micro soft
-
మైక్రోసాఫ్ట్ బగ్ ప్రభావం .... అమెరికా గగనతలం ఖాళీ!
న్యూయార్క్: అమెరికా గగనతలంలో ప్రతి రోజు విమానాల ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాఉంటుందో శుక్రవారం(జులై 19) అర్థమైంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బగ్ సమస్య తలెత్తి అమెరికాలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీలైన అమెరికన్ ఎయిర్‌లైన్స్,డెల్టా,యునైటెడ్ సంస్థల విమానాలు ఎక్కడికక్కడే ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయాయి. దీంతో అగ్రదేశ గగనతలంలో విమానాల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ సాధారణ సమయంలో విమానాల రద్దీ ఎలా ఉంటుంది.. శుక్రవారం విమానాల రద్దీ తగ్గిన తర్వాత ఎలా ఉందనే 12 గంటల ఆసక్తికర టైమ్‌లాప్స్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానాల ట్రాఫిక్ టైమ్‌లాప్స్ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. 12-hour timelapse of American Airlines, Delta, and United plane traffic after what was likely the biggest IT outage in history forced a nationwide ground stop of the three airlines. pic.twitter.com/wwcQeiEtVe— Colin McCarthy (@US_Stormwatch) July 19, 2024 -
అప్పుడు వై2కే బగ్‌తో అతలాకుతలం .. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్
20 ఏళ్ల క్రితం వై2కే బగ్ (దానికి మరో పేరు మిలీనియం బగ్) కంప్యూటర్లను గడగడలాడించింది. ఈ బగ్ వల్ల అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ తరహా ఇబ్బందులు తలెత్తాయో ఇవాళ (జులై 19) మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వై2కే బగ్ కథాకమామిషు ఏంటి? వై2కే బగ్‌కి క్రౌడ్ స్ట్రైక్‌కి ఏదైనా సంబంధం ఉందా?ప్రపంచంలోని అన్నీ దేశాల మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పర్సనల్ కంప్యూటర్లలోని విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడుస్తున్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ప్రత్యక్షమవుతుంది. పలుమార్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతున్నాయి. విండోస్‌లోని సాంకేతిక సమస్యలతో భారత్, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బోర్డింగ్ పాస్‌లను సైతం చేతి రాత ఉపయోగించాల్సి వచ్చింది. అయితే విండోస్‌లోని తలెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్‌ను విజ్ఞప్తి చేస్తుండగా ..ఈ ప్రస్తుత పరిస్థితి 2000 ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన వై2కే బగ్ లాగా తీవ్ర ఆందోళనను రేకెత్తిచ్చింది. సర్వర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు మైక్రోసాఫ్ట్ పరిష్కారం చూపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సమస్యలు అదుపులోకి వచ్చాయి. ఏంటి ఈ వై2కే బగ్?1960-1980లలో కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేసే సమయంలో డేటా స్టోరేజీని ఆదా చేసేందుకు కంప్యూటర్ ఇంజనీర్లు సంవత్సరానికి రెండు అంకెల ‘19’ కోడ్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 31,1999 తర్వాత కొత్త ఏడాది అంటే 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత పోగ్రామర్లు వినియోగించిన కోడ్‌ను 00గా భావించి 2000 ఏడాదిగా కాకుండా 1900గా కంప్యూటర్లు అర్థం చేసుకున్నాయి.ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 100 సంవత్సరాలుగా తీసుకుని ప్రోగ్రామర్లు తేది పరిమాణాన్ని 100 సంవత్సరాలుగా తీసుకుని (1900 నుండి 1999 వరకు) ప్రోగ్రాం రాసారు. 1999 వరకు ఏ సమస్యా లేకుండా సాగిపోయింది. అయితే 2000వ సంవత్సరం రాగానే కంప్యూటర్లు దాన్ని 00గా పరిగణించాయి. ఏడాది 2000 అయితే ప్రోగ్రామర్లు ఫిక్స్ చేసిన 19 కోడ్ కారణంగా 1900 తీసుకున్నాయి. ఫలితంగా ఆ ఏడాది టెక్నాలజీ రంగం అతలాకుతలమైంది. ఇతర రంగాలు సైతం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నాయి. బగ్‌ను పరిష్కరించేందుకు ప్రోగ్రాం అందుబాటులోకి రావడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ పాత సంవత్సరం ముగిసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత వై2కే కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవ్వడం సాధారణమేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్రౌడ్ స్ట్రైక్ వర్సెస్ వై2కే బగ్ఆ వై2కే బగ్‌కి తాజా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో ఇబ్బందులకు ఏదైనా సంబంధం ఉందా అంటే లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ ప్రముఖ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర టెక్నాలజీ కంపెనీలకు, పలు ప్రభుత్వ విభాగాలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు క్రౌడ్‌స్ట్రైక్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. దాని ఫలితంగానే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్‌లోని ఇబ్బందులు తలెత్తి సిస్టమ్‌లు షట్‌డౌన్ , రీస్టార్ట్ అవుతున్నాయని టెక్నాలజీ రంగ నిపుణులు చెబుతున్నారు. -
అజ్యూర్‌కు ఓలా గుడ్‌బై.. మైక్రోసాఫ్ట్‌కు 100 కోట్ల నష్టం?
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా..మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఓలా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ ఇండియాకు దాదాపూ రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్ ఏఐలో బాట్లో తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. అంతే ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్ లింక్డిన్లో ఓ పోస్ట్ పెట్టారు. తమ నిబంధనలకు విరుద్దం అంటూ ఆ పోస్ట్‌ను లింక్డిన్ డిలీట్ చేసింది. లింక్డిన్ పోస్ట్ తన పోస్ట్ డిలీట్ చేయడంతో లింక్డిన్ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌పై భవిష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌట్ కంప్యూటింగ్ సేవలకు స్వస్తి పలకాలని తమ కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ తీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్ వందల కోట్లలో నష్టం వాటిల్లనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
రూ.14వేలకోట్లతో డేటా సెంటర్లు ప్రారంభం.. ఎక్కడంటే..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్‌ఫ్లడ్‌తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలుగ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్ చెప్పారు. -
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో.. ప్రియురాలితో బిల్‌గేట్స్ చెట్టాపట్టాల్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, మార్చి1న ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తన ప్రియురాలు పౌలా హర్డ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంబానీ, వరుడు అనంత్ అంబానీతో కలిసి పోజులిచ్చారు. దీంతో బిల్‌గేట్స్- పౌలా హార్డ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పలు నివేదికల ప్రకారం..ఒరాకిల్ సంస్థ మాజీ సీఈఓ భార్య పౌలా హార్డ్‌ను బిల్‌గేట్స్ గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఏడాది అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్ ఎంగేజ్మెంట్లో ప్రత్యేక్షమయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో బిల్ గేట్స్‌తో ఆమె సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వారిద్దరూ మార్చి 2022లో ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ డబ్ల్యూటీఏ సెమీఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తూ మీడియా కంట కనబడ్డారు. బిల్‌గేట్స్-పౌలాహర్డ్ స్నేహబంధం గురించి అడినప్పుడల్లా దాటవేస్తూ వచ్చారు. గత ఏడాది జూలైలో పౌలా హర్డ్ ధరించిన డైమండ్ రింగ్ ధరించి కనిపించడంపై వాళ్లిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ప్రతినిధి హర్డ్ దశాబ్దాలుగా ఆ ఉంగరాన్ని ధరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై 2021లో బిల్‌గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు ఆప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం బిల్‌గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. తాజాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బిల్‌గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్‌లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్‌లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్‌గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు. అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో సైబర్ దాడుల కలకలం!
మైక్రోసాఫ్ట్‌లో సైబర్ దాడుల కలకలం రేపుతున్నాయి. రష్యాకు చెందిన హ్యాకర్లు తమ సంస్థపై సైబర్ దాడులు చేశారంటూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 12న రష్యా హ్యాకర్స్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ సిస్టమ్స్‌పై దాడులు చేసి ఈమెయిల్స్‌ను దొంగిలించారు. వాటి సాయంతో సిబ్బంది అకౌంట్లలోని పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రష్యాలో సుపరిచితమైన హ్యాకింగ్ గ్రూప్స్ నోబెలియం, మిడ్నైట్ బ్లిజార్డ్ సభ్యులు నవంబర్ 2023 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థపై ‘పాస్వర్డ్ స్ప్రే అటాక్స్’ పాల్పడినట్లు తన బ్లాగ్‌లో పేర్కొంది. సంస్థకు చెందిన కంప్యూటర్లపై సైబర్ దాడులే లక్ష్యంగా ఒకే పాస్‌వర్డ్‌ను పలు మార్లు ఉపయోగించడంతో హ్యాకింగ్ సాధ్యమైనట్లు వెల్లడించింది. అయితే రష్యన్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఇమెయిల్ అకౌంట్స్‌ను చాలా తక్కువ శాతం యాక్సెస్ చేయగలిగింది. ఆ ఈమెయిల్స్‌లో సీనియర్ లీడర్షిప్ టీమ్ సభ్యులు, సైబర్ సెక్యూరిటీ, లీగల్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని మైక్రోసాఫ్ట్ నిర్ధారించింది. మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ బృందం హ్యాకర్స్ దాడులు ఎందుకు చేశారో ఆరా తీసింది. ఇందులో రష్యన్ హ్యాకర్స్ గ్రూప్ మిడ్నైట్ బ్లిజార్డ్ గురించి సమాచారం ఉన్న ఈమెయిల్స్ సేకరించే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
మరోసారి తెరపైకి ‘మూన్‌లైటింగ్’.. దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటే చర్చ!
ఐటీ రంగలో అలజడిని సృష్టించిన మూన్‌లైటింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రం హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్ అయ్యాక మిగిలిన సమయంలో వేరే సంస్థలో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదించే వారు. దీనిని విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ టెక్ కంపెనీలు వ్యతిరేకించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని తొలగించాయి. తాజాగా ఈ మూన్‌లైటింగ్‌పై మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ మరోలా స్పందించారు. రెండో ఉద్యోగం చేసుకోకుండా కంపెనీలు ఉద్యోగుల్ని ఆపకూడదన్నారు. ఉద్యోగుల జీవితాల్ని తమకే అంకితం చేయాలని సంస్థలు కోరుకోకూడదని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి దిగ్గజ టెక్ కంపెనీల్లో చర్చకు దారితీశాయి. మూన్‌లైటింగ్‌పై ఆయన ఇంకేం అన్నారంటే.. మూన్‌లైటింగ్‌పై క్రిస్ విలియమ్స్ కామెంట్ ‘మూన్‌లైటింగ్ అనేది శ్రామిక రంగంలో ఒక భాగం. ఈ పని విధానంతో జీవితంలో అనేక విజయాలు సాధించిన గొప్ప గొప్ప వారున్నారు. మా అమ్మ మమ్మల్ని కాలేజీలో చేర్చడానికి రెండు ఉద్యోగాలు చేసింది’ అని బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలా ఆలోచించడం తప్పు ‘సంస్థ కోసం ఉద్యోగులు ప్రత్యేక సమాయాన్ని కేటాయించాలని మేనేజర్లు ఆశించడం తప్పే అవుతుందని వెల్లడించారు. ఉద్యోగులు వారి సమయాన్ని సంస్థలకు మాత్రమే అంకితం చేయలేరు. ఓ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సదరు ఉద్యోగి మిగిలిన సమయంలో ఏం చేయాలో అతని ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది. సంస్థల్ని ఉద్దేశిస్తూ .. మీ నిర్ణయాన్ని వారి ఇష్టాల మీద రుద్దకూడదని’ చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు అయితే తమ ప్రత్యర్ధి సంస్థల్లో పనిచేస్తుంటే పరిమితులు విధించొచ్చు. అదనపు ఆదాయం కోసం వేరే పనులు చేసుకుంటూ సంస్థల్లో ప్రొడక్టవిటీ తగ్గితే తగు చర్యలు తీసుకునే అధికారం మేనేజర్లకు ఉంటుంది. కొన్ని అంశాల్లో మేనేజర్లు అతిగా స్పందిస్తారు. దాన్ని ఉద్యోగులు ఒక ద్రోహంగా భావిస్తారు. మీతిమీరిన స్పందనతో సిబ్బంది ఉన్న ఫళంగా రాజీనామాలు చేసి బయటకు వెళ్లడానికి అదే కారణమవుతుందని సూచించారు. ఇలా చేస్తే మూన్‌లైటింగ్ చేయరు బదులుగా, మేనేజర్లు తమ కింది స్థాయి సిబ్బంది సాధించిన విజయాల్ని గుర్తించాలి. రెండో ఉద్యోగం చేసుకునే అవకాశమూ కల్పించాలి. ఇలాంటి సందర్భాలలో ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు దూరంగా ఉంటారు. సంస్థలు తగిన ప్రాధాన్యం ఇస్తాయి. ఇక వారు వేరే చోట పనిచేసేందుకు మక్కువ చూపరని మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ టెక్ కంపెనీలను హితబోధ చేశారు. -
మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే!
ఆర్ధిక మాంద్యం భయాలు, పెరిగిపోతున్న ఖర్చులు. వెరసి పునర్నిర్మాణం పేరుతో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది తాజాగా, ఆ సంస్థకు చెందిన సోషల్ నెట్వర్క్ లింక్డిన్లోనూ 600 మందికి పింక్ స్లిప్‌లు జారీ చేసింది. అయితే, ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని చెబుతూనే, ఉద్యోగులకు కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలిస్తూ చర్చాంశనీయంగా మారింది. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ శాలరీలను ఎంత మొత్తంలో చెల్లింస్తుందనే డేటా లీకైంది. ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ఏయే డిజిగ్నేషన్‌కు ఎంత వేతనం చెల్లించాలని తెలిపేలా కొన్ని గైడ్‌లైన్స్‌ను తయారు చేసింది. ఈ గైడ్‌లైన్స్ ఆధారంగా ఆయా డిపార్ట్మెంట్లలో కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు ఎంత జీతాలు ఇవ్వాలనేది మేనేజర్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు అదే జీతాల డేటా ఆన్లైన్లో చక్కెర్లు కొడుతుంది. ప్రాంతాన్ని బట్టే జీతాలు దీంతో పాటు సిబ్బందికి అందించే కాంపన్షేషన్ సైతం ప్రాంతాన్ని బట్టి అందిస్తుంది. మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే న్యూయార్క్,శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే ఉద్యోగులకు కాంపన్షేషన్ కాస్త ఎక్కువ అందిస్తున్నట్లు శాలరీలను వెలుగులోకి తెచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ర్యాంకుల్ని బట్టి శాలరీలు లీకైనా వేతన మార్గదర్శకాల ప్రకారం మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల ర్యాంకులు బట్టి సంస్థ అందించే జీతాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్‌లో మీ ర్యాంక్ (leval) 70 ఉంటే మీకు కంపెనీ ఇచ్చే బేసిక్ పే 231,700 డాలర్ల నుంచి 361,500 డాలర్ల వరకు ఉంటుంది. ఇదే ర్యాంక్‌లో ఖచ్చితమైన శాలరీ అంటే 310,000 నుండి 1.2 మిలియన్ల డాలర్లలోపు పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. 68 ర్యాంక్ ఉన్న వారిని సీనియర్ ఉద్యోగిగా, లెవల్ 63, లెవల్ 65 వరుసగా సీనియర్, ప్రిన్సిపల్ ఉద్యోగులుగా పరిగణించబడతారని నివేదిక హైలెట్ చేసింది. అత్యల్ప స్థాయి అదే కంపెనీలో అతి తక్కువ స్థాయి ఉద్యోగి జీతం 42,500 డాలర్ల జీతం తీసుకుంటారు. ఈ స్థాయిలో ఉన్న ఉద్యోగులు హైరింగ్ బోనస్ లేదా స్టాక్ అవార్డుకు అర్హులు కాదు. ఫీల్డ్‌ను బట్టి ర్యాంక్‌లు మారతాయ్ అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంకులు 70 వరకు వెళ్లవు. ఈ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగిని ప్రత్యేక ఇంజనీర్‌గా భావిస్తారు. అదే సమయంలో, ఇతర ఫీల్డ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల ర్యాంక్‌లు 80కి పైగా ఉంటాయి. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమానురాలు -
‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
కృత్తిమ మేధ ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌ల వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్‌జీపీటీ, బార్డ్ వంటి టూల్స్ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్‌జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్‌ని చదవడం, సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ’ సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ఉత్పాదకత పెరిగి కంపెనీల ప్రణాళికలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని చెప్పారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమాని! -
‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తానని ఊహించలేదని అన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అడుగుపెట్టిన తాను కంపెనీ సీఈవో అవుతానన్న ఆలోచన కూడా లేదంటూ లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు’ అని అన్నారు. చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వేరే ఆఫీస్‌లో చేరదాం అనే ఆలోచనతో కాకుండా.. ప్రస్తుతం ఆఫీస్‌లో మీరు చేస్తున్న పాత్రని విజయవంతంగా పోషించండి. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరియర్లో నేను చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించిన సందర్భం లేదు. నేను అక్కడ చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైన విషయంగా భావించినట్లు వివరించారు. మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకిగా భావించడానికి బదులుగా ఆసక్తిని, అంకితభావాన్ని, నేర్చుకోవడాన్ని ఓ అవకాశంగా భావించాలి. ఈ మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాల్ని అంటే ప్రమోషన్లు లేదా శాలరీల పెంపును వేగంగా పొందగలుగుతారని అన్నారు. చేస్తున్న పని వల్ల ఎదుగుదల ఉండడం లేదని అనిపిస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరని సూచించారు. ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు అని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల తన మనసులో మాటని బయటపెట్టారు. చదవండి👉 కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం! -
‘చాట్‌జీపీటీ’తో ఉద్యోగులకు గండం.. టీసీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ముంబై: చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు.. ఉద్యోగుల స్థానాలను ఆక్రమించబోవని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అవి ’కృత్రిమ మేథ (ఏఐ) గల సహోద్యోగులు’గా మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో పరిశ్రమలో, ఒక్కో కస్టమరుకు ఒక్కో రకం సేవలు అవసరమవుతాయని చెప్పారు. వివిధ పరిస్థితులను అర్థం చేసుకుని, సందర్భానుసారంగా వాటిని అందించడం మనుషులకు మాత్రమే సాధ్యమని, వాటిని అర్థం చేసుకోవడంలో ’ఏఐ సహోద్యోగి’కి చాలా సమయం పడుతుందని మిలింద్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సహాయకరంగా మాత్రమే జెనరేటివ్ ఏఐ ఉండగలదని పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచుకునేందుకు, డెలివరీ వేగాన్ని మెరురుపర్చుకునేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని వివరించారు. చాట్‌జీపీటీ మొదలైన వాటి రాకతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మిలింద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
గూగుల్‌కు గుబులు.. చాట్‌జీపీటీతో సత్య నాదెళ్ల మరో మాస్టర్ ప్లాన్!
కృత్తిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) విభాగంలో గూగుల్‌ను మరింత వెనక్కి నెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మరింత వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాబోయే వారాల్లో ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఔట్‌లుక్‌లలో ఏఐ చాట్‌జీపీటీ డెమో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ది వెర్జ్ నివేదిక ప్రకారం, మార్చి నెలలో ఏఐ టెక్నాలజీపై సత్యా నాదెళ్ల భవిష్యత్ ప్రణాళికల్ని వివరించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్ ఏఐలో మరిన్ని పెట్టుబడులు పెట్టి అన్నీ ప్రొడక్ట్‌లలో మైక్రోసాఫ్ట్ ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా దాని ప్రొడక్టీవ్ యాప్స్‌ను ఎంత త్వరగా తిరిగి ఆవిష్కరించాలనుకుంటుందో వచ్చే నెలలో చేసే ప్రకటనలో మైక్రోసాప్ట్ హైలైట్ చేస్తుంది’అంటూ వెర్జ్ నివేదిక తెలిపింది. ఇప్పటికే చాట్‌జీపీటీని ఔట్‌లుక్‌లో మెయిల్స్‌కు రిప్లయ్ ఇచ్చేలా సెర్చ్ రిజల్ట్స్ మరింత అందంగా తీర్చిదిద్దేలా చాట్‌జీపీటీని టెస్ట్ చేసినట్లు పేర్కొంది. దీంతో పాటు వర్డ్ డాక్యుమెంట్ ఇంటిగ్రేషన్‌ని మెరుగుపరచడం కోసం జీపీటీ మోడల్‌ను పరీక్షించినట్లు గతంలో నివేదించింది. ఈ తరుణంలో పోటీగా గూగుల్ బార్డ్ రావడంతో మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు సిద్దమయ్యారు సత్యనాదెళ్ల. బార్డ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ప్రకటన చేసిన వారం రోజుల వ్యవధిలో మైక్రోసాఫ్ట్ వివా సేల్స్‌లో ఏఐ ఎక్స్పీరియన్స్ అందించనుంది. దీని సాయంతో సేల్స్ ఈమెయిల్స్‌ను రూపొందించడానికి అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఇది ఔట్‌లుక్‌లో మైక్రోసాఫ్ట్ పరీక్షిస్తున్న కొన్ని ఫీచర్లను పోలి ఉంటుందని సమాచారం. -
‘ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు భారీ షాక్!’
ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు కంపెనీలు భారీ షాక్ ఇస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం భయంతో సంస్థలు ఉద్యోగుల్ని తొలగించుకుంటున్నాయి. జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు హఠాత్తుగా మెయిల్స్ పంపిస్తున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీల్లో 24వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయి. తాజాగా, కఠినమైన ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ సైతం మైక్రోసాఫ్ట్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైందని తన నివేదికలో పేర్కొంది. మరో 5 నుంచి 10శాతం ఉద్యోగాలు ఉష్ కాకి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 220,000 మంది పనిచేస్తుండగా..గతేడాది రెండు సార్లు ఉద్యోగుల్ని ఫైర్ చేయగా.. తాజాగా కంపెనీ వార్షిక ఫలితాల్ని వెలు వరించకముందే ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ‘గత కొన్ని వారాలుగా మేం సేల్స్‌ఫోర్స్, అమెజాన్ నుండి గణనీయంగా హెడ్‌కౌంట్ తగ్గడం చూశాం. టెక్ సెక్టార్లో మరో 5 నుండి 10 శాతం సిబ్బంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ వెడ్‌బుష్ నివేదించింది. ఈ కంపెనీల్లో చాలా వరకు 1980 నాటి తరహాలో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ధిక అనిశ్చితికి అనుగుణంగా ఖర్చుపై నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒట్టి రూమర్లే! ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు స్పందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు వస్తున్న నివేదికల్ని ఖండించారు. ఒట్టి రూమర్సేనని కొట్టిపారేశారు. చదవండి👉 నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ? -
సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించా : మంత్రి కేటీఆర్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన సత్యనాదెళ్లతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇద్దరు హైదరాబాదీల భేటీతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్ & బిర్యానీతో గురించి మాట్లాడుకున్నాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS — KTR (@KTRTRS) January 6, 2023 ఇక సత్యనాదెళ్లతో జరిపిన భేటీలో కేటీఆర్ హైదరాబాద్‌లో పెట్టుబడులు, టీహబ్ విస్తరణ, ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చాట్ జీపీటీతో సత్యనాదెళ్ల బిర్యానీ ముచ్చట్లు బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబో ‘చాట్ జీపీటీ’, సత్య నాదెళ్ల మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏంటని చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీ టిఫిన్ కాదని, దాని గురించి నాకు బాగా తెలుసని రిప్లయి ఇవ్వడంతో చాట్ జీపీటీ క్షమాపణలు చెప్పింది. -
ఇంకోసారి, ఉద్యోగుల తొలగింపుపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సారి వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జులై నెలలో పునర్వ్యవస్ధీకరణ పేరుతో 1800 మంది ఉద్యోగులను తొలగించగా..తాజా లే ఆఫ్స్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓ సీనియర్ డిజైనర్ ఉద్యోగుల తొలగింపుపై లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఈ వారంలో ముఖ్యంగా మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) ఉద్యోగుల్ని ఫైర్ చేయనుందని ఓ బాంబు పేల్చారు. సీనియర్ డిజైనర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎల్‌ఎక్స్ టీం తో పాటు ప్రపంచంలోని మైక్రోసాఫ్ట్ కు చెందిన లోకేషన్లలో విధులు నిర్వహించే హెచ్ ఆర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ సభ్యుల్ని తొలగించే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. 2018లో 2018లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఉత్పత్తుల్ని వినియోగించుకునే కస్టమర్లు..మళ్లీ తిరిగి వాటిని ఉపయోగించేలా మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. తొలిసారి ఈ ఎంఎల్‌ఎక్స్ సభ్యులు ఎఫెక్టీవ్ వేలో హెల్దీ ఆన్ లైన్ హ్యాబిట్స్‌తో వినియోగదారులు వారి రోజూవారీ కార్యకలాపాల్ని చక్కదిద్దే లక్ష్యంతో ఎక్స్ బాక్స్ తరహా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవలప్ చేశారు. జూన్ 2020లో మనీ ఇన్ ఎక్స్ఎల్ అనే టెంప్లెట్‌ను మార్కెట్‌కు పరిచయం చేశారు. ఈ మనీ ఎక్స్ అనే టెంప్లెట్ సాయంతో వినియోగదారులు మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ నుంచి డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ అకౌంట్లలో ఎంటర్ అవ్వొచ్చు. పెట్టుబడులు సైతం పెట్టుకోవచ్చు. కాగా, ఈ మనీ ఇన్ ఎక్సెఎల్ అనే టెంప్లెట్ వచ్చే ఏడాది జూన్ 30న షట్ డౌన్ చేయనుంది. ఉద్యోగుల తొలగింపు సాధారణమే ఆర్ధిక మాంద్యంతో ఇక టిక్‌టాక్, ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్ ఇతర సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఆ సమయంలో ఉద్యోగుల తొలగించడం సాధారణమని మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. కంపెనీకి చెందిన 1.8 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 1 శాతం లోపు ఉద్యోగులనే తొలగించామని తెలిపింది. చదవండి👉వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022 -
మైక్రోసాఫ్ట్ భారీ షాక్, వందల మంది ఉద్యోగుల తొలగింపు!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో సేవల్ని నిలిపివేశాయి. వికీపీడియా లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కంపెనీలు రష్యాలో కార్యాకలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రష్యాలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చేసిన మైక్రోసాఫ్ట్ ప్రకటన ఆ సంస్థలో పనిచేస్తున్న 400మంది ఉద్యోగులు రోడ్డున పడేలా చేసింది. ప్రొడక్ట్ అమ్మకాల తగ్గింపు కారణంగా తలెత్తుతున్న నష్టాలు, ఇతరాత్ర కారణాల వల్ల ఆ 400మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్ని తొలగించినా వారికి సంస్థ సహాయ,సహకారాలు ఉంటాయని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు ఐబీఎం గుడ్‌బై 1980 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టంను ఐబిఎం కంప్యూటర్స్‌తో కలిసి బిల్డ్ చేస్తుంది. అయితే ఇటీవల ఉక్రెయిన్ - రష్యా పరిణామాల నేపథ్యంలో ఐబీఎం రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేసింది. ఐబీఎం తర్వాత మైక్రోసాఫ్ట్ రష్యా నుంచి వైదొలొగుతున్నట్లు ప్రకటించింన విషయం తెలిసింది. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఉద్యోగుల శాలరీలను డబుల్ చేస్తున్నట్లు తెలిపారు. సత్య నాదెళ్ల ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని నట్టేట ముంచారు. మీరొద్దు. మీరిచ్చే జీతాలొద్దు. కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు ఊడబీకారు. నష్టాలంటూ శాలరీల్లో కోత విధించారు. డబుల్ హైక్‌లు, ప్రమోషన్లు ఇస్తామంటే మేం ఎందుకు పనిచేస్తాం. కరోనా తెచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నామంటూ..ఉద్యోగస్తులు.. వారు చేస్తున్న ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నాం". ఇదిగో ఇలా పుట్టుకొచ్చిందే ఈ దిగ్రేట్ రిజిగ్నేషన్. ఇప్పుడీ ఈ అంశం ప్రపంచ దేశాలకు చెందిన అన్నీ సంస్థల్ని కలవరానికి గురిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేస్తూ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. 'నియర్లీ డుబల్డ్ ది గ్లోబల్ మెరిట్'. ముఖ్యంగా మిడ్ కెరియర్ (35 నుంచి 45 మధ్య వయస్సు) ఉద్యోగుల శాలరీలు మరింత పెరగనున్నాయి. అంతేకాదు క్లయింట్లకు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయింది. నా తరుపున మీ అందరికి కృతజ్ఞతలు.అందుకే మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యామని సత్య నాదెళ్ల తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు. చదవండి👉నాకొద్దీ ఉద్యోగం.. భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ! -
హైదరాబాద్‌కి బంపర్ ఆఫర్ ! మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో కీలక ప్రకటన?
Microsoft, Telangana seal deal: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్న హైదరాబాద్ ఫ్యూచర్ టెక్నాలజీలకు అనుగుణంగా సిద్ధమవుతోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజీ, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ చెబుతున్న మాట. దీనికి తగ్గట్టే తెలంగాణ సర్కారు ఇప్పటికే డేటా సెంటర్ పాలసీనీ తీసుకువచ్చింది. దేశంలో ఈ పాలసీ తీసుకువచ్చిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ రెడీ అయినట్టు సమాచారం. త్వరలో తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, తెలంగాణ సర్కార్ల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కాగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం కానుంది. కొత్తగా నెలకొల్పబోయే డేటా సెంటర్ కోసం రూ.15 వేల కోట్ల రూపాయలను మైక్రోసాఫ్ట్ కేటాయించనున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రచురించింది. అయితే హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో ఇటు తెలంగాణ సర్కాను, మైక్రోసాఫ్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
వర్క్‌ఫ్రం హోం లేకపోతే ఏం.. సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఎప్పటి నుంచి కార్యాలయాలకు రావాలనే విషయంలో స్పష్టమైన విధానం అంటూ ఏదీ రూపొందించుకోలేదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అనేక అంశాలపై ఆయన స్పందించారు. క్లిష్టపరిస్థితుల్లో ఆఫీసులకు రావడం ఎందుకనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. 73 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడి పెరిగితే ఉద్యోగులు కంపెనీలు మారేందుకు వెనుకాడటం లేదు. గతంలోనే ఉన్నడూ లేనంతగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ప్లెక్లిబులిటీ ఉండే హైబ్రిడ్ పని విధానం వైపు మైక్రోసాఫ్ట్ మొగ్గిందని ఆయన తెలిపారు. టెక్నాలజీతో ఉత్పాదకత పెంపు టెక్నాలజీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వివిధ స్థాయుల్లోని వ్యాపార సంస్థలు తమ ఉత్పాదకతను మరింతగా పెంచుకోవచ్చని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తద్వారా తమ ఉత్పత్తులు, సర్వీసులను చౌకగా అందించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటల్ బాట పడుతున్నాయని ఆయన వివరించారు. హైబ్రిడ్ పని ధోరణి పెరుగుతోందని, వ్యాపారాలు మరింత లోతుగా అనుసంధానమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య విశ్వసనీయమైన సంబంధాలు నెలకొనాలంటే ఎల్లలు లేని డిజిటల్ వ్యవస్థ అవసరం అవుతుందని నాదెళ్ల తెలిపారు. ‘ద్రవ్యోల్బణం పెరిగే ఆర్థిక వ్యవస్థలో.. ధరలను కట్టడి చేసే శక్తి డిజిటల్ టెక్నాలజీకి ఉంది. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు టెక్నాలజీ ఊతంతో తమ ఉత్పత్తులు, సర్వీసుల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. చౌకగా అందించవచ్చు‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. చిప్‌ల డిజైనింగ్‌లో అవకాశాలు: చంద్రశేఖర్ వచ్చే 5–7 ఏళ్లలో సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల్లో భారత్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఆర్. చంద్రశేఖర్ చెప్పారు. కంప్యూటింగ్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో ఇవి కీలకంగా ఉండనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కంపెనీల్లో టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వినియోగించడం మరింతగా పెరిగిందని ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. వ్యాపార సంస్థలు ఉత్పాదకత పెంచుకోవడానికి, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, పోటీ పడటానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. మరింత పటిష్టంగా భారత్ వృద్ధి: టీసీఎస్ చంద్రశేఖరన్ భారత్ దీర్ఘకాల వృద్ధి గతిపై కరోనా మహమ్మారి ప్రభావం పెద్దగా లేదని దేశీ దిగ్గజం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. కొన్ని ప్రాథమిక అంశాల కారణంగా కాస్త జాప్యం మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఎకానమీ పూర్తి స్థాయిలో పుంజుకున్నాక.. ఈ దశాబ్దంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసే దేశాల్లో భారత్ ముందు ఉంటుందని చెప్పారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు! -
మైక్రోసాఫ్ట్‌లో జర్నలిస్టుల తొలగింపు
ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జర్నలిస్టుల తొలగింపునకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు గార్డియన్ నివేదిక తెలిపింది. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన ఎమ్ఎస్ఎన్ న్యూస్ వెబ్సైట్లో 27 మంది జర్నలిస్టులను సంస్థ తొలగించనున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలకు ఉద్యోగులను తగ్గించుకునే వెసలుబాటును కృత్రిమ మేధ కల్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ నివేదికపై జర్నలిస్టులు స్పందిస్తూ.. కంపెనీ అధికారులు తమ అవసరం లేదని చెబుతున్నారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేయాల్సిన విధులను కృత్రిమ మేధ(ఆర్టీఫీషియల్ ఇంటలిజన్స్) నిర్వహిస్తోందని అధికారులు చెప్పడం సమంజసం కాదని జర్నలిస్టులు వాపోయారు. కాగా సీటల్ టైమ్స్ అనే మరో నివేదిక ప్రకారం జూన్ చివరి నాటికి 50 మంది జర్నలిస్టులకు మైక్రోసాఫ్ట్ ఉద్వాసన పలకనున్నట్లు పేర్కొంది. కరోనా సంక్షోభం కారణంగానే ఉద్యగులను తొలగిస్తున్నారని మీడియా ప్రశ్నకు కంపెనీ అధికారులు స్పందిస్తూ.. ప్రతి సంవత్సరం వ్యాపార వృద్ధిని విశ్లేషిస్తూ ఉద్యోగులను తొలగించడం లేదా అదనంగా నియమించుకోవడం సర్వసాధారణం అని అధికారులు స్పష్టం చేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు తమ వ్యాపార వృద్ధిని పెంచుకునేందుకు ప్రతి ఏడాది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని తెలిపారు. అయితే మైక్రోసాఫ్ట్ అమలు చేస్తున్న నిర్ణయాలు మిగతా కంపెనీలు అమలు చేయలేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్టోరీల ఎంపిక, ఎడిటోరియల్స్ విశ్లేషణ చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా వార్తలను ప్రచురణ చేయడంలో కృత్రిమ మేధను ఉపయోగించడం కొత్తేమి కాదని సాంకేతిక నిపుణులు తెలిపారు. వార్తలను వేగంగా విశ్లేషించి, టెక్నాలజీని అత్యుత్తమంగా ఉపయోగించేందుకు జర్నలిస్టులకు కృత్రిమ మేధ ఎంతో ఉపయోగకరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: ఆ కంపెనీలో వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు.. -
జియో మరో మెగా డీల్‌కు సిద్ధం!
సాక్షి, ముంబై : రిలయన్స్ సొంతమైన డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్ మరో మెగా డీల్ ను తన ఖాతాలో వేసుకోనుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలనుంచి పెట్టుబడులను సాధించిన జియో త్వరలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు) ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియోలో సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయని మింట్ నివేదించింది. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయనీ, తుది ఒప్పంద వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయని తెలిపింది. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా తన సేవలను మరింత విస్తరించ నున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ప్రధానంగా అజూర్ క్లౌడ్ సేవలను క్యాష్ చేసుకోవటానికి భారతదేశం అంతటా డేటా సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్) కాగా ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తోపాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల నుండి 10 బిలియన్ డాలర్ల (రూ. 78,562 కోట్లు) పెట్టుబడులను జియో సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే.. విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు -
నాదెళ్ల 'థ్యాంక్స్'
టెక్ దిగ్గజం, ‘మైక్రోసాఫ్ట్’ అధినేత సత్య నాదెళ్ల ఎవరికైనా థ్యాంక్స్ చెప్పారంటే.. వాళ్లెంత దిగ్గజాలు అయి ఉండాలి! అయితే ఆయన థ్యాంక్స్ చెప్పింది.. లూథియానాలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక నమ్యా జోషికి! నాదెళ్ల, నమ్య మంగళవారం ఢిల్లీలోని ఒక వేదికపై కలుసుకున్నారు. ‘యంగ్ ఇన్నొవేటర్స్’ సదస్సు అది. మొత్తం 250 మంది చిన్నారి టెకీలు, విద్యావేత్తలు హాజరయ్యారు. చిన్నారులలో ఎవరి ప్రతిభ వారికి ఉన్నప్పటికీ నమ్యకు ఉన్న ప్రత్యేకతే నాదెళ్ల చేత ఆమెకు థ్యాంక్స్ చెప్పించింది. అర్థంచేసుకోడానికి కష్టమైన స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్), సైబర్ సెక్యూరిటీ పాఠాలను నమ్య మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌ను ఉపయోగించి విద్యార్థులకు, టీచర్లకు కూడా పాఠాలను బోధిస్తోంది. అది ఆశ్చర్యపరచింది నాదెళ్లను. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా టెక్ పాఠాల కోసం ‘స్కైప్’ నమ్యను సంప్రదిస్తున్నారని తెలిసి ముగ్ధులైపోయిన మైక్రోసాఫ్ట్ సీఈవో ఆమెను అభినందించారు. అందుకోసం నమ్య మైన్‌క్రాఫ్ట్‌ని వాడుతోందని తెలిసి థ్యాంక్స్ చెప్పారు. మైన్‌క్రాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ వాళ్లదే. అదొక శాండ్బాక్స్ వీడియో గేమ్. -
హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ
సాక్షి, హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కన్నుమూశారు. తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ళ హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని నివాసానికి చేరుకున్నారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో యుగంధర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ 1962 సివిల్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. 1983-85 మధ్య అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద పనిచేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్ తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య గతంలోనే కన్నుమూశారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. బీఎన్ యుగంధర్ మరణంపట్ల తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్.జగన్ సంతాపం వ్యక్తం చేశారు. యుగంధర్ కుటుంబానికి, ఆయన కుమారుడు సత్య నాదెళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అనుచిత వ్యాఖ్యలకు సత్యనాదెళ్ల క్షమాపణలు!
న్యూయార్క్: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల క్షమాపణలు చెప్పారు. నేను మాట్లాడింది చాలా తప్పు అని సత్యనాదెళ్ల వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలకు ఆగ్రహం తెప్పించాయి. ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతున్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు.