Prakash Ambedkar
-
కాంగ్రెస్‌కు ప్రకాశ్ అంబేద్కర్ ఆఫర్.. ఏడు స్థానాల్లో మద్దతు
ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ )అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన పార్టీ మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే ఏడు స్థానాల్లో తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవీఏ)కు దూరంగా ఉన్న ప్రకాశ్ అంబేద్కర్.. కాంగ్రెస్ పార్టీకి మత్తతు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి (ఎంవీఏ) వీబీఏ మద్దతు లేకుండా ఎన్నికల బరిలో దిగుతామని నిర్ణయం తీసుకున్న తరుణంతో మంగళవారం ప్రకాశ్ అంబేద్కర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అందులో కాంగెస్ పార్టీకి మద్దతను ప్రకటించటం గమనార్హం. అయితే గతంతో మొత్తం 48 సీట్లలో వీబీఏకు నాలుగు సీట్లు కేటాయించగా.. ఆ పార్టీ ఒప్పుకోకుండా 12 సీట్లను డిమాండ్ చేసింది. దీంతో ఎంవీఏ పార్టీని ఒప్పించటంలో ఏంవీఏ కూటమి నేతలు సఫలికృతం కాలేకపోయారు. అయితే.. ఖర్గేకు రాసిన లేఖలో ప్రకాశ్ అంబేద్కర్ ప్రతిపక్ష కూటమిలోని శివసేన(యూబీటీ), శరద్ పవార్(ఎన్సీపీ)పై విమర్శలు చేశారు. ‘పలు సమావేశాల్లో మా పార్టీ అభిప్రాయాలను శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ చంద్రపవార్) పట్టించుకోలేదు. దీంతో ఆ రెండు పార్టీలపై మాకు నమ్మకం పోయింది. మా పార్టీపై అసమానత్వం ప్రదర్శించారు’ అని మండిపడ్డారు ప్రకాశ్ అంబెద్కర్. ఇక.. కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు కావాలనుకుంటే తాము ఏడు స్థానాల్లో పూర్తి మద్దతను ఇస్తామని చెప్పారు. ‘మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగంగా కాంగెస్ పార్టీ పోటీచేసే ఏడు సెగ్మెంట్లలో మా పార్టీ పూర్తిగా క్షేత్రస్థాయిలో కాంగెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో కూటమి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని స్నేహపూర్వకంగా తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది’ అని ప్రకాశ్ అంబేద్కర్ లేఖలో వివరించారు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో భాగం ప్రతిపక్షాల కూటమిలో ఉన్న శివసేన(యూబీటీ)కి-22, కాంగ్రెస్- 16, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లు కేటాయింపు జరగనున్నట్లు సోమవారం ఎంవీఏ కూటమిలోని నేతలు చర్చించుకుంటున్నారు. -
ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ!
మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్ధించినందుకు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన సందర్బంగా ఔరంగజేబు చాలా కాలం దేశాన్ని పరిపాలించారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. హిట్లర్ కూడా జర్మనీ దేశాన్ని చాలాకాలం పాలించాడు. అంతమాత్రాన అక్కడివారికి హిట్లర్ దేవుడు అవుతాడా? ఈ సందర్బంగా అంబేద్కర్ చర్యను మీరెలా సమర్ధిస్తారని ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. మీరిద్దరూ పొత్తు పెట్టుకున్న కారణంగానే అసలేం మాట్లాడటం లేదా? అనడిగారు. అసలు పరాయి దేశం నుంచి వచ్చిన ఔరంగజేబు మన నాయకుడెలా అవుతాడు? ఛత్రపతి శివాజీ ఒక్కడే మన నాయకుడని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న ముస్లింలు ఔరంగజేబు వారసులు కారని.. వారసలు ఆ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా అంగీకరించరని అన్నారు. వారు సైతం ఛత్రపతి శివాజీనే తమ నాయకుడిగా చెప్పుకుంటారన్నారు. ఒకప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చెట్లు కలపాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీని శాశ్వతంగా మూసివేస్తానన్న మాటను గుర్తుచేసి మీ తీరు మాత్రం భిన్నంగానూ మీ నాన్న గారికి వ్యతిరేకంగానూ ఉందన్నారు. ఇక బీహార్‌లో ఈ నెలలో జరగనున్న విపక్ష ఐక్య కూటమి సమావేశం గురించి ప్రస్తావించగా పనికిరాని వంద పాదులు ఏకమైనా ఒక మర్రిచెట్టుకు సమానం కావన్నారు. గతంలో మోదీ వ్యతిరేకంగా ఇంతకంటే పెద్ద కూటమే వచ్చింది. అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
హుస్సేన్ సాగర తీరాన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
-
దేశంలో మార్పు కోసం యుద్ధం చేయాలి.. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో, వ్యవస్థలో, దేశంలో మార్పు కోసం భారతీయులు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకా శ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్ర హాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ‘‘చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఏకమై సమాజంలో మా ర్పుకోసం పోరాటం చేయాలని అంబేడ్కర్ ఉద్భో దించారు. దేశంలో ఆర్థిక అంతరాలు, ఆర్థిక దోపిడీ ల గురించి అప్పట్లోనే ‘ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ అనే పుస్తకం రాశారు. దళితబంధు పథకం ద్వారా రూ పాయి రూపాన్ని మార్చేందుకు కేసీఆర్ ప్రయతి్నస్తున్నారు. దేశ ఆర్థిక దుర్భలతపై ఎలా పోరాడాలో చెప్పడంతోపాటు దళిత బంధు ద్వారా పేదరిక ని ర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అని ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం దేశంలో కేవలం మతపరమైన మైనారిటీలే కాకుండా కమ్యూనిటీ మైనారిటీలు కూడా ఉన్నారని అంబేడ్కర్ అప్పట్లోనే స్పష్టం చేశారని ప్రకాశ్ గుర్తు చేశారు. ధర్మం, జాతి పేరిట రాజకీయాలు జరిగే దేశంలో సహజ నాయకులు ఉండరని కూడా చెప్పారని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి తర్వాత అసలైన జాతీయ నాయకుడెవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం వస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందని, దేశానికి మోడల్‌గా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని అంబేడ్కర్ చెప్పారని.. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉందని ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఈ డిమాండ్ నెరవేరాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం ఆతిథ్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచి్చన బాబాసాహెబ్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న ప్రకాశ్ అంబేడ్కర్‌ని కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. శాలువాతో సత్కరించి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్నా ధోంగే, సిద్దోజీరావు తదితరులున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రకాశ్ అంబేడ్కర్ సాక్షి, హైదరాబాద్: తమ తాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుషుల్లో సమానత్వం–ప్రకృతి సమతుల్యత కోసం పరితపించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఆయన జయంతి రోజున ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని బేగంపేటలో మొక్కలు నాటారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఒక మొక్క ను నాటాకే తన వద్దకు రావాలని కోరుకున్నారని ఆయన మనుమడు ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ తాత అంబేడ్కర్‌కు మొక్కలు నాటడం పట్ల అమితమైన ఆసక్తి ఉండేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చూస్తున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు. ‘గ్రీన్ చాలెంజ్’లిమ్కాబుక్‌లో చేరడం తనకు ఆనందాన్ని కలిగించిందని, సంతోష్ కృషికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దళితబంధు’ దేశానికే మార్గదర్శి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం దేశానికే మార్గదర్శి అని, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయాలని అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో దళితబంధు పథకం యూనిట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, విప్ బాల్క సుమన్ ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన హుజూరాబాద్ చేరుకున్న అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. దళితబంధు యూనిట్లను పరిశీలించిన అనంతరం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుంది. ఇది దేశంలోనే సరికొత్త పథకం. ప్రజలకు విద్యతోపాటు ఆర్థిక సాయం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం అభినందనీయం. మొన్నటిదాకా కూలీలుగా బతికిన వారంతా ఈ పథకం వల్ల ఇప్పుడు ఓనర్లుగా మారారు. లబి్ధదారులతో మాట్లాడాను. ఇంత తక్కువ సమయంలో ఈ పథకం లబ్ధిదారులకు అందేలా శ్రమించిన సీఎం కేసీఆర్, జిల్లా అధికారులకు ధన్యవాదాలు. 70 ఏళ్లుగా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును నేను స్వయంగా చూశాను. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలి. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమైన ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. దేశంలో 30 శాతం వరకు ఉన్న అట్టడుగు వర్గాల వారికి సైతం ఈ పథకం వర్తింపజేయాలి. ఈ విషయాన్ని నేను సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తాను’అని అన్నారు. -
రాబోయే రాజ్యం మనదే.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్
నా మాటలు కొందరు శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే. చిన్న మిరుగు (నిప్పురవ్వ) చాలు అంటుకునేందుకు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి నేను కలలో కూడా ఊహించని ఆదరణ లభిస్తోంది. రాబోయే రోజుల్లో యూపీ, బిహార్, పశి్చమ బెంగాల్ సహా ప్రతిచోటా ఇదే ఆదరణ వస్తుంది. కేంద్రంలో కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే.. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఊహించని ఆదరణ వస్తోందని.. రాబోయే రోజుల్లో దేశంలో రాబోయేది తమ రాజ్యమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో తెలంగాణతోపాటు భారత్‌ను సరైన మార్గంలో పెట్టాలని.. దాని కోసం చివరి రక్తపు బొట్టు వరకు రాజీపడకుండా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఏదో ఒరవడిలో, గాలికి కొట్టుకుపోకుండా.. నిజంగా పేదల కోసం పనిచేస్తున్న వారికి అండగా నిలవాలని, మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన మనవడు యశ్వంత్ ప్రకాశ్ అంబేడ్కర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదు. విశ్వమానవుడి విశ్వరూపాన్ని మూర్తి రూపంలో ప్రతిష్టించుకున్నాం. రాష్ట్ర సెక్రటేరియట్‌కు కూడా అంబేడ్కర్ పేరు పెట్టుకున్నాం. సెక్రటేరియట్ ముందు అమరుల స్మారకం, అంబేడ్కర్ నమ్మిన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. సందేశాత్మక అద్భుత చిహా్నలన్నీ ఒకేచోట ఉన్నాయి. ఇది విగ్రహం కాదు.. విప్లవం.. అంబేడ్కర్ సిద్ధాంతంతో మనసు ప్రభావితం కావాలి. ఆయన మార్గాన్ని అనుసరించడంతో పాటు ఆయన సిద్ధాంతాలు, ఆచరణ అందరి కళ్లలో మెదలాలి. తమ జీవితాలను అర్పించి తెలంగాణ సాధించిన అమరులు కూడా ఆదర్శం కావాలనే ఉద్దేశంతోనే ఈ కాంప్లెక్స్‌కు రూపకల్పన చేశాం. ఆర్థికమంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు ఇది విగ్రహం కాదు.. విప్లవం. కేవలం ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే చైతన్య దీపిక. ఇది దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుంది: కొప్పుల ఈశ్వర్ రాష్ట్రంలో భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ దేశ చరిత్ర పుటల్లో నిలుస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేడ్కర్ స్ఫూర్తిని అందించే లక్ష్యంతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. ఈ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ విగ్రహం పాలకులు, అధికారుల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని చెప్పారు. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళితబంధు ద్వారా కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. ఆశయ సాధనకు కార్యాచరణ దేశంలో 75 ఏళ్లుగా పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు ఇంకా నిరుపేదలుగానే ఉండటం సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలంటే పార్టీ లుకాకుండా ప్రజలు గెలిచే రాజకీయం రావాలని పదే పదే చెప్తున్నాం. ఈ దిశగా దళిత మేధావులు ఆలోచన చేయాలి. ఎక్కడా పెట్టని విధంగా ఈ నెల 30న బీఆర్ అంబేడ్కర్ పేరిట నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభిస్తున్నాం. వీటన్నింటినీ మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తులో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిది, అంబేడ్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ఆచరణాత్మక కృషి ప్రారంభించాలి. అనేక పారీ్టలు గొడవలు, గందరగోళం సృష్టిస్తున్నాయి. అందువల్ల వాస్తవ దృక్పథంతో దళి తులు ముందుకు సాగేలా కార్యాచరణ కావాలి. ఎవరి వైఖరి ఏమిటి? ఎవరి మార్గం ఏమిటో చూడాలి. బీఆర్ఎస్ ఎలా పనిచేస్తుందనేది చూస్తే చాలు. జాతీయ రాజకీయాల్లో మీ ఆశీస్సులు కోరుతున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ పేరిట ఏటా అవార్డులు అంబేడ్కర్ పేరిట ప్రత్యేక అవార్డు ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు పత్రికాముఖంగా సూచన చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఏటా జాతీయ, రాష్ట్రస్థాయిలలో ఉత్తమ సేవలు అందించే వారికి అవార్డులు అందజేస్తాం. దీనికోసం రూ.51 కోట్ల శాశ్వత నిధిని డిపాజిట్ చేయాలని తక్షణమే ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ నిధి ద్వారా ఏటా వచ్చే రూ.3 కోట్ల వడ్డీతో అంబేడ్కర్ పేరు ప్రతిష్టలు శాశ్వతంగా ఉండేలా అవార్డులు ఇస్తాం. ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే.. తెలంగాణ తరహాలో దేశంలో ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింప చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. తెలంగాణలో ఇప్పటికే 50వేల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపచేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1.25 లక్షల మందికి దళితబంధు అందుతుంది. బీఆర్ఎస్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ దళిత సంక్షేమానికి రూ.16వేల కోట్లు ఖర్చు చేయగా.. మా ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ రిపోర్టులే వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్‌తో పూలవాన అట్టహాసంగా భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం బౌద్ధ భిక్షువుల ప్రత్యేక ప్రార్థనలు.. విగ్రహం దిగువన పీఠంలో ఫొటో ఎగ్జిబిషన్ హుస్సేన్‌సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 3.15కు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ 3.30 గంటలకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు అంబేడ్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ కూడా అక్కడికి వచ్చారు. తొలుత బౌద్ధ భిక్షువులు సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేస్తూ వారికి ఆహా్వనం పలికారు. తర్వాత వారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక మీదుగా అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం పీఠం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌తో అంబేడ్కర్ భారీ విగ్రహంపై గులాబీ రేకులు వెదజల్లారు. తర్వాత అంతా విగ్రహం వేదికపైకి చేరుకుని.. బౌద్ధ భిక్షువులు చేసిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్, వీడియోల ప్రదర్శనలు విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహం దిగువన పీఠంగా ఏర్పాటు చేసిన భవనంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘ఆత్మబంధువు అంబేడ్కరుడు’వీడియోను వీక్షించారు. తర్వాత అంతా సభా వేదికకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ‘డిక్కీ’కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాలను కేటాయిస్తూ.. సంబంధిత పత్రాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కలసి డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌కు అందజేశారు. తర్వాత కేసీఆర్ ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలసి ‘దళితబంధు విజయగాథ’సీడీని ఆవిష్కరించారు. కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్, కొప్పుల ఈశ్వర్ ప్రసంగించగా.. ఎమ్మెల్యే రసమయి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ప్రభు త్వ చీఫ్ విప్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి మహా విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
-
‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నది అంబేద్కర్ కోరిక’
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారు. అందరూ విద్యావంతులు అవ్వాలని ఆశించారు. సమాజ మార్పు కోసం ప్రయత్నించారన్నారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. శుక్రవారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారాయన. అంబేద్కర్ ఆశయాల్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం దళితులకు, ఆదివాసీలకే పరిమితం కాదు. దేశంలో మతమైనారిటీలే కాదు.. కులమైనారిటీలు కూడా ఉన్నారన్నారాయన. అలాగే.. పొట్టీ శ్రీరాములు ఆంధ్రపప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన ప్రాణ త్యాగం చేసే వరకు కూడా రాష్ట్రం ఇవ్వలేదు. చిన్న రాష్ట్రాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అంబేద్కర్ భావించేవారు. మీ అందరి తరపున సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు ఆయన ప్రసంగించారాయన. దేశానికి రెండో రాజధాని అవసరమని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ కోరుకున్నారు. అదీ హైదరాబాదే కావాలని అంబేద్కర్ కోరుకున్నారని ప్రకాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమన్న విషయాన్ని అంబేద్కర్ లేవనెత్తారని, ఆ అవసరం ఇప్పుడు ఉందని ప్రకాష్ పేర్కొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి హెలికాఫ్టర్ పైనుంచి పూలాభిషేకం
-
ముఖ్య అతిధి గా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్
-
విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్
-
125 అడుగుల అంబెడ్కర్ భారీ విగ్రహావిష్కరణ
-
దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం
‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు..జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. – అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది – సీఎం కేసీఆర్ ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. అవును.. అలా చెప్పడమేకాదు.. జనం కోసమే జీవించి జనంలో నిలిచిపోయిన మహా మనిషి బాబాసాహెబ్ అంబేడ్కర్. ‘నేను, నా దేశం అని చెప్పాల్సి వస్తే.. నా దేశమే నాకు అత్యంత ముఖ్యమైన’దని చాటిన ఆయనను దేశమంతా స్మరించుకునే రోజు ఏప్రిల్ 14. ఆ మహనీయుడి జయంతి. ఈ రోజునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లో కెల్లా ఇదే అతిపెద్దది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో హుస్సేన్ సాగర్ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ విగ్రహంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు. తర్వాత బౌద్ధ గురువుల ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. దాదాపు 50వేల మంది దీనికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహావిష్కరణ, సభ, ఇతర కార్యక్రమాల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభకు హాజరైనవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీటు ప్యాకె ట్లను పంపిణీ చేయనున్నారు. విగ్రహావిష్కరణ, సభ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌వాదులు, అభిమానులు పాల్గొననున్నారు. రూ.146.50 కోట్ల ఖర్చుతో.. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహ నిర్మాణం, డిజైన్, పనులు తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాల్లోని భారీ విగ్రహాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్ ఉంటాయి. విగ్రహంలో గ్రంథాలయం, హాల్స్ విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేడ్కర్ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంటాయి. భవనంలోపల ఆడియో విజువల్ రూమ్ ఉంటుంది. అందులో అంబేడ్కర్ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు. 36 ఎకరాల్లో స్మృతివనం: అంబేడ్కర్ స్మృతివనం కోసం విగ్రహం పక్కనే 36 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్స్, శాండ్‌స్టోన్ వర్క్ ఉంటాయి. దాదాపు 450 కార్లు పాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. జీవం పోసిన వంజి సుతార్ హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజి సుతార్. మహారాష్ట్రకు చెందిన ఆయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్ రూపొందించినవే. పార్లమెంట్ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్)’కు రూపమిచ్చి నదీ ఆయనే కావడం విశేషం. భారత ప్రభుత్వం సుతార్‌ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది కూడా. -
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పొత్తు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ(సోమవారం) కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఊహించని పొత్తుతో సంచలనానికి తెర తీసింది ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన. అంబేద్కర్ మనవడి పార్టీతో పొత్తు ద్వారా ముంబై స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ నేతృత్వంలోని ‘వంచిత్ బహుజన్ అగాధి’(VBA)తో పొత్తుకు థాక్రే రెడీ అయ్యారు. 2018లో ఆయన ఈ పార్టీని నెలకొల్పారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, వీబీఐతో ముంబై మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొత్తు కోసం రెండు నెలలుగా ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేకాదు నవంబర్‌లో బాల్ థాక్రే తండ్రి ప్రబోధంకర్ థాక్రే పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా.. ఆ కార్యక్రమంలో థాక్రే-అంబేద్కర్లు ఒకే వేదికను పంచుకున్నారు. ‘‘ఇవాళ జనవరి 23. బాలాసాహెచ్ థాక్రే(బాల్ థాక్రే) జయంతి కూడా. రాష్ట్రంలో చాలామంది ఇదే కోరుకుంటున్నారు(పొత్తును ఉద్దేశించి..). ప్రకాశ్ అంబేద్కర్, నేను ఇవాళ జట్టుగా ముందుకు వెళ్లేందుకు కలిశాం అని ఉద్దవ్ థాక్రే ప్రకటించారు. మా తాత, ప్రకాశ్ అంబేద్కర్ తాత ఇద్దరూ సహచరులు. సామాజిక అంశాలపై కలిసి పోరాడారు. ఇప్పుడు వాళ్ల వారసులమైన మేం సమకాలీన అంశాలపై పోరాడేందుకు ఇక్కడ ఒక్కటయ్యాం అని థాక్రే పేర్కొన్నారు. ఇక ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కొత్తదనం మొదలైందని పేర్కొన్నారు. గెలుస్తామో లేదో అనేది ఓటర్ల చేతిలో ఉంది. కానీ, సామాజికాంశాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లకు సీట్లు ఇవ్వడం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మేం ఇద్దరమే. కాంగ్రెస్ ఇంకా పొత్తుపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఎన్సీపీ శరద్ పవార్ పొత్తుపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం అని అంబేద్కర్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం చెదిరిపోయి.. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు, ఆపై బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న ప్రధాన ఎన్నిక బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే కావడం గమనార్హం. -
కులం లెక్కలు.. గెలుపు చిక్కులు
‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి. అవి మెత్తవి, కొత్తవి, కాలుకు హత్తుకుపోయేవి..’ ఒకప్పుడు ఉర్రూతలూగించిన పాట ఇది. మహారాష్ట్రలో షోలాపూర్ ఒకప్పుడు చెప్పులకు అంత ప్రసిద్ధి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలవాలంటే చెప్పులు అరిగేలా నియోజకవర్గంలో తిరగవలసిందే. అంతటి హోరాహోరీ పోరు నెలకొంది. షోలాపూర్ పశ్చిమ మహారాష్ట్రలో ఉంది. పూర్తిగా కరువు ప్రాంతం. చద్దర్స్, మిల్స్, పవర్ లూమ్స్ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా సమస్యలే. బీడీ కార్మికుల్ని కూడా సమస్యలు వేధిస్తున్నాయి. త్రిముఖ పోటీ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కూడా పని చేసిన సుశీల్ కుమార్ షిండే షోలాపూర్‌పై పట్టున్న నాయకుడు. గత ఎన్నికల్లో మోదీ హవాతో ఆయన ఓటమి పాలైనప్పటికీ ఈసారి షిండే గెలుస్తారని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతంలో మూడుసార్లు గెలుపొందిన రికార్డు ఆయనకు ఉంది. అయితే హఠాత్తుగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అగాధి అధినేత ప్రకాశ్ అంబేడ్కర్ బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శరద్ బన్సోడ్ లక్షన్నర ఓట్ల తేడాతో షిండేపై విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీపై నియోజకవర్గం ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా బీజేపీ ఈసారి అభ్యర్థిని మార్చేసి ఆ«ధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర్ స్వామిని బరిలోకి దింపింది. షిండే గెలుపులో దళిత, ముస్లిం ఓట్లే కీలకంగా ఉండేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. షిండే, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, సిద్ధేశ్వర్స్వామి పోటీతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కుల సమీకరణలు ఎవరి కొంప ముంచుతాయి? కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగు జనాభా కూడా ఎక్కువే. మొదటి నుంచీ కర్ణాటకు చెందిన లింగాయత్ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కల్కోట్ తాలూకా గౌడ్గావ్ మథ్కి చెందిన లింగాయత్ ఆధ్యాత్మికవేత్త జై సిద్ధేశ్వర్ శివాచార్య మహాస్వామీజీని బరిలోకి దింపింది. ముస్లింలు, దళితులు, ఇతర ఓబీసీ జనాభా మిశ్రమంగా ఉన్న నియోజకవర్గం ఇది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకే పట్టున్న నియోజకవర్గం. 2009లో ఇది ఎస్సీ సీటుగా రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో షిండే విజయం సాధించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఈ స్థానం ఎస్సీలకు రిజర్వుడు కాకముందు కూడా ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన చరిత్ర షిండేది. ‘ఈసారి ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేమంతా ఈసారి ప్రకాశ్ అంబేడ్కర్‌కే వేద్దామని అనుకుంటున్నాం’ అని ప్రశాంత్ గైక్వాడ్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు చెప్పాడు. దళితులు ఎక్కువగా ఉండే బుధ్వారా పేట్లోనూ ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ అంబేడ్కర్ నామినేషన్ సమయంలో ఆయన ఒంటరిగానే వచ్చారు. కానీ కాసేపటికే ఆ వీధి వీధంతా జనమే. అదే ఆయనకున్న జనాదరణను చాటుతోందని సూరజ్ సర్వేద్ అనే స్థానికుడు అంటున్నారు. అంబేడ్కర్ పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం జత కట్టింది. దీంతో ముస్లింలు కూడా ఈ పార్టీకి వేసే అవకాశాలున్నాయి. ‘నా ఓటు కాంగ్రెస్‌కే. కానీ చాలామంది అంబేడ్కర్ మనవడిపైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని జావేద్ షేక్ అనే స్థిరాస్తి వ్యాపారి అభిప్రాయపడ్డారు. -
ఓట్లు మావి పాలన మీది ఇక నడవదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఓట్ హమారా రాజ్ తుమారా, నహీ చలేగా నహీ చలేగా’ అనే నినాదం 1980వ దశకంలో దళిత నాయకుడు కాన్షీరాం బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నినాదం మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా వినిపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ఏర్పాటు చేసిన ‘వంచిత్ బహుజన్ అఘాది’ అనే సంకీర్ణపక్షం ఈ నినాదాన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అఖిల భారత మజ్లీస్ ఏ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో కలసి ప్రకాష్ అంబేడ్కర్ ఏర్పాటు చేసిన ఈ సంకీర్ణ సంస్థ మహారాష్ట్రలోని 48వ లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో దళితుల సంక్షేమం కోసం అనేక దళిత సంఘాలు పుట్టుకొచ్చి అనేక సామాజిక ఉద్యమాలను నిర్వహించాయి. సామాజిక ఉద్యమాల ద్వారా అంతో ఇంతో విజయం సాధించిన ఈ సంస్థలు, సంఘాలన్నీ రాజకీయంగా విజయం సాధించలేక పోయాయి. ఇందుకు కారణాలు రెండు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎప్పటికప్పుడు దళిత నాయకులను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకోవడం, తమకు మద్దతిచ్చినట్లయితే దళితుల ఎజెండాను అమలు చేస్తామంటూ ఆశచూపించడం ఒక కారణమైతే, రాజకీయంగా చక్రం తిప్పగల దళిత నాయకుడు ఎదిగిరాక పోవడం మరో కారణం. ‘ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీ ఎంప్యాయీస్ ఫెడరేషన్’కు చెందిన వివిధ విభాగాలు, పలు బౌద్ధ సంఘాలు, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే ఏర్పాటు చేసిన సత్యశోధక్ గ్రూపులు దళితుల కోసం పలు సామాజిక ఉద్యమాలు నిర్వహించాయి. రాజకీయంగా మాత్రం తగిన ప్రాధాన్యతను సాధించలేక పోయాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌తోనే లేదా బీజేపీ–శివసేన కూటమితో కలిసి పోవడం వల్ల ఎన్నికల్లో దళిత పార్టీలు సొంత అస్థిత్వాన్ని నిలబెట్టుకోలేక పోయాయి. 2007లో యూపీలో అధికారంలోకి వచ్చిన మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, ఆ ఎన్నికల ద్వారా మహారాష్ట్రలో కూడా పట్టు సాధించగలిగింది. అయితే 2014లో నరేంద్ర మోదీ నాయకత్వాన రాష్ట్రంలో వీచిన బీజేపీ–శివసేన కూటమి ప్రభంజనంలో ఆ పట్టును పూర్తిగా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ అంబేడ్కర్ 1915లో కొత్త కూటమితో ప్రజల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన బహుజన్ మహాసంఘ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ పార్టీల తరఫున దలితుల కోసం పోరాడారు. ఈ కొత్త కూటమి కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్–నేషనల్ కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ తొలుత వార్తవు వెలువడ్డాయి. అయితే ఆ పార్టీలతో అంటకాగకపోవడమే ‘కస్టాల్లో కలిసివచ్చిన మేలు’గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరాఠాలో అంతగా బలం లేకపోయినప్పటికీ ‘వంచిత బహుజన అఘాది’కి అక్కడ ఏఐఎంఐఎంకున్న బలం ఉపకరిస్తుందని, ఈసారి సంకీర్ణ కూటమికి ఆరు శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని రాజకీయ పండితులు తెలియజేస్తున్నారు. వారి అంచనాలు నిజమయితే పలు లోక్‌సభ సీట్లలో బీజేపీ–కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపడమే కాకుండా బహుజన పార్టీ రెండు, మూడు సీట్లను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు పార్టీ బలోపేతానికి అదే నాంది కాగలదు. ప్రకాష్ అంబేడ్కర్ అకోలా, షోలాపూర్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ షోలాపూర్ నుంచి తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. -
ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం
ముంబై: తాము అధికారంలోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండ్రోజులు జైలులో పెడతామని దళిత నేత, ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా దిగ్రాస్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..‘పుల్వామా దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయినా మనం మౌనంగా ఎందుకు కూర్చోవాలి? పుల్వామా ఘటనపై మాట్లాడవద్దని మనకు చెప్పారు. అలా చెప్పే అధికారం ఈసీకి ఎక్కడిది? రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. మేం బీజేపీ కాదు. ఈ ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తే ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే రద్దుచేసిన పెద్దనోట్లను చలామణిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రకాశ్ అంబేడ్కర్ ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. యావత్మల్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో దిగ్రాస్ పోలీసులు ఐపీసీ 503, 505, 189 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేశారు. కాగా, తాను మామూలుగానే మాట్లాడానని, తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకాశ్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఏప్రిల్ 11 నుంచి 29 వరకూ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. -
అధికారంలోకి వస్తే ఈసీకి జైలు శిక్ష
సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘంపై చర్యలు తీసుకుంటామని భరిప బహుజన్ మహాసంఘ్(బీబీఎమ్) చైర్మన్, బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర యవత్మాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, పుల్వామా దాడి గురించి మాట్లాడకుండా ఆంక్షలు విధించడం దారుణమని విమర్శించారు. ‘రాజ్యాంగ పరిధిలో అంశమే అయినప్పటికీ పుల్వామా దాడి గురించి ప్రస్తావించకూడదని ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకుంటుందో అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక ఎలక్షన్ కమిషన్‌పై చర్యలు తీసుకుంటుంది. రెండు రోజులు ఎన్నికల సిబ్బందిని జైల్లో పెడుతుంది. తటస్థంగా ఉండాల్సిన ఈసీ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తుంది’ అని అన్నారు. ప్రకాశ్ అంబేద్కర్ సోలాపూర్, అకోలా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి వంచిత్ బహుజన్ అగాదీ (వీబీఏ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో బరిప్ బహుజన్ మహాసంఘ్, ఏఐఎమ్ఐఎమ్, జనతా దళ్(ఎస్) లు కలిసి వీబీఏ కూటమి గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఏ పార్టీ ఓట్లు చీల్చుతుందోనని అధికార బీజేపీ, విపక్షాల్లో కలవరం మొదలైంది. కాగా సోలాపూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ప్రకాశ్ అంబేద్కర్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రకటించింది. -
‘ఒకే ఒక్కడి’ చుట్టూ మహా రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ : వర్ధమాన నాయకుడు ప్రకాష్ అంబేడ్కర్‌కు మంచి పేరుంది. కచ్చితమైన ఎజెండా ఉంది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రగతిశీల బృందాలకు భవిష్యత్ జ్యోతిగా ఎదుగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రకాష్ అంబేడ్కర్ నాయకత్వంలోని భారిపా బహుజన్ మహాసంఘ్‌తోని పొత్తు కుదుర్చుకున్నట్లు ‘అఖిల భారత మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లీమీన్’కు చెందిన ఔరంగాబాద్ ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ జలీల్ ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఔననిగానీ, కాదనిగానీ ప్రకాష్ అంబేడ్కర్ చెప్పకపోవడం పట్ల ఆయన పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్న పార్టీలు కలవర పడుతున్నాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్ గ్రామంలో గత జనవరి ఒకటవ తేదీన జరిగిన మహా దళితుల సభ, పర్యవసానంగా జరిగిన అల్లర్ల కారణంగా ప్రకాష్ అంబేడ్కర్ వర్ధమాన నాయకుడిగా ఆవిర్భవించారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు జనవరి రెండవ తేదీన మహారాష్ట్ర బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది. ఆయన ఇంతవరకు కాంగ్రెస్–ఎన్సీపీ కూటమికి, బీజేపీ–ఆరెస్సెస్ కూటమికి సమాన దూరంలో ఉంటూ వస్తున్నారు. వామపక్ష పార్టీలే ఆయనకు అంతో ఇంతో దగ్గరగా ఉంటూ వచ్చాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల వల్ల నష్టపోయినట్లు భావిస్తున్నా అన్ని దళిత, ఓబీసీ వర్గాలను ఏకం చేయడంలో కూడా ప్రకాష్ అంబేడ్కర్ విజయం సాధించారు. ఆ గ్రూపులన్నింటితో కలసి ‘వంచిత్ బహుజన్ అఘాది’ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మహారాష్ట్ర ముస్లిం సంఘ్ కూడా బేషరతుగా అంబేడ్కర్‌కు మద్దతు ప్రకటించింది. జమాత్ ఏ ఇస్లామీ కూడా ఆయనతో కలసి పనిచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీని మట్టి కరిపించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్–ఎన్సీపీ ఇప్పటికే ప్రకాష్ అంబేడ్కర్ వైపు చేతులు చాచినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ముస్లిం పార్టీ పొత్తు ప్రకటన చేసింది. మత ప్రాతిపదిక రాజీకయాలను నెరపే అసదుద్దీన్ వల్ల బీజేపీ మరింత బలపడుతుందేమో అన్నది అంబేడ్కర్ వెంట నడుస్తున్న పార్టీలకు కాస్త భయాందోళనలకు గురి చేస్తోంది. ఆయనలో మార్పు రావచ్చు! ‘మేము ప్రకాష్ అంబీడ్కర్‌తో కలసి పనిచేశాం. ఆయన ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి. భూమిలేని నిరుపేదల హక్కుల కోసం పనిచేసే గుణం ఆయనది. అసదుద్దీన్ ప్రతిపాదనను ఆయన తర్వాతనైనా తిరస్కవచ్చు’ అని సీపీఐ నాయకుడు ప్రకాష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల లక్ష్యం ఈ సారి ఒక్కటే, అదే బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడమని ఆయన అన్నారు. ఓవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు కొంత వరకు నష్టం చేయవచ్చేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకనే అంబేడ్కర్ తన వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. ఒకవేళ మార్చుకోకపోతే సీపీఐ వైఖరి ఎలా ఉంటుందని, ఓవైసీ కలుపుకొనే ఎన్నికలకు వెళతారా? అని మీడియా ప్రశ్నించగా ప్రకాష్ రెడ్డి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ‘కాంగ్రెస్ పార్టీతోని కలుస్తామని ఓవైసీ ఏమైనా ఇప్పటి వరకు చెప్పారా ? మేం కూడా అంతే సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతాం’ అని చెప్పారు. ఓవైసీ పార్టీ అంటరానిదేం కాదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు లక్షల ఓట్లు వచ్చాయని, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగిన ఓవైసీ పార్టీ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఏదేమైన ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఓ దళిత నాయకుడి చుట్టూ తిరగడం విశేషం. -
అవి బోగస్ పొత్తులు.. సేన ఫైర్
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఇటీవల పొడిచిన ఎంఐఎం-బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ (బీబీఎం) పొత్తులను బోగస్‌గా శివసేవ వర్ణించింది. వారి మధ్య పొత్తు అనైతికమని.. వారి అంతిమ లక్ష్యం బీజేపీకి లబ్ధి చేకూర్చడమేనని అభిప్రాయడింది. రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీబీఎం ఛీప్, అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన అధికార పత్రిక సామ్నాలో సోమవారం ఎడిటోరియల్‌ను ప్రచురించింది. ఎంఐఎం, బీబీఎమ్ పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలని, రానున్న ఎన్నికల్లో మోదీ విజయానికి లబ్ధి చేకూర్చడం కోసమే రెండు పార్టీలు జట్టు కట్టాయని శివసేన పేర్కొంది. ముస్లింలీగ్‌కు అవినీతి వర్షన్ ఎంఐఎం అని.. ఓవైసీ ముస్లింలను కేవలం ఓట్‌బ్యాంక్ కోసమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించింది. దేశంలో ఉన్న 25 కోట్ల మంది ముస్లింలు హిందూవులను అధిగమించగలరన్న ఓవైసీతో ప్రకాశ్ ఎలా చేతులు కలుపుతారని సేన ప్రశ్నించింది. ఎంఐఎంతో చేతులు కలిపి షెడ్యుల్ కులాలకు ప్రకాశ్ నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించింది. రెండు విభిన్న పార్టీలు చేతులు కలపడం వల్ల రాష్ట్రంలో అల్లర్లు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని సేన హెచ్చరించింది. ఎవరికి లబ్ధి... ఓట్లు చీల్చడానికి బీఆర్పీ–బహుజన్ ఇంతకుముందు ఎన్నికల బరిలోకి దిగినప్పుడల్లా బీజేపీకి లాభించిందని ఫలితాల తరువాత స్పష్టమైంది. మరోపక్క ఓవైసీ కూడా బీజేపీకి లబ్ధి చేకూరే రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు తరుచూ వస్తున్నాయి. మహారాష్ట్రలో దళిత, ముస్లిం ఐక్యత ప్రయోగం 30 ఏళ్ల కిందటే జోగేంద్ర కవాడే, హాజీ మస్తాన్ చేశారు. కానీ, కాంగ్రెస్‌ను దెబ్బతీయడం తప్ప రాజకీయంగా వారికెలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో తాజాగా ఎంఐఎం, బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ కూటమిగా ఏర్పడటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు నష్టపోతారనేది తేటతెల్లం కానుంది. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో బీఆర్పీ–బహుజన్ మహసంఘ్, ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దింపడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. -
ఎంఐఎం, బీఆర్పీల కూటమి
సాక్షి, ముంబై : బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్, ఎంఐఎం పార్టీలు కూటమిగా ఏర్పాడ్డాయి. ఈ మేరకు ప్రకాశ్ అంబేడ్కర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేతులు కలిపారు. వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిసే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఔరంగాబాద్‌లో శనివారం ఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్ ఇంతియాజ్ జలీల్, బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ మాజీ ఎమ్మెల్యే హరిదాస్ భదే, అమిత్ భుయింగల్ వెల్లడించారు. కాగా, కూటమి మొదటి సభ గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన ఔరంగాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది. దళిత కార్డుకు చెక్! స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకుని లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో దళితుల ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ, ప్రకాశ్ అంబేడ్కర్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడంతో దళితుల ఓట్లపై ఆధారపడిన పార్టీలకు పెద్ద దెబ్బ తగిలనట్లైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాంటి ఎన్నికలు వచ్చినా ముందుగా ముస్లింలు, దళితుల ఓట్లపై చర్చ జరుగుతుంది. కేంద్రంలో సామాజిక, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రామ్‌దాస్ ఆఠావలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ప్రస్తుతం అధికార పార్టీ బీజేపీతో ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే జోగేంద్ర కవాడేకు చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ) కాంగ్రెస్‌తో ఉన్నారు. అలాగే రాజేంద్ర గవయి ఏ పార్టీతో ఉంటారో ఇంకా స్పష్టం కాలేదు. గంగారాం ఇందిసే, అర్జున్ డాంగ్లే, మాజీ కార్పొరేటర్ మనోజ్ సంసారే తదితర రిపబ్లికన్ నాయకుల వర్గం బీజేపీ హటావ్ నినాదంతో ఒక్కటవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏడాదిలోనే ఎదుగుదల.. ప్రకాశ్ అంబేడ్కర్‌కు చెందిన బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్‌తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పొత్తు పెట్టుకోవడం వల్ల దళిత, ముస్లిం ప్రజల ఐక్యత బలపడే అవకాశం ఉంది. ముంబైలోని దాదర్‌లో ఉన్న అంబేడ్కర్ భవనం కూల్చివేసిన సంఘటన తరువాత ప్రకాశ్ అంబేడ్కర్ చర్చల్లోకి వచ్చారు. ఒక పటిష్టమైన దళిత నాయకునిగా ఆయనకు గుర్తింపు లభించింది. అనంతరం భీమా కోరేగావ్ హింసాత్మక సంఘనటల నేపథ్యంలో మహారాష్ట్ర బంద్, సంభాజీ భిడేకు వ్యతిరేకంగా ఆందోళన, నగర నక్సలైట్ల అరెస్టులు తదితర సంఘటనల తరువాత ప్రకాశ్ అంబేడ్కర్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌తో ఎంఐఎం పొత్తు పెట్టుకోవడంవల్ల దీని లబ్ధి ఎవరు పొందుతారనే అంశంపై అందరి దృష్టి పడింది. ప్రకాశ్ అంబేడ్కర్‌కు చెందిన బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్‌కు చెందిన బలిరాం శివస్కర్ అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయన అకోలా జిల్లాలోని బాలాపూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. బీజేపీకి లబ్ధి చేకూరేనా! ఓట్లు చీల్చడానికి బీఆర్పీ–బహుజన్ ఇంతకుముందు ఎన్నికల బరిలోకి దిగినప్పుడల్లా బీజేపీకి లాభించిందని ఫలితాల తరువాత స్పష్టమైంది. మరోపక్క ఓవైసీ కూడా బీజేపీకి లబ్ధి చేకూరే రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు తరుచూ వస్తున్నాయి. మహారాష్ట్రలో దళిత, ముస్లిం ఐక్యత ప్రయోగం 30 ఏళ్ల కిందటే జోగేంద్ర కవాడే, హాజీ మస్తాన్ చేశారు. కానీ, కాంగ్రెస్‌ను దెబ్బతీయడం తప్ప రాజకీయంగా వారికెలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో తాజాగా ఎంఐఎం, బీఆర్పీ–బహుజన్ మహాసంఘ్ కూటమిగా ఏర్పడటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు నష్టపోతారనేది తేటతెల్లం కానుంది. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో బీఆర్పీ–బహుజన్ మహసంఘ్, ఎంఐఎం తమ అభ్యర్థులను బరిలోకి దింపడం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదు. -
ఓట్ల కోసం అంబేడ్కర్‌ని ఏదైనా అంటారు..!!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో మార్పులు చేయడంపై ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల్లో హిందువులు, దళితుల ఓట్లకు ఎర వేయడానికి బీజేపీ అవసరమనుకుంటే అంబేడ్కర్ రాముని భక్తుడని కూడా చెప్తుందని విమర్శించారు. ‘మా తాత భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్ అని సంతకం చేసేవాడని, అయితే ఎప్పుడు అలా పూర్తి పేరుతో వ్యవహరించేవారు కాద’ని ప్రకాశ్ తెలిపారు. మహారాష్ట్రలో మిడిల్ నేమ్‌గా తండ్రి పేరును వాడుకోవడం సంప్రదాయమని అన్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అంబేడ్కర్ పేరులో మార్పులు తేవాల్సిన అవసరమేముందని బీజీపీని ప్రశ్నించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదేనని ఆరోపించారు. ఆయన పేరులో మార్పుకు సంబంధించి తమ కుటుంబాన్ని సంప్రదించకపోవడం విచారకరమన్నారు. -
హస్తంతోనే స్నేహం
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ స్నేహ హస్తం చాపితే తమకు ఎలాంటి అభ్యతరం లేదని బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. అయితే పొత్తుకు ముందు కాంగ్రెస్ తమ వైఖరేంటో స్పష్టం చేస్తే అప్పుడు తమ నిర్ణయమేంటో వెల్లడిస్తామని స్పష్టంచేశారు. దాదర్‌లోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం సాయంత్రం బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొద్ది సేపు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, బీజేపీ, శివసేనతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రకాశ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి.. భీమా కోరేగావ్ దాడుల ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న మిలింద్ ఏక్బోటేను ఎన్సీపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. శివసేన స్నేహ హస్తం చూపితే పొత్తుపెట్టుకుంటారా...? అని విలేకరులడిగిన మరో ప్రశ్నకు ప్రకాశ్ సమాధానమిస్తూ శివసేన ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రభుత్వంలోంచి బయటపడాలని, ఆ తరువాత పొత్తు విషయంపై మేం ఆలోచిస్తామని అన్నారు. ఏక్బోటే బీజేపీతో ఉన్నారని, అతన్ని ఎన్సీపీ రక్షించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఏక్బోటేను అరెస్టు చేయరని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారని, దీన్నిబట్టి ఏక్బోటేను ముఖ్యమంత్రి కూడా వెనుకేసుకొస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని, కానీ, వీరందరిని ఉన్న ఫలంగా ఉద్యోగంలోంచి తొలగిస్తే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఉద్యోగుల కొరత వల్ల కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగవన్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, దీంతో వీరందరికి పదోన్నతులు కల్పించకుండా ప్రస్తుతం కొనసాగుతున్న చోటే విధులు నిర్వహించేలా ఉద్యోగంలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మహారాష్ట్రలో మూడో ఫ్రంట్?
సాక్షి, ముంబై: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో తృతీయ కూటమిని ఏర్పరిచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీల కూటములు ఉండగా, వీటికి ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, ఓబీసీలు, ప్రోగ్రెసివ్, దళిత, ముస్లిం పార్టీలన్నీ కలసి మూడో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, ‘బీఆర్పీ బహుజన్ మహాసంఘ్’ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ మూడో కూటమికి నేతృత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమా–కోరేగావ్ ఘటనలో దళితులపై దాడులను ఖండిస్తూ ప్రకాశ్ అంబేడ్కర్ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమవడం తెలిసిందే. ఈ బంద్‌తో ఆయన తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడంతోపాటు దళితులను ఏకతాటిపైకి తీసుకురావడంలో çసఫలమయ్యారని చెప్పవచ్చు. తమ ఆలోచనలను, ప్రణాళికలను అమలు చేయాలంటే అధికారంలోకి రావాలనీ, అందుకోసం బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేయడమే మార్గమని వామపక్షాలు, ఓబీసీలు, ప్రగతిశీల (ప్రోగ్రెసివ్), దళిత, ముస్లిం, సంభాజీ బ్రిగేడ్ మొదలైన వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిసింది. -
ఫడ్నవీస్ ప్రామిస్.. శాంతించిన 'మహా'దళిత్
సాక్షి, ముంబయి : మహారాష్ట్రలో దళితులు శాంతించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగిరావడంతో వారు తమ బంద్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపుమేరకు బంద్‌ను ఆపేశారు. కోరేగావ్ -భీమా యుద్ధానికి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉత్సవం కాస్త కొన్ని అగ్రకులాలవారి జోక్యంతో ఘర్షణగా మారడం, ఇందులో ఓ వ్యక్తి చనిపోవడం,పలు చోట్ల దళితులపై దాడులు జరగడం వంటి కారణాలతో ప్రకాశ్ అంబేద్కర్ మంగళవారం నుంచి నిరవదిక బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ముంబై, థానే, పూణే నగరాల్లో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. రెండు నగరాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడ ఆగిపోయింది. ముంబై నగరంలో మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. థానే నగరంలో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. పూణెలో మొదలైన దళిత ఉద్యమం మొత్తం మహరాష్ట్ర అంతటా విస్తరించింది. బుధవారం బంద్ సందర్భంగా మహారాష్ట్రలో పాఠశాలలు మూసేశారు. ప్రజారవాణ దాదాపు ఆగిపోయింది. థానేలో ఆందోళనకారులు రైలు సేవలకు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నించారు. మంగళవారం జరిగిన హింసలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 187 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో చివరకు ఈ విషయం చేయిదాటక ముందే అప్రమత్తమైన ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ రంగంలోకి దిగారు. దళితులపై జరిగిన దాడి విషయంలో విచారణకు ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాస్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపిస్తామన్నారు. హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. -
మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం