robots
-
రోజుకు రూ.28000 జీతం: ఏడు గంటలే పని!
ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు ఏడు గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక జాబ్ ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు 48 డాలర్లు లేదా సుమారు 4000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన ఏడు గంటలు పనిచేస్తే రోజుకు రూ. 28000 సంపాదించుకోవచ్చు. ఇంతకీ జాబ్ ఏంటి? అక్కడ ఏం చేయాల్సి ఉంటుందనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి.టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్-క్యాప్చర్ సూట్ & వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి రోజూ ఏడు గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవడం ఉంటుంది. ఇందులో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5'7' నుంచి 5'11' ఎండీ ఉండాలి. వీరు 13 ఫౌండ్స్ బరువును కూడా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: తగ్గిన బంగారం, పెరిగిన వెండి: ఈ రోజు ధరలు ఇవేఉద్యోగంలో మూడు షిఫ్టులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అవి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు.. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 8:30 గంటల వరకు. అంటే ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో పని చేయాల్సి ఉంటుంది. -
రణయంత్రాలు.. 'యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని?'
‘యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని ముగించేస్తుంది’ అన్నాడు ఇంగ్లిష్ రచయిత హెచ్‌జీ వెల్స్. చాలామంది దేశాధినేతలు ఇప్పటికీ ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కొత్త కొత్త యుద్ధాలను మొదలుపెడుతున్నారు. మానవాళి జీవనసరళిని సులభతరం చేయాల్సిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సునాయాసంగా సామూహిక జనహననం చేయగల అధునాతన ఆయుధాలను, యుద్ధ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. చివరకు రోబో సైనికులను కూడా రంగంలోకి దించుతున్నారు. ‘యుద్ధం విధ్వంసశాస్త్రం’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు జాన్ అబట్. ఈ విధ్వంసశాస్త్ర పురోగతిపై ఒక విహంగ వీక్షణం...యుద్ధాలు ఎందుకు తలెత్తుతాయంటే, కచ్చితమైన కారణాలను చెప్పడం కష్టం. ప్రధానంగా నియంతల నిరంకుశ ధోరణి, జాత్యహంకారం, మతోన్మాదం, రాజ్యవిస్తరణ కాంక్ష వంటివి చరిత్రలో ప్రధాన యుద్ధ కారణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇలాంటి పెద్దపెద్ద కారణాల వల్లనే యుద్ధాలు జరుగుతాయనుకుంటే పొరపాటే! చాలా చిల్లరమల్లర కారణాలు కూడా యుద్ధాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.రణ పరిణామం..మొదటి ప్రపంచయుద్ధం నాటికి యుద్ధరంగంలోకి తుపాకులు, ఫిరంగులు, యుద్ధట్యాంకులు, బాంబులను జారవిడిచే యుద్ధవిమానాలు, జలమార్గం నుంచి దాడులు చేసే యుద్ధనౌకలతో పాటు ప్రమాదకరమైన రసాయనిక ఆయుధాలు కూడా వచ్చిపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్ బలగాలు జారవిడిచిన అణుబాంబుల పర్యవసానాలు తెలిసినవే! మొదటి రెండు ప్రపంచయుద్ధాలూ కోట్ల సంఖ్యలో ప్రాణాలను కబళించాయి. ఈ యుద్ధాలు మానవాళికి అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. అలాగని యుద్ధాలు సమసిపోలేదు. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత కూడా అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి. కొన్ని అంతర్యుద్ధాలు, ఇంకొన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు, మరికొన్ని ప్రత్యక్ష యుద్ధాలు– ఒక్కొక్క యుద్ధంలో సాంకేతిక ఆయుధాలు పదునెక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి యుద్ధాల్లో రణయంత్రాలే రణతంత్రాలను నిర్దేశిస్తున్నాయి. కృత్రిమ మేధ యుద్ధాల తీరుతెన్నులనే మార్చేస్తోంది.రోబో సైనికులు..పాతకాలంలో సైనికులు పరస్పరం ఎదురుపడి తలపడేవారు. ఒక్కోసారి ఏ కొండల చాటునో, గుట్టల చాటునో మాటువేసి దొంగదాడులతో శత్రుబలగాల మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యుద్ధరంగంలోకి రోబో సైనికులను దించుతున్నారు. వీటిని ఎక్కడో ఉంటూ రిమోట్ ద్వారా నియంత్రిస్తూ, శత్రువులను మట్టుబెట్టగలుగుతున్నారు. అలాగే, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా నిరోధించగలుగుతున్నారు. రోబో సైనికులు ఆయుధాలను ప్రయోగించడమే కాకుండా, శత్రువులు అమర్చిన మందుపాతరలను తొలగించడం, బాంబులను ఏరివేయడం వంటి పనులు కూడా చేయగలవు. అమెరికా, చైనా వంటి దేశాలు ఇప్పటికే రోబో సైనికులను రూపొందించుకున్నాయి.వీటిలో కృత్రిమ మేధతో పనిచేసేవి కూడా ఉండటం విశేషం. ఈ రోబోసైనికులు యుద్ధరంగంలో సైనికుల పనిని సులభతరం చేస్తాయి. దాడులకు తెగబడే శత్రుబలగాలను తిప్పికొట్టడం, శత్రువులపై కాల్పులు జరపడం, శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం వంటి పనులను సునాయాసంగా చేస్తాయి. దక్షిణ కొరియా సైన్యం కాపలా విధుల కోసం సెంట్రీ రోబోలను ఉపయోగిస్తోంది. అధునాతన తుపాకులను అమర్చిన ఈ సెంట్రీ రోబోలు సైనిక స్థావరాల వద్ద గస్తీ తిరుగుతుంటాయి. శత్రువులను గుర్తించినట్లయితే, కాల్పులు జరుపుతాయి. యుద్ధరంగంలో రోబో సైనికులతో పాటు చాలా దేశాలు వేర్వేరు పనుల కోసం వేర్వేరు రోబోలను కూడా వాడుతున్నాయి.యుద్ధరంగంలో భావి సాంకేతికత..ఇప్పటికే పలు అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలు అగ్రరాజ్యాల అమ్ములపొదిలోకి చేరాయి. ఈ దేశాలు మరిన్ని అధునాతన ఆయుధాలు, వాహనాలు, సైనిక పరికరాల కోసం పరిశోధనలు సాగిస్తున్నాయి. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ వంటి పరికరాల రూపకల్పన ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. వీటి నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ యుద్ధరంగంలో పనిచేసే సైనికులకు బాగా ఉపయోగపడుతుంది. సౌరశక్తితో పనిచేసే ఈ సిస్టమ్‌లోని మూడున్నర అంగుళాల స్క్రీన్‌పై చుట్టుపక్కల వివిధ దిశల్లో ఏం జరుగుతోందో, శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూడవచ్చు. హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ 360 డిగ్రీలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది.ఇందులోని మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ (ఎంటీఐ) రాడార్ సెన్సర్ దుమ్ము ధూళి పొగ దట్టంగా కమ్ముకున్న చోట కూడా శత్రులక్ష్యాలను 50 మీటర్ల దూరం నుంచి స్పష్టంగా చూపగలుగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే హైపర్సోనిక్ మిసైల్స్‌ను వినియోగంలోకి తెచ్చాయి. అయితే, ధ్వనివేగానికి ఇరవైరెట్ల వేగంతో దూసుకుపోయే హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణుబాంబులను మోసుకుపోగలిగే హైపర్సోనిక్ మిసైల్స్ 2040 నాటికి అందుబాటులోకి రాగలవని అంచనా. రష్యా, చైనా, అమెరికా సైన్యాలు ఈ స్థాయి హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి పోటాపోటీగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశాల సైనికబలగాలు హైపర్సోనిక్ యుద్ధవిమానాలను వాడుకలోకి తీసుకొచ్చాయి. సైనిక ప్రయోగాల కోసం, హైటెక్ ఆయుధాల తయారీ కోసం అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమాల కోసం అమెరికా చేసే ఖర్చు 2040 నాటికి ట్రిలియన్ డాలర్లను (రూ.83.50 లక్షల కోట్లు) అధిగమిస్తుందని అమెరికన్ రక్షణరంగ నిపుణుడు పీటర్సన్ చెబుతున్నారు.రష్యా, చైనాలు కూడా హైపర్సోనిక్ మిసైల్స్ రూపకల్పనలో ప్రయోగాలు సాగిస్తున్నాయి. భారీస్థాయిలో విధ్వంసాలు సృష్టించగల అణుబాంబులను మోసుకుపోయి ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల మిసైల్స్ తయారీకి ఈ దేశాలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడు దుందుడుకు అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదకర ఆయుధాల తయారీకి ప్రయోగాలను సాగిస్తోంది. వివిధ దేశాలు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తయారీకి ప్రయోగాలు సాగిస్తున్నాయి. రైల్ గన్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ప్రభావవంతంగా పనిచేసే ఆయుధాలే అయినప్పటికీ, విద్యుత్తు సరఫరా ఉంటేనే ఇవి పనిచేయగలవు. యుద్ధక్షేత్రంలో విద్యుత్తు సరఫరా కోసం అత్యధిక సామర్థ్యం గల హైడెన్సిటీ మొబైల్ పవర్స్టోరేజ్ సిస్టమ్స్, మినీ న్యూక్లియర్ రియాక్టర్స్ వంటి వాటి తయారీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొనసాగుతున్న యుద్ధాలు..ఇప్పటికే ఉక్రెయిన్–రష్యాల మధ్య, ఇజ్రాయెల్– పాలస్తీనా, ఇజ్రాయెల్–లెబనాన్, సూడాన్‌లోని రెండు వర్గాల సైన్యం మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఇప్పటికే చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ యుద్ధాలను నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర దేశాలు బాహాటంగా వీటిలో ఏదో ఒక పక్షం తీసుకున్నట్లయితే, దాని పర్యవసానంగా మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే కాకుండా, ఇథియోపియా, హైతీ వంటి దేశాల్లోని అలజడులు, ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై పట్టు కోసం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. ఈ పరిస్థితులు అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధమే గనుక జరిగితే, జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది. ‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదు గాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం మనుషులు కర్రలు, రాళ్లతోనే కొట్టుకుంటారు’ అని ఐన్‌స్టీన్ ఏనాడో అన్నాడు. మూడో ప్రపంచయుద్ధమే గనుక సంభవిస్తే, దాని దెబ్బకు భూమ్మీద నాగరికత తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో మరణించిన వాళ్లు మరణించగా, అరకొరగా మిగిలిన వాళ్ల మధ్య గొడవలు తలెత్తితే, వాళ్ల పోరాటానికి ఆధునిక ఆయుధాలేవీ మిగిలి ఉండకపోవచ్చు. అప్పుడు ఐన్‌స్టీన్ మాటలే నిజం కూడా కావచ్చు.రోబో వాహనాలు..దేశాల సైనిక బలగాలు రకరకాల రోబో వాహనాలను వాడుతున్నాయి. డ్రైవర్ లేకుండానే ఇవి ప్రయాణించగలవు. రిమోట్ కంట్రోల్‌తో వీటిని సుదూరం నుంచి నియంత్రించవచ్చు. వీటిలో కొన్నింటికి ఆయుధాలను అమర్చి యుద్ధరంగానికి పంపే వెసులుబాటు ఉంది. వీటి ద్వారా శత్రుస్థావరాలను ఇట్టే మట్టుబెట్టవచ్చు. కొన్ని రకాల రోబో వాహనాలను శత్రువులు అమర్చిన మందుపాతరలను, బాంబులను నిర్వీర్యం చేయడానికి కూడా వాడుతున్నారు. రోబో వాహనాల్లో యుద్ధట్యాంకుల స్థాయి వాహనాల నుంచి బాంబులు, మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ఆటబొమ్మల్లా కనిపించే చిన్న చిన్న రోబో వాహనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, అమెరికన్ బలగాలు ఉపయోగిస్తున్న ‘గార్డ్బో’ అనే రోబో వాహనం చూడటానికి బంతిలా ఉంటుంది. ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటిలోను ఇది సునాయాసంగా ప్రయాణించగలదు.ఇది గస్తీకి, నిఘా పనులకు ఉపయోగపడుతుంది. అమెరికన్ బలగాలు వాడుతున్న ‘మాడ్యులర్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్’ (మార్స్) మనుషులు నడిపే యుద్ధట్యాంకులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని మనుషులు నేరుగా నడపాల్సిన పనిలేదు. రిమోట్ కంట్రోల్‌తో దీనిని సుదూరం నుంచి నియంత్రంవచ్చు. దీనికి అమర్చిన ఫిరంగులతో శత్రుస్థావరాలపై దాడులు జరపవచ్చు. బ్రిటిష్ సైన్యం ఉపయోగించే డ్రాగన్ రన్నర్ చూడటానికి చిన్న పిల్లల ఆటబొమ్మలా ఉన్నా, ఇది చాలా సమర్థమైన రోబో వాహనం. రిమోట్‌తో నడిచే ఈ వాహనం మందుపాతరలను, పేలని బాంబులను ముప్పయి అడుగుల దూరం నుంచి గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. చైనా సైన్యం రోబో ఆర్మ్డ్ డాగ్‌ను ఇటీవల రంగంలోకి దించింది. ఇది చూడటానికి ఆటబొమ్మలా కనిపిస్తుంది గాని, దీనికి అమర్చిన ఆటోమేటిక్ గన్ ద్వారా కాల్పులు జరపగలదు. దీనిని రిమోట్ ద్వారా సుదూరం నుంచి ఉపయోగించుకోవచ్చు.మన అమ్ములపొదిలోనూ ఏఐ ఆయుధాలు..- రాజ్యాలకు పోటీగా భారత్ కూడా రోబోటిక్ ఆయుధాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది.హైదరాబాద్‌కు చెందిన ‘జెన్ టెక్నాలజీస్’ భారత సైన్యం కోసం ‘ప్రహస్త’ పేరుతో రోబో జాగిలాన్ని, ‘హాక్ ఐ’ పేరుతో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను సైతం గుర్తించగలిగే యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను, ‘స్థిర్ స్టాబ్–640’ పేరుతో నేలపై తిరిగే యుద్ధ వాహనాలతో పాటు యుద్ధనౌకల నుంచి ఆయుధాలను గురి తప్పకుండా ఉపయోగపడే పరికరాన్ని, ‘బర్బరీక్’ పేరుతో అల్ట్రాలైట్ రిమోట్ కంట్రోల్ కంబాట్ వెపన్ స్టేషన్‌ను రూపొందించింది. వీటన్నింటినీ దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి ఇవి సమర్థంగా ఉపయోగపడతాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.స్మార్ట్ ఆయుధాలు..‘స్మార్ట్’యుగం. స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన తరుణంలోనే వివిధ దేశాల సైనిక బలగాలు తమ ఆయుధాగారాల్లోకి స్మార్ట్ ఆయుధాలను కూడా చేర్చుకుంటున్నాయి. వీటిలో స్మార్ట్ గ్రనేడ్ లాంచర్లు, డిజిటల్ రివాల్వర్లు వంటివి ఉన్నాయి. అమెరికన్ సైన్యం దశాబ్దం కిందటే స్మార్ట్ గ్రనేడ్ లాంచర్‌ను వినియోగంలోకి తెచ్చింది. ‘ఎక్స్ఎం25 కౌంటర్ డిఫిలేడ్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సిస్టమ్’ (సీడీటీఈ) గ్రనేడ్ లాంచర్‌ను అఫ్గాన్ యుద్ధంలో ఉపయోగించింది. దీని నుంచి ప్రయోగించిన గ్రనేడ్లు లక్ష్యం వైపుగా దూసుకుపోయి సరిగా లక్ష్యంపైన లేదా లక్ష్యానికి అత్యంత చేరువలో గాల్లోనే పేలుతాయి. ఇవి 150 మీటర్ల నుంచి 700 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. డిజిటల్ రివాల్వర్లను స్మార్ట్‌వాచ్ ద్వారా లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆటబొమ్మల్లా కనిపించే ఈ డిజిటల్ రివాల్వర్లను పలు దేశాల సైనిక బలగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి చిత్రవిచిత్రమైన ఆయుధాలు కూడా ప్రస్తుతం విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. ఉదాహరణకు హాలీవుడ్ సినిమా ‘మైనారిటీ రిపోర్ట్’లో పోలీసు బలగాలు ‘సిక్ స్టిక్స్’ అనే ఆయుధాలు ఉపయోగించిన దృశ్యాలు ఉన్నాయి.‘సిక్ స్టిక్స్’ ఎవరిని తాకినా వారికి వెంటనే వాంతులవుతాయి. ఈ సినిమా 2002లో విడుదలైతే, 2007 నాటికల్లా దాదాపు ఇలాంటి ఆయు«ధాలే ‘వోమిట్ గన్స్’ వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ప్రాణాంతకమైన ఆయుధాలు కాకున్నా, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగపడతాయి. వీటి నుంచి వెలువడే రేడియో తరంగాలు లక్ష్యం దిశగా ప్రయాణించి, చెవులు గింగుర్లెత్తి, తలతిరిగేలా చేస్తాయి. వీటి బారి నుంచి క్షణాల్లోనే తప్పించుకోకుంటే, ఇవి వాంతులయ్యేలా చేస్తాయి. అమెరికన్ నావికాదళం కోసం ‘ఇన్వోకాన్’ కంపెనీ ఈ ‘వోమిట్ గన్స్’ను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే టాక్టికల్ డ్రోన్స్, అన్‌మేన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్లేన్స్, అటానమస్ ట్యాంక్స్, అటానమస్ వెపన్స్ వంటివి కూడా స్మార్ట్ ఆయుధాల కోవలోకే వస్తాయి. సంపన్న దేశాలు పోగేసుకుంటున్న ఇలాంటి ఆయుధాలు భారీస్థాయిలో విధ్వంసాలను సృష్టించగలవు. – పన్యాల జగన్నాథదాసు -
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్‌ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
ఇంటిని శుభ్రం చేసే రోబోట్లు.. ధర ఎంతంటే?
ఇంట్లోని నేల, గోడలు శుభ్రం చేయడం ఒక ఎత్తు అయితే, కిటికీలను శుభ్రం చేయడం మరో ఎత్తు. కిటికీలను ఇంటి లోపలి వైపు భాగాన్ని ఎలాగోలా శుభ్రం చేయవచ్చు. వెలుపల ఉన్న భాగాన్ని శుభ్రం చేయడం కష్టమే! అంతస్తుల కొద్ది నిర్మించిన అపార్ట్‌మెంట్లలోనైతే ఇది మరీ పెద్ద సమస్య. అంత శ్రమ లేకుండా కిటికీలను అన్ని వైపుల నుంచి ఇట్టే శుభ్రపరచగల రోబోను అమెరికన్ కంపెనీ ‘ఇకోవాక్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ‘విన్బో డబ్ల్యూ2’ పేరిట కిటికీలను శుభ్రం చేసే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఇటీవల జరిగిన ‘సీఈఎస్–2024’ షోలో సందర్శకులను ఆకట్టుకుంది. స్విచాన్ చేసుకుంటే చాలు, మనకు ఎలాంటి శ్రమ కలిగించకుండా ఇది కిటికీలను తళతళలాడేలా శుభ్రపరుస్తుంది. కిటికీ అద్దాలపై పేరుకున్న దుమ్మును మూల మూలల నుంచి తొలగిస్తుంది. వాటిపై ఉన్న మరకలను పూర్తిగా తుడిచేస్తుంది. దీని ధర 339.99 డాలర్లు (రూ.28,267) మాత్రమే! -
అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా!
లాస్ వేగాస్‌లో అట్టహాసంగా జరుగుతున్న 2024 సీఈఎస్ ఈవెంట్లో అత్యుత్తమ ఉత్పత్తులు కనివిందు చేస్తున్నాయి. ఈ ఈవెంట్లో సాధారణ ఉత్పత్తులకంటే కూడా కొత్త టెక్నాలజీతో అబ్బురపరిచే గ్యాడ్జెట్స్, వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కథనంలో ఏఐ (AI) టెక్నాలజీ కలిగిన ఉత్తమ గాడ్జెట్లను గురించి వివరంగా తెలుసుకుందాం. బల్లీ (BALLIE) సీఈఎస్ వేదికపై కనిపించిన ఉత్తమ ఏఐ ఉత్పత్తులలో ఒకటి 'బల్లీ'. శామ్సంగ్ కంపెనీ లాంచ్ చేసిన ఈ గ్యాడ్జెట్ చూడటానికి చిన్న బాల్ మాదిరిగా ఉంటుంది. కానీ పనితీరులో మాత్రం దానికదే సాటి అని చెప్పాలి. నిజానికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ డివైజ్ అయినప్పటికీ.. ఇంట్లో చాలా పనులు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెల మీద, పైకప్పు మీద కూడా ప్రాజెక్ట్ చేయగల కెపాసిటీ కలిగిన బల్లీ.. ఈవెంట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ గ్యాడ్జెట్ ధర, వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. (Image credit: Future) LG స్మార్ట్ హోమ్ ఏజెంట్ శామ్సంగ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోకుండా.. LG కంపెనీ కూడా ఓ స్మార్ట్ హోమ్ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ గ్యాడ్జెట్ ఒక స్మార్ట్ హబ్. ఇది ChatGPT వాయిస్‌తో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని పర్యవేక్షించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఈ ఏఐ రోబోటిక్ ధర కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. (Image credit: LG) సెగ్వే నవిమో (SEGWAY NAVIMOW) సెగ్వే నవిమో అనేది ఓ రోబోట్ లాన్‌మూవర్స్. నిజానికి రోబోట్ లాన్‌మూవర్స్ ఈ రోజు ఆలోచన కాదు. అయితే సీఈఎస్ వేదికపై కనిపించిన ఈ సెగ్వే నవిమో ఏఐ టెక్నాలజీ కలిగిన గ్యాడ్జెట్. ఇది బ్లేడ్హాల్ట్ సెన్సార్, రెయిన్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, విజన్ఫెన్స్ సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అమెరికాలో ఈ గ్యాడ్జెట్ ధరలు అందుబాటులో లేదు కానీ.. యూరప్ మార్కెట్లో 1300 డాలర్ల ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. (Image credit: Segway) ఓరో (ORO) శామ్సంగ్, LG గ్యాడ్జెస్ట్స్ కంటే కూడా ఓరో అనేది పెంపుడు జంతువులకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది.పెద్ద పెద్ద కళ్ళు కలిగిం ఈ పరికరం బంతిని విసరడం, ఆహారాన్ని అందించడం వంటివి చేసేలా రూపొందించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటుంది. దీని ధర 799 డాలర్లు. ఏప్రిల్ నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పుడు దీనిని 299 డాలర్ల డౌన్‌పేమెంట్‌తో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. (Image credit: ORo) మొబిన్ (MOBINN) సాధారణంగా గ్యాడ్జెట్స్.. ఇంటి పరిసరాల్లో లేదా ఇంట్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో తిరగటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ మొబిన్ అనేది మెట్లను కూడా ఎక్కగలదు. ఫ్లెక్సిబుల్ వీల్స్‌తో కూడిన ఈ రోబోట్ మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. LiDAR-బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్‌ను కలిగిన మొబిన్ వర్షం, మంచు, రాత్రి సమయంలో కూడా పని చేస్తుంది. సంస్థ ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ డేట్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. (Image credit: MOBINN) లూనా (LOONA) సాధారణంగా ఎవరైనా తమను ఎంటర్టైన్ చేయడానికి పెంపుడు జంతువులను పెంచుకుంటారు. అయితే లూనా అనే రోబోట్ పెంపుడు జంతువులకు ఏ మాత్రం తీసిపోదు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. ChatGPT ఆధారంగా పనిచేస్తుంది. ఇది కదిలే హోమ్ మానిటర్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. దీని ధర 380 డాలర్ల వరకు ఉంటుంది. (Image credit: keyirobot) రోబోట్ వాక్యూమ్ రోబోట్ వాక్యూమ్ అనేది వాయిస్ అసిస్టెంట్, రోబోట్ ఆర్మ్, వీడియో కాలింగ్ ఫంక్షనాలిటీ వంటి వాటిని పొందుతుంది. CES 2024 వేదికగా కనిపించిన అద్భుతమైన గ్యాడ్జెట్లలో ఇది కూడా ఒకటి. మరొక పరికరం అవసరం లేకుండా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ పరికరం లోపల ఉండే కెమెరా యజమానికి కాల్ చేయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ రోబోట్ వాక్యూమ్ ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
నిప్పుకు ఇక చెక్
సాక్షి, అమరావతి: అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఆకాశం నుంచి ఎగురుకుంటూ డ్రోన్లు వచ్చేస్తాయ్. మంటలు చెలరేగిన భవనాల్లోకి చకచకా వెళ్లి మంటల్ని అదుపుచేసే రోబోలు సైతం రాబోతున్నాయ్. త్వరలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధునాతన సాధనా సంపత్తిని సంతరించుకోనుంది. అగ్ని ప్రమాదాలకు తక్షణం చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర అగ్నిమాపక వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం రాష్ట్ర విపత్తుల స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక వ్యవస్థలకు ఆధునిక పరికరాలను సమకూర్చేందుకు ప్రణాళికను ఆమోదించింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు రూ.295 కోట్లతో కార్యాచరణ చేపట్టింది. ఇరుకైన ప్రదేశాలు.. ఎత్తైన భవనాల్లోకీ వెళ్లేలా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరాలు, పట్టణాల జనాభా అధికంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా నగర, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. పెద్దపెద్ద ఆకాశ హార్యా్మలు, పలు కంపెనీలు నిర్మాణం సర్వసాధారణంగా మారింది. అటువంటి ఎత్తైన భవనాలు, కంపెనీల కార్యాలయాలతోపాటు నగరాలు, పట్టణాల్లో ఇరుకైన ప్రదేశాల్లో పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేయడం సవాల్‌గా మారింది. ఫైర్ ఇంజిన్లు, ఇతర అగ్నిమాపక వాహనాలు, పరికరాలను ప్రమాదం సంభవించిన ప్రదేశానికి తీసుకువెళ్లి మంటలను అదుపు చేయడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా కనిష్ట సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి మొత్తం రూ.295 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 50 శాతం నిధులతో ఆధునిక అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో అగ్నిమాపక డ్రోన్లు, రోబోలతోపాటు ఎత్తైన భవనాల్లో చెలరేగే మంటలను అదుపు చేసేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ ప్లాట్ఫారాలతోపాటు 16 రకాల ఆధునిక పరికరాలు ఉండటం విశేషం. మరో 30 శాతం నిధులతో కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం, 20 శాతం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలుగా గుర్తించి వాటిని వినియోగించనుంది. కొనుగోలు చేయనున్న పరికరాలు ♦ అగ్ని మాపక డ్రోన్లు, అగ్నిమాపక రోబోలు ♦హైడ్రాలిక్ ప్లాట్‌ఫారాలు, టర్న్ టేబుల్ ల్యాడర్లు ♦ ఇరుకు ప్రదేశాల్లోకి వెళ్లగలిగే అగ్నిమాపక మోటారు సైకిళ్లతో కూడిన మిస్ట్ ఫైటింగ్ యూనిట్లు ♦ హజ్మత్ వ్యాన్లు, అత్యవసర వైద్య సహాయం అందించే మెడికల్ కంటైనర్లు ♦ లైట్ రెస్క్యూ టెండర్లు, మినీ వాటర్ టెండర్లు ♦ క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్సస్ వాహనాలు, రెస్క్యూ బోట్లు ♦ వాటర్ బ్రౌజర్లు, హై ప్రెజర్ పంపులతో కూడిన రెస్క్యూ వాహనాలు ♦ ఫైర్ ఫైటింగ్ ఫిటింగ్స్, సిబ్బందికి రక్షణ కల్పించే పరికరాలు -
కలుపును నిర్మూలించే రోబోలొస్తున్నాయ్!
మన దేశంలో పంట పొలాల్లో కలుపు వల్ల రైతులకు ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం రూ. 1980 కోట్లని నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లెక్కతేల్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు (అటానమస్ రొబోటిక్ వీడ్ కంట్రోల్ సిస్టమ్స్) వస్తున్నాయి. కృత్రిమ మేధ, జీపీఎస్, జిఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన ‘రోబో కూలీలు’ ఇవి. వీటిల్లో అనేక రకాలున్నాయి. కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి. గాలి, మంట (ఫ్లేమ్), చలి గాలి, మైక్రోవేవ్స్, లేజర్ కిరణాలు, వాటర్ జెట్‌ను ప్రయోగించటం ద్వారా (పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా) కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత. వీటి ఖరీదెక్కువ. నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది. కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయి. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మరో దిగ్గజ కంపెనీలో 30% ఉద్యోగులపై వేటు... కారణాలు తెలిస్తే షాక్ అవుతారు
-
ఉద్యోగులకు షాక్..వీఆర్ఎస్పై హీరోమోటోకార్ప్ కీలక ప్రకటన!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. మోటో కార్ప్ సంస్థ టూవీలర్ల తయారీలో రోబో టెక్నాలజీని వినియోగించాలని, తద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్యోగులకు వన్‌టైమ్ సెటిల్మెంట్, వేరియబుల్ పే, మెడికల్ కవరేజ్, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇక గత రెండేళ్లలో మార్కెటింగ్, ఆర్అండ్డీ, హెచ్ఆర్, ఎలక్ట్రిక్ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. ఫైనాన్స్, ఎలక్ట్రిక్ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. తాజాగా వీఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. -
Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!
వ్యయ నియంత్రణ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్.. లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే కాదు.. రోబోలకు కూడా వర్తింపజేసింది. కేఫిటేరియాలలో పనిచేస్తున్న రోబోలకు ఉద్వాసన పలికింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రోబోల అభివృద్ధి, శిక్షణ కోసం ఎవ్రీడే రోబోట్స్ పేరిట ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసిందని ‘వైర్డ్’ కథనం పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ కార్యాలయాల్లోని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడంతో పాటు వివిధ పనులు చేయడానికి రోబోలను వినియోగించేవారు. ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్‌లో 200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రాలపై నడిచే వన్ ఆర్మ్డ్ రోబోలను 100కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. వీటని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడం, చెత్తను సేకరించి వేరు చేయడం, తలుపు తెరవడం వంటి పనులు చేసేందుకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటితో కాన్ఫరెన్స్ రూములు కూడా శుభ్రం చేయించినట్లు ‘వైర్డ్’ కథనంలో వివరించింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!) రోబోలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోదాని నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని రోబోటిక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యయ నియంత్రణ పరిస్థితుల్లో అంత ఖర్చును భరించడానికి ఆల్ఫాబెట్ సిద్ధంగా లేదు. అందుకే ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్ట్ లాభదాయకం కాదన్న భావనతో దాన్ని నిలిపేసింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే సిబ్బందిని ఇతర రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలోకి బదిలీ చేసింది. -
మానవ మేధకు మరో రూపం.. హెచ్చరించిన స్టీఫెన్ హాకింగ్!
హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ 2004లో నటించిన చిత్రం ‘ఐ–రోబోట్’ గుర్తుంది కదా! అందులో రోబోలు మానవ సైకాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అమెరికాలో 2035 నాటికి ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని నిర్మించిన ఊహాజనిత చిత్రమది. పరిస్థితి అంతలా కాకున్నా.. 2045 నాటికి మానవ మేధస్సుతో సమానంగా పోటీపడే సాంకేతిక పరిజ్ఞానం సాధ్యమేనంటున్నారు.. టెక్ నిపుణులు. ప్రస్తుత ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ’ని దాటి మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని సమస్యలు పరిష్కరించే ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)’ టెక్నాలజీ వస్తుందంటున్నారు. హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ కంపెనీ 2016లో ఏఐ టెక్నాలజీతో నిర్మించిన ‘సోఫియా’ హూమనాయిడ్ రోబో ప్రోగ్రామింగ్‌కు అనుగుణంగా పనిచేస్తోంది. అలాగే యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ సంస్థ 2021 డిసెంబర్లో అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీతో నిరి్మంచిన ‘అమెకా’ హూమనాయిడ్ రోబో మానవ ముఖ కవళికలను అర్థం చేసుకోవడంతో పాటు ఎన్నో హావభావాలను పలికిస్తోంది. ఇకపై వచ్చే టెక్నాలజీ మనిíÙతో పోటీపడుతుందని.. అది ఆర్టిఫిíÙయల్ జనరల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికతతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తాయని చెబుతున్నారు. ఈ రోబోలు మానవ మేధస్సును మించిపోతే ముప్పు కూడా ఉండొచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. యంత్రానికి ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఏజీఐ.. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషికున్న ఇంగిత జ్ఞానం (కామన్సెన్స్) యంత్రాలకు, సాఫ్ట్‌వేర్‌కు ఉండదు. ఒకవేళ యంత్రాలకే ఇంగితజ్ఞానం ఉంటే.. అది ఆరి్టఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అవుతుందని దీన్ని సమర్థించేవారు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఏజీఐ అనేది సమగ్రమైన, పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాలు గల తెలివైన వ్యవస్థగా అభివరి్ణస్తున్నారు. ప్రస్తుతం ఏ పనిచేయాలన్నా టెక్నాలజీ, సాఫ్ట్వేర్ తప్పనిసరిగా మారింది. అయితే, వాటిలో సాంకేతిక సమస్య ఎదురైతే నిపుణులైన వారే సరిచేయాలి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. అయితే, టెక్నాలజీలో ఏ సమస్య ఎదురైనా ఏజీఐ గుర్తించి పరిష్కరిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక కాలంలో మనిషి చేయగల ఏ పనినైనా ఏజీఐ వ్యవస్థ చేస్తుందంటున్నారు. ప్రస్తుతానికి నూరు శాతం పనిచేసే ఏజీఐ వ్యవస్థ లేకపోయినప్పటికీ.. అత్యంత బలమైన ఈ కృత్రిమ మేధస్సును టెక్ దిగ్గజ సంస్థ ఐబీఎం తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలోను కొంతమేర వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఎలాంటి డేటానైనా అద్భుతమైన వేగంతో యాక్సెస్ చేయడంతోపాటు ప్రాసెస్ చేస్తుందంటున్నారు. అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో మానవ మెదడు కంటే వందల రెట్లు వేగంగా స్పందిస్తుందని పేర్కొంటున్నారు. ఏజీఐ వ్యవస్థ ఇంగిత జ్ఞానం, నిశిత ఆలోచన, బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ లెరి్నంగ్ వంటి సామర్థ్యాలను కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. అందువల్లమనిíÙలాగే సృజనాత్మకంగా ఆలోచిస్తుందని చెబుతున్నారు. ఏజీఐతో ఏ పనైనా సుసాధ్యమే.. ప్రస్తుతం ఏజీఐ టెక్నాలజీని కొన్ని విభాగాలలో కొంతమేర వినియోగిస్తున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐబీఎం వాట్సన్ సూపర్ కంప్యూటర్లు సగటు కంప్యూటర్ చేయలేని గణనలను చేయగలవని అంటున్నారు. వీటిని పూర్తిస్థాయి ఏజీఐ టెక్నాలజీతో అనుసంధానం చేస్తే విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. రోగి డేటా ఆధారంగా ఔషధాలను కూడా సిఫారసు చేయవచ్చంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వినియోగిస్తే.. రోడ్డుపై ఇతర వాహనాలు, వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతో పాటు డ్రైవింగ్ నిబంధనలకు కట్టుబడి ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. ప్రమాదాలను ముందుగానే నూరు శాతం గుర్తించి గమనాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని వివరిస్తున్నారు. ఏఐ అటార్నీగా పిలిచే ‘రోస్ ఇంటెలిజెన్స్’ (న్యాయ నిపుణుల వ్యవస్థ)లోని ఒక బిలియన్ టెక్ట్స్ డాక్యుమెంట్ల డేటాను విశ్లేషించి.. సంక్లిష్టమైన ప్రశ్నలకు మూడు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో సమాధానం చెప్పగలదని ప్రయోగాలు నిరూపించాయంటున్నారు. అయితే, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 2014లో ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఏజీఐ సాధ్యమే.. పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందితే అది మానవజాతిని అంతం చేస్తుంది. ఇది తనంత తానుగా నిర్ణయాలు తీసుకుంటుంది.. మానవులు దానితో పోటీ పడలేరు’’ అని హెచ్చరించారు. అయినప్పటికీ, కొంతమంది ఏఐ నిపుణులు ఏజీఐ టెక్నాలజీ అవసరమని భావిస్తున్నారు. దీనిపై పనిచేస్తున్న అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ 2029కి కంప్యూటర్లు మానవ మేధస్సు స్థాయిని సాధిస్తాయని స్పష్టం చేస్తున్నారు. 2045 నాటికి ఏజీఐ టెక్నాలజీ, మానవ మేధస్సు సమానంగా పనిచేస్తాయని తెలిపారు. ‘ఏఐ’ని మించిన టెక్నాలజీ.. సిద్ధాంతపరంగా మనిషి ఏ పనిచేసినా మేధస్సును ఉపయోగించి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మనిíÙకంటే మెరుగ్గా, చురుగ్గా పనిచేస్తేనే టెక్నాలజీకి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ టెక్నాలజీ మనిషి చేసే కొన్ని నిర్దిష్ట పనులు మాత్రమే చేయగలుగుతుంది. అంటే.. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఎదురైతే హెచ్చరిస్తుంది గాని సమస్యను పరిష్కరించలేదు. వాహనాల్లో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ ప్రమాదాలను గుర్తించి హెచ్చరిస్తుంది గాని ఆపలేదు. ఇప్పటికే ఉన్న అనేక ఏఐ సిస్టమ్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, నిర్దిష్ట సమస్యలు పరిష్కరించడానికి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఫోర్స్మెంట్ లెరి్నంగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు అవసరమవుతాయి. అయితే, ఇవేమీ మానవ మెదడు సామర్థ్యాన్ని చేరుకోలేకపోయాయి. అయితే ఏజీఐ టెక్నాలజీ మాత్రం మానవ సామర్థ్యాలతో సమానంగా లేదా అంతకు మించిన కృత్రిమ మేధస్సుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్న నిపుణులు భవిష్యత్‌లో పూర్తి స్థాయి ఏజీఐ టెక్నాలజీ సాధ్యమేనంటున్నారు. (నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) -
Sagubadi: గాల్లో ఎగురుతూ పండ్లు కోసే రోబోలు! ఆపిల్స్, అవకాడో, పియర్స్..
పండ్ల కోత కూలీలు సమయానికి దొరక్క రైతులు నానా యాతన పడుతూ ఉంటారు. కూలీల కొరత వల్ల కోత ఆలస్యం కావటం, నాణ్యత కోల్పోవటం.. రైతులు ఆశించిన ధర దక్కకపోవటం చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా కోత కూలీలు దొరక్క ఏటా 3 వేల కోట్ల డాలర్ల మేరకు రైతులు నష్టపోతున్నారు. రెండు వారాలు ఆలస్యంగా కోసిన పండ్ల వెల 80% తగ్గిపోతున్నదట. 2050 నాటికి 50 లక్షల మంది పంట కోత కార్మికుల కొరత నెలకొంటుందని అంచనా. కోసే వాళ్లు లేక 10% పండ్లు కుళ్లిపోతున్నాయట. ఈ సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపుతోంది. ఎత్తయిన చెట్ల నుంచి పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే సుతిమెత్తగా పట్టుకొని కోసి తెచ్చే రోబోలు వచ్చేశాయి. PC: Kubota తోటలో నేల మీద కదులుతూ స్ట్రాబెర్రీలు, కూరగాయలు, పండ్లను కోసే రోబోలు వున్నాయి. అయితే, గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల నుంచి పండ్లు కోసే రోబోలను కూడా తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ విజయవంతంగా రూపొందించింది. ఇజ్రాయిల్‌కు చెందిన టెవెల్ ఏరోబోటిక్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి స్వతంత్రంగా ఎగురుతూ చెట్ల నుంచి పండ్లను కోసే రోబోలను తయారు చేసింది. ఈ రోబోలకు మీటరు పొడవుండే ఇనుప చెయ్యిని బిగించారు. కోయాల్సిన పండు రకాన్ని బట్టి ఈ చేతిలో తగిన మార్పులు చేస్తారు. అత్యాధునిక కృత్రిమ మేథను కలిగి ఉన్నందున ఏ రంగు, ఏ సైజు పండు కొయ్యాలి? ఏది అక్కర్లేదు? అనే విషయాన్ని ముందుగానే వీటికి ఫీడ్ చేస్తారు. ఆ సమాచారం మేరకు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా సెన్సార్లు, కామెరాల సహాయంతో ఈ రోబోలు పనిచేస్తున్నాయి. పక్వానికి వచ్చిన పండ్లనే కచ్చితంగా గుర్తించి కోయగలుగుతున్నాయని టెవెల్ ఏరోబోటిక్స్ సీఈవో యనివ్ మోర్ తెలిపారు. ఒక వ్యాన్‌పై నాలుగు పండ్లు కోసే రోబోలను వైర్లతో అనుసంధానం చేస్తారు. అవి చెట్లపై ఎగురుతూ పండ్లను కోసి, వాటిని జాగ్రత్తగా వ్యాన్‌పై పెడతాయి. ఈ రోబోలు ఒక ఆప్‌తో అనుసంధానమై ఉండి రైతుకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. ఎంత మొత్తంలో పండ్ల కోత పూర్తయ్యింది? ఏదైనా పురుగుమందు లేదా చీడపీడల ప్రభావం ఉందా? అనే విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తాయి. ఆపిల్స్ నుంచి అవకాడో వరకు అనేక రకాల పండ్లను ఈ రోబోలు అవలీలగా రాత్రీ పగలు నిరంతరాయంగా కోస్తున్నాయని కంపెనీ చెప్తోంది. ఆపిల్స్, అవకాడో, పియర్స్, నారింజ తదితర పండ్ల కోత పరీక్షల్లో చక్కని ఫలితాలు వచ్చాయి. సాధారణంగా రెండున్నర ఎకరాల్లో పండ్ల కోతకు ఒక ఎగిరే రోబో సరిపోతుందట. అయితే, చెట్ల వయసు, పండ్ల రకం, సైజులను బట్టి ఎంత తోటకు ఎన్ని రోబోలు అవసరమవుతాయన్నది ఆధారపడి ఉంటుంది. ‘గాలిలో ఎగురుతూ పండ్లను కోసే రోబోలు మావి మాత్రమే. ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్నాం’ అంటున్నారు ఆ కంపెనీ సీఈవో. సుమారు 3 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఐదేళ్లు పరిశోధించి కంపెనీ ఈ వినూత్న రోబోలను తయారు చేసింది కదా.. ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందిగా మరి! మన దేశంలో ఎంత ధరకు అమ్ముతారో వేచి చూద్దాం... చదవండి: Sagubadi: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఇలా తయారు చేసుకోండి.. కోకోపోనిక్స్ సాగులో.. -
మెర్సిడెజ్ బెంజ్: విధుల నుంచి రోబోట్ల తొలగింపు, ఉద్యోగుల నియామకం!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీలో రోబోట్ల కంటే మనుషులే మేలని నమ్ముతుంది. అందుకే ప్రస్తుతం కార్ల మ్యానిఫ్యాక్చరింగ్లో ఉన్న రోబోట్లను తొలగించింది. వాటి స్థానంలో మనుషుల్ని నియమించనుంది. జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్, ఎలక్ట్రిక్ అవతార్ మెర్సిడెస్ ఈక్యూఎస్, మేబాక్, ఏఎంజీ వెహికల్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ 56లో, అలాగే ఓల్డ్ ఫ్యాక్టరీ 46లో గతంలో ఉన్న 25-30శాతం రోబోట్లలో 10 కంటే తక్కువకు తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగా, లగ్జరీ కార్ల తయారీదారు ఇప్పుడు కంబస్టివ్-ఇంజిన్, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను అదే స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే రోబోట్లు కార్ల తయారీని ఒక్కో పని మాత్రమే చేస్తాయి. అదే మనుషులైతే ఒకే సారి పలు మోడళ్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని నమ్ముతుంది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్ సైట్ మేనేజర్ మైఖేల్ బాయర్ మాట్లాడుతూ..రోబోట్లను మనుషులు భర్తీ చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ సామర్ధ్యం పెంచుతుందని బౌయర్ వివరించాడు. వినియోగదారుల డిమాండ్ పెరిగే కొద్ది కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీల్లో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణమని అన్నారు. -
రోబోలొచ్చేస్తున్నాయ్.. జాగ్రత్త
రోబోల రాకతో.. ఇప్పటికే ఉద్యోగాల విషయంలో మనకు గడ్డు కాలం మొదలైంది.. భవిష్యత్తులో అది మరింత పెరగనుందనడానికి సూచిక ఈ చిత్రం. ఇది లండన్‌లోని ఓ భారీ గోదాము.. ఇక్కడ మనుషులకు బదులు రోబో కాదు.. రోబోల సైన్యమే ఉంది. సుమారు 35 సూపర్ మార్కెట్లకు సమానమైన ఈ గోడౌన్లో సుశిక్షితులైన సిబ్బంది చేసే దానికన్నా ఐదురెట్ల వేగంతో ఇవి పనికానిచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏం చేస్తున్నాయి.. బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఆన్లైన్ గ్రాసరీ వెబ్సైట్ ఒకాడో తమ వినియోగదారులకు వీలైనంత త్వరగా సరుకులను సిద్ధం చేసేందుకు నూతన పంథాను ఎంచుకుంది. లండన్‌లో 5,63,000 చదరపు అడుగుల్లో ఉన్న తమ గోదాములో సుమారు 50 వేల రకాల వస్తువులను... ఆర్డర్లు అందిన వెంటనే డెలివరీ బాయ్స్‌కు అందించేందుకు వీలుగా 2 వేలకుపైగా రోబోలను వినియోగిస్తోంది. 8 చక్రాలతో పరుగులు తీసే ఈ రోబోలు తేనెతుట్టె గదులను పోలినట్లుగా ఉండే నిలువాటి పెట్టెల్లో అమర్చిన స్టాక్‌ను క్షణాల్లో సేకరించేస్తున్నాయి. తమకున్న ‘చేతుల’తో వస్తువులను అందుకొని వాటిని నిలువాటి గొట్టంలో వేయడం ద్వారా పికప్ స్టేషన్‌లోని సిబ్బంది వద్దకు పంపుతున్నాయి. ఈ రోబోలు 20 గంటలపాటు నిర్విరామంగా పనిచేస్తూ ఒక షిఫ్టులో ఏకంగా 20 లక్షల ఆహార వస్తువులను పెట్టెల్లోంచి తీసుకెళ్తున్నాయి. ఏ పెట్టెలో ఏమేం వస్తువులు ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు.. పక్కదాన్ని ఢీకొనకుండా ఎలా వెళ్లాలో ముందే సిద్ధం చేసిన కంప్యూటర్ అల్గోరిథమ్ ద్వారా బాట్స్ అని పిలిచే ఈ రోబోలు మొత్తం ప్రక్రియను పూర్తిచేస్తున్నాయి. ఈ రోబో సైన్యం వల్ల వేలాది మంది సిబ్బంది అవసరం, ఖర్చు తగ్గిందని ఒకాడో తెలిపింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మిలటరీలో మరమనిషి
మనిషిని దేవుడు సృష్టిస్తే, ఆయనకు పోటీగా మరమనిషిని మనిషి సృష్టించుకున్నాడు. అంతటితో ఆగక వాటిని మృత్యురూపాలుగా మారుస్తున్నాడు. వీటి వాడకంతో సంప్రదాయ యుద్ధ రూపురేఖలు మార్చేశాడు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సృష్టికర్తనే మింగే భస్మాసుర రోబోలు అవతరించడానికి అట్టేకాలం పట్టదంటున్నారు నిపుణులు. మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. కాలక్రమేణా వీటిని మారణహోమం సృష్టించే మిషన్లుగా వాడడం ఆరంభమైంది. సైనిక రంగంలో రోబోల వాడకం నైతికం కాదన్న వాదనలున్నా, వీటి వాడకం మాత్రం పెరిగిపోతూనే ఉంది. యుద్ధరంగంలోకి రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ యుద్ధ నమూనాలను మార్చివేస్తోంది. ప్రస్తుతం మిలటరీలో ఉన్న రోబోలు అటు పోరాటంతో పాటు ఇటు రెస్క్యూ (కాపాడడం) ఆపరేషన్లలో, పేలుడు పదార్థాలను కనిపెట్టి నిర్వీర్యం చేయడంలో, గూఢాచర్యంలో, రవాణాలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి రాక సాంప్రదాయక యుద్ధ విధానాలను ఒక్కపెట్టున మార్చేసింది. ఆధునిక రోబో సాంకేతికత అందుబాటులో ఉన్న మిలటరీ అత్యంత బలంగా మారుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు నైతికతను పక్కనపెట్టి మరీ, తమ తమ మిలటరీకి మరమనిషి సాయం అందించేందుకు కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 మిలటరీ రోబోల వివరాలు ఇలా ఉన్నాయి. మార్స్ (ఎంఏఏఆర్‌ఎస్) ► మాడ్యులార్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్‌కు సంక్షిప్త నామమే మార్స్. ► ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు. ► దీంట్లో శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థను, కెమెరాలను, ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను అమర్చారు. ► గ్రెనేడ్ లాంచర్ లాంటి భయంకర జనహనన ఆయుధాలను దీనికి అనుసంధానిస్తారు. ► ఈ ఆయుధాలను రిమోట్‌తో నిర్వహించి విధ్వంసం సృష్టిస్తారు. ► ధర సుమారు 3 లక్షల డాలర్లు. వేగం గంటకు 11 కిలోమీటర్లు. సఫిర్ (ఎస్ఏఎఫ్ఎఫ్ఐఆర్) ► చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది. ► డామేజ్ కంట్రోల్లో మనిషి చేయలేని పనులు చేసేందుకు దీన్ని రూపొందించారు. ► ఇది కూడా మానవ రహిత రోబోనే. ► దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు. ► ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు. గ్లాడియేటర్ ► గ్లాడియేటర్ టాక్టికల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్‌ను సంక్షిప్తంగా గ్లాడియేటర్ అంటారు. ► గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగిస్తారు. ► దీంతో పాటు అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు. ► అవసరమైతే నేరుగా కాల్పులు జరపగలదు. ► ధర దాదాపు 4 లక్షల డాలర్లు. బిగ్‌డాగ్ ► పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుంది. ► బోస్టన్ డైనమిక్స్ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు. ► ఎలాంటి ఉపరితలాలపైనైనా సులభంగా ప్రయాణం చేస్తుంది. ► దీన్ని మిలటరీ లాజిస్టిక్స్‌లో వాడుతున్నారు. ► సులభమైన కదలికల కోసం పలు రకాల సెన్సార్లు ఇందులో ఉంటాయి. ► ధర దాదాపు 74 వేల డాలర్లు. డోగో ► ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలున్న ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది. ► ఇందులో ఉన్న తుపాకీ గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్ కెమెరాలుంటాయి. ► రేంజర్ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తారు. జనరల్ రోబోటిక్స్ తయారు చేస్తోంది. ► ఈ రోబోను భారతీయ ఎన్ఎస్జీ వాడుతోంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పెట్‌మాన్ ► ప్రొటెక్షన్ ఎన్సెంబుల్ టెస్ట్ మానిక్విన్ సంక్షిప్త నామమే పెట్‌మాన్. ► ఇది చూడ్డానికి మనిషిలాగా ఉండే హ్యూమనాయిడ్ రోబో. ► మానవ సైనికుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి రూపొందించారు. ► ఇది మనిషిలాగా నడవడం, పాకడం, పరిగెత్తడంతో పాటు చెమట కూడా కారుస్తుంది. ► భవిష్యత్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో వాడబోతున్నారు. ► దీని రూపకల్పనకు దాదాపు 2.6 కోట్ల డాలర్లు ఖర్చైందని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అట్లాస్ ► ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించారు. ► ప్రమాదకరమైన వాల్వులను మూసివేయడం, తెరుచుకోని బలమైన తలుపులను తెరవడం, మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు. ► చూడటానికి మరుగుజ్జులాగా కనిపిస్తుంది. ► గాల్లోకి దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు. ► ధర సుమారు 75 వేల డాలర్లు. గార్డ్‌బోట్ ► రక్షణ మిషన్లలో పాలుపంచుకుంటూనే పరిస్థితులను వీడియో తీసి లైవ్ స్ట్రీమింగ్ చేయగలగడం దీని ప్రత్యేకత. ► గుండ్రంగా బంతిలాగా ఉండే ఈ రోబో ఉభయచర రోబో. ► నేలపై, నీళ్లలో ప్రయాణించగలదు. ► బురద, మంచును లెక్క చేయకుండా దొర్లుకుంటూ పోగలదు. ► నిఘా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పీడీ100 బ్లాక్ హార్నెట్ ► ఫ్లిర్ సిస్టమ్స్ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది. ► వాడుకలో ఉన్న అతిచిన్న డ్రోన్ రోబో. కీటకం సైజులో కనిపిస్తుంది. ► భారత్ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి. ► దీన్ని అపరేట్ చేసే విధానాన్ని కేవలం 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ► అరగంట చార్జింగ్‌తో అరగంట పాటు గాల్లో తిరగగలదు. ► గరిష్ఠ వేగం గంటకు 21 కిలోమీటర్లు. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు. ఎల్ఎస్3 ► లెగ్గడ్ స్క్వాడ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ► నాలుగు కాళ్లుండే ఈ రోబో సైనికులకు సామాన్లు మోసే గుర్రంలాగా ఉపయోగపడుతుంది. ► ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత. ► చిన్న పాటి వాయిస్ కమాండ్స్‌ను ఆర్థం చేసుకుంటుంది. ► 400 పౌండ్ల బరువును మోయగలదు. ► బిగ్‌డాగ్ రోబోతో పోటీ పడుతుంది. ► ధర దాదాపు లక్ష డాలర్లు. ఎంతవరకు కరెక్ట్? మిలటరీలో రోబోలను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగాలున్నాయనేవారికి సమానంగా వీటి వాడకాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. సైనిక రోబోలతో మానవ సైనికుల ప్రాణాలను రక్షించవచ్చు. మనిషిలాగా వీటికి అలసట రాదు. కనురెప్ప వాల్చకుండా కాపలా కాస్తాయి. వానకు, ఎండకు బెదరవు. మానవ సంబంధ బలహీనతలకు లొంగవు. ముఖ్యంగా యుద్ధమంటే ఏ దశలో కూడా భయం చెందవు. వీటి గురి తప్పదు. వీటితో సమయం ఆదా అవుతుంది. మనిషి చేయలేని పనులను కూడా చేయగలవు. అందుకే వీటిని వాడడం మంచిదేనంటారు సమర్ధకులు. అయితే ఈ వాదనను మానవ హక్కుల కార్యకర్తలు, ఎన్జీఓలు వ్యతిరేకిస్తుంటాయి. కిల్లర్ రోబోల వాడకం నైతిక విలువలకు దూరమని వీరి వాదన. ఎదుటి పక్షం సైనికులు కూడా మనుషులేనని ఇవి గుర్తించవు. వారిని దయాదాక్షిణ్యం లేకుండా ఈ రోబోలు క్రూరంగా మట్టుబెడతాయి. వీటి ఖరీదు చాలా అధికం. అందువల్ల ధనిక దేశాలు మాత్రమే భరించగలవు. ఇది ఆయా దేశాలకు మిగిలిన బలహీన దేశాలపై పైచేయినిస్తుంది. యుద్ధం మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఒక్కమారుగా పరిస్థితి తలకిందులవుతుంది. అన్నిటికి మించి మితిమీరిన సాంకేతికతతో ఈ రోబోలు స్వతంత్రంగా మారితే జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయని కిల్లర్ రోబోల వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ఎవరివాదన ఎలాఉన్నా ప్రస్తుతానికి ప్రభుత్వాలు మాత్రం వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
సరిహద్దుల్లోకి చైనా రోబోట్లు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం చైనా సరిహద్దుల్లో మరో కుయుక్తికి తెరలేపింది. అతి శీతల, ఎత్తైన పర్వత ప్రాంతంలో భారత సైన్యంతో ధీటుగా తలపడలేని పీఎల్ఏ (చైనా సైన్యం) మెషిన్ గన్లను బిగించిన రోబోట్లను రంగంలోకి దించింది. ఆయుధాలను, ఇతర సరఫరాలను చేరవేయగలిగే మానవరహిత వాహనాలను అత్యధిక భాగం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోనే ఉంచినట్లు్ల సమాచారం. షార్ప్ క్లా అనే పేరున్న రోబోట్‌కు తేలికపాటి మెషిన్‌గన్ బిగించి ఉంటుంది. దీనిని రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. మ్యూల్–200 అనే మరో రోబో కూడా మనుషులతో అవసరం లేకుండానే ఆయుధాలను ఉపయోగించగలదు. టిబెట్ ప్రాంతంలో మోహరించిన మొత్తం 88 ‘షార్ప్ క్లా’రోబోల్లో 38, మ్యూల్ రకానికి చెందిన 120 రోబోల్లో అత్యధికం తూర్పులద్దాఖ్ ప్రాంతంలోనే చైనా మోహరిం చినట్లు సమాచారం. వీటికితోడుగా, సాయుధ బలగాలను తరలించే వీపీ–22 రకానికి చెందిన మొత్తం 70 వాహనాలకు గాను 47 వాహనాలను సరిహద్దుల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా పేర్కొంది. అంతేకాకుండా, అన్ని రకాల ప్రాంతాల్లో మోర్టార్లు, శతఘ్నులు, హెవీ మెషిన్గన్ల వంటివాటిని తరలించేందుకు లింక్స్ రకం వాహనాలను కూడా సైన్యానికి తోడుగా సరిహద్దుల్లోనే చైనా ఉంచిందని సమాచారం. -
చిట్టి చిట్టి రోబో కాదు..పిల్లల్ని కనే రోబో
సాక్షి, హైదరాబాద్: రానురాను ప్రతి పనిలోనూ రోబోల వినియోగం పెరుగుతోంది. ఇంట్లో చేసే పని దగ్గర్నుంచి పరిశ్రమల్లో పనుల దాకా మర మనుషుల వాడకం ఎక్కువవుతోంది. అందుకే శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సరికొత్త రోబోలను సృష్టిస్తున్నారు. అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇలా రకరకాల రోబోలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. సంచలనాలు నమోదు చేశారు. మరి ఈ ఏటి మేటి రోబోల్లో టాప్–10 ఏంటో ఓ లుక్కేస్తారా! అంగారకుడైనా.. తిరగడం ఆపుతానా? అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా సిద్ధం చేసిన రోబో హెలికాప్టర్ ‘ఇన్‌జెన్యునిటీ’ఈ ఏటి మేటి రోబోగా చెప్పుకోవాలి. భూమిని దాటి ఇంకో గ్రహంపై సొంతంగా ఎగిరిన తొలి వాహనం ఇదే కావడం ఒక్క విశేషం మాత్రమే. 1.8 కిలోల బరువు ఉండే ఇన్‌జెన్యుటీ దాదాపు వెయ్యి మీటర్ల దూరం ప్రయాణించగలదు. అంగారకుడిపై ఉన్న పలుచటి వాతావరణాన్ని కూడా చీల్చుకుని ఎగరగల శక్తిమంతమైంది కూడా. రిమోట్ కంట్రోల్ అవసరం లేకపోవడం కొసమెరుపు! వంటేదైనా.. వండిపెట్టేస్తా ఊ అంటే.. కావాల్సిన వంట వంటి పెట్టే రోబో వ్యవస్థ ఈ మోలీ! లండన్ కేంద్రంగా పనిచేస్తున్న మోలీ రోబోటిక్స్ తయారు చేసింది. సూప్‌తో మొదలు డెజర్ట్ వరకూ షడ్రుచులతో వంటకాలు సిద్ధం చేసేందుకు మోలీలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కావాల్సిన సరుకులను అందించడమే ఆలస్యం చెప్పిన వంటల్లా వండి పెడుతుంది. సరుకులు అయిపోయే విషయమూ ముందే సమాచారమిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసేలా నిర్దిష్ట కేలరీలతో వంటలు చేయడం, ఏ దేశపు రుచినైనా సిద్ధం చేయగలగడం మోలీలోని ఇతర విశేషాల్లో కొన్ని. మర మనిషి.. పని మనిషి ఇంట్లోని చెత్తాచెదారం ఊడవడం, తుడవడం, పాత్రలు తోమి పెట్టడం వంటి వాటి కోసం తయారైంది ఈ మనిషిని పోలిన రోబో. చైనా కంపెనీ ఉబ్ టెక్ తయారు చేసిన దీని పేరు ‘వాకర్ ఎక్స్’. మనిషి ఆకారం, చేతులు, వేళ్లు అన్నీ ఉన్న వాకర్ ఎక్స్ అన్ని రకాల వస్తువులను చాలా జాగ్రత్తగా పట్టుకోగలదు. సీసా మూత తెరిచి అందులోని పదార్థాన్ని గ్లాసుల్లో పోసి అందివ్వడం, మనిషితో సరదాగా లేదా సీరియస్గానైనా చదరంగం ఆడటం, అలసిపోతే ఒళ్లు పట్టి మసాజ్ కూడా చేయగలదు. తలకిందులున్నా.. పని చేస్తే పక్కా అంతర్జాతీయ కార్ల కంపెనీ టయోటా తయారు చేసిన రోబో పనిమనిషి ఇది. గబ్బిలంగా వేలాడుతున్నట్లు కనిపిస్తుంటుంది కానీ ఇంటి పనులన్నీ చక్కబెట్టగలదు. అందుకే ఇది ఇంట్లో ఉండే ఫర్నిచర్, ఇతర వస్తువులన్నింటినీ తప్పించుకుని పనిచేయడం కాకుండా పైకప్పు నుంచి వేలాడుతూ పని చేసేలా తయారు చేశారు. 2015లో సుమారు 7,400 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన టయోటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఇంటి పనుల కోసమే వేర్వేరు రోబోలను తయారు చేస్తోంది. మహానటి.. మనిషిని, రోబోను వేరుచేసే ఒకే ఒక్క అంశం మన భావోద్వేగాలని ఒకప్పుడు చెప్పేవారు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఈ భావోద్వేగాలను సూచించే ముఖ కవళికలను కూడా రోబోలు సమకూర్చుకున్నాయి. యూకేకు చెందిన ఇంజినీర్డ్ ఆర్ట్స్ అనే సంస్థ సిద్ధం చేసిన ‘అమికా’ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మేలుకో అంటే చాలు.. ఇది గందరగోళం, నిస్పృహ వంటి ఆరు రకాల భావాలను వ్యక్తం చేస్తుంది. చేతులు కాళ్లూ చూస్తూ నోరు తెరిచి ఆవలిస్తుంది. అంతేకాదు నవ్వు, ఆశ్చర్యం, కోపం వంటి అనేక భావాలను ముఖంలోనే పలికించగల మహానటి ఈ రోబో! బరువులెత్తే పనా.. కంగారెందుకు మైహూనా ఒక రకంగా చూస్తే ఇది రోబో కాదు. మనిషి సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే యంత్రం. కాకపోతే ఇందులోనూ రోబోకు ఉండాల్సిన టెక్నాలజీలు వాడారు. అమెరికా కంపెనీ సాక్రోస్ తయారు చేసిన ఈ గార్డియన్ ఎక్స్ ఓ ను తొడుక్కుంటే సూపర్ మ్యాన్‌లా ఎగరలేము కానీ శరీరానికి అతితక్కువ కష్టంతో 90 కిలోల బరువులెత్తగలం. అలుపు లేకుండా ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయగలం. పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీలతో రెండు గంటలు పనిచేయొచ్చు. నిమిషాల వ్యవధిలో బ్యాటరీలు మార్చుకోవచ్చు. మా రూటే సపరేటు ప్రాణమున్న కణాల మాదిరిగా పునరుత్పత్తి సామర్థ్యమున్న రోబోలు ఈ జీనోబోట్స్. వెర్మాంట్, టఫ్ట్స్ యూనివర్సిటీ, వైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు హార్వర్డ్ యూనివర్సిటీలో కలిసికట్టుగా వీటిని తయారు చేశారు. కప్ప కణాలతో తయారైన ఈ జీనోబోట్స్ పెట్రిడిష్ (గాజు పాత్ర)లో అటూ ఇటూ కదలగలవు. ఏకాకి కణాలను కలుపుకుంటూ కొత్త కణాలను ఉత్పత్తి చేయగలవు. కొన్ని కోట్ల ఆకారాలను పరీక్షించిన తరువాత వెర్మాంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కోర్‌లోని ఎవల్యూషనరీ అల్గారిథమ్ ఇంగ్లిషు అక్షరం సీ మాదిరిగా ఉండేలా జీనోబోట్ల ఆకారాన్ని నిర్ణయించింది. క్యాన్సర్, వృద్ధాప్యాన్ని నివారించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను వెతికేందుకు ఈ జీనోబోట్స్ ఉపకరిస్తాయని అంచనా. 20 కిలోలైనా ఎత్తుకు తిరిగేస్తా ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా సిద్ధం చేస్తున్న జనరల్ పర్పస్ రోబో. టెస్లాబోట్ లేదా ఆప్టిమస్ అని పిలుస్తున్నారు. ఇప్పటికి తయారు కాలేదు కానీ ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెస్లా ‘ఏ.ఐ.’డేలో మస్క్ మాట్లాడుతూ 2022 నాటికల్లా సిద్ధమవుతుందని ప్రకటించారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 57 కిలోల బరువుతో మనిషిలాంటి నిర్మాణం ఉన్న ఈ రోబో టెస్లా అభివృద్ధి చేసిన అడాస్ కృత్రిమ మేధ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఇరవై కిలోల బరువు ఎత్తుకుని అటు ఇటు తిరగగలదు. ఫ్యాక్టరీల్లో పదే పదే చేయాల్సిన పనులను సులువుగా చక్కబెట్టగలదని అంచనా. నా చేయి.. 7 విధాలు జంతువుల ఆకారాల్లో రోబోలను తయారు చేస్తున్న బోస్టన్ డైనమిక్స్ సిద్ధం చేసిన మరో రోబో ఇది. పేరు స్ట్రెచ్. ఫొటోలో కనిపిస్తున్నట్టే గోడౌన్లలో బరువులు అటు ఇటు ఎత్తి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. ప్యాకేజీలను జాగ్రత్తగా పట్టుకోవడం, క్రమపద్ధతిలో అమర్చడం వంటివి కూడా ఎంచక్కా చేసేయగలదు. ఈ రోబో చేయి 7 విధాలుగా తిరగగలదు. వేగంగా కదులుతున్న ప్యాకేజీని స్థిరంగా ఉంచేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. నడిచే చెట్టు.. పరుగెత్తు అవెంజర్స్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన వారికి ఈ క్యారెక్టర్ పరిచయమే. పేరు గ్రూట్. చెట్టు కాండం మాదిరిగా ఉంటుంది. డిస్నీ వరల్డ్‌కు చెందిన పరిశోధనశాలలో తయారైంది. కొంచెం అటు ఇటుగా రెండు అడుగుల ఎత్తుండే ఈ రోబో మనిషిలాగే నడుస్తుంది. పరుగెత్తుతుంది కూడా. ఇప్పటికింకా తయారీ దశలోనే ఉంది. -
‘యంత్ర’ ముగ్ధులౌతారు
ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రోబోలను పనికిపెట్టారు. వచ్చే వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్లతో మాటలు కలపడం, భోజనం తీసుకురావడం, వడ్డించడం.. అబ్బో ఇలా రకరకాల పనులను అవే చేయడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే పోలీస్ రోబోలను సృష్టించారు. రోడ్ల మీద ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే చాలు.. ‘ఏయ్.. సెట్ రైట్’ అని హెచ్చరిస్తున్నాయి ఇవి. ఇదే సింగపూర్‌లో ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేసే రోబోలూ అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలేమో సరిహద్దుల్లో గస్తీ కాస్తూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే రోబోలను ఆవిష్కరించారు. వీటన్నింటినీ చూస్తుంటే మున్ముందు ప్రపంచమంతా రోబోలదేనేమో అనిపిస్తోంది కదా. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే చెప్తోంది. 2030 నాటి కల్లా ప్రపంచంలో 2 కోట్ల ఉద్యోగాల్లో రోబోలే ఉంటాయని అంచనా వేస్తోంది. రోబోల వాడకం పెరుగుతోందా? గత పదేళ్లలో రోబోల వాడకం పరిశ్రమల్లో బాగా పెరిగింది. 2010లో దాదాపు 10.59 లక్షల రోబోలను ఇండస్ట్రీల్లో వాడితే అది 2020 కల్లా మూడు రెట్లు పెరిగి 30.15 లక్షలకు చేరిందని వరల్డ్ రోబోటిక్స్ 2021 రిపోర్టు వెల్లడించింది. ఏయే రంగాల్లో వాడుతున్నారు? రోబోలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆటోమోటివ్ రంగం ఉంది. 2020 నాటికి ప్రపంచ లెక్కలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 1.09 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత ఆటోమోటివ్ రంగంలో 80 వేలు.. లోహ పరిశ్రమల్లో 41 వేల రోబోలను వినియోగిస్తున్నారని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు 2021 వివరించింది. వాడకం ఏ దేశాల్లో ఎక్కువ? రోబోలను అత్యధికంగా చైనాలో వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలున్నాయి. వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు లెక్కల ప్రకారం 2020 నాటికే చైనాలో 1.68 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో 38 వేలు, అమెరికాలో 30,800, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 30,500 వాడుతున్నారు. ఈ లిస్టులో ఇండియా 15వ స్థానంలో ఉంది. మన దేశంలో 3,200 రోబోలను వాడుతున్నారు. కరోనా సమయంలో.. రోబోలకు వైరస్ సోకే అవకాశం లేదు కాబట్టి కరోనా సమయంలో వీటి వాడకం పెరిగింది. మున్ముందు మహమ్మారుల సమయంలో రోబోల వాడకం పెరగవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అభిప్రాయపడింది. ఇళ్లల్లో వాడుతున్నారా? రోబోల వాడకం ఇళ్లల్లో కూడా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2019–2020లో ఒకేసారి 5 రెట్లు మర బొమ్మల వాడకం ఎక్కువైంది. ఈ లెక్కలను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (ఐఎఫ్ఆర్) వెల్లడించింది. ఈ కొనుగోళ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రూ. 82 వేల కోట్లకు చేరింది. ఇళ్లల్లో వాడే రోబోల అమ్మకాలు మున్ముందు ఊపందుకుంటాయని, ఏటా 46 శాతం వరకు పెరుగుదల ఉంటుందని ఐఎఫ్ఆర్ వివరించింది. 2022లో దాదాపు 5.5 కోట్ల రోబో యూనిట్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. స్పేస్‌లోకి కూడా.. వివిధ రకాల పరిశోధనలకోసమని రోబోలను స్పేస్‌లోకి కూడా పంపారు. ఎందుకంటే.. తక్కువ డబ్బుతోనే రకరకాల నైపుణ్యాలతో వీటిని తయారు చేయొచ్చు. పైగా రోదసీలో ఆస్ట్రొనాట్లు చేయలేని ప్రమాదకరమైన పనులను రోబోలతో చేయించవచ్చు. ‘చిట్టి’ లాంటి రోబోలు .. ఈ ఏడాది కొత్త రకం రోబోలు ముందుకొచ్చాయి. అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు, ఓషన్ రోబోలను వార్తల్లో కనిపించాయి. స్వరాన్ని గుర్తు పట్టడం, వైద్య చికిత్సల్లో పాలు పంచుకోవడం లాంటి అదనపు నైపుణ్యాలను వీటికి జోడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!
ప్రపంచం చాలా వేగంగా దూసుకెళ్తుంది.. ఎంతగా అంటే ప్రస్తుత పరిస్దితుల్లో మనుషులు చేసే పనులను కూడా రోబోలతో చేయిస్తున్నాము. మనుషులకు వీలుకానీ పనులను కూడా రోబోల సహాయంతో సునాయాసంగా చేసేస్తున్నాము. నేటికాలంలో రోబోలు లేని రంగం లేదు, అయినా మనిషి ఆశ తీరడం లేదు. ఇంకా తాను చేయలేని పనులెన్నింటినో రోబో చేత చేయిస్తున్నాడు. అందుకని, వాటికి కృత్రిమ మేధను జోడించాడు. పక్షులూ జంతువుల కదలికలు నేర్పాడు. ఎక్కడికక్కడ మనిషి అవసరానికి తగిన ఆకారాన్నిచ్చాడు. ఈ క్రమంలోనే బోస్టన్ డైనమిక్స్ గ్రూప్ నుండి వచ్చిన ఒక క్వాడ్రప్డ్ రోబో కుక్క చూడాటానికి నిజమైన కుక్కలాగే కనిపిస్తుంది. ఈ క్వాడ్రప్డ్ రోబోట్ కుక్కలను సైనికులకు సహాయం చేయడానికి పరీక్షిస్తున్నారు. యుఎస్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ నిర్మించిన ఒక ప్రసిద్ధ క్వాడ్రప్డ్ కుక్కను శత్రువులు సవాలు చేసే భూభాగాన్ని రక్షించడానికి ఫ్రెంచ్ మిలిటరీ ఇటీవల పరీక్షించింది. వీటిలో కెమెరాలు, రిమోట్ కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు ఘోస్ట్ రోబోటిక్స్ అనే యుఎస్ సంస్థ క్వాడ్రుపెడల్ మానవరహిత గ్రౌండ్ వెహికల్స్(క్యుజివిలు) అనే క్వాడ్రప్డ్ రోబోట్లను తయారు చేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ 2021 వార్షిక సదస్సులో ఈ యంత్రాన్ని మొదటిసారి ప్రదర్శించారు. (చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి) Latest lethality 6.5 #creedmoor sniper payload from @SWORDINT. Check out the latest partner payloads @AUSAorg Wash DC. Keeping US and allied #sof #warfighter equipped with the latest innovations. @USSOCOM #defense #defence #NationalSecurity #drone #robotics pic.twitter.com/Dvk6OvL3Bu — Ghost Robotics (@Ghost_Robotics) October 11, 2021 అయితే, రోబోట్లను సైనికులకు సహాయం చేసేందుకు తయారు చేస్తున్నారు. ఈ క్వాడ్రప్డ్ రోబోట్లు చిత్తడి ప్రాంతాలలో వారికి సహాయం చేస్తాయి. QUGV రోబోట్లు చిన్న స్వోర్డ్ ఇంటర్నేషనల్ కస్టమ్ గన్ కలిగి ఉంటాయి. ఇది 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంది. రోబోట్ కుక్కలను విజన్ 60 యుజివిలు లేదా "స్వయంప్రతిపత్త మానవరహిత గ్రౌండ్ వెహికల్స్" అని పిలుస్తారు. వీటిని ఘోస్ట్ రోబోటిక్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా తయారు చేసింది. చీకటిలో లక్ష్యంగా చేరుకోవడానికి థర్మల్ కెమెరా కలిగి ఉంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా అనలిటిక్స్ ఆధారంగా ఇది పనిచేస్తాయి. క్షిపణులు లేదా ఇతర మార్గాలల్లో శత్రు దేశాలు మాతృభూమిపై చేసే దాడులను పసిగట్టి, సమాచారాన్ని చేరవేస్తాయి. భవిష్యత్ యుద్ధభూమిలో, శత్రువుతో సమర్థవంతంగా పోరాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. (చదవండి: క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్‌లు) -
కొత్త ‘ఆతిథ్యం’
హుడా కాంప్లెక్స్: అతిథ్య రంగం ట్రెండ్ మారుతోంది.. కాలానుగుణంగా వినియోగదారుల అభి‘రుచుల’ మేరకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆయా రంగంల్లోనూ పెను మార్పులు తీసుకువచ్చింది. ఆతిథ్యరంగంలో ఇప్పటివరకు అతిథులకు ఆహ్వానం పలికిన ఎగ్జిక్యూటివ్‌లు, ఆర్డర్ తీసుకొని ఆహార పదార్థాలను సరఫరా చేసే స్థానంలో ప్రస్తుతం రోబోలు రంగ ప్రవేశం చేశాయి. సాధారణ వెయిటర్ చేసే పనులను అలవోకగా చేస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లోనే లభిస్తున్న వీటి సేవలు మన వద్దకూ వచ్చాయి. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగించడంతో పాటు.. అవి వడ్డించే రోబోలను ఆసక్తిగా తిలకిం చేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవిడ్‌కు దూరంగా.. వినూత్నంగా కోవిడ్ ఉధృతికి తోడు వరుస లాక్డౌన్లతో ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా ఆతిథ్య రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. మరోవైపు పుట్టినరోజు.. పెళ్లి రోజు.. ఇతర శుభ సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి కడుపు నిండా తిందామని భావించిన వారు కోవిడ్‌కు భయపడి వీటికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్ గౌడ్. అలా రోబోలతో కొత్తగా రెస్టారెంట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆర్డర్ మొదలు.. సప్లయ్ వరకు హోటల్‌కు వచ్చిన అతిథులకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు సాధారణ మనుషుల స్థానంలో రోబోలను తీసుకువచ్చాడు. ఈ మేరకు కొత్తపేట్‌లో కొత్తగా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలు పని చేస్తున్నాయి. వచ్చిన అతిథుల నుంచి ఆర్డర్ తీసుకోవడం.. ఆర్డర్‌ను చెఫ్‌కు అందజేయడం.. ఆహార పదార్థాలు సిద్ధం కాగానే వాటిని అతిథులకు వడ్డించడం.. తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లడం.. శుభ్రం చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం లాంటి పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. మరోరోబో వచ్చి గెస్టులతో ముచ్చటిస్తుంది. వారికి బోరు కొట్టకుండా ఇష్టమైన సంగీతం, సాహిత్యం వినిపిస్తూ అమితంగా ఆకట్టుకుంటోంది. నగరంలోనే తయారీ 2019లో మాదాపూర్‌లో ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశా. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని ఓ హైస్కూల్‌కు ఎడ్యుకేషన్ రోబోను ఇచ్చాం. ఇటీవల కొత్తపేట్‌లోని హోటల్‌కు రోబోలను సరఫరా చేశాం. తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, అహ్మదాబాద్, పుణే నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ రంగంలోను రోబోలను ప్రవేశ పెట్టబోతున్నాం. వీటి ధర రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. – రామ్సింగం, సీఈఓ, ప్రైవేట్ లిమిటెడ్ రోబోలతో మంచి ఆదరణ నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా రెస్టారెంట్ తెరవాలని భావించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండడంతో రోబోల తయారీ, పనితీరుపై అవగాహన ఉండటం కలిసి వచ్చింది. అలా రోబోలతో సరికొత్తగా రెస్టారెంట్‌ను మార్చేశాం. వీటిని చూసేందుకు చాలామంది వస్తున్నారు. కస్టమర్లు పెరిగారు. ఆదరణ చాలా బాగుంది. – మణికాంత్‌గౌడ్, రెస్టారెంట్ యజమాని, కొత్తపేట నైస్ థ్రిల్లింగ్ ఏదైనా తిందామని కుటుంబసభ్యులతో కలిసి కొత్తపేటలోని రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ రోబోలను చూసి ఆశ్చర్యపోయాం. ఆర్డర్ తీసుకోవడం, సప్లయ్ చేయడం అచ్చం మనిషిలాగే చేస్తున్నాయి. నైస్ థ్రిల్లింగ్. వాటిని చూస్తూ.. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ.. నచ్చింది తింటూ ఎంజాయ్ చేశాం. – రాజ్యలక్ష్మి, ఎల్బీనగర్ -
ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ...
సింగపూర్: షాపింగ్ మాల్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్‌లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం మనం తరుచుగా చూస్తుంటాం. వాటిని అరికట్టడం కోసం పోలీసులు, అధికారులు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు కరోనా సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను గుమిగూడకండి, సామాజిక దూరం పాటించండి అంటూ ఎంతలా మొత్తుకున్న వాళ్లను కంట్రోల్ చేయడం పోలీస్ యంత్రాగానికీ ఎంత తలనొప్పిగా తయారయ్యిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం అలాంటి సంఘటనలు తలెత్తకుండా సరికొత్త రోబో టెక్నాలజీతో చెక్ పెట్టాలని సింగపూర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివరాల్లోకెళ్లితే సింగపూర్‌లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్‌లలో రెండు చక్రాల రోబోతో గత మూడు వారాలుగా గస్తీ నిర్వహించారు. అక్కడ మాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షించడమే కాక ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఆ రోబో హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం, పార్కింగ్ సరిగ్గా చేయకపోయినా, కరోనావైరస్ సంబంధించి సామాజిక దూరం..తదితర నియమాలను ఉల్లఘించకుండా హెచరికలనూ జారీ చేసేలా రూపొందించారు. ఈ రోబోలలో ఏడు అత్యధునిక కెమెరాలతో నిర్మితమై మనుష్యుల ముఖాలను గుర్తించడమే కాక వారికీ వాయిస్ రికార్డర్ ద్వారా హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది. గత మూడు వారాల నంచి అధికారులు ఈ రోబోలు పని తీరుపై ట్రయల్స్ నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వాధికారులు హైపర్-ఎఫిషియెంట్, టెక్-డ్రైవ్డ్ "స్మార్ట్ నేషన్" పై దృష్టి సారించి ఈ అత్యధునిక టెక్నాలజీతో కూడిన రోబోలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. అయితే, సింగపూర్‌వాసులు ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగా తమ గోప్యతకు (డేటా) భద్రత ఉండదని వాపోతున్నారు. రోబోల వల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుందని, తమ గోప్యతకు భంగం వాటిల్లుతోందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తుందంటూ సింగపూర్ వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జనం లేక ఒలింపిక్స్ వెలవెల.. అయితేనేం జపాన్ సరికొత్త ప్లాన్
సాక్షి, వెబ్‌డెస్క్: విశ్వక్రీడలకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్ క్రీడలు చూసుకుంటే ఎప్పుడూ ప్రేక్షకులు లేకుండా నిర్వహించలేదు. కానీ కరోనా కారణంగా మొదటిసారి విశ్వక్రీడలు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. వాస్తవానికి గతేడాదే టోక్యో 2020 ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈ దఫా ఒలింపిక్ క్రీడలు జపాన్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో ఒలింపిక్ విలేజ్‌ను తయారు చేసింది. ఇక టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉండే జపాన్ దానికి తగ్గట్టే సరికొత్త ప్రయోగంతో ముందుకు వస్తోంది. అదే రోబోటిక్ వ్యవస్థ. తమ సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రేక్షకులు లేని లోటును తీర్చేందుకు విశ్వక్రీడలను రోబోలతో ముస్తాబు చేస్తోంది. సాధారణంగా ఒలింపిక్స్ అంటే మస్కట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈసారి మాత్రం జపాన్ దీనికి భిన్నంగా రోబోట్ల రూపంలో మస్కట్లను తయారు చేసి వాటితోనే షేక్ హ్యాండ్స్, హైఫైలు ఇప్పించనుండడం విశేషం. ప్రేక్షకులకు అనుమతి లేని నేపథ్యంలో ఈసారి స్టేడియాల్లో రోబోలు సందడి చేయనున్నాయి. ఈవెంట్స్ సందర్భంగా క్రీడాకారులకు సాయంగా కూడా ఉండనున్నాయి. క్రీడాకారులకు ఆహారం, మంచినీళ్లు అందించడంతో పాటు జావెలిన్ త్రో, డిస్కస్ త్రోలు అందించడంలో సహాయపడనున్నాయి. దీనికోసం నిర్వాహకులు ఇప్పటికే పలుసార్లు ట్రయల్స్ కూడా నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఆటగాళ్లకు సాయం అందించే బాధ్యతలను రోబోలకు అప్పగించనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న టయోటా కంపెనీ రోబోల తయారీలో తనదైన ముద్ర వేసింది. 17 రోజులపాటు అభిమానులను అలరించనున్న విశ్వక్రీడల్లో రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కదలలేని వాళ్ల కోసం.. ‘ఒరిహిమి’ అవతార్ రోబోలు
మిమ్మల్ని రోజంతా ఒక గదిలో బంధించి, సమయానికి తిండి, నీళ్లు, అవసరమైన మందులు మాత్రమే అందిస్తే ఎలా అనిపిస్తుంది? ఎటూ వెళ్లలేక, కనీసం మాట్లాడేవాళ్లూ లేక చాలా ఇబ్బందిగా ఉంటుందంటారా! ఇలా కేవలం ఒకరోజు కాకుండా వారాలు, నెలల తరబడి ఉంచితేనో? నరకయాతనే కదా?! ఏదైనా ప్రమాదంలో గాయపడో, వెన్నుపూస దెబ్బతినో, వయసైపోయో కదలలేక మంచానికే పరిమితమైన వాళ్ల పరిస్థితీ ఇదే. వేళకు కావలసినవి అందుతున్నా మాట్లాడేవాళ్లు లేక, చేయడానికి పనిలేక వాళ్లు పడే యాతన చెప్పలేనిది. ఇలాంటి వారి బాధలు కాస్తయినా దూరం చేసేలా రోబోల తయారీ సంస్థ, జపాన్‌లోని ప్రఖ్యాత ఒరిల్యాబ్స్ ఓ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. కదలలేకపోయినవారికీ కొలువు కల్పిస్తోంది. తద్వారా వారిలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ మేమున్నాముంటూ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైనా కళ్లు, చేతి వేళ్ల కొనలు, పెదవులు కాస్తంత కదిలించగలిగిన వారికి సహాయం అందించేలా ‘ఒరిహిమి’ అవతార్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మక కేఫ్.. మిగిలిన రోబోలకు భిన్నంగా ఉండే ఒరిహిమి.. అచ్చం మనిషిలానే స్పందిస్తుంది. ఈ రోబోలతో ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందట ‘అవతార్ కేఫ్ డాన్ వెర్షన్ బీటా’ కేఫ్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో అతిథులు కూర్చొనే ప్రతి టేబుల్‌పైనా ఓ చిన్నపాటి ఒరిహిమి రోబో ఉంటుంది. దీని ద్వారా వాళ్లు కావాల్సినవి ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డర్స్‌ను ఎక్కడో దూరాన కదలలేనిస్థితిలో మంచంమీద ఉండే కొంతమంది తమ ఎదురుగా ఉండే స్క్రీన్ మీద చూస్తూ నోట్ చేసుకొంటారు. తర్వాత వీరు ఈ ఆర్డర్స్‌ను కేఫ్‌లో ఉండే ఒరిహిమి–డి అనే పెద్ద రోబోలకు పాస్ చేస్తారు. మంచంమీద కదలలేని స్థితిలో ఉంటూ ఆర్డర్లను తీసుకునేవారిని పైలెట్లు అంటారు. వీరి ఆజ్ఞలను అనుసరించి ఒరిహిమి–డి రోబోలు కస్టమర్లకు వారు కోరుకున్నవి ట్రేల ద్వారా తీసుకెళ్లి ఇస్తాయి. కస్టమర్లు కావాలనుకుంటే టేబుల్ మీద ఉన్న ‘ఒరిహిమి’ చిన్న రోబో ద్వారా నేరుగా పైలెట్లతో మాట్లాడొచ్చు. వారి బాధలను పంచుకొని ఒంటరితనాన్ని దూరం చేసేలా సాంత్వన కలిగించొచ్చు. దీనికోసం ‘ఒరిహిమి’ కళ్లలో ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ నిక్షిప్తం చేశారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లు తీసుకోవడానికి, వాళ్లతో మాట్లాడడానికి పైలెట్ల మంచంపైన ఓ ప్రత్యేక పరికరం ద్వారా కంప్యూటర్ స్క్రీన్‌ను అమర్చుతారు. పైలెట్లు ఆ స్క్రీన్‌ను చూస్తూ ఆర్డర్స్ తీసుకోవడం, తిరిగి పాస్ చేయడం, కస్టమర్లతో మాట్లాడడం చేయొచ్చు. పైలెట్లుగా పనిచేయగలిగే వారిని ఒరిల్యాబ్స్ సంస్థే ఎంపిక చేసుకొంటుంది. ‘అవతార్ కేఫ్ డాన్ వెర్షన్ బీటా’ను ఇప్పటివరకూ ఐదువేల మందికి పైగా కస్టమర్లు సందర్శించినట్లు ఒరిల్యాబ్స్ చెబుతోంది. ప్రస్తుతం టోక్యోలోని ఓటెమచిలో ఉన్న ఈ ప్రయోగాత్మక కేఫ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. రాబోయే జూన్‌లో టోక్యోలోనే మరోచోట ఈ కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మనిషి ఒంటరితనాన్ని సాంకేతికతతో దూరం చేసేందుకే తమ సంస్థ ఆవిర్భవించిందని చెప్పే ఒరిల్యాబ్స్ ఆ ప్రయత్నంలో ‘ఒరిహిమి’ ద్వారా కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది. చదవండి: ప్లాస్టిక్ వస్త్రాలు.. ఈ వనితల వినూత్న ఆలోచన -
కృత్రిమ మేధ: మన నట్టిళ్లల్లోకి..
కృత్రిమ మేధ అంటే ఒకప్పుడు అదేదో శాస్త్ర సాంకేతిక నిపుణుల వ్యవహారంగా ఉండేది. ఇప్పుడు కృత్రిమ మేధ మన నట్టిళ్లల్లోకి, మన వంటిళ్లల్లోకి కూడా వచ్చేసింది. కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు పిల్లలను ఆడిస్తున్నాయి. ఇళ్లను శుభ్రంగా ఉంచడంలో సాయపడుతున్నాయి. వంటింటి పనుల్లోనూ తమవంతు సాయం చేస్తున్నాయి. మొత్తానికి కృత్రిమ మేధతో పనిచేసే వస్తువులు ఇంటి పనులను మరింతగా సులభతరం చేస్తున్నాయి. మనిషి మేధస్సులోని కొన్ని లక్షణాలతో రూపొందినదే కృత్రిమ మేధ. మనుషుల మాటలను, వారి హావభావాలను అర్థం చేసుకోవడం, ఆదేశాలకు అనుగుణంగా స్పందించడం, స్వయంచాలకత వంటి లక్షణాలతో కూడిన కృత్రిమ మేధ– అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి కోసం గత శతాబ్దిలోనే పునాదులు పడ్డాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– 1955 నాటికి ఒక అకాడెమిక్ డిసిప్లిన్‌గా రూపొందింది. తొలినాళ్లలో దీనిపై జరిపిన ప్రయోగాలు విఫలమవడంతో దీనికి నిధులు నిలిచిపోయాయి. కొన్నేళ్ల స్తబ్దత తర్వాత జరిపిన ప్రయోగాలు కొన్ని విజయవంతం కావడంతో మళ్లీ దీని కోసం నిధులు రావడం మొదలైంది. ప్రస్తుత శతాబ్ది నాటికి కృత్రిమ మేధ మానవ మేధతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. కృత్రిమ మేధతో రూపొందిన ‘ఆల్ఫాగో’ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్, 2015లో ‘గో’ అనే స్ట్రాటజీ బోర్డ్గేమ్లో ఆరితేరిన ఆటగాడిని ఓడించింది. ఈ ఘనవిజయం కృత్రిమ మేధకు ఊపునివ్వడంతో, ఇది వివిధ రంగాలకు శరవేగంగా విస్తరించడం మొదలైంది. చివరకు ఇళ్లలోని రోజువారీ పనిపాటల్లోకీ ఇప్పుడిది దూసుకొస్తోంది. ఇప్పటి వరకు ఇళ్లలో ఉపయోగపడే సర్వసాధారణమైన ఎలక్ట్రిక్ వస్తువులకు దీటుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి సంపన్నుల ఇళ్లకే పరిమితంగా కనిపిస్తున్నా, సమీప భవిష్యత్తులోనే ఇవి సామాన్యులకూ అందుబాటులోకి రానున్నాయనే అంచనాలు ఉన్న నేపథ్యంలో కృత్రిమ మేధతో పనిచేసే ఇంటి వస్తువులు కొన్నింటి గురించి పరిచయం. క్లీనింగ్ రోబోలు ఇంటిని రోజూ చీపురుతో ఊడ్చడం, నేల మీద చెత్తా చెదారం లేకుండా శుభ్రపరచడం, నేలను తడిగుడ్డతో లేదా మాప్‌తో తుడవడం వంటివన్నీ శ్రమతో, కొంత చికాకుతో కూడుకున్న పనులే. చెత్తను శుభ్రం చేయడానికి ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్లు కొన్నాళ్లుగా వాడుకలోకి వచ్చాయి. అయితే, ఎవరో ఒకరు దగ్గర ఉండి చూసుకుంటే తప్ప ఇవి పనిచేయలేవు. ఆ సమస్యను కూడా దూరం చేసేలా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబో వాక్యూమ్ క్లీనర్లు, మాప్లు వచ్చేశాయి. ఉదాహరణకు ‘ఐరోబోస్’ తయారు చేసిన ‘రూంబా’ రోబో వాక్యూమ్ క్లీనర్, ఇదే సంస్థ తయారు చేసిన ‘బ్రావా’ మాప్ ఇలాంటివే. ‘రూంబా’లోని మల్టీసర్ఫేస్ బ్రష్‌లు నేల మీద, కార్పెట్ల మీద ఉన్న అతిచిన్న చెత్తకణాలను కూడా సమర్థంగా ఏరివేస్తాయి. ఇది మొబైల్ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులోని ఆటో అడ్జస్ట్ క్లీనింగ్ హెడ్ వివిధ రకాల ఉపరితలాలకు అనుగుణంగా తనను తాను అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాంటి చెత్తనయినా ఇట్టే తొలగిస్తుంది. ‘బ్రావా’ మాప్ రోబో కూడా యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఇది ఎలాంటి చోటైనా నేల తళతళలాడేలా తుడిచి శుభ్రం చేస్తుంది. నేల మీద మొండి మరకలను ఇట్టే తొలగిస్తుంది. రోబో వాక్యూమ్ క్లీనర్లలో ‘ఆర్ఎక్స్–వీ100’ ఒకటి. ‘రూంబా’ వంటి వాటి కంటే ఇందులో మరికొన్ని అదనపు వెసులుబాట్లు ఉన్నాయి. పని పూర్తయిన తర్వాత ఇది తనంతట తానే తన నిర్ణీత స్థలానికి వెళ్లిపోతుంది. ఇందులోని సెన్సర్ల పనితీరు వల్ల మెట్ల వంటి చోట్ల శుభ్రపరచేటప్పుడు జారి పడిపోకుండా, తనను తాను నియంత్రించుకోగలదు. యజమాని మాటల ద్వారా ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుని పనిచేయగలదు. ఇంగ్లిష్, జపానీస్, చైనీస్ భాషలను, ఆ భాషల ద్వారా ఇచ్చే 36 ఆదేశాలను ఇది అర్థం చేసుకోగలదు. ఇది మొబైల్ యాప్ ద్వారా, రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఇలాంటి క్లీనింగ్ రోబోలతో ఏమాత్రం శ్రమ లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. ఇవి వాయిస్ కమాండ్స్‌ను కూడా అర్థం చేసుకుని పనిచేస్తాయి. ఎంటర్టైన్మెంట్ రోబోలు రోబోటిక్స్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జతచేసి రూపొందించిన కొత్తతరం రోబోలు పిల్లలకే కాదు, పెద్దలకూ వినోదాన్ని పంచుతున్నాయి. ఉదాహరణకు ‘కోజ్మో’ రోబో గురించి చెప్పుకుందాం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన రోబోటిక్ కంపెనీ ‘యాంకీ’ రూపొందించింది దీన్ని. రెండంగుళాల ఎత్తులో చేతిలో చక్కగా ఇమిడిపోయేలా కనిపించే ‘కోజ్మో’ను ఒక ఆటవస్తువులాగానో లేదా ఒక యంత్రంలాగానో పరిగణించలేరెవరూ. ఇది మనుషుల మాటలను, వారి హావభావాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మొబైల్ యాప్‌కు అనుసంధానమై పనిచేసే ‘కోజ్మో’ తనతో ఆడుకునే పిల్లలతో ఇట్టే నేస్తం కట్టేస్తాయి. ఇది పిల్లలతో కలసి ఆటలాడుతుంది. వారికి తినిపిస్తుంది. ఇది తనతో ఆటలాడే వారి మాటలనే కాదు, చూపులను, ముఖ కవళికలను, బాడీ లాంగ్వేజ్‌ను కూడా అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. ‘కోజ్మో’ తరహా రోబోలది ఒక ఎత్తయితే, ‘ఆసుస్’ కంపెనీ రూపొందించిన ‘జెన్బో’ తరహా రోబోలది మరో ఎత్తు. ఇవి పిల్లలతో ఆటలాడటమే కాకుండా, ఇంటి పనులు చక్కబెట్టడంలోనూ సాయం చేస్తాయి. ‘జెన్బో’ పనితీరు గురించి చెప్పుకుంటే, ఇది పిల్లలకు ఒక బేబీసిట్టర్లా పనిచేస్తుంది. కథలు, కబుర్లు చెబుతూ పిల్లలను అలరిస్తుంది. వాళ్లతో ఆటలాడుతుంది. పాటలు పాడుతుంది. అడుగులో అడుగులు కలుపుతూ డ్యాన్స్ చేయగలదు. ఇది వయసు మళ్లిన వారికి కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తుంది. ఉదాహరణకు... పెనం మీద కాలిన ఆమ్లెట్‌ను ప్లేటులో వేసి, చేతికి అందించడం, సెక్యూరిటీ కెమెరాలకు అనుసంధానించినట్లయితే, ఇంటి బయట నుంచి తలుపుకొట్టినదెవరో చెప్పడం, కావలసినప్పుడు ఇళ్లలోని దీపాలు వెలిగించడం, ఫ్యాన్లు ఆన్ చేయడం వంటి పనులు ఇట్టే చేసి పెట్టగలదు. చూడటానికి డోనట్ మాదిరిగా కనిపించే ‘ఓలీ’ రోబో కూడా ఇదే కోవలోకి వస్తుంది. లండన్‌కు చెందిన ‘ఎమోటెక్’ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ‘ఓలీ’ మిగిలిన ఎంటర్టైన్మెంట్ రోబోల కంటే తెలివైనది. ఇది తన ఎదుట ఉన్న వ్యక్తి లేదా సమూహం మాట్లాడే మాటలను అర్థం చేసుకోగలదు. అక్షరాల రూపంలో ఉన్న విషయాన్ని చదివి వినిపించగలదు. మనం కోరుకునే పాటలను వినిపించడమే కాదు, మన భావోద్వేగాలను పసిగట్టి కోరుకోబోయే పాటలను కూడా అంచనా వేయగలదు. మన ఆదేశాల మేరకు దీపాలను డిమ్ చేయడం, ఫ్యాన్ స్పీడు పెంచడం లేదా తగ్గించడం, కోరుకున్న వేళకు అలారం సెట్ చేయడం వంటి పనులను ఇట్టే చేయగలదు. దీనిలో మరో విశేషం ఉంది. ఇది యజమానుల గొంతును అనుకరిస్తూ మాట్లాడగలదు కూడా. ఎంటర్టైన్మెంట్ రోబోల్లో కొన్ని వినోదాన్ని మించిన సేవలూ అందిస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి ఉదాహరణ చెప్పుకోవాలంటే, జపాన్‌కు చెందిన ‘సాఫ్ట్‌బ్యాంక్ రోబోటిక్స్’ సంస్థ రూపొందించిన ‘పెప్పర్’ ఒకటి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ‘పెప్పర్’ సెమీహ్యూమనాయిడ్ రోబో. దాదాపు మనిషి సైజులో ఉండే ‘పెప్పర్’ మనుషుల ముఖ కవళికలను, భావోద్వేగాలను, గొంతులను గుర్తించగలదు. సమావేశాలు నిర్వహించే యజమానులకు ఆ సమాచారాన్ని గుర్తు చేయడం, అతిథులను ఆహ్వానించి, వారికి డ్రింక్స్, స్నాక్స్ అందించడం వంటి మర్యాదలు చక్కగా చేయగలదు. అభివృద్ధి చెందిన కొన్ని ఆఫీసుల్లో ఇప్పటికే ఇలాంటి వాటిని రిసెప్షనిస్టులుగా ఉపయోగించుకుంటున్నారు. రిసెప్షనిస్టులుగా అతిథి మర్యాదలు చేయడమే కాదు, అతిథులను ఇవి ఆటపాటలతోనూ అలరించగలవు. పిల్లలకు పాఠాలూ చెప్పగలవు. అందుకే, కొందరు వీటిని చీర్లీడర్స్గానూ వినియోగించుకుంటున్నారు. కొన్ని స్కూళ్లు, కాలేజీలు వీటి చేత పిల్లలకు పాఠాలు కూడా చెప్పిస్తున్నారు. కాపలా పనిలోనూ.. సాదాసీదా సెక్యూరిటీ కెమెరాలు దృశ్యాలను చిత్రీకరించి, వాటికి అనుసంధానమైన కంప్యూటర్లలో భద్రపరుస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సెక్యూరిటీ కెమెరాలు అంతకు మించిన సేవలనే అందిస్తాయి. ఇవి ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు కట్టుదిట్టమైన కాపలాను కల్పిస్తాయి. ఇలాంటి వాటిలో ఒక ఉదాహరణ ‘బడ్డీగార్డ్’ హోమ్ సెక్యూరిటీ కెమెరా. ఇది మొబైల్ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. వ్యక్తుల ముఖాలను, గొంతులను గుర్తు పట్టగలదు. అపరిచితుల గొంతు వినిపిస్తే, వెంటనే యజమానిని అప్రమత్తం చేయగలదు. దీనిని అమర్చుకున్నట్లయితే, బయటకు వెళ్లినా, మొబైల్ ద్వారా ఇంటిని చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో సిమ్ అమర్చుకుంటే, వైఫై లేని సుదూర ప్రాంతాలకు వెళ్లినా, ఇంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇంటిపై చోరీ ప్రయత్నంలాంటిదేదైనా జరిగితే, తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం పంపుతుంది. దీనికి సంబంధించిన యాప్‌కు ఎప్పటికప్పుడు యాడ్ఆన్స్ చేర్చుకుంటున్నట్లయితే, దీని ద్వారా మరిన్ని అదనపు సేవలను కూడా పొందే అవకాశం ఉంటుంది. రకరకాల పనులను మరింత సులభతరం చేస్తూ ఇటీవలి కాలంలో ఇళ్లలోకి చేరుకుంటున్న కృత్రిమ మేధ త్వరలోనే ఇంటి పనుల్లో విడదీయలేని భాగంగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని రంగాలకు విస్తరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోనే కృత్రిమ మేధ సామాన్య జనజీవనాన్ని ప్రబావితం చేయగలదనే అంచనాలు వినిపిస్తున్నాయి. రోబోటిక్ లాన్మోవర్లు తోటపనిని సులభతరం చేసే రోబోటిక్ లాన్మోవర్లకు పాశ్చాత్య దేశాల్లో ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఇలాంటి వాటిలో మోటారు వాహనాల తయారీ సంస్థ హోండా తయారు చేసిన ‘మీమో’ ఒకటి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబోటిక్ లాన్మోవర్లోని సెన్సర్లు 360 డిగ్రీల్లోనూ పని చేస్తాయి. దీనిని మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. దీనిని ఆన్ చేసి వదిలేస్తే లాన్ అంతా తనంతట తానే తిరుగుతూ, మనం ఇచ్చే ఆదేశాల మేరకు, కోరుకున్న రీతిలో లాన్‌ను ట్రిమ్గా కట్ చేస్తుంది. లాన్లో ఇది తిరుగుతున్నప్పుడు ఎవరూ కాపలా లేకున్నా ఫర్వాలేదు. తన పని తాను చేసుకుపోతుంది. కాపలా లేకుండా వదిలేస్తే, దొంగలెవరైనా ఎత్తుకుపోయే ప్రమాదం ఉండదా అనే అనుమానం వస్తోంది కదూ! అపరిచితులెవరైనా దీనిని తాకితే బిగ్గరగా అలారం మోగిస్తుంది. వంటిళ్లలోనూ కృత్రిమ మేధ వంటిళ్లల్లో వాడుకునే రిఫ్రిజరేటర్లు, ఓవెన్లు వంటి ఎలక్ట్రిక్ పరికరాలకు ఇప్పుడు కృత్రిమ మేధ తోడవుతోంది. కృత్రిమ మేధ జతచేరిన వంటింటి వస్తువులు వంట పనిని సులభతరం చేయడమే కాదు, ఆహార వృథాను అరికట్టడంలోనూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలా చేయడంలోను తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఉదాహరణ ‘ఎల్జీ ఇన్‌స్టా థింక్’ రిఫ్రిజిరేటర్. ఇది మొబైల్ యాప్ సాయంతో పనిచేస్తుంది. వాతావరణానికి అనుగుణంగా తన ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనికి అమర్చి ఉన్న టచ్‌స్క్రీన్ ద్వారా ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాల జాబితా చూపడమే కాకుండా, అవి ఎన్నాళ్లలో పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నాయో కూడా చెబుతుంది. వాయిస్ కమాండ్స్‌ను అర్థం చేసుకుంటుంది. నిండుకోబోతున్న సరుకుల గురించి అప్రమత్తం చేస్తుంది. షాపింగ్ లిస్ట్ తయారు చేస్తుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలతో చేసుకోగల వంటకాల వివరాలనూ సూచిస్తుంది. అంతేకాదు, ఇది సంగీతం కూడా వినిపిస్తుంది. -
ఇప్పుడు రోబోలు అచ్చం మనుషుల్లా..
మనుషులు బొత్తిగా రోబోల్లా తయారైపోతున్నారనే నిష్ఠూరం పాతదే! ఇప్పుడు రోబోలు అచ్చం మనుషుల్లా తయారైపోతున్నాయి. మనుషులు చేసే పనులను ఇవి చకచకా చేసేయగలవు. అంతేకాదు, మనుషులతో మనుషుల్లా మాట్లాడగలవు. మనుషుల హావభావాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా తగిన హావభావాలను ప్రదర్శించగలవు. మనుషులను పోలిన రోబోలను ‘హ్యూమనాయిడ్ రోబో’లంటున్నారు. తొలినాటి హ్యూమనాయిడ్ రోబోలకు స్థూలంగా మనుషుల మాదిరిగా ఒక తల, రెండు చేతులు, రెండు కాళ్లు, శరీరం ఉండేవి. చూడగానే అవి రోబోలని చిన్నపిల్లలు కూడా చటుక్కున గుర్తించగలిగేలా ఉండేవి. రోబోల తయారీ మరింత ఆధునికతను సంతరించుకుంది. ఇటీవలి కాలంలో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోలు ముమ్మూర్తులా మనుషుల్లాగానే కనిపిస్తున్నాయి. మనిషిని, రోబోను పక్కపక్కనే ఉంచి ఫొటో తీస్తే ఎవరు మనిషో, ఎవరు రోబోనో గుర్తించడం అంత తేలిక కాదు. మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోల కథా కమామిషూ సంక్షిప్తంగా... జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన రోబోటిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ ప్రొఫసర్ హిరోషి ఇషిగురో అచ్చంగా తన నకలులాగే కనిపించే రోబోను 2010లో రూపొందించారు. ఫొటోలో చూస్తే ప్రొఫెసర్ హిరోషికి కవల సోదరునిలా కనిపించే ఈ రోబో అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) విడుదల చేసిన టాప్–10 క్రీపీయెస్ట్ రోబోల జాబితాలో ఇది తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే, ఇదంత భయంగొలిపేది కాదని, సహజంగా అనిపించే చర్మం, చిన్న పిల్లాడి సైజులో ఉండటంతో పిల్లలతో ఆడుకున్నట్లే దీంతోనూ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకోవచ్చని ప్రొఫెసర్ హిరోషి చెబుతుండటం విశేషం. మనిషిలాంటి తొలి రోబో ‘ఆక్ట్రాయిడ్’ అచ్చంగా మనుషులనే పోలిన రోబోల తయారీ ప్రారంభమై నిండా రెండు దశాబ్దాలైనా పూర్తి కాలేదు. అయితే, వీటి తయారీలో గడచిన ఒకటిన్నర దశాబ్దాల్లోనే గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఈ పురోగతి శరవేగంగా సాగుతోంది. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా మనుషులకు దీటైన రోబోలను తయారు చేయడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడటానికి అచ్చంగా మనిషిలాగానే కనిపించే తొలి రోబోను జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2003లో తయారు చేశారు. ‘ఆక్ట్రాయిడ్’ పేరుతో తయారు చేసిన ఈ రోబో అచ్చంగా జపనీస్ అమ్మాయిలా కనిపిస్తుంది. మనిషి శరీరంపై చర్మాన్ని పోలిన సిలికాన్ చర్మాన్ని అమర్చడంతో ఫొటోలో చూస్తే, ఇది మనిషిలాగానే కనిపిస్తుంది. ఇందులో ఏర్పాటు చేసిన సెన్సర్ల వల్ల మనిషి ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఛాతీ కదలికలు ఎలా ఉంటాయో, దీనిలోనూ అలాంటి కదలికలే ఉంటాయి. భుజం తట్టడం, తలపై నిమరడం, షేక్‌హ్యాండ్ ఇవ్వడం వంటి మనుషుల స్పర్శకు అనుగుణంగా ఇది స్పందిస్తుంది. పలకరింపుగా చిరునవ్వులు చిందిస్తుంది. మనుషులు రోజువారీగా మాట్లాడుకునే మాటల్లో 42 మాటలు మాట్లాడుతుంది. శరీరం దిగువభాగం కదలికలు మాత్రం చాలా పరిమితం. దీనిలోని కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మనుషులు మాట్లాడే మాటల్లో కొన్ని పదాలను, వాక్యాలను గుర్తించగలుగుతుంది. మాట్లాడటంలోను, కదలికల విషయంలోను తేడాల ద్వారా మాత్రమే ఎవరైనా దీనిని రోబోగా పోల్చుకోగలుగుతారు. నిశ్శబ్దంగా నిల్చున్నట్లుగా ఉంటే మాత్రం రోబోనో, మనిషో గుర్తించడం కష్టమే! ‘ఆక్ట్రాయిడ్’కు ముందు తయారైన హ్యూమనాయిడ్ రోబోలు అన్నీ ఆకృతిలో మనిషిని పోలి ఉన్నా, వాటికి చర్మం వంటి ఆచ్ఛాదన ఉండేది కాదు. లోహపు తల, చేతులు, కాళ్లు, శరీరంతో చూడగానే ఇవి రోబోలేననిపించేవి. మనుషుల్లాంటి మరికొన్ని రోబోలు మనుషుల్లా కనిపించే రోబోల్లో కొన్ని ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్పుకుందాం. హాంకాంగ్‌కు చెందిన ‘హాన్సన్ రోబోటిక్స్’ సంస్థ 2015లో ‘సోఫియా’ అనే రోబోను రూపొందించింది. బ్రిటిష్ నటి ఆడ్రీ హెప్బర్న్ పోలికలతో రూపొందించిన ఈ రోబో ఇదివరకటి వాటి కంటే మరింత అధునాతనమైనది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో, అధునాతనమైన సెన్సర్లతో పనిచేసే ‘సోఫియా’ దాదాపు మనిషిలాగానే కనిపిస్తుంది. పరిచితమైన గొంతులను, ముఖాలను గుర్తిస్తుంది. ఎదుట ఉన్న మనుషులతో సూటిగా కళ్లలోకి చూస్తూ మాట్లాడగలుగుతుంది. భావోద్వేగాలను తెలిపేందుకు అరవైరకాల ముఖకవళికలను సందర్భోచితంగా ప్రదర్శిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సెలబ్రిటీల మాదిరిగా ‘సోఫియా’ ప్రముఖ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం విశేషం. సీబీఎస్ చానల్లో ‘60 మినిట్స్ విత్ చార్లీ రోజ్’, ఐటీవీలో ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్ విత్ పీర్స్ మోర్గాన్’, ఎన్బీసీ చానల్లో ‘టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్’ వంటి టీవీ షోల్లో ‘సోఫియా’ ప్రదర్శన చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు రెండేళ్ల కిందట ‘ఎరికా’ అనే రోబోను రూపొందించారు. మనిషి గొంతుతో మాట్లాడే సామర్థ్యం, మనుషులను గుర్తించే సామర్థ్యం, మనుషుల హావభావాలకు అనుగుణంగా స్పందించగల సామర్థ్యం దీని ప్రత్యేకతలు. దాదాపు పాతికేళ్ల జపనీస్ అమ్మాయిలా కనిపించే ‘ఎరికా’ ప్రపంచంలోనే అత్యంత అందమైన రోబోగా వార్తలకెక్కింది. ‘ఎరికా’ త్వరలోనే ‘బి’ అనే హాలీవుడ్ సైన్స్‌ఫిక్షన్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించనుంది. హాంకాంగ్‌కు చెందిన శాస్త్రవేత్త రిక్కీ మా 2016లో స్వయంకృషితో తన ఇంట్లోనే అచ్చం మనిషిలాంటి రోబోను తయారు చేశాడు. హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహాన్సన్ పోలికలతో తీర్చిదిద్దిన ఈ రోబోకు ‘మార్క్–1’ అని పేరు పెట్టాడు. త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించిన అస్థిపంజరానికి సిలికాన్‌తో రూపొందించిన చర్మం సహా అన్ని హంగులూ సమకూర్చి రిక్కీ మా దీనిని తయారు చేశాడు. మనుషుల మాదిరిగానే ఇది కాళ్లు, చేతులు, మెడ, నడుము కదిలించగలదు. ముఖంలో రకరకాల భావోద్వేగాలను పలికించగలదు. ‘రోబో’ భావన ఈనాటిది కాదు అచ్చం మనుషుల్లానే పనిచేసే మరమనుషులు ఉండాలనే భావన ఈనాటిది కాదు. మనుషుల్లో ఇలాంటి ఆలోచనలు క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేవి. ఇలాంటి భావన తొలిసారిగా చైనీస్ తావో తత్వ గ్రంథం ‘లీజీ’లో కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటిది. క్రీస్తుశకం 50 నాటికి చెందిన గ్రీకు గణితవేత్త, ఇంజనీరు ‘హీరో ఆఫ్ అలెగ్జాండ్రా’ ఒక కాల్పనిక గ్రంథంలో విందుకు హాజరైన అతిథుల గ్లాసుల్లో మరమనిషి వైన్ నింపే దృశ్యాన్ని వర్ణించాడు. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో అరేబియాకు చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి అల్ జజారీ తన రచనల్లో మరమనుషులతో కూడిన బ్యాండ్ పార్టీని వర్ణించాడు. అక్కడితోనే ఆగిపోకుండా, చేతులు కడుక్కునేందుకు మనుషుల శిల్పాలతో కూడిన ఆటోమేటిక్ యంత్రాన్ని రూపొందించాడు. తర్వాత ఏనుగు బొమ్మను రూపొందించి, దానిపై ఏర్పాటు చేసిన మావటి బొమ్మ గంటలు కొట్టేలా ఒక మర గడియారాన్ని కూడా రూపొందించాడు. అల్ జజారీ చేసిన ఆ ప్రయత్నాలను రోబోటిక్స్‌లో తొలి ముందంజగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సీ మనిషిని పోలిన ఆటోమేటిక్ యంత్రాన్ని కవచం ధరించిన సైనికుని ఆకారంలో రూపొందించాడు. మర మనుషుల తయారీకి సంబంధించి శతాబ్దాల కిందటే అనేక ప్రయోగాలు జరిగినా, ఎంతో కాల్పనిక సాహిత్యం వెలువడినా అప్పటి రచనల్లో ఎక్కడా ‘రోబో’ అనే మాట కనిపించదు. వందేళ్ల నుంచి మాత్రమే ‘రోబో’ అనే మాట వాడుకలోకి వచ్చింది. తొలిసారిగా చెక్ రచయిత కారెల్ చాపెక్ 1921లో తాను రాసిన ‘రోసుమ్స్ యూనివర్సల్ రోబోస్’ నాటకం ద్వారా ‘రోబో’ అనే మాటను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. చెక్, పోలిష్ భాషల్లో ‘రోబోటా’ అనే పదం దీనికి మూలం. ఆ రెండు భాషల్లోనూ ‘రోబోటా’ అంటే కాయకష్టం, దుర్వినియోగం అనే అర్థాలు ఉన్నాయి. జర్మన్ దర్శకుడు ఫ్రిజ్ ల్యాంగ్ 1927లో తీసిన ‘మెట్రోపోలిస్’ సినిమాలో ‘మెషినెన్మెన్ష్’ (మరమనిషి) పాత్రలో బ్రిగిట్ హెల్మ్ నటించింది. వెండితెరపై రోబో పాత్ర కనిపించడం ప్రపంచంలో అదే మొదటిసారి. ఆ తర్వాత చాలా భాషల్లో చాలా సినిమాల్లో రోబోల్లాంటి యంత్రాలూ కనిపించాయి. రోబోల పాత్రల్లో కొందరు నటీ నటులూ కనిపించారు. హ్యూమనాయిడ్ రోబోల భవితవ్యం దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1982లో ‘బ్లేడ్ రన్నర్’ అనే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో 2019 నాటికి మనుషులను పోలిన రోబోలు అన్ని రంగాలకూ విస్తరించి పని చేస్తుంటాయి. భూమ్మీదనే కాదు, భూమికి దూరంగా గ్రహాంతరాల్లో కూడా ఇవి రకరకాల పనులు చేస్తుంటాయి. ఆ సినిమాలో కృత్రిమ పక్షులు, జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ సినిమాలో ఊహించిన స్థాయికి రోబోటిక్స్ రంగం ఇంకా చేరుకోలేదు. అయితే, దాదాపు మనుషులను పోలి ఉండే రోబోలను తయారు చేయడంలో మాత్రం విజయం సాధించింది. మనుషులకు పూర్తి ప్రత్యామ్నాయం కాగల హ్యూమనాయిడ్ రోబోలను సృష్టించే దిశగా ప్రయోగాలు జరుపుతోంది. మనుషులు చేయగలిగే పనుల్లో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి. వీటిని ఇప్పటి వరకు మనుషులే చేస్తూ వస్తున్నారు. ఉదాహరణలు చెప్పుకోవాలంటే... పూడుకుపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రపరచడం, బాంబులను నిర్వీర్యం చేయడం, ప్రమాదకరమైన గనుల లోలోపలి ప్రదేశాలకు వెళ్లడం వంటివి. హ్యూమనాయిడ్ రోబోలను మనుషులకు దీటుగా తయారు చేయగలిగితే, ఇలాంటి పనుల్లో వాటిని విజయవంతంగా ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది. హ్యూమనాయిడ్ రోబోల ప్రయోజనానికి ఇదొక కోణమైతే, మరో మానవీయ కోణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారు. వారికి తోడుగా ఉంటూ, వారికి అవసరమైన సేవలు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటివి తోడుగా ఉంటే ఒంటరి వృద్ధులకు తమతో ఒక మనిషి తోడుగా ఉన్న భావనే కలుగుతుంది. సంగీతాన్ని పలికించే రోబోలు, వివిధరకాల సంగీత వాద్య పరికరాలను నైపుణ్యంతో వాయించగలిగే రోబోలను ఇప్పటికే శాస్త్రవేత్తలు తయారు చేశారు. త్వరలోనే వినోద రంగంలోనూ రోబోలు ప్రేక్షకులను అలరించే అవకాశాలు లేకపోలేదు. కృత్రిమ మేధతో, తగిన భాషా నైపుణ్యాలతో రూపొందే రోబోలు భవిష్యత్తులో టీవీ చానళ్లలో న్యూస్రీడర్లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని, అలాగే యుద్ధరంగంలో సైనికులకు ప్రత్యామ్నాయం కాగలిగే అవకాశాలూ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న కాలంలో హ్యూమనాయిడ్ రోబోల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అయినా, ఇవి మరింతగా మనుషులు పోషించే పాత్రల్లో ఒదిగిపోతాయని మాత్రం చెప్పవచ్చు. రజనీకాంత్ రోబో ప్రేరణతో రశ్మి భారతీయ శాస్త్రవేత్తలు కూడా హ్యూమనాయిడ్ రోబోల తయారీ దిశగా ప్రయోగాలు సాగిస్తూ వస్తున్నారు. రాంచీకి చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ రంజిత్ శ్రీవాస్తవ రెండేళ్ల కిందట దేశంలోనే తొలిసారిగా అచ్చం మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోను విడుదల చేశారు. దీని తయారీకి ఆయన దాదాపు రెండేళ్లు శ్రమించారు. రశ్మి పేరిట రూపొందించిన ఈ రోబో నాలుగు భాషలు– హిందీ, ఇంగ్లిష్, భోజ్‌పురి, మరాఠీ భాషల్లో మాట్లాడగలదు. ఎదుట ఉన్న మనుషులు మాట్లాడే దిశగా మెడను తిప్పగలదు. ముఖ కవళికల్లో కళ్లు, కనుబొమలు, పెదవుల కదలికల్లో భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు. ‘రశ్మి’ తయారీకి రజనీకాంత్ ‘రోబో’ సినిమా ప్రేరణగా నిలవడం విశేషం. రజనీకాంత్ ‘రోబో’ సినిమా చూసి వచ్చాక రంజిత్ శ్రీవాస్తవ కుమారుడు తనకు అలాంటి రోబో కావాలని మారాం చేశాడు. కొడుకు కోరికను సవాలుగా తీసుకున్న రంజిత్, తనకు ఎలాంటి లాబొరేటరీ లేకున్నా, సాంకేతిక బృందం సహకారం లేకున్నా పట్టుదలతో ‘రశ్మి’ రోబోను తయారు చేసి కొడుకు కోరికను తీర్చడమే కాదు, రోబోటిక్స్‌లో మన దేశం మరో మైలురాయిని అధిగమించేందుకు దోహదపడ్డారు.