Maruti cars
-
భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవా
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో చిన్న కార్లకు డిమాండ్ పుంజుకుంటుందని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. భారత ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తక్కువ ధరకు లభించే చిన్న కార్లు అవసరమని విశ్వసిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘చిన్న కార్ల డిమాండ్‌లో తాత్కాలికంగా ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. అయితే ఇది కంపెనీ వ్యూహాన్ని మార్చబోదు. స్కూటర్ వాడుతున్న వారు దేశంలో భారీ సంఖ్యలో ఉన్నారు. సమీప భవిష్యత్తులో వీరు కార్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సురక్షిత, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను వారు కోరుకుంటున్నారు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండే చిన్న కార్లకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. భారత్‌లో పెద్ద, విలాసవంత వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో విక్రయాలు, సేవా నెట్‌వర్క్‌ను కంపెనీ మరింత బలోపేతం చేస్తోంది’ అని తెలిపారు.ఆరు ఈవీ మోడళ్లు..కంపెనీ నుంచి ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లు 2030–31 నాటికి భారత్‌లో రంగ ప్రవేశం చేస్తాయని భార్గవ వెల్లడించారు. ‘కొన్ని నెలల్లోనే భారత్‌లో మారుతీ సుజుకీ తొలి ఈవీ రానుంది. ఈ కార్లను యూరప్, జపాన్‌కు ఎగుమతి చేస్తాం. 2030–31 నాటికి 40 లక్షల యూనిట్లకు తయారీ సామర్థ్యం పెంచుకుంటాం. 7.5–8 లక్షల యూనిట్లు ఎగుమతి చేస్తాం. 2024–25లో 3 లక్షల యూనిట్లు ఎగుమతులు జరగొచ్చు. హరియాణాలో 10 లక్షల యూనిట్ల సామర్థ్యంతో రూ.18,000 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంటులో 2025–26లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. -
పాత కార్ల అమ్మకాల్లో కనీవినీ ఎరుగని రికార్డ్ - అట్లుంటది మారుతి అంటే!
న్యూఢిల్లీ: ఆటోమొబై ల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) గత రెండు దశాబ్దాల్లో రికార్డు స్థాయిలో పాత కార్లను విక్రయించింది. సంస్థలో భాగమైన ట్రూ వేల్యూ 22 ఏళ్లలో 50 లక్షల వాహనాలను అమ్మింది. ట్రూ వేల్యూ 2001లో ఏర్పాటైంది. ప్రస్తుతం 281 నగరాల్లో 560 అవుట్‌లెట్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. ‘మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పరిశ్రమలో విజయవంతంగా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 లక్షల మంది కొనుగోలుదారులకు సంతోషాలను పంచింది. వారి ప్రథమ ఎంపికగా ఎదిగింది‘ అని ఎంఎస్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
87,599 కార్లకు రీకాల్ ప్రకటించిన దిగ్గజ కంపెనీ - కారణం ఇదే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో సుమారు 87,599 ఎస్-ప్రెస్సో & ఈకో కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తన ఎస్ ప్రెస్సో అండ్ ఈకో కార్లలో స్టీరింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఇది వెహికల్ స్టీరబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2021 జులై 05 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య తయారైన ఎస్ ప్రెస్సో & ఈకో కార్లకు మాత్రమే రీకాల్ ప్రకటించడం జరిగింది. కావున కస్టమర్లు ఈ సమస్యను సంబంధిత డీలర్‌షిప్‌లలో చెక్ చేసుకుని తగిన పరిష్కారం పొందవచ్చు. ఈ సర్వీస్ మొత్తం ఉచితంగానే లభిస్తుంది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) మారుతి సుజుకి ఈ సంవత్సరంలో రీకాల్ చేయడం ఇది నాలుగవ సారి కావడం గమనార్హం. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 1,23,351 యూనిట్లను రీకాల్ చేసింది. కార్లను రీకాల్ చేయడం మన దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా వంటి కంపనీలు కూడా రీకాల్ ప్రకటించాయి. -
రూ. 25 వేలకే ఇన్విక్టో బుకింగ్స్ - లాంచ్ ఎప్పుడంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతీ సుజుకీ సరికొత్త యుటిలిటీ వెహికిల్ ఇన్విక్టో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వినియోగదార్లు రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జూలై 5న ఈ కారు భారత్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ధర రూ.20 లక్షలకుపైగా ఉండనుంది. ఇన్విక్టో రాకతో మూడు వరుసల్లో లభించే ప్రీమియం వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు అవుతుందని మారుతీ సుజుకీ తెలిపింది. స్పోర్ట్ యుటిలిటీ/మల్టీపర్పస్ వెహికిల్ లక్షణాలతో కూడిన ప్రీమియం మూడు–వరుసల వాహనాన్ని కోరుకునే వినియోగదారులను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మూడు వరుసలున్న స్పోర్ట్ యుటిలిటీ/మల్టీపర్పస్ వెహికిల్స్ 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసేవి 1.2–1.25 లక్షల యూనిట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారంగా ఇన్విక్టో రూపుదిద్దుకుంది. Experience a new realm of luxury with the all-new Invicto. Bookings are now open for you to join this exclusive group. To know more : https://t.co/nuzitvde47#Invicto #Bookingsopen #Nexa #CreateInspire *Creative visualization pic.twitter.com/Zt9CuluXBN — Nexa Experience (@NexaExperience) June 19, 2023 -
ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!
Maruti Suzuki Discounts: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు వీటి మునుపటి ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మారుతి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్ మారుతి సుజుకి ఇగ్నిస్ కొనుగోలుపైన రూ. 64,000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.16 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి సియాజ్ సియాజ్ కొనుగోలుపైన రూ. 33,000 అదా చేసుకోవచ్చు. ఇది నెక్సా లైనప్‌లోని ప్రాధమిక మోడల్. కస్టమర్లు దీనిపైన రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుని పొందవచ్చు. అయితే దీని పైన క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) మారుతి సుజుకి బాలెనో దేశీయ మార్కెట్లో ఎక్కువమందికి ఇష్టమైన మోడల్, ఎక్కువ అమ్ముడవుతున్న బాలెనో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారులు రూ. 35,000 బెనిఫీట్స్ పొందవచ్చు. డెల్టా మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. దీని ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్‌ను సంప్రదించవచ్చు. -
మారుతి జిమ్నీ బుక్ చేసుకున్నారా? ఇది మీ కోసమే..
Maruti Jimny Deliveries: మారుతి సుజుకి ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 5 డోర్ జిమ్నీ డెలివరీలు అప్పుడే మొదలయ్యాయి. విడుదలకు ముందే 30వేల బుకింగ్స్ పొందిన ఈ SUV కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి సంబంధిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం.. ఈ డెలివరీ పంజాబ్ ప్రాంతంలో జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇందులో గ్రానైట్ గ్రే కలర్ జిమ్నీ డెలివరీలను చూడవచ్చు. కంపెనీ ఈ కారుకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే దేశ వ్యాప్తంగా డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీడియోలో గమనించినట్లయితే మారుతి జిమ్నీ బుక్ చేసుకున్న కస్టమర్ ఫ్యామిలీ మొత్తం డీలర్‌షిప్‌లో కనిపిస్తారు. కారుని డెలివరీ చేసుకోవడానికంటే ముందు కేక్ కట్ చేయడం వంటివి కూడా చూడవచ్చు. ఇక్కడ కనిపించే మోడల్ జిమ్నీ ఎండ్ జీటా వేరియంట్ అని తెలుస్తోంది. మారుతి జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇందులో నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ టైర్ వంటి వాటితో పాటు 195/80 సెక్షన్ టైర్లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవన్నీ మారుతి జిమ్నీ SUV ని మరింత హుందాగా చూపించడంలో సహాయపడతాయి. మారుతి జిమ్నీ ఆటోమాటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి. ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి, ప్యాసింజర్ వైపు డ్యాష్‌బోర్డ్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్, ఫాక్స్ ఎక్స్పోజ్డ్ బోల్ట్‌లతో చాలా కఠినమైనదిగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) మారుతి సుజుకి ఈ కారుని కేవలం భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. కావున జిమ్నీ త్వరలోనే ఖండాంతరాలు దాటడానికి సిద్దమవుతోంది. ఈ ఆఫ్-రోడర్ 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ధర తెలియకుండానే దూసుకెళ్తున్న బుకింగ్స్.. అట్లుంటది జిమ్నీ అంటే..
Maruti 5 Door Jimny: మారుతి సుజుకి భారతదేశంలో విడుదల చేయనున్న '5 డోర్ జిమ్నీ' గురించి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు వెల్లడించింది. ఈ SUV జూన్ 7న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టనుంది. జిమ్నీ ఆఫ్-రోడర్ బుకింగ్స్, డెలివరీలు వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 3 డోర్స్ జిమ్నీ ఇప్పుడు 5 డోర్స్ జిమ్నీ రూపంలో విడుదలకావడనికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే ధరలు మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ధరలు కూడా అధికారికంగా వెల్లడి కాకముందే ఈ ఎస్యువి ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. బుకింగ్స్ దాదాపు మ్యాన్యువల్ & ఆటోమాటిక్ వేరియంట్లకు సమానంగా వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఈ 5 డోర్ జిమ్నీ కోసం జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్న ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా తయారైంది. ఇందులో 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?) డెలివరీలు.. 5 డోర్ మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ 1000 యూనిట్లను రూపొందించినట్లు సమాచారం. కావున డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫస్ట్ బ్యాచ్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో.. ధర ఎంతో తెలుసా?) మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించన్నప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే
2023 జనవరి ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో అందరి దృష్టిని ఆకర్శించిన 'మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ' (Maruti Suzuki Jimny) లాంచ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ SUV విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాహన ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ మారుతి సుజుకి దేశీయ విఫణిలో జిమ్నీ ధరలను అధికారికంగా జూన్ 07న ప్రకటించనుంది. ఈ కారు జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో టాప్-స్పెక్ ఆల్ఫా ట్రిమ్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ ఈ ఆఫ్-రోడర్ మైలేజ్ గణాంకాలను కూడా వెల్లడించింది. 105 hp పవర్, 134.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగిన ఈ ఎస్యువి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. మైలేజ్ డీటైల్స్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: 5 డోర్స్ జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు) ఫీచర్స్ విషయానికి వస్తే 5 డోర్స్ జిమ్నీ 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. డిజైన్ పరంగా జిమ్నీ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. అంచనా ధరలు జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్‌పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి బాలెనొ: ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
తగ్గేదేలే అంటున్న మారుతి సుజుకి - గత నెల అమ్మకాలు ఇలా!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత కొంతకాలంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు 2023 ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,60,529 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,39,519 యూనిట్లు కాగా.. 16,971 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 1,50,661 యూనిట్లు. మినీ సెగ్మెంట్ విభాగంలో మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. వీటి మొత్తం అమ్మకాలు 14,110 యూనిట్లు. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటివి ముందంజలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు 89,045 యూనిట్లు. ఇక ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సియాజ్ 1,017 యూనిట్ల అమ్మకాలను పొందింది. (ఇదీ చదవండి: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్‌వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?) మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ లో బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. ఈ కార్ల అమ్మకాలు ఏకంగా 90,062 యూనిట్లు. మొత్తం మీద మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో కూడా మంచి స్థాయిలో పెరిగాయి, రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ఇవే!
భారతదేశంలో ఎక్కువ మంది సొంతంగా కార్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కొనుగోలుదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికోసం ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి తక్కువ ధరకు లభించే టాప్-5 కార్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: దేశీయ మార్కెట్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి రూ. 7.95 లక్షల నుంచి రూ. 8.51 లక్షల మధ్య లభించే సరసమైన కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆస్టా. ఇందులో డ్రైవర్, ఫ్యాసింజర్, సైడ్ ఎయిర్ బ్యాగులను పొందుతుంది. కావున భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటిగా ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి బాలెనొ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన బాలెనొ జీటా, ఆల్ఫా ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దీని ధర రూ. 8.38 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది. CNG మోడల్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న బాలెనొ పనితీరు పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆరా: ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే హ్యుందాయ్ ఆరా ధర రూ. 8.61 లక్షలు. ఆరా ఎస్ఎక్స్(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్లు నాలుగు ఎయిర్ బ్యాగులను పొందుతాయి. హ్యుందాయ్ ఆరా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) టయోటా గ్లాంజా: ఇండియన్ మార్కెట్లో రూ. 8.63 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య లభించే టయోటా గ్లాంజా ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని జి, వి ట్రిమ్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) హ్యుందాయ్ ఐ20: మన జాబితాలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఆరు ఎయిర్ బ్యాగులు కలిగిన హ్యుందాయ్ ఐ20 ఒకటి. దీని ధర రూ. 9.77 లక్షల నుంచి రూ. 11.88 లక్షల మధ్య ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు హ్యుందాయ్ ఐ20 ఆస్టా(ఓ) ట్రిమ్‌లో మాత్రమే ఉంటాయి. ఐ20 రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్. రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. -
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' (Maruti Suzuki Fronx) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. విడుదలకు ముందే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందిన ఈ కొత్త ఎస్యువి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & బుకింగ్స్: దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైన కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 7.47 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 13.14 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ఫ్రాంక్స్ 15 వేలకంటే ఎక్కువ సంక్యలో బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్: మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త ఫ్రాంక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ వంటి వాటితో పాటు సైడ్ ప్రొఫైల్‌లో 17 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పరిమాణం పరంగా కూడా ఈ SUV చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,765 మిమీ, ఎత్తు 1,550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) ఫీచర్స్: మారుతి ఫ్రాంక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రీ-స్టాండింగ్ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందిస్తుంది, ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్: కొత్త మారుతి ఫ్రాంక్స్ ఆర్కిటిక్ వైట్, ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండియర్ గ్రే అనే ఏడు రంగులలో లభిస్తుంది. అంతే కాకుండా డ్యూయల్-టోన్ ఎంపికలుగా ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ అందుబటులో ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్‌పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్లో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా ఈ కొత్త ఎస్యువి ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి ఫ్రాంక్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
విడుదలకు ముందే లీకైన జిమ్నీ ధరలు - ఇలా ఉన్నాయి
మారుతి సుజుకి తన 5 డోర్స్ జిమ్నీ SUVని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి ఎక్కువ మంది దీని కొనుగోలుకు వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిమ్నీ మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. కాగా ఈ ఆఫ్ రోడర్ ధరలు విడుదలకు ముందే వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి గట్టి పోటీ ఇవ్వడానికి వస్తున్న మారుతి జిమ్నీ త్వరలోనే అధికారికంగా విడుదలకానుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన ఈ ఎస్యువి ధరలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. షాన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) అని తెలుస్తోంది. అయితే అధికారిక ధరలను కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. ఇది K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. -
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!
2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఈ SUV భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలకాకముందే 13,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కంపెనీ గతంలో ఈ కారు డిజైన్, ఫీచర్స్ గురించి వెల్లడించింది, అయితే తాజాగా ఇప్పుడు మైలేజ్ గురించి ప్రస్తావించింది. ఇంజిన్ ఆప్షన్స్: మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇవి రెండూ వరుసగా 88.5 బిహెచ్పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ & 98.6 బిహెచ్పి పవర్, 147.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ పొందుతాయి. మైలేజ్: మారుతి ఫ్రాంక్స్ 1.2 పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ 21.79 కిలోమీటర్స్/లీటర్ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో 1.0 టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ 21.5 కిమీ/లీ & ఆటోమాటిక్ వేరియంట్ 20.01 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయి. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) డిజైన్ & ఫీచర్స్: మారుతి ఫ్రాంక్స్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కలిగి, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ పొందుతాయి. సైడ్ ప్రొఫైల్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ కూడా ఉంటుంది. ఈ కొత్త SUV ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. అంచనా ధరలు & లాంచ్ డేట్: మారుతి ఫ్రాంక్స్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 8 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ SUV ఈ నెల చివరి నాటికి మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్లో సిట్రోయెన్ C3, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..
మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో కొత్త జిమ్నీ ఎస్‌యువిని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఆఫ్ రోడర్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాకముందే ఇటీవల డీలర్ యార్డ్‌లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న జిమ్నీ 3-డోర్స్ ఎడిషన్, ఇండియన్ మార్కెట్లో 5-డోర్స్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. ఈ SUV ఆటో ఎక్స్పో 2023లో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. అదే సమయంలో కంపెనీ ఈ కారు కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డీలర్ యార్డ్‌లో కొత్త మారుతి జిమ్నీ, స్విఫ్ట్ పక్కన పార్క్ చేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 18,000 బుకింగ్స్ పొందిన ఈ కారు నెక్సా షోరూమ్‌లలో కస్టమర్ల సందర్శనార్థం ప్రదర్శించారు. డెలివరీలు ఈ నెల చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..) డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. దీని పొడవు 3,985 మిమీ, 1,720 వెడల్పు, వీల్‌బేస్ 2,590 మిమీ వరకు ఉంటుంది. కావున ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. త్వరలో విడుదలకానున్న మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?) జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 9.99 లక్షల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా కంపెనీ ఈ ఎస్యువి డెలివరీలను వేగవంతం చేయడానికి సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో త్వరలో జిమ్నీ SUVని అధికారికంగా విడుదల చేయనుంది, ఇప్పటికే ఈ కొత్త మోడల్ కోసం 23,500 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. కాగా ఎంపిక చేసిన నెక్సా అవుట్లెట్లలో ఈ కొత్త కారు డిస్ప్లే కూడా ప్రారంభమైంది. త్వరలో మరిన్ని అవుట్లెట్లలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన జిమ్నీ మే నెలలో విక్రయానికి రానున్నట్లు సమాచారం, కానీ అంతకంటే ముందు ఏప్రిల్ 7 నుంచి భారతదేశంలో మరికొన్ని నగరాల్లోని డీలర్‌షిప్‌లలో కనిపించనుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ NCR, అహ్మదాబాద్, చండీగఢ్, మొహాలి, లూథియానా, రాయ్‌పూర్, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రదర్శన మొదలైపోయింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు అక్కడ జిమ్నీ కారుని పరిశీలించవచ్చు. మారుతి జిమ్నీ ఉత్పత్తి గురుగ్రామ్ ప్లాంట్‌లో జరుగుతుంది. ఇక్కడ నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయించనుంది. కంపెనీ సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ప్రతి నెల 7,000 యూనిట్లను భారతీయ మార్కెట్లో, మిగిలినవాటిని విదేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..) మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్‌లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌తో 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్యువి ధరలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 12 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. -
విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు..ఇవే!
భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా కీర్తి గడించిన మారుతి సుజుకి రానున్న నాలుగు నెలల్లో మరో మూడు కొత్త కార్లను విడుదల చేయనుంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ 5-డోర్, బ్రెజ్జా CNG ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్‌పోలో ఎంతోమంది మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది మారుతి నెక్సా అవుట్లెట్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 'సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా' అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. అంతే కాకుండా ఇది 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ (బూస్టర్‌జెట్ ఇంజిన్), 1.2-లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్: దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ ఎస్‌యువికి ప్రధాన ప్రత్యర్థిగా రానున్న మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటికే డీలర్‌షిప్‌కి చేరుకోవడం కూడా ప్రారంభించింది. ఈ ఏడాది పండుగ సీజన్లో ఈ ఆఫ్-రోడర్ అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎస్యువి కోసం 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఇది K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. మారుతి సుజుకి బ్రెజ్జా CNG: మారుతి సుజుకి సిఎన్జి విభాగాన్ని విస్తరించడంతో భాగంగా తన బ్రెజ్జా సిఎన్జి విడుదల చేయనుంది. కంపెనీ ఈ మోడల్ కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. మారుతి బ్రెజ్జా సిఎన్జి ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగానే అదే 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 100 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. -
డీలర్‌షిప్‌కి చేరుకున్న మారుతి జిమ్నీ.. ఇక డెలివరీలు అప్పుడే!
గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త మారుతి జిమ్నీ 5-డోర్స్ వెర్షన్ ఎట్టకేలకు షోరూమ్‌లకు వచ్చేసింది. ఇప్పటికే బుకింగ్స్ స్వీయకరించడం ప్రారంభించిన కంపెనీ త్వరలోనే డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకి తన ఫైవ్ డోర్స్ జిమ్నీ SUVని 2023 ఆటో ఎక్స్పో ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం ఇప్పటికి 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా ఇప్పుడు వాహన ప్రేమికుల సందర్శనార్థం నెక్సా షోరూమ్‌లలో జిమ్నీ ప్రదర్శిస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంటుంది. జిమ్నీ ప్రొడక్షన్ 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ధర, డెలివరీలకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా కంపెనీ ప్రతి నెలా కనీసం 7,000 యూనిట్లను డెలివరీ చేస్తూ.. సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలో ముందుకుసాగనుంది. డెలివరీలు మే చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌తో 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్‌లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. -
తగ్గని డిమాండ్, పెరుగుతున్న బుకింగ్స్.. అట్లుంటది 'గ్రాండ్ విటారా' అంటే!
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధరలు అధికారికంగా ప్రకటించక ముందే భారీ సంఖ్యలో బుకింగ్స్ పొందిన గ్రాండ్ విటారా ఇప్పటికీ 90,000 కంటే ఎక్కువ బుకింగ్స్ కైవసం చేసుకుంది. దీంతో డెలివరీ పీరియడ్ భారీగా పెరిగింది. మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 19.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. ఇది మొత్తం 9 కలర్ ఆప్సన్స్‌లో (ఆరు మోనోటోన్ & మూడు డ్యూయల్ టోన్) లభిస్తుంది. గ్రాండ్ విటారా రెండు ఇంజిన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 103 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?) ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 92 హెచ్‌పి పవర్, 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్, 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీద ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తూ, 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా డెలివరీలను ప్రారంభించింది, ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ SUV ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కారు మరిన్ని ఎక్కువ పొందే అవకాశం కూడా ఉంది. -
ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా
సాక్షి,ముంబై: రానున్న పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు కార్లుపోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మారుతి సుజుకి మారుతి కొన్ని మోడల్‌లు రూ. 50,000 వరకు భారీ ఆఫర్‌తోపాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో తొమ్మిది నుంచి 60వేల రూపాయల దాకా డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, క్లెరియో, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ , డిజైర్ వంటి మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. అన్ని మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం. రెనాల్ట్ ఇండియా రెనాల్ట్ ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ MPV, కిగర్ కాంపాక్ట్ SUV తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం. అలాగే తన అన్ని మోడళ్లలో యాక్సెసరీలపై పరిమిత ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. హ్యుందాయ్ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్ంట్, కొనా ఈవీ వంటికార్లపై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్‌లు అందించనుంది. టాటా మోటార్స్ టాటా మోటార్స్ వివిధ మోడళ్లలో పండుగ సీజన్ డిస్కౌంట్లు 20- 40వేల రూపాయల విలువైన పథకాలను అందిస్తోంది. ప్రధానంగా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్‌లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలల్లో రిటైల్ విక్రయాలు వెనుకబడి ఉన్నాయి. ఎంట్రీ లెవల్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ప్రస్తుతం పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు.దీంతోపాటు, రానున్న నెలల్లో మెరుగైన సరఫరాతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని గులాటీ కోరారు. గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళికల్లో ఉన్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. -
త్వరలో అన్ని కార్లలో హైబ్రీడ్ టెక్నాలజీ: మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వచ్చే 5–7 ఏళ్లలో తమ అన్ని కార్ల మోడల్స్‌లోనూ హైబ్రీడ్ సాంకేతికతను వినియోగించాలని యోచిస్తోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లు, ఇథనాల్.. బయో సీఎన్జీ అనుకూల ఇంజిన్లపై మరింత దృష్టి పెట్టనున్నట్లు సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ తెలిపారు. రాబోయే అయిదు నుంచి ఏడేళ్లలో ప్రతీ మోడల్లో ఎంతో కొంత గ్రీన్ టెక్నాలజీ ఉంటుందని చెప్పారు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు!
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి చెందిన బాలెనో కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఈ ఏడాది 10లక్షల మైలు రాయిని దాటినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ కారు మార్కెట్ వాటాలో 25 శాతం వాటాను కలిగి ఉంది. నెక్సా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాలెనో 248 నగరాల్లోని 399 అవుట్ లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. మారుతి సుజుకి బాలెనోను 2015 అక్టోబర్ నెలలో లాంచ్ చేశారు. ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 1 లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ 2018 నాటికి ఈ కారు విక్రయాలు 5 లక్షలు దాటేశాయి. ఆ తర్వాత ఐదులక్షల విక్రయాలను మూడేళ్లలోనే పూర్తి చేసుకోవడం విశేషం. "లాంఛ్ చేసినప్పటి నుంచి బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్లలో తన సత్తా చాటుతుంది. ఇది డిజైన్, భద్రత, ఆవిష్కరణలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. 25 శాతానికి పైగా మార్కెట్ వాటాతో "బాలెనో" ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో నాయకత్వం వహిస్తున్నట్లు" అని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. (చదవండి: 2021లో వచ్చిన బెస్ట్ సూపర్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!) బాలెనో 1.2 లీటర్ డ్యూయల్ జెట్, సెగ్మెంట్-ఫస్ట్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేసే డ్యూయల్ వీవీటి ఇంజిన్ కలిగి ఉంది. ఇది, ఐడిల్ స్టార్ట్-స్టాప్, సివిటి ట్రాన్స్ మిషన్ కలిగి ఉంది. పెట్రోల్ యూనిట్ 1.2-లీటర్ ఇంజిన్ రూపంలో 82 బిహెచ్పి, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ కొత్త 1.2-లీటర్ డ్యూయల్ జెట్ స్మార్ట్ హైబ్రిడ్ యూనిట్ రూపంలో ఉంది. ఇది 89 బిహెచ్పి & 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. (చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!) -
Festive Offer: కొత్త కారు కొనాలనుకుంటున్నారా?
పండుగ సీజన్ నడుస్తోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునేవాళ్లకు కొన్ని కార్ల కంపెనీలు శుభవార్త సైతం అందించాయి. కొన్ని కంపెనీ కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దసరా సీజన్ ముగియడంతో అక్టోబర్ 16 వరకే ఆఫర్లు ప్రకటించాయి కంపెనీలు. అవేంటో ఓ లుక్కేద్దాం. ►మారుతీ అల్టో కారుపై రూ.43 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ►ఎస్ ప్రెసో కారుపై కూడా ఆఫర్ ఉంది. దీనిపై రూ.48 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ►ఈకో వెహికల్‌పై కూడా తగ్గింపు పొందొచ్చు. రూ.12500 బెనిఫిట్ లభిస్తోంది. ►వేగనార్ కారుపై రూ.17500 తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ►మారుతీ స్విఫ్ట్ కారుపై రూ.24,500 వరకు తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ►అదే డిజైర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. రూ.19,500 తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ►వితారా బ్రెజా కారుపై రూ.17,500 తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి. గమనిక: ఆఫర్లో కన్సూమర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి కలిసి ఉంటాయి. ఇకపోతే కార్లపై ఆఫర్లు అక్టోబర్ 16 వరకే అందుబాటులో ఉంటాయి. ఇంకా ప్రాంతం, కారు మోడల్, డీలర్షిప్ ప్రాతిపదికన డిస్కౌంట్ ఆఫర్లు కూడా మారతాయి. అందువల్ల కారు కొనుగోలు చేయడానికి ముందే ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. చదవండి: బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! ఈ పాఠం తెలుసా? -
మారుతీ 5000 కార్ల విక్రయం- షేరు అప్
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను పొడిగించినప్పటికీ కొన్ని ఆంక్షలను సడలించడంతో పలు రంగాలలో ఉత్పత్తి కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. లాక్‌డవున్ కారణంగా 55 రోజుల తదుపరి హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంటులో కార్ల తయారీని ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. అంతేకాకుండా గత కొద్ది రోజులలో 5,000 కార్లకుపైగా విక్రయించగలిగినట్లు తెలియజేసింది. దేశవ్యాప్తంగా 1350 షోరూములు తిరిగి ప్రారంభమైనట్లు వెల్లడించింది.వీటికి జతగా 300 ట్రూవేల్యూ ఔట్లెట్లను సైతం ఇటీవల తిరిగి తెరిచినట్లు తెలియజేసింది.ఈ బాటలో ఈ నెల 12 నుంచి మనేసర్ ప్లాంటులో పాక్షిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో మారుతీ సుజుకీ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ఉదయం 11.30 ప్రాంతంలో 2.25 శాతం లాభపడి రూ. 4827 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 4,900 వరకూ ఎగసింది.ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే మారుతీ కౌంటర్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి 0.72 మిలియన్ షేర్లు చేతులు మారాయి. టొరంట్ పవర్- క్యూ4 గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపడంతో టొరంట్ పవర్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 318ను సైతం అధిగమించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నిర్వహణ లాభం(ఇబిటా) 15 శాతం పుంజుకుని రూ. 864 కోట్లను తాకింది. అయితే రూ. 693 కోట్ల పన్నుకు ముందు నష్టం(పీబీటీ) ప్రకటించింది.ఇందుకు 1200 మెగావాట్ల డీజెన్ పవర్ ప్రాజెక్ట్‌పై నమోదైన రూ. 1000 కోట్ల రైటాఫ్ వ్యయాలు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. దీంతో రూ. 270 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2984 కోట్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని 3703 మెగావాట్ల నుంచి 3879 మెగావాట్లకు పెంచుకుంది. కొత్తగా జత కలసిన సామర్థ్యం పునరుత్పాదక ఇంధన విభాగం నుంచి సమకూర్చుకోవడం కంపెనీకి లబ్దిని చేకూర్చనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
మారుతీ కార్ల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మోడల్ ఆధారంగా రూ. 10,000 వరకు పెంచింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని, ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గరిష్టంగా 4.7 వరకు పెంచినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి మారుతీ బీఎస్–6 సీఎన్జీ ఆల్టో ప్రారంభ ధర రూ. 4.32 లక్షలు భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న సీఎన్జీ వెర్షన్ ఆల్టో కారును మారుతీ సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఆల్టో ఎస్–సీఎన్జీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ. 4.32 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ). కిలో సీఎన్జీ 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడంలో భాగంగా ఈ నూతన వెర్షన్ మార్కెట్లోకి విడుదలచేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేచురల్ గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ముడి చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే కాగా, ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న నేచురల్ గ్యాస్ వినియోగాన్ని 2030 నాటికి 15 శాతానికి చేరుకునేలా చర్యలు చేపడుతోంది. మోడల్ పెరిగిన ధర (రూ.) ఆల్టో 9,000–6,000 ఎస్–ప్రెస్సో 1,500–8,000 వ్యాగన్ఆర్ 1,500–4,000 ఎర్టిగా 4,000–10,000 బాలెనో 3,000–8,000 ఎక్స్ఎల్6 5,000