Opposition leaders
-
చంద్రబాబు మోసంపై భగ్గుమంటున్న ప్రతిపక్ష పార్టీలు
-
ప్రణీత్‌రావు విచారణ కోసం స్పెషల్ టీం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుతో వార్తల్లోకి ఎక్కిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ కోసం ఇప్పుడు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ఈ బృందం.. ప్రణీత్‌రావును విచారణ చేపట్టి.. ఆ వివరాలతో సహా ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావును మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఇక.. ఎస్ఐబీ లాగర్ రూమ్‌లో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు కోసం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడు.. ప్రణీత్‌రావు చేసిన నిర్వాకమిది! మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరమే ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సైతం అయ్యింది. అంతకు ముందు.. ఆయన పోలీసుల అదుపులోనే రహస్య ప్రదేశంలో ఉన్నారని.. విచారణ జరుగుతోందన్న ప్రచారం నడిచింది. అయితే ప్రణీత్ రావు కోసం రెండ్రోజులుగా పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లలోనే మకాం వేసినట్లు ఇప్పుడు తేలింది. ప్రణీత్‌రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం ప్రత్యేక టీం విచారణ చేపట్టే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. -
Russia: ప్రతిపక్ష నేతలకు పుతిన్ భయం..!
మాస్కో: పుతిన్ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు. రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్‌లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్కు 2022 డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. పుతిన్‌ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి నావల్ని -
రామ మందిర ప్రతిష్టాపన: విపక్ష నేతలకు ఆహ్వానం
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కీలక విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) అధినేత దేవేగౌడలకు ఆహ్వానాలు పంపినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గౌర్హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరందుకున్నాయి. జనవరి 15 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట పూజ జనవరి 16న ప్రారంభమై జనవరి 22కు ముగియనుంది. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలో భాగంగా జనవరి 17న 100 దేవతా విగ్రహాలతో శ్రీరాముడి జీవితంలోని దృశ్యాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి వనవాసం వరకు సాగిన జీవితం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి చిత్రాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్దం కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చెప్తున్నారు.. కానీ మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని ప్రశ్నించారు. అసెంబ్లీ నిర్వహాణ పట్ల ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ‘సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు. మాకు ఓక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లోలో ఎందుకు అవకాశం ఇస్తున్నారు. సభ నిర్వాహణ మాలాంటి వారికి భాధ కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్ నేతలకు క్లాస్.. అయినా! -
టీకా వేయించుకున్నారా? డాటా లీక్
కొవిన్ యాప్‌లో పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వం అతి పెద్ద గోప్యతా ఉల్లంఘన అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టీకా పొందినవారి వ్యక్తిగత వివరాలు ఇక టెలిగ్రామ్‌లో లభ్యమయ్యేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Cowin Portal से डाटा हुआ लीक? करोड़ों लोगों की पर्सनल डिटेल टेलीग्राम पर आई!अब तक मोदी सरकार देश की संपत्ति ही बेच रही थी, पर अब तो.... pic.twitter.com/NnCPnuT9YT— Rashtriya Janata Dal (@RJDforIndia) June 12, 2023 బాధ్యులెవరు? 'కొవిడ్ టీకా తీసుకున్నప్పుడు ఆధార్, ఫోన్ నెంబర్లు,పాస్‌పోర్టు వివరాలు,ఓటర్ ఐడీతో సహా కుటుంబ వివరాలు అన్ని నమోదు చేశారు. దేశంలో ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా అందులో ఉన్నాయి. కొవిన్ డేటా వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు ఇందులో పాలుపంచుకున్నారు? ప్రజల ముందు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?' అని సాకేత్ గోఖలే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రియా సూలే.. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎట్టిపరిస్థితుల్లో క్షమార్హం కాని నేరం' అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేం లేదు.. కొవిన్ యాప్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునే సమయంలో కేవలం వ్యాక్సిన్ తీసుకునే తేదీని మాత్రమే సేకరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. Co-WIN portal of Health Ministry is completely safe with safeguards for data privacy. All reports of data breach are without any basis and mischievous in nature. Health Ministry has requested CERT-In to look into this issue & submit a report: Government of India pic.twitter.com/hXbTpl3FNU— ANI (@ANI) June 12, 2023 ఇదీ చదవండి:వీడియోలెందుకు తీస్తున్నావ్.. భారత్‌లో విదేశీయుడికి చేదు అనుభవం -
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్‌కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
సస్పెండ్ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి అంశాలు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. వీటిపై తక్షణమే చర్చ చేపట్టాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం సైతం ప్రతిపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ధరలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఎంపీలపై సస్సెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు. బుధవారం రాజ్యసభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను సభాపతి సస్పెండ్ చేశారు. దీంతో ఉభయ సభల నుంచి బహిష్కరణకు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 24కి చేరింది. సస్పెండైన ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద రిలే నిరసన ప్రారంభించారు. 50 గంటల పాటు నిరసన కొనసాగిస్తామన్నారు. 20 మంది రాజ్యసభ ఎంపీలకు నలుగురు లోక్‌సభ ఎంపీలూ తోడయ్యారు. వారికి విపక్షాలు ఆహారం, నీరు అందిస్తున్నాయి. నిరసనలో టీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పలు పార్టీల నేతలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను కలిసి సస్సెన్షన్ ఎత్తేయాలని కోరారు. సదరు ఎంపీలు విచారం వ్యక్తం చేస్తేనే అది సాధ్యమని ఆయన చెప్పారు. అందుకు వారు తిరస్కరించారు. కాగా, నిరసనల్లో భాగంగా ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలోనే నిద్రించారు. కాగా, రాత్రంతా జాగారం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వద్దే గురువారం ఉదయమే 6 గంటలకు టీ, 8 గంటలకు టిఫిన్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. #WATCH | Delhi: The 50-hour long day-night protest of suspended MPs continues at the Gandhi statue at Parliament. (Video Source: Opposition MP) pic.twitter.com/F2Tpu6q8WU — ANI (@ANI) July 28, 2022 విపక్షాల నోటీసుల తిరస్కరణ రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఛైర్మన్ వెంకయ్య నాయుడు విపక్ష ఎంపీల నోటీసులను తిరస్కరించారు. 19 మంది సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. తర్వాత మంగళవారం పోడియంపై కాగితాలు చించి విసిరేసినందుకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ తీర్మానం ఆమోదించారు. అయినా సింగ్ సభలోనే ఉండిపోయారు. దీనిపై రగడతో సభ గురువారానికి వాయిదా పడింది. లోక్‌సభలోనూ టీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆందోళన చేయడం రెండుసార్లు వాయిదాకు దారి తీసింది. ప్లకార్డులు ప్రదర్శించకుంటే సస్పెన్షన్‌ను ఎత్తేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ధరలపై వచ్చేవారం చర్చ! మోదీ సర్కారు దిగొచ్చి విపక్షాల డిమాండ్ మేరకు ధరల పెరుగుదల, సామాన్య ప్రజల కష్టాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. చర్చకు తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. ధరలపై వచ్చేవారం చర్చ ఉండొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. Congress, DMK, TMC, CPM & AAP MPs from both Houses on 50 hour continous dharna by turns in Parliament precincts. They are protesting their suspension for demanding URGENT debate on price rise and GST on food items. (1/2) pic.twitter.com/4IhWLZlaGY — Jairam Ramesh (@Jairam_Ramesh) July 27, 2022 -
కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ విరోధులపైకి ఉసిగొల్పుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు మంగళవారం నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాసిన లేఖలో కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ ప్రశిస్తున్న సమయంలో వారీ లేఖ రాయడం గమనార్హం. ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుండటం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ లేఖపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ, సీపీఎం నేతలు సంతకాలు చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే. కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో చట్టాలను అమలు చేస్తున్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ
న్యూఢిల్లీ: దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. విపక్షాలు లేఖ రాశాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీల సంతకాలతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు లేఖలో ఆరోపించాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుందని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. అలాగే పార్లమెంట్ లో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరపాలని విపక్షాలు లేఖలో కోరాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు రాష్ట్రపతికి లేఖలో తెలిపాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విపక్షాలు కోరాయి. Opposition leaders write to @rashtrapatibhvn on stalemate in Parliament and "misuse" of investigating agencies by govt. @IndianExpress pic.twitter.com/igaQeOVszK — Manoj C G (@manojcg4u) July 26, 2022 -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
రాష్ట్రాన్ని శపించకండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘నేతలు, పార్టీలు, పదవులు శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం శాశ్వతం.. దాని పురోగతి శాశ్వతం. శాశ్వతంగా ఉండే రాష్ట్రాన్ని రాజకీయం కోసం శపించకండి. ఇటీవల మరీ కుసంస్కారంగా మాట్లాడే కొందరు నేతలు పుట్టుకొచ్చారు. దారుణంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ పురోగతిలో దేశంలోనే ముందువరుసలోకి దూసుకు పోతుండటంతో వారు సహించలేకపోతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే దీవెనలుగా సర్దుకుపోతా, కానీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడకండి. రాజకీయాలు వేరు, రాష్ట్ర పురోగతి వేరు..’అని ప్రతిపక్ష నేతలకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. సోమవారం శాసనసభలో పరిశ్రమలు, ఐటీ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. దేశాన్నే తెలంగాణ సాదుతోంది ‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. దేశానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ తర్వాత తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. భౌగోళికంగా, జనాభా పరంగా 12, 11 స్థానాల్లో ఉన్న తెలంగాణ, దేశానికి కాంట్రిబ్యూషన్ విషయంలో నాలుగో స్థానంలో ఉండటంతో దేశాన్నే తెలంగాణ సాదుతోందని అర్థమవుతోంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు ఓ వైపు రాష్ట్రం ప్రయత్నిస్తుంటే సహకరించాల్సిన కేంద్రం.. వాటి భూములను తెగనమ్ముకునే పనిలో ఉంది, ప్రైవేటుపరం చేస్తే ప్రోత్సాహకాలిస్తానంటోంది. మా విధానం ‘స్టార్టప్’అయితే, కేంద్రం విధానం ‘ప్యాకప్’గా మారింది. స్పీకర్ అనుమతిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమే..’అని కేటీఆర్ ప్రకటించారు. 3ఐ మంత్రం నిజం చేస్తున్నాం ‘డిజిటల్ విప్లవాన్ని ప్రపంచంలోనే నవయువకుల జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా మనం అద్భుతంగా ఒడిసిపట్టుకునే వీలుంది. గతంలో ప్రధాని నిర్వహించిన ఓ సమావేశంలో నేనూ పాల్గొన్నా. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే 3ఐ మంత్రం గురించి వివరించా. అదే మంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపుతోంది. 4 కోట్ల జనాభాలో 2 శాతం మందికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు. అందుకే ప్రైవేటు పెట్టుబడులను గరిష్టంగా తెచ్చి ప్రైవేటు రంగంలో ఉపాధికి మెరుగైన బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాం..’అని మంత్రి తెలిపారు. తెలంగాణ వైపు చూస్తున్న కంపెనీలు ‘ప్రముఖ విదేశీ కంపెనీలు వాటి రెండోస్థాయి కేంద్రాలకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాల్లో టాప్ ఐదు కంపెనీలు వాటి రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్దపెద్ద కంపెనీలు కూడా వాటి విస్తరణకు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇందుకు టీఎస్–ఐపాస్ లాంటి పారదర్శక విధానాలు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా వంటివే కారణం. ఎప్పుడో తెలంగాణ ప్రారంభించిన టీఎస్–ఐపాస్‌ను అనుసరిస్తూ తాజాగా కేంద్రం కూడా అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 17,302 పరిశ్రమలకు అనుమతిచ్చాం. రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీతో కలుపుకొంటే 19 లక్షల మందికి ఉపాధి లభించింది. ఇక ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే ఇచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదిస్తున్నాం..’అని తెలిపారు. కట్టుకథలతో పెట్టుబడులు రావు ‘నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ నివేదికల్లో తెలంగాణ పురోగతిని పొగుడుతున్నాయి. కేంద్రమంత్రులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కానీ స్థానిక బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. కానీ కట్టుకథలతో పెట్టుబడులు రావు. కఠోర పరిశ్రమతోనే సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దవైన 300 కంపెనీలు తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. కేసీఆర్ విజన్ ఎప్పుడూ గ్రాండ్‌గానే ఉంటుంది. ముచ్చర్లలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మారంగం ఏర్పడుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాడే హెలికాప్టర్ క్యాబిన్ కూడా తెలంగాణలోనే తయారవుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మా తదితర 14 ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేసుకుని వాటి తయారీ రంగాన్ని సాకారం చేస్తున్నాం..’అని చెప్పారు. వారి వీడియోల్లోనే అభివృద్ధి కన్పిస్తోంది ‘కొందరు నేతలు పాదయాత్రల పేరుతో మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ల అవతారమెత్తారు. వారు సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోల్లోనే ఆయా ప్రాంతాల్లో జరిగిన అద్భుత ప్రగతి తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరిగిందో వారే చూపిస్తున్నారు..’అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ పాతనగర యువత కోసం శిక్షణ కేంద్రం, ఐటీ టవర్ ఏర్పాటుకు కేటీఆర్ హామీ ఇచ్చారు. లక్షల సంఖ్యలో ఉపాధికి ప్రణాళికలు ‘ఉమ్మడి రాష్ట్రంలో 23,650 ఎకరాల్లో పారిశ్రామికవాడలు ఏర్పడితే, తెలంగాణ వచ్చాక టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొత్తగా 56 పార్కులు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఐదేళ్లలో 5 లక్షల మందికి ఉపాధి అందేలా ప్రణాళికలు అమలులోకి తెస్తున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో 4 లక్షల మందికి ఉపాధి దక్కేలా లక్ష్యం నిర్ధారించుకున్నాం. కొత్తగా బీ–హబ్ ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో ఎనర్జీ పార్కును, సంగారెడ్డి సమీపంలోని శివానగర్‌లో ఎల్ఈడీ పార్కును ప్రారంభించనున్నాం. చేవెళ్ల సమీపంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థలు వస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్‌ను ఢీకొనేలా దేశంలోనే పెద్దదైన కాకతీయ టెక్స్టైల్ పార్కుకు రూపకల్పన చేశాం. రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. దీని ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది..’అని కేటీఆర్ తెలిపారు. కేంద్రం స్పందించలేదు ‘ఐడీపీఎల్ పునరుద్ధరణ సాధ్యం కాదని కేంద్రం తేల్చింది. ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మా సిటీకి రూ.వేయి కోట్ల సాయం, ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు కోసం కోరితే స్పందించలేదు..’అని విమర్శించారు. -
2024 ఎన్నికలే అంతిమ లక్ష్యం: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం సోనియా అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశం జరిగింది. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఐక్యంగా పోరాడటమే లక్ష్యం ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగింది. స్వాతంత్ర్యోద్యమ విలువలు, రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలను విశ్వసించే ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో పోరాడాలని సోనియా పిలుపు నిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సోనియా ప్రతిపక్ష పార్టీలను కోరారు. మనందరికీ ఎవరి సిద్దాంతాలు వారికి ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి దేశ ప్రయోజనాల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇదొక చాలెంజ్. ఐకమత్యాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. 2024 ఎన్నికలే అంతిమ లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సోనియా సూచించారు. సమాఖ్య వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన ఆమె పరిమితులు, ప్రతి బంధకాలను అధిగమించి ఐక్యంగా పోరాడాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఐక్యతను చాటినట్టుగానే పార్లమెంటు బయట కూడా అదే స్థాయిలో పోరాడాలన్నారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల ప్రభుత్వం వ్యాక్సినేషన్ పాలసీని మార్చుకుందన్న సోనియా మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవలే విపక్షాలతో సమావేశమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పీడ్ పెంచడంతో తాజాగా సోనియా విపక్షాలతో భేటి కావడం విశేషం. -
విపక్ష నేతలతో సోనియా గాంధీ వర్చువల్ సమావేశం
-
రాజకీయ భేటీ కాదు!.. ఎన్సీపీ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాల మధ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో రాష్ట్రీయ మంచ్ కీలక భేటీ జరిగింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయమంచ్ వ్యవస్థాపకుడు యశ్వంత్ సిన్హా అధ్యక్షత వహించారు. ఇది రాజకీయ భేటీ కాదని, భావసారూప్యం కలిగిన పార్టీలు, మేధావుల భేటీగా ఎన్సీపీ పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారి పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సమాజంలోని కీలక వ్యక్తులు రాష్ట్రీయ మంచ్ వేదికపై ప్రత్యక్షంగా ఒకేచోట సమావేశమయ్యారు. ఈ భేటీలో శరద్ పవార్ (ఎన్సీపీ), యశ్వంత్ సిన్హా (తృణమూల్ కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఘన్‌శ్యామ్ తివారీ (సమాజ్‌వాదీ పార్టీ), జయంత్ చౌధరి (రాష్ట్రీయ లోక్‌దళ్), సుశీల్ గుప్తా (ఆప్), బినోయ్ విశ్వం (సీపీఐ), నీలోత్పల్ బసు( సీపీఎం), సంజయ్ ఝా (కాంగ్రెస్ మాజీ నేత), సుప్రియా సులే (ఎన్సీపీ) వంటి నాయకులతో పాటు జావేద్ అక్తర్, మాజీ బ్యూరోకాట్ కేసీ సింగ్, రిటైర్డ్ జస్టిస్ ఎ.పి. షా వంటి మేధావులతో కలిపి మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్రోల్ – డీజిల్ ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కోవిడ్ మేనేజ్మెంట్, వ్యవస్థలపై దాడి, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను చర్చకొచ్చాయని భేటీలో పాల్గొన్న వారు తెలిపారు. ఈ భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఈ సమావేశం రెండున్నర గంటల పాటు జరిగిందని, అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా... కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను ఎన్సీపీ నాయకుడు మజీద్ మెమన్ తిరస్కరించారు. ఈ సమావేశాన్ని రాష్ట్రీయ మంచ్ చీఫ్ యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేశారని, పవార్ కాదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కపిల్‌సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మనీష్ తివారీలకు కూడా ఆహ్వానించామని, ఇతర కారణాల వల్ల వారు హాజరుకాలేదని తెలిపారు. సీపీఎం నేత నీలోత్పల్ బసు కూడా ఇది భావసారూప్యత కలిగిన వ్యక్తుల మధ్య సమావేశమేనని, దీన్ని రాజకీయ భేటీగా చూడకూడదని అన్నారు. -
ప్రగతిభవన్ ఎదుట విపక్షాల ఆందోళన
-
ప్రగతి భవన్ ఎదుట విపక్షాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రగతిభవన్ ముందు ఆందోళనకు దిగిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్‌కు పీపీఈ కిట్‌తో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉదయం నుంచే వివిధ పార్టీల ముఖ్య నేతల ఇళ్ల పాటు, ప్రగతిభవన్ ముందు పోలీసులు భారీగా మొహరించారు. సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ప్రజా సంఘాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. -
కూలీల ఇక్కట్లపై నేడు ప్రతిపక్షాల భేటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ప్రతిపక్షాల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది నేతలు పాల్గొంటారని అంచనా. ప్రధానంగా వలస కూలీల సమస్యలను పరిష్కరించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చస్తారు. అలాగే పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తుండడంపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు 17 ప్రతిపక్షాలు అంగీకారం తెలిపాయి. -
పబ్లిసిటీ కోసం గాలి మాటలొద్దు..
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలు విస్మరించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.శుక్రవారం ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. నగరంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని...ఆదివారం కూడా వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. వాతావరణం మార్పుతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. విష జర్వాలను అదుపు చేయడానికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ మెడికల్ సేవలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు. డెంగీ లేదనడం లేదని.. డెంగీని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిసిటీ కోసం గాలి మాటలు మాట్లాడవద్దని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. -
కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ నుంచి వెళ్లిన ప్రతిపక్షపార్టీల నాయకుల బృందాన్ని అధికారులు శ్రీనగర్‌లోనే నిలిపివేశారు. బృందంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్జేడీ, టీఎంసీ పార్టీలకు చెందిన 11 మంది నేతలు ఉన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్న గవర్నర్ సూచనల మేరకే తాము ఈ పర్యటన చేపట్టినట్లు బృందం వెల్లడించింది. అక్కడ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని బీజేపీని ఉద్దేశించి సీపీఐ ఆరోపించింది. దీనిపై జమ్మూ కశ్మీర్ ప్రభు త్వం స్పందించింది. ప్రతిపక్ష పార్టీల పర్యటన కశ్మీర్లో నెలకొన్న శాంతికి విఘాతం కలిగించే అవకాశం తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు రాలేదని సీపీఐ నేత డి.రాజా అన్నారు. ‘మేము క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించడానికే వచ్చాం తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి కాదు’ అని ఎల్జేడీ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ అన్నారు. ‘పరిస్థితులు బాగానే ఉంటే మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు? మేము చట్టాలను అతిక్రమించడానికి రాలేదు’ అని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. హక్కులను ఓ నిరంకుశ ప్రభుత్వం ఎలా కాలరాస్తుందో దేశం గమనిస్తోందని సీపీఎం విమర్శించింది. కశ్మీర్‌లోయలో ఆంక్షల ఎత్తివేత.. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో శనివారం ఆంక్షలను ఎత్తివేశారు. ప్రార్థనల సందర్భంగా ఐక్యరాజ్య సమితి మిలిటరీ బృంద కార్యాలయాన్ని ముట్టడించాలని వేర్పాటువాదులు భావించారు. ఈ నేపథ్యంలో అధికారులు శుక్రవారం ఆంక్షలు విధిం చారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలుండగా, కొన్నిచోట్ల ల్యాండ్‌లైన్ ఫోన్లను అనుమతించారు. సుప్రీంకోర్టులో పీసీఐ పిటిషన్.. జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్‌ను పరిశీలిం చాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించేందుకుగాను ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. మీడి యా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆంక్షలు తొలగించేందుకు సహాయం చేయాలని పీసీఐ కోరింది. -
నోటికొచ్చినట్లు ఆరోపిస్తే దావా వేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హెచ్చరించారు. రూ. 4.30 కోట్ల టెండర్లలో రూ. 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని దిగజారి మాట్లాడుతున్నా రని మండిపడ్డారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా? అని ఆవే దన వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు ఒక బఫూన్ రమ్మంటే వెళ్లాలా అని ప్రశ్నించారు. అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కాబట్టి బట్ట కాల్చి మీద వెయ్యాలని కొందరు ఏది పడితే అలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ ఫలితాల విషయంలో ప్రతిపక్షాలు, మీడియా సంయమనం పాటించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా మే డే వేడుకలు జరిగాయి. టీఆర్ఎస్ కార్మిక విభాగం జెండా ఆవిష్కరించిన అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేకే... ‘అన్నీ మంచిగా జరుగుతుంటే కొందరికి మనసున పడడంలేదు. ప్రతిపక్షాలకు ఏ అంశం లేకనే ఇంటర్ ఫలితాల సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయి. తప్పులు జరిగితే ప్రభుత్వం కచ్చితంగా సరిదిద్దుకుంటుంది. ఒక తండ్రిగా నాకూ బాధ ఉంది. పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే ఎవరూ తొందరపడవద్దని సీఎం కేసీఆర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు వేరే అంశాలు లేక చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఒకాయన మాట్లాడారు. అది విద్యాశాఖలోని బోర్డులో జరిగిన విషయం. దీనికి ఐటీ శాఖతో సంబంధం ఉండదు. అందులో ఏం జరిగిందో తెలియదు. విచారణలో తేలుతుంది. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరీనా సంస్థకు టెండర్ దక్కితే తప్పును నాకు అంటగడుతున్నారు. రూ. 4.30 కోట్ల టెండర్లో రూ. 10 వేల కోట్ల లం చం ఇచ్చారని అంటున్నారు. సమస్య సున్నితమైనది. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలి. రాజకీయంగా కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ఎదుర్కోవాలం టే ప్రతిపక్షాలకు వేరే అంశాలు ఉన్నాయి. విద్యార్థు లు, తల్లిదండ్రులు తొందర పడవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బఫూన్.. పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా? ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా? కేసీఆర్‌ను ఎవరైనా ఏదైనా అం టే కొన్ని మీడియా సంస్థలు లేనిపోని హడావుడి చేస్తున్నాయి. ఇంటర్ ఫలితాల కేసు విచారణ హైకోర్టులో జరుగుతోంది. చదువే మొత్తం కాదు. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే మళ్లీ రావు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను బాధ పెట్టొ ద్దు. సమస్య తీవ్రమైనదే. అయినా ప్రతిపక్షాలు, మీడి యా సంయమనం పాటించాలని కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మర్యాదగా తప్పు దిద్దుకుంటే మంచిది. లేకుంటే కోర్టు దావాలకు వెళ్లాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడితే కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు దోషులుగా తేల్చిన వాళ్లను శిక్షించాలని ప్రభుత్వాన్ని నేనే మొదట డిమాండ్ చేస్తా. ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం. మీడియా ఇంటర్ సమ స్య విషయంలో సంయమనం పాటించాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని ప్రతిపక్షాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది. అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలి’అని కేటీఆర్ సూచించారు. కేసీఆర్.. కార్మిక పక్షపాతి కార్మిక లోకానికి కేటీఆర్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలు రావడమే కాదు... స్థానికులకు ఉపాధి కలగాలని, కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అందాలనేది కేసీఆర్ విధానమని చెప్పారు. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చేతల్లో నిరూపించుకున్నారన్నారు. అంగన్వాడీ కార్మికులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌ది అని, కొన్ని ఎర్రజెండా పార్టీలు ఉద్యమాలకు వారిని వాడుకున్నారు తప్పితే ఏమీ చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యా నించారు. గతంలో అంగన్వాడీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరితే గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ వారికి రెండుసార్లు వేతనాలు పెంచారని ఆయన గుర్తుచేశారు. ‘సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లోకి ఎవరినీ రానివ్వరని ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతుంటాయి. కానీ కేసీఆర్ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిపించి వారికి భోజనాలు పెట్టి మూడు గంటలపాటు చర్చించారు. కార్మికుల వేతనాలు పెంచారు. సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇవ్వడంతోపాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించారు. హోంగార్డులకు, జీహెచ్ఎంసీ స్వీపర్లకు, ఆశావర్కర్లకు, వీఆర్ఏలకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, విద్యుత్ కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు వేతనాలను పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్. మూతబడిన పరిశ్రమలను తెరిపించారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని తెచ్చారు. పనిచేసే చోటే కార్మికులకు నివాస సదుపాయం కల్పించాలనేది సీఎం ఆలోచన. పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలనేది కేసీఆర్ విధానం. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్ ఎన్నో చేశారు. బీడీ కార్మికులకు భృతి ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు చేయూత ఇస్తున్నారు. ఆటోలకు రవాణా పన్ను మినహాయించి వారికి లబ్ధి చేకూర్చారు. కార్మికులకు సంబంధించి ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్ అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి పెరగాలి. ఈ రంగాలతో సంపద పెరగాలి. పెరిగిన సంపదను అందరి సంక్షేమం కోసం పంచాలి. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. కార్మికులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. సాక్షర భారత్, గోపాలమిత్ర, మధ్యాహ్న భోజనం వర్కర్లకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మిక పక్షపాతి కాదు. టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటే కార్మికులకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కాలేరు వెంకటేష్, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్, రూప్సింగ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖలకు అభినందనలు... జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా కృషి చేసిన సంక్షేమ శాఖలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. సంక్షేమ శాఖల అధికారుల బృందం చక్కగా పని చేసిందని ప్రశంసించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ సంస్థల్లో చదవిన 506 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచారని సంక్షేమశాఖ ట్విట్టర్లో పేర్కొన్న అంశంపై కేటీఆర్ స్పందించారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతికి సంతాపం జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతిపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ట్విట్టర్ వేదికగా సుభాషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. -
వైఎస్సార్ సీపీ నేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, లోకేశ్‌తో పాటు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) వ్యవస్థతో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యనేతలపై నిఘా పెట్టిన ముఖ్యమంత్రి.. తాజాగా వారి వాట్సాప్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు. వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తెప్పించారు. ఫోన్ ట్యాపింగ్‌లు, ప్రతిపక్ష అభ్యర్థుల కదలికలపై నిఘా ద్వారా సమాచారం సేకరించి.. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్యాపింగ్ ఈ విషయాన్ని అధికార వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ జాబితాను దొంగలించడమే కాకుండా ప్రభుత్వ సాధికార సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చి, దానిద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌కు ఇస్తూ ప్రభుత్వం, ఐటీ గ్రిడ్స్ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ఆటోనగర్‌లో ఐటీ కంపెనీలున్న భవనంలోని ఒక అంతస్తులో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు.. గతంలో ఈవీఎంలు టాంపరింగ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికిపోయిన చంద్రబాబు సన్నిహితుడు, బినామీ అయిన వేమూరి హరిప్రసాద్, పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌లు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాల సేకరణతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడలను సాగిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్‌లో పనిచేసే ఉద్యోగులను విజయవాడకు తరలించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఆర్టీజీఎస్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్యనేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్‌కు సైతం వారు పాల్పడుతున్నారు. యూరప్ నుంచి అధునాతన పరికరాలు ఇందుకోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తీసుకువచ్చారని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్లడించారు. ఒకసారి వాయిస్ రికార్డు చేస్తే ఫోను మార్చి మాట్లాడినా ఆ వాయిస్‌ను రికార్డు చేసే టెక్నాలజీ ఆ పరికరాలకు ఉన్నట్టు సమాచారం. అలాగే సెల్ ఫోన్ నంబర్ తెలుసుకోవడం ద్వారా, అలాగే సెల్‌ఫోన్ తయారీ నంబర్ ద్వారా ట్యాపింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ వ్యవహారం అంతా హరిప్రసాద్, అశోక్ కనుసన్నల్లోనే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజులుగా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల సమాచారం సేకరణ పనిలో నిమగ్నమయ్యారని, వారి ఫోన్ నంబర్లతో పాటు వారి బ్యాంకు అకౌంట్ల కోసం అన్వేషిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పార్టీ సేవా మిత్ర యాప్‌కు ఇచ్చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల బ్యాంకు ఖాతాల వివరాలను, వారి ఫోన్ నంబర్లను సేకరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సచివాలయంలోను, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్లతో ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. అందులో భాగంగానే డబ్బులున్న వ్యక్తులకే వైఎస్సార్సీపీ అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. పోలింగ్ సమయం దగ్గరపడే సరికి ఈ ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది వారి ఉద్దేశమని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారుల కోడ్ ఉల్లంఘనలపై చర్యలేవీ.. ఇలావుండగా ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బరితెగింపుతో అధికార దుర్వినియోగం, ఇంత అధికార పార్టీ పిచ్చితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను గతంలో ఎన్నడూ చూడలేదని పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర పార్టీలు పోలీసు యంత్రాంగం దురాగతాలపై ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి పంపి వాటిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అలాంటివేమీ జరగలేదని నివేదిక పంపితే ఆ ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారు తప్ప జిల్లా అధికార యంత్రాంగం నివేదికలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్లుగా తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని చంద్రబాబు నియమించారు. ఇప్పుడు వారిద్దరూ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అలాగే సచివాలయ స్థాయిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తూ యధేచ్చగా నియమావళిని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. గతంలో టీవీలు, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాల ఆధారంగా కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
కోల్‌కతాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ