Stephen Fleming
-
భారత హెడ్‌కోచ్ సెలక్షన్.. అతడిని ఒప్పించే బాధ్యత ధోనీదే!
టీమిండియా హెడ్ కోచ్ పదవికి కోసం బీసీసీఐ దరఖాస్తులను అహ్హనించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా పలు దిగ్గజాలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలను ఎలాగైనా ఫ్లెమింగ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కానీ ఫ్లెమింగ్ మాత్రం టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతలు చెపట్టేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలతో కోచ్‌గా అతడు ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. అయితే జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, మహేల జయవర్ధనే వంటి ఇతర అభ్యర్థులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ను ఒప్పించడంపై బోర్డు ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ.. సీఎస్కే మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."భారత హెడ్‌కోచ్ పదవి కోసం స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను బీసీసీఐ సంప్రదించింది. అందుకు ఫ్లెమింగ్ నో చెప్పలేదు. కానీ అతడు ఫ్రాంచైజీలతో తన కాంట్రాక్ట్ పదవీకాలం గురించి ఆలోచిస్తున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కూడా తొలుత భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ అతడిని ఒప్పించారు. ఇప్పుడు ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బాధ్యతను ఎంఎస్ ధోనికి అప్పగించారు. ఎందుకంటే స్టీఫెన్‌తో ధోనికి మంచి సంబంధాలు ఉన్నాయని" ఓ బీసీసీఐ అధికారి ఒకరు హిందుస్థాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు. -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
టీమిండియా హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది.. ఈ క్రమంలో హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27గా బీసీసీఐ నిర్ణయించింది. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.అతడి నేతృత్వంలోనే సీఎస్కే ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదే చూడాలి. బీసీసీ రూల్స్ ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్లో భారత జట్టును ముందుకు నడిపించాలి.అదే విధంగా ఏడాదికి 10 నెలల పాటు జట్టుతో పాటు ఉండాలి. ఒకవేళ ఫ్లెమింగ్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడితే సీఎస్కే ఫ్రాంచైజీతో బంధం తెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా హెడ్ కోచ్ రేసులో ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా? -
IPL 2024: ధోని ఆటగాడిగా కొనసాగడంపై బిగ్ అప్డేట్
ఐపీఎల్లో సీఎస్కే మాజీ సారధి ఎంఎస్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ ష్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం పునరుద్ఘాటించాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం చాలా మందికి ముందే తెలిసినప్పటికీ.. తనకు మాత్రం ఆలస్యంగా తెలిసిందని కాశీ విశ్వనాథ్ వాపోయాడు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని, అది తమ జట్టుకు మంచే చేస్తుందని కాశీ విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని 2023 సీజన్లో కంటే ఈ సీజన్లోనే ఎక్కువ ఫిట్‌గా కనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. ధోని ఈ సీజన్‌తో పాటు మున్ముందు జరిగే సీజన్లలోనూ సీఎస్కేతోనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎస్కే నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ విషయాన్ని ధోని తనకు గత సీజన్‌కు ముందు చెప్పాడని తెలిపాడు. ధోని గత సీజన్లోనే తనతో పరోక్ష కెప్టెన్సీ చేయించాడని పేర్కొన్నాడు. గత సీజన్ చివర్లో తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. కెప్టెన్సీ చేపట్టే విషయంలో ధోని తనలో మానసిక స్థైర్యాన్ని నింపాడని తెలిపాడు. కాగా, లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ బాధ్యతలు చేపట్టాడు. మరికొద్ది గంటల్లో (మార్చి 22, రాత్రి 7:30 గంటలు) ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
IPL 2024 Auction: సీఎస్కేపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు. ఇవాళ జరిగిన వేలంలో సీఎస్కే మేనేజ్మెంట్ డారిల్ మిచెల్‌ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్‌ను 4 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు) -
#MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే
IPL 2023 Winner CSK: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావోకు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు చెన్నై ఫ్రాంఛైజీతో కొనసాగిన బ్రావో.. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 2011లో సీఎస్కేకు తొలిసారి ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2011, 2018, 2021 సీజన్లలో ధోని సేన టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. అదే విధంగా 2014 నాటి చాంపియన్స్ లీగ్ గెలిచిన ధోని సేనలో బ్రావో సభ్యుడు కూడా! అంతేగాక క్యాష్ రిచ్‌లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముందు వరుసలో నిలిచాడు. 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 183 వికెట్లు తీయడంతో పాటుగా.. 1560 పరుగులు సాధించాడు. సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా ఇలా సీఎస్కేతో అనుబంధం పెనవేసుకున్న డ్వేన్ బ్రావో గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని బౌలింగ్ కోచ్ నియమిస్తూ తమతోనే కొనసాగేలా చేసింది ఫ్రాంఛైజీ. ఇక సీఎస్కే ముఖచిత్రమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే ఇందుకు ప్రధాన కారణం అంటున్నాడు బ్రావో. ధోని నుంచి వచ్చిన ఆ ఒక్క కాల్ వల్లే ‘‘ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు! విజయవంతమైన ఐపీఎల్ కెరీర్‌కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించడం నా జీవితంలో విచారకరమైన సమయం. అయితే, ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ ఐపీఎల్లో కొనసాగాలని నా నుదుటి రాతలో రాసిపెట్టింది. మహేంద్ర సింగ్ ధోని.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఒ్క ఫోన్ కాల్ నన్ను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది. నా క్రికెట్ కెరీర్లో ముందుకు సాగేందుకు ఇదే సరైన దిశ అనిపించింది. కంగ్రాట్స్ ఆ దేవుడు.. క్రికెటర్‌గా నాకు ప్రసాదించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో కోచ్‌గా కొత్త అవతారం ఎత్తడం.. అది కూడా ఐపీఎల్ హిస్టరీలో విజయవంతమైన చరిత్ర ఉన్న జట్టుకు కోచ్‌గా ఉండటం అద్భుతం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన మనసులోని మాటను పంచుకన్న బ్రావో.. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్, మతీశ పతిరణ, రాజ్యవర్థన్ హంగార్కర్, రవీంద్ర జడేజా తదితరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2023 విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌కు విజయోత్సవాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47) -
అతడిని వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు: సీఎస్కే కోచ్
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మరో సారి తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు సునీల్ నరైన్ కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన వరుణ్.. 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుణ్ చక్రవర్తి నెట్ బౌలర్‌గా ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పెట్టేవాడని ఫ్లెమింగ్ అన్నాడు. సీసీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. "వరుణ్‌ను వదులుకున్నందుకు మేము ఇప్పటికీ బాధపడుతున్నాం. అతడు నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడొక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్. నెట్స్‌లో అతడి బౌలింగ్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దురదృష్టవశాత్తూ వేలంలో అతడిని మేము సొంతం చేసుకోలేకపోయాం. గతేడాది వేలంలో కూడా అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాం. కానీ మళ్లీ అతడిని కేకేఆర్ భారీ ధరకు సొంతం చేసుకుంది. చెపాక్ వంటి స్పిన్ పిచ్‌లపై చక్రవర్తి మరింత అద్భుతంగా రాణించగలడు. నేటి మ్యాచ్‌లో కూడా చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడు" అతడు పేర్కొన్నాడు. చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు -
Viral: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి!
IPL 2023 CSK Vs PBKS- MS Dhoni Loses Cool: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరణ. ఐపీఎల్-2023లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ తుది జట్టులో వీరు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ.. ముందుకు సాగుతున్నారు. మిస్టర్ కూల్‌కు కోపం ఎందుకొచ్చింది? ఈ సీజన్లో ఇప్పటి వరకు తీక్షణ, పతిరణ ఐదేసి వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ధోని కూడా వీరికి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో తీక్షణ చేసిన తప్పు మిస్టర్ కూల్ ధోనికి కూడా కోపం తెప్పించింది. నరాలు తెగే ఉత్కంఠ చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయం సాధించింది. పతిరణ వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతికి పంజాబ్ బ్యాటర్లు సికిందర్ రజా, షారుక్ ఖాన్ మూడు పరుగులు పూర్తి చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చెత్త ఫీల్డింగ్ కాగా తీక్షణపై ధోని ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో బంతిని ధోని.. తుషార్ దేశ్‌పాండేకు అందించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత షార్ట్ బాల్‌ను సంధించాడు ఫాస్ట్‌బౌలర్ తుషార్. దానిని పుల్‌షాట్ ఆడబోయిన లివింగ్‌స్టోన్ లెక్క తప్పడంతో బంతి బౌండరీ దిశగా పయనించింది. ఈ క్రమంలో థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తీక్షణ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బాల్ మిస్ చేశాడు.. ఏకంగా 4 పరుగులు క్యాచ్ అందుకోవడానికి విఫలయత్నం చేశాడు. అనవసరంగా ముందుకు డైవ్ చేసి బాల్‌ను మిస్ చేశాడు. బంతి బౌండరీని తాకడంతో పంజాబ్‌కు నాలుగు పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన ధోని.. మిస్ ఫీల్డింగ్ చేసిన మహీశ్ తీక్షణపై ఫైర్ అయ్యాడు. జట్టు నుంచి తీసిపారేయండి అసలేం ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా? అన్నట్లు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. డగౌట్లో ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం తీక్షణ చేసిన పనికి గుస్సా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘నీకసలు బుద్ధుందా? బౌలింగ్ అంతంత మాత్రమే. చెత్త ఫీల్డింగ్. జట్టులో నుంచి తీసిపారేయండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! ఆసియా కప్ రద్దు? పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!? pic.twitter.com/iAB4MTdg4p — CricDekho (@Hanji_CricDekho) April 30, 2023 𝙎𝙈𝙊𝙊𝙏𝙃 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧 😎@imjadeja & @msdhoni combine to get Prabhsimran Singh OUT! Follow the match ▶️ https://t.co/FS5brqfoVq#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/1qS9t5DJ8k — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ధోని అభిమానులకు మరో షాకింగ్ న్యూస్
-
ఆ చిన్న కిటుకు మర్చిపోయారు.. అదే పాక్ ఓటమికి దారి
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్‌గా అవతరించింది. బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్‌కు విజయాన్ని కట్టబెట్టింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు బోల్తా పడడం.. పాక్ ఓటమికి కారణ మని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ''16 ఓవర్లలో 119/4తో ఉన్న పాక్.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవంగా అయితే అక్కడినుంచి ఓవర్ కు 10 పరుగులు రాబట్టినా స్కోరు దాదాపుగా 160-165 పరుగులకు చేరుకొనేది. ఈ పిచ్‌పై ఇది నిజంగా సవాల్ విసిరే స్కోరు. కానీ, ఎంసీజీ గ్రౌండ్ బౌండరీలను పాక్ బ్యాటర్లు సరిగా అర్థం చేసుకోలేదు. ఈ కిటుకును పసిగట్టకపోవడం వల్లే డెత్ ఓవర్లలో వారు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు కూడా తెలివిగా బౌండ్రీ 85 మీటర్ల దూరం ఉన్న వైపే షాట్లు ఆడే విధంగా బంతులు విసిరి.. పాక్ బ్యాటర్లను ఉచ్చులోకి లాగారు. కొంచెం బుర్ర ఉపయోగించి సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకొచ్చినా పరిస్థితి మరో రకంగా ఉండేది.ఇదే పాక్ ఓటమికి ప్రధాన కారణం.'' అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: బాబర్‌కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ ముగిసిన ప్రపంచకప్.. కోహ్లి సరికొత్త రికార్డు -
జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎంపికయ్యాడు. కాగా జోహన్నెస్‌బర్గ్ ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్లో సీఎస్కే హెడ్‌కోచ్‌గా కూడా ఫ్లెమింగ్ కొనసాగుతున్నాడు. ఇక తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్‌ను జోహన్నెస్‌బర్గ్ నియమించిన విషయం తెలిసిందే. అదే విధంగా తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా ప్రోటీస్ మాజీ పేసర్ అల్బీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌గా ఎరిక్ సైమన్స్లతో జోహన్నెస్‌బర్గ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ సరికొత్త టోర్నీ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించేందు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. జొహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా.. సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. చదవండి: Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్!
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్, కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా పసుపు రంగు జెర్సీని ధరించనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రోటిస్ క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. జొహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా.. సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ను డర్బన్ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. చదవండి: Ind Vs WI 5th T20I: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. సూర్యకుమార్‌కు విశ్రాంతి! ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! -
'జడేజా ఫామ్ గురించి ఆందోళన లేదు.. అతడు త్వరలోనే చెలరేగుతాడు'
ఐపీఎల్-2022లో సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతులు ఎదుర్కొన్న జడేజా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ధోని సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, ఆ బాధ్యతలను జడేజా చేపట్టాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా జడేజా టోర్నీ మధ్యలోనే ధోనికి మళ్లీ జట్టు పగ్గాలు అప్పగించేశాడు. సారథ్య బాధ్యతల జడేజా నుంచి తప్పుకున్నప్పటికీ .. బౌలింగ్లోను, బ్యాటింగ్లోను విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో జడేజా ఫామ్‌పై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. జడేజా ఫామ్ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఫ్లెమింగ్ తెలిపాడు. జడేజా ఫామ్ గురించి పెద్దగా నాకు ఆందోళన లేదు. టీ20 ల్లో ఆడటం అంత సులభం కాదు. అతడు త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను. బ్యాటర్ 5 లేదా 6 స్ధానంలో బ్యాటింగ్ వస్తే.. అతడు సెటిల్ అవ్వడానికి ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి హిట్టింగ్ చేసే క్రమంలో వికెట్ కోల్పోయే అవకాశం ఉంది. కాగా రాబోయే మ్యాచ్‌ల్లో మా బ్యాటింగ్ ఆర్డర్‌పై దృష్టి సారిస్తాం "అని ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మొయిన్ అలీకి గాయం.. సీఎస్కే హెడ్ కోచ్ ఏమన్నాడంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ గాయం కారణంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజగా అతడి గాయంపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫన్ ఫ్లేమింగ్ స్పందించాడు. అతడు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరడానికి మరో వారం రోజులు పడుతుందని ఫ్లేమింగ్ తెలిపాడు. ఏప్రిల్ 23న జరిగిన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ట్రైనింగ్ సెషన్లో అలీ గాయపడ్డాడు. "మొయిన్ అలీ చీలమండకు గాయమైంది. అయితే అదృష్టవశాత్తూ.. ఎక్స్‌రేలో ఎలాంటి ఫ్రాక్చర్ లేదని తేలింది. అయితే అతడికి వారం రోజులు పాటు విశ్రాంతి అవసరం. ఎలాంటి ఫ్రాక్చర్ లేనందున త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము" అని ఫ్లెమింగ్ సోమవారం మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు పేసర్లు దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే ఐపీఎల్-2022 సీజన్‌కు దూరమయ్యారు. ఇక పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందింది. చదవండి: IPL 2022: "ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నా కల.. ఈ సారి అస్సలు వదులుకోను" -
ఒక్కోసారి మా మీద మాకే డౌట్ వస్తుంది.. కానీ..
IPL 2022 SRH Vs CSK: ‘‘బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... మూడు విభాగాల్లో మేము చాలా మెరుగుపడాల్సి ఉంది. కొంత మంది కీలక ఆటగాళ్లు జట్టుతో లేని లోటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాం’’ అని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం ఆత్మన్యూనతకు దారి తీస్తుందన్న ఫ్లెమింగ్... ఆత్మవిశ్వాసం పోగు చేసుకుని తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిని మూటగట్టుకుంది. కొత్త సారథి రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘మేము ఒక్క మ్యాచ్‌కూడా గెలవలేకపోయాం. కనీసం విజయానికి చేరువగా కూడా వెళ్లలేకపోతున్నాం. ఇలాంటి పరిణామాలు మనపై మనం నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. విమర్శల కారణంగా ఆటగాళ్లు కూడా ఢీలా పడే అవకాశం ఉంది. అయితే, మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోము. తిరిగి పుంజుకుని టోర్నీలో ముందుకు సాగుతాం’’ అని తెలిపాడు. అదే విధంగా దీపక్ చహర్ వంటి స్టార్ ప్లేయర్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న ఫ్లెమింగ్.. ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టడంలో విఫలమవుతున్నామని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇకపై మెరుగ్గా రాణిస్తేనే ప్రయాణం సాఫీగా సాగుతుందని, లేదంటే భంగపాటు తప్పదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది. సీఎస్కే వర్సెస్ సన్‌రైజర్స్ స్కోర్లు చెన్నై-154/7 (20) హైదరాబాద్- 155/2 (17.4) చదవండి: IPL 2022: అతడు భవిష్యత్ ఆశా కిరణం: డుప్లెసిస్ ప్రశంసలు .@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v — IndianPremierLeague (@IPL) April 9, 2022 -
పొలార్డ్ కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించాం..
ఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరోన్ పొలార్డ్ ఐపీఎల్లో చాలా కాలం తర్వాత ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనియాడాడు. బంతిని హిట్ చేసేటప్పుడు పొలార్డ్ కచ్చితమైన టైమింగ్‌తో ఉంటాడన్నాడు. పొలార్డ్ క్రీజ్‌లో పాతుకుపోతే ప్రమాదమనే విషయం తమకు తెలుసని, అతన్ని ఔట్ చేయడానికి అన్ని అస్త్రాలు ప్రయోగించామన్నాడు. కానీ చివరకు అతన్ని పెవిలియన్‌కు చేర్చడంలో విఫలం కావడంతోనే తమను పరాజయం వెక్కిరించిందన్నాడు. మ్యాచ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడిన ఫ్లెమింగ్.. ‘ అసలు పొలార్డ్ ఏ షాట్ ఎలా ఆడతాడో కచ్చితంగా అంచనా వేయలేం. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పొలార్డ్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ముంబైకు ప్రధాన ఆటగాడు. అతన్ని ఔట్ చేయడానికి చాలా ప్రయోగాలు చేశాం. కానీ నిలువరించలేకపోయాం. ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు తీసిన తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశాం. మేము చాలా మంచి టార్గెట్ ముంబై ముందు ఉంచాం. అయినా కొన్ని తప్పిదాలతో ఓటమి పాలయ్యాం. మేము చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని తర్వాత మ్యాచ్‌కు సిద్ధమవుతాం. మేము మరింత కసిగా తుదపరి మ్యాచ్‌కు వస్తాం. టోర్నమెంట్లో ఓడిపోతే ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందనే అంటారు. అది సర్వసాధారణం’ అని తెలిపాడు. కాగా, సీఎస్కే నిర్దేశించిన 219 పరుగుల భారీ టార్గెట్‌లో పొలార్డ్ 34 బంతుల్లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన పొలార్డ్.. మ్యాచ్‌ను గెలిపించేతవరకూ క్రీజ్‌లో ఉండి తన బ్యాటింగ్ పవర్ చూపెట్టాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు పిండుకుని ముంబైకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఇక్కడ చదవండి: డేవిడ్ వార్నర్‌కు నో ప్లేస్ మీకు బౌలర్లు ఉన్నారు.. కానీ డెత్ ఓవర్ బౌలర్ ఎక్కడ? వార్నర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ -
సీఎస్కే అసలుసిసలైన ఆల్‌రౌండర్ అతనే..
ముంబై: మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు రాబట్టడమేకాకుండా, తన కోటా ఓవర్లను విజయవంతంగా పూర్తి చేస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్న సీఎస్కే ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కీలకమైన వన్‌డౌన్‌లో రాణిస్తూ, బౌలర్ పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మొయిన్ అలీ ఈ సీజన్లో సీఎస్కే అసలుసిసలైన ఆల్‌రౌండర్‌గా అవతరించాడని ఆకాశానికెత్తాడు. ప్రస్తుత సీజన్లో చెన్నై ఆడిన మూడో మ్యాచ్‌ల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి వరుసగా 36, 46, 26 పరుగులు స్కోర్ చేసిన మొయిన్.. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు కీలకమైన వికెట్లు(మిల్లర్, రియాన్ పరాగ్, మోరిస్) పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాశించాడని కొనియాడాడు. మొయిన్ లాంటి అసలుసిసలైన ఆల్‌రౌండర్ లేని కారణంగానే గత సీజన్లో చెన్నై ఆఖరి స్థానానికి పడిపోయిందని పేర్కొన్నాడు. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మొయిన్ అలీని దక్కించుకోవడం సీఎస్కేకి కలిసొచ్చిందని, మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో అతని ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టుకు మేలుచేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సీజన్లో 3 మ్యాచ్‌ల్లో 108 విలువైన పరుగులతో పాటు 4 కీలకమైన వికెట్లు పడగొట్టిన మొయిన్..చెన్నై తరుపు ముక్కగా మారాడని ప్రశంసించాడు. అలాగే ఫామ్‌లోని లేని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఫ్లెమింగ్ వెనకేసుకొచ్చాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా రుతురాజ్ టెక్నిక్ పరంగా ఉత్తమ ప్లేయర్ అని కొనియాడాడు. రుతురాజ్‌కు మరిన్ని అవకాశలు కల్పిస్తామని, ఆతరువాతే ఉతప్పకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నాడు. జట్టులో ఎవ్వరూ భారీ స్కోర్లు సాధించకపోయినా.. ఆయా ఆటగాళ్లు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన సీఎస్కే.. బుధవారం(ఏప్రిల్ 21న) జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. చదవండి: డబ్యూటీసీ ఫైనల్ యధావిధిగా జరుగుతుంది: ఐసీసీ -
‘అది మాకు సానుకూలాంశం.. తక్కువ అంచనా వేయొద్దు’
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలుకావడం ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 188 పరుగుల భారీ స్కోరు చేసినా పరాజయం చెందింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచి దూకుడుగా ఆడటంతో ఆ టార్గెట్‌ను మూడు వికెట్లు కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. దీనిపై మ్యాచ్ తర్వాత సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. తాము తిరిగి గాడిలో పడటానికి ఎంత సమయం పట్టదని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. తమ జట్టు బౌలింగ్‌లో చేసిన తప్పిదాలతోనే ఓటమి పాలైందని, వాటిని సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌ల్లో సత్తాచాటుతామన్నాడు. గతంలో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పట్టిందని, ముంబైలో తాము ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు. తాము ముంబైలోని వాంఖడేలో పరిస్థితుల్ని సాధ్యమైనంత త్వరగా అర్థం చేసుకుంటామన్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గాడిలో పడతామన్నాడు. తమది చెన్నైకి చెందిన జట్టని, తమను తక్కువ అంచనా వేయవద్దని పరోక్షంగా ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రధానంగా ముంబైలోని పిచ్ పరిస్థితుల్ని బట్టి చూస్తే బౌలింగ్‌లో తాము ఇంకా మెరుగుపడాలన్నాడు. అది మాకు సానుకూలాంశం గత సీజన్‌కు దూరమై ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన సురేశ్ రైనాపై ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో సురేశ్ రైనా కొట్టిన షాట్లు అతని మునపటి ఫామ్‌ను గుర్తుకు తెచ్చాయన్నాడు. మొయిన్ అలీని దూకుడుగా ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రైనా కూడా అదే రోల్‌ను పోషించడం తమకు సానుకూలాంశమని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. రైనా రెండు-మూడు షాట్లు కొట్టిన తర్వాత ఫుల్ జోష్‌లోకి వచ్చాడన్నాడు. ఈ సీజన్లో సురేశ్ రైనా పాత్ర తమకు కచ్చితంగా లాభిస్తుందని ఫ్లెమింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో తమ ప్రణాళికలు అంతగా ఉపయోగపడలేదని, వచ్చే మ్యాచ్‌ల్లో దాన్ని కూడా అధిగమిస్తామన్నాడు. -
పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు
వన్డేల్లో రెగ్యులర్ బౌలర్లు.. ఆల్‌రౌండర్లు.. పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండడం సహజం. టీమిండియాలో సచిన్, సెహ్వాగ్ లాంటి వారు పార్ట్‌టైమ్ బౌలర్లుగా రాణించారు.. మ్యాచ్‌లు గెలిపించారు. కానీ ఏబీ డివిలియర్స్, మహేళ జయవర్దనే, స్టీఫెన్ ప్లెమింగ్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సయీద్ అన్వర్,మహ్మద్ యూసఫ్ ఇలా ఎవరిని చూసుకున్నా వీరంతా ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్లుగానే పేరు పొందారు. బ్యాట్స్మెన్లుగా ఒకప్పుడు సత్తా చాటినవారు కొందరు ఉంటే.. మరికొందరు ఇప్పుడు కూడా రాణిస్తూనే ఉన్నారు. అయితే కెరీర్ మొత్తం బ్యాటింగ్‌కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అరుదుగా బౌలింగ్ చేసేవారు. బ్యాట్స్మెన్లుగా తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించిన వీళ్లు అప్పుడప్పుడు బౌలర్ అవతారమెత్తి వికెట్లు కూడా తీశారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఐసీసీ పాతతరం.. కొత్తతరం క్రికెటర్లు తమ జట్లకు బౌలింగ్ చేసిన ఒక మొమరబుల్ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి : స్వదేశంలో కలిసొచ్చింది.. మరి విదేశంలో) ఈ వీడియోలో మనకు ఎప్పుడు బౌలింగ్ చేసినట్లు కనిపించని జయవర్దనే.. ఏబీ డివిలియర్స్.. ఎంఎస్ ధోని..స్టీఫెన్ ప్లెమింగ్ లాంటివారు బౌలింగ్ చేయడమే గాక వికెట్లు తీయడం చూపించారు. మీకు టైముంటే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్సవ్వద్దు అంటూ క్యాప్షన్ జతచేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన వీడియో కాస్త కొత్తగా ఉండడంతో వైరల్‌గా మారింది. (చదవండి : కూతురును చూసి మురిసిపోతున్న స్టార్ క్రికెటర్) 🤯 Virat Kohli, AB de Villiers, Mahela Jayawardene ... picking up international wickets! Here's a video you don't want to miss 😄 pic.twitter.com/IkROsA3tew — ICC (@ICC) December 16, 2020 -
అదొక గ్రేట్ చాలెంజ్: ఫ్లెమింగ్
దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైనా వచ్చే ఏడాది మరింత పటిష్టంగా తిరిగొస్తామని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. సీఎస్కేను తిరిగి పటిష్టం చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు. ఆదివారం సీఎస్కే చివరి లీగ్ ఆడిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఫ్లెమింగ్.. ‘ మా ముందు అతి పెద్ద చాలెంజ్ ఉంది. అత్యంత బాధ్యత సీఎస్కే ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తాం. రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువ క్రికెటర్లతో పాటు పాత క్రికెటర్లతో సీఎస్కేను సమ్మేళనం చేస్తాం. (వాట్సన్ ఉద్వేగం.. క్రికెట్‌కు గుడ్ బై!) ఎప్పుడూ సీఎస్కే జట్టు ఎంపికలో యజమాని శ్రీనివాసన్ కీలకంగా వ్యవహరిస్తారు. సీఎస్కే మేనేజ్మెంట్, శ్రీనివాసన్‌లు వారికి మంచిదైన జట్టునే ఎంపిక చేస్తారు. దాన్ని వచ్చే ఐపీఎల్లో కూడా అవలంభిస్తాం. మేము పదేళ్లుగా నిలకడైన క్రికెట్ ఆడుతున్నామంటే జట్టు ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అది పెద్ద బాధ్యత. మా జట్టులో టాలెంట్ ఉంది. కానీ జట్టును ఎలా మిక్స్ చేయాలనే అంశంపై కసరత్తులు చేయనున్నాం’ అని తెలిపాడు. ఈ సీజన్లో సీఎస్కే తన లీగ్ దశను ఆరు విజయాలతో ముగించింది. టోర్నీ నుంచి నిష్క్రమించినా వరుసగా ఆ జట్టు సాధించిన మూడు విజయాలు మునపటి సీఎస్కేను గుర్తు చేశాయి. వరుస విజయాలు సాధించడంతో ధోని మీద వచ్చిన విమర్శలు కూడా చెక్ పడింది. కింగ్స్ పంజాబ్‌తో తన చివర మ్యాచ్‌లో సీఎస్కే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.(ఐపీఎల్ 2020: నెట్ రన్‌రేట్ టై అయితే..) -
‘ఇదొక భయంకరమైన పవర్ ప్లే’
షార్జా: ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. సీఎస్కే 115 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించగా, ముంబై 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. సామ్ కరాన్(52) మినహా అంతా విఫలం కావడంతో చెన్నై ఘోరపరాభవాన్ని చవిచూసింది. పవర్ ప్లే ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోరుకు పరిమితమైంది. అదే సమయంలో ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో సీఎస్కే ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. (వరుణ్ పాంచ్ పటాకా.. కేకేఆర్ ‘సిక్సర్’) అయితే మ్యాచ్ తర్వాత సీఎస్కే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘ మా ప్రదర్శన మాకే ఆశ్చర్యం కల్గించింది. ఇదొక భయంకరమైన పవర్ ప్లే. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. అదే కూడా పవర్ ప్లే ముగిసే సరికి సగం వికెట్లను చేజార్చుకున్నాం. పవర్ ప్లేలో గేమ్ దాదాపు ముగిసింది. ఈ మ్యాచ్‌ను చూడటం కష్టతరమైంది. మేము కొంతమంది యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చాం. అది వర్కౌట్ కాలేదు’ అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ముంబై బౌలింగ్ యూనిట్‌పై ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. ‘ముంబై బౌలర్లంతా అసాధారణమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అనే దానికి దారులు కనుగొన్నాం. మ్యాచ్‌కు ముందు ఇది కీలకమైన మ్యాచ్ అని భావించాం. కానీ పూర్తిగా తేలిపోయాం. ఈ గేమ్‌లో మా బౌలింగ్ యూనిట్ బాగుంది. కానీ సరిపడా పరుగులు బోర్డుపై ఉంచకపోవడంతో దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మాకు కొంత ఆశ మాత్రమే ఉంది. మ్యాచ్‌లో ఓటమి ముందే ఖరారై పోయింది’ అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
'మా జట్టు ప్రదర్శన నన్ను నిరాశపరిచింది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ప్రదర్శన తనను చాలా నిరాశపరిచిందని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ప్లెమింగ్ సీఎస్కే బ్యాటింగ్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (చదవండి : శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) 'కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోవడం బాధగా అనిపించింది. వాట్సన్ మంచి ఆరంభాన్ని ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. మ్యాచ్‌లో మా ఇన్నింగ్ మొదలైన తర్వాత వాట్సన్, డుప్లెసిస్ ఇచ్చిన ఆరంభానికి తోడు.. రాయుడు మంచి టచ్‌లో కనిపించడంతో లక్ష్యాన్ని సులభంగా చేదిస్తుందనే అనుకున్నా. కానీ ఒక ఐదారు ఓవర్లు పాటు నిలకడగా ఆడి ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం. ధోని నాలుగో స్థానంలో రావడంపై తప్పుబట్టలేం. ఎందుకంటే వాట్సన్ క్రీజులో ఉండడంతో ధోని అతనికి సహకారమందించాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. వాట్సన్ అవుటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాట్స్మెన్లు షాట్ల ఎంపిక పొరపాటుతో పాటు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మా జట్టులో బ్యాట్స్మెన్లకు కొదువ లేదు.అందరు విమర్శించినట్టు మాకు అదనపు బ్యాట్స్‌మన్ అవసరం లేదు. 8 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బ్రావో వరకు పటిష్టంగానే ఉంది. కాకపోతే వచ్చే మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం ఉంది. సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో లాంటి ఆల్రౌంర్లు ఉండి కూడా కీలక దశలో చేతులెత్తేసాం.'అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : చేదనలో తడబడ్డ చెన్నై; కేకేఆర్ విజయం) కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13వ ఓవర్ వరకు కేవలం రెండు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన చెన్నై .. వాట్సన్ 50 పరుగులు పూర్తి చేసిన వెంటనే అవుటవ్వడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 10వ ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకు సీఎస్కే జట్టు కేవలం 20 పరుగులు మాత్రమే చేయడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాగా చెన్నె సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ శనివారం(అక్టోబర్ 10న) ఆర్సీబీతో తలపడనుంది. -
రైనా, రాయుడు లోటు స్పష్టంగా తెలుస్తుంది
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై జట్టు వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. చెన్నై ఓపెనర్లు విఫలమైన వేళ మిడిలార్డర్లో డుప్లెసిస్‌కు సరైన సహకారం అందకపోవడం.. అంబటి రాయుడు, సురేశ్ రైనాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయమై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. 'చెన్నై జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రైనా, రాయుడు లాంటి ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనఫ్లో వారి స్థానాలను భర్తీ చేసేందుకు వివిధ రకాల కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాం. కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శ్యామ్ కర్జన్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా మ్యాచ్‌లను కోల్పోతున్నాం. నిజంగా రైనా టోర్నీకి దూరమవ్వడం బాధాకరం.. అతను నిన్నటి మ్యాచ్‌లో ఆడి ఉంటే జట్టుకు గెలిచే అవకాశాలు ఉండేవేమో. టాప్ ఆర్డర్, మిడిలార్డర్లో చేదించాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడికి తట్టుకొని నిలకడగా ఆడుతూ బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు. (చదవండి : ధోని వ్యవహరిస్తున్న తీరు సరైనదే) 'ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మా జట్టు స్పిన్ విభాగం మరింత బలహీనంగా తయారైంది. వరుసగా రెండు మ్యాచ్‌లు(రాజస్తాన్, ఢిల్లీ) చూసుకుంటే పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా.. పరుగులు నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు.. చెన్నై జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లు మూడు గ్రౌండ్స్‌లో ఆడింది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఏ విధమైన బౌలింగ్ శైలి నడుస్తుందన్నది చెప్పడం కష్టమైంది. ఐపీఎల్ మొదలైన వారం రోజుల్లో మూడు వేదికలపైన అవగాహన వచ్చింది. ఇక ముందు పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. పేస్ బౌలింగ్‌లో కూడా ఒక అంచనాకు వచ్చాం. రానున్న మ్యాచ్‌ల్లో వీటిపై దృష్టి సారిస్తూ.. తప్పులను సరిచేసుకుంటాం. 'అంటూ తెలిపాడు. (చదవండి : ఢిల్లీ కమాల్...) ఇక రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అప్పటికే దాదాపు ఓటమి ఖరారైపోయింది. 24 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని దాటిగా ఏం ఆడలేకపోయాడు. 12 బంతుల్లో 15 పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్లో చెన్నై టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టం కావాల్సి ఉంది. రాయుడు తిరిగి జట్టులోకి వస్తేనే టాప్ ఆర్డర్ బలంగా మారే అవకాశం ఉంది. ఇక వరుసగా రెండు ఓటమిలు చవిచూసిన చెన్నై తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 2న సన్‌రైజర్స్‌తో ఆడాల్సి ఉంది. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 6రోజులు విరామం దొరకడంతో చెన్నైకి రీచార్జ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ రావడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ధోని ఏడో స్థానంలో రావడమేంటంటూ పలువురు మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. అయితే రెండు వారాలు క్వారంటైన్లో గడపడంతో ప్రాక్టీస్‌కు అంతగా సమయం సరిపోలేదని ధోని పేర్కొన్నాడు. ఈ విషయంలో చెన్నె సూపర్‌కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లేమింగ్ మాత్రం ధోనికి మద్దతుగా నిలిచాడు. 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. అయినా ధోని ఇంతకముందు సీజన్లలో కూడా ఐదు లేదా ఆరు స్థానల్లోనే కదా చూశాం. లీగ్ ప్రారంభంలోనే ధోనిలో ఉన్న ఫినిషర్ బయటకు రావాలనే ఆలోచన వ్యర్థం.. అభిమానుల అంచనాలు అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. ధోనిలో మంచి ఆటగాడు ఉన్నాడనేది మాత్రం కచ్చితంగా చెప్పగలను. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ధోని ఏడో స్థానంలో వచ్చినా కొంత సమయం తీసుకున్నాకా.. బ్యాట్ ఝులిపించాడు. 16 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ధోని ఎంత మంచి ఫినిషరో.. కాకపోతే రాజస్తాన్ భారీ స్కోరు చేయడంతో రన్‌రేట్ పెరిగిపోయింది.. అప్పటికే చేయాల్సిన పరుగుల రన్‌రేట్ కూడా పెరిగిపోయింది. దానికి ధోని కూడా ఏం చేయలేడు. (చదవండి : ‘ధోని కాకుండా వేరేవాళ్లైతే పరిస్థితేంటి’) ఒకవేళ ఐదో స్థానంలో వచ్చి ఫెయిలై ఉంటే అప్పుడు కూడా ఇలానే విమర్శించేవారు. ఇక స్యామ్ కర్జన్ బాగానే ఆడినా.. అదే స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ 19వ ఓవర్ వరకు 186 పరుగులతో ఉంది. కానీ ఎన్గిడి వేసిన చివరి ఓవర్లో 30 పరుగులు రావడం చెన్నైకు నష్టంగా మారింది. అని తెలిపాడు.మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో సంజూ సామ్సన్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సామ్సన్ మైదానం నలువైపులా సిక్సర్లతో రెచ్చిపోయాడు. నిజంగా అతనికి మంచి భవిష్యత్తు ఉందంటూ పేర్కొన్నాడు. కాగా చెన్నై తన తర్వాతి మ్యాచ్ సెప్టెంబర్ 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. (చదవండి : ముంబై వర్సెస్ కోల్‌కతా.. పైచేయి ఎవరిదో!)