Romantic Movie
-
సినిమా రిజల్ట్ నా చేతుల్లో ఉండదు : కేతిక శర్మ
అందాల భామ కేతిక శర్మ రొమాంటిక్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాష్ పూరీ నటించారు. తొలి సినిమాతోనే గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కేతిక ఆందాల ఆరబోతలో అస్సలు మొహమాటపడదు. ఆమె చేసిన రొమాంటిక్, లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు ఫ్లాప్ అయినా యూత్‌లో ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సక్సెస్ లేకపోయినా గ్లామర్‌తో అవకాశాలు కొల్లగొట్టేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన ఫెయిల్యూర్స్‌పై స్పందించింది. 'సినిమా కాన్సెప్ట్ నచ్చితే చేస్తాను. రిజల్ట్ గురించి ఆలోచించను. నా పాత్ర వరకు న్యాయం చేస్తాను. రిజల్ట్ నా చేతిలో ఉండదు' అంటూ కేతిక చెప్పుకొచ్చింది. -
ప్రేమికుల రోజు చూడాల్సిన స్పెషల్ మూవీస్ ఇవే..
వాలెంటైన్స్ డే.. ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజిది. ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్నా ఎందుకో ప్రేమికులకు ఈరోజు మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డేకి మించిన రోజు ఉండదని భావిస్తారు. అందుకే ప్రేమికుల రోజును మరింత స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు. రెండు మనసుల్ని దగ్గర చేసే ప్రేమ మత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి దేవదాసు దగ్గర్నుంచి లేటెస్ట్ సీతారామం వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చేశాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్‌గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దాం. ప్రేమికుల రోజు సోనాలి బింద్రే, కునాల్ జంటగా నటించిన ప్రేమికుల రోజు సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. కాథిర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం, క్లైమాక్స్‌లో మళ్లీ కలవడం ఇలా ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కథకు తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. జయం దేశ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. నితిన్, సదా జంటగా నటించిన ఈ సినిమా హీరో,హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో విజయం సాధించడంతో తమిళంలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యిందీ చిత్రం. గీతాంజలి నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఎవర్గ్రీన్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. ఇళయరాజ సంగీతం సినిమాకు మరో ఆణిముత్యంలా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్, సన్నివేశాలు ఎవర్గ్రీన్. ఏ మాయ చేసావే నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సమంతకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే సమంత, నాగ చైతన్య మధ్య స్నేహం కుదిరింది. పెళ్లికి దారితీసింది. కానీ ఏమైందో ఏమో మనస్పర్థల కారణంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆర్య సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బన్నీకి స్టార్డమ్కు తెచ్చిపెట్టింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ప్రపోజ్ డేకు బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. లవ్ ఎట్ సైట్, ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారు. లవ్‌స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం లవ్ యాంగిల్లోనే కాకుండా కుల వివక్ష, చిన్నతనంలోనే లైంగిక వేధింపులు వంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేశారు. నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. కథలో ఇంటెన్స్ స్టోరీతో పాటు టైటిల్‌కు తగ్గట్లుగా మంచి ఫీల్‌గుడ్ పాటలతో సాగిన ఈ చిత్రం వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో ఒకటి. వీటితో పాటు సఖి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమదేశం, వర్షం, సీతారామం సహా ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. -
ఈ వారం సినీ ప్రియులను అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు తెలుసా ?
Upcoming Movies And Web Series On This Week: సినీ ప్రియులకు సినిమాలు చూడటమే ఆనందం. అందుకే ఎప్పుడెప్పుడూ ఏ కొత్త సినిమా విడుదలవుతుంది ? ఏ వెబ్ సిరీస్ చూద్దాం ? అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలకు చెక్ పెడుతూ ఈ వారం థియేటర్లు, ఓటీటీలు కళకళలాడనున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో రానున్న పలు హిందీ, తెలుగు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందామా ! 1. అంతిమ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'. మహేశ్ వి. మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్ శర్మ కీలకపాత్ర పోషించారు. ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సల్మాన్ ఖాన్ పోలీసు ఆఫిసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేశారు. 2. అనుభవించు రాజా రాజ్‌తరుణ్ కీలక పాత్రలో శ్రీను గావిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అనుభవించు రాజా’. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. కషికా ఖాన్ కథానాయికగా చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అందులోని సంభాషణలు ఆకట్టుకున్నాయి. నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. 3. ది లూప్ తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శింబు. ఈ తమిళ స్టార్హీరో ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో అలరించేందుకు 'ది లూప్' సినిమాతో రానున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన తమిళ చిత్రం ‘మానాడు’. దీన్ని తెలుగులో ‘ది లూప్’ పేరుతో నవంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్లు సమాచారం. 4. ఆశ ఎన్కౌంటర్ యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా చేసుకుని వస్తోన్న సినిమా 'ఆశ ఎన్కౌంటర్'. 2019 నవంబర్ 26న హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఆర్జీవీ సమర్పిస్తున్నారు. 5. క్యాలీఫ్లవర్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన వినోదాత్మక చిత్రం ‘క్యాలీప్లవర్’. దీనికి 'శీలో రక్షతి రక్షితః' అన్నది క్యాప్షన్. కథానాయికగా వాసంతి నటించగా, పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబరు 26న థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 6. భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ రాసిన ఓ లైన్‌ను ఆదర్శంగా తీసుకొని సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'భగత్ సింగ్ నగర్ వాలాజా క్రాంతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విదార్థ్, ధృవీక జంటగా నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుంది. 7. కార్పొరేటర్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షకలక శంకర్. అంతేకాదు, ఆయన కథానాయడిగానూ నటించారు. తాజాగా ఆయన కీలక పాత్రలో సంజయ్ పునూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్పొరేటర్’. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదంతో పాటు, రాజకీయ సందేశంతో కూడిన చిత్రంగా ‘కార్పొరేటర్’ రూపొందించారు. 8. 1997 డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘1997’. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాచరు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘1997’ను నవంబరు 26న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటీటీలో సందడి చేసే చిత్రాలు.. అమెజాన్ ప్రైమ్ వీడియో * దృశ్యం-2, నవంబర్ 25 * చ్చోరీ (హిందీ), నవంబరు 26 నెట్‌ఫ్లిక్స్ * పెద్దన్న * ట్రూ స్టోరీ (హాలీవుడ్), నవంబరు 24 * బ్రూయిజ్డ్ (హాలీవుడ్), నవంబరు 24 * ఏ కాజిల్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్), నవంబరు 26 డిస్నీ+ హాట్‌స్టార్ * 2024(హిందీ), నవంబరు 23 * హాకేయ్ (తెలుగు డబ్బింగ్), నవంబరు 24 * దిల్ బెకరార్ (వెబ్ సిరీస్), నవంబరు 26 జీ5 * రిపబ్లిక్, నవంబర్ 26 ఆహా * రొమాంటిక్, నవంబర్ 26 -
రొమాంటిక్: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Romantic Movie On AHA: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యే రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్‌కు ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. పూరి ఈ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించగా ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించాడు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డార్లింగ్ ప్రభాస్ వల్ల ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. చదవండి: రొమాంటిక్ సినిమా ఎలా ఉందంటే.. తాజాగా రొమాంటిక్ మూవీ ఓటీటీ ట్రాక్ ఎక్కింది. థియేటర్లో రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకే థియేటర్లో ఈ సినిమా చూసిన పూరీ ఫ్యాన్స్ మరోసారి ఓటీటీలో చూడొచ్చని సంతోషిస్తున్నారు. అటు థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఆహాలో చూసేయొచ్చన్నమాట! 'Vasco' and 'Monica' are here to charm you 🥰 Get ready to see the world in a Romantic way from November 26❣️#RomanticOnAHA @ActorAkashPuri @AnilPaduri @meramyakrishnan @purijagan #KethikaSharma pic.twitter.com/8dLFzTfEcP — ahavideoIN (@ahavideoIN) November 16, 2021 -
కేతిక ఏడుపు చూసి భయపడ్డా
-
గరం గరం వార్తలు 30 October 2021
-
Romantic Review: రొమాంటిక్ మూవీ రివ్యూ
టైటిల్ : రొమాంటిక్ నటీనటులు : ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ దర్శకత్వం : అనిల్ పాదూరి సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : నరేష్ రానా విడుదల తేది : అక్టోబర్ 29,2021 పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలెడతాడు. వచ్చిన డబ్బుతో తన నానమ్మ పేరుతో మేరీ ట్రస్ట్‌ని నెలకొల్పి తన బస్తీ వాసులకు ఇళ్లు నిర్మించి వసతులు కల్పిస్తుంటాడు. పెద్ద పెద్ద నేరాలు చేసైనా సరే.. తన బస్తీవాసులకు ఇల్లు కట్టించాలనుకుంటాడు. దీనికోసం గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్తగా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ). వాస్కోడిగామాను పట్టుకొని, ఆ గ్యాంగ్‌ని అంతమొందించడమే ఆమె లక్ష్యం. మరి ఏసీపీ రమ్య వలలో వాస్కోడిగామా చిక్కాడా లేదా? మోనికతో మోహం ఏమైంది? నిజానికి అది మోహమా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్’కథ. ఎవరెలా చేశారంటే... గ్యాంగ్ స్టర్ వాస్కోడి గామాగా ఆకాశ్ పూరీ అదరగొట్టేశాడు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. తన నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది. ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది. అయినప్పటికీ.. అకాశ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఫైట్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్‌లో కూడా అద్భుత నటనను కనబరిచాడు. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా జనాలకు గుర్తిండిపోతుంది. ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. రొమాంటిక్ సీన్స్‌లో అద్భుత నటనను కనబరిచి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. క్లైమాక్స్‌లో ఆమె ఫెర్పామెన్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆకాశ్ పూరీ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర రమ్యకృష్ణది. ఏసీపీ రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆకాశ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే...? పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్’టచ్ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మర్లో` అనే తత్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవడం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం.. అంతా సినిమాటిక్‌గా ఉంటుంది. అయితే లాజిక్లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్రధానబలం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రొమాంటిక్ మూవీ ట్విటర్ రివ్యూ
పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Can watch #Romantic 3 times for @ActorAkashPuri, 3 times for #Ketikasharma & 1 time for the entire team 🥳 Loved it ❤@purijagan @Charmmeofficial #AnilPaduri #SunilKashyap @PuriConnects #RomanticOnOCT29th pic.twitter.com/gKjjOdUBTe — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 Just watched #romantic Thoroughly enjoyed it!🙂@ActorAkashPuri killed it!👏👏#Ketikasharma did a great job, welcome to TFI! Wishing the entire team all the very best!#RomanticOnOCT29th pic.twitter.com/Hhd2YrUYo4 — Teja Sajja (@tejasajja123) October 27, 2021 @purijagan Big blockbuster of Movie #romantic @ActorAkashPuri #blockbuster @purijagan Garu big fan of ur love you sir❤️❤️💪 pic.twitter.com/7qQBYh2MuU — Arun (@Arun81197894) October 29, 2021 " I love india Rupayi karchundadu I Love you dhoola teeripothundi" @purijagan things 🔥🔥 #Romantic — E Avinash (@EAvinash1106) October 29, 2021 Breaking update Hero #Ram Cameo in #Romantic movie 😍🤩🥰 — E Avinash (@EAvinash1106) October 29, 2021 #Romantic : “Turns out to be OVERMATIC” 👉Rating : 1.25/5 ⭐️ Positives: 👉Few dialogues Negatives: 👉Entire Film 👉Bad Narration 👉Overaction This puri Akash film will make you feel…Ela cheparura premieres lo🥲#akashpuri #KetikaSharma pic.twitter.com/X1Vu09ooPZ — Theinfiniteview (@theinfiniteview) October 29, 2021 Block Buster Director @AnilRavipudi Sir Speech at #Romantic Special Premiere 💥 Releasing Tomorrow in Theaters 💥 All The Best To The Entire Team From Anil Sir Fan's 🙌💥@ActorAkashPuri #Ketikasharma@purijagan #AnilRavipudi#RomanticOnOCT29th pic.twitter.com/maR74yihPx — Anil Ravipudi FC™ (@AnilRavipudiFC) October 28, 2021 The fighting back of urge to watch #Romantic is real. I'm torn from the gut. — Alice in Cinema Hall 🎥 (@cinemapilla) October 29, 2021 -
రొమాంటిక్ మూవీ టీం తో గరం సత్తి ముచ్చట్లు
-
‘రొమాంటిక్’ మూవీపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తాజా చిత్రం రొమాంటిక్. ఈ మూవీ అక్టోబర్ 29(శుక్రవారం) విడుదలకు సిద్దమైన సంగితి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ మూవీ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ షోకు దర్శకుడు ధీరుడు రాజమౌళి కుటంబ సమేతంగా వచ్చి వీక్షించారు. అలాగే స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు బాస్కర్, గొపిచంద్ మిలినేని, బాబీ, మెహర్ రమేశ్‌లతో పలువురు నటీనటులు ఈ పీమియర్ షోకు హజరయ్యారు. ఈ షో చూసిన అనంతరం డైరెక్టర్లంతా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీ బాగుందని, ఇది ఆకాశ్ కెరీర్‌కు మైల్స్టోన్ అవుతుందని కితాబిచ్చారు. చదవండి: ChaySam Divorce: సమంత పోస్ట్‌పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ అలాగే రాజమౌళి కూడా మీడియాతో మాట్లాడుతూ రొమాంటిక్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. ఇది కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ముసలోడివై పోయావ్…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉంది. అనిల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన మనసులో ఏదనిపిస్తే అది లెక్కలు వేసుకోకుండా మరీ చిత్రాన్ని రూపొందించాడు. ఆకాశ్, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అతడిని మరోమెట్టు ఎక్కిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బాగా ఆకట్టుకుంది. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్ భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు #ssrajamouli at #Romantic Special Premiere. Talks about the film.#RomanticOnOCT29th pic.twitter.com/tdORbZtdPc — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 28, 2021 -
ఆకాశ్ మంచి నటుడే.. కానీ అందులో చాలా వీక్: పూరి జగన్నాథ్
‘ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. రొమాంటిక్ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది’అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటే చేసింది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. . ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాశ్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాశ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాశ్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక మనం చేద్దామని ఆకాశ్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్‌లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు. ‘ఆకాశ్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్’ అని అన్నారు నటి, నిర్మాత చార్మి. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఈ సినిమాకు నా వాయిస్ ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మీ నాన్న డబ్బింగ్ చెప్పారా? అని అన్నారు. సినిమా చూసిన అందరూ కూడా అదే అన్నారు. మా నాన్నకు ఓ హిట్ సినిమా ఇవ్వాలి. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’అన్నాడు యంగ్ హీరో ఆకాశ్. -
రొమాంటిక్ మూవీ ప్రీమియర్ షో టాక్
-
‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ప్రీమియర్ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేశారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతిమణి, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బాబీ, గుణశేఖర్, అలీ, సత్యదేవ్, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండతో పాటు రొమాంటి చిత్ర బృందం, పూరీ, ఛార్మీలు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ప్రీమియర్ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్ తప్పకుండా విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రీమియర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికాశర్మ హీరోయిన్గా నటించింది. చదవండి: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయా: కేతికా శర్మ
‘నేను డిల్లీ నుండి వచ్చాను. మాది డాక్టర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు సినిమా రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్ రావాలని అనుకున్నాను. పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్ ద్వారా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’అన్నారు హీరోయిన్ కేతిక శర్మ. అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’.పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఇన్ స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది. ►ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ►నా మొదటి చిత్రమే పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా ఆయన మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ►నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను చాలా ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషంగా నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది. ► ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుంది. రమ్యకృష్ణ, ఆకాశ్‌తో కలిసి నటించడం చాలెంజింగ్ గా అనిపించింది. దర్శకుడు అనిల్ ని ప్రతీ సీన్ గురించి పదే పదే అడిగేదాన్ని. టోటల్ ఔట్పుట్ చూశాక ఆడియెన్స్‌కు నేను నచ్చుతాను అని అనిపించింది. ► ఆకాశ్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. ► బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే. ► ప్రభాస్ మా టీంను పిలిచారు.. డార్లింగ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు. కానీ బాహుబలి మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ► సినిమా మొదటి నుంచి చివరి వరకు ఛార్మీ గారు మా వెంటే ఉన్నారు. ఆమే నాకు శిక్షణ ఇచ్చారు. మౌనికను నాలో ఆమె చూశారు. నన్ను నమ్మారు. ఆమె ఎంతో మంచి వ్యక్తి. ► రొమాంటిక్ చిత్రంలో కరోనా కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమా కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఆనందంగా ఉంది. ► రొమాంటిక్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరంతా కూడా రొమాంటిక్ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతారు. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి.. ప్రతీ సీన్ ట్రీట్‌లా ఉంటుంది. ► డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే డబ్బింగ్ చెప్పాలని, అది జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను. -
Romantic: భయమేసింది.. పారిపోదామనుకున్నా: ఆకాశ్ పూరి
ఆడియో ఫంక్షన్ పెట్టండి.. నేను కొంచెం మాట్లాడాలి అని అన్నాను. ఏం మాట్లాడతావ్ రా అని నాన్న అన్నారు. మీరు పెట్టండి అని అన్నాను. స్టేజ్ మీద అలా మాట్లాడే సరికి ఆయన సర్ ప్రైజ్ అయ్యారు. అలా మాట్లాడతాను అని ఊహించలేదు. మమ్మికి, డాడీకి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేశారు. అంత బాగా మాట్లాడాడు ఏంటి? అని అందరూ అనడంతో నాన్న గారు హ్యాపీగా ఫీలయ్యారు’అన్నారు పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’.కేతిక శర్మ హీరోయిన్. అనిల్ పాదురి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ► ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముందే ప్లాన్ చేసుకుని అలా మాట్లాడలేదు. ఆ టైంలో అనిపించింది చెప్పాను అంతే. పూరి పనైపోయిందని చాలా మంది అన్నారు.. నా పని కూడా అయిపోయిందని అన్నారు.. ఆ మాటలు వింటూ ఉండే వాడిని. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో అంతా వెనక్కి వచ్చింది. ► అనిల్ నాన్న దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఆయన సీజీ డిపార్ట్మెంట్ చూసుకునే వారు. ఆయన దర్శకత్వం చేస్తారని, అందులో నేను హీరోగా నటిస్తాను అని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఓ రోజు నాన్న(పూరి జగన్నాథ్) సడెన్‌గా పిలిచి ఈ సినిమాకు ఆకాష్ హీరో.. నువ్ దర్శకుడివి అని అనిల్‌తో అన్నారు. ఇద్దరం షాక్ అయ్యారు. అలా ఓ రెండు రోజులు కలిసి ట్రావెల్ అయ్యాం. తరువాత కనెక్ట్ అయిపోయాం. ► మెహబూబా విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ ఒకే సమయంలో జరిగాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అవ్వడంతో రొమాంటిక్ ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రావడంతో సినిమా స్థాయి మారిపోయింది. అలా సినిమాను పూర్తి చేసే సమయానికి లాక్డౌన్ వచ్చింది. మొత్తానికి అలా ఆలస్యమైంది. ► కరోనా వల్ల ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తారా? అని భయపడ్డాను . ఎందుకంటే ఇది అందరితో కలిసి థియేటర్లో కూర్చుని చూసే సినిమా. క్రాక్, ఉప్పెన, లవ్ స్టోరీ వంటి సినిమాలు మళ్లీ థియేటర్లకు ఊపిరిపోశాయి. ఏది ఏమైనా సరే థియేటర్లకు వచ్చి చిత్రాలు చూస్తామని చాటి చెప్పిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. ► రొమాంటిక్ సినిమాలో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఇది కేవలం యూత్ సినిమా మాత్రమే కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. రొమాంటిక్ అని టైటిల్ పెట్టినందుకు ట్రైలర్ అలా కట్ చేశాం. కానీ సినిమా విడుదలయ్యాక మౌత్ టాక్ ద్వారా ఇంకా జనాల్లోకి వెళ్తుందని నమ్మకం ఉంది. ► సినిమాలో ట్విస్ట్లాంటివి ఏమీ ఉండవు. కానీ కచ్చితంగా సినిమా చూస్తే ఎగ్జైట్ అవుతారు. వాస్కోడిగామా పాత్రలో కనిపిస్తాను. వాడి రూటే రాంగ్ రూట్. క్రైమ్ డిపార్మెంట్లో ఉంటాడు. ఇంత కంటే ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ► చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. వాస్కోడిగామా అనే పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది.ఈ క్యారెక్టర్ విన్న వెంటనే.. ఎలాగైనా సరే బాగా చేయాలని ఫిక్స్ అయ్యాను. ► మా నాన్న ఈ సినిమా లైన్‌ను ఎప్పుడో రాసుకున్నారు. ఈ కథలోకే నేను వచ్చాను. రొమాంటిక్ కథను నాకు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి హీరోలందరూ మా నాన్న డైలాగ్స్ చెబుతుంటే ఆనందపడేవాడిని. నేను ఇప్పుడు ఆయన డైలాగ్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. ► అనిల్ ఇది మొదటి సినిమాలా చేయలేదు. ప్రతీ ఒక్కటి ఎంతో క్లారిటీతో చేశారు. ఆయనకు ఈ చిత్రంతో ఎంతో మంచి పేరు వస్తుంది. నాకు తెలిసి ఆయన ఎలాంటి పెద్ద సినిమాను అయినా హ్యాండిల్ చేయగలరు. ఆయనకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ► సినిమా చూసి నాన్న గారితో పాటు అందరూ ఎమోషనల్ అయ్యాం. చాలా బాగా వచ్చింది. రేపు సినిమా చూశాక అందరూ అదే ఫీలవుతారు. ► రమ్యకృష్ణతో పని చేయడమే పెద్ద చాలెంజింగ్. ఆమెతో పని చేయడం నా అదృష్ణం, గౌరవంగా ఫీలవుతున్నాను. ఆమెకు నాకు వచ్చే సీన్లు పోటాపోటీగా ఉంటాయి. నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. నరసింహా సినిమాలో రజినీకాంత్ ముందు ఫెర్ఫామెన్స్ చేసిన ఆవిడ ముందు నేను చేస్తానా? అని అనుకున్నాను. ఆమెతో పని చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నో సార్లు ఆమె ముందు డైలాగ్స్ మరిచిపోయాను. కానీ ఆమె మాత్రం నవ్వుతూనే పర్లేదు టైం తీసుకో అని ఎంకరేజ్ చేశారు. ► ఏం చేయమంటే అది చేస్తాను.. దూకమంటే దూకుతాను.. కానీ ఈ రొమాన్స్ కాస్త తగ్గించు నాన్నా అని అన్నాను. సినిమానే రొమాంటిక్.. అందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా అని అన్నారు. సెట్లో ఎన్నో సార్లు భయమేసింది. పారిపోదామా? అని అనిపించింది. స్క్రీన్ మీద రొమాన్స్ చేయడం చాలా కష్టం. ► మా నాన్న నుంచి ఎంత దూరం పారిపోతే అంత మంచిదని అనిపిస్తుంటుంది. ఇప్పటికే మా నాన్న ఎంతో చేశారు. ఎంతో డబ్బులు పెట్టారు. ఇంత వరకు మా నాన్న చేసింది చాలు.. ఇక నేను మా నాన్నకు చేయాలి. తిరిగి ఇవ్వాలి. నేను సక్సెస్ కొట్టాక అప్పుడు వెళ్లి మా నాన్నతో ఓ సినిమా చేస్తాను. ► నేను అగ్రెసివ్, ఎమోషనల్ కంటెంట్ ఉన్న కారెక్టర్స్ బాగా చేయగలను అని నాన్న నమ్ముతారు. ► ప్రభాస్‌కి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తెలుసు. రొమాంటిక్ ప్రమోషన్స్ కోసం మేం ఎవ్వరం కూడా ప్రభాస్‌కి ఫోన్ చేయలేదు. ఆయనే ఫోన్ చేసి అడిగారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఒక రోజు మొత్తం మాకు ఇచ్చారు. ముంబైకి పిలిపించుకున్నారు. ఆయనతో ఉన్న ఆ ఒక్క రోజును ఎప్పటికీ మరిచిపోలేను. ► నాన్న ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. ఇంకా ఆయన్ను హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. కానీ ఆయన నన్ను ఎప్పుడూ అంతగా మెచ్చుకోరు. ఎంత కష్టపడి షాట్ చేసినా కూడా హా బాగుంది అని సింపుల్‌గా అనేస్తారు. ఎక్కువగా మెచ్చుకోరు. కానీ లోపల సంతోషపడతారు. ఆయన బాగుంది అని అంటే చాలు అదే ఎక్కువ. ► ఇప్పుడు కాదు కానీ ఓ పదేళ్ల తరువాత అయినా సరే దర్శకత్వం చేస్తాను. ముందు నేను హీరోగా నిలబడ్డ తరువాత డైరెక్షన్ చేస్తాను. కథ రాయడం నాకు రాదు. మా నాన్నకు రెమ్యూనరేషన్ ఇచ్చి కథ తీసుకుంటాను. డైరెక్షన్ మాత్రం చేస్తాను. ► సినిమా ప్రపంచం తప్ప మరొకటి తెలియదు. హీరోగా కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయ్యిండే వాడిని. కానీ సినిమా ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేస్తుండేవాడిని. ► నాకు రజనీకాంత్, చిరంజీవి దేవుళ్లతో సమానం. వారిద్దరూ చాలా ఇష్టం. వారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. ► నేను ఇప్పుడు ఏదో ఒక్క జానర్‌కు పరిమితం కావాలని అనుకోవడం లేదు. నా సినిమాను మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు అందరూ చూడాలని అనుకుంటున్నాను. ► పదేళ్ల అనుభవం ఉన్న నటుడిలా చేశావ్ అంటూ నాకు ప్రభాస్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాంటి రెస్పాన్స్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ► మా నాన్న తీసిన సినిమాల్లో నాకు పోకిరి, బిజినెస్ మెన్, నేనింతే అంటే చాలా ఇష్టం. ► చోర్ బజార్ సినిమా చాలా బాగా వస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నాం. అందులో కూడా ఇలాంటి సాలిడ్ కారెక్టరైజేషన్ ఉంది. బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్రలు దక్కడం ఆనందంగా ఉంది. ఆ చిత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో తీస్తున్నాం. కమర్షియల్ పరంగా చాలాపెద్దగా ఉంటుంది. అది యాక్షన్ బేస్డ్ ఫిలిం. దాదాపు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ మూవీ స్టిల్స్
-
ఆకాశ్‌లో ఆ కసి కనిపించింది: సంగీత దర్శకుడు సునీల్
‘‘రొమాంటిక్’ చిత్రంలోని ‘పీనే కే బాద్..’ పాట చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది రాత్రి పూట ఆ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసినవాళ్లతో పాటు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి, ‘పీనే కే బాద్..’ అని మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అన్నారు. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘రొమాంటిక్’లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. పూరీగారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది ‘రొమాంటిక్’ చూశాక ఆయన కంట్లోంచి నీళ్లు రావడంతో నా పని మీద నాకు నమ్మకం వచ్చింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎమోషన్ అవుతారు. మా ఇస్మార్ట్ గ్యాంగ్ సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్..’. ఈ సినిమాలో కేతికా శర్మ పాడిన ‘నావల్ల కాదే..’ పాట కూడా పెద్ద హిట్ అయింది. ‘వాస్కోడిగామ..’ పాటలో ఆకాష్ వాయిస్ బాగుంది. ప్రీ రిలీజ్లో ఆకాష్ మాట్లాడిన తీరులో తన కసి కనబడింది. హీరోలు ఎంత బాగా నటిస్తే నేను అంత బాగా రీ–రికార్డింగ్ (ఆర్ఆర్) ఇవ్వగలను. ‘రొమాంటిక్’ని అనిల్ బాగా తెరకెక్కించాడు. నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. నా జర్నీలో ఎక్కువగా భాస్కరభట్లగారే ఉంటారు. పూరీగారు తన సినిమాలన్నీ నాకు ఇవ్వాలని ఏమీ లేదు.. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే ఇష్టం. ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళుతుంటా. హిందీలోనూ రెండు సినిమాలు చేశాను. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్ వేరియేషన్స్, క్లాసికల్ ఫ్యూజన్స్ రావచ్చు. ప్రతి సినిమాలో అలాంటివి చేయలేం.. కానీ, ప్రైవేట్ ఆల్బమ్‌లో అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘గాడ్సే’ కి సంగీతం అందిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి. చదవండి: ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి -
హీరోయిన్గా ఉన్నప్పుడు కంఫ్టర్ ఉండేది: చార్మీ
Charmy Kaur: అతి తక్కువ కాలంలోనే నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ చార్మీ. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన చార్మీ ఆ తర్వాత సినిమాలకు గుడ్‌డై చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిర్మించిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 'హీరోయిన్గా ఉన్న సమయంలో ఎక్కువ కంఫర్ట్ ఉండేది. ఫిటినెస్‌పై మాత్రమే దృష్టి పెడితే సరిపోయేది. కానీ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అందరి కంఫర్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అయినా నాకేమీ విసుగు అనిపించడం లేదు. ఇప్పటికీ నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు ఇక నటించే ఆలోచన మాత్రం లేదు. అని చెప్పుకొచ్చింది. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్
‘‘మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే ‘రొమాంటిక్’. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయి. ఇది కేవలం యూత్ సినిమానే కాదు.. కుటుంబ ప్రేక్షకులూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ అనిల్ పాదూరి అన్నారు. ఆకాశ్ పూరి, కేతిక శర్మ జంటగా రమ్యకృష్ట ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ పాదూరి విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు అవ్వాలనే ఆలోచన నాలో రేకెత్తించింది పూరి జగన్నాథ్‌గారే. ‘రొమాంటిక్’ కథని డైరెక్ట్ చేయమని చెప్పారు పూరిగారు. ‘రొమాంటిక్’ కథ, మాటలు ఆయన రాసినా సినిమాలో నా మార్క్ కనిపిస్తుంది. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఈ పాత్రకు ఆకాశ్ వంద శాతం న్యాయం చేశాడు. ‘రొమాంటిక్’ ఫస్ట్ కాపీ చూసిన పూరిగారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ‘నా సినిమాలో ఇంత ఎమోషన్ ఉందా?. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ఎమోషన్ ఉంది.. ‘రొమాంటిక్’ లో అంత కంటే ఎక్కువగా ఉంది.. సినిమా బాగా తీశావ్.. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకున్నారు. నా తర్వాతి చిత్రం యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లోనే చేస్తాను’’ అన్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
ప్రభాస్ ను ఇంప్రెస్ చేసిన ట్రైలర్
-
ప్రభాస్ ఫోన్ చేసి.. సినిమాని ప్రమోట్ చేస్తానన్నాడు: పూరి
‘‘రొమాంటిక్’ మూవీ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్లుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్లుగా లాస్ట్ షాట్లో అద్బుతంగా అనిపించాడు. యాక్టర్‌గా ఆకాష్ ఇంప్రూవ్ అయ్యాడు. అనిల్ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు’’ అన్నారు ప్రభాస్. ఆకాష్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో వాస్కో పాత్రలో ఆకాష్, మౌనిక పాత్రలో కేతిక నటించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ప్రభాస్ ‘రొమాంటిక్’ ట్రైలర్‌ను విడుదల చేసిన వీడియోను ప్లే చేశారు. అనంతరం ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్’ను విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? ఈవెంట్‌కు రావాలా? అని అడిగారు. ప్రభాస్ చాలా మంచివారు. ‘రొమాంటిక్’ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ‘డార్లింగ్..’ అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ సర్ప్రైజింగ్గా ఉండబోతోంది. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా అనిల్ ‘రొమాంటిక్’ను బాగా తెరకెక్కించాడు’’ అన్నారు చార్మి. చదవండి: ‘రొమాంటిక్’గా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న ఆకాశ్ పూరీ -
‘రొమాంటిక్’గా ట్రైలర్.. లాంచ్ చేసిన ప్రభాస్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అనంతరం హీరోగా సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి దర్శకుడు. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్ పూరినే అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టకోగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. ‘ఐ లైక్ దిస్ ఎనిమల్’ అంటూ ఆకాశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయిన ఈ ట్రైలర్ ఎంతో రొమాంటిక్‌గా సాగింది. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం చూస్తున్న ఈ కుర్ర హీరో ఎలాగైనా సక్సెస్ రుచి చూడాలని కసిగా ఈ సినిమాతో చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీత అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 29న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. చదవండి: ప్రభాస్ ‘సలార్’లో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి? -
ఆకట్టుకుంటున్న ఆకాశ్ కొత్త సాంగ్ ‘పీనే కే బాద్’
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఇందులో కేతికా శర్మ హీరోయిన్గా నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘పీనే కే బాద్’ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘‘హ్యాపీ హ్యాపీ మామ.. దిల్ ఖుష్ అవుతుందే పీనేకే బాద్...’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు ‘పీనే కే బాద్’ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట థీమ్‌కు తగ్గట్లు పబ్‌లో షూట్ చేశాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పూరి జగన్నాథ్, భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు సునీల్ కశ్యపే పాడారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన చిత్రం నవంబరు 4న విడుదల కానుంది. చదవండి: సల్మాన్ ఖాన్ని డైరెక్ట్ చేయనున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ..? -
ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ విడుదల ఎప్పుడంటే..
డైనమిక్ డైరెక్టర్ పూరిగజన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’.ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేతికా శర్మ అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. (చదవండి: డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున) ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్లు, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. -
‘రొమాంటిక్’ సినిమా స్టిల్స్