space center
-
దివి నుండి భువికి దీపావళి
దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్‌ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్. వారిని స్పేస్‌లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి వచ్చే అవకాశాలు లేవు. సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌కు సునీతా విలియమ్స్ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు. -
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్‌లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్‌లైనర్‌లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్‌స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్‌లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్‌ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్‌కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్‌లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
నాసా ప్రయోగానికి ‘గగన్‌యాన్’ వ్యోమగామి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగంలో పాలుపంచుకొనేందుకు ‘గగనయాన్’ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని ఐఎస్ఎస్కు పంపిచనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించారు. ఉమ్మడి స్పేస్ మిషన్లలో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఐఎస్ఎస్కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో అస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. -
విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్
సాక్షి, ఢిల్లీ: విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా గోపీచంద్ వెళ్లనున్నారు. విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్‌గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్‌కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది. ఆరుగురు వ్యక్తులు వీరే.. అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. ఇస్రో సైతం.. మరోవైపు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు. మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. -
మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్
జెరూసలేం: గాజాలో హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకరపోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. సిమోర్ఘ్ రాకెట్‌తో వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో రాత్రివేళ ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్–2, హతెఫ్–1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్‌కు సంబంధించిన నానో శాటిలైట్లని ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోనప్పటికీ, ఇటీవల జరిగిన ఇస్లామిక్ స్టేట్ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు. -
స్పేస్ పాలసీకి ఆమోదం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ పాలసీ–2023కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తోపాటు ఈ రంగంలోని ప్రైవేట్ సంస్థల పోషించాల్సిన పాత్ర, నెరవేర్చాల్సిన బాధ్యతలను ఈ పాలసీ కింద రూపొందించారు. సహజ వాయువు, సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలపై నియంత్రణకు నూతన ప్రైసింగ్ ఫార్ములానూ కేబినెట్ ఆమోదించింది. దీనిప్రకారం దేశంలో పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజ వాయువు (ఏపీఎం గ్యాస్) ధరలే ఇకపై ముడి చమురు ధరలకు సూచికగా ఉంటాయి. ఇప్పటిదాకా అమెరికా, రష్యా చమురు ధరల ఆధారంగా మన దేశంలో ధరలను నిర్ణయిస్తున్నారు. -
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్- ఎస్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో మరో మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం ప్రకటించించింది. ఈ నెల 15నే విక్రమ్-ఎస్ ప్రయోగం నిర్వహించాలని భావించినప్పటికీ.. నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ‘వాతావరణం అనుకూలించకపోవటం వల్ల విక్రమ్-ఎస్ రాకెట్ లాంఛ్‌ను మరో మూడు రోజులు 15-19 మధ్య చేపట్టాలని నిర్ణయించాం. నవంబర్ 18 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.’ అని తెలిపింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్. ‘ప్రారంభ్’ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం -
15న నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 15న నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఉదయం11.30 గంటలకు ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ప్రారంభ్ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా? -
వచ్చేవారమే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్
న్యూఢిల్లీ: భారత్‌లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ ప్రయోగాన్ని వచ్చేవారమే చేపట్టబోతున్నారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12–16 తేదీల మధ్య ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మొత్తం ప్రయోగానికి ‘ప్రారంభ్ మిషన్’ అని నామకరణం చేశారు. విక్రమ్–ఎస్ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్–ఎస్ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. ‘ఇన్–స్పేస్’ క్లియరెన్స్ దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్–స్పేస్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ప్రైవేట్ విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్–స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ లభించింది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 12–16 మధ్య ప్రయోగం చేపట్టే వీలున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రతినిధి శిరీష్ పల్లికొండ మంగళవారం తెలిపారు. ప్రారంభ్ మిషన్‌ను ఆరంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్‌కుమార్ చందన వెల్లడించారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ -
రాకెట్ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుందా?..అయితే ఇది మీకోసమే!
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్ మిషన్‌ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోండి మరి. ఎస్ఎస్ఎల్వీ-డీ1/ఈఓఎస్-02 మిషన్‌ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్లో పేర్కొంది ఇస్రో. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను షేర్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఈఓఎస్-02 , ఆజాదిసాట్ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్. The launch of the SSLV-D1/EOS-02 Mission is scheduled for Sunday, August 7, 2022, at 9:18 am (IST) from Satish Dhawan Space Centre (SDSC), Sriharikota. ISRO invites citizens to the Launch View Gallery at SDSC to witness the launch. Registration is open at https://t.co/J9jd8yDs4a pic.twitter.com/rq37VfSfXu — ISRO (@isro) August 1, 2022 ఇదీ చదవండి: Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం -
చైనా అంతరిక్ష కేంద్రానికి మరో ముగ్గురు
బీజింగ్: చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగస్వాములను చేసేందుకు మరో ముగ్గురు వ్యోమగాములను ఆదివారం నింగిలోకి పంపనుంది. తియాంగాంగ్ స్పేష్ స్టేషన్‌కు వ్యోమగాములు చెన్ డాంగ్, లీయాంగ్, కాయ్ క్సుజీలను షెంజూ–14 వ్యోమనౌక ద్వారా నింగిలోకి పంపుతున్నట్లు చైనా మానవసహిత స్పేస్ ఏజెన్సీ(సీఎంఎస్ఏ) శనివారం పేర్కొంది. గన్సులోని జిక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా రెండు ల్యాబ్ మాడ్యుల్స్ వెంటియాన్, మెంగ్టియాన్లను నింగిలోకి పంపుతారు. అక్కడికి వీటిని తీసుకెళ్లాక వాటిలో డజనుకుపైగా శాస్త్రీయ ప్రయోగ క్యాబినెట్లను అమర్చుతారు. వచ్చే ఆరు నెలలపాటు వారు చైనా స్పేస్‌స్టేషన్(సీఎస్ఎస్)లోనే గడుపుతారు. ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు అక్కడికి వెళ్లగా ఏప్రిల్‌లో ఒక మహిళా వ్యోమగామి తిరిగి భూమిని చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా వెళ్లిన ఆ ముగ్గురు అక్కడ కీలక స్పేస్ టెక్నాలజీల పనితీరును పునఃపరీక్షించారు. రష్యా సాయంతో నిర్మితమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) భవిష్యత్‌లో నిర్వీర్యమైతే చైనా స్పేస్ స్టేషన్(సీఎస్ఎస్) ఒక్కటే మానవనిర్మిత కేంద్రంగా రికార్డులకెక్కనుంది. ఈ ఏడాది మొత్తంగా సీఎస్ఎస్కు 140 ఉపకరణాలు పంపేందుకు 50 అంతరిక్ష ప్రయోగాలు చైనా చేపట్టనుంది. -
NASA: మళ్లీ తెరపైకి ఏలియన్ల ఊసు!
గ్రహాంతరవాసుల ఉనికిపై మరోసారి అమెరికా వరుస ప్రకటనలకు దిగుతోంది. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration).. గ్రహాంతరవాసుల జాడకు సంబంధించిందిగా చెప్తూ ఓ ఫొటోను రిలీజ్ చేసింది. తాజాగా యూఎస్ స్పేస్ కమాండ్.. 2014లో భూమిని ఢీ కొట్టిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్‌గా ధృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్ సైతం ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి.. ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంగారక గ్రహాంపై గుర్తు తెలియని ముద్రలకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేయగా.. అది ముమ్మాటికీ ఏలియన్లకు సంబంధించిందేనన్న చర్చ ఊపందుకుంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా క్యాప్చర్ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేయగా.. ఫాలోవర్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఏలియన్ల ఉనికి తెలుస్తుందా? 2017లో భూమిని తాకిన ఓ శకలాన్ని.. ‘ఒయూమువామువా’గా నామకరణం చేశారు. సాంకేతిక పరిశోధనలతో.. అది ఇంటర్ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) ఆబ్జెక్ట్‌గా తేలింది. అయితే.. అంతకంటే ముందే 2014 జనవరిలో ఓ ఉల్క భూమిని తాకింది. తాజాగా దీనిని కూడా ఇంటర్ స్టెల్లర్ ప్రాజెక్టుగానే ధృవీకరించింది అమెరికా స్పేస్ కమాండ్. మరో సౌర వ్యవస్థ నుంచి దూసుకొచ్చిన ఈ స్పేస్ రాక్‌ను హార్వార్డ్ ఖగోళ పరిశోధకులు అమీర్ సిరాజ్, అబ్రహం లియోబ్‌లు పరిశోధనలు జరిపి.. ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్‌గా నిర్ధారించారు. దీంతో 2017లో భూమిని తాకిన ‘ఒయూమువామువా’ను రెండో ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్‌గా తేల్చినట్లు అయ్యింది. 6/ “I had the pleasure of signing a memo with @ussfspoc’s Chief Scientist, Dr. Mozer, to confirm that a previously-detected interstellar object was indeed an interstellar object, a confirmation that assisted the broader astronomical community.” pic.twitter.com/PGlIOnCSrW — U.S. Space Command (@US_SpaceCom) April 7, 2022 అటువంటి ఇంటర్ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) శకలాలు.. గ్రహాంతర జీవుల ఉనికిని ఇతర ప్రాంతాలకు మోసుకెళ్తాయని పరిశోధకులు నమ్ముతారు. ఇంటర్ స్టెల్లర్ మెటోర్స్ అనేవి ఇతర గ్రహాల వ్యవస్థ, అక్కడి ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు విశ్వంలో జీవరాశి(పాన్స్పెర్మియా) గురించి తెలియజేసేందుకు మధ్యవర్తిత్వం లాగా అవి పని చేస్తాయని అబ్రహం లోయిబ్ అంటున్నారు. అయితే.. 2014 ఉల్క సంగతి ఏమోగానీ.. ఒయూమువామువా మాత్రం ఆస్టరాయిడ్ అనడం కంటే.. ఏలియన్ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుగా దాదాపు నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. హాలీవుడ్లో ఇంటర్ స్టెల్లర్ మూవీ.. అదే ఏడాది నవంబర్‌లో రిలీజ్ కావడం కొసమెరుపు. -
వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు
వ్యోమగామిగా ఉండటం కష్టమైన ఉద్యోగాలలో ఒకటిని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణించి తమకిచ్చిన పనిని పూర్తి చేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే రిస్క్‌తో కూడుకున్న జాబ్ అనే చెప్పాలి. టెక్నాలజీ పుణ్యమా అని స్పేస్ ప్రయాణం కూడా ముందున్నంత కష్టంగా లేవనే చెప్తున్నారు వ్యోమగామలు. తాజాగా ఓ వ్యోమగాముల బృందం అంతరిక్షంలో పార్టీ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లలో రోజులు కాదు నెలల కొద్దీ గడిపేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న కొందరు వ్యోమగాములు అక్కడ సరదాగా పిజ్జా పార్టీ చేసుకున్నారు. ఈ వీడియోను ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్.. థామస్ పెస్క్వెట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. స్నేహితులతో కలిసి ఓ తేలియాడే పిజ్జా నైట్, మరోలా చెప్పాలంటే మాకిది భూమిపై శనివారం జరుపుకునే పార్టీలా అనిపిస్తుందని క్యాప్షన్‌గా పెట్టాడు. ఆ వీడియోలో.. స్పేస్ షిప్లో ఉన్న కొందరు వ్యోమగాములు పిజ్జాలు గాలిలో ఎగురుతుంటే.. తమ నోటితో పట్టుకొని తింటున్నారు. అక్కడ ఏ వస్తువు అయినా అలా ఎగురుతూనే ఉంటాయి. స్పేస్‌లో గ్రావిటీ ఉండదనే సంగతి తెలిసిందే. ఏదైనా సరే గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే. అంతెందుకు స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు మనుషులు కూడా గాలిలో ఎగురుతూనే ఉంటారు. అందుకే.. స్పేస్‌లో ఉండటం చాలా కష్టం. మొత్తానికి.. వ్యోమగాములు పిజ్జా పార్టీ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరచడంతో పాటు ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Thomas Pesquet (@thom_astro) చదవండి: Italy Fire Accident: ఎత్తైన బిల్డింగ్.. అగ్నికీలలతో సుందర భవనం ఎలా మారిందంటే.. -
చైనా పెను సంచలనం
సంచలనానికి చైనా సిద్ధపడింది. సొంత స్పేస్ స్టేషన్ ‘టియాన్‌గోంగ్’ ద్వారా అరుదైన ప్రయత్నానికి సిద్ధపడింది. త్వరలో ప్రారంభం కానున్న(పూర్తి స్థాయిలో) ఈ స్పేస్ స్టేషన్ ద్వారా ఒకేసారి వెయ్యి ప్రయోగాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో క్యాన్సర్‌కి ‘స్పేస్ ట్రీట్మెంట్’ సంబంధిత ప్రయోగాలు కూడా ఉండడం విశేషం. బీజింగ్: మెడికల్ రీసెర్చ్, సాంకేతిక అధ్యయనాలతో పాటుగా వెయ్యి ప్రయోగాలను అదీ ఒకేసారి స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ స్టేషన్లో నిర్వహించాలని చూస్తోంది. భూమి నుంచి 388.9 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్పేస్ ఏజెన్సీలోకి ఇంటర్నేషనల్ స్పేష్ ఏజెన్సీ(ఐఎస్ఎస్), రష్యా స్పేస్ ఏజెన్సీ మిర్ లాగా ఇతర దేశాల స్పేస్ సైంటిస్టులకు అనుమతి ఇవ్వకూడాదని నిర్ణయించుకుంది. మైక్రోగ్రావిటీ ప్రయోగాలు ఇక స్పేస్ స్టేషన్ ద్వారా ప్రయోగాలకు డిఫరెంట్ మాడ్యూల్స్‌ను(ఇప్పటికే మూడు ఉన్నాయి) ఏర్పాటు చేయబోతోంది డ్రాగన్ కంట్రీ. నేచర్ కథనం ప్రకారం.. హై ఎనర్జీ కాస్మిక్ రేడియేషన్‌ను గుర్తించడానికి 1-2బిలియన్ల యువాన్లను(దాదాపు 310 బిలియన్ డాలర్లు)దాకా ఖర్చు చేయబోతోంది. తద్వారా కాస్మిక్ కిరణాలు, చీకటి సంబంధిత అధ్యయనాలను సులువుగా కొనసాగించనుంది. అంతరిక్షంలో చికిత్స? స్పేస్ క్రోగ్రావిటీలో క్యాన్సర్ మీద కూడా అధ్యయనం చేపట్టాలని చైనా నిర్ణయించుకుంది. త్రీడీ బ్లాబ్స్ను పంపడం ద్వారా ఆరోగ్యవంతమైన వాటితో పాటు క్యాన్సర్ కణజాలాల మీద ఏకకాలంలో ప్రయోగాలు నిర్వహించనుంది. తద్వారా.. తక్కువ గ్రావిటీ వాతావరణంలో(అంతరిక్షంలో) క్యాన్సర్ కణాల పెరుగుదల నెమ్మదించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడమో నిర్ధారించుకునే దిశగా ప్రయోగాలు చేయనుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే.. The China Manned Space Agency ‘అంతరిక్ష వైద్యానికి బీజం వేయనుంది. అంటే క్యాన్సర్ పేషెంట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి చికిత్స అందించడమో లేదంటే అక్కడ తయారు చేసిన మందుల్ని ఉపయోగించడమో(భూ వాతావరణానికి తగ్గట్లు పనిచేసే విధంగా) ద్వారా సంచలనానికి తెర తీయాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ‘వ్యోమగాముల ఆరోగ్యం కోసం’ అనే హింట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుల్లో క్యాన్సర్ పేషెంట్లకు స్పేస్ ట్రీట్మెంట్ అందించే ఆలోచన చేస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు గ్లోబల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రెండు స్పేస్ ల్యాబ్‌లు స్పేస్ స్టేషన్లో కొత్తగా రెండు ల్యాబ్‌లను ప్రారంభించాలని చైనా భావిస్తోంది. అయితే ఐఎస్ఎస్ లాగా కాకుండా.. ఒకేసారి వంద మంది చేరుకునే ప్రయోగానికి రెడీ అయ్యింది. ఇంకా చాలా ప్రయోగాలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని, చైనా ఆస్ట్రోఫిజిస్ట్ జాంగ్ షువాంగ్ నాన్ ‘నేచర్’తో వ్యాఖ్యానించాడు. వీటిలో చాలావరకు(తొమ్మిది ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కలిపి) ఇతర దేశాల సహకారంతోనూ నిర్వహించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు 40 దేశాల నుంచి అభ్యర్థనలు రాగా.. అమెరికా-రష్యాలతో పోటీపడి నిలబడేందుకు చైనాకు మంచి అవకాశమే దొరికినట్లయ్యింది. -
బెజోస్ అంతరిక్షయాత్ర: మౌనం వీడిన గూగుల్ సీఈవో పిచాయ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం గ్లోబల్ బిలియనీర్ల అంతరిక్ష యానం హవా నడుస్తోంది. ఇప్పటికే బిలియనీర్, వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చారిత్రక రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోగా మరో బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెలలోనే నింగిలోకి దూసుకెళ్లెందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా టెక్ దిగ్గజం, గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షం నుంచి భూమిని చూడటం అంటే తనకు కూడా చాలా ఇష్టమని, త్వరలోనే బెజోస్ నింగిలోకి వెళ్లడం తనకు కొంచెం జెలస్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మనుషులు సృష్టించిన అత్యంత లోతైన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో బీబీసీ ఇంటర్వ్యూలో పిచాయ్ పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా చివరి సారిగా ఎపుడు ఉద్వేగానికి లోనయ్యారని అడిగినప్పుడు కోవిడ్-19 ఉదృతి సమయంలో ప్రపంచవ్యాప్తంగా మృత దేహాలతో ఉన్న ట్రక్లు క్యూలో ఉన్న దృశ్యాన్ని, అలాగే గత నెలలో భారత దేశంలో నెలకొన్న పరిస్థితి చూసి కన్నీళ్లొచ్చాయని చెప్పుకొచ్చారు. తమిళనాడులో పుట్టి చెన్నైలో పెరిగిన గూగుల్ సీఈఓ తాను అమెరికన్ పౌరుడినే అయినప్పటికీ తనలో భారతమూలాలు చాలా లోతుగా పాతుకుపోయాయన్నారు. భారతీయత తనలో కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. భద్రత కోసం ఒకేసారి 20 ఫోన్లు వాడతా వివిధ ప్రయోజనాల నిమితం ఒకేసారి 20 ఫోన్లను ఉపయోగిస్తున్నానని సుందర్ పిచాయ్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీను పరీక్షించేందుకు ఫోన్‌ను నిరంతరం మారుస్తూ ఉంటానని చెప్పారు. పెద్ద టెక్ కంపెనీలను నడిపే సాంకేతిక నిపుణుల వ్యక్తిగత టెక్ అలవాట్లను తెలుసుకోవడం చాలా సాయపడుతుంద న్నారు. దీంతోపాటు తన పిల్లల కోసం కేటాయించే సమయం, స్క్రీన్ సమయం, పాస్వర్డ్ మార్పులు సహా తన టెక్ అలవాట్లను పంచుకున్నారు. అలాగే పన్ను వివాదాస్పద అంశంపై స్పందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపు దారులలో తాము ఒకరమనీ, ముఖ్యంగా యూఎస్‌లో ఎక్కువగా చెల్లిస్తున్నామన్నారు. గత దశాబ్దంలో సగటున 20 శాతానికి పైగా పన్నులు చెల్లించామని తెలిపారు. కాగా నాసా అపోలో మూన్ ల్యాండింగ్ వార్షికోత్సవం సందర్భంగా బ్లూ ఆరిజిన్ అంతరిక్ష విమానం న్యూ షెపర్డ్ వ్యోమనౌక బెజోస్ సుమారు 100 కిలోమీటర్లు లేదా 328వేల అడుగులు ఎగురుతుందని భావిస్తున్నారు. జెఫ్ బెజోస్ అతని సోదరుడు మార్క్ బెజోస్, ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి ప్రవేశించ నున్నారు. నిజానికి రోదసీయాత్ర చేసిన తొలి బిలియనీర్‌గా రికార్డు సృష్టించాలని బెజోస్ భావించారు. ఈ వ్యూహాలతో కార్యాచరణలో ఉండగానే అనూహ్యంగా బెజోస్ కంటే ముందే రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో నింగిలోకి వెళ్లి ఆ రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’
పత్రికల్లో పజిల్స్ వస్తుంటాయి. దారి చూపండి.. రంగులు వేయండి. ఆరు తేడాలను గుర్తించండి. ఖాళీలు నింపండి. అన్నీ.. చిన్నపిల్లలు చేసేవి. వీళ్లూ చిన్నపిల్లలే.. టెన్త్ పిల్లలు. స్పేస్ ఇండియా వీళ్లకో పెద్ద పజిల్ ఇచ్చింది. ‘కనుక్కోండి చూద్దాం?’ అంది. ఆ పజిల్నీ పూర్తి చేశారు! కొత్త ఆస్టరాయిడ్‌ను కనిపెట్టి.. ‘కనుక్కున్నాం చూడండి’ అన్నారు! పైన అంతరిక్షంలో అనేకం తిరుగుతుంటాయి. గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు! నక్షత్రాలు కూడా ఉంటాయి కానీ వాటిని ‘తిరుగుతున్నాయి’ అనకూడదు. వాటి దారి వేరే. సూర్యుడిలా సొంత రూట్లో ప్రయాణిస్తూ ఉంటాయి. అదొక మర్మదేశం. దేశం అంటే చిన్నదైపోతుంది. అంతుచిక్కని ‘విశ్వాంతరాళం’. ఆదీ అంతమూ తెలియని రహస్యం. వాటిల్లో కొన్ని శాస్త్ర పరిశోధకులకు మాత్రమే కనిపించేవి. మరికొన్ని మామూలు కంటికి కూడా కనిపించేవి. కొన్ని రోజులుగా డాబాలపై నుంచి ‘నియోవైజ్’ అనే తోకచుక్క కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆ తోకచుక్కను వట్టి కంటితో చూడగలిగాం. దాదాపు 5 కి.మీ. పొడవున ఉన్న నియోవైజ్ భూమికి పది కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి కూడా రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో తూర్పు దిక్కున పైకి తేలుతోంది. మళ్లీ 6,766 ఏళ్ల తర్వాతే నియోవైజ్ కనిపించడం! ఇప్పుడిక ‘నియోవైజ్’ తోక చుక్కను మించిన అద్భుతంలోకి వద్దాం. మనలాగే రోజూ ఆ తోకచుక్కను చూస్తూ, ఆశ్చర్యపడవలసిన ఇద్దరు అమ్మాయిలు.. ఆ తోక చుక్కను కూడా దాటిపోయి, ఆకాశంలో ఓ లఘు గ్రహాన్ని (ఆస్టరాయిడ్) కనిపెట్టారు! ఆ ఆస్టరాయిడ్ వీళ్ల కళ్లలో పడింది భూకక్ష్యలో ఉండి కాదు. అంగారకుడి చుట్టూ తిరుగుతూ!! నియోవైజ్ తోక చుక్క గురించి ‘నాసా’ వాళ్లు ప్రపంచానికి వెల్లడించక ముందు నుంచే గత రెండు నెలలుగా వైదేహి, రాధిక అనే ఆ ఇద్దరమ్మాయిలు కొత్త గ్రహాల కోసం ఖగోళాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ‘సవానీ చైతన్య విద్యాసంకుల్’లో టెన్త్ విద్యార్థినులు వాళ్లు. ‘ఆలిండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ 2020’ భాగంగా గగనాన్ని గాలిస్తున్నప్పుడు ఆ ఆస్టరాయిడ్‌పై వీళ్ల దృష్టి పడింది! ‘పాన్ స్టార్స్’ అనే టెలిస్కోప్‌లో పరిశీలిస్తూ ఇద్దరూ ఒకేసారి అంగారకుడి కక్ష్యలో ఆస్టరాయిడ్‌ను గుర్తించారు. అంత శక్తిమంతమైన టెలిస్కోప్ ఈ అమ్మాయిల చేతికి ఎలా వచ్చింది? ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ (ఐజక్) అనే బహుళ విశ్వవిద్యాలయాల సంస్థ, టెక్సాస్‌లోని హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. వాటితో ఒప్పందంలో ఉన్న ఇండియాలోని ‘స్పేస్ ఇండియా’ (హర్యానా) ఈ అన్వేషణ కోసం.. అంతరిక్ష పరిజ్ఞానం, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తుల నుంచి ఆహ్వానించి, పోటీ పరీక్ష నిర్వహించి వైదేహి, రాధికలను ఎంపిక చేసుకుంది. భూమికి కనుచూపు మేరలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కనిపెట్టడం సెర్చ్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. కరోనా సమయం కాబట్టి వీళ్ల ఈ అన్వేషణ అంతా ఇంటి నుంచే జరిగేలా స్పేస్ ఇండియా ఏర్పాట్లు చేసింది. అంతకుముందే అన్వేషణ విధానాలలో శిక్షణ ఇచ్చింది. అంతరిక్షంలో మొదట వీళ్లు దాదాపు ఇరవై ఖగోళ పదార్థాలేవో గుర్తించారు. అయితే అవేవీ ఆస్టరాయిడ్స్ కాదు. చివరికి అసలైన ఆస్టరాయిడ్ కంటికి చిక్కింది. అయితే అది ఆస్టరాయిడేనా?! నిర్థారణ కోసం ఆ లోకేషన్‌ని ‘స్పేస్ ఇండియా’ నాసాకు పంపింది. ‘ఎస్.. ఆస్టరాయిడే’ అంది నాసా. తాత్కాలికంగా ఆ ఆస్టరాయిడ్కు హెచ్.ఎల్.వి.2514 అనే పేరు పెట్టింది. దాని కక్ష్యను కూడా నాసా గుర్తించాక (ఇందుకు సంవత్సరాలు పడుతుంది) ఆ ఆస్టరాయిడ్కు పేరు పెట్టే అవకాశాన్ని ఈ ఇద్దరు అమ్మాయిలకు ఇస్తుంది! హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీలో గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిల్లర్ పంపిన ప్రత్యేక అభినందనలలో వైదేహి రాధిక ఇప్పుడు మేఘాలలో విహరిస్తున్నారు. యు.ఎస్.లోని నాసా వరకు ఎగరాలన్నది వారి కోరిక. వైదేహి తండ్రి వస్త్రవ్యాపారి. రాధిక తండ్రి కంప్యూటర్స్ విడిభాగాలు దుకాణం. కూతుళ్లు ఇంత సాధించాక తల్లిదండ్రులు గాలితో తేలిపోకుండా ఉంటారా! -
రోబోలతో రోబోల కోసం
చందమామని అందుకోవాలన్న భారత్ కలలు ఈ ఏడాది కొంతవరకు ఫలించాయి. ఇస్రో చంద్రయాన్–2 ఇంచుమించుగా విజయం సాధించింది. చిన్న సాంకేతిక లోపంతో చంద్రుడిపైకి వెళ్లి కూడా నిలబడలేకపోయింది. ఒకట్రెండు సంవత్సరాల్లో చంద్రుడిపైకి మనుషుల్ని పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జపాన్ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. 2020లో చంద్రుడిపై ఒక స్థావరం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్థావరం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని రోబోలే నిర్మిస్తాయి. ఆ స్థావరంలో రోబోలే ఉంటాయి. చంద్రుడికి ఆవలివైపు వెళ్లాలన్నా, ఖగోళ రహస్యాలను ఛేదించాలన్నా, అంగారకుడిపై పరిశోధనలు చేయాలన్నా చంద్రుడిపై ఇంధనం నింపుకోవడానికి ఒక స్థావరం ఎంతో అవసరం. చంద్రుడిపై హీలియం నిల్వలు ఉన్నాయని భావిస్తుండటంతో అక్కడే ఇంధనం తయారు చేయొచ్చన్న ఆలోచనలూ ఉన్నాయి. -
ఎడారి కమ్ముకొస్తోంది
భారత దేశంలో నేలతల్లి నెర్రలు విచ్చుకుంటోంది. పచ్చదనంతో కళకళలాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన భూమి ఎందుకూ పనికి రాకుండా ఎడారిగా మారిపోతోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అంచనాలు, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో 328.72 మిలియన్ హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంటే అందులో 96.4 మిలియన్ హెక్టార్ల ప్రాంతం ఎడారిగా మారిపోయింది.అంటే 30శాతం భూమి ఎందుకూ పనికి రాకుండా పోయిందన్న మాట. మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. ఎనిమిది రాష్ట్రాలో పరిస్థితి మరీ ఘోరం. 40–70% ఎడారిగా మారిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. ఇక మిజోరంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. 5.8శాతంగా ఇది ఉంది. 2003–2011 మధ్యలో అత్యధికంగా1.8 మిలియన్ హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ 14.35 శాతం , తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది. ఎందుకీ పరిస్థితి ? నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా ఉత్పాదక భూమి పంటలు పండడానికి అనుగుణంగా లేకపోవడాన్నే ఎడారీకరణ అంటారు. దీని కారణంగా నీటి వనరులు తగ్గిపోతాయి. మొక్కలు పెరగవు. వన్యప్రాణులకు స్థానం ఉండదు. ఎడారిలో పూలు పూస్తాయా ! దేశంలో ఎడారీకరణ తగ్గిస్తామని భారత్ ఐక్యరాజ్య సమితి సదస్సులో 1994లోనే సంతకాలుచేసింది. 2030 నాటికి వ్యర్థంగా మారిన భూముల్ని సాగుకు అనుగుణంగా చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ సెప్టెంబర్‌లో భారత్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పద్నాలుగో సదస్సు (కాప్–14)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు సందర్భంగా వచ్చే మూడున్నరేళ్లలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, నాగాలాండ్ అటవీభూముల్ని పెంచుతామని హామీ ఇవ్వనుంది. నీటి వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, భూ సార పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు వంటి చర్యల ద్వారా భారత్ ఎడారిలో పూలు పూయించనుంది. -
అంతరిక్షంలో ఆపరేషన్ శక్తి
శత్రుదేశాల ఉపగ్రహాలను ఆకాశంలోనే పేల్చివేయగలిగిన క్షిపణిని భారత్ తన దేశీయ పరిజ్ఞానంతోటే డీఆర్డీఓ నేతృత్వంలో ప్రయోగించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. భూమికి సమీపంలో అంటే 300 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని కేవలం మూడు నిమిషాల వ్యవధిలో భూమ్మీద నుంచి ప్రయోగించి కూల్చడం ఏరకంగా చూసినా మన శాస్త్రవేత్తలకు చారిత్రాత్మక విజయం అనే చెప్పాలి. ప్రతిపాదన వచ్చినవెంటనే ఆమోదముద్ర తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ ఆరంభంలోనే సగం విజయాన్ని ఖాయం చేశారు. అంతరిక్షంలో మిషన్శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అందరికీ అర్థమవుతోంది. భారతదేశం ‘ఆపరేషన్ శక్తి’ పేరిట అంతరిక్ష ఉప గ్రహ, క్షిపణి ప్రయోగాల్లో చరిత్రాత్మక ఘనవిజ యాన్ని సాధించడం ప్రశం సనీయం. గత కొన్నేళ్లుగా మన శాస్త్రవేత్తలు అహర్ని శలు సల్పుతున్న కృషి ఫలి తమే ఈ ఘనవిజయానికి కారణం. శత్రుదేశాల ఉపగ్రహాలను ఆకాశంలోనే పేల్చివేయగలిగిన క్షిపణిని భారత్ తన దేశీయ పరిజ్ఞానంతోటే డీఆర్డీఓ నేతృత్వంలో ప్రయోగించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. భూమికి సమీపంలో అంటే 300 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని కేవలం మూడు నిమిషాల వ్యవధిలో భూమ్మీద నుంచి ప్రయోగించి కూల్చడం ఏరకంగా చూసినా మన శాస్త్రవేత్తలకు చరిత్రాత్మక విజయం అనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో మిషన్శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అందరికీ అర్థమవుతోంది. ఈ క్షిపణి ప్రయోగ చర్యను దేశభద్రతను పెంపొందించడం కోసం, ప్రపంచ శాంతి ప్రయోజ నాల నిమిత్తం నిర్వహించడమైనది. ఈ ప్రయోగం కోసం గత కొన్నేళ్లుగా భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం, నిధుల కోసం ప్రయత్నించారు. ప్రతిపాదన వచ్చిన వెంటనే భారత ప్రధాని నరేంద్రమోదీ మంజూరు చేసి శాస్త్రవేత్తల వెన్నుతట్టినప్పుడే సగం విజయం చేకూరింది. ప్రయో గం విజయవంతం అయ్యాక దాన్ని భారత శాస్త్రవే త్తల చరిత్రాత్మక ఘనవిజయంగా ప్రధాని మోదీ వర్ణించి అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగాములైన అమె రికా, రష్యా, చైనాల సరసన నాలుగో స్థానంలో భార త్ను నిలపడంపట్ల మన శాస్త్రజ్ఞులను కొనియాడారు. అంగారక గ్రహంపై ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాలతో పోటీ పడుతూ భారత్ మంగళయాన్ పేరిట 2013 నవం బర్ 5న అంగారకుడిపైకి తన తొలి ఉపగ్రహాన్ని పంపించింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆనాడే దేశం ఆకర్షించింది. రెండేళ్ల కిందట 2017 ఫిబ్రవరి 14న రష్యా రికార్డును బద్దలు చేసిన భారత్ ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2014లో ఒకేసారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన రష్యా రికార్డును అధిగమించి భారత్ 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపడం సాధారణ విషయం కాదు. ఇది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేస్తున్న అవిరామ కృషి. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనా రంగంలో మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ అపారమైన జ్ఞానం, అనుభవం సంతరించుకుని ఉంది. ఉపగ్రహాలను స్వంతంగా అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ప్రత్యేక సభ్యదేశాల జాబితాల్లో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తున్న వరుస ఘన విజయాలు ఈ రంగంలో దేశీయంగా విస్తృత అధ్యయ నాలు, పరిశోధనలను ప్రోత్సహి స్తున్నాయి. ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష పరిశో ధనలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీ యం గానే అంతరిక్ష న్యాయ శాస్త్రంపై చర్చలు, సమీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయి. అంతరిక్ష భద్రత, రక్షణ పరమైన అంశాలకు ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. అంతరిక్షం అగ్రరాజ్యాలు, అగ్రదేశాలు మాత్రమే ఉపయోగించుకునేది కాదు. ప్రపంచదేశాల న్నింటికీ అంతరిక్షంపై సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉన్నాయి. దాదాపు 60 దేశాలు అంతరి క్షంలో ఉపగ్రహాలను ప్రయోగించి ఉపయోగించు కుంటున్నాయి. రానున్న రోజుల్లో అంతరిక్షంలో రద్దీ, పోటీ వాతావరణం పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష న్యాయశాస్త్రం ముఖ్యంగా 5 బహుపాక్షిక ఒప్పందాలపై ఆధారపడి ఉంది. 1. అంతరిక్ష ఒడంబడిక 1967. 2. రెస్క్యూ ఒప్పందం 1968. 3. బాధ్యతాయుత ఒడంబడిక 1972. 4. రిజిస్ట్రేషన్ ఒడంబడిక 1975. 5. చంద్రు డిపై ఒడంబడిక 1979. ఈ ఐదు అంతర్జాతీయ, అంతరిక్ష ఒప్పందాల ముఖ్య ఉద్దేశాలు మానవాళికి హితం చేకూర్చేవి. అవేమిటంటే.. ఏ దేశం కూడా అంతరిక్షాన్ని దుర్వినియోగపర్చరాదు. అంతరిక్షంలో ఆయు ధాల నిషేధం లేదా నియంత్రణ. అంతరిక్షంలో స్వేచ్ఛ, అన్వేషణలు సాగించటం. అంతరిక్షంలోని సంబంధిత వస్తువులను నష్టపరిస్తే బాధ్యులను చేయటం. అంతరిక్షంలో భ్రమిస్తున్న లేక సంచరి స్తున్న వ్యోమ నౌకలను, వ్యోమగాములను భద్రత మరియు రక్షించటం. అంతరిక్షంలోకి సహజ వన రుల అన్వేషణ. ప్రతి ఒడంబడిక ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ సహాయ సహకారాలతో అంతరిక్షంలో సురక్షితమైన కార్యకలా పాలను నిర్వహించుకోవటం. రోజురోజుకూ పెరుగుతున్న అంతరిక్ష ఉపగ్రహ ప్రవేశాల కారణంగా కొంత పర్యావరణ కాలుష్యం జరుగుతున్న మాట వాస్తవం. గ్రహ శకలాలు భూమి పైకి పడటం ద్వారా లేదా అంతరిక్షంలో నిరుపయో గంగా ఉన్న ఉపగ్రహాలను తొలగించుటకు, అక్కడి వ్యర్థాలను నిర్మూలించటం కొరకు, అదే విధంగా ప్రపంచ పర్యావరణ హితం కొరకు భారత్ కోఆపరే టివ్ స్పేస్ మిషన్‌ను ప్రతిపాదించి ప్రవేశపెట్టడం జరిగింది. భారత్ అదే విధంగా అంతర్జాతీయ, అంత రిక్ష న్యాయశాస్త్రంపై, దాని విధానపరమైన అంశా లపై విస్తృతమైన అధ్యయనం చేసి తనదైన పాత్రను పోషించింది. భారత్‌కు అన్ని ముఖ్యమైన అంతరిక్ష ఒడంబడికలలో సభ్యత్వం ఉంది.. అభివృద్ధి చెందుతున్న దేశాల సహాయ సహ కారాలు అంతరిక్ష రంగంలో చాలా అవసరం అని భారత్ భావిస్తుంది. అంతరిక్షంలోని ప్రయోజ నాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందకపోతే అంత రిక్ష అభివృద్ధి కార్యకలాపాలు నిరర్థకం అయినట్టే. జాతి గర్వించదగ్గ విజయాలను భారత్ చేకూ రుస్తూ, అంతరిక్ష సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తూ, ప్రపంచ దేశాలకు తనదైన చర్యలతో మార్గద ర్శిగా నిలుస్తూ, తన ప్రత్యేకతను చాటుకోవటం విశేషం. అంతరిక్ష కార్యకలాపాలు భారత్‌లోనే కాక ఇతర దేశాలలో కూడా దినదిన ప్రవర్ధమానమై కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు భారత్‌లో అంతరిక్షానికి సంబంధించిన చట్టం లేకపోవడం బాధాకరం. ప్రస్తుత సమాజంలో త్వరితగతిన సంభ విస్తున్న శాస్త్ర, సాంకేతిక వినియోగాన్ని గమనించి నట్లయితే∙పటిష్టమైన జాతీయ అంతరిక్ష న్యాయ చట్టం ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. గత ఏడు దశాబ్దాలుగా భారత్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు అద్భుతం. ‘ఆప రేషన్ శక్తి’ ద్వారా భారత్ సొంత సాంకేతిక పరి జ్ఞానంతో ప్రపంచాన్ని అబ్బుర పర్చడమే గాకుండా, దేశీయ వ్యాపార వాణిజ్య అవసరాలను తీర్చే దిశగా విజయం సాధించింది. ఇవి విస్తృతమవుతున్నందు వల్ల మనకు జాతీయ అంతరిక్ష చట్టం అవసరం. అంతరిక్ష టెక్నాలజీ వినియోగంలో భారీ నిధులు, ఈ కార్యకలాపాలలో ప్రైవేటు వ్యక్తుల, దేశ ప్రజల నిధులు, ప్రయోజనాలు కూడా ఉన్నందున రాబోయే రోజులలో కొన్ని సమస్యలు, చిక్కులు న్యాయప రంగా వచ్చే అవకాశం ఉన్నది. మారుతున్న కాలానికి తగినట్లుగా జాతీయ చట్ట ముసాయిదాను ప్రతిపాది స్తున్నారు. ఈ చట్టం ఆవశ్యకత, జాతీయ, అంతర్జా తీయ ప్రయోజనాలను చక్కగా నిర్వర్తించ గలదు. ప్రొ‘‘ డీఆర్వీ బాలకిష్టారెడ్డి వ్యాసకర్త రిజిస్ట్రార్, సెంటర్ హెడ్ ఫర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లాస్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ -
‘మిషన్ శక్తి’పై మెత్తబడ్డ అమెరికా
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. అంతరిక్ష రంగంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు ఇరు దేశాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చింది. మిషన్ శక్తి తరువాత అంతరిక్షంలో 400 శకలాలు మిగిలిపోయాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్ పాలడినో బుధవారం మాట్లాడుతూ అంతరిక్షంలో ఉపగ్రహ శకలాలు మిగిలిపోవడం ఆందోళనకరమే అయినా, ఈ సమస్యను పరిష్కరించేలా పరీక్షను నిర్వహించామని భారత్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌తో అమెరికాకు పటిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండు దేశాలు కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
ఇలా వెళ్లాలా ఆఫీస్‌కి!
ఆకాశంలో సగం దేవుడెరుగు. స్పేస్ రీసెర్చ్ సెంటర్లోనే మహిళలకు స్పేస్ లేదు! లైంగిక వేధింపులపై రెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలికి దిక్కే లేకపోగా.. చివరికి చుక్కెదురైంది! కేరళలో జరిగిన ఈ ఉదంతంలో.. మహిళా ప్రొఫెసర్‌కి న్యాయం జరగపోగా.. వేధించిన సహోద్యోగికి ప్రమోషన్ దక్కింది! అంగారక గ్రహానికి వెళుతున్నాం. అతివ విషయంలో ఎందుకిలా.. పాతాళంలోకి కృంగిపోతున్నాం?! స్పేస్ సెంటర్లో పని చేస్తున్నంత మాత్రాన స్త్రీకి ఇంత ప్రొటెక్షన్ అవసరమా?! అవసరం లేదు. కానీ భూమి మీద ఏ స్పేస్‌లోనూ ఉద్యోగం చేస్తున్న మహిళకు లైంగిక వేధింపుల నుండి రక్షణ ఉండడం లేదు. అంతేకాదు.. ఆమె ఫిర్యాదుకూ విలువ లేకుండా పోతోంది! ‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి...స్త్రీ, శిశు సంక్షేమం కోసం మీరు చాలా పథకాలనే రూపొందించారు. ఆడపిల్లల కోసం బేటీ బచావో, బేడీ పడావో, మహిళలు, ఉద్యోగినుల కోసం స్వధార్ గృహ, ఎస్టీఈపీ (సపోర్ట్ టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ విమెన్), ఉద్యోగినీ స్కీమ్, డీఎస్టీలో విమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ వంటివాటిని ప్రవేశపెట్టారు. అయితే చాలా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో సైంటిఫిక్ ఫ్యాకల్టీగా మహిళలు 25 శాతం కంటే తక్కువగా అథఃపాతాళంలో ఉన్నారు. మహిళా శాస్త్రవేత్తలయితే 14 శాతం కంటే కనిష్టం అన్నది కనపడుతున్న నిజం. కారణం.. విమెన్ ఫ్రెండ్లీ వాతావరణంలేకపోవడమే. కాబట్టి అలాంటి వాతావరణం కల్పించాలని కోరుతున్నాం..’’ దాదాపు రెండేళ్ల కిందట కేరళకు చెందిన మహిళా ఉద్యమకారులు, రచయిత్రులు, ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ప్రధానమంత్రికి పెట్టిన అర్జీ ఇది. ఎందుకు పెట్టవలసి వచ్చింది? తిరువనంతపురంలోని ఐఐఎస్టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది అనిత (పేరు మార్చాం). చాలా బ్రిలియంట్ ప్రొఫెసర్. చురుగ్గా ఉంటారు. బోధన కాకుండా అప్పగించిన ప్రాజెక్ట్స్‌ను నిర్ణయించిన టైమ్‌కల్లా పూర్తి చేసేంత నిబద్ధత గల అధ్యాపకురాలు. పని అంటే ప్రాణం. జీవన్ (ఇతని పేరూ మార్చాం).. ఐఐఎస్టీలోనే ఇంకో ప్రొఫెసర్. అనిత కొలీగ్. 2016, నవంబర్ చివరివారం. ఆఫీస్రూమ్లో అకడమిక్ డిస్కషన్ జరుగుతోంది. అనిత, జీవన్‌తోపాటు ఇంకో నలుగురు ప్రొఫెసర్లు, ఒక స్టూడెంటూ ఉన్నారు. చర్చలో భాగంగా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్‌కు సంబంధించి అనిత ఏదో వివరిస్తోంది. ఆమె ఏం చెప్తున్నా మాటమాటకీ అడ్డు తగులుతున్నాడు జీవన్. విసుగు చెందిన అనిత ‘‘అలాగైతే మీ ప్రజెంటేషన్ మీరు ఇచ్చుకోండి.. నా ప్రెజెంటేషన్ నేను ఇచ్చుకుంటాను’’ అని సౌమ్యంగానే చెప్పింది అనిత. అహం దెబ్బతిన్న జీవన్ .. కోపంగా అనిత వైపు వస్తూ.. ఆమెను గది మూలకు నెడుతూ, ఆమె వైపు వేలు చూపిస్తూ.. ‘‘పోవే’’ అంటూ అమర్యాదగా సంబోధిస్తూ.. కొట్టడానికీ చేయి లేపాడు. ఈ పరిణామానికి అనిత సహా అక్కడున్న వాళ్లంతా బిత్తరపోయారు. పరిస్థితిని చక్కదిద్దడానికి జీవన్‌ను ఆ గది నుంచి బయటకు పంపారు. ఆ అవమానాన్ని సహించలేని అనిత తెల్లవారే జీవన్ మీద ఐఐఎస్టీ డైరెక్టర్‌కు కంప్లయింట్ చేసింది. రెండు కమిటీలు నిర్ధారించినా..! అనిత దరఖాస్తును స్వీకరించిన డైరెక్టర్ రెండు అంతర్గత విచారణ సంఘాలను నియమించాడు. ఆ రోజు అకడమిక్ డిస్కషన్స్‌లో పాల్గొన్న ప్రొఫెసర్లలో అనిత కాక ఇంకో మహిళా ప్రొఫెసర్ కూడా ఉన్నారు.ఇంటర్నల్ కమిటీస్ విచారణలో ఆమె సాక్ష్యం చెప్పారు.. అనిత పట్ల జీవన్ అమర్యాదకరంగా.. అసభ్యంగా ప్రవర్తించాడని. మిగిలిన ముగ్గురూ ఆమె సాక్ష్యాన్ని (స్టూడెంట్ సహా) బలపరిచారు.నివేదికను పరిశీలించిన డైరెక్టర్.. జీవన్‌ను పిలిచి.. మందలించి.. విషయాన్ని అక్కడితో వదిలేశాడు. డైరెక్టర్ చర్యకు నివ్వెరపోయింది అనిత. రెండు కమిటీలు ఎంక్వయిరీ చేసి.. జీవన్ అనే వ్యక్తి అకారణ కోపం ప్రదర్శించాడని, హద్దు మీరాడని, అసభ్యపదజాలాన్ని వాడాడని, ఒక బోధనాలయంలో ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించాడని సాక్ష్యాధారాలతో రిపోర్ట్ ఇస్తే.. అతనిని పిలిచి చిన్నగా మందలించి తిరిగి డ్యూటీలోకి పంపించడమా? ఇది ఇంకో అవమానంగా అనిపించింది అనితకు. శిక్షించకపోగా.. ప్రమోషన్! అనిత ఆలోచించింది. ఇలాగే వదిలేస్తే.. ఈ రోజు తనను అన్నవాడు.. రేపు ఇంకో ఉమన్ ప్రొఫెసర్‌ను అంటాడు. స్టూడెంట్స్ కూడా దీన్ని ఇండికేషన్‌గా తీసుకుని తమ ఫిమేల్ క్లాస్మేట్స్ పట్లా ఇలాగే మిస్‌బిహేవ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే అక్కడితో సమాధానపడొద్దని నిర్ణయించుకుంది. పైగా ఇది ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన సంఘటన. అందుకే తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ ఇస్రో చైర్మన్‌కు అప్పీల్ చేసుకుంది. కేసు పూర్వాపరాలు, అంతర్గత విచారణ కమిటీల నివేదికనూ చదివిన చైర్మన్.. ఐఐఎస్టీ డైరెక్టర్‌కు లేఖ రాశాడు.. అనిత కేస్‌లో జీవన్‌ను మందలించి వదిలేయడమనేది అతను చేసిన నేరానికి సరిపడా శిక్ష కాదని, ఈ విషయంలో డైరెక్టర్ పునరాలోచన చేసి, తగు నిర్ణయం తీసుకోవాలని. ఆశ్చర్యం ఏంటంటే ఐఐఎస్టీ డైరెక్టర్ ఆ లేఖను నిర్లక్ష్యం చేయడమేగాక, తర్వాత కొన్ని రోజులకే జీవన్‌కు ప్రమోషన్ ఇవ్వడం. కంగుతినడం అనిత వంతైంది. అంతర్గత పోరాటంతో అలిసిపోయిన ఆమె ఇండియన్ పీనల్ కోడ్ సాయం తీసుకోవాలనుకుంది. అండగా మహిళా సంఘాలు పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చింది. ఇన్సల్టింగ్ మోడస్టీ ఆఫ్ ఉమన్ (మహిళను కించపరచడం) అనే కారణంతో సెక్షన్ 509, సెక్షన్ 506 (భయపెట్టడమనే కాజ్) కింద జీవన్ మీద వలియమాల (తిరువనంతపురం) పోలీసులు కేస్ నమోదు చేశారు. ఇది తెలిసిన ‘స్త్రీ కూటయమా’ అనే మహిళా హక్కుల పరిరక్షణ సంస్థ అనితకు అండగా నిలబడింది. స్త్రీ కూటయమాలో యాక్టివిస్ట్‌లతో పాటు రచయిత్రులు, ప్రొఫెషనల్స్ కూడా భాగస్వాములు. విమెన్ కలెక్టివ్ గ్రూప్ అన్నమాట. అనితకు న్యాయం జరగాలని ఆందోళన మొదలుపెట్టింది ఈ గ్రూప్. ఈ డిమాండ్‌ను కోరుతూనే స్త్రీకూటయమా ప్రధానమంత్రి మోదీకి ఆ విజ్ఞప్తి చేసింది. ఈ నవంబర్‌తో ఆ స్ట్రగుల్‌కి రెండేళ్లు. ప్రస్తుతం నేషనల్ విమెన్ నెట్వర్క్ ఇన్ మీడియా ఇండియా గ్రూప్ కూడా అనిత పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తోంది. వీళ్లందరి కృషి, మీ టూ ఉద్యమం ప్రభావంతోనైనా ఆమెకు సరైన న్యాయం అందుతుందని ఆశిద్దాం. – శరాది -
తొలి ‘వాణిజ్య యాత్ర’లో సునీతా
హూస్టన్: అమెరికా 2019లో చేపట్టనున్న తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాముల బృందంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు. మరో 8 మంది వ్యోమగాములతో కలసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘బోయింగ్’ సంస్థ తయారుచేసిన బోయింగ్ సీఎస్టీ–100, స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా ఈ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా పంపనుంది. 2011లో స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిపోవడంతో అమెరికా భూభాగం నుంచి ఇప్పటివరకూ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపలేదు. తమ సహకారంతో బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆధునిక అంతరిక్ష నౌకల సహాయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని నాసా తెలిపింది. సునీతా, మరో వ్యోమగామి జోష్ కస్సాడాతో కలసి స్టార్ లైనర్ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రంపై అడుగుపెడతారని పేర్కొంది. గతంలో అంతరిక్షంలో 321 రోజులపాటు గడిపిన సునీతా తిరిగి 2012లో భూమిపై అడుగుపెట్టారు. ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్‌క్యాప్సూల్ మిషన్‌లో వ్యోమగాములు రాబర్ట్ బెహ్న్‌కెన్, డగ్లస్ హర్లీ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. అయితే, వీరి ప్రయాణం కంటే ముందుగా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రెండు సంస్థలు తమ నౌకల్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. -
ప్రేమ విహారాలు
ఇద్దరు భామలతో స్పేస్‌లో ప్రేమ విహారం చేస్తున్నారట వరుణ్ తేజ్. మరి ఆ ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్ష్యం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా కనిపించనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గురువారం మొదలైన కొత్త షెడ్యూల్ ఈ నెల 14 వరకూ జరగనుంది. ప్రత్యేకంగా వేసిన స్పేస్ సెట్లో ఈ షూటింగ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్, అదితీ, లావణ్య ముగ్గురూ పాల్గొంటున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
స్పేస్‌లోకి..
షారుక్ ఖాన్ బ్యాగ్ సర్దుకొని ఓ రెండు నెలలు పాటు స్పేస్‌లో ఉండబోతున్నారట. అక్కడ తనకు అప్పగించిన ప్రాజెక్ట్‌ను నిర్వర్తించడంలో బిజీ అయిపోతారట. మ్యాటరేంటంటే.. ఈ స్పేస్ సెట్టింగంతా రాకేశ్ శర్మ బయోపిక్ ‘సెల్యూట్’ కోసం. పైలెట్ రాకేశ్ శర్మ పాత్రలో షారుక్ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేశ్ మతాయి డైరెక్ట్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రెండు నెలలపాటు గ్యాప్ లేకుండా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సెట్లో షూటింగ్ జరపనున్నారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో షారుక్ ప్రెస్టీజియస్ మూవీ ‘జీరో’ను ప్రమోట్ చేయ నున్నారు. ‘సెల్యూట్’ 2019లో విడుదల కానుంది. ‘జీరో’ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. -
పసిఫిక్‌లో కూలిన స్కైలాబ్
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్–1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. సోమవారం ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్–1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎక్కడా, ఎవ్వరికీ హాని జరగలేదనీ, భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్డ్ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది. సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్–1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) అంతరిక్షంలో టియాంగంగ్‌లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ టియాంగంగ్ సేవలను చైనా పొడిగించుకుంటూ వెళ్లింది. అయితే 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది. చివరకు సోమవారం మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి సముద్రంలో కూలిపోయింది. ‘మా దగ్గర ఉన్న సమాచారం మేరకు టియాంగంగ్ కూలడం వల్ల భూమిపై ఎక్కడా ఎలాంటి హానీ జరగలేదు. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవున్న టియాంగంగ్ ఆకాశంలోనే చాలా వరకు కాలిపోయింది. అది చైనా చరిత్రలో నిలిచిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల గురించి ఇది మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ షువాంగ్ చెప్పారు.