Radhe
-
అభిమానులను నిరాశ పరిచిన ఆ ఐదు చిత్రాలు
2021 Bollywood Flop Movies: సినిమా సినిమా.. కొబ్బరికాయ కొట్టి మొదటి క్లాప్ ఇచ్చినప్పటినుంచి మూవీ విడుదలై, సక్సెస్ మీట్ వరకూ ఒక రకమైన పండుగల ఉంటుంది. హిట్ అయితే 'అబ్బా సాయిరామ్' అని అనిపించిన దర్శక నిర్మాతలకు సినిమా సరిగా ఆడకుంటే మాత్రం 'చాలా బాగోదు'. కానీ ఏం చేద్దాం. కొన్ని సినిమాలు బాగా టేకాఫ్ అయితే.. మరికొన్ని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో టేకాఫ్ కాకుండా కుప్పకూలిపోతాయి. ఇలా ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని ఐదు హిందీ చిత్రాలు మీకోసం. 1. రాధే (యువర్ మోస్ట్ వాంటేడ్ భాయ్) బాలీవుడ్ భాయిజాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ చిత్రం రాధే. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను ఎంతమాత్రం రీచ్ కాలేకపోయాడు రాధే. ఇందులో సల్మాన్.. రాజ్వీర్ షికావత్ అకా రాధే పాత్రను పోషించాడు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ చిత్రంలో దిశా పటానీ, జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా తదితరులు నటించారు. ఈ సినిమాకు ఐఎండీబీ 1.8 (IMDb) రేటింగ్‌ను ఇచ్చింది. 2. హంగామా 2 2003లో విడుదలైన హంగామా సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే హంగామా 2. మొదటి చిత్రం 7.6 ఐండీబీ రేటింగ్‌ను సాధించగా రెండో సినిమా మాత్రం 2.1 కి పరిమితమైంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ హాస్య నటులు పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్, జానీ లివర్ ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 3. లాహోర్ కాన్ఫిడెన్షియల్ జీ5 ఒరిజినల్ నిర్మించిన రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం వన్ లాహోర్ కాన్ఫిడెన్షియల్. ఈ సినిమాలో రిచా చద్దా, అరుదోదయ్ సింగ్, కరిష్మా తన్నా, ఖలీద్ సిద్ధిఖీ నటించారు. చిత్రంలో స్పై-థ్రిల్లర్ అంశాలు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. కునాల్ కోహ్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు 2.8 రేటింగ్ ఇచ్చింది ఐఎండీబీ (IMDb). 4. రూహి బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన కామెడీ-హార్రర్ చిత్రం రూహి. ఇందులో జాన్వీ కపూర్, వరుణ్ శర్మ నటించారు. ఈ చిత్రానికి హార్దిక్ మెహతా దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను నిరాశపరిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 4.3. 5. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ నిర్మించిన చిత్రం ది గర్ల్ ఆన్ ది ట్రైన్. పౌలా హాకిన్స్ రాసిన నవల ఆధారంగా 2016లో హాలీవుడ్లో విజయం సాధించిన ఈ సినిమాకు ఇదే పేరుతో హిందీలో రీమెక్ చేశారు. ఈ చిత్రం ప్రోమోలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయినా పరిణీతి చోప్రా, అదితి రావు హైదరీ నటించిన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు అంతగా థ్రిల్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమాకు 4.4గా ఐఎండీబీ (IMDb) రేటింగ్ ఇచ్చింది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది అలరించనున్న సినిమాలు ఇవే.. -
పైరసీ చూస్తే వాట్సాప్ కట్!
న్యూఢిల్లీ: సినిమా పైరసీ విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సినిమాను పైరసీని ప్రొత్సహించే యూజర్ల వాట్సాప్ అకౌంట్లను తాత్కాలికంగా రద్దు చేయాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సూచించింది. రాధే సినిమా పైరసీ కాపీలను షేర్ చేసినవాళ్లతో పాటు చూసిన వాళ్ల, అమ్మిన వాళ్ల వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా అకౌంటన్లను సస్పెండ్ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక సినిమా విషయంలో న్యాయస్థానం ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే రాధే పైరసీ పై మహారాష్ట్రలో క్రిమినల్ కంప్లంయిట్స్ కూడా నమోదు అయ్యింది. కాగా, తమ సినిమా పైరసీ యధేచ్ఛగా జరుగుతోందని, సినిమా క్లిపులు వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున్న సర్క్యులేట్ అవుతున్నాయని రాధే సినిమా హక్కులదారు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇంటీరియమ్ రిలీఫ్ కింద ఈ ఆదేశాలను జారీ చేసింది జస్టిస్ సంజీవ్ ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్. ఈ విషయంలో తమ సబ్స్క్రయిబర్ల వివరాలివ్వాలని టెలికామ్ ఆపరేటర్లను సైతం కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపింది. పైరసీ కాపీలను చూడడం, కాపీ, అమ్మకం, నిల్వ చేయడం.. ఇలా ఏ రూపంలో రాధే పైరసీ కాపీ ఉన్నా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపింది. డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు అమలు రాబోతున్న వేళ.. పైరసీపై ఇలాంటి చర్యలు మునుముందు నిర్మాతలకు ఊరట అందించబోతున్నాయి. కాగా, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్‌వాంటెడ్ భాయ్’ మే 13న జీ ఫ్లిక్స్‌లో , డిష్, డీ2హెచ్, టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంటి డీటీహెచ్ వేదికల్లో ‘పే పర్ వ్యూ’ విధానంలో రిలీజ్ చేశారు. వ్యూయర్షిప్తో దుమ్మురేపినప్పటికీ.. కంటెంట్ ఆడియెన్స్‌ను మెప్పించకపోవడం, నెగెటివ్ రివ్యూలు, ట్రోలింగ్‌తో.. 1.8 ఐఎండీబీ రేటింగ్‌తో సల్మాన్ కెరీర్లోనే వరెస్ట్ మూవీ ట్యాగ్ దక్కించుకుంది రాధే. -
‘రాధే’ పైరసీ: ముగ్గురు సోషల్ మీడియా యూజర్లపై కేసు
గతవారం ఓటీటీలో విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీప్లెక్స్‌లో పే పర్ వ్యూ విధానంలో విడుదలైంది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్లైన్లో దర్శనమిచ్చిది. దీనిపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ పైరసీ కారులపై మండిపడ్డాడు. మూవీ పైరసీకి పాల్పడిన వారిపై సైబర్ సెల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించాడు. అంతేగాక జీ5 సంస్థ సైతం దీనిపై సెంట్రల్ సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.. ఇదిలా ఉండగా ఈ మూవీ పైరసీ కేసులో గుర్తుతెలియని ముగ్గురు సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు తాజాగా సైబర్ సెల్ పోలీసులు వెల్లండించారు. వీరిలో ఇద్దరు వాట్సాప్ యూజర్లు, ఒక ఫేస్బుక్ ఖాతా దారుడు ఉన్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుని ఫేస్బుక్లో డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా విక్రయించేందుకు అతడు ఆఫర్ చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాధే చిత్రం పైరసీ వెర్షన్ వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై లీకైన వెంటనే జీ5 నిర్మాత తమ సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఇద్దరు వాట్సప్ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఖాతా దారులను గుర్తించామన్నారు. ప్రస్తుతం తమ టీం మరి కొందరి ఫోన్ నెంబర్లను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైందని తెలిపారు. చదవండి: ‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్, సల్మాన్ ఫైర్ -
‘రాధే’ మూవీ టీంకు భారీ షాక్, సల్మాన్ ఫైర్
బిగ్ స్క్రీన్‌పై విడుదలవ్వాల్సిన పెద్ద సినిమాలు సైతం కరోనా దెబ్బకు ఓటీటీ బాట పడుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రాలను పైరసీ భూతం వదలడం లేదు. ఎక్కడైనా సరే పెద్ద సినిమాల దర్శక నిర్మాతలకు ఈ పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా విడుదలైన బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీకి కూడా ఈ సమస్య తప్పలేదు. గతేడాది నుంచి థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘రాధే’ మూవీని సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం జీప్లెక్స్‌లో పే పర్ వ్యూ విధానంలో విడుదల అయ్యింది. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ సినిమా ఆన్లైన్లో లీకైయింది. మరోవైపు ఓటీటీ యాప్‌లు డౌన్ అయ్యి సర్వర్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఆన్లైన్లో వచ్చిన పైరసీని ఆశ్రయించారు. అది తెలిసి జీ5 నిర్వహాకులు సైబర్ సెల్లో కేసు నమోదు చేశారు. అంతేగాక సల్మాన్ సైతం పైరసీ వీరులపై మండిపడుతూ.. సోషల్ మీడియా వేదికగా వారికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘కేవలం 249 రూపాయలకే మా సినిమా రాధేను ఓటీటీలో అందుబాటులో ఉంచాం. అయినప్పటికీ సినిమాను మీరు పైరసీ చేయడం చట్టరిత్యా నేరం. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఈ అక్రమ సైట్ల నిర్వహకులతో పాటు, వాటిని వినియోగించిన వారిపై సైతం సైబర్ సెల్ చర్యలు తీసుకుంటుంది. సైబర్ సెల్‌తో మీకు ఇబ్బందులు తప్పవు. పైరసీని ఎవరూ ప్రోత్సహించకండి. దయచేసి అర్థం చేసుకోండి’ అంటూ సల్మాన్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా సినిమాకు విడుదల ముందే సల్మాన్ మూవీని ఎలాంటి పైరసీలకు యత్నించకుండా సరైన వేదికలపైనే మూవీని ఆస్వాధించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. సల్మాన్ సరసన దిశా పటానీ ‘రాధే’లో సందడి చేసింది. pic.twitter.com/bPob7gFKMj — Salman Khan (@BeingSalmanKhan) May 15, 2021 -
Salman Khan: ‘రాధే’మూవీ ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతంటే..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టించిన తాజా సినిమా 'రాధే'. ఈద్ కానుకగా ఈ సినిమా గురువారం నాడు(మే 13న) విడుదలైంది. అయితే ఈ సినిమాను కరోనా కారణంగా థియేటర్స్ తో పాటు, జీప్లెక్స్ ద్వారా జీ5 ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యే ప్రయత్నం చేయడంతో ఈ ఓటీటీ సర్వర్లు.. స్తంభించిపోయాయి. రికార్డు వ్యూస్ సాధించిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 4.5 మిలియన్ హిట్స్ సాధించినట్లుగా జి ఫైవ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఒక చరిత్ర అని వాళ్ళు తమ అధికారిక ఖాతాల్లో పేర్కొన్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ‘రాధే’ మంచి వసూళ్లనే రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.39 కోట్లను రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి రోజున ఆస్ట్రేలియాలో 35 లక్షల రూపాయలు, న్యూజిలాండ్‌లో 7 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక గల్ఫ్ దేశాల్లో తొలి వారాంతానికి ఈ చిత్రం రూ.7.3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్‌డే కలెక్షన్లను కరోనాపై పోరు చేస్తున్న స్వచ్ఛంధ సంస్థలకు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అదీ సల్లు భాయ్ రేంజ్.. ‘రాధే’ దెబ్బకు సర్వర్ క్రాష్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సల్లుభాయ్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు బాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంటుంది. రికార్డులు బద్దలవుతాయి. అయితే సల్మాన్ స్టామినా కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు ఓటీటీలోనూ తనకు సాటిలేదని చాటి చెప్పారు. ఆయన తాజాగా నటించిన ‘రాధే’ సినిమా ఈద్ కానుకగా గురువారం (మే 13)విడుదలైంది. కరోనా కారణంగా థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలోనూ విడుదల చేశారు. కరోనా భయంతో జానాలు థియేటర్లకు వెళ్లి చూడలేదు కానీ, ఓటీటీలో చూసేందుకు మాత్రం ఎగబడ్డారు. ఈ సినిమాను మేకర్స్ ఓటీటీ జీ5, జీప్లెక్స్ల్లో విడుదల చేశారు. దీంతో గురువారం సల్మాన్ ఖాన్ అభిమానులు పెద్ద ఎత్తున జీ5, జీప్లెక్స్ లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో సర్వర్ క్రాష్ అయ్యింది. అయితే.. సర్వర్లు ఆగిపోవడానికి గల కారణాలు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్విటర్లో పేర్కొంది. కొంత సమయం తర్వాత సర్వర్లు యధావిధిగా పని చేయడంతో ప్రేక్షకులు సినిమాను ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించారు. ‘రాధే సినిమాపై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్లో జీ5 తెలిపింది. -
వారిని క్షమాపణలు కోరిన సల్మాన్ ఖాన్
కరోనా కారణంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. రేపు(మే 13) ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా, థియేటర్ల యాజమాన్యాలతో నిన్న(మంగళవారం) సల్మాన్ జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భాయిజాన్ ఎగ్జిబిటర్లను క్షమాపణలు కోరాడట. ఎందుకంటే రాధే మూవీ ఎట్టి పరిస్థితుల్లోనైనా థియేటర్లలోనే విడుదల చేయాలని గతేడాది ఎగ్జిబిటర్ల సమాఖ్య ఆయనను కలిసి విన్నవించుకోగా సరే అని ఆయన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికి కరోనా కారణంగా భాయిజాన్ వారికిచ్చిన మాట తప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్ క్షమాపణలు కోరుతూ.. ‘థియేటర్లలో విడుదల చేయాలని చాలా కాలం ఎదురు చూశాం. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాకపోపోగా రోజురోజు ఇంకా పరిస్థితి దిగజారుతోంది. అందువల్లే రాధేను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ వివరించాడు. అంతేగాక ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడం వల్ల ఇండియా థియేట్రికల్ రెవెన్యూ మొత్తం జీరో అయిపోయిందని తెలుసు, కానీ తప్పడం లేదంటూ విచారణ వ్యక్తం చేశాడు. అదే విధంగా సల్మాన్ తన అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. పలు అభిమాన సంఘాలు రాధే మూవీ కోసం ఆడిటోరియాలను బుక్ చేసుకుని ప్రైవేటు స్రీనింగ్‌లో చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని సల్మాన్ వ్యతిరేకిస్తు కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఇలా గుంపులుగా సినిమా చూడటం సరైంది కాదని, దీనికి తాను బాధ్యత వహించాల్సి ఉందటుందని హెచ్చరించాడు. కాగా ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడి దిశా పటానీ నటించింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసి సిటీమార్ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ‘రాధే’ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. -
ఆదాయం... సహాయం
‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్ర నిర్మాతలు ఆదర్శనీయమైన ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా విడుదల ద్వారా లభించే ఆదాయంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితుల వైద్య సేవలకు వినియోగించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘గివ్ ఇండియా’ సంస్థతో అసోసియేట్ అయి, కోవిడ్ బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్ వంటి పరికరాల కొనుగోలుకు తాము సహాయం చేస్తున్నట్లు ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు సోహైల్ ఖాన్, బావ అతుల్ అగ్నిహోత్రి, నిఖిల్ నిర్మించారు. ఈ సినిమా విడుదల హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. ‘‘ఈ నెల 13న మల్టీ ప్లాట్‌ఫామ్స్ (ఓటీటీ, డీటీహెచ్ ఆపరేటర్స్, థియేటర్స్...)లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు ఆదాయం వస్తే అందులో కొంత కోవిడ్ బాధితుల సహాయార్థం వినియోగిస్తాం. కోవిడ్ బాధితుల కోసం మరింతమంది సహాయం చేయాల్సిన అవసరం ఉంది’’ అని జీ స్టూడియోస్ ప్రతినిధులు వెల్లడించారు. -
సల్మాన్ ‘రాధే’కు పోటీయే లేదు.. ‘సత్యమేవ జయతే 2’ వాయిదా
సాధారణంగా ఈద్ పండుగ అంటే బాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి మాములుగా ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది బాలీవుడ్లో పెద్ద చిత్రాలేవీ రాలేదు. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఓ సినిమాను విడుదల చేసే సల్మాన్ ఖాన్ సైతం గత ఏడాది ఖాళీగా ఉన్నాడు. ఇక ఈ సారి ఏదేమైనా ఈద్‌కి వచ్చేస్తానని ప్రకటించాడు సల్మాన్. అన్నట్లుగానే ఈద్ సందర్భంగా తన లేటెస్ట్ సినిమా ‘రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ని మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలలో కూడా విడుదల చేయనున్నాడు. మరోవైపు జాన్ అబ్రహం ’సత్యమేవ జయతే 2' కూడా అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహంకి, సల్మాన్‌కి మధ్య వార్ తప్పదని భావించారు అంతా. కానీ జాన్ అబ్రహం ఒక అడుగు వెనక్కి వేశాడు. తన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. అందువల్ల మా సత్యమేవ జయతే సినిమాను వాయిదా వేస్తాం. తర్వాత రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’ అంటూ 'సత్యమేవ జయతే2' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. దీంతో ఒక్క ‘రాధే’ తప్ప, ఇతర సినిమాలేవి థియేటర్లలో విడుదల కావడంలేదు. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలు కూడా తాజా సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్సేన్ 'పాగల్' సినివాలు కూడా వాయిదాపడ్డాయి. -
మొదటిసారి హీరోయిన్‌కు ముద్దు పెట్టిన సల్మాన్‌ఖాన్
ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో రాధే సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యారు సల్లూ భాయ్. ప్రభుదువా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇందులో సల్మాన్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాదారణంగా ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే సల్మాన్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 32 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క హీరోయిన్‌తోనూ ముద్దు సీన్లో నటించలేదు. అలాంటిది రాధే ట్రైలర్లో హీరోయిన్ దిశా పటానీతో సల్మాన్ లిప్‌లాక్ సీన్ చూసిన ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గతంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు..తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా అనిపిస్తుందని సల్మాన్ బదులిచ్చాడు. దీంతో సల్మాన్ ఇవన్నీ ఆఫ్-స్క్రీన్‌లో చేస్తుంటాడు కాబట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అవసరం లేదని ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 33 ఏళ్లుగా ఉన్న కండీషన్స్‌ని దిశా కోసం సల్మాన్ పక్కన పెట్టేశారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి : అల్లు అర్జున్ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్! జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి -
అల్లు అర్జున్ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే. గతేడాది విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రంజాన్ కానుకగా మే 13న రాధే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇక సినిమాలో తనకు నచ్చినట్లు వ్యవహరించే రౌడీ పోలీస్ పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడు. దిశాపటాని హీరోయిన్గా కనిపించనుంది. రణదీప్ హుడా పవర్ఫుల్ విలన్‌గా సల్మాన్‌ను ఢీ కొట్టనున్నాడు. తాజాగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలిజ్ చేశారు. ఈ ట్రైలర్లో చేజింగ్‌లు, భారీ యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాను అంతం చేసే పోలీస్ ఆఫీసర్ స్టోరీని ప్రభుదేవా పక్కా మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు. అయితే ట్రైలర్‌పై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటీమార్ పాటను రాధే చిత్రయూనిట్ కాపీ కొట్టిందని మండిపడుతున్నారు. సల్మాన్, దిశా కనిపించే ఓ పాటలో పూర్తిగా బన్నీ స్టైల్లో భాయ్‌జాన్ స్టెప్పులు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీని కాపీ కొట్టిన సల్మాన్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక అల్లు అర్జున్ స్టెప్పులను సల్మాన్ కాపీ కొట్టారంటే మన హీరో రేంజ్ వేరు అని బన్నీ అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు! Why is #seetimaar in #RadheTrailer !!?? — Great_Indian (@Since_01999) April 22, 2021 #Seetimaar song in #radhe?....south ke film ke saath gaane bhi copy karre hain😂 — NeedKane (@messagebabu) April 22, 2021 @alluarjun bhai bollywood ke taraf se sorry 😭#RadheTrailer #SeetiMaar — Sunny (@TheAce1kka) April 22, 2021 After listening to #Seetimaar song In #RadheTrailer @alluarjun - Yeh toh mera wala gaana hai 😂#RadheTrailer #DJ #AlluArjun #SalmanKhan #Pushpa pic.twitter.com/oK6hYGz6VU — Muthayyab Ali™️ (@immali14) April 22, 2021 -
స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి!
‘రాధే’ అనుకున్నట్టుగానే రంజాన్‌కు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఈ నెల 13న ఒకేసారి ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చినా ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. ముంబయ్‌లో థియేటర్స్ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
సల్మాన్ బ్యాడ్‌లక్.. ఈ ఏడాది కూడా లేనట్లే
‘రాధే’ రావడం మరోసారి వాయిదా పడ్డట్లేనని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. గత ఏడాది ఈద్‌కు విడుదల కావాల్సిన ‘రాధే’ సినిమా అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రంజాన్‌కు రావడానికి రెడీ అయింది. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను చిత్రబృందం మరోసారి వాయిదా వేసిందని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ‘రాధే’ సినిమా ఈ రంజాన్ కు విడుదల కాకపోతే బక్రీద్ సందర్భంగా జూలై 21న విడుదలవుతుందని బాలీవుడ్లో ప్రచారం సాగింది. కానీ మహారాష్ట్రలో థియేటర్స్ మూసివేత, ఢిల్లీ థియేటర్లలో ముపై శాతం సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో ‘రాధే’ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాకూడదని అనుకుంటున్నారట నిర్మాతలు. గత ఏడాది వచ్చిన 200 కోట్ల ఓటీటీ ఆఫర్ వద్దనుకుని పంపిణీదారులు, థియేటర్ అధినేతల విజ్ఞప్తుల మేరకు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని సల్మాన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. ‘రాధే’ ఓటీటీకి వచ్చే అవకాశం లేదు. మరి.. తాజా పరిస్థితుల దృష్ట్యా చిత్రనిర్మాతలు మనసు మార్చుకుంటారేమో చూడాలి. -
సల్మాన్ వర్సెస్ జాన్
సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్’ రంజాన్ సందర్భంగా మే 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే రోజు రావడానికి జాన్ అబ్రహామ్ రెడీ అయ్యారు. మూడేళ్ల క్రితం జాన్ అబ్రహామ్ హీరోగా మిలాప్ ఝవేరీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘సత్యమేవ జయతే 2’ రంజాన్ రిలీజ్‌కి రెడీ అయింది. మే 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో జాన్ అబ్రహామ్ రెండు పాత్రలు చేశారు. సినిమాలో జాన్ వర్సెస్ జాన్ అయితే బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ వర్సెస్ జాన్ అనాలి. రంజాన్ సల్మాన్‌కి కలిసొచ్చే పండగ. ఈ సీజన్లో విడుదలైన సల్మాన్ సినిమాలు ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘కిక్’, ‘బజరంగీ భాయీజాన్’, ‘సుల్తాన్’ వంటివి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించాయి. ‘రాధే’ కూడా ఈ హిట్ లిస్ట్‌లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘సత్యమేవ జయతే 2’ని కూడా తక్కువ చేయడానికి లేదు. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలూ హిట్టవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక అభిమానులంటారా? తమ అభిమాన హీరో సినిమానే హిట్టవ్వాలని కోరుకోవడం సహజం. ఏది ఏమైనా ‘సల్మాన్ వర్సెస్ జాన్’ అనేది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
సల్మాన్, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా, దిశా పటానీ, జాకీ ష్రాఫ్, జరీనా వహాబ్ కీలక పాత్రలు చేశారు. ‘‘సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాలు రంజాన్‌కు విడుదలై సూపర్‌హిట్ సాధించాయి. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కూడా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సల్మాన్, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్. ఈ ఫైట్‌ను ఓ కొరియన్ స్టంట్ టీమ్ డిజైన్ చేసింది. సల్మాన్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఓ యాక్షన్ ట్రీట్’’ అని చిత్రబృందం పేర్కొంది. నిజానికి ఈ సినిమా 2020 ఈద్‌కు విడుదల కావాల్సింది. కానీ కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్ల అభ్యర్థనల మేరకు సల్మాన్ ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో సల్మాన్ సినిమా థియేటర్స్‌లోకి వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. -
క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్
'రండి బాబూ రండి, విచ్చేయండి..' అని ఆహ్వానం పలుకుతున్నా చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలతో కిటకిటలాడే సినిమా హాళ్లు ఇలా బోసిగా కనిపించడంతో థియేటర్ యాజమాన్యానికి గుబులు పట్టుకుంది. ఏదైనా పెద్ద సినిమా వస్తే జనాలు వాళ్లంతట వాళ్లే థియేటర్లకు వస్తారని బాలీవుడ్ థియేటర్ యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'ను థియేటర్లలోనే విడుదల చేయమంటూ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆమధ్య లేఖ రాసింది. కష్టసమయంలో థియేటర్స్ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని, ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్ అని 2021 ప్రారంభంలోనే సల్మాన్‌ని కోరారు. (చదవండి: హనీమూన్‌కు వెళ్లిన బిగ్‌బాస్ నటి) ఈ విన్నపానికి ఎట్టకేలకు సల్లూభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "ఈ నిర్ణయం తీసుకోడానికి ఇంత కాలం తీసుకున్నందుకు క్షమించాలి. ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లు చవిచూస్తున్న గడ్డు పరిస్థితుల గురించి నాకు తెలుసు. ఈ కష్టకాలంలో రాధేను థియేటర్లలో విడుదల చేసి వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. అయితే ఇందుకు ప్రతిఫలంగా థియేటర్లలోకి వచ్చేవారి కోసం పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ ఈద్‌కు రిలీజ్ అవుతున్న రాధేను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. నిజానికి ‘రాధే’ను జీ 5 మొత్తం రూ 230 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రిలీజ్ కోసం ఈ మొత్తానికి డీల్ కుదిరింది. కానీ థియేటర్ల యాజమానుల విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను తొలుత థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా హీరోయిన్ దిశా పటానీ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్, జరీనా వాహబ్, రణ్‌దీప్ హుడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రభుదేవా డైరెక్షన్ చేస్తున్నారు. (చదవండి: నాలుగు రోజుల్లోనే లాభాలొచ్చాయి) View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) -
సల్మాన్ ఖాన్ క్రేజ్ మామూలుగా లేదు
సల్మాన్ ఖాన్ క్రేజ్ కరోనా వచ్చినా తగ్గలేదు లాగుంది. అతడి తాజా చిత్రం ‘రాధే’ను జీ 5 మొత్తం 230 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రిలీజ్ కోసం ఈ మొత్తానికి డీల్ కుదిరింది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ మేలో రంజాన్ పండగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ‘మే 22న రిలీజ్ అనుకుంటున్నాం. ఇంకా ఫైనల్ కాలేదు. ఈ కరోనా భయం వెళ్లి అందరూ సేఫ్‌గా థియేటర్లకు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఉంటేనే రిలీజ్ చేయాలనుకుంటున్నాము. ( ఆరేళ్లకు మళ్లీ! ) అప్పటికి ఆ పరిస్థితి పోతుందని కూడా అనుకుంటున్నాము’ అన్నాడు సల్మాన్ ఖాన్. దిశా పటాని, జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. సల్మాన్ గత సినిమాలు ‘రేస్ 3’, ‘దబాంగ్ 3’, ‘భారత్’లు జీలో టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పుడు ‘రాధే’ కూడా ఈ చానల్ సొంతమైంది. -
థియేటర్స్‌లోకి రా భాయ్
ప్రస్తుతం సినిమా థియేటర్స్ పరిస్థితి కాస్త సందిగ్ధంలో ఉంది. ఏదైనా పెద్ద సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారని ఓ వాదన. ప్రేక్షకులు వచ్చేలా ఉంటేనే పెద్ద సినిమా తీసుకొద్దాం అనేది మరో వాదన. సల్మాన్ లాంటి స్టార్ సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా వస్తారని బాలీవుడ్ థియేటర్ యాజమాన్యం భావిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన తాజా మాస్ ఎంటర్టైనర్ ‘రాధే’ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ‘రాధే’ను థియేటర్స్‌లోనే విడుదల చేయమంటూ ఓ లేఖ ద్వారా కోరింది. ఇలాంటి కష్టసమయంలో థియేటర్స్ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని, సల్మాన్ చిత్రం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని, ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌కి తీసుకొచ్చే స్టామినా ఉన్న స్టార్ సల్మాన్ అనేది ఈ లేఖ సారాంశం. ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్ అని సల్మాన్‌ని కోరారు. మరి భాయ్ సినిమా థియేటర్స్‌లో వస్తుందా? వేచి చూడాలి. -
రాధే ఓటీటీకి రాదే!
సల్మాన్ ఖాన్ సూపర్ పోలీస్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టయిలిష్ ఎంటర్టైనర్లో దిశా పటానీ కథానాయిక. జాకీ ష్రాఫ్, రణ్‌దీప్ హుడ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది ఈద్ పండగకు విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ వల్ల ప్లాన్ మారింది. షూటింగ్ పూర్తి కాలేదు. థియేటర్స్ కూడా ఓపెన్ లేవు. ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేశారు. దాంతో ‘రాధే’ ఓటీటీకి వస్తుంది అనే వార్త బాగా వినబడుతోంది. కానీ ఈ వార్తలను ఖండించింది చిత్రబృందం. ‘రాధే’ ఓటీటీకి రాదని, వచ్చే ఏడాది ఈద్‌కి సల్మాన్ భాయ్ థియేటర్స్‌లోకి వస్తాడని స్పష్టం చేశారు. హిందీ మార్కెట్లో మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకొచ్చే సినిమాల్లో సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం చాలా కీలకం అని బాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. -
డ్యూటీ ముగిసింది
క్రిమినల్స్ అంతు చూడటానికి పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా మారారు సల్మాన్ ఖాన్. విజయవంతంగా డ్యూటీ పూర్తి చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ‘మోస్ట్ వాంటెడ్ భాయ్’ అన్నది ఉపశీర్షిక. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాలో స్టయిలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు సల్మాన్. లాక్డౌన్ వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఇటీవలే ముంబైలో చిత్రీకరణ ప్రారంభించారు. అనుకున్న తేదీ కంటే చిత్రీకరణ ముగిసిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్ పండగకు థియేటర్స్‌లోకి తీసుకురావాలన్నది యూనిట్ ప్లాన్ అని తెలిసింది. -
ఆటా పాటా
సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సల్మాన్ కనిపిస్తారు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా హీరోయిన్ దిశా పటానీ కూడా సెట్లో అడుగుపెట్టారు. ఓ హుషారైన గీతాన్ని సల్మాన్, దిశా మీద చిత్రీకరిస్తున్నారు. ‘‘చాలా గ్యాప్ తర్వాత సెట్లో అడుగుపెట్టాను. ఓ సూపర్ సాంగ్‌ను షూట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు దిశా. 15 రోజుల్లోగా సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను ఈ ఏడాది ఈద్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ వల్ల ఆగిపోయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుందని టాక్. -
రాదే ఓటీటీలోకి రాదు
‘‘రాధే’ చిత్రాన్ని థియేటర్స్ కోసం రూపొందించాం. ఇది థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అన్నది క్యాప్షన్. ఇందులో దిశా పటానీ కథానాయిక. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సల్మాన్ ఖాన్. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. వాటిని కొట్టి పారేశారు దర్శకుడు ప్రభుదేవా. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘‘రాధే’ చిత్రానికి సంబంధించి 3–4 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్‌కు జనాలు మళ్లీ వస్తారా లేదా అనే ఆందోళ అందరిలోనూ ఉంది. కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే స్టార్ సల్మాన్ మాత్రమే. థియేటర్స్ ఎప్పుడు తెరిస్తే అప్పుడు మా సినిమా విడుదలవుతుంది. అది దీపావళి అయినా క్రిస్మస్ అయినా రిపబ్లిక్ డే అయినా సరే’’ అన్నారు ప్రభుదేవా. -
ఈద్ కానుకగా ‘రాధే’లోని మూడో పాట విడుదల
-
అభిమానులకు సల్మాన్‌ఖాన్ ఈద్ ‘కానుక’
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకున్నాడు. ఎప్పటిలాగే ఈ రంజాన్‌కు తన తాజా సినిమా ‘రాధే’ను భాయిజాన్ విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఈ క్రమంలో భాయిజాన్ ‘రాధే’లోని భాయ్ అంటూ సాగే పాటను సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే. అభిమానులకు ఈద్ సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ‘రాధే’లోని మూడో పాటను భాయిజాన్ విడుదల చేశాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో ప్రకటిస్తూ.. ‘మొదట అందరికి ఈద్ ముబారక్. ఈ ఏడాది మహమ్మారిని ఎదుర్కోవటానికి మనందరికి బలం చేకూరాలని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. (అయ్యో ఈ సారి భాయిజాన్ సినిమా లేదే!) అంతేగాక ‘‘ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది ఈద్‌కు నా సినిమాను విడుదల చేయలేకపోయాము. కాబట్టి నా ప్రియమైన అభిమానులందరి కోసం ఈ పాటను ప్రత్యేకంగా రూపోందించాం. మనమంతా సోదర భావం, ఐక్యతగా ఉండాలనే భావనతో భాయ్ అని పిలుచుకుంటాము. దీనికి గుర్తింపుగా ‘భాయ్ భాయ్’ పాటను ఈద్ ప్రత్యేక రోజును ఉత్తమంగా భావించి విడుదల చేశాం. దీనిని మీరంతా తప్పకుండా ఆనందిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా భాయిజాన్ గత కొన్నేళ్లుగా ప్రతి రంజాన్‌కు తన కొత్త సినిమాను విడుదల చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా విడుదలైన భాయిజాన్ సినిమాలన్ని ఘన విజయం సాధించి భారీ కలెక్షన్లను రాబట్టాయి. అదే విధంగా 2020 ఈద్‌కు కూడా తన ‘రాధే సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. (కరోనా : సల్మాన్ కొత్త బ్రాండ్ లాంచ్) -
రాధే.. రారాదే
కరోనా దెబ్బకు బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీసు లెక్కలు, విడుదల తేదీలు గాడి తప్పాయి. ఇప్పటికే అక్షయ్‌కుమార్ ‘సూర్యవన్షీ’, రణ్‌వీర్‌సింగ్ ‘83’ వంటి సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ రంజాన్ పండక్కి విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతుందనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క 2013లో తప్ప 2009 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది ‘వాటెండ్’ (2009), ‘దబాంగ్’ (2010), ‘బాడీగార్డ్’ (2011), ‘ఏక్తా టైగర్’ (2012), ‘కిక్’ (2014), ‘భజరంగీ భాయిజాన్ ’ (2015), ‘సుల్తాన్’ (2016), ‘ట్యూబ్‌లైట్’ (2017), ‘రేస్ 3’ (2018), ‘భారత్’ (2019)) సల్మాన్ ఖాన్ సినిమాలు రంజాన్ పండక్కి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇప్పుడు సల్మాన్ నటిస్తున్న ‘రాధే...’ విడుదల వాయిదా పడటంతో సల్మాన్ అభిమానులు రంజాన్‌కి భాయ్ రాడేమోనని బాధపడుతున్నారు. ‘రాధే... రారాదే’ అనుకుంటున్నారు. మరి.. పండక్కి భాయ్ వస్తాడా? చూడాలి.