Sri Devi
-
'జాము రాతిరి జాబిలమ్మా' అంటూ అభిమాన హీరోయిన్‌తో వర్మ సాంగ్
'జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా' సాంగ్ వినిపించగానే ఎవరికైన టక్కున గుర్తుకొచ్చేది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. క్షణ క్షణం సినిమాలో ఈ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ తరాలు మారినా ఆదరణ మాత్రం తగ్గలేదు. 1990లో విడుదలైన క్షణ క్షణం సినిమాను స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.క్షణ క్షణం సినిమాలో జాము రాతిరి జాబిలమ్మా అంటూ.. వెండితెరపై వెంకటేశ్, శ్రీదేవి కనిపించిన విషయం తెలిసిందే. అయితే, వెంకటేశ్ స్థానంలో శ్రీదేవి పక్కన రామ్ గోపాల్ వర్మ ఉంటే.. అదేలా సాధ్యం అంటారా..? ఏఐ టెక్నాలజీ సాయంతో వర్మ అభిమానులు దీనిని క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ సాంగ్‌ను రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేశాడు. శ్రీదేవి పక్కన కనిపించే భాగ్యం తనకు కల్పించిన ఏఐ టెక్నాలజీకి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు.Thanks to AI , Me in Venkatesh pic.twitter.com/VhnhUv8ddM— Ram Gopal Varma (@RGVzoomin) May 31, 2024 అతిలోక సుందరి శ్రీదేవి అంటే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానంతో పాటు గౌరవం కూడా ఉంది. ఆ ఇష్టంతోనే క్షణ క్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్గా ఉండాలని ఎంపిక చేశారు. -
Birthday Special: 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. రేర్ (ఫొటోలు)
-
శ్రీదేవి గ్లామర్ కోసం చేసిన ఆ డైట్ అంత డేంజరా?
శ్రీదేవి అందం కాపాడుకోవడం కోసం ఫాలో అయిన డ్రైట్ అత్యంత ప్రమాదకరమైంది. వైద్యలు సైతం వద్దని వారించిన ఆమె చనిపోయేంత వరుకు ఆ డైట్ ఫాలో కావడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సైతం చెబుతున్నారు. ఆమె అందం కోసం చేసిన డైట్ ఏంటీ? అంత ప్రమాదకరమైందా? వైద్యులు ఏం చెబుతున్నారు? తదితరాల గురించే ఈ కథనం. టాలీవుడ్ నటి శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువుగా ఉండే డైట్ ఫాలో అయ్యేది. అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఒక రకంగా కారణమైంది. డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కవుగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు కూడా. అయినా ఆమె చనిపోయేంత వరకు కూడా అలా ఉప్పులేకుండానే తినడంతో అదికాస్తా లో బీపీకి దారితీసిందని, ఆమె ఆకస్మిక మరణానికి అది కూడా ఒక కారణమని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు. ఇలా అస్సలు వద్దు.. మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం, తదితరాల ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమయ్యే అత్యంత ప్రధానమైన ఖనిజాల్లో ఒకటి. ఇది సెల్యూలార్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఒకవేళ ఉప్పుని ఆహారంలో పూర్తిగా స్కిప్ చేస్తే ఎలక్టోలైట్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చి ఒక్కసారిగా మైకం కమ్మి స్ప్రుహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా లోబీపీ రావడమే గాక అనే రకాల దుష్ప్రభావాలను ఎదర్కొనక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎదురయ్యే దుష్ప్రభావాలు.. శరీరానికి సరిపడ సోడియం అందనట్లయితే నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతారు. ఒక మనిషి శరీరంలో ఉండవల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్‌కి 135 మిల్లీక్వివలెంట్స్(ఎంఈక్యూ/ఎల్) కంటే తక్కువుగా ఉంటే దాన్ని హైపోనాట్రేమియా అంటారు. దీంతో కండరాలు, కణాలు ఉబ్బడం తోపాటు రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో తలనొప్పి, అలసట, మైకం కమ్మడం, కళ్లు తిరిగడం వంటివి ఎదర్కొంటారు. ఈ హైపోనాట్రేమియా కూడా మూడు రకాలుగా ఉంటుంది. కొందరికి అంత త్రీవ స్థాయిలో ఉండకపోవచ్చు. మందులతోనే క్యూర్ అవ్వొచ్చు. కొందరికి ఇది తీవ్ర స్థాయిలో ఉండి..మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ఒక్కొసారి మెదడులో నరాలు చిట్లిపోయే పరిస్థితి ఏర్పడి చనిపోవచ్చని వైద్యలు విక్రమ్‌జిత్ సింగ్ చెబుతున్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గిస్తే ఎటువంటి సమస్య లేదుగానీ ఏదో అందం కోసం అని ఉప్పు లేకుండా ఆహరా పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం ప్రతి రోజు ఐదు గ్రాములు ఉప్పు వినియోగించొచ్చని నొక్కి చెబుతోంది. ఇంతకు మించి తక్కువగా వాడితే కోమాలోకి వెళ్లిపోయి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల దయచేసి సినీతారలు దగ్గర నుంచి సామాన్యుల వరకు మన శరీరానికి కావాల్సినంత ఉప్పుని తీసుకోవడమే సర్వవిధాల మంచిది. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
బోరున విలపించిన బోనీ కపూర్.. ఆమెకు మాత్రమే సాధ్యమంటూ..!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన భార్య దివంగత శ్రీదేవి మనకు సుపరిచితమే. తాజాగా ఆయన భార్య శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. భార్యను తలుచుకుంటూ బోరున విలపించారు. ఆమెను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు ఆయన చిన్నకుమార్తె ఖుషీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోనీ కపూర్ బోరున విలపించడంతో అక్కడే ఉన్న చిత్రనిర్మాత బాల్కీ ఆయనను ఓదార్చారు. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. (చదవండి: విధి మా కలలను నాశనం చేసింది.. బోనీ కపూర్ ఎమోషనల్) ఇటీవలే బోనీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ చేశారు. శ్రీదేవి 15 సంవత్సరాల విరామం తర్వాత కూడా ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో నటించి తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా అద్భుత ప్రదర్శన చేయడం శ్రీదేవి మాత్రమే సాధ్యమైందంటూ కొనియాడారు. ఈ సినిమా ఆమె కెరీర్లో ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. గతంలో శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తన తల్లిపై హృదయానికి హత్తుకునేలా పోస్ట్ చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. ఆమె నటన, అందాన్ని సినీలోకంతో పాటు యావత్ ప్రపంచం గుర్తు చేసుకుంది. ఆమె పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
‘మా ఇద్దరిని కలపడానికి ఓ గదిలో పెట్టి తాళం వేశారు’
అందాల తార శ్రీదేవి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండియాలోనే టాప్ హీరోయిన్గా నిలిచారు. అప్పటికే టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న జయప్రద, జయసుధలకు.. అటు బాలీవుడ్లో మాధురీ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు శ్రీదేవి. ఆ తర్వాత ఆమె ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్గా ఎదిగారు. ఇక శ్రీదేవికి, జయప్రదకు మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం కానీ.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ చేసేవారు కాదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందరో ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన కోల్డ్ వార్‌కు సంబంధించిన విశేషాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ సారి ఏకంగా జయప్రదనే దీనిపై స్పందించారు. ఇండియన్ ఐడల్ 12కు గెస్ట్‌గా వచ్చారు జయప్రద. ఈ వేదిక మీద ఆమె తనకు, శ్రీదేవికి మధ్య నడిచిన కోల్డ్ వార్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఇలా చెప్పడానికి నేనేం బాధపడటం లేదు. అలా అని మేం ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడ్డామా అంటే అది లేదు. కాకపోతే మా ఇద్దరి మధ్య కెమస్ట్రీ మ్యాచ్ కాలేదు. పైగా అప్పటికే మేం ఇద్దరం టాప్ హీరోయిన్లం. నేనేందుకు తగ్గాలంటే.. నేనేందుకు తగ్గాలి అని ఇద్దరం ఫీల్ అయ్యే వాళ్లం. ఎలా ఉండేవాళ్లం అంటే మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇక ప్రతి విషయంలో మేం ఒకరి మీద ఒకరం పోటీ పడుతుండేవాళ్లం. డ్రెస్సులు, డ్యాన్స్‌లు ఇలా అన్ని విషయాల్లో ఒకరిపై ఒకరం పై చేయి సాధించాలని ట్రై చేసే వాళ్లం. తెర మీద మంచి అక్కాచెల్లళ్లలా కనిపించినప్పటికి.. వాస్తవంగా కనీసం పరిచయం ఉన్నవారిలా కూడా ఉండేవాళ్లం కాదు. మేం ఇద్దరం ఎదురుపడిన ప్రతిసారి దర్శకులు, తోటి నటులు మమ్మల్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసేవారు. అప్పుడు మాత్రం హలో అని పలకరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చారు జయప్రద. ఇక తమ ఇద్దరిని కలపడానికి చాలా మంది ప్రయత్నించారని.. వారిలో రాజేశ్ కుమార్, జితేంద్ర ఖన్నా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు జయప్రద. ‘‘ఒకసారి షూటింగ్ లంచ్ టైంలో రాజేశ్ కుమార్, జితేంద్ర మా ఇద్దరిని ఒకే రూమ్‌లో పెట్టి తాళం వేశారు. దాదాపు గంటసేపు అలానే ఉంచారు. అలా అయినా మేం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామని భావించారు. గంట తర్వాత తలుపు తీసి చూస్తే.. మేం ఇద్దరం ఆ పక్క ఒకరం.. ఈ పక్క ఒకరం కూర్చుని ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం బయటకు వెళ్లిపోయాం’’ అని చెప్పుకొచ్చారు జయప్రద. చదవండి: 'అమ్మాయ్... చింపి.. చింపి.. చంపి పడేశావ్' ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది -
శోభన్‌బాబు చేసిన ఏకైక వ్యాపారం ఏంటో తెలుసా?
సృష్టిలో తియ్యనిది తల్లి ప్రేమ! ఒకరు కన్నతల్లి! మరొకరు తల్లి కాని తల్లి! ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ మమతల కథ... ‘ఇల్లాలు’. శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి నటించిన ఈ కుటుంబ కథాచిత్రం అప్పట్లో సూపర్ హిట్ సినిమా. ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి..’, ‘అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా...’ లాంటి పాటలతో గుర్తుండిపోయిన సినిమా. లేడీ ఫ్యాన్స్ అమితంగా ఉన్న హీరో శోభన్‌బాబుకూ, నటనలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్న సమయంలో హీరోయిన్లు జయసుధ, శ్రీదేవికీ కెరీర్లో అది ఓ మైలురాయి సినిమా. 1981 ఏప్రిల్‌లో రిలీజైన ‘ఇల్లాలు’కు ఇప్పుడు 40 వసంతాలు. ఇల్లాలు.. భర్తకు ప్రేమమూర్తి. బిడ్డకుమాతృమూర్తి! సృష్టికే దేవతామూర్తి!!! భార్యాభర్తల అనుబంధానికీ, కుటుంబ బంధానికీ నిర్వచనమైన ఈ అంశాన్నే తెరపై సెంటిమెంట్ నిండిన కుటుంబకథగా చెప్పింది ‘ఇల్లాలు’ చిత్రం. బాబు ఆర్ట్స్ పతాకంపై జి. బాబు నిర్మాతగా, అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో, తాతినేని రామారావు దర్శకత్వంలో తయారైందీ సినిమా. ఈ ముగ్గురూ స్నేహితులు, వ్యాపార భాగస్వాములు. ఆ రకంగా ఇది ఆ ముగ్గురి సినిమా. ఇంకా గమ్మత్తేమిటంటే, శోభన్‌బాబు ఆర్థిక అండదండలతో ఏర్పాటైన అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ లక్ష్మీచిత్ర (నైజామ్‌లో శ్రీలక్ష్మీచిత్ర)యే ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అలా మిత్రులందరి సమష్టి సినీ ప్రాజెక్టుగా ‘ఇల్లాలు’ ముందుకు నడిచింది. ఇద్దరు తల్లుల కథ – ‘ఇల్లాలు’! సంసారం సవ్యంగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. ఆ విషయాన్ని ఈ చిత్రం అర్థవంతంగా చెప్పింది. ఆస్తిపాస్తులతో, ధనవంతుల ఇంట్లో పుట్టిపెరిగిన, అహంకారపూరితమైన అమ్మాయి కల్పన (జయసుధ). సామాన్య జీవితాన్ని సాగిస్తున్న కథానాయకుడు కిరణ్ (శోభన్ బాబు)ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. ఓ బిడ్డ పుట్టాక, భర్తతో ఇమడలేనంటూ, అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది. ఆ పరిస్థితుల్లో మరో అమ్మాయి జ్యోతి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకుంటాడు. అతని బిడ్డను కన్నతల్లిలా పెంచుతుంటుంది ఆమె. మొదటి భార్య కల్పన తాను పోగొట్టుకున్నదేమిటో గ్రహించి, వెనక్కివచ్చి తన కన్నబిడ్డను ఇమ్మని హీరోను అడుగుతుంది. కన్నపాశం, పెంచిన మమకారం మధ్య నడిచే ఈ చైల్డ్ సెంటిమెంట్ కథ విశేష ప్రేక్షకాదరణ పొందింది. అహంకారంతో కాపురాన్నీ, కన్నబిడ్డనూ కాదనుకున్న సెంటిమెంటల్ పాత్రలో జయసుధ, ఒద్దికైన ఇంటి ఇల్లాలుగా శ్రీదేవి, భర్త పాత్రలో శోభన్‌బాబు రాణించారు. సంసార సూత్రాలు గొల్లపూడి రచనలో వినిపిస్తాయి. హిందీ హిట్ కథకు ఇది రీమేకైనప్పటికీ, మూలాన్ని అనుసరిస్తూనే, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. కథనంలోని ఇలాంటి మార్పులు, సెంటిమెంట్ బాగా పండించడం ‘ఇల్లాలు’ విజయానికి తోడ్పడ్డాయి. ఒకే దర్శకుడు – రెండు హిట్లు! ఆ ఏడాది మొదట్లో వచ్చిన శోభన్‌బాబు చిత్రాలు ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’ – రెండింటికీ దర్శకుడు తాతినేని రామారావే. ఆయన దర్శకత్వంలో అంతకు ముందెప్పుడో అక్కినేనితో వచ్చిన ‘ఆలుమగలు’కే పాత్రలతో సహా కొన్ని కీలక మార్పులు చేసి, ‘పండంటి జీవితం’ అందించారాయన. ‘ఇల్లాలు’ ఏమో హిందీ సూపర్ హిట్ చిత్రం ‘అప్నాపన్’ (చుట్టరికం అని అర్థం – 1977)కు రీమేక్. జితేంద్ర, రీనారాయ్, సులక్షణా పండిట్ నటించగా దర్శక, నిర్మాత జె. ఓం ప్రకాశ్ రూపొందించిన ఆ చిత్రం పెద్ద హిట్. హిందీ మాతృకలో లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ సంగీతంలో ‘ఆద్మీ ముసాఫిర్ హై...’ అంటూ మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడే పాట పెద్ద హిట్. తెలుగు రీమేక్‌లోనూ జేసుదాస్, ఎస్పీ శైలజ పాడిన సందర్భోచిత ఆత్రేయ రచన ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి...’ మారుమోగిపోయింది. ఈ పాట సినిమాలో పలు సందర్భాల్లో పదే పదే వినిపిస్తూ, కథలోని మూడ్‌ను పెంచింది. తోటి హీరోల్లో... ఆయనదే రికార్డు! అప్పట్లో ‘ఇల్లాలు’ చిత్రం 6 కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తెనాలి, హైదరాబాద్) డైరెక్టుగా వంద రోజులు ఆడింది. 2 కేంద్రాలలో (కాకినాడ, చీరాల) షిఫ్టుతో, రోజుకు మూడు ఆటలతో శతదినోత్సవం చేసుకుంది. అలా 8 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో శతదినోత్సవం జరుపుకొన్న చిత్రమైంది. ఇవి కాక, మరో 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తంగా 12 కేంద్రాలలో ఈ ఫ్యామిలీ డ్రామా వంద రోజుల పండగ చేసుకుంది. 1981 ఆగస్టు 16న మద్రాసులోని చోళా హోటల్లో శతదిన ఘనమహోత్సవం జరిపారు. ప్రేక్షకాదరణతో ఆపైన ‘ఇల్లాలు’ రజతోత్సవమూ చేసుకుంది. బాక్సాఫీస్ లెక్క చూస్తే – ఇలా ఎనిమిది, అంతకు మించి కేంద్రాలలో రెగ్యులర్ షోలతో వంద రోజులు ఆడిన సినిమాలు శోభన్‌బాబు కెరీర్లో ఏకంగా పది ఉన్నాయి. ‘ఇల్లాలు’కు ముందు ఆయన కెరీర్లో 8 చిత్రాలు కనీసం 8 కేంద్రాల్లో వంద రోజులాడాయి. ‘సంపూర్ణ రామాయణం’ (10 కేంద్రాలు), ‘జీవన తరంగాలు’(12), ‘శారద’ (8), ‘మంచి మనుషులు’(11), ‘జీవనజ్యోతి’ (12), ‘జేబుదొంగ’(10), ‘సోగ్గాడు’ (19), ‘గోరింటాకు’ (8), తర్వాత ‘ఇల్లాలు’ (8 కేంద్రాలు) 9వ సినిమా అయింది. ఆ తర్వాత ‘దేవత’ చిత్రం (9 కేంద్రాలు) ఆ శతదినోత్సవ విజయాల జాబితాలో పదోది అయింది. గమ్మత్తేమిటంటే, తన సమకాలీన హీరోలలో అలాంటి శతదినోత్సవ చిత్రాలు అత్యధికంగా ఉన్నది శోభన్‌బాబుకే! ఇలా పది చిత్రాలతో శోభన్‌బాబు హయ్యస్ట్‌గా నిలిస్తే, ఆయన సమకాలీన హీరోల సెకండ్ హయ్యస్ట్ 4 చిత్రాలే కావడం గమనార్హం! ఆ రోజుల్లో హీరోల్లో శోభన్ బాబుకు మహిళాదరణ ఎక్కువ. ఆ కారణంగా ఆయన సినిమాలు బాగా ఆడేవి. ఎక్కువ రోజుల రన్ కూడా వచ్చేది. సమకాలీన హీరోలకు మించి ఆయనకు శతదినోత్సవ చిత్ర రికార్డుకు అది ఓ ప్రత్యేక కారణం. శోభన్‌బాబు ఈ పది శతదినోత్సవ చిత్రాల విజయయాత్ర సాగించిన 1972 – 1982 మధ్య కాలానికి సంబంధించి మొత్తం తెలుగు సినీపరిశ్రమ పరంగా గమనిస్తే – ఎన్టీఆర్ (15 చిత్రాలు) తరువాత శోభన్ బాబుదే (10 చిత్రాలు) అగ్రస్థానం. చివరకు సీనియర్ హీరోలతో సహా మిగతా హీరోలెవరూ శోభన్బాబులో సగం మార్కును కూడా దాటలేకపోయారు. అదీ ఆ కాలఘట్టంలో హీరో శోభన్బాబుకున్న సక్సెస్ స్టామినా! ముగ్గురు మిత్రుల ‘దీపారాధన’ ఒకపక్కన ‘ఇల్లాలు’ క్రిక్కిరిన ప్రేక్షకులతో ఆడుతుంటే, అదే సమయంలో... ఆ పక్కనే కూతవేటు దూరంలో... వేరే హాలులో శోభన్‌బాబు సినిమా ‘దీపారాధన’ సక్సెస్‌ఫుల్‌గా నడవడం ఆ రోజుల్లోని ఓ విశేషం. ‘బలిపీఠం’, ‘గోరింటాకు’ తరువాత దర్శకుడు దాసరి – శోభన్‌బాబుల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. స్నేహం విలువను చాటే ఈ సినిమా నిరుద్యోగులైన ముగ్గురు ప్రాణమిత్రుల (శోభన్, మోహన్‌బాబు, మురళీమోహన్) కథ. వారిలో ఒకరైన హీరోకు పెళ్ళి కావడం... ఎదురైన సంఘటనలు... త్యాగాలు... ఇలా సెంటిమెంటల్‌గా సాగే, సంభాషణల ప్రధానమైన సినిమా ఇది. ‘వచ్చే జన్మంటూ ఉంటే మీ భార్యగా కాకుండా, స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ కన్నుమూసే త్యాగభరిత కథానాయికగా జయప్రద కనిపిస్తారు. చక్రవర్తి బాణీల్లో ‘సన్నగా సనసన్నగా...’, ‘తూరుపు తిరిగి దణ్ణం పెట్టు అన్నారండి మావారు...’ పాటలు అప్పట్లో పదే పదే వినిపించేవి. ‘దీపారాధన’ మధ్యతరగతి మహిళలను ఆకట్టుకుంది. ‘ఇల్లాలు’ తర్వాత రెండు రోజుల తేడాలో ‘దీపారాధన’ షిఫ్టులు, నూన్ షోలతో 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొంది. వంద రోజుల్లో...3 వంద రోజులు నిజం చెప్పాలంటే, శోభన్ బాబుకు ఒకటికి మూడు శతదినోత్సవ చిత్రాలు అందించి, బాగా కలిసొచ్చిన సంవత్సరాల్లో ఒకటి – 1981. ఆ ఏడాది జనవరి 1న వచ్చిన ‘పండంటి జీవితం’ వంద రోజులు ఆడింది. అప్పట్లో విజయవాడ (కల్యాణచక్రవర్తి థియేటర్) సహా 4 కేంద్రాలలో ‘పండంటి జీవితం’ చిత్రాన్ని 98 రోజులకే ఎత్తేసి, 99వ రోజున ఏప్రిల్ 9న అదే శోభన్‌బాబు నటించిన కొత్త చిత్రం ‘ఇల్లాలు’ రిలీజ్ చేశారు. గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ కూడా సూపర్ హిట్టయి, వంద రోజులు దాటేసింది. ఇంకా గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ రిలీజయ్యాక రెండు రోజుల తేడాతో ఏప్రిల్ 11న శోభన్‌బాబు నటించినదే ‘దీపారాధన’ రిలీజైంది. ఒక పక్కన ‘ఇల్లాలు’ విపరీతమైన ఆదరణతో నడుస్తుండగానే, మరోపక్క ‘దీపారాధన’ కూడా హిట్టయింది. శతదినోత్సవమూ జరుపుకొంది. మొత్తానికి, వంద రోజుల వ్యవధిలో 3 వంద రోజుల సినిమాలు రావడం ఏ హీరోకైనా అరుదైన సంఘటన. ఆ మూడూ కుటుంబ కథలు, సెంటిమెంట్ చిత్రాలే తప్ప, మాస్ యాక్షన్ సినిమాలు కావు. అది గమనార్హం. అప్పట్లో శోభన్‌బాబు సినిమాకున్న మహిళాదరణకు అది ఓ నిదర్శనం. శోభన్‌బాబు చేసిన ఏకైక సినీ వ్యాపారం! అప్పట్లో దర్శకుడు తాతినేని రామారావు, నిర్మాణ సారథులు అట్లూరి పూర్ణచంద్రరావు, జి. బాబు, తరువాతి కాలంలో నిర్మాతగా పేరు తెచ్చుకున్న వై. హరికృష్ణ (మేనేజింగ్ పార్ట్నర్) – నలుగురూ కలసి చిత్రనిర్మాణం చేసేవారు. కేంద్రీకృత సినీ పంపిణీ వ్యవస్థ ఇంకా పట్టుసడలని సమయం అది. ఆ పరిస్థితుల్లో ఆ నలుగురూ, హరికృష్ణ మేనల్లుడైన కాట్రగడ్డ ప్రసాద్, హైదరాబాద్ ‘వెంకటేశా’ థియేటర్ బి.వి. రాజు, తర్వాత టి.టి.డి చైర్మనైన ఆదికేశవులునాయుడు భాగస్వాములుగా ‘లక్ష్మీచిత్ర’ అనే ఓ కొత్త పంపిణీ సంస్థను ప్రారంభించారు. హీరో శోభన్‌బాబు ఆర్థికంగా అండగా నిలిచారు. తన సతీమణికి అన్నగారైన గోపిని అందులో భాగస్వామిని చేశారు. ఒకరకంగా శోభన్‌బాబు సినీ వ్యాపారమంటూ చేసింది – ఈ పంపిణీ సంస్థలో చేతులు కలపడమొక్కటే! 1979 మార్చి 29న విజయవాడలో ‘లక్ష్మీచిత్ర’ కార్యాలయం ప్రారంభమైంది. ఆంధ్రాలో ‘లక్ష్మీచిత్ర’గా, నైజామ్‌లో ‘శ్రీలక్ష్మీచిత్ర’గా వ్యాపారం నడిచింది. శోభన్ హీరోగా నటించిన ‘కార్తీకదీపం’ తొలి ప్రయత్నంగా విడుదలైంది. అది సూపర్ హిట్. అక్కడ నుంచి ‘లక్ష్మీచిత్ర’ వెనుదిరిగి చూడలేదు. వరుసగా కొన్నేళ్ళు శోభన్ సినిమాలన్నీ ఆ సంస్థే పంపిణీ చేసింది. 1981 మొదట్లో రిలీజైన ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’– లక్ష్మీచిత్ర రిలీజ్లే. శోభన్‌తో చిత్రాలు నిర్మించే స్థాయికి వై. హరికృష్ణ ఎదిగారు. కాట్రగడ్డ ప్రసాద్ ‘వసుధాచిత్ర’తో డిస్ట్రిబ్యూషన్ నడిపి, మేనమామ బాటలో నిర్మాత అయరు. ఇప్పుడు సౌతిండియన్ ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడయ్యారు. మహిళలు మెచ్చిన అందాల నటుడు సినిమాల్లోనే కాదు... చదువుకొనే రోజుల నుంచి అందగాడు శోభన్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. చదువుకొనే రోజుల్లో ఆఖరు నిమిషంలో కాలేజీ ఎన్నికల్లో అనుకోకుండా పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకు లేడీ స్టూడెంట్స్ ఓట్లు మూకుమ్మడిగా పడ్డాయి. అనూహ్యంగా ఆయన గెలిచారు. ఆ సంగతి శోభన్‌బాబే స్వయంగా రాశారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయనకు మహిళా అభిమానులే ఎక్కువ. ‘శారద’, ‘జీవన తరంగాలు’, ‘జీవనజ్యోతి’ చిత్రాల రోజుల నుంచి ఆ ఫాలోయింగ్ అలా కొనసాగుతూ వచ్చింది. అందుకే, ఒక దశ దాటిన తరువాత నుంచి ఆయన తన ప్రధాన అభిమాన వర్గమైన మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. మహిళలు మెచ్చే అంశాలు, సెంటిమెంట్ ఉండేలా చూసుకొనేవారు. 1979 నాటి ‘కార్తీక దీపం’ మొదలు ‘గోరింటాకు’, ‘ఇల్లాలు–ప్రియురాలు’, ‘శ్రావణసంధ్య’(’86) – ఇలా అన్నీ అశేష మహిళాదరణతో ఆయన కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దినవే. మరణానంతరం కూడా ఇవాళ్టికీ ఆయనకు ఒక వర్గం అభిమానులు ఉన్నారంటే, దానికి ఆ కథలు, ఆ సినిమాలు అందించిన ఇమేజే కారణం. – రెంటాల జయదేవ -
‘మిస్ యూ అమ్మ’ శ్రీదేవి కూతుళ్ల భావోద్వేగం
అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్గ్రీన్ హీరోయిన్గా నిలిచిన శ్రీదేవి వర్ధంతి నేడు. ఫిబ్రవరి 24వ తేదీన ఆమె దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె వర్ధంతి సందర్భంగా శ్రీదేవి కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి ఆమె మరణించిదనే విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. తల్లి వర్ధంతి సందర్భంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా శ్రీదేవి తనను ఉద్దేశించి స్వయంగా రాసిన ఓ పేపర్‌ను జాన్వీ పంచుకుంది. ‘ఐ లవ్యూ మై లబ్బు.. యువర్ ద బెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్’ అని శ్రీదేవి రాసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా బోనీకపూర్, శ్రీదేవి కలిసి ఉన్న ఫొటోలను పంచుకుంది. మిస్ యూ అని జాన్వీ, ఐ లవ్యూ అమ్మ అని ఖుషీ కపూర్ అంటూ పోస్టులు చేశారు. శ్రీదేవీ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెను స్మరించుకున్నారు. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) -
అవును ఖుషీ ఎంట్రీ త్వరలోనే: బోనీ కపూర్
ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కూతురిని హీరోయిన్గా చూడాలన్నది శ్రీదేవి కోరిక. అనుకున్నట్లుగానే పెద్ద కూతురిని హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేసింది శ్రీదేవి. ఇక తాజాగా ఆమె రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా త్వరలో నటిగా ఏంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖుషీ ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందా అని శ్రీదేవి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఈ క్రమంలో ఆమె త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందంటూ కొంతకాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సైతం త్వరలోనే ఖుషీ నటిగా ఆరంగ్రేట్రం చేయనుందని స్పష్టం చేశాడు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. ఓ ఇంటర్య్వూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘ఖుషీని సినిమాల్లో పరిచయం చేయడానికి నా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. (చదవండి: ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్) అయితే తనని మాత్రం మొదట పరిచయం చేసే వ్యక్తిని నేను కాదు. ఓ నిర్మాతగా నాకు, నటిగా తనకు ఇది మంచిది కాదు. ఎందుకంటే ఓ తండ్రిగా ఖుషీ తన సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ఖుషీ కూడా సోషల్ మీడియాలో వరుసగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుండటంతో ఆమె ఎంట్రీ తర్వలోనే ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రైవసీలో ఉన్న తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌ను తాజాగా ఖుసీ పబ్లిక్ చేసింది. అనంతరం హాట్ హాట్ ఫోటోలను పంచుకోవడం ప్రారంభించింది. అవి చూసిన ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు వెండితెరపై కనిపించేందుకు ఖుషీ సిద్దమైందని, ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఖుషీ లండన్‌లో ఫిలీం స్కూల్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటుందని, త్వరలోనే తను నటిగా మీ ముందుకు వస్తుందని పలు ఇంటర్య్వూలో జాన్వీ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: మా పిల్లలు ప్రతిభావంతులు) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) -
శ్రీలతా రెడ్డి, మంత్ర, సుజాత.. ఎవరబ్బా?!
(వెబ్ స్పెషల్): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి.. శ్రీదేవి బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు. జయసుధ మూవీస్‌లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం) జయప్రద అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ) రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. భూమిక ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను) అనుష్క ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ సినిమాల కోసం నయనతారగా మారింది. రాశి రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఇక వీరే కాక హీరో రజనీకాంత్, చిరంజీవి, సూర్య, పవన్ కళ్యాణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. -
స్వయంవరానికి అర్హులు.. కానీ
(వెబ్ స్పెషల్): హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాల రాణులు.. అభిమానుల కలల దేవతలు.. వారితో స్నేహం కోసం ఎందరో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక వివాహం విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మలకు స్వయంవరం పెడితే రాకుమారులు సైతం క్యూ కడతారు. అయితే విచిత్రంగా మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రెండో భార్యగా వెళ్లి అభిమానులకు షాక్ ఇచ్చారు. స్మితా పాటిల్ మొదలు కరీనా వరకు చాలా మంది హీరోయిన్లు విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఓ సారి ఆ జాబితా చూడండి.. 1. స్మితా పాటిల్ 1970 దశకంలో తన అందం, అభినయంతో సినీ లోకాన్ని ఏలిన స్మితా పాటిల్ వివాహం విషయంలో మాత్రం ప్రేక్షకులను ఒకింత షాక్‌కు గురి చేశారు. అడిగితే ప్రాణాలర్పించే అభిమానులున్న స్మిత అనూహ్యంగా అలనాటి హీరో రాజ్ బబ్బర్‌ని వివాహం చేసుకున్నారు. ఆయనకు అప్పటికే నాదిరా అనే మహిళతో వివాహం అయ్యింది. కానీ స్మిత పరిచయం తర్వాత రాజ్ బబ్బర్ ఆమెకు విడాకులు ఇచ్చి.. స్మితను వివాహం చేసుకున్నారు. 2. షబానా అజ్మీ హీరోయిన్ అంటే కేవలం ఓ అందాల బొమ్మ అనుకునే ఇండస్ట్రీలో తన అభినయంతో టాప్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు షబానా అజ్మీ. ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్టు గెలుచుకున్నారు. నటిగానే కాక సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. అయితే షబానా అజ్మీ కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ కవి జావేద్ అఖ్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే ఆయన హనీ ఇరానీ అనే ఆమెను వివాహం చేసుకోవడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (చదవండి: భలే ఉన్నావు బాబు) 3. శ్రీదేవి ఇక అందాల తార, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి అంతర్జాతీయంగా క్రేజ్. బాల్యం నుంచి సినిమాల్లోనే ఉన్న శ్రీదేవి.. ఎందరికో కలల రాకుమారి. చాలా మంది హీరల ఫస్ట్ క్రష్ కూడా అతిలోక సుందరి మీదనే. స్వయం వరం ప్రకటిస్తే.. దేశవిదేశాల బడా బాబులు.. వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు శ్రీదేవి కోసం క్యూ కట్టేవారు అంటే ఆశ్చర్యం లేదు. అంతటి క్రేజ్ ఉన్న ఈ నటి.. నిర్మాత బోని కపూర్‌ని వివాహం చేసుకుని ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చారు. అది కూడా రెండో భార్యగా వెళ్లారు. వర్మ లాంటి చాలా మంది నేటికి ఈ నిజాన్ని జీర్ణించుకోలకపోతున్నారు. శ్రీదేవి కంటే ముందే బోని కపూర్‌కి మోనా కపూర్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకి విడాకులు ఇచ్చి.. శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి జాహ్నవి, ఖుషి అని ఇద్దరు సంతానం. (చదవండి: నా కథ చెబుతాను) 4. సారిక సారిక కూడా విడాకుల తీసుకున్నవ్యక్తినే పెళ్లాడారు. లోక నాయకుడు కమల్ హాసన్ జీవితంలో రెండో భార్యగా ప్రవేశించారు. కమల్ తన మొదటి భార్య వాణి గణపతికి విడాకులు ఇచ్చి.. సారికను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్. ఆ తర్వాత సారిక కమల్ నుంచి విడిపోయింది. అది వేరే కథ. 5. మన్యాత దత్ మన్యాత దత్ ఏకంగా మూడో భార్యగా మున్నాభాయ్ సంజయ్‌దత్ జీవితంలో ప్రవేశించారు. మన్యాత కన్నా ముందు సంజయ్ రిచా శర్మ, రియా పిల్లయ్ అనే ఇద్దరిని వివాహం చేసుకున్నారు. 6. కరిష్మ, కరీనా అక్కాచెళ్లల్లు ఇద్దరు విడాకులు తీసుకున్న వ్యక్తులనే వివాహం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, కరిష్మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వారి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత కరిష్మా సంజీవ్ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే అతడు నందిత మహతానీని వివాహం చేసుకున్నాడు. ఇక కరీనా.. చోటా నవాబ్ సైఫ్ అలీఖాన్ని వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే సైఫ్‌కు అమృతా సింగ్‌తో వివాహం కావడమే కాక ఇద్దరు పిల్లలు సారా, ఇబ్రహీం ఉన్నారు. అమృతతో విడాకుల అనంతరం సైఫ్, కరీనాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి తైమూర్ అనే బాబు ఉండగా.. రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: తగ్గాలమ్మాయ్ అన్నారు!) 7. విద్యా బాలన్ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ యాక్టర్ విద్యా బాలన్. లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఇక వివాహం విషయానికి వస్తే.. విద్యాబాలన్ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తినే వివాహం చేసుకున్నారు. యూటీవీ హెడ్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లాడారు. అయితే అతనికి ఇది మూడవ వివాహం కావడం గమనార్హం. 8. శిల్పా శెట్టి ఇక పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి కూడా రెండో భార్యగానే వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శిల్పా కంటే ముందే రాజ్ కుంద్రాకు కవిత అనే మహిళతో వివాహం అయ్యింది. ఆమెకు విడాకులు ఇచ్చి.. శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికో కుమారుడు ఉండగా.. తాజగా సరోగసి ద్వారా మరో ఆడబిడ్డ వీరి కుటుంబంలో ప్రవేశించింది. ఇక వీరే కాక లారా దత్త(మహేభట్), కిరణ్ రావ్(అమీర్ ఖాన్), కల్కి కోచ్లిన్ (అనురాగ్ కశ్యప్), అమృత అరోరా (షకీల్ లడఖ్) విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకున్నారు. ఇక మన టాలీవుడ్లో అయితే విజయ నిర్మల, అమల, రాధిక వంటి వారు వివాహం అయిన వ్యక్తులను పెళ్లాడారు. మన హీరోల విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, శరత్‌బాబు, పవన్ కళ్యాణ్, శరత్ కుమార్, హరికృష్ణ, ప్రకాశ్ రాజ్ వంటి వారు కూడా రెండో వివాహం చేసుకున్నారు. -
నాన్నా! నేనున్నాను!!
‘‘నాన్నా! నీకు కొడుకుల్లేరని దిగులు వద్దు. నేనే కొడుకుని’’ ఈ డైలాగ్ సినిమాల్లో చూస్తుంటాం. కేరళలోని శ్రీదేవి ‘‘నాన్నా! నీకు కొడుకుని నేనే’’ అని అనట్లేదు. కానీ ‘‘నాన్నా! నేనున్నాను’’ అని తండ్రికి భరోసా ఇచ్చింది. లాక్డౌన్లో ఇంటికి ఆసరా అయింది. శ్రీదేవి గోపాలన్‌కి పాతికేళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, బీఈడీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఈ వేసవి గడిస్తే టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు... అనుకుంది. కరోనా లాక్డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆమె తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్ల నుంచి కాయలు దింపుతాడు. ‘‘ఆ సంపాదనతో ముగ్గురి కూతుళ్లను పెంచి పెద్ద చేయడం, కాలేజీ చదువులు చదివించడం చిన్న విషయం కాదు. అయినా సరే... మా నాన్న ఏనాడూ తనకు పుట్టింది కూతుళ్లు మాత్రమే. కొడుకులు లేరు... అని బెంగ పడలేదు. ముగ్గురినీ చదివిస్తున్నాడు. అలాంటిది ఈ లాక్డౌన్ కాలం ఆయనను మానసికంగా కుంగదీసింది. వయసు పెరగడం, లాక్డౌన్ మొదటినెలల్లో ఎవరూ పనికి పిలవలేదు. చేతిలో పని లేకపోవడం, ఇంటి ఖర్చులేవీ తప్పక పోవడంతో బాగా ఆందోళనకు గురయ్యారు. అమ్మతో ‘కొడుకు ఉండి ఉంటే... చేదోడుగా ఉండేవాడు’ అన్నాడు. ఆ మాటతో నా మనసు కదిలిపోయింది. ‘‘కొబ్బరి కాయలు దించడానికి నేను కూడా వస్తాను నాన్నా’’ అంటే ఒప్పుకోరని తెలుసు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండా యూ ట్యూబ్‌లో కొబ్బరి చెట్టు ఎక్కడం, కాయలు దింపడం చూశాను. కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఉపయోగించే సాధనాలను మా చెల్లెళ్లు ఆన్లైన్లో బుక్ చేశారు. ఆ సాధనంతో నేను స్వయంగా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకున్నాను. పని కూడా వెతుక్కున్నాను. ఒక చెట్టు నుంచి కాయలు దింపితే నలభై రూపాయలు వస్తాయి. రోజుకు ఇరవై చెట్ల పని ఉంటుంది. నేను పనికి వెళ్లడం చూసి నాన్న తాను కూడా నాతో వస్తానన్నారు. చెట్టు మీద ఎక్కువ సేపు స్థిరంగా ఉండడం, కోత దశకు వచ్చిన కాయలను గుర్తించడం నేర్పించారు నాన్న. ఈ పనితో మా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. కానీ అమ్మ మాత్రం చాలా బాధ పడుతోంది. ‘ఇంత చదివించింది చెట్లెక్కి కొబ్బరి కాయలు కోయడానికా’ అని ఒకరు, ‘నువ్వు కన్నది కూతుర్ని... ఆడపిల్ల చేసే పనులేనా ఇవి’ అని మరొకరు బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు రకరకాలుగా దెప్పుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నాన్న ‘‘నా కూతుర్ని చూస్తే గర్వంగా ఉంది. నా కూతురి చేతికింద పని చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంద’’న్నారు. కోవిడ్ చాలా నేర్పిస్తోంది కోవిడ్ మనలో దాగి ఉన్న చాలా నైపుణ్యాలను వెలికి తీస్తోంది. మనల్ని మనం పోషించుకోవడానికి మన ఎదురుగా ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తాం. కొబ్బరి కాయలు కోయడంతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాం. కాయల రవాణా కూడా చేస్తున్నాం. నాన్నకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నాన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాను. కోవిడ్ మహమ్మారి ఇంతలా జీవితాల మీద దాడి చేయకపోయి ఉంటే... బీఈడీ తర్వాత టీచర్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నించేదాన్ని. నేను ఇన్ని పనులు చేయగలుగుతాననే విషయం ఎప్పటికీ తెలిసేది కాదు కదా’’ అని నవ్వుతోంది శ్రీదేవి. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం అంటే ఇదే. ‘పాజిటివ్’ అనే పదమే భయపెడుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి పాజిటివ్ దృక్పథం అవసరం. అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా, జీవికను గాడిలో పెట్టుకోవడానికైనా. అమ్మానాన్న, చెల్లెళ్లతో శ్రీదేవి -
వైరలవుతున్న నటి పెళ్లి ఫొటోలు
ముంబై: పాకిస్తాన్ నటి సజల్ అలీ తన చిరకాల మిత్రుడు, సహ నటుడు అహద్ రజా మీర్‌ను వివాహమాడారు. ఇటీవలే వీరి పెళ్లి వేడుక అబుదాబిలో ఘనంగా జరిగింది. నిఖా సందర్భంగా ఎరుపు రంగు లెహంగాలో వధువు సజల్ మెరిసిపోగా... తెలుపు రంగు కుర్తా ధరించిన రజా మీర్ హుందాగా కనిపించాడు. కాగా ఓ టీవీ షోలో కలిసి నటించిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2019 జూన్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరగగా తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సజల్.. ‘హెల్లో.. మిస్టర్ మీర్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సజల్ అలీ.. ‘మామ్ చిత్రంలో బాలీవుడ్ తెరపై తళుక్కుమన్న సంగతి తెలిసిందే. తన సవతి కూతురి(సజల్ అలీ)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో దివంగత, లెజెండ్ శ్రీదేవి నటించగా.. ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సజల్‌కు మంచి గుర్తింపు లభించింది. -
జాన్వీ బర్త్ డే: అమ్మ ఉంటే ఇలా చేసేది!
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నేటితో(మార్చి 6) 24వ వసంతంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకుని భావోద్యేగానికి లోనయ్యారు. ఓ ఇంటర్యూలో తన పుట్టిన రోజునా శ్రీదేశి చాలా హడావుడి చేసేవారని చెప్పారు. ‘నా ప్రతి పుట్టిన రోజును మా అమ్మ ఏప్పుడూ ప్రత్యేకంగా ఉంచేవారు. ముందు రోజు రాత్రి నా రూం అంతా బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించి కేక్ కట్ చేయించేవారు. ఆరోజు అమ్మ.. నన్ను చాలా గారాబం చేసేది. అయితే డాడీ(బోణి కపూర్) ఇప్పటికీ ప్రతి రోజు నన్ను గారాబం చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు. వైరల్: పర్ఫెక్ట్ స్టెప్పులతో అదరగొట్టిన జాన్వీ అంతేగాక మన ప్రత్యేకమైన రోజునా(పుట్టిన రోజు) ఖరీదైన బహుమతుల కంటే మనకు ఇష్టమైన వాళ్లతో గడపే సమయం చాలా విలువైనదని జాన్వీ చెప్పారు. ఇక తన తల్లి పోలికలతో జాన్వీని పోల్చడంపై స్పందించారు. ‘నేను మా అమ్మకు చాలా భిన్నంగా ఉంటానన్న విషయాని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. ‘ధడక్’ తర్వాత కొంత మందికి అది అర్ఢమైంది కానీ ఇప్ప టికీ కొందరూ నాలో శ్రీదేవిని చూస్తున్నారు’ అని అన్నారు. దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ? -
‘ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’
ముంబై: అతిలోక సుందరి శ్రీదేవి మరణించడం తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాల్లో ఒకటని బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా అన్నాడు. శ్రీదేవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశాడు. మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగిన మనీష్ మల్హోత్రా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించి ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీతో పంచుకున్నాడు. తాను సంప్రదాయ పంజాబీ కుటుంబంలో జన్మించానని, బాలీవుడ్ మీద ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నాడు. ‘‘సాధారణ కుటుంబంలో పుట్టిన నాకు... విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివేంత స్థోమత లేదు. అందుకే సొంతంగానే డిజైనింగ్ నేర్చుకున్నా. గంటల తరబడి స్కెచెస్ గీసేవాణ్ణి. మొదట్లో ఓ బొటిక్‌లో మోడల్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నా నెల జీతం రూ. 500. బాలీవుడ్ సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడిని. ఇలా జీవితం సాగిపోతుండగా... 25 ఏళ్ల వయస్సులో నా కెరీర్ ప్రారంభమైంది. జూహీ చావ్లా సినిమాలో పనిచేసే అవకాశం లభించింది. ఆ తర్వాత 1995లో విడుదలైన ‘రంగీలా’ సినిమాతో నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకు బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. ఇలా 30 ఏళ్ల కెరీర్లో ఎన్నెన్నో విజయాలు లభించాయి. ఇక నా జీవితంలో అత్యంత బాధపడిన, చెత్త విషయం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’’ అని మనీష్ చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్ అగ్ర తారలందరికీ అభిమాన క్యాస్టూమ్ డిజైనర్‌గా ఉన్న మనీష్ మల్హోత్రా.. శ్రీదేవికి కూడా వ్యక్తిగత డిజైనర్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు కూడా దుస్తులు డిజైన్ చేస్తున్నారు. -
చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
-
‘తల్లిదండ్రులు అవమానంగా భావించారు’
ముంబై: పట్టణానికి చెందిన శ్రీదేవి మూడేళ్ల క్రితం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై యూనివర్సిటీలో చేరిన శ్రీదేవి తనను తాను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్న తొలి విద్యార్థిగా నిలిచారు. 2017లో యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరినప్పుడు శ్రీదేవి తనను ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకున్నారు. కష్టపడి చదివి యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఒపెన్ లర్నింగ్(ఐడీఓఎల్) నుంచి సోషియాలజీ, సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రాడ్యూయేషన్ పూర్తి చేయడమే ఓ యుద్ధం అనుకుంటే.. దాని తర్వాత ఉద్యోగం సంపాదించడం మరి కష్టమైంది అన్నారు. ‘చదువు పూర్తవ్వడంతో ఓ యుద్ధాన్ని జయించినట్లు భావించాను. ఇలాంటి యుద్ధాలు ముందు ముందు మరెన్నో చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైంది ఉద్యోగం. చదవు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం మరింత కష్టమయ్యింది. ట్రాన్స్‌ఉమెన్‌కు జాబ్ ఇవ్వడానికి ఎవ్వరు ఆసక్తి చూపలేదు. ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్న తర్వాత ఓ ఉద్యోగం లభించింది. ప్రసుత్తం నేను ఓ ఎలాక్ట్రానిక్ కంపెనీలో సీఏడీ డిజైనర్‌గా పని చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా నేను ఎదర్కొన్న అనుభవాల మేరకు భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది. అయితే వ్యాపారం గురించి నాకు ఏం తెలియదు. కాకపోతే ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే వ్యాపారం చేయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు ఓ ఎన్జీవో అధ్వర్యంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. ఇంటిరీయర్ డిజైనింగ్‌కు సంబంధించి షార్ట్‌టర్మ్ కోర్సు కూడా చేస్తున్నాను’ అని తెలిపారు శ్రీదేవి. ఇక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘నన్ను తమతో పాటు ఉంచుకోవడం అవమానంగా భావించేవారు నా తల్లిదండ్రులు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే.. వారికి కనిపించకుండా నన్ను గదిలో బంధించేవారు. తల్లిదండ్రుల ప్రవర్తన నన్ను ఎంతో బాధపెట్టిది. నేను మనిషిని.. నాకు ఓ మనసుంది.. నాకు జీవించే హక్కుంది. నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనేందుకు దాక్కొవాలి అని నా మనసు తిరగబడేది. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో ఎన్నో సార్లు గొడవ పడ్డాను. కానీ వారిలో మార్పు లేదు. దాంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆనాటి నుంచి మరిక వెనుతిరిగి చూడలేదు’ అంటున్నారు శ్రీదేవి. ఐటీఓఎల్ ప్రతినిధి వినోద్ మలాలే మాట్లాడుతూ.. మా యూనివర్సిటీలో ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. కానీ వారు ఎవరు తమను తాము ట్రాన్స్‌జెండర్స్‌గా ప్రకటించుకోలేదు. అలా చేసిన మొదటి విద్యార్థి శ్రీదేవి అని తెలిపారు. -
తిరుపతిలోనే నా పెళ్లి: జాన్వీ కపూర్
‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ప్రవేశించారు అందాల నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికి తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు జాన్వీ. తాజాగా బ్రైడ్స్ టుడేకిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. శ్రీదేవి ఉన్నప్పుడు మీ పెళ్లి గురించి చర్చించేవారా అని ప్రశ్నించగా.. ‘దీని గురించి మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే మా అమ్మకు నా మీద నమ్మకం తక్కువ. నేను త్వరగా ప్రేమలో పడతానని తన అభిప్రాయం. నా జడ్జిమెంట్ మీద అమ్మకు నమ్మకం లేదు కాబట్టి నా కోసం తనే ఓ అబ్బాయిని చూస్తానని చెప్పేది’ అన్నారు జాన్వీ. ఇక చేసుకోబోయే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్నించగా.. ‘చేసే పని పట్ల తనకు శ్రద్ధ, నిబద్ధత ఉండాలి. తన నుంచి నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. నేనేంటే పడి చచ్చిపోవాలని’ చెప్పుకొచ్చారు. మరి పెళ్లి ఎలా జరగాలని కోరకుంటున్నారని ప్రశ్నించగా.. ‘అట్టహసంగా, వైభవంగా జరిగే వేడుకలకు నేను దూరం. అందుకే నా వివాహం చాలా సాంప్రదాయబద్ధంగా తిరుపతిలో జరుగుతుంది. పెళ్లిలో నేను కంజీవరం జరీ చీర ధరిస్తాను. వివాహం తర్వాత నాకు ఇష్టమైన దక్షిణ భారతదేశ వంటకాలతో బ్రహ్మండమైన దావత్ ఉంటుంది. దానిలో ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, పాయసం వంటివి ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
సాక్షి, విజయవాడ: తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గుంటూరు రూరల్ ఎస్పీని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎస్పీని కలిసి మాట్లాడారు. అసలు మహిళా దళిత ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అంటరానితనాన్ని రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. దళిత ఎమ్మెల్యే.. దేవుడు దగ్గరకు వెళ్ళితే మైలు పడతారని మాట్లాడటం ప్రజాస్వామ్య,రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రౌడీల్లా రెచ్చిపోతున్నారు.. గుంటూరు:దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతల దౌర్జన్యం దారుణమని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల్లా ప్రవర్తిస్తూ.. టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘శ్రీదేవిది సహజ మరణం కాదు’
భారతదేశ సినీ చరిత్రలో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిన అలనాటి అందాల తార శ్రీదేవి మరణించి నేటికి ఏడాదికి పైనే అయ్యింది. ఇప్పటికి కూడా శ్రీదేవి అభిమానులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో శ్రీదేవి ఓ బాత్‌టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మృతి చుట్టూ ఎన్నో అనుమానాలు. కానీ వాటికి సరైన సమాధానం మాత్రం లభించలేదు. అభిమానుల మనసుల్లో నేటికి కూడా ఈ అనుమానాలు అలానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీదేవి మృతి గురించి మరో సారి చర్చ ప్రారంభమయ్యింది. ఈ చర్చను ప్రారంభించిన వ్యక్తి సామాన్యుడు కాదు. కేరళ జైళ్ల శాఖ డీజీపీగా పని చేస్తున్న రిషిరాజ్ సింగ్ ఈ చర్చను తెరమీదకు తీసుకొచ్చారు. కేరళ కౌమిది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషిరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని బాంబు పేల్చారు. అతిలోక సుందరిది సహజ మరణం కాదని తన స్నేహితుడు, ఫొరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమదత్తన్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి దేశవ్యాప్తంగా శ్రీదేవి మృతి చర్చనీయాంశమైంది. శ్రీదేవి మరణం గురించి తాను ఉమదత్తన్‌తో మాట్లాడినప్పుడు ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేసినట్లు రిషిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన మాటాల్లోనే.. ‘ఏ మనిషి అయినా ఒక్క అడుగు లోతు ఉన్న బాత్‌టబ్‌లో పడి చనిపోవడం అసంభవం. ఒక వేళ సదరు వ్యక్తి విపరీతంగా తాగితే.. తప్ప ఇలా చనిపోయే అవకాశం లేదు. అలాకాకుండా ఎవరైనా వ్యక్తి కావాలని నీటిలో ముంచితే అప్పుడు ఆ వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది. అయితే శ్రీదేవికి అతిగా తాగే అలవాటు లేదు. పైగా ఎంత మత్తులో ఉన్నా సరే ఊపిరాడని పరిస్థితి ఎదురైతే.. మన శరీరం వెంటనే రియాక్టయి.. మత్తును తాత్కాలికంగానైనా బ్రేక్ చేస్తుంది. కానీ శ్రీదేవి విషయంలో అలా జరగలేదు’ అన్నారు రిషిరాజ్ సింగ్. మరోటి శ్రీదేవి దుబాయ్‌లో బీమా చేయించడం.. ఆమె అక్కడ మరణిస్తేనే బీమా పరిహారం అందుతుంది అనే అంశం కూడా అనుమానాస్పదంగానే ఉందన్నారు. చివరకు శ్రీదేవి కూడా దుబాయ్‌లోనే మరణించడం ఈ అనుమానానికి బలం చేకూరుస్తుందన్నారు. శ్రీదేవి మరణించిన తర్వాత బీమా పరిహారానికి సంబంధించిన వార్తలు పేపర్లలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పోలీసు అధికారి, ఫోరెన్సిక్ నిపుణుడు శ్రీదేవి మరణం గురించి సందేహాలు వ్యక్తం చేయడంతో మరోసారి ఈ టాపిక్ గురించి చర్చ జరుగుతోంది. అవన్ని ఊహాజనిత వార్తలే : బోనీ కపూర్ అయితే శ్రీదేవి మృతి పట్ల రిషిరాజ్ సింగ్ వ్యక్తం చేసిన అనుమానాలను బోనీ కపూర్ కొట్టి పారేస్తున్నారు. అవన్ని ఊహాజనిత ప్రశ్నలే అంటున్నారు. -
‘ఆమెని మర్చిపోవడమా.. అసాధ్యం’
అందాల తార శ్రీదేవి మరణించి ఇప్పటికే ఏడాది దాటినప్పటికి.. ఆమె జ్ఞాపకాలు మాత్రం అభిమానులను వదలడం లేదు. ఇక ఆమె భర్త, పిల్లల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటికి కూడా వారు ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ టీవీ షోకు హాజరైన బోనీ కపూర్.. శ్రీదేవి గురించి తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఫిల్మ్ ట్రేడ్ అనాలసిస్ట్ కోమల్ నాథ్ వ్యాఖ్యతగా వ్యవహరించే.. ‘ఔర్ ఏక్ కహానీ’ కార్యక్రమానికి హాజరయ్యారు బోనీ. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్ తెగ వైరలవుతోంది. కార్యక్రమంలో భాగంగా కోమల్ నాథ్ బోనీని.. ‘మీ జీవితంలో శ్రీదేవిని మర్చిపోయిన క్షణం ఏదైనా ఉందా’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే ఉద్వేగానికి గురైన బోనీ.. కన్నీటిని ఆపుకుంటూ.. ‘లేదు.. ఆమెని మర్చిపోవడం అసలు సాధ్యం కాద’ని సమాధానమిచ్చారు. అంతేకాక ‘మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు.. మరి సినిమాల్లో ఎందుకు నటించలేద’ని కోమల్ నాథ్ ప్రశ్నించగా.. ‘ఇప్పుడు కూడా నేను చాలా పొడవుగా.. అందంగానే ఉన్నానం’టూ బోనీ సమాధానమిచ్చారు. తప్పుడు ఆర్థిక నిర్ణయాల గురించి ప్రశ్నించగా.. ‘నేను రేస్‌లకు వెళ్లి, జూదం ఆడి డబ్బులు పొగొట్టలేదు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఆర్థికపరంగా కొన్ని తప్పులు జరిగాయని నాకు తెలుసు. అయితే ఇలాంటి సందర్భాల్లో కుటుంబం మద్దతు.. ముఖ్యంగా భార్య పిల్లల మద్దుతు లేకపోతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అదృష్టం కొద్ది ఈ విషయంలో నా కుటుంబం నాకు పూర్తి మద్దతుగా ఉంద’ని బోనీ చెప్పుకొచ్చారు. Why did ostentatious producer Boney Kapoor @BoneyKapoor get emotional on Komal Nahta Aur Ek Kahani? See for yourself in this trailer and then on the show on Sunday, May 5, 1 p.m. on Tata Sky’s Classic Cinema channel (no. 318). @Subhash_somani @PRIYANKAAWASTHY@sukrit_banerjee pic.twitter.com/ucD9o03ZHr — Komal Nahta (@KomalNahta) May 3, 2019 ఈ కార్యక్రమం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు టాటా స్కై క్లాసిక్ సినిమా చానెల్లో ప్రసారం కానుంది. శ్రీదేవి మరణంతో బోనీ కపూర్ పూర్తిగా కుంగిపోయాడని చెప్పవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన నలుగురు పిల్లలు బోనీకి మద్దతుగా నిలిచారు. -
‘ఏడుస్తూ ఉంటే నువ్వు చాలా బాగున్నావ్
శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాక జాన్వీకి మరిన్ని అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావాలనేది నా కల. దీన్ని సాకారం చేసుకోవడానికి నేను మా అమ్మతో గొడవ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఆ రోజు నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను అని మా అమ్మతో చెప్పాను. తాను ముందు వద్దంది. ఆ తర్వాత ఇదే విషయమై మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దాంతో నేను ఏడ్వడం మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ నావైపు తిరిగి ఏడుస్తున్నప్పుడు నువ్వు చాలా బాగున్నావ్. యాక్టర్‌కు ఇది చాలా ముఖ్యం’ అని చెప్పిందంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాక ధడక్ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించడం తనకు చాలా మేలు చేసిందన్నారు జాన్వీ. ఒక వేళ తాను ఆ చిత్రంలో నటించకపోతే.. ప్రస్తుతం తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని తెలిపారు. ఆ చిత్రం తనకు ఎన్నో విధాల మేలు చేసిందన్నారు. జాన్వీ ప్రస్తుతం.. వార్ ఎపిక్ డ్రామా ‘థక్త్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తొలిసారిగా బాబాయ్ అనిల్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆమె.. భారత వైమానిక పైలట్ గుంజన్ సక్సేనా బయెపిక్ ‘కార్గిల్ గర్ల్’ సినిమా టైటిల్ రోల్లో కనిపించనున్నారు. -
శ్రీదేవిలా నటించాలంటే గట్స్ ఉండాలి..
ముంబై : క్రేజీ తార సిల్క్ స్మిత పాత్రలో ఒదిగిపోయి బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్. ఇటీవలే ఎన్టీయార్ బయోపిక్‌లో కూడా బసవతారకంగా కనిపించారు. తాజాగా తన అభిమాన నటి కోసం కాస్త కష్టంతో కూడుకున్నదైనా సరే మరో బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అంటున్నారు విద్య. తనకు గనుక అవకాశం వస్తే కచ్చితంగా స్వర్గీయ లెజండరీ నటి శ్రీదేవి పాత్రలో జీవించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తా అంటున్నారు. శుక్రవారం ఓ షోకు హాజరైన విద్యా బాలన్ మాట్లాడుతూ... ‘నేను శ్రీదేవి అభిమానిని. తుమ్హారి సులూ సినిమా కోసం శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’లోని ‘హవా హవాయి’ పాటలో నటిస్తున్నపుడు ఉద్వేగానికి లోనయ్యాను. నాకే గనుక శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేస్తా. అయితే అందుకు చాలా ధైర్యం కావాలి. నాకు ఇష్టమైన నటికి నివాళి అర్పించాలంటే ఆ మాత్రం చేయాలి కదా అంటూ అతిలోక సుందరిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇక తన పాత్రల ఎంపిక గురించి అడిగినపుడు... ‘ స్వాభిమానం ఉండాలి, అదే విధంగా మన జీవితంలో ఉన్న ముఖ్య వ్యక్తి మనమే అని భావించాలి. నన్ను అలాగే పెంచారు. అందుకే ఇష్కియా సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకొన్నా అని చెప్పుకొచ్చారు. -
తల్లికి తగ్గ తనయ
అలనాటి అందాల తార శ్రీదేవి నటన, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలిచారు శ్రీదేవి. ఆమె వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. తొలి చిత్రం ‘ధడక్’తో విజయంతో పాటు నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటున్నారు జాన్వీ. ప్రస్తుతం జాన్వీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీదేవిలానే జాన్వీ కూడా మంచి డ్యాన్సర్ అనే సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. త్వరలో పాల్గొనబోయే ఓ కార్యక్రమం కోసం కొరియోగ్రాఫర్‌తో కలిసి జాన్వీ క్లాసికల్ డ్యాన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి. ఈ వీడియో చూసిన అభిమానులు ‘మరోసారి శ్రీదేవిని గుర్తు చేశారం’టూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram @jahnvikapoor rehearses with full dedication for her performance for an upcoming event. A post shared by Viral Bhayani (@viralbhayani) on Jan 22, 2019 at 3:54am PST -
ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్
ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ప్రియా ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు పంపారు. విషయం ఏంటంటే.. ప్రియా ప్రకాశ్ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ట్రైలర్, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అదీ కాకుండా ట్రైలర్లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సీన్ కూడా ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాత బోనీ కపూర్.. ప్రియతో పాటు చిత్రబృందానికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మాట్లాడుతూ.. ‘గత వారం బోనీ కపూర్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను. నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి. మేం దీన్ని ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు. -
‘శ్రీదేవి కాళ్లకు నమస్కరించేవాడిని’
శ్రీదేవి లాంటి సూపర్ స్టార్‌తో నటించడం నా అదృష్టం. ఆమెని కలిసిన ప్రతిసారి తన కాళ్లకు నమస్కరించేవాడిని అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ ఇండియా అనిల్ కపూర్. శ్రీదేవితో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించారు అనిల్ కపూర్. ఈ మధ్య ఓ టీవీ కార్యక్రమానికి హాజరైన అనిల్ కపూర్ ఈ సందర్భంగా శ్రీదేవితో తనకు గల అనుబంధం గురించి తెలిపారు. ‘నేను ఆమెని కలిసిన ప్రతి సారి ఆమె పాదాలకు నమస్కరించేవాడిని. ఇది ఆమె పట్ల నాకున్న గౌరవం. కానీ నేను ఇలా చేయడం శ్రీదేవికి చాలా అసౌకర్యంగా అనిపించేది’ అంటూ చెప్పుకొచ్చారు. ‘ఓ ఆర్టిస్ట్‌గా ఆమెలాంటి గొప్ప స్టార్‌తో కలిసి నటించడం నా అదృష్టం. ఆమెతో నటించడం నా కెరియర్‌కి బాగా హెల్స్ అయ్యింది. ఆమెలో చాలా ప్రతిభ ఉంది. స్ర్కీన్ మొత్తాన్ని ఆమె తన మ్యాజిక్‌తో నింపగలదు. ఆమె ప్రతిభకి కొలమానం లేదు. తను మా అన్నని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెపై ఉన్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆమె మనతో లేరని బాధపడకూడదు. ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించినందుకు సంతోషించాలి’ అని వెల్లడించారు అనిల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు శ్రీదేవి.