒక్క పూట కోసం వంట వండుకున్న వాళ్లు ఓపిక లేక అదే భోజనాన్ని మరుసటి రోజు కూడా తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.... ఈ నేపథ్యంలోనే గ్రామస్తుల ఆలోచన నుంచి ‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటయింది.నెలకు రెండు వేలు చెల్లిస్తే... ప్రతి పూటా వేడి వేడి భోజనం చేయవచ్చు. ఆరోగ్యకరమైన భోజనం మాట ఎలా ఉన్నా ‘కమ్యూనిటీ కిచెన్’ అనే పెద్ద ఫ్యామిలీలో వృద్ధులందరూ కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ఒకరితో ఒకరు ఎంతోసేపు మాట్లాడుకుంటున్నారు. దీని వల్ల తమలో తెలియని ఆత్మీయత పెరిగింది. గతంలో ఎవరి ఇంట్లో వారు ఉండడం వల్ల ఎవరు ఎలా ఉన్నారు అనేది తెలిసేదికాదు. ఇప్పుడు రోజు కలుసుకోవడం వల్ల అన్ని విషయాలు మాట్లాడుకోగలుగుతున్నారు. మనసులో భారం దించుకొని ఒంటరితనానికి దూరం అవుతున్నారు. ఒకరి పక్కన ఒకరు కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ కలిసి తినడం అనేది భోజనానికి సంబంధించిన విషయమే కాదు మానసికంగా శక్తిని ఇచ్చే విషయం అని ఈ ఊరి ‘కమ్యూనిటీ కిచెన్’ నిరూపిస్తుంది. ‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటులో పూనమ్భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. భార్యా, బిడ్డలు పట్టణంలో ఉన్నా సరే, తాను మాత్రం ఊరిను వెదుక్కుంటూ వచ్చాడు. ఎంతోమంది వృద్ధులకు బిడ్డగా మారాడు. ‘కమ్యూనిటీ కిచెన్’ల కోసం గ్రామస్తులు నెల జీతంతో కుక్‌లను నియమించుకున్నారు. వారికి ఉచిత నివాసం కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో సందడి లేకపోయినా ‘కమ్యూనిటీ కిచెన్’లో మాత్రం సందడి ఉంటుంది. నవ్వులకు దూరం అయిన వృద్ధుల నవ్వులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ‘కమ్యూనిటీ కిచెన్’ సాధించిన విజయం గురించి చెప్పుకోవడానికి ఈ నవ్వులే సాక్ష్యం.(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్‌ను, పెయింటింగ్‌ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్‌కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్‌లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్‌లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్‌ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్‌ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్‌ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్‌ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
Thodu Needa Founder Rajeswari: సీనియర్ సిటిజన్స్‌కు భరోసా ఏది?
దేశం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన జనాభా మార్పుకు గురవుతోంది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గడం, అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాల వల్ల భారతదేశ జనాభాలో వృద్ధుల వాటా నిశ్శబ్దంగా పెరుగుతోంది. అయితే, దీనికి తగినట్టుగా వారి ఆర్థిక శక్తి పెరగడం లేదు. ఫలితంగా వృద్ధులు సొంత కుటుంబాల నుంచే ఈసడింపులకు, వేధింపులకూ గురవుతున్నారు. వృద్ధుల జీవితం భరోసాగా గడవడం ఎలా?! పాశ్చాత్య దేశాల మాదిరి కాకుండా భారతదేశంలోని 40 శాతం మంది వృద్ధులు అత్యంత పేదరికంలో ఉన్నారు. 60 నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఆర్థిక, ఇతర అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వృద్ధులు కుల, వర్గ ఆధారిత వివక్షకూ గురవుతున్నారు. గ్రామాల్లో పెను సవాల్! నగరాలలో ఉండే సీనియర్ సిటిజన్స్ జీవితాలతో పోల్చితే గ్రామాల్లో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వీరు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నారు. మన ఆరోగ్య విధానం సాధారణంగా మాతా, శిశు సంరక్షణపైనే ఉంటుంది. వృద్ధుల సంరక్షణకు అంతగా ్రపాధాన్యత ఇవ్వడం లేదు. గ్రామీణ వృద్ధులలో ప్రత్యేకించి మహిళలు ఆర్థిక, అవసరాల కోసం వారి కుటుంబాలపై పూర్తిగా ఆధారపడుతున్నారు. మన దేశంలో వృద్ధుల సంరక్షణ ఎక్కువ భాగం వారి పిల్లలు చూసుకోవడం ఆనవాయితీ. అయితే, కాలంతో పాటు ఈ విధానాలూ వేగంగా మారుతున్నాయి. పిల్లల వలస.. పెరుగుతున్న ఒంటరితనం విద్య, ఉద్యోగాల కోసం పిల్లలు వలసలు వెళ్లడం, ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్చిన్నం కావడం, వృద్ధుల సంరక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. నివేదికల ప్రకారం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 6 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారు. 20 శాతం మంది పిల్లలు లేకుండా వారి జీవిత భాగస్వామితో మాత్రమే జీవిస్తున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తక్కువ ఆదాయ కుటుంబాలలో వృద్ధుల ఆరోగ్య అవసరాలు ఆర్థికంగా భరించలేనంత భారంగా మారుతున్నాయి. భారతదేశంలో వృద్ధులపై వేధింపుల కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ నివేదిక ప్రకారం 25 శాతం మంది పెద్దలు తమ సొంత కుటుంబాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. సామాజిక భద్రత హె ల్ప్ ఏజ్ ఇండియా సూచనల మేరకు.. ► దేశంలో వృద్ధుల కోసం అధికారిక సంస్థాగత సంరక్షణలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన పెన్షన్, సామాజిక భద్రతా వ్యవస్థ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడం ద్వారా వారి కుటుంబ సభ్యులపై వృద్ధులు ఆధారపడటం తగ్గించవచ్చు. ► దాదాపు 33 శాతం మంది వృద్ధ స్త్రీలకు ఎటువంటి ఆదాయం లేదు. 11 శాతం మందికి మాత్రమే పెన్షన్ ద్వారా ఆదాయం వస్తోంది. 16.3 శాతం మంది సామాజిక పెన్షన్ పొందుతున్నారు. సీనియర్ కేర్ సంస్కరణలపై ఇటీవల ‘నీతి అయోగ్’ సమర్పించిన ఓ నివేదిక ప్రకారం వృద్ధుల ఆర్థిక సాధికారతను నిర్ధారించడానికి ప్రభుత్వ నిధుల కవరేజీని పెంచడం, తిరిగి పని నైపుణ్యాలవైపు మళ్లించడం, తప్పనిసరి ΄÷దుపు ప్రణాళికలు, రివర్స్ మార్టిగేజ్ మెకానిజమ్స్, పన్ను, జీఎస్టీ సంస్కరణల వంటి అనేక చర్యలు చేపట్టాలని పేర్కొంది. ► ఎటువంటి ఆస్తులు, ఆదాయం లేకుండా ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ వృద్ధాప్య సంరక్షణ నమూనాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందనేది మరో సూచన. నలుగురు కలిసి ఉంటే ఎంతో మేలు.. వృద్ధులైనా డబ్బున్నవారి పరిస్థితి బాగానే ఉంది. డబ్బులేని వారే జీవశ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ► వృద్ధులకు ఓల్డేజీ హోమ్స్ తప్ప మరో మార్గం లేదు. ఫుడ్ షెల్టర్ ఈ రెండే ఇస్తుంది. కానీ, ఎమోషనల్‌గా ఒంటరితనం ఫీలవుతుంటారు. అందుకే, రీ మ్యారేజ్ ద్వారా మేం ఒక సొల్యూషన్ చూపిస్తున్నాం. లేదంటే, ఒంటరిగా ఉన్న వృద్ధులు ప్రమాదాలకు, దోపిడీలకు గురవుతున్నారు. ఇలాంటప్పుడు నలుగురు వృద్ధులు కలిసి ఒక చోట ఉండవచ్చు. దీని వల్ల ఒంటరితనం పోగొట్టుకోగలుగుతారు. ► అప్పడాలు, వడియాలు వంటివి చేసి, వ్యాపారం చేసుకోవచ్చు. కానీ, 70 ఏళ్ల వయసులో ఏ పనీ చేయడానికి ఓపిక ఉండదు. పెట్టింది తినడం తప్ప ఏ రకమైన ఫిజికల్ స్ట్రెయిన్ పడలేరు. అందుకని, రూమ్మెట్స్ లాగా కలిసి ఉండాలి. అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండోర్‌గేమ్స్, స్థానిక పర్యాటక స్థలాలు చూసి రావచ్చు. ► యువత పట్టించుకోదు, మధ్య వయసువారికి కుటుంబ సమస్యలు. సీనియర్ సిటిజన్స్ పట్ల ఎవరికీ జాలి, దయ ఉండదు. వృద్ధులకు ఇచ్చే ఆత్మీయ స్పర్శను ఎంతో ఓదార్పుగా ఫీలవుతారు. ► రాజకీయ వర్గం తరచుగా యువ జనాభాను ఆర్థిక ఆస్తిగా పేర్కొంటుంది. పెరుగుతున్న వృద్ధ జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, సామాజిక మద్దతును అందించడానికి అంతగా ఆసక్తి చూపదు. ఏ రకమైన ఆదాయం లేనివారికి ప్రభుత్వమే వారికో దారి చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెన్షన్ రూపేణ వచ్చే వనరుతోనూ నలుగురు కలిసి ఉండవచ్చు. – ఎన్.ఎమ్.రాజేశ్వరి, తోడు నీడ స్వచ్ఛంధ సంస్థ, హైదరాబాద్ -
'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా?
ఒంటరితనం అదొక రకమైన వ్యాధి అని ఎందరో వైద్యులు చెబుతున్నారు. మానసిక వ్యాధిలా మొదలై దీర్థకాలికి వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో! అంత ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒంటరితనం అంత ప్రాణాంతకమా? ఏకంగా ధూమపానం తాగడంతో పోల్చడానికి కారణం ఏంటీ?.. తదితరాల గురించే ఈ కథనం!. ఒంటరితనం ఒంటరిగా ఉండటం అంటే.. ఒంటరితనం, ఒంటిరిగా అనే పదాలు ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంది. మనకు మనంగా కోరుకుని ఒంటరిగా ఉండటాన్ని ఏకాంతంగా గడపటంగా భావించొచ్చు. ఇష్టపూర్వకంగా నీతో నీవు గడపటం లాంటిది. ఇది ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒకరకంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకునే ఓ గొప్ప అవకాశం. అదే ఒంటరితనం అంటే.. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో లేదనే భావన ఉండటం. తనకంటూ ఎవ్వరూ లేరని ఫీలవుతుండటం ఒంటిరితనం కిందకు వస్తుంది. ఇది మనిషిని కుంగదీస్తుంది. చూడటానికి సాధారణంగా అనిపించినా.. ఓ భయానక వ్యాధి. చివరికి మనిషిని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తుంది. అందుకనే వైద్యలు, ఆరోగ్య నిపుణులు ఒంటరితనం ప్రాణాంతకమైనదని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. పరిశోధనలే ఏం చెబుతున్నాయంటే శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ల కంటే ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు అకాల మరణానికి 50% ఎక్కువ ఉందని వెల్లడైంది. ఈ ఒంటరితనం ధూమపానం తాగినంత ప్రమాదకరమైనదని పేర్కొంది. రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకం అంత ప్రమాదకరమైనది ఒంటిరితనం అని వెల్లడించింది. దీనివల్ల రోజువారి జీవనంపై ప్రభావం ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్లులు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ కారణంగా చాలామంది ఒబెసిటీ సమస్యను ఎదర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకోసం అని ఓ మెడిల్ ఆస్పత్రిలోని దీర్ఘకాలిక సమస్యలతో ఒంటరితనంతో బాధపడుతున్న కొంతమంది రోగులపై అధ్యయనం చేయగా..వారు కొంత సేపు తమతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ వారితో స్నేహంగా మెలిగారు. వారు కూడా తెలియకుండానే వారితో కనెక్ట్ అయ్యి తమ భావోద్వేగాలన్నింటిని షేర్ చేసుకున్నారు. వాళ్లికి ఎవ్వరితోనైనా కాసేపు మాట్లాడితే తెలియని ఆనందం ఉంటుందనేలా ఆ రోగులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆ రోగులు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉన్నారు పరిశోధకులు. ఐతే వారిలో మార్పు వచ్చి మనుషులతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. అలాగే ఆ రోగులు ఆస్పత్రిని సందర్శించడం కూడా తగ్గింది. ఎందుకు హానికరం అంటే.. తనకంటూ ఎవ్వరూ లేరనే వ్యథ ఆవరించి మనిషిని ఒక విధమైన సోమరి లేదా చేతకాని వాడిగా మార్చేస్తుంది. తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. అది క్రమేణ ఆ వ్యక్తిని మంచానికే పరిమితమై ఓ భయానక వ్యాధిలా మారిపోతుంది. ఏం లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా త్వరతగతిన మృత్యు ఒడిలోకి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లు తాను నిర్లక్ష్యానికి గురవ్వుతున్నా అనే భావం నుంచి మొదలై ఎవ్వరితోనూ సంబంధాలు నెరుపుకోలేక ఇబ్బంది పడతారు. మొదట ఆ భావన తొలగించి తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపూతూ మంచి సంబంధాలను నెరుపుకుంటూ పోతే మనల్ని వద్దనుకున్నవాళ్లు సైతం మనతో చేయి కలిపేందుకు ముందుకు వస్తారు. చిత్త వైకల్యం అన్నింటికంటే ప్రమాదకరమైంది. అది బాగుంటే అన్ని బాగున్నట్లే. అలాగే రిలేషన్స్‌లో క్యాలిటీ ముఖ్యం వందల సంఖ్యలో రిలేషన్స్ ఏర్పర్చుకోనవసరం లేదు. మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా చాలు. మనకు వారి వద్ద స్వాంతన దొరికితే చాలు. నచ్చిన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి/మన అనుకునులే మనం మంచి కోరే వ్యక్తి ఉంటే చాలు. అందుకే ఇక్కడ మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి నాణ్యతతో కూడిన బాండింగ్ ఏర్పర్చుకుంటే చాలు. తెలియకుండానే అన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. ఆ తర్వాత మీకు మీరుగా ఏదోక వ్యాపకం ఏర్పరుచుకుని ధైర్యంగా జీవితాన్ని గడపగలిగే మనోధైర్యం వచ్చేస్తుంది. చింతకు చోటు ఇవ్వదు అది మీ చిత్తాన్ని చెదిరిపోయేలా చేసి కుంగదీస్తుంది. మీకు కాస్త ఒంటరితనంగా ఫీలయితే వెంటనే సోషల్ మీడియాలో లేదా దేవాలయానికో లేదా నచ్చిన ప్రదేశానికి వెళ్లండి కొత్త మనుషులు పరిచయలు ఏర్పడి మీకో కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచే ఈ ఒంటరితనం సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
మాజీ భార్యతోపాటు ఆరుగురి కాల్చివేత
ఆర్కాబుతాలా(యూఎస్): అమెరికాలో మరో ఘోరం జరిగిపోయింది. ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన మాజీ భార్య, సవతి తండ్రితో పాటు మరో నలుగురిని కాల్చి చంపాడు. ఉత్తర మిసిసిపీలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. రిచర్డ్ డేల్ క్రమ్(52) తొలుత టెన్నెసీ స్టేట్ లైన్ సమీపంలోని ఆర్కాబుతాలా దుకాణంలో బయట ఓ వాహనంలో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని హ్యాండ్‌గన్‌తో కాల్చేశాడు. తర్వాత కొద్ది మైళ్ల దూరంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి, అక్కడున్న మాజీ భార్య, ఆమె భర్తపై తూటాల వర్షం కురిపించాడు. మాజీ భార్య మరణించగా భర్త గాయాల పాలయ్యాడు. అనంతరం మరో తన సవతి తండ్రి ఇంట్లోకి దూరి ఆయన్ను, ఆయన సోదరిని అంతం చేశాడు. తర్వాత తాపీగా నడుచుకుంటూ తన ఇంటి వెనుకకు చేరుకున్నాడు. రోడ్డుపై కనిపించిన ఓ వ్యక్తిపై, వాహనంలో కూర్చున్న మరొకరిని కాల్చి చంపాడు. పోలీసులు రంగంలోకి దిగి క్రమ్‌ను అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కాల్పుల్లో ఆరుగురు మరణించడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తుపాకీ చట్టాలను సంస్కరించడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌కు జో బైడెన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. -
పాపం.. 32 ఏళ్లుగా బోనులోనే!
డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. ఏడాది వయసులో బాగా నమ్మిన వ్యక్తి చెయ్యి పట్టి గెంతులేసుకుంటూ దేశాలు దాటింది ఆ చిట్టి గొరిల్లా. పాపం.. తన జీవితం మూడు దశాబ్దాలపైగా నరకం లాంటి చోట చిక్కుకుపోతుందని ఊహించి ఉంటే అమ్మ ఒడిని అప్పుడు అది వీడి ఉండేది కాదేమో!. బువా నోయి.. దీనికి అర్థం చిట్టి తామర అని. అయితే పేరులో ఉన్న ఆహ్లాదం.. ఆ గొరిల్లా ముఖంలో ఏమాత్రం కనిపించదు. దాని వయసు 33 ఏళ్లు. కానీ, 32 ఏళ్లుగా కంపు కొట్టే తుప్పు పట్టిన బొనులో బంధీగా ఉండిపోయింది. అందుకేనేమో ప్రపంచంలోనే అత్యంత బాధను అనుభవిస్తున్న గొరిల్లాకు దీనికంటూ ఒక ముద్ర పడిపోయింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాంగ్ బంగ్ ఫ్లాత్లో బాంగ్ కీ ఖాన్ వద్ద ఓ ప్రైవేట్ మర్షియల్ బిల్డింగ్ పైన ‘పటా’ అనే జూ ఉంది. ఈ జూకి ప్రధాన ఆకర్షణ మాత్రమే కాదు.. అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది బువా నోయి. బువా Bua Noi పుట్టింది జర్మనీలో. ఏడాది వయసున్న బువాను దాని సంరక్షకుడు 7 లక్షల పౌండ్లకు థాయ్‌లాండ్ పటా జూ నిర్వాహకులకు అమ్మేశాడు. 1990లో అది అమ్మకి దూరమై.. ఈ జూలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అది బయటకు వచ్చింది లేదు. అక్కడే తిండి.. అక్కడే నిద్ర. అదే బోనులో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ జూకి ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. అయితే ఒంటరిగా అది పడుతున్న అవస్థను చూడలేక.. 2015 నుంచి కొందరు ఉద్యమకారులు దానిని బయటకు రప్పించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. కొన్నదానికంటే కాస్త ఎక్కువ డబ్బు చెల్లిస్తేనే.. దానిని వదులుతానంటూ భీష్మించుకు కూర్చున్నాడు పటా జూ ఓనర్. దీంతో దీని విడుదలకు పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. Triste ao conhecer a história de outro animal escravizado por toda a vida. Bua Noi vive presa há mais de 30 anos num espaço dentro de uma loja de departamentos num shopping da Tailândia. Ela é conhecida como a gorila mais triste do mundo. Como as pessoas são capazes?? #FreeBuaNoi pic.twitter.com/yDZaNV7xkd — PREFIRO LULA 🚩🦑 (@carolando_44) October 26, 2022 థాయ్ పాప్ సింగర్ చెర్ సైతం దీనికి బయటకు రప్పించేందుకు చాలా యత్నించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అగ్రిమెంట్ బలంగా ఉండడంతో.. అక్కడి ప్రభుత్వం సైతం ఎలాంటి బలవంతపు చర్యలకు దిగలేకపోయింది. చివరకు ఫండ్ రైజింగ్ ద్వారా అనుకున్న సొమ్ము సేకరణకు దిగినా.. ఫలితం దక్కలేదు. అగ్రిమెంట్లో ఉన్న లొసుగులతో ఎప్పటికప్పుడు దానిని అమ్మే ధర పెంచుకుంటూ పోతున్నాడు ఆ ఓనర్. ఇది దాని స్వేచ్ఛకు అడ్డుతగులుతోంది. దీంతో దానికి మరణం ద్వారా అయినా విముక్తి అందించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే అక్కడి కోర్టులో కొందరు అందుకు సంబంధించి పిటిషన్లు సైతం దాఖలు చేస్తున్నారు. బంధీగా అలా అది చావడం కంటే.. దానిని అక్కడే చంపేసేందుకు ప్రభుత్వం చర్యలు పూనుకోవాలని, అందుకు ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. మరోవైపు ఈ విషయం తమదాకా రావడంతో పెటా ఏషియా స్పందించింది. దాని బతుకు మరీ ఘోరంగా ఉందని.. పటా జూను మొత్తానికే సీల్ చేసి అక్కడి జంతువులకు విముక్తి కల్పించేందుకు పోరాటానికి సిద్ధమని ప్రకటించింది. -
అందరూ వదిలేయడంతో అనాథలా.. నటి ఆత్మహత్య
మంచి ఉద్యోగం-జీతం.. రెండింటినీ వదులుకుందామె. ఎవరూ ఊహించని రీతిలో పోర్న్ సినిమాల వైపు అడుగులేసింది. ఆ నిర్ణయంతో అయినవాళ్లకు దూరమైంది. చివరకు అనాథలా ఆత్మహత్యకు పాల్పడింది నటి క్రిస్టియానా లిసీనా. క్రిస్టియానా ‘క్రిస్ ది ఫాక్స్’ పేరుతో పాపులర్ అయిన రష్యన్ అడల్ట్ నటి. వయసు 29 ఏళ్లు. పోర్న్‌హబ్, ఓన్లీఫ్యాన్స్ సైట్ల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఆదివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ 22 అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చేతిలో కాయిన్ నేవ్స్కై పోలీసులు లిసీనా చేతిలో ఓ కాయిన్‌ను గుర్తించారు. దాని మీద ‘నువ్వెప్పుడు నా గుండెల్లో ఉంటావ్’ అనే కొటేషన్ ఉంది. అది తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ఆమె రాసి ఉంటుందని భావిస్తున్నారు. చనిపోయే కాసేపటి ముందే ఆమె బిల్డింగ్‌లోకి ఎంటర్ అయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. గత కొంతకాలంగా లిసీనా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఆమె మరణవార్త తెలియగానే ప్రియుడు రుస్తామ్.. సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఒంటరితనం భరించలేకే ఆమె చనిపోయిందని వాపోయాడు. క్రిస్టియానా అంత్యక్రియల కోసం సాయం చేయాలని కోరడంతో.. కొందరు ముందుకొచ్చారు కూడా. బ్యాంక్ జాబ్ వదిలి.. సైబీరియాకు చెందిన క్రిస్టియానా లిసీనా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆపై క్రాస్కోయార్స్క్లో బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఐదురోజులు మాత్రమే పని చేసిన ఆమె.. ఆసక్తి లేక అడల్ట్ సినిమాల వైపు మళ్లింది. దీంతో కుటుంబం ఆమెను వెలేయడంతో సెయింట్ పీటర్బర్గ్స్కు మకాం మార్చింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ.. కుదరలేదు. ఆమధ్య ఒంటరితనం తన పాలిట శాపమైందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయాన్ని.. ఇప్పుడు కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక ఆమె చనిపోయాక ఓన్లీఫ్యాన్స్ పేజీలో ఆమె పేరుతో ఉన్న అకౌంట్‌ను తొలగించారు. మిగతా సైట్లలోనూ ఆమె వీడియోలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
జపాన్‌లో లోన్లీనెస్ మినిస్టర్
టోక్యో: జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో తొలిసారి ఓ కొత్త శాఖని ప్రవేశపెట్టారు. దానిపేరు ‘లోన్లీనెస్ మినిస్టర్’. అంటే ఒంటరితనానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ అని అర్థం. ఇంత ఈ అవసరం ఏమొచ్చిందనేగా మీ అనుమానం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. కోవిడ్‌తో మరణాలు ఒక ఎల్తైతే, కోవిడ్ కారణంగా ఒంటిరితనంతో మరణిస్తోన్న వారి సంఖ్య జపాన్‌లో 11 ఏళ్ళలో ఎప్పుడూలేనంతగా పెరిగింది. జాతీయ సమస్యలతో పాటు తీవ్రతరమౌతోన్న ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ‘లోన్లీనెస్ మినిస్ట్రీ’ని జపాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. యూకేలో తొలిప్రయత్నం అయితే లోన్లీనెస్ మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టిన తొలిదేశం జపాన్ మాత్రం కాదు. 2018లో యూకేలో తొలిసారి ఇలాంటి ఒక శాఖను ప్రవేశపెట్టారు. యూకేని ఆదర్శంగా తీసుకొని జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో ఈ లోన్లీనెస్ శాఖను ప్రవేశపెట్టారు. ఈ కొత్త పోర్ట్‌ఫోలియో దేశంలో క్షీణిస్తోన్న జననాల రేటుని ఎదుర్కోవడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పునరుజ్జీవింపజేసే అంశాలపై దృష్టి సారిస్తుంది. మంత్రి టెట్సుషి సకామోటో ఏకకాలంలో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని జపాన్ ప్రధాని సుగా తెలిపారు. జాతీయాంశాలు, కోవిడ్ మహమ్మారి కాలంలో పెరుగుతోన్న మహిళల ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధాని యోషిహిడే సుగా తనకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి సకామోటో మీడియాకు వివరించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొంటూ సమగ్రవ్యూహాన్ని రూపొందించా లని ప్రధాని సూచించారని మంత్రి చెప్పారు. సామాజిక ఒంటరితనాన్ని పరిష్కరించేందుకు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించనున్నట్టు మంత్రి చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమ యంలో పెరిగిన ఆత్మహత్యలు, పిల్లల్లో పేదరికం సమస్యలు పరిష్కరించేందుకు ఫిబ్రవరి 19న క్యాబినెట్లోనే ‘ఐసోలేషన్, లోన్లీనెస్ కౌంటర్ మెజర్స్ ఆఫీస్’ని ఏర్పాటు చేశారు. టోక్యోలో ప్రతి ఐదుగురిలో ఒక మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు అనేక దేశాల్లో మాదిరిగానే జపాన్‌లో సైతం కోవిడ్ భారం మహిళలపై ఎక్కువగా పడింది. కోవిడ్ మహమ్మారి మహిళల స్థితిగతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.జపాన్‌లోని మహానగరం టోక్యోలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. కోవిడ్ కారణం గా బయటకు వెళ్ళకుండా ఇళ్ళకే పరిమితం కావ డంతో అసలే ఒంటరిగా ఉంటోన్న మహిళలు మరింత ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా అది వారిని కుంగదీసింది. కోవిడ్‌లో 15 శాతం పెరిగిన మహిళల ఆత్మహత్యలు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలను బట్టి జపాన్‌లో 4,26,000 కోవిడ్ కేసులు నమోదుకాగా, 7, 577 మంది మరణించారు. గత ఏడాది జపాన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళల సంఖ్య మొత్తం దేశంలోని కోవిడ్ మరణాల సంఖ్యకు దగ్గరగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది జపాన్‌లో 6,976 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య 2019 కంటే 15 శాతం అధికం. గత పదకొండేళ్ళలో ఆత్మహత్యల సంఖ్య ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. గత ఏడాది పురుషులకంటే మహిళలు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెరిగిన లైంగిక వేధింపులు, గృహహింస ఎంతో మంది మహిళలు వర్క్‌ఫ్రం హోం కారణంగా ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనితో పాటు పిల్లల సంరక్షణా బాధ్యతలతో ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా కరోనా కాలం లో గృహహింస, లైంగిక వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయి. పెరుగుతోన్న మానసిక, శారీ రక సమస్యలు మహిళల ఆత్మహత్యలకు కారణమౌతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వైరస్ భారాన్ని మోసింది ఎక్కువగా మహిళలే కరోనా వైరస్ భారాన్ని మోసింది ఎక్కువగా మహిళలేనని జపనీస్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ యుకి నిషిముర అభిప్రాయపడ్డారు. మహిళలు తమ ఆరోగ్యం గురించి మాత్రమే చూసుకుంటే సరిపోదు. వాళ్ళ పిల్లలు, వృద్ధులు, మొత్తం కుటుంబం ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన భారం కూడా వారిపైనే ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఇంటి పరిశుభ్రతలాంటి సమస్యలు వారిపై భారాన్ని మరింత పెంచాయి అంటారు యుకి నిషిముర. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది జపాన్‌లో ఉద్యోగాలు చేస్తోన్న మహిళల్లో సగం మందివి పార్ట్‌టైం, లేదా కాంట్రాక్టు ఉద్యోగాలు. కోవిడ్ కారణంగా కంపెనీలు మూతపడటంతో ముందుగా మహిళలనే ఉద్యోగాల్లోనుంచి తీసివేశారు. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 1.44 మిలియన్ల మంది ఇలాంటి కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అందులో సగానికి పైగా మంది మహిళలే కావడం గమనార్హం. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన మహిళల్లో మూడింట రెండొంతుల మంది నిరుద్యోగులే. ఉద్యోగాలను కోల్పోవడం మహిళలను మరింత మానసిక ఒత్తిడికి గురిచేసింది అని సోషల్ ఎపిడెమియాలజీ నిపుణులు, ఒసాకా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ టెస్టూయా మాట్సు బయాషి అభిప్రాయపడ్డారు. -
ఒంటరితనానికి ఓ మంత్రిత్వ శాఖ, ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒంటరితనం.. చుట్టూ ఎందరున్నా ఏకాకిగా ఉన్నామన్న భావన చాలా మంది లో ఉంటుంది. ఈ భావన ఎక్కువ కాలం కొనసాగి తే మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఒంటరితనం కారణంగా గుండెజబ్బులు, డిమెన్షి యా, నియంత్రణ లేకుండా ఆహారం తీసుకోవడం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ సమస్య మరింత పీడిస్తూ ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి వారిని కుటుంబసభ్యులు, మిత్రులు గుర్తించి ఆ కుంగుబాటు, ఒంటరితనం నుంచి బయటపడేలా స్థైర్యాన్ని అందించాలి. ఈ విషయంలో వ్యవస్థాగతంగా, ప్రభుత్వపరంగా తోడ్పాటును ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో అందిస్తున్నాయి. జపాన్‌లో మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ జపాన్ ప్రధాని యోషిహిదే సుగ ఇటీవల తన కేబినెట్లో ‘మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్’అనే కొత్త మంత్రిత్వ శాఖను పెట్టారు. గత 11 ఏళ్లతో పోలిస్తే జపాన్‌లో కోవిడ్ కారణంగా ఒంటరితనం ఎక్కువై ఆత్మహత్యల సంఖ్య పెరగడంతో దీనిపై దృష్టి సారించారు. ప్రజల్లో ఒంటరితనం సమస్యను జపాన్ దేశం సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నదే. అయితే గతేడాది అక్టోబర్ నెలలోనే మొత్తం 2,153 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అదేనెలలో కరోనాతో 1,765 మంది మాత్రమే మరణించారు. అంటే కోవిడ్ కంటే ఆత్మహత్యల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు జపాన్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 70 శాతం అధికమని చెబుతున్నారు. బ్రిటన్‌దే తొలి అడుగు.. ‘లోన్లీ మినిస్టర్’ను నియమించిన తొలిదేశం బ్రిటన్. 2018లోనే ఇందుకు ఓ శాఖను ఏర్పాటు చేసి మంత్రిని నియమించింది. బ్రిటన్‌లోని 90 లక్షల మంది ప్రజలు ఒక్కోసారి లేదా ఎల్లప్పుడూ ఒంటరిగా ఉన్నామన్న భావనలో ఉంటున్నట్లు 2017లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావడంతో వెంటనే ఆ దిశలో ఆ సమస్యను అధిగమించేందుకు మంత్రిని నియమించింది. అయితే ఈ శాఖను నిర్వహించేందుకు మంత్రులు అంతగా సుముఖత వ్య క్తం చేయకపోవడంతో మూడేళ్లలో ముగ్గురు మం త్రులను మార్చాల్సి వచి్చంది. ఆ్రస్టేలియా కూడా ఒంటరితనానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. హ్యాపీనెస్ శాఖ పెట్టాలి.. ‘జపాన్ ఇతర దేశాలతో పోలిస్తే భార త్ సమాజం పూర్తిగా భిన్నమైంది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, చిన్న కుటుంబాలు వచ్చాయి. అవివాహితులు కూడా ఉంటున్నారు. జపాన్‌లో పనికి అధిక ప్రాధాన్యమిస్తారు. దీంతో ఒత్తిడికి గురై, పని తర్వాత ఏంటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయి తే భారత్‌లో కుటుంబం లేదా సమాజం మద్దతు ఉంటుంది. హైదరాబాద్‌లో కంటే ముంబై, తదితర చోట్ల పని ఒత్తిడి తదితర కారణాలతో ఒంటరితనం, కుంగుబాటు సమస్యలు వస్తున్నాయి. మనదేశం విషయానికొస్తే ఒంటరితనానికి శాఖ కన్నా భూటా న్లో మాదిరిగా హ్యాపీనెస్‌కు సంబంధించి మంత్రిత్వ శాఖ పెడితే బాగుంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ ద్వారా ఆయా సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే మంచిది. – డా.నిశాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్ -
మగాళ్లు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు..
ప్రపంచంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లే ఎక్కువ ఒంటరితనంతో బాధ పడుతున్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో బ్రిటన్ విషయంలో కూడా ఇదే రుజువైంది. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు ఒంటరితనంతో బాధ పడుతున్నారు. సన్నిహిత మిత్రులు ఒక్కరు కూడా లేరని 18 శాతం మంది, మంచి మిత్రులే లేరని 32 శాతం మంది చెప్పగా, 12 శాతం మహిళలు సన్నిహిత మిత్రులు లేరని, 24 శాతం మంది మహిళలు మంచి మిత్రులు లేరని ‘యూగౌ’ జరిపిన సర్వేలో తెలిపారు. పిల్లల స్కూళ్లకు వెళ్లినప్పుడో, వారి కోసం క్రీడా క్లబ్బులు, మైదానాలకు వెళ్లినప్పుడు ఇతర పిల్లల తల్లులు తమకు ఎక్కువగా స్నేహితులు అవుతున్నారని తేలింది. ఈ విషయంలో తండ్రులకు ఎక్కువగా స్నేహితులు కావడం లేదు. కారణం వారు తరుచుగా పిల్లల కోసం స్కూళ్లకుగానీ స్పోర్ట్స్ క్లబ్బులకుగానీ వెళ్లకపోవడం. మగవాళ్లకు ఎక్కువగా ఆఫీసుల్లోనే స్నేహితులు అవుతున్నారు. అందుకనే వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాత ఒంటరితనంతో బాధపడాల్సి వస్తోంది. సమాజంలో పురుషులకన్నా మహిళలనే సోషల్ నెట్వర్క్ ఎక్కువగా ఉంటుందని, వారు జీవితాంతం కొత్తవారిని స్నేహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, అదే మగవాళ్లలో లేదని, వారితో మనకేం పనిలే అనుకోవడం అందుకు కారణమని బ్రిటన్‌లో ఒంటరితనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న పరిశోధనా సంస్థ డైరెక్టర్ రాబిన్ హెవింగ్స్ విశ్లేషించారు. పైగా మహిళలు సొంత విషయాలు మిత్రులు, కుటుంబాలతో పంచుకోవడానికి ఎక్కువ చొరవ చూపుతారని, అదే మగవాడు ఒంటరితనంతో బాధ పడుతున్న విషయాన్ని మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడరని, అలా పంచుకోవడం ఆత్మ న్యూన్యతా భావంగా భావించడమేనని హెమింగ్స్ వివరించారు. కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం కూడా మగవాళ్లలో తక్కువ. అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్లు కేవలం 18 శాతం మాత్రమేనని తేలింది. ఒంటరితనంతో బాధపడడం వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అది పెరిగితే బతుకు భారం అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆ తీవ్రమైన చర్యకు కూడా పాల్పడతారు. అందుకని పురుషుల్లో ఒంటరితనం పోవాలంటే పాత మిత్రులతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి. అందుకు నేడు సోషల్ మీడియా ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం పూట వాకింగ్ అలవాటు చేసుకొని అలా వచ్చేవారితో స్నేహం చేసుకోవాలి. లేదా పెంపుడు కుక్కలను అలా తిప్పడానికి తీసుకెళ్లినప్పుడు తోటి వాళ్లతో స్నేహం చేయాలి. వ్యాయామం లేదా ఇతర కాలక్షేప క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా స్నేహాన్ని పెంచుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు ఇరుగు, పొరుగు వారితో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. -
‘సోషల్’ అతిగా వాడితే అనర్థమే
న్యూయార్క్: సామాజిక మాధ్యమాలను అతిగా వాడటం వల్ల మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటివి దరిచేరుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఫేస్బుక్, స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం ఆరోగ్యానికి హానికరంగా మారుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నపుడే మీరు మీ జీవితానికి కావాల్సిన ప్రశాంతమైన సమయాన్ని గడపుతారు’అని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా హంట్ తెలిపారు. -
ఏకాకి జీవితంతో వ్యాధుల చికాకు..
లండన్ : ఆధునిక జీవితంలో మనిషిని చిన్నాభిన్నం చేస్తున్న ఒంటరితనం మానవాళిని మింగేసే ఉపద్రవమని వైద్యులు సైతం తేల్చిచెబుతున్నారు. ఒంటరితనం ఫలితంగా శరీరం వ్యాధుల మయంగా మారుతుందనేందుకు ఇప్పటికే పలు అథ్యయనాలు ఆధారాలు గుర్తించగా ఏకాకి జీవితంతో మనిషి శరీరంలో ఏం జరుగుతుందనేది తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒంటరితనంతో బాధపడేవారికి అసలైన మందు చుట్టూ ఉన్న వారితో మమేకం కావడమేనని హార్వర్డ్ యూనివర్సిటీ సైకియాట్రిస్ట్ డాక్టర్ చార్లెస్ బుల్లక్ తేల్చిచెప్పారు. ప్రపంచ నాగరిక చరిత్రలోనే ఎన్నడూలేనంతగా సాంకేతికతను ప్రస్తుత తరం ఉపయోగిస్తున్నా ఒంటరితనం మాత్రం 1980లతో పోలిస్తే రెండింతలైందని మాజీ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో పేర్కొన్నారు. ఒంటరితనం శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఒంటరితనంతో బాధపడే వారిలో ఎదుటి వ్యక్తుల ముఖంలో భావాలను చదవగలిగేందుకు వీలు కల్పించే మెదడులోని కీలక గ్రే మ్యాటర్ తగ్గుముఖం పడుతుందని డాక్టర్ బుల్లక్ తన బ్లాగ్‌లో పొందుపరిచారు. ఒంటరితనంతో మనిషి శరీరంలో హార్మోన్లు విశృంఖలంగా ఉరకలెత్తుతాయని గుర్తించారు. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్ధాయిని మించి విడుదలైతే శరీరం నియంత్రించుకోలేదని ఇది శరీర జీవక్రియలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుందని చెప్పారు. వీలైనంత సమయం స్నేహితులతో గడపడం ఒంటరితనానికి విరుగుడుగా పనిచేస్తుందని డాక్టర్ బుల్లక్ చెప్పుకొచ్చారు. సమూహంలో మెలగడం ద్వారా ఉద్వేగాలను తగ్గించుకోవచ్చని, కుంగుబాటు నుంచి ఉపశమనం కలుగుతుందని, రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని సూచించారు. లైబ్రరీ, పార్కు, జనావాసాల్లోకి తొంగిచూడటం వంటి వాటితో మెదడులో ఆక్సిటోసిన్ విడుదలవడం ద్వారా ఒత్తిడి హార్మోన్ స్ధాయిలను తగ్గిస్తుందన్నారు. -
ఒంటరితనంతో ఆయువుకు చేటు
అదేదో సినిమా పాటలో సోలో బతుకే సో బెటరు అనేసినంత మాత్రాన అదేమీ జీవిత సత్యం కాదు. ఒంటరి బతుకు బతకడం ఒంటికేమంత మంచిది కాదు. కుటుంబ జీవితం గడిపేవారితో పోలిస్తే ఒంటరిగా బతికే వారిలో గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు రెట్టింపుగా ఉంటాయని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 45 ఏళ్ల పైబడ్డ వారిలో 4.26 కోట్ల మంది ఒంటరిగా బతుకుతున్నారు. వీరిలో చాలామందికి టీవీ చూడటమే ప్రధానమైన కాలక్షేపం. చిరుతిళ్లు తింటూ, మద్యం సేవిస్తూ, ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో పట్టించుకోకుండా గంటలకు గంటలు టీవీ ముందు గడిపేసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయినవారి అండదండలు లేకపోవడం, సామాజిక సంబంధాలు పెద్దగా లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఇలాంటి వారి డిప్రెషన్ బారినపడుతున్నారని, జీవితం మీద లక్ష్యంగా లేకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరమై గుండెజబ్బుల బారినపడుతున్నారని, ఫలితంగా అకాల మరణాలకు బలైపోతున్నారని బర్మింగ్‌హామ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జూలియన్ హోల్ట్ లున్స్టాండ్ వెల్లడించారు. -
మెదడుపై ఒంటరితనం ప్రభావం..
కాలిఫోర్నియా : ఒంటరితనం మెదడులో ఉత్పత్తయ్యే రసాయనాల్లో మార్పులకు కారణమై భయం, దుందుడుకు ధోరణులకు దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ఆధునిక జీవనశైలితో నలుగురిలో కలవడం తగ్గిపోవడంతో కుంగుబాటు, ఒత్తిడి పెరిగి తీవ్ర అనారోగ్యాల ముప్పు ముంచుకొస్తోందని పేర్కొంది. ఎలుకల్లో చేసిన పరిశోధనలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తేల్చిన అంశాలు మానసిక అస్వస్థతలను నివారించే క్రమంలో ముందడుగుగా భావిస్తున్నారు. గతంలో వృద్ధుల్లో ఒంటరితనం సమస్య వేధించేదని, ప్రస్తుతం 18 నుంచి 22 ఏళ్లలోపు యువతను ఒంటరితనం ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒంటరితనం కుంగుబాటు, ఉద్వేగ సమస్యలకు దారితీయడంతో పాటు శారీరక అనారోగ్యాలపైనా ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఒంటరితనంతో బాధపడే వారు ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్‌ను అధికంగా విడుదల చేయడంతో శరరంలో వాపులకు కారణమవుతుందని పరిశోధకులు తేల్చారు. తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతున్నామనుకునే వారిలో గుండె జబ్బులు, టైఫ్ టూ మధుమేహం, డిమెన్షియా వ్యాధుల ముప్పు అధికమని పరిశోధకులు తేల్చారు. -
రాత్రి 10తర్వాత సోషల్ మీడియాలో ఉంటే..!
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా సమాజం గురించి మాట్లాడేవారే. ప్రతి విషయాన్ని నేరుగా కాకుండా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. సామాజిక మాధ్యమాల్లో ‘బిజీ’గా ఉంటూ నిద్రాహారాలు మరిచిపోయేవారే ఎక్కువవుతున్నారు. అయితే రాత్రి, పగలూ తేడా లేకుండా సోషల్ మీడియాలో మునిగిపోయే వారికి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని తాజాగా ఓ సర్వే బయట పెట్టింది. రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్ మీడియాలో గడపటం, టీవీ చూడటం వంటి అలవాట్లున్న వారు తీవ్రమైన ఒత్తిడి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురికాక తప్పదని ‘ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్’లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. అలాంటి వారి రోజూవారి దినచర్యల్లో తీవ్ర మందకొడితనం నెలకొంటుందని తెలిపింది. బై పోలార్ డిసార్డర్ ద్వారా కోపం, బాధ, చిరాకు వంటివి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో వారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని నివేదిక హెచ్చరించింది. బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు ఆనందంగా ఉండలేరని, ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. ‘దాదాపు 91 వేల మంది మధ్య వయస్కులపై పరిశోధన చేసి ఈ రిపోర్టు తయారు చేశాం. వారందరినీ సోషల్ వేదికలు, టీవీల్లో మునిగిపోయేలా చేసి వారి దినచర్యల్లో వచ్చిన మార్పులను గుర్తించాం. కంటినిండా నిద్రలేకుండా.. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ వేదికల్లో అహోరాత్రులు గడుపుతూ, మధ్య మధ్యలో టీ, కాఫీలు తీసుకునే వారు ఈ ముప్పుని ఎదుర్కొన్నార’ని నివేదిక తయారు చేసిన డానియెల్ స్మిత్ పేర్కొన్నారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో పావువంతు జనాభా ఈ కింది మానసిక రుగ్మతలకు గురయ్యారని ఆయన తెలిపారు. 6 శాతం మంది మానసిక ఒత్తిడి 11 శాతం మంది బై పోలార్ డిసార్డర్ 9 శాతం మంది ఆనందంగా లేకపోవడం ‘విమానాలలో కొన్ని గంటల ప్రయాణం చేసినప్పుడు, ఒకటి రెండు రాత్రులు తగినంత నిద్ర లేనప్పుడు సహజంగా మన ప్రవర్తన, రోజూవారి కార్యక్రమాలపై ప్రభావం పడుతుంది. ఆలోచనా శక్తి మందగిస్తుంది. మరి అదే పనిగా శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తూ.. నిద్రకు దూరం చేస్తే విపరీత పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. సహజ జీవనానికి భిన్నంగా బతకడం అంటే సమస్యలకు తలుపులు తీయడమే’ అని స్మిత్ పేర్కొన్నారు. -
‘జీవితభాగస్వామిని కోల్పోతే గుండెకు ముప్పు’
లండన్ : జీవితంలో ఓ దశ దాటిన తర్వాత ఒంటరితనం శాపమే. ఒంటరితనం పలు రుగ్మతలకు దారితీస్తుందని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలల్లో హృద్రోగ ముప్పుతో మరణం సంభవించే ప్రమాదం 40 శాతం అధికంగా ఉందని తాజా అథ్యయనం పేర్కొంది. ఎంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలలు ఆ బాధను నియంత్రించుకోవడం ఎవరికైనా చాలా కష్టమని ఈ సమయంలో బాధితులకు మరణం ముప్పు 41 శాతం వరకూ అధికంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన రైస్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. తీవ్ర విచారం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోవడం విషాదకరమని, ఈ ఒత్తిడి జీవించి ఉన్న వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని తెలిపింది. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగానే వీరికి మరణ ముప్పు 53 శాతం వరకూ అధికంగా ఉంటుందని అథ్యయనానికి నేతృత్వం వహించిన రైస్ వర్సిటీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్ ఫగుండెస్ చెప్పారు. అథ్యయనంలో భాగంగా జీవిత భాగస్వామిని కోల్పోయిన 32 మంది ఆరోగ్య పరిస్థితిని టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. తామెంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోతే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ సహా పలు హృదయ సంబంధిత వ్యాధులు తలెత్తే ముప్పుందని చెప్పారు. హృదయ కవాటాలు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయని, హార్మోన్లు అమాంతం పెరగడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నా వాస్తవంగా దీనికి కారణమేంటన్నది అస్పష్టంగా ఉంది. తమ అథ్యయనంతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని స్వాంతన పరిచే ప్రక్రియలో వినూత్న చికిత్సకు మార్గం సుగమమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
ఒంటరితనం కబళిస్తోంది..
న్యూయార్క్ : జనజీవితాల్లోకి సోషల్ మీడియా చొచ్చుకువచ్చిన ఫలితంగా మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకూ సమూహంలోనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ సిగ్నా చేపట్టిన సర్వే నివేదిక దిగ్భ్రాంతికర అంశాలను వెల్లడించింది. అమెరికా జనాభాలో దాదాపు సగం మంది ఒంటరితనంతో డీలాపడ్డారని వెల్లడైంది. సోషల్ మీడియా ప్రభావంతో యువతపై ఒంటరితనం ప్రభావం ఉండదన్న అంచనాలు తలకిందులయ్యాయి. 22 ఏళ్ల లోపు యువత వృద్ధుల కన్నా ఎక్కువగా ఒంటరితనంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. తమ జీవితంలో తమను అర్థం చేసుకునే వారే లేరని అమెరికన్లలో నాలుగింట ఓ వంతు జనాభా అభిప్రాయపడింది. తమ సంబంధాలు అర్థవంతంగా లేవని 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక అమెరికన్లలో అన్ని వయసుల వారిలో కుంగుబాటు, ఆందోళనలతో సతమతమయ్యే వారు అత్యధికంగా ఉన్నారు. తక్కువ ఒంటరితనం అనుభవిస్తూ వ్యక్తిగతంగా చురుకైన సంబంధాలు కలిగిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అథ్యయనంలో వెల్లడైంది. అమెరికన్లలో కేవలం సంగం మందే అర్థవంతమైన సామాజిక సంబంధాలను కలిగిఉన్నారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో నిత్యం మెరుగైన సమయాన్ని గడపడం వంటి సామాజిక సంబంధాలను కేవలం 53 శాతం మందే నెరుపుతున్నారని సర్వేలో తేలింది. కాగా, ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాలపై పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని సర్వే చేపట్టిన సిగ్నా పేర్కొంది. ప్రతి ఐదుగురిలో ఒక వ్యక్తి తమకు సన్నిహితంగా ఎవరూ లేరని, ఆప్యాయంగా మాట్లాడేందుకు ఆత్మీయులే కరవయ్యారని భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. -
అంతిమ యాత్ర
ఒంటరితనంతో సహవాసం చేసేవాడికి సమాజంపై విపరీతమైన అసహ్యమైనా ఉంటుంది. లేదా జాలితో కూడిన ప్రేమైనా కలుగుతుంది. పురుషోత్తం ఎప్పట్నుంచో ఒంటరి. అరవైకి దగ్గరవుతోన్న ఒంటరి. సమాజాన్ని ప్రేమించడం అతనికి ఈ ఒంటరితనమే ఎలాగో అలవాటు చేసింది. జీవితాన్ని అతను ఇష్టపడతాడు. నాగేశం కూడా ఒంటరివాడే. పెళ్లైన ఒంటరివాడు. పెంచిన కూతురు ప్రేమ పేరుతో వెళ్లిపోవడం, పై చదువులకని వెళ్లిన కొడుకు పరదేశంలోనే స్థిరపడిపోవడం, అతని దురదృష్టమో, ఆమె అదృష్టమో అతని భార్య ఏకంగా పరలోకానికే వెళ్లిపోవడం అతణ్ని ఒంటరివాడ్ని చేశాయి. పురుషోత్తం, నాగేశం ఇంచుమించు ఒకే వయస్సు వారు. ఒకే కాలనీలో ఉంటారు. చాలాసార్లు ఎదురుపడి ఉంటారు ఒకరికొకరు. ఇద్దరి జీవితాల్లోకి ఒకరోజు... ఆరింటికి అలారం మోగగానే పురుషోత్తం నిద్రలేస్తాడు. ఇవ్వాళ ఆరుకు ముందే ఎవరో తలుపు తడుతున్న చప్పుడు. లేచి తలుపు తెరిచాడు. రమేశ్. ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ‘‘రమేశ్.. ఇంత పొద్దున్నే ఏంటి? ముందు లోపలికి రా! ఎందుకలా టెన్షన్ పడుతున్నావ్?’’ అన్నాడు పురుషోత్తం.‘‘సార్ అదీ,’’ రమేశ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. పురుషోత్తం రమేశ్‌ను శాంతపరిచాడు. ‘‘సర్! ఒక పన్నెండు వేలు కావాలి. మళ్లీ రేపు ఉదయం ఆరింటికల్లా ఇచ్చేస్తాను,’’ అడిగాడు రమేశ్. మళ్లీ అతనే కొనసాగిస్తూ – ‘‘బాబుకి యాక్సిడెంట్ అయింది. చాలా క్రిటికల్‌గా ఉంది. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోలేదు,’’ రమేశ్ ముఖంలో టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు. పురుషోత్తం మారు మాట్లాడకుండా వెళ్లి బీరువాలోంచి డబ్బు తీశాడు.‘‘రేపు బాబు బాగున్నాడనే మాట చెప్పి డబ్బు తిరిగిస్తావు కదూ!’’ అంటూ రమేశ్ అడిగిన డబ్బును అతని చేతిలో పెట్టాడు. రమేశ్ ఆ డబ్బును అందుకొని కృతజ్ఞతగా పురుషోత్తం వైపు చూస్తూ, అక్కణ్నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ముందురోజు డాక్టర్ రాసిచ్చిన మందులు కొనాలనే తన అవసరం కంటే రమేశ్ కొడుక్కి అత్యవసరమైన వైద్యానికి తన డబ్బు ఉపయోగపడుతున్నందుకు పురుషోత్తం చిన్న ఆత్మసంతృప్తి పొందాడు. వాతావరణం వర్షానుకూలంగా తోచడంతో వర్షం రావడం కంటే ముందు తనే ఆఫీస్కెళ్లాలని డైలీ రొటీన్లో పడిపోయాడు. నాగేశం నిద్ర లేవగానే అతని మనసంతా చిరాకుగా, చిందరవందరగా ఉంది. పక్కనే బల్లపై ఉన్న చీటీపాట పుస్తకాన్ని అందుకుని, తనకు డబ్బు ఇవ్వాల్సిన వారి చిట్టాని రాస్కుని లెక్క సరిగ్గా చూసుకోవడంతో మనసులోని చిరాకు తగ్గటంతో పాటు తనరోజు కూడా మొదలైంది. వర్షం మొదలైంది. గొడుగు తీస్కొని ఆఫీస్‌కి బయల్దేరిన పురుషోత్తానికి ఇంటిముందు రోడ్డు మీద ఒక చిన్న బుజ్జి కుక్కపిల్ల చలికి వణుకుతూ కనిపించింది. ఆగిపోయాడు. పదుల సంఖ్యలో వాహనాలు పరిగెత్తుతున్నా కుక్కపిల్ల అదృష్టమో, లేక వాహనాలు నడిపేవారు చాకచక్యంగా ఉన్నారో ఆ కుక్కపిల్లను మాత్రం తప్పించి నడుపుతున్నారు. ఆ కుక్కపిల్లను రోడ్డు మధ్యలో చూస్తుంటే పురుషోత్తం మనసు చలించిపోయింది. ఆలస్యం చేయకుండా రోడ్డు మధ్యలోకి వెళ్లి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇంటి వరండాలోని బల్లకింద పాత మసిగుడ్డల మధ్యలో ఉంచాడు. ఇప్పుడది ప్రశాంతంగా ఒకదగ్గర కూర్చుంది. ఆఫీస్ చేరుకున్న నాగేశం అడుగు లోపల పెట్టగానే ప్యూన్ వేణు, చేతిలో ఒక డబ్బాతో ఆఫీస్‌లోని ఒక్కో క్యాబిన్కూ తిరుగుతుండటం చూశాడు. విషయమేంటో లాగటానికి పక్క క్యాబిన్ లింగరాజును కదిలించాడు నాగేశం. ‘‘ఏమోయ్ లింగరాజు! వేణు ఏదో డబ్బా పట్టుకొని అంతలా తిరుగుతున్నాడు! ఏంటి అతగాని సంగతి?’’ ‘‘మీకు ఇంకా విషయం తెలీదా? మన పక్క బిల్డింగ్ అకౌంట్ సెక్షన్‌లోని విశ్వనాథం నిన్న సాయంత్రం చనిపోయాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయంగా మన ఆఫీస్ స్టాఫ్ తోచినంత డబ్బు ఇవ్వమని మేనేజ్మెంట్ సూచన....’’ ఇంకా ఏదో చెప్తోన్న లింగరాజు మాటలు నాగేశం చెవులను చేరట్లేదు. ముఖం దీనంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ లోపల విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. నెలరోజుల ముందు తన కూతురి పెళ్లికని దాచిన డబ్బుని వడ్డీకి విశ్వనాథం నాగేశానికివ్వటం, ఆ డబ్బుని అంతకంటే ఎక్కువ వడ్డీకి బయట వేరేవాళ్లకు ఇవ్వడం, విశ్వనాథం దురదృష్టం కొద్దీ ఈ విషయం వీరిద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలియకుండటం జరిగాయి. నాగేశం ఆనందానికి అవధుల్లేవు. వేణు చేతిలోని ఫండ్ డబ్బాలో తన తరఫున వంద రూపాయలు వేశాడు. తన మాటలు వింటున్నాడో లేదో పట్టించుకోకుండా విశ్వనాథం గురించి చెప్పుకుపోతున్న లింగరాజు, నాగేశం డబ్బాలో వంద వేయడం చూసి ఆశ్చర్యపోయాడు.మధ్యాహ్నం భోజనం ముగించుకొని తన కుర్చీ వద్దకు చేరుకున్న పురుషోత్తానికి నాలుగు కుర్చీల ఆవల ఒక ముసలావిడ కనిపించింది. రెండు గంటల నుంచి అక్కడే ఉందని స్ఫురణలోకి వచ్చి ఆమెను గమనించాడు. ఆ ముసలావిడ అభ్యర్థనను పట్టించుకోకుండా బల్లకింద తన చేతిని తృప్తి పరుస్తున్న వారి పత్రాలను మాత్రమే పరిశీలిస్తూ పనిలో నిమగ్నతను నటిస్తున్న వరుణ్ని ఏమనాలో పురుషోత్తానికి అర్థంకాలేదు. ముసలావిడని తన బల్ల వద్దకు పిలిపించుకొని రెండొందల రూపాయలు ఆమె చేతిలో ఉంచి చెవిలో ఏదో చెప్పి మళ్లీ వరుణ్ దగ్గరకు పంపాడు పురుషోత్తం. వరుణ్ బల్ల ముందుకు చేరిన ముసలావిడ బల్ల కింద చేయి ఉంచింది. ‘‘ఇదిగో మీరడిగిన డబ్బులు సారూ!’’ ఆశ్చర్యపోయాడు వరుణ్. ‘‘ఇప్పటివరకూ లేని డబ్బు ఇప్పుడెలా వచ్చింది?’’ ‘‘ఎలాగో అలా.. నా పని మాత్రం చేసి పెట్టండి సారూ!’’ ఆమె మాటలు అతణ్ని తప్పునైనా సరిగ్గా చేయమని ఆదేశిస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన పురుషోత్తాన్ని చూసిన వరుణ్ నిల్చున్నాడు. కూర్చోమని సైగ చేస్తూ పక్కనే తనూ కూర్చున్నాడు పురుషోత్తం.‘‘ఆ రెండొందలు ఇచ్చింది నేనే! దొంగనోట్లేం కాదయ్యా. ఆమె ఇస్తే తీసుకునే డబ్బుకి ఎంత విలువుందో నేనిచ్చే డబ్బుక్కూడా అంతే విలువుంటుంది.’’ ‘‘సార్! సారీ సర్..’’ ఒక్కక్షణం ఆగాడు పురుషోత్తం. ‘‘ఇప్పుడు బల్లకింద తీస్కునే డబ్బుతో ఏది కొన్నా ఆలోచించో, అవసరమయ్యో కొనవు. కొన్నాక అది నీ జీవితంలో ఎక్కువ రోజులు ఉండదు కూడా. కానీ ఇలా వచ్చే డబ్బు కోసం డెబ్భై ఏళ్ల ముసలావిడని ఇన్ని గంటలపాటు నిల్చోబెట్టి పట్టించుకోకపోవడం మాత్రం ఆమెకి మిగిలిన జీవితం మొత్తం గుర్తుంటుంది..’’ ‘‘ఒకరికి మంచి చేయమని నేను చెప్పట్లేదు. వరుణ్! నీ పని నిన్ను చేయమంటున్నానంతే’’. తన కుర్చీ వద్దకు వెళ్లిపోయాడు పురుషోత్తం. వరుణ్ కళ్లలో సన్నటి నీటి చెమ్మ. సాయంత్రం నాలుగ్గంటలకే ఆఫీసు నుంచి బయల్దేరిన నాగేశం తనకు ఇవ్వాల్సిన వారి నుంచి చీటీ డబ్బుల్ని ముక్కు పిండి మరీ వసూలు చేస్కొని అటునుంచి అటే మద్యం దుకాణానికి వెళ్లాడు. ఒంటరిగా కూర్చుని తన ఒంటరితనాన్ని తనే పంచుకుంటున్నాడు. గ్లాసులో మందు ఖాళీ అయ్యేకొద్దీ మత్తు ఎక్కుతూ ఉంది. చివరి గ్లాసు తాగేసి బయటకి వచ్చిన నాగేశానికి తన బైక్‌కు అడ్డంగా పడుకున్న ఒక కుక్క కనిపించింది. విచక్షణని మత్తు కమ్మేయడంతో ఆ కుక్కని బలంగా ఒక్క తన్ను తన్నాడు. అది నాలుగు అడుగుల దూరంలో ఎగిరిపడింది. దాని మూలుగు శబ్దాన్ని కూడా పట్టించుకోకుండా బండిపై వెళ్లిపోయాడు నాగేశం. ఆకాశాన్ని విపరీతంగా కమ్మిన మబ్బులు వర్షం తీవ్రతని సూచిస్తుండటంతో పాటు వెలుగును తొందరగా సన్నబరుస్తున్నాయి. ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరిన పురుషోత్తం ఈరోజుకి హోటల్లో బిర్యానీ పొట్లాన్ని కొని ఇంటికెళ్లాడు. పురుషోత్తం వెళ్లిన రెండు నిమిషాలకు అదే హోటల్లోని చివరి బిర్యానీ పొట్లాన్ని నాగేశం కొనుక్కొని ఇంటికి బయల్దేరాడు. వర్షం క్షణక్షణానికీ ఉధృతంగా మారిపోతోంది. ఇంటికి చేరుకున్న పురుషోత్తం స్నానం చేసి తినడానికి కూర్చున్నాడు. పొట్లం విప్పి తినబోతున్న అతనికి ఒక్కసారిగా వరండాలో బల్లకింది కుక్కపిల్ల గుర్తొచ్చింది. హడావుడిగా అక్కడికెళ్లి చూశాడు. చలికి వణుకుతూ, ఆకలికి మూల్గుతున్న బుజ్జి కుక్కను చూసి వెంటనే తాను తెచ్చుకున్న పొట్లాన్ని దాని మూతికి అందించాడు. ముక్కుతూ మూల్గుతూ తింటున్న దాన్ని చూసి చిన్న నవ్వు నవ్వుకుని టీవీ ముందుకొచ్చాడు. ‘ఓ నిండు చందమామ’ అంటూ వస్తున్న పాటను వింటూ వెనక్కి ఒరిగి కళ్లు మూసుకున్నాడు. ఎప్పటిలాగే తన లక్ష్మి గుర్తొచ్చింది. చిన్ని చిరునవ్వు నోటి మీదకొచ్చింది. సహారా ఎడారిలో ఉన్నా కూడా మనసును మంచుతో నింపే ఆమె జ్ఞాపకాలంటే పురుషోత్తానికి ప్రాణం. ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి తనని కాదనడానికి ఎన్నైనా కారణాలుండొచ్చు. కానీ ఇన్నేళ్ల తన ఒంటరితనాన్ని ఆమె జ్ఞాపకాలు ఎంత మధురంగా చేశాయో తనకు తెలుసు. అందుకే ఆమెంటే ఎప్పటికీ ప్రేమే. కానీ ఎందుకో తెలీదు ఈరోజు తను ఎక్కువగా గుర్తొస్తోంది. ఆలోచిస్తూనే పురుషోత్తం మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు అదే వీధిలో పురుషోత్తం ఇంటికి నాలుగు ఇళ్ల ఆవల ఉన్న తన ఇంట్లోకి చేరాడు నాగేశం. హోటల్ నుంచి తెచ్చుకున్న చివరి బిర్యానీ పొట్లం అవ్వడం వలన మసాలా బాగా ఎక్కువ మోతాదులో ఉన్నా ఆకలి నకనకలాడుతుండటంతో ఫుల్లుగా లాగించేశాడు. భుక్తాయాసంతో మంచం పైకి చేరి ఒక్కసారి తనకు రావాల్సిన చీటీ పద్దులు లెక్క చూసుకొని అలాగే మంచం పైకి ఒరిగాడు. భార్య చనిపోయి ఇన్నేళ్లయినా మామ తనకు ఇవ్వాల్సిన కట్నాన్ని సగానికి పైగా ఎగ్గొట్టినందుకు ఆయన్ను, తన డబ్బుతో చదువుకొని విదేశాలకు వెళ్లి ఒక్కపైసా కూడా పంపనందుకు కొడుకునీ, తన ఇష్టంతో సంబంధం లేకుండా వేరేవాణ్ని చేసుకున్నందుకు కూతుర్నీ.. ఇలా అందర్నీ తిట్టుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారిపోయాడు నాగేశం. అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. ఆరిపోయే దీపపు వెలుగులా వర్షం తన ప్రతాపాన్ని పెంచింది. గాఢ నిద్రలో ఉన్న పురుషోత్తం, నాగేశంల గుండెల్లో ఏదో చిన్న రాయి కదిలినట్టు సన్నని నొప్పి. ఆ నొప్పి పెరుగుతూ పెరుగుతూ నిద్ర గాఢతను తగ్గిస్తోంది. ఇద్దరూ పూర్తిగా మేల్కొనేసరికి వారి ఎడమ చేయి గుండెపై, కుడి చేయి పక్కన దొరికిన వస్తువును బలంగా పట్టుకున్నాయి. ఆ అర్ధరాత్రి వారి శరీరాన్ని ప్రకృతికి అప్పగించి వెళ్లిపోవడం తప్ప చేసేదేమీ లేదని వారి మెదడు సూచిస్తూనే ఉంది. కుంభవృష్టిలా కురిసిన వర్షం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి ఆగిపోయింది. అప్పటివరకూ వేగంగా కొట్టుకున్న శరీరాలు కదలడం ఆగిపోయి మెల్లగా చల్లబడటానికి సిద్ధమయ్యాయి. సెంచరీ కొట్టడానికి ఉపయోగపడే చివరి పరుగు ఎంత అమూల్యమైందో రమేశ్‌కి తెలుసు. అందుకే తన కొడుకు వైద్యానికి కావాల్సిన చివరి చిన్న మొత్తాన్ని సర్దిన పురుషోత్తం ఇంటి తలుపును చెప్పిన సమయానికి తట్టాడు. ఉదయం ఆరు గంటలకు ఠంచనుగా నిద్రలేచే అలవాటున్న పురుషోత్తం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోకి చూసిన రమేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కాసేపటికి ఆ వీధి, ఇంకాసేపటికి ఆ కాలనీ కూడా ఉలిక్కిపడ్డాయి. మరోవైపు సమాజం అవసరాలతో సంబంధం లేకుండా బతికే నాగేశం ఇంటివైపు ఎప్పట్లానే ఎవ్వరూ వెళ్లలేదు. వెళ్లరు కూడా. రక్త సంబంధీకుల రాకపోకలు కూడా ఉండకపోవటంతో అతని ఇల్లు కిటికీలు, తలుపులున్న అతిపెద్ద సమాధిలా ఉంది. చూస్తుండగానే పురుషోత్తం ఇంటిముందు చేరిన జనం సంఖ్య ముందురోజు పడిన వర్షపు చినుకుల సంఖ్యను తలపిస్తోంది. ఒకరికి తెలియకుండా ఒకరికి అతను చేసిన సహాయాలను ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఒక సంఘజీవి చనిపోయాడంటూ మనస్ఫూర్తిగా బాధ పడుతున్నారు. అంతిమ యాత్ర మొదలైంది. పురుషోత్తం శరీరాన్ని ఒకరితర్వాత ఒకరు పోటీ పడుతూ శ్మశానానికి కదులుతున్న జనాల్ని చూస్తుంటే అంతిమ యాత్ర కూడా ఒక అద్భుతంగా కనిపిస్తోంది. ఆ జనాలతో పాటే తనకు తెలిసో తెలీకో ఒక చిన్న కుక్కపిల్ల ముందురోజు రాత్రి సగం తిన్న బిర్యానీ పొట్లాన్ని వదిలేసి వారితో పాటు వెళ్తూ ఉంది. ఆ కుక్కపిల్లతో పాటు అంతిమ యాత్రలో పాల్గొన్న చాలామందికి తెలియదు, పురుషోత్తం ఏదో ఒక సమయంలో వారికి సాయం చేశాడని. పురుషోత్తం, నాగేశం చనిపోయి పన్నెండు గంటలయింది. పురుషోత్తం శరీరం శ్మశానంలో నిశ్శబ్దంగా కాలిపోతోంది. నాగేశం శరీరం ఎవ్వరి పట్టింపూ లేక అంతే నిశ్శబ్దంగా, భయంకరంగా కుళ్లిపోతోంది. -
రాలిపోతున్న విద్యాకుసుమాలు
సాక్షి, బెంగళూరు: తీవ్రమైన ఒత్తిడి, చిన్న సమస్య ఎదురైనా తట్టుకోలేని మనస్తత్వం, వెరసి దేశంలో గంటకో విద్యా కుసుమం రాలిపోతోంది. ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగాల్సిన విద్యార్థులను సమస్యల చదువు ఆత్మహత్యల దిశగా నడిపిస్తోంది. కేంద్ర హోం శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం... దేశవ్యాప్తంగా 2016లో 9,474 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. మహారాష్ట్ర 1,350 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక మొదటి, రెండు స్థానాల్లో, తెలంగాణ మూడో, ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా 2016లో తమిళనాడులో 981 మంది విద్యార్థులు బలవన్మరణం చెందగా రోజుకు సగటున మరణాల రేటు 2.68గా నమోదైంది. కర్ణాటకలో 540 మంది ఆత్మహత్య చేసుకోగా రోజువారీ రేటు 1.47గా ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 349 మంది, కేరళలో 340 మంది అర్ధంతరంగా తనువు చాలించారు. ఆంధ్రప్రదేశ్ 295 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో ఐదో స్థానంలో ఉంది. ఒత్తిళ్లే కారణమా?: ప్రాణాలు తీసుకోవాలనే తీవ్ర వైఖరి విద్యార్థుల్లో ప్రబలటానికి సామాజిక, మానసిక కారణాలు ఉన్నాయని అంటున్నారు మానసిక నిపుణులు. టాప్ ర్యాంకులు తెచ్చుకోవాలంటూ టార్గెట్లు పెడుతూ ఒత్తిళ్లు తెస్తున్న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల వైఖరి ఇందులో ప్రధానమైంది. నేటి తల్లిదండ్రులు తమ తమ కెరీర్లో బిజీగా ఉండి పిల్లలను పట్టించుకోకపోవడంతో వారు ఒంటరితనానికి గురవుతున్నారు. ఈ ఏకాకితనమే వారిని ఒత్తిడికి... ఆ ఒత్తిడి డిప్రెషన్‌కు.. చివరికి ఆత్మహత్యకు ప్రేరేపిస్తోందనేది మానసిక నిపుణుల మాట. విద్యార్థులు మద్యంతోపాటు డ్రగ్స్‌కు బానిసలుగా మారిపోతుండడం మరో కారణం. డ్రగ్స్ వాడకానికి అలవాటు పడ్డ విద్యార్థులు ఒత్తిడులు, సమస్యల నుంచి బయటపడిన భావన కలిగినప్పటికీ అది తాత్కాలికమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్‌కు, మద్యానికి బానిసలుగా మారిన 15శాతం మందిలో ఆత్మహత్య భావనలు కలిగే ప్రమాదముందని చెబుతున్నారు. అంతేకాదు, తమ అలవాటును తల్లిదండ్రులు గుర్తించారని అవమానంగా భావించిన సందర్భాలతో పాటు డ్రగ్స్ దొరకని సమయాల్లో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు యత్నిస్తుంటారన్నది నిపుణుల విశ్లేషణ. ఇటువంటి సమయాల్లో వీరి ప్రవర్తనను, వైఖరిని, నిశితంగా గమనించి తగిన చికిత్సతోపాటు కౌన్సెలింగ్ అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. సమస్యను ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం కావాలన్నా కాదనకుండా నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నారు తప్పితే, వారికి ఏదైనా సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పడం లేదు. సమస్యలు వచ్చినపుడు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ఉపాధ్యాయులు సైతం పాఠ్యాంశాల కంటే ముందుగా తమ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యాన్ని నింపాలి. కేవలం మార్కుల వెంబడి పరుగులు పెట్టడమే జీవితం కాదన్న విషయాన్ని పిల్లలకు తెలియజెప్పాలి. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కొనడమే జీవిత పరమార్థమని తెలియజెప్పాలి. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇలా... 2014 2015 2016 8,068 8,934 9,474 –అనూష, సైకాలజిస్టు. -
ఆకు కూరలతో బుర్రకు పదును!
ఆకు కూరలతో బుర్రకు పదును! ఆకు కూరలు తింటే ఆరోగ్యం బాగుపడుతుందని చాలాసార్లు విని ఉంటాం. ఇందులో గొప్ప విశేషమేమీ లేకపోవచ్చు. కాకపోతే ఇవే ఆకు కూరలు ప్రతిరోజూ తింటూ ఉంటే... వయసుతో పాటు మెదడు పనితీరు మందగించడానన్నీ తగ్గిస్తుందని అంటున్నారు రూథ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే పదకొండేళ్లలో మెదడుకు జరిగే నష్టాన్ని ఒక్క రోజు ఆకుకూరలు తినడం ద్వారా పరిహరించవచ్చు. షికాగో ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు వెయ్యిమంది వృద్ధులు (81 ఏళ్ల సగటు వయసు) పై పదేళ్లపాటు జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్టు మార్థా క్లెయిర్ మోరిస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మతిమరపు వంటి లక్షణాలేవీ లేని సమయంలో పరిశోధన మొదలుపెట్టామని, జ్ఞాపకశక్తి, ఆలోచనలకు సంబంధించి ఏటా పరీక్షలు పెట్టి చూశామని వివరించారు. వీటితోపాటు వారు ఎంత తరచుగా ఆకుకూరలు తింటూండేవారో తెలుసుకున్నామని మార్థా వివరించారు. ఈ అంశం ఆధారంగా వారిని ఐదు గుంపులుగా విభజించి పరిశీలనలు జరిపామని, రోజూ ఒక కప్పు కంటే ఎక్కువ ఆకుకూరలు తినే వారి మెదడు పని తీరుతో పోలిస్తే తక్కువ తినే వారి పని తీరు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఐదు గుంపుల మధ్య ఉన్న తేడాల ఆధారంగా ఒక కప్పు ఆకు కూరలతో 11 ఏళ్ల నష్టాన్ని నివారించవచ్చునన్న అంచనాకు వచ్చినట్లు చెప్పారు. గ్లూకోజ్ ఎంతుందో చెప్పేస్తుంది.. మధుమేహులకు రక్తంలో చక్కెర మోతాదు ఎంతుందో తెలుసుకోవడం రోజువారీ పని. అయితే ఇందుకోసం సూదులతో గుచ్చుకోవడమంటే ఎవరికైనా కష్టమే. ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉండనే ఉంది. ఇన్ని కష్టాలు ఉండటం వల్లనే చాలామంది మధుమేహులు రోజువారీ పరీక్షలకు వెనుకాడుతూ ఉంటారు. అయితే ఇకపై ఈ సమస్యలు దూరం కానున్నాయి. ఎలాగంటారా? షింగుహువా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ప్యాచ్ సిద్ధం చేశారు మరి. రెండు దశల్లో పని చేసే ఈ ప్యాచ్‌తో సూది గుచ్చుకోకుండానే రక్తంలోని చక్కెర శాతం ఎంత అన్నది చెప్పేస్తుంది. ఈ ప్యాచ్‌ను చర్మంపై అతికించుకునే ముందు అక్కడ కొంచెం హైయాలోరొనిక్ యాసిడ్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్యాచ్‌పై ఓ కాగితం బ్యాటరీని ఉంచుతారు. ఫలితంగా యాసిడ్ కాస్తా కరిగి చర్మం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న గ్లూకోజ్‌ను ఉపరితలంపైకి తెస్తుంది. దాదాపు 20 నిమిషాల తరువాత ప్యాచ్‌పై ఓ బయో సెన్సర్‌ను ఉంచితే చక్కెర మోతాదు ఎంతో తెలుపుతుంది. తాము ఇప్పటికే ఈ ప్యాచ్‌ను చైనాలోని కొన్ని ఆసుపత్రుల్లో మనుషులపై ప్రయోగించి చూశామని ప్యాచ్ ద్వారా వచ్చిన ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయని, పరీక్షలు చేయించుకున్న కార్యకర్తలు కూడా ఎలాంటి బాధ అనుభవించలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఒంటరితనంతో ఆయువుకు హానికరం ఆహారంలో మితిమీరిన కొవ్వు, ఎడాపెడా తగలేసే సిగరెట్లు, మోతాదుకు మించిన మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిన విషయమే. ఈ జాబితాలోకి ఒంటరితనాన్ని కూడా చేర్చాలంటున్నారు శాస్త్రవేత్తలు. మితమీరిన కొవ్వు, ధూమపానం, మద్యపానం మాదిరిగానే ఒంటరితనం కూడా మనుషుల ఆయువును హరించేస్తుందని హెచ్చరిస్తున్నారు. రోజుకు పదిహేను సిగరెట్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత చేటు జరుగుతుందో కుటుంబంలో అయిన వారి తోడు లేకుండా, సామాజిక సంబంధాలు కూడా పెద్దగా లేకుండా ఒంటరి జీవితం గడపడం వల్ల కూడా దాదాపు అంతే చేటు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్యూయెర్టో రికోలోని ఎక్సెటర్ యూనివర్సిటీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఒంటరి వ్యక్తులపై జరిపిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరితనం వల్ల గుండెకు, మెదడుకు చాలా హాని జరుగుతుందని, దీర్ఘకాలిక ఒంటరితనం ఆయువును హరించేస్తుందని ఈ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
ఒంటరితనం ప్రమాదమే!
వాషింగ్టన్: ఊబకాయం కంటే ఒంటరితనమే చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.ఊబకాయం కంటే ఒంటరితనం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు రెండు ప్రత్యేక బృందాలపై బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించి తెలిపారు. ఒంటరితనంలో జీవించే దాదాపు 3.4 లక్షల మందిని, సమాజంతో కలసి జీవించే 3 లక్షల మందిపై పరిశోధన నిర్వహించారు. ఒంటరితనంతో జీవించే వారి కంటే సమాజంతో కలసిపోయి బతికేవారిలో 50 శాతం మంది ఆలస్యంగా మరణిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన జూలియన్ హోల్ట్ లూస్టడ్ వెల్లడించారు. ఒంటరితనంతో జీవించే వారికి అనారోగ్య సమస్యలు రావడంతోపాటు మరణం కూడా ముందుగానే సంభవిస్తోందని చెప్పారు. సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా దీనిని అరికట్టగలమని భావిస్తున్నట్లు చెప్పారు. -
చివరిదశలో ఒంటరి వ్యథలు
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఇద్దరు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఏజ్‌వెల్ ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు 15 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. వీరిలో 47.49 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. పట్టణాల్లో ఉండే వారిలో 64.1 శాతం మంది ఒంటరితనాన్ని అనుభవిస్తుండగా పల్లెల్లో ఇది 39.19 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో పోలిస్తే పట్టణాల్లో ఉన్నవారిలో ఒంటరితనం భావన ఎక్కువ ఉన్నట్టు స్పష్టమైంది. వీరిలో అధికులు ఒంటరిగా కానీ వారి జీవిత భాగస్వామ్యులతో కానీ ఉంటున్నారని పేర్కొంది. అనారోగ్య కారణాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం తదితర కారణాల వల్ల వీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఒంటరితనం కారణంగా ప్రతి ఐదుగురు వృద్ధుల్లో ఒకరు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని దీనిని అధిగమించేందుకు కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 2017 ఏప్రిల్– జూన్ మధ్య ‘చేంజింగ్ నీడ్స్ అండ్ రైట్స్ ఆఫ్ ఓల్డర్ పీపుల్’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. -
ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారా?
సెల్ఫ్‌చెక్ చిన్నప్పుడే ఒంటరితనం అంటే ఏమిటో తెలుస్తుంది. చిన్న పిల్లలకు అమ్మ కనిపింకపోతే తల్లడిల్లిపోతారు. పదిమంది ఒకచోటకు చేరే సందర్భాల్లో కలవరు. సంఘంలో చిన్నచూపుకు గురవటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మొదౖలన కారణాలు లోన్లీనెస్‌ను ప్రేరేపిస్తాయి. అయితే ఒంటరిగా ఉండటం వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్రియేటివిటీకి లోన్లీనెస్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీనికి హద్దు ఉండాలి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా? 1. ఎవరితోనైనా మాట్లాడటానికి, కలిసి తిరగటానికి ఇష్టపడరు. ఎ. అవును బి. కాదు 2. మీ చుట్టూ ఉన్నవారు మీలా ఉండరని మీకు నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు కనిపించలేదని బాధ పడుతుంటారు. ఎ. అవును బి. కాదు 3. ఉద్వేగాలను అణుచుకోవటం కోసం ఒంటరి తనాన్ని కోరుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. చెడ్డ అలవాట్ల (మద్యపానం లాంటివి) వల్ల ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. ఎవరితో కలవకుండా మీలో మీరే కుమిలిపోతుంటారు. చెడు ఆలోచనలను అదుపు చేయటం మీవల్ల కాదు. ఎ. అవును బి. కాదు 6. జీవితంలో ఎదురుదెబ్బలు తిని ఉంటారు. దీనివల్ల అభత్రతాభావం మీలో ఉంటుంది. ఎ. అవును బి. కాదు 7. ఏమీ సాధించలే మని, నేనెందుకూ పనికిరానని అనుకుంటుంటారు. ఎ. అవును బి. కాదు 8. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవిం చరు. మీకు నచ్చినదే కరెక్ట్ అని వాదిస్తారు. ఎ. అవును బి. కాదు 9. ఎప్పుడూ పనిమీదే ధ్యాస. ఇతర విషయాలను పట్టించుకోరు. పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. ఎ. అవును బి. కాదు 10. ఎప్పుడూ పరధ్యానంలో ఉంటారు. మనోనిబ్బరం లేకుండా ఉంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు. న్యూనతాభావంతో ఉంటారు. నిరాశావాదంలో ఉండకండి. మీ సమస్యలు, సంతోషం ఇతరులతో పంచుకుంటేనే మనసు తేలిక పడుతుంది. అనవసర భయాందోళనకు దూరంగా ఉండండి. -
ఒంటరితనం ‘గుండె’కు చేటు
న్యూయార్క్ : మనలో చాలామంది కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించాలని అభిప్రాయపడుతుంటాం. అప్పుడే ఎలాంటి బాదరాబందీ ఉండవని భావిస్తుంటాం. అయితే అలా ఎక్కువ రోజులు ఎవరూ ఒంటరిగా జీవించలేమట. ఎక్కువ కాలం ఒంటరిగా బ్రతికే వాళ్లకి గుండెపోటులు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఒంటరిగా, సమాజానికి దూరంగా జీవించేవాళ్లకి 29 శాతం ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు, 32 శాతం హార్ట్ స్ట్రోకుల కలిగి ఉంటున్నారని తేల్చారు. ఒంటరితనాన్ని, సమాజానికి దూరంగా జీవించేవాళ్లని గుర్తించి, ఈ రెండింటికి సంబంధించిన సమస్యల నుంచి వారిని కాపాడటం ప్రధానమైన కర్తవ్యంగా బ్రిగ్హం యంగ్ యూనివర్సిటీ పరిశోధకలు పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. లక్షా 81 వేల మంది పెద్దలపై మూడు నుంచి 21 ఏళ్లు జరిపిన ఈ పరిశోధనలో, 4,628 కేసులు గుండెకు సంబంధించిన వ్యాధులుగా నమోదు అవగా, మూడువేల స్ట్రోకులను పరిశోధకులు గుర్తించారు. ఎలాంటి వ్యాధులు రాకుండా మనశ్శాంతిగా జీవించేందుకు సామాజికంగా అందరితో కలివిడిగా ఉండాలని తెలిపారు. అయితే టెక్నాలజీ అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో సామాజికంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం కోసం సమర్ధవంతమైన జోక్యాల రూపకల్పనే అతిపెద్ద సవాలని పరిశోధకులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. -
ఆదిమ ఏకాంతం ఎన్నాళ్లు?
విశ్లేషణ అండమాన్‌లోని జరావా తెగ ప్రజల నిర్బంధ ఏకాంత వాసాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ వారికి తమ మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? లేదా? ఇటీవల అండమాన్ జరావా తెగకు వార్తా పత్రికల్లో కాస్త చోటు లభ్యమవుతున్నట్లు కనిపిస్తోంది. జరావా యేతర పురుషుడితో సంపర్కం ద్వారా ఈ తెగ మహిళ ఒక పాపను ప్రసవించింది. అయితే ఆ పాప హత్యకు గురైంది. ఈ హత్యను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలా? లేక, జరావా తెగ అంతరించి పోకుండా కాపాడాలన్న తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ హత్యోదంతాన్ని పట్టించుకోకుండా ఉండిపోవాలా? శిక్షించడం ద్వారా ఒక జరావాను కోల్పోయినట్లయితే అది వారి సంఖ్యను తగ్గించే అవకాశముంది. ఒక్క మనిషి తగ్గిపోయినా సరే వారి సంఖ్య తగ్గిపోతుంది. దాదాపు 50 వేల సంవత్సరాలుగా జరా వాలు అండమాన్ ప్రాంతంలో వేటతో ఆహా రాన్ని సేకరించుకునేవారుగా మనుగడ సాధిస్తు న్నారు. క్షీణిస్తున్న వారి సంఖ్య రీత్యా అండమాన్ లోని ఓంజె తెగలాగా వీరినీ రక్షిత జాబితాలోకి చేర్చారు. వారి విశిష్ట, ప్రత్యేక లక్షణాల కారణం గా ఏ ఇతర గుంపులో కలిసినా సరే వీరికి హాని కలిగే అవకాశముంది. అందుకే, ‘బయటి వ్యక్తుల కనీస జోక్యం’తో ‘తమదైన భవిష్యత్తును ఎంచుకోవడానికి’ జరావాలను అనుమతించి నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ పేర్కొంది. జరావాలను వారి ఆవాస ప్రాంతాల్లోనే ఉంచుతూ వాటి సరిహద్దుల్లో గార్డులను నియమించడం ద్వారా వారిని బయటి వ్యక్తుల కు దూరంగా ఉంచడం అనేది ప్రభుత్వం అనుసరించే విధానపు ముఖ్య లక్షణంగా ఉంటోంది. ఒక దశలో సుప్రీంకోర్టు సైతం జరావాలు నివసించే ప్రాంతం గుండా వెళ్లే రోడ్‌ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది. గిర్ జంతు సంరక్షక కేంద్రంలోని సింహాలను చూస్తున్న విధంగా బయటి వ్యక్తులు జరావా లను చూడటానికి సఫారీకి వెళుతున్నారు. వారెక్కడ ఉంటున్నారో అక్కడే అలాగే ఉండేవిధంగా, జరావాలకు ప్రభుత్వం కలిగిస్తున్న రక్షణ నిష్క్రియాత్మకంగానే ఉంది. 1990ల ప్రాంతంలో జరావాలు అడవుల నుంచి బయటకు వచ్చి, తమ తెగ కానివారితో, బయటివారితో సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించారు. దేశంలోని ఇతర తెగలను ప్రధాన స్రవంతిలో కలిపేందుకోసం సక్రియాత్మకమైన, నిర్ణయాత్మకమైన మద్దతు నిచ్చేవారు. వీరికి కోటాలు ఉండేవి. బడ్జెట్లు ఉండేవి. అన్ని ప్రజాప్రాతినిధ్య సంస్థల్లో ప్రాతినిధ్యం కూడా ఉండే ది. మరొకవైపున, జరావాలను నిర్బంధ ఒంటరితనంలో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. అధికారిక విధానం ప్రకారం జరావాలను సంరక్షిస్తున్నారు. వారి రక్తసంబంధాన్ని, సంస్కృతిని భద్రపర్చడానికి మానవ విజ్ఞాన శాస్త్ర రీత్యా తగు కారణాలు ఉండవచ్చు.. కానీ వారికి మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? వారు ఏం ఎంపిక చేసుకునేది ఏది? మనకేమీ తేలీదు. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని, ఎంపికను మనం అసలు కనుగొనలేదు. అలాంటి అవకాశం వారికి ఉంటే, పార్సీలుగా ప్రధాన స్రవంతిలో ఉంటూనే తమ విశిష్ట లక్షణాలను అలాగే నిలిపి ఉంచుకునేవారా? ఇతరులతో పోలిస్తే తాము విశిష్టత కలిగి ఉన్నామనే విషయం పట్ల వారు జాగరూకతతో ఉంటున్నారని, కొత్తగా పుట్టిన బిడ్డను ఒక జరావా తెగ వ్యక్తి చంపివేసిన ఘటన సూచిస్తోంది. రహస్య సంబంధం వారిని మశూచి బారిన పడవేస్తున్నందున, వారిని బహిర్గతం చేసినట్లయితే తెగమొత్తానికే నష్టం కలుగుతుందని మనం గ్రహిస్తున్నాం. తక్కిన ప్రపంచం నుంచి పూర్తిగా దూరం పెట్టినందుకే వారిపట్ల ఆసక్తి ఏర్పడుతోందా? వారు మన ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదని చాలా తక్కువగానే వారికి తెలుసనేది స్పష్టం. మనలో ప్రతి ఒక్కరికీ దఖలుపడిన హక్కుల గురించి కూడా వారికి తెలిసింది చాలా తక్కువే. విచిత్రం ఏమిటంటే, వారిని రంగంలో ఉంచేందుకోవడమే? మనం సమయాన్ని, శక్తిని, వనరులనూ వెచ్చిస్తున్నాం. ఇది ఊరగాయల సీసాలో ముక్కల్లాగే తలపిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే వారి తరపున మనం నిర్ణయాలు తీసుకోవడమే అన్యాయం, అసమంజసం. మన గణతంత్ర రాజ్యంలో వారు భాగంగా లేరనిపించేలా ఇది ఉంటోంది. జరావాలను ఉన్నట్లుండి ప్రపంచం ముందుకు తీసుకురావటం వల్ల సొంత ప్రయోజనాలున్న బయటివారు వారికి పూర్తిగా హాని కలిగించేలా చేస్తుంది. సొంత ప్రయోజనాలు అంటే జరావాలు ఆధారపడి ఉన్న అడవులు లేదా వారి ఓట్లు వంటివి. వీటిలో రెండోదానికి అంత ప్రాముఖ్యత ఉండక పోవచ్చు. ఎందుకంటే జరావాల మొత్తం సంఖ్య 300 లేక 400 మాత్రమే. అయితే తక్కిన భారత్‌తో పోలిస్తే తమ పరిస్థితి గురించి అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేసే స్థాయిలో వారికి విద్య గరిపే విషయంలో కూడా ఎలాంటి గట్టి ప్రయత్నం జరిగి ఉండలేదు. వారి సమ్మతితో పనిలేకుండా మనం నిర్ణయిస్తున్నాం కాబట్టి నేను నైతిక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. కానీ అత్యంత చిన్న స్థాయి లోని వారి పరిమాణం రీత్యా వారు ఇప్పటికే మనల్ని ఉనికిపరంగా భయపెడుతున్న సామా జిక బృందంగా ఉంటున్నారు. ఏరకంగా చూసిన ప్పటికీ వారి భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది. అయినప్పటికీ ప్రస్తుత విధానం ప్రకారం వారు తమదైన చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండాల్సిందే. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com