Paytm Payments Bank
-
పేటీఎంకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. -
కొత్త సౌండ్‌బాక్స్‌లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే..
ఫిన్‌టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌కార్డుల కోసం కొత్త సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చింది. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్‌బాక్స్‌లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆడియో డివైజ్‌ల బ్యాటరీ లైఫ్ 10 రోజులుంటుందని చెప్పింది. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, తెలుగు, తమిళంతో సహా 11 భాషల్లో నోటిఫికేషన్లను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సౌండ్‌బాక్స్‌లు లాంచ్ చేసేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో పేటీఎం వ్యవస్థాపకులు, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ..‘కొత్త సౌండ్‌బాక్స్‌లు భారతదేశంలోనే తయారు చేశాం. ఇవి స్పష్టమైన సౌండ్‌ను అందిస్తాయి. భారతీయ పరిస్థితులకు ఇవి బాగా సరిపోతాయి. అధిక శబ్దం వచ్చే పరిస్థితుల్లోనూ పేటీఎం కస్టమర్లకు స్పష్టమైన నోటిఫికేషన్‌ను అందిస్తాయి’ అన్నారు. ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను రద్దు చేసిన తర్వాత యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేల కోసం ప్రయత్నించింది. పేటీఎం వినియోదారులకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ (పీఎస్పీ) బ్యాంక్ హ్యాండిల్స్‌ను మార్చారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్‌లతో పేటీఎం పీఎస్పీను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 17న ఈ పీఎస్పీ బ్యాంకులకు కస్టమర్ మైగ్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు మరో షాక్!
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించారు. పీపీబీఎల్‌లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్‌లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్‌గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్‌పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్‌పర్సన్‌తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్‌సైట్‌లోని ఎఫ్ఏక్యూ సెక్షన్‌ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్‌మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి
ముంబై: యూపీఐ హ్యాండిల్ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్ వెబ్సైట్ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థను ఎన్పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్ చేసే క్రమంలో పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్లుగా (పీఎస్పీ) 4–5 బ్యాంకులను ఎన్పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది. తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్‌లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్‌డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్‌డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్‌డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్‌లో చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్‌తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్‌డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్‌డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్‌లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే..
ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన ఆర్బీఐ తేదీని సవరించింది. ఈ నేపథ్యంలో ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఇటీవల ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థానంలో యాక్సిస్ బ్యాంక్‌తో ఒన్97 కమ్యునికేషన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రీఛార్జ్‌లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పేటీఎంను ఉపయోగించవచ్చా? ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌ల కోసం పేటీఎం యాప్‌ని ఉపయోగించవచ్చని కంపెనీ తన FAQ పేజీలో ధ్రువీకరించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ.. వంటి అధీకృత బ్యాంకులకు తమ పేటీఎంను లింక్ చేసిన వారిపై తాజా నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ ఎప్పటిలాగే పని చేస్తాయా? కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని ఉపయోగించవచ్చా? పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు.. ఉపసంహరించుకోవచ్చు.. మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు మాత్రం చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించవచ్చా? ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అందులో డబ్బును డిపాజిట్ చేయలేరు. అందులో ఉన్న నగదును ఉపయోగించవచ్చు. లేదా గడువులోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్‌ని మూసివేయవచ్చు. అందులో ఉన్న నగదు రీఫండ్ కోసం బ్యాంక్‌ని కోరవచ్చు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. -
పుంజుకుంటున్న ప్రముఖ కంపెనీ షేరు ధర.. కారణం ఇదే..
పేటీఎం కంపెనీ షేరు ధర ఇటీవల భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమే కారణమని నిపుణులు తెలిపారు. అయితే వరుసగా రెండో రోజు సోమవారం వన్97 కమ్యూనికేషన్స్ షేరు (పేటీఎం) భారీగా పుంజుకుంది. బీఎస్ఈలో షేరుధర సోమవారం ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను చేరింది. మర్చంట్ సెటిల్మెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్‌తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కంపెనీ షేర్లు లాభాల బాటపట్టాయి. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చింది. ఇందువల్ల పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాత కూడా యథావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు - ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లు, ఎన్‌సీఎంసీల్లోకి డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించొద్దని ఆదేశించింది. తాజాగా ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్బీఐ ఆంక్షల ప్రకటన తర్వాత కంపెనీ షేర్లలో పతనం కొనసాగుతూ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం నేపథ్యంలో శుక్రవారం నుంచి కాస్త ఉపశమనం లభించింది. సోమవారం కూడా ఆ ర్యాలీ కొనసాగినట్లు తెలిసింది. -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్‌టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్‌ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్‌ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
పేటీఎంతో శాలరీ లింక్.. రకరకాల ప్రశ్నలు.. అన్నింటికీ క్లారిటీ ఇదిగో..
పేటీఎం ( Paytm )పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో లక్షలాది యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. రకరకాల సందేహాలు వారిని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానంగా.. యూజర్లకు సహాయకరంగా స్పష్టత ఇచ్చేందుకు ఆర్బీఐ తాజాగా తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సమగ్ర సెట్‌ను ప్రచురించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ నిషేధాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదంటూ ఆదేశించింది. అయితే అన్ని లావాదేవీలను నిలిపివేసే గడువును మార్చి 15 వరకు పొడిగించడం ద్వారా వ్యాపారాలకు కొంత ఊరటను అందించింది. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తర్వాత ఏం జరుగుతుంది.. ఎలాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి ఇలాంటి 30 ప్రశ్నలపై సెంట్రల్ బ్యాంక్ ఎఫ్ఏక్యూ సమగ్ర సెట్‌ను ప్రచురించింది. ఈ ఎఫ్ఏక్యూ పత్రం వాటాదారుల అన్ని ఆందోళనలను పరిష్కరించడానికి ఉద్దేశించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. పేటీఎంపై ఆర్బీఐ ఎఫ్ఏక్యూ సెట్లోని కొన్ని ప్రశ్నలు.. కరెంట్, సేవింగ్స్ ఖాతాదారుల పరిస్థితి ఏంటి? ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాదారులు 2024 మార్చి 15 తర్వాత ఈ ఖాతా నుంచి నిధులను విత్‌డ్రా చేయడం లేదా బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మీ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు నిధులను ఉపసంహరించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి డెబిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని మీ ఖాతాలో డబ్బును జమ చేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ లేదా రీఫండ్లు మినహా ఇతర క్రెడిట్లు లేదా డిపాజిట్లు క్రెడిట్ చేయడానికి వీల్లేదు. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో రీఫండ్? అవును.. రీఫండ్లు, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్లు లేదా వడ్డీలు మార్చి 15 తర్వాత కూడా మీ ఖాతాలోకి క్రెడిట్ అయ్యేందుకు అనుమతి ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో జీతం, ఈఎంఐ లింక్ అయితే ఎలా? మార్చి 15 తర్వాత, వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి ఎలాంటి జీతం క్రెడిట్లను పొందలేరు. అసౌకర్యాన్ని నివారించడానికి మీరు మార్చి 15 లోపు మరొక బ్యాంకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీటీ సబ్స్క్రిప్షన్, విద్యుత్ బిల్లులు, రివార్డ్‌లు? మీ ఖాతాలో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు ఆటోమేటిక్ యూపీఐ మ్యాండేట్ ద్వారా ఉపసంహరణ/డెబిట్‌కు వీలుంటుంది. అయితే మార్చి 15 తర్వాత మీ ఖాతాల్లో క్రెడిట్ లేదా డిపాజిట్ అనుమతించబడదు. అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి మార్చి 15 లోపు మరొక బ్యాంకు ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ లేదా డీబీటీ? మార్చి 15 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో మీ ఖాతాలోకి అలాంటి క్రెడిట్‌ను స్వీకరించలేరు. ఏదైనా అసౌకర్యం లేదా అంతరాయాన్ని నివారించడానికి దయచేసి మార్చి 15 లోపు మీ లింక్ చేయబడిన ఖాతాను మరొక బ్యాంకుకు మార్చడానికి ఏర్పాట్లు చేసుకోండి పేటీఎం వాలెట్ గురించి? వినియోగదారులు వాలెట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఉపయోగించడం, ఉపసంహరించుకోవడం లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం కొనసాగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే మార్చి 15 తర్వాత వినియోగదారులు ఈ వాలెట్‌లోకి క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్లు కాకుండా మరే ఇతర క్రెడిట్లను టాప్-అప్ చేయలేరు లేదా వాలెట్‌లోకి బదిలీ చేయలేరు. -
కస్టమర్ల వివరాల కోసం పేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్‌కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది. అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి. -
‘పేటీఎం’ మీద చర్యలపై తగ్గేది లేదు..
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం కస్టమర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే తప్ప.. తాము పేటీఎంకి వ్యతిరేకమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ రంగానికి ఆర్బీఐ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉందని, పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని దాస్ తెలిపారు.‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీపీబీఎల్‌పై చర్యలు తీసుకున్నాం. కస్టమర్ల సందేహాల నివృత్తి కోసం ఈ వారంలోనే ఎఫ్ఏక్యూలను జారీ చేస్తాం‘ అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ భేటీలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలంటూ పీపీబీఎల్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. ఇవి ఫిబ్రవరి 29 తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే దాస్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితులపై సమీక్ష.. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 2024–25 మధ్యంతర బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెడుతున్న అంశాలను వివరించారు. ఆర్థిక రంగం నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనేది పేర్కొన్నారు. -
సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్‌లో పేటీఎం!
సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం మూతపడుతుందని, ఇక తమకు తిరుగులేదని సంబరపడిపోతున్న ప్రత్యర్థి కంపెనీలకు పేటీఎం షాక్ ఇవ్వబోతోంది. తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ ఫిన్‌టెక్ సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం (Paytm) మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తమ కస్టమర్లకు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ - UPI ) సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్-పార్టీ పేమెంట్ యాప్ (TPAP) మార్గంపై దృష్టి సారిస్తోంది. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు "పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చెల్లింపు సేవలను నిలిపివేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంకుల ద్వారా యూపీఐని ఏకీకృతం చేస్తూ ముందుకు సాగే థర్డ్-పార్టీ యాప్‌గా మారుతుంది" అని పేటీఎంలో పరిణామాల గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. దేశంలో యూపీఐ వ్యవస్థను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మారనున్న వీపీఏ ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు @paytmతో ముగిసే వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) కలిగి ఉన్నారు. అయితే, మార్చి 1 తర్వాత ఈ వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్‌కి మారుతున్నాయి. పేటీఎం యూపీఐ సర్వీస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కిందకు వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని నిషేధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం తమ యూపీఐ కస్టమర్లకు కొత్త వీపీఏల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకోనుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్ పే, గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe)లతో సహా ఇప్పటికే 22 థర్డ్-పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు థర్డ్-పార్టీ రూట్ ద్వారా ఇలాంటి ఫిన్టెక్లకు సహకారం అందిస్తున్నాయి. సాధారణంగా వీపీఏను బ్యాంక్, ఫిన్‌టెక్ రెండింటి బ్రాండ్ పేర్లను కలిపి రూపొందిస్తారు. -
పేటీఎంలో మరో కీలక పరిణామం..
ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్మెంట్ డిప్యూటీ ఎండీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు -
ఫిబ్రవరి తర్వాత కూడా యథావిధిగా పేటీఎం సేవలు
న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సరీ్వసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్‌ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. -
పేటీఎంకి భారీ షాక్.. డబ్బు తీసుకోడానికి వీల్లేదు!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm)కి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) భారీ షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్-అప్‌లను స్వీకరించకూడదని ఆదేశించింది. బయటి ఆడిటర్లు నిర్వహించిన సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, తదుపరి సమ్మతి ధ్రువీకరణ నివేదికకు ప్రతిస్పందనగా పేటీఎంపై సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎస్సీఎంసీ కార్డ్‌లు మొదలైన వాటిలో వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, రీఫండ్లు తప్ప డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్లు అనుమతించబడవని స్పష్టం చేసింది. తమ నోడల్ ఖాతాలను వీలైనంత త్వరగా ఫిబ్రవరి 29లోపు రద్దు చేసుకోవాలని One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే అన్ని లావాదేవీలు, నోడల్ ఖాతాల సెటిల్మెంట్ను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. -
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.5.39 కోట్లు జరిమానా - కారణం ఇదే!
ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లఘించిన బ్యాంకుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ తాజాగా 'పేటీఎమ్ పేమెంట్స్' బ్యాంక్‌కు భారీ జరిమానా విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లఘించిన కారణంగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ. 5.39 కోట్లు పెనాల్టీ విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 46(4)(i), 47A(1)(c) నిబంధనల ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్స్‌కు సంబంధించిన RBI మార్గదర్శకాలను, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విఫలం కావడాన్ని గుర్తించడంతో ఆర్బీఐ ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
పేటీఎంలో సరికొత్త ఫీచర్లు..
ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం (Paytm) సరి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ లైట్ ఫీచర్, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ యాడింగ్, స్ప్లిట్ బిల్, మొబైల్ నంబర్లకు బదులుగా పేటీఎం యాప్‌లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (PPBL) నిర్వహించిన సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్‌లో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్ గుప్తా, PPBL సీఈవో సురిందర్ చావ్లా కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు. పేటీఎం కొత్త ఫీచర్లు ఇవే.. పేటీఎం యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌ను పేటీఎం యాప్‌లో యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవచ్చు. అన్నింటి ముఖ్యమైన విప్లవాత్మక ఫీచర్.. స్ప్లిట్ బిల్. అంటే ఏదైనా బిల్లును స్నేహితుల సమూహంలో విభజించి పంచుకోవచ్చు. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్ చేయవచ్చు. అదేవిధంగా ట్యాగ్ చేసిన చెల్లింపులను ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇక ఫిబ్రవరిలో ప్రారంభించిన సంచలనాత్మక యూపీఐ లైట్ ఫీచర్ తాజాగా యాపిల్ ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. చెల్లింపులను క్రమబద్ధీకరించడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యను తొలగించడం దీని ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ఇప్పుడు పిన్ను నమోదు చేయకుండానే రూ. 200 వరకు చెల్లింపులు చేయవచ్చు. టూపీఐ లైట్‌కి రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో.. -
పేటీఎం రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసిందిగా! కార్డు లేకుండానే..
ముంబై: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత ‘రూపే క్రెడిట్ కార్డ్’ను విడుదల చేసింది. కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. యూపీఐ ఐడీకి రూపే క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది. రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐపై చెల్లింపుల సౌలభ్యం ఏర్పడుతుందని తెలిపింది. వినియోగదారులకు ఉత్తమ సదుపాయాలను అందించాలన్న లక్ష్యంలో భాగమే రూపే క్రెడిట్ కార్డ్ అని కంపెనీ అభివర్ణించింది. (ఇదీ చదండి : RBI Policy review: రెపో రేటు పెంపు) రూపే క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకున్న యూపీఐ ఐడీ ద్వారా లావాదేవీలు సజావుగా, ఆఫ్‌లైన్ , ఆన్లైన్ చెల్లింపులు రెండూ వేగంగా మారుతాయని కంపెనీ వెల్లడించింది. తమ కస్టమర్లకు చెల్లింపులను మరింత సులభం చేసేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ సేవలు ప్రారంభించామని పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ సురీందర్ చావ్లా తెలిపారు. (ఐకియా గుడ్‌న్యూస్: ధరలు తగ్గాయోచ్!) -
జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న పేటీఎం.. ఏకంగా నాలుగు రెట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనితో డిసెంబర్ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్ క్యాపిటల్, పిరమల్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. చదవండి: నాలుగేళ్ల జీతం బోనస్ బొనాంజా: ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ? -
‘డేటా’ నిబంధనలను పాటిస్తున్నాం
న్యూఢిల్లీ: డేటా స్థానికతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన నిబంధనలన్నింటినీ పూర్తిగా పాటిస్తున్నామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) స్పష్టం చేసింది. తమ బ్యాంక్ డేటా అంతా దేశీయంగానే భద్రపరుస్తున్నామని వివరించింది. పర్యవేక్షణపరమైన లోపాల కారణంగా కొత్త ఖాతాలు తెరవొద్దంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ గత వారం ఆదేశించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్ సర్వర్లలోని వివరాలు చైనా సంస్థల చేతుల్లోకి వెడుతున్నాయనే వార్తలతో సోమవారం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఒక్కసారిగా పతనమైంది. ఈ వన్97 కమ్యూనికేషన్స్‌లో చైనా ఆలీబాబా గ్రూప్ సంస్థలకు 31 శాతం వాటాలు ఉన్నాయి. తద్వారా పీపీబీఎల్‌లో కూడా చైనా కంపెనీలకు పరోక్షంగా వాటాలు ఉన్నాయి. -
పేటీఎమ్‌పై సంచలన ఆరోపణలు..! అందుకే బ్యాన్..!
కొత్త ఖాతాలను తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్ బ్యాంకును రిజర్వ్ ఆఫ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్ చేశారని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో సంచలన ఆరోపణలను చేసింది. చైనా కంపెనీల చేతిలోకి..! కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ గట్టిషాక్‌ను ఇచ్చింది. బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు విదేశాల్లోని సర్వర్లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. చైనా ఆధారిత సంస్థలతో కంపెనీ సర్వర్లు సమాచారం పంచుకుంటున్నాయని ఆర్బీఐ వార్షిక తనిఖీల్లో గుర్తించాయని నివేదికలో వెల్లడించింది.అందుకే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించినట్లు బ్లూమ్‌బెర్గ్ అభిప్రాయపడింది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పలు చైనా కంపెనీలు పరోక్షంగా వాటాను కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ, జాక్ మాస్ యాంట్ గ్రూప్ కో పేటీఎంలో వాటాలను కల్గి ఉన్నాయి. తప్పుడు వార్తలు..! బ్లూమ్‌బెర్గ్ నివేదికను పేటీఎం తీవ్రంగా ఖండించింది.అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలంటూ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన డేటాను ఎవరితో పంచుకోలేదని వెల్లడించింది. డేటా స్థానికీకరణపై ఆర్బీఐ ఆదేశాలను పేటీఎం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. బ్యాంకుకు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉందని తెలిపింది. పూర్తి స్వదేశీ బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఉన్నందుకు గర్విస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇక ఆర్బీఐ ప్రకటనతో పేటీఎం షేర్లు సోమవారం రోజున 13.3 శాతం మేర పడిపోయాయి. చదవండి: బెస్ట్ సెల్లింగ్ కార్.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్ క్విడ్ -
ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం: పేటిఎమ్
పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకులో కొత్తగా కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే ఆపేయాలని పేటిఎమ్'ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్చి 11న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై పేటీఎమ్ మార్చి 12న స్పందించింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ఖాతాదారులను ఆన్ బోర్డింగ్ చేయకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేటిఎమ్ తెలిపింది. "పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సాధ్యమైనంత త్వరగా ఆర్బీఐ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి రెగ్యులేటర్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. ఆర్బీఐ ఆమోదం పొందిన తర్వాత కొత్త ఖాతాలను తిరిగి ప్రారంభించేటప్పుడు మేము తెలియజేస్తాము" అని రుణదాత తన ప్రకటనలో తెలిపింది. అయితే, కొత్త కస్టమర్లు పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకులో కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతాలను తెరవలేరు. నూతన వినియోగదారులు పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ను కూడా తెరవలేరని రుణదాత పేర్కొంది. ఇంకా, పేటిఎమ్ యాప్ వినియోగించే కొత్త వినియోగదారులు పేటిఎమ్ యుపీఐ హ్యాండిల్స్ సృష్టించవచ్చు, వాటిని వారి ప్రస్తుత పేమెంట్స్ బ్యాంక్ ఖాతా లేదా ఇతర బ్యాంకు ఖాతాలకు లింక్ చేయవచ్చు అని తెలిపింది. "బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద ఆర్బీఐ తన అధికారాల మేరకు.. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని కొత్త వినియోగదారులను ఆన్‌బోర్డింగ్ చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్లు" ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. (చదవండి: ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!) -
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ
ప్రముఖ ప్రైవేట్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. కొత్తగా ఖాతాదారులను ఆన్ బోర్డింగ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్చి 11న పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకును ఆదేశించింది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు చెందిన ఐటీ వ్యవస్థను సమగ్రంగా ఆడిట్ చేయడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని బ్యాంకును ఆదేశించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. "బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద ఆర్బీఐ తన అధికారాల మేరకు.. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని కొత్త వినియోగదారులను ఆన్‌బోర్డింగ్ చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్లు" ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆగస్టు 2016లో ప్రారంభమైంది. నోయిడాలోని ఒక శాఖ నుంచి మే 2017లో అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చే జూన్ నాటికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ) లైసెన్స్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: ఏటీఎం కార్డు లేనివారికి ఎన్పీసీఐ గూడ్‌న్యూస్..!) -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన పేటీఎం..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) శుభవార్తను అందించింది. పేటీఎం 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంకును లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్భీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు స్టేటస్‌ను ఇచ్చినట్లు ప్రకటించింది. ఆర్బీఐ యాక్ట్-1934 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్భీఐ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఈ డిజిటల్ పేమెంట్ కంపెనీ ఇక కొత్త వ్యాపారాలపై ఫోకస్ పెట్టేందుకు మార్గం సులువుకానుంది. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! భారీ అవకాశాలు పేటీఎం సొంతం..! ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎంకు వ్యాపారపరంగా భారీ అవకాశాలను సొంతం చేసుకోనుంది. ప్రభుత్వం, ఇతర పెద్ద పెద్ద కంపెనీలు జారీ చేసే రిక్వెస్ట్ ఆఫ్ ప్రొపోజల్స్(ఆర్ఎఫ్పీ)లో పేటీఎం పాల్గొనవచ్చును. దాంతో పాటుగా ప్రైమరీ వేలాల్లో కూడా పాల్గొనే అవకాశం పేటీఎంకు ఏర్పడనుంది. పేటీఎం షెడ్యూల్ బ్యాంకు స్టేటస్‌పై సెప్టెంబర్‌లోనే ఆర్బీఐ నిర్ణయం తీసుకోగా...అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో ఆర్భీఐ జారీ చేసింది. కాగా షెడ్యూల్ బ్యాంకు స్టేటస్ వచ్చినట్టు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు గురువారం వెల్లడించింది. షెడ్యూల్ బ్యాంకు స్టేటస్‌తో వచ్చే ప్రయోజనాలు ఆర్భీఐ రూపొందించిన నిబంధనలను షెడ్యూల్ బ్యాంకులు అనుసరించాల్సిం ఉంటుంది. అంతేకాకుండా ఆర్భీఐ నుంచి రుణాలను కూడా పొందే సౌకర్యం ఉంటుంది. రోజువారీ బ్యాంకింగ్ అవసరాల కోసం ఆర్భీఐ నుంచి నగదును అప్పు తీసుకునే సౌకర్యం షెడ్యూల్ బ్యాంకులకు కల్గుతుంది. 6.4 కోట్లకు పైగా ఖాతాలు..! మార్చి 31, 2021 నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 6.4 కోట్లకు పైగా సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, పార్టనర్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం రూ.5200 కోట్ల పైనే ఉన్నాయి. చదవండి: పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!