Raebareli
-
పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆగడంలేదు. తాజాగా ఇటువంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు.ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ డంపర్ నుండి రైల్వే ట్రాక్‌పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తరువాత రైలు ముందుకు సాగిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దీనిలోభాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతున్నదన్నారు. ఈ నేపధ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్‌పై పోసి అక్కడినుంచి పరారయ్యాడన్నారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్లో వచ్చిందన్నారు. అయితే ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్‌పై మట్టిని గమనించి, రైలును ఆపాడని దేవేంద్ర భడోరియా తెలిపారు. లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, రైల్వే ట్రాక్‌పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు కదిలిందన్నారు. ఈ సమయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్మెన్ శివేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉన్నకారణంగానే ప్రమాదం తప్పిందని, ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేదన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి -
చేతిలో రాజ్యాంగం.. ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం
కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం .. తొలి 18వ లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. చిన్న రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్‌లో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. చివరలో జైహింద్, జై సంవిధాన్ అని నినదించారు. ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్.. రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేసి విజయం సాధించారు. అనంతరం ఆయన వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో నిలవనున్నారు.ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు. -
‘మోదీజీ వారి ఆర్తనాదాలు వినపడడం లేదా’.. రాహుల్ ఆగ్రహం
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విజయోత్సవాలతో బిజీగా ఉన్న మోదీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు వినడం లేదని మండిపడ్డారు. గత మూడు రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోని రియాసి, కతువా, దోడాలో మూడు వేర్వేరు ఉగ్రవాద దాడులు జరిగాయి. అయినప్పటికీ మోదీ ఎన్డీయే ఎన్నికల విజయోత్సవాలతో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.ఇటీవలి ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ (కేరళ)తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్‌బరేలీ (యూపీ)లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తనను మరో సారి ఎన్నుకున్నందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కేరళలోని వాయనాడ్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదో సమాధానం చెప్పాలని దేశం డిమాండ్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.మేనిఫెస్టోకి అనుగుణంగా పేదలకు, రైతులకు కాంగ్రెస్ పనిచేస్తోందన్న రాహుల్ మా పని ఇప్పుడే ప్రారంభమైంది. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సూచించారు. ప్రేమ ద్వేషాన్ని ఓడించింది..వినయం అహంకారాన్ని ఓడించిందిప్రేమ ద్వేషాన్ని ఓడించింది..వినయం అహంకారాన్ని ఓడించింది. అదానీ,అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేసే విచిత్రమైన పరమాత్మ మోదీ. నా దేవుళ్లు పేద ప్రజలే, నా దేవుళ్లు వాయనాడ్ ప్రజలే మీరు నాకు ఏమి చెబితే అది చేస్తాను అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
‘‘వయనాడ్, రాయ్‌బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్‌బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్‌బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారనే దానిపై ఉత్కంఠ
-
రాహుల్ గాంధీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ
రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు?.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇదే. కేరళ వయనాడ్‌తో పాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారాయన. అయితే టెక్నికల్‌గా ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన దేని వదులుకుంటారు? దేనికి పరిమితం అవుతారు? అనే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అనూహ్యంగా అమేథీ నుంచి ఓడి, వయనాడ్ నుంచి నెగ్గారు. ఈసారి కూడా తొలుత అక్కడి నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉండటంతోపాటు.. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశాయి. ఇక బీజేపీ, వామపక్ష పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఏకంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ దిగారు. ఉత్తర భారతానికి చెందిన రాహుల్ అసలు వయనాడ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అయినా కూడా వయనాడ్ నుంచి రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు.ఇక.. రాయ్‌బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియాగాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్.. భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాహుల్ రాయ్‌బరేలీని వదులుకుంటే అక్కడ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదనే వాదనా ఉంది. అయితే ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాత్రం ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని ఒక మాటైతే అన్నారు. దీంతో అది రాయ్‌బరేలీ కావొచ్చనే ఊహాగానాలు తెర మీదకొచ్చాయి. -
కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ.. రెండు నియోజర్గాలో పార్టీ విజయ ఢంకా మోగించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మేజార్టీతో గెలుపొందారు. ఇటు అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి బొల్తా కొట్టారు. దాదాపు 1.50 లక్షల ఓట్ల తేడాతో కిషోర్ లాల్ శర్మ చేతిలో చిత్తుగా ఓడారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీని తిరిగి చేజిక్కించుకుంది.కిషోరీ లాల్ గెలుపుతో తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. పార్టీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ గెలుపు విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు’ అని రాసుకొచ్చారు.किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024 -
రాయ్‌బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్ శర్మ బరిలో నిలిచారు. లోక్‌సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.తాజాగా లోక్‌సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.‘నేను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.తోబుట్టువులిద్దరూ(రాహుల్, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.పార్లమెంట్ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. అదే విధంగా అమేథీ నుంచి రాహుల్ ఓటమి భయంతో పారిపోయారంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్‌కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్‌లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు. -
ఇస్మార్ట్ రాహుల్ గాంధీ
-
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విస్ట్ ఇచ్చారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన.. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కాసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటే1952లో రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఫిరోజ్ గాంధీ(రాజీవ్ గాంధీ తండ్రి) ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్ నారాయణ్ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్ నెహ్రూ, షీలా కౌల్ కాంగ్రెస్ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్ సింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదు పర్యాయాలు(2006 ఉప ఎన్నికతో సహా) సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ వచ్చారు. ఇంకోవైపు ఈ రెండు లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్ బరేలీ ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆయన దేని నుంచి పోటీ చేస్తారు?.. అసలు ఆయన ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలకు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరుండేది. అమేథీలో రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అదే ఎన్నికలో కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే..క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి ఆయన దూరం జరిగారు. కేవలం వయనాడ్ నుంచి మాత్రమే ఆయన నామినేషన్ వేశారు. ఇదే అదనుగా.. పోటీ చేయడానికి రాహుల్ జంకుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. దీంతో బీజేపీ విమర్శలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. రాహుల్ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి చేరుకుంది.మరోవైపు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం దేశం మొత్తం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వివరించే యత్నం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో.. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థిపైనా ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నిక సహా ఐదుసార్లు ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానంలో ఆమె తనయ, ఏఐసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అన్నాచెల్లెళ్లతో వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోటీకి ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీకి రాహుల్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల నామినేషన్ల దాఖలుకు ఇవాళే ఆఖరు తేదీ. దీంతో భారీ ర్యాలీగా రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఐదో ఫేజ్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ, అమోథీ లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి (సీఈసీ) తెరదించింది.24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్‌సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు -
రాయ్‌బరేలీ నుంచి రాహుల్? ప్రియాంకపై వీడని ఉత్కంఠ?
యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ ఎవరిని ఎన్నికల బరిలోకి దింపుతున్నదనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్త తాజాగా వినిపిస్తోంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని ఎన్నికల పోరులో నిలబెట్టే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని కూడా అంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఆరాధన మిశ్రా అధినాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథీ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా రెండు దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కొద్దిసేపటిలో కాంగ్రెస్ అమెథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. దీంతో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. -
రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. ప్రియాంకపై పోటీకి నో
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోది. అయితే ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కానీ పార్టీ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీపై పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. కాగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా రాయ్‌బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా కాంగ్రెస్ నుంచి యాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. రాయ్‌బరేలీ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రియాంక బరిలో దిగనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబిత్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరణకు గురైన వరుణ్ గాంధీ.. రాయ్‌బరేలి నుంచి పోటీకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ విషయంపై వరుణ్‌ను సంప్రదించగా.. ఆయన నిరాసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ‘గాంధీ వర్సెస్ గాంధీ’ పోటీ ఉండటం తనకు నచ్చకపోవడంతో రాయ్‌బరేలీ పోరు నుంచి తప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రాయ్‌బరేలీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కుమార్ విశ్వాస్?
కాంగ్రెస్‌లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఈసారి బ్రాహ్మణ అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నదని సమాచారం. ఈ నేపధ్యంలో బీజేపీ అభ్యర్థులుగా కుమార్ విశ్వాస్, బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే పేర్లు వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, అమేథీలను యూపీలో కాంగ్రెస్‌కు కంచుకోటలుగా పరిగణిస్తారు. అయితే 2019లో అమేథీ నుంచి బీజేపీ తన అభ్యర్థిగా స్మృతి ఇరానీని పోటీకి దింపి, కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టింది. రాయ్‌బరేలీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ గత రెండేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదేస్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ రాయ్‌బరేలీ నుంచి ప్రముఖుడిని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. కుమార్ విశ్వాస్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై అమేథీ నుంచి పోటీ చేశారు. విశ్వాస్ను ఎన్నికల్లో దింపడం ద్వారా బలమైన పోటీ ఇవ్వవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుమార్ విశ్వాస్ ప్రసంగం ఆయన బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని సూచనలిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ద్వారకలో పర్యటించినప్పుడు ఆయనను కుమార్ విశ్వాస్ ప్రశంసించారు. -
ప్రియుడితో సంబంధం.. కూతురు అడ్డుగా ఉందని...
రాయ్‌బరేలి: కామంతో కళ్లు మూసుకుని రక్త సంబంధాలు మర్చిపోతున్నారు కొందరు. ఆ సమయంలో ఏం చేస్తున్నారో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగిన వారికన్నా కామం మత్తు మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తమ కోరికకలకు అడ్డుగా ఉన్నారని భావిస్తే ఎవరినైనా హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉందని భావించి తన కూతురును కన్నతల్లి చంపేసుకుంది. అనంతరం మృతదేహాన్ని బావిలోకి పడేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగింది. రాయ్‌బరేలీలోని దాల్మయి కోట్వాలీ మండలం సుర్సానా గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ భార్య, కూతురు (5)తో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా భార్య కూతురును తీసుకుని పుట్టింటికి వచ్చింది. పండుగ అనంతరం ఆమె తిరిగి రాలేదు. అనంతరం ఆమె అదృశ్యమైంది. ఆమె కోసం గాలిస్తుండగా ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు. ఆమె తన ప్రియుడితో కలిసి పక్క ఊరిలో ఒక ఇంట్లో ఉంటోందని తెలిసింది. దీంతో భర్త వెంటనే అక్కడకు వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కూతురి విషయం అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేదు. కుటుంబసభ్యులు అంతటా గాలించారు పాప ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో బావిలో బాలిక మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకుని మృతదేహం బయటకు తీయగా బాలిక కనిపించింది. వివరాలు సేకరించి బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తానే బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు.. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు బావిలో పడేసినట్లు చెప్పింది. దీంతో భర్త, ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే ప్రియుడితో పాటు ఆమెను జైలుకు తరలించారు. -
ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే!
లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితిసింగ్ బుధవారం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరై.. కాంగ్రెస్ వర్గాలను విస్మయ పరిచారు. విపక్షాలన్నీ ఉమ్మడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించాయి. మరోవైపు యూపీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ లక్నోలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి డుమ్మా కొట్టి మరీ అదితి సింగ్ అసెంబ్లీకి హాజరుకావడం గమనార్హం. అదితి సింగ్ రాయ్‌బరేలి జిల్లా ఎమ్మెల్యే. ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నది. అదితి తండ్రి అఖిలేశ్ సింగ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. అదితి కూడా ప్రియాంక సన్నిహిత అనుచరురాలుగా ఇన్నాళ్లు కొనసాగారు. కానీ, బుధవారం అనూహ్యంగా ఆమె ప్రియాంక ర్యాలీకి గైర్హాజరై.. అసెంబ్లీకి హాజరు కావడం కాంగ్రెస్ వర్గాలకు షాక్ ఇచ్చింది. అదితి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని, ఈ క్రమంలో యోగి సర్కారు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరయ్యారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తాను బీజేపీలో చేరతున్నట్టు వస్తున్న కథనాలను అతిది సింగ్ కొట్టిపారేశారు. -
పామును చేతిలో పట్టుకున్న ప్రియాంకగాంధీ
రాయ్‌బరేలి: ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలిలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకగాంధీ.. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ.. వారి గురించి అడిగి తెలుసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, అందరి అభ్యున్నతికి కృషిచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆమె రాయ్‌బరేలిలో పాములు ఆడించేవారిని కలుసుకొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు.. పాములను ఆమెకు చూపించగా.. ఆమె ఒక పామును చేతిలో పట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందన్న ఎస్పీ, బీఎస్పీ విమర్శలను ఆమె తిప్పికొట్టారు. కాంగ్రెస్, బీజేపీ భావజాలాలు పూర్తి విరుద్ధమైనవని, బీజేపీతో తామే పోరాడుతున్నామని, రాజకీయాల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా గతంలో బలహీన అభ్యర్థుల్ని యూపీలో బరిలోకి దించామన్న ప్రియాంక మాట మార్చారు. బీజేపీపై గట్టిగా పోరాడేందుకు బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపామని, ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ విధమైన లబ్ధి చేకూరకుండా చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు. -
స్త్రీలోక సంచారం
►వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ మళ్లీ అమేధీ నుంచే పోటీ చెయ్యొచ్చని తెలుస్తోంది కానీ, ఆయన తల్లి, యు.పి.ఎ. చైర్పర్సన్ సోనియా గాంధీ అసలు ఈసారి ఎన్నికల్లో నిలబడతారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ సోనియా 2019 ఎన్నికలకు దూరంగా ఉంటే కనుక ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి ఆమె కూతురు ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రియాంక ఆసక్తి చూపుతారా అనేది మరో ప్రశ్న. ►వంట చెయ్యడం రాదని, ఇంటి పనులు సరిగా చెయ్యడం లేదని భర్త భార్యను తిట్టడం ఆమెను అవమానించడం అవదని 17 ఏళ్ల నాటి ఒక గృహిణి ఆత్మహత్య కేసులో ముంబై హైకోర్టు తీర్పు చెబుతూ, ఆ భర్తని, అత్తమామల్ని కింది కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సమర్థించింది. 2001 జూన్ 5 నాటి ఆ ఆత్మహత్య అనంతరం భర్త విజయ్ షిండేపై భార్య పుట్టింటి వారు కేసు పెడుతూ.. వంట బాగోలేదనీ, ఇంటిని శుభ్రంగా ఉంచడం లేదని అల్లుడు, అత్తమామలు తమ కూతుర్ని తరచు తిడుతున్న కారణంగానే ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుందని చేసిన ఆరోపణలపై ఇన్నేళ్లపాటు జరిగిన వాదోపవాదాలలో విజయ్‌కి వేరొక స్త్రీతో సంబంధం ఉందన్న కోణం కూడా ఉంది. ►రోగుల సేవలకు మరింతగా బాధ్యులను చేయడానికి, వృత్తిపరమైన అవకతవకల్ని నివారించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే నర్సులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సెప్టెంబరులో ‘నర్సింగ్ యునీక్ ఐ.డి. (ఎన్.యు.ఐ.డి) లను ఇవ్వబోతోంది. నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖలోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో తీసుకున్న ఈ కార్డుల జారీ ప్రయోజనాల గురించి నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు టి. దిలీప్ కుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డికి వివరించిన అనంతరం దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడింది. ►జపాన్ గ్రాఫిక్ డిజైనర్ తనాగో అకీకో డిజైన్ చేసిన ఫ్యాన్ హ్యాండ్‌బ్యాగ్ నమూనా టోక్యో సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శనలో మహిళలను అమితంగా ఆకట్టుకుంటోంది. హ్యాండ్‌బ్యాగ్ వెలుపల అమర్చిన ఫ్యాను.. బయటి వాతావరణంలోని వేడిమిలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి ఆ సమాచారాన్ని అందిస్తుందని అకీకో చెబుతున్న పాయింట్ కన్నా కూడా.. బ్యాగ్ డిజైనే ప్రదర్శనకు వస్తున్న మగువల్ని ఎక్కుగా ఆకర్షిస్తోంది. ►భర్త అడుగుజాడల్లో నడవటం అటుంచి, భర్త అడుగుజాడల్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలనియా మళ్లీ మరొకసారి.. భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ సి.ఎన్.ఎన్. టీవీ ఇంటర్వ్యూలో ‘మనల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్న మనిషి’ అని తనను విమర్శించడంపై ట్రంప్ స్పందిస్తూ, ‘బుద్ధిమాంద్యపు వ్యాఖ్యాత డాన్ లెమన్.. లెబ్రాన్ జేమ్స్‌ని ఇంటర్వ్యూ చేయడం చూశాను. లెబ్రాన్ ఏబ్రాసీ ముఖాన్ని అందంగా చూపించడానికి అతడు చాలా ప్రయత్నించినట్లు ఉన్నాడు’ అని అన్న కొద్ది గంటల్లోనే... ‘భావి తరాలకు ఉపయోగపడేలా జేమ్స్ అనేక మంచి పనులు చేస్తున్నాడు’ అని మెలనియా ఒక ప్రకటన విడుదల చేసినట్లు సి.ఎన్.ఎన్. వెల్లడించింది. ►ముజఫర్రూర్లోని బాలికల ప్రభుత్వ ఆశ్రయ గృహంలో 34 మంది మైనర్ బాలికలపై అమానుషమైన అనేక లైంగిక అకృత్యాలు జరిగినట్లుగా వస్తున్న వార్తలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మలీవాల్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. బాధిత బాలికలు మొదట ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకునేలా వారిపై ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నందున వారికి గట్టి భద్రతను కల్పించాలని ఆ లేఖలో ప్రధానంగా విజ్ఞప్తి చేయడంతో పాటు.. వారిని స్కూళ్లకు, కౌనెల్సింగ్కు పంపే విషయమై శ్రద్ధ వహించాలని స్వాతి కోరారు. ►ఈ ఏడాది డిసెంబరులో జరుగునున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా.. నలభై రోజుల ‘రాజస్థాన్ గౌరవ యాత్ర’ ప్రారంభించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలి రోజు బహిరంగ సభలో.. తన ప్రభుత్వం మహిళలకు, యువతకు, రైతులకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. అలాగే, ‘మేము మీతో ఉన్నాం : బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు’ అనే నినాదంతో రాజే మహిళలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ► ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసిన ‘కాస్టింగ్ కౌచ్’ దారుణాల గురించి విన్నాక హాలీవుడ్ మీద తనకు గౌరవం పోయిందని అంటూ.. హాలీవుడ్ తన పాపాలకు పశ్చాత్తాపం చెంది, పూర్తిగా ప్రక్షాళన చెందాకే అటువైపు చూసేందుకు సాహసిస్తానని బ్రిటిష్ టీవీ ప్రెజెంటర్, నటి, మోడల్ జమీలా అలియా జమీల్ ‘గార్డియన్’కి ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అవసరమైతే నా కెరీర్నైనా నాశనం చేసుకుంటాను కానీ, హాలీవుడ్‌కి వెళ్లి నేను నాశనం కాను’ అని కూడా ఆమె అన్నారు! -
రాయ్‌బరేలీ ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీ పెళ్లి!
రాయ్‌బరేలీ: సొంత పార్టీకే చెందిన యువ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం ఖరారైందంటూ నకిలీ వార్తలు గుప్పుమన్నాయి. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్, రాహుల్‌ల పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయని, మే నెలలోనే పెళ్లి తంతు పూర్తవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కీలకమైన కర్ణాటక ఎన్నికల పోలింగ్ ఉండనుండటంతో రాజకీయం వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కాగా, పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితి ఘాటుగా స్పందించారు. నేను రాఖీ కట్టే అన్నయ్య: ‘‘రాహుల్ గాంధీ నాకు పెద్దన్నలాంటి వారు. రాఖీ కూడా కడతాను. అలాంటిది మా ఇద్దరికీ పెళ్లా? అసలు ఇలాంటి ప్రచారం సాగడం నిజంగా బాధాకరం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చూసినప్పుడు మనసుకు కష్టంగా అనిపిస్తుంది’’ అని ఎమ్మెల్యే అదితి సింగ్ మీడియాతో అన్నారు. ప్రియాంకకు చాలా క్లోజ్: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 29 ఏళ్ల అదితి సింగ్‌ది ప్రత్యేక స్థానం. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తిచేసిన ఆమె అనూహ్యరీతిలో రాజకీయరంగప్రవేశం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలి నుంచి 90వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అదితి.. రాహుల్ సోదరి ప్రియాంకతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. రాయ్‌బరేలి స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిలేశ్ సింగ్ కూతురే అదితి సింగ్. -
రాయ్‌బరేలీకి ‘వారసత్వం’ నుంచి విముక్తి
రాయ్‌బరేలీ: గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని కుటుంబపాలన రాజకీయాల నుంచి విముక్తి చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ గాంధీ కుటుంబానికే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నా అభివృద్ధి జాడలు కానరావటం లేదన్నారు. శనివారం రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వారసత్వ రాజకీయాల నుంచి రాయ్‌బరేలీకి విముక్తి కల్పించి, అభివృద్ది బాటన నడిపిస్తామని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చా. కాంగ్రెస్, ఆపార్టీ అగ్రనేతలు ఏళ్లుగా ఇక్కడ పరిపాలన సాగించినప్పటికీ కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పలేక పోయారు. ఈ జిల్లాను, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తాం. యోగి ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ‘గూండారాజ్యం’ ఉండగా ప్రస్తుతం శాంతి నెలకొంది. కాషాయ ఉగ్రవాదమంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలి’అని అమిత్ డిమాండ్ చేశారు. సభలో మీడియా ప్రతినిధులు కూర్చున్న చోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. -
నా జీవితంలో పెద్ద ఆస్తి మీరే: సోనియా
న్యూఢిల్లీ: తొలిసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి గత కొద్ది రోజులుగా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆమె అందులో ఆరోపించారు. అనంతరం అమేథీ, రాయ్‌బరేలీతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. తాను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి గల కారణాలు పెద్దగా పేర్కొనని ఆమె అమేథీ, రాయ్‌బరేలీ తమ జీవితంలో భాగం అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె లేఖ విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దశలోనే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీకి చెందిన ఐదు నియోజవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ప్రాంత ప్రజలు తమతో ఉండాలని సోనియా లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘కొన్నికారణాల వల్ల ఈసారి నేను మీముందుకు రాలేకపోతున్నాను. మీకు ప్రతినిధిగా ఉండటం నాకు, నా కుటుంబానికి చాలా గౌరవం. మీతో మా కుటుంబానిది ప్రత్యేక అనుబంధం. నా జీవితంలో అతిపెద్ద ఆస్తులు మీరే’ అంటూ సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు. -
‘బంధుత్వాలు కలుపుకుని మోసం’
రాయబరేలీ: ఎక్కడికి వెళ్లినా బంధుత్వాలు కలుపుకుని మోసం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం రాయబరేలీలో ఆయన ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ పాలనలో రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేయడానికి ప్రధాని వద్ద డబ్బులు లేవు కానీ.. రూ. 12 వందల కోట్ల రుణాలిచ్చి విజయ్ మాల్యాకు విదేశాలకు పంపారని ఆరోపించారు. తమపై మోదీ చేసిన విమర్శలను పట్టించుకోనని అన్నారు. పేదలు, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. -
సోనియాను రిప్లేస్ చేయబోతున్న ప్రియాంక?
-
ఈ స్థానం నుంచే ప్రియాంక అరంగేట్రం?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంకగాంధీ.. రాజకీయ ఆగమనం ఖాయమని వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. సోనియా తప్పుకొని తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో ప్రియాంకకు అవకాశమివ్వవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఒక కథనంలో తెలిపింది. ప్రస్తుతం సోనియాగాంధీ అంత ఆరోగ్యంగా లేరు. రాజకీయాలలోనూ అంత చురుగ్గా కనబడటం లేదని పార్టీ వర్గాలు ఉంటున్నాయి. ఈక్రమంలో సోనియా తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తుండటంతో.. ఆమేరకు పార్టీలో ప్రియాంక ప్రాధాన్యం, పాత్ర పెరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 'రాహుల్ తన సోదరిపైన ఆధారపడటం ఇటీవల బాగా పెరిగింది. సోనియాగాంధీ నిర్వహిస్తున్న అనేక బాధ్యతలను చూసుకోవడమే కాదు.. రాహుల్ కార్యాలయం తెరవెనుక బాధ్యతలను కూడా ఆమెనే చక్కబెడుతున్నారు' అని పార్టీ ఇన్సైడర్ ఒకరు తెలిపారు. రాజకీయాల్లో ప్రియాంక మరింత పెద్ద పాత్ర పోషించాలని తాము కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ సోమవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోనూ మేజర్ క్రెడిట్ ఆమెదేనని ప్రకటించింది. కాంగ్రెస్‌లో ప్రియాంక క్రియాశీలక పాత్రను బాహాటంగా అంగీకరించడం ఇదే తొలిసారి. పార్టీలో ఒక తరం నుంచి మరో తరానికి అధికార మార్పునకు రంగం సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే ప్రియాంక క్రియాశీలక చురుకైన పాత్ర పోషిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి రానున్న యూపీ ఎన్నికల్లో ఇటు సోదరుడు రాహుల్‌తో కలిసి, సొంతంగా విస్తారంగా ప్రచారం చేయాలని ప్రియాంక భావిస్తున్నారు. అఖిలేశ్ భార్య డింపుల్‌తో కలిసి కూడా ఆమె ప్రచారం చేసే అవకాశముందని వినిపిస్తోంది. -
కుట్రతోనే వాద్రాపై ఆరోపణలు: సోనియా
మోదీ షెహన్‌షాలా వ్యవహరిస్తున్నారని ధ్వజం రాయ్‌బరేలీ: తన అల్లుడు రాబర్ట్ వాద్రాపై బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపణలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ విముక్త భారత్‌ను సాధించాలనే లక్ష్యంతోనే బీజేపీ నేతలు రాబర్ట్ వాద్రాపై కుట్రపూరితంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో సోనియాగాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు.. ఒక ఆయుధ వ్యాపారికి, వాద్రాకు మధ్య ఉన్న లింకులపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేపట్టనుందనే వార్తలపై సోనియాను ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. మోదీ షెషన్‌షాలా ప్రవర్తిస్తున్నారు.. నరేంద్రమోదీ ప్రధానమంత్రిలా కాకుండా షెహన్షా (చక్రవర్తి) మాదిరిగా ప్రవర్తిస్తున్నారని సోనియా మండిపడ్డారు. దేశంలో పేదరికం, కరువు తీవ్రంగా ఉండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మరోవైపు వాద్రాను సోనియాగాంధీ వెనకేసుకురావడం ఒక నాటకమని బీజేపీ కొట్టిపారేసింది.