PETA
-
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్‌లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
బిగ్‌బాస్ షో నుంచి గాడిద ఎలిమినేట్!
బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఓ గాడిదను కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. గత వారం బిగ్‌బాస్ 18వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో 19వ కంటెస్టెంట్‌గా గాడిదను ప్రవేశపెట్టారు. దీని పేరు గదరాజ్. దాన్ని బిగ్‌బాస్ హౌస్‌లోనే ఓ చోట కట్టేశారు. కంటెస్టెంట్లు సమయానికి దానికిన్ని నీళ్లు, గడ్డి పెట్టారు. అయితే రియాలిటీ షో కోసం మూగజంతువును వాడుకోవడం చూసి పెటా(పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది.మొదటివారం ఎవరు ఎలిమినేట్?తక్షణమే దాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈమేరకు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు లేఖ రాసింది. పెటా ఆదేశాలతో ఈ వారం గాడిదను ఎలిమినేట్ చేసి పంపించినట్లు సమాచారం. నిజానికి ఈ వారం చాహత్ పాండే, గుణరత్న సదవర్తె, కరణ్ వీర్ మెహ్రా, అవినాష్ మిశ్రా, ముస్కన్ బామ్నే నామినేషన్లో ఉన్నారు. కానీ వీళ్లలో ఒకరికి బదులుగా పెటా ఆదేశాల ప్రకారం గాడిదను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.18 మంది కంటెస్టెంట్లుఇకపోతే ఈ హిందీ బిగ్‌బాస్‌లో వివియన్ డిసేనా, ఐషా సింగ్, కరణ్ వీర్ మెహ్రా, చాహత్ పాండే, షెహజాదా దామి, నైరా బెనర్జీ, అవినాష్ మిశ్రా, ఎలైస్ కౌశిక్, రాజత్ దలాల్, శిల్ప శిరోద్కర్ వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పీతను హింసించారు.. ఎమ్మెల్యేపై ‘పెటా’ ఫిర్యాదు
ముంబై, సాక్షి: ఇటీవల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను వేలాడదీయడంపై జంతు హక్కుల సంస్థ పెటా (PETA) ఎన్నికల అధికారులకు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్) చీఫ్ శరద్ పవార్‌కు లేఖ రాసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, మహారాష్ట్ర మోడల్ ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ప్రచారానికి, ఎన్నికలకు జంతువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 2014 మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారని పెటా పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను హింసించారని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోందని, మీడియా స్టంట్ కోసం మూగ ప్రాణులకు నొప్పి, బాధ కలిగించారని శరత్ పవార్‌తోపాటు జిల్లా ఎన్నికల అధికారి మినల్ కలస్కర్‌కు రాసిన లేఖలో పెటా ఇండియా అడ్వకేసీ అసోసియేట్ శౌర్య అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే వెటర్నరీ కేర్, పునరావాసం కోసం పీతను తిరిగి ప్రకృతిలోకి వదిలిపెట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు కూడా పెటా ఇండియా లేఖ రాసింది. -
సముద్రంలో సరదాగా సొరతో ఫుట్‌బాల్ ఏజెంట్ కొట్లాట.. వీడియో వైరల్..
ఎవరైనా సరదాకి చిన్న జంతువులతో ఆటలాడుతారు. ఇంట్లో ఉండే కుక్క, పిల్లులతోనే కాలక్షేపం చేస్తారు. కొన్నిసార్లు వాటితో సరదాగా పోట్లాడుతారు. ఏవో నవ్వుకునే పనులు చేస్తుంటారు. కానీ ఎవరైనా ప్రమాదకరమైన జంతువులతో పెట్టుకుంటారా? తెలివి ఉన్నవారు ఎవరూ అలా చేయరు కదా..! కానీ ఓ ఫుట్‌బాల్ ఏజెంట్ ఏకంగా సొరచేపతో సరదాగా ఫైట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అమెరికాకి చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్ఎఫ్ఎల్) ఏజెంట్ డ్రూ రోసెన్హాస్ సొరచేపతో ఫైటింగ్ చేశారు. స్నేహితులతో సరదాగా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రోసెన్హాస్.. ఓ చిన్న సొరచేపను చూశారు. అది వారి బోటుకు దగ్గరికి రావడంతో వారంతా మరింత ఆసక్తిని కనబరిచారు. కాసేపు బోటులో నుంచే దానితో ఆటలాడారు. కానీ రోసెన్హాస్ మాత్రం సముద్రంలోకి దూకి సొరచేపతో ఆటలాడారు. దాని తోకను పట్టుకుని కాసేపు ఫైటింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సొరతో 45 నిమిషాలు పోట్లాడినట్లు చెప్పుకొచ్చారు. Went fishing with @cheetah today and decided to get up close to this Dusky Shark pic.twitter.com/P1jIWKEuef — Drew Rosenhaus (@DrewJRosenhaus) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. రోసెన్హాస్ తీరుపై పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్(పీఈటీఏ) మండిపడింది. జంతువులతో అలా ప్రవర్తించడంపై ఆక్షేపించింది. సొరచేపతో అటలాడటాన్ని కొందరు విమర్శించారు. కాలుష్యంతో ఇప్పటికే సముద్ర జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయ్.. ఇక నేరుగా కూడా దాడి చేస్తారా? అంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన తల్లి.. కొన్నాళ్ల తర్వాత -
Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది
ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ ‘ఏనుగు డాక్టర్’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్ అడవుల్లో పిక్నిక్ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది. ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది. నేను... ఎలీని... నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు. కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది. కొనసాగుతున్న హింస ‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు. ‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం. -
మాంసాహారులతో శృంగారం వద్దు!: పెటా
వైరల్: ముక్క తినే మగవాళ్లకు ముద్దూముచ్చటలను దూరం చేయాలన్న పెటా ప్రయత్నం బెడిసి కొట్టింది. నాన్-వెజ్ తినే మగవాళ్లతో శృంగారంలో పాల్గొనకూడదంటూ మహిళాలోకానికి పిలుపు ఇచ్చింది మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ. అయితే.. ఈ పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు. సెప్టెంబర్ 22వ తేదీన పెటా తన బ్లాగు పోస్టులో ఇలా రాసుకొచ్చింది. ‘‘చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, అది మూగజీవులకు మాత్రమే హాని కాదు.. ఈ భూమికి కూడా. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడానికి మహిళల కంటే పురుషులే ఎక్కువ కారణం. ముఖ్యంగా మాంసం తినే మగవాళ్లు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు అంటూ పెటా ఓ పోస్ట్ ఉంచింది. ఈ కారణంతో.. సె* స్ట్రైక్ చేయాలని, తద్వారా వాళ్లను శాఖాహారులుగా మార్చాలంటూ పెటా పిలుపు ఇచ్చింది. అయితే.. సోషల్ మీడియా ఈ పిలుపునకు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. పైగా పెటా ప్రచారంలో ఏమాత్రం వాస్తవికత లేదని పేర్కొంటూ సెటైర్లు పేలుస్తున్నారు. Hold men accountable! This may be the only solution to the climate catastrophe 😉 pic.twitter.com/qqU5g52yq9 — PETA (@peta) September 23, 2022 PETA has asked WOMEN to stop having SEX with MEAT eating MEN. Calling for a sex strike, PETA wrote, “Men need to take accountability for their actions. PETA’s proposing a strike on sex with meat-eating men to persuade them to go vegan." But what about the MEAT-EATING WOMEN 😁 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) September 27, 2022 me, a woman who eats mainly meat and is thus free from peta's stupid complaints https://t.co/SXLeaZGMU8 pic.twitter.com/ibKaBBSJwX — sef🏳️⚧️ (@Karmatekc) September 27, 2022 Lol, this has to be a troll! lol https://t.co/Y0xNGV3XUy — Lakel The VA (@CartoonCritic12) September 27, 2022 "Men have a 40 percent higher carbon footprint because they're eating more meat than woman." Women in Germany are being told to stop having sex with their husbands and boyfriends until they stop eating red meat. Dr Carys Bennett from PETA explains on #TimesRadio. pic.twitter.com/6B9jlFn1Pl — Times Radio (@TimesRadio) September 22, 2022 ఇదీ చదవండి: దొంగలను భలేగా పట్టేసిన సెక్యూరిటీ గార్డు -
ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..!
RRR Actress Invests in an E-Commerce Platform: టాలీవుడైనా, బాలీవుడైనా ప్రముఖ నటినటులు అటూ సినిమాలపై దృష్టి పెడుతూనే...ఇతర వ్యాపారాలపై కూడా దృష్టిపెడుతున్నారు. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన బాలీవుడ్ నటి మరోక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారీగా ఇన్వెస్ట్ చేసిన అలియా...! ఆర్ఆర్ఆర్ సినిమా సీత పాత్రలో నటించిన బాలీవుడ్ నటి అలియా భట్ ప్రముఖ వెల్ల్నెస్ స్టార్టప్ ఫుల్.కోలో భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలియా భట్ తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తోందనుకుంటే మీరు పొరపడినట్లే...! ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ గతంలో విమెన్ లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ నైకాలో కూడా భారీగా ఇన్వెస్ట్ చేసింది. కాగా ఎంతమేరకు నిధులను ఇన్వెస్ట్ చేసిన దానిపై సమాచారం లేదు. ఫుల్.కో లో ఇన్వెస్ట్ చేసిన అలియా భట్ మాట్లాడుతూ...వెగన్, ఎకో ఫ్రెండ్లీ, ఉత్పత్తులను తయారుచేస్తోన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! పాడైపోయిన పూలతో...! పాడైపోయిన పూలను సేకరించి వాటిని సుగంధాలను వెదజల్లే అగరబత్తుల రూపంలో, ఇతర వెల్ల్నెస్ ప్రొడక్ట్‌ను తయారుచేయడంలో ఫుల్.కామ్ స్టార్టప్ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ కంపెనీ డీ2సీ(డైరక్ట్ టూ కస్టమర్)సేవలను అందిస్తోంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా కంపెనీ ఉత్పత్తులను నేరుగా సేల్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను తయారుచేయడంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఎంతగానో కృషి చేశారు. ఈ కంపెనీ పెటా నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును కూడా అందుకుంది. చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...! -
ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై ఎఫ్ఐఆర్ నమోదు
FIR against Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో గుర్రం యజమాని, మణిరత్నంలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెలలో హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా షూటింగ్ జరుగింది. యుద్ధం సీన్ కోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో డీహైడ్రేషన్ కారణంగా ఓ గుర్రం చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిథులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమానిపై పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11 మరియు భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ కాస్టింగ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చదవండి : సినిమా షూటింగ్లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్.. -
సినిమా షూటింగ్లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి
సాక్షి, హైదరాబాద్: యుద్ధం సీన్‌ను భారీగా తీయాలన్న అత్యాశ ఓ గుర్రం ప్రాణం తీసేసింది. సినిమా షూటింగ్లో జంతువులను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా.. నిర్వాహకుల నిర్లక్ష్యం ఆ మూగజీవి ప్రాణాన్ని తీసింది. అయితే, గుర్రం చనిపోతే కేసు అవుతుందన్న భయమో... లేక గుర్రమే కదా అన్న నిర్లక్ష్యమోగానీ... గుట్టుచప్పుడు కాకుండా గుర్రాన్ని పూడ్చేసి చేతులు దులుపుకున్నారు సినిమా నిర్వాహకులు. కానీ, షూటింగ్లో పాల్గొన్న వారిచ్చిన సమాచారంతో పెటా ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో యుద్ధం సీన్ కోసం 40–50 గుర్రాలను వినియోగించారు. హైదరాబాద్‌కే చెందిన ఓ గుర్రాల యజమాని దగ్గరి నుంచి గుర్రాలను తెప్పించుకున్న నిర్వాహకులు వాటితో ఏకధాటిగా షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ సమూహంలోని ఓ గుర్రం షూటింగ్ జరుగుతుండగానే డీహైడ్రేషన్ కారణంగా గత నెల 11న చనిపోయింది. చనిపోయిన గుర్రాన్ని సినిమా నిర్వాహకులు గుంత తీసి పూడ్చేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. ఆనోటా ఈనోటా గుర్రం మృత్యువాత పడ్డ విషయం పెటా ప్రతినిధులకు తెలిసింది. దీంతో గత నెల 18న అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చారు. పెటా పిటిషన్ ఆధారంగా చిత్ర నిర్మాత, గుర్రం యజమానిపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. స్థానిక పశువైద్యుడి సహకారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చనిపోయిన గుర్రానికి పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
Telangana: ఎలుకలను పట్టే గ్లూట్రాప్‌లపై నిషేధం!
సాక్షి, హైదరాబాద్: ఎలుకలను పట్టేందుకు వినియోగించే గ్లూట్రాప్ (జిగురుతో కూడిన ఉచ్చు)ల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించింది. గ్లూట్రాప్స్‌తో ఎలుకలను పట్టడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని.. గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఉచ్చుబిగించడం తోపాటు ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఎలు కల నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని ప్రజలకు సూచించింది. కాగా.. గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం చర్య తీసుకోవడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది. -
థాంక్యూ వైఎస్ జగన్: పెటా
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ప్రశంసించింది. ఈ విధానం జంతు ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెటా ఇండియా ట్విటర్ ద్వారా తెలిపింది. పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వంపై పెటా ప్రశంసల జల్లు కురిపించింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తూ.. ‘థాంక్యూ వైఎస్ జగన్’ అంటూ పెటా ఇండియా ట్వీట్ చేసింది. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం Thank you @ysjagan. We are sure this will help animals too!https://t.co/JUVcS9d4Zz — PETA India (@PetaIndia) June 8, 2020 -
వారి ఆచూకీ చెబితే రూ.50 వేలు..
ముంబై : అభంశుభం తెలియని కుక్క నోటిని, కాళ్లను తాళ్లతో కట్టేసి నీళ్లలోకి విసిరేసిన ఘటనపై పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకుల ఆచూకీ చెబితే రూ.50వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ‘‘ ఆ యువకుల వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ముందుకు రావాలి. రాక్షస ప్రవృత్తి కలిగిన వారి వల్ల జంతువులకే కాదు మనుషులకు కూడా పెను ప్రమాదమని సైకాలజిస్టులు చెబుతున్నారు. కుక్కల్ని హింసించే భర్తల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని 60శాతం మంది మహిళలు కూడా చెబుతున్నారు’’ అని పేర్కొంది. సదరు యువకుల వివరాలు తెలిసిన వారు పెటా హెల్ప్‌లైన్ నెంబర్ +91 9820122602 లేదా e-mail Info@petaindia.org. Informers కు పంపాలని కోరింది. యువకుల ఆచూకీ అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ( ఈ మెడికల్ షాపు ప్రత్యేకతేంటో తెలుసా?) కాగా, వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు కుక్క నోటిని, కాళ్లను తాళ్లతో కట్టేసి,గిరగిరా తిప్పుతూ నీటిలో పడేశారు. అంతటితో ఆగకుండా ఓ యువకుడు కుక్క మునిగిపోయిన ప్రదేశంలో రాళ్లను విసిరాడు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో కొద్దిరోజుల కిత్రం టిక్‌టాక్‌లో విడుదలైంది. దీనిపై స్పందిస్తున్న జంతుప్రేమికులు సదరు యువకులపై నిప్పులు చెరుగుతున్నారు. మనుషులా? క్రూర మృగాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?) చదవండి : (కంటతడి పెట్టిస్తోన్న చిన్నారుల లేఖ) -
అనుమతులా.. మాకెందుకు..?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘నూతన మున్సిపల్ చట్టం మాకు వర్తించదు.. లే అవుట్, ఎల్ఆర్ఎస్ ఏ అనుమతి లేకున్నా ఫర్వాలేదు. బై నంబర్లతో సర్వే నంబర్లు ఉన్నా చాలు.. ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేస్తాం.’ ఇదీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లే అవుట్ లేని వెంచర్లలో ప్లాట్లకు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారం. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడంతో ఇది బయట పడింది. మున్సిపల్ కమిషనర్ ఫలానా వెంచర్లకు లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేదని లేఖ ఇచ్చినా ఎలా రిజిస్ట్రేషన్ చేశారని సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పుట్టగొడుగుల్లా వెంచర్లు.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గత ఏడాది సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట పట్టణానికి సమీపంలో కుడకుడ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, జనగాం రోడ్డు, కోదాడ రోడ్డు, కోదాడలో ఖమ్మం, విజయవాడ రోడ్డు, మునగాల రోడ్డు, హుజూర్నగర్, నేరేడుచర్లలో మిర్యాలగూడ రోడ్డులో, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జనగామ, సూర్యాపేట రోడ్డులో వెంచర్లు వెలిశాయి. అయితే మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్టర్లు వెంచర్లు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ అధికారులు పలుమార్లు అక్రమ వెంచర్లపై కొరడా ఝుళిపించి ఈ వెంచర్లలో ప్లాట్ల హద్దు రాళ్లను జేసీబీలతో తీయించినా మళ్లీ కొన్నాళ్లకే రియల్టర్లు హద్దురాళ్లు పెడుతున్నారు. నూతన మున్సిపల్ చట్టం అస్త్రం ప్రయోగించినా.. అనుమతులు లేకున్నా రియల్టర్లు ప్లాట్లు చేస్తుండడంతో మున్సిపల్ అధికారులు కొత్త మున్సిపల్ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్నారు. 2019 జూలైలో తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయవద్దు. అనుమతి లేని ప్లాట్లలో భవనాలు నిర్మించినా రిజిస్ట్రేషన్ చేయవద్దని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో అక్రమ వెంచర్ల జాబితాను సర్వే నంబర్లతో సహా సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. అయినా ఇక్కడ అక్రమ తంతుకు అడ్డుకట్ట పడలేదు. కొత్త మున్సిపల్ చట్టం అమలుకు తిలోదకాలిచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లే అవుట్, ఎల్ఆర్ఎస్ లేకుంటే మా కెందుకు..? ఆదాయమే పరమావధిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొందరు రియల్టర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడిపి మరీ హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమ వెంచర్లను పరిశీలించిన అనంతరం మున్సిపల్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి కలెక్టర్ తనిఖీతో బయటపడిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం.. లే అవుట్, ఎల్ఆర్ఎస్ లేకుండా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వెంచర్లలో జేసీబీలతో ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. వీటిని కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారా..? అని మున్సిపల్ అధికారులను ఆరా తీసిన కలెక్టర్ వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేకుండా 36 వెంచర్లు వెలిశాయని వీటిలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని గత ఏడాడి నవంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్ మూడు సార్లు సబ్ రిజిస్ట్రార్‌కు లేఖలు పంపారు. ఆయా వెంచర్ల సర్వే నంబర్లు, ఎంత విస్తీర్ణం అన్నది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ లేఖ ఇచ్చిన తర్వాత కూడా ఈ సర్వే నంబర్లలో రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎలా చేశారని కలెక్టర్.. సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. ఒక సర్వే నంబర్‌కు అనుమతి లేదని ఇస్తే.. అదే సర్వే నంబర్‌కు బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు కలెక్టర్ తనిఖీలో బయటపడింది. ఇలా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్లు సమాచారం. నూతన మున్సిపల్ చట్టాన్ని పక్కన పెట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై ఆ శాఖ ఉన్నతాదికారులు కింది స్థాయి అధికారులకు ఇప్పటికే మొట్టికాయలు వేసినట్లు తెలిసింది. లే అవుట్ ఉంటనే రిజిస్ట్రేషన్ చేయాలి 2019 జూలైలో వచ్చిన నూతన మున్సి\ పల్ చట్టానికి అనుగుణంగా లే అవుట్లకు అనుమతి తీసుకోవాలి. మున్సిపాలిటీ నుంచి అనుమతి వచ్చిన లే అవుట్లకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయాలి. లే అవుట్ అనుమతి లేకున్నా కనీసం ఎల్ఆర్ఎస్ కచ్చితంగా ఉండాలి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 36 అనుమతి లేని వెంచర్లు ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కలెక్టరేట్లో ఒక టీంను ఏర్పాటు చేసి అన్ని మున్సిపాలిటీల్లో అనుమతి లేని వెంచర్లు గుర్తిస్తాం. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్ట ప్రకారం లే అవుట్లకు అనుమతి ఇస్తాం. మున్సిపాలిటీ అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు చేయొద్దు. – టి.వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్ -
గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న!
న్యూఢిల్లీ : ‘పాలు తాగండి. ఆరోగ్యంగా ఉంటారు’.. ప్రభుత్వ నినాదమిది. రోజూ లేవగానే ఒక గ్లాసుడు పాలు తాగాలని పిల్లలకు పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ(పెటా) మాత్రం.. మనుషుల ఆరోగ్యానికి పాల కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్ అని చెబుతోంది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆరోగ్యం కోసం పాలకంటే బీరే చాలా మంచిదని పెటా ఘంటాపథంగా చెబుతోంది. ఇందులో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని పెటా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ ట్రేసీ రీమాన్స్ స్పష్టం చేశారు. డెయిరీ ప్రాడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పెటా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధుల, ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని పెటా హెచ్చరించింది. ఇక డెయిరీ ఉత్పత్తుల వాడకం వల్ల ఎముకల వ్యాధి కూడా సోకుతుందని చెప్పిన పెటా.. దీన్ని నిర్థారిస్తూ కొన్ని రుజువులను కూడా వెల్లడించింది. కానీ బీరు తాగడం వల్ల ఎముకలు బలోపేతమవుతాయని చెబుతోంది. -
తాతకు తగ్గ మనవడు
స్టైలు స్టైలులే నీది సూపర్ స్టైలులే అని రజనీకాంత్ సూపర్ స్టైల్‌ని చాలామంది మెచ్చుకుంటారు. అద్దం ముందు నిలబడి చిన్నపిల్లలు రజనీ స్టైల్స్ చేసి చూసుకుంటారు. ఇక కుర్రకారు గురించి చెప్పక్కర్లేదు. రజనీలా వాకింగ్, రజనీలా టాకింగ్, సిగరెట్ అలవోకగా విసిరి, నోటితో క్యాచింగ్.. ఇలా చాలా చాలా చేస్తారు. బయటవాళ్లే ఇంత చేస్తే ఇక ఇంట్లో ఉన్న మనవడు ఊరుకుంటాడా? తాతను ఫాలో అయిపోతున్నాడు. రజనీకాంత్ రెండోకుమార్తె సౌందర్య కొడుకు వేద్ తాత స్టైల్‌ని గమనిస్తుంటాడట. ‘పేటా’లో తాత నిలబడినట్లు.. రెండు చేతులను జేబులో పెట్టుకుని నిలబడినప్పుడు మురిసిపోయిన సౌందర్య ఫొటో తీశారు. ఇక్కడ మనం చూస్తున్న ఫొటో అదే. వేద్ స్టైల్ చూస్తుంటే తాతకు తగ్గ మనవడు అనాలనిపిస్తోంది కదూ. -
పండక్కి ట్రిపుల్ ధమాకా
సంక్రాంతి పండక్కి సినిమాలొస్తాయి. థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారు. ఆకాశంలో గాలిపటాల కంటే స్టార్స్ ఎక్కువ కనపడతారు. రంగుల ముగ్గుల కంటే థియేటర్లో రంగుల కాగితాలు ఎక్కువ ఎగురుతాయి. ఇక స్వీట్ల పంపకాలు, వేడుకలు, డ్యాన్సులు... థియేటర్ల బయట బోలెడంత హంగామా. సంక్రాంతికి ట్రిపుల్ ధమాకాలా వచ్చిన మూడు స్ట్రయిట్ ‘ఫ్యాన్.... టాస్టిక్’ సినిమాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. సంక్రాంతి సీజన్లో ముందుగా వచ్చిన సినిమా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. క్రిష్ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలు. ‘‘ట్రేడ్ పరంగా బుధవారం రిలీజ్ అంటే అంత మంచిది కాదు. కానీ ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి విడుదలకు ఆ రోజుని ఎంపిక చేసుకున్నాం’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ చిత్రం వసూళ్ల విషయానికొస్తే... 700 థియేటర్లలో రిలీజైన ‘యన్.టి.ఆర్’ తొలి రోజు 10 కోట్ల పై చిలుకు షేర్ చేసిందని, బుధవారం అయినప్పటికీ ఇంత వసూలు చేయడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘యన్.టి.ఆర్’ రిలీజ్ తర్వాత ఒక్క రోజు గ్యాప్ (11న విడుదల)తో ‘వినయ విధేయ రామ’ తెరపైకి వచ్చింది. రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మించారు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరపైకొచ్చింది. దాదాపు 900 థియేటర్లకు పైగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 30 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్ వీకెండ్లో సందడి చేయడానికి థియేటర్లోకి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం శనివారం తెరకొచ్చింది. ‘‘మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్లో ఈ సినిమా కూడా హిట్టే’’ అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. స్ట్రయిట్ చిత్రాల మధ్య వచ్చిన డబ్బింగ్ మూవీ ‘పేట’. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ సినిమాని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేశారు. మూడు స్ట్రయిట్ చిత్రాల మధ్య రావడంతో థియేటర్లు పెద్దగా దొరకలేదు. రజనీ మార్క్ మాస్ మూవీ అనిపించుకుని, ప్రేక్షకులను థియేటర్స్‌కి రాబట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కియారా, రామ్‌చరణ్ వెంకటేశ్, తమన్నా, మెహరీన్, వరుణ్ తేజ్ రజనీకాంత్, త్రిష -
కటౌట్ ఎవరిది?
ఎవరి స్టోరీ వారిదే.. ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ప్లే వారిదే.. ఎవరి పవర్ వారిదే.కానీ ఏదో మ్యాచ్ అయింది. ఎక్కడో కంపారిజన్ మొదలైంది.రజనీ డైలాగ్స్ అజిత్ ఫ్యాన్స్‌కి వచ్చి తగిలాయి. అజిత్ డైలాగ్స్ రజనీ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేశాయి.నిజానికి ఎవరూ ఎవర్నీ టార్గెట్ చెయ్యలేదు. ఫ్యాన్సే వెళ్లి టార్గెట్ అయ్యారు. పేట్ట, విశ్వాసం.. ఒకే రోజు రిలీజ్ అవడంతో..హీరోలకేం కాలేదు కానీ..ఫ్యాన్స్ అనే పెద్ద కటౌట్ కూలిపోయింది! ‘‘ఇరవైమందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమాడు.’’ ‘‘ఎవర్రా వాడు?’’‘‘పేరు కాళీ. ఇంకే డీటెయిల్స్ తెలీదు.’’ ‘‘వాడు కూర్చున్న తీరును బట్టే పసిగట్టగలను. వాడు భయపడేవాడా కాదా అని.’’ ‘‘వీడు మామూలోడు కాదు మయీ’’ అవును మామూలోడు కాదు! వాడికి సెంటిమెంట్లు ఉండవు. ‘‘రేయ్.. ఎవరికైనా పెళ్లాం పిల్లలని సెంటిమెంట్లు ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతుందిక్కడ. దొరికారా.. భస్మమే’’ కుర్చీలో కూర్చొని తల వెనక్కి చేతులు పెట్టుకుని ఊగిపోతున్నాడు. ఆ డైలాగ్‌కి నిన్నట్నుంచీ తమిళనాడు ఊగిపోతోంది. ‘పేట్ట’ (తెలుగులో పేట) లోని ఆ ఇరవైమందిని కొట్టినవాడు, కాళీ అనే పేరు తప్ప ఇంకే డీటెయిల్సూ తెలియనివ్వనివాడు, ప్రత్యర్థి దొరికితే మాడ్చి మసిచేసేవాడు. అతడే.. రజనీకాంత్. ∙ ∙ ‘‘పేరు తూకు దొరై. ఊరు కొడువులపట్టి. తేని డిస్ట్రిక్ట్. భార్య నిరంజన. కూతురు పేరు శ్వేత. రా రా చూసుకుందాం’’అడ్రస్ చెప్పేశాడు. ఎవరిని అతడు చాలెంజ్ చేసింది? ‘‘నిన్ను వేసేస్తా’’నని తిరుగుతున్నవాడిని. ఎవరు ఆ తిరుగుతున్నది? తన కథలో తనే హీరో అని చెప్పుకున్నవాడిని. మరి చాలెంజ్ చేసినతను? తన కథలో తను విలన్ అని చెప్పినవాడు. ‘కంటి చుక్క రాలిపడని సంపన్నుడు లేడు. జీవితంలో ఒక్కసారైన నవ్వని నిరుపేద లేడు’.. విలన్ ఫిలాసఫీ. మనిషి భూమిని నమ్ముకుని నిలబడితే, భూమి నమ్ముకున్న మనిషి పక్కన నిలుచుని, ఆ మనిషి కోసం రక్తాన్ని కన్నీటిలా కురిపించిన చల్లని మేఘం ఆ విలన్. సడన్‌గా ఓ రోజు..తన కథలో తనే హీరో అయినవాడు వచ్చాడు లాండ్ లాగేసుకోడానికి. తన కథలో తనే విలన్ అయినవాడూ వచ్చాడు ‘‘దిస్ లాండ్ బిలాంగ్స్ టు పేదవాళ్లు. చెయ్యేస్తే నరికేస్తా. స్టాంప్ పేపర్లు చింపేస్తా’’ అని. మాటా మాటా నడిచింది. ఫైటింగ్‌కి మొదలవబోతోంది. ‘నెంబర్ వన్ పొజిషనే నా ఐడెంటిటీ’ అన్నాడు సెల్ఫ్ స్టెయిల్డ్ హీరో. నవ్వాడు విలన్. ఇద్దరికీ పడింది. థియేటర్ అదిరిపోయింది. నిన్నట్నుంచీ తమిళనాడు అదిరిపోతూనే ఉంది. హీరోనని చెప్పుకున్న విలన్.. జగపతిబాబు.విలన్‌నని చెప్పుకున్న హీరో.. అజిత్. సినిమా పేరు ‘విశ్వాసం’ అదీ నిన్ననే రిలీజ్ అయింది. ∙ ∙ ‘పేట్ట’, ‘విశ్వాసం’.. రెండూ బాక్సులు బద్దలు కొట్టేస్తున్నాయి. ‘పేట్ట’లో రజనీ పాత రజనీలా రెచ్చిపోయాడు. ‘విశ్వాసం’లో అజిత్ కొత్త అజిత్‌లా ఉత్సాహం తెచ్చాడు. మరి.. బాక్సులు బద్దలవుతుంటే.. ఫ్యాన్స్ కదా విజిల్స్ వెయ్యాలి? పోలీసులెందుకు విజిల్స్ వేస్తున్నారు. ఎందుకు లాఠీచార్జి చేస్తున్నారు. ఎందుకు డిస్పర్స్ అంటున్నారు. ఎందుకు వన్‌ఫార్టీఫోర్ సెక్షన్ విధించారు. ఎందుకంటే.. బాక్సు బద్దలయ్యే చప్పుడును మించిపోయింది ఫ్యాన్స్ గొడవ. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పనడంతో మొదలైంది స్ట్రీట్ ఫైట్. కటౌట్లు విరిగాయి. వాల్‌పోస్టర్ల మీద పేడముద్దలు పడ్డాయి. రజనీ, అజిత్.. ఎవరో ఒకరే ఉండాలి స్టేట్‌లో అన్నంతగా ఆయన అభిమానులు, ఈయన అభిమానులు కత్తిపోట్లు పొడుచుకున్నారు. వేలూరులోని ఒక థియేటర్ బయటి కొట్లాట ఇది. పదిహేను మందికి గాయాలయ్యాయి. నలుగురు హాస్పిటల్ పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న విడుదలైన రెండు పిక్చర్లూ హిట్ కొట్టినట్లే. రజనీ, అజిత్ హ్యాపీగా ఉండి ఉంటారు. అభిమానులు కూడా సినిమా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉంటే బాగుండేది. ∙ ∙ రజనీ, విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ, సిమ్రాన్, త్రిష, సింహా, శశికుమార్, సనంత్, మేఘా ఆకాష్, మోమనన్.. మంచి స్టారింగ్ ఉంది పేట్టాలో. సంగీతం అనిరు«ద్. కెమెరా తిరునావక్కరుసు. ఫ్యాన్స్‌కి కిక్ ఎక్కించే టీమ్ ఇదంతా. ‘‘నా పని అయిపోయిందనుకున్నార్రా?’ అని అడుగుతారు రజనీ ఎంట్రీ ఇస్తూ. ఆ ప్రశ్న కథలోని విలన్ని అడిగినట్లు ఉండదు రజనీ ఫ్యాన్స్‌కి. అజిత్ ఫ్యాన్స్‌ని అడిగినట్లు ఉంటుంది. అజిత్ ఫ్యాన్స్ రజనీ సినిమాలను చాలాకాలంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు రిటార్ట్గా ఈ డైలాగ్ కొట్టినట్టు ఫ్యాన్స్ అర్థం చేసుకున్నట్లున్నారు! బయటికొచ్చి, అజిత్ ఫ్యాన్స్‌ని చూసి సేమ్ డైలాగ్, సేమ్ అదే స్టెయిల్లో కొట్టారు. అజిత్ అభిమానులకు రోషం వచ్చింది. అసలే ఈ సినిమా తీసింది రజనీ ‘డైహార్డ్ ఫాన్’ కార్తీక్ సుబ్బరాజ్. కనుక తమనే టార్గెట్ చేశాడని అజిత్ అభిమానులు అనుకున్నారు. పేట్ట ఫ్లెక్సీలను చింపేయడం కోసం తీసిన కత్తుల్ని పేట్ట ఫ్యాన్ వైపు తిప్పారు. అభిమానం షార్ప్‌గా ఉంటుంది కానీ, ఇంత షార్ప్‌గా ఉండడం తగదు. ∙ ∙ ‘విశ్వాసం’ చిత్రంలో మీసం తిప్పుతాడు అజిత్. పంచె ఎగ్గడతాడు. కత్తులు దూస్తాడు. నడక స్టెయిల్‌గా ఉంటుంది. అవన్నీ రజనీకి దీటుగా ఉంటాయి! అతడి కోపం రజనీ కోపంలా ఉంటుంది. అతడి డైలాగ్ డెలివరీ రజనీ డెలివరీలా ఉంటుంది. అతడి ఫైటింగ్, అతడి నవ్వు, అతడి రొమాన్స్, ఆ థ్రిల్స్ అవన్నీ! రజనీలా అంటే.. రజనీ ఫ్యాన్స్‌ని లక్ష్యం చేసినట్లుగా. అయితే అది నిజం కాదు. స్టోరీ, స్క్రీన్‌ప్లే అలాంటివి. రజనీకీ, అజిత్‌కీ ఒకేలా వర్కవుట్ అయ్యేలా ఉన్నాయి. కథను ఐదుగురు రాశారు. శివ, మణికందన్, శావరి, భాగ్యరాజ్, చంద్రన్. శివ మెయిన్‌గా డైరెక్షన్. కెమెరా వేత్రి. ఆయనదంతా యాక్షన్ టేకింగ్. సైలెన్స్‌ని కూడా తన లెన్స్‌లతో యాక్ట్ చేయిస్తారు. ‘పేట్ట’లో నవాజుద్దీన్ సిద్ధికీతో రజనీ, ‘విశ్వాసం’లో జగపతిబాబుతో అజిత్ తలపడడం, సవాల్ విసరడం, పంచ్ డైలాగ్స్ కొట్టడం పోటా పోటీగా ఉంటాయి. అందుకే ఫ్యాన్స్‌కి తమ హీరో సినిమా మీదకన్నా, అవతలి వాళ్ల హీరో మూవీ మీద ధ్యాస పడి కంపేరిజన్ ఎక్కువైంది. కాన్ఫ్లిక్టూ మొదలైంది. ∙ ∙ అభిమానించడం మంచి విషయం. ఆ రెండు గంటల సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చేడం మరీ మంచి విషయం. అభిమానాన్ని దురభిమానం స్థాయికి పెంచుకుని అవతలి హీరోని కించపరచడం, ఆ హీరో అభిమానుల్ని రెచ్చగొట్టడం మంచి విషయం కాదు. కథ కోసం రాసిన ఆవేశాన్ని, కోపాన్ని, ప్రతీకారాన్నీ, పంటికి పన్నును, కంటికి కన్నును అభిమానానికి అప్లయ్ చేసుకోకూడదు. -
సహనం కోల్పోనివ్వకండి
‘థియేటర్స్ దొరకనివ్వకుండా ఓ మాఫియా జరుగుతోంది. సినిమాను సాఫీగా రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. థియేటర్స్ అన్నీ నలుగురైదుగురు చేతుల్లోనే ఉండిపోయాయి’ అంటూ ‘పేటా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సమాధానంగా నిర్మాత ‘బన్నీ’ వాసు, తన సోషల్ మీడియాలో ‘‘ప్రసన్నగారు, తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’’ అని రాసుకొచ్చారు. -
థియేటర్ల మాఫియా ఉంది
‘‘సినిమా కళకి కులం, మతం, జాతి, ప్రాంతం.. ఉండవని నిరూపించారు రజనీగారు. స్వయంకృషితో వరల్డ్ సూపర్‌స్టార్‌గా ఎదిగారంటే అది రజనీగారొక్కరే. మన ఎన్టీ రామారావుగారు కూడా చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్కూడా స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు’’ అని నిర్మాత టి.ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సినిమా బావుంటే ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు థియేటర్స్ మాఫియా ఎలా ఉందంటే మాఫియా డాన్స్ కంటే దారుణాతి దారుణంగా ఉంది. కేవలం ముగ్గురు నలుగురు చేస్తున్న సినిమాలకి మొత్తం థియేటర్స్ పెట్టుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను బతకనిచ్చే పరిస్థితిగానీ, కొత్తవాళ్లు వచ్చే పరిస్థితిగానీ లేకుండా చాలా నీచాతి నీచంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఆరేడు సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగే ప్రేక్షకులున్నారు. కానీ, చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్న మాఫియా ఉంది. ఈ మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుగార్లకు చెబుతాం. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగతా వాళ్లందర్నీ తొక్కి పారేస్తున్నారు. మా సినిమాలే ఉండాలి అనే ధోరణిలో వెళుతున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇది మీకు విజ్ఞప్తి అనుకోండి.. కాదంటే వార్నింగ్ అనుకోండి.. అయిపోతారు... చాలా మందిని చూశాం. విర్రవీగినోళ్లంతా ఆకాశంలోకి వెళ్లిపోయారు.. మీరు కూడా పోతారు. కొంచెం తెలుసుకుని కరెక్టుగా ఉండండి’’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య.. ‘పేట’ కూడా పెద్ద సినిమానే. వాటి మధ్య ఈ సినిమా విడుదల చేస్తున్నాడు అశోక్. ఆ సినిమాలతో పాటు ‘పేట’ కూడా ఆడాలని కోరుకుంటున్నా. రజనీకాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. చిరంజీవిగారు, రజనీగారు నటీనటులకు స్ఫూర్తి’’ అన్నారు. చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ–‘‘ఎందరో మహానుభావులు.. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. పిలిచినా వస్తానని రాకుండా మమ్మల్ని ఆనందపెట్టిన ఇంకొందరు మహానుభావులకు నా రెండేసి వందనాలు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్య మన సినిమా ‘పేట’ కి థియేటర్స్ తక్కువైనా, బిజినెస్ జరిగినా, జరక్కపోయినా సొంతంగా రిలీజ్ చేద్దామని రిస్క్ తీసుకుని విడుదల చేస్తున్నా’’ అన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘రజనీగారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. అలాంటివాళ్లు అక్కడక్కడా వస్తుంటారు. మనకి మన ఎన్టీ రామారావుగారు. ఆయన ఓ చరిత్ర. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జపాన్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి రజనీ. సౌత్ ఇండియాలోనూ హీరోలు ఉన్నారని ప్రపం చానికి చాటిన మొదటి హీరో రజనీ ’’అన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘పేట’ చిత్రం మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. రజనీసార్ అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మంచి కథ. ఈ పండక్కి చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా విడుదలవుతోంది. ఆ సినిమాలతో పాటు మా ‘పేట’ కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటీనటులు బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహన్, పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జెట్ స్పీడ్!
సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ ఇవ్వడం లేదు. నాలుగైదు నెలల గ్యాప్‌లోనే స్క్రీన్‌పై కనిపిస్తున్నారు రజనీకాంత్. ‘కాలా, 2.0, పేట్టా’ మూడు చిత్రాలు ఏడు నెలల గ్యాప్‌లో రిలీజŒ అయ్యాయి. ఈ స్పీడ్ చూసి ఆశ్చర్యపడకమానలేం. సంక్రాంతికి కొత్త సినిమా ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)తో బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి నెలలో మురుగదాస్‌తో చేయనున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా, రజనీను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండబోతోందని ఆ మధ్య ఓ ఫంక్షన్లో పేర్కొన్నారు మురగదాస్. ఆల్రెడీ మురుగదాస్‌తో ‘సర్కార్’, రజనీతో ‘పేట్టా’ సినిమాలను నిర్మించిన సన్ నెట్వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రజనీకాంత్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ప్రవేశించాక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చనే టాక్ కూడా తమిళనాడులో ఉంది. అందుకోసమే ఇలా గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌తో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారా? -
జల్లికట్టు..పెటా పట్టు
జల్లికట్టు క్రీడకు మార్గం సుగమం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’(పెటా) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్బెంచ్కు శుక్రవారం పిటిషన్‌ను బదలాయించింది. జల్లికట్టుపై నిషేధం తీసుకురావాలని పెటా పట్టుదలతో పోరాడుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జంతు సంక్షేమ సంరక్షణ చట్టం పరిధిలోని జంతువుల జాబితాలో ఉన్న ఎద్దులను ఆ జాబితా నుంచి కేంద్రం తొలగించడంతో రాష్ట్రంలో జల్లికట్టు క్రీడ యథావిధిగా సాగుతోంది. అయితే తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషేధం విధించాలని జంతు సంక్షేమ సంఘం గతంలో ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన తరువాత 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషే«ధం విధించింది. తమిళనాడు ప్రజల ఆచార, వ్యవహరాల్లోనూ, ప్రాచీన సంప్రదాయక్రీడైన జల్లికట్టులోనూ జోక్యం తగదని నినాదాలు చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ 2017 జనవరి 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. చెన్నై మెరీనా తీరంలో విద్యార్థులు, యువజనులు లక్షలాదిగా తరలివచ్చి నిరవధిక ఆందోళనకు దిగారు. పిల్లలు పెద్దలు, యువతీ యువకులు మెరీనాతీరం చేరుకున్నారు. జల్లికట్టు ఉద్యమంలో ఆందోళనకారులు ఉడుంపట్టు మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించి తనవైపునకు తిప్పుకుంది. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అదే ఏడాది జనవరి 20వ తేదీన జల్లికట్టుపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రగవర్నర్‌కు అందజేశారు. గవర్నర్ సదరు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపడం వెంటనే ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయాయి. దీంతో 22వ తేదీన మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు క్రీడలు ఉత్సాహంగా సాగాయి. ఆనాటి నుంచి రాష్ట్రంలో పొంగల్ పండుగల దినాల్లో జల్లికట్టు క్రీడలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే పన్నీర్‌సెల్వం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను పెటా తీవ్రంగా గర్హిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం వివరణతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కేసు న్యాయమూర్తి రోహింగ్టన్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. జల్లికట్టుపై మధ్యంతర నిషేధం విధించలేమని, అయితే ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు న్యాయమూర్తి రోహింగ్టన్ తెలిపారు. -
రంకెలేసి.. ప్రాణం తీసి
తమిళనాడు ప్రజలకు ప్రీతిపాత్రమైన జల్లికట్టులో అపశుృతి చోటుచేసుకుంది. ఎద్దులదాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో జల్లికట్టు ఉత్సాహంగా సాగుతోంది. అలంగానల్లూరులో జల్లికట్టును సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలూ, వడలూ పాయసాలు కంటే జల్లికట్టు క్రీడలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అసలు జల్లికట్టు కోసమే ఎదురుచూస్తుంటారు. జల్లికట్టు కోసమే బాగా బలిష్టంగా పెంచుతున్న ఎద్దును క్రీడావలయంలోకి వదలడం, ఆవి రెచ్చిపోతూ పరుగులు పెడుతుంటే వాటిని అణిచి అదుపుతోకి తీసుకున్న యువకులను విజేతలుగా ప్రకటిస్తారు. చూపరులకు అత్యంత ప్రమాదకరంగా కనపడే ఈ క్రీడలో పాల్గొనేందుకు తమిళనాడు యువకులు ఏ మాత్రం భయం లేకుండా ఉత్సాహం చూపుతారు. అయితే జల్లికట్టుకు వినియోగించే ఎద్దులకు మద్యం తాగిస్తారని, రెచ్చగొట్టేందుకు మరెన్నో చేస్తారని ప్రచారం ఉంది. అలాగే ఎద్దులను అదుపుచేసే క్రమంలో వాటిని హింసిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు, జంతుప్రేమికులు కోర్టుకెక్కారు. జల్లికట్టు క్రీడ ముసుగులో జంతువులను హింసిస్తున్నారంటూ ‘పీపుల్స్ ఫర్ ది ఎతికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) లేవనెత్తిన అభ్యంతరం మేరకు సుప్రీం కోర్టు రెండేళ్ల క్రితం నిషేధం విధించింది. జల్లికట్టు క్రీడపై నిషేధం విధించడాన్ని రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోయారు. జల్లికట్టు తమ ప్రాచీన సంప్రదాయ క్రీడగా అభివర్ణిస్తూ నిషేధం ఎత్తివేయాలంటూ గత ఏడాది ఆందోళన మొదలుపెట్టారు. చెన్నై మెరీనాబీచ్‌లో వేలాది ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థ్ది సంఘాలు సంయుక్తంగా సాగించిన జల్లికట్టు పోరాటం యావత్‌దేశ దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచింది. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఆర్దినెన్స్ తేవడం, రాష్ట్రపతి ఆమోదించడంతో జల్లికట్టుపై నిషేధం తొలగిపోయింది. దీంతో గత ఏడాది జల్లికట్టును కోలాహలంగా జరుపుకున్నారు. ఇక ఈ ఏడాది విషయానికి వస్తే 14వ తేదీనే జల్లికట్టు క్రీడలు మదురై జిల్లా ఆవనియాపురంలో, 15వ తేదీ పాలమేడులో ప్రారంభమయ్యాయి. జల్లికట్టు క్రీడకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై జిల్లా అలంగానల్లూరులో క్రీడాపోటీలను ముఖ్యమంత్రి ఎడపాడి , ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మంగళవారం ప్రారంభించారు. జల్లికట్టు క్రీడను కాపాడుకోవడం మన కర్తవ్యమని ఎడపాడి పేర్కొనగా, జల్లికట్టు కోసం అలంగానల్లూరులో శాశ్వతమైన మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. విజేతలకు కారు, బంగారు నాణేలు రూ. కోటి విలువైన ఆకర్షిణీయమైన బహుమతులు ప్రకటించారు. ఎవ్వరూ అదుపు చేయలేని ఎద్దుల యజమానులకు సైతం బహుమతులు అందజేశారు. 1,241 మంది జల్లికట్టు వీరులు, 1060 ఎద్దులతో నిర్వహించిన అలంగానల్లూరు జల్లికట్టు క్రీడలను వీక్షించేందుకు ఎప్పటి వలే పెద్ద సంఖ్యలో విదేశీయులు సైతం వచ్చారు. కొన్ని ఎద్దులకు రాష్ట్ర మంత్రుల పేర్లు పెట్టి బరిలోకి దింపడం విశేషం. అరియలూరు జిల్లా జయంకోటై్ట పుదుచ్చావడి గ్రామంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జల్లికట్టు నిర్వహించారు. కోర్టు నిబంధనల ప్రకారం జల్లికట్టుకు ఎంపిక చేసిన మైదానం విస్తీర్ణం సరిపోదు, సమీపంలో నివాసగృహాలు ఉన్నాయనే కారణాలతో జిల్లా కలెక్టర్, ప్రజాపనుల శాఖ అధికారులు సోమవారం రాత్రి అనుమతి నిరాకరించారు. అయితే అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు మంగళవారం యథావిధిగా జల్లికట్టు నిర్వహించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 14నే ప్రారంభమైన మరణ మృదంగం: తమిళులు పొంగల్ అని పిలుచుకునే సంక్రాంతి పండుగ రోజుల్లో జల్లికట్టును జరుపుకుంటారు. ఈనెల 14వ తేదీన మదురై జిల్లా అవనియాపురంలో జల్లికట్టు క్రీడలు నిర్వహించగా ఆరుగురు జల్లికట్టు వీరులు, 22 మంది వీక్షకులు గాయపడ్డారు. ఈనెల15వ తేదీన పాలమేడులో రెండోరోజు జల్లికట్టు పోటీలు జరుగగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న ఎమకలాపురానికి చెందిన కాలిముత్తు(19)ను ఎద్దు పొడవడంతో మరణించాడు. అలాగే తిరుచ్చిరాపల్లి మనకోటై్టలో మంగళవారం జరిగిన జల్లికట్టులో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న సోలైపాండి (26) అనే వ్యక్తి ఎద్దు పొడిచి ప్రాణాలు కోల్పోయాడు. శివగంగై జిల్లా శిరవయల్ గ్రామంలో మంజువిరాట్ పోటీలు మంగళవారం జరిగాయి. ఈపోటీలో భాగంగా ఎద్దులు, ఆవులను పెద్ద సంఖ్యలో ఒకేసారి వదులుతారు. ఈ పశువులు ఉరకలేస్తూ పరుగులుపెడుతూ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. దీంతో రామనాథన్ (38), కాశీ (25) అనే ఇద్దరు మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
కేంద్రం సవరణ.. జల్లికట్టుపై మళ్లీ టెన్షన్!
సాక్షి, చెన్నై : జల్లికట్టు ఆటపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 1960 యానిమల్స్ యాక్ట్‌ను సవరించటంతో వచ్చే సంక్రాంతికి ఈ పోటీల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది. కేంద్ర సవరణతో ఒక్క జల్లికట్టు మాత్రమే కాదు.. రెక్లా(ఎండ్ల బండ్ల పోటీలు) కూడా నిర్వహించుకోవచ్చని అడ్వొకేట్ జనరల్ విజయ్ నారాయణ్ డివిజన్ బెంచ్‌కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే (వచ్చే నెల 7న తేదీ ఆ ప్రాంతంలో) నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పెటా పిటిషన్‌తో మార్చి 7, 2014న సుప్రీంకోర్టు ఈ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమిళనాడు ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. వారికి సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో కేంద్రం దిగివచ్చింది. 1960 చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంఘం పెటా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. -
నగ్న ప్రదర్శనతో సన్నీలియోన్ సందేశం
ముంబై: జంతు సంరక్షణ కోసం బాలీవుడ్ నటి సన్నీలియోన్ భర్త డెనియల్ వెబర్‌తో కలిసి నగ్న ప్రదర్శన చేసింది. జంతు సంరక్షణ సంస్థ ‘పెటా’ (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్)కు ప్రచారకర్తైన సన్నీ జంతువుల సంరక్షణ ప్రచారంలో భాగంగా ఈ నగ్న ఫొటోలకు ఫోజుచ్చింది. జంతువులను చంపి వాటి చర్మంతో తయారు చేసిన దుస్తులు ధరించరాదనే సందేశాన్ని ఈ నగ్నత్వంలోనే గ్రహించాలని ఆమె అభిమానులను కోరింది. ఈ ఫొటోను పెటా ఇండియా అధికారిక ట్విట్టర్లో ‘ జంతు సంరక్షణ ప్రచారంలో భాగంగా స్టన్నింగ్ బ్యూటీ సన్నీ, ఆమె భర్త డెనియల్ వెబర్ ఫొటో షూట్ అని ట్వీట్ చేసింది. అంతేగాకుండా జంతువుల చర్మలతో దుస్తులు ఎలా తయారుచేస్తున్నారనే వీడియోను సైతం పెటా షేర్ చేసింది. జంతు చర్మంతో కాకుండా తయారు చేసిన వస్తువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వస్తువులనే ఎంచుకోండి అని సన్నీ అభిమానులకు పిలుపునిచ్చింది. మేం జంతువుల పక్షాన పోరాడుతున్నాం. వాటి సంరక్షణ కోసం పాటుపడుతున్నామని సన్నీ భర్త డెనియల్ తెలిపాడు. Stunning beauty @SunnyLeone and her husband @DanielWeber99 in new PETA campaign promote animal-free fashion. https://t.co/egUvr9xaHF Thanks @subisamuel for this beautiful shot. Thanks @hitendra1480 for styling & #TomasMoucka for hair & make-up. pic.twitter.com/polWc6EGQB — PETA India (@PetaIndia) 28 November 2017 -
హీరో సూర్యకు పెటా సారీ
చెన్నై: తమిళ హీరో సూర్యకు పెటా (ద పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి పూర్వా జోషిపురా క్షమాపణలు చెప్పారు. సూర్య కేవలం తన రాబోయే చిత్రం ఎస్3 (ఇప్పుడు సీ3గా పేరు మర్చారు) ప్రచారం కోసమే జల్లికట్టును సమర్థిస్తున్నారని గతంలో పూర్వ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా సూర్య తన లాయర్ ద్వారా ఆమెకు నోటీసులు జారీ చేయించారు. దీంతో క్షమాపణలు కోరుతూ సూర్య లాయర్‌కు ఆమె ఒక లేఖ పంపారు.