National Investigation Agency ( NIA )
-
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూలు వద్ద పేలుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి. అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్ఎస్జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం. స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్ ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు. మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు. -
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(12ప్రాంతాలు), తమిళనాడు(5 ప్రాంతాలు), ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట.. మొత్తం 18 ప్రదేశాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందుతుడు ముజ్మిల్ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ముజ్మిల్ మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్ధలు , సాంకేతిక పరికరాలు సరాఫరా చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సోదాల్లో నగదుతోపాటు, వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇక రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. కాగా మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో బాంబు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తుజరుపుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. చదవండి: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ? Rameshwaram Café blast case: National Investigation Agency (NIA) arrested a key conspirator following massive raids across multiple locations in three states. Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator after NIA teams cracked down at 18 locations,… pic.twitter.com/TEzXTXpSv3 — ANI (@ANI) March 28, 2024 -
ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు. -
బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో బళ్లారిలో షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్లిపోయిన నిందితుడి కోసం గాలిస్తూ బుధవారం షబ్బీర్ ఆచూకీని కనుగొన్నారు. బళ్లారిలో మోతీ సర్కిల్ సమీపంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో షబ్బీర్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొంతసేపు విచారించి బెంగళూరుకు తరలించారు. బాంబు పెట్టిన వ్యక్తికి, షబ్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. షబ్బీర్ బళ్లారి సమీపంలో తోరణగల్లు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిíÙయన్‌గా పని చేస్తున్నాడు. బాంబు పేలుడు తర్వాత ప్రధాన నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారికి బస్సులు మారుతూ వచ్చాడు. ఆపై షబ్బీర్ ఇంటికి వచ్చి అతడిని కలిసినట్లు ఎన్ఐఏ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. కాగా, షబ్బీర్‌ను విచారించి రాత్రి వదిలిపెట్టినట్లు సమాచారం. -
Rameswaram Cafe Blast: నిందితుడి జాడ చెప్తే రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: బెంగళూరులో మార్చి ఒకటో తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం అందిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేసింది. కేఫ్‌లోకి అడుగుపెట్టేటపుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్్క, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ హామీ ఇచి్చంది. ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. శక్తివంత పేలుడు పదార్ధం(ఐఈడీ) వాడటంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించడం తెల్సిందే. మొదట కర్ణాటక పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, పేలుడు పదార్ధాల చట్టాల కింద కేసు నమోదుచేశారు. ముంబైలో నవంబర్ 26న ఉగ్రదాడి తర్వాత ప్రత్యేకంగా ఉగ్రసంబంధ ఘటనలపై దర్యాప్తు కోసం ఎన్ఐఏను 2008లో ఏర్పాటుచేశారు. -
బెంగళూరు ‘రామేశ్వరం కేఫ్’ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. గత శుక్రవారం(మార్చి 1) మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీబీ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐకు బదిలీ చేయనుంది. కాగా, అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి.. బెంగాల్ బీజేపీ చీఫ్‌కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు -
బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ పరిధిలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు. 30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు. ‘‘కేఫ్‌లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు. దుండగులను వదలిపెట్టం కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు. -
Bengaluru Cafe Bomb Blast Video: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
-
Watch Video:బెంగళూర్ కేఫ్‌లో పేలిన టైం బాంబ్
సాక్షి, బెంగళూరు: నగరంలో సంభవించిన భారీ పేలుడు.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టైం బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. టిఫిన్ బాక్స్‌లో ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. తొలుత బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్‌లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించింది. అదే సమయంలో.. బోల్ట్‌లు, నట్లు, ఎలక్ట్రిక్ వైర్లను.. వాచ్‌ను(టైం బాంబ్ కోసం ఉపయోగించేది) గుర్తించింది. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్‌లోని సింక్ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక.. 12గం.46ని. సమయంలో బాంబు పేలింది. ఆ బ్యాగ్‌లోని టిఫిన్ బాక్స్‌లోని బాంబ్ పేలుడుకు కారణమని.. ఇది ఉగ్రదాడే అయ్యి ఉంటుందని ఎన్ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది. ఏం జరిగిందంటే.. రామేశ్వరం కేఫ్‌కు నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తం తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్ మోహన్ చెప్పారు. అంతకు ముందు.. ‘‘సిలిండర్ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారి చెప్పారు. ఇదీ చదవండి: కలాం స్ఫూర్తి.. రామేశ్వరం కేఫ్ నెల బిజినెస్ 4 కోట్లపైనే! An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. #Karnataka pic.twitter.com/7PXndEx2FC — ANI (@ANI) March 1, 2024 #WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm — ANI (@ANI) March 1, 2024 Just spoke to Rameshwaram Café founder Sri Nagaraj about the blast in his restaurant. He informed me that the blast occurred because of a bag that was left by a customer and not any cylinder explosion. One of their employees is injured. It’s seems to be a clear case of bomb… — Tejasvi Surya (@Tejasvi_Surya) March 1, 2024 ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో తాను మాట్లాడానని.. పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఇది సిలిండర్ బ్లాస్ట్ కాదని.. కస్టమర్ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు జరిగిందని.. ఇది ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్ చేశారాయన. -
తమిళనాడులో NIA సోదాలు
-
సంజయ్ దీపక్ రావు అరెస్ట్ పై నన్ను ప్రశ్నించారు: వేణుగోపాల్
-
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు
-
‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ముగిసిన NIA సోదాలు ఎల్బీనగర్లోని శ్రీనివాస నగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఎ సోదాలు ముగిశాయి. కూకట్పల్లి పీఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు అరెస్ట్ విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు. రవిశర్మ మొబైల్‌తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోలకు చెందిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఎ అధికారులు. ఈ నెల 10న ఎన్ఐఎ కార్యాలయానికి హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన NIA అడిషనల్ ఎస్పీ రాజ్‌కుమార్. విక్షణం పత్రిక ఎడిటర్ వేణు కామెంట్స్ ఉదయం ఐదు గంటలకు మా ఇంటికి ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు.. సెర్చ్ వారెంట్‌తో వచ్చామని చెప్పారు సంజయ్ దీపక్ రావు అరెస్ట్ అయినా దాని మీద వచ్చామని అన్నారు. 2013 నయిల్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలను తీసుకెళ్లారు. నా మొబైల్ సీజ్ చేశారు. సెప్టెంబర్ 15 సింహపురి టౌన్ షిప్లో సంజయ్ దీపక్ రావును అరెస్ట్ చేశారు. దీపక్‌కు నాకు సంబంధముందని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి లేఖ రాశాను. నేను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యింది. దేశంలో NIA ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాము. జనవరి మూడో తేదీన నాపై పెట్టిన కేసును NIA టెకప్ చేసుకుంది. ఈ కేసులో ఏ-22గా నా పేరు చేర్చారు పోలీసుల దగ్గర ఉన్న కన్ఫక్షన్ స్టేట్మెంట్లో నా పేరు ప్రస్థావించినట్టు తెలిపారు. -
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్‌కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేశారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి మయన్మార్ నిందితులు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్‌లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది. -
అది పచ్చపన్నాగమే..
విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్‌పై హత్యాయత్నం జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్‌గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్‌కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి. చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి ఎన్ఐఏ చార్జిషీట్లో ఏముంది? వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ వైఎస్ జగన్‌పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం 2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్‌కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్‌కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే... కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని.. జగన్‌కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్‌జగన్‌కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది. పచ్చ మీడియా పైశాచిక ఆనందం బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్‌ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటి? ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. సమగ్ర దర్యాప్తునకు వినతి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్‌కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్‌ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్కి ఎయిర్‌పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా? కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్‌ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? -
కుట్రకోణంపై కౌంటర్ దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక గల కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ... సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసుకు సంబంధించి విశాఖలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతున్న తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలపాటు నిలిపివేసిన హైకోర్టు, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు లోపాలనుప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకెళ్లిన జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో ఆయనపై జనుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి హత్యాయత్నం చేశారు. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి ప్రయత్నించారు. జగన్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ ఘటనను తేలిక చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ మీడియా సమావేశాలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడి కత్తి సంపాదించాడని, అదును చూసి జగన్‌పై దాడి చేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ వివరించింది. కానీ.. ఎన్ఐఏ కుట్ర కోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డారో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనివాసరావు వెనుక ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ తేల్చలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ వైఎస్ జగన్ తరఫున న్యాయవాది టి.నాగార్జునరెడ్డి గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం విచారణ జరిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం: ఎన్ఐఏ వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఎన్ఐఏ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ఎన్ఐఏ తరఫున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి ఎన్ఐఏ, నిందితుడు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించారు. కాగా.. న్యాయవాది నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు జగన్మోహన్రెడ్డిని సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి విశాఖ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న సెషన్స్ కేసు (ఎస్జీ) 5/2023కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ 8 వారాల పాటు నిలుపుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిధి లేకున్నా విజయవాడ కోర్టు ఉత్తర్వులిచ్చింది సీఎం వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తామని చార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ ఆ తరువాత ఎలాంటి దర్యాప్తు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కుట్ర కోణం గురించి అసలు పట్టించుకోలేదన్నారు. ఈ దృష్ట్యా కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే, ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ ఏడాది జూన్ 25న ఉత్తర్వులిచ్చిందన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్ఐఏ కోర్టు పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జూలై 21న నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును విచారించే పరిధి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. విచారణ పరిధి లేకపోయినప్పటికీ విజయవాడ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిందని, అందువల్ల విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. చట్ట ప్రకారం పరిధి ఉన్న ప్రత్యేక కోర్టు మాత్రమే విచారణ జరపాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచేయాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంలో మళ్లీ కొత్తగా ఉగ్ర గ్రూపు ఏర్పడకుండా కఠినమైన వైఖరిని అవలంబించాలని ఉగ్రవాద వ్యతిరేక విభాగాలను కోరారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించివేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు అన్ని విభాగాలు ఉమ్మడిగా ముందుకు సాగాలన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో రెండు రోజుల జాతీయ ఉగ్ర వ్యతిరేక సదస్సునును అమిత్ షా ప్రారంభించి, ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీలు, హవాలా, ఉగ్ర నిధులు, వ్యవస్థీకృత నేర ముఠాలు, డ్రగ్స్– ఉగ్ర లింకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు మంచి ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు. ఎన్ఐఏ, ఉగ్ర వ్యతిరేక బృందాలు, రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌లు కేవలం కేసుల దర్యాప్తునకే పరిమితం కారాదన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తమ పరిధిని దాటి వినూత్నవిధానాలను ఆలోచించాలని కోరారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే క్రమంలో అంతర్జాతీయ సహకారంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు, వివిధ ఏజెన్సీల మధ్య సహకారం ఉండాలన్నారు. ఇందుకోసం కేంద్రం పలు డేటా బేస్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎన్ఐఏ పరిధిలో మోడల్ యాంటీ టెర్రరిజం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లోని ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధికార క్రమం, నిర్మాణం, విచారణ, కార్యాచరణ విధానం ఏకరీతిగా ఉండాలన్నారు. 94 శాతం కంటే ఎక్కువగా నేరారోపణ సాధించిన ఎన్ఐఏ కృషిని షా ప్రశంసించారు. ఈ ఏడాదిలో ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్ సముద్రగుప్తతో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగామన్నారు. -
గురపత్వంత్ సింగ్‌కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్‌లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్‌నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్‌పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్ -
ముమ్మాటికీ హత్యాయత్నమే
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే. ఆయన్ని హతమార్చాలనే కుట్రతోనే నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ నివేదిక ఇచ్చింది. చార్జిషీట్లోనూ ఇదే పేర్కొంది. అంతకు ముందు సిట్ కూడా ఇదే చెప్పింది’ అని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. కానీ, ఓ వర్గం మీడియా క్రియేటివ్ సెన్సేషన్ కోసమే కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి తెస్తోందని, దర్యాప్తు అధికారుల నివేదికకు విరుద్ధంగా ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంకటేశ్వర్లు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నిందితుడే స్వచ్ఛందంగా అంగీకరించాడు నిందితుడు శ్రీనివాసరావు గతంలో బెయిల్‌పై విడుదలైన తర్వాత తన న్యాయవాదితో (ఇప్పుడున్న న్యాయవాదే) కలిసి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్పప్పుడు ఆయనపై తానే దాడి చేశానని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఇప్పుడు అదే న్యాయవాది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఆయుధాన్ని సమకూర్చారంటూ కొత్త వాదన తెరపైకి తేవడం సిగ్గుచేటు. న్యాయ స్థానంలో దాఖలు చేసిన పత్రాల్లోని విషయాన్ని చూడాలి తప్ప, కోర్టులో జరగనివి, జరిగినవి చెప్పడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే. దీనికి బాధ్యులు చర్యలు ఎదుర్కోక తప్పదు. సీఎం జగన్‌పై హత్యాయత్నంలో నిందితుడు శ్రీనివాసరావు ఒక ఆయుధం మాత్రమే. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం లేకుండా ఈ ఘటన జరగడానికి అవకాశం లేదనడానికి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం దర్యాప్తును, కోర్టు విచారణను తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు. మీడియాతో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు కోడి కత్తి అంటూ కేసు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఓ పత్రిక (ఈనాడు) మొదటి నుంచీ వ్యవహరిస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించారు. సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఓ వర్గం మీడియా సైతం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన (2018 అక్టోబరు 25) మర్నాటి నుంచే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురించింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఏకపక్షంగా రాసేశారు. ఆ దాడిలో వైఎస్ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, ఓ ప్రతిక (ఈనాడు) మాత్రం వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. బాధితుడైన వైఎస్ జగన్‌ను అవహేళన చేస్తోంది. బ్లేడ్లతోనే ఎన్నో హత్యలు చేస్తున్నారు. కోడి కత్తి చిన్నగా ఉన్నా అత్యంత పదునుగా ఉంటుంది. కానీ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రతిసారీ కోడి కత్తి అంటూ ఓ ఆయుధాన్ని కేసుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. దాడి నాటి దృశ్యం కేసులున్న వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఎలా? నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయం రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడంతోనే ఈ కుట్రకు బీజం పడింది. వాస్తవానికి విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. శ్రీనివాసరావుకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఎన్వోసీ ఎవరు ఇచ్చారన్నది కీలకంగా మారింది. శ్రీనివాసరావుపై 2017లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్తో పాటు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. పైగా, అతన్ని రెస్టారెంట్లో చేర్పించడానికి ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఆతృత కనబరచడం గమనార్హం. శ్రీనివాసరావుపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు లేవని ఆ పోలీస్ స్టేషన్ అధికారి ఎన్వోసీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో అతనిపై కేసులు ఉన్నాయో లేవో వారికి తెలియదని చెప్పినట్టే. కానీ హర్షవర్ధన్ చౌదరి మాత్రం శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి నేర చరిత్ర లేదని తానే సొంతంగా నిర్ధారిస్తూ ఎన్వోసీ సమర్పించారు. ఏ ప్రాతిపదికన ఆయన అలా చెప్పారు? అంటే శ్రీనివాసరావు నేర చరిత్రను గోప్యంగా ఉంచుతూ డీజీసీఏను తప్పుదోవ పట్టిస్తూ మరీ ఎన్వోసీ ఇచ్చారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉంది. సాక్ష్యం చెప్పడానికి రానని సీఎం చెప్పలేదు ఎన్ఐఏ దర్యాప్తు అనంతరం తొలి చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో పెద్ద కుట్రకోణం దాగి ఉందని, తదుపరి దర్యాప్తు చేపడతామని పేర్కొంది. తొలుత 39 మంది సాక్షులను తూతూమంత్రంగానే విచారించి వదిలేసింది. 2019 జనవరి 23న చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సాక్షిని కూడా విచారించలేదు. ఒక్క డాక్యుమెంట్‌ను కూడా సేకరించలేదు. సిట్ అధికారులు ఇచ్చిన రికార్డులను మాత్రమే 2019 జూలై 23న కోర్టులో దాఖలు చేశారు. తాజాగా కొత్త అంశాలు వెలుగులోకి రాలేదని మాత్రమే కోర్టులో చెప్పింది. దర్యాప్తు అవసరం లేదని ఎక్కడా రాయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఇకపై ఎన్ఐఏ విచారణ అవసరం లేదని చెప్పినట్టు రాస్తోంది. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానని ఎక్కడా చెప్పలేదు. తన సాక్ష్యం రికార్డు ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కులుగుతుందని మాత్రమే చెప్పారు. అడ్వొకేట్ కమిషన్ ద్వారా సాక్షులను విచారించే అవకాశం ఉందని, దాని ప్రకారం తనను విచారించాలని అనుమతి కోరుతూ ఎన్ఐఏ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూడా వక్రీకరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపైనా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానానికి, మిగిలిన జిల్లాల్లోని కేసుల విచారణ పరిధి విజయవాడ న్యాయస్థానానికి ఉంటుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సైతం జీవో ఇచ్చింది. కుట్రకోణం ఉంది.. అనుమానాలివే తనపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందని ఈ కేసులో బాధితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు బలాన్ని చేకూరుస్తూ స్పష్టమైన అంశాలను ప్రస్తావించారు. నేర చరిత్ర ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేర్పించడం, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి నిందితుడు ఆయుధాన్ని అక్రమంగా తీసుకురావడం, ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి టీడీపీ నేత కావడం మొదలైన అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కుట్ర కోణాన్ని, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి హత్యాయత్నం వెనుక కుట్రను ఛేదించాలని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాం. ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయాలనేదే మా వాదన. అందులో మేం చెప్పిన అంశాలివీ.. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరికి, నిందితునికి ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు శ్రీనివాసరావుపై గతంలో కేసులు ఉన్నప్పటికీ, విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో చెప్పిన విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్థన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్థన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ♦ ఎన్ఐఏకి రికార్డు ఇవ్వొద్దని సిట్ దర్యాప్తు అధికారి శ్రీనివాసరావును అప్పటి డీజీపీ ఎందుకు ఆదేశించారు? కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? ♦ స్థానిక పోలీసులు బయోమెట్రిక్ హాజరు మిషన్‌ను సీజ్ చేసి వివరాలు సేకరించగా అందులో నిందితుడు శ్రీనివాసరావు పేరు నమోదు కాలేదు. హర్షవర్ధన్ కూడా పేరు ఎంట్రీ చేయలేదని చెప్పారు. కానీ, ఎన్ఐఏ దగ్గరికి వచ్చేసరికి బయోమెట్రిక్ హాజరులో నిందితుడు అక్కడే పని చేస్తున్నట్టు, దాడి జరిగిన రోజు కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. ఇవి పరస్పర విరుద్ధ అంశాలు. ♦ అదే రోజు విమానాశ్రయం లాంజ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు? -
కరీంనగర్ హుస్సేనీపురాలో ఎన్ఐఏ సోదాలు
-
న్యాయస్థానం నిర్ణయంపైనా ‘పచ్చ’పాతమా రామోజీ?
దుష్ప్రచారం చేయడంలో తనను మించిన వారు లేరంటూ ఈనాడు రామోజీ మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా తగ్గేదే లేదని పదే పదే చాటుకుంటున్న రామోజీ.. తుదకు పాత్రికేయ విలువలకూ తిలోదకాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయడంతో ఈయన గారికి బీపీ పెరిగిపోయింది. న్యాయస్థానమైతే ఏంటనుకుంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ కేసును విచారిస్తోంది ఎన్ఐఏ. బదిలీ చేస్తూ తీర్పు చెప్పింది విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం. బదిలీ చేసింది విశాఖలోని ఆ కోర్టుకే. ఇందులో అభ్యంతరం ఏమిటి రామోజీ? తీర్పు ఎలా ఇవ్వాలో కూడా మీరే నిర్దేశిస్తారా? సాక్షి, అమరావతి: పచ్చ (టీడీపీ) కామెర్లు సోకిన ఈనాడు రామోజీరావు ఏనాడో పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగక ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాల నిర్ణయాలు, తీర్పులను సైతం వక్రీకరిస్తూ.. వక్రభాష్యాలు చెబుతూ.. దురుద్దేశాలు ఆపాదించేందుకూ బరితెగించారు. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతామని తన దివాలాకోరుతనాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇందులో భాగంగా న్యాయ వ్యవస్థ అధికార పరిధిలోకి చొరబడి మరీ న్యాయమూర్తి నిర్ణయాలకు వక్రభాష్యం చెప్పారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 2018 అక్టోబరు 25న విశాఖపట్నంలో జరిగిన హత్యాయత్నం కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ‘ఈనాడు’ సొంత వ్యాఖ్యలు చేయడం న్యాయ నిపుణులను విస్మయ పరిచింది. న్యాయ వ్యవస్థను కించపరిచిన ఈనాడు ఈ కేసును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడంపై ఈనాడు పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పూర్తిగా వక్రీకరణే. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని ఈనాడు తీర్మానించేయడం న్యాయ వ్యవస్థను ప్రశ్నించడమే. రాజకీయ దురుద్దేశంతో ప్రచురించిన కథనం అది. ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ... న్యాయ వ్యవస్థను కించపరుస్తూ కథనాన్ని ప్రచురించింది. ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను సాగదీసేందుకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి కేసును బదిలీ చేశారని ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు న్యాయస్థానాల్లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతుందని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. అందుకే రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ లేఖ ద్వారా కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐలకు ఇతర రాష్ట్రాల్లో కూడా వేర్వేరు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడతోపాటు విశాఖపట్నం, కర్నూలులో ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. అదే విధంగా ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. ఈనాడు పైశాచిక ఆనందం ఎవరైనా బాధితునిపట్ల సానుకూలత, సానుభూతి చూపుతారు. దాడికి పాల్పడిన వారి పట్ల ఆగ్రహం ప్రదర్శిస్తారు. కానీ ఈనాడు పత్రిక అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ హత్యాయత్నం కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనపట్ల ఈనాడు పత్రిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని అవహేళన చేయడమే కాకుండా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. ఇలా పైశాచిక ఆనందం పొందుతోంది. నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తక్కువగా చూపేందుకు కుట్ర పన్నుతోంది. నిజాలకు పాతర.. ‘ఈనాడు’ ఎత్తుగడ! కేసులో వాస్తవాలు బయట పడకూడదనే ఈనాడు ఇలా వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని, మెడ భాగంలో పొడిచి.. జగన్‌ను హత్య చేయాలన్నది అతని లక్ష్యమని స్పష్టం చేసింది. చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని కూడా చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంత తీవ్రమైన దాడిని తక్కువగా చేసి చూపేందుకు ఈనాడు పత్రిక దిగజారుడు కథనాలు ప్రచురిస్తోంది. కుట్ర కోణం, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కింది అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితునితో ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుపై గతంలో కేసు ఉన్నా సరే విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్ధన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్ధన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో డానిశ్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం (బిహార్), ఇమ్రాన్ ఖాన్ (మహారాష్ట్ర), ఒబైదుర్ రెహా్మన్ (హైదరాబాద్) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్ భక్తల్ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది. చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా!