RTC bus stand
-
ఆర్టీసీ ఉద్యోగిపై దాడి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఆన్‌డ్యూటీలో ఉన్న ఉద్యోగి(కంట్రోలర్)పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేయడానికి వచ్చి ఇన్‌గేట్(అనుమతిలేని చోట) వద్ద కారు పార్కింగ్ చేసి వె ళ్తుండగా కంట్రోలర్ గమనించారు. కారును అక్కడ నుంచి తీసివేయాలని సూచించారు. దీంతో వారిద్ద రు ఉద్యోగి జమాల్పాషాపై పిడగుద్దులు గుద్దారు. స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్క ర్లు కొడుతోంది. ఆర్టీసీ కంట్రోలర్ జమాల్‌పాషా దాడి విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సీఐ బన్సీలాల్ తెలిపారు. -
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
హుస్నాబాద్‌లో నాటుబాంబుల కలకలం.. పేలుడుతో ఉలిక్కిపడ్డ జనం..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్డీసీ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రెండు బాంబులు పేలగా ఐదు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడుతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం బస్టాండ్‌లోని పార్కింగ్ స్థలం పక్కన ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ప్రయాణికులు, అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు. తోపుడు బండి కార్మికుడు బస్టాండ్‌లోని తన తోపుడు బండిని బయటకు తీస్తుండగా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నాటుబాంబులకు తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఆ కార్మికుడు ఆర్టీసీ సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్ వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, పార్కింగ్ స్థలంలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఉన్న స్థలం వద్దకు ఎవర్నీ రానివ్వకుండా కట్టడి చేశారు. అయితే బస్టాండ్ ఆవరణలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ నాటు బాంబులు ఊర పందులు, అడవి పందులను అరికట్టేందుకు వినియోగిస్తారని తెలుస్తోంది. గన్‌పౌడర్ (నల్ల మందు)తో వీటిని తయారు చేస్తారని సమాచారం. ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులను పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నామన్నారు. -
శరవేగంగా పులివెందుల ‘ఆర్టీసీ’ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందులలో కొత్త ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోల నిర్మాణ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా సాగుతున్నాయని, నిర్ణీత కాలంలో వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. కరోనా సెకండ్ వేవ్‌తో పనులకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ముందుగా ప్రకటించిన గడువులోగానే పూర్తి చేస్తామని తెలిపింది. కొత్త ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది డిసెంబర్ 24న శంకుస్థాపన చేయగా.. అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొంది. పనుల పురోగతి ఇలా..: టరూ.2.80 కోట్లతో ప్రహరీ నిర్మాణం, గ్రావెల్ లెవలింగ్ పనుల పూర్తికి గడువు తేదీ ఈ ఏడాది జులై 31. ఆ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 1,100 మీటర్ల ప్రహరీకి గాను 900 మీటర్ల గోడ నిర్మాణం పూర్తయ్యింది. మిగతా 200 మీటర్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇంతవరకు రూ.2.30 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. ► రూ.9 కోట్లతో చేపట్టిన కొత్త బస్ డిపో భవనాల నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి. గ్యారేజీ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయ్యింది. మొదటి అంతస్తు గోడల నిర్మాణం జరుగుతోంది. ఆయిల్ రూమ్‌కు శ్లాబ్ వేశారు. మిగతా నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తి చేశారు. మొత్తం రూ.3 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ► రూ.22.40 కోట్లతో కొత్త బస్ స్టేషన్ నిర్మాణాన్ని 2022 సెప్టెంబరు 1నాటికి పూర్తి చేయాలి. మొత్తం 128 స్తంభాలకు గాను 108 స్తంభాల నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తయ్యింది. ఇంతవరకు రూ.2 కోట్ల విలువైన పనులు చేశారు. -
మాస్క్‌లు ధరించకుంటే టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఖమ్మం: ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకుంటే టికెట్ ఇవ్వొద్దని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రోజున ఖమ్మం బస్టాండ్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతే టికెట్ ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు. అనంతరం.. కోదాడు బస్సు డిపోను సైతం మంత్రి పరిశీలించారు. ప్రయాణికులకు స్వయంగా శానిటైజర్ స్ప్రే చేశారు. చదవండి: ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని ప్రతి బస్సుకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మేయర్ పాపాలాల్ మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. చదవండి: ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా -
సైకో వీరంగం.. గాజు ముక్కలతో..
సాక్షి, అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ సైకో వీరంగం సృష్టించారు. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకుంటూ హల్ చల్ చేశాడు. బస్టాండ్‌లో సెల్ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడ్డ నాని అనే సైకోను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని ఆర్టీసీ బస్టాండ్‌లోని అవుట్ పోస్ట్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన నాని.. అవుట్ పోస్ట్‌లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ.. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ పోలీసులపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
9వ తరగతి విద్యార్థి లంచ్‌బాక్స్‌లో గ్రెనేడ్ తీసుకొచ్చి
-
జమ్మూలో గ్రెనేడ్ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి!
జమ్మూ: జమ్మూలో గ్రెనేడ్ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్‌ను లంచ్ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనేడ్ తయారు చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారని, అతను కారులో బుధవారమే ఇక్కడికి చేరాడని పేర్కొన్నారు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం కూడా గాలిస్తున్నామన్నారు. మైనర్ అయిన నిందితుడు ఒక్కడే 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు? అది వన్‌వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్ము నేషనల్ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో నిందితుడు చెప్పాడన్నారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్‌గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్‌కు చెందిన యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్‌ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. -
నడిరోడ్డుపై తిష్ట.. రహదారిలో వెళ్లేదెట్ట..?
సాక్షి, కడప: రాత్రి వేళ వాహనదారులు, చిరు వ్యాపారులు పనులు ముగించుకొని హడావుడిగా ఇళ్లకు వెళ్లే సమయంలో కడప నగర వాసులకు ప్రతి రోజు ఓ సమస్య వేధిస్తోంది. సరిగ్గా రోడ్డు మధ్యలో పశువులు తిష్టవేసి వచ్చి పోయే వాహనాలకు స్పీడు బ్రేకర్లుగా తయారవుతున్నాయి. వీటిని తప్పించుకు పోవాలంటే ప్రజలకు గగనమవుతోంది. నగర శివారు ప్రాంతంల్లోనో లేక ఏదైనా వీధిలో అయితే పర్వాలేదు. ఏకంగా ప్రధాన కూడళ్లైన ఆర్టీసీ బస్టాండు, ఏడురోడ్లు, అప్సర సర్కిల్, ఐటీఐ, చిన్నచౌక్లలో రోడ్ల మధ్యలో గంటల తరబడి ఇవి నిలబడడం, పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట దగ్గరికి వచ్చినంత వరకు పశువులు పడుకున్నది అర్థం కాని పరిస్థితి. వాహనాలు రాత్రిపూట కొద్దిగా వేగంగా వెళుతున్న సమయంలో పశువులు గుంపులు గుంపులుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో వాహనాలు తిరగబడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతూ వాహనచోదకులతోపాటు చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు, పలు రకాల పండ్లను తింటూ పాడు చేస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరికలు సరే.. చర్యలేవీ? రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసే కార్పొరేషన్ అధికారులు వాటిని అమలు చేయటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీదకు వదిలిన పశువులను బందించి రోజుకు రూ.50 అపరాద రుసం వసూలు చేస్తామని, 15 రోజుల్లోపు బంధించిన పశువులను యజమానులు వచ్చి తోలుకెళ్లకపోతే వాటిని అడవులకు తరలిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేయటంతో కొద్దిరోజుల పాటు మాత్రమే వాటిని బయటకు రానీయకుండా యజమానులు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చి యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా కార్పొరేషన్ అధికారులు కట్టడి చేయాలని నగర ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు. -
సినిమా చూపిస్తా మామా!
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో వివిధ కారణాల వల్ల వేచి ఉండాల్సిన ప్రయాణికులకు శుభవార్త. తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియే టర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయిం చింది. ఆర్టీసీ ప్రతిపాదనకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ముందుకు వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి, టికెట్టేతర ఆదాయం కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న ఆర్టీసీకి ఈ ఆలోచన కాసులు కురిపిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మినీ థియేటర్ల నిర్మాణానికి చకాచకా అడుగులు వేస్తోంది. త్వరలో విజయవాడకు బృందం.. టికెట్టేతర ఆదాయం పెంపులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలను వేలం వేసిన ఆర్టీసీ, ఇకపై మినీ థియేటర్లను ఏర్పాటు చేయనుందని సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకోసం ఆర్టీసీకి చెందిన 23 స్థలాలను గుర్తించామని, ఇందులో 15 ప్రాంగణాల్లో మినీ థియేటర్లు నిర్మించేందుకు టీఎఫ్‌డీసీ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ థియేటర్ల ద్వారా ఏటా రూ. 3.11 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌లో ఇలాంటి మినీథియేటర్ నడుస్తోంది. ఈ మినీ థియేటర్ నిర్వహణ పని తీరును పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్ నేతృత్వం లోని బృందం విజయవాడ వెళుతుందని ఆయన వివరించారు. ఏయే ప్రాంతాల్లో.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్, సిరిసిల్ల, పెద్ద పల్లి, జడ్చర్ల, షాద్‌నగర్, నర్సా పూర్, సంగారెడ్డి, నాగార్జున సాగర్, కోదాడ, ఆర్మూర్, బోధన్, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. -
రూ.31.50లక్షల నగదు స్వాధీనం
సాక్షి, తాడిపత్రి టౌన్ : స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం రూ.31.50లక్షల నగదును అక్రమంగా తరలిస్తున్న తాడిపత్రి పట్టణం పతాంజలి వీధికి చెందిన నజీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగదును ఐటీ శాఖకు అప్పగించినట్లు పట్టణ సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నజీర్ జువెలర్స్ యజమాని నజీర్ అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు డీఎస్పీకి వచ్చిందన్నారు. ఆ మేరకు స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం ఎస్ఐలు రాఘవరెడ్డి, శ్రీధర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. బంగారు షాపు యజమానిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. -
ఇక ఆటోలో ప్రయాణం..సులభతరం.. సురక్షితం
అనంతపురం సెంట్రల్ : అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో దిగే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడే విధంగా ప్రయాణ చార్జీలు వసూలు చేసే ఆటో డ్రైవర్లకు కళ్లెం వేస్తూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. మహానగరాల తరహాలో ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రీ పెయిడ్ ఆటో బూత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ... ప్రయాణికుల ఆటోలలో రాకపోకలను సులభతరంతో పాటు సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు ప్రీ పెయిడ్ ఆటో బూత్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి గమ్యస్థానాలకు ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రయాణికులు, ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీలో ఈ ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రయాణికులు నేరుగా సెంటర్ వచ్చి వారు పోవాల్సిన చిరునామాకు టికెట్ తీసుకోవచ్చని చెప్పారు. ముందే ధరలు నిర్ణయించడంతో ఇష్టానుసారం వసూలు చేయడానికి కుదరదన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి మహిళలు బస్టాండ్‌లో దిగితే సురక్షితంగా గమ్యాన్ని చేరచ్చని చెప్పారు. సదరు ప్రయాణికురాలు ఏ ఆటో ద్వారా వెళ్తున్నారనే సమాచారం ముందే తెలిసిపోన్నారు. దీని వలన నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. నగరాన్ని ఎనిమిది రూట్లుగా విభజించడం జరిగిందన్నారు. ఒకటిన్నర కిలోమీటరుకు రూ. 25లు నిర్ణయించడం జరిగిందని, ఆ తర్వాత అదనపు చార్జీలు పడుతుందన్నారు. నగరంలో శివారు ప్రాంతానికి కూడా రూ. 150లు మించి ఉండదని తెలిపారు. దీని వలన ప్రయాణికునికి, ఆటో నిర్వాహకునికి ఇద్దరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కేంద్రం 24 గంటలు పనిచేస్తుందన్నారు. త్వరలో రైల్వే స్టేషన్లో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ నర్సింగప్ప, కార్పొరేషన్ కమిషనర్ మూర్తి, ఎంవీఐ రమేష్, సీటీఎం గోపాల్‌రెడ్డి, డీఎం బాలచంద్రప్ప సీఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి
-
చవితి ఎఫెక్ట్..!
అనంతపురం న్యూసిటీ: వినాయక చవితి... తెలుగు పండుగల్లో ఓ ముఖ్యమైన పండుగ. దీంతో సొంత ఊళ్లకు వెళ్లి పండుగకు వెళ్లాలనుకునే వారి సంఖ్యా ఎక్కువ. గురువారం జిల్లా కేంద్రం నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో అనంతపురం బస్టాండ్ కిటకిటలాడింది. తమ ఊరి బస్సు రాగానే సీటు కోసం పరుగులు తీశారు. -
ప్రయాణీకుల పాట్లు.. ఫీట్లు..!
వైవీయూ: ఆదివారం కడప నగరం ప్రయాణికులతో కిటకిటలాడింది. పోలీసు ఉద్యోగార్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దాదాపు 20వేల మంది కడప నగరానికి చేరుకున్నారు. పరీక్ష తర్వాత ఇంటికెళ్లేందుకు బస్టాండుకు వెళితే.. బస్సుల కొరత కారణంగా వేచి ఉండక తప్పలేదు. ఒక్కసారిగా వందలాది మంది వేచి ఉండటంతో బస్సు వచ్చిన సమయంలో సీటు కోసం ఫీట్లు చేయాల్సి వచ్చింది. పరీక్ష కోసం.. పరుగో.. పరుగో.. కడప నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల సందడి కనిపించింది. కేంద్రం వద్ద హాల్ టిక్కెట్లు, గుర్తింపు కార్డులు సరిచూశాక పరీక్షకు అనుమతి ఇచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు రాత పరీక్ష నిర్వహించారు. చాలా మంది టైం అయిపోతోందని పరుగెత్తుకుంటూ కేంద్రానికి చేరుకున్నారు. -
ఇక విజయవాడలోనే రవాణా కమిషనరేట్
సాక్షి, విజయవాడ : రవాణా శాఖ కమిషనరేట్ ఉద్యోగుల కార్యకలాపాలు ఈ నెల 27 నుంచి విజయవాడలో మొదలవుతాయని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. గురువారం ఉదయం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న భవనంలో రవాణా శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27కల్లా 80 మంది అధికారులు, ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, రెండో దశలో జూలై 15నాటికి సుమారు 70 మంది అధికారులు, ఉద్యోగులు వస్తారని వివరించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా తమ శాఖ కార్యాలయాన్ని ఇక్కడి మార్చామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయంలో కీలక భూమిక పోషించే తమ శాఖ కార్యకలాపాలు విజయవాడ నుంచి ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యాలయ రికార్డులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి 27వ తేదీనాటికి ఇక్కడికి వస్తామని చెప్పారు. 13 జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు, ఇతర విభాగాల అధికారులకు ఇక్కడ్నుంచే ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహిస్తామని చెప్పారు. రవాణా శాఖ నాన్ టెక్నికల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలాంటి షరతులు, డిమాండ్లు లేకుండా వచ్చి తాము పనిచేయడానికి సుముఖత తెలిపామని చెప్పారు. -
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం
అనంతపురం: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రంగనాయకులు ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏమైందో తెలియదు కానీ, పురుగుల మందు తాగి అనంతపురం బస్టాండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ డిపో మేనేజర్ వేధింపులే కారణమని మృతుని తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగనాయకులు కుటుంబానికి న్యాయం చేయాలని అతడి సన్నిహితులు, బంధువులు పోలీసులు, అధికారులను కోరుతున్నారు. -
చోరీకి యత్నించిన మహిళకు దేహశుద్ధి
వనపర్తి : స్థానిక ఆర్టీసీ బస్డాండులో చోరీ చేయటానికి విఫల ప్రయత్నం చేసిన ఓ మహిళకు ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల వద్ద ఉన్న చిన్నపిల్లాడి కాళ్లకు ఉన్న వెండికడియాలను చోరీ చేయటానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి పట్టుకున్నానని పిల్లవాడి తల్లి ఆరోపించారు. విషయం గమనించి చుట్టుపక్కల వారు చోరీకి ప్రయత్నం చేసిన మహిళకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆమెకు అవగాహన కల్పించి వదిలేశారు. -
మార్కాపురం బస్టాండు వద్ద వ్యక్తి హత్య
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండువద్ద మంగళవారం ఉదయం ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో అతన్ని కిరాతకంగా నరికి హత్యచేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన చెన్నకేశవులు(43) ఉదయం బస్టాండు వద్ద నడుచుకుంటూ వెళుతుండగా వెంబడించిన దుండగులు దారుణంగా నరికి చంపారు. పాతకక్షల వల్లే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్లాస్టిక్ కవర్లో పసికందు..
గుంతకల్లు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌లో పసికందు మృతదేహాన్ని కనుగొన్నారు. గుర్తు తెలియని మహిళ, పసికందును ప్లాస్టిక్ కవర్లో చుట్టి మూడో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై వదిలివెళ్లింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
15కోట్లతో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
-
ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యక్తి మృతి
అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం నుంచి అలాగే పడుకుని ఉండటంతో అనుమానం వచ్చి స్థానికులు సాయంత్రం తట్టి చూడగా ఒంట్లో ప్రాణం లేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఉంటుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాధ్యతగా వ్యవహరించకపోతే వేటే!
- ఆర్టీసీ సిబ్బందికి ఆర్ఎం హెచ్చరిక - డీఎంలతో సమీక్షాసమావేశం పట్నంబజారు(గుంటూరు) : విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని పక్షంలో వేటు తప్పదని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తన చాంబర్లో గురువారం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి జిల్లావ్యాప్తంగా పదిమందితో కూడిన బృందాలు తిరుగుతాయని, సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పక్కన పెట్టాల్సివస్తుందని స్పష్టం చేశారు. ఆయా డిపోల పరిధిలో బ్రేక్ డౌన్స్ అధికమైపోతున్నాయని, ఎప్పటికప్పుడు బస్సుల స్థితిగతులను చూసుకోవాల్సిన బాధ్యత డీఎంలపైనే ఉందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి రీజియన్ పరిధిలో జరుగుతున్న ‘బస్సు ప్రయాణ మాసం’లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతి డిపో మేనేజర్ వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో బస్సుల్లో పర్యటిస్తూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ఆదివారం డీఎంలు సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించి ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు గత నెల 27వ తేదీన శ్రీరామపురం తండా నుంచి ప్రసవం కోసం మాచర్ల బయలుదేరిన అరుణాబాయి బస్సులోనే ప్రసవించింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్ కృష్ణ, కండక్టర్ రహీంలను ఆర్ఎం శ్రీహరి అభినందించారు. -
జనవాహిణి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి... ధర్మపురిలో జనం నిండిపోయారు. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో ఉన్నారు. దయచేసి భక్తులంతా ఇతర పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లండి - కరీంనగర్ బస్‌స్టేషన్‌లో మైకు ద్వారా ఆర్టీసీ అధికారుల సూచనలివి. కాళేశ్వరంలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శనాన్ని రద్దు చేయడమైనది. భక్తులు సహకరించాల్సిందిగా మనవి - కాళేశ్వరంలో భక్తులు పోటెత్తడంతో ఆలయ అధికారులు చేసిన విజ్ఞప్తి ఇది. కోటిలింగాలకు ఈరోజు, రేపు వెళ్లడం కష్టమే. పది కిలోమీటర్ల దూరంలోనే వాహనాలన్నీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాయని వార్తలొస్తున్నాయి. వేరే చోటుకు వెళ్లి పుష్కరస్నానం చేసొద్దాం పదండి - కోటిలింగాలలో పరిస్థితిని తెలుసుకుని జిల్లాలోని ఇతర ఘాట్లకు వెళ్లే ముందు ఆర్టీసీ బస్టాండ్‌లో కుటుంబ సభ్యులకు చెబుతున్న ఓ భక్తుడి మాటలివి. కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లలో శనివారం భక్తుల తాకిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇవి నిదర్శనం. ముందుగా ఊహించినట్లుగానే పుష్కరాలకు వెళ్లే దారులన్నీ జిల్లావైపే మళ్లాయి. పొరుగు జిల్లాల, రాష్ట్రాల భక్తుల్లో అధికంగా జిల్లాలోని పుష్కర ఘాట్లకే విచ్చేశారు. ఏకంగా లక్షల సంఖ్యలో భక్తుల తాకిడి పెరగడంతో ఘాటన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు. చీమల దండు మాదిరిగా ప్రధాన పుష్కర ఘాట్లన్నింటి వద్దకు వాహనాలు బారులు తీరాయి. రాజీవ్హ్రదారి టోల్గేట్ల వద్ద వాహనాల రుసుం వసూళ్లు ఆలస్యం కావడంతో దాదాపు 20 కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. టోల్గేట్ల వద్దనున్న ప్రజల బాధలు వర్ణణాతీతం. శనివారం ఒక్కరోజే ఏకంగా 26 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ధర్మపురిలోనే సుమారు 10 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. కాళేశ్వరంలోనూ 7 లక్షల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమం వద్ద తనివీ తీరా స్నానాలు ఆచరించారు. కోటిలింగాలలో 2 ల క్షలు, మంథనిలో 1.25 లక్షల మంది పుష్కర స్నానాల్లో మునిగితేలారు. వాహనాలు పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడం..దారి పొడవునా వాహనాలు ఆగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పోలీసులది. వాహనాలను నియంత్రించేందుకు గంటల తరబడి చెమటోడ్చాల్సి వచ్చింది. ధర్మపురి, కాళేశ్వరంలో భక్తుల క్యూలైన్లు కిలోమీటర్ల కొద్దీ సాగారుు. దైవదర్శనం కోసం ధర్మపురిలో 6 గంటలు, కాళేశ్వరంలో 4 గంటలకుపైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మపురి జనసంద్రమైన వేళ ధర్మపురి పుష్కరానికి శనివారం ఒక్కరోజే దాదాపు 10 లక్షల మంది తరలిరావడంతో వాహనాల రాకపోకలు గంటల తరబడి స్తంభించిపోయాయి. ధర్మపురికి వచ్చే వాహనాలు దాదాపు 25-30 కిలోమీటర్ల వరకు నిలిచిపోవడంతో వాహనాల్లో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధర్మపురికి వచ్చే రోడ్లను మూసివేసి ఒకే రోడ్డు గుండా స్నానఘట్టానికి వెళేల్లా చేయడంతో భక్తులు ఒక్కరికొకరు తోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రదేశాల నుంచి వచ్చిన జనమే ఎక్కువగా ఉండటంతో స్నాన ఘట్టాలు తెలియక ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ నీతూప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిరంతరం అక్కడే ఉంటూ పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ దంపతులు ధర్మపురిలో పుష్కర స్నానమాచరించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, పంబ పీఠాధిపతి గోవిందనంద సరస్వతీశర్మ, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు ధర్మపురిలో పుణ్యస్నానం చేశారు. కిక్కిరిసిన కాళేశ్వరం.. శుక్రవారం రాత్రే వేలాది మంది భక్తులు కాళేశ్వరంలో బసచేసి శనివారం తెల్లవారుజామునే గోదావరి నది బాట పట్టారు. సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రైవేటు, ఆర్టీసీ పార్కింగ్ నుంచి గోదావరి నది ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ వరకు ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. మధ్యాహ్నం 3గంటల వరకు సుమారు 6.25 లక్షల మంది స్నానాలు చేయగా, రాత్రి 8 గంటల వరకు ఆ సంఖ్య 7ల క్షలు దాటినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గోదావరి నదీ వరకు ఆటోలను అనుమతించగా రద్దీ పెరగడంతో వాటిని నిలిపివేశారు. మూడు గంటల పాటు ఏకదాటిగా నదికి వరదలా భక్తులు తరలిరావడంతో స్వల్పతోపులాట జరిగింది. భక్తుల తాకిడిని ముందే పసిగట్టిన ఓఎస్టీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ పౌసమిబసు శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతారావు సైతం మూడు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. పుష్కర స్నానాల అనంతరం అనేక మంది భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి సుమారు కిలోమీటర్ మేర రెండు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సాధారణ ద ర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ దష్ట్యా వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దీ చేశారు. జాయింట్ కలెక్టర్ పౌసమిబసు స్వయంగా వీఐపీ, సాధారణ దర్శనాల వద్ద బైఠాయించి పరిస్థితిని చక్కదిద్దారు. మంథనిలో 1.25 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారు. పంప పీఠాధిపతి గోవిందనాథ సరస్వతీస్వామి, సంగారెడ్డి జిల్లా జడ్జి శాంతకుమారి, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్.రాజం పుష్కరస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిలింగాలలో 2 ల క్షలు కోటిలింగాల పుష్కర ఘాట్లన్నీ శనివారం ఇసుకేస్తే రాలనంతగా మారాయి. ఏకంగా 2లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. సెలవు దినాల్లో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశముందని గ్రహించిన అధికారులు రాత్రికి రాత్రే కొత్త ఘాట్‌ను ఏర్పాటు చేశారు. గోదావరిఖని బ్రిడ్జి వద్ద పుష్కరఘాట్‌లో శనివారం 50 వేల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. సమీపంలోని ఇంటెక్వెల్ వద్ద గల మరో పుష్కరఘాట్ వద్ద 15 వేల మంది పుష్కరస్నానమాచరించారు. రామగుండం మండల పరిధిలోని గోలివాడ పుష్కరఘాట్ వద్ద సుమారు ఐదు వేల మంది పుణ్యస్నానాలు చేశారు. శనివారం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లాపాపలతో భక్తులు అధిక సంఖ్యలో పుష్కరఘాట్లకు తరలివచ్చారు. ఆదివారం కూడా మరింత ఎక్కువ సంఖ్యలోనే భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు పుష్కరఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. టోల్గేట్లు ఎత్తేస్తారా.... ధ్వంసం చేయాలా? బీజేపీ జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు హెచ్చరిక గోదావరి మహా పుష్కరాలకు వచ్చే భక్తులంతా టోల్గేట్ల వద్ద నరకం కన్పిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలింతలు శనివారం అల్లాడిపోయారు. భక్తుల రద్దీ దృష్ట్యా పుష్కరాలు పూర్తయ్యేంతవరకు టోల్గేట్లను తక్షణమే ఎత్తివేయాలి. లేనిపక్షంలో టోల్గేట్లను ధ్వంసం చేసేందుకూ వెనుకాడం. -
ఆర్టీసీ బస్టాండులో మహిళ ప్రసవం
తల్లీబిడ్డ సురక్షితం తాడిపత్రి టౌన్ : స్థానిక ఆర్టీసీ బస్టాండులో బుధవారం ఉదయం ఓ మహిళ మగ శిశువును ప్రసవించింది. స్థానిక ఆర్టీసీ అధికారులు స్పందించి సకాలంలో ప్రసవం చేయించి, 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. స్థానిక ఆర్టీసీ అధికారుల కథనం ప్రకారం...వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం చెవిటిపల్లికి చెందిన లింగమయ్య, జయలక్షుమ్మ భార్యభర్తలు. జయలక్షుమ్మ గర్భిణి కావడంతో వైద్యం కోసం రెండు రోజుల క్రితం బత్తలపల్లి ఆస్పత్రికి వెళ్లారు. అయితే ప్రసవానికి వారం రోజులు సమయం పడుతుండని వైద్యులు చెప్పడంతో చెవిటిపల్లికి తిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి నొప్పులు రావడంతో బుధవారం ఉదయం పులివెందుల నుంచి తాడిపత్రికి వస్తున్న ఆర్టీసీ బస్సులో బత్తలపల్లికి బయలుదేరారు. తాడిపత్రి బస్టాండుకు రాగానే జయలక్షుమ్మకు నొప్పులు అధికం కావడంతో ఆమె భర్త అర్టీసీ అధికారులకు విషయం తెలిపారు. ఆర్టీసీ అధికారులు శశిభూషణ్, నాగభూషణం, హరిత, స్థానిక మహిళల సహకారంతో బస్టాండులోనే ప్రసవం చేశారు. అనంతరం 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. -
కార్మిక హక్కులను హరిస్తే సహించం
వాడవాడలా మేడే వేడుకలు నెల్లూరు(సెంట్రల్): కార్మిక హక్కులను హరిస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ చెప్పారు. మేడే సందర్బంగా నగరంలోని ఏబీఎం కాంపౌండు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద బహిరంగసభ ఏర్పాటుచేశారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చిన టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారని ఆందోళన చెందారు. బహుళజాతి కంపెనీలకు భూములు అప్పగిస్తూ రైతులు, కూలీలు, కార్మికుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రెపరెపలాడిన ఎర్రజెండాలు.. మేడే సంద ర్భంగా నగరంలో పలు చోట్ల ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఆత్మకూరు బస్టాండు ,కనకమహల్, వీఆర్సీ, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ, పలు చోట్ల ఎర్రజెండాలతో నగరం నిండిపోయింది. కనకమహల్ సెంటరులో సీపీఎం నాయకులు ఎర్రజెండాలతో ఆ ప్రాంతాన్ని నింపారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కార్మికుల పక్షాన పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చంద్రారెడ్డి, సూర్యనారాయణ, మస్తాన్‌బీ, గోపాల్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న సుమో..ఒకరి మృతి
వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): చిన్నమండెం మండలంలోని ముండ్లవారికోట గ్రామం వద్ద కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా సుమో ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో హోటల్ రమేశ్(40) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. రమేశ్ చిన్నమండెం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు. -
బస్టాండ్లలో దోపిడీ!
రాష్ర్టం మొత్తం మీద ఏ ఆర్టీసీ బస్టాండ్లు చూసినా అపరిశుభ్రతే! ఎంత ఘోరం అంటే కనీస సదుపాయాలు కూడా లేవు. మంచినీటి దగ్గర నుంచి మూత్రశాలల వరకూ అన్నీ అరకొరే. ఇక లోపల తినుబండారాల దుకాణాలు అయితే చెప్పనక్కరలేదు. ఏ మాత్రం శుచిగా లేకున్నా ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకోవడం ప్రయాణికు లను నిలువునా దోచుకోవడం అక్కడ దుకాణదారులకు పరిపా టైపోయింది. ఏ అధికారికి చెప్పినా ఫలితం శూన్యం. ఇది మామూలైపోయింది. ఎవరూ ఏమీచేయలేని పరి స్థితి దాపురించింది. ఒకానొక సందర్భంలో సంబం ధిత మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు మంత్రి గారికే పరాభవం ఎదురైందంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఎంతో ఘనంగా చెప్పుకునే హైద రాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్ పరిస్థితి కూడా అంతే! అదే కాదు హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి అంతే, ఒక్కసారైనా ఏ ఒక్క అధికారి అడిగిన పాపాన పోలేదు, ఇక మురుగు, పారి శుధ్యం సంగతి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కాబట్టి ఇప్పటికైనా మన అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవల సిన అవసరం ఎంతైనా ఉంది. - ఎస్.రాజేశ్వరి చిక్కడపల్లి, హైదరాబాద్ -
ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగం
ఒంగోలు నగరంలో సిటీ బస్సు సర్వీసులను మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. సిటీ బస్సులు నిలిపే బస్షెల్టర్లు కూడా ఆయన ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని సిటీ సర్వీసులు నడుపుతామని చెప్పారు. ఒంగోలు: ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగంగా ఉంటుందని రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో నూతనంగా ఏర్పాటు చేసిన 5 సిటీ సర్వీసులను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రి వద్ద, దక్షిణ బైపాస్‌లో ఏర్పాటు చేసిన బస్షెల్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు పేద వర్గాలకు సైతం అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా మరిన్ని సిటీ సర్వీసులు నగరానికి తీసుకువస్తామన్నారు. అదనంగా సిటీ బస్సులు వస్తే అప్పుడు మరిన్ని రూట్లలో ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం వీ.నాగశివుడు మాట్లాడుతూ సిటీ సర్వీసుల కోసం ఎన్నాళ్ల నుంచో ప్రజాసంఘాలు తీవ్ర పోరాటం చేశాయన్నారు. రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నూతన బస్సులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో రూట్ల ఎంపిక చేపడతామన్నారు. సిటీ బస్సుల కోసం ప్రత్యేక స్టూడెంట్ పాసులు ఉంటాయని, అదే విధంగా ఉద్యోగులకు కూడా ప్రత్యేక బస్సు పాసులు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, సీఎంఈ రవికాంత్,ఒంగోలు డిపో మేనేజర్ మురళీ బాబు, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల, ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూని యన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బస్సుల సమయాలు ఇలా: మొత్తం 5 మార్గాల్లో ఏర్పాటు చేసిన ఈ సర్వీసులు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే సమయాలు విధంగా ఉన్నాయి. సూరారెడ్డిపాలెం: 5.45, 6.15, 6.45, 8.15, 8.35, 9.15, 10.45, 10.55, 11.45, 13.15, 13.15, 14.15, 15.00, 16.00, 17.15, 17.30, 18.20, 19.45, 20.00, 22.15 మద్దిపాడు: 6.30, 7.00, 8.30, 9.30, 10.30, 12.00, 12.30, 14.15, 15.00, 16.15, 17.00, 18.45, 19.00, 21.00 ,21.15, సంతనూతలపాడు: 5.30, 7.30, 8.00, 9.30, 10.30, 11.30,13.00, 13.30, 16.00, 16.00, 18.00, 18.30, 20.00, 21.00, 21.55 కరువది: 7.20, 9.40, 12.00, 14.15, 17.05,19.25, 21.45. యరజర్ల: 6.45, 9.15, 11.45, 14.15, 17.00, 19.30, 21.55. మంగమూరు: 5.30,8.00, 10.30, 13.00, 15.45, 18.15, 20.45. -
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలి
కడప అర్బన్ : రిటైర్డ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలనీ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్టాండు నుంచి పీఎఫ్ కార్యాలయం వరకు రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎన్‌రెడ్డి, ఎల్.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈపీఎఫ్ 1995 స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం వాగ్దానం ప్రకారం 2005 నుంచి రివ్యూ చేసి అప్పటి నుంచి ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. ఈపీఎఫ్ స్కీమ్ 1995 సభ్యులెవరికీ ఎల్ఐసీని పునరుద్దరించాలని, అందుకు పెన్షన్‌లో రికవరీ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎఫ్ ఎల్ఐసీ అందరికీ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా రద్దు చేసిన ఈపీఎఫ్‌లో 1/3 పెన్షన్ అమ్ముకునేందుకు అనుమతించాలన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ నిధిని షేర్మార్కెట్లో ఉంచి జూదమాడే విధానాన్ని నిషేదించాలన్నారు. -
చిల్లర దోపిడీ
- పెట్రోల్ బంకుల్లో ఇష్టారాజ్యం - ఫిక్స్డ్ మిషన్లను వినియోగించని నిర్వాహకులు - ప్రతి లీటర్‌పై 50 పైసల నుంచి రూపాయి వరకు దోపిడీ - కొలతల్లోనూ మతలబు - పట్టించుకోని పౌర సరఫరాల శాఖ అధికారులు అనంతపురం రూరల్ : అనంతపురం నగరానికి చెందిన జ్ఞానేష్ అనే ఉద్యోగి పెట్రోల్ వేయించుకోవడానికి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లోని ఓ బంకుకు వెళ్లారు. రూ.వందకుపెట్రోల్ వేయమన్నారు. పంప్ బాయ్ రూ.99.41కు మాత్రమే వేశాడు. ‘ఇదేమిటి?! ఫిక్స్డ్ మిషన్ ద్వారా వే యొచ్చు కదా’ అని జ్ఞానేష్ ప్రశ్నించారు. అందుకు అతను ‘ఇష్టముంటే వేయించుకో.. లేకపోతే పో’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ పరిస్థితి ఒక్క జ్ఞానేష్కు మాత్రమే కాదు.. జిల్లాలో వినియోగదారులందరికీ రోజూ ఎదురవుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల నిర్వాహకులు బహిరంగంగానే నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వారితో గొడవ పెట్టుకుంటున్నారు. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి వారిలో కన్పిస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. తనిఖీలు చేయకుండా నిద్రమత్తులో జోగుతున్నారు. దీంతో వినియోగదారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ : జిల్లా వ్యాప్తంగా 225 పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 117, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీ) 70, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) బంకులు 38 ఉన్నాయి. ప్రతి నెలా పెట్రోల్ 4,600 కిలో లీటర్లు (ఒక కిలో లీటర్ వెయ్యి లీటర్లకు సమానం), 2,780 కిలోలీటర్ల డీజిల్ విక్రయమవుతోంది. ఇదే రోజుకైతే డీజిల్ 927, పెట్రోల్ 153 కిలోలీటర్లు అమ్ముడవుతోంది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.74.35, డీజిల్ రూ.64.23 ఉంది. వినియోగదారులు మాత్రం రూ.75, రూ.65 చొప్పున ఇవ్వాల్సి వస్తోంది. రూపాయలు కాకుండా.. పైసలు తిరిగి ఇవ్వడం కష్టం కనుక రూ.50, రూ.100..ఇలా వేయించుకోవాలని స్వయాన పౌర సరఫరాల శాఖాధికారులే సూచిస్తున్నారు. వారు చెబుతున్నట్లుగా కొంత మంది వేయించుకుంటున్నా.. దోపిడీ మాత్రం ఆగడం లేదు. పెట్రోల్ బంకుల్లో ‘ఫిక్స్డ్’ మీటర్లు వాడడం లేదు. అనేక బంకుల్లో నేటికీ అవి లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వినియోగదారుడు రూ.వందకు పెట్రోల్ వేయమంటే రూ.99.5లోపే మీటర్ ఆపేస్తున్నారు. దీనికితోడు ‘పెట్రోల్ గన్’ ట్రిగ్గర్ను మధ్యమధ్యలో వదిలి పెట్టడం ద్వారా మీటర్‌ను జంప్ చేస్తూ కొలతల్లోనూ కొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం బంకుల నిర్వాహకులకే వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తామని ఇటీవల డ్వామా హాలులో జరిగిన సమావేశంలో మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. అయితే, అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్న సూచనలు కన్పించడం లేదు. -
నోపార్కింగ్
సాక్షి, నెల్లూరు: నిర్మాణ రంగానికి సంబంధించి నెల్లూరులో నిబంధన ల ఉల్లంఘన జోరుగా సాగుతోంది. భవన నిర్మాణ సమయంలో పార్కింగ్ స్థలం చూపి ప్లాన్ అప్రూవ్ చేయించుకుంటున్న బిల్డర్లు తర్వాత తమ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కార్పొరేషన్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి పార్కింగ్ స్థలాల్లోనూ అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లైన కనకమహల్‌సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ట్రంకురోడ్డు, పెద్దబజారు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్లు, షాపింగ్‌మాళ్లు, కాంప్లెక్సులు, కల్యాణ మండపాలే ఇందుకు నిదర్శనం. వీటిలో 90 శాతం నిర్మాణాలకు పార్కింగ్ స్థలాలు లేవు. మొదట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను పార్కింగ్ స్థలంగా చూపి, ఆ తర్వాత దుకాణాలు నిర్మిస్తున్నారు. అపార్టుమెంట్లలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆయా ప్రదేశాల్లో వివిధ పనులపై వచ్చిన వారు వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్ జాం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ఏటా వంద కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లోనూ ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారం బయటపడింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన కార్పొరేషన్ అధికారుల అండతో నగరంలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 11 షాపింగ్ మాళ్లు, 233 షాపింగ్ కాంప్లెక్సులు, 31 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం భవనాలను పార్కింగ్ స్థలాలు లేవు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ ప్రముఖ ఫ్యాన్సీ షాపుల అధినేత కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ప్లాన్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌ను పార్కింగ్ ప్లేస్‌గా చూపారు. అనుమతులు మంజూరైన తర్వాత పార్కింగ్ ప్లేస్ మాయమైంది. కార్పొరేషన్ అధికారుల చేతులు తడపడంతో ఇప్పుడు వాహనాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. కోర్టు ఆదేశించినా.. మాగుంట లేఅవుట్లో కొద్ది రోజుల క్రితం రోడ్డు స్థలాన్ని కొందరు అప్పటి అధికార పార్టీ అండతో ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. రికార్డుల ప్రకారం వారికి 11.11 అంకణాల స్థలం ఉండగా, 17.33 అంకణాల్లో నిర్మాణం ప్రారంభించారు. సెట్‌బ్యాక్ వదలకపోవడంతో పాటు రెండు వైపులా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమించారు. జీ ప్లస్ 1 పేరుతో కార్పొరేషన్లో ప్లాన్‌కు దరఖాస్తు చేసి, ఐదంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే తమ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారంటూ విశ్రాంత ఇరిగేషన్ అధికారి కార్పొరేషన్ అధికారులను ఆశ్రయించారు. విచారించిన అధికారులు నిర్మాణం అక్రమేనని, తాము అనుమతులు మంజూరు చేయలేదంటూ చేతులు దులుపుకున్నారు తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణంపై కోర్టు స్టే మంజూరు చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నిర్మాణం ఆగలేదు. భారీ ఎత్తున ముడుపులు అందడంతోనే అధికారులు మిన్నకుండిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రక్తదారులు
అనంతపురం క్రైం : తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న ఆతృత.. మితిమీరిన వేగం.. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం.. అధికారుల నిర్లక్ష్యం.. కారణమేదైనా ప్రజలు మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 40 రోజుల వ్యవధిలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 30 మంది మృత్యుఒడికి చేరారంటే ప్రమాదాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక క్షతగాత్రులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. అనంతపురంలోని మూడో రోడ్డులో నివాసముంటున్న యువ పశువైద్యాధికారి నవతేజ (27) శుక్రవారం విధి నిర్వహణ కోసం అనంతపురం నుంచి తాడిమర్రి వెళ్లేందుకు ఉదయం ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా తన తప్పేమీ లేకున్నా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో మృత్యుపాలయ్యాడు. శనివారం చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓల్వో బస్సు.. ముందువెళ్తున్న లారీని ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన బాబుపిళ్లై, మద్దిశెట్టి చంద్రశేఖర్, బెంగళూరుకు చెందిన రాహుల్ అగర్వాల్ మృతి చెందాడు. వీరంతా యువకులే. ఓల్వో బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే నియంత్రించుకోలేక ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ముందు వెళ్తున్న లారీకి వెనుక ఇండికేషన్స్ వెలగలేదనే విషయం విచారణలో వెలుగు చూసింది. ఆగస్టు 31న రాత్రి 8 గంటలకు మడకశిర మండలం తడకలపల్లి-బుళ్లసముద్రం గ్రామాల మధ్య కారు అదుపు తప్పి వేపచెట్టును ఢీకొనడంతో ఆమిదాలగొంది, ఛత్రం గ్రామాల కార్యదర్శులు లక్ష్మినారాయణరెడ్డి (38), నాగరాజు (39) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ నెల 2న కుమారుడికి కటింగ్ చేయించేందుకు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఐషర్ వాహనం ఢీకొని ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన గోవింద్‌నాయక్ (40), కుమార్తె సోనియా (6) మృత్యువాత పడగా కుమారుడు సాయి అభిషేక్ గాయపడ్డాడు. ఈ ఘటనలో భర్త, కుమార్తెను పోగుట్టుకున్న తల్లి ఆవేదన అంతాఇంతా కాదు. ఇదే నెల 4వ తేదీన కదిరి మండలం నడిమిపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో నల్లమాడ మండలం సానేవారిపల్లికి చెందిన శివయ్య (43) దుర్మరణం చెందాడు. ప్రమాదాల్లో అధికశాతం లారీల వల్ల జరిగినవే కావడం గమనార్హం. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. ప్రమాదాల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏడాదికోసారి తూతూమంత్రంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ అంటూ వారోత్సవాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కమిటీ కూడా ప్రమాదాలను నియంత్రించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగాక నానా హడావుడి చేసే పోలీసులు రోడ్లపై అతివేగంగా వెళ్లే వాహనాలను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. వేగ నియంత్రణ చర్యలేవీ వేగ నియంత్రణ ద్వారా సగం రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చు. అయితే జిల్లాలో జాతీయ రహదారితో పాటు చిన్న చిన్న రహదారుల్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలు అజాగ్రత్త, అతివేగంతో జరుగుతున్నాయి. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిద్రపోతోంది. చాలా మంది లెసైన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. డీజిల్ ఆటోల్లో జనాల్ని మూటలను కుక్కినట్టు కుక్కుతున్నారు. దీంతో డ్రైవరు వాహనాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనికి తోడు కాలం చెల్లిన వాహనాలను తిప్పుతుండడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టి అదుపు చేసుకునేందుకు ప్రయత్నించినా కాలం చెల్లిన వాహనాలు అదుపులోకి రాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అభంశుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రవాణా అధికారులు, పోలీసులు పర్యవేక్షణ పెంచి వేగ నియంత్రణ, అధికలోడు, లెసైన్స్‌లేని వాహనాలపై చర్యలు తీసుకుంటే కొద్దిమేరకు ప్రమాదాలు అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
అయ్యయ్యో..
అనంతపురం క్రైం: ఎంత పని చేశావు దేవుడా.. బంగారు కుమారుడిని తీసుకెళ్తివే భగవంతుడా’.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నీకేం అన్యాయం చేశామయ్యా అంటూ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విలపించడం చూపరులను కలిచివేసింది. ఆ పాడు లారీ నా జీవితాన్ని నాశనం చేసిందంటూ భార్య వెక్కివెక్కి ఏడ్చింది. వెనుక వస్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. పెళ్లై ఎనిమిది నెలలైనా కాని ఓ పశువైద్యాధికారిని బలి తీసుకుంది. అనంతపురంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడిమర్రి పశువైద్యాధికారి ఎ.నవతేజ (27) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రామాంజనేయులు (గడివేముల మండలం గడియపేటలో హెచ్ఎం), శారదాదేవి దంపతుల కుమారుడు ఎ.నవతేజ 2012 సెప్టెంబరులో పశువైద్యాధికారిగా ఉద్యోగం పొందాడు. అప్పటి నుంచి తాడిమర్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అనంతపురం ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో ఏఈగా పని చేస్తున్న సుజితతో 2013 డిసెంబర్లో వివాహమైంది. అనంతపురంలోని మూడో రోడ్డులో నివాసం ఉంటున్నారు. నవతేజ శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో ఆర్టీసీ బస్టాండ్‌కు బయల్దేరారు. (అక్కడి నుంచి బస్సులో తాడిమర్రి వెళ్లేవారు) సైఫుల్లా ఫ్లై ఓవర్ బ్రిడ్జి (శ్రీనివాసనగర్ వైపు) దిగుతున్న సమయంలో ముందు వెళ్తున్న లారీ కాస్త స్లో అయింది. దీంతో నవతేజ బ్రేక్ వేసి వాహనం ఆపాడు. ఇదే సందర్భంలో వెనుక నుంచి ఎరువుల లోడుతో వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నవతేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న మృతుడి తల్లిదండ్రులు అనంతపురం చేరుకున్నారు. విగతజీవుడై పడి ఉన్న కుమారుడిని చూసి చలించిపోయారు. పెళ్లయిన తొమ్మిది నెలలకే కుమారుడు కన్ను మూయడాన్ని వారు జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదించారు. భార్య సుజిత కన్నీరుమున్నీరయ్యారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఎస్ఐ సాగర్ కేసు దర్యాప్తు చేపట్టారు. -
కిక్కిరిసిన బస్టాండ్
నిజామాబాద్ నాగారం: సమగ్ర సర్వే సందర్భంగా చాలా మంది స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా బస్సులు కేటాయించకపోవడంతో ప్రయాణికులు అష్టాకష్టాలు పడుతూ గమ్యాలను చేరుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, ముం బాయి, కరీంనగర్ తదితర ప్రాంతాలలో ఉన్న జిల్లా వా సులు ఇంటి దారి పట్టారు. దీంతో శనివారం నుంచి వన్ వే నడుస్తోంది. అంటే, ప్రయాణికులు అక్కడి నుంచి ఇక్కడి వస్తున్నారు. తప్పితే ఇక్కడి నుంచి అటు వెళ్లేవారి సంఖ్య నామమాత్రంగా ఉంది. మాములు రోజులలో నడిచే వాహనాలలోనే జనం నిండుగా ఉండేవారు. ఇపుడు మరింత రద్దీ పెరిగిపోయింది. హైదరాబాద్‌కు ‘పల్లెవెలుగు’ సర్వే పుణ్యమా అని పల్లె వెలుగు బస్సులు ఎక్స్‌ప్రెస్‌గా మారాయి. ప్రతి డిపో నుంచి పల్లె వెలుగు బస్సులను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిని సొంత గ్రామాలకు త్వరగా చేర్చడానికే పల్లెవెలుగు బస్సులు వేశామని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. ఇంద్ర, గరుడ, సూ పర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు నడుస్తున్నాయి. అయినా సరిపోకపోవడంతో పల్లెవెలుగు బస్సులు వేశారు. ప్రయాణికులు కూడా ఏ బస్సు అని ఆలోచన చేయడం లేదు. మన జిల్లా బస్సు ఉంది చాలు అంటూ ఎక్కేస్తున్నారు. తప్పని ఇక్కట్లు ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రత్యేకంగా బస్సులు కేటాయిం చకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బస్సులు సరిపడా లేకపోవడంతో జనం ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. -
బస్సుల నెలవు.. సమస్యల కొలువు
తండ్రికి అనారోగ్యం కలగడంతో పంపనూరు గ్రామానికి చెందిన రామకృష్ణ బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేయించుకుని, తిరుగు ప్రయాణంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. దాహం తీర్చుకోడానికి అక్కడే ఉన్న కొళాయి వద్దకు వెళ్లగా అందులో నీళ్లు రాలేదు. చేసేది లేక ఎదురుగానే ఉన్న మినరల్ వాటర్ దుకాణంలో డబ్బు చెల్లించి దాహం తీర్చుకున్నాడు. బస్టాండుకు వచ్చే ప్రయాణికులందరి పరిస్థితీ ఇదే... సాక్షి, అనంతపురం: వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే అనంతపురం ఆర్టీసీ బస్టాండులో కనీస సౌకర్యాలతో పాటు రక్షణ కూడా కరువవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 14 ప్లాట్‌ఫాంలున్న ఈ బస్టాండులో చివరి ప్లాట్‌ఫాం వద్ద నాలుగు కొళాయిలు ఏర్పాటు చేశారు. తీవ్రమైన దాహంతో కొళాయి వద్దకు చేరుకున్న ప్రయాణికులు అక్కడి పారిశుద్ధ్య పరిస్థితి చూడగానే దాహాన్ని మరచిపోయి దూరంగా పోతున్నారు. కాదని ఎవరైనా దాహం తీర్చుకోవాలని ప్రయత్నిస్తే నాలుగింటిలో ఒక్క కొళాయిలో మాత్రమే సన్నని ధారగా నీరు వస్తూ కనిపిస్తుంది. అయినా సరే దాహం తీర్చుకుందామంటే బస్సు వెళ్లిపోతుందేమోనన్న ఆదుర్దా అడ్డుపడుతుంది. ఇవన్నీ కాదని సహనం విహ ంచినా, ఆ నీరు దుర్వాసన వేస్తూ గుటక పడనివ్వదు. దీంతో ఆ నీటిని తాగితే అనారోగ్యం ఖాయమని గుర్తించిన ప్రయాణికులు ఎదురుగానే ఉన్న మినరల్ వాటర్ దుకాణంలో నీళ్లు కొనుగోలు చేసి తాగుతున్నారు. ఎంతటి నిరుపేదకైనా ఈ పరిస్థితి తప్పనిసరి. ఇదే అదనుగా, బస్టాండులో ప్రస్తుతం నీరు విక్రయించేందుకు ఆరు దుకాణాలు వెలిశాయి. వీరు సైతం మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ విక్రయిస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు. సేదదీరే అవకాశమే లేదు బస్సు లేకపోవడం వల్లో మరే కారణంతోనైనా బస్టాండులోనే నిలచిపోయిన ప్రయాణికులు తలదాచుకునేందుకు ఇక్కడ విశ్రాంతి గదులు సైతం లేవు. రాత్రి వేళల్లో బస్టాండుకు చేరుకునే ప్రయాణికులు బస్సు లేకపోతే, పడకలు అద్దెకు తీసుకునే శక్తి లేకపోతే బస్టాండు ఆవరణలోనే ప్లాట్‌ఫాంపై దోమలకాటుకు గురవుతూ, జాగరణ చేయాల్సిందే. మూత్ర శాలలు, మరుగుదొడ్లలో ఒక పద్ధతంటూ లేకుండా డబ్బు వసూలు చేస్తున్నా పరిశుభ్రత కానరావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులకు అవసరమైనన్ని కుర్చీలు, బల్లలు కూడా తగినంత స్థాయిలో లేవు. అనంతపురం బస్టాండ్ మీదుగా వెళ్లే బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకోవడానికి విచారణ కేంద్రానికి వెళితే తెలియదన్న సమాచారం మాత్రమే వినిపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బస్టాండులోని టీవీలు, ఫ్యాన్ల పని తీరు చెప్పాల్సిన అవసరమే లేదని అంటున్నారు. టీవీలు పనిచేయడం లేదు బస్సులు చార్జీలు పెంచి మాపై భారం మోపుతున్నారు కానీ, బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. బస్టాండులో ఏర్పాటు చేసిన టీవీలు ఎప్పుడూ పని చేసిన దాఖలాలే లేవు. దీంతో బస్సు వచ్చే వరకు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. ఆర్టీసీ సార్లు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. - రమేష్, ప్రయాణికుడు, సనప. ఆర్టీసీ బస్టాండులో దొంగకు దేహశుద్ధి అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కుని పారిపోతున్న దొంగను బాధితురాలి కుటుంబ సభ్యులు పట్టుకోగా, ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నుంచి రాయదుర్గం వెళ్లే బస్సులో కడప పట్టణానికి చెందిన సుజాత కుటుంబం ప్రయాణిస్తోంది. వారు వెళుతున్న బస్సు గురువారం మధ్యాహ్నం అనంతపురం ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. బస్సు అక్కడే కొద్ది సేపు ఆగడంతో కొందరు ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఇంతలో ఓ యువకుడు సుజాత భుజానికి తగిలించుకున్న బ్యాగును కిటికీలోంచి లాక్కుని ఉడాయించాడు. దీంతో ఆమె దొంగ..దొంగ అంటూ గట్టిగా కేకలు వేయడంతో, వాటర్ బాటిల్ కోసం బస్సు దిగిన ఆమె సోదరుడు దొంగను వెంబడించాడు. శ్రీనివాసనగర్ వైపు పరుగెత్తుతున్న అతనిని పట్టుకోగా, ప్రయాణికులు, కుటుంబ సభ్యులు అతనిని చితకబాదారు. హ్యాండ్ బ్యాగ్‌లోని మొత్తాన్ని లెక్కపెట్టగా, అందులో ఉండాల్సిన మొత్తం ఎక్కడికీ పోలేదని బాధితురాలు చెప్పడంతో, దుండగుని ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. బాధితులే దొంగను వెంబడించి పట్టుకుని అప్పగించినా, ప్రయాణికులు పెద్ద ఎత్తున పోగైనా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు.. సరికదా... ఫిర్యాదు రాసి ఇచ్చి వెళ్లమంటూ బాధితులకు ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆదమరిస్తే అంతే నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్య్యాలతో పాటు రక్షణ కూడా కరువుతోంది. కాస్త ఆదమరిస్తే చాలు దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. బస్టాండులో టూ ప్లస్ టూ చొప్పున పోలీసు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ఒక్కరు కూడా కనిపించడం లేదు. గురువారం బస్టాండ్‌లో ఉన్న ఒకే ఒక కానిస్టేబుల్ ఇతర ప్రాంతానికి చెందిన ఓ సీఐ సేవలో ఉండడం గమనించిన దొంగ తన చేతికి పని చెప్పాడు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రయాణికులు కలసి దొంగను పట్టుకున్నారే తప్ప, పోలీసులు చేసింది శూన్యం. ఇలా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆర్టీసీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. -
‘ఆర్టీసీ’ డీఎస్పీ సివిల్ పంచాయితీ
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించా రు. రియల్ ఎస్టేట్ మధ్యస్తాలు, సివిల్ పంచాయితీలకు ప్రభుత్వ కార్యాల యాన్నే కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. చి వరకు ఓ మద్యస్తానికి సంబంధించిన రూ.40 లక్షల నగదుతో అడ్డంగా బుక్కయ్యారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాం డ్ ఆవరణలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగుజూసిన ఈ సంఘటన సం చలనం సృష్టించింది. విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (డీఎస్పీ) చెంచురెడ్డి కార్యాలయంలో ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం నరుకూరుకు చెందిన మారుబోయిన అశోక్ సోదరుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విడవలూరుకు చెందిన ఉడా కిషోర్‌కు తమ ఊరి నుంచి కొడవలూరుకు వెళ్లే మార్గంలో 14.6 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం మొత్తాన్ని రూ.90 లక్షలకు కొనుగోలు చేసేందుకు 2011లో అశోక్ ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.30 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తం నాలుగు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత భూముల ధరలు తగ్గడం, మిగిలిన మొత్తం సమకూరకపోవడంతో కిషోర్‌కు అశోక్ సకాలంలో నగదు చెల్లించలేకపోయాడు. నెలలు గడుస్తున్నా అశోక్ నగదు చెల్లించకపోవడంతో కిషోర్ 9.5 ఎకరాలను ఆర్టీసీ బస్టాండ్‌లో కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్న మనుబోలుకు చెందిన దేవళ్ల రమణారెడ్డి జీపీ కమ్ సేల్ డీడ్ చేశాడు. ఇది తెలుసుకున్న అశోక్ తాను అడ్వాన్స్‌గా చెల్లించిన నగదు ఇచ్చేయాలని పలుమార్లు కిషోర్‌పై ఒత్తిడి తెచ్చినా ఫలితం కరువైంది. ఇటీవల అశోక్ నగరంలోని తల్వాకర్ జిమ్‌లో చేరాడు. అక్కడ ఆయనకు ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డీఎస్పీ లక్కు చెంచురెడ్డితో పరిచయం ఏర్పడింది. క్రమేణా స్నేహితులుగా మారడంతో తనకు నగదు రావాల్సిన విషయాన్ని చెంచురెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు అశోక్. పంచాయితీ ఇలా.. ఈ సివిల్ పంచాయితీని పరిష్కరించే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నాడు చెంచురెడ్డి. ఇటీవల తన కార్యాలయానికి కిషోర్‌ను పిలిపించి విచారించాడు. తర్వాత దేవళ్ల రమణారెడ్డిని పిలిచి అశోక్‌కు స్థలం అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకుగాను రూ.60 లక్షలు చెల్లించడంతో పాటు, ఆ మొత్తానికి 2011 నుంచి వందకి రూపాయి వంతున వడ్డీ చెల్లిస్తాడని ఒప్పించాడు. ఇష్టం లేకున్నా డీఎస్పీ ఒత్తిడి మేరకు అశోక్‌కు స్థలాన్ని అప్పగించేందుకు కిషోర్, రమణారెడ్డి సిద్ధపడ్డారు. అయితే తమకు అశోక్‌పై నమ్మకం లేదని, మంగళవారం రాత్రి లోపు రూ.50 లక్షలు చెల్లిస్తే బుధవారం రిజిస్ట్రేషన్ చేస్తామని షరతు పెట్టారు. ఆ నగదు కోసం రాత్రి 8 గంటల వరకు ఇద్దరూ బస్టాండ్ వద్ద వేచిచూసి వెళ్లారు. అనంతరం 8.30 గంటలకు అశోక్ రూ.40 లక్షలతో అక్కడి వచ్చాడు. రమణారెడ్డి, కిషోర్ వెళ్లిపోయారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తాన్ని తన కార్యాలయంలోని కానిస్టేబుల్ నాగరాజుకు ఇచ్చివెళ్లాలని చెంచురెడ్డి సూచించాడు. డీఎస్పీ ఆదేశాల మేరకు నాగరాజు నగదు బ్యాగ్‌ను బీరువాలో భద్రపరిచారు. ఏసీబీకి సమాచారం.. డీఎస్పీ పంచాయితీలు చేస్తున్న వ్యవహారం, కార్యాలయంలో నగదు ఉన్న విషయమై మంగళవారం అర్ధరాత్రి ఏసీబీ డీఎస్పీ కె.ఎస్ నన్జున్డప్పాకు సమాచారం అందింది. వెంటనే ఆయన తన బృందంతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని డీఎస్పీ కార్యాలయంపై దాడి చేశారు. తనిఖీలు నిర్వహించి బీరువాలోని రూ.40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నాగరాజును ప్రశ్నించగా డీఎస్పీ ఫోన్లో ఆదేశించిన మేరకు ఆ నగదును బీరువాలో పెట్టానని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత డీఎస్పీ చెంచురెడ్డిని పిలిచి విచారించారు. ఇద్దరినీ బుధవారం తెల్లవారుజామున ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అనంతరం అశోక్, కిషోర్‌ను పిలిపించి పూర్తి వివరాలు రాబట్టారు. ముమ్మరంగా విచారణ స్వాధీనం చేసుకున్న నగదు డ్రా చేసిన బ్యాంకులు, ఖాతాల వివరాలను, భూములను సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అశోక్ వెల్లడించిన వివరాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన డీఎస్పీ చెంచురెడ్డి సివిల్ వివాదాల్లో తల దూర్చడం, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు తన బీరువాలో దాచడం నేరమని, ఆయనపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేస్తూ ఏసీబీ అధికారులు పోలీసు శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, టి.వి శ్రీనివాసరావు, ఎం. కృపానందం, కానిస్టేబుళ్లు కె. మధుసూదనరావు, ఓ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు ఆర్ఐగా వ్యవహరించిన చెంచురెడ్డి అప్పట్లో హోమ్‌గార్డుల ఉద్యోగాల విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు: డీఎస్పీ చెంచురెడ్డి స్నేహితునికి సంబంధించిన స్థల వివాదాన్ని మానవతా దృక్పథంతో పరిష్కరించాలనుకున్నా. అయితే ఆ నగదు నా బీరువాలోకి ఎలా వచ్చిందో తెలియదు. ఓ పథకం ప్రకారమే నన్ను ఇరికించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్), న్యూస్‌లైన్ : అప్పుల బాధ తాళ్లలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ లాడ్జీలోని 304 గదిలో ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కందమూరుకు చెందిన డి.అంజయ్య (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంజయ్య తన కుమార్తె వివాహం కోసం రూ. నాలుగు లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు చెల్లిస్తూ ఉన్నాడు. రెండేళ్ల కిందట కుమారుడు వివాహం కోసం మరో రూ.2 లక్షలు బంధువుల వద్ద అప్పు తీసుకున్నాడు. ఇటీవల కుమారుడికి ఆరోగ్యం చెడిపోవడంతో వైద్యం కోసం మళ్లీ రూ.2 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పుల భారం పెరిగి..రుణదాతల నుంచి ఒత్తిడిలు ఎక్కువయ్యాయి. అప్పులు బాధలు తాళలేక సతమతమవుతున్నాడు. దిక్కు తోచక ఈ నెల 15వ తేదీ పనిమీద బయటకు వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి నెల్లూరుకు వచ్చాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ లాడ్జీలో 304వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నాడు. 18వ తేదీ సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి తాను అత్యవసర పనిపై ఊరు వెళుతున్నానని, ఫోన్ చేయడం కుదరదని చెప్పాడు. రెండు రోజులుగా గదిలోనే ఉన్నాడు. 19వ తేదీ సాయంత్రం లాడ్జీ సిబ్బంది గది తలుపులు తట్టగా తెరవలేదు. లోపల నిద్రపోతున్నాడేమో అని భావించి వారు మిన్నకుండి పోయారు. గురువారం మధ్యాహ్నం అంజయ్య గది నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంను గమనించిన లాడ్జీ సిబ్బంది తలుపులు తట్టగా తెరవలేదు. దీంతో నాల్గో నగర సీఐ జి. రామారావు దృష్టికి తీసుకెళ్లారు. సీఐ తన సిబ్బందితో కలిసి లాడ్జీ వద్దకు చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా అంజయ్య ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకుని ఉన్నాడు. అతని జేబుల్లో ఉన్న అడ్రస్ కాగితాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. లాడ్జీ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు. -
శ్రీశైలంలో నేడు గిరిప్రదక్షిణ
శ్రీశైలం, న్యూస్‌లైన్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం మాఘశుద్ధపౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్ గురువారం విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 8గంటలకు ఆలయ రాజగోపురం వద్ద పల్లకీలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేకపూజలను నిర్వహిస్తారన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఆర్టీసీ బస్టాండ్ ముందుభాగం, ట్రైబల్ మ్యూజియం వెనుక భాగం నుంచి దేవస్థానం టోల్ గేట్, యజ్ఞవాటిక, శ్రీగిరి కాలనీ వెనుకభాగం, గోశాల, హేమారెడ్డి మల్లమ్మ మందిరం మీదుగా గంగాభవాని స్నానఘట్టాల మీదుగా సాగుతుందన్నారు. ఈ ప్రదక్షిణలో భాగంగా పంచమఠాలు, వీరభద్ర మఠం, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్పకొలను ఎగువభాగం తదితర చోట్ల స్వామి అమ్మవార్లకు నీరాజనాలను అర్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ జన్మల్లో చేసిన పాపాలన్నీ ప్రదక్షిణలో ఒక్కొక్క అడుగుతో తొలగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయన్నారు. భగవంతునికి అర్పించే కైంకర్యాలలో ప్రదక్షిణ పరిపూర్ణమైనదన్నారు. ఆలయాలలోనే కాకుండా పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఆయా పర్వతాల చుట్టూ, గిరుల చుట్టూ ప్రదక్షిణ చేసే సంప్రదాయం కూడా ఉందన్నారు. భక్తులలో భక్తిభావాలను పెంపొందిండంతో పాటు క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికత కేంద్రంగా తీర్చిదిద్దేందకు, ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు. -
మిస్టరీ వీడని హరిత హత్య కేసు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ శివారులోని గుట్టల్లో 2012 మార్చి 21 తెల్లవారుజామున దారుణ హత్యకు గురైన హరిత (25) కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను ఓ అమాత్యుడు రక్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా కేసు పురోగతి లేకపోవడంతో పోలీసుల చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బెళుగుప్ప మండలం ఆవులదిన్నె గ్రామానికి చెందిన హరిత (25) శింగనమల మండలం మట్లగొందిలోని తన అక్క ఇంట్లో ఉండేది. ఉన్నత విద్య నిమిత్తం అక్క ఇంట చేరిన ఆమె.. ఎస్కే యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేసింది. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. అక్కడ వచ్చే వేతనం తక్కువ కావడంతో ఆర్డీటీలో ఎస్టీఎల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెను 2012 మార్చి 18న ఇంటర్వ్యూకు పిలిచారు. దీంతో మట్లగొంది నుంచి నగరానికి వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత నగర శివారులోని ఆర్డీటీ కార్యాలయం నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. అప్పటికే సమయం సాయంత్రం 6.30 గంటలు కావడంతో బావ కొర్రి రాముడుకు ఫోన్ చేసి ఆలస్యానికి గల కారణాన్ని తెలియజేసింది. అలాగే ఓ అపరిచిత వ్యక్తి మీకు సన్నిహితుడినంటూ తనను పరిచయం చేసుకున్నాడని చెప్పింది. ఫోన్లో మాట్లాడిన ఆ వ్యక్తి ‘అన్నా నేను శివ. పాపను బస్సు ఎక్కించి పంపుతా’నని చెప్పాడు. అయితే.. గ్రామానికి ఎనిమిది గంటలకు చేరాల్సిన హరిత ఆర్టీసీ బస్సు వచ్చినా అందులో కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లేకపోవడంతో మార్చి 19న స్థానిక త్రీటౌన్ పోలీసులకు కొర్రి రాముడు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వచ్చేందుకు బస్సెక్కినట్లు చెప్పిన హరిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. మార్చి 21న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన గొర్రెల కాపరులు కాలి వున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మృతదేహం హరితదేనని నిర్ధారించారు. ఆమె వద్ద హ్యాండ్ బ్యాగుతో పాటు పసుపు కొమ్మలు, సెల్‌ఫోన్ లభించాయి. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి.. ఈ ప్రాంతానికి తీసుకువచ్చి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా కూడా తీశారు. అయితే అందులో హంతకులకు సంబంధించిన వివరాలేవీ లభించలేదని అప్పట్లో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అత్యాచారం... ఆపై హత్య! హరితను గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై చున్నీతో ఉరివేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్చి 18 రాత్రే కడతేర్చి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో అనుమానితులను బుక్కరాయసముద్రం పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతలో ఓ అమాత్యుడు నిందితులకు మద్దతుగా జోక్యం చేసుకోవడంతో పోలీసులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు విషయంపై బుక్కరాయసముద్రం ఎస్.ఐ మోహన్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని, ఫైల్‌ను పూర్తిగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. -
బిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు
-
‘బండ’కో దండం!
సిలిండర్ ధర పెంపుపై జనాగ్రహం పెల్లుబికింది. గ్యాస్‌బండ గుదిబండగా మారిందని మహిళలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఆధార్‌తో లింకుపెట్టి నడ్డివిరిచారని కన్నెర్రచేశారు. పెంచిన ధరలే కాంగ్రెస్‌ను దహించేస్తాయని దుమ్మెత్తిపోశారు. గ్యాస్ధరను వెంటనే తగ్గించకపోతే ప్రభుత్వానికి తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సీఐటీయూ, సీపీఎం, సీఐటీయూ, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి గీత మాట్లాడుతూ..గ్యాస్‌ధర పెంపుతో సామాన్యులపై పెనుభారం పడిందన్నారు. నగదు బదిలీ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. సిలిండర్ ధరను ఏకంగా రూ.217, కమర్షియల్ గ్యాస్‌పై రూ.385 పెంచి వినియోగదారులపై ఉక్కుపాదం మోపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనురాధ, లక్ష్మి, మీనాక్షి, బేగం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. షాద్‌నగర్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఇండస్ట్రీయల్ కమిటీ ప్రధానకార్యదర్శి వర్ధం విజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ ముఖ్యకూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ ధరను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై పెనుభారం మోపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రాజు, నాగమణి, సాయిబాబా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో.. మిడ్జిల్ , న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ నాయకు డు నిరంజన్‌గౌడ్ మాట్లాడుతూ..పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రభుత్వానికి బుద్ధితప్పదని హెచ్చరించారు. నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కాట్రపల్లి లక్ష్మయ్య, హఫీజ్, మాజీ సర్పంచ్‌లు సీతారాం పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో.. కొత్తూరు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆధార్ గుర్తింపు కార్డులు, నగదు బదిలీ పథకాలు పనికిమాలినవని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహా అన్నారు. వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్ శివారులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో అనేకసార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నగదుబదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో.. షాద్‌నగర్, న్యూస్‌లైన్: గ్యాస్‌ధర పెంపును నిరసిస్తూ శుక్రవారం పట్టణంలోని ముఖ్యకూడలిలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిలి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్‌ధరలను పెంచి మరోమారు ప్రజలను మోసం చేశాయని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచిందని ధ్వజమెత్తారు. వంటగ్యాస్‌కు ఆధార్‌ను లింకుపెట్టి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్‌పై వచ్చే సబ్సిడీని బ్యాంకు ద్వారా వినియోగదారులకు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఏ ఒక్కరికీ అందించిన దాఖాలాలు లేవన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాల్సిన ప్రభుత్వం ధరలను పెంచేందుకే పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ పంతులు, యారం శేఖర్‌రెడ్డి, ఖాదర్ఘోరి, ఇబ్రహీం, శర్ఫోద్దీన్, వెంకటయ్య, అనురాధ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ధరలపెంపు అసమర్థ పాలనకు నిదర్శనం మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ రవిప్రకాశ్ దుయ్యబట్టారు. గ్యాస్‌ధర పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు మహిళలు కట్టెలపొయ్యిపై వంటలు చేసి ఆగ్రహాం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ధరను పెంచితే ఆ భారాన్ని ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. పెరిగిన ధరలు సామాన్యులను కష్టాలకు గురిచేస్తున్నాయన్నారు. ధరలను తగ్గించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నేతలు సనా, తిరుపతి నాయక్, జోగులు, సతీష్‌గౌడ్, నాగరాజు, సురేష్, శ్రీకాంత్‌రెడ్డి, ఇందిర, ప్రసాద్, అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
విభజనాగ్రహం
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. గురువారం రాత్రి కేబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే మొదలైన ఆగ్రహ జ్వాలలు శుక్రవారం తీవ్రరూపం దాల్చాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు మరోమారు రోడ్డెక్కారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో కదం తొక్కారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర మంత్రులు సీమాంధ్రుల మనోభావాలను గుర్తించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్యాకేజీల కోసం కక్కుర్తిపడే సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు సమాధి కట్టడం తథ్యమని శాపాలు పెట్టారు. తిరుపతి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలో ఏపీఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి ఒకటో డిపో గ్యారేజీ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బాలాజీ లింక్ బస్టాండ్‌లో తిరుమలకు వెళ్లే బస్సులను గంటసేపు అడ్డుకున్నారు. పోలీ సులు రంగప్రవేశంచేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్వీయూ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద జాతీయ ర హదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పద్మావతి మహిళా వర్సిటీ, పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలను మూయించి నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్యెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వాహనాలలో పర్యటించి నగరంలోని దుకాణాలను మూసివేయించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నిమ్మనపల్లె రోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలసి బంద్‌లో పాల్గొన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. పీలేరులో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. క్రాస్‌రోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి, రాస్తారోకో చేపట్టారు. పలమనేరులో టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నా,రాస్తారోకో చేశారు. ఎన్జీవో నాయకులు ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యకర్తలు స్కూటర్ ర్యాలీ, ఎన్జీవోలు నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. బి కొత్తకోటలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. చిన్నగొట్టిగల్లు,భాకరాపేటలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి దుకాణాలను మూసివేయించారు. కుప్పం జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి బంద్‌ను పర్యవేక్షించారు.చిత్తూరులో ఎన్జీవోలు,ఉపాధ్యాయులు గాంధీ బొమ్మ సర్కిల్లో రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలు జనతా బజారు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపో ఎదుట ధర్నా చేశారు. -
అడ్మిషన్ల దందా
సాక్షి, అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏసీ తరగతి గదులు, ఇతర హంగులతో ఓ ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే... పదో తరగతి అడ్మిషన్లు కూడా చేసుకున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులు ఇక్కడ పదో తరగతి చదువుతున్నారు. వీరికి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఆ పాఠశాల యాజమాన్యం రాంనగర్‌లోని ‘గుర్తింపు’ ఉన్న మరో పాఠశాలలో పేర్లు నమోదు చేయించి... రెగ్యులర్ విద్యార్థులుగా పరీక్షలు రాయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విద్యార్థుల నుంచి భారీగానే వసూలు చేసింది. కేవలం ఈ పాఠశాలలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలలో అడ్మిషన్ల దందా కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే అన్ని తరగతుల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల సమయంలో దొడ్డిదారులను వెతుకుతున్నారు. గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ‘రెగ్యులర్’గా చదివినట్లు చూపుతూ... పరీక్షలు రాయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై తల్లిదండ్రులకూ ఏయేటికాయేడు మోజు పెరుగుతూనే ఉంది. వాటిలో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది వారి ఆశ. ఆర్థిక స్థోమత లేకపోయినా కూలీలు, ఆటోడ్రైవర్లు సైతం నానా అవస్థలు పడి రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వాటి యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 762 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 217 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో గుర్తింపులేనివి 53 ఉన్నట్లు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నాయి. గుర్తింపు లేని పాఠశాలల్లో పదో తరగతికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.20-25 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల సమయంలో మరో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు దండుకుంటున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని విద్యార్థులు ‘రెగ్యులర్’గానే పరీక్షలు రాస్తారు. వీరికి ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు రూ.125. కానీ.. వాటి నిర్వాహకులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,350కు పైగా దండుకుంటున్నారు. ‘గుర్తింపు’ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం దాదాపు 13 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వాటి యాజమాన్యాలు ఏ మేరకు సొమ్ము చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం తమ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేదనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం తెలియనివ్వడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా వేరే పాఠశాలల్లో బోగస్ హాజరు వేయించి.. వాటి నుంచే విద్యార్థులను పరీక్షలకు పంపడానికి రంగం సిద్ధం చేశారు. ఇలా పరీక్షలు రాస్తే ఆ విద్యార్థి ఉత్తీర్ణత సాధించిన తరువాత మార్కుల జాబితా, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ, కాండక్టు సర్టిఫికెట్లు ‘వేరే పాఠశాల’ మీదుగానే వస్తాయి. కార్పొరేట్, పేరెన్నికగల పాఠశాలలో చదివినట్లు గుర్తింపు ఉండదు. కాదు..కూడదనుకుంటే ‘ప్రైవేటు’ విద్యార్థులుగానే పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ద్వారా పరీక్షలకు హాజరైతే స్టడీ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా చాలా ఉద్యోగాలకు అభ్యర్థులను ‘లోకల్ ఏరియా’గా పరిగణించాలంటే స్థానికంగా కనీసం ఐదేళ్ల పాటు చదివి ఉండాలనే నిబంధన ఉంది. ప్రైవేటుగా పరీక్ష రాసినప్పుడు ఆ ధ్రువపత్రం పాఠశాల నుంచి తీసుకునే అవకాశం లేదు. అప్పుడు రెవెన్యూ పరంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అందుకు నానా అవస్థలు పడాలి. అంటే విద్యాసంస్థలు చేస్తున్న మోసాలకు విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్మిషన్ల దందా గురించి తెలిసినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గుర్తింపులేని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు గుర్తింపు ఉన్న విద్యాసంస్థలలో బోగస్ హాజరుతో రెగ్యులర్ విద్యార్థులుగా నమోదవుతున్నారు. అందుకు ఆ పాఠశాలల యాజమాన్యాలు గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకు ఒక్కొక్క విద్యార్థిపై రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నాయి. నిబంధనల ప్రకారమైతే గుర్తింపులేని పాఠశాలల విద్యార్థులు ‘ప్రైవేటు’గా పరీక్షలు రాయాలి. అందుకు ప్రభుత్వానికి హాజరు మినహాయింపు కింద రూ.650, పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూపంలోనూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విద్యావ్యవస్థనే భ్రష్టుపట్టిస్తున్నారు. -
గుంతకల్లులో భారీ వర్షం
గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని గుంతకల్లు, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంతకల్లు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షపు నీటితో పాత బస్టాండ్ రోడ్డు చెరువును తలపించింది. బీఎస్ఎస్ కాలనీ, పాతగుత్తి రోడ్డులోని అరక్షిత శిశు మందిరం ప్రాంతం, పాత ఫైర్‌స్టేషన్ ఏరియా, తిమ్మనచర్ల ప్రాంతం, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా నీరు పారడటంతోఈ ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శివారు ప్రాంతాలైన సీఐటీయూ కాలనీ, రామిరెడ్డి కాలనీ, ఆంకాళమ్మగుడి, అంబేద్కర్‌నగర్ సమీపంలోని శ్రీలంక కాలనీలు నీటిమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రామసుబ్బయ్య జిన్నా ప్రాంతంలోని గుడిసెల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి, బియ్యం, దుస్తులు తడిసిపోయాయని బాధితులు వాపోయారు. మండీబజార్లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద పెద్ద చెట్టు నేలకూలింది. దీంతో అంజుమన్వీధిలోని మూడు విద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.