Premalu Movie
-
3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్‌గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్‌కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్‌ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్‌కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. -
Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్!
కథలో కొత్తదనం, సహజత్వం అనగానే చాలామందికి మలయాళ సినిమాలు గుర్తొస్తుంటాయి. అది నిజమేనని ఏయేటికాయేడు మాలీవుడ్ (Mollywood) నిరూపించుకుంటూనే ఉంది. ఈ ఏడాదైతే మంజుమ్మెల్ బాయ్స్, ఆడుజీవితం, ఆవేశం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అయితే 2024లో మాలీవుడ్‌లో సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందంటోంది కేరళ చిత్ర నిర్మాతల సంఘం.199 చిత్రాలు రిలీజ్వారి నివేది ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. ఇందులో కేవలం 26 చిత్రాలు మాత్రమే సక్సెసయ్యాయి. అయితే మొత్తం అన్ని సినిమాలకు కలుపుకుని రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రూ.300 కోట్లు మాత్రమే తిరిగొచ్చింది. అంటే రూ.700 కోట్లు నష్టపోయారు! బడ్జెట్ పెరగడం, నటీనటుల పారితోషికం పెంపు వంటివి ఈ నష్టానికి ప్రధాన కారణమని తేల్చాయి.రూ.100 కోట్ల క్లబ్లో ఐదు సినిమాలుమంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys), ఆవేశం (Aavesham), ప్రేమలు (Premalu), ఆడుజీవితం (Aadujeevitham: The Goat Life), ARM చిత్రాలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఈ ఐదింటిలో అత్యధికంగా మంజుమ్మెల్ బాయ్స్ రూ.242 కోట్లు సాధించింది. కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలు రూ.50 కోట్లు వసూలు చేశాయి.రీరిలీజ్ మూవీస్ హిట్మోహన్లాల్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన బరోజ్ పెద్దగా ఆక్టటుకోలేకపోయింది. కానీ అతడు నటించిన దేవదూతన్, మణిచిత్రతళు సినిమాలను రీరిలీజ్ చేయగా మరోసారి హిట్టందుకున్నాయి. జనాలు భారీ తారాగణాన్ని చూసి కాకుండా కంటెంట్‌ను చూసి థియేటర్లకు వస్తున్నారని ఈ ఏడాదితో స్పష్టమైంది. దీన్ని బట్టి ఎడాపెడా ఖర్చుపెట్టకుండా నిర్మాణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటే ఇండస్ట్రీకి మంచిది!చదవండి: Tollywood: ‘డిసెంబర్’ రివ్యూ.. హిట్ రాలేదు ‘పుష్పా’ ! -
కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్
'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్. స్వతహాగా ఎడిటర్ అయిన ఇతడు.. మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే జూలై 27న రాత్రి ఇతడు ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అలాంటిది నెలలోనే పూర్తిగా కోలుకున్న సంగీత్ ప్రతాప్.. ఇన్ స్టాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. అసలేం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటనేది క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)'గత నెలలో ఇదే రోజున కారు ప్రమాదం జరగ్గానే నా జీవితం తలక్రిందులైంది. తొలుత నాకు ఏం కాలేదని అనుకున్నా. కానీ నర్స్ వచ్చి చెప్పిన తర్వాత నేనెంత ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడ్డానో అర్థమైంది. ఆ రోజు నుంచి నాలో బాధ, భయం, డిప్రెషన్ ఇలా చాలా ఎమోషన్స్‌కి గురయ్యాను. ఈ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఇంతకుముందు భవిష్యత్ గురించి చాలా భయాలుండేవి. కానీ జీవితం మనం కంట్రోల్లో ఉండదని అర్థమైంది. నచ్చినట్లు బ్రతికాలని ఫిక్స్ అయ్యాను''ఇన్ని రోజులు కంటికి రెప్పలా చెప్పాలంటే ఓ పిల్లాడిలా నన్ను చూసుకుంది నా భార్య. దీనికి బదులుగా ఆమెకు ఎంత ప్రేమ తిరిగిచ్చినా తక్కువే. తల్లిదండ్రులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. వాళ్లు చెప్పిన మాటలు, మెసేజులు వల్ల నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. అలా ఈ రోజు మళ్లీ సాధారణ జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. నాకెంతో ఇష్టమైన సెట్‌కి వెళ్లిపోయాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. కొన్నిరోజుల్లో అంతా సెట్ అయిపోతుందిలే. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని సంగీత్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) View this post on Instagram A post shared by Sangeeth Prathap (@sangeeth.prathap) -
'ప్రేమలు' బ్యూటీ బర్త్ డే స్పెషల్.. రేర్ అండ్ క్యూట్ ఫొటోలు
-
దుమ్మురేపుతున్న మాలీవుడ్.. 1000 కోట్లు దాటేసిన ఇండస్ట్రీ
-
'ప్రేమలు' హీరోయిన్‌కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!
'ప్రేమలు' సినిమాతో మనకు బాగా నచ్చేసిన మలయాళ బ్యూటీ మమిత బైజు. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటివరకు కేరళలో మాత్రం ఈమెకు ఫ్యాన్ బేస్ ఉండేది. 'ప్రేమలు' తర్వాత దక్షిణాదిలో ఈమెకు చాలామంది అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా మమిత, చెన్నై వెళ్లగా ఈమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి పడేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మమిత బైజు.. 'ప్రేమలు' మూవీతో లీడ్ యాక్టర్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ఓ జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. అయితే ఊహించని విధంగా చాలామంది కుర్ర అభిమానులు అక్కడికి వచ్చేశారు. కనీసం షాప్ లోపలికి కూడా మమిత వెళ్లకుండా ఇబ్బంది పెట్టేశారు.ఎలాగైతేనేం బౌన్సర్ల సహాయంతో షాప్ లోపలికి మమిత వెళ్లింది. కానీ ఆమె మొహంలో ఇదెక్కడి అభిమానం రా బాబు అనే భయం మాత్రం కనిపించింది! ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొన్నాళ్ల ముందు కాజల్ అగర్వాల్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)'#Premalu' actress #MamithaBaiju mobbed at Chennai mall. pic.twitter.com/3TJMxHLwRL— Films Spicy (@Films_Spicy) June 3, 2024Craze for #MamithaBaiju 💥🥰 pic.twitter.com/GxoPfcqKPM— VCD (@VCDtweets) June 2, 2024 -
మాలీవుడ్‌లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు
-
ప్రేమలు హీరోయిన్ మమితా బైజు క్యూట్ పిక్స్
-
చీరలో ప్రేమలు బ్యూటీ హుయలు
-
ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్‌నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
అఫీషియల్: 'ప్రేమలు' సీక్వెల్.. రిలీజ్ కూడా చెప్పేశారు
సంక్రాంతి తర్వాత అన్ని సినీ ఇండస్ట్రీల్లో డల్ ఫేజ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, జనాల్ని మెప్పించే చిత్రాలు సరిగా రావట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. అన్ సీజన్ ఫిబ్రవరిలోనే ఏకంగా నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటే 'ప్రేమలు'. మలయాళంతో పాటు తెలుగులోనూ యువతని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) అవును మీరు విన్నది నిజమే. పెద్దగా కథ కాకరకాయ లాంటిది ఏం లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఫన్ ఎలిమెంట్స్ జోడించడంతో 'ప్రేమలు'.. మలయాళంలో పెద్ద హిట్టయిపోయింది. తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సినిమాలో కథంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ ట్రెండ్‌కి తగ్గ డైలాగ్స్ అన్నీ ఉండటం మనోళ్లకు నచ్చేసింది. అయితే కొందరు తెలుగు ఆడియెన్స్‌కి మాత్రం ఇది పెద్దగా నచ్చలేదు. మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025లో రిలీజ్ ఉంటుందని కూడా చెప్పేసింది. తొలి భాగంలా కాకుండా ఈసారి తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే తొలి భాగం.. హీరో పాత్రధారి యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ స్టోరీ యూకేలో ఉంటుందా? మళ్లీ హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది చూాడాలి. అలానే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని త్వరగా సీక్వెల్ తీసేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి? (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) View this post on Instagram A post shared by Dileesh Pothan (@dileeshpothan) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు రంజాన్ పండగ వచ్చేసింది. దీంతో ఈ హాలీడేస్‌లో సినీ ప్రియులకు పండగే. వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావటం లేదు. ఈ వారంలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతే కాకుండా ఒకటి, రెండు చిన్న చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో సందడి చేసేందుకు హిట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం విశ్వక్సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్, మలయాళ హిట్ మూవీ ప్రేమలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మీకిష్టమైన సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ లాల్ సలామ్(తమిళ డబ్బింగ్ సినిమా)- ఏప్రిల్ 12 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ ఓం భీం బుష్(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12 -
ఓటీటీలో ఒకేరోజు నాలుగు హిట్ సినిమాలు.. ఈ వారం పండగే
‘ఓమ్ భీమ్ బుష్’: అమెజాన్ ప్రైమ్ శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో భారీ హిట్ కొట్టింది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకుల చేత ఔరా అనిపించింది.లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గామి: జీ5 టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'లాల్ సలామ్': నెట్ ఫ్లిక్స్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా ఓటీటీ కష్టాలు దాటుకుని స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో కొద్దిరోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'లాల్ సలామ్' స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రేమలు: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ.. తెలుగులో మార్చి 8న వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. -
This Week OTT Releases: అసలే పండుగ సీజన్.. ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు. అంతే కాకుండా వరుసగా ఉగాది, రంజాన్ పండుగలు వస్తున్నాయి. దీంతో సినీ ప్రియులు కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అలాంటి వారి కోసం ఓటీటీలు సైతం రెడీ అయిపోయాయి. ఈ వారం మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించిన గామి ఈ వారంలోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ప్రేమలు మూవీ సైతం స్ట్రీమింగ్కు సిద్ధమైంది. వీటితో పాటు బాలీవుడ్లో పరిణీతి చోప్రా నటించిన మూవీ అమర్ సింగ్ చమ్కిలా ఓటీటీలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ స్పిరిట్ రేంజర్స్- సీజన్- 3 (కిడ్స్ యానిమేటెడ్ సిరీస్)- ఏప్రిల్ 08 నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండ్-అప్ కామెడీ స్పెషల్)- ఏప్రిల్ 09 ఆంత్రాసైట్- (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 -(కొలంబియా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10 అన్లాక్డ్: ఏ జైల్ ఎక్స్పెరిమెంట్- (డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 10 జెన్నిఫర్ వాట్ డిడ్ - (బ్రిటిష్ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10 యాజ్ ది క్రో ఫైల్స్- సీజన్ 3- (టర్కిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 హార్ట్‌బ్రేక్ హై -సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11 మిడ్ సమ్మర్ నైట్ -సీజన్ 1 -(నార్వే థ్రిల్లర్ సిరీస్)- ఏప్రిల్ 11 అమర్ సింగ్ చమ్కిలా (హిందీ సినిమా)- ఏప్రిల్ 12 గుడ్ టైమ్స్ -(యానిమేటెడ్ సిట్కామ్)- ఏప్రిల్ 12 లవ్ డివైడెడ్ - (స్పానిష్ రోమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12 స్టోలెన్ - (స్వీడిష్ చిత్రం)- ఏప్రిల్ 12 ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ సిరీస్) జీ5 గామి(తెలుగు సినిమా)- ఏప్రిల్ 12 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రేమలు(మలయాళ వర్షన్)- ఏప్రిల్ 12 అమెజాన్ ప్రైమ్ అన్‌ఫర్‌గాటన్ సీజన్-5(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 08 ది ఎక్సార్సిస్ట్: బిలీవర్(హారర్ మూవీ)- ఏప్రిల్ 09 ఫాల్ అవుట్(అమెరికన్ సిరీస్)- ఏప్రిల్ 11 ఎన్డబ్ల్యూఎస్ఎల్(అమెజాన్ ఒరిజినల్ సిరీస్)- ఏప్రిల్ 12 -
ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రేమలు. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి తనయుడు కార్తికేయ. అదే పేరుతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో ప్రేమలు థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రేమలు' సినిమా
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చే విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా నస్లేన్ కె.గఫూర్, మాథ్యూ థామస్, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఎ.డి. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 135 కోట్ల మార్క్‌ను చేరుకుంది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.17 కోట్లు రాబట్టింది. ఏప్రిల్ 12 నుంచి ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
'ప్రేమలు' సినిమా నుంచి క్రేజీ సాంగ్ విడుదల
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీని ప్రకటించే పనిలో మేకర్స్ ఉన్నారు. కేవలం రూఏ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 130 కోట్ల మార్క్‌ను దాటింది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.15 కోట్లు రాబట్టింది. మార్చి 29న ఓటీటీలోకి వస్తుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా బెటర్‌గా ఉండటంతో ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని డిస్ట్రీబ్యూటర్స్ నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో చిత్ర మేకర్స్ కాస్త తగ్గారు. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. తాజాగా ప్రేమలు చిత్రం నుంచి మిని మహారాణి సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట థియేటర్లో యమ క్రేజీగా క్లిక్ అయింది. మంచి మ్యూజిక్‌తో సాగే ఈ పాట ఇప్పటికి నెట్టింట ట్రెండ్‌లో ఉంది. ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది మమితా బైజు. ప్రేమలుతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజు'కు రెబల్ షాక్
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను కోలీవుడ్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్ మొదటిరోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్ ఉంటే ఫైనల్‌గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. -
అరె.. ఏంట్రా ఇదీ.. మరీ ఓవర్‌గా లేదూ..!
ఈ మధ్య జనాలకు పిచ్చి ముదురుతోంది. అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రేమలు అనే మూవీ మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇంకేముంది.. ఈ చిత్రాన్ని వెంటనే తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దీనికి మంచి స్పందన లభించింది. సినిమా క్లిక్ అవడంతో హీరోయిన్ మమిత బైజుకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తుండగా మరో సినిమాకు ఓకే చెప్పేసిందట! ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన ప్రేమలు సక్సెస్‌మీట్‌లో ఓ మీమర్ అతి చేశాడు. సినిమా చూసి పెద్ద అభిమాని అయిపోయానంటూ స్టేజీపైనే మమితకు హారతి ఇచ్చాడు. ఈ రకమైన అభిమానం తొలిసారి చూస్తున్నానంటూ నవ్వేసింది హీరోయిన్. అయితే ఇది చూసిన జనాలు మాత్రం.. కాస్త కాదు.. చాలా అతిగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క సినిమాకే గుండెలో గుడి కట్టేశావా? పైగా హారతి కూడా రెడీ చేసుకున్నావంటే ముందే అంతా ప్లాన్ చేసుకున్నట్లేగా.. ఎందుకింత ఓవరాక్షనో.. మరీ జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు.. ఫేమస్ అవడానికి ఇలాంటి డ్రామాలు చేయడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కొందరు మాత్రం మా హీరోయిన్ ఎంత క్యూట్‌గా నవ్వుతుందో.. ఇంతటి గ్రాండ్ వెల్కమ్ మరెవరికీ దక్కలేదని మురిసిపోతున్నారు మమిత ఫ్యాన్స్. Direct ga "Aarathi" ivvatam entraaa🤣❤️🔥#MamithaBaiju craze😍🔥 pic.twitter.com/5OAtrOlJz8 — Anchor_Karthik (@Karthikk_7) March 15, 2024 చదవండి: జీవితం ఎటు పోతోందో.. హృదయం ముక్కలయ్యాక.. -
రాజమౌళి మెచ్చిన నటి మమితా బైజు గురించి ఈ విషయాలు తెలుసా?
-
'ప్రేమలు' ఓటీటీ వివరాలు.. ఒకేసారి అన్ని భాషలలో రిలీజ్
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. ఓటీటీ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్లో వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ప్రేమలు యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ హిట్ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. నస్లేన్ కె.గఫూర్, మమితా బైజు జంటగా నటించి మెప్పించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రేమలు మూవీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విడుదలై ఇప్పటికే 30రోజులు దాటింది. దీంతో ఈ సినిమాను మార్చి మొదటి వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. కానీ ప్రేమలు చిత్రం నచ్చి ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంతో తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ వెర్షన్ మార్చి 15న రిలీజ్ కానుంది. అందువల్లే ఓటీటీ రిలీజ్ కాస్త ఆలస్యం అయినట్లు చెబుతున్నారు. మార్చి 29 నుంచి హాట్‌స్టార్‌లో ప్రేమలు స్ట్రీమింగ్ కావడం దాదాపు ఖాయంగా కనిపస్తుంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి
పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ) 'కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్‌ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా చాలా బాగా నటిస్తారు. అలానే ఈ సినిమాలో చేసిన నస్లెన్, మమిత, శ్యామ్ మోహన్, సంగీత ప్రతాప్.. తమ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. మేం యాక్షన్ సీన్స్‌తో చాలా కష్టపడుతుంటాం. కానీ వీళ్లు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో థియేటర్లలో విజిల్స్ అందుకుంటున్నారు. హీరోయిన్ మమిత అయితే.. 'గీతాంజలి'లో గిరిజ, ఆ తర్వాత వచ్చిన సాయిపల్లవిని గుర్తు చేసింది' అని రాజమౌళి అన్నారు. ఈ సినిమాని తెలుగులో ఎంత తన కొడుకు కార్తికేయ రిలీజ్ చేసినా సరే రాజమౌళి నుంచి ఈ రేంజు ప్రశంసలు వస్తాయని మాత్రం 'ప్రేమలు' టీమ్ ఊహించి ఉండరు. అలానే రాజమౌళి కామెంట్స్‌తో మలయాళ యాక్టర్స్ కూడా గాల్లో తేలుతూ ఉంటారేమో. అయితే యాక్టింగ్ పరంగా మలయాళీస్ బెస్ట్ అయి ఉండొచ్చు కానీ ఆడియెన్స్ పరంగా తెలుగోళ్లని కొట్టేవాళ్లు ప్రపంచంలోనే లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 'లవర్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్‌మీట్ (ఫొటోలు)
-
ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు. గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఓ మలయాళ డబ్బింగ్ చిత్రానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన సినిమా 'ప్రేమలు'. గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా.. శివరాత్రి కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ.. తెలుగులోకి తీసుకొచ్చాడు. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ కూడా పెట్టారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు. తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు. ''ప్రేమలు'ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు. నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది. అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. కలెక్షన్స్ అయితే సాధించాడు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత) Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!! — Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024 -
ప్రేమలు చూసి నవ్వుతూనే ఉన్నాను: రాజమౌళి
‘‘సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్ స్టైల్. మలయాళ ‘ప్రేమలు’ సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్ చేస్తున్నాన ంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో.. ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. నస్లేన్ కె. గఫూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్ , మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’. మలయాళంలో హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఎస్ఎస్ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రేమలు’ మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ‘ప్రేమలు’లోని నటీనటులు అద్భుతంగా నటించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కూడా మాట్లాడారు.