-
యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
కోల్‌కాతా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీల ప్రాబల్యం ఉన్న జంగీపూర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని బీజేపీ రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకుంటోంది. దీని వల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల మొదటి, రెండో దశ ఓటింగ్ పూర్తయింది. ఈ దశలోనే బీజేపీ ఓటమి భయాన్ని పొందిందని మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక అంశాన్ని ఉపయోగిస్తోంది. ఈసారి యూసీసీ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది ఒక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత ఏర్పడుతోందని మమతా బెనర్జీ అన్నారు. మొదటి రెండు దశల ఓటింగ్ తర్వాత ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ఐదు దశల్లో కూడా బీజేపీ ఓటమిని చవి చూస్తుందని బెనర్జీ అన్నారు. ఎన్నికల తరువాత రాబోయే ఫలితాలే దీన్ని చెబుతాయని అన్నారు. -
టీచర్లపై వేటు.. ఆ పార్టీలకు ఓటు వేయొద్దన్న సీఎం మమత
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఉద్యోగాలు రద్దైన టీచర్లకు ఓ సందేశాన్ని పంపారు. హైకోర్టు తీర్పు అనంతరం తొలిసారి సీఎం మమతా స్పందించారు. ‘బీజేపీ హైకోర్టు కోర్టును కోనుగోలు చేసింది. సుప్రీం కోర్టును కాదు. నాకు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నా. బీజేపీ హైకోర్టును, సీబీఐ, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, సీఏపీఎస్ వంటి ప్రభుత్వం సంస్థలను కొనుగోలు చేసింది. దూరదర్శన్ ఛానెల్ కలర్ మార్చింది. ఛానెల్ వాళ్లు కేవలం బీజేపీ, మోదీ గుర్చించి మాత్రమే ప్రసారాలు చేస్తారు. దూరదర్శన్ ఛానెల్ చూడకండి. ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయండి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు.. టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇక.. 2019లో మొత్తం 42 స్థానాల్లో 18 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీచర్లు తీవ్ర నిరసన తెలిపారు. అవినీతికి పాల్పడిన కొంతమంది వల్ల వేలాది మంది అమాయక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు.2016 నాటి స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ (SLST) చట్టబద్ధం కాదని జస్టిస్ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్ రషీదిలతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఎల్ఎస్టీ 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని కూడా కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో ఎస్ఎల్ఎస్టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు. కాగా,లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది. ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు -
కూటమి చిలుక 'పీకే'
సాక్షి, అమరావతి: తాను ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ (పీకే) వల్లె వేస్తున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని స్పష్టమైంది. ఏపీలో టీడీపీ–బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈమేరకు బుధవారం టీవీ 9 బంగ్లా చానెల్‌కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా పీకే జోస్యం చెబుతున్నారు’ అని వెల్లడించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం చెబుతున్నట్లు తేలిపోయింది. బాబు అరెస్టు తరువాత.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేష్ తీసుకొచ్చారు. ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పారు. బిహార్‌లో కలసి రాకపోవడంతో.. బెంగాల్ ఎన్నికల తర్వాత 2021లో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ పీకే ప్రతినబూని ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీ‹Ùకుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. ఆపై నితీశ్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజకీయంగా బిహార్‌లో తన పప్పులు ఉడకవని గ్రహించిన పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఆ జోస్యాలన్నీ తప్పే.. అటు బిహార్‌లో రాజకీయంగా చెల్లక.. ఇటు ఇం‘ధనం’ లేక కొట్టుమిట్టాడిన పీకే తనకు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే ఢంకా భజాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు సేవలో ‘పీకే’ ఏపీ రాజకీయాల్లో తలమునకలు బెంగాల్ సీఎం మమత వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు. ఐప్యాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్, ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ, బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మమతా ఈ విషయాలను వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం, ప్రమేయం పెద్దగా లేదన్నారు. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement