railway ministry
-
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఆ టికెట్ చార్జీల తగ్గింపు
రైల్వే శాఖ ప్రయాణికులు భారీ ఊరట కల్పించింది. ఏసీ చెయిర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైల్వే టికెట్లను తగ్గించింది. ఈ తగింపు పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. అనుభూతి , విస్టాడోమ్ కోచ్‌లతో సహా ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో w తగ్గింపు వర్తించనుంది. వందేభారత్‌తో సహా అన్ని రైళ్లలోని ఏసీ చైర్కార్లు, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు, అనుభూత్, విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నవాటిపై ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు తగ్గిస్తామని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయంలో గత 30 రోజులలో 50శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ (ఎండ్-టు-ఎండ్ లేదా కొన్ని నిర్దేశిత కాళ్లు/సెక్షన్లలో) ఉన్న రైలును పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే తెలిపింది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తగ్గించిన ఛార్జీల వాపసు లభించదు. -
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
వందేభారత్ రైళ్లు: గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం.. యావరేజి స్పీడ్ 83 కి.మీ.
న్యూఢిల్లీ: దేశంలో వందేభారత్ రైళ్లు సరాసరిన గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైళ్లను 130 కి.మీ. వేగంతో నడపవచ్చు. రైలు మార్గాల్లో నాణ్యత లేమి వల్ల తక్కువ వేగంతోనే నడుపుతున్నట్లు సమాచార హక్కు చట్టం కింద అందిన దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. ‘‘అత్యల్పంగా గంటకు 64 కి.మీ. సరాసరి వేగంతో ముంబై–షిర్డీ వందేభారత్ రైలు, గరిష్టంగా 95 కి.మీ. వేగంతో న్యూఢిల్లీ–వారణాసి రైలు నడుస్తోందని చెప్పారు. ఆగ్రా కంటోన్మెంట్– తుగ్లకాబాద్ రైలు మాత్రం గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది’’ అని పేర్కొంది. -
Vande Metro: గుడ్‌న్యూస్.. ఇక వందే మెట్రో రైళ్లు
ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికుల కోసం గుడ్ న్యూస్ చెప్పారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రధాన నగరాలను కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ వ్యవస్థ ‘వందే మెట్రో’ను ఈ ఏడాది చివర్లోనే పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించారాయన. సుదూర ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ తీసుకొచ్చిన సెమీ హై స్పీడ్ రైళ్లు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు తక్కువ దూరంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేలా వందే మెట్రో రైళ్లను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారాయన. ఈ ఏడాది చివర్లోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వందే భారత్‌తో పోలిస్తే వందే మెట్రో డిఫరెంట్‌గా ఉంటుంది. డిసెంబర్ కల్లా ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారాయాన. అంతేకాదు.. వందే భారత్‌కు వస్తున్న స్పందనకు అనుగుణంగానే వందే మెట్రోలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్-లక్నో(90 కిలోమీటర్ల దూరం) నడుమ తొలి రైలు పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. వేగంగా, రూట్లో ఫ్రీక్వెంట్‌గా సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. తద్వారా ఉద్యోగులకు, విద్యార్థుల ప్రయాణాలకు వందే మెట్రో ఉపకరించొచ్చని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభిప్రాయపడుతున్నారు. ఎనిమిది కోచ్‌లతో వందే మెట్రో రైళ్లను నడపాలని భావిస్తోంది. ఇప్పటికే చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి, లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్‌కు రైల్వే శాఖ ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ఆదాయంలో అదరగొట్టిన రైల్వేస్: కారణాలివే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం గమనార్హం. -
మాట నిలుపుకున్న కేంద్రమంత్రి.. చెప్పినట్లే ఢిల్లీ వెళ్లగానే..
కొరాపుట్(భువనేశ్వర్): తాను కొరాపుట్ నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రతిపాదిత స్టేషన్లలో రైళ్లు ఆగుతాయన్న కేంద్ర రైల్వే, టెలికాం మంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, బస్తర్ జిల్లా బచేలిలో రైళ్లు ఆగాయి. ఉదయం ఆదేశాలు రావడంతో సాయంత్రం నుంచి ఆయా స్టేషన్లకు హాల్టులు కల్పించారు. మెదటి విడత కోవిడ్ సమయం నుంచి ఈ స్టేషన్లలో రైళ్లు ఆపడం నిలిపివేశారు. అనంతరం కోవిడ్ తగ్గుముఖం పట్టినా రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ఇటీవల రైల్వే మంత్రి కొరాపుట్ వచ్చినప్పుడు ఈ సమస్యను నాయకులు ప్రస్తావించారు. దీంతో ఆయా స్టేషన్లలో హాల్టులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు నెరవేర్చారు. దీంతో లక్ష్మీపూర్‌లో జగధల్‌పూర్–భువనేశ్వర్, జగధల్‌పూర్–హౌరా, జగధల్‌పూర్–రౌర్కెలా రైళ్లు ఆగనున్నాయి. అలాగే బచేలిలో విశాఖపట్నం–కిరండోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (రాత్రిపూట రైలు) ఆగనుంది. ఈ ప్రకటనతో లక్ష్మీపూర్, నారాయణ పట్న, బందుగాం సమితులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వాల్తేర్ డీఆర్ఎం అనుఫ్ కమార్ సత్పతి లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం -
రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన లేదు
చెన్నై: జాతీయ రవాణా సాధనమైన రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్ఘాటించారు. భద్రత, సౌకర్యం విషయంలో ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే రంగంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినదే కావాలన్నారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్), వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రాజెక్టులను అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. తమిళనాడులోని పెరంబుదూర్‌లో శనివారం నిర్వహించిన భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్(బీఆర్‌ఎంఎస్) 20వ అఖిలభారత సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపిస్తున్నాయని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అతిపెద్ద సంస్థ అయిన రైల్వేలను ప్రైవేట్‌కు అప్పగించే ఆలోచన, ప్రణాళిక ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూపకల్పనలో ఐసీఎఫ్ కృషిని మంత్రి ప్రశంసించారు. రైల్వేశాఖలో నియామకాల్లో గత యూపీఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖలో 3.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో 1.40 లక్షల ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
భారతీయ రైల్వేకు కనక వర్షం కురిపిస్తున్న తత్కాల్ టికెట్లు..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలోనూ.. రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి మొత్తం 1033కోట్లు రైల్వే వసూలు చేసింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు రాగా, ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు, డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరంలో చాలా వరకు రైళ్లను నిలిపివేశారు. అయిన, ఈ మేరకు ఆదాయం రావడం గమనార్హం. రైల్వే ఆదాయంపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు స్పందిస్తూ రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే తత్కాల్ టికెట్ల ద్వారా 353 కోట్లు, ప్రీమియం తత్కాల్ కింద 89 కోట్లు, డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.240 కోట్లు వచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు భారతీయ రైల్వే సంస్థ డైనమిక్ ఛార్జీల రూపంలో రూ.1,313 కోట్లు, తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.1,669, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల రూపంలో రూ.603 కోట్లు సంపాదించింది. ఈ తత్కాల్ టిక్కెట్లపై విధించే ఛార్జీలు "కొంచెం అన్యాయమైనవి" అని రైల్వేలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యానించిన ఒక నెల తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి డేటా బయటకి వచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రజలు భాదపడుతున్న సమయంలో ప్రయాణీకులపై భారాన్ని మోపడం తగదు అని కమిటీ పేర్కొంది. (చదవండి: వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!) -
లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. వచ్చే నెల ఇండియా వస్తాను. నాతో బాటు 10,000 డాలర్లు తెచ్చుకోవచ్చా. ఇంకేదైనా మార్గం ఉందా? - కోనేరు రంగారావు, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) గతంలో ఎన్నోసార్లు మనం ఈ విషయం ప్రస్తావించాం. మీరు ఇండియా వస్తున్నప్పుడు అంత పెద్ద మొత్తం డాలర్ల కరెన్సీ నోట్లను మీతో పాటు తేకూడదు. తెస్తే రిస్క్. చట్టరీత్యా నేరం. నిషేధం. ఇంత పెద్ద వ్యవహారాన్ని ‘హవాలా’గా పరిగణించే అవకాశం ఉంది. అలా తేకండి. రాచమార్గం ఉండగా వేరే మార్గం ఎందుకు? మీరు వచ్చే ముందు, లేకపోతే వచ్చిన తర్వాత .. అక్కడున్న మీ అబ్బాయి/అమ్మాయి అకౌంటు నుండి ఇండియాలోని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోండి. ఇలా పంపబడిన మొత్తం.. అమెరికాలో పన్నుభారానికి గురి అయినదై ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు. ఇక్కడ మీ అకౌంటులోకి జమ అవుతుంది. పంపే వ్యక్తి వివరాలన్నీ మీ ఇన్‌కం ట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. పేరు, చిరునామా, పాస్‌పోర్ట్ కాపీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొత్తం, బదిలీ వివరాలు వీటితో పాటు ఒక ఈమెయిల్ తెప్పించుకోండి. మీరు ఇటునుంచి ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. ఇక మీ విషయానికొస్తే ఇంత మొత్తం జమ అవ్వడమనేది, బ్యాంకు అధికారుల దృష్టిలో పడుతుంది. ఏ అధికారి దృష్టిలో పడినా మీ దగ్గర పూర్తి వివరణ ఉండాలి. ఈ వ్యవహారం వల్ల గానీ, జమ వల్ల గానీ ఎటువంటి పన్నుభారం ఉండదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ సందర్భంలో మీరు అక్కడ సంపాదించిన మొత్తం గానీ, మీ పిల్లలు సంపాదించిన మొత్తం గానీ ఇండియా వస్తోందని అనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఎటువంటి పన్నుభారం ఉండదు. కుటుంబ సభ్యులు కాకపోతే ఈ వ్యవహారాన్ని అప్పుగా పరిగణించాలి. అలా కాకపోతే ఆదాయం అవుతుంది. ఏ వ్యవహారానికయినా సరైన డాక్యుమెంట్లు ఉండాలి. నేను ఈ మధ్యే రైల్వే శాఖలో నుంచి రిటైర్ అయ్యాను. ఆ సందర్భంలో సుమారు రూ.50,00,000 వచ్చింది. దీని మీద పన్ను భారం ఉంటుందా? - నండూరి సత్యవతి, హైదరాబాదు సాధారణంగా ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్ అయిన వారికి పదవీ విరమణ సందర్భంలో వచ్చిన పెన్షన్ ప్రయోజనాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. సెక్షన్ 10 ప్రకారం వీటన్నింటి మీద మినహాయింపు ఉంది. అయితే, రిటర్ను వేసేటప్పుడు, రిటర్నులో ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ వివరాలు రాయండి. ఇలా రాయడం వల్ల మున్ముందు ‘సోర్స్’ వివరణలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. లాటరీల మీద ఆదాయాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? - ఎం. ఉపేంద్ర, నిజామాబాద్ ముందుగా లాటరీల మీద ఆదాయాన్ని/ప్రైజ్ మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఇతర ఆదాయం కింద వర్గీకరిస్తారు. ఈ ఆదాయం మీద విధిగా టీడీఎస్ చేస్తారు. దీనిపై 30 శాతం మేర భారం పడుతుంది. విద్యా సుంకం అదనం. పైగా ఎటువంటి బేసిక్ లిమిట్ మినహాయింపు ఉండదు. మొత్తం లాటరీని ఆదాయంగా భావించి, 30 శాతం ప్రకారం పన్ను వేస్తారు. ఈ భారంలో నుంచి టీడీఎస్‌ను తగ్గించి, పన్ను చెల్లించాలి. కె.సీహెచ్.ఎ.వీ.ఎస్. ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య - ట్యాక్సేషన్ నిపుణులు -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Bullet Train Project Made In India: ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్మెంట్ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు రెడీ అవుతోంది. వయడక్టు నిర్మాణంలో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ టట్రైన్ పప్రాజెక్టును ఇండియన్ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్ క్యారియర్లు, గర్డర్ ట్రాన్స్పోర్టర్లు వంటి భారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్మెంట్ని పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న ఎల్ అంట్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా 1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వాటి తర్వాత ఇండియానే బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే. అయితే ఇండియా ఆ దేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ యంత్రాలను రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నిర్మాణం జరుపుకునే బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో కీలక భూమిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. Flagged off Made in India engineering marvel, a reflection of the 21st Century Mindset. #HighSpeedRailonFastTrack pic.twitter.com/7EzkdPaWFI — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2021 చదవండి: Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్ -
తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైల్వేల నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి - కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. చదవండి : ఏపీ: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే.. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయాయి. ఆపై అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ ఈనెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, మరో 39 రైళ్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది. -
కోవిడ్-19 : రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో రైల్వే కోచ్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లకు రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రైల్వే కోచ్‌ల్లో టైటానియం డయాక్సైడ్ కోటింగ్, ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫికేషన్, శానిటైజేషన్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వంటి ప్రణాళికలపై రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాచరణకు పూనుకుంది. ప్రయాణీకుల రైళ్లు పట్టాలెక్కేలోగా ఈ చర్యలను చేపట్టాలని భావిస్తోంది. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్లో ఈ తరహా తొలి నమూనా రైలును రూపొందించారు. రైల్వే కోచ్‌లన్నింటిలో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేలు యోచిస్తున్నాయి. ఎక్కడా చేతులు ఉపయోగించకుండా కాళ్లతోనే అన్నింటినీ ఆపరేట్ చేసేలా చర్యలు చేపడతామని రైల్వేలు తెలిపారు. కోచ్‌ల్లో కాపర్‌తో చేసిన హాండ్‌రెయిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. కాపర్‌పై వైరస్ చేరిన కొద్దిసేపటికే వైరస్‌లోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను ధ్వంసం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్లాస్మా ఎయిర్ పరికరాలు ఏసీ కోచ్‌లో గాలిని, ఉపరితలాలను స్టెరిలైజ్ చేస్తాయని తెలిపాయి. నూతన కోచ్‌లను ఈ తరహాలోనే తయారు చేసేందుకు రైల్వేలు సంసిద్ధమయ్యాయి. భవిష్యత్‌లో కోచ్‌ల తయారీలో వీటిని పొందుపరుస్తామని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణీకుల రైళ్లను ఆగస్ట్ 12 వరకూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. చదవండి : నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ -
లాక్డౌన్ : మూడు గంటల్లో రూ.10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతినిచ్చిన నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైళ్ల కోసం ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేయడం ప్రారంభించిన తరువాత సోమవారం (మే 11) మొదటి మూడు గంటల్లో 54 వేల మంది ప్రయాణికులు 30 వేల టికెట్లు కొనుగోలు చేశారు. తద్వారా సుమారు రూ .10 కోట్లు ఆదాయం రైల్వే శాఖకు సమకూరింది. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!) ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) రైళ్ల టికెట్ల అమ్మకాల ద్వారా సోమవారం రాత్రి 9 గంటలకు రూ .9.9 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ముంబై- న్యూఢిల్లీ మార్గంలో టికెట్లు మే 12-17 వరకు పూర్తిగా అమ్ముడుబోయాయని తెలిపారు. హౌరా-న్యూ ఢిల్లీ రైలుకు సంబంధించిన అన్ని టికెట్లను మొదటి 10 నిమిషాల్లోనే బుక్ చేశారన్నారు. అయితే టికెట్ల కోసం భారీ రద్దీ కారణంగా ఐఆర్సీటీపీ సైట్ క్రాష్ అయింది. దీంతో బుకింగ్స్ షెడ్యూల్ రెండు గంటలు ఆలస్యమైంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ షేరు ట్రేడర్ల కొనుగోళ్లతో లాభాల్లో దూసుకుపోతోంది. (400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్) కోవిడ్-19 మహమ్మారి కారణంగా అన్ని సేవలను ప్రభుత్వం పరిమితం చేసిన దాదాపు 50 రోజుల తరువాత భారత రైల్వే ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను మంగళవారం నుండి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 25వ తేదీ నుంచి మే 17వరకు దేశంలో మూడు దశల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకూ దాదాపు అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. -
ప్రత్యేక రైళ్లు : వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైళ్లు ఈ రోజు (మంగళవారం) నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. 15 రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో రాయితీలకు సంబంధించి రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటనిచ్చింది. కొంతమంది రోగులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే రాయితీ ధరల్లో టికెట్లు అందుబాటులో వుంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ) అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విద్యార్థులు, 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు మాత్రమే రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) -
వదంతులకు చెక్ పెట్టిన రైల్వే శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి రైల్వే రిజర్వేషన్ సంస్థ ఐఆర్ సీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిందని పలు నివేదికలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. అసలు తాము ఏప్రిల్ 15 (అంటే లాక్ డౌన్ తరువాతి సమయానికి సంబంధించి) నుంచి బుకింగ్‌లను నిలిపి వేసిందని లేదనీ అది పాత ప్రకటన అనే గమనించాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నందున తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. లాక్ డౌన్ ఆదేశాలకు మేరకు తాము లాక్ డౌన్ సమయం వరకే టికెట్ రిజర్వేషన్లను ఆపేశామని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి రైల్వే టికెట్లు 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, దాన్ని చూసి కొంతమంది అపోహ పడుతున్నారని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయం తర్వాతి ప్రయాణాల కోసం తాము ఎప్పుడూ టికెట్ రిజర్వేషన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఒకవైపు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే టికెట్ల రిజర్వేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి తిరిగి ప్రారంభించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్ Certain media reports have claimed that Railways has started reservation for post-lockdown period. It is to clarify that reservation for journeys post 14th April was never stopped and is not related to any new announcement. pic.twitter.com/oJ7ZqxIx3q — Ministry of Railways (@RailMinIndia) April 2, 2020 -
రైళ్లలో కరోనా రోగులతో జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాదు రైల్వే ప్రయాణాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇటీవలి కాలంలో రైళ్లలో కరోనా పాజిటివ్ రోగులు, అనుమానితులను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్ళలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన కొన్ని కేసులను గుర్తించామని, ఇది రైలు ప్రయాణాన్ని ప్రమాదకరంగా చేస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. మీ సహ ప్రయాణీకుడికి కరోనావైరస్ ఉంటే మీరు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున రైలు ప్రయాణానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అన్ని ప్రయాణాలను వాయిదా వేయండి..తద్వారా మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుకోండని సూచిస్తూ రైల్వేమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. Railways has found some cases of Coronavirus infected passengers in trains which makes train travel risky. Avoid train travel as you may also get infected if your co-passenger has Coronavirus. Postpone all journeys and keep yourself and your loved ones safe. #NoRailTravel — Ministry of Railways (@RailMinIndia) March 21, 2020 -
రైల్వే ప్రయాణికులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఏడాది తొలిరోజు నుంచే రైల్వే ప్రయాణికులకు షాక్ తగలనుంది. రైలు చార్జీలను మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని తరగతుల ప్రయాణీకుల చార్జీలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డినరీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు పైసా చొప్పున, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిలోమీటర్‌కు రెండు పైసలు చొప్పున చార్జీలను పెంచారు. ఏసీ క్లాస్‌కు కిలోమీటర్‌కు 4 పైసల చొప్పున చార్జీలను పెంచినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్ల నుంచి రైల్వే చార్జీలను పెంచని దృష్ట్యా రైలు చార్జీలను హేతుబద్ధీకరించామని వెల్లడించింది. చివరిసారిగా 2014-15లో రైలు చార్జీలను పెంచారు. చార్జీల పెంపుతో పాటు రైళ్లలో ప్రయాణీకుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్‌ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
రైల్లో రిస్కీ స్టంట్, క్షణాల్లో..
సాక్షి, ముంబై : క్షణాల్లో ప్రాణాలు పోతున్నా కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. తాజాగా ప్రమాదమని తెలిసి కూడా డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు డోర్ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్ చేశాడో యువకుడు. ఈ ఫీట్ వికటించి అదుపు తప్పి ప్లాట్‌ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. దీన్ని అతని స్నేహితులు వీడియో తీసారు. స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. డిసెంబర్ 26న ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో దిల్షాన్ అనే యువకుడు మరణించాడని పేర్కొంది. రైలులో ఇలాంటి స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులను వారించింది.భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులోఅనాలోచిత ప్రయోగాలు లాంటివి చేయొద్దని సూచించింది ट्रेन में स्टंट ना करें ये गैरकानूनी है एवं जानलेवा भी सिद्ध हो सकता है। मुंबई में 26 दिसंबर को दिलशान नाम का युवक ट्रेन के बाहर लटक कर स्टंट करते हुए अपनी जान गंवा चुका है। अपनी सुरक्षा की अवहेलना करके ट्रेन के बाहर लटकना,चलती ट्रेन में चढ़ना, हादसे का बुलावा हो सकता है। pic.twitter.com/oGEsqjoka6 — Ministry of Railways (@RailMinIndia) December 30, 2019 -
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ తరహా రైళ్లను మరికొన్నింటిని ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో కొత్తగా 40 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం ఇటీవల చేపట్టిన టెండర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకుని సమస్యను చక్కదిద్దారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల తయారీకి నూతన టెండర్ ప్రక్రియను రైల్వే బోర్డు చేపట్టడంతో ఈ రైళ్లు త్వరలో పట్టాలెక్కేందుకు కార్యాచరణ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ, వారణాసి మధ్య రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. మేకిన్ ఇండియాలో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. -
షాకింగ్ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలు భారీ లేఆఫ్స్‌కు రంగం సిద్ధం చేశాయి. మూడు లక్షల మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీవిరమణ చేయాలని రైల్వేలు కోరనున్నాయి. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులను తమ స్ధానాల నుంచి వైదొలగాలని కోరవచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా అన్ని జోనల్ చీఫ్స్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డులు ఉద్యోగుల సామర్ధ్యంపై నివేదికను కోరుతూ లేఖ రాశాయి. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరితో పాటు 2020 తొలి క్వార్టర్లో 30 ఏళ్ల సర్వీస్‌ను పూర్తిచేసుకున్న వారి జాబితాను సమర్పించాలని కోరాయి. ఉద్యోగుల సామర్ధ్యంపై సమీక్ష నిర్వహించి దాని ఆధారంగా సర్వీస్ రికార్డును తయారుచేయాలని జోనల్ మేనేజర్లకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగుల శారీరక, మానసిక ఫిట్నెస్, రోజూ విధులకు హాజరయ్యే రికార్డు, క్రమశిక్షణ ఆధారంగా సామర్ధ్య సమీక్షను చేపడతారు. ఆగస్ట్ 9 నాటికి ఉద్యోగులకు సంబంధించిన నివేదికలను తమకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కళంకిత అధికారులను సాగనంపే ప్రక్రియను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టడంతో ఆ కోణంలోనూ రైల్వే ఉద్యోగుల్లో వడపోతలు ఉంటాయని భావిస్తున్నారు. -
రైళ్లలో ఇక ఆ ఇబ్బంది ఉండదు..!
న్యూఢిల్లీ : సరదాగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ఒక రకమైన బెరుకు, ఇలా చేస్తున్నారేంటి..? అనే భావనను కలిగించే ట్రాన్స్జెండర్లపై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై కొరడా ఝళిపించింది. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 73 వేల మందిని అరెస్టు చేసింది. రైళ్లలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై రైల్వే శాఖ చేపట్టిన చర్యలేంటో తెలపాలని దాఖలైన ఆర్టీఐ పిటిషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కాలంలోనే 20 వేల మంది ట్రాన్స్జెండర్లు అరెస్టు కాగా, ఈ జనవరిలోనే 1399 మందిని అరెస్టు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. 2015 జనవరి నుంచి హిజ్రాల డబ్బు వసూళ్ల పై చర్యలు ముమ్మరం చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే భద్రతా దళం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపింది. ఇదిలాఉండగా.. రైల్వే శాఖ చర్యలతో నకిలీ ట్రాన్స్జెండర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిచేసుకుని బతికే బదులు తమకు ప్రత్యేక హక్కులున్నట్టుగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పినట్టయిందని అంటున్నారు. యాచించడం బదులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఎదురు తిరిగితే అసభ్యంగా ప్రవర్తించడం నకిలీ హిజ్రాలకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రైళ్లలోనూ బ్లాక్‌బాక్స్‌లు!
సాక్షి, న్యూఢిల్లీ : విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. విమానాల్లో మాదిరిగా రైళ్లలో లోకో కాబ్ ఆడియో వీడియా రికార్డింగ్ సిస్టమ్, క్రూ వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్‌లను నెలకొల్పుతామని పార్లమెంట్లో రైల్వే సహాయ మంత్రి శ్రీ రాజెన్ గోహెన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఊహించని ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిర్వహణ అంశాలు, మానవ తప్పిదాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులకు ఈ వ్యవస్థ కీలక సమాచారం చేరవేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే 26 రైళ్లలో అమర్చినట్టు తెలిపింది. ఈ వ్యవస్థను పలు రైళ్లలో అమర్చేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు 2018-19 బడ్జెట్లో రూ 100 కోట్లు కేటాయించినట్టు ప్రకటన తెలిపింది. -
‘సఫాయివాలా’లు ఇకపై ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’
న్యూఢిల్లీ: తమ శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంఘాలతో చర్చించిన మీదట రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్–డీ ఉద్యోగులే సఫాయి వాలాలు. ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్లుగా సంబోధిం చాల్సి ఉంటుందని తెలిపింది. వీరి ఎంపిక, నియామక విధానం, అర్హతలు, సీనియారిటీ, పదోన్నతి ప్రక్రియ, వేతనంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని జోనల్ విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
కొత్త రైలు.. కూ చుక్ చుక్!
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్ల్లో ప్రయాణికుల సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహేన్ పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన కరీంనగర్–లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై (11206/11205) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్–ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్.. ఇక నుంచి కరీంనగర్–లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై వరకు రాకపోకలు సాగించనుంది. మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ఎలక్ట్రానిక్ గైడెన్స్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థ వల్ల ప్లాట్‌ఫారాలపై ఏ కోచ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల సుమారు రూ.2వేల కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేశారు. రూ.125 కోట్లతో పూర్తి చేసిన పలు సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చా రు. కాజీపేట్–కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 6/7 ప్లాట్‌ఫాంపై ఒక లిఫ్టు నిర్మాణానికి, బేగంపేటలో రూ.1.5 కోట్లతో 3 లిఫ్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్లో 238 మీటర్ల నుంచి 330 మీటర్లకు పొడిగించిన 2 ప్లాట్‌ఫారాలను ప్రారంభించారు. లింగంపల్లి, కాజీపేట స్టేషన్లలో రూ.3 కోట్లతో చేపట్టనున్న 3 ఎస్కలేటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బొల్లారం, వరంగల్ రైల్వే స్టేషన్ల పాదచారుల వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యత.. ఈ సందర్భంగా మంత్రి రాజెన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్త లైన్ల విస్తరణ, సదుపాయాలకు రూ.వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 50 కిలోమీటర్లకు పైగా కొత్తలైన్లు వేయడంతోపాటు, 76 కిలోమీటర్ల రైల్వే లైన్లను డబ్లింగ్ చేసినట్లు వివరించారు. మరో 345 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరించినట్లు పేర్కొన్నారు. రూ.106 కోట్లతో మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన మూడో రైలు మార్గాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల సరుకు రవాణాకు ఈ మార్గంలో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాజీపేట–కొండపల్లి మధ్య రూ.1693.45 కోట్ల అంచనాలతో ప్రస్తుతం చేపట్టిన మూడో రైలు మార్గం వల్ల ప్రయాణికులకు అదనపు సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా సరుకు రవాణాలో ఇతోధికమైన అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. మల్కాజిగిరి స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మంత్రిని కోరారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఇంకా విస్తరించాల్సి ఉందని అన్నారు. లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతోనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వేలో కాపలా లేని రైల్వే గేట్లను పూర్తిగా తొలగించనున్నట్లు జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. -
మరికొద్ది సేపట్లో ప్లాట్‌ఫాం నం..
దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా, సుఖవంతంగా మార్చే చర్యలు ఊపందుకున్నాయి. ఈ దిశలో చేపడుతున్న కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గతంలోని ఇమేజీకి భిన్నంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నవీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అందివస్తున్న సాంకేతిక ఫలాల రూపంలో ప్రయాణికులు సౌకర్యాలు, ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతి లోకో మోటివ్ ఇంజన్లో జీపీఎస్ పరికరాలు అమర్చడం మొదలు డేటా లాగర్స్ రైలు ప్రయాణ సమయ పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఆర్ఐ) ను ఉపయోగించి మెయింటెనెన్స్, అందుబాటులోని రైల్వే ఆస్తుల వినియోగం, పర్యవేక్షణ, సెన్సర్ ఆధారిత వ్యవస్థలతో కూడిన స్మార్ట్ కోచ్‌ల వినియోగం ఇలా అనేక అంశాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటోంది. ఇలాంటి నూతన ప్రణాళికల అమల్లో భాగంగా పలు ప్రా జెక్టులు చేపడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అవేమిటంటే.. నిర్దేశిత సమయానికి రైళ్లు రాకపోకలు సాగించేలా గతంలో స్టేషన్ మాస్టార్లు రైళ్ల సమయాన్ని రికార్డు చేసే విధానానికి బదులుగా ఇంటర్ చేంజ్ పాయింట్లలోనే ఈ సమయం నమోదు చేసేందుకు డేటా లాగర్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా కంప్యూటర్లో రైళ్ల సమాచారం కనిపిస్తుంది. డేటా లాగర్స్ వల్ల గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 73–74 శాతం సమయపాలన పెరిగినట్లు రైల్వే మంత్రి చెబుతున్నారు. ప్రతి లోకోమోటివ్ ఇంజన్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ప్రతి రైలు ఎక్కడుందో తెలుసుకునే వీలుంటుంది. దీంతో ఎప్పటికప్పుడు రైలు గమనం.. ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైల్వేల విద్యుదీకరణ వల్ల ఏటా 200 కోట్ల డాలర్ల మేర ఆదా చేయొచ్చని రైల్వే శాఖ అంచనా. డీజిల్ ఇంజన్లకు మరమ్మతులు చేస్తారు. విద్యుత్ ఇంజన్లలను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. సమర్థతను పెంచుకునేందుకు వీలుగా ‘స్మార్ట్ టైం టేబుళ్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతోంది. ప్రస్తుత రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచే చర్యలతో పాటు లక్షన్నర వరకున్న బ్రిడ్జీల స్థితిగతులను పరిశీలించి, వాటిని మరింత మెరుగ్గా చేస్తారు.