Naresh (actor)
-
మా అమ్మ సినిమాలు చేసేటప్పుడు నేను పడే బాధ: నటుడు నరేష్
-
నా ఫిట్ నెస్ డైట్ సీక్రెట్ ఇదే
-
మా అమ్మకు నన్ను పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు
-
మహేష్ బాబు ఏడ్చినప్పుడు నేను ఏడ్చేశా..!
-
పవిత్రతో నా జీవితం ఎలా ఉందంటే?: నరేశ్
తొమ్మిదో ఏట ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు వీకే నరేశ్. పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే అతడు ‘ఐఎస్ సీఏహెచ్ఆర్(ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్)’ నుంచి 'సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నాడు. సగం మంది విడాకులే వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ నటి పవిత్ర లోకేశ్‌తో కలిసి జీవిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవిత్రతో కొత్త జీవితం ఎలా ఉందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. దీనికి నరేశ్ స్పందిస్తూ ముందుగా ఏవేవో లెక్కలు వేశాడు. 'ప్రపంచంలో దాదాపు సగం మంది విడాకులు తీసుకుంటున్నారు. 70% మంది వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. విడిపోయి ఎవరికి వారు సొంతంగా బతుకుతున్నారు. మంచి, చెడ్డ పక్కన పెడితే ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండాలి. ముందు సంతోషంగా లేను అలాగే తోడు లేకుండా ఉండలేమా? అంటే 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు అవసరం. ఈ సమయంలో సరైన భాగస్వామి అవసరం. నాకు ముందు జరిగిన పెళ్లిళ్ల వల్ల సంతోషంగా లేను. అందుకే విడాకులు తీసుకున్నాను. నేను సెలబ్రిటీ కాబట్టి విమర్శలు, వివాదాలు వస్తాయి. అన్నింటితో పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రస్తుతం పవిత్రతో నేను సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: థియేటర్లో సినిమా చూసి జక్కన్న.. కీరవాణి నిద్రపోతున్నాడా? -
కెరీర్ కోల్పోయా.. డిప్రెషన్, ఆర్థిక ఇబ్బందులు.. నరేశ్ ఎమోషనల్
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు నటుడు నరేశ్. దివంగత నటి, దిగ్గజ దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఇతడు తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. ఈయన సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు కావస్తుండగా తన గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని నరేశ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఐక్యరాజ్య సమతి అనుబంధ సంస్థ అయిన ఐఎస్ సీఏహెచ్ఆర్ (ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్) నుంచి ఆయన సార్ అనే బిరుదుతో పాటు డాక్టరేట్‌ను అందుకున్నాడు. నాలో స్ఫూర్తిని నింపింది.. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై ప్రసంగించినందుకుగానూ నరేశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. అంతేకాదు ఇకపై నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్ అనే హోదా చేరుతుంది. ఈ సంతోషం నరేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అతడు తన గోల్డెన్ జూబ్లీ గురించి ఆసక్తికర పోస్ట్ వేశాడు. అలాగే తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎంతగానో ఇన్స్పైర్ చేసిన పాటను షేర్ చేశాడు. ఇష్టమైనవాళ్లు వదిలేసి పోయారు.. 'నా జీవితం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు ఈ పాట నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. ఆ సమయంలో నేను కెరీర్ కోల్పోయాను, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇష్టమైనవాళ్లు శాశ్వతంగా దూరమయ్యారు. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఓ జోకర్ నాపై పనికిరాని కేసు వేసినప్పటికీ నా తల్లి, స్నేహితుడు విజయ్ మద్వా మాత్రమే నాకు అండగా నిలబడ్డారు. సుమారు 100 కిలోల దాకా బరువు ఉండే నేను ఇప్పుడిలా మారిపోయాను. ఈ పాట నాలో స్ఫూర్తిని నింపడమే కాదు, నేను శక్తివంతంగా కమ్‌బ్యాక్ ఇచ్చేలా చేసింది. డిప్రెషన్లో అప్పుడలా.. ఇప్పుడిలా.. నేనిప్పుడు సినీప్రయాణంలో 50వ సంవత్సరంలో ఉన్నాను. ఈ మైలురాయిని అందుకోవడంతో తోడ్పడిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రియురాలు పవిత్ర లోకేశ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన వీడియోలను సైతం సదరు పోస్ట్‌లో పొందుపరిచాడు. అలాగే 2003లో డిప్రెషన్లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాను? 2023లో గోల్డెన్ జూబ్లీ వచ్చినప్పుడు ఎలా ఉన్నానో తెలియజేస్తూ అప్పటి, ఇప్పటి ఫోటోలను పక్కపక్కన పెట్టాడు నరేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. This one song, inspired me during the toughest period of my life, losing my career, facing financial strain, and the departure of supposed loved ones. Despite heckling from relatives and being labeled a 'fome case' and a joker, only my Mother and friend Vijay Wadhwa stood by… pic.twitter.com/GXRqneF0CS — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 29, 2023 చదవండి: సినిమాలకు హీరోయిన్ ఇలియానా గుడ్‌బై? -
నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు
సీనియర్ నటుడు నరేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేశ్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా 'సార్' అనే బిరుదుతోపాటు 'డాక్టరేట్'ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో నటుడు నరేశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేశ్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా నరేశ్‌ను నియమించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్‌కు 'సర్' బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. దేశంలో ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి నటుడిగా నరేశ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ కార్యక్రమంలో ప్రముఖులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని నరేశ్ ఈ సందర్భంగా తెలిపారు. తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
నా కుమారుడు అంతర్జాతీయ అవార్డు గెలిచాడు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ మొదట్లో నటుడిగా సినిమాల్లో కనిపించాడు. కానీ తర్వాత ఉన్నట్లుండి వెండితెరపై మాయమయ్యాడు. చాలాకాలం తర్వాత అతడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేశాడు. అయితే ఈసారి నటుడిగా కాకుండా దర్శకుడిగా తెర వెనకనుంచి పని చేశాడు. సత్య అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఈ లఘు చిత్రంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించారు. ఇటీవల ఈ షార్ట్ ఫిలిం నుంచి సోల్ ఆఫ్ సత్య పేరిట సాంగ్ రిలీజైంది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ షార్ట్ ఫిలిం తాజాగా అరుదైన ఘనత అందుకుంది. న్యూయార్క్‌లో అంతర్జాతీయ ఒనిరోస్ ఫిలిం అవార్డ్స్ వేదికపై ఈ లఘుచిత్రాన్ని ప్రదర్శించగా రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా నవీన్ విజయకృష్ణ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే సత్య షార్ట్ ఫిలింకు హానరబుల్ మెన్షన్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. మీ ఆశీర్వాదాలు కావాలి 'సాయిధరమ్ తేజ్ తదితరులు నటించిన సోల్ ఆఫ్ సత్య సినిమా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒనిరోస్ అవార్డు వేదికలో సత్తా చాటింది. ఈ షార్ట్ ఫిలింకు గానూ నా తనయుడు నవీన్ బెస్ట్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అవార్డు గెలిచాడు. మా కుటుంబంలో నాలుగోతరం నుంచి వచ్చి తన అభిరుచిని కొనసాగించాలనుకుంటున్న ఈ యువ దర్శకుడికి మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ షార్ట్ ఫిలింను హిందీలో కూడా అందిస్తున్నాం. సమయం దొరికినప్పుడు చూసేయండి. థాంక్యూ సో మచ్' అని నవీన్ తండ్రి నరేశ్ ట్వీట్ చేశాడు. అప్పుడు హీరోగా, ఇప్పుడు దర్శకుడిగా.. కాగా 2016లో ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో నవీన్ విజయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘రెండు జెళ్ల సీత’ అనే సినిమాలు చేశాడు. కానీ, పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోగా రాణించలేకపోయిన నవీన్ చాలాకాలం సినిమాలకు దూరమయ్యాడు. బరువు కూడా భారీగా పెరిగాడు. చాలాకాలం తర్వాత ‘సత్య’ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Shubodayam! 🙏🏻 I’m delighted to share that my son, Nawin, has won the award for Best First-Time Director for his film “SOUL OF SATHYA,” featuring Sai Dharam Tej and others, at the prestigious international “ONIROS AWARDS.” We humbly request your best wishes and blessings for… pic.twitter.com/Sf9EgHVBe4 — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 8, 2023 Our little baby #Satya starts its journey with a bang! 💥 We are proud to announce that our super cool Director @NawinVK has won the Best 1st Time Director award at the @OnirosFilmAward - New York 😍 & Also happy to receive the Honorable Mention award for #Satya 🇮🇳 pic.twitter.com/ONqgSUC82K — Dil Raju Productions (@DilRajuProdctns) November 7, 2023 చదవండి: తల్లిని చూసి చంటిపిల్లాడిలా ఏడ్చేసిన గౌతమ్.. అమ్మ ప్రేమ గుర్తొచ్చి ప్రిన్స్ కంటతడి.. -
నరేష్ గారితో నటించాలంటే ఏదోలా ఉంది: వెంకటేష్ మహా
-
ఓటు విలువ చెప్పే సినిమా..అందరూ తప్పక చూడండి
-
విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్
చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు. తేజ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా రణ్వీర్ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్‌షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్‌లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు. (ఇదీ చదవండి; డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) -
నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!
సీనియర్ నటుడు నరేశ్ కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విబేధాలు, పవిత్ర లోకేశ్‌తో ప్రేమాయణం.. ఆపై కోర్టు కేసులు ఇలా వీటితోనే సెన్సేషనల్ అవుతూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే అతడి మొదటి భార్య తనయుడు నవీన్ మొదట్లో నటుడిగా కనిపించి సత్య అనే షార్ట్ ఫిలింతో దర్శకుడిగా మారాడు. తాజాగా అతడు తన తండ్రి గురించి మాట్లాడుతూ.. 'మా ఫ్యామిలీలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. ఎవరి మీదా ఆధారపడరు. మొదటి నుంచీ అదే జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఎవరి గురించి నేను చెడుగా ఫీలవలేదు. జనాలు మా కుటుంబం గురించి ఏది పడితే అది వాగినా నేను పట్టించుకోలేదు. జనాలకు నచ్చినట్లు బతకలేం కదా.. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. అతడు సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేదే మాకు కావాల్సింది! బయట ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతాడు. ఇది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం. పవిత్ర లోకేశ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. చాలా మంచావిడ. నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నానంటే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను. తనను పవిత్రగారు అని పిలుస్తుంటాను' అని నవీన్ చెప్పుకొచ్చాడు. చదవండి: మిస్టర్ ప్రెగ్నెంట్.. డెలివరీ అదిరిపోయింది.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే? -
మా అమ్మ, నానమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు: నరేశ్ తనయుడు
మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించిన లఘు చిత్రం సత్య. ఈ చిత్రానికి సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ దర్శకత్వం వహించాడు. మంగళవారం ఈ సినిమా నుంచి సోల్ ఆఫ్ సత్య అనే పాట విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. 'మూడు సంవత్సరాల క్రితం.. ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ సంవత్సరం జీవితంలో చాలా కోల్పోయాను. అక్కడి నుంచి మళ్లీ ఇక్కడివరకు వచ్చాను. నేను మీ అందరి కామెంట్లు చదివాను. ఇంత లావయ్యి మీ ముందుకు తిరిగి వచ్చాను. జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. నానమ్మ విజయనిర్మల, అమ్మ నేత్ర.. వీళ్లిద్దరూ నేనెప్పుడూ మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. కానీ వాళ్లు బతికుండగా అది నెరవేర్చలేకపోయాను. అందుకే వెనక్కు వెళ్లకుండా మళ్లీ తిరిగి వచ్చాను. సత్య సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నాను. నాకు మా నానమ్మే ఇన్స్పిరేషన్. తను యాక్టింగ్, డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ చూసుకునేది. తను సినిమాలు చేసేటప్పుడు నేను సెట్స్‌లో ఉండేవాడిని. అవన్నీ చూసి నాకు డైరెక్టర్ అవ్వాలనిపించేది. కానీ తనకు మాత్రం నేను నటుడినవ్వాలని కోరుకుంది. అందుకే తనకోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు డైరెక్టర్‌గా మారాను. సత్య సినిమా విషయానికి వస్తే జీవితంలో అందరికీ కష్టాలుంటాయి. మా అమ్మ, నానమ్మ కూడా ఎన్నో కష్టాలు పడ్డవారే! వాళ్లు ఫైటర్స్! వీరిద్దరూ నాకెప్పటికీ ఆదర్శం' అని చెప్పుకొచ్చాడు నవీన్ విజయకృష్ణ. చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే? -
పరీక్షా ఫలితాలు విడుదల.. పవిత్రా లోకేష్ రిజల్ట్ ఏంటంటే
నరేశ్-పవిత్రా లోకేష్‌ల జంట మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి పక్కన పెడితే. తాజాగా పవిత్రా లోకేష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. రీసెంట్గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. (ఇదీ చదవండి; క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్ ఇన్స్టిట్యూట్తో పాటు, భాషా ఇన్స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, లలిత ఆర్ట్ ఇన్స్టిట్యూట్లు వివిధ విభాగాల కింద పరిశోధన అందించబడుతుంది. ఇందులోని మూడు సంస్థలలో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాశారు. కానీ 259 మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్ తెలిపారు. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) కన్నడ విశ్వవిద్యాలయంలోని అధ్యయన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్లను మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తామని ఆయన తెలిపారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్పేది. అందులో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్టెన్షన్ సెంటర్లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్ పరీక్ష రాశారు. మే 30న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో తన వెంట నరేష్ కూడా వెళ్లారు. తాజాగ విడుదలైన ఫలితాలతో ఆమె సంతోషంగా ఉన్నా అక్కడి యూనివర్సిటీలో సీట్ వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. -
ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్
'మళ్లీ పెళ్లి' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మెరిట్ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ బెంగళూరు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రసారం చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాకుండా నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతికి అనుమతి లేదని కూడా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ మీడియా సంస్ధతో ఆయన ఇలా మాట్లాడారు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) 'ఆమెకు (రమ్య రఘుపతి) చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు వసూలు చేసేవారు మా ఇంటికి వస్తున్నారు. ఇది మా కుటుంబంలోని సభ్యులకు (తల్లి వైపు) కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము కోర్టు రక్షణను కోరాము. ఇప్పుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించకూడదని బెంగళూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.' అని నరేష్ తెలిపారు. అంతే కాకుండా నరేష్, రమ్య ఇద్దరూ విడిగా ఉన్నారనే విషయాన్ని కూడా ఆర్డర్ కాపీలో కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తామిద్దరం కలిసి జీవించడం లేదని కోర్టు కూడా నిర్ధారించిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమ విడాకులకు మార్గం సుగమం అయిందన్నారు. అందుకు సంబంధించి తాను ఇప్పటికే కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపిన నరేష్ ఈ తీర్పు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు) ఈ ఏడాది ప్రారంభంలో రమ్య నుంచి విడాకుల కోరుతూ కూకట్పల్లి కోర్టులో తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి తన చుట్టు ఎన్నో వివాదాలు వచ్చాయని నరేష్ ఇలా తెలిపారు. 'నేను, పవిత్ర లోకేష్‌తో కలిసి వుండటాన్ని కొంతమంది పలు రకాలుగా మాట్లాడుకున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఊహాగానాలు చేస్తుంటే, నేను ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇకనుంచి అయినా నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను కాబట్టి ఈ కేసు వల్ల విడాకుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.' అని నరేష్ అన్నారు. -
ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు
మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతికి షాక్ తగిలింది. మెరిట్ లేని కారణంగా బుధవారం నాడు కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేసింది. సినిమాను అడ్డుకునే ప్రసక్తే లేదు సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని న్యాయస్థానం నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ తీర్పు ప్రకారం సినిమాను ఎక్కడైనా నిర్మాతలు స్వేచ్ఛగా ప్రసారం చేయవచ్చు. నరేశ్ ఇంట్లో ప్రవేశానికి రమ్యపై నిషేధం మరో కేసులో నరేష్ కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడి ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని గుర్తించింది. ఆమె కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కూడా పేర్కొంది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు రమ్య రఘుపతిని నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 సంవత్సరాలుగా విడివిడిగా జీవనం ఇకపోతే నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్యాభర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దవుతుంది. కోర్టు ఇచ్చిన తీర్పు.. నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. కాగా రమ్య రఘుపతి.. నరేష్‌పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు .. రమ్య రఘుపతిపై గృహ నిషేధం కేసు పెట్టారు. రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్‌కు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు పెండింగ్‌లో ఉంది. చదవండి: రామ్‌చరణ్ కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ -
తుపాకీ లైసెన్స్ కావాలంటున్న నటుడు నరేశ్
సాక్షి, శ్రీ సత్యసాయి: సీనియర్ నటుడు నరేశ్ తుపాకీ లైసెన్స్ కావాలంటున్నాడు. ఈ మేరకు గురువారం నాడు పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డిని కలిసి తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని కోరాడు. స్వీయరక్షణ కోసమే అతడు తుపాకీ లైసెన్స్ కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా నరేశ్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. పవిత్రా లోకేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జూన్ 24న ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కాగా ఈ సినిమాపై నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! తనను టార్గెట్ చేస్తూ పరువు తీసేందుకే మేకర్స్ సినిమాను నిర్మించారని మండిపడింది. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ మధ్య కోర్టుకు వెళ్లింది. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: 2016 నుంచి పిల్లల కోసం ట్రై చేస్తూనే ఉన్నాం: నటి -
ఆడియన్స్ కి నన్ను చూసి బోర్ కొడితే?
-
నరేష్ తో యాక్టింగ్ అనగానే నా గుండె ఆగిపోయింది
-
జగన్ పాలనపై పోసాని
-
ఆ ఓటీటీలోకే రానున్న 'మళ్లీ పెళ్లి'
సీనియర్ నటుడు నరేశ్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్ ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ హీరోయిన్గా నటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలామంది ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలోకి రాబోతోందని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చే ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలన్నది మేకర్స్ డిసైడ్ చేయనున్నారు. ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వీలైనంత తొందరగానే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ పెళ్లి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య
సీనియర్ నటుడు నరేశ్, అతడి ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా నుంచి లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఇదొక సెన్సేషన్‌గా మారింది. కారణం.. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో ఉండటమే! ఇందులో అతడి మూడు పెళ్లిళ్లు, పవిత్రతో ప్రేమాయణం.. హోటల్లో పట్టుబడ్డ సీన్.. ఇలా అన్నీ ఉన్నాయి. పైగా ప్రమోషన్స్‌లోనూ పవిత్రతో రొమాన్స్ చేయడం, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం విశేషం. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నరేశ్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా శుక్రవారం (మే 26న) విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమా విడుదల ఆపాలంటూ పిటిషన్ వేసింది. దీంతో మళ్లీ పెళ్లి సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: డైరెక్టర్ మాస్ వార్నింగ్ -
ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్‌తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..
టాలీవుడ్లో నరేష్, పవిత్రా లోకేష్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సరే డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్‌తో పవిత్రా లోకేశ్ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నరేష్ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నరేష్‌తో రిలేషన్‌పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
మా బంధానికి మహేశ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం టాలీవుడ్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్-పవిత్రా లోకేశ్ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్,పుటేజీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్‌ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్‌బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు. ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్‌కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.