Pankaja Munde
-
Lok sabha elections 2024: వారే వీరయ్యారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు. అజిత్ వర్సెస్ కోల్హే 2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్ శివసేన సిట్టింగ్ ఎంపీ శివాజీరావ్ అథాల్‌రావ్ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్ రాంసింగ్ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్లో కోల్హే అజిత్‌ను కాదని శరద్ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వదినా మరదళ్ల వార్ బారామతిలో చాన్నాళ్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది. నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు రాహుల్ రమేశ్ షేవలే, అనిల్ దేశాయ్ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్ రెండుసార్లు సౌత్ సెంట్రల్ ముంబై ఎంపీగా గెలవగా అనిల్ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్ షిండే వర్గంలో చేరగా అనిల్ ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్ సెంట్రల్ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అనిల్‌కు ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్నాథ్ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అభిప్రాయపడ్డారు. చిఖ్లీకర్ కోసం చవాన్ ప్రచారం గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖ్లీకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్ ఇప్పుడు చిక్లీకర్కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు. బరనే కోసం అజిత్... గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు. నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ.. బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. –సాక్షి, న్యూఢిల్లీ -
నేను యోధురాలిని.. పంకజా ముండే ఎమోషనల్ స్పీచ్
నేను ధైర్యమున్న యోధురాలిని. పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడతా.. అంటూ మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే ఎమోనల్ స్పీచ్‌తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పరాలిలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బంధువు ధనంజయ్ ముండే చేతిలో ఇక్కడి నుంచే ఆమె ఓడిపోయారు. తాజాగా పరాలికి విచ్చేసిన పంకజా ముండేకు ఘన స్వాగతం లభించింది. ఆమె సాంప్రదాయ బంజారా దుస్తులు ధరించిన ఆమె లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని పరాలివాసులను కోరారు. "నేను ధైర్యమున్న యోధురాలిని. నేను పార్లమెంటులో కూర్చుని మీ కోసం పోరాడుతాను. నా బంజారా సోదరులు, సోదరీమణుల కోసం సూర్య చంద్రులు, నక్షత్రాలతో సైతం పోరాడతాను" అంటూ అక్కడ గుమికూడిన ప్రజల నినాదాలు, చప్పట్ల మధ్య భావోద్వేగంతో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ ముండేను అన్ని వర్గాలు ప్రేమిస్తున్నాయని, ఆయనను స్మరించుకోని సమాజం లేదని అన్నారు. బంజారా సమాజానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి సుధాకరరావు నాయక్‌తో తన తండ్రికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. -
నాన్చకండి.. నిర్ణయం తీసుకోండి: మాజీ బీజేపీ మంత్రి
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ చేస్తోన్న పోరు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బీజీపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు హామీలివ్వడం కాకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలని కోరారు. కేంద్రానికి అప్పగించండి.. బీజేపీ మాజీ మంత్రి పంకజా ముండే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శివశక్తి పరాక్రమ యాత్రలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె మరాఠా రిజర్వేషన్లపై ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చన్న ప్రణాళిక ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది కాబట్టి నిరసనకారులతో ధైర్యంగా చర్చలు నిర్వహించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి 50% కంటే రిజర్వేషన్ ఇవ్వలేమనిపిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తే వారు రాజ్యాంగబద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అన్నారు. హామీలొద్దు.. మరాఠా సమాజం ఇప్పటికే విసిగిపోయిందని కచ్చితమైన కార్యాచరణ కావాలని అన్నారు. అనవసరంగా మరాఠాలు ఓబీసీలకు మధ్య తగువులు పెట్టవద్దని విన్నవించారు. అదే విధంగా నిరసనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ... మీ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆందోళనలను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్లాజ్‌ను తొలగించండి.. ఇటీవల జల్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 11 రోజులుగా దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే పాటిల్ దీక్షను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం పొందుకుని ఓబీసీ రిజర్వేషన్ సాధించాలంటే వంశపారపర్యం ధ్రువీకరణ పత్రం తప్పదంటూ ప్రభుత్వ చేసిన తీర్మానం(జీఆర్) నుంచి ఆ క్లాజ్‌ను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు గడిచిన వారం రోజుల్లో మరింత ఉధృతం చేశారు నిరసనకారులు . అహ్మద్‌నగర్, , ధారాశివ్, నాందేడ్, జల్నా, హింగోలి, ఔరంగాబాద్, పర్భని జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇది కూడా చదవండి: TS Election 2023: అమిత్‌షా సభ విజయవంతమైనా.. చేరికలు లేక డీలా..! -
మహారాష్ట్రలో బీజేపీలో ట్విస్ట్.. పంకజా ముండే సంచలన కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక, పవార్ వర్గం బీజేపీ కూటమితో చేరడం పట్ల మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఎన్సీపీ నేతలను ఇప్పుడే పక్కనే కూర్చోబెట్టుకోవాలన్న కారణంగా తమ అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కతున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, పంకజ్ ముండే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవర్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అవినీతి ఆరోపణలున్న ఎన్సీపీ నేతలు ప్రభుత్వంలో చేరడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే తాను రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలపై సీరియస్ అయ్యారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తాను కలిసినట్లు ప్రసారం చేసిన ఛానెల్‌పై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వదంతులు ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ సిద్ధాంతం తన రక్తంలో ఉందన్నారు. సిద్ధాంతాల విషయంలో రాజీపడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నానని సంచలన కామెంట్స్ చేశారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినా తన నీతిని ప్రశ్నిస్తున్నారని, పుకార్లు పుట్టిస్తున్నారని పంకజా ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయాలపై గడ్కరీ అదిరిపోయే సెటైరికల్ పంచ్ -
బీజేపీ నా పార్టీ కాదు... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దివంగత బీజేపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ముండే కుమార్తె మాజీ మంత్రి బీజేపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నేను బీజేపీకి చెంది ఉండవచ్చు, కానీ అది నా పార్టీ కాదని వ్యాఖ్యలు చేశారు. పంకజా ముండే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి సొంత పార్టీలో ముసలం రేపుతున్నాయి. బీజేపీ నా పార్టీ కాదు... పంకజా ముండే 2014 నుండి 2019 మధ్య కాలంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఓటమిపాలైన నాటి నుండి ఆమె ప్రజల మధ్యకు రావడం తగ్గించేశారు. చాలా కాలం తర్వాత జనం ముందుకు వచ్చిన ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేను బీజేపీకి చెంది ఉండవచ్చు, అంతమాత్రాన అది నా పార్టీ కాదు. నాకు మా నాన్నతో సమస్య వస్తే, మా అన్న ఇంటికి వెళ్తాను. ఇది కూడా అంతే .." అని చాలా తేలికగా చెప్పి చిచ్చు రాజేశారు. అసలు కారణం ఇదే... అయితే గోపీనాథ్ ముండే అనుచరులు కొంతమంది మహాదే జాంకార్ నాయకత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీనుద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. 2022 లో ఎకనాథ్ షిండే ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవి దక్కనందుకే ఆమె ఈ విధంగా స్పందించి ఉండొచ్చంటున్నారు. చదవండి: ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్ -
పంకజా, ప్రీతం మద్దతుదారుల రాజీనామా
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి మండలి విస్తరణలో స్థానం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పంకజా ముండే, ఎంపీ ప్రీతం ముండేల మద్దతుదారులు సుమారు 20 మందికిపైగా పైగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీడ్ జిల్లాకు చెందిన వీరంతా రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. అసంతృప్తి లేదంటూనే.. కేంద్ర మంత్రిమండలి విస్తరణ అనతంరం మంత్రి మండలిలో స్థానం దక్కకపోవడంపై దివంగత సీనియర్ బీజేపీ నేత గోపీనాథ్ ముండే కూతుళ్లు పంకజా ముండే, ప్రీతం ముండేలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని ఆ వార్తలన్నీ అవాస్తవమంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపడేశారు. మరోవైపు పంకజా ముండే కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఎలాంటి నిరాశ లేదని, అదేవిధంగా అసంతృప్తి కలగలేదంటూ ఈ వార్తలకు విరామం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ముండే మద్దతుదారులు మాత్రం శనివారం బీజేపీలో తమ పదవులకు రాజీనామాలు చేయడం కలకలం సృష్టించింది. ముఖ్యంగా బీడ్ జిల్లా పరిషత్ సభ్యురాలు సవితా బడే, పంచాయతి సమితి సభ్యులు ప్రకాష్ ఖోడ్కర్, బీజేపీ విద్యార్థి ఆఘాడీ జిల్లా అధ్యక్షుడు సంగ్రామ్ బంగార్, బీజేపీ బీడ్ జిల్లా ఉపాధ్యక్షుడు వివేక్ పాఖరేతోపాటు డా. లక్ష్మణ్ జాధవ్ తదితరులు తమ పదవులకు రాజీనామా చేశారు. -
Pankaja Munde: మీరు మోసపోలేరు.. సీఎంను కలుస్తా
ముంబై: రిజర్వేషన్లపై మరాఠాలు మోసపోయామని భావిస్తున్నారని కానీ, ప్రస్తుత తరం ప్రజలు మోసపోలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే వ్యాఖ్యానించారు. గురువారం తన తండ్రి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు. ఉద్ధవ్‌ను త్వరలోనే కలుస్తానని, రిజర్వేషన్ల అంశంపై తన సలహాలు, సూచనలు సీఎంకు అందజేస్తానని పంకజ తెలిపారు. విద్య, ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో మరాఠాలు మోసపోయామని అనుకుంటున్నారని, కానీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏ వర్గాల కోసం ప్రణాళిక రూపొందిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. ఓబీసీ, మరాఠా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కాగా, బీడ్ జిల్లా పార్లీ నుంచి 2019లో ఎదురైన ఓటమిపై ఆమెను ప్రశ్నించగా ఎన్నికల నష్టం రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిలిచిపోదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికీ తన ఓటమి గురించి మాట్లాడుతారని కానీ, ఆ ఓటమి పూర్తి స్థాయిలో లేదన్నారు. ప్రజలకు తనపై ఇంకా ఆశలు ఉన్నాయని, గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం ఇస్తానని పంకజా తెలిపారు. కాగా, 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల వరకు రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకి రాలేదు. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. చదవండి: మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్ వ్యాఖ్యలు దుమారం జీరో కరోనా కేసులు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ -
ఆ విషయంలో నాకు బాధ లేదు: బీజేపీ నేత
ముంబై: తనని విధాన మండలి ఎన్నికల కోసం ఎంపిక చేయకపోవడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేత పంకజా ముండే తెలిపారు. కార్యకర్తలెవరు నిరాశ చెందొదంటూ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘మనం ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం. మనకి సాహెబ్ ( తండ్రిగోపినాధ్ ముండే)ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు మా అమ్మకి, చెల్లికి ఫోన్ చేసి మీ బాధను, ఆవేదనను వ్యక్తపరుస్తోన్నారు. నేను మీ ఫోన్‌ను స్వీకరించలేను. ఎందుకంటే నా వద్ద చెప్పడానికి ఏం లేదు. నేను ఏం బాధపడటం లేదు. పార్టీ ఎంపిక చేసిన నాలుగురు అభ్యర్థులకు నా అభినందనలు’ అని పేర్కొన్నారు. (ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్ధవ్ పోటీ?) అసెంబ్లీ ఎన్నికల్లో తన దాయాది మీద పాలి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ముండే ఓడిపోయారు. అయితే తనకి విధానపరిషత్ ఎన్నికలకు టికెట్లు కేటాయించకపోవడంపై ముండే బాధపడటం లేదని ఎన్సీపీ లీడర్ ధనుంజయ్ ముండే తెలిపారు. ముండేతో పాటు బీజేసీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సేకి కూడా టికెట్ కేటాయించపోకవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి ఎన్సీపీ నేత రంజిత్ సిన్హ్ మోహిత్‌ని, ఎవరికి అంతగా పరిచయంలేని గోపిచంద్ పడ్లాకర్, ప్రవీణ్ దత్కే, అజిత్ గోపిచండేలను ఎన్నికల కొరకు ఎంపిక చేశారు. వీరు శుక్రవారం నామినేషన్లను దాఖలు చేశారు. మే 21న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక తొమ్మిది సీట్లకు జరగనుంది. ఈ ఎన్నిక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఎన్నికలో గెలిస్తేనే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. (21న మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు) -
కరోనా కాలంలోనూ రాజకీయ సెగలు
సాక్షి, ముంబై : కరోనా కాలంలోనూ మహారాష్ట్రలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. మే 21న రాష్ట్రంలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో సీటు ఆశించిన భంగపడ్డ బీజేపీ నేతల నుంచి నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. వీరిలో జాబితాలో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపినాథ్ ముండే కుమార్తె, మాజీ మంత్రి పంజక ముండే ముందు వరుసలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సమీప అభ్యర్థి ధనుంజయ్ ముండేపై పోటీ చేసి పంకజ ఓటమి చెందారు. అనంతరం పార్టీ అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మారిన రాజకీయ సమీకరణాల కారణంగా శుక్రవారం బీజేపీ విడుదల చేసిన మండలి అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. దీంతో పంకజ తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. దీనికి తోడు ఆమె అనుచరులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (మండలి ఎన్నికలకు ఈసీ గ్రీన్‌సిగ్నల్) అయితే గత శాసనసభ ఎన్నికల ముందే నుంచి పంకజ కాషాయ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలతో ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపించాయి. పంకజ ముండే పార్టీని వీడిపోనున్నారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి. తన ఓటమి అనంతరం ‘భవిష్యత్ కార్యాచరణపై ఆలోచించుకోవాల్సిన సమయం’ అంటూ ఆమె వివాదాస్పద పోస్ట్ పెట్టడం పెద్ద దుమారమే సృష్టించింది. ఆమె బీజేపీకి గుడ్‌బై చెబుతారనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. (ఠాక్రే ఎన్నికకు ముహూర్తం ఖరారు) ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై శనివారం స్పందించిన పంకజ పార్టీ ప్రకటించిన జాబితాలో తన పేరు లేనందుకు ఏమాత్రం కలత చెందడంలేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమెతో పాటు చోటుదక్కని మరికొందరు నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మే 21 మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_331238501.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘నేనైతే వెళ్లను..పొగబెడితే మాత్రం’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలతో ఆ పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. కాషాయ పార్టీ నేత పంకజ ముండే పార్టీని వీడిపోనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. తన ఓటమి అనంతరం ‘భవిష్యత్ కార్యాచరణపై ఆలోచించుకోవాల్సిన సమయం’ అంటూ ఆమె వివాదాస్పద పోస్ట్ పెట్టడమే ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. పంకజ్ ముండే పార్టీకి గుడ్‌బై చెబుతారన్న వార్తలు వినిపిస్తున్నక్రమంలోనే ఆమె మరోసారి పార్టీని వీడతారనే సంకేతాలు పంపారు. గురువారం జరిగిన తన తండ్రి దివంగత గోపీనాథ్ ముండే జయంతి వేడుకల్లో ఆమె పాల్గొంటూ ప్రస్తుతం తాను బీజేపీని వీడడం లేదని వివరణ ఇచ్చారు. అయితే తనను పార్టీ నుంచి పంపించేయాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గత ఎన్నికల్లో కొంతమంది బీజేపీ నాయకులు తాను ఓడిపోవాలని కోరుకున్నారని ప్రస్తావించారు. అందుకే తన సోదరుడి చేతిలో ఓటమిపాలయ్యానంటూ చెప్పుకొచ్చారు. పంకజ్ ముండే వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గత కలహాలను వెల్లడిస్తున్నాయి. కాగా పంకజ్ ముండే ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సోదరుడు ధనుంజయ్ ముండే చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. -
బీజేపీ మహిళా నేత అనూహ్య పోస్ట్..!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక, భవిష్యత్ కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ నాయకురాలు పంకజ ముండే ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. గత బీజేపీ సర్కార్‌లో పంకజ (40) గ్రామీణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన కజిన్ సోదరుడు ధనుంజయ్ ముండే చేతిలో 30వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పంకజ ముండే తాజాగా పెట్టిన పోస్టు ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. ‘రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత భవిష్యత్తేమిటనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో నేను చర్చించుకోవడానికి 8 నుంచి 10 రోజుల సమయం కావాలి’ అని తెలిపారు. తన తండ్రి, బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే 60వ జయంతి సందర్భంగా డిసెంబర్ 12లోపు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆమె తెలిపారు. బీడ్ జిల్లాలోని తన తండ్రి స్మారక కేంద్రం గోపీనాథ్ ఘాట్ వద్దకు 12వ తేదీన తమ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఈ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తన కజిన్ ధనుంజయ్ ముండేతో తీవ్ర రాజకీయ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో పంకజ ముండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
‘రాహుల్ మెడకు బాంబు కట్టి విసిరేయాలి’
ముంబై : ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు.. భద్రతా దళాలను వాడకోకూడదంటూ ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నాయకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు పంకజ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అనుమానం వ్యక్తం చేసేవారు నోరు ముస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు పంకజ ముండే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన సైనికుల మీద దాడి చేసిన ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు జరిపాము. కానీ కొందరు ‘అసలు దాడులు ఎక్కడ జరిపారు.. ఆధారాలేవ’ని ప్రశ్నిస్తున్నారు. వారికి అర్థమవ్వాలంటే ఒకటే దారి.. రాహుల్ గాంధీ మెడలో బాంబు కట్టి.. వేరే దేశానికి పంపించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంకజ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. -
ఆమెకు ఒక్క గంట చాలు
సాక్షి, ముంబై: మరాఠా రిజర్వేషన్ బిల్లు వ్యవహారంపై శివసేన మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. మంత్రి పంకజ ముండే(39) వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై విరుచుకుపడింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. (మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?) ‘ఎలాంటి సమస్యలు లేకుండా మరాఠా రిజర్వేషన్ బిల్లును క్లియర్ చేస్తానని పంకజ ముండే చెబుతున్నారు. ఆమెను ఒక్క గంట ముఖ్యమంత్రిని చేయండి చాలు. రిజర్వేషన్ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది’ అని ఆ సంపాదకీయం పేర్కొంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లను ఏకీ పడేసింది. ఓ మహిళా మంత్రి, రిజర్వేషన్ బిల్లుపై ఆసక్తి చూపుతుంటే.. సీఎం మాత్రం కిక్కురు మనకుండా ఉండిపోతున్నారు. కనీసం ఢిల్లీ వెళ్లి ప్రధానినో లేక.. మంత్రులనో కలిసి మరాఠా బిల్లు కోసం చర్చించాలన్న ఇంగిత జ్ఞానం సీఎంకు లేకుండా పోయింది. ఒకవేళ ధైర్యం చేసి ఢిల్లీ వెళ్లినా సమయానికి ఆ ప్రధాని ఉండరు. ఎప్పుడూ చూసినా విదేశాలు పట్టుకుని తిరుగుతుంటారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను అణచివేయటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ప్రభుత్వాలు పని చేస్తున్నాయి అని సామ్నాలో శివసేన విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉంటే 16 శాతం రిజర్వేషన్ కోరుతూ మరాఠా కమ్యూనిటీ(మొత్తం 30 శాతం జనాభా ఉంది) ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం విదితమే. ఆందోళనల్లో భాగంగా జూలై 23న ఔరంగాబాద్‌లో ఓ యువకుడు(27) గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మక రూపం దాల్చింది. గురువారం బీద్ జిల్లా పర్లీలో పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పంకజ ముండేను మరాఠా ఉద్యమకారులు అడ్డుకున్నారు. ‘మరాఠా రిజర్వేషన్ ఫైల్ నా టేబుల్‌పై గనుక ఉండి ఉంటే నిమిషాల్లో సంతకం పెట్టేదాన్ని. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందుకే జాప్యం’ అని ఆమె వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
పావనీ.. ప్రెజెంట్ సార్.. యామినీ.. ప్రెజెంట్ సార్!
ఏడాదిలో ముప్పై రోజులకు పైగా బాలికలు స్కూలుకు రాకపోవడంపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. వారి హాజరు శాతాన్ని పెంచేందుకు ‘అస్మిత’ అనే పథకాన్ని మార్చి ఎనిమిది నుంచి అమలుచేయబోతోంది. ఆ పథకంలో మీరూ పాలుపంచుకోవచ్చు. ఓ అనాథ బిడ్డను ఏడాది పాటు దత్తత తీసుకున్నాం అనుకోండి. దానర్థం.. ఒక ఏడాదిపాటు ఆ బిడ్డ పోషణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఒక విద్యార్థిని దత్తత తీసుకుంటే వారి చదువుకు ఏడాదికయ్యే ఖర్చును స్పాన్సర్ చెయ్యడం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫార్ములాను బాలికలలో ‘రుతుక్రమ పరిశుభ్రత’ కోసం అనుసరించబోతోంది. ప్రతి నెలా ‘పరీక్షా సమయమే’! గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే.. అమ్మాయిల సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. వారిలోనూ కనీసం ఐదవ తరగతైనా పూర్తి చేసే అమ్మాయిలు మరీ తక్కువ. అసలు వాళ్లు అక్కడి వరకు రావడమే పెద్ద విజయం అన్నట్లు ఉంటాయి బాలికలకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు. ఐదవ తరగతిని కూడా దాటుకుని ఎనిమిది, తొమ్మిది క్లాసులకొచ్చేటప్పటికి వారి హాజరు శాతం మరింత పడిపోతోంది. ఏడాదిలో ముప్పై రోజులకు పైగా ఆ తరగతి బాలికలు స్కూలుకు రాలేకపోతున్నారు! ఈ పరిస్థితిపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. మనసు బడిలో.. మనిషి ఇంట్లో.. పరిశుభ్రమైన పద్ధతుల్లో నెలనెలా రుతుక్రమాన్ని దాటుకుని రావడం గ్రామాల్లోని విద్యార్థినులకు ఒక సమస్యగా పరిణమిస్తోంది. డబ్బు పెట్టి ప్యాడ్స్ కొని వాడలేరు. దాంతో నెలకు నాలుగు రోజులు వారిని ఇంట్లోనే ఉంచేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని గుర్తించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రుతుక్రమ పరిశుభ్రత గురించి తెలియజెప్పి ఊరుకుంటే సరిపోదు, అంతకు మించిన సహకారం బాలికలకు ఉండాలని భావించారు. ఫలితమే.. ‘అస్మిత’ ప్రోగ్రామ్. ప్రభుత్వమే ‘ప్యాడ్మాన్’ అయింది! గ్రామాల్లో అల్పాదాయ వర్గాల బాలికలకు ఏడాదికి దాదాపుగా 183 రూపాయలు రుతుక్రమ పరిశుభ్రత కోసం ఖర్చు చేయడం కష్టమైన పని. అందుకని ప్రభుత్వమే నామమాత్రపు ధరకు ప్యాడ్లను అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ‘అస్మిత’ అనే పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించబోతోంది. అందులో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పేర్లు, వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థినుల పేర్లు ఉంటాయి. వారందరికీ అస్మిత కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉన్న అందరికీ ప్రతి నెలా... ఎనిమిది శానిటరీ ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్‌ను ఐదు రూపాయలకే అందిస్తారు. వీటి పంపిణీ బాధ్యతను స్థానిక స్వయం సహాయక గ్రూపులు తీసుకుంటాయి. ప్యాడ్ల తయారీకి పాతిక నుంచి ముప్పై రూపాయలవుతుంది. ఐదు రూపాయలు పోగా మిగిలిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మనమూ ప్యాడ్మాన్ కావచ్చు! గ్రామీణ బాలికలకు సహాయం చేయాలనుకునే వాళ్లు ఆన్లైన్లో అస్మిత పోర్టల్‌లోకి వెళ్లి ఒక బాలికకు ఒక ఏడాదికి అయ్యే ఖర్చు 183 రూపాయలను విరాళంగా ఇవ్వవచ్చు. ఈ స్కీమ్‌ని మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో మనం అరుణాచలం మురుగనాథమ్ సేవల్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్ర దర్శక నిర్మాతలకు ప్రేరణనిచ్చిన నిజజీవితపు ప్యాడ్‌మ్యాన్ అరుణాచలం మురుగనాథమ్.. బాలికలలో రుతుక్రమ బిడియాన్ని పోగొట్టి, వారు చదువులో వెనుకబడకుండా తోడ్పాటునివ్వగలిగారు. – మంజీర -
నా రాజీనామా సిద్ధంగా ఉంది: మంత్రి
మహారాష్ట్ర మంత్రివర్గంలో సభ్యురాలైన పంకజా ముండే రాజీనామాకు సిద్ధపడ్డారు. తన ప్రత్యర్థులు పదే పదే తనను టార్గెట్ చేస్తున్నారని, తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయాలని భావిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఆ ప్రత్యర్థులు వేరే పార్టీ వాళ్లా.. తమ సొంత పార్టీలోని వాళ్లేనా అన్న విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. ''మా నాన్న వారసత్వాన్ని నా లేత భుజాలపై మోయాల్సి వచ్చింది. నన్ను ఎంతగా టార్గెట్ చేస్తారు? నా మీద అవినీతి ఆరోపణలు చేశారు. నేను బెదిరించానని ఒక వ్యక్తి ఆరోపించాడు, నన్ను గూండా అని కూడా అంటున్నారు. వాటిలో ఏ ఒక్క ఆరోపణా ఇంతవరకు రుజువు కాలేదు గానీ, నా పేరు ప్రతిష్ఠలను మాత్రం మంటగలుపుతున్నారు. నేను పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోతున్నాను. నా రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచాను. నేను ఏదైనా తప్పు చేశానని ప్రలు భావించిన వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకొంటా'' అని అహ్మద్‌నగర్- బీద్ రోడ్డులోని భగవాన్గఢ్లో నిర్వహించిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆమె ఆవేశంగా అన్నారు. పంకజా ముండే మద్దతుదారులకు, అక్కడ వంజారాల ఆధ్యాత్మిక నేత నామ్‌దేవ్ శాస్త్రి వర్గీయులకు మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంటుందన్న సమాచారం ఉండటంతో పోలీసులు అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భగవాన్గఢ్ వద్దకు ముండేను రానిచ్చేది లేదని అంతకుముందు నామ్‌దేవ్ వర్గం హెచ్చరించింది. ఇది ఆధ్యాత్మిక ప్రాంతమని, దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకోనివ్వబోమని తెలిపింది. అయితే, పంకజ తండ్రి.. దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే ప్రతియేటా దసరా సందర్భంగా భగవాన్గఢ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవారు. అదే సంప్రదాయాన్ని పంకజ కూడా కొనసాగిస్తున్నారు. అయితే.. ఆమె భగవాన్బాబా సమాధిని దర్శించుకోడానికి కొండ మీదకు వెళ్లినా, అక్కడ కాకుండా కొండ దిగువన మాత్రమే మాట్లాడటంతో చాలావరకు వివాదం తప్పింది. అలాగే నామ్‌దేవ్ శాస్త్రిని కూడా ఆమె కలవలేదు. తాను గొడవ పడదలచుకోలేదని.. వచ్చే సంవత్సరం ఆయన తనను తప్పనిసరిగా ర్యాలీకి పిలుస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు పంకజ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. -
మరో వివాదంలో మహిళా మంత్రి!
ముంబై: రాష్ట్ర మహిళా మంత్రి పంకజ ముండే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ ప్రధాన ఆలయ పూజారిని, ఆయన మద్ధతుదారులను బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె నియోజకవర్గంలోని ఓ ఆలయంలో గతంలో ఆమె తండ్రి ప్రతి దసరా వేడుకలలో పాల్గొనేవారు. ఆ ప్రాంతం సమీపంలో రాజకీయ ప్రసంగాలు కూడా ఇచ్చేవారు. ఈ క్రమంలో వంజారీ కమ్యూనిటీకి చెందిన కొందరు ఆమెను భగవాన్ గడ్ లో దసరా వేడుకలలో పాల్గొనాలని కోరగా, మంత్రి మద్ధతుదారులు ఆలయ పూజారి వర్గంపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. మీపై అకారణంగా కేసులు బుక్ చేస్తామని మంత్రి పంకజ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఆడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఆడియో వివాదంపై ప్రధాన పూజారి నామ్ దేవ్ శాస్త్రిని జాతీయ మీడియా సంప్రందించగా.. దసరా వేడుకలలో ప్రసంగించేందుకు ఆమె నిరాకరించారని, మరికొన్ని పనులకు వారికి అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై మంత్రి పంకజ గానీ, బీజేపీ నేతలు గానీ నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మాట్లాడుతూ.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రి పంకజను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కరువు జిల్లా లాతురులో నదీ పునరుద్దరణ పనులు పర్యవేక్షించిన సందర్భంగా ఆమె ఎండిపోయిన నదీ ఒడ్డున నిల్చుని దిగిన ఫొటో సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఓ వైపు రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా సెల్ఫీలు దిగడం పూర్తిగా నిర్లక్ష్యమేనని విమర్శలొచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఆ పోస్ట్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. -
పంకజ అలక.. సీఎం బుజ్జగింత
ముంబయి: 'ఇది మా సెక్షన్ పని కాదండి..' అని శంకర్ సినిమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటారే.. దాదాపు అలాంటి సంవాదమే చోటుచేసుకుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రిణి పంకజ ముండేల మధ్య. సోమవారం సింగపూర్ లో జరగనున్న అంతర్జాతీయ జల సదస్సుకు వెళ్లబోనని, ఆ పని నాది కాదని అలక బూనిన పంకజను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బుజ్జగించి చివరకు సింగపూర్ వెళ్లేలా ఒప్పించారు. ఇంతకీ ఆమె అలకకు కారణం ఏమంటే.. గోపీనాథ్ ముండే వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పంకజ.. ఎమ్మెల్యే అవుతూనే మంత్రి పదవి చేపట్టారు. మహారాష్ట్ర జల సంరక్షణ (వాటర్ కంజర్వేషన్) మంత్రిగా ఉన్న ఆమెను.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖకు మార్చారు. రెండేళ్లుగా నిర్వహిస్తున్న శాఖ నుంచి ఉన్నపళంగా మార్చేయడంతో పంకజ కొద్దిగా డిసపాయింట్ అయ్యారట. అందుకే సింగపూర్ లో జరిగే కార్యక్రమాలనికి వెళ్లడం లేదని, ఆ శాఖ మంత్రిని కానుకాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని శనివారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న సీఎం ఫడ్నవిస్.. కొద్ది గంటల్లోనే పంకజ ట్వీట్ పై స్పందించారు. 'సింగపూర్ సదస్సుకు మీరు తప్పక హాజరుకావాలి. సీనియర్ మంత్రిగా అది మీ బాధ్యత. మీరు జల సంరక్షణ మంత్రిగా కాదు.. మహారాష్ట్ర ప్రభుతవ ప్రతినిధిగా సింగపూర్ వెళ్లండి' అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతే, విమానం టికెట్లు బుక్ చేసుకునే పనిలోపడ్డారు పంకజ.. Reaching singapore tomorrow on monday there is world water leader summit i was invited but now wont attend since i m not minister incharge — PankajaGopinathMunde (@Pankajamunde) 9 July 2016 Of course you must attend WLS 2016. As a senior Minister you would be representing 'The Government of Maharashtra'. https://t.co/czMYpLepMA — Devendra Fadnavis (@Dev_Fadnavis) 9 July 2016 -
హవ్వా... అక్కడ సెల్ఫీనా?
ముంబై: మహారాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి పంకజా ముండే మరో వివాదంలో చిక్కుకున్నారు. కరువుతో అల్లాడుతున్న లాతూరు జిల్లాలో ఆదివారం సెల్ఫీ తీసుకుని ట్విటర్ లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. లాతూరు జిల్లా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆమె పూర్తిగా ఎండిపోయిన మంజీరా నది పునరుద్ధరణకు సియా గ్రామం వద్ద ప్రభుత్వం చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నది ఒడ్డున నిలబడి తన సెల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా దీన్ని ట్విటర్ లో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కరువు ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటారా అంటూ మంత్రిపై నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే స్పందించిన ఆమె పనుల పర్యవేక్షణకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి నెటిజన్లను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మంజీరా నది పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. పంకజ సెల్ఫీపై మిత్రపక్షం శివసేన స్పందించింది. కరువు ప్రాంతం లాతూరులో సెల్ఫీ తీసుకోవడం దురదృష్టకరమని, ఇలా చేసుండాల్సింది కాదని వ్యాఖ్యానించింది. కరువును బీజేపీ వెక్కిరిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ మొత్తం సెల్ఫీ, అవకాశవాద పార్టీ అని విమర్శించింది. -
'పంకజ పాత్రను బుచ్చయ్య పోషిస్తున్నారు'
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశానవాటిక నిర్మించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 10లోపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడుతానని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవినీతికి పాల్పడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పాత్రను రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి పోషిస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన సుందరీకరణ పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించి అవినీతిమయం చేస్తున్నారని హర్షకుమార్ అన్నారు. -
స్కాములేవీ చేయలేదు.. విచారణకు రెడీ
స్కూలు పిల్లల కోసం రూ. 206 కోట్ల విలువైన సామగ్రి సరఫరా కాంట్రాక్టులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే ఎట్టకేలకు నోరు విప్పారు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన స్కాం అని, కేవలం రాజకీయ కక్షతోనే తనపై పస లేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కూతురైన పంకజ... మహారాష్ట్ర ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం రూ. 408 కోట్లతో ఈ తరహా సామగ్రి కొనుగోలు చేసిందని ఆమె అన్నారు. పిల్లలకు వేరుశనగ అచ్చులు, చాపలు, నోట్ పుస్తకాలు, వాటర్ ఫిల్టర్ల కొనుగోలు కాంట్రాక్టులను తమ పార్టీ కార్యకర్తలు, వాళ్ల కుటుంబ సభ్యులకే ఇచ్చారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వమే ఎక్కువ ధర పెట్టి కొందని, తాము ఇంకా తక్కువకు కొన్నా అది తప్పేనంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక్క రూపాయి మేర కూడా అక్రమాలు జరగలేదని, తన శాఖతో పాటు తాను కూడా ఈ అంశంలో ఏసీబీ విచారణకు సిద్ధంగా ఉన్నామని పంకజా ముండే చెప్పారు. కాగా, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే కూడా ఓ నకిలీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారని, ప్రభుత్వ పాఠశాలలకు అగ్నిమాపక పరికరాల కొనుగోలు కోసం రూ.191 కోట్ల కాంట్రాక్టు ఇవ్వడంలో అక్రమాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. -
పీకల్లోతు మునిగిన పంకజ
ముంబై: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు మునిగి పోయారు. ఏప్రిల్ నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, ఆదరాబాదరాగా ఫిబ్రవరి 13వ తేదీన ఏకంగా 230 కోట్ల రూపాయల టెండర్లను 24 జీవోల ద్వారా కేటాయించారు. ఈ అన్ని జీవోలపైనా ఒక్క రోజే సంతకం చేయడం గమనార్హం. ఈ కాంట్రాక్టులు దక్కించుకున్న వారిలో కొన్ని మహిళా సంఘాలు ఉన్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఉత్పత్తిదారుల బినామీలు ఉన్నారు. కాంట్రాక్టులు పొందిన వారిలో పాలకపక్ష బీజేపీ స్థానిక నేతలు ఉన్నారు. అవినీతిలోనూ సమాన న్యాయం అన్న నీతిని పాటించినట్టు ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రజ్ఞా పరాబ్ నాయకత్వంలోని 'సూర్యకాంత్ మహిళా ఔద్యోగిక్ సహకారి సంస్థ'కు ఏకంగా 104 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు అప్పగించారు. ఈ మహిళా సంస్థ ఏడాది టర్నోవర్ 300 కోట్ల రూపాయలపైనే. మిగతా మహిళా సంఘాల్లో ఎక్కువ మంది బీజేపీ మహిళా నేతలు లేదా నేతల భార్యలే ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, శిశువులను పౌష్టికాహారాన్ని సరఫరా చేయడంతో పాటు వంట పాత్రలు, వాటర్ ఫిల్టర్లు సరఫరా చేసేందుకు రూ. 230 కోట్ల కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి పథకం (ఐసీడిఎస్) కింద దేశంలోని అంగన్వాడీ పిల్లలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహార పథకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే విషయం ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద తన దృష్టికి రావడంతో సుప్రీం కోర్టు 2004లోనే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐసీడీఎస్ కింద పౌష్టికాహారాన్ని సరఫరా చేసే కాంట్రాక్టులు వ్యాపారవేత్తలకు ఇవ్వరాదని, స్థానిక ప్రజాసంఘాలు, ఆర్థిక వనరులు మరీ ఎక్కువగా లేని మహిళా సంఘాలు, స్వయం పోషక సంఘాలకు అప్పగించాలని, అట్టడుగు వర్గాల మహిళల నాయకత్వంలోని మహిళా సంఘాలకు మాత్రమే ఇవ్వాలని, స్థానిక సరకు ఉత్పత్తిదారులకు ఇవ్వొచ్చని, అవి కూడా ఒకే సంఘానికి కాకుండా తాము సూచించిన సంఘాల్లో కనీసం ఐదు సంఘాలకు కాంట్రాక్టులు అప్పగించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. ఇలా చేయడం వల్ల అంగవాడీలకు రేషన్ సరఫరా సక్రమంగా ఉండటమే కాకుండా స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఈ సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఎప్పటి నుంచో తుంగలో తొక్కుతూ వస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో ఐసీడీఎస్ స్కీమ్‌లోకి కాంట్రాక్టర్లను కూడా చేరుస్తూ కొత్త సవరణ తీసుకొచ్చింది. మహారాష్ట్రలోని 'వేంకటేశ్వర మహిళా ఔద్యోగిక్ ఉత్పాదన్ సబకారి సంస్థ లిమిటెడ్, మహాలక్ష్మీ మహిళా గృహోద్యోగ్ అండ్ బాలవికాస్ బుద్దేశియా ఔద్యోగిక్ సంస్కారి సంస్థ, మహారాష్ట్ర మహిళా సహకారి గృహుద్యోగ్ సంస్థ లిమిటెడ్' లాంటి మహిళా సంఘాల పేర్లు వింటుంటే ఇవి ఏ ఉద్దోశంతో పుట్టుకొచ్చాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పంకజా ముండేపైనే కాకుండా ఆమె తండ్రి, మాజీ మంత్రి దివంగత నాయకుడు గోపీనాథ్ ముండేపై కూడా గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన సన్నిహితుడైన సతీష్‌రావు ముండేకు చెందిన స్వప్నిల్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సబ్‌లీజ్ కింద ఐసీడీసీ కింద కాంట్రాక్టును దక్కించుకుంది. సతీష్‌రావు భార్య వనమాల ముండే నాయకత్వంలోని మహిళా సంఘానికి ప్రధాన కాంట్రాక్టు లభించింది. ఈ కారణంగా గోపీనాథ్ ముండే అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి కింద గర్భవతులైన తల్లులకు, ఆరేళ్ల వయస్సు వరకు ఉండే పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1975లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ పథకాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. -
'ఆధారాలు చూపిస్తే మంత్రిపై విచారణకు సిద్ధం'
ముంబై: మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండేపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. చిన్నారులకు అందించే ఆహారపదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని పంకజపై వచ్చిన ఆరోపణలపై ఫడ్నవిస్ స్పందించారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని సూచించారు. వీటిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఫడ్నవిస్ చెప్పారు. పంకజ 206 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు సంబంధించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'ఆమెది రూ.200 కోట్ల కుంభకోణం'
ముంబయి: మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే దాదాపు రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పాఠశాలకు సంబంధించి కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని, వీటికి చెందిన పూర్తి ఆధారాలు, దస్తావేజులతో సహా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పంకజ ముండే బీజేపీ ప్రముఖ నేత గోపినాథ్ కుమార్తె. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్స్ కొనుగోలు చేసే విధానంలో ప్రాథమిక విధి విధానాలను పాటించలేదని, దీని ద్వారా ఆమె 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. గిరిజన విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దించే బాధ్యత చూడాల్సిన ఓ మంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమాత్రం గర్హనీయం కాదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. మహారాష్ట్రలో పంకజ మహిళా శిశు సంక్షేమశాఖను నిర్వహిస్తున్నారు. గత ఫిబ్రవరి 13న పాఠశాలల పరికరాల కోసం ఆమె మొత్తం 24 కాంట్రాక్టులకు ఆమోదం తెలిపారని, ఆ సమయంలో కనీస పద్ధతులు పాటించకుండా కుంభకోణానికి తెర లేపారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, లక్ష రూపాయలు పై బడిన ప్రతి వస్తువు కొనుగోలు కోసం టెండర్లు ఖచ్చితంగా పిలవాలని తాను కఠిన నిబంధనలు విధించానని రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగన్ తివార్ తెలిపారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలు పంకజ ముండే ఖండించారు. తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని, ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారమే వాటిని కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కొనుగోళ్లు జరిపే సమయంలో ఆన్లైన్ టెండర్ పద్ధతి ఇంకా ప్రారంభకాలేదని వివరణ ఇచ్చారు. -
ఉత్తమ మంత్రిగా పంకజా ముండే
►రెండో స్థానంలో ముఖ్యమంత్రి ►మరాఠీ చానెల్ సర్వేలో ప్రజాభిప్రాయం సాక్షి, ముంబై : బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉత్తమ మంత్రిగా పంకజా ముండే ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్రాధినేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోగా, తృతీయ స్థానంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ శిందే నిలిచారు. బీజేపీ, శివసేనల ప్రభుత్వం శనివారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ మరాఠీ న్యూస్ చానెల్ మంత్రుల పనితీరుపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. దాదాపు లక్ష మంది పాల్గొన్న ఈ సర్వేలో అత్యధిక ఓట్లతో పంకజా ముండే అందరికంటే ముందు నిలిచారు. మంత్రిగా ఆమె పనితీరు బాగుందంటూ 11,760 మంది ఓటు వేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మెచ్చకుంటూ 9,545 మంది ఓటేశారు. మరోవైపు ఏక్నాథ్ శిందే పనితీరుబాగుందని 8,093 మంది ఓటేశారు. ఇక అత్యల్పంగా కేవలం 3,267 ఓట్లతో చంద్రశేఖర్ బావన్కులే చివరి స్థానంలో నిలిచారు. మిగిలిన మంత్రుల్లో వినోద్ తావ్డే (7,411) నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా సుభాష్ దేశాయి (6,726), రామ్‌దాస్ కదం (6,694), దివాకర్ రావుతే (6,024), దీపక్ సావంత్ (5,473), సుధీర్ మునగంటివార్ (5,466), ఏక్నాథ్ ఖడ్సే (5,320), చంద్రకాంత్ పాటిల్ (5,186), గిరీష్ మహాజన్ (4,930), గిరీష్ బాపట్ 860)లున్నారు. -
మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళ
ప్రతి మనిషికి, ఇంటికి నిత్యవసరమైనది మరుగుదొడ్డి. ఆ మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఓ మహిళ ఏకంగా తన మంగళసూత్రాన్నే అమ్మేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషీం జిల్లాలోని సాయిఖేదా గ్రామంలో చోటుచేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన అక్కడి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే గురువారం సత్కరించారు. మరుగుదొడ్డి సౌకర్యం లేక ముఖ్యంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆమె విలేరులతో చెప్పింది. అయితే మరుగుదొడ్డిని కట్టించడానికి తన మంగళ సూత్రాన్ని, మిగతా అభరణాలను అమ్మినట్టు సంగీతా పేర్కొంది. దేశంలోనూ, రాష్ట్రంలో పలుచోట్ల మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పంకజా ముండే చెప్పారు. శాసనసభ్యురాలైన తొలిరోజు నుంచి 25 శాతం మేర నిధులను మరుగుదొడ్ల నిర్మాణానికే కేటాయిస్తాన్నట్టు తెలిపారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్నీ మరుగుదొడ్లు నిర్మించాలనేది తమ లక్ష్యమని ముండే పేర్కొన్నారు.