net loss
-
స్విగ్గీ నష్టాలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ నష్టాలు స్వల్పంగా తగ్గాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 626 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2023–24) ఇదేకాలంలో రూ. 657 కోట్ల నష్టం ప్రకటించింది.మొత్తం ఆదాయం రూ. 2,763 కోట్ల నుంచి రూ. 3,601 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,507 కోట్ల నుంచి రూ. 4,310 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇటీవలే స్టాక్ ఎక్చ్సేంజీలలో లిస్ట్‌కావడంతో తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.కాగా.. సొంత అనుబంధ సంస్థ స్కూట్సీ లాజిస్టిక్స్ ప్రయివేట్‌లో రైట్స్ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 1,600 కోట్లకు మించకుండా ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు స్విగ్గీ వెల్లడించింది. స్కూట్సీ ప్రస్తుతం సప్లైచైన్ సర్వీసులు, పంపిణీ బిజినెస్ నిర్వహిస్తోంది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు తగ్గిన నష్టం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెలువరించింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం స్వల్పంగా తగ్గి రూ. 495 కోట్లకు పరిమితమైంది. అధిక విక్రయాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 524 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 873 కోట్ల నుంచి రూ. 1,214 కోట్లకు ఎగసింది. వాహన విక్రయాలు 74 శాతం జంప్‌చేసి 98,619 యూనిట్లను తాకాయి. 2025 మార్చికల్లా కంపెనీ 2,000 సొంత ఔట్లెట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌కల్లా 782 స్టోర్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 73 వద్ద ముగిసింది. -
పేటీఎంకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. -
నష్టాలు తగ్గుతాయి! దేశీయ ఎయిర్‌లైన్స్‌కు ఊరట
ముంబై: దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మరింత తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నష్టాలు రూ.5,000–7,000 కోట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదల సానుకూలంగా ఉండడం ఎయిర్‌లైన్స్ ఆదాయ వృద్ధికి సాయపడుతుందని తెలిపింది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతోపాటు, డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఎయిర్‌లైన్స్ నష్టాలు రూ.11,000–13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ మెరుగ్గా ఉన్నప్పటికీ ఏటీఎఫ్ ధరలు త్రైమాసికం వారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం అనే సవాళ్లను దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఎదుర్కొన్నట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై నెలలో ప్రయాణికుల సంఖ్య 1.22 కోట్లుగా నమోదైందని, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఏవియేషన్ రంగానికి స్టెబుల్ రేటింగ్ (స్థిరత్వం) ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వేగంగా రికవరీ కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాతో స్థిరత్వం రేటింగ్‌ను ఇచ్చింది. గణనీయంగా తగ్గిన నష్టాలు ఎయిర్‌లైన్స్ పరిశ్రమ 2021–22లో రూ.23,500 కోట్లు నష్టపోవడం గమనార్హం. దీంతో పోలిస్తే 2022–23లో నష్టాలు గణనీయంగా తగ్గాయి. తొలుత రూ.17,000 కోట్ల వరకు రావచ్చని ఇక్రా అంచనా వేయగా, వాస్తవ నష్టాలు రూ.11,000–13,000 కోట్లకు పరిమితం అయ్యాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు కాస్ట్ ఆఫ్ అవైలబుల్ సీట్ కిలోమీటర్ను మెరుగుపరుచుకున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే సగానికి తగ్గుతాయని అంచనా. పరిశ్రమలో టారిఫ్‌ల పరంగా క్రమశిక్షణ నెలకొనడంతో ఈ ధోరణి కొనసాగుతుందని ఇక్రా తెలిపింది. ఏటీఎఫ్ ధరలు కొంత తగ్గడం కలిసొస్తుందని పేర్కొంది. జూలైలో విమానయానం 25 శాతం అప్.. దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య జూలైలో 25 శాతం ఎగిసింది. 1.21 కోట్లుగా నమోదైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం గతేడాది జూలైలో విమాన ప్రయాణికుల సంఖ్య 97.05 లక్షలుగా నమోదైంది. తాజాగా గత నెల విమానయాన సంస్థ ఇండిగో 76.75 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా 11.98 లక్షల మంది ప్రయాణికులు 9.9 శాతం మార్కెట్ వాటాతో తర్వాత స్థానంలో ఉంది. ఇక టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార 10.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి 8.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిర్ఏషియా ఇండియా (ఏఐఎక్స్ కనెక్ట్) 9.01 లక్షల ప్రయాణికులు (7.5 శాతం వాటా), ఆకాశ ఎయిర్ 6.24 లక్షల మంది ప్యాసింజర్లను (5.2 శాతం వాటా) గమ్యస్థానాలకు చేర్చాయి. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ 5.04 లక్షల మంది ప్రయాణికులు, 4.2 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది. సమయ పాలన విషయంలో ఇండిగో 86.8 శాతంతో అగ్ర స్థానంలో నిల్చింది. -
షాక్ ఇచ్చిన వోల్టాస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆతిథ్య రంగ కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 41.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 60 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 546 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 515 కోట్ల నుంచి రూ. 575 కోట్లకు పెరిగాయి. కాగా.. ఈ కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన కొత్తగా 4,397 మంది సభ్యులను జత చేసుకుంది. సభ్యత్వ అమ్మకాల విలువ 93 శాతం వృద్ధితో రూ. 194 కోట్లను తాకింది. -
నష్టాల్లోనే ఐవోసీ క్యూ2లో రూ. 272 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్‌టైమ్ గ్రాంట్‌కింద మూడు పీఎస్‌యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం! మార్జిన్లు అప్ క్యూ2లో బ్యారల్‌కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే. -
నష్టాల్లోనే వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ. 7,297 కోట్లకు చేరాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,319 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 10,410 కోట్లను తాకింది. ప్రస్తుత సమీక్షా కాలంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 104 నుంచి రూ. 128కు మెరుగుపడింది. టారిఫ్‌ల పెంపు ఇందుకు సహకరించింది. మార్చి నుంచి జూన్‌కల్లా మొత్తం వినియోగదారుల సంఖ్య 24.38 కోట్ల నుంచి 24.04 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే 10 లక్షల మంది 4జీ కస్టమర్లు జత కలవడంతో వీరి సంఖ్య 11.9 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కొత్త చైర్మన్.. ఈ నెల(ఆగస్ట్) 19 నుంచి చైర్మన్‌గా రవీందర్ టక్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ నెల 18కల్లా హిమాన్షు కపానియా నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలియజేసింది. వొడాఫోన్ గ్రూప్ నామినీ అయిన టక్కర్ ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టెలికం పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కీలక మార్కెట్లలో 5జీ సేవలను అందించేందుకు తగిన స్పెక్ట్రమ్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్లు సీఈవో టక్కర్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 9.10 వద్ద ముగిసింది. -
నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్న జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నష్టం రూ.352 కోట్లుగా ఉంటే, తాజాగా అది రూ.67 కోట్లకు పరిమితమైంది. అయితే ఏ రూపంలో నష్టాలు తగ్గాయన్న? సందేహం రావచ్చు. కంపెనీ ఫిట్సో అనే ప్లాట్ఫామ్లో తనకున్న వాటాలను విక్రయించింది. ఈ రూపంలో రూ.316 కోట్లు సమకూరాయి. ఇది మినహాయించి చూస్తే నష్టం రూ.383 కోట్ల నష్టం కార్యకలాపాలపై వచ్చినట్టు తెలుస్తోంది. ఆదాయం సైతం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.609 కోట్ల నుంచి రూ.1,112 కోట్లకు ఎగసింది. వ్యయాలు కూడా రూ.755 కోట్ల నుంచి రూ.1,642 కోట్లకు చేరాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో వచ్చే రెండేళ్లలో 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. కస్టమర్ డెలివరీ చార్జీలు తగ్గించడం, కరోనా తర్వాత రీఓపెనింగ్ ప్రభావం, డెలివరీ నుంచి రెస్టారెంట్ డైనింగ్ అవుట్‌కు కొంత వ్యాపారం బదిలీ కావడం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) వృద్ధి బలహీనంగా ఉండడానికి దారితీసినట్టు జొమాటో వివరించింది. జీవోవీ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం అధికంగా, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.7 శాతం పెరిగి రూ.5,500 కోట్లుగా ఉంది. మరింత విస్తరణే లక్ష్యం ‘‘దీర్ఘకాలంలో ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం వృద్ధి పట్ల పెద్ద అంచనాలతోనే ఉన్నాం. రెస్టారెంట్ పరిశ్రమలో మార్పులకు అందిస్తున్న సహకారం ద్వారా జొమాటో ప్రయోజనం పొందుతుంది’’ అని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. మరిన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న తీరుపై స్పందిస్తూ.. తమ వ్యాపారం వృద్ధిని వేగవంతం చేసే వ్యాపారాల్లో మైనారిటీ వాటాల కొనుగోలుకు పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీ బ్యాలన్స్ షీటులో 1.7 బిలియన్ డాలర్లు ఉన్నాయని, నిధుల సమీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో అర్బన్పైపర్లో 5 మిలియన్ డాలర్లు, అడోన్మోలో 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అంతకుముందు బ్లింకిట్ (గ్రోఫర్), షిప్‌రాకెట్, క్యూర్‌ఫిట్ తదితర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
అప్పుడు సూపర్ హిట్, ఇప్పుడు జొమాటోకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో లిమిటెడ్ ఈ ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 100 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 266 కోట్ల నుంచి రూ. 844 కోట్లకు జంప్‌చేసింది. ఇక మొత్తం వ్యయాలు సైతం రూ. 383 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో గ్రోఫర్స్ ఇండియా లో 9.25%, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 9.27% చొప్పున వాటాల కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గ్రోఫర్స్ ఇండియా ప్రయివేట్, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్, గ్రోఫర్స్ ఇంటర్నేషనల్ తదితరాలతో డీల్ కుదుర్చుకున్నట్లు జొమాటో వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 125 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల ఐపీవో లిస్టింగ్ లో జొమాటో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో .. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. సబ్స్క్రిప్షన్స్ సైతం గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ జొమాటో నిలిచింది. కానీ క్యూ1 ఫలితాల్లో జొమాటో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది. నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరడంపై ఇన్వెస్టర్లు, అటు మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్, ఆ ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్ -
Yes Bank: యస్ బ్యాంక్ నష్టం 3,790 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఏకంగా రూ. 3,790 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. ఆదాయం క్షీణించడం, మొండిబాకీలకు ప్రొవిజనింగ్ భారీగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,665 కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను యస్ బ్యాంక్ నికర నష్టాలు రూ. 16,432 కోట్ల నుంచి రూ. 3,488 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పునర్వ్యవస్థీకరించే అవకాశమున్న రుణాల కోసం కూడా ముందుగా ప్రొవిజనింగ్ చేసినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో మొండిబాకీలకు ప్రొవిజనింగ్ రూ. 5,239 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 4,872 కోట్లుగా ఉంది. మరో రూ.5,000 కోట్ల రికవరీ లక్ష్యం..: అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు ఇక ముగిసినట్లేనని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం రూ. 5,000 కోట్లు రికవరీ చేయాలని నిర్దేశించుకున్నట్లు కుమార్ వివరించారు. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోను 15% పెంచుకోవాలని, రిటైల్ రుణాలను 20% పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో రిటైల్, చిన్న రుణాల వాటా 51% దాకా ఉంది. క్రమంగా మళ్లీ కార్పొరేట్ రుణాలను ఇవ్వనున్నట్లు, ఈ విభాగంలో 10% వృద్ధి అంచనా వేస్తున్నట్లు కుమార్ తెలిపారు. మార్చి క్వార్టర్లో రూ. 3,500 కోట్ల కొత్త రుణాలిచ్చినట్లు పేర్కొన్నారు. అటు స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం 16.80% నుంచి 15.41%కి తగ్గాయి. జూన్ క్వార్టర్లో రూ. 2,500 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నట్లు.. వీటిలో సింహభాగం కార్పొరేట్ విభాగానివే ఉండొచ్చని కుమార్ తెలిపారు. -
టైటన్- శ్రీ సిమెంట్... ఫలితాల దెబ్బ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో టాటా గ్రూప్ కంపెనీ టైటన్ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలంలో పనితీరు నిరాశపరచడంతో శ్రీ సిమెంట్ లిమిటెడ్ కౌంటర్ సైతం బలహీనపడింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ నష్టాల బాటలో సాగుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో డైవర్సిఫైడ్ దిగ్గజం టైటన్ రూ. 297 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 364 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 61 శాతం క్షీణించి రూ. 1979 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు రూ. 361 కోట్ల నష్టం నమోదైంది. గత క్యూ1లో ఈ పద్దుకింద రూ. 520 కోట్ల లాభం సాధించింది. ఈ నేపథ్యంలో టైటన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4 శాతం పతనమై రూ. 1063 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1049 దిగువకు చేరింది. శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ప్రయివేట్ రంగ దిగ్గజం శ్రీ సిమెంట్ 14 శాతం తక్కువగా రూ. 330 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 25 శాతం క్షీణించి రూ. 2480 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 12 శాతం వెనకడుగుతో రూ. 443 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో శ్రీ సిమెంట్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం నష్టపోయింది. ప్రస్తుతం రూ. 21,530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,322 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
కరోనా కష్టాలు : మారుతికి నష్టాలు
సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) కరోనా , లాక్డౌన్ సంక్షోభంతో భారీ నష్టాలను నమోదు చేసింది. జూన్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 249.4 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 1,435.5 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం 79 శాతం క్షీణించి, 4,106.5 కోట్లకు చేరుకోగా, 2019 జూన్‌లో 19,720 కోట్ల రూపాయల ఆధాయాన్ని సాధించామని బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంఎస్ఐ తెలిపింది. జూన్ త్రైమాసికం అపూర్వమైందనీ, మొత్తం త్రైమాసికంలో ఉత్పత్తి కేవలం రెండు వారాల పనికి సమానమని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. మారుతి నికర అమ్మకాలు రూ .3,677.5 కోట్లకు తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .18,735.2 కోట్లు. మొదటి త్రైమాసికంలో మొత్తం 76,599 వాహనాలను విక్రయించగా, దేశీయ మార్కెట్లో అమ్మకాలు 67,027 యూనిట్లు, ఎగుమతులు 9,572 యూనిట్లు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 4,02,594 యూనిట్లను విక్రయించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇది కంపెనీ చరిత్రలో ఇదొక అసాధారణమైన త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. లాక్డౌన్ నిబంధనల కారణంగా అమ్మకాలు, ఉత్పత్తి నిలిచిపోయాయని తెలిపింది. మే నెల చివరిలో మాత్రమే చిన్నగా కార్యకలాపాలను ప్రారంభిచినట్టు తెలిపింది. ముఖ్యంగా వినియోగదారులు, సప్లయ్ చెయిన్ అంతటా ఉద్యోగులు, ఇతరుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వెల్లడించింది. మొత్తం త్రైమాసికం కేవలం రెండు వారాల రెగ్యులర్ పనికి సమానమనీ ప్రస్తుత త్రైమాసిక ఫలితాలను ఈ కోణంలో చూడాలని కంపెనీ తెలిపింది. కాగా ఒక దశాబ్దం తరువాత నష్టాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. దీంతో మారుతి సుజుకి దాదాపు 2 శాతం నష్టంతో కొనసాగుతోంది. -
కరోనా : ఐటీసీ లాభాలు 25 శాతం ఢమాల్
సాక్షి,ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం మధ్య ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ జూన్ త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదుచేసింది. జూలై 24 తో ముగిసిన తొలి త్రైమాసికంలో పన్నుల తర్వాత ఏకీకృత లాభంలో 25 శాతం క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన 3,437 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే 2,567 కోట్లను సాధించింది. ఏకీకృత ఆదాయం 2020 10,478.46 కోట్లుగా ఉందని ఐటీసీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిందిఅంతకుముందు ఏడాది కాలంలో 12,657.90 కోట్ల రూపాయలతో పోలిస్తే ఆదాయం 17 శాతం తగ్గింది. సిగరెట్ల వ్యాపారంఈ త్రైమాసికంలో 4,330.05 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది, ఏడాది క్రితం ఇది 6,141.92 కోట్ల రూపాయలు. అలాగేఅంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 411.60 కోట్లు సాధించిన హోటళ్ల వ్యాపార ఆదాయం 4.92 కోట్లకు పడిపోయింది. ఇతర ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఆదాయం 3,378.84 కోట్లుగా ఉండగా, ఏడాది క్రితం 3,068.07 కోట్లుగా ఉంది. మరోవైపు, ఈ త్రైమాసికంలో వ్యవసాయ వ్యాపారం లాభపడిందని ఐటీసీ ప్రకటించింది. ఏడాది క్రితం 3,622.40 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,764.56 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపింది. -
యాక్సిస్ నష్టం రూ.112 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.112 కోట్ల నికర నష్టాలు (స్టాండ్అలోన్) వచ్చాయి. కార్పొరేట్ పన్ను రేటులో మార్పుల వల్ల రూ.2,138 కోట్ల వన్ టైమ్ పన్ను వ్యయాల కారణంగా ఈ నష్టాలు వచ్చాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఈ క్యూ2లో నికర లాభం 157 శాతం వృద్ధితో రూ.2,026 కోట్లకు పెరిగి ఉండేదని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.790 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం రూ.15,959 కోట్ల నుంచి రూ.19,334 కోట్లకు పెరిగాయని తెలిపింది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.5,952 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,102 కోట్లు ... నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.6,102 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. 3.51 శాతం నికర వడ్డీ మార్జిన్‌ను సాధించామని, ఇది తొమ్మిది క్వార్టర్ల గరిష్ట స్థాయని పేర్కొంది. బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 5.96 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 5.03 శాతానికి తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 2.54 శాతం నుంచి 1.99 శాతానికి తగ్గాయని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 5.25 శాతంగా, నికర మొండి బకాయిలు 2.04 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు రూ.2,927 కోట్ల నుంచి రూ.3,518 కోట్లకు పెరిగాయని తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు తగ్గాయి. ఈ క్యూ1లో రూ.3,815 కోట్ల కేటాయింపులు జరిపామని వివరించింది. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 78 శాతం నుంచి 79 శాతానికి పెరిగిందని పేర్కొంది. లోన్ బుక్ రూ.24,318 కోట్లకు పెరిగిందని, ఇది రెండేళ్ల గరిష్ట స్థాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 0.4 శాతం లాభంతో రూ.713 వద్ద ముగిసింది. -
జెట్ బాటలో మరో సంస్థ..
సాక్షి, న్యూఢిల్లీ : సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మూసివేతకు దారితీసిన జెట్ ఎయిర్వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాటలో మరో విమానయాన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఏప్రిల్ వేతనాలు చెల్లించలేమని పవన్ హంస్ యాజమాన్యం ఉద్యోగులకు పంపిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కంపెనీ సామర్ధ్యాన్ని పూర్తిగా సమీక్షించిన మీదట సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడైందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గి నికర నష్టం రూ 89 కోట్లుగా నమోదైందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పౌరవిమానయాన రంగంలో పరిస్థితులు సైతం భవిష్యత్ వృద్ధికి ఏ మాత్రం సానుకూలంగా లేవని స్పష్టం చేసింది. కాగా, కంపెనీ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నందున వేతనాలు చెల్లించలేమని యాజమాన్యం పేర్కొనడం పట్ల పవన్ హంస్ ఉద్యోగుల సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీ చర్య అమానవీయమైనదని ఆక్షేపించింది. వేతన సవరణ కోసం వేచిచూస్తున్న ఉద్యోగుల వేతనాలను నిలిపివేయడం తగదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పెరిగిన వేతనాలను అందుకుంటున్న క్రమంలో యాజమాన్యం చర్య తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. యాజమాన్యం చర్యకు నిరసనగా తాము నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతామని పేర్కొంది. మరోవైపు ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాలను నిలిపివేయలేదని, ఏప్రిల్ వేతనాలు అందని ఉద్యోగుల సంఖ్య పరిమితమని పవన్‌హంస్ ప్రతినిధి స్పష్టం చేశారు. -
యూనిటెక్ నష్టాలు రూ.73 కోట్లు
న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ కంపెనీ యూనిటెక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.16 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.73 కోట్లకు ఎగిశాయని యూనిటెక్ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.289 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.78 కోట్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,272 కోట్ల ఆదాయం రూ.218 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయని కారణంగా కంపెనీ ఎమ్‌డీలు ఇద్దరూ–సంజయ్ చంద్ర, అజయ్ చంద్ర జైలు శిక్ష గడుపుతున్నారు. -
ఫలితాల దెబ్బ: పీఎన్బీ షేరు పతనం
సాక్షి, ముంబై: అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో ఇరుక్కున్న దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నష్టాలు వదిలిపెట్టడం లేదు. వరుసగా రెండవ క్వార్టర్లో కూడా నష్టపోవడంతో పీఎన్బీ షేరు భారీగా నష్టపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ బ్యాంకు భారీగా నష్టాలను చవి చూవడడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో పీఎన్బీ షేరు ఒక దశలో దాదాపు 9శాతం కుప్పకూలింది.. చివరికి 7శాతం నష్టంతో రూ.82.90 వద్ద ముగిసింది. జూన్ 30తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.940 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీఎన్బీ నికర లాభం కేవలం రూ.343 కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది పీఎన్బీ ఆదాయం రూ.14,468గా ఉంది. మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో బ్యాంక్ 13,417 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇక మొండి బకాయిలు 18.26 శాతం పెరిగినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. -
ఎస్బీఐపై ‘మొండి’బండ!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు మొండిబకాయిలు షాక్ ఇచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్, క్యూ3) అత్యంత నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. అనుబంధ సంస్థలన్నిటితో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎస్బీఐ రూ.1,887 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎస్బీఐ రూ.2,152 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. ప్రధానంగా అధిక మొండిబకాయిలతో కేటాయింపులు పెరిగిపోవడం, వడ్డీయేతర ఆదాయం పడిపోవడం వంటివి లాభాల్లోనుంచి నష్టాల్లోకి జారిపోవడానికి కారణమయ్యాయి. ఎస్బీఐ 17 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా క్యూ3లో నికర నష్టాన్ని ప్రకటించడం మొండిబకాయిల తీవ్రతకు నిదర్శనం. మార్కెట్ వర్గాలు ఎస్బీఐ క్యూ3లో రూ.2,507 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశాయి. కాగా, క్యూ3లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.74,191 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.75,537 కోట్లతో పోలిస్తే 1.79 శాతం తగ్గింది. కాగా, కొత్త చైర్మన్ రజనీష్ కుమార్ హయాంలో తొలి ఆర్థిక ఫలితాలు ఇవే కావడం గమనార్హం. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే... ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఎస్బీఐ క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. క్రితం ఏడాది క్యూ3లో బ్యాంక్ స్టాండెలోన్‌గా రూ.2,610 కోట్ల నికర లాభాన్ని ఆర్జించటం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.53,587 కోట్ల నుంచి రూ.62,887 కోట్లకు పెరిగింది. 17.3 శాతం వృద్ధి నమోదయింది. మొండిబకాయిలు పైపైకి... ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) క్యూ3లో భారీగా పెరిగాయి. బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2017 డిసెంబర్ నాటికి (క్యూ3) 10.35 శాతానికి చేరి రూ.1,99,141 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది క్యూ3 చివరికి స్థూల ఎన్పీఏలు 7.23 శాతం (రూ.1,08,172 కోట్లు) మాత్రమే. కాగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే (9.83 శాతం) సీక్వెన్షియల్‌గా కూడా స్థూల ఎన్పీఏలు పెరగడం గమనార్హం. నికర ఎన్పీఏలు సైతం గతేడాది క్యూ3లో 4.24 శాతం (రూ.61,430 కోట్లు) నుంచి ఈ ఏడాది క్యూ3లో 5.61 శాతానికి (రూ.1,02,370 కోట్లు) ఎగబాకాయి. ఈ ఏడాది క్యూ2లో నికర ఎన్పీఏలు 5.43 శాతంగా ఉన్నాయి. కేటాయింపులు 145 శాతం అప్... మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజనింగ్) డిసెంబర్ క్వార్టర్లో (క్యూ3) ఏకంగా 145 శాతం ఎగబాకి రూ.7,244 కోట్ల నుంచి రూ.17,760 కోట్లకు పెరిగాయి. క్యూ2లో ఈ పెరుగుదల 6.2 శాతం మాత్రమే. ఇందులో రూ.6,000 కోట్ల ప్రొవిజన్స్ పాతవాటికి సంబంధించి తాజాగా చేయడం వల్ల పెరిగినవే. కాగా, క్యూ3లో కొత్తగా రూ.25,830 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. ఇందులో కార్పొరేట్ కంపెనీలకు చెందినవి రూ.21,823 కోట్లు (విద్యుత్ రంగం రూ.14,422 కోట్లు) ఉన్నాయి. కాగా, ఎన్పీఏగా మరే అవకాశం ఉన్న జాబితాలో (వాచ్‌లిస్ట్) రూ.10,834 కోట్ల రుణాలున్నాయి. దివాలా కేసుల్లో చిక్కుకున్న కంపెనీల మొండిబకాయిలకు (40 ఖాతాలకు చెందిన రూ.78,000 కోట్లు) సంబంధించి 60 శాతం మేర కేటాయింపులు చేసినట్లు బ్యాంక్ తెలిపింది. క్యూ3 ఆర్థిక ఫలితాలు కచ్చితంగా నిరుత్సాహపరిచేవే. క్యూ4లో కూడా మొండిబకాయిలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నా. కాగా, ఆర్బీఐ మదింపులో బయటపడిన మొండిబకాయిల్లో 90 శాతాన్ని ఇప్పటికే ఎన్పీఏలుగా గుర్తించాం. ఇందులో దాదాపు రూ.10,000 కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. రానున్న కాలంలో ఈ రంగానికి చెందిన రుణాల్లో మరిన్ని ఎన్పీఏలుగా మారే అవకాశాలున్నాయి. గడచిన 9 నెలల కాలంలో కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2018–19)లో వీటిని 2 శాతం లోపునకే పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ఎన్‌పీఏల్లో భారీ తేడాలు... గడచిన ఆర్థిక సంవత్సరంలో (2016–17) ఎస్బీఐ భారీ మొత్తంలో ఎన్పీఏలను తక్కువగా చూపించినట్లు ఆర్బీఐ తనిఖీల్లో బయటపడింది. 2017 మార్చినాటికి ఎస్బీఐ స్థూల ఎన్పీఏలను రూ.1,12,342 కోట్లుగా ప్రకటించింది. అయితే, ఆర్బీఐ మదింపులో మాత్రం ఇవి రూ.1,35,582 కోట్లుగా లెక్కతేలాయి. అదే విధంగా నికర ఎన్పీఏలు కూడా ఆర్బీఐ రూ.75,796 కోట్లుగా లెక్కతేల్చగా, ఎస్బీఐ మాత్రం రూ.58,277 కోట్లుగా చూపింది. ప్రొవిజనింగ్(కేటాయింపులు) కూడా రూ.5,720 కోట్ల మేర ఎస్బీఐ తగ్గించింది. వీటన్నింటినీ తాజాగా మొండిబకాయిలుగా చూపడంతోపాటు తగిన కేటాయింపులు కూడా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది నికర లాభాన్ని తొలుత ప్రకటించిన రూ.10,484 కోట్ల నుంచి రూ.6,743 కోట్లకు సవరించడం విశేషం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 5.17% వృద్ధితో రూ.18,688 కోట్లకు పెరిగింది. ♦ క్యూ3లో వడ్డీయేతర ఆదాయం 29.75 శాతం దిగజారి రూ.11,507 కోట్ల నుంచి రూ.8,084 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా ట్రెజరీ కార్యకలాపాల్లో నష్టాలు(మార్క్–టు–మార్కెట్) దీనికి కారణంగా నిలిచాయి. ♦ ఫీజుల రూపంలో ఆదాయం 5.71 శాతం పెరుగుదలతో రూ.4,710 కోట్ల నుంచి రూ.4,979 కోట్లకు చేరింది. ♦ ఫీజులు కాకుండా ఇతర ఆదాయం మాత్రం 18.38 శాతం క్షీణించి రూ.14,401 కోట్ల నుంచి రూ.11,755 కోట్లకు దిగజారింది. ♦ క్యూ3లో రుణ వృద్ధి అత్యంత స్వల్పంగా 2.52 శాతం మాత్రమే నమోదైంది. దీంతో డిసెంబర్ చివరికి బ్యాంక్ మొత్తం రుణాల పరిమాణం రూ.19.24 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ రుణాల్లో 13.59 శాతం, వ్యవసాయ రుణాల్లో 5.88 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. కార్పొరేట్ రుణాలు మాత్రం 4.22 శాతం తగ్గింది. ♦ ఇక బ్యాంక్ డిపాజిట్లు కూడా క్యూ3లో నామమాత్రంగా 1.86 శాతం వృద్ధితో రూ.26.51 లక్షల కోట్లకు చేరాయి. ♦ నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 0.26 శాతం దిగజారి 2.45 శాతానికి చేరింది. ♦ శుక్రవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు ధర 1.68 శాతం నష్టంతో రూ.296 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. -
ఐడియాకు క్యూ3లోనూ తప్పని నష్టాలు
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ ఐడియా సెల్యులర్ మళ్లీ ఫలితాల్లో నిరాశపర్చింది. ఆర్థిక సంవత్సరం క్యూ3లో నష్టాలను నమోదు చేసింది. మంగళవారం విడుదల చేసిన కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,284 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 6510 కోట్లను తాకింది. క్యూ2లో రూ. 7466 కోట్ల ఆదాయం సాధించింది. ఆపరేటింగ్ మార్జిన్ 18.8శాతంగా ఉంది.గత ఏడాది ఇది 20శాతంగాఉంది. అయితే వినియోగరుదాల మార్కెట్లో వృద్ధిని సాధించింది. డిసెంబర్ నాటికి 20.3 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 2017 డిసెంబర్ నాటికి నికర రుణాలు రూ. 55,780 కోట్లకు చేరినట్లు ఐడియా సెల్యులర్ ఫలితాల విడుదల సందర్భంగా వివరించింది. మరోవైపు యూకే దిగ్గజం వొడాఫోన్తో విలీన ప్రక్రియ తుది దశకు చేరిందని, 2018 మొదటి త్రైమాసిం నాటికి ఈ విలీనం పూర్తికావచ్చని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ఆరంభంనుంచి నష్టాల్లో ఉన్న ఐడియా కౌంటర్ మరింత బలహీనపడి దాదాపు 5శాతం పతనాన్ని నమోదు చేసింది. -
తగ్గిన ఐఓబీ నష్టాలు
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నికర నష్టం 2017 జూన్ త్రైమాసికంలో రూ. 499 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,450 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 5,868 కోట్ల నుంచి రూ. 5,174 కోట్లకు తగ్గిందని, ఇందుకు వడ్డీ రేట్ల తగ్గుదల కారణమని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐఓబీ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గినా...స్థూల ఎన్పీఏలు 20.48 శాతం నుంచి 23.60 శాతానికి పెరిగాయి. జూన్ క్వార్టర్లో రుణ వితరణ తగ్గడంతో ఎన్పీఏల శాతం పెరగడానికి ప్రధాన కారణమని బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలు 13.97 శాతం నుంచి 14.97 శాతానికి పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 1.87 శాతం నుంచి 1.65 శాతానికి తగ్గింది. ఫలితాల నేపథ్యంలో ఐఓబీ షేరు 3.35 శాతం క్షీణతతో రూ. 23.10 వద్ద ముగిసింది. -
భారీగా పెరిగిన జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2017 మార్చి త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికర నష్టం క్రితంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.2,479 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.395 కోట్ల నుంచి రూ.272 కోట్లకు పడిపోయింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రెండింతలకుపైగా పెరిగి రూ.3,684 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.1,256 కోట్ల నుంచి రూ.1,182 కోట్లుగా ఉంది. కాగా, ఆర్థిక సంవత్సరంలో రూ.37,480 కోట్లున్న స్థూల రుణ భారం రూ.19,856 కోట్లకు తగ్గించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 13.71% ఎగసి రూ.17 వద్ద క్లోజ య్యింది. ఎయిర్పోర్ట్ విభాగం లాభాలు పెరిగా యని, తొలిసారిగా ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులు డివిడెండు ప్రకటించినట్టు కంపెనీ వెల్లడించింది. జీఎంఆర్ వరోరా ఎనర్జీ మొదటిసారిగా లాభాలను ఆర్జించి రూ.143 కోట్లను నమోదు చేసింది. కాకినాడ, కృష్ణగిరిల్లో మిగులు భూముల విక్రయం రుణభారాన్ని మరింత తగ్గించుకునే క్రమంలో తమకు రోడ్లు, విద్యుత్ రంగాల్లో వున్న కొన్ని ఆస్తుల్ని విక్రయిస్తామని జీఎంఆర్ గ్రూప్ సీఎఫ్ఓ మధు తెర్దాల్ చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ, కృష్ణగిరిల్లో వున్న మిగులు భూముల్ని విక్రయించడంపై దృష్టిపెట్టామని, ఈ విక్రయం ద్వారా రూ. 1000–1200 కోట్లు సమకూరుతాయని అంచనావేస్తున్నామన్నారు. ఇటీవలే ఇండోనేషియాలో బొగ్గు గనిని అమ్మడం ద్వారా రూ. 400 కోట్ల నగదు లభించిందని, రోడ్డు ప్రాజెక్టుల్ని విక్రయించడం ద్వారా మరో రూ. 500–600 కోట్లు పొందవచ్చని భావిస్తున్నామని ఆయన వివరించారు. జీఎంఆర్ ఎనర్జీ ద్వారా ఐపీఓ జారీచేసే ప్రణాళిక కూడా వుందని, ఈ అంశాలన్నీ తమ రుణభారం తగ్గడానికి దోహదపడతాయన్నారు. హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై రూ. 7,400 కోట్ల పెట్టుబడి... తమ హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై తాజాగా రూ. 7,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మధు వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టును రూ. 4,500–5,000 కోట్ల పెట్టుబడితో విస్తరించాలని యోచిస్తున్నామని, ఈ ఎయిర్‌పోర్టు వద్ద రూ. 2,700 కోట్ల నగదు నిల్వలున్నాయన్నారు. అలాగే హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణను రూ. 2,400 కోట్ల పెట్టుబడితో చేపడుతున్నామని, ఈ ఎయిర్‌పోర్టు రూ. 1,000 కోట్ల నగదు నిల్వను కలిగివున్నదన్నారు. తమ స్థూల ఆదాయం రూ. 8,236 కోట్లని, అందులో రూ. 2,989 కోట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి, రూ. 1,057 కోట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సమకూరిందన్నారు. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మళ్లీ కుదేలు
ముంబై : దేశంలోనే ఆరో అతిపెద్ద రుణదాత బ్యాంకు ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరోసారి భారీ నష్టాలను నమోదుచేసింది. మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్ లో ఈ బ్యాంకు నికర నష్టాలు 1,046 కోట్లగా ఫైల్ చేసింది. బ్యాడ్ లోన్స్ శాతం తగ్గకుండా అలానే అత్యధికంగా ఉండటంతో బ్యాంకుకు మరోసారి భారీ నష్టాలే నమోదయ్యాయి. అయితే ముందటి ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది కొంత నష్టాలను బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించుకుంది. గతేడాది ఈ బ్యాంకు నష్టాలు రూ.3,587 కోట్లు. డిసెంబర్ క్వార్టర్ లో బ్యాంకు రూ.102 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. గత క్వార్టర్ కంటే ఆస్తుల నాణ్యత క్షీణించిందని బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం బ్యాంకుకు 9 శాతం పెరిగి రూ.3469 కోట్లగా నమోదయ్యాయని తెలిపింది. ముందటి ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీ ఆదాయాలు రూ.3187 కోట్లు. బ్యాంకు ఆస్తుల నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం స్థూల నిరర్థక ఆస్తులు పెరగడమేనని తెలిసింది. డిసెంబర్ క్వార్టర్ లో రూ.51,781 కోట్లగా ఉన్న ఈ స్థూల నిరర్థక ఆస్తులు, ఈ క్వార్టర్ లో రూ.52,044 కోట్లకు పెరిగాయి. ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఇవి రూ.49,879 కోట్లు. మొత్తం రుణాల్లో బ్యాడ్ లోన్స్ అలానే అత్యధికంగా 13.22 శాతంగా ఉన్నాయి. గత క్వార్టర్ లో ఇవి 13.38 శాతం. ఫలితాల ప్రకటనాంతరం బ్యాంకు ఆఫ్ ఇండియా షేర్లు 7 శాతం మేర నష్టపోయి, రూ.166 వద్ద నమోదవుతున్నాయి. -
జియో ఎఫెక్ట్: ఐడియా ఆశ్చర్యకర ఫలితాలు
ఉచిత ఆఫర్లతో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బతో టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ మార్చి క్వార్టర్లో మరోసారి చతికిలబడింది. టెలికాం మార్కెట్ లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఐడియా వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా నష్టపోయింది. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చరపరుస్తూ నష్టాలనుంచి భారీగా కోలుకుంది. నష్టం రూ.765 కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేయగా బాటమ్ లైన్ లాభాలతో భారీగా పుంజుకుని రూ.328 కోట్లను నికర నష్టాలను నమోదుచేసింది. 2015-16 సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,714 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం 8126.1 కోట్ల రూపాయల వద్దే నమోదైంది. ఆదాయం రూ .8,135 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల , రుణ విమోచన (ఎబిటాలు) రూ. 2,196 కోట్లు, ఎబిటా మార్జిన్ 27 శాతంగా ప్రకటించింది. కాగా జియో మరో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఇండియా ఆదాయం కూడా 6.25 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. భారతి ఎయిర్‌టెల్‌తో పోల్చితే, 100శాతం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడిన భారీగా నష్టపోయింది. అయితే వోడాఫోన్‌తో విలీనం కారణంగా 2017 లో స్టాక్ 22 శాతం పెరిగడంతో ఐడియా నష్టాలనుంచి భారీగా కోలుకుంది. -
రిలయన్స్ జియో నష్టమెంతో తెలుసా?
ముంబై : ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లో దుమ్మురేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు భారీ షాకే తగిలింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ ఆరు నెలల వ్యవధిలో రూ.22.50 కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. మార్చి 31తో ముగిసిన ఆరు నెలల వ్యవధి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫలితాలను కంపెనీ సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నష్టాలు రూ.7.46 కోట్లగానే ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా కంపెనీ ఆదాయాలు కూడా ఈ ఆరు నెలల వ్యవధిలో భారీగా 76 శాతం పడిపోయాయి. గతేడాది 2.25 కోట్లగా ఉన్న ఆదాయాలు ప్రస్తుతం 54 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ వ్యయాలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగినట్టు వెల్లడైంది. 13.63 కోట్లగా ఉన్న వ్యయాలు భారీగా ఎగిసి 34.88 కోట్లగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. పన్నులకు ముందు కంపెనీ వ్యయాలు 34.34 కోట్లు. తమ 4జీ నెట్ వర్క్ లను విస్తరించడానికి 2 లక్షల కోట్లకు పైగా నగదును ఇన్వెస్ట్ చేయనున్నట్టు కూడా కంపెనీ అంతకముందే చెప్పింది. ఇటీవలే కంపెనీకి 72 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పిన కంపెనీ టారిఫ్ ప్లాన్స్ ను అమలుచేస్తోంది. ఏప్రిల్ 1కి ముందు ప్రైమ్ సర్వీసులు యాక్టివేట్ చేసుకున్న వారికి కంపెనీ డేటా ఆఫర్లను కూడా ప్రకటించింది. ధన్ ధనా ధన్ ఆఫర్ పేరుతో ఇటీవలే ఓ కొత్త ఆఫర్ ను కూడా ప్రైమ్ యూజర్లకు తీసుకొచ్చింది. -
నష్టాలను తగ్గించుకున్న అదాని పవర్
న్యూఢిల్లీ: అదానీపవర్ ఏకీకృత నికర లాభం స్వల్పంగా తగ్గింది. సోమవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అదానీ పవర్ లిమిటెడ్ రూ.114 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది రూ. 411 కోట్ల నికర నష్టాలను చవిచూసినట్టు కంపెనీ బీఎసీఈ ఫైలింగ్ లో తెలిపింది. గౌతం అదానీ ఆధ్వర్యంలోని అదాని పవర్ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.5776 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇది రూ.5,751 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు రూ.4,533 కోట్లుగా ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో విరివిగా అందుబాటులోకి వస్తున్న విద్యుత్ ఉత్పత్తి ఒక కీలకమైన అంశమని అదానీ పవర్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. 2016-17 ఆర్థికసంవత్సరానికి అన్ని ప్లాంట్లలో మరింత వృద్ధిని సాధించే అవకాశంఉందని అదానీ సీఈవో బనీత్ జైన్ చెప్పారు. కార్యనిర్వాహక సామర్ధ్యం మెరుగుదల, ఫైనాన్స్ వ్యయం, సమర్థవంతమైన కార్యకలాపాలు నేపథ్యంలోతాజా త్రైమాసికంలో నికర నష్టాలు గణనీయంగా తగ్గడానిక సాయపడ్డాయన్నారు.