Mahesh Vitta
-
ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ కమెడీయిన్, బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా అందరికీ పరిచయమే..టాలీవుడ్లో అంచెలంచెలుగా ఒక స్థాయికి చేరిన నటుడు మహేశ్. తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడి సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరాడు. బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ వెండితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. (ఇదీ చదవండి: హీరోయిన్ స్నేహకు గోల్డెన్ ఛాన్స్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..!) తాజాగా మహేశ్ తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్లో వారిద్దరి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. మహేష్ విట్టా-శ్రావణిల పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే తన లవ్ స్టోరీని మహేశ్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.. కానీ అప్పట్లో ఆమె పేరును మాత్రం బయటకు చెప్పలేదు. శ్రావణి రెడ్డిని సుమారు ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తన చెల్లెలు ఫ్రెండే అని కూడా మహేశ్ చెప్పాడు. మొదట్లో అతని ప్రేమను శ్రావణి రిజెక్ట్ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె ప్రేమను సాధించానని మహేశ్ చెప్పిన విషయం తెలిసిందే. రెండేళ్లు తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని.. ఆ తర్వాత తన ప్రేమకు శ్రావణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నాడు. శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. మహేశ్ పలు సినిమాల్లో రానిస్తున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Mahesh Vitta (@maheshvitta) -
దేవుడా, నువ్వున్నావా? ఇది చూస్తున్నావా?: సరయు
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్, ఎలిమినేషన్స్ మనం ఊహించినట్లుగా ఉండవు. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అవుతారనుకున్న కంటెస్టెంట్లు ఎక్కువ వారాలు హౌస్‌లో కొనసాగుతే, ఫినాలేకు చేరుకునే సత్తా ఉన్న హౌస్మేట్స్ మధ్యలోనే వెనుదిరుగుతారు. ఇలాంటి అద్భుతాలు ఒక్క బిగ్‌బాస్‌లోనే జరుగుతాయి. తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షోలో నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. అతడి స్థానంలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి పంపించారు. బాబాను ఇంట్లోకి పంపడం మంచి నిర్ణయమే కానీ చాలా ఆలస్యంగా దాన్ని అమలు చేశారు. అయితే గేమ్‌లో ప్రత్యర్థులకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న మహేశ్‌ను ఎలిమినేట్ చేయడమే అస్సలు బాగోలేదంటున్నారు ఆయన ఫ్యాన్స్. తాజాగా సరయు సైతం ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను నమ్మకం కోల్పోయాను. దేవుడా, అసలు నువ్వు నిజంగానే ఉన్నావా? ఇక్కడ జరిగేది గమనిస్తున్నావా? అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇతరులను బాధపెట్టడానికి ట్రోల్స్ చేస్తుంటారు. కానీ దానివల్ల వారి కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్లోకి కూడా వెళ్తుంటారు అని అఖిల్ సార్థక్ తల్లి దుర్గ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీనికి సరయు స్పందిస్తూ కరెక్ట్‌గా చెప్పారు ఆంటీ అంటూ ఆ పోస్ట్‌ను తిరిగి షేర్ చేసింది. చదవండి: సమంత ఒంటిపై మూడు టాటూలు, పచ్చబొట్టు వేయించుకోవద్దంటున్న సామ్ గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్, బాబా భాస్కర్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ!
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ను ఓటీటీలోకి తెస్తే ఎలా ఉంటుంది? బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదాన్ని గంట ఎపిసోడ్‌గా చూపించడం కంటే కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు 24 గంటలు చూసేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పుట్టుకొచ్చిందే బిగ్‌బాస్ ఓటీటీ. హిందీ, తమిళంలోనూ వర్కవుట్ అయిన ఈ బిగ్‌బాస్ ఓటీటీ తెలుగులో ప్రారంభమై ఏడువారాలవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 11 మంది మాత్రమే మిగిలారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేశ్ విట్టా నామినేషన్లో ఉన్నారు. వీరిలో అఖిల్, బిందు మాధవి ఓట్ల రేసులో దూసుకుపోతున్నారు. అరియానా, శివ మొదటి నుంచి మంచి గేమ్ ఆడుతుండటంతో వీరికంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్ల విషయం పక్కన పెడితే ఎప్పటిలాగే ఈవారం కూడా మిత్ర శర్మ సేఫ్. మిగిలిందల్లా అనిల్, మహేశ్. ఇద్దరూ గేమ్ ఎవరి స్టైల్లో వారు గేమ్ ఆడుతున్నారు, కానీ శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం దొరకడం లేదు. ఇంకా చెప్పాలంటే అనిల్ ఇంట్లో ఉండీలేనట్టుగా ఉంటున్నాడు. చదవండి: ప్రియురాలితో యాంకర్ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్ అటు మహేశ్ గతంలో కంటే కూడా చాలా మెరుగయ్యాడు. హౌస్‌మేట్స్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. టాప్ 5కి చేరుకునే సత్తా ఉంది. కానీ అనూహ్యంగా అతడిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఏడో వారం మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని లీకువీరులు దండోరా వేసి చెప్తున్నారు. నిజానికి ఓట్ల పరంగా అతడు మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ కావాలనే అతడిని గేమ్ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గేమ్‌లో కొట్లాటలు తప్ప పెద్దగా కామెడీ లేకుండా పోవడంతో బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో సీజ్‌లో పాల్గొన్న బాబా భాస్కర్‌ను హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! చదవండి: అమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది: యాంకర్ -
నాలుగేళ్లుగా ప్రేమలో, త్వరలోనే మా పెళ్లి: మహేశ్ విట్టా
ఒక్క ఛాన్స్ అంటూ సినిమాల్లో అవకాశాల కోసం రేయింబవళ్లూ కష్టపడిన మహేశ్ విట్టా ఇప్పుడు సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. తన యాసతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన మహేశ్ విట్టా గతంలో బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. తాజాగా అతడు మరోసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో అడుగుపెట్టాడు. అయితే షోలోకి వెళ్లేముందు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు మహేశ్. 'నాలుగేళ్లుగా రిలేషన్లో ఉంటున్నాం. ఎంత గొడవపడ్డా వెంటనే కలిసిపోతాం. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆమె నా చెల్లెలి స్నేహితురాలు. తను ఐటీలో ఉద్యోగం చేస్తుంది. రెండుసార్లు చూసినప్పుడు మా అమ్మ ఫేస్‌కట్ ఉందనిపించింది. వెంటనే ప్రపోజ్ చేశాను. పరిచయమవగానే ప్రపోజ్ ఏంటి? పో అంది. సరే ఫ్రెండ్స్‌గా ఉందామన్నాను. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పింది. గతేడాది మా ఇద్దరి ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. నా సినిమా రిలీజయ్యాక ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంటాను' అని చెప్పుకొచ్చాడు మహేశ్ విట్టా. బిగ్‌బాస్ ఓటీటీ గురించి మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టే వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారిందంటున్న మహేశ్ విట్టా
మహేశ్ విట్టా యూట్యూబర్, నటుడు, కమెడియన్. 2017లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. యాక్టింగ్ టాలెంట్‌తో పలు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఆయన బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాడు. అయితే తన ఫ్రస్టేషన్‌ను పక్కనవారికి చెప్పుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. నారదుడు అన్న బిరుదును అతడికి అంకితమచ్చారు. అయితే అప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు భయముండేది. కానీ ఇప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు జల్లికట్టులో ఎద్దు మాదిరిలా గుద్దుకుంటా పోతాడంతే.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పుకొచ్చాడు మహేశ్. బిగ్‌బాస్ తర్వాత ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారింది, సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా కూడా తీశానని చెప్పుకొచ్చాడు మహేశ్. ఊరమాస్‌గా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బుల్లితెరపై కూడా నవ్వులు పంచుతూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంటాడా? అనేది చూడాలి! -
బిగ్‌బాస్ చివరి రోజు: మహేశ్ హర్ట్ అయ్యాడు
నిన్నటి ఎపిసోడ్ చూసినవారికి బిగ్‌బాస్ షో మళ్లీ మొదలైందా అన్న భావన కలిగించేలా ఉంది. అందరూ ఒకే చోటికి చేరి రచ్చరచ్చ చేశారు. పొట్టి డ్రెస్సులతో అదరగొట్టారు. ఎలిమినేట్ అయిన 17 మంది కంటెస్టెంట్లు ఆటపాటలతో బిగ్‌బాస్ హౌస్‌ను హోరెత్తించారు. ఇక మొదట్లో శత్రువులుగా మారిన రాహుల్, శ్రీముఖి అన్నీ పక్కనపెట్టేసి మళ్లీ పాత మిత్రువులుగా మారిపోయినట్టు కనిపించింది. నిన్నటి పార్టీలో రాహుల్ శ్రీముఖిని ఎత్తుకుని తిప్పాడు. ఇక వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన జాఫర్, బాబా కామెడీతో, పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించారు. వీరి సమక్షంలో అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఎవరు ఏ అవార్డు అందుకున్నారంటే.. వరుస సంఖ్య అవార్డు అందుకున్న వ్యక్తి అందజేసిన వ్యక్తి 1 పక్కా మాస్ హేమ రాహుల్ సిప్లిగంజ్ 2 అగ్నిగోళం పునర్నవి వితికా షెరు 3 సర్వజ్ఞాని జాఫర్ బాబు హేమ 4 మెరుపుతీగ శిల్పా చక్రవర్తి శ్రీముఖి 5 మిస్టర్ రోమియో అలీ రెజా రవికృష్ణ 6 బెస్ట్ కామెడీ చానల్ రోహిణి బాబా భాస్కర్ 7 సైలెంట్ కిల్లర్ అషూ రెడ్డి శివజ్యోతి 8 బెస్ట్ ఫుటేజ్ క్వీన్ హిమజ రోహిణి 9 మిస్టర్ నారద మహేశ్ విట్టా(తిరస్కరించాడు) - 10 సూపర్ స్టార్ బాబా భాస్కర్ తమన్నా 11 దివా వితికా షెరు వరుణ్ సందేశ్ 12 పటాకా ఆఫ్ హౌస్ శ్రీముఖి రాహుల్ 13 మాయలోడు రవికృష్ణ శివజ్యోతి 14 జలపాతం శివజ్యోతి రోహిణి, అషూ, రవి, అలీ, హిమజ 15 రాక్ స్టార్ రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి, వరుణ్, వితికా 16 గ్యాంగ్ లీడర్ వరుణ్ సందేశ్ మహేశ్ విట్టా అవార్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శిల్ప, మహేశ్ మెరుపుతీగ అవార్డును అందుకోడానికి మొదట శిల్పా చక్రవర్తి నిరాకరించింది. అయితే అందరూ నచ్చచెప్పడంతో ముభావంగానే అవార్డును స్వీకరించింది. ‘అసలు నాకు ఈ అవార్డు అవసరమా’ అంటూ నిరుత్సాహాన్ని వెళ్లగక్కింది. మహేశ్ కూడా నారద అవార్డు అందుకోడానికి ససేమీరా అన్నాడు. ‘ టాస్క్ కోసం వాళ్లిస్తారు. కానీ తీసుకోవడం తీసుకోకపోవడం నా ఇష్టం’ అంటూ అవార్డును తిరస్కరించాడు. హిమజ ఓ సక్కనోడా.. పాట అందుకోగా వరుణ్ హ్యాపీడేస్ సాంగ్‌తో అందరినీ అలరించాడు. రాహుల్ పాటల హోరు అదనపు ఆకర్షణగా నిలిచింది. అందరూ మాంచి కిక్కిచ్చే పార్టీ చేసుకున్నాక ఇంటికి వీడ్కోలు పలికారు. అనంతరం బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్, శ్రీముఖి, వరుణ్ తిరిగి కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు. ఇక గ్రాండ్ ఫినాలే కోసం ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు వీరలెవల్లో కష్టపడుతున్నారు. డాన్స్ వచ్చినవాళ్లు, వచ్చీరాకుండా మేనేజ్ చేసేవాళ్లు, అసలు ఇప్పటివరకు డాన్స్ చేయనివాళ్లు కూడా నేటి ఎపిసోడ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకునేది ఎవరు అనేదానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి కొద్ది గంటల్లో వాటికి తెరదించుతూ ఫైనల్ విజేత ఎవరు అనేది తేలనుంది. -
ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు..
తెలుగు రాష్ట్రాల్లో టీవీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే షోల్లోఒకటి ‘బిగ్‌బాస్’. ఇందులో పాల్గొనే అవకాశం ఎన్నో వడపోతల తర్వాత వస్తుంది. అలాంటిది ‘ఫన్‌బకెట్’ కామెడీ స్కిట్లతో సోషల్ మీడియా ద్వారా యూత్‌కు చేరువైన మహేష్ విట్టా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బిగ్‌బాస్–3 హౌస్‌లో ఏకంగా 84 రోజులు ఉన్నాడు. గతవారం ఎలిమినేట్ అయ్యాక ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. లోపల జరిగేవన్నీ నిజం కాదని, నాగార్జున ఓన్లీ స్క్రిప్ట్‌ని మాత్రమే ఫాలో అవుతారని..ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.ఆవి మహేష్ మాటల్లోనే.. సాక్షి,సిటీబ్యూరో: వాస్తవానికి నేను ‘బిగ్‌బాస్–2’కి వెళ్లాల్సిన వాడిని. అప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్ చివర్లో ఉన్నాను. అదే సమయంలో ‘బిగ్‌బాస్’లోకి మహేష్ విట్టా వస్తే బాగుంటుందని ‘స్టార్ మా’కి నాని అన్న చెప్పారు. అప్పుడు ‘మా’ యాజమాన్యం నన్ను సంప్రదించింది. షూటింగ్స్‌లో బిజీ ఉండి రాలేనని.. వచ్చే ఏడాది వస్తాననడంతో సీజన్–3కి రావాలని పిలిచారు. తెలిసిన డైరెక్టర్లు, స్నేహితుల సలహాలు తీసుకుని అంతా ఓకే అనుకున్నాక ఓకే చెప్పా. అలా నాని మాట సాయం వల్ల వెళ్లానే తప్ప విజేత అవ్వాలని మాత్రం కాదు. నన్ను నేను టీవీలో చూసుకోవడానికి, ప్రేక్షకులకు ‘వాట్ ఈజ్ మహేష్ విట్టా’ అని చెప్పడం కోసం వెళ్లా. తల్లి రమణమ్మతో మహేష్ విట్టా నెగిటివ్ చెప్పడం చాలా కష్టం హౌస్‌లోకి అడుగుపెట్టాక చాలా సంతోషమనిపించింది. అందరం కొత్త ముఖాలే అయినా కలిసిపోయాం. కబుర్లు చెప్పుకుంటూ బాగానే ఉంటున్న సమయంలో టాస్క్‌లు ఇస్తారు. ఏవో చిన్న చిన్న గొడవలు. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారు. ఓ వ్యక్తి గురించి నెగిటివ్‌గా చెప్పాలి అంటే ఎలా చెప్తాం? అంత తప్పు ఆ వ్యక్తి ఏం చేశాడని చెప్పాలి? సరే.. బిగ్‌బాస్ చెప్పాడు కదా అని చెప్తాం.. మళ్లీ పొద్దున లేచాక ఆ మనిషి ముఖం చూడాల్సిందేగా? ఇన్ని సమస్యలు ఉండబట్టే లోపల ప్రతి ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. బయటకు చెప్పుకోలేం. మీరు చూస్తున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరు. ఫుడ్ విషయంలో ఇబ్బంది పడ్డా.. హౌస్‌లో ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడాలి. ఒక మనిషిని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. వాళ్లకు నచ్చిన కూరగాయాల్ని పంపుతారు. ఆ కూరగాయలు కూడా ఫ్రెష్ ఉండవు. వారానికి సరిపడా పంపే రేషన్‌లో కొన్ని ముఖ్యమైన నిత్యావసర సరుకులు ఉండవు. ఒకసారి కూరలో వేసుకునే కారం పంపలేదు. దాంతో మాదగ్గరున్న ఎండు మిర్చిని దంచి కారంలా చేసి కూరల్లో వాడుకున్నాం. లోపల పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. లైట్స్ ఆపితేనే పడుకోవాలి లోపల ఉన్న మాకు రాత్రి– పగలు ఎప్పుడో తెలియదు. బిగ్‌బాస్ లైట్లు ఆపి పడుకోండి అంటే పడుకోవాలి, లైట్లు ఆన్‌చేసి లేవమంటే లేవాల్సిందే. నైట్ టైం పోలీసుల పెట్రోలింగ్ వాహనాల సైరన్ విని రాత్రి అయ్యిందేమో అనుకునేవాళ్లం. ఇంటి నుంచి లెటర్స్ వస్తే వారు చదివి, బయట విషయాలు లేవంటేనే మాకు సమచారం ఇస్తారు. నాగార్జునకు కూడా తెలియదు వాస్తవానికి హౌస్‌లో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు నాగార్జున గారికి కూడా తెలియనివ్వరు. వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ని మాత్రం ఆయన ఫాలో అవుతారు. ఆయన కూడా ఎవ్వరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదు, ఇబ్బంది పెట్టేవారు అసలే కాదు. అసలు నేను ఎందుకు పనికిరానని అందరూ అనుకున్న సమయంలో నాగ్ సార్ ‘మహేష్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్, నీ స్టైల్లో నువ్వు ఆడు’ అంటూ సపోర్ట్ చేశారు. దసరా రోజు హౌస్‌లోకి వచ్చినప్పుడు నాతో సరదాగా ఉన్నారు. ఆ హ్యాపీ మూమెంట్ స్వీట్ మెమరీ. నాకు బాగా నచ్చిన వ్యక్తి బాబా మాస్టర్. ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు. ఆ రాజకీయాలు ఏంటనేవి నేను చెప్పను. హౌస్ నుంచి రాగానే అమ్మని కలిశాను. కొన్నిరోజులు కేరళ వెళతా. టీఆర్పీ రేటింగ్స్ కోసం గత వారంలో అయిన గొడవను టీవీలో ఫ్రెష్‌గా చూపిస్తారు. పునర్నవి, రాహుల్, నేను, వితిక, వరుణ్ ఫ్రెండ్స్. మా మధ్య సరదా సంఘటనలు జరిగాయి. వీటిని ఎడిటింగ్ చేసి పునర్నవి, రాహుల్ మధ్య ఏదో ఉందన్నట్టు టెలికాస్ట్ చేశారు. అక్కడ అదేం లేదు. -
ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్!
బిగ్‌బాస్ ఇంట్లో మహేశ్‌కు, శ్రీముఖికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికీ తెలిసిందే! పన్నెండో వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ‘హంట్ అండ్ హిట్’ టాస్క్‌తో ఇది మరింత తేటతెల్లం అయింది. శ్రీముఖిని పంపించాలని చూసినప్పటికీ చివరికి మహేశ్ బిగ్‌బాస్ హౌజ్‌ను వీడక తప్పలేదు. ఇక మహేశ్.. తననే టార్గెట్ చేశాడని గ్రహించిన శ్రీముఖి కూడా అతని మాటలకు గట్టి కౌంటర్లే ఇస్తూ వచ్చింది. మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించినప్పుడు బాబా తప్ప ఇంటిసభ్యులెవరూ పెద్దగా బాధపడినట్లు కనిపించలేదు. తన గురువు అంటూ బాబా భాస్కర్‌కు పాద నమస్కారం చేసి అతనిపై భక్తి, ప్రేమలను చాటుకున్నాడు. ఎలిమినేషన్ రోజు కూడా మహేశ్, శ్రీముఖి నాగ్ ముందే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇక మహేశ్ వెళ్లిపోయే ముందు శ్రీముఖితో పనుందంటూనే ఏమీ చెప్పకుండానే సెలవు తీసుకున్నాడు. కానీ స్టేజిపైకి వచ్చిన తర్వాత మనసులో ఉన్నదంతా కక్కేశాడు. ఇంట్లో నెంబర్ 1 కంటెస్టెంట్ బాబా తప్ప ఎవరూ లేరటూ ఘంటాపథంగా చెప్పాడు. ఇక కిచెన్‌లో అన్ని గిన్నెలు కడగాలన్న బిగ్‌బాంబ్‌ను శ్రీముఖిపై వేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. తాను గురువుగా గౌరవించే బాబాకు ఆర్డర్లు వేస్తుందని, అది తనకు ఇసుమంతైనా నచ్చదని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి ఎన్ని గిన్నెలైనా వేసేయండి అంటూ బాబాకు ఉచిత సలహా ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్ బాస్ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్ 3 షోకు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో బిగ్‌బాస్ విజేత ఎవరనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ చర్చే 84వ ఎపిసోడ్‌గా మారింది. శనివారం స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున.. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చి ఎపిసోడ్‌ను అత్యంత వినోదకంగా మార్చారు. మొదట శుక్రవారం ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్ను చూపించారు. ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్‌లో బాబా భాస్కర్, అలీ, వరుణ్‌లు పాల్గొనగా ఎండ్ బజర్ మోగే సరికి ముగ్గురు 12 బాటిల్స్ ఫిజ్ తాగారు. దీంతో గేమ్ టైగా ముగిసింది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫిజ్ బాటిల్స్ తీసుకొచ్చి తాగాలి అని చెప్పగా, అలీ రెజా ఒకటి తాగేసి రెండోది తాగుతున్న సమయంలో ఎండ్ బజర్ మోగింది. దీంతో టాస్క్ విజేతగా అలీ నిలిచారు. ఆ సమయంలో బాబా, వరుణ్, అలీ పడిన ఇబ్బందులు ఫన్నీగా అనిపించాయి. (చదవండి : బిగ్‌బాస్ : ‘అతడు’ ఎలిమినేటెడ్!) అనంతరం వితికా, వరుణ్‌లు స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు రోమాంటిక్‌గా చర్చ జరిపారు. వరుణ్‌ను ఎత్తుకొని పూల్‌లో పడేసేందుకు వితికా గట్టి ప్రయత్నం చేసింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న 8 మంది సభ్యులకు ట్రెజర్ హంట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో దాచిన 8 వస్తువులను 8 మంది పట్టుకోవాలని సూచించారు. దీంతో అందరూ వస్తులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారిలో అలీరెజానే ఎక్కువ వస్తువులను కనిపెట్టాడు. 8 వస్తువులలో 7 వస్తువులను ఇంటి సభ్యులు కనుక్కోని, ఒక వస్తువును మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో చేసేది ఏమిలేక ఆ వస్తువు ఎక్కడ ఉందో నాగార్జునే చెప్పాడు. ఆ వస్తువును బాబా భాస్కర్ తీసుకున్నాడు. 8 వస్తువులో ఒక్కో వస్తువుకు ఒక్కో అర్థం వచ్చేలా బిరుదు ఇచ్చారు నాగార్జున. ఇందులో ఇతరులపై ఆధారపడేవాళ్లు, మోస్ట్ డేంజర్, భజన చేసే వాళ్లు, జోకర్, ఆట ఆడించేవారు, సుత్తి వేసేవాళ్లు, బలహీనమైన వాళ్లు అనే బిరుదు ఉన్నాయి. వాటిలో ఏది ఎవరి సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున చెప్పారు. అయితే ఇతరులపై ఆధారపడే వాళ్లు, బలహీనమైన వాళ్లుగా మహేష్‌ను ఎంచుకోగా, సుత్తి ఎక్కువగా మాట్లాడేది శివజ్యోతిగా ఎంచుకున్నారు. మోస్ట్ డేంజర్‌గా వితికాను బాబా భాస్కర్ ఎంచుకున్నాడు. ఫన్నీగా సాగిన ఈ ప్రక్రియలో ఎక్కువ బిరుదులు వితికా, బాబాలకు రావడం గమనార్హం. అనంతరం మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. బిగ్‌బాస్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు వస్తే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నాడు. శ్రీముఖి ఆ సొమ్మును అమ్మనాన్నలకు ఇస్తానని చెప్పగా, వరుణ్ వితిక ఇస్తానని, రాహుల్ ఇల్లు కొంటానని, అలీ వాళ్ల నాన్నకు వ్యాపారం పెట్టించి, హోటల్‌ను తెరిపిస్తానని, మహేష్ హైదరాబాద్‌లో ఓ ఇళ్లు కట్టి దానికి వాళ్ల నాన్న పేరు పెడుతానని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆ ప్రైజ్ మనీతో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. అనంతరం ఇంటి సభ్యుల్లో ఎవరికి రూ.50 లక్షలు తీసుకునే అర్హత లేదో చెప్పాలని కింగ్ నాగార్జున అడగ్గా.. వితిక, వరుణ్‌లు బాబా భాస్కర్ పేరును, రాహుల్ వరణ్ పేరు, అలీ, జ్యోతి, శ్రీముఖి మహేష్ పేరును సూచించారు. మహేష్ విట్టా.. శ్రీముఖకి పేరును చెప్పి ఎందుకు అర్హత లేదో కూడా వివరించారు. ఆమె ప్రతిదీ గేమ్‌లాగే ఆడుతుందని, ఆమె ప్రవర్తను తనకు నచ్చడం లేదన్నాడు. రూ. 50 లక్షలు తీసుకునే అర్హత శ్రీముఖికి లేదన్నాడు. మహేష్ కామెంట్స్‌పై శ్రీముఖి మండిపడింది. అతను ప్రతి విషయంలో తనను టార్గెట్ చేస్తున్నాడని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడని విమర్శించింది. ప్రతి స్టోరీని తనకు అనుకూలంగా, చాలా అందంగా నరేట్ చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే వీరి మధ్య నాగార్జున కలుగజేసుకొని ఆ వార్కి అక్కడే పుల్‌స్టాప్ పెట్టాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ కొంచెం కామెడీగా, కొంచె హాట్‌గా సాగింది. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో నేడు తెలియనుంది. -
బిగ్‌బాస్ : ‘అతడు’ ఎలిమినేటెడ్!
బిగ్‌బాస్ పన్నెండో వారం ముగింపుకు వచ్చినప్పటికీ అసలైన మజా రావటం లేదు. షో చూస్తే నిద్ర వస్తుందే తప్ప ఇంట్రస్ట్ అన్న మాట మచ్చుకైనా కనిపించటం లేదని ప్రేక్షకుల వాదన. ఇప్పటివరకు తొమ్మిది మంది ఇంటిని వీడగా మరొకరు తట్టాబుట్టా సర్దుకోనున్నారు. అయితే ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్లో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్తూ పూటకో ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. దీంతో అతని నిజ స్వరూపం ఇంటి సభ్యులందరికీ అర్థమయి కాస్త దూరం పెట్టారు. దీంతో అందరితో కలిసిపోయానంటున్న మహేశ్ ఇంట్లో చివరికి ఏకాకిగా మారిపోయాడు. అయినప్పటికీ నారద వేషాలు మానుకోలేదు. ఇక నామినేషన్ రౌండ్లో వరుణ్, రాహుల్ ఉన్నందున బాబా భాస్కర్, శ్రీముఖి ఫ్యాన్స్ ఓట్లు మహేశ్‌కు పడే అవకాశాలు ఎక్కువ. కానీ మహేశ్.. శ్రీముఖిని టార్గెట్ చేశాడని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ అతనికి ఓట్లు వేయాలా వద్ద అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. అటు బాబాతోనూ సఖ్యతగా ఉండకపోవటం వల్ల అతని అభిమానులు కూడా అదే పరిస్థితిలో కొట్టుమిట్టాడారు. ఈ ఊగిసలాటలోనే వారం అంతా గడిచిపోయింది. మరి ఈ లెక్కన చూస్తే మహేశ్‌కు ఓట్లు తగ్గినట్టేగా! గతంలోనూ నాగ్ ఒకసారి మహేశ్‌ను ఎలిమినేట్ చేశాడు. కానీ అది టాస్క్‌లో భాగంగా! ఈ సారి మాత్రం ఊరికే కాకుండా నిజంగానే గుడ్‌బై చెప్తారని టాక్.. సో ఈ విషయం మహేశ్‌కు కూడా ఈపాటికే అర్థమై ఉంటుంది. అందుకే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని లెక్కలు వేసుకున్నాడు. ఒకవేళ వెళ్లిపోయినా నాతోపాటు ఇంకొకరు రావాల్సిందేనని మంకు మీద ఉన్నాడు. మరి మహేశ్ చెప్పినట్టు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేక మహేశ్ బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం దగ్గరపడిందా! అన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
‘మొగుడే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు’
బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు హంట్ అండ్ హిట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి సభ్యులకు వారికి తెలియని, ఇంతవరకూ చూడని వీడియోను ప్లే చేశాడు. దీంతో అందరి రంగు బయటపడింది. ఊసరవెల్లిలా రంగులా మార్చేవారు ఈ దెబ్బతో తెల్లమొహం వేశారు. మొదట బాబా భాస్కర్‌కు అలీ రెజా, రాహుల్ వీడియోలను చూపించాడు. అయితే కోపంలో అవన్నీ మామూలే అని బాబా తేలికగా తీసుకున్నాడు. రాహుల్‌తో మాట్లాడుతూ నిజంగా నిన్ను టార్గెట్ చేసి ఉంటే ముఖం మీద చెప్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అనంతరం అలీ రెజా ఫోటో ఉన్న కుండను పగలగొట్టాడు. శ్రీముఖికికి..ఆమె ఒక్క నిమిషం కూడా బిగ్‌బాస్ గేమ్ వదలదు అంటూ మాట్లాడిన అలీ, డైరెక్ట్ ఎలిమినేట్ చేయమంటే శ్రీముఖిని లగేజ్ సర్దుకోమంటానని చెప్పిన మహేశ్ వీడియోలను చూపించాడు. దీంతో వీరావేశంతో బయటికి వచ్చిన శ్రీముఖి మహేశ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పి అతని ఫొటో కుండకు అతికించి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది. శివజ్యోతి రాహుల్ ఫొటో ఉన్న కుండను పగలగొట్టింది. రాహుల్‌కు నోటిదూల ఎక్కువ అంటూ మహేశ్, శివజ్యోతితో చెప్పుకొచ్చిన వీడియోను బిగ్‌బాస్ రాహుల్‌కు చూపించాడు. నేరుగా చెప్పే దమ్ము లేదా అంటూ మహేశ్‌తో వాగ్వాదానికి దిగిన రాహుల్. మహేశ్ ఫొటో ఉన్న కుండను బద్ధలు కొట్టాడు. వితిక.. వీడియో చూశాక అలీపై సీరియస్ అయి అతడి ఫోటో ఉన్న కుండ పగలగొట్టింది. ఇక అలీ.. వీడియో చూసిన తర్వాత శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడంటూ వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. మహేశ్‌కు.. శ్రీముఖి అతని గురించి నెగెటివ్‌గా మాట్లాడిన వీడియోను ప్లే చేశాడు. అది చూసిన మహేశ్‌కు చిర్రెత్తుకొచ్చి శ్రీముఖి కుండను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వరుణ్.. అలీ ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు. ఇక స్టార్ ఆఫ్ దహౌస్గా నిలిచిన వరుణ్, శివజ్యోతికి స్పెషల్ డిన్నర్ రావటంతో ఇంటిసభ్యులు గుటకలు వేసినా ఏం లాభం లేదని తెలుసుకుని మిన్నకుండిపోయారు. ఇక మహేశ్ వీడియో చూసిన తర్వాత బాగా హర్ట్ అయినట్టు కనిపించాడు. ఇక నుంచి తాను ఎవరితో మాట్లాడను అంటూ శ్రీముఖి, మాస్టర్‌పై అలిగాడు. నా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. అయినా నాపై జోకులు వేస్తున్నారు. శ్రీముఖి అవసరం కొద్దీ మెదులుతుంది. నామినేషన్‌కు వెళ్లకుండా ఉండటానికి అందరితో క్లోజ్‌గా ఉంటుంది అని అతని అభిప్రాయాన్ని శివజ్యోతితో పంచుకున్నాడు. అలీరెజా గుట్టు బయటపడిందని, మహేశ్ చిత్రగుప్తులవాడు అని వరుణ్, వితిక అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిసభ్యులు రచ్చరచ్చ చేశారు. వింత వింత వేషధారణలతో డాన్స్ చేశారు. బిగ్‌బాస్ బర్త్‌డే ఇంటిసభ్యుల చావుకొచ్చింది అన్నట్టుగా తయారైంది పరిస్థితి. బర్త్‌డే సందర్భంగా బిగ్‌బాస్ కేకుల మీద కేకులు పంపించాడు. మొదటి కేక్‌ను ఆవురావురుమంటూ తిన్నారు కానీ నాలుగో కేక్‌కు వచ్చేసరికి అపసోపాలు పడుకుంటూ తినేశారు. ఇక బిగ్‌బాస్ ఇంట్లో 80 రోజులు గడిచిపోయాయి. రానురాను టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. ఎవరు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కడదాకా పోరాడుతారో చూడాలి! -
బిగ్‌బాస్: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!
బిగ్‌బాస్ ఇంట్లో ఇంటిసభ్యులకు కింగ్ నాగార్జున సరిపోయే క్యాప్షన్స్ ఇచ్చారు. అయితే నాగార్జున ఇచ్చిన క్యాప్షన్‌కు నొచ్చుకున్న ఏకైక వ్యక్తి మహేశ్. పుల్లలు పెట్టడం అనే ట్యాగ్‌ను ఇంటిసభ్యులు ఎవరైనా గుర్తు చేస్తే చాలు.. ఒంటికాలిపై లేస్తాడు. ఉన్నమాటంటే ఉలుకెక్కువ అని ఊరికే అనలేదు అని మహేశ్‌ను చూస్తే తెలుస్తుంది. అందరితో కలిసిపోయానంటూనే అన్ని విషయాలు తెలుసుకుంటూ వారి రహస్యాలను అంగట్లో పెడుతున్నాడు. ఇది బిగ్‌బాస్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులకే కాదు.. ఇంటిసభ్యులకు కూడా తెలిసిన విషయం. ఇదే విషయాన్ని తాజా ఎపిసోడ్‌లోనూ వారు వెల్లడించారు. ఇటు రాహుల్ టీం దగ్గరికొచ్చి వారితో మాట్లాడింది అంతా శ్రీముఖి టీం దగ్గరికెళ్లి పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే ఇదే జరుగుతుందని రాహుల్ ముందుగానే అంచనా వేశాడు. అంతేనా.. మహేశ్ వెళ్లిపోయిన తర్వాత అతని తీరుపై శ్రీముఖి అనుమానం వ్యక్తం చేసింది. ఎటొచ్చి అతను పుల్లలు పెట్టడం వల్ల ఎవరికీ ఏమీ ఒరగలేదు. అంతా మహేశ్ తలకే చుట్టుకుంటోంది. బాబా బంటుగా పేరొందిన మహేశ్ మిగతా ఇంటిసభ్యుల దగ్గర బాబా భాస్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల మొదటికే మోసం వస్తుందన్న విషయం మహేశ్‌కు ఇంకెప్పుడు అర్థం అవుతుందో! మహేశ్ చెప్పిందే నిజం అయింది.. గత వారం వరుణ్, రాహుల్, పునర్నవి, మహేశ్‌లు నామినేషన్ రౌండ్లో ఉన్నారు. ఆ సమయంలో డబుల్ ఎలిమినేషన్ ఉండాలని మహేశ్ బిగ్‌బాస్‌ను కోరుకున్నాడు. వీలైతే ట్రిపుల్ ఎలిమినేషన్ ఉన్నా పర్వాలేదంటూ బిగ్‌బాస్‌కు సూచించాడు. నామినేషన్లో ఉన్న అందరినీ పంపించి తాను మాత్రం హౌస్‌లోనే ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఇక వరుణ్ బ్యాచ్‌లోని నలుగురిలో ఒకరు వెళ్లిపోవాలని, వారికి ఆ బాధేంటో తెలియాలి అని తన విపరీత కోరికను బయట పెట్టాడు. అతను అనుకున్నట్టే పునర్నవి ఎలిమినేట్ అయింది. మహేశ్ చెప్పిందే నిజం అయింది. ఇక తాజా నామినేషన్లోనూ మహేశ్ ఎవరైతే వెళ్లిపోవాలని భావించాడో వారే మళ్లీ పోటీగా ఉన్నారు. మెడాలియన్ పవర్‌తో వితిక ఎలాగోలా నామినేషన్ నుంచి తప్పించుకుంది. ఇక వరుణ్, రాహుల్‌లతో పోలిస్తే మహేశ్‌కే తక్కువ ఫాలోయింగ్ ఉంది! అదీకాక అక్కడివి ఇక్కడ.. ఇక్కడవి అక్కడ చెప్తూ తనకు తానే నెగెటివిటీ తెచ్చుకుంటూ డేంజర్ జోన్లో పడ్డాడు. ఇక మహేశ్ రెండు నాలుకల ధోరణిని భరించలేకున్నామని, బిగ్‌బాస్ ఇంటికి గుడ్‌బై చెప్పే రోజులు దగ్గరపడ్డాయని నెటిజన్లు అంటున్నారు. అతన్ని ఎలిమినేట్ చేసి తగిన బుద్ధి చెపుతామంటున్నారు. -
బిగ్‌బాస్: గాయపడిన శివజ్యోతి
పన్నెండో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోల ప్రకారం నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగేలా ఉంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ‘సేఫ్ పార్కింగ్’అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎనిమింది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్ స్థలాలు మాత్రమే ఇచ్చాడు. అయితే సేఫ్‌గా పార్కింగ్ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అవుతారు. అలా పార్కింగ్ స్థలాలను తగ్గిస్తూ ఉండటంతో.. ఒక్కొక్కరు నామినేట్ అవుతారు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలను పరిశీలిస్తే వరుణ్, వితికా, మహేశ్ విట్టాలు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. తొలి రౌండ్లోనే రాహుల్, మహేశ్‌లు ఓకే పార్కింగ్ స్థలంలోకి వెళ్లడానికి పోటీ పడ్డారు. అయితే మహేశ్ విఫలం కావడంతో నేరుగా నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక టాస్క్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ కిందపడ్డాడు. దీంతో అలిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బాబా భాస్కర్ కావాలనే కొంతమందిని అడ్డుకుంటున్నారని ఆయనపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే బాబా భాస్కర్ తన స్టైల్లో సర్ధి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. కాగా, టాస్క్‌లో శివజ్యోతి కాలికి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. గాయంతో శివజ్యోతి విలవిలాడుతుండటంతో ఇంటిసభ్యులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే అలీ రెజా వెంటనే శివజ్యోతిని ఎత్తుకొని కన్ఫెషన్ రూమ్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్‌పై బిగ్‌బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం నామినేట్ అయ్యేది ఎవరో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. Trolley task lo #Rahul disappointed#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/hQ7gsWGZUi — STAR MAA (@StarMaa) October 7, 2019 Trolley parking task lo hurt aina #ShivaJyothi.. #Ali comes for rescue #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/oAhQgc3aQX — STAR MAA (@StarMaa) October 7, 2019 -
బిగ్‌బాస్ : ఎలిమినేట్ అయ్యేదెవరో తెలిసింది!
బిగ్‌బాస్ వీకెండ్లో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ గురించే అందరు చర్చించుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే దానిపై ఒకటి, రెండు రోజుల ముందుగానే బయటికి తెలియడంతో సస్పెన్స్ లేకుండా పోతోంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై బిగ్‌బాస్ చిన్నపాటి లాజికల్ గేమ్ ఆడినట్టుగా తెలుస్తోంది. మహేశ్ హౌజ్‌లో నుంచి వెళ్లిపోతున్నట్టు బిగ్‌బాస్ నుంచి లీక్‌లు వచ్చాయి. కానీ అందులో ఏ మాత్రం నిజం లేనట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ వారం పునర్నవి హౌజ్‌ను వీడుతున్నట్టు సమాచారం. అయితే గతంలో జరిగినట్టుగా కాకుండా ఈ వారం ఎలిమినేషన్ విషయంలో.. కొద్దిపాటి సస్పెన్స్ క్రియేట్ చేయడంలో బిగ్‌బాస్ నిర్వహకులు విజయవంతం అయ్యారనిపిస్తోంది. ఈ వారం రాహుల్, వరుణ్, పునర్నవి, మహేష్‌లు నామినేట్ కాగా.. తొలుత డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ చివరకు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఒక్కరే అని తెల్సింది. ఆ నలుగురిలో రాహుల్ సేఫ్ అయినట్టు హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్లో ప్రకటించారు. ఇక మిగిలిన ముగ్గురిలో వరుణ్ స్ట్రాంగ్ కంటెస్ట్ కాగా.. మహేశ్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపైనే అందరు చర్చించడం ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పునర్నవి హౌజ్ నుంచి వెళ్లనున్నట్టుగా తెలిసింది. ఈ రోజు ఎపిసోడ్లో నవరాత్రి వేడుకల సందర్బంగా హౌస్మేట్స్ నవరసాలను ప్రదర్శించనున్నారు. మరోవైపు శనివారం సాగిన ఎపిసోడ్లో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ను వితిక గెలిచినట్టుగా బిగ్‌బాస్ ప్రకటించాడు. -
బిగ్‌బాస్: పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసిన మహేశ్
బిగ్‌బాస్ ఇంట్లో నవ్వులు తగ్గిపోయి కేవలం అరుపులు, గొడవలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజా ఎపిసోడ్లో డెటాల్ కోసం పునర్నవి రాహుల్‌ను చెడామడా తిట్టడమే కాక అలిగింది. దీంతో అలక పోగొట్టడానికి రాహుల్ కాసేపు పునర్నవిని ఆటపట్టించాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ రెండో లెవల్లో శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీ రెజా తలపడ్డారు. ఈ టాస్క్‌లో ఒక్కొక్కరు ఒక్కో ఫ్రేములో నిలబడి తలపై పెట్టుకున్న వస్తువును ఫ్రేముకు ఆనించాలి. ఫ్రేమును కానీ వస్తువును కానీ చేతితో తాకడం లాంటివి చేయకూడదు. ఇక ఎక్కువ సేపు బ్యాలెన్స్‌గా ఉన్న బాబా భాస్కర్ ఈ టాస్క్‌లో గెలిచి ఫైనల్ లెవల్‌కు చేరుకున్నాడు. టాస్క్ తర్వాత ఇంటిసభ్యులు బాబా భాస్కర్ మునుపటిలా లేడు అంటూ మాట్లాడుకున్నారు. బాబా హీరోయిజంలో బతుకుతారే తప్ప, రియాలిటీ చెక్‌లో బతకలేడు అని పునర్నవి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ ఆఖరి అంకానికి వెళ్లే ముందు ఇంటిసభ్యుల అభిప్రాయాలు చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఫైనల్ లెవల్‌కు చేరుకున్న బాబా భాస్కర్, వితికలలో నచ్చినవారికి తిలకం పెట్టి నచ్చని వ్యక్తి తలమీద గుడ్డు పగలగొట్టాలని పేర్కొన్నాడు. ఇక శ్రీముఖి.. వితికపై గుడ్డు పగలగొట్టగా, బాబాకు తిలకం పెట్టింది. మహేశ్.. తన మార్పుకు కారణమైన వ్యక్తి అంటూ బాబాకు అంటూ తిలకం దిద్దాడు. శివజ్యోతి కూడా బాబాకు తిలకం పెట్టింది. కాగా అతనేంటో ఇప్పటివరకూ అర్థం కావట్లేదు అంటూ అలీరెజా, రాహుల్, పునర్నవి.. బాబా భాస్కర్ మీద గుడ్లు పగలగొట్టి వితికకు నుదుటిపై బొట్టు పెట్టారు. వరుణ్.. వితికకు తిలకం దిద్దాడు. టాస్క్ అనంతరం ఇంటిసభ్యులు బాబా భాస్కర్‌తో.. మాతో ఎందుకు కలవట్లేదు అని ప్రశ్నించారు. దీనికి బాబా భాస్కర్ మాట్లాడుతూ.. నాగార్జున వీడియో చూపించినప్పటినుంచి గిల్టీగా ఉందని వాపోయాడు. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తోంది అని బాధపడ్డాడు. ఆయన మనోవేదనను చూసిన రాహుల్ అనవసరంగా బాబాను తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని పునర్నవితో చెప్పుకొచ్చాడు. ఇక మహేశ్.. మళ్లీ పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. వరుణ్ టీంతో మంచిగా ఉంటూనే వారి వెనక గోతులు తవ్వడం ప్రారంభించాడు. వారు మాట్లాడుకున్న విషయాలను శ్రీముఖి దగ్గర ప్రస్తావించాడు. వరుణ్, రాహుల్, పునర్నవి, వితిక అంతా ఒక్కటే అని పేర్కొన్నాడు. ‘నీ వెనక దారుణంగా మాట్లాడతారు కానీ నీ ముందుకు రాగానే బెస్ట్‌ఫ్రెండ్స్ అన్నట్టుగా మాట్లాడతారు’ అని శ్రీముఖితో అన్నాడు. ఇక బాబా భాస్కర్, వితికలలో మెడల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి! -
నామినేషన్లో ఉన్నదెవరంటే..?
బిగ్‌బాస్ హౌస్‌లో రాళ్లే రత్నాలు అనే టాస్క్.. రెండో రోజూ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్‌లో భాగంగా రాళ్లు ఏరుకునేప్పుడు వితికాపై మిగతా హౌస్‌మేట్స్‌పడటంతో వారిపై ఫైర్ అయింది. ఈ టాస్క్‌లో అలాగే అవుతుందని.. వరుణ్‌కూడా తిరిగి ఫైర్ అయ్యాడు. చివరకు మళ్లీ కూల్ చేసేందుకు వితికాను బుజ్జగించసాగాడు. రెండో బజర్ మోగే సరికి మహేష్ దగ్గర తక్కువ రాళ్లు ఉండటంతో నామినేషన్లోకి వచ్చాడు. ఎండలో లభించే విటమిన్ ఏంటని ఇంటి సభ్యులంతా డిస్కషన్ పెట్టుకున్నారు. హౌస్మేట్స్ రాళ్ల కోసం అగచాట్లు పడుతూనే ఉన్నారు. అయితే మూడో బజర్‌మోగే సరికి పునర్నవి దగ్గర తక్కువ విలువైన రాళ్లు ఉండటంతో పునర్నవి నామినేషన్లోకి వెళ్లింది. ఇక చివరి బజర్ మోగేసరికి వరుణ్-బాబా భాస్కర్‌కు సరి సమానం వచ్చాయని.. వితికా ఇచ్చిన రాళ్లతో ఇద్దరూ సరిసమానం అయ్యారు. అయితే కెప్టెన్ అయిన శ్రీముఖి వారిద్దరిలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుందని వితికా చెప్పుకొచ్చింది. అయితే చివరగా.. కురిసిన వర్షంతో వరుణ్ తక్కువగా సంపాదించుకోవడంతో నామినేషన్లోకి వచ్చాడు. దీంతో రాహుల్, వరుణ్, పునర్నవి, మహేష్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!
పదకొండో వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన రాళ్లే రత్నాలు.. అనే టాస్క్ ఉత్కంఠగా సాగింది. రాళ్ల వర్షం కురిసినప్పుడల్లా.. హౌస్మేట్స్ వాటిని సంపాదించడం కోసం పరిగెత్తడం.. తీరా వాటిని చేజిక్కించుకున్నాక కాపాడుకోవడం కోసం తంటాలు పడటం హైలెట్‌గా నిలిచింది. రాళ్ల వర్షం కురిసే సమయానికి రాహుల్ అందుబాటులో లేకపోయే సరికి.. అతను వెనకబడిపోయాడు. అయితే రాళ్లను సంపాదించడం కోసం శివజ్యోతి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పున్ను వద్ద నుంచి లాక్కుందామని ప్రయత్నించగా.. రాహుల్ చేతిని కొరికేసింది. వారు సంపాదించుకున్న రాళ్లను గంపలో దాచుకున్నారు. రెండో సారి రాళ్ల వర్షం కురవగా.. వాటిని ఏరుకోవడం అందరూ బిజీ అయ్యారు. మహేష్ దగ్గరి నుంచి లాక్కోవడానికి రాహుల్ ప్రయత్నించడంతో.. అతను ఫైర్ అయ్యాడు. ఆవేశంతో తన దగ్గరున్న రాళ్లను విసిరిపారేశాడు. ఎవరికేం కావాలో తీసుకోండని కోపంగా అన్నాడు. అయితే రెండు వందలు విలువచేసే రాయిని పునర్నవికి మహేష్ ఇచ్చాడు. అయితే చివరకు తన తప్పును తెలుసుకున్న మహేష్.. తన రాళ్లను తనకివ్వమని బతిమిలాడాడు. అయితే పున్ను మాత్రం తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఫన్ క్రియేట్ అయ్యేలా చేసింది. మొదటి బజర్ మోగేసరికి రాహుల్ దగ్గర తక్కువ విలువ రాళ్లు ఉండటంతో అతను నేరుగా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. కానీ వారంతా నిత్యావరసరాలను తీర్చుకోడానికి చాలా కష్టపడ్డాల్సి వచ్చింది. ఉప్పు ధర ఐదు వేలు, ఒక్క ఉల్లిగడ్డ ధర రూ.500, పసుపు వెయ్యి రూపాయలని చెప్పేసరికి వారి గుండె బద్దలైంది. అయినా ఉప్పు లేకుండా వంట ఉండదు కాబట్టి తలా ఇంత వేసుకుని వంట చేసుకున్నారు. అయితే ఈ టాస్క్ పూర్తయ్యే సరికి తిండి కోసం తిప్పలు పడేట్టు కనిపిస్తోంది. టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇంటి లోపలకి అడుగు పెట్టకూడదనే కండీషన్‌పెట్డాడు. రేపటి ఎపిసోడ్లో ఈ టాస్క్ మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు కనిపిస్తోంది. -
బిగ్‌బాస్.. టాస్క్‌లో మహేష్ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవ జరగని రోజు ఉంటుందా? అంటే చెప్పడం కష్టమే. ఇక వీకెండ్లో నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేసే టైమ్‌లో తప్పా మిగతా ఐదు రోజుల్లో ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు ఫైర్ అవుతునే ఉంటారు. అది టాస్క్‌లో భాగంగానే కావచ్చు.. నామినేషన్ ప్రక్రియలో భాగంగానే కావచ్చు... లేదా ఊరికే మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనూ గొడవలు కావచ్చు. అయితే ముఖ్యంగా టాస్క్‌లు ఆడుతున్న సమయంలోనే ఈ గొడవలు జరగుతూ ఉంటాయి. ఎన్ని గొడవలు జరిగినా.. మళ్లీ అంతా ఒక్కటవుతారు అది వేరే విషయం. రాహుల్ నిన్న పాట పాడినట్లు.. ఎన్ని గొడవలు జరిగినా.. మళ్లీ అంతా ఫ్రెండ్స్‌లానే కలిసిపోతారు. నేటి నామినేషన్ ప్రక్రియ కోసం చేట్టిన టాస్క్ ఆసక్తి రేపేలా ఉంది. రాళ్లే రత్నాలంటూ పెట్టిన ఈ టాస్క్ హౌస్మేట్స్ మధ్య చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది. టాస్క్ ఆడనంటూ మహేష్ తప్పుకుంటుండగా.. శ్రీముఖి అతడ్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. బాబా భాస్కర్కూడా సర్దిచెప్పేప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చివరకు ఏం జరిగిందన్నది చూడాలి. -
బిగ్‌బాస్: ఇంటి సభ్యులందరికీ బిగ్ షాక్!
బిగ్‌బాస్ ఇచ్చిన క్రేజీ కాలేజీ టాస్క్‌లో బెస్ట్ టీచర్‌గా బాబా భాస్కర్, బెస్ట్ స్టూడెంట్‌గా మహేశ్ ఎంపికయ్యారు. ‘ప్రచారమే ఆయుధం’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో బాబా భాస్కర్ అతని బంటుగా పేరొందిన మహేశ్ తలపడ్డారు. వీరిద్దరూ ఇంటి సభ్యుల దగ్గరికి వెళ్లి గెలిపించమని మద్దతు కోరగా.. ఎవరి ప్రచారమైతే నచ్చుతుందో వారి మెడలో ఇంటి సభ్యులు పూలదండను వేస్తారు. ‘అధికారంలో ఉన్నప్పుడే మనిషి గుణం తెలుస్తుంది ఇది నేను చెప్పింది కాదు.. మహాత్మాగాంధీ చెప్పిన మాట. నాలో మార్పు కోసం నేను కెప్టెన్సీ కోరుకుంటున్నా’నంటూ మహేశ్ తన మాటలతో మ్యాజిక్ చేశాడు. అదేవిధంగా మహేశ్‌కు ఒక చాన్సిచ్చి చూద్దాం అని భావించిన ఇంటి సభ్యులందరూ (వితిక, పునర్నవి తప్ప) మహేశ్‌కు పూలమాలలు వేసి కెప్టెన్‌గా గెలిపించారు. ఇక కెప్టెన్ మహేశ్.. సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కెప్టెన్ మీటింగ్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. చెప్పుకోండి చూద్దాం అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో హిమజ సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో కెప్టెన్ మహేశ్ ప్లకార్డును పట్టుకుంటాడు కానీ దాన్ని చూడడు. ఇంటిసభ్యులు నేరుగా అక్కడ రాసి ఉన్న పేరును కెప్టెన్‌తో చెప్పించాలి. అందరూ సరిగ్గా చెప్పడంతో లగ్జరీబడ్జెట్ టాస్క్ విజయవంతంగా పూర్తయింది. ఇక ఎప్పుడూ డాన్స్‌తో హుషారుగా ప్రారంభమయ్యే రోజు కాస్త నేటి ఎపిసోడ్లో డల్‌గా స్టార్ట్ అయింది. లేస్తూనే ఏడుపు లంకించుకున్న శివజ్యోతిని శ్రీముఖి ఎత్తుకుని బుజ్జగించింది. అటు వితిక కూడా వరుణ్ ఒడిలో తలపెట్టి కన్నీళ్లు కార్చింది. దీంతో ఇంట్లో వాతావరణం ఎమోషనల్‌గా మారగా.. ఇది తర్వాత ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. కాగా ఇంటిసభ్యులందరికీ బిగ్‌బాస్ బిగ్‌షాక్ ఇచ్చాడు. (చదవండి: ఈ మాత్రం దానికి బిగ్‌బాస్ షో అవసరమా!) బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టి 60 రోజులు పూర్తయినందున ఫ్యామిలీని మిస్ అవుతున్న ఇంటి సభ్యుల కోసం ఓ సర్ప్రైజ్ సిద్ధం చేశాడు. అయితే ఓ మెలిక కూడా పెట్టాడు. ఇంటి సభ్యులు ఎవరూ మాట్లాడటానికి వీలులేదని తెగేసి చెప్పాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూపించగా ఇంటి సభ్యులందరూ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి, శివజ్యోతిలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇక పార్టిసిపెంట్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులతో బిగ్‌బాస్ గేమ్ ఆడించనున్నాడు. అందులో భాగంగా అయిదింటిలో జోకర్, అయిదింటిలో ఐ లోగో ఉన్న బాక్సులను ఏర్పాటు చేశాడు. ఐ లోగో వచ్చిన వారితో గేమ్ ఆడించి అందులో గెలిచిన ఇద్దరికి మాత్రమే ఇంట్లోకి వెళ్లే అవకాశముందని చెప్పాడు. ఇప్పటికే వితిక లక్కీ చాన్స్ కొట్టేసింది. కాగా వితిక, రవిలకు ఇంటిసభ్యులను కలుసుకునే గోల్డెన్ చాన్స్ దక్కిందని సమాచారం! -
బిగ్‌బాస్.. హిమజ కావాలనే చేసిందా?
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్ కొన్ని మార్పులు మాత్రమే చేశాడు. అప్పుడు కూడా టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేసి ఒక్కో హౌస్‌మేట్స్‌ను పిలిచి నేరుగా నామినేట్ చేశాడు. అయితే నామినేషన్లోంచి తప్పించుకోవడానికి ఓ అవకాశమిస్తున్నట్లు చెప్పి.. మిగతా హౌస్మేట్లోంచి ఒకరి చేత తాను చెప్పిన పనిని చేయించాల్సి ఉంటుందని షరతును విధించాడు. దీనిలో భాగంగా రెండో సీజన్లో గీత మాధురి బిగ్‌బాస్ ట్యాటూ వేయించుకోగా.. ఈసారి శ్రీముఖి వేయించుకుంది. తనీష్ తనకు ఇష్టమైన జాకెట్‌ను పెయింట్‌లో ముంచగా.. ఈసారి రవి తనకిష్టమైన షూలను పెయింట్‌లో ముంచాడు. తేజస్వీ కోసం సామ్రాట్ క్లీన్ షేవ్ చేయించుకోగా.. శ్రీముఖి కోసం బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకున్నాడు. అయితే మహేష్ నామినేషన్ విషయానికొచ్చేసరికి మాత్రం తేడా కొట్టేసింది. గతంలో కూడా ఇలాంటిది ఇచ్చిన బిగ్‌బాస్.. మరోసారి చెక్ చేయమని చెప్పలేదు. ఈసారి కెప్టెన్ అయిన వితికాను.. హిమజకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఏమైనా ఉంటే చూసి చెప్పండని ఆదేశించాడు. దీంతో హిమజకు సంబంధించిన మేకప్ వస్తువులు, కొన్ని బట్టలు మిగలడంతో ఆ విషయాన్ని బిగ్‌బాస్‌కు తెలిపింది. దీంతో మహేష్ నామినేట్ అయినట్లు తేల్చేశాడు. అయితే హిమజ కావాలనే ఇలా చేసిందని కొందరు అంటుండగా.. కాదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా హిమజ చేసిన ఈ పనితో మహేష్ నామినేషన్లోకి వచ్చేశాడు. దీంతో హిమజపై ప్రస్తుతం ఫుల్ నెగెటివిటీ పెరుగుతోంది. -
నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇచ్చిన తమన్నా, శిల్పా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. హౌస్‌లోని ఇంటి సభ్యులతో వారు సరిగా కలవలేకపోయారు. బిగ్‌బాస్ ఆడియెన్స్‌ను మెప్పించలేక వెనుదిరిగిపోయారు. అయితే ఈ తొమ్మిదో వారంలో మరో సర్ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సోమవారం నాటి ఎపిసోడ్‌కే నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. సోమవారం అర్దరాత్రి నుంచే ఓటింగ్ కూడా మొదలవుతుంది. కానీ నిన్నటి ఓటింగ్ లైన్లు తెరుచుకోలేదు ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు ఒక్క మహేష్ మాత్రమే నామినేషన్లోకి వచ్చాడు. మిగిలిన ప్రక్రియ నేటి ఎపిసోడ్లో పూర్తవ్వనున్నట్లు తెలుస్తోంది. అయినా రాహుల్ కోసం పునర్నవి జుట్టు కత్తిరించుకున్నట్లు, శివజ్యోతి కూడా ఏదో త్యాగం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ వారం నామినేషన్లో ఉండేది ఒక్కరు లేదా ఇద్దరే. అందుకే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి తీసుకుని రావడానికి రంగం సిద్దం చేసినట్లు సమాచారం. వీరి కోసం ఓటింగ్‌ను చేపట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. అలీ రెజాకు అందరి కంటే ఎక్కువ అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలీ ఎలిమినేట్ అయినప్పటి నుంచి అతడిని మళ్లీ రీఎంట్రీ చేయించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. రోహిణి కూడా అనవసరంగా ఎలిమినేట్ అయిందనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడింది. గత సీజన్లో కూడా ఇలానే జరిగింది. రీ ఎంట్రీ పెట్టినప్పుడు.. భారీ ఓట్లను సాధించి నూతన్ నాయుడు, శ్యామల తిరిగా హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఈ సారి కూడా అలాంటిదే రీపిట్ అయితే.. కచ్చితంగా అలీ రెజా ఉంటాడని అనిపిస్తోంది. మరి నిజంగానే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? రీ ఎంట్రీపై క్లారిటీ కావాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి. -
స్టేజ్ పైనే షూ పాలిష్ చేసిన నాగ్
బిగ్‌బాస్ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ ఇచ్చాడో కానీ హౌస్ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు రెచ్చిపోవడంతో.. మనుషులుగా ఉన్న శ్రీముఖి, మహేష్, పునర్నవిల మెడకు చుట్టుకుంది. ఆ టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చినందుకు గానూ ఆ ముగ్గురికి పనిష్మెంట్ను బిగ్‌బాస్ ఇచ్చాడు. షూ పాలిష్ చేయాలంటూ ఇచ్చిన టాస్క్‌ను పునర్నవి, మహేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు షూ పాలిష్ చేయమంటాడు.. రేపు చెడ్డీలు ఉతకమంటాడు అంటూ మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతి లేక వచ్చామా అంటూ ఆ సమయంలో బాగానే ఫైర్ అయ్యాడు. అయితే ఇదే మహేష్ కొంపముచ్చేట్టుంది. ఈ విషయంలో నాగార్జున బాగానే సీరియస్ అయినట్టు కనిపిస్తోంది. స్టేజ్ పైనే షూ పాలిష్‌చేసిన నాగ్.. గేట్లు తెరిచే ఉన్నాయి బయటకు వెళ్లు అంటూ మహేష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరి తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాలి. Open the gates please!!!#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/P4iHYnslnn — STAR MAA (@StarMaa) September 14, 2019 -
డిన్నర్ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్ ఐటమ్స్ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్ లభించాయి. చివరకు అందరికీ బిగ్‌బాస్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. సీక్రెట్-లైస్ అని ఓ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. దాంట్లో ఇంటి సభ్యులందరూ గెలిస్తే.. డిన్నర్‌పార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో కన్ఫెషన్ రూమ్‌లో జరిగిన వాటిని మిగతా హౌస్‌మేట్స్‌కు తెలియపర్చాలి. అయితే అవి నిజాలా? కాదా? అని ఇంటి సభ్యులు కనిపెట్టాలి. ఇలా వారు చెప్పినవన్ని నిజాలే అని గెస్ చేస్తే.. డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలిపాడు. టాస్క్‌లో భాగంగా మొదటగా.. బాబా భాస్కర్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అనంతరం 1 నుంచి 100 వరకు, 100 నుంచి 1 వరకు లెక్కించమన్నాడు. ఏ నుంచి జెడ్ వరకు జెడ్ నుంచి ఏ వరకు చెప్పమన్నాడు. అయితే వీటిని చెప్పడంలో బాబా తడబడ్డాడు. హౌస్మేట్స్ దగ్గర ఏబీసీడీలు నేర్చుకోమ్మని సలహాఇచ్చాడు. ఇక బాబా భాస్కర్ తనకు కన్ఫెషన్ రూమ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ల గురించి చెప్పగా.. అవి నిజమేనని తమ నిర్ణయాన్ని తెలిపాడు. రవి-హిమజలకు కేక్‌లు, చాక్లెట్లు ఇచ్చిన బిగ్‌బాస్.. వరుణ్-వితికాలను ఏకాంతంగా మాట్లాడుకునే వీలును కల్పించాడు. పునర్నవి నర్సరీ రైమ్స్, శివజ్యోతి తెలుగు పద్యాలను పాడారు. రాహుల్ విషయంలో మాత్రమే ఇంటి సభ్యులు పప్పులో కాలేశారు. అయితే శ్రీముఖి ప్రదర్శించిన అత్యుత్సాహం వల్లే నిజాన్ని కనుక్కోలేకపోయారు. దీంతో వరుణ్-శ్రీముఖి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు ఇరువురు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇక శ్రీముఖికి నాగ్ ఫోటోను ఇచ్చి మాట్లాడుకోమన్నాడు.. శిల్పాకు తన భర్త ఫోన్ చేశాడని అబద్దం చెప్పమని అన్నాడు. కానీ ఇంటి సభ్యులు పసిగట్టేశారు. ఇక అందరి టాస్కుల్లోకెల్లా.. మహేష్‌కు ఇచ్చిన టాస్క్ కాస్త ఫన్నీగా అనిపించింది. అయితే అది అబద్దమని ఇట్టే పసిగట్టేశారు. అయినా మహేష్ నమ్మించేందుకు ప్రయత్నించినా.. ఎవ్వరు కూడా నమ్మలేదు. దీంతో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది చూడాలి. -
మహేష్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్!
-
మహేష్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్!
అవును మహేష్‌ను బిగ్‌బాస్ ఎలిమినేట్ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్ సీక్రెట్ టాస్క్ చేయాలి. అసలే ఈ వారంలో నామినేషన్లో ఉన్న మహేష్‌కు ఈ సీక్రెట్ టాస్క్ ఏమైనా ఉపయోగపడుతుందా? లేదా అన్నది తెలియాలి. గతవారంలో ఎలిమినేషన్ జోన్లో శ్రీముఖి మినహా.. మిగతా అందరూ మగవారే. అయితే ఈ సారి దానికి భిన్నంగా ఉంది. ఈ వారంలో నామినేషన్లో ఉన్నది మహేష్ మినహా అందరూ ఆడవారే. మరి ఈ వారంలో మహేష్‌ను సేవ్చేసేందుకే బిగ్‌బాస్ ఈ సీక్రెట్ టాస్క్‌ను ఇచ్చాడా? తాను ఎలిమినేట్ అయినట్లు, ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించినట్లు మిగతా ఇంటి సభ్యులను మహేష్ నమ్మించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా తన లగెజ్ను సర్దుకుంటూ ఉన్నాడు. మధ్యలో బాబా భాస్కర్ అడుగుతుండగా.. దానికి మహేష్ ఏదో ఆన్సర్ చెబుతున్నాడు. సీరియస్‌గా నటిస్తూ... ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు.. మరి నిజంగానే ఈ సీక్రెట్ టాస్క్‌లో గెలిస్తే.. ఈ వారం మహేష్ సేవ్ అయినట్టేనా? మహేష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటాడా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి.