Sahara Group
-
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్.. రిఫండ్ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కోఆపరేటివ్ సొసైటీల చిన్న డిపాజిటర్ల రిఫండ్ మొత్తాలపై గతంలో ఉన్న రూ.10,000 పరిమితిని ప్రభుత్వం రూ.50,000కు పెంచింది. సహకార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు సీఆర్సీఎస్ (సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్)–సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ.370 కోట్లను విడుదల చేసింది. రిఫండ్ మొత్తం పరిమితిని రూ. 50,000కి పెంచడంతో, రాబోయే 10 రోజుల్లో సుమారు రూ. 1,000 కోట్ల చెల్లింపులు జరుగుతాయని అధికారి వెల్లడించారు.సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చర్యలు సహారా గ్రూప్ నాలుగు మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల వాస్తవ డిపాజిటర్లు క్లెయిమ్‌ల సమర్పణకు, డిపాజిట్ల వాపసుకు సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి సీఆర్సీఎస్–సహారా రిఫండ్ పోర్టల్ గత ఏడాది జూలై 18న ఏర్పాటయిన సంగతి తెలిసిందే.వీటిలో స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హైదరాబాద్)సహా సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (లక్నో) సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ (భోపాల్), హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కోల్‌కతా) ఉన్నాయి.2023 మార్చి 29 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2023 మే 19న సెబీ–సహారా రీఫండ్ ఖాతా నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కి రూ. 5,000 కోట్ల బదిలీ అయ్యాయి. డిజిటల్ రూపంలో డబ్బు పంపిణీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. -
రూ. 1,000 కోట్లు జమ చేయండి
న్యూఢిల్లీ: గ్రూప్ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్ సమీకరణకు సంబంధించి సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో వెర్సోవాలోని 12.15 మిలియన్ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘సహార సంస్థలు– ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ (రెండూ సహారా గ్రూప్ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే, వెర్సోవా భూమిని విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్‌పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్ వెంచర్ అగ్రిమెంట్‌కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్‌పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతోరాయ్ సుదీర్ఘకాలం తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
Subrata Roy : వేల కోట్ల ‘సహారా గ్రూప్’ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం!
కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్(75) మంగళవారం ముంబయిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత సహారా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహారా -సెబీ అకౌంట్స్‌లో ఉన్న అన్‌క్లయిమ్డ్ నిధుల మొత్తాన్ని ప్రభుత్వ అకౌంట్‌కు (Consolidated Fund of India) ట్రాన్స్ఫర్ చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 11ఏళ్ల క్రితం సహారా గ్రూప్ సామాన్యుల నుంచి సేకరించిన రూ.25 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సెబీకి అందించింది. అందులో తమ డబ్బులున్నాయని, అందుకు సహారా ఇచ్చిన రిసిప్ట్‌లను సెబీకి (ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో) అప్లయ్ చేసుకుంటే.. వాటిని పరిశీలించిన సెబీ కేవలం రూ.138.07 కోట్లని తిరిగి వెనక్కి ఇచ్చింది. సెబీ నుంచి కేంద్ర బ్యాంక్ అకౌంట్‌కు ఇప్పుడు సెబీ వద్ద ఆ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు రీఫండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మార్చేందుకు కేంద్రం అన్వేషిస్తుందని ఈ అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. అన్‌క్లయిమ్డ్ డిపాజిట్లన్నీ ప్రజా సంక్షేమానికే అయితే, సెబీ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్‌కు నిధులు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం కేంద్రం నిజమైన డిపాజిటర్లను గుర్తించి, వారికి తిరిగి డబ్బులు చెల్లించనుంది. మిగిలిన అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ప్రజా సంక్షేమం కోసం కేంద్రం వినియోగించాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది. వేల కోట్ల డిపాజిట్లు సహారా నుంచి సెబీకి సెబీ ఈ ఏడాది మార్చి 31 నాటికి 17,526 దరఖాస్తులకు గాను 48,326 ఖాతాల్లో రూ.138 కోట్లు జమ చేసింది. సహారా గ్రూప్ నుండి రికవరీ చేసి.. ఆయా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.25,163 కోట్లుగా ఉంది. ప్రత్యేక పోర్టల్ నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్లు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జులై నెలలో పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు అయిన సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లిస్తున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా
సహారా అంటే సహాయం, సహారా అంటే సముద్రం. సహారా అంటే ఓ ఎడారి. కానీ మన దేశంలో సహారా అంటే ఓ కంపెనీ. ఆ సంస్థని స్థాపించింది సుబ్రతా రాయ్. ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే స్థాయి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన సుబ్రతా రాయ్ కార్పొరేట్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అపర కుబేరుడిగా అవతరించిన రాయ్.. చివరికి అందరూ ఉన్న అనాధలా తలకొరివి పెట్టించుకోలేని దుస్థితికి ఎలా దిగజారారు. సహారాలో పనిచేస్తూ జీతం తీసుకునే ఉద్యోగులు, సహారా నుంచి కమీషన్ తీసుకునే కమీషన్ ఏంజెంట్లు, సహారా కస్టమర్లు సైతం దేవుడు, సహారా శ్రీగా పిలిచే సుబ్రతా రాయ్ 1948 బీహార్‌లోని అరారియాలో బెంగాలీ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఛబీ, సుధీర్ చంద్ర రాయ్‌లు తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని ఢాకా, బిక్రంపూర్‌లో సంపన్న భాగ్యకుల్ జమీందార్ భూస్వామి కుటుంబానికి చెందినవారు. మిర్చి బజ్జీలు అమ్ముతూ అయితే, షుగర్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే తండ్రి సుధీర్ చంద్ర రాయ్ మరణంతో కుటుంబ పోషణ భారం సుబ్రతారాయ్ మీద పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం ‘జయ ప్రొడక్ట్’ పేరుతో మిర్చి బజ్జీలు, పునుగులు, ఇతర తినుబండరాలను భార్య సప్నారాయ్ తయారు చేస్తే.. డొక్కు లాంబ్రెట్టా స్కూటర్ మీద ఇంటింటికి తిరుగుతూ అమ్మేవారు. ఇలా తినుబండారాలే కాకుండా భార్య సప్నారాయ్తో మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. కానీ ఆ రెండు బిజినెస్‌లు ఫెయిల్ అయ్యాయి. రెండు బిజినెస్‌లు ఫెయిల్ ప్రతి రోజు చెమట చిందిస్తేనే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే పరిస్థితి మరింత దిగజారడంతో.. ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు సుబ్రతా రాయ్. అప్పుడే తన మాటే మంత్రంలా పనిచేసేలా రాయ్ మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ఈసారి గురి కుదిరింది. బిజినెస్ నిలబడింది. 30 ఏళ్ల పాటు అప్రతిహితంగా సాగింది. చివరికి సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జైలు జీవితం ఎలా ఉంటుందో నేర్పింది. ఇంతకీ ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఇప్పుడంటే ఎటు చూసినా బ్యాంకులే దర్శనమిస్తున్నాయి. కానీ 1970లలో బ్యాంకులు ఉండేవి కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ గురించి, సేవింగ్స్ గురించి పెద్దగా తెలిసేదికాదు. ఇక్కడే సుబ్రతరాయ్ మాస్టర్ మైండ్‌కి ఓ బిజినెస్ ఐడియా తట్టింది. అదేంటంటే? స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ స్కూటర్ మీద తినుబండరాలు అమ్మే సుబ్రతా రాయ్ స్థానికంగా ఉండే టీ స్టాల్ నిర్వాహకులు, రిక్షా నడపుతూ జీవనం కొనసాగించేవారు, తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు నిర్వహించే నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మీరు ఏ పని చేస్తున్నా. వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంతుంటే అంత బ్యాంక్‌లకు వెళ్లే అవసరం లేకుండా నా దగ్గర దాచండి. దాచిన మొత్తానికి కొంత కాలం తర్వాత అధిక మొత్తం వడ్డీ ఇస్తానని ఆశ చూపించారు. ఇలా ఒక రూపాయి నుంచి పదులు, వందలు ఇలా కొద్ది మొత్తాన్ని దాచుకోవచ్చని చెప్పడంతో వారికి ఇదొక మంచి అవకాశంగా భావించారు. ఈ ప్రచారంతో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాల్లోని ప్రజలు సహారాలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. సహారాతో కనెక్టైనా ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా కట్టి పడేయడం రాయ్‌కి కొట్టిన పింది. కస్టమర్లను, ఏజెంట్లను, ఉద్యోగులను సహారాపరివార్ అంటూ తన మాటే మంత్రంలా పనిచేసేలా కట్టిపడేస్తుండేవారు. పైగా పేదలకు పెళ్లిళ్లు చేసి వారు ఆర్ధికంగా నిలబడేలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. సహారా పరివార్ పేరుతో దేశం మొత్తం ప్రచారం చేసేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యమైనట్లే? సహారా సంస్థమీద, సుబ్రతా రాయ్ మీద నమ్మకాన్ని పెంచేందుకు క్రికెట్లోకి అడుగుపెట్టారు. క్రికెట్‌ను మతంలా భావించే ఇండియన్ క్రికెట్ టీంకు స్పాన్సర్ చేశారు. దీంతో సహారా మీద ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. డిపాజిట్లు సైతం భారీగా పెరిగాయి. హాస్పిటల్ ఖర్చులు, చదువులు, పెళ్లిళ్లలకు సహారాలో డిపాజిట్ చేసిన డబ్బులు, వాటి నుంచి వచ్చే వడ్డీ ఉపయోగపడడంతో చాలా మంది సుబ్రతా రాయ్‌ని దేవుడిలా భావించారు. సంస్థ ఉద్యోగులు, కమిషన్ ఏంజెట్ల కష్టానికి ప్రతిఫలంగా వేతనాలు ఇవ్వడంతో సుబ్రతారాయ్‌ని సహారా శ్రీగా పిలిచేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యం అనేలా ఫిలయ్యేవారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలా 1978లో రూ.2వేల రూపాయల పెట్టుబడి, ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సహారా 1.13 మిలియన్ల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. 1997కి సహారా సంస్థ 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఎయిర్ సహారా, న్యూయార్క్‌లో లగ్జరీ హోటల్స్ కొనుగోలు, భారత్‌లో యాంబీ వ్యాలీ పేరుతో రిసార్ట్... ఇలా వాట్ నాట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌ను నిర్మించారు. క్రికెట్, ఏవియేషన్ రంగంలో సైతం అడుగు పెట్టారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. రూ.550కోట్లతో ఇద్దరు కుమారుల పెళ్లి సుబ్రాతా రాయ్‌కి సుశాంతో, సీమంతో రాయ్ ఇద్దరు కుమారులు. 2004 ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో వాళ్లిద్దరి పెళ్లిని రూ. 550 కోట్లతో నాలుగు రోజుల పాటు నిర్వహించారు. ముఖ్య అతిధుల కోసం ప్రైవేట్ జెట్లను ఏర్పాటు చేశాడు సుబ్రతారాయ్. కొద్ది మందిని కొంత కాలమే మోసం చేయొచ్చు. ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కొడుకుల పెళ్లితో సుబ్రతా రాయ్ జీవనశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరుపేదల సొమ్మును దోచుకునేలా ఇలా నిరుపేదలు దాచుకున్న మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అప్పటి వరకు ప్రజలు డిపాజిట్ చేసిన అసలు, వడ్డీని సహారా ఇచ్చేది. రోజులు గడిచే కొద్ది ఆ మొత్తాన్ని ఇవ్వకుండా సహారా గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వారిని మోటివేట్ చేసేవారు. అంతేకాదు అప్పటి వరకు ఏజెంట్లు ఇంటికి వెళ్లి డిపాజిట్లను వసూలు చేసేవారు. కానీ ఇకపై ఏజెంట్లకు ఇంటింటికి తిరగరని మీరే వచ్చి డిపాజిట్ చేయాలని హుకుం జారీ చేశారు. అలా డిపాజిట్ చేసేందుకు వీలు లేక కట్టని వారిని స్కీమ్‌ల నుంచి వారి పేర్లను తొలగించేవారు. తొలగించిన వారి డిపాజిట్లను తిరిగి ఇచ్చేది కాదు సహారా గ్రూప్. సహారా మోసం వెలుగులోకి వచ్చింది అప్పుడే అయితే సుదీర్ఘ విరామం తర్వాత 2009లో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సహారా ఇండియా గ్రూప్ తన రియల్టీ విభాగం సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్ (ఎస్పీసీఎల్) ఐపీవోకి వెళుతున్నట్లు సుబ్రతారాయ్ ప్రకటించారు. ఆ ప్రకటన సహారాని ఊహించని మలుపు తిప్పింది. ఐపీవోకి వెళ్లాలంటే కంపెనీల వివరాలు లాభాలు, నష్టాలు, వివాదాలన్నింటిని వివరిస్తూ ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ను సెబీకి దాఖలు చేయాలి. ఇక్కడే సహారా గ్రూప్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా రూ.24,000 కోట్ల కుంబకోణానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది. సుబ్రతా రాయ్‌ని ఇరికించిన రోషన్‌లాల్ ఆ తర్వాత కొద్ది రోజులకు డిసెంబర్ 25, 2009న, జనవరి 4, 2010న సెబీకి రెండు ఫిర్యాదులు అందాయి. సహారాకు చెందిన ఈ రెండు (పైన పేర్కొన్న) సంస్థలు కొన్ని బాండ్ల జారీలో చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగించాయని ఆరోపించాయి. ఆ ఫిర్యాదు చేసింది మరోవరో కాదు. ఒకరు పెట్టుబడిదారులు సభ్యులు చేస్తే, జనవరి 4, 2010న ఆడిటర్ రోషన్‌లాల్ చేశారు. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. రోషన్ లాల్ ఫిర్యాదు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా సెబీకి చేరింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా, సెబీ.. సహారా గ్రూప్ నుండి వివరణలు కోరడం ప్రారంభించింది. సంచలనం సెబీ ప్రశ్నల పరంపరపై రాయ్ స్పందిస్తూ ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,669 బాక్సుల్లో 3 కోట్ల మంది మదుపర్ల ధరఖాస్తులు, రెండు కోట్ల రిడెంప్షన్ వోచర్లను సెబీకి పంపారు. దీంతో సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబై శివార్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కుల్లో వచ్చిన ఆధారాల్ని సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించి మరీ ఈ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలను స్కాన్ చేసి, ఒక సర్వర్‌లో దాచింది. నన్ను ఉరితీసుకోవచ్చు పలు దఫాలుగా సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అంతేకాదు తన 32 వ్యాపారం రంగంలో ఎన్నడూ న్యాయ నిబంధనలకు వ్యవహరించలేదని, అలా చేస్తే నన్ను ఉరి తీయొచ్చని సుబ్రతారాయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు నుంచి బయట పడేలా లలిత్ మోడీ సాయం ఇలా 2010 నుంచి ప్రారంభమైన సుబ్రతారాయ్ కేసు 2014 మార్చి 4 వరకు కొనసాగింది. మార్చి 4 పోలీసు కస్టడీలో ఉన్న సుబ్రతారాయ్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉండి కేసు నుంచి బయటపడేందుకు ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాడు రాయ్. ఇందు కోసం జైలులో వైఫైని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక తన ఆస్తుల్ని అమ్మి కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, కార్పొరేట్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీని కోరాడు. ఇలా 2014 నుంచి 2016 వరకు తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. చివరికి 2014 మార్చి 4 బెయిల్‌పై విడుదలయ్యారు. కడసారి చూపుకు నోచుకోని తాజాగా, సుబ్రతారాయ్ అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించగా.. గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసులు కారణంగా ఇద్దరు కుమారులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన రాయ్‌ని కడసారి చూపుకు ఆయన ఇద్దరు కుమారులు సుశాంతో, శ్రీమంతోలు నోచుకోలేదు. చివరికి అందరూ ఉన్న అనాధలా లండన్‌లో చదువుకుంటున్న సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
సహారా ఇష్యూ కొనసాగుతుంది
ముంబై: గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బుచ్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేకరులకు బుచ్ ఈ విషయాలు వెల్లడించారు. సహారా ఇన్వెస్టర్లకు వాపసు చేయాల్సిన రూ. 25,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లోనే ఉండగా, రాయ్ మరణించిన నేపథ్యంలో బుచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆధారాలున్న ఇన్వెస్టర్ల క్లయిములకు అనుగుణంగా సుప్రీం కోర్టు నియమిత కమిటీ సొమ్ములు వాపసు చేస్తున్నట్లు బుచ్ తెలియజేశారు. వివరాల్లోకి వెడితే.. సహారా గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీఏ), సహారా హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలు .. ఓఎఫ్‌సీడీల (డిబెంచర్లు) ద్వారా 2007–08లో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించడం వివాదాస్పదమైంది. దీనితో పోంజీ స్కీముల ఆరోపణల మీద సహారా గ్రూప్ 2010 నుంచి సమస్యల్లో చిక్కుకుంది. ఆపై 2014లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాయ్‌ను అరెస్ట్ చేశారు. గ్రూప్ కంపెనీలు రెండింటికి సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్లు వాపస్ చేయకపోవడంతోపాటు .. కోర్టుముందు హాజరుకావడంలో విఫలం చెందడంతో రాయ్ అరెస్ట్ అయ్యారు. తదుపరి రాయ్ బెయిల్ పొందినప్పటి కీ గ్రూప్ కంపెనీల సమస్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయడానికి, న్యాయస్థానం ఆదేశాల మేరకు సెబీ ప్రత్యేక ఖాతాల్లోకి సహారా గ్రూప్ రూ. 24,000 కోట్లు జమ చేసింది. -
సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ
సహారా గ్రూపు ఫౌండర్ చైర్మన్ సుబ్రతా రాయ్ మరణంతో, సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంగతి, వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయనే ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ క్లారిటీ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు, విచారణ వ్యక్తిపై కాదని, గ్రూపుపై అని, ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ గురువారం స్పష్టం చేశారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా దర్యాప్తు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ FICCI నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు రీఫండ్ చేయాల్సింన మొత్తం రూ. 25,000 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, మార్చి 31 నాటికి సెబీ మొత్తం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. పెట్టుబడి రుజువుతో ముందుకు వస్తున్న వారికి చెల్లింపులు జరిగాయని ఆమె చెప్పారు. కాగా సెబీ-సహారా కేసులో మద్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ కేసులో రెండు సహారా గ్రూప్ సంస్థలు– సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనేది అభియోగం. సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన హౌసింగ్ బాండ్ల వ్యత్యాసాలను చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ లాల్ ఫిర్యాదుతో సహారా గ్రూప్ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ విచారణ తర్వాత సుబ్రతా రాయ్ కూడా జైలు పాలయ్యారు సహారా కన్వర్టబుల్ డిబెంచర్లు (OFCDలు) జారీ ద్వారా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. సుమారు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన ఈ నిధులను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ సంస్థలైన SIREL, SHICLలకు 2011లో సెబీ ఆదేశించింది. ఆగస్టు 31, 2012న, సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్‌లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్‌కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
ప్రశ్నార్థకంగా సహారా రూ. 25 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ మరణించడంతో సహారా–సెబీ ఖాతాలోని రూ. 25,000 కోట్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. రెండు గ్రూప్ సంస్థలు సమీకరించిన నిధులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు వాపసు చేసేందుకు సహారా గ్రూప్ ఈ నిధులను సెబీ ఖాతాల్లో జమ చేసింది. వివరాల్లోకి వెడితే.. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన నిధులను వాపసు చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2011లో ఆదేశించింది. 2012లో సుప్రీం కోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థ్ధిస్తూ, 15 శాతం వడ్డీతో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 95 శాతం మందికి రిఫండ్ చేసేశామని సహారా గ్రూప్ తెలియజేసినా, ఆ వాదనలను తోసిపుచ్చి రూ. 24,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలంటూ ఉత్తర్వులు ఇచి్చంది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ. 25,000 కోట్లు ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు సెబీ రూ. 138 కోట్లు వాపసు చేసింది. చాలా మటుకు ఇన్వెస్టర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం, క్లెయిమ్‌లు రాకపోవడంతో మిగతా నిధులన్నీ సెబీ దగ్గరే ఉన్నాయి. అనారోగ్యంతో సుబ్రతో రాయ్ మరణించిన నేపథ్యంలో పంపిణీ చేయని ఈ సొమ్ము పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్ (హౌసింగ్) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేయాలంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
పల్లెల్లో ‘సహారా’ కలకలం.. నాలుగేళ్లలో రెండింతలిస్తామంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘సహారా’డిపాజిట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సహారా బ్యాంకు పేరిట సేకరించిన ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు తీరినా సొమ్ము చెల్లించకపోతుండటంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సహారా ఏజెంట్లను నిలదీస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇల్లు, స్థలాల కొనుగోలు, కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని.. ఇప్పుడు సొమ్ము రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సంస్థలో పలు ఆర్థిక సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, సొమ్ము వస్తుందని ఏజెంట్లు పైకి సర్ది చెప్తున్నా.. లోపల వారు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే సంస్థలో పనిచేసే ఓ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఇంటి నష్ట పరిహారం పైసలు డిపాజిట్ చేశా.. మిడ్‌మానేరు కింద అనుపురంలో ముంపునకు గురైన ఇంటి నష్ట పరిహారం కింద వచ్చిన రూ.4.70 లక్షలను సహారాలో డిపాజిట్ చేశాను. ఏజెంట్లు 5 ఏళ్ల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయన్నారు. గడువు ముగిసి 16 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇప్పించాలి. – తాండ్ర రజిత, అనుపురం, సిరిసిల్ల జిల్లా అప్పుచేసి బిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చింది మాది బిహార్. 30 ఏళ్ల కింద సిరిసిల్లకు వచ్చి స్థిరపడ్డాం. వేములవాడ, సిరిసిల్లలోని సులభ్ కాంప్లెక్స్‌లను కాంట్రాక్టు తీసుకొని పనిచేయిస్తున్నాను. ఏడేళ్ల కింద సహారా ఏజెంట్లు వచ్చి రూ.4.40 లక్షలు ఎఫ్డీ చేస్తే 5 ఏళ్ల 4 నెలలకు రూ.10 లక్షలు వస్తాయని చెప్పి డిపాజిట్ చేయించుకున్నారు. గడువు దాటి 17 నెలలు అయినా డబ్బివ్వలేదు. నా బిడ్డ పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది. – సునీల్ మిశ్రా, సిరిసిల్ల దాదాపు ఏడాదిన్నర నుంచి.. ఐదున్నరేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పడంతో చాలామంది తమ కష్టార్జితాన్ని సహారాలో డిపాజిట్ చేశారు. కొందరు ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తే.. చాలా మంది వారానికోసారి, నెలకోసారి కట్టే రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ)గా పొదుపు చేశారు. వీరిలో చాలా వరకు కూలీలు, పేదలే. చివరిలో పెద్దమొత్తంలో సొమ్ము చేతికి అందుతుందని ఆశపడ్డవారే. సహారా సంస్థ ఏజెంట్లు గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకున్న పరిచయాలతో డిపాజిట్లు సేకరిస్తున్నారు. కొన్నిరోజులుగా డిపాజిట్లు మరింత పెంచేందుకు నాలుగేళ్లలోనే సొమ్ము డబుల్ అవుతుందని చెప్తున్నట్టు తెలిసింది. అయితే దాదాపు ఏడాదిన్నరగా డిపాజిట్లను తిరిగి చెల్లించడం లేదని.. గత ఏప్రిల్ నుంచి మొత్తంగా రావడం లేదని డిపాజిటర్లు చెప్తున్నారు. దీనితోపాటు డిపాజిటర్లు నెలనెలా చెల్లించే మొత్తానికి వారి పేరున కాకుండా ఏజెంట్ పేరుతో రశీదులు ఇవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై ఏజెంట్లను నిలదీయగా.. సంస్థకు సంబంధించిన పలు కారణాలతో ఇలా జరుగుతోందని పై అధికారులు చెప్పారని వివరిస్తున్నారు. సంస్థ అధికారులు ప్రతి శనివారం ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 17న జూమ్ మీటింగ్‌కు హాజరైన అనంతరం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలకు చెందిన సహారా మేనేజర్ కందాల సంపత్ (55) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన హన్మకొండ జిల్లా కమలాపూర్ సహారా బ్రాంచికి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డిపాజిటర్లకు మెచ్యూరిటీ తీరినా సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఉందని, పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన కుమారుడు వినయ్ హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ ఘటన ఏజెంట్లలో ఆందోళన పెంచింది. సొమ్ము వస్తుంది.. ఆందోళన వద్దు! కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక చిక్కుల వల్ల మెచ్యూరిటీ పూర్తయినా డిపాజిట్లు చెల్లించలేకపోతున్న మాట వాస్తవమే. అయితే అత్యవసరమున్న వారికి సర్దుబాటు చేస్తున్నాం. డిపాజిటర్లు, ఏజెంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రశీదులు ఏజెంట్ పేరు మీద రావడమంటే అవన్నీ ముందస్తు చెల్లింపులే. దానిపై కంగారు వద్దు. డిపాజిటర్లకు భరోసా కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేనేజర్ సంపత్ ఆత్మహత్యకు ఇతర ఆర్థిక కారణాలే తప్ప.. సహారాకు సంబంధం లేదు. శ్రీనివాస్, సహారా సంస్థ రీజినల్ మేనేజర్, కరీంనగర్ సిరిసిల్లలో చీటింగ్ కేసులు సహారా సంస్థలో డిపాజిట్ చేసివారిలో ఎక్కువ మంది పేద, దిగువ మధ్య తరగతివారే. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువు, అనారోగ్యం తదితర అవసరాల కోసం.. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు సొమ్ము అందకపోవడంతో సంస్థపై, ఏజెంట్లపై చీటింగ్ కేసులు పెడుతున్నారు. ఇలా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, వేములవాడ పోలీస్స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కరీంనగర్లో ఉన్న సహారా రీజనల్ మేనేజర్, ఇతర అధికారులను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పిలిపించి వివరణ కూడా తీసుకున్నారు. చదవండి: కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం -
రూ.67,228 కోట్లు ఇక రానట్టే!.. వసూలు కావడం కష్టమేనన్న సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, తనకు రావాల్సిన బకాయిలు రూ.96,609 కోట్లలో రెండొంతులు అయిన రూ.67,228 కోట్లను (2022 మార్చి నాటికి) ఇక ‘వసూళ్లు కావడం కష్టమే’ అనే విభాగం కింద చేర్చింది. వివిధ కంపెనీలపై విధించిన జరిమానాలు చెల్లించకపోవడం, ఫీజుల చెల్లింపుల్లో వైఫల్యం, తన ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లింపులు చేయకపోవవడం వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం బకాయిల్లో రూ.63,206 కోట్లు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, పీఏసీఎల్, సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించినవి కావడం గమనార్హం. అలాగే, మొత్తం వసూలు కావాల్సిన బకాయిల్లో 70 శాతానికి సమానమైన రూ.68,109 కోట్లు వివిధ కోర్టులు, కోర్టులు నియమించిన కమిటీల విచారణ పరిధిలో ఉన్నట్టు 2021–22 సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. అన్ని మార్గాల్లో ప్రయత్నించినా కానీ, రూ.67,228 కోట్లు వసూలయ్యే అవకాశాల్లేవని సెబీ తేల్చింది. -
సహారాకి షాక్ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయండి!
న్యూఢిల్లీ: రెగ్యులేటరీ నిబంధనావళిని ఉల్లంఘించి దాదాపు రూ.14,000 కోట్ల వసూలు కేసులో సహారా గ్రూప్ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లకు శాట్‌లోనూ పూర్తి ఊరట లభించలేదు. మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఎస్క్రో అకౌంట్లో రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయాలని సహారా గ్రూప్ సంస్థ– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ (ఎస్‌ఐసీసీఎల్), ఆ సంస్థ మాజీ డైరెక్టర్లను సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఆదేశించింది. ఇందుకు నాలుగువారాల గడువు మంజూరు చేసింది. ఈ నిధుల డిపాజిట్ తర్వాతే గ్రూప్ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా సెబీ రికవరీ ఆఫీసర్ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. శాట్ ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లలో గ్రూప్ చైర్మన్ సుబ్రతారాయ్ కూడా ఉన్నారు. ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ ఆస్తులు, తదితర వివరాలు కూడా సెబీకి సుబ్రతారాయ్ అఫిడవిట్ రూపంలో అందజేయాలని శాట్ ఆదేశించింది. ‘‘భారతదేశం, అలాగే విదేశాలలో ఉన్న అన్ని ఆస్తులు, అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాల పూర్తి జాబితాను, మ్యూచువల్ ఫండ్స్/షేర్లు/సెక్యూరిటీలను (భౌతికంగా లేదా డీమ్యాట్ రూపంలో) సెబీకి నాలుగు వారాల్లోగా అందజేయాలని మేము మొదటి అప్పీలుదారు– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్, రెండవ అప్పీలుదారు– సహారా ఇండియాలను ఆదేశిస్తున్నాము’’అని శాట్ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. ఇరువురికి ఊరట... కాగా, వృద్ధాప్యం, అత్యవసర వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కంపెనీ అప్పటి డైరెక్టర్లు ఇరువురు– ఏఎస్ రావు, రనోజ్ దాస్ గుప్తాలకు వ్యతిరేకంగా జారీ అయిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని సెబీ రికవరీ ఆఫీసర్‌ను శాట్ ఆదేశించింది. కేసు వివరాలు ఇవీ... ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు పాటించకుండా దాదాపు 2 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి ఐచ్ఛిక పూర్తి కన్వర్టబుల్ డిబెంచర్ల (ఆప్షనల్లీ ఫుల్లీ కన్వెర్టబుల్ డిబెంచర్లు) ద్వారా 1998 నుంచి 2009 మధ్య ఎస్‌ఐసీసీఎల్ ఈ నిధులు సమీకరించిందన్నది ఈ కేసులో సహారా గ్రూప్ సంస్థ, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై ఆరోపణ. కంపెనీ వసూలు చేసిన రూ.14,000 కోట్లను 15 శాతం వార్షిక వడ్డీతోసహా రిఫండ్ చేయాలని ఎస్‌ఐసీసీఎల్, ఆ కంపెనీ ఒకప్పటి డైరెక్టర్లను 2018 అక్టోబర్‌లో సెబీ ఆదేశించింది. అలాగే ఇతర సంస్థలతో భాగస్వామ్యాల నుంచి కూడా ఎస్‌ఐసీసీఎల్‌ను, ఆ సంస్థ డైరెక్టర్లను సెబీ నిషేధించింది. ఈ కేసుకు సంబంధించి 2021 ఏప్రిల్‌లో సెబీ రికవరీ ఆఫీసర్ ఎస్‌ఐసీసీఎల్‌కు, కంపెనీ అప్పటి డైరెక్టర్లకు డిమాండ్ నోటీస్ జారీ చేశారు. రూ.14,106 కోట్లు 15 రోజుల్లో డిపాజిట్ చేయకపోతే రికవరీ ప్రక్రియ తప్పదని స్పష్టం చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో అక్టోబర్ 2021న జప్తు ఉత్తర్వులుజారీ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు తదితర వారి ఆస్తుల అన్నింటి జప్తునకు బ్యాంకులు తత్సబంధ అధికారులకు జప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సహారా శాట్‌ను ఆశ్రయించింది. చదవండి: రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్ ఇష్యూ! -
రూ. 62,603 కోట్లు కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం గత ఆదేశాలకు అనుగుణంగా రెండు సహారా సంస్థలు... ఎస్‌ఐఆర్‌ఈసీఎల్ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎస్‌హెచ్‌ఐసీఎల్ (సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లు రూ.62,602.90 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 30 నాటికి జరపాల్సిన ఈ మొత్తాలను సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో జమచేయడంలో విఫలమైతే, సహారా గ్రూప్ సుబ్రతారాయ్‌ని తిరిగి కస్టడీలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నెల 18న సెబీ దాఖలు చేసిన పిటిషిన్‌లో ముఖ్యాంశాలు, కేసు పూర్వాపరాలను చూస్తే... ► సహారా గ్రూప్ సంస్థలు రెండు ఎస్‌ఐఆర్‌ఈసీఎల్ , ఎస్‌హెచ్‌ఐసీఎల్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి భారీ నిధులు సమీకరించాయన్నది ప్రధాన ఆరోపణ. ► 2012, జూన్ 14న సహారా దాఖలు చేసిన స్టేట్మెంట్ల ప్రకారం, 2012 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎస్‌ఐఆర్‌ఈసీఎల్ చెల్లించాల్సిన అసలు రూ.16,997 కోట్లు. ఎస్‌హెచ్‌ఐసీఎల్ విషయంలో ఈ మొత్తం రూ. 6,352 కోట్లు. అసలుతోపాటు అప్పటికి చెల్లించాల్సిన వడ్డీసహా ఈ మొత్తాలను రూ.25,781.32 కోట్లుగా లెక్కతేల్చారు. ► సెబీ దాఖలు ఒక పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం 2012 ఆగస్టు 31న ఒక రూలింగ్ ఇస్తూ, వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకున్న నాటి నుంచీ 15 శాతం చొప్పున వడ్డీతోసహా మూడు నెలల్లోపు చెల్లింపులు జరపాలని ఆదేశించింది. చెల్లింపులు జరిపిన విషయాన్ని డాక్యుమెంట్లుసహా సెబీకి సమర్పించాలని కూడా సహారాకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ► అయితే డబ్బు చెల్లింపు ప్రక్రియలో ఇన్వెస్టర్ల చిరునామాలు, బ్యాంక్ అకౌంట్ల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల నేపథ్యంలో జమ మొత్తాలను ప్రత్యేక సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో జమచేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ► అయితే 2012 ఉత్తర్వుల తర్వాత సహారా సంస్థలు ఇప్పటి వరకూ రూ.15,455.70 కోట్ల్ల మొత్తాలనే డిపాజిట్ చేశాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ తా జాగా పేర్కొంది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఈ మొత్తాలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. 2020, సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వడ్డీ తోసహా సెబీ–సహారా రిఫండ్ అకౌంట్ ఆర్జన రూ.22,589.01 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ► చెల్లించాల్సింది రూ.రూ.25,781.32 కోట్లయితే, చెల్లించింది రూ.15,455.70 కోట్లు. వెరసి చెల్లించాల్సిన అసలు రూ.10,325.62 కోట్లని సెబీ పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 15% వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకుంటే, 2020 సెప్టెబర్ 30వ తేదీ నాటికి సహారా చెల్లించాల్సిన మొత్తాలు రూ.62,602.90 కోట్లకు చేరినట్లు సెబీ తాజాగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. ► బకాయిల చెల్లింపులకు సుప్రీం ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని వినియోగించుకోకుండా, సహారా గ్రూప్ సంస్థలు, ఆ సంస్థల చీఫ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని విమర్శించింది. ► ఈ కేసులో 2014 మార్చి 4వ తేదీ నుంచీ 2016 మే 6వ తేదీ వరకూ (డైరెక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్‌రాయ్ చౌదరిసహా) తీహార్ జైలులో ఉన్న సుబ్రతా రాయ్ తల్లి మరణం నేపథ్యంలో అంతిమ సంస్కారాల కోసం విడుదలయ్యారు. సహారా ఆస్తులు అమ్మి అయినా, చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చిన రాయ్, ఈ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కోర్టు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నట్లు తాజాగా సెబీ ఆరోపించింది. -
ఆ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు ప్రకటిస్తుంటే సహారా గ్రూప్ తమ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు ప్రమోషన్లను ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని కంపెనీ సోమవారం వెల్లడించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధించడంతో పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు యూపీకి తిరిగివెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో స్ధానికులకు వారి అర్హతలను బట్టి తమ గ్రూపు సంస్థల్లో ఉపాధి కల్పిస్తామని సహారా గ్రూప్ పేర్కొంది. మహమ్మారి విజృంభణ తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపినా ఈ కారణంతో గ్రూపు సంస్ధల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని గట్టి నిర్ణయం తీసుకున్నామని సహారా గ్రూప్ తెలిపింది. పూర్తి భద్రతతో ఉద్యోగులందరూ తమ విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. క్షేత్రస్ధాయిలో పనిచేసే 4,05,874 మంది ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించామని, 4808 మంది కార్యాలయ ఉద్యోగులకు వేతన పెంపుతో ప్రమోషన్లు కల్పించామని పేర్కొంది. తమ వద్ద పనిచేసే ఉద్యోగుల జీవనోపాథికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహారా గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్ధలకు విజ్ఞప్తి చేసింది. చదవండి : ఇప్పట్లో ఆఫీస్ లేనట్టే! -
న్యూయార్క్ ప్లాజా అమ్మకానికి భారీ డీల్!
న్యూయార్క్ : సహారా గ్రూప్‌కి చెందిన ప్రఖ్యాత ప్లాజా హోటల్‌ను ఎట్టకేలకు ఇద్దరు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సుబ్రతా రాయ్‌కి చెందిన సహారా గ్రూప్‌కు 70 శాతం వాటాలు ఉన్నాయి. చాలా కాలంగా సహారా సంస్థ ఈ హోటల్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్తలు దీన్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న వైట్ సిటీ వెంచర్స్ యజమాని షాహల్ ఖాన్, హకీమ్ సంస్థ యజమాని కమ్రాన్ హకీమ్ 70 శాతం వాటాలను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ జూన్ 25తో ముగుస్తుంది. 1907లో ఈ హోటల్ ప్రారంభమైంది. అమెరికాలో ఈ ఒక్క హోటల్‌కే ‘నేషనల్ రిజిస్టార్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్’లో చోటు దక్కింది. 70 శాతం వాటాను సహారా గ్రూప్ కార్పొరేట్ పైనాన్స్ హెడ్ సందీప్ వాద్వావ, 5 శాతం వాటాను ఛత్వల్‌లు 2012లో కొనుగోలు చేశారు. అయితే సహారా చాలా కాలంగా ఈ హోటల్ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నా.. మిగతా 25 శాతం వాటాను కలిగి ఉన్న దుబాయ్ యువరాజు అల్వలీద్ బిన్ తాలీల్ వల్ల కుదరలేదు. అయితే గత ఏడాది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జానిస్ లాంగ్ లాసల్లే హోటల్‌ను వేలం వేసే బాధ్యతను తీసుకుంది. దాంతో 75 శాతం వాటాను విక్రయించినట్లు సందీప్, ఛత్వల్‌లు ప్రకటించారు. ఈ విక్రయ ఒప్పంద వ్యవహారం చాలా రహాస్యంగా సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ హోటల్‌ను 2005లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసి దివాలా తీశారు. మొత్తానికి భారీ ఒప్పందంతో సహారా గ్రూప్ ఊపిరి పీల్చుకుంది. -
యాంబీ వ్యాలీ వేలాన్ని అడ్డుకుంటే జైలుకే...
-
యాంబీ వ్యాలీ వేలాన్ని అడ్డుకుంటే జైలుకే...
న్యూఢిల్లీ: యాంబీ వ్యాలీ వేలానికి అడ్డు పడుతున్న సహారా గ్రూపును సుప్రీంకోర్టు గురువారం గట్టిగా హెచ్చరించింది. వేలానికి ఎవరు అడ్డంకులు కల్పించినా కోర్టు ధిక్కారం కింద పరిగణించి జైలుకు పంపుతామని కఠిన స్వరంతో స్పష్టం చేసింది. యాంబీ వ్యాలీ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ సహారా గ్రూపు పుణె పోలీసులకు లేఖ రాయడం ద్వారా వేలానికి ఆటంకాలు కల్పించిందని సెబీ తరఫు న్యాయవాది గురువారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 28న ఇందుకు సంబంధించి సహారా గ్రూపు రాసిన లేఖతో పోలీసులు యాంబీ వ్యాలీని తమ అధీనంలోకి తీసుకోవడంతో వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని, దాంతో అది నిలిచిపోయినట్టు తెలియజేశారు. దీన్ని జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. యాంబీ వ్యాలీని అధికారిక లిక్విడేటర్(బాంబే హైకోర్టు)కు 48 గంటల్లోనే స్వాధీనం చేయాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించింది. వేలానికి ఎవరు ఆటంకం కల్పించినా కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపిస్తామని, 6 నెలల వరకు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. వేలాన్ని నిర్వహించుకోవచ్చని సెబీకి స్పష్టం చేసింది. చెల్లింపులు చేశాం... సెబీ ఆరోపణలను సహారా తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఖండించారు. వేలంలో పాల్గొనకుండా సహారా గ్రూపు అడ్డుకోలేదని చెప్పారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకు సెబీ ఖాతాలో ఇప్పటికే రూ.19,000 కోట్లు జమ చేశాం. సెబీ మాత్రం ఇన్వెస్టర్లకు రూ.60 కోట్లు మాత్రమే చెల్లించింది. సహారా భూములకు సంబంధించిన ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేశాం. వీటి విలువ రూ.20,000 కోట్లు ఉంటుంది. డిపాజిటర్లకు సహారా 95% వరకు తిరిగి చెల్లింపులు చేసింది’ అని సహారా గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది. -
సహారా యాంబీ వేలీ వేలం ప్రక్రియ షురూ
రిజర్వ్ ధర రూ. 37,000 కోట్లు ముంబై: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్‌నకు చెందిన యాంబీ వేలీ రిసార్ట్ టౌన్ వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. రిజర్వ్ ధర రూ. 37,392 కోట్లుగా నిర్ణయిస్తూ అధికారిక లిక్విడేటర్ బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రాజెక్ట్ మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల పైగా ఉంటుందని సహారా గ్రూప్ పేర్కొంది. బిడ్లను ఆహ్వానించడం, నో యువర్ క్లయింట్స్ మార్గదర్శకాలు ధృవీకరించుకునే రెండు ప్రక్రియలను మాత్రమే లిక్విడేటర్ ప్రారంభించారని తెలిపింది. తదుపరి విచారణ తేదీకి ముందే రూ. 1,500 కోట్లు డిపాజిట్ చేసిన పక్షంలో వేలం ప్రక్రియను ఉపసంహరిస్తారని సహారా వివరించింది. ఆధునిక విల్లాలు, గోల్ఫ్ కోర్స్, పాఠశాల, విమానాశ్రయం మొదలైన సదుపాయాలన్నీ ఉన్న అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ నగరంగా ప్రకటనలో లిక్విడేటర్ పేర్కొన్నారు. పుణెలోని లోనావాలా దగ్గర దాదాపు 6,761.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్షిప్ ఉంది. మారిషస్‌కి చెందిన రాయల్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెట్ ఫండ్ సుమారు 1.67 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 10,700 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామంటూ గతవారం ముందుకొచ్చినా.. వేలం ప్రక్రియ యథాప్రకారం ప్రారంభం కావడం గమనార్హం. వేలం పూర్తి కావడానికి ముందు అనేక దశలు ఉంటాయని సహారా గ్రూప్ తరఫు న్యాయవాది గౌతమ్ అవస్తి తెలిపారు. యాంబీ వేలీ ప్రాజెక్టులోకి 1.67 బిలియన్ డాలర్లు సమకూర్చుకునే దిశగా ఆర్పీఐఎఫ్, విక్టర్ కోనిగ్ యూకేతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వివరించారు. ఇన్వెస్టర్లతో చర్చలు జరిపేందుకు అనుమతించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ తేదిలోగా రూ. 1,500 కోట్లు కడితే వేలం ప్రక్రియను ఉపసంహరిస్తామని పేర్కొంది. గ్రూప్ సంస్థలు అక్రమంగా సమీకరించిన నిధులను వాపస్ చేయాల్సిన కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. -
వేలానికి సహారా యాంబి వ్యాలీ
-
యాంబీ వ్యాలీ వేలానికి సిద్ధం కండి!
న్యూఢిల్లీ : సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి యాంబీ వ్యాలీ వేలం వేసే ప్రక్రియను చేపట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం, బొంబై హైకోర్టును ఆదేశించింది. యాంబీ వ్యాలీ ప్రాపర్టీస్‌కు సంబంధించిన విక్రయ నోటీసు ప్రచురించాలని పేర్కొంది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని అంతకముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే దీనిలో రూ.247 కోట్లను మాత్రమే సహారా చీఫ్ సెబీ అకౌంట్లో జమచేశారు. మిగతా మొత్తం రూ.305.21 కోట్లను ఆగస్టు 21 వరకు డిపాజిట్ చేస్తామని సుబ్రతారాయ్ తరుఫున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ చెప్పారు. బ్యాలెన్స్ మొత్తంతో పాటు రూ.1500 కోట్లను సెప్టెంబర్ 7 వరకు సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సుబ్రతారాయ్‌ను ఆదేశించింది. దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. అంతేకాక సుబ్రతారాయ్ పెరోల్ గడువును అక్టోబర్ 10 వరకు కోర్టు పొడగించింది. తుదపరి విచారణను సెప్టెంబర్11న చేపట్టనునున్నట్టు కోర్టు చెప్పింది. -
విదేశీ హోటళ్ల అమ్మకంపై సహారా కసరత్తు
దేశీయంగా 30 అసెట్స్ విక్రయంపైనా చర్చలు న్యూఢిల్లీ/న్యూయార్క్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్ .. విదేశాల్లో తమకున్న మూడు హోటల్స్ విక్రయంపై కసరత్తు చేస్తోంది. అలాగే దేశీయంగా 30 ప్రాపర్టీల అమ్మకానికి సంబంధించి రూ. 7,500 కోట్ల మేర వచ్చిన తుది బిడ్స్‌పై మదింపు జరుపుతోంది. 30 అసెట్స్ కోసం 250 పైగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) రాగా.. సుమారు 25–26 సంస్థలు తుది బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన సంస్థల్లో టాటా సంస్థలు, గోద్రెజ్, అదాని, పతంజలితో పాటు ఒమాక్సీ, ఎల్డెకో వంటి పలు రియల్ ఎస్టేట్ డెవలపింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. మరోవైపు, న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్.. లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్ హోటల్స్ విక్రయానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్లాజా హోటల్లో సహారా వాటాలు కొనేందుకు యాష్‌కెన్జీ అక్విజిషన్ కార్పొరేషన్‌తో సౌదీ ప్రిన్స్ అల్–వలీద్ బిన్ తలాల్ చేతులు కలిపారు. సహారా గ్రూప్ సంస్థలు చట్టవిరుద్ధంగా రూ. 24,030 కోట్లు సమీకరించడం, వాటిని తిరిగి చెల్లించలేకపోయినందువల్ల గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్ సహారాను సుప్రీం కోర్టు జైలుకు పంపడం తెలిసిందే. ప్రస్తుతం పెరోల్ మీద బైటికొచ్చిన రాయ్.. జూన్ 15లోగా రూ. 1,500 కోట్లు కట్టకపోతే మళ్లీ జైలుకెళ్లాల్సి రానుంది. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయంపై సహారా మరింతగా కసరత్తు చేస్తోంది. -
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
-
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15 కల్లా 2500 కోట్ల రూపాయలు సెబీ-సహారా అకౌంట్లో జమచేయాలని ఆదేశించింది. లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. జూన్ 15 వరకు సెబీ అకౌంట్లో డబ్బులు జమచేసేందుకు రెండు చెక్ లను ఇస్తానని సుప్రీంకోర్టుకు హాజరైన సుబ్రతారాయ్ చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది. చెక్ లు క్లియర్ కాకపోతే, మళ్లీ తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని జడ్జీలు పేర్కొన్నారు. సహారా గ్రూప్ కు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా 25వేల కోట్ల మేర వసూలు చేసి, వాటిని తిరిగి ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెందడంతో అధినేత సుబ్రతారామ్ 2014 లో తీహార్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తన తల్లి చనిపోయినప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చిన సుబ్రతారాయ్, అప్పటినుంచి తన పెరోల్ ను పొడిగించుకుంటూ వెళ్తున్నారు. సహారాకు చెందిన మహారాష్ట్రలోని లగ్జరీ అంబీ వ్యాలీ టైన్ షిప్ ను వేలం వేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలపై సుబ్రతారాయ్ న్యాయవాది, మాజీ మంత్రి కపిల్ సిబాల్ వాదించారు. ఇది 10వేల ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందని, దీని విలువ 34వేల కోట్ల మేర ఉంటుందని తెలిపారు. సెబీకి బాకీ పడిన దానికంటే దీని విలువే ఎక్కువని చెప్పారు. అయితే ఈ వేలాన్ని మరోసారి సమీక్షించాలనే కపిల్ సిబాల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా జూన్ 19న తమ ముందు హాజరుకావాలని సుబ్రతారాయ్ ను సుప్రీం ఆదేశించింది. సహారా ఇప్పటికే దేశీయంగా, విదేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మడానికి ప్రయత్నిస్తోంది. -
యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన యాంబీ వ్యాలీ లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.24,647 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ అకౌంట్ల ప్రత్యేక ఆడిట్ అనంతరం కొద్ది నెలల క్రితం ఈ నోటీసులు జారీ ఆయ్యాయి. సహారా గ్రూప్ ప్రతినిధి తాజాగా ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. 2012–13 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.48,086 కోట్ల ఆదాయం సంస్థ రికార్డ్ బుక్స్‌లో ప్రతిబింబించలేదని సంబంధిత ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. దీనితో పన్ను, జరిమానాగా ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సహారాకు చెందిన రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో (వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్లు) వైఫల్యం కేసులో యాంబీ వ్యాలీ అమ్మకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 28న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ సుప్రీంకోర్టు ముందు స్వయంగా హాజరుకావాల్సి ఉంది.