promise
-
మహా ఎన్నికలు.. ఏ మేనిఫెస్టోలో ఏముంది?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దాలను గుప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మహాయతిని ఢీకొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. అటు ఎంవీఏ కూటమి ఇటు మహాయతి (బీజేపీ, షిండే సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండూ మహిళలు, రైతులు, వృద్దులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతూ పలు పథకాలను ప్రకటించాయి.కొత్తగా ఉచిత బస్సు ప్రయాణంశివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్‌ల కూటమి ఎంవిఎ ‘లోక్సేవేచి పంచసూత్రి’ కింద పలు వాగ్దానాలను ప్రకటించింది. ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు చెల్లించే రైతులకు అదనంగా రూ.50 వేలు మాఫీ చేస్తామని ఎంవీఏ కూటమి హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకూ ప్రయోజనం చేకూరుస్తామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు.పథకాల మొత్తాల పెంపుఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది. ఒకప్పుడు ఉచిత పథకాలను విమర్శిస్తూ, దేశ అభివృద్ధికి ఇది ప్రమాదకరమని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు బీజేపీ తరపున పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహాయుతి తన లడ్కీ బహిన్ పథకపు మొత్తాన్ని 1,500 నుండి రూ.2,100కి పెంచింది. ఈ పథకం కింద మహిళలు, వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే విద్యార్థులకు నెలకు రూ. 10,000 సహాయం, రైతులకు రూ.15,000 ఆర్థిక సహాన్ని ప్రకటించింది. గతంలో ఇది రూ.12,000గా ఉంది.మహిళలు.. లఖ్పతి దీదీలుమహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని అధికార మహాయతి కూటమి హామీ ఇచ్చింది. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను 'లఖ్పతి దీదీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. దీంతో పాటు రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.1000 కోట్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మహావికాస్ అఘాడి (ఎంవీఏ) విషయానికొస్తే మహిళల కోసం మహాలక్ష్మి యోజనను ప్రారంభిస్తామని, దీని కింద మహిళలకు నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది.రైతులకు రుణాలు.. విద్యార్థులకు స్కాలర్షిప్లుమహారాష్ట్రలోని రైతులకు రూ.15 వేల వరకు రుణమాఫీ చేస్తామని మహాయుతి హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయోత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై 20 శాతం రాయితీ కల్పిస్తామని అధికార కూటమి హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని పేర్కొంది. ఇదే విషయంలో సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రతిపక్ష కూటమి హామీ ఇచ్చింది. 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10,000 స్కాలర్షిప్ ఇస్తామని మహాయుతి హామీనిచ్చింది. అలాగే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక ఎంవీఏ విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.4000 స్కాలర్షిప్ను ప్రకటించింది.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపురాష్ట్రంలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార కూటమి వివేకానంద యూత్ హెల్త్ కార్డ్‌ను అందజేస్తామని, యువతకు వార్షిక ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తామని పేర్కొంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ పాలసీని ప్రారంభించనున్నట్లు మహాయుతి తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. ఉచితంగా మందులు అందజేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.21,500 నుంచి రూ.82,100కు పెంచుతామని మహాయుతి చెప్పగా, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అంశాన్ని ఎంవీఏ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మహాయుతి తెలిపింది. ఎంవిఎ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కుల గణనను నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా తొలగిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.ఇది కూడా చదవండి: ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు -
‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్ ఎదుట హామీనిచ్చాడు.అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి.. -
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు.‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’...అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు.ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. -
ఇల్లు.. ఓటు.. మాట నిలబెట్టుకున్న స్మృతి ఇరానీ!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని స్థానిక ఓటరుగా మారారు. ఎంపీ ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీగంజ్‌లోని మెదన్ మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్న స్మృతి ఇరానీ అక్కడ ఓటరు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడామె ఆ గ్రామంలో ఓటరుగా మారారని విజయ్ గుప్తా తెలిపారు. స్మృతి ఇరానీ అమేథీని తన కుటుంబంగా భావిస్తారు. అమేథీ కుటుంబం మధ్య నివసించేందుకు ఆమె ఇక్కడే తన నివాసాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణంతో ఆమె అమేథీ నుంచి ఓటరుగా నిలిచే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తయ్యాయని గుప్తా తెలిపారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానంలోని మెదన్ మావాయి గ్రామంలోని బూత్ నంబర్ 347లో ఓటరుగా మారారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి స్మృతి ఇరానీ గత ఫిబ్రవరి 22న గృహ ప్రవేశం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. కాగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మే 20న అమేథీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది. -
ఎంపీగా గెలిస్తే ఫారెన్ లిక్కర్ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం
చంద్రాపూర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి చెబుతున్నారు. ఈ విచిత్ర హామీ ఇస్తున్న అభ్యర్థి పేరు వనితా రౌత్. బీరు, విస్కీలను సబ్సిడీ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది వనితా రౌత్. అయితే ఈ స్కీమ్ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్ ఉండాల్సిందేనన్న కండీషన్ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడమని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్ వారికి అవసరమని సమర్థించుకుంటోంది. పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది. వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం. ఇదీ చదవండి.. మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివి -
ఛూ మంతర్.. ఒక చంద్రబాబు.. వెయ్యి అబద్దాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 'హామీల అనుభవాలు' ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితమే. చంద్రబాబు మాట నీటి మూట. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నానుడి బాగా ఫేమస్. చంద్రబాబు మాటలనే కాదు.. ఆయనను కూడా ప్రజలు నమ్మడం లేదు. 'జయహో బీసీ' పేరుతో టీడీపీ - జనసేన సంయుక్తంగా సభ నిర్వహించాయి. 2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు 600లకు పైగా హామీలిచ్చారు. ఒక్క హామీనైనా 100 శాతం అమలు చేశారా..? అమలు చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో దాచి పెట్టే పరిస్థితి, టీడీపీ అధికార వెబ్ సైట్ నుంచి తొలగించి పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? . "చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నాది పూచి" అన్న పవన్ కల్యాణ్ ఏనాడైనా చంద్రబాబును ప్రశ్నించారా...? ఈ రోజున ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్నవే. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్‌లు సమాధానం చెప్పి బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తే బాగుండేది. "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు బడుగులకు న్యాయం చేస్తానని సభ నిర్వహిస్తే ప్రజలు నమ్ముతారా...? తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ బెదిరించింది చంద్రబాబు కాదా..? "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అని బెదిరించింది చంద్రబాబు కాదా...?. బీసీల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి తోడ్పాటు ఇవ్వకుండా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెరులు ఇచ్చింది చంద్రబాబు కాదా..? ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే, తన అనుకూల మీడియాలో చెప్పించుకునే చంద్రబాబు ఇస్త్రీ పెట్టెలు, కత్తిరెలు ఇవ్వడం ఏంటనీ సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదివి, విమానాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని బీసీ మేధావులు గుర్తు చేస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడిని ఏనాడైనా నారా లోకేష్ గౌరవించాడా...?. టీడీపీ కీలక నిర్ణయాల్లో అచ్చెన్నాయుడి భాగస్వామ్యం ఉందా...? టీడీపీ వ్యూహాత్మక భేటీల్లో బీసీ నేత అయిన అచ్చెన్నాయుడి ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటున్నారా..? గుండె మీద చేయి వేసుకుని ఆత్మ సాక్షిగా అచ్చెన్నాయుడే ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా..? బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని బాబు అంటున్నారు. బీసీల డీఎన్ఏలో టీడీపీ ఉంటే 23 సీట్లు ఇచ్చి మూలన ఎందుకు కూర్చోబెడతారు..? కుప్పం నియోజకవర్గంలో 30 వేలకే మీ మెజార్టీ ఎందుకు తగ్గిపోయింది..? బీసీల సీటు మంగళగిరిలో నారా లోకేష్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4 వేలు చేస్తానని బాబు చెబుతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 40 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారు. బాబు హయాంలో నెలవారీ పింఛన్ బడ్జెట్ కేవలం రూ.400 కోట్లు. వైఎస్ జగన్ పాలనలో 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఈ జనవరి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ రూ.3 వేలకు పెంచారు. సీఎం జగన్ పాలనలో నెలవారీ పింఛన్ బడ్జెట్ రూ.2 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. చంద్రబాబు రూ.4 వేల పింఛన్ కాదు రూ.5 వేలు ఇస్తానన్నా ఆయనను నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో పింఛన్ తీసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్లాలి.. గంటలు కొద్దీ వెయిట్ చేయాలి..లైన్లో నుంచోలేక పండుటాకులు ప్రాణాలు వదిలిన సందర్భాలు అనేకం. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తేదీ వచ్చిందంటే చాలు వలంటీర్ వచ్చి చేతిలో పింఛన్ డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారు. కళ్లతో చూస్తున్నారు. విచిత్రం ఏమంటే.. కర్ణాటక, తెలంగాణ మేనిఫెస్టోలు కాపీ కొట్టడమే కాదు.. చివరికు వైఎస్ఆర్ సీపీ నినాదాలు కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. "బీసీలు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్" అని మొదట నినదించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరకు ఈ నినాదాన్ని కూడా బాబు బ్యాచ్ కాపీ కొట్టడంపై జనాలు నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ ఏలూరులో బీసీ గర్జన సభ నిర్వహించింది. ఈ సభలో ఇచ్చిన హామీల కంటే 58 నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగానే చేశారు. డీబీటీ - నాన్ డీబీటీ కింద వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ.1.71 లక్షల కోట్లు బీసీలకు లబ్ధి చేకూర్చింది. సంక్షేమ పథకాల్లో సింహభాగం బీసీ లబ్ధిదారులే. 2014లో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.50 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఐదేళ్లలో వాస్తవానికి ఆయన ఇచ్చింది కేవలం రూ.19 వేల కోట్లు. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోటయ్య కమిటీ వేసి కోతలు, వాతలు పెట్టారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు రూ.15 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసి అన్నదాతలకు ఇచ్చిన మాట తప్పారు. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు.. ఈ రుణాలు కూడా మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ.25 వేల కోట్లు అయ్యాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో చంద్రబాబు ఎగ్గొట్టిన డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారు. డ్వాక్రా రుణాల చెల్లింపు సాధ్యం కాదని ఆనాటి మంత్రి పరిటాల సునీత ద్వారా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. అంటే.. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటను అసెంబ్లీ సాక్షిగా తప్పారు చంద్రబాబు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా బీసీలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ తేడానే 2024 ఎన్నికల్లో నిజమైన ఫలితాన్ని ప్రజల ముందుంచనుంది. - YV రెడ్డి -
KTR : పిల్లలకిచ్చిన మాట కోసం..పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన కేటీఆర్ (ఫొటోలు)
-
చేతనయ్యే వాగ్దానాలే సీఎం చేస్తారు.. చేసి చూపిస్తారు
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు తనకు చేతనయ్యే వాగ్దానాలే చేస్తారని, వాటిని తప్పకుండా ఆచరించి చూపుతారని రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని రాద్ధాంతం చేయడం కంటే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తోందని... చేతనైతే 25గంటలు ఇవ్వొచ్చని ప్రతిపక్ష పార్టీలపై వ్యంగ్యా్రస్తాలు సంధించారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆదివారం శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధించిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో 30శాతం గెలుచుకోగలిగిందన్నారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకునే బిల్లును రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పురపాలక చట్టంలో సవరణ బిల్లును మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ సవరణ బిల్లును వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదాపడింది. నాలుగు రోజులు... 12 బిల్లులు శాసనమండలి వానాకాలం సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. మొత్తం 23గంటల 10 నిమిషాల పాటు సభ కొనసాగింది. 20 ప్రశ్నలు లేవనెత్తగా, 4 షార్ట్ డిస్కర్షన్స్ జరిగాయి. వివిధ అంశాలపై 55 ప్రసంగాలు కొనసాగాయి. ఇప్పటికే ఉన్న బిల్లుల్లో 4 సవరణలు, కొత్తగా 8 బిల్లులను... మొత్తంగా 12 బిల్లులను సభ ఆమోదించింది. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,టీడీపీ నేతల పోటాపోటీ సవాళ్లు
-
టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రమాణంపై స్పందించిన ఈటల
-
ఐపీల్ కప్పుతో తిరిగొస్తా... కూతురికి మాటిచ్చిన రోహిత్ శర్మ
-
Pele: తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నవేళ
అది 1950 ఫిఫా వరల్డ్‌కప్.. ఆతిథ్య దేశం బ్రెజిల్, ఉరుగ్వే మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓడిన బ్రెజిల్ రన్నరప్‌గా నిలిచింది. బ్రెజిల్ ఓడిపోవడం చూసి ఒక వ్యక్తి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆయన పక్కనే ఉన్న ఒక పదేళ్ల పిల్లాడు కూడా ఆ వ్యక్తి అలా ఏడ్వడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ పదేళ్ల పిల్లాడు మరెవరో కాదు.. ఫుట్‌బాల్ లెజెండరీ ఆటగాడు.. పీలే. బ్రెజిల్‌కు మూడుసార్లు ఫిఫా వరల్డ్‌కప్ అందించి హీరోగా నిలిచాడు. ఇక పీలే పక్కనున్న వ్యక్తి ఇంకెవరో కాదు స్వయానా ఆయన తండ్రి డోండిన్హో. తన పదేళ్ల వయసులో నాన్న గుక్కపట్టి ఏడ్వడం గమనించిన పీలే.. నాన్న ఏడ్వకు.. ఈరోజు నీకు మాట ఇస్తున్నా.. బ్రెజిల్‌కు కచ్చితంగా వరల్డ్‌కప్ అందించి తీరుతా అని పేర్కొన్నాడు. అప్పటికే పదేళ్ల వయసు మాత్రమే ఉన్న పీలే మాటలు తండ్రికి నమ్మశక్యంగా అనిపించలేదు. 1958 ఫిఫా ఫైనల్ గెలిచిన అనంతరం పీలే కట్‌చేస్తే.. ఎనిమిది సంవత్సరాల తర్వాత 1958 ఫిపా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది పీలేనే. తండ్రికిచ్చిన మాటను నిలబ్టెట్టుకోవాలని మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో పీలే మొత్తంగా ఆరు గోల్స్ చేశాడు. సెమీఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన పీలే ఫైనల్స్‌లోనే రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికి పీలే వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 17 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌లో సంచలనాలు సృష్టించిన పీలే ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 1958 ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకెళ్లి తండ్రికి అందించాడు. ఆ సమయంలో పీలే తండ్రి దోహిన్హో పీలేను హత్తుకొని కన్నీరు కార్చడం ప్రతీ ఒక్కరి గుండెలను కదిలించింది. తన పదేళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్ రాలేదని తండ్రి ఏడ్వడం చూసిన పీలే.. తన తండ్రి మరోసారి అలా ఏడ్వకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే కడు పేదరికంలో పెరిగినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గాలనే లక్ష్యంతోనే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని బరిస్తూ ముందుకు కదిలాడు. ఆ తర్వాతి ఎనిమిదేళ్లలో ఫుట్‌బాల్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగి తండ్రి కోరికను సాకారం చేసి గొప్ప కొడుకు అనిపించుకున్నాడు. -
సత్యప్రమాణాలకు నిలయం.. తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయం
గుర్రంకొండ: నిజం పలికించే బలిపీఠం తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహ్వామి ఆలయం. సత్యప్రమాణాలకు నిలయంగా అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఆలయంగా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయంలోని సత్యప్రమాణాలు చేసే బలిపీఠం దుర్వాసమహర్షి ప్రతిష్టించాడని పురాణ కథనం. తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణం చేయాలంటే భయపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆధునిక సమాజంలో సత్యప్రమాణాల నిలయంగా తరిగొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం విరాజిల్లుతుండడం విశేషం. దుర్వాస మహర్షి ఇక్కడి ఆలయంలో బలిపీఠం ప్రతిష్టించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఆలయం వెలుపల స్వామివారికి ఎదురుగా ఈ బలిపీఠం ఉంది. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రయంత్రం పీఠం కింద ఏర్పాటు చేసి బలిపీఠానికి అత్యంత శక్తిని చేకూర్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ బలిపీఠమే కాలక్రమేణా సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. బలిపీఠం ముందరే ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు శ్రీవెంగమాంబ ఆలయం ఉంది. ఉమ్మడి రాయలసీమజిల్లాలో కాణిపాకం తరువాత ఎక్కువగా సత్యప్రమాణాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆచారం ప్రకారమే సత్యప్రమాణాలు: ఇక్కడి ఆచారం ప్రకారమే ఎవరైనా సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేసేవారు ముందుగా ఆలయ ప్రాంగణంలోని బావినీటితో స్నానం ఆచరించాలి. తడిబట్టలతో బలిపీఠం వద్దకు చేరుకొని ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆలయప్రాముఖ్యత, స్వామివారి మహత్యం తెలిసినవారు ఎవ్వరు కూడా తప్పు చేసి ఇక్కడ సత్యప్రమాణం చేసే సాహసం చేయరు. చాలా మంది స్నానాలు చేసి ప్రమాణం చేసే ముందు ఆలయ అర్చకులు చెప్పేమాటలు విని వెనకడగు వేసి నిజం అంగీకరించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. తప్పుడు ప్రమాణాలు చేస్తే వారి వంశం నిర్వీర్యమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని దుర్వాస మహాముని ఇక్కడ శాసనం చేసినట్లు ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి సత్యప్రమాణాలు చేసేందుకు వస్తుంటారు. దేవుడిపై నమ్మకం ఎక్కువ తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి మీద భక్తులకు, గ్రామస్తులకు నమ్మకం ఎక్కువ. ఆలయంలోని బలిపీఠం మీద సత్యప్రమాణాలు చేయాలంటే తప్పు చేయలేదనే భావన ఉండాలి. ఆధునికంగా ఎంతో టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడి ఆలయంలో సత్యప్రమాణంపై భక్తులకు సడలని నమ్మకం ఉంది. ఎక్కడెక్కడి నుంచో సత్యప్రమాణాలు చేసేందుకు ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. – ప్రకాష్‌రెడ్డి, గ్రామస్తులు, తరిగొండ సత్యప్రమాణం చేయాలంటే భయం తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణాలు చేయడానికి భయపడతారు. తప్పు చేసి కావాలనే తప్పుగా ప్రమాణం చేస్తే అందుకు తగిన శిక్ష అనుభవిస్తారు. బలిపీఠం గురించి చెప్పే మాటలు విని సాధ్యమైనంత వరకు బలిపీఠం దగ్గరకు వచ్చి చాలా మంది నిజం అంగీకరించి వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఎలాంటి తప్పు చేయని వాళ్లు మాత్రమే సత్యప్రమాణం చేసేందకు ధైర్యం ఉంటుంది. – గోపాలబట్టర్, ఆలయ అర్చకులు, తరిగొండ -
అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్..
Adivi Sesh Major Promise To Those Who Wants To Join In Army: ‘‘ఎమోషనల్‌గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నిటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. ఈ సినిమా చూసిన చాలామంది ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలని ఉందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై నేనొక మేజర్ ప్రామిస్ చేస్తున్నాను. సీడీఎస్, ఎన్డీఏలో చేరాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్నవారికి సపోర్ట్ చేయాలని మా టీమ్ నిర్ణయించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్‌ని లాంచ్ చేస్తాం’’ అన్నారు అడివి శేష్. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ‘ఇండియా లవ్స్ మేజర్’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ– ‘‘సందీప్ రియల్ హీరో అని తెలుసు కానీ ఈ సినిమాకి నన్ను డైరెక్టర్‌గా చేయమని శేష్ అన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుని, సందీప్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఈ సినిమా చేశాం. శేష్‌కి స్పెషల్ థాంక్స్. అలాగే రచయిత అబ్బూరి రవిగారి సపోర్ట్‌ని మర్చిపోలేం’’ అని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి ‘‘మా మొదటి సినిమా ‘మేజర్’ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. అడివి శేష్ మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఇలా యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఇప్పుడు తెరపై అంత అద్భుతంగా కనిపిస్తోంది. ‘మేజర్’ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు’’ అని నిర్మాతలు శరత్, అనురాగ్ పేర్కొన్నారు. చిత్రకథానాయిక సయీ మంజ్రేకర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటుడు అనీష్ కురువిల్లా ‘మేజర్’ విజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి..
యశవంతపుర(బెంగళూరు): బీబీఎంపీ దక్షిణ విభాగం జాయింట్ కమిషనర్ వీరభద్రస్వామి పెళ్లి చేసుకొంటానని నమ్మించి మోసం చేశాడని ద్రిష్ట అనే మహిళ బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో పరిచయమయ్యాడని, భార్య నుంచి 11 ఏళ్లుగా దూరంగా ఉంటున్నట్లు చెప్పి తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న హుళిమావు–బన్నేరఘట్ట మెయిన్ రోడ్డులోని చౌడేశ్వరి ఆలయంలో తామిద్దరం పెళ్లి చేసుకుని సంసారాన్ని ప్రారంభించామని ఫిర్యాదులో తెలిపింది. అకస్మాత్తుగా ఒకరోజు తనని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడని మళ్లి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. ఇప్పుడు తానెవరో తెలియదు అని ముఖం చాటేశాడని, న్యాయం చేయాలని కోరింది. తాను ఫోన్ చేస్తే వీరభద్రస్వామి స్పందించడం లేదని పేర్కొంది. మరో ఘటనలో.. బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది. ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. -
Promise Day 2022: ప్రామిస్ డే స్పెషల్
-
ఆమెకు ప్రామిస్ చేస్తావా
మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్‌లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా? చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్‌లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్‌లు ఏమిటో తెలుసా? ► రాష్‌గా డ్రైవ్ చేయకు. ► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు. ► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు. ► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు. ► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు ► పొదుపు చేస్తానని చెప్పు ► ఫేస్బుక్లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు ► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్‌లు కోరుకుంటారు. ► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి. ► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. ► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి. ► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి. ► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్‌లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్. ► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు. ► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి. గమనించి చూస్తే ఈ ప్రామిస్లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. ‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు నిలదీసే హక్కూ వస్తుంది. ‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. హ్యాపీ ప్రామిస్ డే. -
చిన్నారి వైద్యానికి సోనూసూద్ భరోసా
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి) : సినీనటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు అద్విత్ శౌర్య (4నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు సిరిసిల్లలో ఓ కొరియర్ సంస్థలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. బాబు తన కుమారుడిని ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. శౌర్యను పరీక్షించిన వైద్యులు.. చికిత్స కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతడి స్నేహి తులు ట్విట్టర్లో ఆ సమాచారాన్ని పోస్టు చేశారు. దీనిపై సోనూసూద్ స్పందించి అద్విత్ శౌర్య ఆపరేషన్‌కు అవసరమయ్యే డబ్బులో వీలైనంత మొత్తం భరించేందకు సిద్ధంగా ఉన్నట్లు ట్టిట్టర్ ద్వారా భరోసా ఇచ్చారని బాలుడి తండ్రి తెలిపాడు. ఇన్నోవా ఆస్పత్రిలో చిన్నారికి వైద్యచికిత్స చేయించాలని పేర్కొన్నట్లు తెలిపాడు. ఆపరేషన్‌ను డాక్టర్ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్ తెలిపినట్టు బాబు చెప్పారు. రూ.లక్షన్నర కోసం తిప్పలు చిన్నారి అద్విత్ చికిత్సకు అవసరమయ్యే రూ.7 లక్షల్లో అధికభాగం సోనూసూద్ ఇవ్వనుండగా ఇంకా రూ.1.5 లక్షలు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని.. దాతలు ఆదుకుని తన కుమారునికి ప్రాణం పోయాలని బాబు వేడుకుంటున్నాడు. దాతలు 80964 24621 మొబైల్ నంబరును సంప్రదించాలని ఆయన కోరాడు. -
అభివృద్ధికి దూరంగా గూడూరు..
సాక్షి, గూడూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్‌రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వేకువనే నిద్ర లేస్తూ.. పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలసి పట్టణంలో ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లలో ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. మాంసం మార్కెట్లో ఎదురైన దుర్భర పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ వస్తున్న దుర్వాసన ఎలా తట్లుకుంటున్నారంటూ అక్కడి వ్యాపారులను అడిగారు. ఇదేనా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అంటూ విమర్శించారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ నూతన మార్కెట్‌ను కట్టించేందుకు ప్రతిపాదనలు చేస్తే... ఎమ్మెల్యే ఆ పనులను సాగనివ్వలేదంటూ కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తానని, లేదంటే తనను నిలదీయాలని హామీ ఇచ్చారు. చేపల మార్కెట్లో మహిళలు యూరిన్‌కు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, నాయకులు పడియాల శ్రీహరి, రుదీప్రెడ్డి, ఎస్సీసెల్ నాయకులు నర్సయ్య, మనోహర్, చంద్రనీల్, సురేష్, వినీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటా గూడూరు రూరల్: తనను గూడూరు ప్రజలు ఆదరించి అసెంబ్లీకి పంపితే నిబద్ధతో పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు యద్దల నరేంద్రరెడ్డి నివాసానికి వెళ్లి గూడూరు మండల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. నామినేషన్ వేసిన తరువాత గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తానని అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరప్రసాద్రావును శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అట్ల శ్రీనివాసులురెడ్డి, వెందోటి శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, సునీల్‌రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గూడూరు నిమ్మ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని వెలగలపల్లి వరప్రసాద్‌రావు తెలిపారు. పట్టణ సమీపంలోని నిమ్మ మార్కెట్లో ఆయన పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నాయకులు పొనకా శివకుమార్‌రెడ్డి, తలమంచి సిద్దారెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు మల్లు విజయకుమార్‌రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, డాక్టర్ రాధా జోత్స్నలత, పిట్టి నాగరాజు తదితరులతో కలసి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. నిమ్మ పంటపై ఆధారపడిన రైతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
ఎన్నికల వేళ.. రాహుల్ కీలక హామీ
రాయ్‌పూర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన పేద ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ దేశం అమలు చేయ్యని విధంగా కొత్త పథకం తీసుకువస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు కనీస ఆదాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఆకలితో పేదరికంలో మగ్గుతున్న పేద ప్రజలకు ఈ పథకం ద్వారా తోడ్పాటు అందజేస్తామని అన్నారు. ప్రతి పేద వ్యక్తి జీవించడానికి కనీస ఆదాయం కావాలి. అలాంటి వారికి కనీస ఆదాయం అందించడం ద్వారా భారత్‌లో ఆకలి, పేదరికాన్ని దూరం చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తమ భవిష్యత్తు కార్యచరణ అని.. ఈ హామీకి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. దేశ ప్రజల కోసం బీజేపీ ఏమి చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన దేశంలో ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మనం నవభారతాన్ని నిర్మించలేమని పేర్కొన్నారు. గతవారం తన సోదరి ప్రియాంక గాంధీకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన రాహుల్.. తాజా హామీతో దేశంలో ఎన్నికల వేడిని పెంచారు. -
ఆతిథ్య హృదయం
విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ఆతిథ్యానికి, ఔదార్యానికి మారు పేరు. సోదరుడు చనిపోతే అతని కొడుకైన లోతూను తనతోపాటే ఉంచుకొని పెంచి పెద్దవాణ్ణి చేసిన అద్భుతమైన ప్రేమ ఆయనది. ఒకరోజున ముగ్గురు పరదేశులు ఇంటికొచ్చారు. తన ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లవద్దని వారిని బతిమాలి మరీ అప్పటికప్పుడు అత్యంత రుచికరమైన భోజనాన్ని తన భార్యౖయెన శీరాతో వండించి వారికి పెట్టాడు. పరదేశులు కదా మంచి వాళ్లో చెడ్డవాళ్లో నాకెందుకులే అని ఆయన ఆలోచించవచ్చు. అప్పటికే శీరా వృద్ధురాలు. ఆమెనెందుకు కష్టపెట్టడం అని కూడా అనుకోవచ్చు. ముక్కూమొహం తెలియని వాడికి భోజనం పెడితే ఏమొస్తుంది? అని కూడా భావించవచ్చు. ఇది అవిశ్వాసుల ఆలోచనాతీరు. అలా ఆలోచించలేకపోవడమే అబ్రాహాము ప్రత్యేకతగా భావించి అలాంటి మరికొన్ని సుగుణాల కారణంగా దేవుడాయన్ని విశ్వాసులకు జనకుణ్ణి చేశాడు. ఆ రోజు వచ్చిన వారు పరదేశులు కాదు, పరదేశుల్లాగా కనిపించిన దేవదూతలని అబ్రాహాముకి ఆ తర్వాత అర్థమయింది. వారు తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళ్లిపోతూ, త్వరలోనే అబ్రాహాము, శీరాలు కడు వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని పొందబోతున్నారని, ఆ మేరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతున్నదని నిశ్చయతనిచ్చి వెళ్లిపోయారు. ఈ విషయాన్నే హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ కొందరు పరదేశులకు ఆతిథ్యమిచ్చి తమకు తెలియకుండానే దేవదూతలకు సేవచేశారని శ్లాఘించారు (ఆది 18: 1–15; హెబ్రీ 13:2) ఆతిథ్యం విశ్వాసుల ఇంటికి సంబంధించిన విషయం కాదు, అది వారి హృదయానికి చెందిన విషయం!! – ఆశ్రయ -
కాణిపాకంలో మాజీ మంత్రి ప్రమాణం
సాక్షి, చిత్తూరు : పదవిలో ఉండగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ మేరకు ప్రమాణాల దేవుడుగా పేరుగాంచిన కాణిపాకం వరసిద్ది వినాయకుడి వద్ద ఆయన ప్రమాణం చేశారు. గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని.. నేడు కాణిపాకం వర సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. ‘పదవిలో ఉండగా నాపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. కానీ, అప్పుడు ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు. అందుకే రాజీనామా చేశాక ప్రమాణం చేస్తున్నా. నేను కానీ, నా కుటుంబంలోని వ్యక్తులు కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు’ అని ఆయన మీడియాకు తెలిపారు. కాగా, గతంలో 10 వతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు కాణిపాకంలో ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు. -
ప్రామిస్ డే: మియా మాల్కోవా మీద వర్మ ప్రామిస్..
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రామిస్ చేశారు. ప్రామిస్ డే రోజు డైరెక్టర్ వర్మ చేసిన ప్రామిస్‌కు అనూహ్య స్పందన వస్తోంది. సాధారణంగా దేవుడి మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు (గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్) అని చెబుతుంటారు కదా.. అందుకు వర్మ కాస్త భిన్నంగా కొందరు వ్యక్తులపై ప్రామిస్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రామిస్ డే రోజు ఓ ప్రామిస్ చేస్తున్నా... నేను ఏనాడు చేసిన మాటపై నిలబడనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోనని ప్రామిస్ చేస్తున్నానంటూ వర్మ తొలుత ఓ ట్వీట్ చేశారు. దేవుడిపై గానీ, తన తల్లిపై గానీ తాను ఆ ప్రామిస్ చేయడం లేదన్నారు వర్మ. అందుకు బదులుగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, స్టీవెన్ స్పిల్బర్గ్, అయన్ ర్యాండ్, డావూద్ ఇబ్రహీం, బ్రూస్ లీ మరియు మియా మాల్కోవాలపై ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఏడాది నేను చాలా మంచి బాధ్యతాయుత వ్యక్తిగా ఉండేందుకు తీవ్రంగా కష్టపడతాను' అంటూ మరో ట్వీట్లో రాసుకొచ్చాడు డైరెక్టర్ వర్మ. మియా మాల్కోవాపై వర్మ ప్రామిస్ చేస్తున్నారు.. మాట నిలబెట్టుకుంటారో లేదో వేచిచూద్దాం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
ఆతిథ్యం ఇచ్చే గృహం
ఆశీర్వాదాలకు మూలం! సువార్త విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ఆతిథ్యానికి, ఔదార్యానికి మారు పేరు. సోదరుడు చనిపోతే అతని కొడుకైన లోతును తనతోపాటే ఉంచుకొని పెంచి పెద్దవాణ్ణి చేసిన అద్భుతమైన ప్రేమ ఆయనది. ఒకరోజున ముగ్గురు పరదేశులు ఇంటికొచ్చారు, తన ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లవద్దని వారిని బతిమాలి మరీ అప్పటికప్పుడు అత్యంత రుచికరమైన భోజనాన్ని తన భార్యౖయెన శారాతో వండించి వారికి పెట్టాడు. పరదేశులు కదా మంచి వాళ్లో చెడ్డవాళ్లో నాకెందుకులే అని ఆయన ఆలోచించవచ్చు. అప్పటికే శారా వృద్ధురాలు. ఆమెనెందుకు కష్టపెట్టడం అనికూడా అనుకోవచ్చు. ముక్కూమొహం తెలియని వాడికి భోజనం పెడితే ఏమొస్తుంది? అని కూడా ఆలోచించవచ్చు. ఇది అవిశ్వాసుల ఆలోచనాతీరు. అలా ఆలోచించలేకపోవడమే అబ్రాహాము ప్రత్యేకతగా భావించి అలాంటి మరికొన్ని సుగుణాల కారణంగా దేవుడాయన్ని విశ్వాసులకు జనకుణ్ణి చేశాడు. ఆ రోజు వచ్చిన వారు పరదేశులు కాదు, పరదేశుల్లాగా కనిపించిన దేవదూతలని అబ్రాహాముకి ఆ తర్వాత అర్థమయింది. వారు తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళ్లిపోతూ, త్వరలోనే అబ్రాహాము, శారాలు కడు వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుని పొందబోతున్నారని, ఆ మేరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతున్నదని నిశ్చయతనిచ్చి వెళ్లిపోయారు. ఈ విషయాన్నే హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ కొందరు పరదేశులకు అతిథ్యమిచ్చి తమకు తెలియకుండానే దేవదూతలకు సేవచేశారని శ్లాఘించారు (ఆది 18: 1–15; హెబ్రీ 13:2). ఆతిథ్యం విశ్వాసుల ఇంటికి సంబంధించిన విషయం కాదు, అది వారి హృదయానికి చెందిన విషయం!! ఒకప్పుడు మన గృహాలన్నీ ఆతిథ్యానికి మారుపేర్లు. కాని అది క్రమంగా కనుమరుగవుతున్న అత్యంత నగరీకరణ చెందిన జీవన శైలి మనదీనాడు. ఎండన పడి ఆకలితో అన్నం తినేవేళ ఇంటికి వచ్చిన అతిథి మొహాన ఫ్రిజ్‌లోని ఏ పానీయమో కొట్టి చేతులు దులుపుకునే ‘కృత్రిమ ప్రేమ’ కు మన ఇళ్లు మారుపేరైతే అదెంత విచారకరం? చిన్నప్పుడు అమ్మ ఏ సమయంలో వచ్చిన అతిథి ఎవరైనా వేడిగా భోజనం వండి వడ్డించడం, ఇక భిక్షగాళ్లకైతే, తప్పకుండా ఏదో ఒకటిచ్చి పంపడం గుర్తుంది. పిల్లలైన కారణంగా మేము భిక్షగాళ్లను కసురుకొనడం చూస్తే వెంటనే మమ్మల్ని మందలించి ఏదీ ఇవ్వలేకపోతే సౌమ్యంగా ‘సారీ’ చెప్పాలని, ఉర్దూ మాట్లాడే ఫకీర్లయితే ‘మాఫ్ కీజియే’ అనాలని నేర్పించేది. కన్న తల్లిదండ్రులకు, తోబుట్టువులకు కూడా అన్నం పెట్టలేని అతి నాగరికతకు దాసోహమైన మన వాళ్లు పరదేశులు, భిక్షగాళ్ల రూపంలో వచ్చే దైవదూతలు, ప్రతినిధులకు ఆతిథ్యం నిరాకరించి పోగొట్టుకుంటున్న ఆశీర్వాదాలెన్నో లెక్క తెలిస్తే, అవాక్కవుతాం! అందుకే ఆతిథ్యం లేని గృహం తప్పకుండా సమస్యలకు, అశాంతికి నిలయం!! – రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
‘చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైంది’