shooter
-
సిద్ధిఖీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ ( అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్య చేసినప్పటి నుంచి నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.శివకుమార్ బాబా సిద్ధిఖీపై కాల్పలు జరపడానికి 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినటట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయ భవనం బయట ఉన్న సమయంలో సిద్ధిఖీపై మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. శివకుమార్ అరెస్ట్‌తో.. సిద్ధిఖీ హత్యలో ప్రమేయమున్న ముగ్గురు షూటర్లు అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇక.. శివకుమార్ అరెస్టుతో సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా శివకుమార్‌కు ఆశ్రయం కల్పించి.. నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఇక..విచారణలో శివ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్‌తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా భావిస్తున్న శుభమ్ లోంకర్ పలుసార్లు సులభతరం చేశాడని పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు తనతోపాటు మిగితా షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. నిందితులతో కమ్యూనికేట్ చేయడానికి అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్ ఫొటోను కూడా షూటర్లతో పంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘భాను’ అని కూడా పిలువబడే అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. గత సంవత్సరం కెన్యాలో, ఈ ఏడాది కెనడాలో కనిపించటం గమనార్హం.మరోవైపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పుల ఘటన, 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి అన్మోల్ బిష్ణోయ్‌ను పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతన్ని అరెస్టు చేయడానికి ఏదైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.చదవండి: సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండేచదవండి: ‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’ -
యూపీలో మరో ఎన్కౌంటర్
యూపీలో మరో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ మన్నా సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పంకజ్ యాదవ్‌పై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) కాల్పులు జరిపింది. ఈ నేరస్తునిపై పై లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ మృతిచెందాడు. కాగా బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ, మాఫియా షహబుద్ధీన్లకు పంకజ్ యాదవ్‌లకు షూటర్‌గా పనిచేశాడు. అలాగే డబ్బుల కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గానూ పేరొందాడు. ఈ ఘటన గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ మధుర-ఆగ్రా హైవేలోని ఫర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని ఎస్టీఎఫ్ తమకు తెలియజేసిందన్నారు. నేరస్తుడు పంకజ్ యాదవ్ తన సహచరులలోని ఒకరితో కలిసి బైక్‌పై ఆగ్రా వైపు వెళ్తున్నట్లు ఇన్ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతనిని వెంబడించింది. ఆతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్టీఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిగా ఎస్టీఎఫ్ కూడా కాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతని కోసం గాలిస్తోంది.గాయపడిన పంకజ్‌ను మధుర జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. యూపీ ఎస్టీఎఫ్ బృందం సంఘటనా స్థలం నుండి ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. పంకజ్ యాదవ్ మవులోని తాహిరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ గ్రామ నివాసి. మన్నా సింగ్ హత్యలో ప్రమేయమున్న పంకజ్ యాదవ్‌పై హత్య, దోపిడీ తదితర 36 కేసులు నమోదయ్యాయి. పంకజ్ యాదవ్‌ను అరెస్టు చేయడానికి యూపీ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సిబ్బంది చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
గురి కుదిరితే మరో పతకం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు అందించారు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు భారత్ ఖాతాలో షూటింగ్ ద్వారా మూడో పతకం చేరుతుంది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ బరిలోకి దిగారు. స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారిస్: అంతగా అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే అదరగొట్టాడు. ఆద్యంతం నిలకడగా పాయింట్లు సాధించి పతకం రేసులో నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల స్వప్నిల్ 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం 44 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కూడా క్వాలిఫయింగ్‌లో పాల్గొని 589 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్ గుర్తింపు పొందాడు. ‘త్రీ పొజిషన్స్’ అని ఈవెంట్ పేరులో ఉన్నట్టే షూటర్లు వేర్వేరు మూడు భంగిమల్లో లక్ష్యం దిశగా షాట్లు సంధిస్తారు. తొలి సిరీస్‌లో షూటర్లు మోకాళ్లపై (నీలింగ్) కూర్చోని షూట్ చేస్తారు. రెండో సిరీస్‌లో సైనిక భంగిమ (ప్రోన్)లో షూట్ చేస్తారు. చివరిదైన మూడో సిరీస్‌లో నిల్చోని (స్టాండింగ్) లక్ష్యం వైపు షాట్లు కొడతారు. ఈ మూడు భంగిమల్లో స్కోరు చేసిన పాయింట్ల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. అత్యధికంగా పాయింట్లు సాధించి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మహిళల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్, మహారాష్ట్రకే చెందిన తేజస్విని సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటున్న స్వప్నిల్ క్వాలిఫయింగ్‌లో సంయమనం కోల్పోకుండా, ఏకాగ్రతతో షూట్ చేశాడు. ముందుగా ‘నీలింగ్’ సిరీస్‌లో 198 పాయింట్లు... ‘ప్రోన్’ సిరీస్‌లో 197 పాయింట్లు... చివరిదైన ‘స్టాండింగ్’ సిరీస్‌లో 195 పాయింట్లు స్కోరు చేశాడు. స్వప్నిల్తోపాటు జిరీ ప్రివ్రత్స్కయ్ (చెక్ రిపబ్లిక్), పీటర్ నింబర్స్కయ్ (చెక్ రిపబ్లిక్) కూడా 590 పాయింట్లు స్కోరు చేశారు.అయితే ఈ ముగ్గురిలో 10 పాయింట్ల షాట్లు స్వప్నిల్ (38 సార్లు), జిరీ (35 సార్లు) ఎక్కువగా కొట్టడంతో ఏడు, ఎనిమిదో ర్యాంక్‌లతో ఫైనల్‌కు చేరగా... పీటర్ (32 సార్లు) తొమ్మిదో స్థానంతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ‘నీలింగ్’లో 197 పాయింట్లు... ‘ప్రోన్’లో 193 పాయింట్లు... ‘స్టాండింగ్’లో 193 పాయింట్లు స్కోరు చేసి 589 పాయింట్లతో 11వ స్థానాన్ని సంపాదించాడు. లియు యుకున్ (చైనా; 594 పాయింట్లు), జాన్ హెర్మన్ హెగ్ (నార్వే; 593 పాయింట్లు), సెర్హీ కులిష్ (ఉక్రెయిన్; 592 పాయింట్లు), డెనిస్ బెర్నార్డ్ లుకాస్ (ఫ్రాన్స్; 592 పాయింట్లు), లాజర్ కొవాసెవిచ్ (సెర్బియా; 592 పాయింట్లు), టొమాస్ బార్ట్నిక్ (పోలాండ్; 591 పాయింట్లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో నిలిచి స్వప్నిల్, జిరీలతో కలిసి నేడు జరిగే ఫైనల్లో పతకాల కోసం పోటీపడతారు. రాజేశ్వరి, శ్రేయసి విఫలం మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ బరిలోకి దిగారు. మొత్తం 30 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి, శ్రేయసి 113 పాయింట్లు స్కోరు చేసి వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. రోయింగ్ సెమీస్‌లో బల్‌రాజ్‌కు ఆరో స్థానం భారత రోవర్ బల్రాజ్ పన్వర్ పారిస్ ఒలింపిక్స్ సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్లో ఆరో స్థానంలో నిలిచాడు. బుధవారం జరిగిన పోటీల్లో పన్వర్ 7 నిమిషాల 4.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఇక 19 నుంచి 24 స్థానాల కోసం శనివారం జరగనున్న పోటీలో బల్రాజ్ బరిలోకి దిగనున్నాడు. -
0.1 పాయింట్ తేడాతో స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన టీనేజ్ షూటర్ బాన్ హ్యోజిన్ 0.1 పాయింట్ తేడాతో స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగం ఫైనల్లో 16 ఏళ్ల బాన్ హ్యోజిన్ చివరి షాట్లో అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి పతకం చేజిక్కించుకుంది. 22 షాట్లు ముగిసేసరికి బాన్ హ్యోజిన్తో పాటు 17 ఏళ్ల చైనా షూటర్ హువాంగ్ యూటింగ్ 251.8 పాయింట్లతో నిలిచారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా.. అందులో బాన్ 10.4 స్కోరు చేయగా.. హువాంగ్ 10.3 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. తద్వారా బాన్ ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతిపిన్న వయసు మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. స్విట్జర్లాండ్ షూటర్ ఆడ్రే గొగ్నియాల్ 230.3 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. -
మనూ చరిత్ర లిఖించేనా!
మూడేళ్ల క్రితం ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన భారత యువ షూటర్ మనూ భాకర్ తడబడి నిరాశపరిచింది. అయితే ఈసారి ‘పారిస్’లో మాత్రం మనూ తుపాకీ గర్జించింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా క్వాలిఫయింగ్‌లో పూర్తి విశ్వాసంతో లక్ష్యంవైపు గురి పెట్టిన మనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో నేడు జరిగే ఫైనల్లో మనూ అదే జోరు కొనసాగిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ కొడుతుంది. పారిస్: విశ్వ క్రీడల్లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ నుంచి రెండు జోడీలు బరిలోకి దిగినా పతకానికి దూరంగా నిలిచాయి. అయితే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనూ భాకర్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేకెత్తించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా–రమితా జిందాల్ (భారత్) ద్వయం 628.7 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ 626.3 పాయింట్లు సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 28 జోడీలు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్ చేరుకుంటాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్‌కు దూరమయ్యాడు. 33 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. సరబ్జోత్, జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సరబ్జోత్ (16) కంటే 10 పాయింట్ల షాట్లు ఎక్కువ కొట్టిన రాబిన్ వాల్టర్ (17) ఎనిమిదో స్థానంతో ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. నిలకడగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ బరిలో నిలిచారు. మొత్తం 44 మంది షూటర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. మనూ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. రిథమ్ మాత్రం 573 పాయింట్లతో 15వ స్థానాన్ని దక్కించుకొని ఫైనల్‌కు దూరమైంది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో ఒక్కో షూటర్‌కు 10 షాట్లతో ఆరు సిరీస్‌లు అవకాశం ఇచ్చారు. మనూ వరుసగా ఆరు సిరీస్‌లలో 97, 97, 98, 96, 96, 96 పాయింట్లు సాధించింది. నేడు జరిగే ఫైనల్లో వెరోనికా (హంగేరి), జిన్ ఓ యె (దక్షిణ కొరియా), విన్ తు ట్రిన్ (వియత్నాం), కిమ్ యెజి (దక్షిణ కొరియా), జుయ్ లీ (చైనా), తర్హాన్ సెవల్ (టరీ్క), రాన్‌జిన్ జియాంగ్ (చైనా)లతో కలిసి మనూ పోటీపడుతుంది. ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్లు సంధిస్తారు. 10 షాట్ల తర్వాత తక్కువ స్కోరు ఉన్న చివరి షూటర్ ని్రష్కమిస్తుంది. ఆ తర్వాత ప్రతి రెండు షాట్ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు. చివరకు 24 షాట్లు ముగిశాక టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
‘లైఫ్‌స్పాన్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈషా సింగ్..
సాక్షి, హైదరాబాద్: భారత ప్రొఫెషనల్ షూటర్ ఈషా సింగ్ హైదరాబాద్ ఆధారిత లైఫ్‌స్పాన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. భారత ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయసు్కల్లో ఒకరైన ఈషా సింగ్ లైఫ్స్పాన్కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గర్వంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు ఈషా సింగ్ భాగస్వామ్యం కావడం క్రీడా రంగానికి కృషి చేయాలనే తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
షూటర్ సిఫ్ట్ కౌర్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో పతకం లభించింది. మ్యూనిక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 452.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. -
స్వర్ణంతో పారిస్ ఒలింపిక్స్‌కు మేహులి
భారత యువ షూటర్ మేహులి ఘోష్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసింది. అజర్‌బైజాన్‌లోని బాకూలో జరుగుతున్న ఈ టోర్నీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె స్వర్ణం సాధించింది. 1895.9 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచిన మేహులి తాజా ప్రదర్శనతో వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మరో వైపు మేహులి, రమిత, తిలోత్తమ సేన్లతో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అయితే ఈ టోర్నీ ద్వారా ఒలింపిక్ కోటా వ్యక్తిగత ఈవెంట్లకు మాత్రమే పరిమితం. మరో వైపు స్కీట్ టీమ్ 14వ స్థానంలో నిలవగా, ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో టాప్–25లో భారత్‌నుంచి ఒక్క షూటర్ కూడా నిలవలేకపోయాడు. -
భారత షూటర్ల జోరు.. సిఫ్ట్ కౌర్‌కు రెండు స్వర్ణాలు ..
చెంగ్డూ: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్లు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచారు. పంజాబ్ అమ్మాయి సిఫ్ట్ కౌర్ సమ్రా మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో, వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 3527 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ 462.9 పాయింట్లతో విజేతగా నిలువగా, ఆశి చౌక్సీ 461.6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకొని రజతం గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అర్జున్ సింగ్ చీమా, వరుణ్ తోమర్, అన్మోల్ జైన్‌లతో కూడిన భారత జ ట్టు 1730 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చా’.. షూటర్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులకు పాల్పడిన దుండగుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకే తాను వచ్చానని, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇలా చేశానని పేర్కొన్నాడు. ‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు మాత్రమే వచ్చా.’ అని కెమెరా ముందు చెప్పాడు దుండగుడు. గుజ్రాన్‌వాలాకు బైక్‌పై వచ్చానని, తన బంధవు ఇంట్లో బండిని పార్క్ చేసి ర్యాలీకి వచ్చినట్లు వెల్లడించాడు. మరోవైపు.. ఇమ్రాన్ ర్యాలీలో ఇద్దరు షూటర్లు పాల్గొన్నట్లు సమాచారం. ఒకరు పిస్టల్‌తో రాగా.. మరొకరు ఆటోమెటిక్ రైఫిల్‌తో ఉన్నారని పలు మీడియాలు వెల్లడించాయి. మరోవైపు.. కాల్పుల్లో కాలికి తీవ్రంగా గాయమైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని నిలువరించిన పార్టీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఆయనను హత్య చేసేందుకు జరిగిన దాడిగా పార్టీ సీనియర్ నేత రవూఫ్ హసన్ ఆరోపంచారు. ఇదీ చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు -
దుండగుడు చంపాలనుకుంది అబేను కాదట.. కానీ!
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నారా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ముందు ప్రసంగిస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అబే. ఈ ఘాతుకానికి పాల్పడింది కొన్నేళ్ల క్రితం నౌకాదళంలో పని చేసిన తెత్సుయ యమగామి(41)గా గుర్తించారు పోలీసులు. అయితే.. తాను మొదట చంపాలనుకుంది అబేను కాదని పోలీసులకు తెలిపినట్లు జపాన్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓ మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాయి. మత సంస్థపై తనకు కోపం ఉందని, దానితో షింజో అబేకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే హత్యకు పాల్పడ్డానని పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ తెలిపింది. అబే రాజకీయ విశ్వాసలను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాను నేరం చేశానని భావించటం లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే.. ఆ మత గురువు ఎవరనే విషయం తెలియరాలేదు. నౌకాదళంలో మూడేళ్లు విధులు: మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు యమగామి తన హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదని తేలింది. తన గ్రాడ్యూయేషన్ ఇయర్ బుక్‌లో సైతం అదే రాశాడు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అతడు 2005లో హిరోసిమా, క్యూర్ బేస్‌లోని నౌకాదళంలో చేరి మూడేళ్లు పని చేశాడు. 2020లో కన్సాయి ప్రాంతంలోని ఓ తయారీ సంస్థలో ఉద్యోగంలో చేరిన యమగామి.. దానిని సైతం రెండు నెలల క్రితమే మానేశాడు. అలసిపోయాననే కారణం చెప్తూ.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దుండగుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులు: నారా ప్రాంతంలోని అతని అపార్ట్మెంట్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. షింజో అబే భౌతికకాయాన్ని శుక్రవారం టోక్యోకు తరలించారు. మంగళవారం అంతిమసంస్కారాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్ -
నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి
ఇటీవలకాలంలో క్లబ్లో కాల్పులు జరపడం సర్వసాధారణం అయిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నైట్ క్లబ్‌లను తెల్లవార్లు తెరిచే ఉంచుతున్నారు కొంతమంది యజమానులు. అక్కడకు వచ్చిన కొంతమంది పీకలదాక తాగి ఆ మత్తులో చిన్న తగాదాకే ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిపోతున్నారు. నిజానికి అక్కడ ఎలాంటి కారణం ఉండదు. ఆ మత్తులో తూలుతూ ఒళ్లుమరిచి ఇలాంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...హర్యానాలో నైట్ క్లబ్లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్లతోపాటు మరికొంతమంది కూడా వస్తున్నారు. వారంతా కారు పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైందో ఏమో ఇంతలో ఒక వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతే అతడు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్ అతని స్నేహితుడి శరీరంలోకి వెళ్లింది. దీంతో అతని స్నేహితుడి బాధతో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న మహిళా స్నేహితురాలు నివారించేందుకు యత్నించినా ఆమె పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్లు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని వద్ద ఉన్న పిస్టల్ని లాక్కున్నారు. ఐతే కాసేపటికి గాయపడిన వ్యక్తితో సహా నలుగురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు క్లబ్ తెరిచి ఉన్నందుకు యజమాని పైనా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Panchkula, Haryana| At around 4.30am accused open-fired outside Coco cafe in wee hours of July 3. He injured his friend & a bouncer. We've registered a case against accused & another against cafe for keeping it open till so late: PS sector 5 incharge Sukhbir Singh pic.twitter.com/C53n0uDE1p — ANI (@ANI) July 5, 2022 (చదవండి: రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!) -
సిప్పీ సిద్ధూ హత్య కేసు.. ఏడేళ్లకు ప్రొఫెసర్ కళ్యాణి అరెస్ట్
చండీగఢ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షూటర్ సిప్పీ సిద్ధూ కేసులో.. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు, ప్రొఫెసర్ కళ్యాణిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న కళ్యాణిపైనే తొలినాటి నుంచి అందరికీ అనుమానం ఉంది. నేషనల్ లెవల్ షూటర్ సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్ధూ(35) 2015, సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధూ షూటర్ మాత్రమే కాదు.. కార్పొరేట్ లాయర్ కూడా. పైగా ఛండీగఢ్ మాజీ సీజే ఎస్ఎస్ సిద్ధూ మనవడు. రిలేషన్షిప్ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. ఛండీగఢ్ సెక్టార్ 27లో బుల్లెట్లు దిగబడిని అతని మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు. జాతీయ షూటర్, పైగా హైఫ్రొఫైల్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సిప్పీ సిద్ధూ కేసు సంచలనం సృష్టించింది. చివరకు.. పంజాబ్ గవర్నర్ జోక్యంతో.. 2016లో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందించిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు నజరానా ప్రకటించింది సీబీఐ. అంతేకాదు.. సిప్పీ హత్య జరిగిన సమయంలో ఓ యువతి అతనితో ఉందని, ఆమె ఎవరో ముందుకు వస్తే.. ఆమెను నిరపరాధిగా భావించాల్సి ఉంటుందని, లేకుంటే.. ఆమెకు కూడా హత్యలో భాగం ఉందని భావించాల్సి ఉంటుందని ఏకంగా సీబీఐ ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది కూడా. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ఇది అతని ప్రేయసి కళ్యాణి చేయించిన హత్యేనని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది. మరోవైపు 2021లో ఈ కేసులో నజరానాను ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచింది సీబీఐ. ఇక 2020లో సిప్పీతో ఉన్న మహిళను గుర్తించలేకపోయామని కోర్టు తెలిపి.. కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. కళ్యాణి సింగ్‌ను కూలంకశంగా ప్రశ్నించిన తర్వాతే.. అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆపై ప్రత్యేక న్యాయమూర్తి సుఖ్‌దేవ్ సింగ్ ఎదుట ఆమెను హాజరుపరిచి.. నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది సీబీఐ. (చదవండి: స్కూల్స్‌లో కరోనా కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్.. టెన్షన్లో అధికారులు) -
ఉక్రెయిన్ దళంలో చేరిన ఒలింపిక్ షూటర్
Olympic Star Shooter Joins Ukraine Forces: ఉక్రెనియన్ చాంపియన్ షూటర్ క్రిస్టినా డిమిత్రెంకో తన మాతృభూమి రక్షణ కోసం ఉక్రెయిన్ బలగంలో చేరింది. ఆమె 2016 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో బయాథ్లాన్‌లో స్వర్ణం గెలుచుకుందిలో స్వర్ణ పతకం గెలుచుకుంది. బయాథ్లాన్ అనేది స్కీయింగ్, రైఫిల్ షూటింగ్‌లను మిళితం చేసే క్రీడ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న కార్పాతియన్ పర్వతాలలో అంతర్జాతీయ పోటీ కోసం ప్రాక్టీసు చేస్తోంది. అంతేగాదు క్రిస్టినా ఫిబ్రవరి 27న స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఇటలీతో పోటీపడాల్సి ఉంది. ఆమె కీవ్, చెర్నిహివ్‌లలో రష్యా బలగాల విధ్వంసాన్ని తెలుసుకుని ఉక్రెనియన్ యుద్ధంలో చేరాలని నిర్ణయించుకుంది. అంతేగాదు యుద్ధంలో పాల్గొని ఆయుధాలను చేతపట్టడానికి కూడా అర్హత సాధించింది. క్రీస్టినా ఇలాంటి పరిస్థితి ఒకటి తన జీవితంలో ఎదరవుతుందని తాను ఊహించలేదని చెప్పింది. పైగా తనకు శత్రువంటే భయం లేదని, వాళ్లకసలు అవకాశం ఇవ్వకుండా దాడి చేస్తానని చెబుతోంది. అంతేగాదు ఆటలో ఉన్న యుద్ధంలో ఉన్నా చివరి వరకు ఉంటానిని విజయం మనదేనని విశ్వాసం వ్యక్తం చేసింది. అదీగాక ఉక్రేనియన్ దళాలు రష్యా దళాలను ఖార్కివ్ నుంచి వెనక్కి మళ్లేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా డాన్బాస్ ప్రాంతంలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని, రష్యా దళాలు ఏదోరకంగా దురాక్రమణ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
ప్రపంచకప్ టోర్నీకి షూటర్ ఇషా సింగ్
అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ మరో టోర్నీకి సిద్ధమైంది. ఈనెల 9 నుంచి 20 వరకు జర్మనీలో జరిగే ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నీలో ఇషా సింగ్ బరిలోకి దిగనుంది. 17 ఏళ్ల ఇషా 10 మీటర్ల, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో పోటీపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్దినేని ఉమామహేశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. చదవండి: IPL 2022: ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇది: పంత్ -
పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్
న్యూఢిల్లీ: హర్యానాకి చెందిన ఒకవ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో మతపరమైన ద్వేషపూరిత రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేయడంతో పెద్ద వివాదానికి తెరలేపింది. అతను 2020లో హర్యానాలో జామియా మిలియా యూనివర్సిటీ సమీపంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కాల్పులు జరిపిన షూటర్‌గా గుర్తించారు. అతను తనను తాను రాంభక్త్ గోపాల్‌గా చెప్పుకునే యువకుడు. పటౌడీలో జరిగిన 'మహాపంచాయత్'లో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మతపరమైన ప్రసంగాల చేయడంతో అరెస్ అయిన వ్యక్తి. గతేడాదే అతనికి హర్యానా కోర్టు బెయిల్ మంజరూ చేసింది. గోపాల్ తన ఇన్‌స్టాగ్రాంలో ఎస్యూవీ కారులో వస్తూ.. తుపాకితో పిలల్లను బెదిరిస్తున్న వీడియోతోపాటు మరో వ్యక్తిని కొడుతున్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు. పైగా ప్రతి వీడియోలో "గో రక్షా దళ్, మేవాత్ రోడ్ హర్యానా" అని రాసి ఉంది. దీంతో ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ రెండు వీడియోలపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వ్యక్తి తన ఇన్‌స్టాగ్రాంని ప్రైవేట్‌గా మార్చుకున్నాడు. అంతేకాదు గోపాల్ తనను తాను గాడ్సే 2.0గా అభివర్ణించుకుంటూ...ఆయుధాలతో రెచ్చగొట్టే వీడియోలు, ఫోటోలు పెట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేయడంతో ట్విట్టర్లో ఈ మతపరమైన రెచ్చేగొట్టే వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరలు అవుతున్నాయి. Rambhakt Gopal Sharma uploaded a video on his Instagram where people in car TERRORISING young girls & kids by showing guns. The video caption reads 'Gau Raksha Dal, Mewat road, Haryana'. Hello @DGPHaryana @police_haryana, #ArrestRamBhaktGopalpic.twitter.com/IhRTm3dWBm — Mohammed Zubair (@zoo_bear) April 24, 2022 Jamia shooter out on bail Rambhakt Gopal uploaded this video on his instagram with caption "Taking away the cow smuggler". Men with pistols can be seen taking away a man. They have full freedom to violate law everyday and still remain free. Insta link: https://t.co/2ydAyjWY6Z pic.twitter.com/wWHImXQbFF — Kaushik Raj (@kaushikrj6) April 24, 2022 (చదవండి: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన లోకల్ ట్రైన్.. ప్రయాణికుల పరుగులు) -
ఈశాసింగ్.. ట్రిగర్ నొక్కితే బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించాల్సిందే..!
ఈశాసింగ్... తొమ్మిదో ఏట పిస్టల్ పట్టుకుంది.తొలి పిస్టల్ ఖరీదు డెబ్బై వేలు. పాతికకు పైగా జాతీయ పతకాలు. పదికి పైగా అంతర్జాతీయ పతకాలు. ఇప్పుడు స్టార్ పిస్టల్ పట్టుకుంది. మరిన్ని పతకాలకు గురిపెడుతోంది... తెలుగు నేల మీద పుట్టిన ఈ స్టార్ షూటర్. ఈశాసింగ్... గురి చూసి ట్రిగర్ నొక్కితే బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గురితప్పని ఈ షూటర్ అత్యున్నత లక్ష్యం ఒలింపిక్స్. ఆమె వివరాల్లోకి వెళ్తే... నాలుగు తరాల వెనుక (ఈశాసింగ్ తండ్రి తాతగారు) తెలుగు రాష్ట్రానికి వచ్చి స్థిరపడిన రాజ్‌పుత్రుల కుటుంబం వారిది. ఈశా షూటింగ్ ప్రస్థానం కాకతాళీయంగా జరిగిపోయింది. ఈశా తండ్రి సచిన్ సింగ్‌కి బైక్ ర్యాలీ, కార్ ర్యాలీలంటే మహాఇష్టం. ఒకరోజు ‘నాన్నా! లాంగ్‌రైడ్‌కి వెళ్దామా’ అని ఈశాసింగ్ అడగడం, సచిన్ కారు తీయడం, కూతుర్ని సరదాగా తిప్పి ఆ తర్వాత గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్న తన మిత్రుడి దగ్గరకు వెళ్లడం ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే జరిగిపోయింది. ఆ ప్రయాణం... ఆశాసింగ్ కొత్తదారి ప్రయాణానికి శ్రీకారం చుడుతుందని ఆరోజు ఎవరూ అనుకోలేదు. ‘నాకు పిస్టల్ కావాలి’ అని ఆశాసింగ్ అడిగినప్పుడు, డెబ్బై వేలు పెట్టి కొనిచ్చేటప్పుడు కూడా ‘ఈశా ఇంత సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తుందనుకోలేద’న్నారు సచిన్ సింగ్. ‘షూటింగ్ పట్ల నా ఆసక్తిని గమనించిన తర్వాత నాన్న నన్ను పూణెలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు తీసుకువెళ్లారు. అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో 2015, 16, 17 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు బంగారు పతకాలు వచ్చాయి. ఆ పతకాలు చూసి నాన్న తాను ర్యాలీలో గెలిచినంతగా సంతోషించారు’’ అని గుర్తు చేసుకుంది ఆశాసింగ్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండవ ఎడిషన్‌లో బంగారు పతకాన్ని సాధించినప్పటికి ఆమె వయసు 15. షూటింగ్లో ఒలింపిక్ విజేత మనూ భాకర్ మీద విజయం, 2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాన్ని అందుకోవడం ఈశాసింగ్‌కి షూటింగ్ కెరీర్ ఇచ్చిన తీపి జ్ఞాపకాలు. నాన్న త్యాగం ‘‘నాన్న నా కోసం తన ర్యాలీలను మానుకున్నారు. నన్ను కోచింగ్‌కి తీసుకువెళ్లడం, కాంపిటీషన్లకు తీసుకువెళ్లడమే నాన్న ఫుల్‌టైమ్ జాబ్ అయింది. నాన్న నాతో వచ్చినప్పుడు మా స్పోర్ట్స్ షాప్‌ని అమ్మ చూసుకుంటుంది. నేను జర్మనీ, బ్రెజిల్, లిమాపెరూ, చెక్ రిపబ్లిక్లలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్లకు వెళ్లాను. మనదేశంలో జరిగే ప్రతి పిస్టల్ షూటింగ్ కాంపిటీషన్లోనూ పార్టిసిపేట్ చేశాను, మెడల్స్ తెచ్చుకున్నాను. గడచిన డిసెంబర్లో (2021) న్యూఢిల్లీ, ఫరీదాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎయిర్‌పిస్టల్‌షూటింగ్ పోటీల్లో రెండు గోల్డ్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు జాతీయ స్థాయి పతకాలు ఇరవై ఐదు వరకు ఉన్నాయి, ఇంటర్నేషనల్ మెడల్స్ పద్నాలుగు. ఇప్పుడు జర్మనీ కంపెనీ బహూకరించిన స్టార్ పిస్టల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆరు గంటల ప్రాక్టీస్ నా ప్రాక్టీస్ కోసం సికింద్రాబాద్‌లోని మా ఇంట్లోనే చిన్న షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేశారు మా నాన్న. రోజుకు ఆరు గంటల సేపు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే కావడంతో ప్రాక్టీస్‌కి టైమ్ కలసి వస్తోంది. రాంపల్లిలోని రీక్వెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో లెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. నేను కాంపిటీషన్లకు వెళ్లడానికి, స్పెషల్ ట్రైనింగ్ క్లాసులకు వెళ్లడానికి పర్మిషన్ ఇస్తూ మా టీచర్లు, ప్రిన్సిపల్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రయాణమే. ఇష్టంగా మొదలు పెట్టాను. కాబట్టి కష్టం అనుకోవడం లేదు. ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రాక్టీస్, స్కూలు రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లలేను. సినిమాలకు కూడా తక్కువే. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు ఇతర వేడుకలను కూడా వదులుకోవాల్సిందే. ఎక్కువగా టోర్నమెంట్ ప్రయాణాల్లో ఉంటాను. టోర్నమెంట్ నుంచి వచ్చిన తరవాత అప్పుడు మిస్ అయిన పాఠాల నోట్స్ రాసుకోవాలి. ఇదంతా ఒక వైపు అయితే మరోవైపు ఈ ప్రాక్టీస్‌కి అయ్యే ఖర్చు. షూటింగ్ ప్రాక్టీస్‌కి చాలా ఖర్చవుతుంది. పూజా బిల్డర్స్ కొంత వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక మిగిలిన ఖర్చులన్నీ నాన్న చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను సాధించిన మెడల్స్ చూసుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. అలాగే అవి నా బాధ్యతను గుర్తు చేస్తుంటాయి కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలనేది నా లక్ష్యం మాత్రమే కాదు, బాధ్యత కూడా. భారతదేశానికి మెడల్ తెచ్చిన రోజున నేను గర్వంగా ఫీలవుతాను. అప్పటి వరకు సాగే ఈ ప్రయాణం అంతా లక్ష్యసాధనలో అధిరోహిస్తున్న మెట్లు మాత్రమే’’ అని చెప్పింది ఈశాసింగ్. ఆమె లక్ష్యం నెరవేరాలి. మనజాతీయ పతాకం ఒలింపిక్స్‌లో మెరవాలి. గురి తప్పకూడదు. (చదవండి: చండీగఢ్ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ) – వాకా మంజులారెడ్డి -
వర్ధమాన షూటర్ కోనికా ఆత్మహత్య
జాతీయ స్థాయి షూటర్, జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల కోనికా లాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఆశించిన స్థాయి ప్రదర్శన లేకపోవడంతో ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ వద్ద కోనికా శిక్షణ పొందుతోంది. సొంత రాష్ట్రం తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడంతో నటుడు సోనూసూద్ ఆమెకు ప్రత్యేక రైఫిల్ కొనిచ్చి ప్రోత్సహించాడు. ఇటీవల అనూహ్య రీతిలో నలుగురు షూటర్లు ఆత్మహత్యకు పాల్పడటం చర్చకు దారి తీస్తోంది. -
యువ మహిళా షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య.. సుసైడ్ నోట్ రాసి..
కోల్‌కతా: జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడటం తోటి క్రీడాకారులని దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్‌కతాలో తాను ఉంటున్న హాస్టల్లో కొనికా లాయక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్లో రాణించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు నెలల్లో నలుగురు క్రీడాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో సోనూసూద్ రూ. 2.70 లక్షల విలువైన జర్మన్ రైఫిల్‌ను బహుమతిగా అందించడం ద్వారా ఈ క్రీడాకారిణీ వార్తల్లో నిలిచింది. కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతోంది. కోనికా లాయక్ జనవరిలో సోనూ సూద్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేసింది. అందులో.. 11వ జార్ఖండ్ స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేను రజతం, బంగారు పతకం సాధించాను. అయితే, ప్రభుత్వం నుంచి నాకు ఏమాత్రం సహాయం లేదు. దయచేసి సహాయం చేయండని ట్వీట్ చేసింది. తాను ఈ ట్వీట్‌ని సోనూ సూద్‌తో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ అధికారిని కూడా ట్యాగ్ చేసింది. में आपको राइफल दूंगा। आप देश को मेडल दे देना। आपकी rifle आप तक पहुंच जाएगी। @SoodFoundation https://t.co/4JFXdrQl2l — sonu sood (@SonuSood) March 10, 2021 చదవండి: Viral: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న.. -
ఆమెకు పతకం మాత్రమే.. కానీ 34వేల జనాభాగల దేశానికి మాత్రం..
ఎక్కడ విశ్వక్రీడలు జరిగినా... కొద్దో గొప్పో వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం ద్వారా ఓ చిన్ని దేశం సంగతులు తెలిసొచ్చాయి. ఆ పతకాన్ని అలెజాండ్రా పెరిలి షూటింగ్లో గురి పెడితే ఆమె దేశం సాన్ మరినో గురించి మనకందరికీ ఇలా తెలిసొచ్చింది. టోక్యో: ఐరోపాకు చెందిన సాన్ మరినో దేశం గురువారం రాత్రి ఒలింపిక్స్ పుటలకెక్కింది. జనాభా పరంగా పతకం గెలిచిన అతి చిన్న దేశంగా ఘనత వహించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నా... సాన్ మరినోని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసింది మాత్రం 33 ఏళ్ల అలెజాండ్రా పెరిలినే! ఈ మహిళా షూటర్ సాధించిన కాంస్యమే ఆ దేశానికి ఇప్పుడు బంగారంతో సమానం. మహిళల ట్రాప్ ఈవెంట్లో పెరిలి మూడో స్థానంలో నిలిచింది. ఈ వెటరన్ షూటర్ ఒలింపిక్స్‌లో ఆడటం ఇదేం తొలిసారి కాదు. లండన్–2012 ఒలింపిక్స్ నుంచే పతకంపై గురి పెడుతూ వచ్చింది. అక్కడ త్రుటిలో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత రియో ఒలింపిక్స్ (2016)లోనూ పాల్గొన్నప్పటికీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. అంత మాత్రాన తన పనైపోయిందని, మూడు పదుల వయసు దాటిందని ఇక చాలనుకోలేదు. కఠోరంగా ప్రాక్టీస్ చేసి టోక్యోలో కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో పెరిలి 29 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఈవెంట్లో స్లొవేకియా అమ్మాయి స్టెఫెస్కొవా (43 పాయింట్లు) బంగారం గెలిస్తే... కైల్ బ్రౌనింగ్ (అమెరికా–42 పాయింట్లు) రజతం నెగ్గింది. జనాభా 34 వేలు మాత్రమే... సాన్ మరినో ఓ యూరోపియన్ యూనియన్ దేశం. సాన్ మరినో చుట్టూ ఇటలీ ఉంటుంది. జనాభా కేవలం 34 వేలు మాత్రమే! మన రాష్ట్రంలోని పట్టణాల్లో నివసించే జనం కంటే తక్కువే కదా! కానీ ఒలింపిక్స్‌కు కొత్తేం కాదు. 60 ఏళ్ల క్రితం నుంచే రోమ్ ఒలింపిక్స్ (1960) నుంచి విశ్వక్రీడలు ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఓ పతకంపై గురిపెట్టింది. పతకం సాధించిన అతి తక్కువ జనాభా గల దేశంగా రికార్డులకెక్కింది. కేవలం మూణ్నాలుగు క్రీడాంశాల్లో పాల్గొనే సాన్ మరినో ఒలింపిక్ కమిటీ ఆశలన్నీ షూటర్లపైనే! పెరిలి కంటే ముందు ఒలింపిక్స్‌లో సాన్ మరినో దేశం అత్యుత్తమ ప్రదర్శన ఐదో స్థానం. అది కూడా షూటింగ్‌లోనే! లాస్ ఏంజిల్స్ (1984)లో ఫ్రాన్సెసొ నని పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. దీన్ని లండన్‌లో పెరిలి నాలుగో స్థానంతో సవరించింది. షూటింగ్‌తో పాటు రెజ్లింగ్, స్విమ్మింగ్, జూడో ఈవెంట్లలో సాన్ మరినో క్రీడాకారులు పాల్గొంటారు. ఫైనల్లో ఐదో షూటర్ నిష్క్రమించగానే నేను గట్టిగా మనసులో అనుకున్న... మరోసారి నాలుగో స్థానంలో నిలవొద్దని! చివరిదాకా ఏకాగ్రతతో గురిపెట్టాను. తుదకు పోడియంలో నిలిచాను. నాకు, నా దేశానికి ఇదే తొలి పతకం. మా చిన్న దేశానికి ఇదే పెద్ద గర్వకారణం. బహుశా మా వాళ్లంతా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారేమో. –పెరిలి -
2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ
డెహ్రడూన్: ఆమె ఒకప్పుడు అంతర్జాతీయ వేదికల మీద మన దేశ జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు. భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. దేశానికి అవసరమైనప్పుడు ఆమె నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి.. దేశ కీర్తిని పెంచారు. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికం అనుభవిస్తూ.. సాయం కోసం ఎదురు చూస్తుంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్, బిస్కట్ ప్యాకెట్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు దిల్‌రాజ్ కౌర్. ఆ వివరాలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన దిల్‌రాజ్ కౌర్ భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ఈ రంగంలో ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు గెలుచుకున్నారు. అయితే ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ.. ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్ పిస్టల్ షూటర్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు ఒక్క చిప్స్ ప్యాకెట్ ధర కేవలం పది రూపాయలు మాత్రమే అంటూ ఇలా రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను.. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఉత్తరఖండ్ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం, మద్దతు లభించలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి అప్లై చేశాను. కానీ ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అద్దె కట్టడం, మిగతా ఖర్చుల కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్, బిస్కెట్లు అమ్ముతున్నాను’’ అని తెలిపారు. చదవండి: కరోనాతో ‘షూటర్ దాదీ’ మృతి.. మిమ్మల్ని మిస్సవుతున్నాం -
దాదీ మళ్లీ తిరిగొస్తారనుకున్నా: తాప్సీ ఎమోషనల్
ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్ షూటర్స్ ద్వయం (చంద్రో తోమర్–89, ప్రకాశీ తోమర్–84)లో ఒకరైన చంద్రో తోమర్ ఇటీవల తుదిశ్వాస విడిచారు. కోవిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంతోనే ఆమె కన్ను మూశారు. ఈ షూటర్స్ ద్వయం జీవితం ఆధారంగా హిందీలో ‘సాండ్ కీ ఆంఖ్’ (2019) చిత్రం రూపొందింది. తుషార్ హీరానందాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చంద్రోగా భూమీ పెడ్నేకర్, ప్రకాశీగా తాప్సీ నటించారు. ఇటీవల చంద్రో మరణించినప్పుడు భూమి, తాప్సీ ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రీకరణ రోజులను గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రో మరణం, ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రీకరణ అనుభవాల గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘సాండ్ కీ ఆంఖ్’ అధికారిక ప్రకటన రావడానికి కొన్ని రోజుల ముందు మేం ఓ స్టూడియోలో చంద్రో, ప్రకాశీగార్ల రాక గురించి ఆసక్తిగా ఎదురుచూశాం. వారు వారి జీవితాల్లో సాధించిన ఘనతలు వారి పట్ల మా గౌరవాన్ని మరింత పెంచాయి. మా హృదయాల్లో వారికి అత్యున్నత స్థానం కల్పించాము. అందుకే చంద్రో, ప్రకాశీ దాదీ (బామ్మ)లను చూడాలన్న మా ఉత్సాహం క్షణక్షణానికి పెరిగింది. వాళ్లు వచ్చిన తర్వాత వారితో నేను, భూమి నాన్‌స్టాప్‌గా మాట్లాడాం. జీవితంలో వారు చేసిన పోరాటం, పడ్డ కష్టాలు విన్న మాకు అవి స్ఫూర్తినిచ్చాయి. దాదీలు చంద్రో, ప్రకాశీల తరం వేరు. మా తరం వేరు. వారి అనుభవాలు, వారు ఎదుర్కొన్న సంఘటనలు, జీవితంలో వారు సాధించిన పరిణతి వంటి వాటిని మేం (తాప్సీ, భూమి) స్క్రీన్ పై ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. వారిలా ఉండడానికి ప్రయత్నించాం. ఈ ప్రాసెస్‌లో మా జీవితంలో మేం ఎంతో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చంద్రో దాదీ లేరంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల కరోనా రావడానికి ముందు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకుంటున్న చంద్రో దాదీని నేను కలిశాను. ఆమె నన్ను చూసి, గుర్తు పట్టి ఆనందించారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా తిరిగి వచ్చేస్తారనుకున్నాను. కానీ అప్పుడు ఆమె ఫైట్ చేసి, ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. అప్పటిలానే ఈసారి కూడా ఫైట్ చేసి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని ఆశించాం. షఫేలీ (చంద్రో మనవరాలు) ద్వారా మేం చంద్రో దాదీ హెల్త్ ఆప్డేట్స్ తెలుసుకునేవాళ్లం. చంద్రో ఇక లేరని, కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారని షఫేలీ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఇటీవల మా అమ్మమ్మగారు చనిపోయినప్పుడు బాగ్పత్ (చంద్రో నివసించే ప్రాంతం) మీదుగా ఏడాది తర్వాత ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని, కోలుకుంటున్నారని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ‘సాండ్ కీ ఆంఖ్’ షూటింగ్ సమయంలో దాదీ, నేను ఒకే గదిలో ఉన్నాం. ఆమెతో నేను ఎంతో సరదాగా ఉండేదాన్ని. వారి ఇంట్లో రెండు నెలలు ఉన్నాం. నా కుటుంబ సభ్యురాలిగా దాదీని భావించాను. ఆమె లేరనే నిజం చాలా బాధగా ఉంది’’ అని తాప్సీ ఎమోషనల్ అయ్యారు. చదవండి: నోరు మూస్కో, నా టైమ్ వేస్ట్ చేయకు: తాప్సీ -
కరోనాతో ‘షూటర్ దాదీ’ మృతి.. మిమ్మల్ని మిస్సవుతున్నాం
మీరట్: ఆరు పదుల వయసు దాటాక షూటింగ్ క్రీడలో ఓనమాలు నేర్చుకొని... ఆ తర్వాత జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధించి... ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ‘షూటర్ దాదీ’ చంద్రో తోమర్ కరోనా వైరస్‌ను జయించలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన 89 ఏళ్ల చంద్రో తోమర్‌కు గత సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్వాస సంబంధ సమస్యలతో ఆమెను మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా... ఐదు రోజులపాటు మహమ్మారితో పోరాడిన ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇక చంద్రో తోమర్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘సాండ్ కీ ఆంఖ్’ పేరుతో సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా చంద్రో తోమర్ మృతికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం వ్యక్తం చేశారు. You will be missed so much ❤️ Forever #ChandroTomar #ShooterDadi pic.twitter.com/zM9nEhq5Ic — bhumi pednekar (@bhumipednekar) April 30, 2021 For the inspiration you will always be... You will live on forever in all the girls you gave hope to live. My cutest rockstar May the ✌🏼 and peace be with you ❤️ pic.twitter.com/4823i5jyeP — taapsee pannu (@taapsee) April 30, 2021 I'm deeply saddened by tragic demise of our most lovable Dadi Chandro Tomar ji. She was inspiration for millions and will continue to inspire forever. May her soul rest in peace. Om Shanti. 🙏 pic.twitter.com/lsa12up9Oc — Kiren Rijiju (@KirenRijiju) April 30, 2021 -
క్యాన్సర్‌తో భారత మాజీ షూటర్ పూర్ణిమ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్, కోచ్ పూర్ణిమ జనానే (42) కన్నుమూసింది. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమె పుణేలో శనివారం తుదిశ్వాస విడిచింది. భారత్ తరఫున పూర్ణిమ పలు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలు, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో జాతీయ రికార్డు తన పేర లిఖించుకున్న ఆమె కోచ్‌గానూ రాణించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ అవార్డు’ను గెలుచుకుంది. ఆమె మృతి పట్ల భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ), బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, భారత మాజీ రైఫిల్ షూటర్ జాయ్దీప్ కర్మాకర్ సంతాపం వ్యక్తం చేశారు.