srinivasulu
-
జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది. అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు. -
టీడీపీ నేతలే హంతకులు
-
బయటపడ్డ కూటమి సర్కారు నిజస్వరూపం
-
పత్తికొండ హత్య కేసులో టీడీపీ నేతే హంతకుడు
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది. అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్.. హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు. ఇప్పుడేమంటావ్ లోకేశ్? హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్సీపీ, జగన్మోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!? -
కర్నూలు: టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆధిపత్యం కోసం టీడీపీ నేతలే హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. హత్యకు ఆధిపత్య పోరే కారణమని డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు.హత్య వెనకా రాజకీయ కోణం ఉంది. అందుకే అంత మొందించారు. టీడీపీకి చెందిన గుడిసె నరసింహులతో పాటు మరో ముగ్గురు హత్యకు కుట్ర పన్నారు. ఇద్దరు మైనర్లతో హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులను పత్తికొండ కోర్టులో రిమాండ్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని జువైనల్ కోర్టుకు తరలించారు.శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. అయితే ఈ హత్యను మంత్రి నారా లోకేష్.. వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన జరిగింది. -
టీడీపీ నేత హత్యకేసు: వెలుగులోకి దారుణ నిజాలు
కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. టీడీపీలో శ్రీనువాసులకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యను వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్, హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. -
షాడో ఎమ్మెల్యేకి 15 బ్రేక్ దర్శన టికెట్లు!
తిరుమల: తిరుమలలో సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి.. తీరా తమకు తోచిన వారికి అత్యధిక టికెట్లు కేటాయించేలా టీటీడీపై ఒత్తిడి తెస్తోంది. సాధారణంగా టీటీడీ నియమావళి ప్రకారం రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు స్వయంగా దర్శనానికి వస్తే, వారితో పాటు వచ్చేవారికి కూడా ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తారు. వారు స్వయంగా రాకుండా కుటుంబ సభ్యులు వస్తే రెఫరల్ ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. అయితే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శనానికి స్వయంగా రాకపోయినప్పటికీ, ఆయన అన్న కుమారుడు శివకుమార్‌తో పాటు మరో 14 మందికి ప్రొటోకాల్ బ్రేక్ దర్శనాలు కేటాయించారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంత షాడో ఎమ్మెల్యే అయినా 14 బ్రేక్ దర్శనాలు ఎలా ఇస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. -
అంతరార్థం..
ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే దాన్ని చూసిన మనం అతడు అలా చేయటం మంచిదనో లేదా చెడ్డదనో వెంటనే తీర్పుచెబుతూ ఉంటాం. అలా చేయటం తగదని శ్రీ రామకృష్ణ పరమహంస రామాయణ, మహాభారతాల నుంచి కొన్ని ఉదాహరణలు చూపారు. రామరావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాది యుద్ధ వీరులంతా చనిపోయారు. రావణుని తల్లి కైకశి ప్రాణభయంతో పారిపోసాగింది.లక్ష్మణుడు అలా పారిపోతున్న ఆ వృద్ధ స్త్రీని గమనించి శ్రీరామ చంద్రునితో, ‘అన్నయ్యా! ఏమిటీ వింత? అనేక మంది పుత్రులను, బంధువులను కోల్పోయి పుత్ర శోకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు స్వీయ ప్రాణ రక్షణార్థం ఈ వృద్ధురాలు ఇలా ఎందుకు పారిపోతోంది?’ అని అడిగాడు. అందుకు రాముడు ‘ఆమెనే అడిగి కారణం కనుక్కొందాం’ అన్నాడు. ‘శ్రీరాముడు అభయమిచ్చాడని తెలిపి ఆమెను గౌరవంగా నా కడకు తోడ్కొని రండి అని కొందరిని ఆమె కడకు పంపాడు. వారు అలాగే చేశారు.‘నీవు ప్రాణ భీతితో అలా పారిపోతున్నావా? నిజం చెప్పు’ అన్నాడు శ్రీరామ చంద్రుడు ఆమెతో. అప్పుడామె, ‘ఓ రామా! నేను జీవించి ఉన్నందునే నీ ఈ లీలలను తిలకించ గల్గుతున్నాను. ఈ భూమ్మీద నీవు ఇంకా జరుపబోయే లీలలను కూడా చూడగోరి ఇంకా కొంత కాలం జీవించాలని అభిలషిస్తున్నాను’ అని చెప్పింది. దీంతో సత్యమేమిటో అందరికీ తెలిసి వచ్చింది.మహాభారత ఉదాహరణ చూద్దాం. భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పంచ పాండవులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మహావీరుడైన భీష్మాచార్యుల వారి కళ్ళ నుండి అశ్రువులు స్రవించటం వారు గమనించారు. అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘సఖా! ఎంత విచిత్రంగా ఉంది. కురు పితామహులైన భీష్ములు మరణ సమయంలో మాయలో పడి దుఃఖిస్తున్నా రేమిటి?’ అన్నాడు. కృష్ణుడే భీష్ముడిని దాన్నిగూర్చి అడిగాడు.అప్పుడు భీష్ముడు, ‘ఓ కృష్ణా! మరణ భయంతో నేను దుఃఖించటం లేదని నీకు బాగా తెలుసు, స్వయంగా భగవంతుడే పాండవులకు సారథిగా ఉన్నప్పటికీ వారి కష్టాలకు అంతులేకుండా ఉందే! ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి లీలలను కించిత్తూ తెలుసుకోలేకుండా ఉన్నానే అని తలచుకొని దుఃఖిస్తున్నాను’ అన్నాడు (శ్రీ రామకృష్ణ కథామృతం–01). కాబట్టి దేన్ని చూసినా, విన్నా త్వరపడి విమర్శించ కూడదు. నిజం నిలకడ మీద తేలుతుంది. – రాచమడుగు శ్రీనివాసులు -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
ఆధ్యాత్మిక శక్తితో...
ఇవ్వాళ ప్రభుత్వాలూ, సంఘసేవకులూ మహిళా సాధికారత గురించి ఎంతగానో మాట్లాడుతున్నారు. కానీ, దాదాపు 140 సంవత్సరాల క్రితమే శ్రీ రామకృష్ణ పరమహంస స్త్రీ జనోద్ధరణపై దృష్టి పెట్టారు. సాక్షాత్తూ భార్యలోనే కాళీ మాతను దర్శించగలిగిన పరమహంస స్త్రీ జనోద్ధరణకు తన శిష్యులను ప్రోత్సహించారు.ఒకరోజు గౌరీమా అనే భక్తురాలు పువ్వులు సేకరిస్తుండగా గురుదేవులు ఒక నీటికుండతో అక్కడకు వచ్చి ఒక చేత్తో చెట్టుకొమ్మను పట్టుకొని మరో చేత్తో చెట్టుకు నీరు పోస్తూ ‘గౌరీ, నేను నీరు పోస్తూ ఉంటే నువ్వు మట్టిని కలుపు’ అన్నాడు. అప్పుడామే ‘ఇక్కడ బంక మట్టి లేదు. ఎలా మట్టిని కలప గలన’ని పలికింది.ఆ మాట విని గురుదేవులు ‘నేను ఏ అర్థంలో చెప్పానూ, నువ్వు ఏ రకంగా అర్థం చేసుకొన్నావూ? ఈ దేశంలో స్త్రీల పరిస్థితి శోచనీయంగానూ, బాధాకరంగానూ ఉంది. వారికోసం నువ్వు పాటుపడాలి’ అన్నారు. అంటే... తాను దేశ స్త్రీల అభివృద్ధికి నడుం బిగించి కృషి ఆరంభిస్తే, గురుదేవులు అందుకు తగిన తోడ్పాటు అందిస్తారన్నమాట అనుకున్నారు గౌరీమా. అప్పుడామె ‘కొద్ది మంది బాలికలను నాకు ఇవ్వండి. వారిని హిమాలయాలకు తోడ్కొని వెళ్ళి వారిని సౌశీల్యవంతులుగా తీర్చి దిద్దుతాను’ అంది. గురుదేవులు తన తలను అడ్డంగా ఊపుతూ, ‘కాదు, కాదు, నువ్వు నగరంలోనే ఉంటూ పని చేయాలి. నువ్వు అనుష్ఠించిన ఆధ్యాత్మిక సాధనలు చాలు. ఆధ్యాత్మిక శక్తితో నువ్వు స్త్రీలను సేవించాలి’ అన్నారు.గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించిన గౌరీమా కలకత్తాలో బాలికల నిమిత్తం ఒక పాఠశాలను స్థాపించి భారతీయ స్త్రీలను విద్యావంతులను గావించడంలోనూ, తద్వారా వారిని ఉద్ధరించడంలోనూ ఎంతో కృషి చేసింది. (పుటలు 248, 249 – శ్రీ రామకృష్ణ లీలామృతం). రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు కూడా మహిళా ఉద్ధరణకు ఎంతగానో కృషి చేయడం గమనార్హం. – రాచమడుగు శ్రీనివాసులు -
వైఎస్సార్సీపీ దళిత నేత ఇంటిపై దాడి
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్‌ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. -
ఎన్ని శక్తులు ఏకమైనా గెలుపు వైఎస్సార్సీపీదే
సాక్షి, అమరావతి: ఎన్ని శక్తులు ఏకమైనా 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని వర్గాలూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. ‘సిద్ధం’ సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తే.. సీఎం జగన్‌పై ప్రజలకు ఏస్థాయిలో అభిమానముందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబు కుప్పంలో ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తెలిసే.. బాబుకు ఇక విశ్రాంతి అవసరమంటూ భువనేశ్వరి అన్నారు. నారా కుటుంబం ఓటమిని ముందే అంగీకరించింది. కుప్పంలో సైతం ఓడిపోతానని తెలిసే.. అక్కడి నుంచి పారిపోయేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నామని పవన్‌కళ్యాణ్ అంటున్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేనప్పుడు.. రాజకీయాలు ఎందుకు? అసలు ఏం చూసి ప్రజలు చంద్రబాబుకు, బీజేపీకి, పవన్‌కు ఓటు వేయాలి? 2014లో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయకుండా చంద్రబాబు కూటమి ప్రజల్ని మోసం చేస్తే.. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. వైఎస్ జగన్ పాలనలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ సీఎం జగన్ మంచి చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే వైఎస్సార్సీపీ టార్గెట్. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో మళ్లీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. -
మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒకరు మృతి
శాంతిపురం(చిత్తూరు): మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు గౌనివారి శ్రీనివాసులు కారు ఢీకొని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో మహిళ మృత్యువుతో పోరాడుతోంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని బంగారుపేట సమీపంలో ఉన్న ఐతెనహళ్లికి చెందిన దంపతులు మునెప్ప (60), లక్ష్మమ్మ శనివారం మోపెడ్‌పై గుండిశెట్టిపల్లికి బయలుదేరారు. గమ్యస్థానానికి అర కిలోమీటరు దూరంలో ఉండగా శనివారం రాత్రి పలమనేరు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు వీరి టీవీఎస్ సూపర్ ఎక్సెల్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడ్డ మునెప్పకు తల, కాళ్లకు, లక్ష్మమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో వీరిని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మునెప్ప మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు స్వయంగా కారు నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే రాత్రి 9.30 గంటల వరకు ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ విషయమై రాళ్లబూదుగూరు ఎస్ఐ మునిస్వామిని వివరణ కోరగా..ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం గమనార్హం. ఒక ప్రాణం పోయినా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా.. ప్రమాదానికి కారణం ఎవరనే విషయంలో స్పష్టత ఉన్నా పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
చిత్తూరు రూరల్/చిత్తూరు అగ్రికల్చర్/గుడిపాల: చిత్తూరు, గుడిపాల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలను మండల ప్రజాప్రతినిధులతోపాటు వెఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్సీపీ నాయకులు, అధికారులు ఎమ్మెల్యేను ఆయన నివాసం వద్ద కలిసి దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గుడిపాలలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎం.ఎస్ బాబునాయుడు, వైస్ ఎంపీపీలు జయరాం, రంజనీ, గుడిపాల ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి, నాయకులు త్యాగరాజులు, సంపత్, బాబు, దిలీప్, కుమార్, ధర్మారెడ్డి, ఎంపీటీసీ, సర్పంచులు ప్రతిమారెడ్డి, భాస్కర్‌రెడ్డి, భాస్కర్, శ్రీధర్‌రెడ్డి, రజనీకాంత్, వెంకటేష్‌రెడ్డి, కలై అరసి, రవీంద్రారెడ్డి, శ్రీరాములురెడ్డి, జనార్ధన్, ప్రసాద్‌రెడ్డి, చిట్టిబాబు, డానియల్, విక్టర్, సాయిప్రతాప్, శింభు, సాయి, గోపి, క్రిష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చార్జర్ వైర్‌తో చంపేశారు...
గుణదల (విజయవాడ తూర్పు): ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మేడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్‌ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపు తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్‌లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. నిందితుల అరెస్టు.. మృతుని తండ్రి కరణం రాఘవరావు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. -
ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి
సాక్షి, విజయవాడ: కోవిడ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వచ్చే అంబులెన్స్‌లను పరిశీలించి అనుమతి ఇస్తున్నామన్నారు. మద్యం అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయి. జీజీహెచ్‌లో అక్సిజన్ అయిపోయే ప్రమాదాన్ని అందరి సహకారంతో అరికట్టాం. పోలీసు శాఖలో 97 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లను అమ్మే 12 గ్యాంగ్‌లను పట్టుకున్నాం. విజయవాడ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుపై కేసులు నమోదు చేశాం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీలు, అవగాహన కల్పించామని’’ సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చదవండి: తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్ ప్లాంట్, ప్రారంభించిన మంత్రి ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’ -
అమ్మా ఎంతపనిచేశావమ్మా..?
చిన్నపాటి మనస్పర్థలకే కుంగిపోయావు.. మా నాన్నను వదిలి ఒంటరిగా జీవించాలనుకున్నావు.. అది సాధ్యం కాదని తెలిసి నీ తల్లిదండ్రుల చెంతకు చేరావు.. వారితోనూ సఖ్యతగా ఉండలేక విసిగిపోయావు .. గొడవలకు దిగి మరింత మానసిక వేదనకు లోనయ్యావు.. కడుపుచించుకు పుట్టిన బిడ్డల్ని పోషించలేనని భావించావు.. ఒంటరిగా సమాజంలో బతకడం కష్టమని కుమిలిపోయావు.. ఇక చావే శరణ్యమని వ్యవసాయబావిని ఎంచుకున్నావు.. ఆ బావిలోనే మమ్మల్ని ముంచేసి.. నువ్వూ కడతేరిపోయావు.. అమ్మా ఎంతపనిచేశావమ్మా..? అన్నట్టు అభంశుభం తెలియని పసిపిల్లలు నీటిలో తేలియాడుతూ కనిపించడం చూపరులను కలచివేసింది. చిత్తూరులో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన తల్లీబిడ్డలు శుక్రవారం వ్యవసాయ బావిలో శవాలుగా తేలడం స్థానికంగా విషాదం అలముకుంది. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఓబనపల్లెకు చెందిన మునిరత్నం, పట్టమ్మ కుమార్తె ధనలక్ష్మి (28)కి పదేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరుకు చెందిన ముత్తుతో వివాహమైంది. వీళ్లకు ఝాన్సి (8), ఉదయ్ పిల్లలు ఉన్నారు. ముత్తు తాపీమేస్త్రీగా, ధనలక్ష్మి హైరోడ్డులోని ఓ హోటల్లో కూలీగా పనిచేసేవారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగింది. తర్వాత చిన్నపాటి గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం దంపతులు విడిపోయారు. ముత్తు తన సొంతూరికి వెళ్లిపోగా, ధనలక్ష్మి ఓబనపల్లెలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి, కుమారుడిని ఒకటో తరగతి చదివిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా ధనలక్ష్మి ఒంటరితనాన్ని భరించలే పోయింది. తల్లిదండ్రులతో సైతం పలుమార్లు మనస్పర్థలు రావడంతో మరింత కుంగిపోయింది. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్.. మనోవేదనతో శిరీష..) ఈనెల 4వ తేదీ సాయంత్రం పిల్లలతో సహా ధనలక్ష్మి కనిపించకుండాపోయింది. భర్త వద్దకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఆపై రెండు రోజుల పాటు అన్నిచోట్లా విచారించారు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో ఈనెల 6వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ కెమెరాలు, తెలిసిన వాళ్ల చిరునామాల్లో వెతకడం ప్రారంభించారు. ధనలక్ష్మి తన సెల్‌ఫోన్ కూడా ఇంట్లోనే వదలివెళ్లిపోవడంతో కేసు కొలిక్కిరాలేదు. శుక్రవారం ఉదయం ఓబనపల్లె వద్ద ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలాయి. గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేశారు. బాధితుల్ని ఓదారుస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టూటౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ మల్లికార్జునతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ధనలక్ష్మి పిల్లలుగా గుర్తించారు. కొంతసేపటి వరకు ధనలక్ష్మి కోసం బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు తీవ్రం చేయడంతో ఆమె మృతదేహం కూడా లభ్యమైంది. పిల్లల్ని ముందుగా బావిలో తోసి, ఆపై తనూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. -
ఎమ్మెల్యే గారు మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా..
సాక్షి, చిత్తూరు: ‘‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ హరికృష్ణ మాట్లాడుతున్నా.. చిత్తూరులోని ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నాం. మీ శ్రేయోభిలాషి కావడంతో ముందుగానే చెబుతున్నా. కాస్త జాగ్రత్తగా ఉండండి. చిన్న మాట, నేండ్రగుంట వద్ద మన టీమ్ (ఏసీబీ బృందం) భోజనాలు చేస్తోంది. ఓ రూ.8 వేలు పంపితే బాగుణ్ణు.’’ అంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు ఫోన్ చేసి, మస్కాకొట్టబోయిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఎమ్మెల్యే పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంగవరానికి చెందిన ఉప్పత్తి హరికృష్ణ (35)ను గురువారం అరెస్టు చేశారు. చిత్తూరు ఇన్చార్జ్ డీఎస్పీ తిప్పేస్వామి, టూటౌన్ సీఐ యుగంధర్, తాలూక సీఐ విక్రమ్ ఇతని నేరచరిత్రను మీడియాకు వివరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మదనపల్లెవారి ఇండ్లు సమీపంలోని సాయిగార్డెన్ సిటీకి చెందిన ఉప్పత్తి హరికృష్ణ.. ఇంటర్ వరకు చదువుకున్నాడు. కాస్త ఏమరుపాటుగా ఉన్నవాళ్లను మోసం చేయడంలో దిట్ట. ఓ సెల్‌ఫోన్ కంపెనీకు చెందిన టవర్ లొకేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగులకు వలవేశాడు. నిరుద్యోగ అభ్యర్థులను తాను ముందుగా ఎంచుకున్న ప్రదేశాలకు పిలవడం, ఇంటర్వ్యూలు చేసేలా ఓ వాతావరణం సృష్టించేవాడు. ‘ఇంటర్వ్యూకు గడ్డం గీసుకోకుండా వస్తే ఎలాగయ్యా..? అదిగో అక్కడున్న షాపులో షేవ్ చేసుకుని, స్నానంచేసి రా’ అంటూ నిరుద్యోగులను పంపడం, వాళ్ల మొబైల్లో ఉన్న పేటీఎం, ఫోన్ పే కోడ్లు తెలుసుకుని తన బ్రాంచ్ ఆఫీసు నుంచి డబ్బులు వస్తాయని నిరుద్యోగుల నంబర్ల నుంచి పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసేవాడు. (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు) ఇలా అనంతపురం జిల్లాలోని పెనుగొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో తహసీల్దార్లు, పోలీసు అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులకు ఫోన్లు చేశాడు. ఏసీబీ డీఎస్పీగా పరిచయం చేసుకుని.. రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఫోన్‌పే, పేటీఎంలలో డబ్బులు వేయించుకునేవాడు. ఈనెల 4వ తేదీ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుకు ఫోన్‌చేసి రూ.8వేలు అడగడంతో ఆయన పీఏ స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వలపన్ని తొలుత రూ.200 ఫోన్‌పేలో పంపించి, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హరికృష్ణను అరెస్టు చేశారు. (క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం) పోలీసుల విచారణలో నిందితుడిపై తిరుపతి, పుంగనూరు, బైరెడ్డిపల్లె, మదనపల్లె, తంబళ్లపల్లె, బంగారుపాళ్యం పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. ఈ కేసులకు సంబంధించి ఇతను జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు గుర్తించారు. చిత్తూరులోని వన్‌టౌన్, టూటౌన్, తాలూక పోలీస్ స్టేషన్ల పరిధిలో వారంలో ముగ్గురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. చిత్తూరులో నమోదైన మూడు కేసుల్లో నిందితుడ్ని అరెస్టు చేస్తున్నట్లు, ఇతనిపై రౌడీషీట్ కూడా తెరుస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇతడ్ని పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐలు విక్రమ్, నాగసౌజన్య, సిబ్బంది రాజ్‌కుమార్, సుధాకర్‌ను డీఎస్పీ అభినందించారు. -
కదులుతున్న అక్రమాల డొంక..
సాక్షి కడప: తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆప్కోలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బినామీ సొసైటీలను అడ్డుపెట్టుకుని ఆప్కో మాజీ చైర్మన్ శ్రీనివాసులు చేసిన అవినీతిని సీఐడీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే గుజ్జుల శ్రీను ఇంటిలో సోదాలు జరిపి 9కిలోలకు పైగా బంగారం, 16కేజీల వెండి, రూ.కోటి 10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రొద్దుటూరు, ఖాజీపేట, కడప, ఎర్రగుంట్లలో దాడులు చేశారు. రికార్డులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 70శాతం బోగస్ సొసైటీలే.. సీఐడీ అధికారులు జిల్లాలోని 126 చేనేత సొసైటీలను గుర్తించారు. 2015 నుంచి 2018 వరకూ అధిక లావాదేవీలు జరిగిన వాటిని ప్రత్యేకంగా గుర్తించారు. ఆ సోసైటీల సభ్యుల జాబితాను తీసుకున్నారు. గ్రామాలకు వెళ్లారు. సొసైటీల్లో నిజంగా సభ్యులు ఉన్నారా కాగితాలకే పరిమితమయ్యారా అనే విషయాలపై ఆరా తీశారు.దాదాపు 70శాతం బోగస్ సొసైటీలను గుర్తించారు. ఇందులో అధిక భాగం ఆప్కో మాజీ చైర్మన్ బినామీలున్నట్లు గుర్తించింది. సొసైటీల ఆర్థిక లావాదేవీలపై సీఐడీ ప్రత్యేక నిఘా ఉంచింది. బోగస్ సోసైటీలుగా ఉండి ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారనే దానిపై విచారణ చేస్తున్నారు. అందులో కీలక పాత్ర ఎవరిది.. సహకరించినవారెవరు.. అధికారులు పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కడప కేంద్ర కార్యాలయంలోని రికార్డులను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. పవర్లూమ్ నుంచి రూ. కోట్లు స్వాహా పవర్లూమ్ నుంచి మీటరు రూ. 30 నుంచి రూ 35కే లభిస్తుంది. సిరిసిల్లా, సూరత్, ఈరోడ్, ప్రొద్దుటూరులోని పవర్లూమ్పై నేసిన క్లాత్‌ను ఆప్కో మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేతలు నేసినట్లు రికార్డులు తయారు చేయించారని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా చేయడం వల్ల మీటరుకు రూ.100 నుంచి రూ.110 మిగులు తుంది. ఇలా కోటి మీటర్లు ఆప్కోకు అమ్మితే రూ.110 కోట్లు మిగిలుతుంది. ఇలా వచ్చిన డబ్బు అంతా స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోందనే దానిపై ఆరాతీస్తున్నారు. ♦పవర్లూమ్ నుంచి తెచ్చిన క్లాత్‌ను నేరుగా ఆప్కో షోరూమ్ గోడౌన్‌కు తరలించడం ద్వారా ట్రాన్స్‌పోర్టు పేరుతో రూ. కోట్లు స్వాహా అయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ♦ఆర్థికంగా నష్టపోయిన సొసైటీలకు ఎన్సీడీసీ పేరుతో నిధులు ఇచ్చి ఆదుకుంటారు. ప్రభుత్వం నుంచి 30శాతం సబ్సిడీ వస్తుంది. రుణాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుంది.బోగస్ సోసైటీలు నిధులు తీసుకుని సబ్సిడీలు పొంది ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టిన విషయంపై విచారణ చేస్తున్నారు. ♦విద్యార్థులకు దుస్తులు కుట్టించే విషయంలోనూ అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.చేనేత కార్మికులు నేసిన క్లాత్‌ను దుస్తులు కుట్టడానికి ఇవాల్సి ఉంటుంది. కానీ అప్పటి ఆప్కో చైర్మన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ మగ్గంపై నేసిన క్లాత్‌ను తెప్పించి సరఫరా చేసినట్లు గుర్తించారు. విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకు ప్రభుత్వం జతకు రూ 50 అందిస్తోంది. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా రూ 30కు కుట్టించి మిగతా సొమ్ము స్వాహా చేశారు. సుమారు రూ. వందల కోట్లు స్వాహా జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ♦చేనేత సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్, కార్పస్ ఫండ్‌ను ఇస్తాయి. ఇలా వచ్చిన ఫండ్ ఆప్కో మాజీ చైర్మన్ ద్వారా బినామీ సొసైటీలకు అందినట్లు గుర్తించారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఆప్కో మాజీ చైర్మన్ గోడౌన్‌పై దాడులు ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు గోడౌన్‌పై సీఐడీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గోడోన్‌లో ఉన్న క్లాత్‌ను పరిశీలించారు. వాటిని సీజ్ చేశారు. -
గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ సోదాలు
సాక్షి, వైఎస్సార్ కడప: ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీబీసీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు ఆయన సొసైటీకి సంబంధించిన గోడౌన్లపై ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో జరిగిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండితో పాటు పలు కీలక డ్యాక్యుమెంట్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేసిన విషయం తెలిసిందే. -
ఆప్కో మాజీ చైర్మన్ ఇంటిలో రూ. కోట్లలో అవినీతి సొమ్ము
ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు అలియాస్ శ్రీను స్వగృహంలో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని ఆయన ఇంట్లో ఏకంగా.. 9 కేజీల 900 గ్రాముల బంగారం, 16 కేజీల 300 గ్రాముల వెండి, రూ. 91,67,000 నగదును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.10 లక్షల పాత వెయ్యి రూపాయిల నోట్లను, హైదరాబాద్‌లోని ఇంటిలో మరో రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆప్కోలో అక్రమాలపై పూర్తి సమాచారం అందుకున్న అధికారులు కోర్టు అనుమతితో శుక్రవారం శ్రీనివాసులు ఇంటిలోనూ, ఇదే సమయంలో ఢాంఖాన్ పల్లె సొసైటీ కార్యాలయం, సొసైటీలో పనిచేస్తూ ఆర్థిక లావాదేవీలు జరిపే మరో కీలక వ్యక్తి ఇంటిలో సోదాలు జరిపారు. ఖాజీపేటలోని ఆయన ఇంటిలో సుమారు 25 మంది తనిఖీ చేయగా.. ఏకకాలంలో ప్రొద్దుటూరులోని అకౌంటెంట్లు కొండయ్య, శ్రీరాములు, కడపలోని పలు ఇళ్లలో సీఐడీ సోదాలు కొనసాగాయి. ఆప్కోలో అవినీతి బాగోతం ► గత ఎనిమిదేళ్లుగా ఆప్కోలో జరిగిన అవినీతి సీఐడీ అధికారుల సోదాలతో బయటకు వస్తోంది. ► పలు బోగస్ సొసైటీల జాబితాను అధికారులు గుర్తించారు. సొసైటీలో నిజంగా సభ్యులు ఉన్నారా? లేదా? అనే విషయంపైనా దృష్టి సారించారు. ► వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలోని గ్రామాల్లో, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లో సీఐడీ అధికారులు విచారణ జరుపగా.. సభ్యులు పేపర్లలోనే ఉన్నారు కానీ వాస్తవంగా లేరని సీఐడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ► బోగస్ సొసైటీలుగా గుర్తించిన వాటి లావాదేవీలు ఎలా జరిగాయి? నిజంగా వీరు మగ్గం నేసి సొసైటీకి అమ్మారా? లేక పవర్లూమ్ నుంచి తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపారా అనే దానిపై ఆరాతీస్తున్నారు. ► బోగస్ సొసైటీలకు, ఆప్కో మాజీ అధ్యక్షునికి ఉన్న లింకులపై విచారణ జరుపుతున్నారు. ► శ్రీనివాసులు బంధువులను ప్రశ్నించిన అధికారులు.. నేతన్న నేస్తం పథకం ద్వారా మీకు లబ్ధి ఎలా చేకూరింది? తెల్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ► సొసైటీ కార్యాలయంలోని కంప్యూటర్లు, రికార్డులను తమ వెంట తీసుకెళ్లారు. తనిఖీలో బయటపడిన విషయాలను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. -
ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
-
ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో సీఐడీ సోదాలు
సాక్షి, కడప : ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం కడప జిల్లాలోని ఖాజీపేటలో ఆయన నివాసంలో, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. గతంలో ఆప్కోలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేశారు. ఈ క్రమంలో అధికారులు వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారు, డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. (చేటు తెచ్చిన సివిల్ పంచాయితీ) -
జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం
సాక్షి, తాడిపత్రి: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసుల వాహన శ్రేణి కవాతుతో పాటు, ఏరియా డామినేషన్ పెట్రోలింగ్‌ను నిర్వహించారు. ఈ వాహన శ్రేణి స్థానిక గాంధీ సర్కిల్ వద్దకు చేరుకున్న అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రాకూడదన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ పవన్‌కు ముందుగానే తాము హెచ్చరికలు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టిన కారణంగానే కడపలో నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్.కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తాడిపత్రి పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు నమోదు చేశామన్నారు. -
బెజవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు
సాక్షి, విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా పని చేస్తున్న బత్తిన శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ బాధ్యతల నుంచి ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్లైన్ మోసాలపై సైబర్ సెల్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. (గ్యాంగ్ వార్ కేసులో పురోగతి) నేరాలను నియంత్రించాం: ద్వారకా తిరుమలరావు విజయవాడలో 23 నెలలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకున్నామని వెల్లడించారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. (బెజవాడ గ్యాంగ్‌వార్ : పండు అరెస్ట్)