Preparations
-
ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్పే లక్ష్యంగా..(ఫొటోలు)
-
ఏపీలో రేపటి నుంచి సీఈసీ పర్యటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఎన్నికల అధికారుల బృందం రేపు(సోమవారం) విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఎల్లుండి(మంగళవారం) పార్టీలతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష చేస్తారు. ఎన్నికల సన్నద్ధతపై ఈనెల 10న సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్.. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం జరగనుంది. మీడియా సమావేశం అనంతరం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల బృందం ఢిల్లీ వెళ్లనుంది. చదవండి: ‘నా ఉద్యోగం నేను చేసుకుంటా..’ -
తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక పార్టీ పూర్తి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇదీ చదవండి: మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ -
రంజాన్ కోసం అలీ దంపతుల ప్రిపరేషన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే! ( ఫొటోలు)
-
మళ్లీ కదిలిన మహా ఫ్లైఓవర్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్‌పెట్టేలా.. కాలుష్యం లేకుండా మూసీ నది తీరం వెంబడి నిర్మించాలనుకున్న ‘మహా’ఫ్లైఓవర్ ప్రతిపాదనలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్ నుంచి గౌరెల్లి వరకు దాదాపు 52 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల విస్తీర్ణంతో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ రూపకల్పనపై చర్చలు జరిగినా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించడంతో మరోసారి ఈ భారీ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ, పీసీబీ, హెచ్ఎండీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఆస్తుల సేకరణ, భూసేకరణ సమస్య లేని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.నాలుగు వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు. తూర్పు, పడమర మధ్య ప్రయాణం సాఫీగా... హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ, నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు అంటే నగరంలోని తూర్పు, పడమరలను కలిపే విధంగా ప్రత్యేక వంతెన నిర్మించనున్నారు. మూసీనది నగర శివారు పశ్చిమ ప్రాంతంలో హిమాయత్‌సాగర్ నుంచి ఈ వంతెన ప్రారంభమై నగర తూర్పు దిశలోని గౌరెల్లి వద్ద నగరాన్ని దాటుతుంది. నార్సింగి, టోలిచౌకి, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, రామంతాపూర్, నాగోల్, ఉప్పల్‌ను అనుసంధానం చేయడంతో పాటు విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను వికారాబాద్ రాష్ట్ర రహదారిని కలుపుతుంది. ఈ మూసీ నది తీరం వెంబడి నిర్మించే ఈ వంతెనకు భూసేకరణ, ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణ వంటి పనులు లేకపోవడంతో తొందరగానే పూర్తి కానుంది. -
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
-
భారత్‌కు ఎదురుందా?
తుది అంకానికి చేరిన కరీబియన్ పర్యటనలో టీమిండియాను అరుదైన ‘సిరీస్ క్లీన్‌స్వీప్’ అవకాశం ఊరిస్తోంది. ఇప్పటికే టి20లు, వన్డే సిరీస్‌లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన కోహ్లి సేన... తొలి టెస్టులోనూ గెలుపు ఢంకా గట్టిగానే మోగించింది. రెండో టెస్టుకూ అదే ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. వెస్టిండీస్ మాత్రం సొంతగడ్డపై ఆపసోపాలు పడుతోంది. భారత్ జోరు కంటే తమ ఆటగాళ్ల ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండటం వారిని కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాను నిలువరించాలంటే హోల్డర్ బృందం శక్తికి మించి పోరాడాల్సిందే. కింగ్స్టన్ (జమైకా): తొలి టెస్టులో దక్కిన ఘన విజయం ప్రేరణతో వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది కోహ్లి సేన. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టెస్టుకు ఇక్కడి సబీనా పార్క్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లు మార్పులతో బరిలో దిగే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేసర్ షమీని తప్పించి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది. గాయంతో చివరి నిమిషంలో తొలి టెస్టుకు దూరమైన పేసర్ కీమో పాల్... కమిన్స్ స్థానంలో విండీస్ తుది జట్టులోకి వచ్చే వీలుంది. బ్యాట్స్‌మన్ షమారా బ్రూక్స్‌ను పక్కనపెట్టి మహాకాయుడు రకీమ్ కార్న్‌వాల్‌తో అరంగేట్రం చేయించనుంది. పంత్‌పై దృష్టి; అశ్విన్‌కు అవకాశం! తొలి టెస్టుకు ముందు విపరీతమైన ఒత్తిడిలో ఉన్న వైస్ కెప్టెన్ రహానే... అర్ధసెంచరీ, సెంచరీతో పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అయితే, వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అవసరమైన సమయంలో అతడు క్రీజులో నిలవలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి పంత్‌పై పడింది. అశ్విన్‌కు తుది జట్టులో చోటు కూడా ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టులో అతడిని ఆడించకపోవడం ఆశ్చర్యపర్చినా ఘన విజయం ముందు అదేమీ చర్చనీయాంశం కాలేదు. అశ్విన్‌కు చోటిస్తే పేసర్ షమీని తప్పించాల్సి ఉంటుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. మయాంక్ అగర్వాల్ మంచి స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా వైఫల్యం సైతం అనూహ్యమే. కానీ, తన స్థాయి ఆటగాడికి పుంజుకోవడం పెద్ద పనేం కాదు. కోహ్లి, రహానేకు తోడుగా అతడూ రాణిస్తే జట్టు భారీ స్కోరు అందుకుంటుంది. భారత పేస్ ధాటిని ఎదుర్కొంటూ విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ నిలవగలదా? అనేది పెద్ద ప్రశ్న. ఇషాంత్ కాదంటే బుమ్రా ప్రత్యర్థికి సింహస్వప్నాల్లా కనిపిస్తున్నారు. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పరుగులు చేస్తూ వికెట్లు తీస్తుండటం టీమిండియాను మరింత బలోపేతం చేసింది. బ్యాటింగే విండీస్ బెంగ... బౌలింగ్ అంత బలహీనంగా ఏమీ లేకున్నా బ్యాటింగ్‌లో టాపార్డర్ పేలవ ఫామ్ వెస్టిండీస్‌ను దెబ్బతీస్తోంది. ప్రత్యర్థి పేసర్లు ఎంత భీకరంగా ఉన్నా, బ్యాట్స్‌మెన్ నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడం జట్టును ఆందోళన పరుస్తోంది. నమ్మదగ్గ బ్యాట్స్‌మన్, ఓపెనర్ బ్రాత్‌వైట్ నిలిస్తేనే ఈ టెస్టులోనైనా వారి పరువు దక్కుతుంది. క్యాంప్‌బెల్‌కు అనుభవం లేదు కాబట్టి బాధ్యతంతా హోప్, చేజ్, హెట్మైర్లదే. పేసర్ రోచ్ ఒక్కడికే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీయగల సత్తా ఉంది. గాబ్రియెల్, కీమో పాల్, హోల్డర్ తలో చేయి వేస్తే కోహ్లి సేనను కట్టడి చేయగలదు. మరొక్క విజయం సాధిస్తే... టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం 27 విజయాలతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడు సమంగా ఉన్నాడు. తుది జట్లు (అంచనా) భారత్: మయాంక్, రాహుల్, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే, విహారి, పంత్, జడేజా, షమీ/అశ్విన్, ఇషాంత్, బుమ్రా. వెస్టిండీస్: బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్, బ్రూక్స్/కార్న్‌వాల్, హోప్, బ్రేవో, చేజ్, హెట్‌మైర్, హోల్డర్ (కెప్టెన్), కీమో పాల్, రోచ్, గాబ్రియెల్. పిచ్ పచ్చికతో ఉంది. పేస్‌కు అనుకూలంగా తయారు చేశారు. ఇదే మైదానంలో గతంలో బంగ్లాదేశ్‌పై విండీస్ పేసర్లు చెలరేగారు. 20కి 18 వికెట్లు పడగొట్టి మూడు రోజుల్లోనే టెస్టును ముగించేశారు. వాతావరణం మేఘావృతమై ఉన్నా... వర్షానికి అవకాశం తక్కువే. -
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
-
బడ్జెట్ కార్యక్రమాలు షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించిన కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఆర్థికశాఖ కార్యాలయంలో సోమవారం హల్వా వేడుకను నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఈ ప్రీ బడ్జెట్ వేడుకను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి మధ్యంతర బడ్జెట్ కాగితాల ముద్రణ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పొన్ రాధకృష్ణన్, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్ గార్గ్ పాల్గొన్నారు. హల్వా వేడుక ప్రతి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారన్న విషయం తెలిసిందే. బడ్జెట్ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. బడ్జెట్ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు. ఇవి మొత్తం జాయింట్ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి. 1950 వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించే వారు. కానీ అక్కడ అవి లీక్ కావడంతో దానిని మింట్ రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో దీనిని నార్త్‌బ్లాక్‌లోని బేస్మెంట్కు మార్చారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతోంది. బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఆర్థిక మంత్రిత్వశాఖలోని కంప్యూటర్లలో ఈమెయిల్ సౌకర్యాన్ని బ్లాక్ చేస్తారు. బడ్జెట్‌కు కొన్ని రోజుల మందు పీఐబీ అధికారులను అక్కడికి అనుమతిస్తారు. వారు బడ్జెట్ తర్వాత చేయాల్సిన పత్రికా ప్రకటనలను పరిశీలిస్తారు. మరోవైపు ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అరుణ్‌జైట్లీ అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. -
పోరుకు సన్నద్ధం
సాక్షి, వనపర్తి : గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు, పోలింగ్ స్టేషన్లను గుర్తించడం, ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాలు నమోదు చేసుకోవడం, జిల్లాలోని 14 మండలాలను మూడు విభాగాలుగా విభజించడం వంటి ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,438 వార్డులు ఉన్నాయి. వార్డు వారీగా ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుండడంతో 2,438 ఉండనున్నాయి. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామాల కార్యదర్శులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అనువుగా ఉన్న గదులను గుర్తించారు. వాటిలో వెలుతురు సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే భవనాలను ఎంపికచేశారు. ఓటర్ల గుర్తింపు జిల్లాలోని 14 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించారు. మొత్తం 2,88,503 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,46,718 మంది, మహిళలు 1,41,785 మంది ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు 24,369 మంది ఉండగా పురుషులు 12,162, మహిళలు 12,207 ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 49,285 మంది ఉండగా, ఇందులో పురుషులు 25,230, మహిళలు 24,052 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 1,82,788 మంది ఉన్నారు. కాగా, వీరిలో పురుషులు 92,734, మహిళలు 90,054 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు మొత్తం 32,049మంది ఉండగా>.. పురు షులు 16,578 మంది, మహిళలు 15,470 మంది ఉన్నారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అధికారులకు బాధ్యతలు ఇవే.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలంటే తగిన సిబ్బంది కావాలి. ఆర్ఓ స్టేజ్ 1 అధికారి, ఆర్ఓ స్టేజ్ 2 అధికారి, ప్రిసైడింగ్ సిబ్బంది, పోలింగ్ సిబ్బందిని ఇప్పటికే ఎంపిక చేశారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గ్రామాల్లో ప్రకటించడం, అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడం, నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రక టించి వారికి గుర్తులు కేటాయించడం రిటర్ని ంగ్ అధికారి స్టేజ్ 1కు బాధ్యత అప్పగించారు. వీరిని ఒక్కో క్లస్టర్ గ్రామపంచాయతీలకు ఒక్కొక్కరి చొప్పున మొత్తం 98మందిని ఎంపికచేశారు. ∙ఇక స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారికి ఎన్నికల పోలింగ్ జరిగే రోజు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం మొత్తం 286 మందిని ఎంపికచేశారు. వీరంతా పోలింగ్ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడం, పోలింగ్ తీరు, కౌంటింగ్, ఎన్నికల్లో గెలిచిన వారిని ప్రకటించడం, ఉప సర్పంచ్ ఎన్నికను వెంటనే పూర్తిచేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ అధికారి ఒకరు ఉంటారు. మొత్తం 2,583 మంది ప్రిసైడింగ్ అధికారులను గుర్తించారు. 2,847 మంది పోలింగ్ అధికారులు ఉంటారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి ఇద్దరు కలిసి ఓటు వేయడానికి వచ్చిన వారికి పూర్తిగా సహకరించాలి. మూడు విడతలుగా ఎన్నికలు ∙14 మండలాలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి విడతలో వనపర్తి, ఖిల్లాఘనపురం, పెద్ద మందడి, గోపాల్పేట్, రేవల్లి మండలాలు ఉన్నాయి. ∙రెండవ విడతలో కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాలను చేర్చారు. ∙మూడవ విడతలో పెబ్బేరు, శ్రీరంగాపూర్, పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలు చేర్చినట్లు అధికారులు ప్రకటించారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల గుర్తింపు, అవసరమైన సిబ్బందిని గుర్తించడం వంటి పనులు పూర్తిచేశాం. జిల్లాలోని 14 మండలాలను మూడు విడతలుగా విభజించాం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. – వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి, -
తెలుగువారి దీవెనలే గెలుపుబాట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కన్నడేతరుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. కర్ణాటకలో తెలుగువారితో పాటు తమిళులు, మలయాళీలు అధిక సంఖ్యలో నివాసముంటున్నారు. బెంగళూరు మహానగరంతోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కన్నడేతరులు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా భాషలు మాట్లాడే ప్రజల ఓట్లు కీలకమని రాజకీయ పార్టీలు భావించి వారిని ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక తెలుగువారి విషయానికొస్తే రియల్ ఎస్టేట్, విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బెంగళూరుతో మన వారికి తరతరాల నుంచీ విడదీయలేని బంధముంది. లక్షలాది మంది తెలుగువారు బెంగళూరు వ్యాప్తంగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం నగర పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 నుంచి 10 స్థానాల్లో తెలుగువారు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. హెబ్బాళ, కేఆర్ పురం, బొమ్మనహళ్లి, మహదేవపుర, బీటీఎం లేఔట్, అనేకల్, యలహంక, జయనగర, హొసకోటే, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల సంఖ్య అధికం. అలాగే ప్రస్తుత శాసనసభ్యుల్లో దాదాపు 10 శాతం మంది తెలుగు మాట్లాడేవారు ఉండడం గమనార్హం. కర్ణాటకతో సరిహద్దు బంధం కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దులున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, వ్యాపార, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కర్ణాటకకు తరలివచ్చారు. బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు, చిక్కబళ్లాపుర, మైసూరు, కొప్పళ, చిత్రదుర్గ, దావణగెరె, యాదగిరి, హుబ్లీ–ధార్వాడ తదితర ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం దాదాపు కోటి మందికిపైగా తెలుగు మాట్లాడే ప్రజలు రాష్ట్రంలో ఉంటున్నారు. ఎప్పటినుంచో స్థిరపడిపోయిన తెలుగువారు ఇక్కడే తమ అనుబంధాలను ఏర్పరచుకున్నారు. రాష్ట్రంలో కన్నడ తరువాత ఇతర భాషలు మాట్లాడే వారిలో ఉర్దూ తొలిస్థానంలో ఉండగా ఆ తర్వాత తెలుగు నిలిచింది. అక్కడి జనాభాలో ఉర్దూ మాట్లాడేవారు 9 శాతం కాగా, తెలుగు ప్రజలు 8.17 శాతం ఉన్నారు. బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో దగ్గుబాటి పురంధేశ్వరి వంటి తెలుగు నేతలతో బీజేపీ ప్రచారం చేయిస్తోంది. బెంగళూరులోనూ అలనాటి నటుడు కృష్ణంరాజు ఇప్పటికే ఒక విడత ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్‌కు కేసీఆర్, పవన్, కాంగ్రెస్‌కు చిరు గణనీయ సంఖ్యలో ఉన్న తెలుగు వారి ఓట్లను దక్కించుకునేందుకు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాల పరంగా కాంగ్రెస్, బీజేపీలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం ఇక్కడ జేడీఎస్ అధినేత దేవెగౌడతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతివ్వాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు వారిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని రంగంలోకి దింపనుంది. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలంటున్నారు. పవన్‌కు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామితో మంచి సంబంధాలు ఉన్నాయి. ‘యోగి అడుగుపెడితే చెప్పులతో కొట్టండి’ బెంగళూరు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కర్ణాటక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగి ఎప్పుడు రాష్ట్రంలో అడుగుపెట్టినా చెప్పులతో కొట్టా లని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్లో కఠువా, యూపీలో ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కర్ణాటక పీసీసీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన నిజంగా యోగి కాదు. గూండా, అబద్ధాల కోరు, ఇక్కడికి వస్తే ప్రజలు చెప్పులతో కొట్టి వెనక్కుపంపాలి’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. -
షరా మామూలే!
సాక్షి,సిటీబ్యూరో: వేసవి సెలవుల్లోనూ పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. పొటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులను సాకుగా చూపించి ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీ చేసిన అధికారులు ఇప్పటికే ఆయా కాలేజీలకు షోకాజు నోటీసులు అందజేయడం విశేషం. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 323 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. అధికారులు ఇటీవల 27 కాలేజీల్లో తనిఖీ చేసి వీటిలో నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న 12 కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 200పైగా ఉన్న కాలేజీలు ఉండగా, వీటిలో 20 కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత రెండుమూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి.. ఆ తర్వాత షరామా మూలుగా తరగతులు నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇప్పటికే సెకండియర్ పూర్తై.. ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకునేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని కాలేజీలు ఇటీవలే ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకూ గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఒత్తిడి నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నారు. ఫలితాలు రాకముందే ప్రవేశాలు.. టెన్త్ ఫలితాలు ఇంకా వెలువడక ముందే నగరంలోని పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఫస్టియర్ అడ్మిషన్ల పక్రియను అప్పుడే చేపట్టాయి. ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్మీడియట్ తరగతులను కూడా కొనసాగిస్తుండటంతో ప్రైవేటులో సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం లేకపోలేదు. ఈ అంశాన్ని ముందే పసిగట్టిన పలు యాజమాన్యాలు ఆయా కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు టార్గెట్లు ఇచ్చాయి. అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకున్నాయి. వీరంతా బస్తీల్లో పర్యటించి ఇటీవల టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం ఇదే పనిలో ఉంటున్నారు. టెన్త్ ఫలితాలు వెలువడిన తర్వాత యాజమాన్యాలు ఫీజులు పెంచే అవకాశం ఉందని, ప్రస్తుతం అడ్మిషన్ చేసుకున్న వారికి ఫీ జులో 20 నుంచి 30 శాతం రాయితీ కూడా ఇస్తుందని ప్రకటిస్తున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా కాలేజీ, హాస్టల్ భవనాలను అందగా తీర్చిదిద్దుతుండటం విశేషం. తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు వేసవి సెలవుల్లో ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. హైదరాబాద్ జిల్లాల్లో ఇప్పటికే 12 కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చాం. రెండోసారి పట్టుబడిన కాలేజీలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. అంతేకాదు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దళారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ముందస్తుగా డబ్బులు కట్టి మోసపోవద్దు. ప్రవేశాలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కళాశాలల్లోని వసతులు, సౌకర్యాలు గుర్తించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికే గుర్తింపు ఇవ్వనున్నారు. ఈ జాబితాను ఆన్లైన్లో పొందుపరిచే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏ కళాశాలలో ఎలాంటి వసతులున్నాయి.. అనుమతి తీసుకున్న భవనం.. తరగతి గదులు..అధ్యాపకుల అర్హ తలు.. తదితర సమగ్ర సమాచారాన్ని ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు సమగ్రంగా పరిశీలించి ప్రవేశాలు చేసుకుంటే మంచిది. – జయప్రద, డీఐఈఓ -
మండ మెలిగె.. మేడారం వెలిగె
కోరిన వారికి కొంగు బంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరకు మరో అడుగు పడింది. గత బుధవారం గుడి మెలిగెతో జాతర ఘట్టం ప్రారంభంకాగా, తాజాగా మండ మెలిగెతో ఉత్సవాలు ఊపందుకున్నాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం వడ్డెలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొండాయిలో గోవిందరాజులు, పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడుల్లో కూడా సంప్రదాయబద్ధంగా మండ మెలిగెను నిర్వహించారు. దుష్టశక్తులు రాకుండా గ్రామ పొలిమేరల్లో నీళ్లు ఆరబోశారు. మేడారానికి రక్షాబంధం కట్టారు. సమ్మక్క– సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని మండమెలిగె పండుగను బుధవారం మేడారంలో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగతో జాతర వేడుకలు ఊపందుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువున్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయాలను వడ్డెలు శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. – ఎస్‌ఎస్‌తాడ్వాయి మామిడాకు తోరణాలు.. సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి వద్ద నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. తూర్పు, పడమర వైపు ఉన్న ప్రధానదారుల్లో కొత్త బురుక కర్రలను తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా ఐదుగురు పూజారులు గడ్డపారను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా గుంతలు తవ్వారు. దిష్టి తగులకుండా మామిడి తోరణ ం, కోడిపిల్ల, సోరకాయ కట్టి ధ్వజ స్తంభాలు నిలిపారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి పూజారి కొక్కెర కృష్ణయ్య కంకణాలు, పసుపు, కుంకుమ రూపంలో అమ్మవారిని గద్దె మీదకు తీసుకెళ్లారు. కంకణాలు కట్టి పూజలు చేశారు. కన్నెపల్లి సారలమ్మ గుడిలో.. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కాక వంశస్తులు మండమెలిగె నిర్వహించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఉదయం అమ్మవారి గుడిని శుభ్రపరిచారు. మహిళలు ఆలయాన్ని అలికి ముగ్గులతో అలంకరించారు. అమ్మవారి పూజ సామగ్రి, వస్త్రాలను శుద్ధి చేశారు. సాయంత్రం వడ్డె కాక సారయ్య సారలమ్మకు పూజలు నిర్వహించారు. రాత్రి మేడారంలోని దేవతల గద్దెల వద్దకు సాకహనం(సారా)ను తీసుకుని వెళ్లారు. కొండాయి గోవిందరాజులు గుడిలో.. ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయంలో మండ మెలిగె పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి దబ్బకట్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో గుడిని శుద్ధి చేశారు. పసుపు, కుంకుమతో ఆలయాన్ని అలంకరించారు. కొబ్బరి, బెల్లంతో గోవిందరాజులుకు నైవేద్యం సమర్పించారు. ఆలయం పక్కనే ఉన్న నాగులమ్మ ఆలయాన్ని పుట్టమన్నుతో అలికారు. ముగ్గులు వేసి పుసుపు, కుంకుమ చల్లి పూజలు నిర్వహించారు. సమ్మక్క ఆలయంలో.. సిద్ధబోయిన వంశస్తులు మేడారంలోని సమ్మక్క ఆలయంలో మండమెలిగె పండుగ జరిపారు. సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, నాగేశ్వర్రావు సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. కృష్ణయ్య అమ్మవారి శక్తిపీఠం, గద్దెలను పవిత్రమైన పుట్టమట్టితో అలికారు. నాగేశ్వర్రావు అమ్మవారి ధూపాదీపాలను కడిగి, మండ మెలిగె పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి ఆచార ప్రకారం ఆడపడుచులు పసుపు, కుంకుమ, కంకణాలు, పవిత్ర జలాన్ని తీసుకుని డోలువాయిద్యాలతో సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. అమ్మవారి గద్దెపై పసుపు, కుంకుమలు వేశారు. శక్తి పీఠాన్ని కూడా పసుపు, కుంకుమలతో అలంకరించారు. ముగ్గుల అలంకరణ పూర్తయిన అనంతరం పూజారులు ఆలయం నుంచి ధూపం, పసుపు, కుంకుమతో మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ మైసమ్మతోపాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర ట్రస్టుబోర్డు కమిటీ చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. ఘనంగా ఎదురుపిల్ల పండుగ ములుగు రూరల్: మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు గట్టమ్మ ఆలయం వద్ద ఎదురుపిల్ల పండుగను ఆదివాసీ నాయకపోడ్లు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ములుగులోని నాయకపోడ్ కాలనీ నుంచి లక్ష్మీదేవరను సిద్ధం చేసి ఊరేగింపుగా బయలు దేరారు. దీంతోపాటు వాజేడు మండలం కడెకల్, ములుగు మండలం పత్తిపల్లి నుంచి వచ్చిన లక్ష్మీదేవరలను కలుపుకుని డీఎల్ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి గట్టమ్మ ఆలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యలో నాయకపోడ్ యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. ఆలయ పూజారులు లక్ష్మీదేవరగను సాదరంగా ఆహ్వానించి ఎదురుకోళ్లు తీశారు. మహిళలు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి యాటపోతులతో మొక్కులు చెల్లించారు. పగిడిద్దరాజుకు పానుపు తయారీ గంగారం(ములుగు): మండ మెలిగెను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును పెన్క వంశీయులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ముందుగా పానుపు(పగిడిద్ద రాజును పెళ్లి కుమారుడిని చేసేందుకు ఉపయోగించే పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ధూపదీప నైవేద్యం)ను సిద్ధం చేసి తళపతి ఇంట్లోని ప్రత్యేక పూజ గదిలో ఉంచారు. తళపతి ఇంటి నుంచి పూజాసామగ్రిని పగిడిద్ద రాజు ఆలయానికి తీసుకొచ్చారు. గుడిని శుభ్రపరిచిన అనంతరం పెన్క వంశీయుల ఆడబిడ్డలు ఆలయం ఎదుట లఘ్నపు ముగ్గు వేశారు. 30న మేడారానికి పయనం పగిడిద్దరాజును ఈనెల 30న మేడారానికి తీసుకెళ్లాలని పూజారులు ముహూర్తాన్ని నిర్ణయించారు. పగిడిద్దరాజు పడిగెతో సహా పూజారులు, పెనక వంశీయులు కాలి నడకన మేడారం బయలుదేరుతారు. ఆరోజు రాత్రి లక్ష్మీపురంలోని పెనక వంశీయుల ఇంట్లో బస చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారుజామున పస్రా చేరుకుంటారు. పస్రా నుంచి పోలీసు బలగాలతో మేడారం చిలుకలగుట్టకు చేరుకుంటారు. -
జూన్‌లో గిరిజన వర్సిటీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: జూన్ నుంచి ములుగు మండలం జాకారంలో గిరిజన వర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వర్సిటీతోపాటు వరంగల్ మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించే విషయమై బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. కాలేజీ కోసం ప్రభుత్వం గతేడాది రూ.109.69 కోట్లు మంజూరు చేసిందని కడియం చెప్పారు. కాలేజీలో ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం లేఖ రాశామని అధికారులు కడియం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గిరిజన వర్సిటీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని కడియం చెప్పారు. వర్సిటీ కోసం భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలని అధికారులకు సూచించారు. -
‘ముందస్తు’ హడావుడి
పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, పంచాయతీలకు ముందస్తు ఎన్నికలు, కొత్త పంచాయతీల ఏర్పాటు వంటి వార్తల నేపథ్యంలో గ్రామ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా పంచాయతీ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల వివరాలపై కూడా నివేదించింది. తాజాగా ఎన్నికల సిబ్బంది వివరాలను సేకరించే పనిలో జిల్లా పంచాయతీ విభాగం నిమగ్నమైంది. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో జిల్లా పంచాయతీ విభాగం ఎన్నికల నిర్వహణ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల లభ్యతపై అంచనాకు వచ్చిన పంచాయతీ అధికారులు.. ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ పంచాయతీలను సైతం దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది జాబితాలు రూపొందిస్తున్నారు. సుమారు 6300 పోలింగ్ స్టేషన్లకు సుమారు 7400 మంది సిబ్బంది అవసరమవుతారని ప్రాథమికంగా అంచనా వేశారు. 200 వరకు ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్‌లో ఇద్దరు, 200 నుంచి 400 ఓటర్లు ఉంటే ముగ్గురు, 400కు పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్‌లో నలుగురేసి చొప్పున సిబ్బంది అవసరమవుతారని లెక్కలు వేస్తున్నారు. ఈ మేరకు నాలుగో తరగతి ఉద్యోగులను మినహాయించి వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు తదితరుల వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగి పేరు, సెల్ నంబరు, హోదా, పని చేసే చోటు తదితర వివరాలను క్రోఢీకరిస్తున్నారు. ఈ ఏడాది జూలై 31లోగా రిటైరయ్యే ఉద్యోగులను ఈ జాబితా నుంచి మినహాయిస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా ఒకే విడతలో కాకుండా రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే కోణంలో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది జాబితాలు రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు సాధ్యమేనా? ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నాటికి ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ముగియనుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించి, వచ్చే ఆగస్టు నాటికి కొత్తగా ఎన్నికైన పాలక మండళ్లకు శిక్షణ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఓటరు జాబితా ప్రచురణ, కొత్త పంచాయతీలు, వార్డుల ఏర్పాటు, రిజర్వేషన్ల ఖరారు, బ్యాలెట్ల ముద్రణ తదితర ఏర్పాట్లు ఫిబ్రవరిలోగా పూర్తి చేయడం అసాధ్యమని పంచాయతీ విభాగం వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రస్తుతం 475 పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 4718 వార్డులు ఉన్నాయి. అయితే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సూచన మేరకు జిల్లాలో కొత్తగా 206 పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో 93 గిరిజన తండాలకు గ్రామ పంచాయతీ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. మరోవైపు అమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వంటి అంశాలపై స్పష్టత వస్తేనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానున్నది. అయితే కొత్త పంచాయతీలు, వార్డుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. మార్గదర్శకాలు మాత్రం జారీ కాలేదు. మార్గదర్శకాలు విడుదలైతేనే కొత్త పంచాయతీలకు సంబంధించిన మ్యాపులు, సర్వే నంబర్లు తదితర అంశాలు కొలిక్కి రానున్నాయి. అయితే జిల్లా పంచాయతీ విభాగం అధికారులు మాత్రం వివిధ కోణాల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, నివేదికల రూపంలో క్రోఢీకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. జిల్లా జనాభా : 12,06,996 ఎస్టీలు : 82501 ఎస్సీలు : 2,42,040 బీసీలు : 4,82,510 గ్రామ పంచాయతీలు : 475 వార్డులు : 4718 కొత్త పంచాయతీలు : 206 (ప్రతిపాదన) వార్డులు : 1626 (ప్రతిపాదన) బ్యాలెట్ బాక్సులు : 3241 (లభ్యత) ఎన్నికల సిబ్బంది : 7400 (అంచనా) -
సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
భద్రాచలం (ఖమ్మం జిల్లా) : భద్రాచలం రామక్షేత్రం కల్యాణ శోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో ప్రతీ ఏటా సంప్రదాయబద్దంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. 5న తేదీ బుధవారం శ్రీసీతారాముల కల్యాణం, 6న గురువారం శ్రీరామపట్టాభిషేకం జరగనుంది. ఈ ఏడాది ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వంసిద్ధం చేసింది. ఇందుకుగాను మిథిలా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్ల నిర్మాణం గావించారు. ప్రాంగణాన్ని సెక్టార్ల వారిగా విభజించి భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రామాలయాన్ని విద్యుదీపాలంకరణ గావించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. రామాలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. పట్టణ ప్రధాన వీధులన్ని స్వాగతద్వారాలతో నిండిపోయాయి. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దారు. గత ఏడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 3లక్షల మందికి పైగా భక్తులు కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకాలకు హాజరయ్యే అవకాశం ఉంది. భక్తుల కోసం 3లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్దం చేస్తున్నారు. 100క్వింటాల కళ్యాణం తలంబ్రాలను సిద్ధంచేశారు. పట్టణంలోని వివిధ కూడళ్లల్లో భక్తులు విశ్రాంతి పొందుటకు ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీల టిక్కెట్ల విక్రయాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ రాములోరిని దర్శించుకొని మిథిలా ప్రాంగణానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని స్థానిక పురుషోత్తపట్నం సమీపంలో హెలీప్యాడ్‌ను సిద్దం చేశారు. పోలీస్‌లు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రితో పాటు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ ఏడాది పెద్దఎత్తున కల్యాణానికి హాజరుకానున్నారు. గురువారం జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ కే.నర్సింహన్ దంపతులు హాజరుకానున్నారు. శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా భద్రాచలం తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో రామాలయ పరిసరాలు నిండిపోయాయి. గతేడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య భాగా పెరుగుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా రాములోరి కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సమీప ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున భద్రాద్రికి చేరుకుంటున్నారు. మరికొంత మంది భక్తులు కాలినడకన ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. వీరు విశ్రాంతి పొందేందుకు గాను పట్టణ పలు ప్రాంతాల్లో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. 3లక్షల మందికి పైగా భక్తులు ఈ ఏడాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. భక్తులకు కల్పించే సౌకర్యాలు పూర్తికావచ్చాయి. భద్రాచలం పట్టణంతో పాటు పర్ణశాలలో కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా పట్టణాలను అందంగా ముస్తాబు చేశారు. భద్రాచలానికి నేటి నుంచి బస్సులు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు 580 ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల నుంచి భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. -
రీసెట్-2016కు సన్నాహాలు
పీహెచ్డీ సీట్ల పెంపునకు అవకాశం ఎస్కేయూ : వర్సిటీ పరిధిలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్–2016 రాత పరీక్ష నిర్వహించేందుకు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో పరిశోధన సీట్లు , మార్గదర్శకాలు, విధివిధానాలు దరఖాస్తులో పేర్కొన్నారు. పీహెచ్డీ సీట్లు గతంలో కంటే మరిన్ని పెరిగే దిశగా చర్యలు తీసుకొన్నారు. అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులకు గైడ్షిప్ కల్పించనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. జేఎన్టీయూ తరహాలోనే అనుబంధ కళాశాలల అధ్యాపకులకు గైడ్షిప్ ఇచ్చే అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టతకు వచ్చారు. మరోవైపు గత వారం సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లు అధ్యయనం చేయడానికి పర్యటించిన ఉన్నత కమిటీ అడ్‌హక్ లెక్చరర్లు , అనుబంధ కళాశాలల అధ్యాపకులకు రీసెర్చ్ గైడ్షిప్ కల్పించాలని సూచించారు. ఇదిలా ఉండగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తయి ఏడు సంవత్సరాలైనా వీరికి గైడ్షిప్ ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రథసప్తమికి ముమ్మర ఏర్పాట్లు
జి.మామిడాడ (పెదపూడి) : పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ మూర్తి జయంతి, రథసప్తమిని శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ, ఈవో, ఆలయ ధర్మకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ మంగళాశాసనాలతో ఆలయంలో శుక్రవారం నుంచి రథ సప్తమితో ప్రారంభమైయ్యే కార్యక్రమాలు ఈ నెల 11 వరకు జరుగుతాయి. 7న స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో పూజలు, దేవేరులతో సూర్యనారాయణుని ఉత్సవ విగ్రహాల ఆలయ ప్రదక్షిణ చేయనున్నారు. రథోత్సవం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభిస్తారు. ఆలయ కమిటీ, ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామస్తులు, యూత్ స్వామి రథాన్ని లాగనున్నారు. పెదపూడి ఎస్సై వీఎల్‌వీకే సుమంత్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు. రథసప్తమి రోజున ఆలయంలో జరిగే కార్యక్రమాలు వివరాలు తెల్లవారు జామున 4.00 గంటలకు స్వామివారిని మేల్కొలుపు, నిత్యార్చన, నవకలçశ స్నపనం అలంకరణ 5.45 గంటల నుంచి 9 గంటల వరకు భక్తులు,విద్యార్థులు సూర్యనమస్కారాలు వేయుట 6.00 గంటలకు విశేష ఆరాధన 6.30 గంటల నుంచి స్వామి వారు భక్తులకు దర్శనం 1.30 గంటలకు స్వామివారి రథోత్సవ ప్రారంభం 6.30 గంటలకు స్వామివారి రథోత్సవం ఆలయానికి చేరుట. -
రేపు చినవెంకన్న తెప్పోత్సవం
ద్వారకా తిరుమల : క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చినవెంకన్న తెప్పోత్సవం నేత్రపర్వంగా జరగనుంది. ఇందుకు క్షేత్రంలోని పుష్కరణి వద్ద సరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా ఈ ఉత్సవాన్ని శ్రీవారి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా వేడుకను నేత్రపర్వంగా జరిపేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీవారి పుష్కరణిని, గట్లును అలంకరించారు. పుష్కరణి పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కరణి ముందు స్వామివారి భారీ విద్యుత్ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పను హంసగా ముస్తాబు చేస్తున్నారు. ఈ తెప్పోత్సవ వేడుక శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమౌతుందని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
రొట్టెల పండగకు జోరుగా ఏర్పాట్లు
10 లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా భక్తులకు మజ్జిగ, నీళ్ల పంపిణీకి ప్రభుత్వ ఆదేశం ఈ సారి రూ.కోటికి పైగానే కార్పొరేషన్‌కు భారం అదనంగా రూ.1.40 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని కార్పొరేషన్ మీద ఒత్తిడి ఈ ఖర్చు సుమారు రూ.80 లక్షలు రూ.16 లక్షలు వక్ఫ్ సాయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సారి 10 లక్షలకు పైగా జనం హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. పండగ ఏర్పాట్ల ఖర్చు రూ.కోటితో పాటు స్వర్ణాల చెరువుకు శాశ్వతంగా ఘాట్లు నిర్మించేందుకు జరుగుతున్న పనికి సంబంధించి రూ.1.40 కోట్లు కార్పొరేషన్ నెత్తిన భారం మోపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అసలే నిధులు లేవని అల్లాడుతున్న కార్పొరేషన్ వర్గాలు ఈ బిల్లులు తాము చెల్లించలేం మహాప్రభో అని బావురుమంటున్నాయి. ఇదిలా ఉండగా రొట్టెల పండగను ఈ సారి భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు కల్పించే బాధ్యత మాత్రం యథాతథంగానే కార్పొరేషన్ మీద మోపింది. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు వస్తాయేమోనని ఎదురు చూసిన అధికారులు ఇక లాభం లేదనుకుని 15 రోజుల నుంచి పనులు ప్రారంభించారు. శాశ్వత ఏర్పాట్లు కేవలం రొట్టెల పండగ సమయంలోనే కాకుండా ఏడాది మొత్తం నెల్లూరు వాసులకు వినోదం, ఆహ్లాదం కల్పించడానికి చెరువుకు ఘాట్ల నిర్మాణం, మొక్కల పెంపకం, జనం కూర్చోవడానికి అనువుగా సదుపాయాలతో శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.2.60 కోట్లు ఇచ్చింది. దర్గా, చెరువుకు వచ్చే జనానికి సౌకర్యంగా ఉండేదు కోసం భూమి చదును, 120 శాశ్వత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భక్తులకు నీడ కల్పించడం కోసం షెడ్లు, అలకరణలో భాగంగా ఆర్చిలు నిర్మిస్తున్నారు. బారాషహీద్ దర్గాకు వక్ఫ్‌బోర్డు రంగులు వేయింస్తోంది. భక్తులకు మజ్జిగ, నీళ్లు పంపిణీ రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరికీ మజ్జిగ, నీళ్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.80 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు భక్తులకు వినోదం కల్పించడం కోసం ఈ సారి ఖవ్వాలి ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. రూ.18.90 లక్షలతో విద్యుత్ అలంకరణలు, మూడు పార్కింగ్ ప్రదేశాల్లో రూ.12 లక్షలతో 100 మొబైల్ టాయిలెట్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాకు రూ.20 లక్షలు ఖర్చు చేయబోతున్నారు. వక్ఫ్ రూ.16 లక్షల సాయం గత ఏడాది రొట్టెల పండగకు కార్పొరేషన్‌కు రూ.15 లక్షలు ఇచ్చిన వక్ఫ్‌బోర్డు ఈసారి రూ.16 లక్షలు అందించనుంది. గతేడాది రూ.10 లక్షలు అందించిన పర్యాటక శాఖ ఈ సారి తామే ఏర్పాట్లు చేస్తున్నందువల్ల ఆర్థికంగా సహకారం అందించలేమని తేల్చింది. గత ఏడాది నిర్వహించిన టెండర్లో రూ.60 లక్షలు ఆదాయం వచ్చినందువల్ల ఇందులో నుంచి ఈ సారి రూ.40 లక్షలు తమకు చెల్లించాల్సి ఉందని కార్పొరేషన్ వర్గాలు వక్ఫ్ బోర్డును కోరాలని నిర్ణయించాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.3 కోట్లు అడిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. పుండు మీద కారం రొట్టెల పండగ నిర్వహణ కోసం అవసరమయ్యే రూ.కోటి భరించడమే ఇబ్బందిగా ఉన్న కార్పొరేషన్ మీద మరో రూ.1.40 కోట్లు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్వర్ణాల చెరువు అభివృద్ధి, ఘాట్ల నిర్మాణానికి రూ.4 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి తమ వంతుగా రూ.2.60 కోట్లు ఇచ్చింది. మిగిలిన రూ.1.40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాలని సూచించింది. అయితే కాంట్రాక్టరు పనులు వేగంగా చేస్తూ బిల్లుల కోసం కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. మంత్రితో కూడా సిఫారసు చేయించారు. కాగా రూ.1.40 కోట్లు తాము ఇవ్వలేమని కార్పొరేషన్ వర్గాలు తేల్చి చెప్పాయి. -
కొత్త జిల్లాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు
–అధికారుల పనితీరు భేష్ –రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ భువనగిరి : కొత్తగా ఆవిర్భవించనున్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించిన భవనాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. అధికారుల పని తీరు బాగుందని కితాబునిచ్చారు. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించిన తాత్కాలిక భవనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. తొలుత భువనగిరి శివారులోని పగిడిపల్లిలో గల బంజారా ట్రైబల్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని, జగదేవ్‌పూర్ రోడ్డులోని మాధవ బీఈడీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సందర్శించారు. కలెక్టర్ భవన సముదాయంలో వివిధ శాఖల కోసం ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలు, కేటాయించిన బ్లాక్‌లు, తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అనంతరం హన్మాపురం శివారులో ఉన్న మాధవ బీఈడీ కళాశాలకు వెళ్లారు. అక్కడ ఎస్పీ, డీఎస్పీ, ఎస్‌బీతో పాటు వివిధ విభాగాల కోసం నిర్మితమవుతున్న గదులను పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సీఎస్‌కు వివరించారు. అక్కడి నుంచి రాయగిరిలో గల మాసుకుంట సమీపంలో ఉన్న డ్వాక్రా భవనాలను, ప్రభుత్వ భూమిని పరిశీలించారు. తదనంతరం సూర్యాపేటకు వెళ్లారు. ఆయన వెంట జేసీ సత్యనారాయణ, ఏఎస్పీ గంగారం, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి,డీఎస్పీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డి, సీఐలు శంకర్‌గౌడ్, అర్జునయ్య, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద సీఎస్‌కు కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు స్వాగతం పలికారు. అలాగే భువనగిరి రహదారి బంగ్లాలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
రహదారి భద్రతపై జాతీయ శిక్షణ శిబిరం
19, 20 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు హాజరుకానున్న విదేశీ ప్రతినిధులు మర్రిపాలెం : విశాఖ నగరంలో రహదారి భద్రత జాతీయ శిక్షణ శిబిరం నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో హోటల్ నోవాటెల్ జరగబోయే ఈ శిబిరంలో విదేశీ ప్రతినిధులు పాల్గొనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రవాణా శాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిబిరం విజయవంతం కావడానికి ఆ శాఖ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. ‘రహదారి భద్రత’ అంశాలపై తీర్మానాలు? ఇటీవల పార్లమెంట్లో ‘రహదారి భద్రత’ బిల్లు ఆమోదం పొందడం తెలిసిందే. ఈ క్రమంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడంతో అందరి చూపు విశాఖపై పడింది. శిబిరంలో ‘రహదారి భద్రత’పై పలు అంశాలు తీర్మానించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అమలు చేయబోయే పాలనా సంస్కరణలు, మోటార్ వాహనాల చట్టంలో మార్పుల గురించి చర్చించనున్నారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథులుగా కేంద్ర రవాణా, హైవే, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కారీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్ హాజరు కానున్నారు. ప్రపంచ బ్యాంక్ నిపుణులు, గ్లోబల్ లీడ్ రోడ్ సేఫ్టీ, గ్లోబల్ రోడ్ సేఫ్టీ ప్రతినిధులు, సౌత్ ఆసియా ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు, న్యూజిలాండ్ పోలీస్ విభాగం అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా, హైవేల ఉన్నతాధికారులు, సుప్రీంకోర్టు నియమించిన రోడ్ సేఫ్టీ ప్రతినిధులు ఈ శిబిరంలో పాల్గొంటారు. ఇంకా మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రవాణా, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు విచ్చేయనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేపడుతున్నామని డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రహదారి భద్రత’పై దృష్టిసారించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు. -
సమర్థవంతంగా స్యాతంత్య్ర వేడుకలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ పతాకావిష్కరణ, కవాతు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మైదానంలో వీఐపీలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబం«ధించిన నివేదికలను శాఖల వారీగా సీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోదులు, న్యాయశాఖ అధికారులకు ఆహ్వానించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం కస్తూర్బా కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలో తిక్కన, పొట్టిశ్రీరాములు మహానుభావుల చరిత్రలతో కుడిన ప్రదర్శనలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యావసర వైద్యశిబిరాలు అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను అకట్టుకునే విధంగా సిద్ధం చేయాలని తెలిపారు. అధికారులు, ఉద్యోగులందరు హాజరుకాలన్నారు. వివిధ శాఖల రుణాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి, సీపీఓ పీబీకే మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, ఐటిడీఏ పీఓ కమలకుమారి, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
కేసీఆర్‌తో కలిసి ‘మిషన్ భగీరథ’ను ప్రారంభించనున్న నరేంద్రమోడీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు.. ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష గజ్వేల్: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో ‘మిషన్ భగీరథ’ పథకం ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగం రేయింబవళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఆ రోజు ప్రధాని కోమటిబండ అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్క్స ప్రాంగణంలో పథకం ప్రారంభసూచికగా నల్లాను ఆన్ చేస్తారు. ఆ తరువాత గుట్ట కింది భాగంలో బహిరంగ సభ జరుగనున్నది. సుమారు 2లక్షలకుపైగా జనసమీకరణ లక్ష్యంగా ఉండగా... అందుకు తగ్గట్లు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సభా స్థలిలో పూర్తిగా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయడానికి నిర్ణయించారు. ప్రధాని సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా వీవీఐపీల రాజీవ్ రహదారి నుంచి సింగాయపల్లి స్టేజీ, చౌదర్పల్లి మీదుగా కోమటిబండలోని సభాస్థలికి చేరుకునే విధంగా ఆ మార్గాన్ని కేటాయించబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కోసం వేర్వేరుగా హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ హెలిపాడ్ ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఆ శాఖ జిల్లా ఎస్ఈ రాధాకృష్ణ, సిద్దిపేట ఈఈ బాల్నర్సయ్యలు ఇక్కడే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక డిజైన్ సిద్ధం సభావేదిక కోసం ఇప్పటికే డిజైన్ సిద్ధం చేశారు. మరో రెండ్రోజుల తర్వాత సభాస్థలిని, ‘మిషన్ భగీరథ’ ప్రారంభోత్సవ ప్రదేశాన్ని కేంద్రానికి చెందిన ఎస్పీజీ బలగాలు ఆధీనంలోకి తీసుకునే అవకాశముంది. శనివారం ఏర్పాట్లన్నింటినీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. బహిరంగ సభాస్థలి చదును పనులను పరిశీలించారు. అంతకుముందు కోమటిబండ హెడ్వర్క్క్స ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లపై కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో చర్చించారు. సభావేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో 3 గంటలకుపైగా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ముందుగా హెడ్వర్క్క్స ప్రాంతంలో నల్లాను ప్రారంభించిన అనంతరం సభావేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీపీసీకి చెందిన 1600 మెగావాట్ల పవర్‌స్టేషన్, ఎఫ్‌సీఐఎల్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు ప్రధాని శంకుస్థాపన ఇక్కడే చేస్తారని వెల్లడించారు. వర్షాల వల్ల సభకు అంతరాయం కలగకుండా రేయిన్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రజలను ఇక్కడకు తరలిస్తామన్నారు. -
వీఐపీ ఘాట్లలో అన్ని ఏర్పాట్లు
(మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద నిర్మిస్తున్న వీఐపీ, వీవీఐపీల ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి, వీఐపీ ఘాట్ ప్రత్యేక అధికారి అమృతారెడ్డి తెలిపారు. మట్టపల్లి క్షేత్రం వద్ద వీఐపీలకు కేటాయించిన ప్రహ్లాద ఘాట్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఘాట్ వద్ద ఉన్న కొన్ని పాత గోడలను పూర్తిగా తొలగిస్తామని, నూతనంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నది వద్ద ప్రమాదకరమైన ప్రదేశాలకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఐబీ ఏఈలు పిచ్చయ్య, భిక్షం, వీఆర్వో వెంకటరామారావు తదితరులు ఉన్నారు.