SEASON
-
భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం?
భారతదేశంలోని ప్రజలు ఒక ఏడాదిలో వివిధ రుతువులలోని వాతావరణాలను చవిచూస్తారు. చలి, వేడి, వర్షం మొదలైనవి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. అటువంటప్పుడు భారతీయులు ఏ సీజన్లో అత్యధిక సంతోషంతో ఉంటారనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.వాతావరణం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. సూర్యకాంతి, వర్షం, వేడి, చలి, ఇవన్నీ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అలాగే వేసవిలో అధిక వేడి అందరికీ చికాకు కలిగిస్తుంది.వాతావరణం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మొదలైనవి మన మానసిక స్థితి, శక్తి స్థాయిలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. శీతాకాలంలో పగలు తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి కూడా తక్కువగానే ఉంటుంది. ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) తరహా సమస్యలను కలిగిస్తుంది. మరోవైపు శీతాకాలం పండుగ సీజన్ కూడా కావడంతో జనం కొంతమేరకు సంతోషంతో ఉంటారు.వేసవి కాలంలో అత్యధిక సూర్యకాంతి కారణంగా జనం త్వరగా అలసిపోతారు. చికాకుగా అనిపిస్తుంటుంది. అయితే వేసవి సెలవులు రావడం, దీనికితోడు ప్రయాణాల సీజన్ కావడంతో జనం సంతోషంతో ఉంటారు. వర్షాకాలంలో ఏర్పడే పచ్చని ప్రకృతి మన మనసును ప్రశాంతపరుస్తుంది. భారతదేశంలో వాతావరణం- సంతోషం మధ్య సంబంధాన్ని తేల్చిచెప్పడం చాలా క్లిష్టమైనదని నిపుణులు అంటుంటారు. ప్రజల ఆనందం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది.మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాలలోని వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండలు మండిపోతుంటాయి. కాగా భారతీయ సంస్కృతిలో వాతావరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పలు పండుగలు, ఆచారాలు సీజన్‌తో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు హోలీ పండుగ వసంతకాలంలో జరుపుకుంటారు. దీపావళిని శరదృతువులో జరుపుకుంటారు. వాతావరణం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరికి శీతాకాలం, మరికొందరికి వేసవి కాలం అంటే ఇష్టం ఉంటుంది. ఇది కూడా చదవండి: మనవరాలి పెళ్లి సంగీత్‌లో.. మల్లారెడ్డి ఊర మాస్ డ్యాన్స్ -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం..
వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఇదే. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామానికి తోడు రోజువారీ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.రోజువారీ ఆహారం..ఉదయం రెండు ఇడ్లీలు లేదా 60 గ్రాముల గింజ ధాన్యాలు లేదా 25 గ్రాముల పప్పులతో 150 మిల్లీ లీటర్ల పాలు తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల సమయంలో ఏదో ఒక పండు, నిమ్మరసం లేదా జామకాయ తింటే మేలు. ఇవేవీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసు పాలైనా తాగాలి. మధ్యాహ్నం భోజనంలో 75 గ్రాముల గింజ ధాన్యాలు, ఆకుకూరలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు 50 గ్రాముల గింజ ధాన్యాలతో చిరుతిండి, ఒక కప్పు పాలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా రెండు చపాతీలు లేదా పుల్కాలు కూరగాయలతో తినాలి. ఒకవేళ కూరగాయ, పెరుగు వద్దనుకుంటే 100 గ్రాముల మాంసాహారం తీసుకోవచ్చు.నీరు.. పాలు..పరిశ్రుభమైన నీటినే తాగాలి. ఎత్తు, బరువుకు సరిపడా నీరు తాగితే 50 శాతం రుగ్మతలు దరిచేరవు. ఎక్కువగా కాచి వడబోసిన నీటినే తీసుకోవాలి. నీటితో పాటు పాలు కూడా చాలా అవసరం. రోజుకు 250 ఎం.ఎల్. పాలు తాగాలి. కాఫీ, టీ అలవాటు ఉన్న వారు రోజుకు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ తీసుకోకపోవడమే శ్రేయస్కరం.పప్పు ధాన్యాలు కీలకంఆహారంలో పల్లీలు, మినుములు, శనగలు, బాదం పప్పు వంటివి ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూర కనీసం 100 గ్రాములు తీసుకోవాలి. జామ, నిమ్మ, ఉసిరి ఏదో ఒక దానిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ ఉడికించిన గుడ్డు, వారంలో ఒకసారి చికెన్, మటన్ తినాలి.తాజా పండ్లు, కూరగాయలు మేలు..ప్రతిపూట భోజనానికి ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజ రంగులో ఉండే పండ్లు కొన్నిరకాల దీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పండ్లను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.వీటికి దూరంగా ఉండాల్సిందే..నిల్వ చేసిన ఆహారం, తీపి పదార్థాలు తీసుకోరాదు. బయట దొరికే రెడీమేడ్ ఆహారం, ఉప్పుతో కూడిన ఆహారం, కూల్‌డ్రింక్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.జలుబు నివారణకు..ఈ కాలంలో ఎక్కువగా పీడించేవి జలుబు, దగ్గు, ఆయాసం. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం మిరియాలు, అల్లం, వెల్లుల్లి బాగా ఉపయోగపడతాయి. వీటిని అవసరం మేరకు వేడినీరు, పాలు, టీలో ఏదేని ఒకదానిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.మంచి ఆహారంతో ఆరోగ్యంఆహారం బాగా ఉడికించి తినాలి. ఏ, సీ, డీ, కే విటమిన్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంధత్వంతో పాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోస సంబంధ వ్యాధులను నివారించేందుకు ఏ విటమిన్ బాగా పని చేస్తుంది. తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారెట్, మునగాకు, మామిడి, బొప్పాయి, గుమ్మడి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇలా చేస్తే రోగకారకాలను నియంత్రించవచ్చు. – బాలాజీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి -
స్ట్రీమింగ్కు వచ్చేస్తోన్న ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
ఓటీటీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న వెబ్‌సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను అలరించాయి. తాజాగా మూడో సీజన్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మూడో సీజన్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే గత సీజన్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. కొత్త సీజన్లో మరికొన్ని పాత్రలు పరిచయం చేయనున్నారు. -
టాలీవుడ్ రియాలిటీ షో.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 వచ్చేసింది!
టాలీవుడ్ సినీ ప్రియులను అలరించేందుకు మరో రియాలిటీ షో వచ్చేసింది. యువ సింగర్స్ టాలెంట్‌ను వెలికితీసేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 సిద్ధమైంది. ఈ రోజు నుంచే షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సీజన్లు సక్సెస్ కావడంతో ఈ సీజన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 షో ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. గతవారమే లాంచ్ ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జడ్జిలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి, శ్రీరామచంద్ర వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ షో మొత్తం 33 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించారు. స్వర సంగీత సమరం!🎶సరిగమ రాగల సంబరం!!🎙️తెలుగు ఇండియన్ ఐడల్- 3 ఆగమనం!!!🥳Global star ni chese star meere...ika chuseyandi ..👉▶️https://t.co/QVPfxrk2AG🎤🎶 Watch India's biggest singing song #TeluguIndianIdolS3 streaming now only on @ahavideoin, every Friday and Saturday at 7… pic.twitter.com/ZeOYSI28yf— ahavideoin (@ahavideoIN) June 14, 2024 -
సమ్మర్లో కంఫర్టబుల్‌గా... కలర్ఫుల్గా! (ఫోటోలు)
-
చిన్నసైజు హెలికాప్టర్ కనిపిస్తుంది..తుఫాన్ బాధితుల్ని కాపాడటంలో
తుఫానులనూ తట్టుకోగల డ్రోన్ చిన్నసైజు హెలికాప్టర్లా కనిపించే ఈ డ్రోన్ వాతావరణంలోని ఎలాంటి మార్పులనైనా తట్టుకుంటూ ఇట్టే దూసుకుపోగలదు. చెక్ కంపెనీ ‘థండర్ ఫ్లై’ ఈ డ్రోన్‌ను ‘టీఎఫ్–జీ1’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యవసర వస్తువులను గమ్యానికి చేరవేయడానికి వీలుగా ‘థండర్ ఫ్లై’ ఇంజినీర్లు దీనిని రూపొందించారు. తుఫానుల్లో సైతం ఈ డ్రోన్ చెక్కుచెదరకుండా ప్రయాణించగలదు. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ డ్రోన్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, గంటకు పైగా నిరంతరాయంగా ప్రయాణించగలదు. ఇది ఐదు కిలోల వరకు బరువున్న వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటుకు సురక్షితంగా తీసుకుపోగలదు. తుఫానుల్లో చిక్కుకు పోయిన వారికి ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను చేరవేయడానికి ఇది బాగా ఉపయోగపడగలదు. థండర్ ఫ్లై వెబ్సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 9,999 డాలర్లు (రూ.8.33 లక్షలు). రోటరీ బ్లేడ్లు అదనంగా కావాలను కుంటే, మరో 499 డాలర్లు (రూ.41,611) చెల్లించాల్సి ఉంటుంది. -
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
జ్వరం.. వణుకుతున్న జనం!
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఒడిశా కాలనీకి చెందిన బోయ అజయ్, బోయ మరియమ్మల కుమార్తె అక్షర (3) విషజ్వరంతో ఆదివారం మృతి చెందింది. చిన్నారికి తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఏటూరునాగారంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సరిగా వైద్యం అందక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన గోస్కుల శ్రీజ (4) అనే చిన్నారి డెంగీ లక్షణాలతో మరణించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు తొలుత సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలిసింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొత్మీర్ గ్రామానికి చెందిన యువకుడు మిట్టె నాగరాజు (24) ఆదివారం రాత్రి విష జ్వరానికి బలయ్యాడు. అప్పటికే నాలుగైదు రోజులుగా జ్వరంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందినా పరిస్థితి మెరుగుకాలేదు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభించి జనం అల్లాడుతున్నారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 5,315 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య సంగతేమోగానీ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కరిద్దరు జ్వరంతో మంచాన పట్టి కనిపిస్తున్నారు. గత ఇరవై రోజులుగా విష జ్వరాల తీవ్రత మరింతగా పెరిగింది. డెంగీ, మలేరియాలతో గత ఐదారు రోజుల్లోనే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు మృత్యువాత పడటం ఆందోళనకరం. గోదావరి పరీవాహక ఏజెన్సీ ప్రాంతాల్లో.. ముఖ్యంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ప్రాణం పోయింది చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ కళ్లముందు తిరిగిన నాబిడ్డ గంటల వ్యవధిలోనే దూరమైపోయింది. గత నెల 28న ఆమెకు జ్వరం వస్తే.. స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి, సిరప్ రాసిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి సిరప్ తాగిస్తే తెల్లవారే సరికి జ్వరం తగ్గింది. రెండు రోజులు బాగానే ఉంది. కానీ 30న మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ వాంతులు చేసుకుంది. వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. రూ.10వేలు అడ్వాన్సుగా తీసుకుని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కానీ పరిస్థితి సీరియస్‌గా ఉందని, తమ వల్ల కాదంటూ 65 కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్తుండగానే నా బిడ్డ ప్రాణాలు విడిచింది. – బోయి అజయ్, (అక్షర తండ్రి) ఆందోళన వద్దు.. మలేరియా, డెంగీ జ్వరాల పట్ల ఆందోళన వద్దు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇటీవల జ్వరాలు విజృంభిస్తుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారుల సూచన మేరకు డెంగీ, మలేరియాలను నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. జ్వరం లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సహాయం పొందాలి. రక్త పరీక్షలు చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులకు తగినన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ -
మరింత మంది రైతన్నలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో మరింత మంది రైతులకు మేలు చేకూర్చేలా మరిన్ని సంస్కరణలు తెచ్చారు. నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణాన్నిబట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయడమే కాకుండా, ప్రస్తుత వ్యవసాయ సీజన్ నుంచే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఒక సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. ఇలా 2019లో శ్రీకారం చుట్టిన ఈ పథకం ద్వారా గడిచిన 4 ఏళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారం చెల్లించింది. పరిహారం లెక్కింపులో పారదర్శకత కోసమే సాధారణంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్ కేటగిరీల్లో పంటలు సాగవుతుంటాయి. పూర్వం నుంచి ఇరిగేటెడ్ (నీటి వసతి కల్గిన) విభాగంలో సాగయ్యే పంటలను దిగుబడి ఆధారితంగా, నాన్ ఇరిగేటెడ్ (వర్షాధారం) కేటగిరిలో సాగయ్యే పంటలను వాతావరణ ఆధారితంగా పరిగణనలోకి తీసుకొని బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. దిగుబడి ఆధారిత పంటలకు వాస్తవ, హామీ దిగుబడిలోని వ్యత్యాసాల ఆధారంగా, వాతావరణ ఆధారిత పంటలకు ప్రతికూల, సాధారణ వాతావరణ పరిస్థితుల్లోని వ్యత్యాసాలను బట్టి బీమా పరిహారం లెక్కిస్తారు. స్థానికంగా ఉండే నీటి వసతినిబట్టి కొన్ని జిల్లాల్లో ఒకే పంట రెండు కేటగిరిల్లోనూ సాగవుతుంటుంది. దీంతో ఒకే జిల్లాలో ఒకే పంటకు సాగయ్యే విధానాన్ని బట్టి రెండు విధాలుగా బీమా కవరేజ్ కల్పిస్తూ నోటిఫై చేయాల్సి వచ్చేది. ఫలితంగా పక్క పక్క సర్వే నంబర్లలో సాగయ్యే ఒకే పంటకు ఒకే పంట కాలంలో కొంత వాతావరణ, మరికొంత దిగుబడి ఆధారంగా లెక్కించి పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా జరిగిన పంట నష్టం ఒకటే అయినా, పరిహారంలో వ్యత్యాసాలు ఉండేవి. ఉదాహరణకు నోటిఫైడ్ జిల్లాల్లో ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు 95 శాతం విస్తీర్ణంలో వర్షాధారం, 5 శాతం నీటి వసతి కింద, మిరప 85 శాతం నీటి వసతి, 15 శాతం వర్షాధారం కింద సాగవడం వలన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో పరిహారం ఉండేది. ఖరీఫ్‌లో నోటిఫై చేసిన పసుపు పంటకు కృష్ణా జిల్లాలో వాతావరణ ఆధారంగా, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ జిల్లాల్లో దిగుబడి ఆధారంగా పరిగణించేవారు. ఇలా మిరప, పత్తి, పసుపు, జొన్న, వేరుశనగ వంటి పంటల విషయంలో పూర్వం నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరిహారం లెక్కింపు, పంపిణీలో అసమానతలు తొలగించడమే లక్ష్యంగా పంటల బీమా మార్గదర్శకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి నోటిఫై చేసిన జిల్లాల్లో ఖరీఫ్‌లో మిరప, పసుపు జొన్న పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా పూర్తిగా దిగుబడి ఆధారంగానే పరిగణిస్తారు. పత్తి, వేరుశనగ పంటలను పూర్తిగా వాతావరణ ఆధారితంగా పరిగణిస్తారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా సాగవుతున్న ఆముదం పంటను కొత్తగా పంటల బీమా పరిధిలోకి తెచ్చారు. నోటిఫైడ్ జిల్లాల్లో దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడిమామిడి పంటలను వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. నాటిన మూడో ఏడాది నుంచి దానిమ్మకు, నాలుగో ఏడాది నుంచి బత్తాయి పంటకు ఖరీఫ్‌లోనూ, మూడో ఏడాది నుంచి జీడిమామిడి, నాలుగో ఏడాది నుంచి నిమ్మ తోటలకు రబీలోనూ బీమా రక్షణ కల్పిస్తారు. 2023–24 సీజన్ కోసం నోటిఫికేషన్ జారీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది పీఎంఎఫ్‌బీవైతో కలిసి బీమా పథకం అమలు చేయగా, యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం విముఖత చూపడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు కంపెనీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం దిగి రావడంతో 2022–23 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బీమా రక్షణ కల్పిస్తోంది. 2023–24 సీజన్ కోసం దేశంలోనే అత్యల్ప ప్రీమియంతో బీమా కవరేజ్‌కు ముందుకొచ్చిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. జిల్లాలవారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలతో ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్–2023లో 15 పంటలకు దిగుబడి ఆధారంగా, 6 పంటలకు వాతావారణ ఆధారంగా, రబీ 2023–24లో 13 పంటలకు దిగుబడి ఆధారంగా, 4 పంటలకు వాతావరణ ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుబడి ఆధారిత పంటలకు ఖరీఫ్‌లో గ్రామం, మండల, జిల్లా యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తుండగా, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం మండలం యూనిట్‌గా బీమా కవరేజ్ కల్పిస్తున్నారు. అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంటల బీమా లెక్కింపు, పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు పంటల బీమా మార్గదర్శకాల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. నీటి వసతి, వర్షాధారం ప్రాతిపదికన కాకుండా ఇక నుంచి పూర్తిగా వాతావరణ, దిగుబడి ఆధారంగానే పంటలకు బీమా రక్షణ ఉంటుంది. నోటిఫై చేసిన జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలు నష్టపోయే రైతులకు ఒకే రీతిలో పరిహారం దక్కు తుంది. లెక్కింపులో, చెల్లింపుల్లో ఎలాంటి అసమానతలు ఉండవు. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
పది రోజుల్లో నాలుగింతల వాన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి. లోటు నుంచి అధికం వైపు వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది. అంతటా కుండపోత వానలతో.. గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. -
ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!
వేసవి తాపం చల్లారి హమ్మయ్యా అనిపించే కాలం. చలచల్లగా హాయిగా ఉంటుందని ఆనందించేలోపు అంటు వ్యాధులు మనం కోసం రెడీగా ఉంటాయి. ఈ కాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ తదితర అంటువ్యాధులు ప్రబలేకాలం. ఇలాంటి కాలంలో ఈ పండ్లు తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు నేరెడు పండ్లు: ఇందులో పోటాషియం, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తంలో ఆకస్మికంగా పెరిగే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెర్రీస్: దీనిలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణం కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలోనూ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడంలో ఉపకరిస్తుంది. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ ఇన్వెక్షన్ల నుంచి సునాయసంగా బయటపడే సామార్థ్యాన్ని పెంపొందిస్తాయి. బొప్పాయి: ఈ బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సంక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే గాక చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దానిమ్మ : దానిమ్మ గింజలు: ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన పండు. ఇందులో ముఖ్యంగా బీ విటమిన్లు, ఫోలేట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, రక్త ప్రసరణకు సహయపడతాయి. ఈ పళ్లు హైపర్‌టెన్షన్, గుండె సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పీచెస్: ఈ పండ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పచ్చిగా గానీ సలాడ్‌తో గానీ కలిపి తినండి. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ ఐరన్ ఉన్నాయి. ఇది జామూన్ మాదిరి మంచి శక్తిమంతమైన పోషకాలను అందిస్తుంది. లిచ్చి: ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆస్తమా రోగుల శ్వాసక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి తరుచుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పైన చెప్పిన ఈ పళ్లల్లో దేని రుచి మీకు నచ్చకపోయినా, వాటిని తినడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పండ్లను పచ్చిగా తినడం లేదా జ్యూస్ /సలాడ్లు, స్మూతీలు, యోగర్ట్‌లు లేదా డెజర్ట్‌లలో చేర్చి తీసుకోండి. ఇవి మీ రోజువారీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
సెప్టెంబర్ 8,9 తేదీల్లో ప్రొ కబడ్డీ వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ముంబైలో జరగనుంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లను ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న వారి కనీస ధర రూ. 30 లక్షలుగా... ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు కనీస ధర రూ. 20 లక్షలు... ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల కనీస ధర రూ. 13 లక్షలుగా... ‘డి’ కేటగిరీ క్రీడాకారుల కనీస ధర రూ. 9 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో 500కుపైగా క్రీడాకారులు బరిలో ఉన్నారు. తొమ్మిదో సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లలో ఆరుగురిని అట్టిపెట్టుకునే సౌలభ్యం ఆయా ఫ్రాంచైజీలకు ఉంది. మొత్తం 12 జట్లు ఈ లీగ్‌లో ఉన్నాయి. -
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
వేసవి మంటలు?.. అదే జరిగితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పైపైకి!
సాక్షి, హైదరాబాద్: చలి తగ్గింది. మధ్యాహ్నం ఎండ.. అప్పుడే వేసవి వచ్చిందా? అన్నట్టుగా ఉంటోంది. ఈసారి ఎండలు మండిపోతాయా? అని కూడా అనిపిస్తోంది. అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ జనవరి అంచనాలు కూడా వేసవి ఉష్ణోగ్రతలు మోత మోగిపోతాయని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశం మొత్తమ్మీద గత మూడేళ్లలో వర్షాలకు ఏమాత్రం కొదవ లేకుండా పోయింది. అదే సమయంలో వేసవిలో విపరీతమైన వడగాడ్పులు వీచాయి. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గత ఏడాది శీతాకాలం చలి వణికించింది. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఇవన్నీ తార్కాణాలే. కాగా నాలుగేళ్ల విరామం తరువాత ఈ ఏడాది వేసవి సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని, ఎండలు అసాధారణంగా ఉండే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు స్పష్టం చేశారు. లా నినా నుంచి ఎల్ నినో వైపు? అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఈ ఏడాది వాతావరణంపై గత నెలలో ప్రాథమిక అంచనాలను వెలువరించింది. దాని ప్రకారం ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టుల్లో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడేందుకు యాభై శాతం అవకాశం ఉండగా.. జూలై మొదలుకొని సెపె్టంబర్ వరకు ఏర్పడేందుకు 58 శాతం అవకాశాలున్నాయి. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ చుట్టుపక్కల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గితే అది లా నినా అవుతుంది. కాగా దేశంలో గత మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు కారణమైన లా నినా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే కచి్చతంగా ఇలాగే జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని.. రానున్న మూడు నాలుగు నెలల్లో పరిస్థితులు మారినా మారవచ్చని వీరు అంటుండటం ఊరటనిచ్చే అంశం. ఎన్ఓఏఏ మాదిరిగానే భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కూడా ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలే ఎక్కువని చెబుతోంది. అయితే ఎల్ నినో సీజన్ మొదలయ్యేందుకు ఇంకా మూడు నాలుగు నెలలు ఉన్నందున ఈ అంచనాలు తప్పు కావచ్చునని కూడా పేర్కొంది. కాగా ఈ నెలాఖరుకు తాజా అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ డైరెక్టర్ ఎం.మహాపాత్ర తెలిపారు. సమాచారం ఆందోళనకరమే: స్కైమెట్ ఈ ఏడాది ఎల్ నినో, లా నినా పరిస్థితులపై అందిన ప్రాథమిక సమాచారం ఆందోళనకరంగానే ఉందని దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్‌కు చెందిన మహేశ్ పలవట్ చెబుతున్నారు. ‘పరిస్థితులు లా నినా నుంచి ఎల్ నినో వైపునకు మారుతున్నాయంటేనే ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం. రుతుపవనాల సమయంలో ఎల్ నినో ఏర్పడితే ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 2020లోనే లా నినా పరిస్థితులు ఏర్పడి, ప్రస్తుతం కూడా అదే కొనసాగుతున్నా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో ఉండటం, గత ఏడాది కొన్నిసార్లు విపరీతమైన వడగాడ్పులు నమోదు కావడం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫ్రిబవరి, మార్చిల్లోనూ ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం అసాధారణ స్థాయిలో ఉండవచ్చు..’ అని పలవట్ పేర్కొన్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోమన్నాం.. మధ్యమ స్థాయి ఎల్ నినో రుతుపవనాలపై ప్రభావం చూపగలదు. దీనివల్ల కురిసే వర్షాల మోతాదు తగ్గుతుంది. కానీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రం రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్పలేం. రానున్న మూడు నాలుగు నెలల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో తేడాల ఆధారంగా రుతుపవనాల తీవ్రతలో తేడాలు రావచ్చు. మొత్తం మీద ఈ సారి ఎండలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించాం. – ఎం.రాజీవన్, ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సగటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక వేడి నమోదైన సంవత్సరాల్లో 2022ది ఐదో స్థానం. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు శతాబ్దం క్రితంతో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరగవచ్చునని అంచనా. గత ఏడాది భారత్‌లో కనీసం తొమ్మిది నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉత్తర, వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు రావచ్చని గత ఏడాది ఐఎండీ హెచ్చరించింది. సముద్ర జలాలు వెచ్చబడితే అధిక ఉష్ణోగ్రతలు లా నినా పరిస్థితుల్లో తూర్పు నుంచి పశ్చిమం వైపు వీచే వాణిజ్య పవనాలు బలంగా ఉంటాయి. దీనివల్ల సముద్ర ఉపరితలంపై ఉండే వెచ్చటి నీరు పశి్చమ దిక్కుకు ఎక్కువగా కదులుతుంది. అదే సమయంలో సముద్రపు లోపలి భాగంలోని శీతల జల ప్రవాహాలు తూర్పువైపునకు ప్రయాణిస్తాయి. అధిక వర్షాలకు కారణమవుతాయి. ఎల్ నినోలో పరిణామాలు మాత్రం దీనికి వ్యతిరేక దిశలో ఉంటాయి. వాణిజ్య పవనాలు బలహీనపడి ఉపరితలంపైని వెచ్చటి నీరు తూర్పు దిక్కుకు అంటే మన వైపు ప్రయాణిస్తుంది. అప్పటికే చల్లగా ఉన్న నీటిని ఇవి వెచ్చబెడతాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇండోనేసియా, ఆ్రస్టేలియాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాల్లో తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడిపోతాయి. కరువులు, కార్చిచ్చులు ఎక్కువవుతాయి. -
ఆ రుతువు వచ్చేవరకూ ఆగాలి... తప్పదు
మామిడి కాయలంటే ఇష్టం. మొక్క తెచ్చావు. నీళ్ళుపోసావు... ఇంకా కాయలు రాలేదని రోజూ బిందెలకు బిందెలు నీళ్ళుపోస్తే కాయలు రావు. మొక్క చెట్టు కావాలి... అయినా వసంత రుతువుకూడా రావాలి.. అప్పుడే పూత పూస్తుంది, అది పిందెగా మారుతుంది. ఆ పిదప కొంత కాలానికి కాయ... ఆ తరువాతే పండు... అప్పటిదాకా ఓర్పు ఉండాలి. వేచి చూడాలి. ఎప్పుడో కాయ కాస్తుందని ఇప్పటినుంచే నీళ్ళెందుకు పోయడం.. అని మానేస్తే మొక్క బతకదు... అంటే ఓర్పుతోపాటు నీ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. ప్రతి దానికీ ఒక నియమం, ఒక సమయం ఉంటాయి. అప్పటిదాకా వేచి చూడగల ఓర్పు ఉండడంతో పాటూ ప్రయత్నం కూడా పూర్తిగా ఉండాలి. వెనకటికి ఓ రాజుపై శత్రువులు విరుచుకు పడ్డారు. రాజు ఓడిపోయాడు. నిరాశతో రాజు అన్నీ వదిలేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటే... సైనికులు, ఆంతరంగికులు అందరూ నచ్చచెప్పారు. మనం కొంతకాలం ఆగుదాం.. మళ్ళీ శత్రువుపై యుద్ధం ప్రకటిద్దాం.. అని చెప్పినా వినకుండా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఓరోజున రాజు ఒక చెట్టుకింద కూర్చుని... దగ్గర్లోనే ఒక సాలెపురుగు గూడు అల్లడానికి నానా తంటాలు పడడాన్ని ఆసక్తిగా గమనించాడు.. అది గూడు అల్లే క్రమంలో చాలాసార్లు పోగు తెగి కిందపడిపోతున్నది... పలుమార్లు అలా చేసిన తరువాత చివరికి అది గూడు పూర్తిగా అల్లి మధ్యలో సౌకర్యవంతంగా కూర్చుని గూడుకు చిక్కుకున్న పురుగులను హాయిగా తింటున్నది. ఇది చూసిన రాజుకు జ్ఞానోదయమయింది. వెంటనే వెళ్ళి తన పరివారాన్ని చేరదీసి సర్వసన్నద్ధం అయ్యేవరకు ఆగి... ఓ రోజున యుద్ధం ప్రకటించాడు. శత్రురాజును సునాయాసంగా ఓడించి తిరిగి తన రాజ్యాన్ని పొందాడు. ప్రతిదానికీ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం ఎక్కడా ఆపకుండా పూర్తిచేయాలి, ఫలితం వచ్చేవరకూ ఓర్పుగా వేచి చూడాలి. తొలితరానికి చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్ జగదీశ్ చంద్రబోస్ ఆంగ్లేయ ప్రొఫెసర్లతో సమానమైన అర్హతలు, ప్రతిభాపాటవాలు కలిగినా, వారితో సమానంగా తనకు వేతనం ఇవ్వనందుకు నిరసనగా జీతం ముట్టుకోకుండా తన వృత్తిని మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే అదే అంకితభావంతో కొనసాగిస్తే... చివరకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దిగొచ్చి ఆయన్ని సన్మానించి పెంచిన జీతం పాత బకాయిలతో సహా చెల్లించింది. కార్యసాధనలో ఓర్పు ఎంత ముఖ్యమో... ప్రయత్నాలను చివరిదాకా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
-
సింధు వర్సెస్ సైనా
గువాహటి: బ్యాడ్మింటన్ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్–3 సిద్ధమైంది. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక కరమ్‌బీర్ నబీన్ చంద్ర బర్డోలాయ్ ఏసీ ఇండోర్ స్టేడియంలో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టు అవధ్ వారియర్స్‌తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో భాగంగా చెన్నై తరఫున పీవీ సింధు, అవధ్ తరఫున సైనా నెహ్వాల్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నారు. ఇటీవలే జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి సైనా జోరు కనబరిచింది. అయినప్పటికీ ముఖాముఖిలో 2–1తో సింధుదే పైచేయిగా ఉంది. సీజన్–2లో ఆరు జట్లతో జరిగిన పీబీఎల్‌లో ఈసారి మరో రెండు జట్లు జతయ్యాయి. కొత్తగా అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ జట్లు లీగ్‌లో చేరాయి. వీటితో పాటు ఢిల్లీ ఏసర్స్ జట్టు పేరు మార్చుకొని ఢిల్లీ డాషర్స్ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పీబీఎల్‌లో తొలిసారిగా మహిళల నం.1 క్రీడాకారిణి తైజు యింగ్ (తైవాన్) అరంగేట్ర జట్టు అహ్మదాబాద్ స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలోనూ వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సన్ బెంగళూరు బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసారి 10 మంది ఒలింపియన్లు లీగ్‌లో పాల్గొననుండటం విశేషం. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఇరు జట్ల మధ్య రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్ మూడు గేమ్‌ల పాటు జరుగుతుంది. ప్రతీ గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గత సీజన్లో 11 పాయింట్లతో గేమ్‌ను నిర్వహించారు. లీగ్ దశ ముగిశాక పాయింట్లపరంగా టాప్–4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో కీలకమైన సెమీస్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ పోరుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు. ట్రోఫీతో 8 జట్ల మార్క్యూ ఆటగాళ్లు -
ప్రొ కబడ్డీ లీగ్–5 విజేతకు రూ.3 కోట్లు
మొత్తం ప్రైజ్‌మనీ రూ.8 కోట్లు న్యూఢిల్లీ: తొలి సీజన్ నుంచి అనూహ్య ఆదరణతో దూసుకెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి ప్రైజ్‌మనీ కూడా భారీగా పెరిగింది. గత సీజన్లో రూ.6 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ఈసారి రూ. 8 కోట్లకు పెరిగింది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 కోట్లు దక్కించుకుంటుంది. రన్నరప్‌కు రూ. కోటీ 80 లక్షలు లభిస్తాయి. మూడో స్థానం పొందిన జట్టుకు రూ. కోటీ 20 లక్షలు అందజేస్తారు. ‘అత్యంత విలువైన ఆటగాడు’ అవార్డు పొందిన వారికి రూ.15 లక్షలు దక్కుతాయి. ఓవరాల్‌గా లీగ్‌లో 12 జట్ల మధ్య 138 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈనెల 28న హైదరాబాద్‌లో మొదలయ్యే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడుతుంది. అక్టోబరు 28న ఫైనల్ జరుగుతుంది. -
ఎండ మండుతోంది.. వాన కురుస్తోంది
నరసాపురం : వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుఉన్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. వారం రోజులుగా కొన్నిచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచీ భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులు, అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. సాధారణంగా మే నెలాఖరు నుంచి (రోహిణి కార్తె వెళ్లాక) ఈదురు గాలులు వీయటం.. వర్షాలు కురవటం పరిపాటి. అందుకు భిన్నంగా ఏప్రిల్ చివరి వారం నుంచే భారీ గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమే ఈ మార్పులకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటివరకూ 35నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు వారం రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగాయి. భూమి ఒక్కసారిగా వేడెక్కడం, సాయంత్రం చల్లబడుతుండటంతో భూమి నుంచి వేడి వాయువుల పీడనం పైకి వెళుతోంది. ఈ కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తు న్నాయి. వాతావరణంలో నెలకొన్న ఈ సర్దుబాట్లే ప్రస్తుత స్థితికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే గాలుల్లో వేగం పెరగడం ఈదురు గాలులకు కారణమని చెబుతున్నారు. తగ్గుతున్న తేమశాతం తీర ప్రాంతం కావడంతో మన జిల్లాలో తేమ శాతం అధికంగా ఉంటుంది. నాలుగు రోజులుగా గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. పగటిపూట తేమశాతం 60 నుంచి 70 శాతానికి తగ్గింది. రాత్రివేళ 80 నుంచి 90 శాతం నమోదవుతోంది. వారం క్రితం వరకు పగటిపూట 70 నుంచి 80 తేమ శాతం నమోదైంది. తగ్గుతున్న తేమ శాతంలోను గంటకో రకంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీనివల్ల ఉక్కపోత కాస్త తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజృంభిస్తున్న వ్యాధులు రోజుల వ్యవధిలో తేమ శాతంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి సూచించారు. వారం రోజులు ఇదే పరిస్థితి నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భూమి బాగా వేడెక్కింది. వాతావరణం చల్లబడ్డ తరువాత వచ్చే వేడి గాలుల వల్ల మేఘాలు ఏర్పడి వర్షిస్తున్నాయి. దీనికి ఈదురు గాలులు తోడయ్యాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎన్.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం -
గట్టెక్కుతుందా..!.
కీలక సమయంలో కాటన్ బ్యారేజ్వద్ద తగ్గుతున్న నీటిరాక నీరు పెంచాలి్సన సమయంలో పడిపోయిన సహజ జలాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు సీలేరుపైనే ఆశలు ఇప్పటికే బైపాస్ పద్ధతిలో సాగునీరు ఆంధ్రుల అన్నపూర్ణగా భాసిల్లుతున్న గోదావరి డెల్టాలో రబీ కీలక దశకు చేరింది. పాలు పోసుకుని గింజ గట్టిపడే దశకు వరి చేలు చేరుకున్నాయి. ఈ తరుణంలో రైతులు చేలల్లో ఎక్కువగా నీరు నిల్వ చేసూ్తంటారు. ఇదే సమయంలో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి రాక తగ్గుతూండడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. రబీ వరిసాగును గట్టెక్కించేదెలాగని వారు ఆందోళన చెందుతున్నారు. అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి డెల్టాలో అధికారుల లెక్కల ప్రకారం 8.86 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. ఇంత విస్తీర్ణంలో సాగుకు కనీసం 85 టీఎంసీల నీరు అవసరం. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి ఎద్దడి ఉండదని భావించారు. కానీ, డిసెంబరు నెలలో అనూహ్యంగా సహజ జలాల రాక పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీనికితోడు సాగు ఆరంభంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వంతులవారీ విధానంతో పరిస్థితి కొంత సానుకూలంగా మారింది. డెల్టా శివారుల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో రబీ వరి చేలు ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. మధ్య డెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు; తూర్పు డెల్టాలోని కరప, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో సాగు ఆలస్యమైన చోట చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ దశలో చేలల్లో ఎక్కువగా నీరు పెడతారు. కాలువల ద్వారా సమృద్ధిగా సాగు నీరందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 8,540 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా 4,863, బైపాస్ పద్ధతిలో 2,712 క్యూసెక్కుల చొప్పున 7,575 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంటే బ్యారేజ్ వద్ద సహజ జలాలు 965 క్యూసెక్కులు మాత్రమే. తూర్పు డెల్టాకు 2,520, మధ్య డెల్టాకు 1,640, పశ్చిమ డెల్టాకు 4,380 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 105 డ్యూటీ(ఒక క్యూసెక్కు 105 ఎకరాల చొప్పున)లో నీరు అందిస్తున్నారు. పాలు పోసుకుంటున్న సమయంలో డెల్టా కాలువకు 90 డ్యూటీ(ఒక క్యూసెక్కు 90 ఎకరాల చొప్పున)లో నీరు విడుదల చేయాల్సి ఉంది. అంటే మూడు కాలువలకు 8,800 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలి. వేసవి ఎండలు పెరుగుతున్నందున్న ఆవిరి రూపంలో ఎక్కువ నీరు పోతుంది. కాబట్టి కనీసం 9 వేల క్యూసెక్కుల నీరు ఇస్తే శివారుకు సాగునీరందుతుంది. కానీ సహజ జలాల రాక వెయ్యి క్యూసెక్కుల లోపునే ఉంది. ముందు ముందు ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. పోనీ సీలేరు నుంచి ఇప్పుడొస్తున్నట్టుగా నీరు వస్తుందనే నమ్మకం కూడా రైతులకు లేదు. ఇప్పటికే బైపాస్‌లో 2,712 క్యూసెక్కులు ఇస్తున్నారు. వేసవి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బైపాస్‌ను నిలిపివేస్తే రైతులకు కష్టాలు తప్పవు. నీరు తగ్గడానికి తోడు, వేసవి ఎండలు పెరిగితే చి‘వరి’లో రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. -
సాగుకు ముందే పంట రుణం
స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటల బీమా సాక్షి, హైదరాబాద్: సీజన్లో సాగుకు ముందే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ‘ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు’ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. అప్పుడే రైతు తనకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసి ప్రైవేటు అప్పులకు దూరంగా ఉంటారని, రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ రాజిరెడ్డి కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో నాబార్డు సహా వ్యవసాయ, ఉద్యాన, పశుసం వర్థక, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతు ఆదాయం రెట్టింపునకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు తమ నివేదికలు అందజేశాయి. ప్రస్తుతం సాగు చేశాకే పంట రుణాలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని టాస్క్ ఫోర్స్ కమిటీ వివరించింది. పంట వేయడానికి ముందే వివిధ పంటలకు బీమా ప్రీమియం గడువులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడి, చేపలు, గొర్రెల పెంపకం వంటి వాటిని కూడా ఎంచుకోవాలని సూచించారు. ఎరువుల వాడకాన్ని తగ్గించాలి: వచ్చే ఖరీఫ్ నుంచి ఎరువుల వాడకాన్ని కనీసం పావు శాతానికి తగ్గించేలా చూడాలని కమిటీ సూచించింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న అంశంపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు రెండు బృందాలు వెళ్లి సర్వే నిర్వహించాయి. -
మెట్ట ప్రాంతంలో ముందే పూసిన మామిడి
మంచు దెబ్బకు భయపడుతున్న రైతులు చింతలపూడి: వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మామిడి తోటలు ముందుగానే పూతకు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 30 శాతం తోటలు పూత పూసినట్లు ఉద్యానాధికారులు తెలిపారు. అయితే పూతకొచ్చిన తోటలకు మంచు దెబ్బ తగిలే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు, మూడేళ్ళుగా ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్ధానం, జిల్లాలో ప్రధమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు మెట్ట ప్రాంతంలో గత దశాబ్దంన్నరగా గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దశాబ్దాల పాటు కన్న బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు క్రమక్రమంగా 10 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. మామిడి తోటల అభివృధ్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. సస్యరక్షణ చేయాలి పొడి వాతావరణం కారణంగానే నెల రోజులుగా వాతావరణం పొడిగా ఉన్నందున గత 10 రోజులుగా తోటల్లో పూత కనపడుతూందని అధికారులు చెప్పారు. రైతులు ఇప్పట్నించీ సరైన సస్య రక్షణ చేపట్టాలని సూచించారు. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 50 గ్రాముల యూరియా ఒక లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. తేనే మంచు పురుగు నివారణ ఇలా... ప్రస్తుతం మామిడి పూతపై తేనె మంచు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. లేత పూ మొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆసిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు ఉధృతి తగ్గుతుంది. కె సంతోష్, ఉద్యానాధికారి -
చిన్నారులపై ‘సీజనల్’ పడగ
– విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు – ఆసుపత్రులకు క్యూ కడుతున్న తల్లిదండ్రులు – ప్రబలుతున్న అతిసారం, టైఫాయిడ్ –జిల్లాలో అనుమానిత డెంగీ జ్వరాలు కర్నూలు(హాస్పిటల్): ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారులు ఉన్నపలంగా మంచానపడుతున్నారు. విపరీతమైన జ్వరం, కళ్లు ఎర్రగా కావడం, ఒళ్లంతా నొప్పులతో అల్లాడుతున్నారు. దీనికితోడు జలుబు, దగ్గు సరేసరి. ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికితోడు ఇప్పటికే పక్క జిల్లా కడపలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు ఈసారి బాగానే కరుస్తుండటం, వాతావరణం సైతం ఎప్పుడూ చల్లగా ఉండటంతో వైరస్లు విజృంభిస్తున్నాయి. వర్షపునీరు, ఇతర వ్యర్థాలు తోడై భూమి పొరల్లోని వైరస్లు, బ్యాక్టీరియా విస్తృతమై ముందుగా వ్యాధినిరోదక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగానికి ప్రతిరోజూ 200లకు పైగా చిన్నపిల్లలు ఓపీ చికిత్సకు వస్తున్నారు. అందులో 100కు పైగా వైరల్‌ఫీవర్ కేసులే ఉంటున్నాయి. రోజూ 25 నుంచి 30 మంది దాకా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ప్రై వేటు చిన్నపిల్లల వైద్యుల వద్దకు సైతం ఇంతే నిష్పత్తిలో చిన్నపిల్లలు వైరల్ఫీవర్లతో వెళ్తున్నారు. కర్నూలులో 40 మందికి పైగా చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉన్నారు. ఇక నంద్యాల, ఆదోనిలలోనూ వీరి సంఖ్య మరో 50 దాటుతోంది. ప్రతి ఒక్కరి వద్దా ఈ సీజన్లో రోజూ 30 నుంచి 50 మంది దాకా వైరల్ఫీవర్లతో పిల్లలు చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు కలుషిత నీరు తాగడంతో టైఫాయిడ్, అతిసారం, పచ్చకామెర్లు వంటి వ్యాధులు సైతం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. గత నెలలో కడప జిల్లాకు చెందిన డెంగీ అనుమానిత పిల్లల రక్తాన్ని పరీక్ష నిమిత్తం పంపగా 40 మందిలో 22 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ చిన్నారికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ నెలకు సంబంధించి ఇప్పటికే 40కి పైగా రక్తపు నమూనాలను పరీక్షకు కర్నూలు మెడికల్కాలేజిలోని మైక్రోబయాలజి డిపార్ట్మెంట్కు పంపించారు. మరో రెండు రోజుల్లో ఈ నివేదికలు వచ్చే అవకాశం ఉంది. అయితే డెంగీ లక్షణాలతో ఆసుపత్రిలో చేరే చిన్నపిల్లల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి –సాధ్యమైనంత వరకు పిల్లలను చల్లని వాతావరణానికి దూరంగా ఉంచాలి. –శుభ్రమైన గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. –కాచిచల్లార్చిన నీటిని, ఫ్యూరిఫైడ్(శుద్ధిచేసిన) నీటిని మాత్రమే తాగించాలి. –తాగునీటిని శుభ్రపరిచేందుకు ఒక బిందె నీళ్లలో ఒక క్లోరిన్ బిళ్లను వేసి, అరగంట తర్వాత ఆ నీటిని తాగాలి. –జనసమర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో పిల్లలను తీసుకోకపోవడమే మంచిది. –ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలి. పిల్లలు పడుకునే గదుల్లో దోమతెరలు ఉపయోగించాలి. –మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. –తినే ఆహారంపై తప్పనిసరిగా మూతలు ఉంచాలి. –వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని, బాగా మగ్గిన పండ్లను తినకూడదు. –రోడ్లపై తినుబండారాలకు దూరంగా ఉండటమే మేలు. – ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సీజనల్ వ్యాధులను అశ్రద్ధ చేయొద్దు –డాక్టర్ జి. రమాదేవి, చిన్నపిల్లల వైద్యులు, పెద్దాసుపత్రి సీజనల్లో చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులను ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం, విపరీతమైన ఒళ్లునొప్పులతో కూడిన జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్ క్రిములు, బ్యాక్టీరియా కారక వ్యాధులు అధికంగా వస్తున్నాయి. ఆసుపత్రిలో శుక్ర, శనివారాల్లో సాధారణంగా ఓపీ తక్కువగాఉంటుంది. కానీ ఈ రెండురోజుల్లో ఓపీ బాగా పెరిగింది. -
చంపేస్తోన్న ’చలి’ పులి
-
విమానాల్లో చార్జీల మోత!!