Shiva temple
-
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం
అజ్మీర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్ ఇదిలా ఉండగా, అజ్మీర్ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని అజ్మీర్ దర్గాను పర్యవేక్షించే అంజుమన్ సయీద్ జద్గాన్ కార్యదర్శి సయీద్ సర్వర్‌చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం?: అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ నెలలో అజ్మీర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు. సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్ సింగ్ అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొఘల్ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ అజ్మీర్ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉర్స్ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్ సిబల్ అజ్మీర్ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్ సిబల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్ కోర్టు ఉత్తర్వును పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్‌గనీ లోన్ తప్పుపపట్టారు. -
త్రయంబకేశ్వర్ శివాలయం లో రవీనా టాండన్, కూతురు రాషా తడాని (ఫొటోలు)
-
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్‌లోని కడనా డ్యామ్‌లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
గంగా తీరం వద్ద ఉన్న వారణాసి శివాలయంలో వింత విషయాలు
-
శివాలయంలో పానవట్టం ఏ దిక్కున ఉండాలి?
-
నూహ్‌లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
శివాలయంలోకి ఏనుగులు.. నిజంగా గుడిలోని గంట కొట్టాయా?
భామిని: మండలంలోని పక్కుడుభద్ర సమీపంలో జీర్ణోద్ధరణ జరుగుతున్న స్వయం భూ దేవాలయంలోకి గురువారం ఆరు ఏనుగుల గుంపు ప్రవేశించి ప్రత్యేకత చాటుకుంది. ఏనుగులు ప్రతి రోజూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు చెబుతుంటారు. అయితే వాస్తవంగా స్వయం భూ దేవాలయంలోకి ఏనుగులు ప్రవేశించి గంట కొట్టాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. బత్తిలికి చెందిన శాసనపురి కుటుంబసభ్యులతో జీర్ణోద్ధరణ జరుగుతున్న ఆలయంలోకి ఏనుగులు ప్రవేశించడంపై విశేష ప్రచారం కొనసాగుతోంది. ఇంతవరకు పంట నష్టాలపై చెప్పుకునే రైతులు, ఇప్పుడు ఏనుగుల ఆలయ ప్రవేశంపై ప్రచారం చేస్తున్నారు. -
మహాశివరాత్రి సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
-
కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం
-
పురాతన శివాలయం.. గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షం
సాక్షి, ఖమ్మం జిల్లా: కూసుమంచిలోని కాకతీయుల కాలం నాటి శివాలయం లో ఓ నాగు పాము ప్రత్యక్ష మైంది. సోమవారం కావడంతో తెల్లవారు జామునే ఆలయ పూజారి శేషగిరి శర్మ.. శివునికి పూజలు చేసేందుకు గుడి తలుపులు తీశారు. అప్పటి వరకు శివలింగంపైన ఉన్న నాగుపాము కిందకు దిగి శివలింగం పక్కనే పడగ విప్పి ఉండటంతో అక్కడకు వచ్చిన భక్తులు అంతా శివుని మహిమే అంటూ నాగుపాముకు దండం పెట్టుకుని శివునికి పూజలు చేశారు. ఓ పావుగంట గర్భ గుడిలో ఉన్న నాగుపాము గుడిలో నుంచి బయటకు వచ్చింది. చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు! -
కూసుమంచిలో 13వ శతాబ్దపు శివాలయం
సాక్షి, హైదరాబాద్: మరుగునపడిన కాకతీయుల కాలం నాటి శివాలయం ఒకటి ఇటీవల వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయితీ కార్యాలయం వెనకవైపు ఉన్న ఈ ఆలయాన్ని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ అధ్యక్షుడు కట్టా శ్రీనివాస్ సర్పంచ్ చెన్న మోహన్, ఉపాధ్యాయులు అరవపల్లి వీరస్వామి, మామిళ్లపల్లి లక్ష్మిల సహకారంతో గుర్తించారు. క్రీ.శ.13వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయ నిర్మాణ శైలిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, గణపేశ్వరాలయ వాస్తు శిల్పా న్ని పోలి ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. ద్వారాల ముందు రాతి కిటికీలతోపాటు గోడపైభాగంలో ఆలయం చుట్టూ రాతి వెంటిలేటర్ ఉండటం విశేషమన్నారు. 16 స్తంభాల రంగమండపం పైకప్పు, గర్భాలయంపై ఇటుక రాతి విమానం, ద్వార మం డపం ముందు నెమలి వాహనంపై వల్లీ సుబ్రహ్మ ణ్య నల్లరాతి శిల్పం అద్భుతంగా ఉన్నాయన్నారు. -
శివాలయం బావిలో 4 నెలల నుంచి వేడి నీళ్లు.. దేవుడి మహిమేనా?
సాక్షి, కేసముద్రం(మహబూబాబాద్): పురాతన శివాలయంలోని చేదబావిలో నీళ్లు వేడెక్కడంతో ప్రజలు పూజలు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. కాకతీయుల కాలంలో గ్రామంలో శివాలయం, ఆలయ ఆవరణలో చేదబావిని రాతికట్టడంతో నిర్మించారు. నిత్యం ఆలయాన్ని శుభ్రం చేసేందుకు వెలిశాల సుగుణమ్మ ఈ బావి నీటినే వినియోగిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఎప్పటిలాగే బావిలో నీటిని తోడగా.. నీళ్లు బాగావేడిగా ఉండటం గమనించింది. వాటిని ఆలయ ఆవరణలోని పోసి చూడగా పొగలు వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన పూజారికి చెప్పింది. బావిలో నీరు వేడిగా ఉన్నట్లు గుర్తించిన ఆయన గ్రామపెద్దలకు సమాచారవిచ్చారు. ఒకట్రెండు రోజుల క్రితం విషయం గ్రామస్తులకు తెలియడంతో ఇదంతా దేవుడి మహిమంటూ ఆదివారం ఆలయానికి చేరుకుని బావి వద్ద పూజలు చేశారు. చదవండి: రోగికి ఊపిరి పోస్తుండగా... ఆగిన డాక్టర్ గుండె చుట్టుపక్కలున్న బావిలోని నీటిని, ఈ బావి నీటిని పరిశీలించగా తేడా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. భూగర్భంలోని పొరల్లో మార్పుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని, ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి శాస్త్రవేత్తలతో పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. -
చీరాలలోని శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
Kurnool: నయనాలప్ప క్షేత్రాన్ని చూసొద్దాం రండి..
కోవెలకుంట్ల (కర్నూలు): కోరిన కోర్కెలు తీరుస్తూ ఓం కారేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచారు. సహజసిద్ధ ఎర్రమల కొండల్లో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన నయనాలప్ప క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు, తిరుణాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నయనాలప్ప క్షేత్ర చరిత్ర: కర్నూలు జిల్లాలోని కోవెల కుంట్ల నుంచి జమ్మల మడుగుకు వెళ్లే రహదారిలో సంజామల మండలంలోని అక్కంపల్లె సమీపంలో కొండలో వెలసిన నయనాలప్ప క్షేత్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన చెన్నబసప్ప అనే శివభక్తుడు ఈప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ప్రకృతి సౌందర్యము, కొండగుహలను చూసి ముగ్దుడై కుటుంబసమేతంగా వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఒకరోజు రాత్రి నిద్రిస్తుండగా ఓం అను ప్రణవ శబ్ధం వినబడటంతో లేచి ఆ శబ్ధం ఈశ్వరతత్వమని గ్రహించి శివున్ని ధ్యానించి ఇక్కడ శివాలయం నిర్మించ కోరిక కలదని భార్య శివాంబతో చెప్పారు. ఆలయ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదని ఆలోచన విరమించుకోవాలని భార్య చెప్పగా ప్రశాంత వాతావరణంలో ఆలయం నిర్మించడం వల్ల శివభక్తులను ఉపయోగకరంగా ఉంటుందని శివాలయాన్ని నిర్మించ తలపెట్టారు. శివాలయ నిర్మాణంపై ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదని, పక్కనే ఉన్న అక్కంపల్లె గ్రామస్తులు మహా భక్తులని, వారిని ఆశ్రయించిన దేవాలయ నిర్మాణం సులభతరమవుతుందని ఓంకారేశ్వరునిగా ఆలయంలో ప్రతిష్టించాలని ఒక రోజు రాత్రి శివుడు కలలో కన్పించి చెప్పడంతో ఈ విషయాన్ని భార్యకు తెలియజేశారు. శివుడు చెప్పినట్లు చేయాలని భార్య సలహా ఇవ్వడంతో చెన్నబసప్పా అక్కంపల్లె చేరుకుని శివుడు కలలో ఆజ్ఞాపించిన విషయాన్ని గ్రామస్తులకు వివరించగా వారు దేవాలయ నిర్మాణానికి చేయూత నిస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బసప్పా తన దగ్గర ఉన్న ఎద్దులసాయంతో రాళ్లను పైకి చేర్చి ముందుగా తాను పూజిస్తున్న గర్భగుడికి సరిగా కింద భూమిలో నేలగుహ అను పేరుతో పై ఆలయములోకి వచ్చునట్లుగా సోపానములను అమర్చారు. శివ మహిమతో నేల గుహ ఇప్పటికి ఎయిర్ కండీషన్ గదిలా ఉంది. రాత్రి సమయాల్లో శివ మహిమతో రాళ్లు పైకి చేరుతుండటమేకాక, పగలు నిర్మించిన కట్టడాలు సరిగా లేని పక్షంలో చక్కగా సరిదిద్దబడేవని చరిత్ర. ఒక రోజురాత్రి నిద్రిస్తున్న సమయంలో శివాంబ శివాలయ ప్రాంతంలో అలికిడి విని లేచి చూడగా పరమేశ్వరుడు శివగణంబులతో శివాలయ నిర్మాణ విశేషములను తిలకించి వాటికి కావాల్సిన సద్దుబాట్లు చేయించుకున్న దృశ్యాలను చూసి నిశ్చేష్ఠురాలైంది. ఈ విషయాన్ని భర్తను లేపగా శివుడు అదృశ్యమయ్యాడు. శివుని ప్రత్యక్షంకోసం పర్వతం కింద కఠోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకుండా అదృశ్యవాణితో బసప్పను దీక్ష విరమించి భార్య, కుమారుడు సుజాతప్పను కలుసుకోవాలని, త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఓంకారేశ్వరునిగా తనను ప్రతిష్ఠింపచేసి కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడి నుంచి కాశీ జలాన్ని తెచ్చి అభిషేకించాలని, అప్పుడు దర్శనభాగ్యం కలుగునని పలికెను. దీక్షను విరమించి ఇంటికి చేరుకున్న బసప్ప కాశీ విషయాన్ని భార్యకు చెప్పి మునీశ్వరుల వెంట కాశీకి బయలు దేరాడు. భర్త వెళ్లే సమయానికి శివాంబ రెండు నెలల గర్బవతి. భర్త కాశీకి వెళ్లడంతో ఆమె ప్రతి రోజు పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆవుపాలు, నెయ్యితో వీబూది ముద్దలుగా చేసి గదిలో భద్రపరిచేది. శివాంబకు అచ్చం తన పోలికలతో కూడిన కుమార్తె జన్మించడంతో శరణమ్మనామకరణం చేసి 16 సంవత్సరాల పాటు కఠోరంగా శివున్ని ప్రార్థించింది. ఒక రోజు శివాంబ బిక్షాటనకై అక్కంపల్లె గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో కాశీ నుంచి బసప్ప ఇంటికి చేరుకున్నాడు. ఆయన రాకను చూసిన మునులు మీ తండ్రి కాశీ క్షేత్రం నుంచి వచ్చాడని చెప్పడంతో శరణమ్మ కలశంతో నీటిని తెచ్చి తండ్రి పాదములు కడుగుటకు ఎదురుగా వచ్చింది. బపస్ప కాశీ క్షేత్రానికి వెళ్లే సమయానికి భార్య గర్భవతని, తనకు కుమార్తె పుట్టిన విషయం తెలియకపోవడంతో బసప్ప కలశంతో నీళ్లు తెచ్చిన శరణమ్మ తన భార్యగా భావించి ముసలితనంలో ప్రాయం వచ్చనా అన్న మాటలు అనడంతో వెంటనే తండ్రి మనోభావాన్ని గ్రహించిన కుమార్తె తండ్రి వద్దకు వెళ్లి నేను నీ కుమార్తెనని తెలిపింది. దీంతో బసప్ప కుమార్తెను అక్కున చేర్చుకుని తాను పొరబడ్డానని బాధించి ఓంకారేశ్వరుని సన్నిధికి చేరుకుని నయనములు కల్గి ఉండుటవల్లే ఈ తప్పిదం జరిగిందని, ఈ నయనములు ఉండటానికి వీల్లేంటూ రెండు కళ్లూ పీకి శివసన్నిధిని ఉంచారు. భార్య, పిల్లలు ఎంత చెప్పినప్పటికీ వినకుండా అంధత్వ జీవితం భరించుట సాధ్యం కాదని, జీవసమాధి అయ్యారు. కొంతకాలానికి ఎద్దులు కూడా మృతి చెందటంతో బసప్ప పక్కనే వాటిని సమాధి చేశారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది తర్వాత అంతటి ప్రాధాన్యత నయనాలప్ప క్షేత్రానికే ఉంది. ఓంకారేశ్వర ఆలయంలో బసప్ప పూజలు నిర్వహించిన నేలగుహ ఇప్పటికి చెక్కు చెదరలేదు. నేలగుహలో ప్రతిష్టించిన శివలింగానికి బసప్ప పూజలు చేసేవారు. శివమహిమతో ఉన్న ఈ గుహను అలాగే ఉంచి దానిపై ఆలయాన్ని నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆలయం ఉన్న గర్భగుడిలో నేలగుహ ఎయిర్‌కండీషన్ గదిని పోలి ఉంది. ఇది నయనాలప్ప క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత. ఓంకారేశ్వర క్షేత్రంలో కార్తీక కడసోమవార ఉత్సవాలు: ప్రతిఏటా కార్తీక మాసంలో ఓంకారేశ్వరస్వామి క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీకమాస కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో మూడు రోజులపాటు తిరుణాల ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శుక్రవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండగా కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, ధ్వజరారోహణ నిర్వహిస్తారు . అదేవిధంగా.. స్వామివార్ల గ్రామోత్సవం, కోలాటాలు, హరిభజనలు, భక్తిరసపూరిత కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం, నాటకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచేకాక కడప, అనంతపురం జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రాన్ని చేరుకుని ఓంకారేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. నయనాలప్ప క్షేత్రానికి ఇలా చేరుకోవాలి: కర్నూలు జిల్లా కేంద్రం నుంచి బేతంచెర్ల, బన గానపల్లె, కోవెలకుంట్ల, మాయలూరు మీదుగా సంజామల మండలం అక్కంపల్లె గ్రామ శివారు నుంచి నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి గోస్పాడు, కోవెలకుంట్ల మీదుగా, ఆళ్లగడ్డ నుంచి పెద్దముడియం మీదుగా, వైఎస్ఆర్ జిల్లా నుంచి భక్తులు జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం మీదుగా నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. -
రాక్షసుల పూజలందుకున్న కపర్దీశ్వరుడు
Tanuku Kapardheswara Temple Story: తణుకు పట్టణంలో స్వయంభూగా వెలిసిన శివలింగం కలిగిన కపర్దీశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాలి. తారకాపురంగా పిలువబడే తణుకు పట్టణాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద తారకాసురుడు నిత్యం పూజలు చేసేవాడని ఇదే క్రమంలో ఆయన మెడలోని లింగాన్ని కుమార స్వామి సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సంహరణకు గురైన లింగం అయిదు ముక్కలుగా తెగిపడి పంచారామక్షేత్రాలుగా పిలువ బడుతున్న ప్రాంతాల్లో పడినట్లు చెబుతుంటారు. ఇవే పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, అరమరావతి, ద్రాక్షారామం అని పిలువబడుతున్న పంచారామక్షేత్రాలు. అయితే పంచారామ క్షేత్రాలను దర్శించిన భక్తులు తణుకులోని కపర్దీశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆలయ గోపురంపై పూర్తిగా రాక్షసుల బొమ్మలు ఉంటడం ఇక్కడ విశిష్టత. తణుకు పట్టణంలోని పాతవూరు మున్సిపల్ కార్యాలయం ఆనుకుని వైష్ణవులు నిర్మించిన దేవాలయంగా పేరొందిన పార్వతి కపర్దీశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు, కల్యాణాలు, గ్రామోత్సవాలు జగరకపోవడం విశేషం. కపర్దీశ్వర స్వామి వారు నిత్యం తపస్సులోనే ఉంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కార్తీకమాసం సమీపిస్తుండటంతో నవంబరు 5 నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లవరపు శంకరశర్మ ఇక్కడి ఆలయానికి ప్రత్యేకత... రాష్ట్రంలోనే కాదు ఎక్కడా లేనివిధంగా ఆలయ గోపురంపై రాక్షసుల విగ్రహాలు ఉండటం కపర్దీశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత. రాక్షసులు పూజలు అందుకున్న స్వామివారుగా ప్రసిద్ధి చెందారు. పంచారామక్షేత్రాలు వెళ్లిన వారు కపర్దీశ్వరస్వామివారికి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. – అల్లవరపు శంకరశ్మ, అర్చకుడు, తణుకు -
ఖమ్మం జిల్లాలో వెయ్యేళ్లనాటి శివాలయం-అతిపెద్ద శివలింగం
కూసుమంచి (ఖమ్మం): కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్షసాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈశివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తున్నారు. క్రీ.శ 11–12వ శతాబ్ధంలో కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. (చదవండి: అపార్ట్మెంట్లో బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్) శివాలయంలోని శివలింగం ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారం ఉన్నట్లుగా బండరాళ్లను పేర్చి వాటిపై ఆలయాన్ని నిర్మించటం విశేషం. ఇక ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు. 5.3 సెంమీ వ్యాసార్థంతో ప్రతిష్టించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించటం మరో విశేషం. వందలాది సంవత్సరాల పాటు కంపచెట్లు, మట్టిదిబ్బలతో జీర్ణావస్థకు చేరింది. గ్రామంలో గొప్ప ఆలయం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోక పోవటంతో అది ఎలా ఉందో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. నాటి కూసుమంచి సీఐగా ఉన్న సాథు వీరప్రతాప్‌రెడ్డి దృష్టికి ఆలయం విషయం రావటంతో గ్రామస్థుల సహకారంతో ఈఆలయాన్ని వెలుగులోకి తీసుకవచ్చారు. దాన్ని అభివృద్ది పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో ఈ ఆలయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మహా ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయాన్ని దర్శించటం పునర్జన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈశివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతియేడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు. (చదవండి: జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..) -
పురాతన దేవాలయాలు.. పిల్లలమర్రి శివాలయాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. అంతేకాకుండా పురాతన దేవలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది. "వాణి నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కి వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ముఖధ్వారం ఉంది. అంతేకాదు మూసీ కాలువ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లంగానే పిల్లలమర్రి గ్రామం వచ్చేస్తుంది. (చదవండి: ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’) శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు... పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు కాకతీయులు సేనానులుగా, మహా సామంతులుగా ఆమనగల్లు, ఎలకతుర్తి, పిల్లలమర్రి ప్రాంతాలను పరిపాలించారు. మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు. అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. రాతి దూలాలపై పురాణ గాథాలు..... క్రీ.శ 1195 నాటికి పిల్లలమర్రి బాగా ప్రసిద్ధి పొందింది. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో మరో నామేశ్వరాలయం కూడా ఉంది. అది 1202లో నిర్మించబడింది. తెలుగు భాష మాట్లాడేవారందర్నీ మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసాని పిల్లలమర్రిలో తన పేరుమీద ఎరుకేశ్వరాలయాన్ని నిర్మించి శాసనం వేయించింది. ఆలయం సమీపంలో సుబ్బ సముద్రాన్ని తవ్వించింది. దేవాలయంలో పూజల నిమిత్తం భూధానం చేసింది. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మధనం, వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలు... నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఇసుక పోసి ఏనుగులతో పెద్ద పెద్ద బండలను ఎక్కించినట్లు తెలిసింది. దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. (చదవండి: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
Photo Story: ‘నీళ్ల’కంఠుడు.. పూర్తిగా మునిగిన శివాలయం
చుట్టూ గుట్టలు.. పచ్చని పొలాలు.. మధ్యలో అలుగు పారుతున్న ఊకచెట్టు వాగు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో కనువిందు చేస్తున్న జలదృశ్యమిది. వాగు మధ్యలోని శివుడి విగ్రహం చుట్టూ నీళ్లు పారుతున్న చిత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. – కొత్తకోట రూరల్ (వనపర్తి జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా) -
ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం
‘సిరిగిరి మల్లన్నను శరణన్న చాలు పరమపాతక కోట్లు భస్మమై తూలు’ అని శ్రీశైల ప్రశస్తి. శ్రీ పర్వతం లేదా శ్రీశైలం అంటే కైలాసనాథునికి పరమ ప్రీతి. ఇక తెలుగువారికి శివుడంటే ఉన్న ప్రీతికి సాక్ష్యాలు అవసరం లేదు. అసలు త్రిలింగాల వల్లే తెలుగు పదం ఆవిర్భవించిందని కదా మన నమ్మకం. అందుకే శివాలయం లేని ఊరు మనకు తెలుగునాట కనిపించదు. మన శివాలయాల్లో విశిష్టమైన మహత్తుగల క్షేత్రం శ్రీశైలం మహాశివరాత్రి శ్రీశైలంలో రమణీయ, భక్తి భావతరంగిత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. సర్వం శివమయంగా కనిపించే ఈ క్షేత్రాన్ని మహాశివరాత్రినాడు దర్శించడమే మహాభాగ్యం. క్షేత్రంలో ఎక్కడ ప్రతిష్ఠిత శివలింగం ఉన్నా దర్శనం చేసుకోవడానికి, అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. అనువైన ప్రతిచోటా అడుగడుగునా లింగార్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేకాలను చూడడమే ధన్యం అనుకున్న భక్తులు తామూ ఒక్క మారేడుదళమైనా ఆ సాంబయ్యపై ఉంచాలని పోటీపడతారు. సిద్ధులు, యోగులు, తపస్వులు ఎందరో మామూలు మానవులలో కలిసిపోయి సంచరిస్తూ ఉంటారు. ఆనందంతో నాట్యం చేసేవారు. మల్లికార్జునుని భక్తిగీతాలు పాడేవారు, శంఖాలు పూరించేవారు. వాద్యఘోషతో కైలాసనాథునికి జయజయనాదాలు చేసేవారు, పురాణ శ్రవణం చేసేవారు ఇలా అందరూ ఏదో ఒక విధంగా ఆనాటితో జన్మధన్యం అనుకుంటూ ఆనందపడేవారే. శివరాత్రి వైభవ సంప్రదాయాలు ఉద్వేగ భరిత క్షణాలు సంధ్యాసమయంలో ప్రారంభమవుతాయి అఖిలలోకాలకు ప్రభయై వెలిగే అచలేశ్వరునికి ప్రభోత్సవం సిద్ధమవుతుంది. స్వామి అమ్మవార్లు ప్రభపైకి విచ్చేస్తారు. అందమైన ప్రభపై చిత్రవిచిత్ర పుష్పాలతో అలంకరణ జరుగుతుంది. ఆదిదంపతులు పురవీధుల్లో ప్రభలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరిస్తారు. సూర్యాస్తమయం ఆవుతుంది. శ్రీశైల ఆలయం చుట్టూ ఉండే సాలుమండపాలపై, మెట్లపై ఇతర మండపాలలో ఎక్కడ చూసినా జనమే కానవస్తారు. వారందరి ఎదురుచూపులన్నీ పాగాలంకరణ కోసమే. మరోవైపు ఆలయంలో లింగోద్భవకాల రుద్రాభిషేక ఏర్పాట్లలో అర్చకగణం మునిగిపోతుంది. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ ఒకేసమయంలో ప్రారంభమవుతాయి. దివ్యతీర్థజలాలతో, విశేషద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అఖిల జగత్తుకు మూలాధారమైన ఆదిదేవునికి జరిగే ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం. అభిషేకం పూర్తయ్యే సమయానికి కొంచెం ముందుగా పాగాలంకరణ పూర్తవుతుంది. ఒక్కసారిగా అంతటా వెలుగులు ప్రసరిస్తాయి. కళ్లముందు పాగాలంకరణతో మెరిసిపోయే స్వామి. నుదుట బాసికం పెట్టుకుని, పాగా చుట్టుకున్న మల్లన్న, భ్రమరాంబికాదేవితో కల్యాణం జరిపించుకోవడానికి చంద్రవతీ కల్యాణ మంటపానికి విచ్చేస్తాడు. లోకహితం కోసం జరిగే ఆదిదంపతుల కల్యాణోత్సవం... రెండు కన్నులు వాలని రసవత్తర ఘట్టాన్ని తిలకించాలంటే శ్రీశైలం సందర్శించాలి. మల్లికార్జునా! ఆదుకో! శివరాత్రి: ఇన్ని గంటలు శివార్చన చేస్తే పుణ్యం! -
చరిత్రకు ఆనవాళ్లు.. ఈ శివాలయాలు
సాక్షి, కుక్కునూరు: కుక్కునూరు మండలాల్లోని శివాలయాలు గత చరిత్రకు అనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఎంతో మహిమాన్వితమైన శివాలయాలుగా పేరున్నా, ప్రభుత్వాలు ఈ ఆలయాలని పట్టించుకోక పోవడంతో వాటి చరిత్ర కనుమరుగయ్యే స్థితికి చేరుకుందని భక్తజనం ఆరోపిస్తున్నారు. సమరసతా సేవా ఫౌండేషన్ వంటి ధార్మిక సంస్థలు ఆలయాల పునరుద్ధరణకు పూనుకుని వాటికి గత వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా పూర్తి వైభవాన్ని సంతరించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. మనిషి రూపంలో దర్శనమిచ్చే కేదారేశ్వరుడు మనిషి రూపంలో ఉన్న కేదారేశ్వరస్వామి విగ్రహం కుక్కునూరు మండలంలోని పెద్దరావిగూడెం గ్రామంలోని శ్రీకేథారేశ్వరస్వామి ఆలయానిది. 16వ శతాబ్ద కాలానిదిగా ఆలయ అర్చకులు చెప్తారు. సాదారణంగా దేశంలోని అన్ని శైవక్షేత్రాల్లో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు కానీ మండలంలోని పెద్దరావిగూడెం గుట్ట మీద ఉన్న శివుడి విగ్రహం మాత్రం మనిషి రూపంలో ఉంటుంది. స్వామి వారి విగ్రహం ఉదయం బాలుడిగాను, మధ్యాహ్నం యవ్వనస్తుడిలా, సాయంత్రం వృద్ధుడిలా విగ్రహం కనపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆ గుట్టపై స్వామి వారి విగ్రహం ఉన్న విషయాన్ని ఓ సన్యాసికి స్వామి కలలో కనిపించి చెప్పడంతో ఆయన ఊరి పెద్దలతో కలిసి తవ్వించగా విగ్రహం బయట పడినట్టు ఆలయ చరిత్రగా గ్రామస్తులు చెబుతారు. కౌండిన్య మహాబుషి పేరుతో వెలిసిన ఆలయం రాతి కట్టడాలతో నిర్మించిన కౌండిన్య ముక్తేశ్వరస్వామి ఆలయం మండలంలోని మాధవరంలోని కౌండిన్య ముక్తేశ్వరాలయం సాక్ష్యాత్తూ కౌండిన్య మహాబుషి తపస్సు చేసి ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు చెప్తారు. దీంతోనే ఈ ఆలయానికి కౌండిన్యముక్తేశ్వరాలయం అని పేరొచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆలయ పూర్తి చరిత్ర తెలిసిన వారు ఎవరూ లేనప్పటికీ ఇటీవల ఈ ఆలయాన్ని సందర్శించిన పురావస్తు శాఖ వారు మాత్రం ఈ ఆలయం కాకతీయుల నాటిదని తేల్చారు. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు గుప్తనిధుల వేటలో దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ తవ్వకాల్లో పురాతన శివలింగం బయటపడింది. కుక్కునూరు మండలంలోని శ్రీకేథారేశ్వరస్వామి, కౌండిన్యముక్తేశ్వరస్వామి ఆలయాలతో పాటు వేలేరుపాడు మండలం రుద్రమకోట, కట్కూరు శివాలయాలన్ని గుట్టల మీద ఉండడంతో పాటు అన్ని గోదావరి తీరానే ఉండడం మరో విశేషం. ముంపు మండలాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉగ్రరూపంలో వీరభద్రస్వామి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన చారిత్రక పట్టణం లేపాక్షి. మధ్యయుగం నాటి శిల్పకళా నిర్మాణంలో ఒక పురాతన శివాలయం ఇక్కడ కొలువు తీరి ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి సుమారు 30 అడుగుల ఎత్తువరకు పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు కనువిందు చేస్తుంది. పై కప్పు కూడా లేకుండా ఈ విగ్రహం ఆరుబయట దర్శనమిస్తుంది. ఇక్కడ స్తంభాలు, మండపాలతో పాటు అనేక శివలింగాలతో కూడిన ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయి. విశాలమైన ఆవరణ మధ్యభాగంలో కొలువుతీరి ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్రస్వామి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంటుంది. సాధారణంగా దేవుడు మనకు గుడి బయట నుంచి కనపడతాడు. వీరభద్రస్వామిది ఉగ్రరూపం, ఆయన కోపపు చూపులు సూటిగా గ్రామం మీద పడకూడదు. అందువల్ల ఈ ఆలయ ముఖద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. ఇది ఈ ఆలయ విశేషం. ఇక్కడి వేలాడే స్తంభం ఈ గుడికి ముఖ్య ఆకర్షణ. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక పల్చటి వస్త్రాన్ని అతి సులువుగా తీయగలుగుతాం. ఇది అప్పటి శిల్పకారుల నైపుణ్యానికి తార్కాణం. ఇక్కడి వీరభద్రస్వామిని మహిమలు గల దేవునిగా కొలుస్తారు. –డా. వైజయంతి -
హర.. హర.. మహాదేవ శంభోశంకర
రాష్ట్రవ్యాప్తంగా శివ దీక్ష చేపట్టిన బోల్‌భం భక్తులు జిల్లాలోని ఆయా శివాలయాలకు తరలిపోతున్నారు. శివనామస్మరణతో హోరెత్తిస్తూ భక్తిశ్రద్ధలతో శివాలయాలను దర్శించుకుంటున్నారు. తమ వెంట తీసుకువచ్చిన పుణ్య నదీ జలాలతో శివునికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. రాయగడ ఒరిస్సా : శివనామస్మరణే ధ్యేయంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బోల్‌భం భక్తులు రాయగడలోని నైమగిరి పర్వత శ్రేణుల్లో ఉన్న పాతలేశ్వర శివాలయానికి సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది బోల్‌భం దీక్షాపరులు అక్కడున్న చాటికొన జలపాతం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం ఆయా పుణ్య నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివునికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది బోల్‌భం భక్తులు తమ వెంట కావిళ్లతో తీసుకువచ్చిన పవిత్ర జలాలతో శివునికి పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉపవాసాలు ఆచరించి, శివునికి ప్రత్యేక పూజలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి బోల్‌భం భక్తులు మార్గం మధ్యలో ఉన్న అనేక శివాలయాలను సందర్శించి, శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు కొనసాగే ఈ దీక్షలో భక్తులందరూ శివనామస్మరణ చేసుకుంటూ ఏక మార్గంలో ప్రయాణిస్తూ యాత్రను కొనసాగిస్తున్నట్లు పలువురు భక్తులు చెబుతున్నారు. జయపురంలో.. జయపురం : రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బోల్‌భం దీక్షాపరులు కొరాపుట్ జిల్లాలోని జయపురంలో ఉన్న గుప్తేశ్వర ఆలయానికి బయలుదేరారు. జయపురం పట్టణం నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుప్తేశ్వర ఆలయానికి వెళ్లాలంటే మార్గం మధ్యలో ఉన్న అడవులను దాటుకుంటూ వెళ్లాలి. ఈ నేపథ్యంలో రాత్రిపూట ప్రయాణం అంత సౌకర్యం కానందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా అడవిలో ఉన్న అనేక చెట్లకు విద్యుత్ లైట్లను పెద్ద ఎత్తున అమర్చుతున్నారు. పలు రాష్ట్రాల నుంచి కూడా.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బోల్‌భం భక్తులు శివుని దర్శనం కోసం గుప్తేశ్వర ఆలయానికి చేరుకుంటుండడం విశేషం. ఇదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పలు స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు, సంఘ సేవకులు బోల్భక్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి, పగలు తేడా లేకుండా అనేక వేలాది మంది బోల్‌భం భక్తులు బొయిపరిగుడ నుంచి గుప్తేశ్వరాలయం వరకు ఉన్న దట్టమైన అడవిలో ప్రస్తుతం బోల్‌భం భక్తులు ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయపురం పట్టణానికి చెందిన యువత దారి పొడవునా దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. బోల్‌భం భక్తులు చక్కగా నడిచి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉందని పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బరంపురంలో.. బరంపురం: మహా శివునికి ఇష్టమైన శ్రావణమాసం సందర్భంగా దీక్ష చేపట్టిన పలువురు బోల్‌భం దీక్షాపరులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా శివాలయాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది శివభక్తులు శివనామస్మరణ చేసుకుంటూ ఆయా శివాలయాలకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. భక్తులు వెళ్లే మార్గంలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా ఉండేలా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘ సేవకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఉజ్జలేశ్వరాలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని, తమ వెంట తీసుకువచ్చిన పవిత్ర నదీ జలాలతో శివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, తరించారు. -
గుడిలో శఠగోపం పెట్టడం
శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీని పైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదా లను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. సాధారణంగా విష్ణ్వాలయంలో అయితే శఠగోపాన్ని తలమీద పెడతారు. శివాలయంలో శఠగోపాన్ని తలమీద ఉంచరు. కళ్లకు అద్దుకోవడానికి వీలుగా కనులముందు ఉంచుతారు. విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే... శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచు తో విడివిడిగా గాని తయారుచేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలోని వేడిని ఇది సులువుగా లాగేస్తుంది. -
అదిగో...మహిష్మతి
యాత్ర మహిష్మతి రాజ్యాన్ని ‘బాహుబలి’ సినిమాలో చూసి ఉంటారు. ఆ పేరున్న పట్టణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్కి వెళ్లాలి. నగిషీలు చెక్కిన ప్రాకారాలు, ఠీవీగా నిల్చున్న కోటగోడలు చుట్టూ ఉండగా మధ్యన నందీశ్వరుడితో సహా కొలువుదీరాడు మహేశ్వరుడు. నిత్యం శివార్చనతో ప్రశాంతమైన నర్మదానది ప్రణమిల్లగా మన అంతఃచేతనంలో పరవశాలను నింపుతూ దర్శనమిస్తాడు మహేశ్వరుడు. ఆయన పేరు మీదుగానే ‘మహేశ్వర్’ అని పట్టణ నామం స్థిరపడింది. అలా అక్కడ భక్తులకు అనంతమైన ఆశీస్సులను మహేశ్వరుడు అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ జిల్లాలో ఉందీ మహేశ్వర్ పట్టణం. ఆగ్రా–ముంబై వెళ్లే 3వ నెంబర్ జాతీయ రహదారికి కేవలంS13 కిలోమీటర్లు, ఇండోర్ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి లెక్కలకందని విశిష్టతలెన్నో ఉన్నాయి. శరీరానికి హృదయం దేవాలయం ఎలాగో సుసంపన్నమైన మహేశ్వర్ కోటకు హృదయం మహేశ్వరుడి మందిరం. ఈ కోట అహిల్యాబాయి హోల్కర్ కోటగా కూడా ప్రసిద్ధి. 18వ శతాబ్దిలో మరాఠా రాణి, రాజమాత అహిల్యా బాయి హోల్కర్ తన భర్త మరణా నంతరం మహేశ్వర్ ఆలయాన్ని నడిబొడ్డుగా చేసుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడ నుంచే మాళవ (మాల్వా) దేశాన్ని ఆమె పరిపాలించారు. శివ భక్తురాలైన అహిల్యా దేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్ మందిరం, ఉజ్జయిని, నాసిక్, విష్ణుపాద మందిర్, గయ.. ఆలయాల లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు నర్మదానది ఒడ్డున ఎన్నో దేవాలయాలు, ఘాట్లను నిర్మింపజేశారు. నర్మదానది ఒడ్డున నిల్చుని అహిల్యాబాయి కోట ఘాట్లను వీక్షిస్తుంటే ప్రసిద్ధ చిత్రకారుడు కాన్వాస్ మీద అందమైన చిత్రాలను తీర్చిదిద్దినట్టుగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం. రామాయణ కాలం నాటి సామ్రాజ్యం మహేశ్వర్ ప్రాచీన నామం మహిష్మతి. రామాయణ, మహాభారతాలలో ఈ మహిష్మతి సామ్రాజ్య ప్రస్తావన ఉంది. అంటే, రామాయణ కాలం నాటి కన్నా ముందే ఈ రాజ్యం ఉందన్నమాట. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని సందర్శిస్తే అలనాటి విశేషాలు కళ్లకు కడతాయి. గోపురాలు నాటి కథలు చెబుతాయి. ఈ ప్రాచీన పట్టణాన్ని సోమవంశ సహస్రార్జున క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని, పరిపాలించేవాడు. ఇతడినే శ్రీ సహస్రార్జున అనేవారు. ఇతని గురించి మన ఇతిహాసాలలో గొప్ప ప్రస్తావన ఉంది. ఒక రోజు సహస్రార్జునుడు తన 500 మంది భార్యలతో నదీ తీరానికి వాహ్యాళికి వెళ్లాడట. అయితే, 500 మంది భార్యలు ఉల్లాసంగా ఆడుకోవడానికి అనువైన ప్రాంతం కనిపించక, ప్రవహించే పవిత్ర నర్మదానదిని తన వెయ్యి బాహువులతో నిలువరించాడట. విశాలమైన ఆ నర్మదానదీ మైదానంలో అందరూ ఆనందంగా విహరిస్తున్న సమయంలో రావణాసురుడు ఆకాశమార్గాన పుష్పకవిమానంలో వెళుతూ, ఈ ప్రాంతంలో దిగాడట. నదీ మైదానం విశాలంగా కనిపించడంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు ప్రారంభించాడట. సహస్రార్జునుడి భార్యలు ఆటలు ముగించి, నది ఒడ్డుకు చేరుకోవడంతో అతను నెమ్మదిగా నీటిని విడుదల చేశాడట. ఇప్పటికీ అవే 11 అఖండ దీపాలు దీంతో రావణుడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగాన్ని నర్మదానది నీరు తుడిచిపెట్టేసుకుంటూ వెళ్ళింది. రావణుడు ఆగ్రహించాడు. సహస్రార్జునుడితో యుద్ధానికి దిగాడట. çసహస్రార్జునుడు తన వెయ్యి బాహువులతో రావణుడిని ఓడించి, అతడిని కట్టేసి, పది తలల మీద పది దీపాలు, కట్టేసిన రెండు చేతుల మధ్య మరో దీపం ఉంచి తన ఇంటికి బందీగా తీసుకెళ్లాడు. తన కొడుకు ఊయలను రావణాసురుడితో ఊపించి, ఆ తర్వాత వదిలేశాడట. ఇప్పటికీ మహేశ్వర్‌లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూనే ఉండటం విశేషం. అలాగే, అగ్నిదేవుని కృప ఈ పట్టణానికి రక్షగా ఉందని ఎన్నో కథనాలున్నాయి. సహస్రార్జునుడి తదనంతరం నిషాద రాజ్యం రాజు నిల మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్రయుద్ధం ముగిశాక ధర్మరాజు రాజయ్యాడు. భూమినంతా జయించడానికి యాగాన్ని ప్రారంభించాడు. అంతా ఆక్రమించుకున్నా, మహిష్మతి మాత్రం వీరి హస్తగతం కాలేదు. ధర్మరాజు తమ్ముడు సహదేవుడు అగ్నిదేవుడి రక్షణ వల్లే మహిష్మతి తమ హస్తగతం కావడం లేదని గుర్తించాడు. అగ్నిని ప్రసన్నం చేసుకుని, మహిష్మతిని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు పాండవులు. అలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుడి నామంతో మహేశ్వర్‌గా రూపుమార్చుకుంది. దేవాలయాల రాజ్యం సహస్రార్జునుడి మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర మందిరం, కాశీ విశ్వనాథ, చతుర్భుజి నారాయణ, అహిల్యామాత, చింతామణి గణపతి, పండరినాథ్, భవానీ మాత, గోబర్ గణేశ్, అనంత్‌నారాయణ, ఖేడాపతి హనుమాన్, రామ– కృష్ణ, నర్సింగ్, కాళేశ్వర, జ్వాలేశ్వర మందిరాలున్నాయి. బాణేశ్వర్ శివ మందిరం నర్మదానది మధ్యలో ఉంటుంది. దీని వల్ల ఈ మందిరం ఓ ద్వీపంలో ఉన్నట్టు గోచరిస్తుంది. వింధ్యవాసినీ శక్తిపీఠం మహేశ్వర్‌లోని వింధ్యవాసినీ భవాని శక్తిపీఠాలలో ఒకటి అంటారు. ఏక్ ముఖి దత్త మందిరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మించారు. దీన్ని శివదత్త ధామంగా పిలుస్తారు. 30 ఎకరాలలో సువిశాలంగా నిర్మించారు. జగద్గురు కృపాళూజీ మహారాజ్ వేవేల విధాలుగా మహేశ్వర్ దేవాలయాన్ని కీర్తిస్తూ అఖండ సంకీర్తనల్ని వెలువరించారు. జీవితమంతా మహేశ్వర్‌లోనే ఉన్నారు. ఉత్సవాల కోలాహలం అహిల్యాబాయి కోటలో కొంత భాగాన్ని ప్రాచీన హోటల్‌గా మార్చారు. మహేశ్వర్‌లో నాగపంచమి, గుడి పడవా, తీజ్, శ్రావణమాసంలో అన్ని సోమవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి సోమవారం మాత్రం కాశీవిశ్వనాథుని పూజ జరిపి భంగు (గంజాయి) ప్రసాదంగా పంచుతారు. మహాశివరాత్రి, సమోటి అమావాస్య, ఇతర అన్ని పండగలు విశేషంగా జరుపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం మహేశ్వర్‌లోని స్వాధ్యాయ భవన్ ఆశ్రమం మహా మృత్యుంజయ రథయాత్రను ప్రారంభిస్తుంది. సినిమాలలో మహేశ్వర్! నర్మద నదీ తీరప్రాంతమంతటా ఎన్నో ప్రకృతి అందాలు కొలువుదీరాయి. వీటిలో మహేశ్వర్‌లోని కోట ఘాట్లు, ప్రాకారాలు ప్రత్యేకమైనవి. ఈ కోట లోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో తరచూ హిందీ, తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణ జరుగుతుంటుంది. వీటిలో ప్రముఖంగా ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ వీడియో, ‘బాజీరావ్ మస్తానీ’, ‘నీర్జా’ సినిమాలు, చారిత్రక టీవీ సీరియల్స్ ఇక్కడే చిత్రీకరించారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చలిగా, పొడిగా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. దేశీయ చేనేత... మహేశ్వరి చీరలు మహేశ్వర్ 5వ శతాబ్ది నుంచి చేనేతకు ప్రసిద్ధి గాంచింది. దేశంలోని చేనేతలలో ఉత్తమమైన వస్త్రంగా పేరొందింది. మహేశ్వర్ దేవాలయాన్ని సందర్శించి, విశేషాలు తెలుసుకోవడం ఒక ఎల్తైతే, ఆ పట్టణానికి మరో ప్రత్యేకత – రంగురంగుల మహేశ్వరి చీరలు. ఇవి కాటన్, పట్టులో లభిస్తాయి. చారలు, పువ్వుల అంచులతో చూడగానే ఆకట్టుకుంటాయి ఈ చీరలు. మధ్యప్రదేశ్ టూరిజమ్ హనుమాంతియాలోని నర్మదానది డ్యామ్ బ్యాక్‌వాటర్‌లో ‘జల్ మహోత్సవ్’ పేరుతో రెండేళ్లుగా డిసెంబర్–జనవరి నెలల్లో ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా హనుమాంతియాలోని టూరిస్ట్ కాంప్లెక్స్, మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వివరాలకు: మధ్యప్రదేశ్ టూరిజమ్, టూరిస్ట్ ప్లాజా, బేగంపేట, హైదరాబాద్.9866069000 /9951080605లలో సంప్రతించవచ్చు. ఇలా వెళ్లచ్చు! ► హైదరాబాద్ నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి మ«ధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు రైలు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కు 120 కిలోమీటర్లు. రోడ్డుమార్గంలో వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ►ఇండోర్‌లో దేవీ అహిల్యాబాయి హోల్కర్ పేరున అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్కి 95 కిలోమీటర్లు. – నిర్మల చిల్కమర్రి