mamata banerjee
-
బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ‘ఖేలా హోబే’ మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్‌పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.మన లక్ష్యం 215 ప్లస్ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు. ‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు. -
హైప్ అవసరం లేదు.. ఏది అవసరమో అది చేయండి చాలు: మమతా బెనర్జీ
కోల్ కతా: మహా కుంభ మేళాను ‘మృత్య్ కుంభ్’గా ఆరోపించారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు రావడంతో దానిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే యత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ ఆమె స్పష్టం చేశారు. తాను ప్రతీ మతాన్ని గౌరవిస్తానని, కానీ తాను చేసిన వ్యాఖ్యలు ఒకటైతే దాన్ని వేరే రకంగా చిత్రీకరించే యత్నం జరిగిందన్నారు మమతా. ప్రధానంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అసెంబ్లీ వేదికగా .. మమతా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు మమతా.‘యోగి నాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలతో నాకు బొప్పి ఏమీ కట్టదు. ఒక సీఎంగా యోగికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. నేను ఆరోజు చెప్పింది ఒక్కటే. మహా కుంభమేళా ఏర్పాట్లు సరిగా చేయని కారణంగా కొన్ని కుటుంబాల మీద ప్రభావం పడింది. మీరు వారికి డెత్ సర్టిఫికేట్లు, పోస్ట్ మార్టమ్ సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా ఇక్కడకు వచ్చిన తర్వాత మేము వారికి పోస్ట్ మార్టమ్ నిర్వహించాం. మిగతా రాష్ట్రాల్లో ఏమి జరిగిందో నాకైతే తెలీదు. మీరు వారికి పరిహారం ప్రకటించి ఉంటే పరిహారం ఇవ్వండి’ అని మమతా ఘాటుగా స్పందించారు.ప్రజలు భారీ సంఖ్యలో హాజరైటప్పుడు వారికి తగిన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అసలు ఎంతమంది వస్తున్నారు.. ఏర్పాట్లు ఎలా ఉండాలి అనేది ముందుకు పర్యవేక్షించుకోవాలి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తోంది అనే హైప్ ఇక్కడ అవసరం లేదు. కుంభమేళా అనేది 2014లో కూడా వచ్చింది. ఏది అవసరమో అది చేయాలి కానీ అవసరం లేనిది అక్కర్లేదు’ అంటూ మమతా చురకలంటించారు. తమ రాష్ట్రంలో కూడా దుర్గా పూజ ఘనంగా నిర్వహిస్తామని, ఆ సమయంలో ప్రతి నిమిషం దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. -
మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం
లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారాంటూ బుధవారం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారాయన.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మహా కుంభమేళాను మృత్యు కుంభమేళాగా అభివర్ణించిన విషయం తెలిసిందే. కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వం(UP Government) ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలే గుప్పించారామె. అయితే ఆమె వ్యాఖ్యలపై అసెంబ్లీలోసీఎం యోగి ఇవాళ స్పందించారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 56 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిరాధారమైన ఆరోపణలతో ఆమె వాళ్లందరి విశ్వాసాలతో ఆటాడుకున్నారు అని సీఎం యోగి మండిపడ్డారు. జనవరి చివర్లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఘాట్ల వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు, వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చి మృత్యువాత చెందిన వాళ్లకు అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించారాయన. ఈ క్రమంలో.. దీదీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.#WATCH | Lucknow: In the UP assembly, CM Yogi Adityanath says, "While we are participating in the discussion here, at that time more than 56.25 crore devotees have already taken their holy dip in Prayagraj... When we make any baseless allegations or snow fake videos against… pic.twitter.com/VYNnzPn4w1— ANI (@ANI) February 19, 2025కుంభమేళా మృతులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. కానీ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి?. ఈ కుంభమేళాలో దేశం.. ప్రపంచమే పాల్గొంటోంది. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవాల్సిన పనేముంది? అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. యోగి మాత్రమే కాదు పలువురు బీజేపీ నేతలు కూడా మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ మాట్లాడుతూ.. మత విశ్వాసాలు లేనివాళ్లే అలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తారంటూ మండిపడ్డారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా దీదీపై విరుచుకుపడుతున్నాయి. దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ..మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. దీదీ వ్యాఖ్యలకు ఓ అనూహ్య మద్దతు లభించింది. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ 46వ శంకారాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి(సద్గురు) మమత వ్యాఖ్యలతో ఏకీభవించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది నిర్వహణ లోపం కాకుంటే మరేమిటి?. మహా కుంభమేళా రాబోతోందని మీకు తెలియదా?. అలాంటప్పుడు మీరు చేసే ఏర్పాట్లు ఇవేనా? అంటూ యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన.#WATCH | Bemetara, Chhattisgarh: On West Bengal CM Mamata Banerjee's 'Mrityu Kumbh' remark, Jagadguru Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, "... There was a traffic jam of 300 kilometres, if this is not mismanagement then what is it? People had to walk… pic.twitter.com/pxDXWI5og7— ANI (@ANI) February 19, 2025 -
అలా మాట్లాడటం కంటే చావడం మేలు: సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే చొరబాటుదార్లను ఆమె ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పొరుగుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం తీరుతో రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారనున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన మహా కుంభ్‌ను ఆమె మృత్యు కుంభ్ అంటూ వర్ణించడం ద్వారా కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సువేందు.. ‘అక్రమ చొరబాటుదార్లను అస్సాం ఎస్టీఎఫ్ పట్టుకుంటే మీరు నిద్రపోతున్నారు. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లా ఉన్నాయని స్వయంగా మీరే అన్నారు. ఒక మతం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారితే మీకు సంతోషమా? మీరు అలా చేయడాన్ని మేం ఒప్పుకోం’ అని హెచ్చరించారు.రుజువు చేస్తే రాజీనామా చేస్తా: మమత బంగ్లాదేశ్‌లోని అతివాదులు, ఉగ్రవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించడంపై సీఎం మమత మండిపడ్డారు. చేతనైతే రుజువు చేయాలని వారికి సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కంటే చావడం మేలని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరాధార ఆరోపణల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు. బంగ్లా సరిహద్దులోని చచార్లో రాత్రి కర్ఫ్యూసిల్చార్: తీవ్రవాద శక్తులు, స్మగ్లర్ల కదలికలను నివారించే లక్ష్యంతో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అస్సాం రాష్ట్రం చచార్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ చచార్ జిల్లా మేజిస్ట్రేట్ మృదుల్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రెండు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో భారత భూభాగంలోని సుర్మా నది ఒడ్డున ఎవరూ సంచరించరాదని, అనుమతులున్న స్థానిక మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలిచింది: మమతా బెనర్జీ
కోల్‌కతా:కాంగ్రెస్ పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఫెయిలవడం వల్లే 2024లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారం దక్కించుకోలేకపోయిందని విశ్లేషించారు.బంగ్లార్ నిర్బచోన్ ఒ ఆమమ్రా పేరుతో తాను రాసిన మూడు పుస్తకాలను మమతా బెనర్జీ బుధవారం(జనవరి29) విడుదల చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నించింది. కూటమిలో పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం వల్లే బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ రాణించకపోవడం ఇండియా కూటమి ఓటమికి కారణం’అని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మమత తన పుస్తకాల్లో లోతుగా విశ్లేషిచారు. -
దోషి సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలంటూ దీదీ సర్కార్ పిటిషన్
-
చొరబాటుదార్లకు బీఎస్ఎఫ్ దన్ను
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడే వారిని వదిలేస్తూ తమ రాష్ట్రాన్ని అస్థిర పర్చేందుకు బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. సరిహద్దులు దాటి ఇక్కడి వచ్చే సంఘ వ్యతిరేక శక్తులు నేరాలకు పాల్పడి, మళ్లీ వెళ్లిపోతున్నారన్నారు. బీఎస్ఎఫ్ చర్యల వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తముందని తనకు అనుమానంగా ఉందని చెప్పారు. సరిహద్దు జిల్లాల్లోని కొందరు మేజిస్ట్రేట్లు, ఎస్పీలు సరిహద్దు బలగాల అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇస్లాంపూర్, సిటాయ్, చోప్రా వంటి సరిహద్దుల ప్రాంతాల ద్వారా ప్రవేశించే చొరబాటుదార్లకు బీఎస్ఎఫ్ సాయం చేస్తున్నట్లు మాకు సమాచారముంది. బీఎస్ఎఫ్ జవాన్లు మహిళలను చిత్ర హింసలకు గురిచేస్తూ, రాష్ట్రాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని సెక్రటేరియట్లో జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం మమత వ్యాఖ్యానించారు. ‘సరిహద్దుల రక్షణ బాధ్యత బీఎస్ఎఫ్దే, మాది కాదు. వీసాల జారీ కూడా కేంద్రమే చూసుకుంటుంది. విమానాల్లో ఇక్కడికి వచ్చే వారి సమాచారం మాకు అందజేస్తారు. ఇప్పుడు అది కూడా మేం తీసుకోవడం లేదు. దీంతో, రాష్ట్రానికి ఎవరు వస్తున్నారో మాకు తెలీదు. అయినప్పటికీ చొరబాట్ల వ్యవహారాన్ని కేంద్రం మాపై నెట్టేయాలని చూస్తోంది. రాష్ట్రాన్ని ఎవరైనా అస్థిరపరిచేందుకు చూస్తే టీఎంసీవైపే వేలెత్తి చూపుతోంది. అందుకే మేం చెప్పేది ఒక్కటే. చొరబాట్లకు బీఎస్ఎఫ్దే బాధ్యత. టీఎంసీది కాదు. కానీ, కొన్ని టీవీ చానెళ్లు టీఆర్పీ కోసం మాపై దుష్ప్రచారం చేస్తున్నాయి’ అని తెలిపారు. ఇలాంటి చర్యలకు ని రసనగా కేంద్రానికి లేఖ రాస్తానన్నా రు. సీఎం మమత వ్యాఖ్యలను బీఎస్ ఎఫ్ ఖండించింది. తమ జవాన్లు సరి హద్దుల రక్షణలో అత్యంత అప్రమ త్తత, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా మని తెలిపింది. బీఎస్ఎఫ్ పోస్టుల ఏర్పాటుకు స్థలం ఇచ్చేందుకు సైతం నిరాకరించిన మమత తన యంత్రాంగం చేతికానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీఎస్ఎఫ్పై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ విమర్శించారు. ఆమె భ్రమల్లో గడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
బీజేపీ వస్తే మమత జైలుకే: బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మమత అరెస్టు తప్పదన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలను టీఎంసీ నేతలు వేధించిన ఘటనలకు మమత బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘2026లో బెంగాల్లో బీజేపీ పవర్లోకి వస్తే సందేశ్‌ఖాలీ ఘటనలపై విచారణ కమిషన్ వేస్తాం. సీఎం మమత కూడా జైలుకు వెళ్లకతప్పదు. సందేశ్‌ఖాలీలో మన తల్లులు, అక్కచెల్లెలను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు’అని సువేందు అధికారి హెచ్చరించారు. మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించిన మరుసటి రోజే పోటీగా అక్కడ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సువేందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కాగా,గతేడాది ప్రారంభంలో తృణమూల్ నేత షాజహాన్‌షేక్ తమ భూములు కబ్జా చేయడమే కాకుండా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఉత్తరపరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం షేక్‌షాజహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వం రెండెకరాల భూమికి మాత్రమే యజమానిని అని చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఏకంగా వందల కోట్లకు అధిపతి అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ(ఏడీఆర్) కుండబద్ధలు కొట్టింది. భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఏడీఆర్ సంస్థ సోమవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలపాటు అధికారం చలాయించి, ప్రస్తుతం సైతం ఏపీ సీఎం కుర్చీపై కూర్చున్న చంద్రబాబు నాయుడు పేరిట ఏకంగా రూ.931 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్ర బాబేనని స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వార్షిక తలసరి ఆదాయం కేవలం రూ.1,85,854 కాగా సగటున ముఖ్యమంత్రి తలసరి ఆదాయం ఏకంగా రూ.13,64,310కు పెరిగింది. అంటే దేశంలో వార్షిక తలసరి సగటు కంటే సీఎం ఆదాయం ఏకంగా 7.3 రెట్లు అధికంగా ఉంది. దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. మోదీ సర్కార్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పేరిట కేవలం రూ.15 లక్షల ఆస్తులు ఉండటం విశేషం. చంద్రబాబు తర్వాత దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ నిలిచారు. ఆయన పేరిట రూ.332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.51.93 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. ఒక కోటి రూపాయల అప్పు ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట రూ.55 లక్షల ఆస్తులున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ పేరిట రూ.1.18 కోట్ల ఆస్తులున్నాయి. ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా రూ.52.59 కోట్లుకావడం గమనార్హం. 42 శాతం సీఎంలపై క్రిమినల్ కేసులు నివేదికల పేర్కొన్న ముఖ్యమంత్రుల్లో 42 శాతం మందిపై.. అంటే 13 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 32 శాతం మందిపై.. అంటే పది మందిపై హత్య, అపహరణ, ముడుపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిలిచారు. ఆయనపై ఏకంగా 89 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. రేవంత్‌రెడ్డి తర్వాత స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పులు ఉన్నాయి. సిద్ధరామయ్య రూ. 23 కోట్లు, చంద్రబాబు నాయుడుకు రూ.10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. 31 మంది సీఎంలలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా, ఇద్దరు డాక్టరేట్ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా, 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు్కలేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరే మహిళా సీఎంలు(మమతా బెనర్జీ, అతిశి మార్లేనా) ఉన్నట్టు తెలిపింది. -
సందేశ్‌ఖాలీలో నేడు మమతా బెనర్జీ పర్యటన
కోల్‌కతా:పశ్చిమబెంగాల్లో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్‌ఖాలీలో సీఎం మమతాబెనర్జీ సోమవారం(డిసెంబర్30) పర్యటించనున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల భూకబ్జాలు,లైంగిక వేధింపులపై ఈ ఏడాది ఆరంభంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనల తర్వాత ఈ ప్రాంతంలో సీఎం మమత పర్యటించడం ఇదే తొలిసారి. పౌరసరఫరాల శాఖ కార్యక్రమంలో మమత పాల్గొననున్నారు. మాజీ టీఎంసీ నేత షేక్‌షాజహాన్ తమ భూములు కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని సందేశ్‌ఖాలీలో మహిళలు ఉద్యమించారు.తర్వాత రేషన్ స్కామ్‌లో మనీ లాండరింగ్ ఆరోపణలపై షేక్‌షాజహాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షేక్ షాజహాన్‌ను అరెస్టు చేసింది. ఈ పరిణామాలతో అప్పట్లో అతడిని టీఎంసీ సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: బీహార్‌లో ఉద్రిక్తతలు..ప్రశాంత్‌కిశోర్‌పై కేసు -
మమతా బెనర్జీ (సీఎం) రాయని డైరీ
ప్రజాస్వామ్యం కొన్నిసార్లు నిరంకుశత్వంతో పోరాడవలసి వస్తుంది. అప్పుడేం చేయాలి? పోరాడాలి. పోరాడేందుకు ఒక్కరైనా ముందుకు రావాలి. ఆ ఒక్కరు ఎవరన్నది... నిర్ణయంతో తేలేది కాదు. నిశ్చయంతో జరిగేది. ‘‘నేనొస్తాను...’’ అన్నాను. ‘‘సీఎంగా ఉంటూనే, ‘ఇండియా’ కూటమినీ నడిపిస్తాను’’ అన్నాను.నేను ఆ మాట అన్నప్పుడు... ‘‘కూటమిని నడిపించటానికే కదా మల్లికార్జున్ ఖర్గే కూటమికి చైర్మన్‌గా ఉన్నారు, కూటమిని కవాతు చేయించటానికే కదా లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ఖర్గే కూటమి నాయకులుగా ఉన్నారు...’’ అని కూటమిలోని సభ్యులెవరూ అనలేదు! ‘‘ఎస్, మీరు రావాలి మమతాజీ...’’ అన్నారు శరద్ పవార్.‘‘మీరొస్తే 2025లో గెలుపు మనదే...’’ అన్నారు లాలూ ప్రసాద్.‘‘మీరు రావటమే మంచిది మేడమ్...’’ అని అఖిలేశ్ యాదవ్. వారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు కూడా! కూటమిలో మహామహులు ఉన్నారు. ప్రకాష్ కారత్, అరవింద్ కేజ్రీవాల్,ఎం.కె. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరేన్, ఫరూఖ్ అబ్దుల్లా, డి.రాజా, మెహబూబా ముఫ్తీ... వారిలో ఏ ఒక్కరూ... ‘‘కూటమికి నేను నాయకత్వం వహిస్తాను...’’ అని ముందుకు వచ్చినా నేను వారికి అడ్డుపడేది, వారితో నేను పోటీకి దిగేది ఏముంటుంది? అంతా ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమిగా ఏర్పడినవాళ్లం ఒకరిని ఒకరం ఎందుకు వెనక్కు లాగుతాం?!కానీ, రాహుల్ అలా అనుకున్నట్లు లేరు! ‘‘దిగువ స్థాయి లీడర్ల మాటల్ని పట్టించుకో కండి. కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’’ అంటున్నారు. నన్ను ‘దిగువ స్థాయి’ లీడర్ అన్నందుకు నాకేం పట్టింపు లేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి మాటల్ని ఎన్ని వినలేదు! ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన నేనేమీ ‘వెరీ ఇంపార్టెంట్ పర్సన్’ అయిపోను. నిజానికి, నేనొక ‘లెస్ ఇంపార్టెంట్ పర్సన్’ అని చెప్పుకోవటమే నాకు ఇష్టం. ‘కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’ అని రాహుల్ అనడంలో తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు పరిష్కరించవలసింది కూటమి లోపలి సమస్యలనా? లేక, కూటమి బయట ఉన్న సమస్యనా? బయటి సమస్య వల్లనే కదా, లోపలి సమస్యలు బయటికి వస్తున్నది! బీజేపీని ఓడించటానికి కూటమిగా ఒకటై పోరాడాక కూడా 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. 2024లో హరియాణా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రలలో విజయం సాధించలేకపోయింది. దీనిని కదా కాంగ్రెస్ పరిష్కరించవలసింది! నాయకుల్ని నాయకులు గౌరవించక పోయినా, పార్టీలను పార్టీలు గౌరవించాలి. రాహుల్ నన్ను దిగువ స్థాయి లీడర్ అని అనటం, తృణమూల్ కాంగ్రెస్‌ను దిగువస్థాయి పార్టీ అని అనటమే! తృణమూల్ కూడా ఒకప్పటి కాంగ్రెస్సే అనే సంగతి ఆయనకు గుర్తు లేకుండా ఉంటుందా?కూటమిని నేను నడిపిస్తాను అని నేను అంటున్నది... ఖర్గేజీ నడిపించలేక పోతున్నా రనో, రాహుల్ పరుగెత్తలేక పోతున్నారనో కాదు. కూటమి భాగస్వామిగా మోదీజీని దించే బాధ్యత నాకు మాత్రం లేదా... అని. ‘‘కూటమిని లీడ్ చేస్తాను’’ అని నేను అనగానే, అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాకు శ్రేయోభిలాషిగా మారిపోయారు! ‘‘మమతాజీ! చచ్చిపడి ఉన్న కూటమికి సారథ్యం వహించి, మీరు దానిని బతికించలేరు. 2026లో మీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి...’’ అని హితవు చెప్పారు. రాహుల్ అన్న మాట కంటే అదేమీ ఘాటైనది కాదు. -
చీలిక దిశగా ఇండియా కూటమి -మమతకు పెరుగుతున్న మద్ధతు
-
దీదీకి బాధ్యతలు అప్పగిస్తారా..?
-
ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సరైన నాయకురాలు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీయేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం(డిసెంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు అవసరమైన రాజకీయ, ఎన్నికల అనుభవం ‘దీదీ’కి కావల్సినంత ఉంది. 42 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమె నాయకత్వ పటిమ రుజువవుతూనే ఉంది’అని విజయసాయిరెడ్డి కొనియాడారు.Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఫలించేనా..? -
మీరు ఆక్రమిస్తుంటే... మేం లాలీపాప్ తింటామా?
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ను మరికొద్ది రోజుల్లోనే ఆక్రమించుకుంటామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు కొందరు చేస్తున్న అతి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు. అవన్నీ మతిలేని వ్యాఖ్యలంటూ ఆమె కొట్టిపారేశారు. ‘మీరొచ్చి బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్ తింటూ కూర్చుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. ‘మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి’అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ప్రేరేపించే దురుద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ ఫేక్ వీడియోలను ఇక్కడ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. భారత్‌లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతోపాటు బెంగాల్‌కు, ఇక్కడి ప్రజలకు కూడా క్షేమకరం కాదని మమత హెచ్చరించారు. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదముందని కూడా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
టార్గెట్ కాంగ్రెస్.. మమత రాజకీయం ఫలించేనా?
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, కూటమి నాయకత్వం మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంపీ సుప్రియా సూలే తాజాగా మాట్లాడుతూ.. ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీ తీసుకుంటే మంచిదే. మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పెద్ద పాత్ర ఉంది. అలాగే, బాధ్యత కూడా ఉంది. కాబట్టి మమత.. మరింత బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో బీజేపీకి అధికారం ఇవ్వకుండా మమతా బెనర్జీ పాలన కొనసాగిస్తున్నారు. మంచి సంక్షేమ పథకాలను అమలు చేసిన విజయవంతమైన మోడల్‌ను చూపించారు. ఆమె ఎన్నికల అనుభవం, పోరాట పటిమతో మోదీ సైతం తేలిపోయారు. ఇండియా కూటమి బాధ్యతలు ఆమె తీసుకోవడం మంచి పరిణామమే అవుతుంది. మా సీనియర్ నాయకులు కలిసి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ వరుస పరాజయాలను చవిచూడటం, ఒంటరిగా పోటీ చేయడంపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమత మాట్లాడుతూ..‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన అని చెప్పారు. అయితే, ఇండియా కూటమిలో మమతా బెనర్జీకి ఇప్పటికే పలు పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో, మమతకే బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు నిలిచి మమత విజయాలు సాధించడం కూడా ఆమె నాయకత్వానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి.. ఇండియా కూటమిలో మమత రాజకీయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మెజార్టీ నేతలు ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనే చర్చ నడుస్తోంది. -
ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ..?
జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బెంగాలీ న్యూస్ ఛానల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే తాను ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం పదవిని మాత్రం వదులుకోనని ఆమె స్పష్టం చేశారు.రెండు పాత్రలకు న్యాయం చేస్తాబెంగాల్ సీఎంగా, విపక్ష కూటమి నాయకురాలిగా రెండు పాత్రలకు న్యాయం చేయగలనని మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమిని నేనే స్థాపించా. దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. వారలా చేయలేకపోతే నేనేం చేయగలను? ప్రతీ ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని మమత అన్నారు. ‘దీదీ’ ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అందుకే కూటమికి దూరమయ్యారా?ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు. మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించిన ఆమె చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడంపై అప్పట్లో హాట్‌టాపిక్ అయింది. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో తేడాలు రావడం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ తాను అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే సాకుతో మమత సింగిల్‌గానే పోటీ చేశారు. ఇండియా కూటమి గెలిస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని ప్రకటించి తనదారి తాను చూసుకున్నారు. కాగా, బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.మమతకు పగ్గాలు అప్పగిస్తారా?ఇండియా కూటమి నడిపించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ తాజాగా తనకు తానుగా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. 37 ఎంపీలను కలిగిన సమాజ్‌వాదీ పార్టీ రెండో పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (యూబీటీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది.చదవండి: మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయంమమతకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ‘ఇండియా కూటమి నాయకురాలిగా మమతా బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెకు మద్దతు ఇవ్వాలి. కూటమి బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. బెంగాల్లో బీజేపీని నిలువరించడంలో మమత కీలకపాత్ర పోషించారు. ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది. చాలా కాలం నుంచి ఆమెతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయ’ని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉదయ్ వీర్ సింగ్ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మమత వారసుడు అతడేనా?ఇదిలావుంటే తన రాజకీయ వారసుడి ఎంపికపై మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా కలిసి తన రాజకీయ వారసుడిని ఎంపిక చేస్తుందని ఆమె చెప్పారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మమత తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయననే ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టయింది. -
రాజకీయ వారసులపై మమత ఆసక్తికర కామెంట్స్
కోల్‌కతా:తన రాజకీయ వారసులెవరన్న దానిపై పశ్చిమబెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు. ‘నా రాజకీయ వారసులెవరన్నదానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అంటే నేనొక్కదాన్నే కాదు.మా పార్టీ నేతలు, కార్యకర్తలంతా క్రమశిక్షణ కలిగిన సైనికులు. మాకు ఎమ్మెల్యులు,ఎంపీలు,బూత్ వర్కర్లున్నారు. ఇంతమంది కలిస్తేనే పార్టీ అవుతుంది. నా రాజకీయ వారసులపై పార్టీలో ఉన్నవారంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. పార్టీలోకి ఈరోజు కొత్తగా వచ్చినవారు రేపు సీనియర్లవుతారు’అని మమత వ్యాఖ్యానించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లు,జూనియర్ల మధ్య గ్రూపు తగాదాలు జరుగుతున్న వేళ మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్‌లో మమత తర్వాత ఆమె మేనల్లుడు అభిషేక్‌బెనర్జీ పార్టీ పగ్గాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ -
బంగ్లాదేశ్‌కు ఐరాస దళాలు పంపాలి: మమతా డిమాండ్
కోల్‌కతా : పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో తాత్కాలిక ప్రభుత్వంతో సహకరించేందుకు ఐరాస శాంతి పరిరక్షక దళాలను మోహరించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఐరా సలో ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విదేశీ గడ్డపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీ యులను స్వదేశానికి తీసుకు రావాలన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై మన వైఖరిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ వివరించాలని, లేకుంటే విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేయాలని కోరారు. మమతా బెనర్జీ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ... ద్వైపాక్షిక అంశాలపై తాను మాట్లాడలేనని చెప్పారు. అయితే, అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్కడి నుంచి వచ్చిన బాధితులు, ఇస్కాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు అసెంబ్లీలో స్పందించాల్సి చచ్చిందన్నారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురైన భారతీయులకు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆహార పదార్ధాలకు ఎటువంటి కొరత లేదన్నారు.వక్ఫ్ పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందిబీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు పేరుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ముస్లింలను విభజించి ఏకాకులుగా మార్చేం దుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదన్నారు. హిందూ ఆలయ ట్రస్టులు, చర్చిల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే జోక్యం చేసుకోగలడా అని ఆమె ప్రశ్నించారు. మూడింట రెండొంతుల మెజారిటీ లేని బీజేపీ పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలదా అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బిల్లుపై జేపీసీలో జరిగే చర్చల్లో ప్రతిపక్ష సభ్యులను బీజేపీ మాట్లాడనివ్వడం లేదని అందుకే టీఎంసీ ఆ కమిటీ నుంచి వైదొలగిందని వివరించారు. -
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన షేక్ హసీనా, మమతా బెనర్జీ
-
చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా
కోల్‌కతా: బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న పెద్ద టార్గెట్ అన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) కోల్‌కతాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.బెంగాల్లో చొరబాట్లను తక్షణమే ఆపాలన్నారు. బెంగాల్లో చొరబాట్లు,అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే సాధ్యమన్నారు.బెంగాల్లో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస,ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలే నిదర్శనమన్నారు.అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాట్లను ఆపినప్పుడే బెంగాల్లో శాంతి నెలకొంటుందన్నారు.కాగా, పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్లతో నిర్మించిన ల్యాండ్‌పోర్ట్‌ను అమిత్‌షా ప్రారంభించారు. ఇదీ చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం -
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ప్రధానికి మమత మరో లేఖ.. కేంద్రంపై ఆరోపణలు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ వరదలపై సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. వరదల కారణంగా రాష్ర్టంలో 50లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో తెలిపారు.వారిని ఆదుకునేందుకుగాను కేంద్రం వెంటనే నిధులివ్వాలని లేఖలో కోరారు.తమ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. ఈ విషయమై ప్రధానికి మమత రాసిన తొలి లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ స్పందించారు. డీవీసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశలోనూ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.దీనిపై బెనర్జీ స్పందిస్తూ డ్యామ్‌ల నుంచి నీటి విడుదల దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. నీటి విడుదలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాలి కానీ వారు అలా చేయలేదు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ఆధ్వర్యంలోని శాఖలు ఏకపక్షంగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీరు విడుదల చేశారని తప్పుపట్టారు.నీటి విడుదలకు కొద్ది గంటల ముందు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు చేపట్టడం కుదరలేదని విమర్శించారు. -
డీవీసీతో సంబంధం తెంచేసుకుంటాం
కోల్‌కతా: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ)తో తమ రాష్ట్రం అన్ని సంబంధాలను తెంచేసుకుంటుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు డీవీసీ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడమే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం మమత శుక్రవారం ఈ మేరకు ప్రధానికి నాలుగు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న నదులు ప్రమాదకర స్థాయి, అంతకు మించి ప్రవహిస్తున్న విషయం తెలుపుతూ తమ అధికారులు, నీటి విడుదలను వాయిదా వేయాలంటూ లేఖ రాసినా డీవీసీ పట్టించుకోలేదని మమత ఆరోపించారు. డీవీసీ నియంత్రణలో ఉన్న మైథోన్, పంచెట్ జలాశయాల నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా విడుదల చేశారన్నారు. ఒక్కసారిగా భారీగా వరదలు చుట్టుముట్టడంతో పూర్బ వర్ధమాన్, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, బంకురా, హౌరా, హుగ్లీ, పూర్బ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలకు చెందిన 50 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్‌కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
ఇదే చివరిసారి.. వైద్యులను చర్చలకు ఆహ్వానించిన సీఎం మమత
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం, వైద్యలు మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నిరసన చేస్తున్న వైద్యులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించించారు. కోల్‌కతాలోని సీఎం నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు అయిదోసారి/చివరి అవకాశంగా ఆందోళన చేస్తున్న వైద్యులను చర్చలకు పిలుస్తున్నట్లు బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.‘పశ్చిమ బెంగాల్ ఎం మమతా బెనర్జీతో, వైద్య ప్రతినిధుల సమావేశం కోసం అయిదోసారి. అలాగే చివరిసారి సంప్రదిస్తున్నాం. ముందు రోజు చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపడానికి మిమ్మల్ని(నిరసనకారులను) మరోసారి ఆహ్వానిస్తున్నాము. చివరిసారి చర్చలకు వచ్చిన వైద్యుల బృందమే నేడు సాయంత్రం 4.45 నిమిషాలకు వేదిక వద్దకు రావాలని అభ్యర్థిస్తున్నాం.ఈ కేసు సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నందును.. మీరు డిమాండ్ చేస్తున్నట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం కానీ వీడియో గ్రఫీ కానీ ఉండదు. దానికి బదులు సమావేశాన్ని రెండు వర్గాలు రికార్డ్ చేసి సంతకాలు చేస్తాయి’ అంటూ మనోజ్ పంత్ పేరిట లేఖలో తెలిపారు.అదే విధంగా సుప్రీకోర్టు ఆదేశాలను వైద్యులు పాటించాలని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరులగా, కోర్టు ఆదేశాలకు కట్టుబడి వైద్యలు విధుల్లోచేరాలని కోరుతున్నట్లు తెలిపారు. వైద్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైద్యులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు నాలుగు సార్లు వైద్యులను చర్చించేందుకు ఆహ్వానించగా.. లైవ్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు చర్చలను తిరస్కరించారు. ఇక శనివారం ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్ భవన్’ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులనిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు. -
తాగకపోతే వదిలేట్లు లేరు! తాగి వద్దామా!
-
మమతా బెనర్జీ చివరి ప్రయత్నం
-
RG Kar Incident: వైద్యులకు మమతా బెనర్జీ బుజ్జగింపులు
కోల్‌కతా: ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై జూనియర్ వైద్యుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగకపోవడంతో వైద్యులు ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ కోల్‌కతాలో వైద్యులు నిరసనలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వైద్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముందు తను మాటను వినాలని, ఆ తర్వాత నినాదాలు చేయాలంటూ వైద్యులకు సూచించారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee reaches Swasthya Bhawan in Kolkata to meet the protesting doctors. pic.twitter.com/AbtdOAisKh— ANI (@ANI) September 14, 2024‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆ తర్వాత నినాదాలు చేయండి. ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్యంలో మీ హక్కు. నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నా భద్రతా అధికారులు వద్దని వారించినా.. నేను ఇక్కడకు వచ్చాను. మీ నిరసనలకు నా సెల్యూట్. నేను కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నదాన్నే. ఇంత కంటే నా పదవి పెద్ద విషయం కాదని నాకూ తెలుసు. రాత్రంతా వర్షంలోనూ మీరు నిరసనలు చేశారు. ఎంతో బాధపడి ఉంటారు. నాకు కూడా బాదేసింది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయాను.ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం. ఇక్కడికి నేను ముఖ్యమంత్రిగా రాలేదు. మీ దీదీ (సోదరి)గా వచ్చా. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. నేను డిమాండ్లను అధ్యయనం చేస్తాను, నేనేం ఒంటరిగా ప్రభుత్వాన్ని నడపడం లేదు కదా. ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో చర్చించాలి. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను. నేను తిలోత్తమ (హత్యాచారానికి గురైన బాధితురాలికి పెట్టిన పేరు). మీ డిమాండ్లను పరిశీలిస్తాను’’ అని ఆమె వైద్యులకు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుండి వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్త్య భవన్ వెలుపల ఆందోళన చేపట్టిన అనతరం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిరసనకారుల డిమాండ్‌పై అవి నిలిచిపోయాయి.మరోవైపు జూనియర్ వైద్యులు- రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని జూనియర్ వైద్యులు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు సైతం పంపారు. -
ఇలా చేయటం సబబేనా!
లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది. కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది. అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు. జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు. కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి. -
Kolkata: ప్రధాని మోదీ, రాష్ట్రపతికి వైద్యుల లేఖ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వెంటనే విధుల్లో చేరాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించినా, ఇటు చర్యలకు బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించినా.. వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకొని ప్రతిష్టంభను ముగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్, వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన నాలుగు పేజీల లేఖలో.. ‘‘కామాంధుడి చేతిలో బలైన మా సహోద్యోగికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము(వైద్యులు), ఆరోగ్య కార్యకర్తలు బెంగాల్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి భయం లేకుండా మా విధులు నిర్వర్తించగలం. మేము నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి మాపై బెదిరింపులు, హింసలు, ఆసుపత్రులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జోక్యం మా అందరికీ వెలుగుగా పనిచేస్తుంది. మేము ధైర్యంగా ముందుకు నడిచే మార్గాన్ని చూపుతుంది. మా చుట్టూ అలుముకున్న చీకటి నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.’ అని పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా అభయ కేసులో కీలక మలుపు.. సీబీఐ సంచలన నిర్ణయం!కాగా ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినప్పటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల తాజాగా వైద్యులు మంగళశారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనలు ఆపని వైద్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు బెంగాల్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తోపాటు.. వైద్యశాఖలో పలువురి ఉన్నతాధికారుల రాజీనామా కోరుతూ వైద్యులు అయిదు డిమాండ్లను దీదీ సర్కార్ ముందు ఉంచారు.ఈ విషయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మూడుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. కానీ చర్చల భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తేనే తాము వస్తామని నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేసిన దీదీ.. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. -
నేను రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంతో చర్చకు జూనియర్ డాక్టర్ల మరోసారి నిరాకరించారు. ఈ క్రమంలో సీఎం మమత సంచలన కామెంట్స్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నట్టు మమత చెప్పుకొచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అభయ ఘటనపై ఆందోళనల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో మరోసారి చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. అయితే, వైద్యులు చెబుతున్నట్లుగా 30మంది కాకుండా.. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. దీంతో డాక్టర్లు ఎవరూ చర్చలకు రాలేదు. ఈ సందర్భంగా డాక్టర్ల కోసం సీఎం దీదీ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశారు. అనంతరం, సీఎం మమత మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. ఇప్పుడు కూడా వారితో చర్చించేందుకే ముందుకు వచ్చాం. అభయ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కారణంగా చేతనే జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నట్టు వారితో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కాగా.. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. చివరగా.. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. డాక్టర్లతో చర్చించేందుకు దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశాను. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదు. అయితే, వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. వైద్యులకు దేశ ప్రజలు అండగా నిలవండి. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైద్యులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రయోజనం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee says "I tried my best to sit with the junior doctors. I waited 3 days for them that they should have come and settle their problem. Even when they didn't accept the verdict of the… pic.twitter.com/qLD207vSd6— ANI (@ANI) September 12, 2024కాగా, బెంగాల్లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూడాల ఆందోళనలు చేపట్టారు. దీంతో బెంగాల్లో వైద్యసేవలు చాలా వరకు స్తంభించాయి. ఈనేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపించేందకు మమతా సర్కార్ ముందుకు వచ్చింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి తాజాగా గురువారం లేఖను పంపారు. ఈరోజు ఐదు గంటలకు చర్చలకు రావాలని లేఖలో పేర్కొన్నారు. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. అదే విధంగా ఈ ప్రతిపాదిత చర్చలు సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చివరగా ట్విస్ట్ ఇస్తూ.. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. అయితే, ప్రత్యక్ష ప్రసారం ఉండకపోవడంతో ముఖ్యమంత్రి మమతతో చర్చించేందుకు జూనియర్ డాక్టర్లు ఎవరూ సీఎం ఆఫీసుకు వెళ్లలేదు. West Bengal CM Mamata Banerjee says "I am ready to resign from the Chief Minister of West Bengal. I am not concerned about the post. I want justice, I am only concerned about justice getting served"#MamtaBanerjee #Westbangal #RGKarDoctor #RGKarProtestpic.twitter.com/KjaJzWcGXC— Vijay Singh (@VijaySikriwal) September 12, 2024 -
RG Kar Case: చర్చలపై సందిగ్ధం
కోల్‌కతా: ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 33 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం సచివాలయం(నబన్న)లో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో(5.23ని. టైంలో) ఆ భేటీని లైవ్ టెలికాస్ట్ చేయించాలని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రతినిధులు హాజరుకావాలని నిరసన చేపట్టిన వైద్యులు ప్రధాన షరతుగా పెట్టారు. ఈ చర్చలను బహిరంగ వేదికగా జరపాలని మరో కండీషన్‌గా పెట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ చర్చలకు హాజరుకావాలని.. వీటిని లైవ్‌లో ప్రసారం చేయాలని కోరారు. చర్చల్లో పారదర్శకత కోసమే తాము ఇలా కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వైద్యులలో 12 నుంచి 15 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి రావాలంటూ సీఎస్ మనోజ్ పంత్ పేరిట ఆహ్వానం వెళ్లింది. అయితే 30 మంది బృందం చర్చలకు వెళ్తామని వైద్యులు అంటున్నారు. ఈ డిమాండ్లతో సాయంత్రం 6గం. లకేప్రారంభం కావాల్సిన చర్చలపై సందిగ్ధం నెలకొంది. అంతకంటే ముందే.. సీఎం మమతా బెనర్జీతో చర్చలకు తామూ సిద్ధమంటూ వైద్యులు ప్రకటన చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న అభయ ఘటన ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు ఉండాలని, అందుకోసం అపాయింట్మెంట్ కోరుతూ సీఎంవోకు మెయిల్ పంపారు. దీంతో.. వెంటనే ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయానికి రావాల్సిందిగా ప్రభుత్వం బదులిచ్చింది. ఇదీ చదవండి: అభయ ఘటన. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు -
సీఎం మమతా అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి
కోల్‌కతా: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బాధితురాలి తల్లిదండ్రుల వ్యాఖ్యలను దీ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నమంటూ మండిపడ్డారు.‘బాధితురాలి తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదు. కానీ, వారి కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా మంచి పని చేయాలని భావిస్తే.. వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా. ఆ విషయంలో వారు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా సీఎం దీదీ వ్యాఖ్యలను హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లి ఖండించారు. మమతా బెనర్జీ అబద్దం చెబుతున్నారని ఆరోపించారు. వారికి డబ్బులు ఇవ్వాలని చూశారని మరోసారి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం మమతా అబద్ధాలు చెబుతున్నారు. నష్టపరిహారం ఇప్పిస్తానని, మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని మాతో చెప్పారు. నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేను మీ ఆఫీసుకు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’ అని తెలిపారు.అదే విధంగా హత్యాచారం అనంతరం చేపట్టిన నిరసనలను అణచివేసేందుకు సీఎం మమతా ప్రయత్రించారని ఆమె ఆరోపించారు. తమ నిరసనలు ఆపాలని, రాబోయే దుర్గా పూజ ఉత్సవాలకు సిద్దం కావాలని సూచించారని పేర్కొన్నారు. అయితే దీదీ అలా మాట్లాడటం అమానవీయమని అన్నారు. తాను ఒక ఆడపిల్లకు తల్లినైనందున ఇది అమానుషంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
మహిళలపై నేరాలకు మరణ శిక్షే
కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.ఏమిటీ అపరాజిత బిల్లు?భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. -
బెంగాల్ అసెంబ్లీ ముందుకు అత్యాచార నిరోధక బిల్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, విద్యార్ధి సంఘాలు, వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు 2024'గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది.ఈ బిల్లులో ఏమి ఉంటుంది అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధన.ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది.అత్యాచారం మాత్రమే కాదు యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరం, దీనికి జీవిత ఖైదు విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్-అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది.ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.కాగా ఈ బిల్లు గురించి గతంలో మమతా బెనర్జీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్‌భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2— ANI (@ANI) September 3, 2024 కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.మరోవైపు కోల్‌కతాలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ వైద్యులు మంగళవారం ఉదయం బిబి గంగూలీ వీధిలో తమ నిరసనను కొనసాగించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీబీ గంగూలీ స్ట్రీట్‌లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. -
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్షే
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు. అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు. గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు. మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు? ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా. అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు. -
రాళ్ల దాడులు, లాఠీచార్జి... ర్యాలీ హింసాత్మకం
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. ఇటు ఇసుక వేస్తే రాలనంత మంది విద్యార్థి నిరసనకారులు, అటు వారిని అడ్డుకునేందుకు వేలాదిగా మోహరించిన పోలీసులతో పరిస్థితి యుద్ధరంగాన్ని తలపించింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా వారికి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సచివాలయానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. వాటిని బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళలపై అకృత్యాలను అడ్డుకోవడం చేతగాని మమతా సర్కారు విద్యార్థులపై మాత్రం ప్రతాపం చూపుతోందంటూ దుయ్యబట్టింది.‘‘పోలీసు హింసాకాండకు బాధ్యత వహి స్తూ మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలి. వైద్యురాలి హత్యలో నిజాలు వెలు గు చూసేందుకు వీలుగా పాలీ టెస్టులకు సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే రా ష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించింది. బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ర్యాలీ బీజేపీ గేమ్ప్లానేనని చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను దిగజార్చేందుకే ఆ పార్టీ కంకణం కట్టుకుంది’’ అంటూ మండిపడింది. బంద్ జ రగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ కుండబద్దలు కొట్టారు! ఉదయం నుంచే... విద్యార్థి సంఘమైన పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ర్యాలీ తలపెట్టారు. మరోవైపు డీఏ తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల అసమ్మతి వేదిక ‘సంగ్రామీ జౌతా మంచా’ కూడా మంగళవారమే చలో సచివాలయానికి పిలుపునిచ్చింది. నిరసనకారులంతా కోల్‌కతాలో పలు ప్రాంతాల నుంచి ఒక్క ఉదుటున సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటిని భగ్నం చేసేందుకు ఏకంగా 6,000 మందికి పై చిలుకు బలగాలు రంగంలోకి దిగాయి. హౌరా బ్రిడ్జి, సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌తో పాటు నగరంలో పలుచోట్ల బారికేడ్లతో పోలీసులు ముందుగానే రోడ్లను దిగ్బంధించారు. బారికేడ్లపైకెక్కి దూకేందుకు ప్రయత్నించిన నిరసనకారులను నిలువరించేందుకు లాఠీచార్జీ చేయ డంతో చాలామంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు రాళ్లతో పాటు ఇటు కలు కూడా విసరడంతో 30 మంది దాకా పోలీసులు గాయపడ్డారు. ఎంజీ రోడ్, హేస్టి ంగ్స్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ తదితర ప్రాంతాలన్నీ ఘర్షణలకు వేదికగా మారాయి. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ‘‘మేమేమీ చట్టాలను అత్రికమించలేదు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే విచక్షణారహితంగా కొట్టారు’’ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. 33 మంది మహిళలతో పాటు మొత్తం 126 మంది ఛాత్ర సమాజ్ సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి 200 పైచిలుకు మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రేపిస్టులకు మమత అండ: నడ్డా విద్యార్థుల శాంతియుత ర్యాలీపై పోలీసులు జులుం ప్రదర్శించారని బీజేపీ అధ్యక్షుడు జే పీ నడ్డా ఆరోపించారు. ‘‘మమత పాలనలో రేపిస్టులు, క్రిమినల్స్‌కు వ్యవస్థే అన్నివిధాలా అండగా నిలుస్తోంది. మహిళల భద్రత కో సం గళమెత్తడం బెంగాల్లో క్షమించరాని నేరంగా మారింది’’ అంటూ ఎక్స్ పోస్టులో ఎద్దేవా చేశారు. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్ప డ్డ వారిని మమత సర్కా రే కాపాడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. చెవిటి సర్కారు: బీజేపీ మమతను కరడుగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అభివర్ణించారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు విన్పించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచి్చనట్టు తెలిపారు. విద్యార్థుల ర్యాలీపై పోలీసుల అణచివేతకు నిరసనగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాల్ బజార్ ప్రాంతంలో బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆయన విఫలయత్నం చేశారు. టియర్ గ్యాస్ ధాటికి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలంటూ సాయంత్రం దాకా అక్కడే బైఠాయించారు. మరోవైపు బుధవారం రాష్ట్రమంతటినీ స్తంభింపజేయడంతో పాటు సెపె్టంబర్ 6 దాకా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన నలుగురు విద్యార్థి నేతలను మంగళవారం రాత్రే పోలీసులు మాయం చేశారని ఆయన ఆరోపించారు. వాటిని పోలీసులు ఖండించారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై...ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయం వైద్యురాలి కేసులో సీబీఐ నిర్ణయం కోల్‌కతా: కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించిన డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ప్రధాన నిందితు డు సంజయ్ రాయ్ తనంత తానుగా నే ఘోరానికి పాల్పడ్డాడా, అతని వెనక ఎవరన్నా ఉన్నారా అన్నదానిపై పక్కాగా నిర్ధారణకు వచ్చేందుకు వారిచ్చే నివేదిక ఉపయోగపడొచ్చని భావిస్తోంది. సంజయ్‌కి సన్నిహితుడైన ఏఎస్సై అనూప్ దత్తా కూడా ఈ ఘోరంలో అతనికి సా యపడ్డట్టు సీబీఐ అనుమానిస్తోంది. దత్తాకు పాలి టెస్టులు చేసేందుకు కోర్టు ను ఇప్పటికే అనుమతి కోరింది. మరో వైపు ఘోష్ హయాంలో ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై తాజాగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ‘కమిషనర్’ బైక్‌పై నిందితుడు! కోల్‌కతా: అత్యాచారం, హత్య జరిగిన రాత్రి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోల్‌కతా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టరైన బైక్‌ను వాడినట్టు తేలడం ఆందోళనకరమని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. వైద్యుల భద్రతపై టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం భాగస్వామ్యపక్షాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయం న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం మంగళవారం జరిగింది. భద్రతపై ప్రొటోకాల్ రూపొందించడానికి భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 10 మంది సభ్యులతో ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో జరిగిన తొలి సమావేశానికి సభ్యులందరితోపాటు కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు సైతం హాజరయ్యారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతపై చర్చించారు. తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇప్పటికే వివిధ భాగస్వామ్యపక్షాలతో మాట్లాడామని, తమకు దాదాపు 400 సలహాలు సూచనలు అందాయని టాస్‌్కఫోర్స్ సభ్యులు ఈ సందర్భంగా చెప్పారు. -
మమత బెనర్జీ నివాసం ముట్టడి
-
కోల్‌కతా ఘటనపై ప్రధానికి మమతా లేఖ.. కేంద్రం ఘాటు రిప్లై
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి సీఎం మమతా బెనర్జీకి సోమవారం లేఖ రాశారు.మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను కేటాయించినప్పటికీ.. వీటిలో ఇప్పటికీ చాలా వరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. మమత సర్కార్ మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని,మహిళలు, చిన్నారులపై వివక్ష, హింసను నియంత్రించేందుకు తక్షణమే సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని విమర్శలు గుప్పించారు. ‘కోల్‌కతాలో హత్యాచారానికి గురైన డాక్టర్ తల్లిదండ్రులకు నా సంతాపం. గత నెలలో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నాం. దీని ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అడ్డుకుంటున్నాం. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయానికొస్తే.. ఈ కోర్టులను ఏర్పాటు చేసేందుకు 2019లో కేంద్రం పథకం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 30 జూన్ 2024 నాటికి, 409 ప్రత్యేకమైన పోక్సో కోర్టులతో సహా 752 ఎఫ్టీఎస్సీలు పని చేస్తున్నాయి. వీటి కింద 2,53,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కరం పపొందాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తం 123 ఎఫ్టీఎస్సీల కేటాయింపు జరిగింది. ఇందులో 20 ప్రత్యేక పోక్సో కోర్టులు 103 ఎఫ్టీఎస్సీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి కూడా 2023 జూన్ వరకు పనియలేదు. రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఇంకా 11 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారు’ అని మండిపడ్డారుకాగా దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపిస్తూ గతవారం మమతా బెనర్జీ ప్రధానినరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో రోజుకు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇది సమాజం విశ్వాసాన్ని, మనస్సాక్షిని కదిలిస్తుందని అన్నారు.మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించడం మన కర్తవ్యం. ఇటువంటి తీవ్రమైన, సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా కేంద్రంచ ట్టం తీసుకుకురావాలి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. -
ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన ఎంపీ అభిషేక్ బెనర్జీ 11ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తామని పలువురు బెదిరించిన వీడియోలు పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల సంఘం దృష్టికి వచ్చాయి. ఆర్జీకార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసనర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి అభిషేక్ బెనర్జీ కుమార్తెపై దారుణానికి ఒడిగడతామని బెదిరించగా.. మరో వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన వారికి రూ.10కోట్లు బహుమతి ఇస్తామని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై పిల్లల హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పిల్లల భద్రతకు హాని కలిగించేలా ఉంది’అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాదు ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన నిందితులపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్, బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.ఈ ఘటనపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల సంఘం పోలీసులను కోరింది.జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీదీ రాజీనామా చేయాలని రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ.. ఇంతటి క్లిష్ట సమయంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రం చురుగ్గా కనిపించడం లేదు. దాంతో పార్టీలో అంతర్గతంగా లుకలుకలున్నాయని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ ఎక్కడ..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
కోల్‌కతా హత్యోదంతం వేళ.. సందీప్ ఘోష్‌కు దీదీ రాసిన లేఖ వైరల్
కోల్‌కతా : యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూన్ 30న ఆర్జీకార్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ లేఖతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందికి మాత్రమే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాస్తారని, ఆ కొద్ది మందిలో సందీష్ ఘోష్ సైతం ఉన్నారని సమాచారం. ఇక ఆ లేఖపై దీదీని బీజేపీ టార్గెట్ చేసింది. సందీప్ ఘోష్‌కు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీతో మంచి అనుబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్జీకార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ మమతా బెనర్జీ అత్యంత సన్నిహితుల్లో ఒకరు అనేది రహస్యం కాదని, బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. ‘ఆర్జీ కార్ ఆసుపత్రిలో అవకతవకలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలగించలేదు. ప్రిన్సిపల్‌గా కొనసాగారు’ అని తిబ్రేవాల్ చెప్పారు.రాజీనామా అంతలోనే పోస్టింగ్ వైద్యురాలిపై జరిగిన దారుణం జరిగిన రెండురోజుల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ అంశంపై వివాదం నెలకొంది. కలకత్తా హైకోర్టు సైతం ఆయన పోస్టింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీష్ ఘోష్‌ను నిరవధిక సెలవుపై పంపింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది.సందీప్ ఘోష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఅదీకాక.. ఈ హత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలు.. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు తీవ్ర సందేహాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సందీష్ ఘోష్ చుట్టు ఉచ్చు మరింత బిగిసేలా.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్జీ కార్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు సైతం ఆగ్రహంఈ వారం ప్రారంభంలో అక్తర్ అలీ డాక్టర్ సందీష్ ఘోష్ మార్చురీలోని అనాధ శవాలతో వ్యాపారం చేశారని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు సందీష్ ఘోష్‌ను విచారణకు ఆదేశించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ఎవరు టచ్‌లో ఉన్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఎందుకు ఆలస్యం అయ్యింది?అని బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు ప్రశ్నించింది. -
Kolkata Doctor Case: క్రైం సీన్‌నే మార్చేశారు
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచారోదంతంపై తమ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘ఈ పాశవిక చర్యను కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయతి్నంచారు. అందులో భాగంగా మేం దర్యాప్తు బాధ్యతలు స్వీకరించే నాటికి ఏకంగా క్రైం సీన్‌నే సమూలంగా మార్చేశారు.ఈ కారణంగా దర్యాప్తు తమకో పెను సవాలుగా మారింది’’ అంటూ నివేదించింది. ‘‘తొలుత వైద్యురాలి ఆరోగ్యం బాగా లేదంటూ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకున్నాక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక తీరుబడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని పేర్కొంది. ‘అంతేకాదు, ఆగస్టు 9న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఆస్పత్రి వైద్యులు ఫోన్ చేసి వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సమాచారమిచ్చారు. నిజానికి ఆమె అప్పటికే చనిపోయింది’’ అని తెలిపింది. ప్రిన్సిపల్ వెనక ఎవరున్నట్టు: సీజేఐ కోల్‌కతా దారుణాన్ని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. ధర్మాసనం ఆదేశం మేరకు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అంశాలతో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్ సర్కారు కూడా ఓ నివేదిక సమరి్పంచింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘సాయంత్రం 6.10 నుంచి 7.10 మధ్య పోస్టుమార్టం జరిపారు. అంటే అది అసహజ మరణమని అప్పటికే రూఢీ అయినట్టే. కానీ అర్ధరాత్రి కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం.గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’’ అంటూ ఆయన తూర్పారబట్టారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అ«దీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు. ‘‘14 గంటలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా?! ఘోరం గురించి ఉదయమే తెలిసినా, సాయంత్రానికల్లా పోస్టుమార్టం చేసినా రాత్రి 11.30 దాకా పోలీసులకు సమాచారమే ఇవ్వలేదు. నిజానికి విషయం తెలియగానే నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడటం ప్రిన్సిపల్ కనీస బాధ్యత.ఈ విషయంలో ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు? అసలాయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? దాని వెనక కారణాలేమిటి? విమర్శల తీవ్రతకు ఎట్టకేలకు ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోగా ఆయన్ను సింపుల్‌గా మరో వైద్య కాలేజీకి బదిలీ చేసింది’’ అంటూ సీజేఐ ఆక్షేపించారు. దీనంతటినీ ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు తమ ఎదుట హాజరై ఎంట్రీ నమోదు సమయం తదితర వివరాలన్నింటినీ నేరుగా వెల్లడించాలని ఆదేశించారు.ఈ ఉదంతాన్ని రాజకీయం చేయొద్దని పారీ్టలకు సీజేఐ సూచించారు. హతురాలి జననాంగంలో 150 జీఎం పరిమాణంలో వీర్యం ఉందన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనను తప్పుబట్టారు. సోషల్ మీడియా వార్తల ఆధారంగా వాదనలు విని్పంచొద్దంటూ మందలించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని, ఇది కేవలం ఒక్కరి పనేనని ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో తేలిందని, డీఎన్ఏ నివేదిక కూడా దీన్నే ధ్రువీకరిస్తోందని సీబీఐ పేర్కొన్నట్టు సమాచారం!మెహతా వర్సెస్ సిబల్పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆయనకు, సీబీఐ తరఫున వాదనలు విన్పించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య సాగిన వాడీ వేడి వాదనలు కోర్టు హాలును వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలులో చోటుచేసుకున్న లోటుపాట్లను తాను వివరిస్తుంటే సిబల్ హేళనగా నవ్వుతున్నారంటూ ఒక దశలో మెహతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఒక అమాయకురాలు అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం’’ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు.వైద్యులు పట్టుబట్టినందుకే వీడియో జరిగిన దారుణం గురించి తెలిసినా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఘోష్ వెంటనే ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ సొలిసిటర్ జనరల్ మెహతా తప్పుబట్టారు. హతురాలి తండ్రి ఎంతగా డిమాండ్ చేసినా అంత్యక్రియల అనంతరం రాత్రి 11.45 గంటలకు గానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం చాలా దారుణమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘పోస్టుమార్టాన్ని వీడియో తీయాల్సిందేనని వైద్యురాలి సహచరులు, సీనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. లేదంటే ఆ ఆధారాలు కూడా మిగిలేవి కాదు’’ అన్నారు. వీటిని సిబల్ ఖండించారు. సీబీఐ నివేదికను బురదజల్లే యత్నంగా అభివర్ణించగా మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిజాలను కప్పిపెట్టేందుకు చల్లిన బురదను తొలగించేందుకే సీబీఐ ప్రయతి్నస్తోందన్నారు.నేనూ ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నా: సీజేఐ వైద్యుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తన కుటుంబీకుల్లో ఒకరికి చికిత్స సందర్భంగా స్వయంగా ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నానని చెప్పారు. వైద్యులు దారుణమైన పరిస్థితుల నడుమ పని చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వాళ్లకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవు. 36 గంటలు, అంతకుమించి నిరంతరాయంగా పని చేయాల్సి వస్తోంది. ఇది అత్యంత అమానవీయం.అంతసేపు పని చేసి పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఎవరన్నా వేధించినా అడ్డుకుని స్వీయరక్షణ చేసుకునే స్థితిలో కూడా ఉండరు! ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయని వైద్యులు దయచేసి అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. న్యాయం, ఔషధాలు అందడంలో జాప్యం జరగరాదన్నారు. సమ్మె విరమించి విధులకు వెళ్లాల్సిందిగా వైద్యులను మరోసారి అభ్యర్థించారు. ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆస్పత్రి వర్గాలు తమను వేధిస్తున్నాయని నాగ్‌పూర్ ఎయిమ్స్ వైద్యులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో వైద్యుల శాంతియుత నిరసనలపై బలప్రయోగానికి దిగొద్దని, విధుల్లో చేరాక ప్రతీకార చర్యలేవీ తీసుకోవద్దని సీజేఐ ఆదేశించారు.సలహాల కోసం పోర్టల్‘‘దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్రాలు వారం లోపు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో, డీజీపీలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సంప్రదింపులు జరపాలి’’ అంటూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వైద్యుల భద్రత తదితరాలపై సలహాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలి. సలహాలు, సూచనలను నేషనల్ టాస్‌్కఫోర్స్ పరిగణనలోకి తీసుకుని వైద్యుల భద్రతపై నేషనల్ ప్రొటోకాల్‌ను రూపొందించాలి’’ అంటూ పలు నిర్దేశాలు జారీ చేశారు. విచారణను సెపె్టంబర్ 5కు వాయిదా వేశారు.మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ టెస్టు మరో నలుగురు వైద్యులకు కూడావైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో హతురాలి సహచరులైన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు గురు వారం అనుమతి జారీ చేసింది. మరోవైపు అమానుషంగా ప్రవర్తించడం ఘోష్‌కు అలవాటని ఆయన ఇరుగుపొరుగు చెబుతున్నారు. సిజేరియన్ అయిన రెండు వారాలకే భార్యను ఆయన దారుణంగా కొట్టారంటూ 12 ఏళ్ల నాటి ఉదంతాన్ని గుర్తు చేస్తూ వారు చెప్పుకొచ్చారు.రేప్‌కు కఠిన చట్టాలు తెండిమోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా: మానభంగానికి పాల్పడేవారికి అతి తీవ్రమైన శిక్షలను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో పీటీ ట్రైనీ డాక్టర్ పాశవిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఈ లేఖను సంధించారు. ‘దేవవ్యాప్తంగా ప్రతిరోజూ రేప్‌లు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ప్రతిరోజూ భారత్‌లో 90 రేప్‌లు జరుగుతున్నాయి. వీటిలో చాలాకేసుల్లో బాధితులు హత్యకు గురవుతున్నారు. ఈ పరంపర భీతి గొల్పుతోంది. దేశం, సమాజం విశ్వాసాన్ని, అంతరాత్మను కుదిపేస్తోంది. ఈ ఘోరాలకు ముగింపు పలకడం మన విధి. అప్పుడే మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావిస్తారు. ఇలాంటి ఆందోళకరమైన, సున్నితమైన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అత్యంత కఠినమైన కేంద్ర చట్టాన్ని తేవాలి. రేపిస్టులకు అతి తీవ్రమైన శిక్షలు విధించాలి’ అని మమత లేఖలో కోరారు.రేప్ కేసుల విచారణ వేగంగా జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే కేసు విచారణ 15 రోజుల్లోగా పూర్తి కావాలని మమత అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసులో మమత సర్కారు వ్యవహరించిన శైలిని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మమత తీవ్ర విమర్శలను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డాక్టర్ల సమ్మె విరమణ ప్రకటించిన ఫైమాన్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఆందోళనకు దిగిన డాక్టర్లు 11 రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. డాక్టర్లు సమ్మె విరమించాలని, తిరిగి విధులకు హాజరయ్యే వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవి సుప్రీంకోర్టు గురువారం హామీ ఇచి్చంది. ’భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించాం.ఆసుపత్రుల్లో భద్రత పెంచడం, డాక్టర్లకు రక్షణపై మా వినతులను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. ఐక్యతతో చట్టపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఫైమా ‘ఎక్స్’లో వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎయిమ్స్ ఢిల్లీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, ఇందిరాగాంధీ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బెంగాల్లో మాత్రం సమ్మె విరమించేది లేదని వైద్యులు, వైద్య సిబ్బంది ప్రకటించారు. -
Kolkata Doctor Case: 50 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు రావాలి: అభిషేక్ బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధిని హత్యాచారం ఘటనలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమతా చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు.ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. దేశంలో ఆ తరహాలో ఎన్నో కేసులు వెలుగు చూశాయని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షపడేలా చట్టాలు రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘పది రోజులుగా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కావాలంటూ వైద్యులు, ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో 900 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా 50 రోజుల్లోగా విచారణలు పూర్తయి శిక్షలు ఖరారయ్యేలా కఠిన చట్టాలు రావాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని పోస్టు పెట్టారు.Over the past 10 days, while the nation has been protesting against the #RGKarMedicalcollege incident and demanding justice, 900 RAPES have occurred across different parts of India - DURING THE VERY TIME WHEN PEOPLE WERE ON THE STREETS PROTESTING AGAINST THIS HORRIBLE CRIME.…— Abhishek Banerjee (@abhishekaitc) August 22, 2024 -
సీఎం మమతా బెనర్జీపై అనుచిత పోస్ట్.. బీకాం విద్యార్ధి అరెస్టు
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఘటనను ఖండిస్తూ వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడు. దాంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చాడు. ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా తానేమీ నిరుత్సాహపడబోనని సదరు స్టూడెంట్ రాసుకొచ్చాడు.ఈ పోస్టును చూసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు బీకాం సెకండియర్ చదువుతున్న కీర్తిశర్మగా పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థి బెదిరింపు పోస్టు.. రెచ్చగొట్టేదిగా, వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేదిలా ఉందని తెలిపారు.అంతేకాదు, ఈ నెల 9న కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దీంతో సీఎంపై హత్యాయత్నానికి, అల్లర్లకు రెచ్చగొట్టడం, అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాల కింద స్టూడెంట్ ను అరెస్టు చేసినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు. -
‘మీరేం ముఖ్యమంత్రి’.. మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి ఉదంతంపై సీఎం మమతా బెనర్జీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన వ్యక్తే.. న్యాయం కావాలని రోడ్డెక్కడంపై పలువురు దీదీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ తరుణంలో సీఎం మమతా బెనర్జీపై ఆర్జీకార్ ఆస్పత్రి బాధితురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ కుమార్తె కేసు విషయంలో కోల్‌కతా పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దీదీపై నమ్మకం పోయిందన్నారు. హత్యదంతంలో నిందితుల్ని గుర్తించేందుకు సీబీఐ కనీసం ప్రయత్నిస్తోందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా తన కుమార్తె డైరీలోని ఒక పేజీని తాను సీబీఐకి అందజేశానని, అయితే అందులోని విషయాలను చర్చించేందుకు ఆయన నిరాకరించారు. దీదీపై నమ్మకం పోయిందిన్యాయం కోసం మమతా బెనర్జీ చేస్తున్న ఆందోళనపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘మొదట్లో నాకు ఆమెపై పూర్తి విశ్వాసం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో న్యాయం చేయాల్సిన వ్యక్తే..న్యాయం కావాలని కోరుతూ రోడ్డెక్కారు. ఈ కేసుపై బాధ్యత వహించాల్సిన ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఎందుకీ ద్వంద వైఖరి‘మాకు న్యాయం కావాలి అని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. కానీ అదే మాట చెబుతున్న సామాన్యులపై దాడులు చేస్తున్నారు. ఓ వైపు న్యాయం కోసం ఆందోళన చేస్తూనే.. అదే ఆందోళన చేస్తున్న సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు’ ఎందుకు ఈ ద్వంద వైఖరి’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ పథకాలు కన్యాశ్రీ పథకం, లక్ష్మి పథకాలన్నీ నకిలీవి. ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో, వాటిని పొందే ముందు దయచేసి మీ లక్ష్మి ఇంట్లో క్షేమంగా ఉందా? లేదా? అని చూడాలని కోరారు. అదే మాటకు కట్టుబడి ఉన్నాంమరోవైపు తమ కుమార్తెపై జరిగిన దాడి ఒక్కరు చేసింది కాదన్న అంశంపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. ‘మేం మొదటి నుంచి చెబుతున్నాం..మాట్లాడిన వారందరూ, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా.. ఇలా చేయడం ఒక్కరి వల్ల సాధ్యం కాదని అంటున్నారు’. తన కుమార్తెకు భద్రత కల్పించాల్సిన వ్యక్తులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు. -
కోల్‌కతా వైద్యురాలి కేసు.. సీబీఐకి మమతా అల్టిమేటం
కోల్‌కతా హత్యాచారం కోల్‌కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆవరణలో అత్యాచారం, ఆపై హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. కామాంధుల కర్కశత్వానికి ఓ యువ వైద్యురాలు బలైంది. సమాజం తలదించుకోవాల్సిన ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి.తాజాగా వైద్యురాలి కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ నేడు(శుక్రవారం) ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదివారం లోగా దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐఈ)కి అల్టిమేటం ఇచ్చారు.అయితే పోలీసులు కేసును తప్పుదారి పట్టించారని, అధికార టీఎంసీ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం మమతా ర్యాలీకి పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్రంలో పోలీసు, హోంశాఖ పోర్ట్‌ఫోలియోలను మమతానే నిర్వర్తిస్తున్నారు.-అయితే పార్టీ అధినేత, సీఎం దీదీ ఎందుకు ర్యాలీతో వీధుల్లోకి వస్తున్నారనే విషయంపై టీఎంపీ ఎంపీ, అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్ క్లారిటీ ఇచ్చారు. కోల్‌కతాలో జరిగిన వైద్యురాలితిపై జరిగిన అత్యాచారం, హత్య కంటే దారుణమైన ఘటనను ఊహించడలేం. దీనిపై ప్రజల ఆగ్రహాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆమె కుటుంబం కోసం అందరూ ప్రార్థించడండి అని పేర్కొన్నారు.‘ఆర్జీ కర్ హాస్పిటల్ ఘటనపై మమతా బెనర్జీ ఎందుకు ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నారనేది సరైన ప్రశ్నే.. ఎందుకంటే ఇప్పుడు కేసును విచారిస్తున్న సీబీఐ, తమ దర్యాప్తుపై రోజువారీ అప్డేట్లు ఇవ్వాలి. అంతకముందు ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి కోల్‌కతా పోలీసులకు సీఎం ఇచ్చిన గడువు ఆగస్టు 17. అదే సీబీఐకి కూడా వర్తించాలి. ఇప్పటికే ఓ నిందితుడిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ మిగతా వారందరినీ అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపినప్పుడే న్యాయం జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షించినప్పుడుఏ బాధితులకు సత్వర న్యాయం జరుగుతుది. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టకూడదు’ అని ఆయన సూచించారు. -
ఆసుప్రతి వద్ద విధ్వంసం.. బీజేపీ, సీపీఎం పనే: సీఎం మమతా
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్, ఆసుపత్రిలో ఓ గుంపు చొరబడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సెమినార్ హాల్లో డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ విద్యార్ధులు, వైద్య సిబ్బంది ఆందోళన చేస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని నిరసనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకొచ్చి బీభత్సం చేశారు.అయితే అసుపత్రి వద్ద జరిగిన విధ్వంసంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల పాత్ర ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం గవర్నర్‌ను కలిసిన తర్వాత మమతా మీడియాతో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన వారు బయటి వ్యక్తులుగా కనిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.‘బయటి వ్యక్తులు, 'బామ్ అండ్ రామ్'కి చెందిన కొంతమంది రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పని చేసినట్లు నాకు సమాచారం అందింది. ఇందులో విద్యార్థుల పాత్ర లేదు. ఈ సంఘటనను ఖండిస్తున్నాను. అలాగే అత్యాచార నిందితులను ఉరి తీయాలంటూ ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయబోతున్నాను,రాత్రి ఘటనలో వామపక్షాలు, బీజేపీ జెండాలను చూశాను. వారు పోలీసులపై దాడి చేసిన విధానం చేశారు. ఇన్ఛార్జ్ అధికారి ఒకరు గంటపాటు కనిపించలేదు. తరువాత అతను గాయపడినట్లు తేలింది. కానీ పోలీసులు రోగులకు ఇబ్బంది కలగకూడదని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము చాలా ఆందోళనలు చేశాం. కానీ ఆసుపత్రిలో ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు’ అని తెలిపారు. కాగా ే గతంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని బామ్ అంటే లెఫ్ట్, రామ్ అంటే బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.ఇదిలా ఉండగా కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ క్యాంపస్‌లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపై సైతం ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారులు గాయపడ్డారు. -
Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేద్దామనుకుంటున్నారు
కోల్‌కతా: వైద్యురాలి రేప్, హత్యపై విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నాయని సీపీఎం, బీజేపీలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అవరణలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తమకేమీ అభ్యంతరం లేదని, సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరితగతిన తేలాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు. ‘వైద్యురాలి కుటుంబానికి అండగా నిలువాల్సిందిపోయి సీపీఎం, బీజేపీలు చవకబారు రాజకీయాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇక్కడా తేగలమని వారు అనుకుంటున్నారు. నేనొకటే చెప్పదలచుకున్నాను. నాకు అధికార వ్యామోహం లేదు’ అని మమత అన్నారు. హత్య గురించి తెలియగానే రాత్రంతా కేసును పర్యవేక్షించానని, పోలీసు కమిషనర్‌తో, బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. మేము ఏం చేయలేదో చెప్పండి? ఏం చర్యలు తీసుకోలేదో చెప్పండి? అని విపక్షాలపై మండిపడ్డారు. ‘డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజిని సేకరించడం, శాంపిల్స్‌ను పరీక్షించడం.. ఇలా ప్రతిదీ 12 గంటల్లోపే జరిగింది. నిందితుడిని కూడా 12 గంటల్లోనే అరెస్టు చేశాం’ అని చెప్పుకొచ్చారు. సీబీఐ ఆదివారం లోగా కేసును చేధించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతా పోలీసులు 90 శాతం దర్యాప్తును పూర్తి చేశారన్నారు. దోషులను ఉరి తీయాలన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వయంగా తాను శుక్రవారం కోల్‌కతా వీధుల్లో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు. నిందితుడిని రక్షించే ప్రయత్నం: రాహుల్ వైద్యురాలి రేప్, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరగడం ఆసుపత్రిపై, అధికార యంత్రాంగంపై పలు సందేహాలకు తావిస్తోందన్నారు. డాక్టర్లలో, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. ‘‘మెడికల్ కాలేజీలోనే డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా పంపిస్తారు? నిర్భయ వంటి కఠినచట్టాలు కూడా ఇలాంటి నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నాయి?’’ అని ప్రశ్నించారు. -
కోల్‌కతా వైద్యురాలి ఉదంతం.. ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: మమతా
కోల్‌కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో గత శుక్రవారం తెల్లవారుజామున వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించింది.మరోవైపు ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వైద్య విద్యార్ధులు, డాక్టర్లు పశ్చిమబెంగాల్, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారం-హత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసులో సీఎం మమత నిందితులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.అయితే వైద్యురాలిపై హత్యచారం ఉదంతాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్ష బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రత్ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.‘బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి.. వామపక్షాలు, బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారు ఇక్కడ ఓ బంగ్లాదేశ్‌ను చేయగలమని భావిస్తున్నారు. అయితే నేనేం అధికారం కోసం అత్యాశతో లేను. ఈ కేసులో అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఈ కేసులో మేం ఏం చేయలేదా? ఎలాంటి చర్యలు తీసుకోలేదా? సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు కమిషనర్‌తో మాట్లాడాను. బాధిత మహిళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాను. అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీస్తానని వారితో చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను.ఘటజన జరిగిన రాత్రంతా కేసును పర్యవేక్షిస్తున్నాను. దహన సంస్కారాలు జరిగే వరకు పోలీసులతో టచ్‌లో ఉన్నాను. పోలీసులు ఆమె కుటుంబంతోనే ఉన్నారు. అంతేగాక 12 గంటల్లో హంతకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని తీసుకెళ్లడం, డీఎన్ఏ టెస్టు చేయడం, సీసీటీవీ ఫుటేజీ, సమగ్ర దర్యాప్తు అన్నింటిని పోలీసులు పూర్తి చేశారు.ఏదైనా విచారణ కోసం ముందు సమయం ఇవ్వాలి. నేను ఆదివారం వరకు పోలీసులకు గడువు విధించాను. సరైన విచారణ చేయకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోలేరు. నేను సీనియర్, జూనియర్ డాక్టర్లను గౌరవిస్తాను. సరైన విచారణ లేకుండా నేను వ్యక్తులను అరెస్టు చేయలేను’అని తెలిపారు.ఈ వ్యవహారంలో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసును మంగళవారం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ దర్యాప్తుపై మమతా మాట్లాడుతూ.. తాము పూర్తిగా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, సీబీఐ దర్యాప్తుకు సహరిస్తున్నామని తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ముప్పై నాలుగు మందిని పోలీసులు విచారించారని, మరికొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. అయితే ఈ లోపే హైకోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి బదిలీ చేసిందని చెప్పారు. -
శిక్షపడేదాకా నిరసన బాటే!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ‘‘విచారణ సత్వరమే పూర్తై దోషులకు కఠిన శిక్ష పడాలి. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. అప్పటిదాకా అన్ని రకాల వైద్య సేవలనూ నిలిపేస్తున్నాం’’ అని ప్రకటించారు. కోల్‌కతాతో పాటు ఢిల్లీ, ముంబై, చండీగఢ్, లఖ్‌నవూ తదితర అన్ని నగరాల్లోనూ సిబ్బంది రోడ్లపైకొచ్చారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థల సిబ్బంది కూడా ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. రంగంలోకి మహిళా కమిషన్ కోల్తాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాన్ఫరెన్స్ హాల్లోనే ఓ వైద్యురాలిపై సంజయ్రాయ్ అనే పౌర వలంటీర్ గురువారం దారుణంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ దారుణం శుక్రవారం వెలుగు చూసింది. దీనిపై బెంగాల్లో మొదలైన నిరసనలు, ఆందోళనలు అన్నిచోట్లకు పాకాయి. దాంతో నాలుగు రోజులుగా దేశమంతా అట్టుడుకుతోంది. బెంగాల్లోనైతే వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా (ఫోర్డా) తదితర సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. కేసు దర్యాప్తుకు జాతీయ మహిళా కమిషన్ కూడా కోల్‌కతా చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరగనుంది. కోల్‌కతాలో మెడికల్ కాలేజీ నుంచి జరిగిన భారీ ర్యాలీలో ప్రముఖ నటీనటులు రిద్ధీ సేన్, సురాంగనా బంధోపాధ్యాయ, కౌశిక్ సేన్, చైతీ ఘోషాల్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.వారంలో ఛేదించకుంటే సీబీఐకి: మమత వైద్యురాలి కేసును ఆదివారంలోగా ఛేదించాలని బెంగాల్ పోలీసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ‘‘ఈ దారుణం వెనక ఆస్పత్రి లోపలి వ్యక్తుల హస్తం కూడా ఉందని వైద్యురాలి కుటుంబం అనుమానిస్తోంది. వారెవరో కనిపెట్టి ఆదివారం లోపు అందరినీ అరెస్టు చేయాలి. లేని పక్షంలో కేసును సీబీఐకి అప్పగిస్తా’’ అని ప్రకటించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిజానికి పలు కేసుల దర్యాప్తులో సీబీఐ చేసిందేమీ పెద్దగా లేదంటూ పెదవి విరిచారు. అయినా అవసరమైతే ఈ కేసును దానికి అప్పగిస్తామన్నారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. మమత డెడ్‌లైన్ నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో దోషులందరినీ పట్టుకుంటామన్నారు. ఈ దారుణం గురించి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నన్ను ఉరి తీసుకోండి: నిందితుడు దారుణానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌లో పశ్చాత్తాపమే లేదని పోలీసులంటున్నారు. విచారణలో నేరం అంగీకరించడమే గాక, ‘కావాలంటే ఉరి తీసుకొ’మ్మని అన్నట్టు తెలుస్తోంది. రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు. కోల్‌కతా పోలీసు శాఖలో పౌర వలంటీర్‌గా ఆస్పత్రిలోని పోలీస్ ఔట్‌పోస్టులో పని చేస్తున్నాడు. అడ్మిషన్ కోసం రోగుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కోల్‌కతా పోలీస్ (కేపీ) అని రాసున్న టీ షర్ట్‌తో తిరుగుతున్నాడు. అతని బైక్‌కు కూడా కేపీ ట్యాగ్ ఉంది. రాయ్ మొబైల్ ఫోన్ నిండా అశ్లీల దృశ్యాలే ఉన్నట్టు తెలిసింది.ప్రిన్సిపాల్ రాజీనామా..వైద్యురాలి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు. తనపై వస్తున్న విమర్శలను, అవమానాన్ని భరించలేనన్నారు. ‘‘బాధితురాలినే నిందితురాలిగా చిత్రిస్తూ నేను వ్యాఖ్యలు చేశాననడం అబద్ధం. ఆమె నా కూతురి వంటిది. నేనూ ఓ తండ్రినే’’ అన్నారు. -
పోలీసులకు బెంగాల్ సీఎం డెడ్ లైన్...
-
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. అవసరమైతే నిందితులను ఉరితీస్తాం: సీఎం మమతా
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైయినీ డాక్టర్ హత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.తాజాగా ట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు అసుపత్రిలోనే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.అయితే నిరసన చేస్తున్న వారికి రాష్ట్ర పరిపాలనపై నమ్మకం లేదని భావిస్తే, వారు మరేదైనా దర్యాప్తు సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. దానితో తనకు ఎలాంటి సమస్యలేదన్నారు. ఈ కేసులో సరైన, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తూనే రోగులకు చికిత్స అందించాలని సూచించారు.కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురైంది. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో శవమై కనిపించింది. అంతేగాక ఆమెను హత్య చేసే ముందు లైంగికదాడికి పాల్పడినట్లు తాజాగా పోస్టుమార్టంలో తేలింది. బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం: బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్‌బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్బెంగాల్ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. -
అపనమ్మకంతో అభివృద్ధి ఎలా?
వికసిత భారత్ లక్ష్యమనీ, అందుకు వికసిత రాష్ట్రాలు కీలకమనీ కేంద్రం మాట. అందుకు అవరోధంగా రాజకీయంగా వివక్ష కొనసాగుతోందని రాష్ట్రాల ఆరోపణ. అందుకే, రాష్ట్రాల అభివృద్ధి, నిధుల కేటాయింపునకు కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో బహిష్కరణల పర్వం కొనసాగడం ఆశ్చర్యం అనిపించదు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ భేటీకి ఒకటీ రెండు కాదు... ఏకంగా పది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. గత వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌లకు తగినన్ని నిధులు కేటాయించలేదంటూ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు భేటీని బహిష్కరిస్తే, పశ్చిమ బెంగాల్ పక్షాన హాజరైన ఏకైక ప్రతిపక్ష పాలిత సీఎం మమతా బెనర్జీ సైతం మాట్లాడనివ్వకుండా మైకు ఆపేశారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనుకున్నట్టే ఆ భేటీ కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాలు, పనితీరు పైన చర్చకు పురిగొల్పింది. కేంద్ర, రాష్ట్రాలు పరస్పర నిందారోపణలు మాని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఈ నీతి ఆయోగ్ వ్యవస్థ ఎన్డీఏ తెచ్చిపెట్టినదే. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. అలా 2015 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. ప్రణాళికా సంఘమైతే పైన కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏకపక్షంగా విధాన నిర్ణయాలు బట్వాడా చేస్తుందనీ, దానికి బదులు కింది అందరినీ కలుపుకొనిపోతూ, రాష్ట్రాల ఆలోచనలకు పెద్దపీట వేసేందుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో నీతి ఆయోగ్‌ను పెట్టారంటారు. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నది ప్రధాన విమర్శ. వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ జూలై 16న నీతి ఆయోగ్ మేధావి బృందాన్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రధానమంత్రి మోదీ ఛైర్‌పర్సన్‌గా ఉండే ఈ బృందంలో నలుగురు పూర్తికాలిక సభ్యులతో పాటు, ఎన్డీఏలో భాగస్వాములైన బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన 15 మంది కేంద్ర మంత్రుల్ని ఎక్స్–అఫిషియో సభ్యులుగా చేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్‌షా తదితరులు అందులో సభ్యులే. ఒకప్పటి ప్రణాళికా సంఘంలోనూ లోపాలున్నా... గ్రాంట్ల విషయంలో గతంలో రాష్ట్రాలతోసంప్రతింపులకు వీలుండేది. కానీ, ఇప్పుడు గ్రాంట్లపై ఆర్థికశాఖదే సర్వంసహాధికారం. ప్రణాళికా సంఘం ఉసురు తీసి వచ్చిన నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమైపోయింది. ఎంతసేపటికీ రాష్ట్రాల స్థానాన్ని మదింపు చేయడానికి కీలకమైన సూచికల సృష్టి మీదే దృష్టి పెడుతోంది. రాష్ట్రాలకూ, ఇతర సంస్థలకూ వనరుల పంపిణీ, కేటాయింపులు జరిపే అధికారం లేని వట్టి ఉత్సవ విగ్రహమైంది. వెరసి, కేంద్ర సర్కార్ జేబుసంస్థగా, పాలకుల అభీష్టానికి తలాడించే సవాలక్ష ఏజెన్సీల్లో ఒకటిగా దాన్ని మార్చేశారు. చివరకు ‘సహకార సమాఖ్య’ విధానానికి బాటలు వేస్తుందంటూ తెచ్చిన వ్యవస్థ అనూహ్యంగా ‘పోటాపోటీ సమాఖ్య’ పద్ధతికి దారి తీసింది. చివరకు మేధావి బృందపు పాత్ర ఏమిటన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తాయి. వాటికీ సరైన జవాబు లేదు. అపనమ్మకం పెరిగితే వ్యవస్థలో చిక్కులు తప్పవని నీతి ఆయోగ్ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది.అభివృద్ధికి సంబంధించిన వైఖరుల్లో పరస్పరం తేడాలున్నా, ప్రధానంగా భౌతిక ప్రాథమిక వసతుల నిర్మాణంపైనే అధికంగా ఖర్చు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు సరిపోలేలా రాష్ట్రాలు కృషి చేయాలంటూ నీతి ఆయోగ్ తాజా భేటీలో 20 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధుల్ని ఉద్దేశించి ప్రధాని నొక్కిచెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగాలంటే ప్రాథమిక వసతుల నిర్మాణం ప్రాధమ్యాంశమని కేంద్రం ఆలోచన. అందుకే, జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్రంతో రాష్ట్రాలు చేతులు కలిపి అటు వసతులకూ, ఇటు సంక్షేమానికీ వనరులు అందు కోవాలని ప్రధాని అంటున్నారు. అయితే, రాష్ట్రాల స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలు ఎక్కడికక్కడ వేర్వేరు కాబట్టి, చెప్పినంత సులభం కాదది! పైగా, రాష్ట్రాలన్నిటికీ పెద్దపీటనే మాటకు భిన్నంగా ఆచరణలో పాలకపక్షం తమ ప్రభుత్వాలు ఉన్నచోటనే ప్రేమ చూపిస్తోందనే విమర్శ ఉండనే ఉంది.కేంద్ర బడ్జెట్‌ను సైతం అదే సరళిలో రాజకీయమయం చేశారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపి స్తున్నాయి. తమిళనాట చెన్నై మెట్రో రైల్, కేరళలో విళింజమ్ పోర్ట్ సహా పలు కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేదని ఎత్తిచూపుతున్నాయి. ఈ అనుమానాలు, ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానాలు కేంద్రం వద్ద లేవు. అదే సమయంలో తాగునీరు, విద్యుచ్ఛక్తి, ఆరోగ్యం, పాఠశాల విద్య తదితర అంశాలే అజెండాగా సాగిన ఓ భేటీని బహిష్కరించడం వల్ల రాష్ట్రాలకూ, ప్రజానీకానికే నష్టం. ఆ సంగతి రాష్ట్రాలు గుర్తించాలి. బహిష్కరణను తప్పుబడుతున్న కేంద్ర పెద్దలు కూడా పరి స్థితి ఇంత దాకా ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి, మునుపటి ప్రణాళికా సంఘమే మళ్ళీ తేవాలనే వాదన వినిపిస్తున్న వేళ వ్యవస్థాగతంగానూ, పని తీరులోనూ పాతుకున్న లోపాలను తక్షణం సవరించాలి. నిధులను సక్రమంగా, సమానంగా పంచ డంలో కేంద్ర ఆర్థిక మంత్రి, బడ్జెట్లు విఫలమవుతున్న తీరును మాటలతో కొట్టిపారేస్తే సరిపోదు. పెద్దన్నగా అన్ని రాష్ట్రాలనూ కలుపుకొనిపోతేనే వికసిత భారత లక్ష్యం సిద్ధిస్తుంది. పన్నుల రూపంలో భారీగా కేంద్రానికి చేయందిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలూ ఇదే భారతావనిలో భాగమని గుర్తిస్తేనే అది కుదురుతుంది. అందుకు రాజకీయాలను మించిన విశాల దృష్టి అవసరం. -
ముగిసిన నీతిఆయోగ్ భేటీ.. ప్రధాని స్పీచ్ హైలైట్స్..
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం(జులై 27) జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై ఈ సమావేశంలో పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా, తాను మాట్లాడుతుండగా మధ్యలో మైక్ కట్ చేశారని నీతిఆయోగ్ సమావేశం నుంచి వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు. ఎన్డీఏ కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నీతిఆయోగ్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్యకారణాల వల్లనే నితీశ్ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. -
మైక్ కట్‌చేయడం.. కోఆపరేటివ్ ఫెడరలిజమా: స్టాలిన్
చెన్నై: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు పలికారు. నీతిఆయోగ్ భేటీలో మమత మైక్ కట్ చేయడం కో ఆపరేటివ్ ఫెడరలిజమా అని ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన శనివారం(జులై 27) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఇలాగేనా గౌరవించేంది. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ గుర్తించాలి. వారిని శత్రువులుగా చూడకూడదు. కోఆపరేటివ్ ఫెడరలిజం మనుగడ సాగించాలంటగే చర్చలకు అవకాశం ఉండాలి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని స్టాలిన్ తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, నీతిఆయోగ్ మీటింగ్‌లో కేవలం 5 నిమిషాలే తనను మాట్లాడించారని, తర్వాత మైక్ కట్ చేశారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మాత్రం మాట్లాడటానికి 20 నిమిషాల సమయం ఇచ్చారని మండిపడ్డారు. -
మమత వాకౌట్
-
నీతిఆయోగ్‌లో కేంద్రాన్ని నిలదీస్తా: మమతా బెనర్జీ
కలకత్తా: ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్లో సవతితల్లి ప్రేమ చూపించారని తృణమూల్కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో శనివారం(జులై 26) జరిగే నీతిఆయోగ్ సమావేశానికి హాజరై చెబుతానన్నారు. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం(జులై26) ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు నాకు మాట్లాడటగానికి నాకు అనుమతివ్వకపోతే నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి వస్తా అని మమత తెలిపారు. మమతాబెనర్జీ నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై మమత తొలి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. -
అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు
కోల్‌కతా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెదిరించి, భయపెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మమత ఏ పార్టీ పేరు తీసుకోకపోయినప్పటికీ ఆమె పరోక్షంగా ఎన్డీఏ కీలకపక్షాలను ఉద్దేశించే పలు ఘాటు విమర్శలు చేశారు. అమరువీరుల దినోత్సవ భారీ ర్యాలీలో మమత ఆదివారం మాట్లాడారు. ‘పిరికిపందలు, అత్యాశాపరులైన నాయకులు ఆర్థిక తాయిలాలకు లొంగిపోయారు. మంత్రిపదవులకు బదులుగా డబ్బు ఇస్తామనడం ఎప్పుడైనా విన్నామా? పార్టీలు డబ్బుకు అమ్ముడు పోవడం చూశామా? వాళ్లు (ఎన్డీఏ మిత్రపక్షాలు) పిరికిపందలు, సిగ్గులేని వారు. అత్యాశాపరులు. అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు’ అని మమత ధ్వజమెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎక్కువకాలం కొనసాగదని, మతతత్వశక్తులకు విజయం లభించినా.. ఓటమి తప్పదని అఖిలేశ్ అన్నారు. -
బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత
కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు. మార్పునకు సంకేతం: కాంగ్రెస్ బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు. -
తిరుగులేని తృణమూల్.. బైపోల్స్‌లో ముందంజ
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి తిరుగులేదని మరోసారి తేలింది. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. మనిక్టల, బాగ్డా, రానాఘాట్ దక్షిణ్, రాయిగంజ్ అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నిక జరిగింది. వీటి ఫలితాలు శనివారం(జులై 13) ఉదయం నుంచి వెలువడుతున్నాయి.ఉప ఎన్నికల పోలింగ్‌లో అధికార టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు టీఎంసీ కొట్టిపారేసింది. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఎంసీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
సీబీఐపై పోరు: ‘మమత’ సర్కారుకు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో మమతా బెనర్జీ నేతృత్వంలోని వెస్ట్‌బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి(కన్సెంట్) లేకుండా సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణ చేయడంపై మమత సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం(జులై 10)న విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా సీబీఐ కేసుల విచారణ చేపట్టడంపై వెస్ట్‌బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తమ భూములను కబ్జా చేయడంతో పాటు తమను లైంగికంగా వేధిస్తున్నాడని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌కు వ్యతిరేకంగా వెస్ట్‌బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు ఉద్యమించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ షాజహాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. -
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. బెంగాల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకే మహిళలు భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన ఈ చర్యలకు దిగారు. శుక్రవారం కలకత్తా హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిణి.. గవర్నర్ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇది కుట్ర అని, ముందు ముందు ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తాయని ఆ టైంలోనే గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణల పర్వం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో ‘‘రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’’ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీఎంసీ నేతలు కొందరు గవర్నర్ ఆనందబోస్‌పై ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామంపై టీఎంసీ సీనియర్ నేత డోలా సేన్ మీడియా స్పందన కోరింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పార్టీతో చర్చించాకే తమ నిర్ణయం ఏంటో చెబుతామని అన్నారాయన. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై బీజేపీ మద్దతు తెలిపింది. గవర్నర్ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ రాహుల్ సిన్హా చెబుతున్నారు. మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజాన్ చక్రవర్తి తాజా పరిణామాలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒరగదని, పైగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తాయని అంటున్నారు. -
కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయండి: మోదీకి మమతా లేఖ
పశ్చిమ బెంగాల్ ముఖ్యంమత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని ఆమె కోరారు. కాగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. అయితే క్రిమినల్ చట్టాలను వాయిదా వేయడం వల్ల పార్లమెంట్లో వీటిపై సమీక్ష జరిపే అవకాశం ఉంటుందని దీదీ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలను కేంద్రంలోని ఇటీవల బీజేపీ ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే.బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో కేంద్రం వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్ధేశ్యంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్యవస్థను, కోర్టు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనున్నాయి. -
సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు
కోల్‌కతా: సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారం కోసం ప్రయతి్నంచనంత మాత్రాన రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోమని కాదన్నారు. తృణమూల్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని చెప్పారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని బలహీన, అస్థిర ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోతే సంతోషిస్తాను. దేశం మార్పు కోరుతోంది. తాజా ప్రజాతీర్పు మార్పు కోసమే. ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు. కనుక ఆయన ప్రధాని పదవి చేపట్టకుండా మరొకరికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది’’ అని మమత అన్నారు. కొత్తగా ఎంపికైన తృణమూల్ ఎంపీలతో మమత శనివారం సమావేశమయ్యారు. మోదీ ప్రమాణస్వీకారానికి తృణమూల్ దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ‘‘బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మిత్రపక్షాలపై ఆధారపడుతోంది. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో, ఎంతవరకు బండిని లాగుతుందో చూద్దాం. పదేళ్లుగా ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదించుకునేది. ఇక అలా కుదరదు. రాజ్యాంగాన్ని కూడా మార్చలేరు’’ అని మమత అన్నారు. ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూ గురించి అడగ్గా.. ‘వారు మా మిత్రులు కూడా. టీడీపీ, జేడీయూలు మాతో లేవని మీకెవరు చెప్పారు?’ అని మమత ప్రశ్నించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ల ప్రభావితం చేశారని, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని టీఎంసీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభల్లో డిమాండ్ చేస్తారని తెలిపారు. బెంగాల్ 42 స్థానాలకు గాను టీఎంసీ 29 సీట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీప్ బందోపాధ్యాయ్‌ను లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేతగా మమత నియమించారు. -
బెంగాల్లో దీదీ మేజిక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మేజిక్ మరోసారి పనిచేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో 42 స్థానాలకుగాను 29 చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు, సందేశ్ఖాలీసహా రాష్ట్రంలో పలు చోట్ల అంతర్గత సమస్యలు తలెత్తినా అవేమీ దీదీ నేతృత్వంలో టీఎంసీ విజయయాత్రను ఆపలేకపోయాయి. పశ్చిమబెంగాల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాలు ఒడిసిపట్టాలని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కాళ్లకు బలపం కట్టుకుని మరీ తెగ ప్రచారంచేశారు.ఎగ్జిట్ పోల్స్ సైతం ఈసారి బెంగాల్లో కమలవికాసం ఖాయమని అంచనాలు వెలువరిచాయి. ఈసారి మోదీ మేనియా ఉండొచ్చన్న రాజకీయ పండితుల లెక్కలూ తప్పు అని మమత మరోసారి నిరూపించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో కొనసాగబోనంటూ వేరుబడి కూడా సార్వత్రిక ఎన్నికల్లో మమత జయకేతనం ఎగరేయడం విశేషం. ‘ బెంగాల్లో బీజేపీ అంతర్గత కలహాలు, వ్యవస్థాగతంగా బలహీనంగా ఉండటం, బలమైన లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో తృణమూల్ వ్యతిరేక ఓటును బీజేపీ తనవైపునకు తిప్పుకోలేకపోయింది’ అని రాజకీయ విశ్లేషకుడు మైదుల్ ఇస్లామ్ చెప్పారు. అందుకే 2019తో పోలిస్తే తృణమూల్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగి 47 శాతానికి చేరుకుంది. బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికల్లాగే సీపీఐ(ఎం) పార్టీ ఈసారి కూడా బోణీ కొట్టలేక చతికిలపడింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. జట్టు కట్టకపోవడంతో పుంజుకుందికాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు ఒప్పందం నుంచి మమత జనవరిలోనే వైదొలగడం టీఎంసీకి బాగా కలిసి వచ్చింది. దీంతో త్రిముఖపోరులో మైనారిటీలు, బీజేపీ వ్యతిరేకులు మరోమార్గంలేక టీఎంసీకే ఓటేశారు. గతంలో బీజేపీ సైతం ఇలాగే టీఎంసీ వ్యతిరేక ఓట్లను ఒడిసిపట్టి 2014లో 17 శాతంగా ఉన్న ఓటు షేరును 2019లో 40 శాతానికి పెంచుకుంది. స్థానిక సమస్యలు, ఎస్ఎస్సీ ఉద్యోగాల రద్దు, సీఏఏ అమలు అంశాలు ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయి. మైనారిటీ ఓటుతో పైపైకిమైనారిటీల బలం దీదీ పార్టీకి ఎంతో దోహపడింది. సీఏఏ అమలు, రామకృష్ణమిషన్, భారత్ సేవాశ్రమం సంఘ్‌లను వ్యతిరేకిస్తూ మమత వ్యాఖ్యలు, 77 ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదా రద్దుచేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పుతో మమత మాత్రమే తమను పట్టించుకుంటారని భావించి మైనారిటీలు టీఎంసీ వెంట నడిచి పార్టీ విజయాన్ని సులభం చేశారు. లక్ష్మీర్ భండార్, కన్యశ్రీ పథకాల లబ్ధిపొందిన మహిళలూ మమతకు మద్దతు పలికారు.మోదీ తక్షణమే రాజీనామా చేయాలి: మమతలోక్సభ ఎన్నికల్లో నైతిక ఓటమిని అంగీకరిస్తూ ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి వైదొలగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లు సాధిస్తుందంటూ ప్రచారం చేసుకున్న మోదీ వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని సైతం సాధించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. మోదీ విశ్వసనీయత కోల్పో యారు. ఇండియా గెలిచింది. మోదీ ఓడిపోయారు. ఎన్నో రాజకీయ పారీ్టలను ఆయన ముక్కలుచెక్కలుగా చేశారు. ప్రజలే ఆయన్ను నైతికంగా దెబ్బకొట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మోదీ టీడీపీ, నితీశ్ కుమార్ల వద్ద కాళ్లబేరానికి వచ్చారు’అని మండిపడ్డారు. -
దీదీకి మోదీ చెక్ పెట్టనున్నారా..!
-
దేవుడైతే గుడి కడతాం... ప్రధానిపై ‘దీదీ’ సెటైర్లు
కోల్‌కతా: చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. తనను దేవుడు పంపాడని ప్రధాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై చురకలంటించారు. ‘ఒకరేమో దేవుళ్లకే దేవుడినని అంటారు. మరో నేతేమో పూరి జగన్నాథుడే ఆయన భక్తుడంటారు.దేవుడయితే మేం ఆయనకు గుడి కడతాం. పూలు,పండ్లు, స్వీట్లు, ప్రసాదం పెడతాం. ఆయన కావాలనుంటే గుజరాతీ వంటకం ఢోక్లా కూడా పెడతాం’అని మమత ఎద్దేవా చేశారు. దేవుడైతే రాజకీయాల్లో ఉండకూడదని, అల్లర్లు రెచ్చగొట్టొద్దని సూచించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా అమ్మ బతికున్నంతవరకు నేను అందరిలాగే పుట్టాననుకున్నాను. కానీ ఆమె చనిపోయిన తర్వాత నన్ను దేవుడు పంపించాడేమో అనిపిస్తోంది. ఈ శక్తి నాకు శరీరం నుంచి రావడం లేదు. దేవుడిస్తున్నాడు. నేననేది ఏమీ లేదు. నేను దేవుని సాధానాన్ని మాత్రమే’అని ప్రధాని ఇంటర్వ్యూలో చెప్పడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
మమత మనసులో ఏముంది? ‘ఇండియా’ భేటీకి ఎందుకు వెళ్లరు?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష ఇండియా కూటమితో జత కడతారా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన మమత ఎన్నికల తర్వాత విపక్షాల కూటమి ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కాబోనని ముందుగానే ప్రకటించారు.టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంపై తాను తీసుకున్న నిర్ణయానికి లోక్‌సభ ఎన్నికలు, రెమాల్ తుపాను కారణాలని పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆమె లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఓటింగ్, రెమాల్ తుపాను అనంతరం చేపడుతున్న సహాయక చర్యల కారణంగా జూన్ ఒకటిన జరిగే కూటమి మీటింగ్‌కు హాజరు కాలేనన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్ ఒకటిన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఒకవైపు తుఫాన్, మరోవైపు ఎన్నికలు ఈ నేపధ్యంలో తాను వీటిని విస్మరించి, సమావేశానికి ఎలా హాజరుకాగలను అని అని ప్రశ్నించారు.మమత సమాధానంపై స్పందించిన బీజేపీ నేతలు.. కూటమి నుంచి తప్పించుకునేందుకే మమత ఇలాంటి సాకులు చూపుతున్నారని ఆరోపించారు. కాగా ఎన్నికల ఫలితాలకు ముందు మమతా బెనర్జీ బహిరంగంగా ప్రతిపక్ష శిబిరంతో సహవాసం చేయకూడదని భావించివుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, అప్పటి సీట్ల సంఖ్యను అనుసరించి ఆమె ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ ఒకటిన పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది. -
Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?
కోల్‌కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్‌లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
నోటిదురుసుకు ఇదా శిక్ష!
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది. ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్‌గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు. సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు. కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం. -
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు. -
మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీపై చేసిన వ్యాఖ్యలకుగాను కలకత్తాక హైకోర్టు మాజీ జడ్జి గంగోపాధ్యాయను ఎన్నికల కమిషన్ మందలించింది. 24 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.ప్రచార సభల్లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని గంగోపాధ్యాకు ఎన్నికల సంఘం సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. నీ రేటెంత అని మమతా బెనర్జీని ఉద్దేశించి గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.గంగోపాధ్యాయ ప్రస్తుతం వెస్ట్‌బెంగాల్‌లోని టమ్లుక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ గంగోపాధ్యాయ బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. -
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
కోల్‌కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్ తృణమూల్ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్‌లోని జార్గ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్గురిలోని రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు.ఇలాంటి వాటిని బెంగాల్ ప్రజలు సహించరు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. -
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేధాలు రోజురోజకీ తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాము(టీఎంసీ) ఇప్పటికీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బయట నుంచి తమ మద్దతు ఉంటుందని వెల్లడించిన మరుసటి రోజే మమతా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హంహల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో గురువారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఓటర్లను విభజించడానికి కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ (బెంగాల్లో) వారికి ఓటు వేయకండి. రాష్ట్రంలో పొత్తు లేదు. కేవలం కేంద్రంలో మాత్రమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేస్తున్నాను. అలాగే కొనసాగుతాం. మేము ఇండియాలో భాగమే. దానికి మద్దతునిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి అపార్థం ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.తాజాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. టీఎంసీ ఇండియా కూటమిలో భాగం కాదని, ఆమె మాటలను నమ్మవద్దని తెలిపారు. టీఎంసీ కూటమి నుంచి వెళ్లిపోయిందని, మమతా బెనర్జీ ఎప్పుడైనా బీజేపీ వైపు వెళ్లవచ్చని ఆరోపించారు.‘ఆమె కూటమికి బయట నుంచి, లోపల నుంచి నాకు చేస్తుందో తెలియదు. మీరే ఆమెను అడగాలి. కానీ నాకు ఆమెపై నమ్మకం లేదు.ఆమె కూటమిని విడిచిపెట్టింది. త్వరలో బీజేపీ వైపు ఆకర్షితులైన ఆశ్యర్యపోనవసరం లేదు.’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమి బెంగాల్ కాంగ్రెస్‌ను లెక్క చేయదని అన్నారు. కూటమి గురించి ఆమెకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఏర్పాటు సమయంలోనే లేవనెత్తాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్‌కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్‌ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: గవర్నర్ బోస్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలని వెస్ట్‌బెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగిపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై శనివారం సప్తగ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత విమర్శలు గుప్పించారు. బోస్ గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టనని మమత స్పష్టం చేశారు.‘దీదీగిరి పనిచేయదని గవర్నర్ అంటున్నారు. కానీ గవర్నర్ నీ దాదాగిరి కూడా పనిచేయదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి. గవర్నర్ నీ ప్రవర్తన సిగ్గుచేటు’అని మమత అన్నారు. -
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు. బెంగాల్లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.పశ్చిమబెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్‌లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు. -
యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
కోల్‌కాతా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీల ప్రాబల్యం ఉన్న జంగీపూర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని బీజేపీ రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకుంటోంది. దీని వల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల మొదటి, రెండో దశ ఓటింగ్ పూర్తయింది. ఈ దశలోనే బీజేపీ ఓటమి భయాన్ని పొందిందని మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక అంశాన్ని ఉపయోగిస్తోంది. ఈసారి యూసీసీ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది ఒక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత ఏర్పడుతోందని మమతా బెనర్జీ అన్నారు. మొదటి రెండు దశల ఓటింగ్ తర్వాత ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ఐదు దశల్లో కూడా బీజేపీ ఓటమిని చవి చూస్తుందని బెనర్జీ అన్నారు. ఎన్నికల తరువాత రాబోయే ఫలితాలే దీన్ని చెబుతాయని అన్నారు. -
టీచర్లపై వేటు.. ఆ పార్టీలకు ఓటు వేయొద్దన్న సీఎం మమత
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఉద్యోగాలు రద్దైన టీచర్లకు ఓ సందేశాన్ని పంపారు. హైకోర్టు తీర్పు అనంతరం తొలిసారి సీఎం మమతా స్పందించారు. ‘బీజేపీ హైకోర్టు కోర్టును కోనుగోలు చేసింది. సుప్రీం కోర్టును కాదు. నాకు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నా. బీజేపీ హైకోర్టును, సీబీఐ, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, సీఏపీఎస్ వంటి ప్రభుత్వం సంస్థలను కొనుగోలు చేసింది. దూరదర్శన్ ఛానెల్ కలర్ మార్చింది. ఛానెల్ వాళ్లు కేవలం బీజేపీ, మోదీ గుర్చించి మాత్రమే ప్రసారాలు చేస్తారు. దూరదర్శన్ ఛానెల్ చూడకండి. ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయండి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు.. టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇక.. 2019లో మొత్తం 42 స్థానాల్లో 18 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీచర్లు తీవ్ర నిరసన తెలిపారు. అవినీతికి పాల్పడిన కొంతమంది వల్ల వేలాది మంది అమాయక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు.2016 నాటి స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ (SLST) చట్టబద్ధం కాదని జస్టిస్ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్ రషీదిలతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఎల్ఎస్టీ 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని కూడా కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో ఎస్ఎల్ఎస్టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు. కాగా,లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది. ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు -
కూటమి చిలుక 'పీకే'
సాక్షి, అమరావతి: తాను ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ (పీకే) వల్లె వేస్తున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని స్పష్టమైంది. ఏపీలో టీడీపీ–బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈమేరకు బుధవారం టీవీ 9 బంగ్లా చానెల్‌కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా పీకే జోస్యం చెబుతున్నారు’ అని వెల్లడించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం చెబుతున్నట్లు తేలిపోయింది. బాబు అరెస్టు తరువాత.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేష్ తీసుకొచ్చారు. ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పారు. బిహార్‌లో కలసి రాకపోవడంతో.. బెంగాల్ ఎన్నికల తర్వాత 2021లో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ పీకే ప్రతినబూని ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీ‹Ùకుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. ఆపై నితీశ్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజకీయంగా బిహార్‌లో తన పప్పులు ఉడకవని గ్రహించిన పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఆ జోస్యాలన్నీ తప్పే.. అటు బిహార్‌లో రాజకీయంగా చెల్లక.. ఇటు ఇం‘ధనం’ లేక కొట్టుమిట్టాడిన పీకే తనకు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే ఢంకా భజాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు సేవలో ‘పీకే’ ఏపీ రాజకీయాల్లో తలమునకలు బెంగాల్ సీఎం మమత వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు. ఐప్యాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్, ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ, బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మమతా ఈ విషయాలను వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం, ప్రమేయం పెద్దగా లేదన్నారు. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
ప్రధాని మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
దేశంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ.. సోషల్ సైట్ ఎక్స్‌లో.. 'దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీ రాముని జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సమయంలో నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ సంవత్సరం లక్షలాది దేశప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని చూశాను. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు. राम भारत की आस्था है, राम भारत का आधार है... pic.twitter.com/iyZm0ponNm — Narendra Modi (@narendramodi) April 17, 2024 అమిత్ షా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు ‘జై శ్రీరామ్.. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. The first Ram Navami after the Pran Pratishtha in Ayodhya is a generational milestone, weaving together centuries of devotion with a new era of hope and progress. This is a day crores of Indians waited for. Innumerable people devoted their lives to this sacred cause. May the… pic.twitter.com/2aJMLn1hhI — Narendra Modi (@narendramodi) April 17, 2024 -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్‌కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
బీజేపీకి 200 సీట్లు కూడా రావు
జల్పాయ్గురి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారంటీలన్నీ బూటకమని కొట్టిపారేశారు. శనివారం జల్పాయ్గురిలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే కుట్రలు సాగించారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న కల్ల»ొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఆయన ఇస్తున్న గ్యారంటీల వలలో పడొద్దని సూచించారు. బెంగాల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని, చివరకు 70 సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. -
‘రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్’ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్ సురక్షితమా అని బీజేపీ నేతలను ఆమె ప్రశ్నించారు. కూచ్‌బెహార్‌లో శుక్రవారం(ఏప్రిల్ 12) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత మాట్లాడారు. ‘బీజేపీకి ఒక ప్రొపగాండా స్పెషలిస్ట్ ఉన్నాడు. రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగింది బెంగళూరులో. నిందితులు కర్ణాటకకు చెందిన వారు. బెంగాల్ వాసులు కాదు. వారు పారిపోయి వచ్చి బెంగాల్లో దాక్కున్నారంతే. అయినా మేం వారిద్దరినీ కేవలం రెండు గంటల్లోనే పట్టుకున్నాం’అని మమత తెలిపారు. కాగా, బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను ఎన్ఐఏ బెంగాల్లో శుక్రవారం అరెస్టు చేసింది. దీంతో బెంగాల్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని బీజేపీ బెంగాల్ కో ఇంఛార్జ్ అమిత్ మాలవీయ, బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పోస్టు చేశారు. ఈ పోస్టులపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి.. రామేశ్వరం పేలుడు.. ఇద్దరు నిందితుల అరెస్టు -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
ప్రచార వేడి.. ప్రధాని మోదీపై ‘దీదీ’ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సందేశ్‌ఖాలీ వివాదంపై ప్రధాని తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పదే పదే సందేశ్‌ఖాలీ ఆందోళనలపై మాట్లాడుతున్న ప్రధానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో మహిళలు, దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదు. ఆయన కుంభకర్ణుని తరహాలో నిద్ర పోతున్నారు. సందేశ్‌ఖాలీ ఆందోళనలపై మా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంది’అని మమత తెలిపారు. కాగా, టీఎంసీ నేత షేక్ షాజహాన్ సందేశ్‌ఖాలీలో తమపై లైంగిక దాడులు చేసి వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనలకు కారణమైన షేక్ షాజహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖా పత్రకు బీజేపీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. మరోపక్క టీఎంసీ షేక్ షాజహాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పామునైనా నమ్మగలం కానీ.. మమత -
పామునైనా నమ్మగలం గానీ..: మమత
కూచ్‌బెహార్/మాల్బజార్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విష పూరిత పామునయినా నమ్మొచ్చేమోగానీ, కాషాయదళాన్ని మాత్రం విశ్వసించరాదన్నారు. ఆవాస్ యోజన కింద పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరితే గుడ్డిగా నమ్మొద్దని ప్రజలను కోరారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఒకే దేశం, ఒకే పార్టీ సిద్ధాంతంపై మాత్రమే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలతోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లు కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి వాటికి తాము తలొంచబోమని తెగేసి చెప్పారు. అన్ని పార్టీలనూ సమానంగా చూడాలని ఈసీని కోరతామన్నారు. -
సందేశ్‌ఖాలీ హింస.. దీదీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
సందేశ్‌ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది. ఈ మేరకు సందేశ్‌ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లను గురువారం విచారణ చేపట్టింది. సందేశ్‌ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు కలిగితే 100 శాతం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. దీనికి అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతేగాక ఈ కేసులో నిందితుడైన షేక్ షాజహాన్ తరపున హాజరైన న్యాయవాదిపై సైతం చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ‘విచారణలో ఉన్న నిందితుడి తరుపున హాజరువుతున్నారు. ముందు మీరు మీ చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించండి. తరువాత మీ వాయిన్‌ను వినిపించడండి.’ అని మందలించారు. కాగా జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. కాగా ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆలస్యంగా అరెస్ఠ్ చేయడంపై బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కవాకుండా వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. చదవండి: ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత? -
‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 లోక్‌సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్‌మార్క్‌ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు. #InPics | West Bengal chief minister Mamata Banerjee, along with TMC leader Mahua Moitra, holds a poll rally in Krishnanagar.#ElectionsWithNDTV #LokSabhaElection2024 pic.twitter.com/4iuTTL203Q — NDTV (@ndtv) March 31, 2024 సీఏఏని అనుమతించబోం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించినందునే టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బీజేపీ ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు. -
Kolkata: ‘దీదీ’పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీపై బీజేపీ నేత దిలీప్‌ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతాబెనర్జీ తన తండ్రి ఎవరో ముందు డిసైడ్ చేసుకోవాలన్నారు. దిలీప్‌ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘మమత గోవా వెళ్లి గోవా బిడ్డనంటుంది. త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత ముందు నిర్ణయించుకోవాలి’ అని ఘోష్ వ్యాఖ్యానించారు.ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో దుర్గా మాతపై, ఇప్పుడు మమతా బెనర్జీపై ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నైతికంగా ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. కాగా, 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వాడిన ‘బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్’ నినాదం బాగా పాపులర్ అయింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయం సాధించింది. ఇదీ చదవండి.. అందుకే వరుణ్‌గాంధీని బీజేపీ పక్కకు పెట్టింది -
ట్యాపింగ్ వీరుడు.. డేటా చోరుడు.. బాబే
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది. మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే... ట్యాపింగ్ చరిత్ర బాబుదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్‌గా పోస్టింగ్ ఇచ్చారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది. రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్’ట్విటర్’లో వెల్లడించింది. మమతా తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్‌పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమెకు ఈ గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది జనవరిలోనూ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది. Our chairperson @MamataOfficial sustained a major injury. Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE — All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024 -
మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ ఎక్కడుంది?
కోల్‌కతా: ‘సందేశ్‌ఖాలీ’ తుపాను ధాటికి పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని, నారీశక్తి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గద్దె దింపుతుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీటైన జవాబిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం తమదేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే గురువారం కోల్‌కతాలో ‘మహిళా హక్కులే మాకు ముఖ్యం’ పేరిట చేపట్టిన పాదయాత్రలో మమత ముందు నడిచారు. ఆమెను వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై మమత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ సందేశ్‌ఖాలీపై బీజేపీ దేశానికి తప్పుడు సందేశాలు పంపుతోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదంటూ నిన్న ఇక్కడికొచ్చి లెక్చర్లు దంచేసిన మోదీ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలు అకృత్యాలకు బలైనప్పుడు ఎందుకు మౌనం వహించారు?’’ అని నిలదీశారు. ‘‘మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినపుడు ఈ బీజేపీ ఏం చేసింది?. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో అత్యాచారం చేసి మృతదేహాన్ని బలవంతంగా తగలబెడితే బీజేపీ సర్కార్ ఏం చేసింది?. గుజరాత్లో సర్వం కోల్పోయిన బిల్కిస్ బానోకు దక్కిన న్యాయమెంత?’’ అని ప్రశ్నించారు. ‘నిజానికి దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం బెంగాల్’ అని ప్రకటించారు. ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం గురువారం బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌నూ మమత విమర్శించారు. ‘‘ తన తీర్పుల ద్వారా బెంగాల్లో వేలాది మంది యువత నుంచి ఉద్యోగాలు లాక్కున్నారు. వారు మిమ్మల్ని క్షమించరు. మీ తీర్పుల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా సరే మిమ్మల్ని ఓడించి తీరతాం’ అని అన్నారు. ‘‘ పింటూ బాబు(బీజేపీ) ఆగ్రహంతో ఊగిపోయినా సరే బెంగాల్లో మీ విభజన రాజకీయాలు నడవనివ్వను. బెంగాల్‌కు 450కిపైగా బృందాలను పంపిన పింటూ బాబు.. మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన మణిపూర్‌కు ఒక్క బృందాన్ని కూడా పంపలేదు’ అని మమత గుర్తుచేశారు. ‘బీజేపీపాలిత యూపీలో మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్‌లో మహిళలు రేప్‌కు గురై, అగి్నకి ఆహుతైన ఉదంతంలో అక్కడి బీజేపీ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలి’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ సందేశ్‌ఖాలీ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందే. టీఎంసీ కార్యకర్తలు బాధ్యుతులుగా తేలితే అరెస్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడను’ అని ఆమె స్పష్టంచేశారు. పాదయాత్రలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన 200కుపైగా మహిళలు పాల్గొన్నారు. -
తృణమూల్ కాంగ్రెస్‌కు 'తపస్ రాయ్' గుడ్ బై - కారణం ఇదే..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత 'తపస్ రాయ్' (Tapas Roy) ఈ రోజు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివాసంపై దాడి చేసినప్పుడు పార్టీ నాయకత్వం తనకు అండగా నిలవలేదని, పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తపస్ రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించానని, ఇప్పుడు నేను 'ఫ్రీ బర్డ్' అని అన్నారు. తపస్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన బీజేపీలో చేరతారా? లేదా మరేదైనా ప్రతిపక్ష పార్టీలో చేరతారా అనే దానిపై తీవ్రమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీలలో చేరే విషయం మీద తన అభిప్రాయాన్ని రాయ్ వెల్లడించలేదు, రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి - జైరాం రమేష్
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పటికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీకి ముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఏకపక్షంగా 42 స్థానాలకు (పశ్చిమ బెంగాల్లో) పోటీ చేస్తానని ప్రకటించింది, కానీ మాకు సంబంధించినంతవరకు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, వారి కోసం తలుపులు తెరిచి ఉన్నాయని.. ఆఖరి మాట చెప్పేంత ఈ అవకాశం ఉంటుందని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రదానం చేసిన వారం రోజుల తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) NDA కూటమిలో చేరింది. అలీఘర్‌లో యాత్రలో రాహుల్ గాంధీకి లోక్ దళ్ స్వాగతం పలికిందని రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం (కేరళలోని) నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. ఆ విషయం ప్రస్తుతం చర్చలో ఉందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
బెంగాల్లో స్కీములన్నీ స్కాములే
కృష్ణనగర్: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. స్కీములను స్కాములుగా మార్చడంలో తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలన్నీ కుంభకోణాలుగా మారాయని ఆరోపించారు. అణచివేత, వారసత్వ రాజకీయాలు, మోసాలు, ద్రోహానికి మమత సర్కారు మారుపేరుగా మారిందని ఆరోపించారు. మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. నాడియా జిల్లాలోని కృష్ణనగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రంసంగించారు. బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ఆరి్ధకాభివృద్ధికి, నూతన ఉద్యోగాల సృష్టికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సాగించిన అకృత్యాల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బాధిత మహిళలను గోడు వినిపించుకోవడం లేదని, నిందితులను అరెస్టు చేయకుండా కాపాడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నో ఆశలతో నమ్మి అధికారం అప్పగిస్తే ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ‘మా, మాటీ, మను‹Ù’ అంటూ నినాదాలు చేసే తృణమూల్ కాంగ్రెస్ మన అక్కచెల్లెమ్మలకు రక్షణ కలి్పంచడం లేదని మండిపడ్డారు. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో నేరగాళ్లే నిర్ణయిస్తున్నారని, పోలీసులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అవినీతి, బంధుప్రీతి తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఎద్దేవా చేశారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్(నువ్వు, నేను, అవినీతి) దుయ్యబట్టారు. బిహార్‌లో అరాచక పాలన మళ్లీ రానివ్వం ఔరంగాబాద్: ప్రధాని మోదీ శనివారం బిహార్‌లో పర్యటించారు. రూ.34,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారని, రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఇక ఎప్పటికీ ఎన్డీయేలోనే ఉంటా: నితీశ్ కుమార్ తన ప్రయాణం ఇకపై ఎప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే అని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కుపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని అన్నారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడానికి తమ రాష్టానికి వచి్చన ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. కొంతకాలం ఎన్డీయేకు దూరమయ్యానని, మళ్లీ తిరిగివచ్చానని, ఇకపై ఇదే కూటమిలో కొనసాగుతానంటూ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నితీశ్‌ను చూస్తూ ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించడం విశేషం. -
సిగ్గు... సిగ్గు...
వ్యవసాయభూముల కాపాడేందుకు ఉద్యమాలు చేసి, అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన పార్టీ చివరకు అందులోనే విఫలమైతే? సదరు పార్టీ వ్యక్తులే సారవంతమైన భూముల్ని కబ్జా చేసి, స్థానికులను జీతం బత్తెం లేని బానిస కూలీలుగా మార్చి, స్త్రీలపై యథేచ్ఛగా లైంగిక అత్యాచారాలు సాగిస్తుంటే? పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ళ దీర్ఘకాల వామపక్ష సర్కార్‌పై అలుపెరుగని పోరాటాలు చేసి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ఇప్పుడు సందేశ్‌ఖలీ వ్యవహారంలో వస్తున్న విమర్శలు ఇవే. కోల్‌కతాకు 70 కి.మీ.ల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలో సారవంతమైన భూములతో కూడిన ఈ కుగ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికి 53 రోజులైనా, అక్కడి అకృత్యాలకు మూలమని ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేత షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయకపోవడంపై కలకత్తా హైకోర్ట్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి రావడం పరాకాష్ఠ. సందేశ్‌ఖలీలో చాలాకాలంగా అకృత్యాలు సాగుతున్నా, అది ఇప్పుడు చర్చకు వచ్చింది. రేషన్ కుంభకోణంలో నిందితుడైన స్థానిక రాజకీయ బాహుబలి షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 5న వెళ్ళింది. వారిపై దాదాపు 2 వేల మంది దాకా షాజహాన్ అనుచరులు తీవ్రమైన దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, పెద్దయెత్తున స్థానిక మహిళలు బయటకొచ్చి, ధైర్యం కూడగట్టుకొన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ షాజహాన్, ఆయన అనుచరులు సాగిస్తున్న భూకబ్జాలనూ, లైంగిక అత్యాచారాలనూ బయటపెట్టారు. ఈ ఆరోపణలతో గ్రామంలో నిరసనలు తలెత్తాయి. గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, షాజహాన్ ప్రధాన అనుచరులైన ఉత్తమ్ సర్దార్, శివప్రసాద్ హజ్రాల ఆస్తులపై దాడికి దిగేలా చేసింది. షాజహాన్నూ, అతని అనుచరులనూ అరెస్టు చేయాలని కోరుతూ ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వీధులకెక్కారు. అధికార తృణమూల్ అసలు నిందితుడి విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంటే, ఈ వ్యవహారాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలా అని బీజేపీ చూస్తోంది. అధికార పార్టీ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్న నిందితుడు షేక్ షాజహాన్‌ది పెద్ద కథ. ‘సుందర్బన్స్ అసలు పులి’ అంటూ స్థానిక గ్రామీణులు పిలుచుకొనే అతను 2013 నుంచి తృణ మూల్‌కూ, అంతకు ముందు సీపీఐ (ఎం)కూ ఓటింగ్ మిషన్. అతను∙ఎవరికి మద్దతిస్తే వారిదే గెలుపు. 2023 జూలై పంచాయతీ ఎన్నికల్లో సందేశ్‌ఖాలీలోని రెండు బ్లాకుల్లో 333 సీట్లుంటే, 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలోనూ చివరకు తృణమూల్ జెండాయే ఎగిరింది. అలాంటి బలవంతుణ్ణి వదులుకోవడం ఎంత మమతకైనా కష్టమే. అందులోనూ మైనార్టీ అయిన షాజహాన్‌ను పరారీలో ఉన్నాడంటూ వదిలేసి, అతని∙హిందూ సహచరు లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ – ఆరెస్సెస్‌లకు అస్త్రం అందివచ్చినట్టయింది. మమత మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని నిందిస్తూ ఎస్సీ, ఎస్టీలను తమ వైపు తిప్పుకోవాలని కమలదళం యత్నిస్తోంది. నాలుగేళ్ళ క్రితమే పోలీసులకు ఫిర్యాదులందినా, 42 కేసులు దాఖలైనా షాజహాన్‌ను కదిలించినవారు లేదు. అతణ్ణి అరెస్ట్ చేస్తే మైనార్టీలు దూరమవుతారనేది మమత భయం. ఏమైనా, మోదీ పర్యటనకు వచ్చే లోపల మమత ఆ పని చేయక తప్పకపోవచ్చు. గతంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మమత ఎలాంటి ధర్నాలు చేసిందీ తెలుసు. 2007లో నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక జోన్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించి అక్కడకు చేరడానికి ఆమె స్కూటర్ వెనుక కూర్చొని ప్రయాణించడం, సింగూర్‌లో టాటా నానో కర్మాగారం ఎదుట ధర్నాలు చేయడం అందరికీ గుర్తే. తీరా మమత పాలనలో ప్రతిపక్షాలు ఆ తరహా పోరాటాలు సాగించలేకపోతున్నాయి. బీజేపీలో సైతం నేతల మధ్య సమన్వయం కొరవడింది. దాంతో, ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరికొద్ది రోజులే ఉన్నందున అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు మార్చి తొలివారంలో ఒకటికి మూడుసార్లు బెంగాల్లో పర్య టించనున్నారు. రాజకీయాలు, హింసాకాండ జంటపదాలైన బెంగాల్ దేశంలోని అతి సున్నితమైన ప్రాంతాల్లో ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరకు కాశ్మీర్ కన్నా ఎక్కువగా 920 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్లో దింపనున్నట్టు ప్రకటించింది. సభ్యసమాజం సిగ్గుపడేలా సాగుతున్న లైంగిక అత్యాచారాలపై పార్టీలకు అతీతంగా నేతలందరూ గళం విప్పాల్సింది. తృణమూల్ మొదట అసలు అలాంటిదేమీ లేనే లేదని కొట్టిపారేసింది. ఆనక ఇదంతా తమను అప్రతిష్ఠ పాల్జేసేందుకు కాషాయదళ స్కెచ్ అనీ, ఇప్పుడేమో నిందితుల్ని శిక్షిస్తామనీ పిల్లిమొగ్గలు వేసింది. ప్రతిపక్షాలేమో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని ఎలా వాడుకోగలమనే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇంత సాగుతున్నా, సందేశ్‌ఖలీ ఘటనల్ని సీఎం మమత గట్టిగా ఖండించిన పాపాన పోలేదు. కనీసం పోలీసులు అసలు నిందితుణ్ణి అరెస్ట్ చేసిందీ లేదు. ఇది శోచనీయం. ఓ మహిళ పాలిస్తున్న రాష్ట్రంలో, శాంతిభద్రతల పరిరక్షించాల్సిన హోమ్ శాఖ ఆమె చేతిలో ఉండగా ఇదీ స్త్రీల పరిస్థితి కావడం మరింత సిగ్గుచేటు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రభుత్వం తక్షణం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతుడిదే రాజ్యంగా మారిన పరిస్థితుల్ని మార్చి, కబ్జాకు గురైన భూముల్ని అసలు యజమానులకు అప్పగించాలి. అప్పుడే న్యాయం గెలుస్తుంది. ప్రభుత్వంపై, ప్రజాస్వామ్యంపై జనంలో నమ్మకం నిలుస్తుంది. -
కాంగ్రెస్‌కు రిలీఫ్.. సీఎం మమత కీలక నిర్ణయం!
ఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా బెంగాల్లో సీట్ల సర్ధుబాటు అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్‌తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో దాదాపు ఆరు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియ కూటమికి బూస్ట్ లభించింది. ఇండియా కూటమిలో సీట్ల విషయంలో మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, గతంలో పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ ఇప్పుడు బెంగాల్, మేఘాలయలో కూడా కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య తుది చర్చలు జరిగే అవకాశం ఉంది. Is it a better deal ?? In Bengal, a deal with TMC... Mamata Banerjee is willing to give Congress 5 seats. Initially, TMC had offered only 2 seats.#INDIAAlliance pic.twitter.com/N2phFmAd8n — Sunil Lamba (@Post4India) February 22, 2024 ఇక, రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే బెంగాల్లో ఆరు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బెంగాల్‌లోని బెహ్రంపూర్, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయిగంజ్, డార్జిలింగ్, పురిలియా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇందుకు మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి ప్రతిగా మేఘాలయ, అస్సాంలలో ఒక్కో సీటును టీఎంసీ కోరుతోందని సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అధికారికంగా సీట్ల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యూపీలో కాంగ్రెస్.. అమేథీ, రాయ్‌బరేలీ సహా 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అఖిలేష్ ఒప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అఖిలేష్‌కు ఎంపీ సీటు ఇచ్చింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్ సీట్లు ఒప్పందం కుదుర్చుకుంది. -
ఆధార్‌ను తొలగిస్తున్న కేంద్రం: మమత
సూరి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధార్ కార్డుతో పనిలేకుండానే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బిర్భూమ్ జిల్లా సూరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ‘జాగ్రత్తంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌లోని చాలా జిల్లాల్లో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉచిత రేషన్, లక్షీభండార్ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేసేందుకు ఇలాంటి చర్యలకు దిగుతోంది. ఆధార్ లేదనే కారణంతో పథకాలను ప్రజలకు అందకుండా నిలిపివేయవద్దని అధికారులను ఆదేశించాను. బెంగాల్ ప్రజలు భయపడొద్దు. మీకు అండగా నేనున్నాను’ అన్నారు. ఆధార్ కార్డుల తొలగింపు వెనుక కుట్ర ఉందని తెలిస్తే ఒక్క కూడా దాన్ని లింక్ చేయడానికి అనుమతించబోనన్నారు. ఆధార్ కార్డులు తొలగించిన వారి వివరాలతో పోర్టల్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని కారణంగా బ్యాంకులు లావాదేవీలను నిరాకరించినట్లయితే సహకార బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సేవలను వాడుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు. -
కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం: మమత
కోల్‌కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశి్చమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్‌కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు. ‘‘ ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కారి్మకుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు. ధర్నా వద్దే మమత రాత్రి బస ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మారి్నంగ్‌వాక్‌కు వెళ్లారు. -
ఎన్నికల్లో గెలవాలనే అందర్నీ జైలుకు పంపుతోంది: మమత
కోల్‌కతా: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ జైళ్లకు పంపుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక వేళ తనను జైలుకు పంపినా బయటకు రాగలనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు తమ టీఎంసీ పార్టీ ఆసక్తి చూపినా ఆ పార్టీ తిరస్కరించిందన్నారు. కాగా మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆధీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఐక్యంగానే పోరాడతాం: రాహుల్
కూచ్ బెహార్(పశ్చిమ బెంగాల్): దేశవ్యాప్తంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి ఐక్యమత్యంగానే దేశవ్యాప్తంగా అన్యాయంపై పోరాటం కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించిన వేళ రాహుల్ కూటమి ఐక్యతపై మరోసారి స్పష్టతనివ్వడం గమనార్హం. అస్సాంలో గువాహటి నగరంలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం, కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల ఘర్షణల నడుమ అస్సాంలో ఉద్రిక్తంగా కొనసాగిన యాత్ర గురువారం పశ్చిమబెంగాల్‌లోకి అడుగుపెట్టింది. బక్షీర్హాట్ గుండా రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాలో రాహుల్ యాత్రను మొదలుపెట్టి అక్కడ మద్దతు దారులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో అన్యాయం రాజ్యమేలు తున్నందుకే యాత్రకు న్యాయ్ అనే పదం జతచేశాం’’ అని అన్నారు. మరోవైపు బెంగాల్లో యాత్రలో సీపీఎం, వామపక్ష పార్టీలు పాలుపంచుకునే అవకాశం ఉంది. బస్సులో ఉన్నది రాహుల్ కాదేమో: అస్సాం సీఎం హిమంత అస్సాంలో న్యాయ్ యాత్ర సందర్భంగా బస్సు లోపలి వైపు రాహుల్ సేదతీరుతూ ముందువైపు డూప్‌ను కూర్చోబెట్టి యాత్ర చుట్టేస్తు న్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ‘‘అస్సాంలో న్యాయ్ యాత్ర ప్రభావం శూన్యం. యాత్ర కొనసాగిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధిస్తుంది. రాహుల్ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీనే గెలుస్తుంది. ఆ కోణంలో చూస్తే బీజేపీకి రాహుల్ అవసరం ఎంతైనా ఉంది’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. కొన్ని చోట్ల రాహుల్ అస్సలు బస్సు దిగట్లేరని, బస్సులో ముందువైపు కనిపించేది రాహుల్ కాదని కొన్ని మీడియాకథనాలు వచ్చాయన్నారు. -
అనైక్యతా కూటమి
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్’ నేత – పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్ ఇచ్చారు. బెంగాల్లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్ నెగ్గిన 2 లోక్‌సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం అయిన నితీశ్ కుమార్ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్ రామ్ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్‌లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్ గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్‌లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్‌కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్‌లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్ ఇమేజ్ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్ నుంచి ముంబయ్ దాకా 100 లోక్‌సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు? మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. -
బెంగాల్లోకి అడుగుపెట్టిన రాహుల్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోకి రాహుల్ అడుగుపెట్టారు. వయనాడ్ ఎంపీకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో తాము ఒంటరిగా పోటి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు విఫలమయ్యాయని, దీంతో ఆ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని ఆమె స్పష్టం చేశారు. అంతేగాక రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి(పశ్చిమ బెంగాల్) వస్తున్న సమయంలో దీనిపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో పోటీ సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య విభేదాలు నెలకొన్న వేళ రాహుల్ యాత్ర ఎలా సాగబోతుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో యాత్ర ప్రారంభమైన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడుతుందని తెలిపారు. చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ దేశంలో అన్యాయం రాజ్యమేలుతోందని అందుకే తమ యాత్రకు ‘న్యాయ’ అనే పదాన్ని చేర్చినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల మాటలు వినడానికి, వారికి అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలు పెంపొందిస్తుందని మండిపడ్డారు. హింస, అన్యాయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. అందుకే ఇండియా కూటమి సమిష్టిగా అన్యాయంపై పోరాడబోతోందని తెలిపారు. జనవరి 14న ప్రారంభించిన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర గురువారం 12వ రోజుకు చేరుకుంది. మణిపూర్, నాగాలాండ్, మేఘాలయా, అస్సాం రాష్ట్రంలో ఇప్పటి వరకు పర్యటించారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర తీవ్ర ఉద్రిక్తల నడుమ సాగుతోంది. మార్చి 20న ముంబైలో రాహుల్ యాత్రం ముగియనుంది. మొత్తం 15 రాష్ట్రాల గుండా 6,200 కి.మీ పర్యటించనున్నారు. -
పెళ్లికి ముందే విడాకులు: బీజేపీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమని టీఎంసీ చీఫ్, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమిపై బీజేపీ విరుచుకుపడింది. మమత ప్రకటనను విపక్ష ఇండియా కూటమికి చావుదెబ్బగా అభివర్ణించింది. ‘‘విపక్షాలది కేవలం కాగితపు కూట మేనని మరోసారి రుజువైంది. వాటి రాజకీయ వివాహం పూర్తిగా జరగక ముందే విడాకుల దాకా వెళ్లింది’’ అంటూ ఎద్దేవా చేసింది. మమత ప్రకటన ఆమెలో నిరాశా నిస్పృహలకు కూడా అద్దం పట్టిందని పేర్కొంది. విపక్ష కూటమి రాజకీయంగా మనగలిగే పరిస్ధితి లేదని, కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ మధ్య విభేదాలతో కూటమి అతుకుల బొంతగా తయారైందని ఎద్దేవా చేసింది.ఇది అసహజ కూటమిగా మారింది..బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎం మమతా బెనర్జీతో విభేదిస్తున్నాయని బెంగాల్ బీజేపీ చీఫ్ సుంకత మజుందార్ ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల అగ్రనేతల మధ్య సామరస్య వాతావరణం ఉన్నా క్షేత్రస్దాయిలో పరిస్ధితి వేరేగా ఉందని అన్నారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించించిన విషయం తెలిసిందేజ పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. చదవండి: Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
రోడ్డు ప్రమాదంలో దీదీ తలకు గాయం
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా మమతా బెనర్జీ కారులో బర్ధమాన్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ఎదురుగా అకస్మాత్తుగా మరో కారు వచ్చింది. దీంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. దీదీ తలకు స్వల్ప గాయాలు కాగా.. ఆమెను కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
మమతా లేని ఇండియా కూటమిని ఊహించలేము: కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయంపై ప్రతిపక్ష ఇండియా కూటమి అయోమయ స్థితిలో పడేసింది. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్న మమతా ప్రకటనతో కూటమిలోని పార్టీలో టెన్షన్ మొదలైంది. దిది నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని అన్నారు, ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమికి టీఎంసీ బలమైన పిల్లర్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీతో సీట్ల పంపకాల చర్చలు ఫలప్రదంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ అన్నారు. ఓడించేందుకు మేము ఏమైనా చేస్తాం. మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ భారత కూటమికి బలమైన మూల స్తంభాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. దిది లేని భారత కూటమిని మనం ఊహించలేం. ఈ కూటమి పశ్చిమ బెంగాల్లో కూటమిలా పోరాడుతుంది. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగమయ్యేందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలాసార్లు కోరారు’ అని తెలిపారు. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయన్న జైరాం రమేష్.. పశ్చిమ బెంగాల్లో భారత కూటమి ఏకమై ఎన్నికల్లో పోటీ చేస్తుందని, దానిపై తమకు పూర్తి విశ్వాసముంది. బీజేపీని ఓడించేందుకు తాము ఏ అవకాశాన్ని వదలదని ఆయన అన్నారు. అదే ఆలోచనతో ప్రస్తుతం అస్సాంలో ఉన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుందని అన్నారు. -
కాంగ్రెస్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్
-
ఇండియా కూటమికి దీదీ షాక్
కోల్‌కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బుధవారం సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అంతేగాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఉద్ధేశిస్తూ ‘ వారు రాష్ట్రానికి వస్తున్నారు. కనీసం దీనిపై మాకు సమాచారం ఇచ్చే మర్యాద వారికి లేదు’అని మండిపడ్డారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఖర్గే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగమే. ప్రస్తుతం ఎన్నికల కోసం కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతా తాజాగా ప్రకటన చేయడం అధికార బీజేపీని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అయితే మమతా బెనర్జీ అవకాశవాది అంటూ, ఆమె సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ సీఎంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే మమతా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు! -
‘పశ్చిమ బెంగాల్’ పేరు మార్చండి: సీఎం మమతా డిమాండ్
తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే లేని తప్పు.. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మారిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు కల్కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతా మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చామని, అయినా చాలా కాలంగా రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చలేదని మండిపడ్డారు. బొంబాయి, ఒరిస్సా పేర్లను మార్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్ పేరు మార్చడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దాంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర పేరును పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలకు మమతా వివరించారు. రాష్ట్ర విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని(ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో W, X, Y, Z), దీని వల్ల బంగ్లా ప్రాముఖ్యత తగ్గుతోందన్నారు. రాష్ట్రం పేరులో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మార్చడం వల్ల నష్టం ఏం లేదని తెలుపుతూ ఓ ఉదాహణ చెప్పారు. ‘ పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది. భారత్‌లోనూ పంజాబ్ పేరుతో రాష్ట్రం ఉంది. ఇందులో ఏ సమస్యల ఏదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ పేరుతో ఓ దేశం ఉంటే.. పశ్చిమ బెంగాల్ బంగ్లాగా ఎందుకు మారకదు’ అని తెలిపారు. -
రాయని డైరీ.. అధీర్ రంజన్
‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో. ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. ఆయన వైపు దిగాలుగా చూశాను. ‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్ ఖాన్ సాబ్ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో! ‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. ఖాన్ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. వచ్చే ఎన్నికల సీట్ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్ ఎంపీలం. ‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్ షేరింగ్ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్ మెట్లెక్కి పైకి వెళ్లగానే. వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! ‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. ఖర్గేజీ నవ్వుతూ చూశారు. ‘‘ఈ రెండు సీట్ల షేరింగ్ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. ‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్ సాబ్! ‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. ‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న తృణమూల్ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే... కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్ సాబ్. ఖర్గేజీ నవ్వలేదు! ‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! ‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. ‘‘బిలేటెడ్గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!! -మాధవ్.. శింగరాజు -
అధికార పార్టీ మాటలు అసలు నమ్మొద్దు కామ్రేడ్!
అధికార పార్టీ మాటలు అసలు నమ్మొద్దు కామ్రేడ్! -
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కీలక భేటీ
ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి మీటింగ్‌కు గంటల ముందు ఈ సమావేశం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. డిసెంబర్ 19 (మంగళవారం)న న్యూఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమి మొదటిసారి సమావేశం కానుంది. డిసెంబర్ 20న బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ భేటీ కానున్నారు. కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్‌కు పెండింగ్‌లో ఉన్న నిధుల అంశంపై ఆమె చర్చించనున్నారు. ఇండియా కూటమి భేటీ మొదట డిసెంబర్ 6న నిర్ణయించారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా కీలక నేతలు గౌర్హాజరు కారణంగా డిసెంబర్ 17కు వాయిదా వేశారు. డిసెంబర్ 17న కూడా వివిధ కారణాలతో మరోమారు ఇండియా కూటమి భేటీ వాయిదా పడింది. డిసెంబర్ 19న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కావునా రేపు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు. ఇదీ చదవండి: Delhi Liquor Scam Case: కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు -
ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు.. సల్మాన్ నా ఫేవరెట్: గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు స్వాగతం పలికాడు. సల్మాన్ తన అభిమాన నటుడన్న దాదా.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయనను కలవలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఏదేమైనా కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా సల్లూ భయ్యాను కలుసుకోవడం సంతోషంగా ఉందని గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా కోల్‌కతా వేదికగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మంగళవారం తెరలేచింది. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా కోల్‌కతాకు విచ్చేసిన బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేశ్ భట్, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా తదితరులకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో వేదికపైకి వచ్చిన సౌరవ్ గంగూలీ సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా అభిమాన నటుడు మిస్టర్ సల్మాన్ ఖాన్‌కు కోల్‌కతా తరఫున స్వాగతం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవడం ఇదే తొలిసారి. LATEST: #SouravGanguly on #Salmankhan Salman is Huge Name in Indian Cinema And famous in other countries also Legendary Megastar@BeingSalmanKhan | #Tiger3 pic.twitter.com/LROpHCWN1Q — FIGHTя (@SalmanzFighter_) December 5, 2023 ఇన్నేళ్లుగా మిమ్మల్ని ఒక్కసారి కూడా ప్రతక్ష్యంగా కలుసుకోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే నిజంగా ఇది దురదృష్టకరమే. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్లతో పాటు సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బెంగాల్ తరఫున టీమిండియాకు ఆడిన సౌరవ్ గంగూలీ దూకుడైన కెప్టెన్‌గా పేరొందిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్కు చూపించాడీ బెంగాలీ బ్యాటర్. #WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee, Film Director Mahesh Bhatt, former Indian cricketer Sourav Ganguly, actors Salman Khan, Anil Kapoor and Sonakshi Sinha shake a leg at the Kolkata International Film Festival (KIFF). (Source: KIFF Social Media) pic.twitter.com/EHOKtK9g3B — ANI (@ANI) December 5, 2023 చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! Latest - Former president of BCCI #Souravganguly about Megastar #Salmankhan. ' Our very favourite my favourite, Salman Khan welcome to Kolkata, we have never met before. But I'm his huge fan ' 🙌❤️pic.twitter.com/12FENf5TTa — YOGESH (@i_yogesh22bakup) December 5, 2023 -
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు
ముడుపులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ. కృష్ణానగర్ (నాడియా నార్త్) పార్టీ జిల్లా అధ్యక్షురాలి నియమించింది. ఈరోజు బెంగాల్లో అధికార పార్టీ ప్రకటించిన 15 మంది కొత్త జిల్లాల చీఫ్‌లలో మోయిత్రా కూడా ఒకరు. లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసిన తరువాత జరిగిన ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై టీఎంసీ ఎంపీ మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. తన నియామకంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానగర్ ప్రజల కోసం తాను ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ ట్వీట్ చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని ఆశ్రయించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై ఏర్పాటైన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను బహిష్కరించాలని సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీల నివేదికను రూపొందించింది. అయితే ఇది విడుదలకు ముందే మీడియాకు లీక్ అయింది. ఇది ఇలా ఉంటే ఎథిక్స్ ఆరోపణలను మొయిత్రా తోసిపుచ్చారు. బీజేపీ సర్కార్‌కు గట్టిగా ఎదురు నిలబడిన కారణంగానే తనను టార్గెట్‌ని చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. Thank you @MamataOfficial and @AITCofficial for appointing me District President of Krishnanagar (Nadia North) . Will always work with the party for the people of Krishnanagar. — Mahua Moitra (@MahuaMoitra) November 13, 2023 -
ఈ టైంలో యూరప్ ట్రిప్పు అవసరమా?.. దీదీపై ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్‌సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు. అర్ధం చేసుకోలేరా? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. విలాసాలకు డబ్బెక్కడిది? ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్‌లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. మామూలు రైలే.. ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్‌కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్‌కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. దృష్టి మళ్లించడానికే.. ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు. #WATCH | Murshidabad, West Bengal: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "PM Modi's government keeps on making excuses before elections... Be on the Women's Reservation Bill or the One Nation, One Election... To do anything, it is necessary to come to… pic.twitter.com/LSi9Ehi1Ew — ANI (@ANI) September 24, 2023 ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు పక్కా -
సంగీత మమకారం
క్షణం తీరిక లేని పనుల్లో అభిరుచులు చిన్నబోతుంటాయి. ఎందుకంటే సమయాభావం వల్ల వాటి జోలికి వెళ్లం. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిరుచుల విషయంలో రాజీ పడదు. సమయం చేసుకొని, చూసుకొని వాటికి న్యాయం చేస్తుంది. దీదీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రసంగించే వక్త మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. చక్కగా ఆడుతుంది. కవిత్వం రాస్తుంది. పాటలు పాడుతుంది. బొమ్మలు గీస్తుంది. ఆమె మానసిక బలానికి ఈ సృజనాత్మక శక్తులే కారణం కావచ్చు. అధికార పర్యటనలో భాగంగా ఇటీవల స్పెయిన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ, ఒకవైపు సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు తనలోని ఆర్టిస్ట్‌ను అధికారులకు పరిచయం చేసింది. పియానోపై రవీంద్రుడి సంగీతాన్ని వినిపించింది. అంతకుముందు మాడ్రీడ్ వీధుల్లో అకార్డియన్పై ‘హమ్ హోంగే’ గీతాన్ని ప్లే చేసింది. ఈ వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
Video: చీరకట్టు, స్మార్ట్ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్‌కు వెళ్లారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా అక్కడ ఆమె జాగింగ్ చేస్తూ కనిపించారు. చీర కట్టులో.. స్మార్ట్ వాచ్ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మరీ.. మాడ్రిడ్ పార్క్‌లో మమతా బెనర్జీ జాగింగ్ చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘మార్నింగ్ రిఫ్రెష్. ఉదయమే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శక్తి వస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’ అంటూ ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు. కాగా సాధారణంగా ప్రతి రోజూ ట్రెడ్‌మిల్‌పై జాగ్ చేస్తుంటారు. గతంలోనూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ.. వివిధ సందర్భాల్లో చెప్పుకొస్తూ ఉంటారు. ఓసారి ఆమె డార్జిలింగ్ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 12 రోజుల పాటు దుబాయ్, స్పెయిన్ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. లా లిగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటి. చదవండి: జోరు వానలో ల్యాండింగ్.. ముంబైలో విమాన ప్రమాదం View this post on Instagram A post shared by Mamata Banerjee (@mamataofficial) View this post on Instagram A post shared by Mamata Banerjee (@mamataofficial) -
భారత్‌కు నాయకత్వం వహిస్తే బెటర్ మేడం!
ఇండియా కూటమి ద్వారా భారత్‌కు నాయకత్వం వహిస్తే బెటర్ మేడం! -
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ స్పందించినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జాతీయ స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది. తనకు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్ బాదల్ కూడా లాబీయింగ్ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు. పట్టించుకోని జాతీయ పార్టీలు వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్రబాబుకు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబుకు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. -
మమతా బెనర్జీపై కాంగ్రెస్ అసంతృప్తి
ఢిల్లీ: జీ20 డిన్నర్ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరవడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం మమత తీసుకున్న నిర్ణయాన్ని ఈ చర్య బలహీనపరుస్తుందని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరవడం వెనక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. 'డిన్నర్ మీటింగ్‌కు సీఎం మమతా బెనర్జీ హాజరవకపోతే ఆకాశం విరిగిపడేదా..? డిన్నర్ మీటింగ్‌లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కనే కూర్చున్నారు. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిన్నర్ మీటింగ్‌కు రాలేదు. మల్లిఖార్జున ఖర్గేకు ఆహ్వానమే అందలేదు. ఢిల్లీకి మమతా బెనర్జీ ముందే వెళ్లాల్సిన అవసరం ఏంటి..?' అని అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలను టీఎంసీ నేత శాంతను సేన్ తిప్పికొట్టారు. సీఎం మమత ఎక్కడకు వెళ్లాలో కాంగ్రెస్ తమకు పాఠాలు చెప్పకూడదని అన్నారు. ప్రొటోకాల్స్ గురించి తమకు తెలుసని చెప్పారు. ఇండియా కూటమిలో సీఎం మమత పాత్ర ఎంటో తమకు తెలుసని అన్నారు. దీనిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. డిన్నర్ మీటింగ్ శనివారం ఉండగా.. మమతా బెనర్జీ శుక్రవారమే ఢిల్లీ వెళ్లారు. మొదట శనివారమే విమానం షెడ్యూల్ ఖరారు కాగా.. ఢిల్లీలో విమాన రాకపోకలపై నిబంధనల నేపథ్యంలో మమతా బెనర్జీ ఫ్లైట్‌ను శుక్రవారానికి మార్చారు. దీంతో ఆమె శుక్రవారమే ఢిల్లీకి వెళ్లారు. డిన్నర్ మీటింగ్‌కి ముందే వెళ్లాల్సిన అవసమేం వచ్చిందని కాంగ్రెస్ మండిపడుతోంది. శనివారం జరిగిన జీ20 డిన్నర్ మీటింగ్‌కి హాజరైన వాళ్లలో బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హెమంత్ సొరేన్, మమతా బెనర్జీ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అశోక్ గహ్లోత్, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మీటింగ్‌కి హాజరవలేదు. ఇదీ చదవండి: కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ.. -
ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే..
ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మన దేశం పేరు ‘భారత్’ లేక ‘ఇండియా’ అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండియా పేరు మార్పుపై ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ‘భారత్’ పేరును సమర్ధిస్తుంటే.. ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కేంద్రలోని బీజేపీపేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఇండియా పేరు మార్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జీ 20 సదస్సు కోసం ప్రెసిడెంట్ డిన్నర్ ఆహ్వాన పత్రికపై భారత్ అని ముద్రించారు. ఇందులో కొత్త ఏముంది. మనం తరుచుగా భారత్ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటాం. భారత రాజ్యంగం లేదా భారత్ కా సంవిధాన్ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ప్రపంచానికి దేశం పేరు ఇండియాగానే తెలుసు. ఇంత అత్యవసరంగా దేశం పేరు మార్చాలని అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. సంబంధిత వార్త: ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్పు దిశగా కేంద్రం West Bengal CM @MamataOfficial reacts on ‘Bharat’ replacing ‘India’. “I heard they are now changing the name of #India. The President’s dinner invite for #G20 mentions #Bharat. What is new here? We always use Bharat. We say India’s constitution or Bharat ka Sanvidhan.… pic.twitter.com/Pq3Z3ZBvbJ — Mahua Moitra Fans (@MahuaMoitraFans) September 5, 2023 కాంగ్రెస్ నేత జయరామ్ రమేశ్ స్పందింస్తూ.. ఈ పరిణామం వెనుక కొంతైనా నిజం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది" అని ఆయన ఆరోపించారు. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జైరామ్ రమేశ్ విమర్శించారు. ఇది భారతదేశం. రాష్ట్రాల యూనియన్. ఇండియా పార్టీల లక్ష్యం కూడా( Bharat- Bring Harmony, Amity, Reconciliation And Trust) సామరస్యం, స్నేహం, సయోధ్య , నమ్మకాన్ని తీసుకురావడమే. జూడేగా భారత్.. జీతేగా ఇండియా! అని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. I have always believed a name should be one which instills pride in us. We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చాన్ దేశం పేరు మార్పును సమర్ధించారు. ఈ మేరకు ‘ భారత్ మాతాకీ జై’ అంటూ ట్వీట్ చేశారు. ఇండియాను భారత్‌గా మార్చాడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. జెర్సీపై కూడా భారత్ అని ముంద్రించాలని కోరారు. T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩 — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023 కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో మనదేశం పేరు మారనుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం యోచిస్తోంది. దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు.. ఆహ్వాన పత్రాల్లోప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా కేంద్రం ముద్రించింది. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. కాగా ఇండియా పేరును మార్చాలని కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశం పేరును ఇండియానుంచి భారత్‌గా మార్చాలని తక్షణమే భారత రాజ్యాంగంల నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించేవారని,.. ‘భారత్’ అనే పదం మన దేశ సంస్కృతికి ప్రతీక అని వాదిస్తున్నారు. అంతేగాక దేశం పేరును ఇండియా అని కూకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. అదే విధంగా ఇటీవల ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. అతడొక జూనియర్
కోల్‌కతా: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీ విభేదిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. వివాదం జరిగిన ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ స్పందిస్తూ ఏమన్నారంటే.. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నా దృష్టిలో ఉదయనిధి స్టాలిన్ చాలా జూనియర్. ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారన్నది నాకు తెలియదు. అన్ని మతాలను గౌరవించాలన్నది నా అభిప్రాయం. నాకు తమిళనాడు ప్రజలంటే అమితమైన గౌరవం. కానీ వారు అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కోరుతున్నాను. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. నాకు సనాతన ధర్మం మీద అపార గౌరవముంది. వేదాల నుంచే మనం అన్నీ నేర్చుకున్నాము. పౌరోహిత్యాన్ని గౌరవించుకుంటాము.. పౌరోహిత్యం చేస్తున్న వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నాము. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మనమంతా దేవాలయాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు కూడా వెళ్తుంటాం. భారతదేశ మూలాల నుంచి గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ అనాదిగా కొనసాగుతూ వస్తోంది. దాన్ని మనం గౌరవించాలని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం పరిణామ క్రమంలో వృద్ధి చెందుతున్న 'ఇండియా' కూటమిపైన పడే అవకాశమున్నందున ఇప్పటికే ఈ కూటమిలోని పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్తాయి. కాంగ్రెస్ పార్టీ తమకు అన్ని మతాలపైనా గౌరవముందని ప్రకటించగా.. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించింది. తాజాగా మమతా బెనర్జీ కూడా ఈ జాబితాలో చెరిపియారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా? -
కలిసే పోటీ చేద్దాం.. విపక్ష కూటమి తీర్మానం
ముంబై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేయాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు తీర్మానించారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలని, రాష్ట్రాల స్థాయిలో సీట్ల పంపకం ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చారు. ముంబైలో ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం శుక్రవారం ముగిసింది. ముందస్తు ఎన్నికలు, ఒకే దేశం–ఒకే ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని తీర్మానాలు చేశారు. కూటమికి సంబంధించిన కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంపాటు సీట్ల పంపకంపై చర్చించడానికి 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేద్దామంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ‘జుడేగా భారత్, జీతేగా భారత్’ అనే థీమ్‌తో వివిధ భాషల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం ఆమోదించారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ‘ఇస్రో’ను ప్రశంసిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. అయితే, ఈ సమావేశంలో కూటమి కన్వినర్ ఎంపికపై దృష్టి పెట్టలేదు. ఈ నెల 30 నాటికి సీట్ల పంపకం పూర్తి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తోపాటు వివిధ పారీ్టల ముఖ్య నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీతారాం ఏచూరి, డి.రాజా, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్, కపిల్ సిబల్, జయంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ సెపె్టంబర్ 30 నాటికి పూర్తవుతుందని ఇండియా కూటమి వర్గాలు వెల్లడించాయి. మోదీ సర్కారు ఓటమి తథ్యం: ఖర్గే నియంతృత్వ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు సాగించినా వచ్చే ఎన్నికల్లో పరాజయం తథ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల పేరిట దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ప్రజలను ఎవరూ మోసం చేయలేరని స్పష్టం చేశారు. అంతకముందు విపక్ష ఇండియా కూటమి సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ప్రతిపక్ష కూటమి బలాన్ని చూసి మోదీ ప్రభుత్వం బెంబేలెత్తిపోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై మరింత ఉధృతంగా విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉందని, దాడులు, అరెస్టులు జరగబోతున్నాయని, కక్ష సాధింపు రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. విశ్వసనీయ ప్రత్యామ్నాయం: పవార్ బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇండియా కూటమి రూపంలో ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇండియా కూటమి సమావేశానికి 28 పారీ్టలకు చెందిన 86 మంది నేతలు హాజరయ్యారని తెలిపారు. ‘ముందస్తు’కు సిద్ధంగా ఉండాలి: నితీశ్ లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, అందుకు ఇండియా కూటమి సిద్ధంగా ఉండాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించారు. 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం: రాహుల్ దేశంలో 60 శాతం జనాభాకు ‘ఇండియా’ కూటమిలోని పారీ్టలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఈ పారీ్టలన్నీ కలిసికట్టుగా ఉంటే బీజేపీని సులభంగా ఓడించవచ్చని అన్నారు. కన్వినర్ అవసరం లేదు: ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్ష ఇండియా కూటమికి కన్వినర్ అవసరం లేదని శివసేన(ఉద్ధవ్) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. కూటమి లోగోపై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నామని వివరించారు. మాకు పబ్లిసిటీ ఆఫీసర్ మోదీ: స్టాలిన్ బీజేపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. మోదీ సర్కారును ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని చెప్పారు. తమ కూటమికి ప్రధాని మోదీ ‘పబ్లిసిటీ ఆఫీసర్’గా మారారని పేర్కొన్నారు. సమన్వయ కమిటీలో ఎవరెవరు? 14 మందితో కూడిన సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ఇండియా కూటమి ఖరారు చేసింది. వివిధ పారీ్టల నాయకులతో ఇందులో భాగస్వామ్యం కలి్పంచారు. కె.సి.వేణుగోపాల్(కాంగ్రెస్), శరద్ పవార్(ఎన్సీపీ), టీఆర్ బాలు(డీఎంకే), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అభిõÙక్ బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), సంజయ్ రౌత్(శివసేన), హేమంత్ సోరెన్(జేఎంఎం), రాఘవ్ చద్ధా(ఆమ్ ఆద్మీ పారీ్ట), జావెద్ అలీఖాన్(సమాజ్‌వాదీ పారీ్ట), లాలన్ సింగ్(జేడీ–యూ), డి.రాజా(సీపీఐ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబ్ ముఫ్తీ(పీడీపీ) ఇండియా కూటమి సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. తమ పార్టీ తరఫు సభ్యుడి పేరును తర్వాత వెల్లడిస్తామని సీపీఎం ప్రకటించింది. ఇది కూడా చదవండి: Jamili Elections: 'జమిలి'పై కమిటీ -
మీ ప్రధాని అభ్యర్థి లొల్లే మిమ్మల్ని ఓడిస్తుందంటున్నార్సార్!
మీ ప్రధాని అభ్యర్థి లొల్లే మిమ్మల్ని ఓడిస్తుందంటున్నార్సార్! -
అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ..
ముంబయి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ని కలిశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు నుంచి ముంబయిలోని జుహులో ఉన్న అమితాబ్ ఇంటికి వెళ్లారు. అనంతరం బిగ్‌బీకి దీదీ రాఖీ కట్టారు. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న 'ఇండియా' కూటమి భేటీకి హాజరయ్యేందుకు ముంబయికి చేరుకున్నారు. Today, Hon'ble CM Smt @MamataOfficial met Mr. @SrBachchan and Mrs. Jaya Bachchan along with their family at their residence in Mumbai. She wholeheartedly thanked them for their precious time and wished them luck in all their future endeavours. Few glimpses from the visit 👇 pic.twitter.com/MxgcoKi95B — All India Trinamool Congress (@AITCofficial) August 30, 2023 అమితాబ్‌ను కలిసి అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఆయన్ని విందుకు ఆహ్వానించినట్లు చెప్పారు. అమితాబ్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన దీదీ.. బెంగాల్లో జరగనున్న దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఆహ్వానించినట్లు తెలిపారు. గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అమితాబ్ హాజరైన వేళ.. సినీ రంగంలో అందించిన సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం.. -
ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..!
ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..! -
లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్‌కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. -
బీజేపీ భారత్ వీడిపో
కోల్‌కతా: మణిపూర్ హింసాకాండ కారకులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, పీఎం కేర్ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల్ని క్విట్ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి దుండగుడు చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన కారులో సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడు. పోలీస్ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో వచ్చిన ఆ వ్యక్తిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది. మమత ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. నిందితుడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు, గంజాయి కూడా దొరికాయని వెల్లడించారు. బీఎస్ఎఫ్ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు అతని వద్ద లభ్యమయ్యాయని సీపీ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడి అసలు ఉద్దేశం కనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్‌గా మారిన బెంగళూరు ఏసీపీ! -
బెంగళూరులో ఇండియా 'కలిసి ఓడిస్తాం'!
బెంగళూరు: 26 విపక్ష పార్టీలు సమైక్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల సమరనాదం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) పేరుతో కొత్త కూటమిగా ఆవిర్భవించాయి. సమైక్యతా ప్రయత్నాల్లో భాగంగా సోమవారం బెంగళూరులో మొదలైన విపక్షాల రెండు రోజుల భేటీ మంగళవారం సాయంత్రం ముగిసింది. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు పలు అంశాలపై నాలుగు గంటల పాటు కూలంకషంగా చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాందీ, రాహుల్‌గాందీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కర్టీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితర దిగ్గజాలంతా భేటీలో పాల్గొన్నారు. విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం చేశారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముంబై భేటీలో కీలక నిర్ణయాలు: ఖర్గే ముంబైలో జరగబోయే విపక్షాల తర్వాతి భేటీలో కమిటీ కన్వీనర్ ఎంపికతో పాటు పలు ఇతర కీలక నిర్ణయాలుంటాయని ఖర్గే తెలిపారు. కూటమికి ఇండియాగా నామకరణం చేసినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడి ఘనవిజయం సాధించి తీరతామని ధీమా వెలిబుచ్చారు. విపక్షాలన్నా, తాజాగా పురుడు పోసుకున్న 26 విపక్షాల కూటమి అన్నా మోదీకి భయం పట్టుకుందని ఖర్గే ఎద్దేవా చేశారు. అయితే కూటమి సారథి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఖర్గే నేరుగా బదులివ్వలేదు. కాంగ్రెస్‌కు అధికారంపై గానీ, ప్రధాని పదవిపై గానీ ఆసక్తి లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అందుకే కూటమిలో పలు పక్షాల మధ్య భేదాభిప్రాయాలున్నా విస్తృత ప్రయోజనాల కోసం, దేశ శ్రేయస్సు కోసం వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చామని చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం ఖర్గే సహా విపక్షాల నేతలంతా సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సోమవారం భేటీలో పాల్గొనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. రాహుల్ మా ఫేవరెట్ దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండియా కూటమిని సవాలు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని మీడియాతో మాట్లాడుతూ మమత నిలదీశారు. ‘‘మా మాతృభూమి అంటే మాకు ప్రాణం. మేం దేశభక్తులం. మేం రైతులం, దళితులం. మేం మా దేశం కోసం, ప్రపంచం కోసం పాటుపడేవాళ్లం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న పని ఒక్కటే. ప్రభుత్వాలను కొనడం, అమ్మడం!’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘ఇండియా నెగ్గుతుంది. మన దేశం నెగ్గుతుంది. బీజేపీ ఓడుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘నేటి సంయుక్త డిక్లరేషన్ ద్వారా పాలక ఎన్డీఏ కూటమిపై మా విపక్ష కూటమి 420 సెక్షన్ విధిస్తోంది’’ అని ప్రకటించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 మోసానికి సంబంధించిన కేసులకు వర్తిస్తుంది. రాహుల్ గాంధీ తమ ఫేవరెట్ అంటూ దీదీ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నేతలందరినీ పలకరించే క్రమంలో ఆమె చేసిన ఈ కామెంట్ పలు రకాల చర్చలకు దారి తీసింది. ఎవరేమన్నారంటే... 1. ‘‘మేం మా కుటుంబాల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని కొందరంటున్నారు. కానీ వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేశమే మా కుటుంబం. ఆ కుటుంబం కోసమే మేం పోరాడుతున్నాం. మా పోరు ఒక వ్యక్తిపై కాదు. ఒక నియంతృత్వ పోకడపై. ఈ నియంతృత్వాన్ని చూసి దేశ ప్రజలు భయపడుతున్నారు. మై హూ నా (నేనున్నా) అని ఒక హిందీ సినిమా వచ్చింది. మేం కూడా హమ్ హై నా (మేమున్నాం) అని ప్రజలకు భరోసా ఇవ్వదలచాం’’ – మోదీపై ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ) విసుర్లు 2. ‘‘గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ఎంతో చూసే గొప్ప అవకాశం ప్రధాని మోదీకి దక్కింది. కానీ ఏ రంగంలోనూ ఏమాత్రమూ అభివృద్ధి జరగలేదు’’ అరవింద్ కేజ్రీవాల్ 3. 2024లో నూతన భారత ఆవిర్భావం ‘‘దేశంలో నియంతృత్వం సాగుతోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం సంక్షోభంలో పడ్డాయి. కానీ 2024లో సరికొత్త భారత్ ఆవిర్భవించడం ఖాయం. జూన్‌లో జరిగిన పట్నా భేటీలో 15 పార్టీలుగా ఉన్న విపక్ష కూటమి బలం బెంగళూరు భేటీ నాటికి 26 పార్టీలకు విస్తరించడం రాబోయే మార్పుకు ప్రబల సంకేతం. దేశాన్ని ఎవరు పాలించకూడదు అన్నదాని మీదే ప్రధానంగా మా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిపై దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చి తీరతాం’’ – తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ ‘ఇండియా’ కూటమిలోని 26 పార్టీలు... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ (శరద్ పవార్), సీపీఎం, సీపీఐ, శివసేన (యూబీటీ), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆరెల్డీ, ఎండీఎంకే, కేఎండీకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్ (లిబరేషన్), ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), అప్నాదళ్ (కమెరవాదీ), ఎంఎంకే లోక్‌సభలో బలాబలాలు ఎన్డీఏ కూటమి – 330పై చిలుకు ఎంపీలు 26 విపక్షల ‘ఇండియా’ కూటమి – 150 మంది ఎంపీలు (విపక్ష కూటమిలోని పార్టీలు ఢిల్లీలోనూ, మరో 10 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నాయి) దీదీ పెట్టిన పేరు! విపక్ష కూటమికి ఇండియా అన్న పేరు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాని పూర్తి పేరు ఎలా ఉంటే బాగుంటుందని నేతలంతా లోతుగా చర్చించినట్టు చెబుతున్నారు. -
..మనదో దారైతే వాళ్లదోదారి! ఈ దారులు కలిసేదెప్పుడో!!
..మనదో దారైతే వాళ్లదోదారి! ఈ దారులు కలిసేదెప్పుడో!! -
ఒక్కరోజు ఛాయ్ వాలా అయిన మమతా బెనర్జీ
-
చాయ్ వాలాగా మారిన సీఎం మమతా.. ఇదంతా అందుకోసమే!
కోల్‌కతా: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతుంటారు. ఇందుకోసం లీడర్లు చిత్రవిచిత్రాలు చేస్తుంటారు. రానున్న పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క ఉన్న ఓ హోటల్లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న వారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం మమతా ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్ నుండి జూలై 8 పంచాయతీ ఎన్నికల కోసం.. పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. కాషాయ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్ఎప్ భయపెడుతోందని, ఈ క్రమంలో వారి కార్యకలాపాలపై నిశితంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. వారి బెదిరిపులకు భయపడకుండా ఎన్నికలలో నిర్భయంగా పాల్గొనాలని ఆమె ప్రజలను పిలుపునిచ్చారు. మూడంచెల గ్రామీణ ఎన్నికలలో తృణమూల్ బీజేపీని ఓడిస్తుందని మమతా నొక్కి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి, దేశంలో అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు. జూలై 8న ఒకే దశలో ఎన్నికలు జరుగనుండగా, జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | West Bengal CM Mamata Banerjee makes tea and serves it to people at a tea stall in Jalpaiguri's Malbazar, as a part of her campaign for upcoming Panchayat polls pic.twitter.com/s2TiVIdyET — ANI (@ANI) June 26, 2023 చదవండి: 'సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం' ప్రముఖ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. -
'చరిత్రను రక్షిస్తాం..' ప్రతిపక్షాల భేటీ తర్వాత మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
పట్నా: ఐక్యంగా ఉన్నాం.. ఐక్యంగా పోరాడతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పట్నాలో ప్రతిపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ.. ఈ సమావేశం నుంచే కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చరిత్రను మారుస్తామని బీజేపీ చెబుతోంది.. కానీ దేశ చరిత్రను బిహార్ సమావేశం నుంచే కాపాడతామని మమత అన్నారు. జాత్యంహకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే తమ ప్రధాన ధ్యేయమని ఆమె చెప్పారు. 1974 తర్వాత ఇదే.. దేశంలో ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా 1974లో పట్నాలో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో మొదటిసారి ప్రతిపక్షాల భేటీ జరిగింది. ఇన్నాళ్ల తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అదే వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాలు సమావేశం ఏర్పరచడం గమనార్హం. ప్రజాస్వామ్యాన్ని చంపేశారు.. విధ్వంసం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలు భేటీ అయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) లీడర్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ వివరించిన ప్రజాస్వామ్యం కశ్మీర్లో ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. కశ్మీర్ నుంచి తాను, మెహబూబా ముఫ్తీ హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జులైలో మరోసారి.. నేడు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరోసారి భేటీ కానున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన అజెండాను చర్చిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం.. -
రాజకీయ వేడి!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలంతా చేయి చేయి కలిపి తమ బలం చాటనున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ నెల 23న పలో సమావేశమై మోదీని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను రచించనున్నారు. దేశంలో అత్యంత బలవంతుడైన నాయకుడు మోదీని ఎదిరించి నిలబడుతున్న రాహుల్ గాందీ, అరవింద్ కేజ్రివాల్; మమతా బెనర్జీ వంటి వారు ఈ సమావేశానికి హాజరై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా మంత్రాంగం నడపనున్నారు. పాట్నా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలందరూ ఒకే తాటిపైకి రాగలరా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పార్టీల్లో ఎవరికి వారికే ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలన్న ఆశ ఉండడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఓట్లు చీలకుండా ఉండడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్ష పార్టీ లన్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చొరవ చూపించారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీజేపీకి దీటుగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుదామని ఆయన ప్రతిపాదించారు. కానీ ఇదెంతవరకు కార్యరూపం దాలుస్తోందన్న అనుమానాలున్నాయి. ♦ ప్రాంతీయ పార్టీ ల మధ్య నెలకొన్న రాజకీయ శత్రుత్వం విపక్షాల ఐక్యతకు అసలు సిసలైన సవాల్‌గా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న టీఎంసీ, లెఫ్ట్ పార్టీ లను ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమనే అభిప్రాయాలున్నాయి. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి వాటితో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు ♦ సీట్ల సర్దుబాటు అన్నది లెక్కకు మించిన పార్టీ ల మధ్య సవ్యంగా జరగడం అతి పెద్ద సవాల్. పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లోనే 172 లోక్‌సభ స్థానాలున్నాయి. ♦ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ , రాజస్తాన్‌లలో తాము పోటీకి దిగమని హామీ ఇస్తోంది కానీ తమకు గట్టి పట్టున్న న్యూఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీపడకూడదని షరతు విధిస్తోంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధిక సంఖ్యలో సీట్లు కాంగ్రెస్కుకేటాయించడానికి సిద్ధంగా లేరు. ♦ బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టసాధ్యమని నితీశ్ కుమార్ అభిప్రాయంగా ఉంది. ఆ దిశగా ఆయన ఎంతవరకు ఒప్పించగలరన్నది సందేహమే. ♦ ప్రధాని మోదీకున్న చరిష్మాను తట్టుకొని నిలబడాలంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజీపడి ఇతర పార్టీ లకు దగ్గరవాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ♦ ఈ సవాళ్లన్నింటిని అధిగమించడం ఇప్పుడే సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుత సమావేశం దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన ధరాభారం, నిరుద్యోగంతో పాటు మతం పేరుతో సమాజాన్ని చీల్చే చర్యలకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట వ్యూహాన్ని చర్చించడానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి ఒకవైపు విపక్ష పార్టీ లన్నీ ఏకం కావడానికి సర్వ శక్తులు ఒడ్డుతూ ఉంటే అధికార ఎన్డీయే నుంచి ఇప్పటికే ఎన్నో పార్టీ లు దూరమయ్యాయి. మళ్లీ వారందరితోనూ జత కట్టడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వయం దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో శివసేన దూరమయ్యాక ఆ పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేని సీఎంను చేసిన బీజేపీకి ఇప్పుడు ఆయన వైఖరి కూడా కొరుకుడు పడడం లేదు. మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేకి జనాదరణ అధికంగా ఉందని పేపర్లో ప్రకటన ఇవ్వడం బీజేపీకి మింగుడు పడడం లేదు.తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై జయలలితపై చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది. ఇక బీహార్‌లో నితీశ్ కుమార్ జేడీ (యూ) దూరమయ్యాక ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ఇటీవల ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో జరిగిన సమావేశంలో తమతో కలిసే మిత్రపక్షాలను కలుపుకొని పోవాలని మోదీ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ♦కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసిన పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ను కూడా తిరిగి ఎన్డీయే గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీ(ఎస్) ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపాలని కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. బీహార్‌లో కులప్రాతిపదికన చిన్న పార్టీ లను కలుపుకొని వెళితే మేలన్న యోచనలో బీజేపీ ఉంది. లోక్‌జనశక్తి పార్టీ (చిరాగ్ చీలిక వర్గం) ఎన్డీయేకి దూరమవకుండా చర్యలు తీసుకుంటూనే హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) దగ్గరకు తీసుకునే చర్యలు చేపడుతోంది. నితీశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే ఇటీవల విభేదాల కారణంగా బయటకు వచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముకేశ్ సాహ్నితో కూడా మంతనాలు సాగిస్తోంది. ♦ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఓం ప్రకాశ్ రాజ్బహార్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తో మంతనాలు సాగిస్తోంది. బీజేపీ యూపీ అధ్యక్షుడు చౌధరి భూపేంద్ర సింగ్ వారణాసిలో జరిగిన రాజ్బహార్ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా అన్ని వైపుల నుంచి ఎన్డీయేని బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ సూపర్ కానుక..!
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఓ మంచి కానుకను పంపించారు. 600 కేజీల మామిడి పండ్లను కానుకగా బహుకరించారు. హిమాసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను కానుకగా పంపించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కూడా ఇలాంటి బహుమతినే ఇచ్చినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ గుర్తుచేశారు. దౌత్య సంబంధాల్లో భాగంగానే ఈ మేరకు కానుకలు పంపినట్లు స్పష్టం చేశారు. మమతా బెనర్జీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా షేక్ హసీనా బహుమతిగా మామిడి పండ్లను పంపించారు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, త్రిపుర, అసోం సీఎంలకు కానుకగా మామిడి పండ్లను బహుకరించారు. ఇదీ చదవండి:‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’ -
ఇది వేధించడం గాక ఇంకేంటి?.. ఆమెను అడ్డుకోవడంపై మమత ఫైర్
బొగ్గు కేసులో విచారణలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు చెందని అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఆమె తన ప్రయాణ ప్రణాళికలు గురించి ఈడికి తెలియజేసినప్పటకీ అడుకున్నారని సీరియస్ అయ్యారు. ఇది వేధించడం గాక ఇంకేమిటి అని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అని అన్నారు. అభిషేక్ బెనర్జీ అత్తగారికి అనారోగ్యంగా ఉంది. అందువల్ల అతడి భార్య తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. ఆమె కోల్‌కతాను విడిచి వెళ్లాలంటే ముందుగానే ఈడీకి తెలియజేయాలని సుపప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే ఆమె ఈడీకి సమాచారం అందించినప్పటికి అలా ఎలా చేసింది ఈడీ అని ప్రశ్నించారు. ఆమెనున విమానాశ్రయంలో అడ్డుకోవడం పిలిపించడం ఇవన్నీ వేధింపులు గాక మరొకటి కాదని అన్నారు మమతా. ఇదిలా ఉండగా, అభిషేక్ బెనర్జీ ఈ విషయమై మాట్లాడుతూ..తన భార్య ప్రయాణం ప్రణాళిక గురించి ముందుగానే ఈడీకి తెలియజేశామని అన్నారు. దుర్మార్గపు ఉద్దేశాలు ఉంటే వారికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు కదా అని అనఆనరు. తాను చేస్తున్న తృణమూలే నబో జోవర్ ప్రచారానికి వచ్చిన ప్రతిస్పందనతో బీజేపీ ఉలిక్కిపడుతోందన్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ దానిని అడ్డుకోవాలని చూస్తుంది. మమ్మల్ని వేధించడానికి మార్గాలు వెతుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ..నా భార్యను, నా పిల్లలను లేదా నన్ను ఈడీ అరెస్టు చేసినా తాను తల వంచేదే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని కుర్చిపై ఉన్న గౌరవంతో ఆయనకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నానని అన్నారు. నావయసు ఆయన రాజకీయ అనుభవం అంత కాకపోవచ్చు..కానీ మీరు నాతో రాజకీయంగా ప్రజాకోర్టులో పోరాడలేకపోతున్నారని విమర్శించారు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ..ఈడీ స్వతంత్ర సంస్థ అని, బీజేపీకి ఈడీ లేదా సీబీఐతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, ఏవైన ఫిర్యాదులు ఉంటే ఎప్పుడైన వారు కోర్టుని ఆశ్రయించవచ్చు అని బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు. (చదవండి: ఆ దుర్ఘటన తర్వాత టికెట్లు రద్దయ్యాయి!..వివరణ ఇచ్చిన రైల్వేస్) -
సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!
కోల్కత్తా: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఒడిషా రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతో పాటుగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం మమత సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక, బాధితుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే, రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు మమత స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సీఎం మమతతో పాటుగా మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు తనతో పాటుగా వస్తున్నారని తెలిపారు. బుధవారం బాధిత కుటుంబాలను కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే రైలు ప్రమాదం గురించి మరోసారి స్పందించారు. ఈ ప్రమాదం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదన్నారు. అలాగే, గతంలో జరిగిన రైలు దుర్ఘటనలపై సీబీఐ విచారణ సందర్భాలను మమత గుర్తు చేశారు. వీటిపై ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ సత్వరమే అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టినట్ట విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు..