set
-
'కల్కి'లో చూపించిన కాశీ ఇదే.. సెట్ ఇలా ఉందా? (ఫొటోలు)
-
లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (లాసెట్)లో ఈ ఏడాది 72.66 శాతం మంది అర్హత సాధించారు. మూడేళ్ల కాలపరిమితి ఉన్న లా కోర్సులో 73.27 శాతం, ఐదేళ్ల లా కోర్సులో 65.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పోస్టు–గ్రాడ్యుయేషన్ లాసెట్ (పీజీఎల్‌సెట్)లో 84.65 శాతం మంది అర్హత సాధించారు. లాసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా లాసెట్ కన్వినర్ బి.విజయలక్ష్మి మాట్లాడుతూ, మూడేళ్ల లా కోర్సుకు 27,993 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 25,510 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఐదేళ్ల కోర్సుకు 8,412 మంది హాజరుకాగా, 5,478 మంది ఉత్తీర్ణులయ్యారని, పీజీఎల్‌సెట్‌కు 3,863 మంది హాజరుకాగా, 3,270 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లాసెట్, పీజీఎల్‌సెట్‌కు ఈసారి మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా, 40,268 మంది హాజరయ్యారని చెప్పారు.వారిలో 29,258 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి లాసెట్‌కు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు హాజరైన నలుగురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ జి.బి.రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. టాపర్లు వీరే.. మూడేళ్ల లా కోర్సులో హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేడ్కర్ 97.49 మొదటి ర్యాంకు, గచ్చిబౌకి చెందిన ప్రత్యూష్ సరస 96.65 రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేష్ 95.74 మార్కులతో మూడు ర్యాంకు సాధించారు. అలాగే ఐదేళ్ల లా కోర్సులో మియాపూర్‌కు చెందిన శ్రీరాం బొడ్డు 87 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, కామారెడ్డికి చెందిన పిప్పిరిశెట్టి దినేష్ 87 మార్కులతో రెండో ర్యాంకు, మల్కాజిగిరికి చెందిన ఆర్పీ విజయనందిని 84 మార్కులతో మూడు ర్యాంకు పొందారు. పీజీఎల్‌సెట్‌లో సికింద్రాబాద్‌కు చెందిన పెరి బాలసాయి విష్ణువర్ధన్ 76 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన అభినీతి జాసన్ 70 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిమన్ సిన్హా 67 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారు. -
ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్!!
ఏఐ సాంకేతికత ప్రస్తుతం ఓ ప్రభంజనంలా దూసుకుపోతోంది. రోజుకో కొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ..అన్నింటిని ఏఐతో చక్కపెట్టేసుకోవచ్చు అనేంతగా శరవేగంగా వెళ్లిపోతుంది. మొన్నటి వరకు ఎంప్లాయిస్ లేకుండా జస్ట్ ఏఐ సాంకేతికతో ఎంప్లాయిస్‌ని సృష్టించి వర్క్ పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అసలే నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటే మళ్లీ ఇదా! అని అంతా బెంబేలెత్తిపోయారు. ఇప్పడూ ఏకంగా ప్రేమ, సాన్నిహిత్యం, ఓ కంపెనీ వంటివి కూడా ఏఐ సాంకేతికతోనా!. ఔను! మీరు వింటుంది నిజమే..! ఓ మహిళ ఏఐతో రూపొందించిన హోలోగ్రామ్‌ని వివాహం చేసుకుంటుందట. ఈ షాకింగ్ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెయిన్‌కి చెందిన పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అలీసియా ఫ్రామిస్ అనే మహిళ కృత్రిమ మేధతో రూపొందించిన హోలోగ్రామ్‌ని పెళ్లి చేసుకోనుంది. డిజిటల్ సంస్థ మెషిన్ లెర్నింగ్ అండ్ హోలోగ్రామ్ సాంకేతికతో కూడిన మనిషిని రూపొదించినట్లు తెలిపింది. అంతేగాదు తమ వివాహం కోసం పెళ్లిమండపాన్ని కూడా బుక్ చేసుకుందట. ఈ ఏడాది రోటర్‌డామ్‌లోని మ్యూజియంలో ఆమె వివాహం జరగనుంది. ఇక ఆమె పెళ్లి చేసుకోనున్న ఏఐ హోలోగ్రామ్ పేరు అలెక్స్. తన భావోద్యేగాలన్నింటిని పంచుకునేలా ఈ హోలోగ్రామ్‌ని రూపొందించినట్లు తెలిపింది. తన వర్చువల్ భాగస్వామి మద్య వయస్కుడైన వ్యక్తిగా ఉన్నాడని చెబుతోంది. 'హైబ్రిడ్ కపుల్' అనే కొత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హోలోగ్రామ్‌ని డిజైన్ చేసినట్లు అలీసియా పేర్కొంది. ఇప్పుడూ ఏఐ సాంకేతికతను ప్రేమ, సాన్నిహిత్యం, వంటి సరిహద్దులను అందుకునేలా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపింది.. ఇంతవరకు ఐఏ సాంకేతికతను కవిత్వం కళల దిశగా ప్రయోగాలు చేయలేదని పేర్కొంది. తన భాగస్వామితో కొనసాగనున్న కొత్త జీవితం గురించి ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించనుందని అలీసియా తెలిపింది. అలాగే తన వర్చువల్ భాగస్వామిని జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, అతనితో మసులకోవాలో అనే వాటి గురించి కలలు కంటున్నట్లు వెల్లడించింది. అంతేగాదు తమ వివాహ దుస్తులను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అలీయాసీ తన ఇన్‌స్టాగ్రాంలో తన భాగస్వామి అలెక్సీతో కలిసి దిగిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో రోబోలు, హోలోగ్రామ్లోతో ప్రేమ, శృంగార జీవిత అనివార్యం అనేది గొప్ప వాస్తవం. అయితే వారు గొప్ప సహచరులుగా సానుభూతిని వ్యక్తపర్చగలరని రాసుకొచ్చింది. ఫోన్లు ఒంటరితనం నుంచి రక్షించి జీవితంలోని శూన్యాన్ని దూరం చేశాయి. అలాగే ఈ హోలోగ్రామ్‌లు మన ఇళ్లల్లో ఉంటూ మనతో ఇంటరాక్టివ్ అవుతూ ఉనికిని చాటుకుంటాయని అంటోంది అలీసియా. అందుకోసం తన స్నేహితురాలి జీవితాన్ని ఉదాహరిస్తూ..తన స్నేహితురాలు భర్త చనిపోవడం వితంతువుగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఆమెకు భర్త లేని లోటుని భర్తీ చేయడం కష్టం అని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడూ ఈ ఏఐ మానవ సహచరులు మనకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు అని ధీమాగా చెబుతోంది. మనం ఇష్టపడ్డ ఇష్టపకపోయినా కొత్త తరం ప్రేమ పుట్టుకొస్తుంది. హోలోగ్రామ్‌లు, రోబోలను పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి అని చెబుతోంది అలీసియా. ఇక భాగస్వామ్య సహచర్యం కూడా ఏఐ మాయతోనేనా..!. (చదవండి: నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?) -
అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. -
నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి సెట్ వేస్తే ఆ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు కూల్చేశారు...
-
కొత్త ఇంటికి! హీరో మహేశ్‌బాబు.. ఎందుకంటే?
హీరో మహేశ్‌బాబు కొత్త ఇంటికి వెళ్లనున్నారట. అయితే ఇది ఆయన నటిస్తున్న తాజా చిత్రం కోసమే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో షురూ కానుందని తెలిసింది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ఓ ఇంటి సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. -
రవితేజ కొత్త సినిమా.. ఆ సీన్ కోసం రూ. 5 కోట్లతో భారీ సెట్
ఏ సినిమాలో అయినా క్లయిమాక్స్ ఫైట్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. ప్రత్యేకించి ఆయా హీరోల అభిమానులైతే తమ హీరో విలన్లను రఫ్ఫాడిస్తుంటే విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. హీరో రవితేజ కూడా తన తాజా చిత్రం ‘రావణాసుర’ కోసం విలన్ల భరతం పడుతున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లు. ఈ చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్రధారి. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రూ.5 కోట్లతో వేసిన సెట్లో ఫైట్ వస్టర్ స్టన్ శివ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. -
నాని 'దసరా' మూవీ హీరోయిన్ ఎవరంటే..
Nani's Dasara Movie: నాని మంచి జోరు మీదున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘అంటే.. సుందరానికీ!’ చిత్రం షూటింగ్‌ని ఇటీవల పూర్తి చేసిన ఆయన తర్వాతి చిత్రం ‘దసరా’పై దృష్టి పెట్టారు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం 12 కోట్ల బడ్జెట్‌తో పల్లె వాతావరణం సెట్‌ని రూపొందిస్తున్నారట. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కోసం ఐదెకరాల్లో కోల్కత్తా సెట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దిన అవినాష్ కొల్ల ‘దసరా’ కోసం విలేజ్ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల్లో గ్రామీణ నేపథ్యం ఉట్టి పడేలా సెట్ రూపొందిస్తున్నారని తెలిసింది. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. అందుకు తగ్గట్లుగానే సెట్‌ని తీర్చిదిద్దుతున్నారట అవినాష్. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. -
నాని ‘దసరా’కోసం 12 ఎకరాల్లో భారీ సెట్.. ఖర్చు ఎంతంటే..?
నేచురల్ స్టార్ నాని కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. గతేడాది డిసెంబర్లో ‘శ్యామ్ సింగరాయ్’తో చాలా గ్యాప్ తర్వాత థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు నాని. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు నానికి మంచి పేరుని సంపాదించిపెట్టింది. ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీ తర్వాత ‘అంటే సుందనానికి..’పై ఫుల్ ఫోకస్ పెట్టాడు నాని. ఇటీవల షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. (చదవండి: అరుదైన రికార్డు నెలకొల్పిన శ్యామ్ సింగరాయ్) త్వరలోనే మరో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘దసరా’అని టైటిల్ పెట్టారు. నాని పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుంది చిత్రబృందం. ఈ సినిమా కోసం ప్రతేకంగా విలేజ్ సెట్‌ని ఏర్పాటు చేయబోతున్నారట. దీని కోసం ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 12 ఎకరాల్లో ఈ సెట్‌ని ఏర్పాటు చేస్తున్నారట. ‘శ్యామ్ సింగరాయ్’కోసం కోల్‌కతా సెట్‌ని తీర్చిదిద్దిన ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్ల ఈ సెట్‌ని రూపొందించబోతున్నారు. సినిమాలోని కీలక సన్నీవేశాలను ఈ సెట్లోనే చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. -
'పుష్ప' మూవీ కోసం 25 సెట్స్ వేశాం: ఆర్ట్ డైరెక్టర్స్
Pushpa Art Director Rama Krishna Reveals Secrets Of Pusha Sets: ‘‘ఎర్రచందనం నేపథ్యంలో సాగే ‘పుష్ప’ సినిమా కోసం కృత్రిమంగా అడవిని సృష్టించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రేక్షకులకు సెట్ అనే భావన రాకుండా ఒరిజినల్ ఫీలింగ్ కలిగించేలా సెట్స్ వేయడం సవాల్‌గా నిలిచింది’’ అని ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ–మౌనిక అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘పుష్ప’కి ఆర్ట్ డైరెక్టర్స్‌గా చేసిన రామకృష్ణ–మౌనిక విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌గారితో ‘పుష్ప’కి పని చేశాం. ఆయనతో ఒక్కసారి కనెక్ట్ అయితే మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు మంచి విలువ ఇస్తారు. ‘పుష్ప’ సినిమా కోసం మొత్తం 25 సెట్స్ వేశాం. నిర్మాతల తపన, ధైర్యం వల్లే సెట్స్ గ్రాండ్‌గా వేయగలిగాం. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ వల్ల కేరళలోని ఓ జలపాతం వద్ద షూటింగ్ చేయడానికి వీలు కాలేదు.. దీంతో ఆ జలపాతం సెట్‌ని కూడా హైదరాబాద్‌లోనే వేశాం. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే బన్నీగారు (అల్లు అర్జున్) సెట్స్ బాగున్నాయని అభినందించారు. కొన్ని సన్నివేశాలు అడవుల్లో, మరికొన్ని సెట్స్‌లో తీసినా ఏది నిజమైన అడవో? ఏది సెట్టో అనేది ప్రేక్షకులకు తేడా తెలియకూడదని కష్టపడ్డాం. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చేస్తున్నాం’’ అన్నారు. -
సెట్.. రీసెట్!
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. కోల్కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు కోల్‌కత్తాలో జరిగింది. అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్‌కు అంతరాయం కలగడంతో హైదరాబాద్ వచ్చేసింది యూనిట్. పైగా లాక్‌డౌన్‌తో కోల్కత్తా వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ప్రత్యేకంగా ఆరున్నర కోట్లతో కోల్‌కత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులతో సెట్ నిర్మించారు. లాక్డౌన్ ముందు వరకూ ఈ సెట్లో కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ సెట్ దెబ్బతింది. ఇప్పుడు సెట్‌ని పునర్నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల ఖర్చు అవుతుందట. ఇంకొన్ని రోజుల పాటు ఈ సెట్లో చిత్రీకరణ జరగాల్సిన నేపథ్యంలో వేరే దారిలేక సెట్‌ని రీసెట్ చేయాలనుకుంటున్నారు. -
డ్యామెజ్ అయిన ‘శ్యామ్ సింగరాయ్’ సెట్!.. కోట్లలో నష్టం
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కోసమే హైదరాబాద్‌లో కోల్‌కత్తాని సృష్టించి భారీ సెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కోల్‌కత్తాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో ఈ సెట్‌ను నిర్మించారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా లాక్డౌన్ కారణంగా షూట్ నిలిచిపోయింది. అయితే హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 'శ్యామ్ సింగ రాయ్' కోసం నిర్మించిన సెట్ డామేజ్ అయినట్లు సమాచారం. దీని వల్ల దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. దీంతో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలకు అదనపు భారం పడనుందని టాక్ వినిపిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి : ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమా చేయలేకపోతున్నా: నాని హీరో సుధీర్‌బాబు భార్య పద్మిణి గురించి ఈ విషయాలు తెలుసా? -
భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ యాంకర్
-
షాకింగ్ వీడియో: లైవ్‌లో యాంకర్‌పై కూలిన స్టూడియో సెట్టు
బొగోటా: కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్‌లో ఉన్న యాంకర్‌పై ఉన్నట్టుండి స్టూడియో సెట్టులోని ఓ భాగం కూలింది. అయితే అదృష్టవశాత్తు అతడికి పెద్దగా గాయాలేం కాలేదు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. యాంకర్‌పై సెట్టు కూలిన సమయంలో అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా షో కంటిన్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కార్లోస్ ఓర్డుజ్ అనే యాంకర్ కొలంబియా ఈఎస్పీఎన్కు చెందిన ఒక షో ప్యానెలిస్టులలో సభ్యుడు. ఈ క్రమంలో ఈ నెల 10న షో నిర్వహిస్తుండగా.. సెట్లో ఉన్న భారీ మానిటర్ లాంటి నిర్మాణం అతనిపై పడింది. దాంతో అతడి ముఖం డెస్క్‌కు తగిలింది. ఈ ఘటనలో అతడు డెస్క్‌కు అతుక్కుపోయినట్లు కనిపించడం వీడియోలో చూడవచ్చు. ఇక ఇదే షోలో ఓర్డుజ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నారు. యాంకర్‌పై సెట్ కూలడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి తేరుకుని.. కాసేపు షోని కంటిన్యూ చేసి.. ఆ తర్వాత బ్రేక్ అని చెప్పి.. కట్ చేశాడు. వెంటనే ఓర్డుజ్ని లేపి ఆస్పత్రికి తరలించారు. అతడికి పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు వైద్యులు. ఈ క్రమంలో తన గురించి కంగారు పడినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు ఓర్డుజ్. సెట్ కూలిన ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్ ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?.. -
ఆలస్య రుసుము అంతనా?
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా సంక్షోభం.. పనుల్లేవ్.. పైసల్లేవ్..! అందరికీ ఇబ్బందులే.. ఇక ప్రైవేటు ఉద్యోగులు, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) ఆలస్య రుసుముల పేరుతో సెట్ కమిటీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఓ విధానం అంటూ లేదు. రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు ఆలస్య రుసుము విధిస్తున్నాయి. ఒక్కో సెట్ ఒక్కో రకంగా ఆలస్య రుసుమును వసూలు చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పోనీ పరీక్షల సమయం వచ్చేసింది.. ఇప్పటికిప్పుడు వారికి హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు చాలా కష్టం.. పైగా ఆయా విద్యార్థులు ఇన్నాళ్లు దరఖాస్తు చేసుకోకపోవడం తప్పు అన్న పరిస్థితి.. ఇప్పుడు లేనేలేదు. ఇంకా నెల రోజుల వరకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశమే కనిపించడం లేదు. అయినా దరఖాస్తులకు ఆలస్య రుసుములు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ విద్యార్థుల నుంచి దండుకుంటుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం గతంలో ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు ఉచితంగా దరఖాస్తుల సబ్మిట్ చేసే అవకాశం ఇవ్వలేదు. గతంలో ఫీజు చెల్లించినా.. ఇప్పుడున్న ఆలస్య రుసుమును చెల్లిస్తేనే దరఖాస్తులను స్వీకరిస్తామని వెబ్సైట్లో పెట్టడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తుల గడువును ముగించేశాయి.. పరీక్షల తేదీలు లేకపోయినా మెున్నటివరకు దరఖాస్తుల గడువును పలు సెట్ కమిటీలు ముగించేశాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా 4 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.. కానీ దరఖాస్తులను సబ్మిట్ చేయలేకపోయారు. సైట్ ఓపెన్ చేసిన తరువాత ఫీజు చెల్లించారు.. ఆ తరువాత దరఖాస్తు ఫాం ఓపెన్ కావడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది నిర్దేశిత సర్టిఫికెట్లు, ఇతర వివరాలు ఆ సమయంలో అందుబాటులో దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన దరఖాస్తుల గడువును పొడిగించేలా సెట్ కమిటీలను ఆదేశించారు. దీంతో పలు సెట్ కమిటీలు దరఖాస్తుల గడువును పొడిగించాయి. అయితే ఇక్కడ మరో మెలిక పెట్టాయి. ఫీజు చెల్లించినా ఆలస్య రుసుము కట్టాల్సిందే.. దరఖాస్తుల గడువును కొన్ని సెట్స్‌కు ఈనెల 20 వరకు, మరికొన్నింటికి ఈనెల 25 వరకు, కొన్ని ఈనెల 31 వరకు ఆలస్య రుసుముతో పొడిగించాయి. గతంలోనే ఫీజు చెల్లించి, దరఖాస్తులను సబ్మిట్ చేయలేని వారు కూడా ఇపుడు విధించే ఆలస్య రుసుమును చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఐసెట్‌కు గతంలో ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ చేయనివారు 1,358 మంది ఉన్నారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. ఎడ్‌సెట్ దరఖాస్తులను సబ్మిట్ చేయని వారు 685 మంది రూ. 2 వేలు, లాసెట్ ఫారాలు సబ్మిట్ చేయని వారు 751 మంది రూ. 4 వేలు, ఈసెట్, ఎంసెట్ విద్యార్థులైతే రూ.10 వేలు ఆలస్య రుసుమును చెల్లిస్తేనే దరఖాస్తులను సబ్మిట్ చేసేలా అవకాశం ఇచ్చారు. -
కడపలో తమిళనాడు!
ఏంటి బాస్.. కడపలో తమిళనాడు ఏంటి? ఏదో రాయాలనుకుని ఏదో రాసేసినట్లున్నారే? అని కన్ఫ్యూజ్ అవ్వొద్దు. సినిమా అంటే సృష్టించడమే కదా. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కడపలో తమిళనాడుని తలపించే సెట్ వేయాలనుకుంటున్నారట. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘2.0’ నవంబర్ 28న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. దాంతో ‘ఇండియన్’కి సీక్వెల్‌గా తీయాలనుకుంటున్న ‘ఇండియన్2’ సినిమాపై శంకర్ దృష్టి పెట్టారు. ఛాయాగ్రాహకుడు రవి వర్మన్‌తో కలసి హెలికాప్టర్లో కడపలో వాలిపోయారు. సినిమాకి అనువైన లొకేషన్స్ వెతుకుతున్నారు. తమిళనాడుని తలపించే సెట్ కూడా కడపలో వెయ్యాలనుకుంటున్నారట. ఇదే సినిమా కోసం థాయ్‌ల్యాండ్‌లో లొకేషన్స్ వెతికారు ఈ ఇద్దరూ. ఇప్పుడు కడప. నెక్ట్స్ ఎక్కడో? ఫస్ట్ పార్ట్‌లో నటించిన కమల్‌హాసన్ సెకండ్ పార్ట్‌లోనూ హీరోగా నటించనున్నారు. -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 విశ్వ విద్యాలయాల్లో త్వరలో చేపట్టనున్న 1,061 అధ్యాపక నియామకాల్లో 100 మార్కుల వెయిటేజీతో స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెట్/స్లెట్/సెట్ ఉన్న సబ్జెక్టులకు రాత పరీక్ష లేకుండానే వెయిటేజీ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా ఈ విధానాన్ని సూచించింది. ఈ మేరకు ఈనెల 19న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య నియామకాల మార్గదర్శకాలను పేర్కొంటూ జీవో 2ను జారీ చేశారు. ఇందులో గరిష్టంగా 50 మార్కులు అకడమిక్ రికార్డులకు, 30 మార్కులు సబ్జెక్టు నాలెడ్జి, టీచింగ్ స్కిల్స్‌కు, 20 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించాలని స్పష్టం చేశారు. నెట్/స్లెట్/సెట్ లేని సబ్జెక్టులకు రాత పరీక్ష నెట్/స్లెట్/సెట్ లేని టెక్నికల్/ఇంజనీరింగ్/ఇతర ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించి మాత్రం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పుడు జవాబుకు పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష సిలబస్, పరీక్ష విధానం గేట్ తరహాలో ఉంటుంది. అయితే ఆ 100 మార్కులకు వాటిని 14 మార్కులకు నార్మలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయా సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థికి పీహెచ్డీ ఉంటే పీహెచ్‌డీకి 7 మార్కులను కేటాయించాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులను మాత్రం మరో 7 మార్కులకు నార్మలైజ్ చేయాలి. మార్గదర్శకాల్లోని మరిన్ని అంశాలు.. పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశాక, అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతి యూనివర్సిటీ.. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సబ్జెక్టు వారీగా స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేయాలి. అందులో సంబంధిత సబ్జెక్టు డీన్, వైస్ చాన్స్‌లర్ నామినీ, ఇతర యూనివర్సిటీల నుంచి సబ్జెక్టు నిçపుణుడు, ఉన్నత విద్యా మండలి నామినేట్ చేసే సబ్జెక్టు నిపుణుడు, డిపార్ట్మెంట్ హెడ్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఉండాలి. -
నేడు ఏపీ సెట్
13 కేంద్రాలు 6623 మంది అభ్యర్థులు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : రాజమహేంద్రవరంలోని 13 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించే ఏపీ సెట్-2017 పరీక్షలకు గానూ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కేంద్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6623 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.సురేష్ వర్మ తెలిపారు. శనివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీ సెట్ పరీక్షలు రాసే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో ఉదయం 9 గంటలకు సంబంధిత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఆలసమైతే అనుమతించేది లేదన్నారు. రాజమహేంద్రవరంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ టి.మురళీకృష్ణ, అసోసియేట్ రీజనల్ కోఆర్డినేటర్ ఎన్. సూర్యరాఘవేంద్ర, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ అశోక్, డాక్టర్ సింహాచలం పాల్గొన్నారు. -
నన్నయ సెట్ ఫలితాల విడుదల
- 48 గంటలలోపే ఫలితాలు వెల్లడి - విద్యార్థినుల హవా రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికి ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నన్నయ సెట్) 2017 ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కేవలం 48 గంటలలోపే విడుదల చేశామని ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు చెప్పారు. ఇది సమష్టి కృషి ఫలితమని పేర్కొంటూ, అందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ పరీక్షలకు విశాఖపట్నంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న 5606 మందిలో 5051 మంది నన్నయ సెట్‌కు హాజరు కాగా వారిలో ఎక్కువమంది విద్యార్థినులే కావడం విశేషమని వీసీ అన్నారు. ఫలితాల్లో కూడా వారి హవా కొనసాగిందన్నారు. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన ర్యాంకులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 16 నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లోని ఆదిత్య కళాశాలలు, ఏలూరులోని సెయింట్ థెరీస్సా కళాశాల, భీమవరంలోని సీఎస్ఎస్ కళాశాల, అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ జరుగుతాయన్నారు. ఎప్పటికప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని వీసీ చెప్పారు. నన్నయ సెట్లో సబ్జెక్టుల వారీగా మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు వరుసగా.. లైఫ్ సైన్స్ : గొల్లపల్లి విజయదుర్గ (వాకతిప్ప) 65 మార్కులు, కాదులూరి పూర్ణశ్రీప్రజ్ఞ్ఞ (ఇసుకపల్లి) 64 మార్కులు, కుసుమ హేమశ్రీ (ముక్కామల) 63 మార్కులు. ఫిజికల్ సైన్స్ : కూచుభొట్ల మహతి (జగ్గయ్యపేట) 74 మార్కులు, నిడదవోలు వెంకట ఆనంద్ (మండపేట) 73 మార్కులు, వంగపండు అనూష (విశాఖపట్నం) 65 మార్కులు. మేథమెటికల్ సైన్స్ : కీర్తి కనకకృష్ణ (తుని) 90 మార్కులు, నందికొట్ల వీరకనకదుర్గ (అంబాజీపేట) 90 మార్కులు, చింతలపూడి హేమ (బిక్కవోలు) 86 మార్కులు. కెమికల్ సైన్స్ : సబ్బారపు రమ్య (రాజమహేంద్రవరం) 88 మార్కులు, మహాదశ లక్ష్మీమేఘన (పాలకొల్లు) 84 మార్కులు, గుండుగొల్లు మోహన వెంకట ఏఆర్‌సీహెచ్ (రాజమహేంద్రవరం) 80 మార్కులు. జియాలజీ : బొర్రా నరేష్ (రాజమహేంద్రవరం) 54 మార్కులు, తాడికొండ సాయి ఉమామహేశ్వరరావు (తాడేపల్లిగూడెం) 54 మార్కులు, జుట్రు హెప్సీ (జువ్వలపాలెం) 48 మార్కులు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ : మేడపోతుల తమ్మన (జగ్గంపేట) 75 మార్కులు, కొల్లి శ్రీనివాసమహాదేవ (రాజమహేంద్రవరం) 75 మార్కులు, బొరుసు సాల్మన్‌బాబు (కాకినాడ) 72 మార్కులు. ఇంగ్లిష్ : మేడవరపు సీతారామ కనక సుబ్రహ్మణ్యం (మండపేట) 88 మార్కులు, నందేటి అజయ్‌ఘోష్ (నూజివీడు) 85 మార్కులు, దేవరపల్లి నీహారిక (టి.నర్సాపురం) 85 మార్కులు. తెలుగు : దేవరకొండ ప్రవీణ్‌కుమార్ (విశాఖపట్నం) 67 మార్కులు, ఉపాధ్యాయుల ఎన్.శాస్త్రి (విజయనగరం) 66 మార్కులు, చాపల వెంకట్రాజు (కొవ్వూరు) 61 మార్కులు. -
టీఎస్ సెట్ గడువు పెంపు
హైదరాబాద్: టీఎస్ సెట్-2017 ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సెట్ సభ్య కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ మేరకు ఈనెల 20గా పేర్కొన్నప్పటికీ అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 27వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి, అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
హృదయంగమం.. పరమశివుని ధామం
కోనసీమకు దిగి వచ్చిన హిమగిరి క్షేత్రం అమలాపురంలో ఆకట్టుకుంటున్న ‘అమరనాథ్’ నమూనాలు శివరాత్రికి ఓం శాంతి ఆధ్వర్యంలో భారీ సెట్టింగులు అమలాపురం టౌన్ : హిమగిరి సీమలోని అమరనాథ్ గుహలు..వాటిలో మంచుతో రూపుదిద్దుకున్న అమరనాథు లింగం.. ఆ గుహల్లోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు.. ఇవి కాక వరసగా 108 శివలింగాలు.. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరాయి. సాక్షాత్తు పరమశివుడే ముచ్చటపడేంత మనోహరంగా రూపొందిన ఆ దివ్యధామం భక్తులను పరవశింపజేస్తోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం (ఓం శాంతి) అమలాపురం కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మాచిరాజువీధిలోని తటవర్తి వారి స్థలంలో ఏర్పాటుచేసిన అమరనాథ గుహలు, శివలింగాల భారీ సెట్టింగ్‌లు రాత్రి సమయాల్లో విద్యుద్దీపాల కాంతులతో భాసిల్లుతూ భక్తులను అయస్కాంతాలుగా ఆకట్టుకుంటున్నాయి. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ దివ్యధామాల సెట్టింగ్‌లను ఆర్డీవో జి.గణేష్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్‌లు మంగళవారం రాత్రి ప్రారంభించారు. 81వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం పేరుతో అమలాపురం ఓం శాంతి కేంద్రం ఇన్‌ఛార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. తెల్లటి మంచు గడ్డలతో ఉన్న అమరనా«థ్ గుహలు.. ఆ గుహల్లోకి వెళ్లే అపురూప మార్గం... అందులో మంచుతో ఉన్న అమరనాథ శివలింగాన్ని రూపాందించారు. అదే గుహల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా తీర్చిదిద్దారు. మరో చోట 108 శివ లింగాలు ఒకే చోట కొలువుదీరిన సెట్టింగ్ ఏర్పాటుచేశారు. ఇంకో చోట భారీ శివలింగాన్ని అమర్చారు. సర్వం శివమయంగా మారిన ఆ తావుకు రాత్రయితే చాలు.. పట్టణంలో దారులన్నీ మాచిరాజువీధికే అన్నట్టు.. విద్యుద్దీప కాంతుల్లో వెలిగే ఆ శివధామ దర్శనం కోసం భక్తులు వెల్లువెత్తుతున్నారు. ఈనెల 25∙వరకూ ఈ ప్రదర్శనలు ఉంటాయి. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
-
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?
ముంబై: ఆయిల్ ధరలు పుంజుకోవడంతో దేశంలో మరోసారి పెట్రో వడ్డనే తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పెరగడంతో పెట్రోల్ ధరలు పెరగొచ్చనే అంచనా మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఈ మాసాంతంలో జరిగే సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ భారీగానే పెంచే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్ఠ స్థాయిని తాకడం, ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ఇటీవల ప్రధాన ఆయిల్ ఉత్పత్తిదారులు అల్జీరియా అంగీకారం నేపథ్యంలో ఈ అంచనాలు నెలకొన్నాయి. అటు చమురు ధరల క్షీణతను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఉత్పత్తిని తగ్గించే దిశగా నాన్ ఒపెక్ దేశాలు కూడా సంకేతాలు ఇవ్వడంతో బ్రెంట్ నార్త్ సీ క్రూడాయిల్ బ్యారెల్ ధర సోమవారం 53.45 డాలర్లను తాకింది. సాధారణంగా రెండు వారాలకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం రంగ ఇంధనసంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోని పెట్రోల్,డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. వివిధ ప్రభుత్వ సుంకాలు ,అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు ఆధారంగా ఇది ఉంటుంది. కాగా గతరెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఆయిల్ ధరలు ఒపెక్ దేశాల సంచలన నిర్ణయంతో భారీగా పుంజుకున్నాయి. గత ఎనిమిదేళ్లో మొదటి సారి గత నెలలో జరిగిన ఒప్పందంతో చమురు ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. ఫిబ్రవరి బ్యారెల్30 డాలర్లకు దిగజారి 12 ఏళ్ల కనిష్టాన్ని నమోదుచేసిన ధరలు కీలక మద్దతు స్థాయిని 50 డాలర్లను అధిగమించాయి. మరోవైపు ఇస్తాంబుల్‌లో నిర్వహించిన వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తాము కూడా ఉత్పత్తిని తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటే భవిష్యత్తులో ఆ రంగానికి నిధులు అందించడం కష్టతరమన్న ఆయన ఇతర ఒపెక్ దేశాలు కూడా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. పెట్రోలియం ఎగుమతి దేశాల తదుపరం సమావేశం నవంబర్ 30 న వియన్నా లో జరగనుంది. -
చైనా నృత్యానికి గిన్నిస్ రికార్డు!
బీజింగ్ః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనా వాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులను సృష్టించడంలోనూ వారికి వారే సాటి. అదే నేపథ్యంలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ తమవైపు తిప్పుకున్నారు. కొన్ని వేలమంది ఒకే వేదికపై చేరి, నృత్య ప్రదర్శన చేసి ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించారు. చైనా వాసుల దృష్టి ఈసారి నృత్యం వైపు మళ్ళింది. బీజింగ్, షాంఘైతోపాటు మరో నాలుగు నగరాలను ఎంచుకొని, ఒకేవేదికపైకి చేరడమే కాదు.... ఏకంగా 31,697 మంది ఒకేసారి నృత్య కార్యక్రమంలో పాల్గొని దాదాపు ఐదు నిమిషాల పాటు అడుగులు కలిపి అందర్నీ ముగ్ధుల్ని చేయడంతోపాటు ప్రపంచ రికార్డును సైతం సాధించారు. నగరంలోని ప్రముఖ బర్డ్స్ నెస్ట్ స్టేడియం ముందు చేరి పెద్దా చిన్నా వయోబేధం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమంలో సమయానికి వర్షం నేనున్నానంటూ వచ్చి చేరింది. దీంతో నృత్యకారులంతా రెయిన్ కోట్లు ధరించి మరీ డ్యాన్స్ చేయడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరే ఉండి పర్యవేక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందించారు. సాధారణంగా మధ్యవయసు, వయసు మళ్ళిన మహిళలు పార్కులు, ప్లాజాల వంటి పబ్లిక్ ప్లేసుల్లో నృత్యం చేస్తుండటం చైనాలో చూస్తాం. అయితే ఆరోగ్యానికి సహకరించేదిగా భావించి పబ్లిక్ ప్లేసుల్లో చేసే డ్యాన్స్... దానితో పాటు పెట్టే భారీగ మ్యూజిక్ సౌండ్ ఒక్కోసారి చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు వేలమంది స్థానికులు కలసి ఒకేచోట చేపట్టిన నృత్య కార్యక్రమం మాత్రం అందర్నీ ఆకట్టుకోవడమే కాక రికార్డును కూడ తెచ్చి పెట్టింది. -
మ్యూజియంగా మారనున్న 'ప్రిన్స్' హోమ్
లాస్ ఏంజెలెస్ః పాప్ గాత్రంతో అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ గాయకుడు ప్రిన్స్ ఎస్టేట్... త్వరలో మ్యూజియంగా మారబోతోంది. 1980 లో స్వంత ఆల్బమ్స్ తో మొదలైన ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ ప్రస్థానం... ఆయన్ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చేసింది. 57 ఏళ్ళ వయసులో 21 ఏప్రిల్ 2016 న ప్రిన్స్ మినెసోట్టోలోని ఆయన స్వగృహంలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు ఆయన స్మారకార్థం సంగీత ప్రియులకు గుర్తుండిపోయేలా ఆయన నివసించిన పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చేందుకు నిర్ణయించారు. 'పర్పుల్ రైన్' హిట్ మేకర్ ప్రిన్స్... తన పాప్ గానంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. దీంతో ఆయన హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన గాయకుడు, మ్యూజిక్ లెజెండ్ ఫ్యాన్స్ మమనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు గుర్తుగా ప్రిన్స్ నివసించిన గృహం 'పైస్లే పార్క్ ఎస్టేట్' ను ఆయన స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయించినట్లుగా ఎటోన్ లైన్ డాట్ కామ్ నివేదించింది. ప్రిన్స్ సంగీతానికి జ్ఞాపక చిహ్నంగా పైస్లే పార్క్ ఎస్టేట్... ను మార్చనున్నట్లు ఆయన బంధువు ఫిలిప్స్ కూడ ఓ పత్రికకు తెలిపారు. అయితే తన నివాస గృహాన్ని మ్యూజియంగా మార్చాలన్న కోరిక ప్రిన్స్ కు ముందే ఉండేదని, అదే ఆలోచనతో ఆయన మరణించక ముందే ప్రిజర్వేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రిన్స్ సహాయకురాలు, మాజీ ప్రేమికురాలు షెయీలా ఓ పోస్ట్ లో వివరించారు. దాంతో పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చే పనులు కొనసాగించి ఆయన కోరికను తీర్చే ప్రయత్నం చేస్తామని ఆమె వివరించారు. ప్రిన్స్ సంగీతం ఎప్పటికీ నిలిచిపోవాలన్న ఆలోచనలో ఉండేవారని అందుకే తన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు సిద్ధ పడ్డారని, ఈ నేపథ్యంలో ఆయన డ్రమ్స్, మోటార్ సైకిల్ వంటి కొన్ని వస్తువులను సైతం సేకరించి పెట్టారని షెయీలా తెలిపారు. వచ్చిన అవార్డులు, రివార్డులపై ఆయనకు పెద్దగా శ్రద్ధ లేకపోయినా, ఫ్యాన్స్ నుంచి తనకు అందిన అభిమానానికి గుర్తుగా, వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరికతో వాటన్నింటిని ప్రిన్స్ హాలులో భద్రంగా ప్రదర్శనకు పెట్టారని షెయీలా తెలిపారు.