Modugula Venugopal Reddy
-
పవన్ కళ్యాణ్ పై మాడుగుల వేణుగోపాలరెడ్డి ఆగ్రహం
-
టీడీపీ పట్టాభి కామెంట్స్ కి వేణుగోపాలరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
కోర్టులకు అవసరమైన కేసులే చూస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రజలకు అవసరమైన అంశాలను న్యాయస్థానాలు టేబుల్ మీదకు తీసుకోవడంలేదని.. తమకు అవసరమైన వాటినే అవి పరిగణనలోకి తీసుకుంటున్నాయని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. అవి ఇచ్చే తీర్పులు ప్రజల్లో న్యాయస్థానాలపై గౌరవం పెరిగేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డా రు. రాజధాని విషయంలో హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యా ఖ్యలు చేశారు. మోదుగుల గుంటూరులోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ 2014లో విభజనవల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగితే సుప్రీం కోర్టు దానిపై ఇంకా తీర్పు ఎందుకు ఇవ్వడంలేదు? దీనిపైనా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు కదా.. అలాగే, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది.. ఆదాయంలేదు, కష్టపడి నిర్మించిన హైదరాబాద్ లేదు.. దీని పై తీర్పు ఇవ్వకుండా మొన్న జరిగిన మూడు రాజ ధానులపై తీర్పు ఇవ్వడమేంటి? న్యాయ వ్యవస్థపై కామెంట్ చేయడంలేదు.. కానీ, వాటిపై తీర్పు ఎం దుకు రాలేదు. న్యాయ వ్యవస్థ నిద్రపోతోందా? ఈ తీర్పును పునఃసమీక్ష చేయాల్సిందే. అలాగే, మూ డు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పాసైన బిల్లు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థల మధ్య పరస్పర విరుద్ధ భావనలు తలెత్తినప్పుడు రెండింటిలో ఏది గొప్ప? అన్నదానిపైనా పూర్తిస్థాయి చర్చ జరగాలి. ‘గల్లా’ ఎన్నిక కేసు ఏమైంది? ఇక ఎన్నికలకు సంబంధించిన కేసులు ఆర్నెళ్లలో ముగించమని చట్టంలోనే చెప్పారు.. మరి 2019 ఎన్నికల కౌంటింగ్ సమయంలో నేను నాలుగువేల ఓట్లతో వెనుకబడినప్పుడు పదివేల పోస్టల్ బ్యాలెట్లు లెక్కపెట్టలేదు. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కేసు వేశాం, అది ఏమైంది? దీనిపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. జడ్జికి నచ్చి నవి టేబుల్‌పై పెట్టడం, నచ్చనివి పక్కన పెట్టడం సరికాదు. దీన్ని అంగీకరించం. మరోవైపు.. అసెంబ్లీ తీర్మానం చేసింది ఆరు నెలల్లో పూర్తిచేయమని చెబుతున్నారు, ఇది చట్టంలో ఎక్కడ ఉంది? మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు శాసన వ్యవస్థపై గౌరవం లేకుండా జడ్జిమెంట్ ఇస్తుంటే ఏమవుతుంది ఈ వ్యవస్థ? జడ్జిమెంట్ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందా? లైక్స్, డిస్‌లైక్స్ ఉండవా? అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారా!?.. అని వేణుగోపాలరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాష్ట్ర విభజనపై తీర్పు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
‘విలనిజంలో జేపీ కొత్త ఓరవడి సృష్టించారు’
సాక్షి, గుంటూరు: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డిలు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, నాటక రంగాల్లో ఆయనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, తన స్వంత ఖర్చుతో గుంటూరులో నాటకాలను ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు జయప్రకాష్‌రెడ్డి భౌతకికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విలనిజంలో జయప్రకాష్ కొత్త ఒరవడిని సృష్టించారని, వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి జయప్రకాష్ అని నాటక రంగం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేవమని గిరిధర్ పేర్కొన్నారు. -
‘అక్కడ 9700 ఓట్లు లెక్కించలేదు’
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదని ఆయన ట్వీటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్వో అక్రమానికి పాల్పడి టీడీపీ 4200 ఓట్లతో గెల్చినట్టు ప్రకటించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరు లోక్‌సభ స్థానంలోని సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్న కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడంతో వాటిని లెక్కించని విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, ఉత్తర గుంటూరు, దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క దక్షిణ గుంటూరు మినహా అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ లోక్‌సభ స్థానంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ను విజయం వరించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుంటూరుతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందని, ఈ రెండు స్థానాలపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. -
గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ ఫలితాలపై కోర్టుకు..
విజయవాడ సిటీ: గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ రెండు లోక్‌సభ స్థానాల ఫలితాలపై కోర్టుకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో సోమవారం వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండానే ఫలితాలను ఏవిధంగా ప్రకటిస్తారని వారు ప్రశ్నించారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్వోలు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుధవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ మినహా మిగిలిన ఆరు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిందని మోదుగుల వివరించారు. ఈ ఆరు చోట్లా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చిందన్నారు. తనకు మాత్రం తన ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయని వివరించారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారని, అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారని మండిపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారన్నారు. మిగిలిన చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించిందన్నారు. అంతేకాకుండా పలుచోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం ఉద్యోగులు చేసిన పొరపాట్ల వల్ల పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటుకాకుండా పోయాయన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లలో 9700 ఓట్లు రిజెక్ట్ చేశారు
-
హైకోర్టును ఆశ్రయించనున్న మోదుగుల
సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు. శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ -
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
-
మాకు వ్యవస్థలపై నమ్మకం ఉంది: మోదుగుల
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వైఎస్సార్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూములను పరిశీలించినట్లు తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని చెప్పారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని వెల్లడించారు. తమకు భారతదేశంలోని వ్యవస్థలపైన నమ్మకముందని వ్యాక్యానించారు. బాబు ఘనుడు .. అందుకే పరిశీలించడానికి వచ్చాం: ఆళ్ల ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారని, తమకు భద్రతపై నమ్మకం ఉందని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు అని ప్రజలు చెబుతున్నారు.. అందుకే ఒకసారి ఈవీఎంల భద్రతను పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు. -
వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల ఇంటిపై ఐటి దాడులు
-
ఆంధ్రజ్యోతి పేరు మారిస్తే బాగుంటుందేమో..
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన ... జయదేవ్ మీద భూకబ్జా కేసులున్నాయని ఆరోపించారు. ఓట్లు గుంటూరువి.. నోట్లు మాత్రం చిత్తూరుకా అని మండిపడ్డారు. ఇక మంగళగిరి అని స్పష్టంగా పలకలేని నారా లోకేష్.. మంగళగిరి టీడీపీ అభ్యర్థా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా సాక్షిగా ఎన్టీఆర్‌ను వాడు అన్నాడంటే.. రూమ్‌లో ఇంకేం మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చని మోదుగుల అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు జ్యోతి లక్ష్మీగా పేరు మారిస్తే బాగుంటుందని మోదుగుల ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ.. జ్యోతి లక్ష్మీ భంగిమలా ఎన్ని మాటలైన మాట్లాడతాడని ఆయన మండిపడ్డారు. టీడీపీకి చంద్రబాబు, లోకేష్‌లు నాయకులుగా పనికిరారన్నారు. మీ పార్టీకి నాయకులను మార్చుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు అభివృద్ధి కోసం ఏమేమి పనులు చేపట్టాలో తెలిపేలా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని మోదుగుల తెలిపారు. -
తాడికొండతో...తరాల అనుబంధం
సాక్షి, తాడికొండ : గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల తరుఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులే అధికంగా పోటీ చేయడం విశేషం. మొత్తం 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుంటూరు ఎంపీగా వైఎస్సార్ సీపీ తరఫున తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల ఎంపీగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ బరిలో నిలిచారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికత కోటాలో తాడికొండ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, పెదపరిమి గ్రామానికి చెందిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాడికొండ గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సారి ఎన్నికలకు వెళ్తున్నారు. సీపీఐ తరుఫున మంగళగిరి నుంచి తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రావెల కిషోర్‌బాబుది తాడికొండ మండలం రావెల గ్రామమే. -
గుంటూరులో గల్లా రౌడీయిజం చేశారు : మోదుగుల
సాక్షి, గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న సింగిల్ ఎజెండాతోనే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 25 ఎంపీలు గెలిపిస్తే ఈ రాష్ట్రానికి కచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తామన్నారు. హోదా వచ్చేంత వరకు పార్లమెంటును నడవనివ్వమన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకునే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కాయమని ధీమా వ్యక్తం చేశారు. అనేక మంది మహానుభావుల్ని ప్రజలు చనిపోయిన తరువాత కూడా గుర్తు పెట్టుకున్నారని, కానీ చంద్రబాబును మాత్రం బతికుండగానే మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరులో గల్లా జయదేవ్ రౌడీయిజం చేశారని ఆరోపించారు. జిల్లాను లూటీ చేసిన ప్రజాప్రతినిధుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందిన గల్లాను నమ్ముకుంటే.... జగన్ గుంటూరు ప్రజలను నమ్ముకున్నారని చెప్పారు. -
గెలిచినా.. ఓడినా..పోటీ ఒక్కసారే!
సాక్షి, అమరావతి : గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 1994 నుంచి ఇక్కడ ప్రధాన పార్టీల తరఫున ఒక సారి పోటీ చేసిన అభ్యర్థులు ఆ తరువాత అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవడంలేదు. ఓడిన అభ్యర్థులే కాదు.. గెలిచిన అభ్యర్థులదీ అదే పరిస్థితి. 1994 సంవత్సరంలో చల్లా వెంకటకృష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్.జయరాంబాబుపై గెలిచారు. 1999 ఎన్నికల్లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ సంవత్సరం టీడీపీ అభ్యర్థి శనక్కాయల అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి కె.ఈశ్వరవెంకటభారతిపై గెలిచారు. అప్పటి ప్రభుత్వంలో శనక్కాయల అరుణ మంత్రిగా పనిచేశారు. మరుసటి ఎన్నికకు ఈ ఇద్దరూ దూరమయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తాడిశెట్టి వెంకట్రావు టీడీపీ అభ్యర్థి టి.వెంకటేశ్వరరావుపై గెలిచారు. 2009లో వారిద్దరూ పోటీకి దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చుక్కపల్లి రమేష్‌పై గెలిచారు. ఆ తరువాత 2014లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసినా మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. 2014లో మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై గెలిచారు. ప్రస్తుతం మోదుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గుంటూరు పశ్చిమం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చంద్రగిరి ఏసురత్నం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మద్దాళి గిరి పోటీచేస్తున్నారు. -
‘ఆయన్ని ఓడించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా’
-
‘ఆయన్ని ఓడించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా’
సాక్షి, గుంటూరు: ఎన్నికలు వచ్చినవి కాబట్టే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారని స్థానిక వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గల్లా జయదేవ్ కేవలం అతిథి ఎంపీ అని, ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను ఏమైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. గుంటూరులో జయదేవ్‌ను తాను, మంగళగిరిలో లోకేష్‌ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్కే భారీ మెజార్టీతో లోకేష్‌ను మట్టికరిపించడం ఖాయమన్నారు. గల్లాను ఓడించేందుకే తాను గుంటూరు ఎంపీగా పోటీచేస్తున్నానని మోదుగుల వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న భావన్న ప్రజలందరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. (విజిటింగ్ ప్రొఫెసర్ గల్లా.. గుల్లే..!) ఐదేళ్ల కాలంలో గల్లా జయదేవ్ ఎన్నిసార్లు గుంటూరు వచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని మండలాల పేర్లు కూడా గల్లాకు సరిగ్గా తెలియవని ఆరోపించారు. ఆయనకు ఎంపీ పదకి ఆభరణమని, తనకు ఆయుధమని వర్ణించారు. దాని ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదాని తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. పొన్నురులో ఐదుసార్లు గెలిచిన ధూళ్లిపాళ్ల నరేంద్రకి ఈసారి చెక్‌పెడతామని, ఆయనొక కిలాడి అని విమర్శించారు. గుంటూరుకు ఐదేళ్ల కాలంలో తొమ్మిది మంది మున్సిపల్ కమిషనర్లను మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
ఎమ్మెల్యే మోదుగుల టీడీపీకి రాజీనామా
-
టీడీపీకి మరో భారీ షాక్..!
సాక్షి, గుంటూరు : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్, టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించారు. దీంతో జిల్లా టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మోదుగుల టీడీపీని వీడతారంటూ రెండేళ్లుగా ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తూ వచ్చింది. 15 రోజులుగా ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద జరిగిన గుంటూరు పార్లమెంట్ సమీక్షకు సైతం మోదుగుల గైర్హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కార్యకర్తల సమావేశం నిర్వహించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సైతం మోదుగుల టీడీపీని వీడతారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మోదుగుల తన రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబుకు పంపడంతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈ నెల 8న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. కాగా, అధికారంలో ఉన్న ఈ నాలుగున్నరేళ్లపాటు మోదుగులకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. పార్టీలోని ఓ సామాజికవర్గం నేతలు ఆయనకు అడ్డుపడుతూ వచ్చారు. తన నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల నుంచి పార్టీ పదవుల వరకు.. చివరికి అధికారుల బదిలీల్లోనూ ఆయన మాట చెల్లనీయలేదు. దీంతో ఇక టీడీపీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం టీడీపీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమైన మోదుగుల పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను వివరించారు. ఇక టీడీపీలో కొనసాగలేనని వారితో చెప్పడంతో అధిక శాతం మంది నాయకులు, డివిజన్ అధ్యక్షులు ‘ఏ పార్టీలో ఉన్నా మీ వెంటే ఉంటా’మంటూ మోదుగులకు మద్దతు పలికారు. అనంతరం హైదరాబాద్ వెళ్లిన మోదుగుల టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడం దారుణమైన విషయమని మోదుగుల ‘సాక్షి’తో అన్నారు. త్వరలో మంచి రోజు చూసుకుని వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుంది, దానికేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఒకవైపు పండించిన పంటలను నిల్వ ఉంచుకునేందుకు గోడౌన్లు లేకపోతే ఇక రైతుకు ఎక్కడ నుంచి రెట్టింపు ఆదాయమొస్తుందో అర్థం కావడట్లేదన్నారు. గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. పంట రుణం తీసుకునేందుకు బీమా కట్టించుకుంటున్నారు, కానీ పంట దెబ్బతింటే మాత్రం రావట్లేదని, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామారావు మాట్లాడుతూ.. తెల్లసెనగలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నారు. దీనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమాధానమిస్తూ.. దీనిపై వ్యవసాయ వర్శిటీ వీసీ ఆధ్వర్యంలో కమిటీని వేశామన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లకు ఇచ్చే రూ.1.50 లక్షలు సరిపోవట్లేదని, ప్రభుత్వమే ఇళ్లను కట్టించి ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. -
మంత్రి పదవుల కోసం టీడీపీలో రగడ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశంలో పార్టీలో మంత్రి పదవుల కోసం చిచ్చు చెలరేగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న గుంటూరు జిల్లాలోనే నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు కేబినెట్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు లేదని తెలియడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. మోదుగులకు మంత్రి పదవి ఇవ్వాలని గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు పదవి ఇవ్వనందుకు పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. చింతలపూడిలో ఆయనను అడ్డుకుని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లరాదంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లాలోనూ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో చంద్రబాబు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
'విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని'
హైదరాబాద్ : విజయవాడ-గుంటూరు మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని ఆపార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అందువల్లే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని మోదుగుల పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపటం ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని మోదుగల అన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని ఆయన తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకరం చేయనున్న విషయం తెలిసిందే. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక నిర్మించనున్నారు. జూన్ 8వ తేదీ ఉదయం 11.35 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురువారం తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై ఆయన వారితో చర్చలు జరిపారు. -
అందరూ ఆశావహులే...
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా వ్యవధి ఉండటంతో మంత్రి పదవులకోసం పోటీ ఎక్కువైంది. జిల్లాలో ఆశావహుల సంఖ్య బాగానే ఉంది. సీనియారిటీ, సిన్సియారిటీ అంటూ కొంతమంది నేతలు చెబుతుంటే మరికొంత మంది మాత్రం సామాజిక వర్గాన్ని నమ్ముకుంటున్నారు. గ్రూపులుగా విడిపోయిన దేశం ఎమ్మెల్యేలు మంత్రి పదవి తనదంటే తనదేనని అనుయాయుల వద్ద చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, గుంటూరు: జిల్లాలో 17 శాసనసభ స్థానాలకూ 12 స్థానాలను దక్కించుకుని పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మంత్రి పదవులకోసం పట్టుపడుతున్నారు. సీనియారిటీ... సామాజికవర్గాలవారీగా తమకు అనుకూలమైన సమీకరణలు సృష్టించుకుని అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అవసరాన్ని బట్టి పైరవీలూ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(తెనాలి), ధూళిపాళ్ల నరేంద్ర(పొన్నూరు), ప్రత్తిపాటి పుల్లారావు(చిలకలూరిపేట), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల),కోడెలశివప్రసాదరావు(సత్తెనపల్లి),జి.వి.ఆంజనేయులు(వినుకొండ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(గుంటూరువెస్ట్), నక్కా ఆనంద్‌బాబు(వేమూరు) మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే వీరిలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నక్కా ఆనందబాబు తప్ప మిగిలిన వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుంద న్న ధీమాలో ధూళిపాళ్ల నరేంద్ర ఉండగా, మాజీ మంత్రులైన ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోడెల శివప్రసాద్‌లు అనుభవమున్న తమకు తప్పకుండా మంత్రిపదవి వస్తుందని భావిస్తున్నారు. అదేసమయంలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పదేళ్ల పాటు పార్టీకి సేవలందించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్రత్తిపాటి పుల్లారావు అధిష్టానం వద్ద ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎవరూ చంద్రబాబునాయుడు పర్యటనకు ముందుకు రాలేదని, ఆ సమయంలో తన నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను ఏర్పాటు చేసి విజయవంతం చేశానని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాగే వినుకొండ నుంచి రెండుసార్లు ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కొంతమంది అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలతో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సిఫార్సులు చేయిస్తున్నారు. మాకు రాకున్నా... ఆయనకు రాకూడదు జిల్లాలో తమలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కాని కోడెలకు మాత్రం మంత్రి పదవి ఇవ్వవద్దంటూ కొంతమంది నాయకులు చంద్రబాబునాయుడును కోరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కోడెలకు బీజేపీ అగ్రనాయకుడైన వెంకయ్యనాయుడుతో మంచి సంబంధాలు ఉండటంతో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవచ్చనే అనుమానాలను సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. గ్రూపులుగా విడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశమివ్వాలని కోరిన వేణుగోపాలరెడ్డిని గుంటూరు పశ్చిమనుంచి పోటీచేసి గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానంటూ బాబు హామీ ఇచ్చారనీ, దాని ప్రకారం తనకు అవకాశం తప్పక దక్కుతుందని ఆయన అనుయాయుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదెంతవరకు నిలబెట్టుకుంటారన్నది వేచి చూడాలి. వేమూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నక్కా ఆనందబాబుకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆయన అనుయాయులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో మరో చిన్న తిరకాసును సైతం వారు చెబుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే ఆయన శిష్యుడైన నక్కా ఆనందబాబుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. పైరవీల జోరు.. టీడీపీలో చక్రం తిప్పుతున్న సుజనాచౌదరి, సీఎం రమేష్‌తో కొంతమంది నాయకులు సంప్రదింపులు జరుపుతుండగా మరికొంతమంది మాత్రం బీజేపీలోని జాతీయ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటున్నారు. ఏది ఏమైనా జూన్2న కొత్త రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గం కూర్పు పెద్ద సవాల్ కాకతప్పదని భావిస్తున్నారు. -
పీఛే.. ముడ్!
పార్టీలో సామాజిక న్యాయం వట్టిమాటే కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనం నియోజకవర్గాల్లో వర్గపోరుతో అతలాకుతలం 17 సీట్లలో ఓటమి ఖాయమని తేల్చిన నాయకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రముఖుల చేరిక టీడీపీకి మూడురోజుల మురిపెమే అవుతోంది. కొందరు నాయకులు పార్టీలోకి వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతోందని వారు భావించడమే ఇందుకు కారణం. టికెట్టు ఇప్పిస్తామంటూ తొలుత జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు నగరంలోని ప్రముఖుల వద్దకు వెళ్లడం, తర్వాత పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లి అట్టహాసంగా కండువాలు కప్పి పార్టీలో చేర్పించడం తర్వాత వారిని విస్మరించడం అనవాయితీగా మారింది. ఆ తర్వాత అసలు విషయాన్ని గ్రహించి చేరిన నాయకులందరూ పార్టీని వీడుతున్నారు. తొలినుంచి పార్టీ జెండా మోసిన వారికి మొండి చెయ్యిచూపించడంతో వారు సైతం పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఓ ఆర్యవైశ్య ప్రముఖుడు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే టీడీపీలో చేరిన మరో ప్రముఖుడు తొందరపడి పార్టీలో చేరవద్దని తామే బయటకు వస్తున్నామని ఆయనకు తెలిపినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీలో చేరలేదు. అలాగే తొలుత ఆ సామాజిక వర్గానికి టికెట్టు ఇస్తారంటూ ప్రచారం చేసినా ఇప్పుడు ఆ స్థానం ముస్లింలకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పార్టీలో చేరి లక్షలు ఖర్చుచేసిన నాయకులు గగ్గోలు పెడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు ఈస్ట్ టికెట్టును తమకు ఇస్తామని చేసి న వాగ్ధానాన్ని మరచిపోయారని ఆ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతపై కాపుల గుర్రు.. తమకు జిల్లాలో రెండు సీట్లివ్వాలని ఆది నుంచి కోరుతున్న కాపులకు బాపట్ల సీటు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై కూడా నియోజకవర్గంలోని ఇతర నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇక మిగిలిన తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఒకటైనా సీటు కేటాయించాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీకి ఎప్పటి నుంచో సేవలందిస్తున్న దాసరి రాజామాష్టారుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయించలేదు. ఆ సమయంలో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామంటూ అధిష్టానం సర్దిచెప్పింది. పశ్చిమ నియోజకవర్గంలో తులసి రామచం ద్ర ప్రభుకు టిక్కెట్టు ఇస్తున్నట్లు ప్రచారం చేసి చివరి నిముషంలో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి సీటు కేటాయించారు. దీంతో తులసీ రామచంద్ర ప్రభు, ఆయన అభిమానులు పిలిచి తమను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్లలో అంతర్గత కుమ్ములాటలు... జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. కేవలం ఆర్థిక పరపతి ఉన్నవారికే టిక్కెట్లు కేటాయిస్తుండటంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు సత్తెనపల్లి కేటాయించడంతో ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేయాలని భావించిన నియనిమ్మకాయల రాజనారాయణ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రచారానికే సామాజిక న్యాయం.. ఆర్యవైశ్య, కాపు, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తామని చేస్తున్న ప్రచారానికి భిన్నంగా జిల్లాలో పరిస్థితి ఉంది. కాపులకు ఒక సీటు కేటాయిస్తే, బీసీలకు సీట్లు తగ్గుతాయని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరిస్థితిపై నివేదికలు పంపే వారు సైతం సామాజిక న్యాయం కింద అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించకుంటే పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని తెలపడం కొసమెరుపు. ఇప్పటివరకూ ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా మహిళ లేకపోవడంపై ఆ వర్గం నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక నూర్‌బాషాలు సైతం తమ వర్గానికి రాష్ట్రంలో ఐదు సీట్లు కేటాయిస్తామన్న చంద్రబాబు మొండిచెయ్యి చూపడంపై వారూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంటే ఏమిటో ఈ ఎన్నికల్లో చూపుతామంటున్నారు. -
‘వేరే చోటనుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదు’
గురజాల: నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచే తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. వేరే చోటనుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నారు. గుంటూరు జిల్లా గురజాలలో విలేకరులతో మాట్లాడారు. మాచర్ల పురపాలక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసి, అధికారిని అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పి.లక్ష్మారెడ్డిని జైల్లో పెట్టించారని, దొంగ ఓటు వేసినవారు బయట తిరుగుతున్నారన్నారు. దాన్ని అడ్డుకున్న లక్ష్మారెడ్డిని జైలుకు పంపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.