Shabbir Ali
-
కేటీఆర్ కు డ్రగ్స్ కు ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది: షబ్బీర్ అలీ
-
బీఆర్ఎస్కు 11 ఎకరాలెందుకు?: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. అలాగే, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనిఅయిపోయిందన్నారు.కాగా, షబ్బీర్ అలీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేతగా హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా?. శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా?. మా పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా?. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడుతున్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది. హైదరాబాద్‌లో 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు?. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. భూమి వేలం వేసి ఆ డబ్బులు రుణమాఫీకి వాడాలి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ. దానికి కూడా మేమే భూమి ఇచ్చాం. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారు. కేసీఆర్ తెలంగాణని అమ్మకానికి పెట్టారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ఆ గట్టూ నాదే..! ఈ గట్టూ నాదే..!!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ, ఆర్మూర్‌లలో పరిస్థితి ఒకలా ఉండగా, జిల్లా కేంద్రాలైన నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి సెగ్మెంట్లలో షబ్బీర్ అలీ పెత్తనం పట్ల పలువురు మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు గుస్సా అవుతున్నారు. షబ్బీర్ పేరు చెప్పుకుని కొందరు నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. దీంతో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన షబ్బీర్ అలీ ఓటమి చెందారు. ఓడినవారే నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు పదవి వచ్చింది.నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. మహేశ్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. మరోవైపు బీసీ కోటాలో కేబినెట్ రేసులోనూ ఉన్నారు. మహేశ్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో షబ్బీర్ కామారెడ్డిలో పెత్తనం చేస్తూనే నిజామాబాద్ అర్బన్‌లో హవా నడిపిస్తుండటం పట్ల ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి పనిచేసిన పలువురు రౌడీషీటర్లను సైతం షబ్బీర్ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డిలోనూ పలువురు అవకాశవాదులను పార్టీలోకి చేర్చుకుని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. మరోవైపు షబ్బీర్ తమ్ముడు, మేనల్లుడు, ఇతర బంధువులు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు సీనియర్ కార్యకర్తలు పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం గమనార్హం. -
డీఎస్ నా రాజకీయ గురువు : ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
నిజామాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో గల మూన్నూరుకాపు కల్యాణ మండపంలో ఆయనకు పార్టీ శ్రేణులు నిర్వహించిన సన్మానసభ మాట్లాడారు. కాంగ్రెస్‌లో కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తుందన్నారు. మారుమూల గిరిజన గ్రామమైన రాహత్‌నగర్ నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, టీపీసీసీలో పనిచేశానన్నారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఏం రేవంత్‌రెడ్డితో చొరవతోనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి కాంగ్రెస్‌కు చిప్ప ఇచ్చా రని శాసనమండలి సమావేశాలలో తాను ఎమ్మెల్సీ కవితతో అన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను తీరుస్తుందన్నారు. ప్రజాగ్రహానికి గురై కేసీఆర్ ఇంటికి పోయాడన్నారు. ప్రజల చేతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వదిలేసిన 30 వేల ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను అందించిందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో మరో లక్ష ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ (డీఎస్) తన రాజకీయ గురువని స్పష్టం చేశారు. 1983లో డీఎస్ ద్వారా తాను ఎన్‌ఎస్‌యూఐలోకి వచ్చినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. బీజేపీ ఓట్ల కోసం మతం, ప్రాంతాల వారీగా విభజన చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, నాయకులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీవిప్ ఈరవత్రి ఆనిల్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్, బాడ్సిశేఖర్గౌడ్, గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ భక్తవత్సలం(ఢిల్లీ), దిగంబర్పవార్, దిలీప్‌పవార్, అశోక్‌గౌడ్, జయసింహాగౌడ్, రామార్తి గోపి, ప్రీతం, వైశాక్షి సంతోష్, వేణుగోపాల్‌యాదవ్, రాజనరేందర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయిలు, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు షబ్బీర్ అలీ సీనియారిటీకి దక్కిన గుర్తింపు..
సాక్షి, కామారెడ్డి: ఎట్టకేలకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీనియారిటీకి గుర్తింపు దక్కింది. ఆయనను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల సలహాదారుగా నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మాజీ మంత్రి, పీఏసీ చైర్మన్ షబ్బీర్ అలీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడంతో కొంత నిరాశచెందారు. ఎమ్మెల్యేగా గెలుపొంది ఉంటే ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కేదని భావించారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న షబ్బీర్‌అలీ.. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం, తద్వారా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు) నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదేళ్లుగా అధికార పదవి లేకుండా ఉన్న షబ్బీర్ అలీకి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు హోదా లభించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా షబ్బీర్ అలీకి అధికారిక పదవి లభించడంతో కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారనున్నాయి. స్థానికంగా అధికార పార్టీ ఆధిపత్యం కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు, శ్రేణులు యాక్టివ్ అయ్యారు. దీనికి తోడు షబ్బీర్‌కు సలహాదారు పదవి రావడంతో వారు మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇవి చదవండి: అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. అదిరిన కొత్త లుక్.. -
స్వేదపత్రం పేరుతో కేటీఆర్‌వి పిల్ల చేష్టలు: షబ్బీర్ అలీ
సాక్షి, నిజామాబాద్: స్వేద పత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారుల నుంచి వివరాలు సేకరించి శ్వేత పత్రం విడుదల చేసిందని.. ప్రభుత్వ శ్వేత పత్రం తప్పు అని బీఆర్ఎస్ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే కేటీఆర్ తప్పులు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని వివరించారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 100 మందికి ఓ కౌంటర్ పెట్టి దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మీ సేవ కేంద్రాల్లో గంటల తరబడి క్యు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదీ చదవండి: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. -
సీఎంగా కన్ఫామ్ కాగానే రేవంత్ రెడ్డి నాతో చెప్పిన మాట ఇదే..!
-
ఓడితే మంత్రి పదవి ఇస్తారా?
-
ఐటీ మంత్రిగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు..?
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంత్రి పదవులపై చర్చ మొదలైంది. జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న దానిపై ఊహాగానాలు జోరందు కున్నాయి. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షబ్బీర్‌అలీ గురించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ సంస్థల యజమాని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కాలం కలిసొస్తే ఐటీ మంత్రిగా అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఎల్లారెడ్డి, జుక్కల్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు కూడా తొలిసారి విజయం సాధించారు. ఇందులో మదన్మోహన్రావు ఐటీ కంపెనీల యజమాని. ఆయన కు పార్టీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అదే ఆయనకు ఎల్లారెడ్డి టికెట్టు రావడానికి కారణమైంది. ఆయనకు మంత్రి మండలిలోనూ అవకాశం కల్పిస్తారని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అనుభవంతో పాటు పార్టీలో ఐటీ రంగానికి సంబంధించి వివిధ రకాల సేవలందించినందున ఆయనకు ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మైనారిటీ కోటాలో.. జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అప్పటి చెన్నారెడ్డి మంత్రిమండలిలో అవకాశం దక్కించుకున్నారు. తర్వా త 2004 ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. 2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, శాసన మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించింది. ఆయన 2014, 2018 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆయన నాలుగైదేళ్లుగా జనంలోనే ఉండి నిరంతరం పనిచేశారు. అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీకి దిగడంతో షబ్బీర్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి వచ్చారు. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి షబ్బీర్‌ను బరిలోకి దింపినా గెలవలేకపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షబ్బీర్‌కు మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లానుంచి గెలిచిన కాంగ్రెస్ నేతల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న విషయమై అంతటా చర్చలు నడుస్తున్నాయి. -
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
కేసీఆర్‌కు అబద్దాలు చెప్పడం అలవాటే: షబ్బీర్ అలీ
-
చూసుకుందాం.. దమ్ముంటే రా
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తడని అనంగనే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయి. జబ్బలు చరిచినోళ్లు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే కామారెడ్డి తెలంగాణ ఉద్యమాల గడ్డ. షబ్బీర్ అలీ అసోంటోళ్లు పోటీ నుంచి తప్పుకున్నరు. ఇగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి వస్తడట. రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే రా చూసుకుందాం. డిపాజిట్ కూడా దక్కనీయం. చిత్తుచిత్తుగా ఓడిస్తం. పోరాటాల గడ్డ మీద తెలంగాణ ద్రోహులకు స్థానం లేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ పోటీ చేస్తున్నడని తెలవంగనే కొందరు నాయకులు పోటీ నుంచి తప్పుకున్నరు. షబ్బీర్ అలీ పోటీ చేయనని పక్కన కూసున్నట్టు మీడియాలో చూసిన. కేసీఆర్ మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు మేకపోతును బలిచ్చినట్టే. గ్రామగ్రామాన ప్రజలే ఏకగ్రీవంగా కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నరు. పోటీ ఏకపక్షమే’అని పేర్కొన్నారు. కామారెడ్డికి గోదావరి తెస్తాం ‘పుట్టుక నుంచి చావు వరకు కేసీఆర్ పథకాలు ఇంటింటికీ చేరినయి అంటూ బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు వస్తది, ఏదేని పరిస్థితుల్లో ప్రాణాలు పోతే కేసీఆర్బీమాతో ఆదుకుంటాం’అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయన్నారు. కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ‘కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఎవరు చూసుకుంటరని కొందరు అంటున్నరు. ఇక్కడ ప్రత్యేక అధికారిని పెడతం. ఆయన పర్యవేక్షణలో అన్నీ జరుగుతయి. ఈ ప్రాంతానికి చెందిన ఆర్డీవో ముత్యంరెడ్డి గజ్వేల్‌లో ప్రత్యేకాధికారిగా పనిచేసి అక్కడి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అవసరమైతే ఆయన్నే ఇక్కడ పెట్టుకుని పాలన సాగించుకుంటాం. నాది పక్క నియోజక వర్గం సిరిసిల్ల.. నేను వారం, పదిరోజులకోసారి వస్తూపోతూనే ఉంట. ఇక మీదట కామారెడ్డిలో ఆగుత. ఇక్కడి ప్రజల కష్టాలను నేనే తీరుస్తా’అని కేటీఆర్ అన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చూస్తారని తెలిపారు. గంప గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించారని, ఇంకా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలా అభివృద్ధి జరగాలంటే సీఎం పోటీ చేయాలని గంప గోవర్ధన్ సీఎంను కోరడంతో పోటీకి సిద్ధమయ్యాడన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ విజయం సాధిస్తారని, ఇక్కడ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా? కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే వాళ్లు చేసిందేమి లేదని, ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మాలని కేటీఆర్ ప్రశ్నించారు.70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తున్నరా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా అని అన్నారు. సభలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తాం.... కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త చంద్రశేఖర్‌రెడ్డి సస్పెన్షన్‌పై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డిపై దౌర్జన్యం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తప్పుడు పనులు చేసేవారిని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని క్షమించేది లేదన్నారు. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
కామారెడ్డిలో పోటీపై షబ్బీర్ అలీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్ ఆలీ తేల్చిచెప్పారు. ‘కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’ అని తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్‌ఉండటంతోనే పోటీకి షబ్బీర్ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్‌పై పోటీకి దిగితే అది తన పొలిటికల్ కెరీర్‌పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే షబ్బీర్ అలీ పేరు ప్రకటించలేదా?
-
షబ్బీర్ అలీకి కొత్త టెన్షన్.. ప్రమాదంలో పొలిటికల్ కెరీర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటీకే కొందరు నేతలు పార్టీలు మారుతుండగా.. కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు మరికొందరు నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ.. ఇప్పటి వరకు పోటీ చేసిన స్థానాల్లో కాకుండా కొత్త చోట్ల బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని సమాచారం. కాగా, కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రత్యర్థిగా కేసీఆర్ ఉండటంతోనే పోటీకి ఆయన విముఖత చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న మదన్ మోహన్‌రావును కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. షబ్బీర్ అలీ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు.. మొదటి లిస్టులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్న(ఆదివారం) 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేకపోవడం విశేషం. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్! -
గజ్వేల్ మరో డల్లాస్.. ఏమైంది?
గజ్వేల్/తూప్రాన్: ‘గజ్వేల్‌ను మరో డల్లాస్, లండన్, న్యూయార్క్ చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించారు.. ఇక్కడికి వచ్చి చూస్తే అట్ల ఏమీ కనిపిస్తలేదు.. ఉన్న బస్టాండ్‌ను కూలగొట్టి రేకుల షెడ్డును నిర్మించిండ్రు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇంకా పూర్తి చెయ్యలే. గిదేనా..? మీరు చేసిన అభివృద్ధి? ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌లోనే కాదు.. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఓడిపోవడం ఖాయం’ అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. సోమవారం కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో అర్ధంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనులతోపాటు గజ్వేల్ పట్టణంలో బస్టాండ్, రింగు రోడ్డు, మినీ స్టేడియంను పరిశీలించారు. గజ్వేల్‌ను బంగారు తునకగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రకటన ల నేపథ్యంలో కామారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటిస్తున్నానని చెప్పారు. మంత్రులు చెబుతున్నదానికి ఇక్కడ పరిస్థితికి పొంతన లేదని విమర్శించారు. వర్గల్లో పేదలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 1,200 ఎకరాల భూమిని ఫుడ్ పార్కు పేరిట లాక్కుంటున్నారని ఆరోపించారు. తూప్రాన్‌లో పర్యటన.. మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డితో కలిసి తూప్రాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అల్లాపూర్ రోడ్డును పరిశీలించి ఇదే అభివృద్ధి అంటే..? అంటూ విమర్శించారు. -
కామారెడ్డి నుంచే కేసీఆర్ పతనం: షబ్బీర్ అలీ
న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గెలిస్తే ఫామ్‌హౌస్‌కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు. సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్ అనౌన్స్ చేశారని విమర్శించారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో కేసీఆర్‌కే దిక్కు లేకుండా పోయిందని, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు. పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చదవండి: మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. -
గంప గోవర్ధన్ పోటీచేస్తే ఓడిపోతారన్న ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ పోటీ
నిజామాబాద్: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పోటీచేస్తే ఓడిపోతారన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇక్కడినుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందన్నారు. హాథ్ సే హాథ్ జోడో, గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఉగ్రవాయిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను నిలువరించడానికి కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ నినాదం తెరపైకి వచ్చిందన్నారు. సీఎంను పోటీకి ఆహ్వానించానని గంప గోవర్ధన్ అనడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. గజ్వేల్‌లోని గ్రామాలను నీట ముంచి, ప్రస్తుతం కామారెడ్డిని ముంచడానికి వస్తున్నారా అని సీఎంను ప్రశ్నించారు. కామారెడ్డినుంచి కేసీఆర్, కేటీఆర్, కవితలలో ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, అమ్ముల ముకుందం, గోనె శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, నౌసిలాల్, చిన్నమల్లారెడ్డి సర్పంచ్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
టీకాంగ్రెస్ నేతలకు షాక్.. ఈడీ నోటీసులు జారీ!
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం. ఈ నోటీసులు కాంగ్రెస్ నేతలను అక్టోబర్ 10న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు. -
షబ్బీర్ అలీని సస్పెండ్ చేయండి : కోమటిరెడ్డి
-
రైతు సమస్యలపై క్షేత్రస్థాయికి కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను క్షేత్రస్థాయిలో రైతుసమస్యలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బృందాలు పర్యటించి రైతు సమస్యలపై నివేదికను టీపీసీసీకి అందించాలని శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. రైతుల సమస్యలపై జిల్లాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండకు చిన్నారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సంభాని చంద్రశేఖర్, మెదక్‌కు దాసోజు శ్రవణ్, వేం నరేందర్‌రెడ్డి, సిరిసిల్లకు మల్లు రవి, శివసేనారెడ్డి, కామారెడ్డి జిల్లాకు కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, ప్రీతమ్, మెట్టు సాయికుమార్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని, వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంట పొలాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకొని టీపీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 8న ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్‌ను ముట్టడించాలని, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు, దళితబంధు అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12, 13 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు: రేవంత్‌రెడ్డి సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరి వేస్తే ఉరేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన ఉద్యమించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో వరికుప్పపై రైతు గుండె ఆగి చనిపోతే సహజ మరణమని కలెక్టర్ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఆగమవుతున్నారని, కేసీఆర్‌కు రైతుల ఉసురు తగలడం ఖాయమని రేవంత్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, చిన్న రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్ను తగ్గిస్తే ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. మానవతా రాయ్, శివసేనా రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 12న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీని అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, హర్కర వేణుగోపాల్, ప్రీతం, మెట్టు సాయి, నర్సింహారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు పంపకాల్లో గొడవతోనే ఉపఎన్నిక!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక పార్టీల పంచాయతీ కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతోనే ఆ ఎన్నిక జరిగిందని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. సీఎం సీటు, డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశం అనంతరం మధుయాష్కీగౌడ్, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవితో కలసి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ పరాజయంపై పీఏసీ సమావేశంలో చర్చించామని చెప్పారు. ఓట్లెందుకు తగ్గాయి? అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగిందనే అంశాలపై చర్చించామని.. ఓటమిపై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక నవంబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో ప్రతి జిల్లాలోని నాయకత్వం స్థానికంగా పాల్గొంటుందని.. రోజుకు 7 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర నిర్వహణ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి ఈ నెల 9, 10 తేదీల్లో మండల, జిల్లా, డివిజన్ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. బీజేపీతో అంటకాగేది ప్రాంతీయ పార్టీలే.. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయన్న టీఆర్ఎస్ ఆరోపణలు సరికాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. గాడ్సేవాదంతో నడిచే బీజేపీతో గాంధేయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎప్పటికీ కలవదన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ప్రాంతీయ పార్టీలే బీజేపీ, అమిత్‌షా, మోదీలతో అంటకాగుతున్నాయని, టీఆర్ఎస్ కూడా బీజేపీకి మడుగులొత్తుతోందని విమర్శించారు. తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు? పేదోళ్ల రక్తతర్పణంతో వచ్చిన తెలంగాణను రాజకీయ వ్యాపార ప్రయోగశాలగా మార్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీ అభ్యర్థి రాజేం దర్ రూ.500 కోట్లు, అహంకారంతో టీఆర్ఎస్ నేతలు రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. డబ్బుల కోసం ఓటర్లు ధర్నాలు చేసే పరిస్థితిని సృష్టించాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలుక్షుద్ర రాజకీయాలతో తెలంగాణను ఎటు తీసుకెళుతున్నాయో మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అర్థం చేసుకోవాలన్నారు. -
నన్ను చెప్పనిస్తే ఉంటా.. లేదంటే వెళ్తా: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చించేందుకుగాను బుధవాంర గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి తప్పు పట్టారు. ‘‘నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా... లేదంటే సంతకం పెట్టి వెళ్ళిపోతా’’నంటూ జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..) ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ.. ఒక్కడి బాధ్యతే ఉండదన్నారు జానారెడ్డి. రేణుకా చౌదరి జానారెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీది బ్యాడ్ షో అని ఉత్తమ్, వీహెచ్, మదు యాష్కీ తెలిపారు. ఇప్పటికే మళ్లీ మీడియాతో మాట్లాడను అని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ వేస్తాం: షబ్బీర్ అలీ రెండు రోజుల పాటు మెంబర్ షిప్ డ్రైవ్‌పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం.. నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ లీడర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలను సమీక్షించుకున్నాం. హుజూరాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదు.కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఫైట్ అన్నారు. ‘‘టీఆర్ఎస్, బీజేపీలు 6 నుంచి 10 వేలు పెట్టి ఓక్కో ఓటు కొన్నారు. ఈటల రాజెందర్ ఎక్కడ తాను బీజేపీ అని చెప్పలేదు. ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తాం’’ అని షబ్బీర్ అలీ తెలిపారు. -
15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందని అన్నారు. గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
TS: ‘కోర్’ స్థానంలో పీఏసీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో కొత్త కమిటీ ఏర్పాటయ్యింది. గతంలో ఉన్న టీపీసీసీ కోర్ కమిటీ స్థానంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, అనసూయ (సీతక్క), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ నియామకంపై చర్చ కమిటీ కూర్పులో తేడా కనిపించకపోయినా ఉన్నట్టుండి అధిష్టానం నుంచి ప్రకటన రావడం, ఈ కమిటీలో కొత్తగా కన్వీనర్ హోదా కల్పించడంపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉండే కోర్ కమిటీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి చైర్మన్‌గా, టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతరులు సభ్యులుగా ఉండేవారు. కానీ, తాజాగా నియమించిన పీఏసీకి కొత్తగా కన్వీనర్‌ను నియమించి ఆ బాధ్యతలను మొదటి నుంచీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తోన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్వీనర్ హోదాలో షబ్బీర్ అలీ ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్య నేతలకు ఉపశమనం ఈ కమిటీ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం మరో సంకేతాన్ని కూడా పంపిందన్నది రాజకీయ వర్గాల భావనగా కనిపిస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ వ్యవహారాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల చరిష్మా కొంత మేర తగ్గిందని, అయితే తాజా కమిటీలో ముఖ్యులందరికీ స్థానం కల్పించడంతో ఆయా శిబిరాల్లో కొత్త జోష్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు సీనియర్లకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలను అధిష్టానం దీనిద్వారా పంపిందని అంటున్నారు. గతంలో కోర్ కమిటీలో ఉన్నట్టే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ ప్రకటించిన ఇతర కమిటీల చైర్మన్లకు తాజా కమిటీలో సైతం ప్రాతినిధ్యం లభించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలు ఆట మొదలయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.