mulugu distric
-
వాగులు దాటి వైద్యసేవలు..
వెంకటాపురం(కె): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సీతారాంపురంలో వైద్య సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు.ఈ గ్రామానికి వెళ్లాలంటే వాగులు దాటాలి. వర్షాలు పడుతుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా వైద్యాధికా రి భవ్యశ్రీ, సిబ్బంది వాగులో నడుములోతు నీటిలో నడుచుకుంటూ గ్రామానికి వెళ్లారు. 67 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. కలిపాక గ్రామంలోని ఇద్దరు గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. -
అయ్యప్ప భక్తుడిని కారుతో ఢీ.. బైరి నరేష్‌పై కేసు
సాక్షి, ములుగు జిల్లా: అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. ప్రమాదం జరిగిన అనంతరం మణుగూరు వైపు వెళ్లిన బైరి నరేష్, అయన భార్య, కొడుకు, డ్రైవర్ వెళ్లినట్లు సమాచారం. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఇదీ చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్ -
కొండాయిలో నిండా విషాదమే!
ఏటూరునాగారం: భారీ వర్షాలు, జంపన్న వాగు వరదతో తీవ్రంగా దెబ్బతిన్న ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం కొండాయి ఇంకా విషాదంలోనే ఉండిపోయింది. వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన 8 మంది గ్రామస్తుల అంత్య క్రియలు కుటుంబ సభ్యుల రోదనల మధ్య శనివా రం పూర్త య్యాయి. గ్రామంలో మట్టి గోడలతో ఉన్న 80 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గ్రామమంతా నీట మున గడంతో బియ్యం, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తు వులు తడిసి పాడైపోయాయి. ఇళ్లలో, బయట ఎక్క డ చూసినా బురదతోనే నిండిపోయి కనిపిస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోవడంతో కొండాయి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పారిశుధ్య చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో.. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలేక చీకటిలోనే మగ్గుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు ఉన్నంత సేపు కాస్త రాకపోకలు, అవసరమైన సరుకులు అందుతున్నాయి. ఆ బృందాలు వెళ్లిపోతే.. అడవి గ్రామంలో చిక్కుకుపోయినట్టేనని గ్రామస్తులు వాపోతున్నారు. మరణంలోనూ వీడకుండా.. కొండాయి గ్రామస్తులు రషీద్, ఆయన భార్య కరీమా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వరద దాటుతుండగా కొట్టుకుపోయారని.. చనిపోయేంత వరకు వారు కలిసే ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. మృతదేహాలు కూడా చేయిపట్టుకునే ఉన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న కొండాయి గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందజేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తక్షణ సాయంగా రూ.25 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. శనివారం అధికారులతో కలసి ఆమె బోట్లలో కొండాయి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వరద బాధితులను ఓదార్చారు. ఆస్తి, పంటల నష్టంపై అధికారులు సర్వే చేసి నివేదిక ఇస్తారని.. అనంతరం తగిన సాయం అందిస్తామని తెలిపారు. -
భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?
సాక్షి, ములుగు జిల్లా: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం రీత్యా వేర్వేరుగా ఉంటున్నారు. ఆ ఎడబాటు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భార్యపై అనుమానంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అనుమానం కాదు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని భార్య, ఆమె తల్లితో పాటు పెద్ద మనుషులు సూచించారు. దీంతో భర్త నిఘా పెట్టి భార్య బండారాన్ని బయట పెట్టాడు. చదవండి: హాస్టల్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం ములుగు జిల్లాలోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శిగా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాల రిత్యా సుమలత చిన్నబోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా.. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. అయితే.. ఇటీవల భార్య-భర్తల మధ్య ఏర్పడిన అనుమానం.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తన ఇంటర్ క్లాస్మెంట్ లింగరాజుతో సుమలత సన్నిహితం పెంచుకుంది. దీంతో భర్త పురుషోత్తం అనుమానం మరింత పెరిగింది. ప్రవర్తన మార్చుకోవాలని.. పలు మార్లు భార్యను హెచ్చరించాడు.. భర్త పురుషోత్తం. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంని నిందించి, అనుమానం కాదు అవసరమైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని సూచించింది. పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని పోలీసులకు అప్పగించిన్నట్లు భర్త పురుషోత్తం తెలిపారు. -
పోడుపై కీలక భేటీ.. కేసీఆర్ నిర్ణయాలపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/ ఏటూరునాగారం /ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారం వంటి అంశాలపై ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న దానిపై అటవీశాఖ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమైన సమావేశంలో పోడు ఆక్రమణలను క్రమబద్ధీకరించే దిశలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో పోడు భూములపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు. అటవీ శాఖతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధి కారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. 2005 తర్వాత మళ్లీ పోడు భూముల పేరిట అటవీ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టంపై పర్యా వరణ నిపుణుల వాదనలు, ఇతర అంశాలు పరిగణ నలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చ ని, అటవీశాఖకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలతో కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏరియల్ సర్వే పోడు భూముల సాగు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో అధికారులు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ చేసినట్లు సమాచారం. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన భూముల వివరాలు, పోడు భూముల దరఖాస్తులపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని తెప్పించుకుంది. పోడు భూముల సర్వే పూర్తయ్యే వరకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పోడు భూములపై ఆరా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, అటవీశాఖ డీఎఫ్ఓలు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో.. పోడు భూముల కమిటీ సభ్యులు శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఏయే తెగలు నివాసం ఉంటున్నాయో ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో పోడు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
ములుగు: పోలీసులు మావోయిస్టు పార్టీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డంప్ వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ నాయకులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బడె చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్, మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఆదేశాల మేరకు దళం సభ్యులు, మిలీషియా సభ్యులు కాల్వపల్లి అటవీ ప్రాంతంలో డంప్‌ను దాచినట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు అడవిలో మూడు అడుగుల లోతులో తవ్వకాలు జరపగా నీలిరంగు డ్రమ్ము దొరికినట్లు తెలిపారు. అందులో 25 జిలెటెన్‌స్టిక్స్, 25 డిటోనేటర్లు, విప్లవ సాహిత్య పుస్తకాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు వివరించారు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టు పార్టీ ప్రయత్నం చేస్తోందని ఎస్పీ అన్నారు. -
యువతి ఆత్మహత్య..మంత్రాల నేపంతో దారుణం
సాక్షి, ములుగు: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా... కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మనిషి ఇంకా తన పాత పద్దతులను వీడటం లేదు , మంత్రాల నేపంతో మనుషులను చంపుతూనే ఉన్నాడు. చెప్పుడు మాటలు విని.. అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. మంత్రాలు నేపంతో ఓ యువకున్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్ (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి సురేష్ మృతుడి ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు. మృతుడికి తల్లిదండ్రలు ఎవరూ లేరు. పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీ సీఎచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. చదవండి:బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
కరోనాతో ప్రపంచదేశాలు గడగడ.. వారి జోలికి మాత్రం పోలేదు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ములుగు: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారితో గడగడలాడుతున్నాయి. కానీ వారి జోలికి మాత్రం పోలేదు. కరోనాతో సంబంధం లేకుండా ఆదివాసీ గిరిజన ప్రజలు సాఫీగా జీవనం సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, ఇల్లెందు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బారిన పడకపోవడం గమనార్హం. ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడం, అడవుల్లో లభించే దుంపలు, కాయలు, ఆకులు, చింతపూలు ఆహారంగా తీసుకుంటుం టారు. అడవుల్లో లభించే విప్ప పువ్వు, కాయలు వాడుతారు. విప్ప పువ్వును ఆహారంగా తీసుకుంటూ.. విప్ప కాయలను గానుగ పట్టి నూనె తయా రు చేసుకుంటున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. పైగా కూరగాయలన్నీ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నా రు. తమ గ్రామాలు దాటి ఎలాంటి శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లట్లేదు. మాస్కులు, శానిటైజర్లు సైతం అవసరం లేకుండానే ఆయా గ్రామాల ప్రజలు నిశ్చింతగా ఉంటున్నారు. సాగుకే పరిమితం.. పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలంలో 50 గిరిజన గ్రామాలుండగా.. 5 గ్రామాల్లో ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. ఆళ్లపల్లి మండలంలో 40 గ్రామాలుండగా.. వీటిలో 5 గ్రామాల్లోనే కరోనా కేసులు నమోదయ్యాయి. కరకగూడెం మండలంలో 7 గ్రామాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. పినపాక మండలంలోని పలు గ్రామాలు కోవిడ్ తమ దరికి చేరనీయలేదు. టేకులగూడెం, ఎర్రగుంట, పిట్టతోగు, ఉమేశ్ చంద్రనగర్, సుందరయ్యనగర్, తిర్లాపురం గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారు మాస్కులు, శానిటైజర్లు వాడట్లేదు. అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని మనుబోతులగూడెంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో 4 గొత్తికోయ గ్రామాలున్నాయి. ఐతయ్య గుంపులో 41, మడకం మల్లయ్య గుంపులో 11, మనుబోతులగూడెం గ్రామంలో 20 కుటుంబాలు, సంతోష్ గుంపు 28, పొడియం నాగేశ్వరరావు గుంపు 20, వేములూరు గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి వారు ఇతర గ్రామాలకు, శుభకార్యాలకు వెళ్లకపోవడం, ఎక్కువ శాతం ఆ గ్రామానికే పరిమితం కావడంతో కరోనాకు దూరంగా ఉన్నారు. పైగా ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాల వారు వచ్చే పరిస్థితి కూడా లేదు. జూలూరుపాడు మండలంలోని బాడవప్రోలు గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్ కేసు నమోదు కాలేదు. భద్రాచలం నియోజకవర్గంలోని చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న చర్ల మండలం వీరాపురం గ్రామంలో 36 కుటుంబాలకు చెందిన 185 మంది జనాభా ఉన్నారు. ఇక్కడా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటికీ అవే ఆచార వ్యవహారాలు ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట, పూబెల్లి పంచాయతీల్లో పలు గిరిజన గూడెంలలో కరోనా జాడలు లేవు. ముఖ్యంగా ముత్తారపుకట్టలో వీరాపురం, కోటగడ్డలో మాణిక్యారం పంచాయతీలో ఒంపుగూడెం, పూబెల్లి పంచాయతీలో పూబెల్లి, పూబెల్లి స్కూల్ గుంపు, దండగుండాలలో కరోనా ఒక్కరికి కూడా రాలేదు. వీరాపురంలో 100 కుటుంబాలు, కోటగడ్డలో 30 కుటుంబాలు, ఒంపుగూడెంలో 100 కుటుంబాలు, పూబెల్లిలో 75 కుటుంబాలు, పూబెల్లి స్కూల్ గుంపులో 100 కుటుంబాలు, దండగుండాలలో 40 కుటుంబాలు ఉన్నాయి. వీరాపురంలో లంబాడీ, ఆదివాసీలు మినహా మిగిలిన ఈ గూడేలన్నీ ఆదివాసీలవే. వీరు తెల్లవారుజాము నుంచి వ్యవసాయ పనుల్లో ఉండటంతో బయటకు వెళ్లే సమయం కూడా దొరకట్లేదు. ఇప్పటికీ గిరిజన ఆచార వ్యవహారాలు గూడేలలో సాగుతున్నాయి. గంజి, గటకే ఆహారం! కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల గ్రామపంచాయతీలో గంగమ్మ కాలనీ ఆదివాసీగూడెం ఉంది. ఈ గూడెంలో 24 ఇళ్లు మాత్రమే ఉంటాయి. వీరంతా వారికి సంబంధించిన పోడులను సాగు చేసుకుంటున్నారు. అడవిలో దొరికే దుంపలు, ఆకుకూరలను తింటూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా చింతపూలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు. సౌర విద్యుత్‌నే వాడుతారు. పాల్వంచ మండలం రాళ్లచెలక గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. అంతా ఆదివాసీలే. అడవిలో దొరికే వాటితోనే జీవనం సాగిస్తారు. తునికాకు సేకరణ, అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మకాలు చేసి జీవనం సాగిస్తారు. ఉదయన్నే గంజి తాగుతారు. గటక తింటారు. పాల్వంచ మండలం ఎర్రబోరు ఆదివాసీ గూడెంలో 150 కుటుంబాలున్నాయి. వీరు వరి, జొన్న వంటి పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. శనగకుంట.. కరోనా లేదంట ములుగు జిల్లా శనగకుంట గ్రామంలో 153 కుటుంబాలు, 482 మంది జనాభా, 252 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. గూడెం వాసులు ఎక్కువగా ఆకుకూర, బొద్దికూరలు, గురుజవెండి చెట్టు, పొత కాయలతో పచ్చడి చేసుకొని తింటారు. వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకుంటారు. సాధారణగా లభించే కూరగాయలు, పప్పులు ఆహారంగా తీసుకుంటారు. తాగునీటి అవసరాలను బోరుబావుల ద్వారా తీర్చుకుంటారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తల సూచనలు, సలహాలను తు.చ. తప్పక పాటిస్తారు. ములుగు జిల్లా లవ్వాల గ్రామానికి చెందిన ఈమె పేరు వాసం లక్ష్మి. ఇప్పటివరకు మూడు సార్లు కరోనా పరీక్ష చేసుకుం టే అన్నిసార్లు నెగెటివ్ వచ్చింది. మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అవసరాల కోసం మాత్రమే బయటకు వెళ్తుంది. మిగతా రోజులు వ్యవసాయ పనులు చేస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మాంసాహారం తీసుకోదు. పప్పుదినుసులు, ఆకుకూరలే ఆహారంలో ప్రధాన భాగం. ములుగు జిల్లా ఎక్కెల గ్రామానికి చెందిన ఈమె పేరు దుబ్బ కన్నమ్మ. ఇప్పటివరకు రెండు సార్లు కరోనా పరీక్ష చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఈమె అత్యవసర పని ఉంటే తప్ప గ్రామం నుంచి బయటకెళ్లదు. ఎక్కువగా పప్పుదినుసులు, ఆకుకూరలనే ఆహారంలో తీసుకుంటారు. వేసవిలో మొక్కజొన్న అంబలి తాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పనులు చేస్తుంది. గ్రామం నుంచి బయటకు వెళ్తే మొఖానికి ఏదైనా టవల్ లాంటిది కట్టుకుంది. ఎవరికి తాకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. మా దరిదాపుల్లోకి కూడా రాదు కరోనా మా దరిదాపుల్లోకి కూడా రాలేదు. రాదు కూడా.. ఎందుకంటే మేం మానవ ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామాల్లో ఉంటున్నాం. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలను స్వయంగా పండించి వాటినే ఆహారంగా తీసుకుంటాం. ఆకుకూరలు, కూరగాయలు, నూనెలు వంటివి స్వయంగా సమకూర్చుకుంటాం. ఇప్పనూనెలో శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుందని మా పూర్వీకులు చెప్పారు. – మడవి నంద, వీరాపురం ఆదివాసీ గ్రామం, చర్ల మండలం సమష్టి జీవన విధానమే మంత్రం గిరిజన గూడేలలో నేటికీ సమష్టి జీవన విధానం వల్ల గిరిజనం ఒకే మాట, ఒకే బాటపై కట్టుబడి ఉంటున్నారు. ముత్తారపు కట్ట పంచాయతీలో వీరాపురం, కోటగడ్డలో కరోనా జాడలేదు. పంచాయతీ తరఫున హైపోక్లోరైట్, బ్లీచింగ్ పిచికారి చేస్తున్నాం. మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. కూరగాయలు పండించుకోవటం, పప్పులు ఇంటి నుంచే సేకరించుకోవడం, చింతపండు మా వద్దే ఉంటుంది. ఆరోగ్యం బాగోలేకుంటే గటక, జావ తాగుతారు. ఇలా బయటి ఆహార పదార్థాలంటేనే ముట్టుకోరు. – మంకిడి కృష్ణ, సర్పంచ్, ముత్తారపుకట్ట పంచాయతీ -
అల్లుడిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు!
సాక్షి, పాలకుర్తి(ములుగు): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ చివరకు భర్తకు దేహశుద్ధి చేయించే వరకు వెళ్లింది. ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భర్త చెడు వ్యసనాలకు అలవాటుపడి తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని నీరజ కేసు పెట్టింది. దీంతో మురళి జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు విడిగా ఉంటున్నారు. ఇటీవల మురళి తల్లి మృతి చెందడంతో నీరజ వచ్చి వావిలాలలో అతడితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తనతో పాటు పిల్లల్ని కొట్టాడని నీరజ తిరిగి మల్లంపల్లికి వెళ్లి దాడి విషయం కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నీరజ కుటుంబ సభ్యులు వావిలాలకు వెళ్లి మురళిని మల్లంపల్లికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం ఎస్సై సతీష్ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దని హెచ్చరించి పంపించారు. -
బాలుడి ఆచూకీ చెబితే రూ.లక్ష!
గీసుకొండ: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా రేణి గ్రామానికి చెందిన పలువురు గత ఏడాది కొమ్మాల జాతరలో ఆట వస్తువులు అమ్ముకునేందుకు వచ్చారు. వీరిలో భగర్య ధర్మవీర్– సీత దంపతుల కుమారుడు భగర్య ప్రదీప్(6) అదే ఏడాది మార్చి 10న జాతరలో తప్పిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులతోపాటు, బాలల సంరక్షణ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. బస్సులపై పోస్టర్లు అంటించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు ఎప్పటికైనా తిరిగి రాకపోతాడా అని తల్లిదండ్రులు కొన్ని నెలల పాటు ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. అయితే, బాలుడు తప్పిపోయి ఏడాది గడిచిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. కాగా, శనివారం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చిన మామునూరు ఏసీపీ నరేష్కుమార్ బాలుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నజరానా అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే, ఈసారి జాతరలో కూడా బాలుడి వాల్‌పోస్టర్లు వేయిస్తామని పేర్కొన్నారు. చదవండి: నిర్లక్ష్యం: స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకుంటూ.. -
ఇటు పోలీస్ డ్యూటీ.. అటు పాల డెయిరీ
కరీమాబాద్ : ఎప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి వస్తుందో.. తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. ఖాళీ సమయంలో పాల డెయిరీ నిర్వహణలో పాలు పంచుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వరంగల్ గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్లో పనిచేస్తూ విధుల నుంచి వచ్చాక, వెళ్లే ముందు తమ ఇంట్లో పెంచే పదిహేనుకు పైగా పాడిగేదెల ఆలనాపాలనా చూస్తున్నారు. పాలు పితకడం మొదలు అన్ని పనులు చేయడమే కాకుండా పాలను ప్యాకెట్లలో నింపి తన భర్త సురేష్ ద్వారా ఇంటింటికి చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లల బాగోగులు చూస్తూ ఆదర్శ మాతృమూర్తిగా తోటకూర స్వప్న నిలుస్తున్నారు. చదవండి: ‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’ -
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
సాక్షి, ములుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెం గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వేసవికాలం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి చెరువులో ఈతకి వెళ్లి, పూడిక తీసిన గుంతలోపడి ఇద్దరుబాలురు మృతిచెందారు. మృతులు మండలరేశ్వంత్ (12), ముచ్చపోతులవీరేందర్ (12)గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
మేడారం జాతరకు 4 వేల బస్సులు
ములుగు/మేడారం: మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని 51 ప్రాంతా ల నుంచి 4 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) యాదగిరి చెప్పారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్లో శనివారం ఇంజనీరింగ్ ఈడీ వినోద్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లుతో కలసి విలేకరులతో మాట్లాడారు. జాతర మొదలయ్యే ఫిబ్రవరి 2 నుంచి 9వరకు సేవలు అందిస్తామని, 23 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మేడారం విధుల్లో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది 12,500 మంది పాల్గొంటారని, 59 ఎకరాల్లో బస్టాండ్, 39 క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సర్వేలెన్స్ కెమెరాలను బిగించి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. జాతర సమయంలో ప్రస్తుతం ఉన్న చార్జీలకు 50% అదనంగా వసూలు చేయనున్న ట్లు వివరించారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, త్వరలో స్టేషన్ల వారీగా బస్సు చార్జీల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అంతకు ముందు మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. -
మేడారంలో ఆదివాసీ ఇలవేల్పులు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలైన సమ్మక్క – సారలమ్మ చెంత 4 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కొలిచే వివిధ ఇలవేల్పులను తీసుకొచ్చి సమ్మేళనం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 500 మంది ఆదివాసీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మూడ్రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఆదివాసీ తెగలకు సంబంధించి ఇలవేల్పులు, దేవతలను ఒక్కచోట పూజించాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 4 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు కొలిచే ఇలవేల్పుల పడిగెలు (ఆదివాసీ ప్రతిమలు) ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ తరహా వేడుకలు జరగడం ఇదే తొలిసారని ఆదివాసీలు తెలిపారు. ప్రతిరోజూ సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్దకు తోడ్కొని వచ్చి ఆదివాసీ సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ గీతాలు, సంగీత వాయిద్యాల హోరుతో మేడారం పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. కాగా, ఆదివాసీ ఇలవేల్పుల సమ్మే ళనం ముగింపు కార్యక్రమం మంగళవారం మేడారంలో జరిగింది, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
సాక్షి, వెంకటాపురం: పక్కా ప్లాన్‌తో భార్యను హతమార్చి తప్పించుకు తిరుగుతన్న భర్తను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త తోట రమేష్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భార్యను హత్యచేసి పరారీలో ఉన్న నిందితున్ని వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రమేష్ వద్ద నుంచి బంగారు గొలుసు, చెవిదుద్దులు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యను తనే హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతడిని కోర్టుకు తరలించారు. -
నేడు మంత్రుల రాక
సాక్షి, ములుగు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు. ముందుగా 11గంటల 15 నిమిషాలకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కలెక్టరేట్లో అందజేయనున్న ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. -
ఉధృతంగా గోదావరి ప్రవాహం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు/భద్రాచలంటౌన్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట తదితర ఏజెన్సీ మండలాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం రాత్రి 9.1 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం ఉదయం 9.92 మీటర్లకు చేరింది. శనివారం 8.5 మీటర్లకు నీటిమట్టం చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఆదివారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం 10.9 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముల్లకట్ట వద్ద 75 మీటర్ల ఎత్తులో సుమారు 2 కిలోమీటర్ల వెడల్పుతో 163 జాతీయ రహదారిని తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలోని రాంనగర్, పరిసర తండాలను గోదావరి వరద చుట్టుముట్టింది. రాంనగర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడకు చెందిన 150 పశువులు వరదలో చిక్కుకోవడంతో వాటిని రైతులు తాళ్ల సహాయంతో బయటకు తీశారు. వెంకటాపురం మండలం బెస్తగూడెం సమీపంలోని గోదావరి లంకల్లో గొర్రెల కాపరులు, గొర్రెలు చిక్కుకున్నాయి. వెంకటాపురం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నాటు పడవల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 43 అడుగులు ఉన్న వరద రాత్రి 7 గంటలకు 50.06 అడుగులకు చేరింది. దీంతో ఒక్క రోజులోనే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. జూరాలకు 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో గద్వాల టౌన్: కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రోజురోజుకూ వరద పెరుగుతోంది. దీంతో జూరాలకు ఆదివారం 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, సోమవారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 క్రస్టు గేట్లను ఎత్తి 1,32,853 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 34,422 క్యూసెక్కులను మొత్తం 1.72 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్స్ సంచారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారంరోజుల క్రితమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. దీనితో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివాసీలు బయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇన్ఫార్మర్ వ్యవస్థని మరో మారు మావోయిస్టులు టార్గెట్ చేసారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, పస్రా, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు చేస్తూ మాజీ మావోయిస్టులపై పోలీసులు కన్నేశారు. వారి కదలికలపై వారం నుంచి దృష్టి పెట్టారు. మావోయిస్టు టార్గెట్ లిస్ట్‌ల ఉన్న స్థానిక ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతానికి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏజెన్సీలో పర్యటించవద్దని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడి పోలీస్ స్టేషన్లకు అదనపు భద్రత కల్పించిన పోలీసులు.. ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ వారికి మావోయిస్టులు తరస పడితే.. భారీ ఎన్కౌంటర్ జరిపేందుకు ప్రణాళిలు కూడా రచిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. -
యువతిని కాపాడిన పోలీస్..
సాక్షి, ఏటూరునాగారం(ములుగు): ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు వారిని రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే వారిపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి.. కాపాడారు. నీళ్లలో మునిగిపోతున్న యువతిని వెలికితీసి.. ప్రాణాలు కాపాడి నిజమైన పోలీస్ అనిపించున్నాడు వాజేడు ఎస్ఐ కృష్ణప్రసాద్. మండలంలోని తాళ్ళగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ పర్వతం మల్లేశ్వరీ.. ముల్లకట్ట బ్రిడ్జ్ పై నుంచి నీళ్లలోకి దూకి ఆత్మహత్య ప్రయత్రం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన వాజేడు ఎస్ఐ కృష్ణప్రసాద్‌తోపాటు అక్కడే ఉన్న ఓ వాహనదారుడు సకాలంలో స్పందించి ఆమెను కాపాడారు. ఇటీవలే కరీంనగర్‌లోని జమ్మికుంట పట్టణంలో ఎస్ఐ సృజన్ రెడ్డి సాహసోపేతంగా బావిలోకి దిగి ఇద్దరిని కాపాడిన విషయం తెలిసిందే. ఈ అపూరూప దృశ్యాన్ని మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడం విశేషం. -
ఫిబ్రవరి 6న గద్దెపైకి సమ్మక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో 2020లో నిర్వహించే శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి గడియల ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటిం చారు. ఆదివారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. 6న గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తెస్తారు. 7న వనదేవతలకు మొక్కుల చెల్లింపు, 8న తల్లుల వనప్రవేశం ఉంటుందని వెల్లడించారు. మహాజాతర తేదీల ఖరారుకు సంబంధించిన లేఖను మేడారం దేవాదాయశాఖ అధికారులకు అందజేయనున్నట్లు పేర్కొ న్నారు. 2018లో జరిగిన మహాజాతరకు సంబంధిం చిన తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించిన పూజారులు 2020లో జరిగే జాతర తేదీలను మాత్రం 9 నెలలు ముందుగా ప్రకటించారు. జాతర తేదీలను ముందుగా ప్రకటించడంతో అభివృద్ధి పనులు, ఏర్పాట్లు చేపట్టడానికి ప్రభుత్వానికి వీలుంటుంద న్నారు. సమావేశంలో పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చందా గోపాల్‌రావు, ఉపాధ్యక్షు డు కాక సారయ్య, కార్యదర్శులు సిద్దబోయిన స్వామి, భోజరావు తదితరులు పాల్గొన్నారు. వరుస ఎన్నికలతో నిధుల ప్రతిపాదనలు మూలకు.. 2018లో జరిగిన పెద్ద జాతరకు హాజరైన సీఎం కేసీఆర్ జాతర శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చారు. దీంతో జాతర అనంతరం ఆ మేరకు చేపట్టనున్న అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ముంద స్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత పార్లమెం టు ఎన్నికలు, ఆపై స్థానిక సంస్థల ఎన్నికలు రావడం తో జాతర నిధుల విషయం అటకెక్కింది. -
ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు
ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌లు గెలుపొందడం విశేషం. అజ్మీరా చందూలాల్.. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం. అజ్మీరా సీతారాంనాయక్ వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోరిక బలరాం నాయక్ 2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్‌పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
3 జిల్లాలకు నాన్–కేడర్ కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతోపాటు వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నాన్ కేడర్ అధికారులకు పదోన్నతులిస్తూ ఈ నియామకాలు చేపట్టారు. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషాకు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. నల్లగొండ జిల్లా జేసీగా ఉన్న సి.నారాయణరెడ్డిని కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్ జేసీ ఎస్.వెంకటరావును మరో కొత్త జిల్లా నారాయణపేట కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లుగా నియమితులైన ముగ్గురూ నాన్ ఐఏఎస్ అధికారులే. ప్రస్తుతం వీరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) హోదాను కలిగి ఉన్నారు. వీరికి ఐఏఎస్ హోదా కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిపోయిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించేందుకు సరిపోయే సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో లేరు. కొందరు ఐఏఎస్‌లు కొన్నేళ్లుగా అప్రధాన్య పోస్టుల్లో కొనసాగుతున్నారు. పోస్టింగ్‌ల విషయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నాన్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించడం గమనార్హం. ఐఏఎస్ కాని వారిని కలెక్టర్లుగా నియమించడం ఇదే తొలిసారి అని, ఇంతకు ముందు నాన్ ఐపీఎస్ అధికారులను జిల్లా ఎస్పీలుగా నియమించడంతో ఈ సంప్రదాయం ప్రారంభమైందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. బి.జనార్దన్ రెడ్డికివిద్యాశాఖ బాధ్యతలు విద్యాశాఖ కార్యదర్శిగా బి.జనార్దన్‌రెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన పురపాలక శాఖ డైరెక్టర్‌గా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లుగా పనిచేశారు. గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. -
రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
-
రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడుగా మరోరెండు నూతన జిల్లాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 17(ఆదివారం) నుంచి ములుగు, నారాయణపేట జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. 9 మండలాలతో కూడిన ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా పరిధిలోకి రానున్నాయి. నారాయణపేట జిల్లాను 11 మండలాలతో ఏర్పాటు చేశారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఉట్కూర్, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు నారాయణపేట పరిధిలోకి రానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క - సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. -
తెలంగాణలో ఇకపై 33 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఇక 33 కానున్నాయి. ఇప్పటికే 31 జిల్లాలు ఉండగా, అదనంగా మరో రెండు నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమ్మక్క ములుగు, నారాయణపేటను జిల్లాలుగా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఫైల్ పీఎంవో కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్నాక, జిల్లాల ఏర్పాటుపై అధికారికంగా నోటిఫికేషన్ వెలువడించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క - సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. అప్పటికే 2016, అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి.