strong
-
‘రాసిపెట్టుకోండి.. నేనంతా మంచోడ్ని కాదు’ (ఫొటోలు)
-
మిస్&మిస్సెస్ ఫ్యాషన్ ఈవెంట్ కర్టన్ రైసర్ (ఫొటోలు)
-
అయ్యయ్యో! బార్బీకి ఏమైంది?!
కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్ గర్ల్. ఈసారి ఇంకో స్ట్రాంగ్ గర్ల్ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్ డాల్’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి అవుతుందా? ఎందుక్కాదూ? చూపు లేక΄ోవటం, చూడలేక΄ోవటం వేర్వేరు కదా. చూపు ఉండీ పక్క మనిషి నిస్సహాయతను పట్టించుకోని వాళ్లకు ఏం శక్తి ఉన్నట్లు? చూపు లేకున్నా సాటి మనిషి హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు ఏం శక్తి లేనట్లు? బార్బీ.. అమ్మాయిల మనసెరిగిన బొమ్మ. డాక్టర్ బార్బీకి.. మెడిసిన్ చదవాలని కలలు కనే అమ్మాయిల మనసు తెలుసు. ఆస్ట్రోనాట్ బార్బీకి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలని ఉవ్విళ్లూరే అమ్మాయిల ఆశలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసు. నల్లజాతి బార్బీకి.. రంగు కారణంగా నల్ల జాతి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర వివక్ష ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా.. మిస్ యూనివర్శ్ బార్బీ, ప్రెసిడెంట్ బార్బీ, పైలట్ బార్బీ, వీల్ చెయిర్ బార్బీ, ప్రోస్థెటిక్ లెగ్ బార్బీలన్నీ వివిధ వృత్తులు, ప్రవృత్తులు, స్థితి గతులకు ప్రతీకగా ఉండి, ఆడపిల్లలకు స్ఫూర్తిని, సహానుభూతిని అందిస్తున్నవే. 1959తో తొలి బార్బీ మార్కెట్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 1000 రకాలకు పైగానే బార్బీ డాల్స్ అమ్మాయిలకు ఆత్మ బంధువులయ్యాయి. ఆ క్రమంలో తాజాగా ఆవిర్భవించిన కారణజన్మురాలే.. ‘‘బ్లైండ్ డాల్’’. కారణ జన్మురాలా! అవును. కారణ జన్మురాలే. బాలికల్ని మానసికంగా శక్తివంతుల్ని చేయాలన్నదే ఆ కారణం. మాటెల్ కంపెనీ తన ‘స్ఫూర్తిదాయకమైన మహిళలు’ సిరీస్‌లో భాగంగా 2021లో ‘హెలెన్ కెల్లర్’ రూపంలో బార్బీని తయారు చేసినప్పటికీ, ఫ్యాషనబుల్‌గా తెచ్చిన తొలి బ్లైండ్ బార్బీ మాత్రం ఇదే. అంధులైన వారిని కూడా కలుపుకుని ΄ోయేలా ఈ ‘బ్లైండ్ బార్బీ’ రూపోందింది. ఇందుకోసం బార్బీ బొమ్మల కంపెనీ ‘మాటెల్’.. ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్’తో చేతులు కలిపింది. ఈ కొత్త బార్బీ డాల్ పింక్ శాటిన్ టీ షర్టు, పర్పుల్ ట్యూల్ స్కర్టు ధరించి ఉంటుంది. చేతిలో తెలుపు, ఎరుపు రంగుల స్టిక్ ఉంటుంది. పిల్లల్లో స్వీయ వ్యక్తీకరణను, ఆత్మదృఢత్వాన్ని పెంపొందించేందుకు బ్లైండ్ బార్బీని తెచ్చామని మాటెల్ కంపెనీ చెబుతోంది. అంతే కాదు, ఈ కొత్త బార్బీ ΄్యాకింగ్ కూడా విలక్షణంగా ఉంది. బాక్సు మీద బార్బీ అనే అక్షరాలను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. బ్రిటన్ యువతి లూసీ ఎడ్వర్డ్స్ ఈ బొమ్మకు ప్రచారకర్త. ఆమె తన 11 ఏళ్ల వయసులో కుడి కంటి చూపు కోల్పోయారు. 17 ఏళ్ల వయసులో రెండో కంటి చూపు కూడా క్షీణించింది. ‘‘ఈ బొమ్మ నా సర్వస్వం. ఇది నా దగ్గర ఉంటే నేను ఒంటరినన్న భావనే నాలో కలగదు..’’ అంటున్నారు లూసీ తన చేతిలోని బ్లైండ్ బార్బీని హృదయానికి హత్తుకుంటూ. ఇంకోమాట.. ‘‘అయ్యయ్యో’’ అనిపించుకోవటంస్ట్రాంగ్ గర్ల్‌కి అస్సలు ఇష్టం ఉండదట. లూసీ అంటారు. -
అమెరికాలో మన గిరాకీ!
భారత్ - అమెరికా బంధాలు రోజు రోజుకు గట్టిపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పీవీ నరసింహారావు వేసిన పునాదులపైన ఆ బంధాలు మరింత దృఢపడుతున్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అగ్రరాజ్యంలో ఎవరు అధికారంలో వున్నా, భారతీయులు కీలక భూమిక పోషిస్తున్నారు. పాలనలో,రాజకీయాలలోనూ,ఐటీ పరిశ్రమలోనూ, ఆ దేశ ఆర్ధిక వృద్ధిలోనూ మన పాత్ర ప్రశంసాపాత్రంగా ఉంటోంది. తాజాగా భారత్ పై అమెరికా రాయబారి కురిపించిన ప్రశంసలు, చేసిన వ్యాఖ్యలు ఈ తీరుకు అద్దం పడుతున్నాయి. ఎవరైనా అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరుతారు! అమెరికా రాయబారి ఎరిక్ గార్శెట్టి మాత్రం భవిష్యత్తును దర్శనం చేసుకోవాలంటే భారత్‌కు రండి..అంటూ పిలుపునిచ్చారు.ఎరిక్ ప్రస్తుతం అమెరికా రాయబారిగా మన దేశంలో వున్నారు. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపన్యాసం అందించారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ప్రపంచ దేశాలు అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టాయి. "మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చాం " అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య అవగాహన కూడా బాగా పెరుగుతూ వస్తోందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో భారతీయుడుపై అభియోగాలు వచ్చాయి. ఈ అంశం రెండు దేశాల బంధంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో? అనే చర్చ పెద్దఎత్తున జరుగుతూనే వుంది.అయితే! ఈ కేసు దర్యాప్తు విషయంలో భారత్ అందిస్తున్న సహకారాన్ని అమెరికా మెచ్చుకుంటోంది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ కూడా అమెరికా -భారత్ బంధం పట్ల గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేయడం కూడా గమనార్హం. రిచర్డ్ నిక్సన్ - ఇందిరాగాంధీ సమయంలో ఇరు దేశాల మధ్య బంధాలు ఏ మాత్రం బాగా ఉండేవి కాదు. పీవీ నరసింహారావు అద్భుతమైన బంధాన్ని ఏర్పరచారు. మన్మోహన్ సింగ్ అదే దారిలో నడిచారు. బుష్- సింగ్ కాలంలో ఈ స్నేహం ఎంతో వికసించింది. నరేంద్రమోదీ - డోనాల్డ్ ట్రంప్ సమయంలో మరింత ఆత్మీయంగా మారింది. జో బైడెన్ మొదటి నుంచి భారత్ పై ప్రత్యేకమైన అభిమానం,గౌరవం చూపిస్తూ వస్తున్నారు. ఆయన అధ్యక్షుడుగా అధికార పీఠం అధిరోహించినప్పటి నుంచి మరింత ప్రభావశీలంగా సాగుతోంది. బరాక్ ఒబామా పరిపాలనా కాలంలోనూ బాగా నడిచింది. డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడుగా అధికారం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. జో బైడెన్ -ట్రంప్ మధ్య పెద్ద పోటీ నడుస్తోంది. భవిష్యత్తు ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇరుదేశాల ప్రయాణానికి ఎటువంటి ఢోకా ఉండదని అంచనా వెయ్యవచ్చు. వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, భద్రతా సహకారం మొదలైన విషయాల్లో భారత్ వైపు అమెరికా గట్టిగా నిలబడుతోంది. ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య వేదికలలో భారతదేశ స్థాయిని, ప్రాతినిధ్యాన్ని పెంచడంలో అమెరికా కీలక భూమిక పోషిస్తోంది. ఎగుమతులు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి తయారీ అంశాల్లోనూ అగ్రరాజ్యం మనకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ప్రపంచంలో తమకు ఎంతో ఇష్టమైన దేశాలలో భారత్ తొలివరుసలో ఉంటుందని అమెరికా ప్రజలు అంటున్నారు. వస్తువులు, సేవలు రెండింటిలోనూ ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూ రావడం శుభ పరిణామం.బ్రిటిష్ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యానంతర భారతంలోనూ చాలా ఏళ్ళు రెండు దేశాల మధ్య బంధాలు అంత ఆరోగ్యం లేవన్నది పచ్చినిజం. ముఖ్యంగా ఈ రెండు దశాబ్దాలలో ఆరోగ్యకరమైన బంధాలు సాగుతున్నాయి. మన దేశానికి ప్రత్యక్ష పెట్టుబడులు అందించే దేశాలలో అగ్రరాజ్యానిది విశిష్టమైన స్థానం.వాణిజ్య భాగస్వామిగా అమెరికాది రెండో స్థానం.అమెరికాలో మన భారతీయుల జనాభా సుమారు 1.35 శాతం వున్నట్లు సమాచారం.ఆ దేశంలో బాగా సంపాయిస్తున్న జాతుల్లో భారత జాతీయులకు సమున్నత స్థానం వున్నది.మన తెలుగువారి స్థానం గణనీయం.అక్కడ మన దేశ భాషలు మాట్లాడేవారిలో అందరికంటే అగ్రస్థానం తెలుగు వారిదే. ఆ తర్వాత తమిళ, బెంగాలీలు వస్తారు. ఆ తర్వాతి స్థానంలో హిందీ వుంది.1910 ప్రాంతంలో అమెరికాలోని భారతీయుల జనాభా కేవలం 2,545.2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50లక్షలమంది వున్నారు.ఈ నాలుగేళ్లలో ఇంకా పెరిగారు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధిలోకి వచ్చాక అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.2000ప్రాంతంలో మనవారు సుమారు 90వేల మంది ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 12లక్షల 40వేలకు పెరిగింది. వీరిలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా ఉంటారు. వివిధ రంగాల్లో అక్కడ రాణిస్తున్న మనవాళ్ళ పేర్లు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది. అయితే! మనవాళ్ళపై జాతి విద్వేషాలు, వైషమ్యాలు జరుగుతూనే వున్నాయి. అవి ఆగాలి. వీసా ఇబ్బందులు తీరడం లేదు.అవి తీరాలి. ఉద్యోగాల కల్పనలోనూ,జీత భత్యాల విషయంలోనూ అసమానతలు పెరుగుతూనే వున్నాయి. వీటికి చరమగీతం పాడాలి.ప్రపంచంలోనే భారత్ ది అతి పెద్ద మార్కెట్. జనాభాలో త్వరలోనే చైనాను సైతం మనం అధిగమిస్తాం. ఎల్లకాలం అగ్రరాజ్యంగా ఉండాలన్నది అమెరికా ఆశ. చైనాను దెబ్బకొట్టాలన్నది మరో వ్యూహం. ఇస్లాం తీవ్ర వాద భయాలు కూడా ఆ దేశానికి బాగా వున్నాయి. ప్రపంచ దేశాల ప్రయాణంలో భారత్ తో స్నేహం, సహకారం అమెరికాకు ఎంతో అవసరం.ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వార్థంతో, మన దేశంతో అమెరికా గట్టి బంధాలను కోరుకుంటోంది. మనకు కూడా ఆ దేశంతో ఎంతో అవసరం ఉంది. అనేక అంశాలలో రెండు దేశాలు కలిసి సాగాల్సిన చారిత్రక అవసరాలు వున్నాయి.మానవవనరుల అభివృద్ధిలో మన ప్రయాణం ఆ దేశానికి ఎంతో నచ్చింది. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణులు మరింత పెరగాలి. మనం భవిష్యత్తులో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తే? అప్పుడు అమెరికా మనతో ఎలా ఉండబోతుందో కాలచక్రంలోనే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే, అమెరికా దృష్టిలో మన గిరాకీ పెరిగింది. -మాశర్మ -
పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలదే హవా..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉంటున్నప్పటికీ పసిడి రుణాలిచ్చే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యాపార కార్యకలాపాలు పటిష్టంగా సాగుతున్నాయి. కరోనా సమయంతో పోలిస్తే కాస్తంత తగ్గినా మార్కెట్లో అవి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2021 మార్చి నుంచి 2023 సెపె్టంబర్ మధ్య కాలంలో మార్కెట్ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగా, వాటి మార్కెట్ వాటా 61 శాతంగా నమోదైంది. కరోనా విస్తృతంగా ఉన్న 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా ఉండగా, పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీల వాటా 64 శాతంగా ఉండేది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రూ. 2.3 లక్షల కోట్లకు చేరగా, వాటి వాటా 62 శాతానికి పరిమితమైంది. మార్కెట్లో మూడింట రెండొంతుల వాటా ప్రైవేట్ సంస్థలదే ఉన్నప్పటికీ.. అత్యధికంగా పసిడి రుణాలిచి్చన సంస్థగా (రూ. 1.3 లక్షల కోట్లు) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు ఉంది. వాటా పెంచుకుంటున్న బ్యాంకులు.. బ్యాంకులు కూడా క్రమంగా పసిడి రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్లో 39 శాతం వాటాను (1 శాతం వృద్ధి) దక్కించుకున్నాయి. అలాగే, గత మూడేళ్లుగా వ్యవసాయేతర బంగారు రుణాలపై.. ముఖ్యంగా రూ. 3 లక్షల పైబడిన లోన్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం, ఆన్లైన్లో రుణాలివ్వడం, ఇంటి వద్దకే సర్వీసులు అందించడం వంటి వ్యూహాలతో పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలు ముందుకెడుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ బి. మాళవిక తెలిపారు. బంగారం ధరల పెరుగుదల కూడా ఎన్‌బీఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్స్ ఏయూఎం వృద్ధికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటున్నాయని క్రిసిల్ పేర్కొంది. కస్టమర్లు చేజారిపోకుండా ఎన్బీఎఫ్సీలు తగు ప్రయత్నాలు చేస్తుండటం, చిన్న..మధ్య స్థాయి రుణాలపై దృష్టి పెట్టడం, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించింది. -
పవన్ ఏం చెబుతాడోనని అందరూ ఎదురుచూశారు
-
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
ఆ సమస్యలను సాధారణీకరించే నిర్వహణకు చైనా పిలుపు!
చైనా అంతర్జాతీయ సరిహద్దులో విభేదాలను సాధారణీకరించే నిర్వహణకు పిలుపుచ్చింది. గాల్వన్ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల రక్షణమంత్రుల మొదటి సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన బలమైన సందేశం తదనంతరం చైనా జనరల్ లీ షాంగ్ఫూ ఇలా వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో.. ఇరుపక్షాలు దీర్ఘకాలికి దృక్పథాన్ని తీసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను తగిన స్థానంలో ఉంచాలి. సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించే నిర్వహణకు ప్రోత్సహించాలి అని పేర్కొంది. ఐతే ఇది భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. సరిహద్దు పరిస్థితి రెండు దేశాల మధ్య బంధాల విస్తరణతో ముడిపడి ఉందని భారత్ స్పష్టం చేసింది. కానీ చైనా భారత్‌తో విభేదాల కంటే సాధారణ ప్రయోజనాలనే పంచకుంటుందని తెలిపింది. ఇరు పక్షాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర అభివృద్ధిని, సమగ్ర దీర్ఘకాలికి వ్యూహాత్మక కోణం నుంచి చూడాలని చైనా నొక్కి చెబుతోంది. తద్వారా ప్రపంచానికి వివేకం, బలాన్ని సంయుక్తంగా అందించాలని చైనా పేర్కొంది. ఇదిలా ఉండగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా ఇరు పక్షుల మంత్రుల సమావేశం తర్వాత భారత్ తన ప్రకటనలో భారత్ చైనా మధ్య సంబంధాల అభివృద్ధి శాంతి ప్రాబల్యంపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పషం చేశారు. సరహద్దు సమస్యలు ద్వైపాక్షిక ఒప్పందాలకు, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికన క్షీణింపచేస్తుందని హెచ్చరించారు. సరిహద్దులను విడదీయడంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. చైనా మాత్రం సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని ఇరు పక్షాల సైనికు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాయని చెబుతోంది. అందువల్ల పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని అందుకు సహకరించండి అని చైన పేర్కొనడం గమనార్హం. (చదవండి: నా కూతురు కారణంగానే అతను ప్రధాని అయ్యారు! సుధామూర్తి) -
ఇన్‌స్టాలో సమంత గురించి ప్రశ్న.. కీర్తి సురేష్ మనసులోని మాట ఇదే!
తాజాగా నటి కీర్తీసురేష్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. కారణం ఈ బ్యూటీ నానితో జత కట్టిన దసరా చిత్రం సక్సెస్ కావడమే. అలాగే ఇటీవల కీర్తీసురేష్ గ్లామర్ డోసు పెంచడం కూడా. తమిళంలో ఇంతకు ముందు నటించిన సాని కాగితం చిత్రంలో డీ గ్లామర్ పాత్రలో కీర్తీసురేష్ నటనకు సినీ వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఆ తరువాత తెలుగులో మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్ మెరుపులు మెరిపించి అలరించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్న కీర్తీసురేష్, తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్, జయం రవి సరసన సైరన్ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో మామనిదన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే ఈ అమ్మడు తన ఇన్‌స్ట్రాగామ్‌లోనూ అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు బదులిస్తుంటారు. అలా.. ఇటీవల ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని నటి సమంత గురించి అడిగిన ప్రశ్నకు కీర్తీసురేష్ బదులిస్తూ సమంత తాను అబ్బురపడే నటి అని పేర్కొన్నారు. ఆమె చాలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం కలిగిన మహిళ అని కొనియాడారు. ఇంకా చెప్పాలంటే సమంతను ఎవరూ అడ్డుకోలేరని, ఎవరూ ఆపలేరని అభిప్రాయపడ్డారు. -
తెలుగు మీడియం పేద పిల్లలే చదవాలా..?
-
బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
-
భారత్ అగ్రరాజ్యానికి మిత్ర పక్షం కాదు..వైట్‌హౌస్ అధికారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్ అగ్రరాజ్యానికి మిత్రపక్షంగా ఉండబోదంటూ వైట్‌హౌస్ ఉన్నతాధికారి కర్ట్ క్యాంప్‌బెల్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా..భారత్ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్, అమెరికాకు మిత్రపక్షంగా ఉండదని, ఒక గొప్ప శక్తిగా ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతంగా వేగంగా ఏర్పడ్డాయని అన్నారు. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని కూడా చెప్పారు. అలాగే అమెరికా తన సామర్ధ్యానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, సాంకేతికంగా ఇతర సమస్యలపై కలిసి పనిచేయడం ద్వారా ప్రజలతో సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదీగాక ఇరు దేశాల్లోని కేంద్రీకృత ప్రభుత్వ విధానాల్లో పలు సవాళ్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఇరు దేశాలు కలిసి పనిచేసే అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అంతరిక్షం, విద్య, వాతావరణం, సాంకేతికత తదితర వాటిల్లో ఇరు దేశాలు సమన్వయంగా ముందుకు సాగాలని చెప్పారు. అలాగే భారత్ అమెరికా సంబంధాలు కేవలం చైనా చుట్టూ ఉన్న ఆందోళనలతో ఏర్పడలేదని నొక్కి చెప్పారు. వనరులు అధికంగా ఉన్న బీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు ఏర్పరచి సైనిక స్థావరాలను నిర్మించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా క్యాంప్‌బెల్ ప్రస్తావించారు. ఈ విషయంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం తదితర దేశాలు చైనాను తప్పుపట్టాయన్నారు. చైనాకు జపాన్‌తో కూడా ప్రాదేశిక వివాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం గురించి మోదీతో చర్చించినప్పుడూ చైనా తన ప్రయోజనాల కోసం నిర్మించుకున్నారంటూ... కొట్టిపారేశారని చెప్పారు. కాగా, బైడెన్ తన పరిపాలను క్వాడ్ లీడర్ స్థాయికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి (ఆంథోనీ) అల్బనీస్ 2023లో ఒక ప్రధాన క్వాడ్ సమావేశానికి అమెరికాను ఆహ్వానించిన సంగతిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్వాడ్ సమావేశం నాలుగు కీలక దేశాల మధ్య సమన్వయ సహకారాన్ని చాలా స్ట్రాంగ్‌గా బలోపేతం చేస్తోందని క్యాంప్‌బెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన జీన్ పియర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...భారత్, యునైటెడ్ స్టేల్స్‌ల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. జీ20లో భారత్ నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడమే గాక భారత్‌తో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా, లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారతదేశంలోని యుఎస్ రాయబారిగా నియమించాలని బైడెన్ పరిపాలన చూస్తున్నట్లు కూడా జీన్ పియర్ తెలిపారు. (చదవండి: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్) -
పరిశ్రమకు భరోసా: ఎంఎస్ఎంఈ ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన మూల స్తంభాలని ఆ శాఖ సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సోమవారం పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడ్డానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగంపై ఫిక్కీ నిర్వహించన వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ⇒ భారతదేశాన్ని స్వావలంబన సాధనకు, అలాగే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పరిశ్రమ, సంబంధిత వర్గాలు కలిసి పని చేయాలి. ⇒ దేశంలో 6.3 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. వాటి ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ⇒ ఎంఎస్ఎంఈలు మన భారత్ జీడీపీ విలువలో దాదాపు 30 శాతం వాటాను అందిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ⇒ దేశంలో ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) ఈ దిశలో ఒక ముందడుగు. ఈ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో తయారీ, సేవల రంగంలో మొత్తం 1.03 లక్షల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. ⇒ ఎంఎస్ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం సహకారం రెట్టింపయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి ఎదరవుతున్న సవాళ్లను తగ్గించడానికి తగిన ప్రయత్నం జరుగుతుంది. ⇒ యువత పారిశ్రామికవేత్తలుగా మారే సంస్కృతిని పెంపొందించడానికి, ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించడానికి, వారి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి, వారి పోటీతత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ⇒ ఇప్పటికే ఉన్న అలాగే కొత్త ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి వాటిని బలోపేతం చేయడానికి మా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ⇒ దీనితోపాటు ‘జెడ్ఈడీ’ సర్టిఫికేషన్ పథకం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్– క్వాలిటీ సర్టిఫికేషన్ అందించడానికి ఉద్దేశించిన), నాణ్యత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘ఏఎస్పీఐఆర్ఈ’ డిజైన్ క్లినిక్ మొదలైన వాటి కింద ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఇతర సంస్థలతో కలిసి పని చేస్తోంది. ⇒ ప్రభుత్వం చాంపియన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది, ఇది ఒకే చోట అన్ని పరిష్కారాలను అందిస్తుంది. ఎంఎస్ఎంఈలను మరింత పోటీగా మార్చడానికిసైతం పోర్టల్‌ను దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలు మరింత స్థిరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ రంగం పురోగతి అవశ్యం:స్వైన్ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీబీ స్వైన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగం స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక పరమైన చేయూత అవసరమని అన్నారు. ‘రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు’ (ఆర్‌ఏఎంపీ) కింద ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమన్వయంగా సహకారాన్ని అందించడానికి, ఇందుకు తగిన ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోందని వివరించారు. ఈ రంగం పురోగతి దిశలో 2020లో ప్రారంభించబడిన సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా ఫండ్ ఇప్పటి వరకు 125 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,335 కోట్ల విలువైన వృద్ధి సంబంధ మూలధనాన్ని అందించిందని తెలియజేశారు. ఈ రంగం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్ధరించడం, ఉద్యామ్, ఇ-శ్రామ్, నేషనల్ కెరీర్ సర్వీస్, ఏఎస్ఈఈఎం పోర్టల్‌ల పూర్తి స్థాయి ఏకీకరణ వంటి కార్యక్రమాల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు. సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమాచార వ్యవస్థ, జాతీయ ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించడం, జెడ్ఈడీ ధృవీకరణ ద్వారా సమస్యలను పరిష్కరించడం, ఎంఎస్ఎంఈ చెల్లింపు సమస్యలను తొలగించడం వంటి చర్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఎంస్ఎంఈలకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, వర్గీకరణలో అప్‌గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వం పన్నుయేతర ప్రయోజనాలను 3 సంవత్సరాల పాటు పొడిగించిందని స్వైన్ పేర్కొన్నారు. ఎకానమీలో కీలక పాత్ర ఎంఎస్ఎంఈ రంగం సామర్థ్యం చాలా విస్తృతమైనది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం మరింత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. ఎకానమీ విలువలో ఈ రంగం వాటా 40-45 శాతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం- ఆర్ నారాయణ్, ఎఫ్ఐసీసీఐ(సీఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్) -
నిరంకుశ శక్తులతోనే ప్రపంచానికి రిస్కు:హెచ్డీఎఫ్సీ చైర్మన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్ల కన్నా నిరంకుశ శక్తులు, సహకార కొరవడటం, వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుకోవడం వంటివే ప్రపంచానికి అతి పెద్ద రిస్కులుగా మారాయని ప్రముఖ బ్యాంకరు, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సంక్షోభాలను ఉటంకిస్తూ .. ప్రపంచం ప్రస్తుతం ఏకకాలంలో అనేక పెను విపత్తులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ‘దేశాల మధ్య విశ్వాసలేమి, గ్రూపులు కట్టడం వంటివి ఎంతగానో పెరిగిపోయాయి. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. వాణిజ్యాన్ని ఆయుధంగా ప్రయోగించడం, పరస్పర సహకారం కొరవడటం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవి ఆర్థిక సవాళ్ల కన్నా పెద్ద రిస్కులు. ఇప్పటికే ఇంధనం, ప్రకృతి వనరులు, సెమీ-కండక్టర్లు మొదలైన అంశాల్లో మనం వీటిని చూస్తూనే ఉన్నాం‘ అని కోల్‌కతాలోని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ విభాగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మరికొన్నాళ్లు కొనసాగుతాయన్నారు. రూపాయి పతనం విషయంలో (డాలరుతో పోలిస్తే మారకం విలువ) రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోరాదని, దేశీ కరెన్సీ తనంత తాను సహేతుక స్థాయిని వెతుక్కునేందుకు వదిలేయాలని పరేఖ్ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సూచించినట్లుగా దేశాలు తమ విదేశీ మారక నిల్వలను భవిష్యత్ షాక్‌లను ఎదుర్కొనేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు మరింత వివేకవంతంగా ఉపయోగించుకోవాలని పరేఖ్ చెప్పారు. -
పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
-
ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 2026–2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.385 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ చెప్పారు. ఆ తర్వాత 2033-34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందన్నారు. యూఎన్డీపీ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో నాగేశ్వరన్ మాట్లాడారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ఈ దృష్యా వృద్ధి అవకాశాలు ఎంతో ఆశావహంగా, ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కనుక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు. డాలర్ మారకంలో జీడీపీ 10 శాతం వృద్ధి సాధించినా 2033–34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు’’అని నాగేశ్వరన్ వివరించారు. వాస్తవానికి 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. -
టీడీపీ ఎమ్మెల్యే నోటి దూల మాటలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అదిరిపోయే కౌంటర్
-
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంతా పార్టీ గుప్పిట్లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీని చూసే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.. పార్టీలోకి నేతలు వస్తూ పోతూ ఉంటారు.. పార్టీయే సుప్రీమ్’అని రెండు రోజుల క్రితం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన దానికి అనుగుణంగా పార్టీ కమిటీలను పటిష్టం చేసే కసరత్తు మొదలైంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ కొలిక్కి రావడంతో రాబోయే రోజుల్లో పార్టీ కేంద్రంగానే నేతలు, కార్యకర్తల యంత్రాంగం పనిచేసేలా సంస్థాగత కమిటీలకు జవసత్వాలు కల్పించాలని అధినేత నిర్ణయించారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణంలో సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ పాత, కొత్త తేడా లేకుండా చురుకైనవారు, యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కమిటీల నిర్మాణంలో పాటించాల్సిన మార్గదర్శకాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నేతృత్వంలో ఒకటి, రెండు రోజుల్లో జరిగే భేటీలో ఖరారు చేస్తారు. గ్రామ, మండల స్థాయి సంస్థాగత కమిటీలు పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏర్పాటవుతుండగా, ఈసారి మాత్రం పార్టీ ఇన్చార్జీల పర్యవేక్షణలో గ్రూపులు, వర్గాలకు అతీతంగా కమిటీలను నియమించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. విజయదశమికి అటూ ఇటూగా పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభించిన తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలకు శిక్షణ ఇచ్చేలా పార్టీ రాష్ట్ర కార్యాలయం షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టేందుకు అన్ని స్థాయిల కమిటీల్లో యువతకు చోటు కల్పించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి.. ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మినహాయిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్కు 103 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 68 మంది వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికైనవారే ఉన్నారు. పార్టీకి చెందిన సీనియర్లు పి.మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, మధుసూదనాచారి, జలగం వెంకట్రావు వంటి నేతలు మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే ఓటమి పాలైనట్లు కేసీఆర్ ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఇటీవల ఓడిపోయిన నియోజకవర్గంలో దివంగతులైన ఎమ్మెల్యే.. ఆయన ఉన్న సమయంలోనే పార్టీని భ్రష్టుపట్టించారని, ఆయన కుటుంబంపై అంత వ్యతిరేకత ఉన్నట్లు తన దృష్టికి రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోవైపు దశాబ్దాల తరబడి వేర్వేరు పార్టీల్లో పనిచేసిన వారు రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వీరి నడుమ ఉన్న రాజకీయ విభేదాలు కూడా పార్టీకి నష్టం కలిగిస్తాయని అధినేత అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడటం ద్వారా వారి పనితీరు బాగాలేని చోట పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాన్ని కేసీఆర్ గుర్తించినట్లు పార్టీనేతలు చెప్తున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను సమన్వయం చేసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు, పార్టీ ప్రధానకార్యదర్శులకు అప్పగించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను పునరుద్ధరించి, జిల్లా అధ్యక్షులను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా నియమితులయ్యే జిల్లా అధ్యక్షులు అధినేత లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌తో నేరుగా సంబంధాలు కలిగి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాల్సి ఉంటుంది. పార్టీకి కొత్త రక్తం.. యువతకు ప్రాధాన్యత పార్టీ యంత్రాంగం నుంచే కొత్త నాయకత్వం పుడుతుందని, భవిష్యత్తు రాజకీయ అవకాశాలు వారికే వస్తాయని ప్రకటించి కేసీఆర్ ఆ దిశగా కమిటీల నిర్మాణం ద్వారా అడుగులు వేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లోనూ సీనియర్ నాయకులు క్రమంగా తెరమరుగవుతున్న క్రమంలో అన్నిపార్టీలు కొత్తతరం నాయకత్వంపై దృష్టి పెడుతున్నాయి. మరో 20 ఏళ్లపాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలోనూ కొత్త నాయకత్వాన్ని గుర్తించేందుకు పార్టీ సంస్థాగత కమిటీలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువకులకు పార్టీ అభ్యర్థులుగా అవకాశమివ్వగా, ఎస్సీ కార్పొరేషన్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వంటి వాటిలోనూ కొత్తవారికే అవకాశమిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీలోనూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. అనుబంధ కమిటీల్లోనూ యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న గుండు సుధారాణి ప్రస్తుతం వరంగల్ మేయర్‌గా ఎన్నిక కావడంతో ఆమె స్థానంలో యువతకు ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
కరోనా : ఆర్థిక ఆరోగ్యానికి అయిదు టీకాలు
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాము. ఏడాది పాటు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు రెండు టీకాలు తీసుకుంటే ‘‘కరోనా’’ నుంచి మనకు పూర్తి రక్షణ ఏర్పడినట్టే. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. కానీ, ఇదే జాగ్రత్త వ్యక్తిగత ఆర్థిక అంశాల్లోనూ తీసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న అయిదు సూత్రాలను సకాలంలో పాటించడం ద్వారా (వీటిని టీకాలు అనుకొండి) మీ వ్యక్తిగత ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకోవచ్చు. ప్రణాళిక ప్రకారం సాగితే పొదుపు... మదుపు... ఎటువంటి కుదుపులు లేకుండా సజావుగా వెళ్లిపోతుంది. ►త్వరలో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలోని వ్యవహారాలను సమీక్షించండి. జీతం తగ్గిపోయి ఉండొచ్చు. రావల్సిన అద్దె రాకపోయి ఉండొచ్చు. లాభాలు అంచనాలను అందుకోలేపోయి ఉండొచ్చు. కరోనాతో ఆదాయానికి గండి పడింది. ఖర్చులు మాత్రం ఏమీ తగ్గలేదు. దీంతో దాచుకున్న నిల్వలు తరిగిపోయి ఉండొచ్చు. కరోనా మహమ్మారి ఖర్చులు తగ్గించుకోవాలన్న సంకేతాన్ని ఇచ్చింది. అనవస రపు ఖర్చులను ఎంత తగ్గించామో సమీక్షించుకోండి. (జియోకు షాకిస్తున్న ఎయిర్టెల్) ► రాబోయే ఆర్థిక సంవత్సరానికి తగిన ప్రణాళికలు వేయండి. వ్యాపారస్తులు కరోనా చేదు అనుభవాల నుంచి తేరుకొని ఏం చేయాలో ఆలోచించండి. వేతన జీవులు కూడా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. ఆదాయపు పన్ను భారం తగ్గలేదు. పెరగలేదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, స్థిరాస్థి క్రయ విక్రయాలు గురించి ఆలోచించండి. పెద్ద పెద్ద కమిట్స్మెంట్ ఏవీ పెట్టుకోకండి. ► ఆర్థిక ఆలోచనలను మీరు ఒక్కరికే పరిమితం చేయకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. కరోనా తెచ్చిన కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వ్యాపారస్తులు ఆలోచించండి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచింది. హంగులు, ఆర్భాటాల జోలికెళ్లకండి. అద్దె ఇళ్లలో ఉంటూ వ్యాపారం చేసే బదులు సొంత ఇళ్లలో వ్యాపారం చేయడం ఉత్తమం. ► జరిగేవన్నీ మంచికే అనే వేదాంత ధోరణి కాకుండా ముందు జాగ్రత్తగా.. ఆదాయపు వనరులు, ఖర్చుల గురించి వార్షిక ప్రణాళికలు వేసుకోండి. ప్రణాళికలు పక్కాగా ఉంటే పొర పాట్లు జరగవు. అనుకోని ఆర్థిక విపత్తులు ఎదురైనా ముందస్తు ఆలోచనల ద్వారా బయటపడొచ్చు. ► సంపాదించిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. నగదు వ్యవహారాలకు స్వస్తి పలకండి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరాస్తి లావాదేవీల సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉంది. లెక్కలు సక్రమంగా చూపించండి. పొదుపు చేయండి. చేతనైతే విరాళాలు ఇవ్వండి. పన్ను భారం అడ్వాన్సు టాక్స్ రూల్స్ ప్రకారం చెల్లించండి. ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించే బదులు వాయిదాల ప్రకారం చెల్లించండి. ఏ ఆందోళనా ఉండదు. ఇలా ప్రణాళిక బద్ధంగా వెళితే మీ ఆరోగ్యంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆరోగ్యంగా, నిలకడగానూ ఉంటుంది. -
రాజకీయ ముఖచిత్రం మారుతోంది...
సాక్షి, మంచిర్యాల : జిల్లా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని బీజేపీ బలోపేతం దిశగా సాగుతోంది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడంతో అనూహ్యంగా బీజేపీ పుంజుకొంటోంది. తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ కమలం గూటికి చేరడంతో జిల్లాలో ఆయన వర్గంగా ఉన్న నాయకులు, తటస్థులు, ఇతర పార్టీల వాళ్లు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆశావహుల అడుగులు కమలం వైపు పడుతున్నాయి. త్వరలో బీజేపీలో చేరికలు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆశావహులంతా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారు. పక్కనున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అదే ఊపు కనిపిస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరడం ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వివేక్ కుటుంబానికి జిల్లాలో బలమైన వర్గం ఉండడంతో ఆ వర్గమంతా ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా వివేక్ పట్టు అధికంగా ఉన్న బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపించనుంది. బీజేపీలో చేరడానికి ముందు వివేక్ జిల్లాలోని తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. దీనితో స్థానిక నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే చెన్నూరు, మంచిర్యాలల్లోనూ మున్సిపల్ ఆశావహులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తులు కమలం బాట పట్టనున్నారు. త్వరలో నిర్వహించబోయే కార్యక్రమంలో ఈ చేరికలు ఉండనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ అనూహ్యంగా బలం పెంచుకుంటున్న బీజేపీ రానున్న మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొంది. జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరు, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపాల్టీలున్నాయి. సహజంగానే పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ప్రభావం ఉండే బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. పైగా ఆర్టికల్ 370 రద్దు అంశం కూడా తమకు బాగా కలిసివస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. ఈ సమయంలో జిల్లాలో పట్టున్న వివేక్ బీజేపీలో చేరడంతో పార్టీలో జోష్ మరింత పెరిగింది. జిల్లాలో వివేక్ పార్టీకి పెద్ద దిక్కుగా మారనున్నారు. పార్టీలో చేరడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారా తన ప్రాభవం చూపించేందుకు వివేక్ పావులు కదుపుతున్నారు. జిల్లాలో బీజేపీకి సగం మున్సిపాల్టీలైనా సాధించిపెట్టి, తనబలాన్ని చూపించాలనే తాపత్రేయంతో ఆయన ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, చెన్నూరు మున్సిపాల్టీలను కైవసం చేసుకొనే దిశగా దృష్టి పెట్టారు. మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూరుల్లోనూ పాగా వేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఆ దిశగా బీజేపీలో చేరికలు ఉండనున్నాయి. ఏదేమైనా అదనపు బలాలతో పటిష్టంగా మారుతున్న బీజేపీలో చేరేందుకు మున్సిపల్ ఆశావహులు సమాయత్తమవుతున్నారు. -
11 నెలల గరిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై : అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతపై తాజా అంచనాలతో ఆసియా దేశాల కరెన్సీలు బాగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో బలపడుతోంది. ఇటీవల డాలరుతో పోలిస్తే బలహీనంగా మారిన రూపాయి గురువారం 0.36 శాతం ఎగిసి 11 నెలల గరిష్టాన్ని తాకింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి 26 పైసలు ఎగసి 68.32 వద్ద ప్రారంభమైంది. అనంతరం పుంజుకుని 68.30 వద్ద ఉంది. బుధవారం రూపాయి 7పైసలు బలహీనపడి 68.58 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అటు ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలనుంచి కోలుకున్నాయి. గురువారం డబుల్ సెంచరీ లాభాలతో కొనసాగుతోంది సెన్సెక్స్. నిఫ్టీ కూడా బలమైన ట్రెండ్‌తో 11550కి ఎగువన ట్రేడ్ అవుతోంది. -
నా ముందు నటించొద్దు..
శివాజీనగర (బెంగళూరు): పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోదీపై నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరి మరణాన్ని సంబరంగా జరుపుకుంటున్న వారెవరనేది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉందనీ, అయినా మోదీ కళ్లు మూసుకుని మౌనం వహిస్తూ గొప్పగా నటిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ అన్నారు. మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘నేను మీ కన్నా గొప్ప నటుడిని. నా ముందు నటించాలని యత్నించకండి. నటుడిగా నన్ను గౌరవించండి. నటన గురించి మీకేమీ తెలియకపోయినా మీరు నటిస్తున్నారంటే...యువతరం, నేను, జనాలు పిచ్చివాళ్లమని మీరు భావిస్తున్నారా? మీరు నాకన్నా గొప్పగా నటిస్తున్నారు. నాకు వచ్చిన ఐదు జాతీయ అవార్డులు మీకే ఇచ్చేయాలనిపిస్తోంది’ అని అన్నారు. మతవాద సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన గౌరీని కొందరు దుండగులు సెప్టెంబరు 5న రాత్రి ఆమె ఇంటివద్దనే చాలా దగ్గరి నుంచి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. సీపీఎంకు చెందిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదస్సును ఆదివారం ప్రారంభించిన అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. ‘నేను చెప్పేదేంటంటే ఆమెను చంపిందెవరనేది ముఖ్యం కాదు. ట్వీటర్లో ఆమె మరణాన్ని వేడుకగా జరుపుకుంటున్నవారెవరో కనిపిస్తూనే ఉంది. చంపినవారెవరో గుర్తించడానికి సాక్ష్యాలు లేకపోవచ్చు. కానీ ఆ మరణాన్ని కొందరు సంబంరంగా జరుపుకుంటున్నా, ఒక్క మాట మాట్లాడుకుండా కళ్లు మూసుకుని మౌనం వహిస్తున్న ప్రధాని మనకు ఉన్నారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేశ్ తనకు సన్నిహితురాలని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. -
భయం లేదు!
‘‘ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో? లేదో? అని ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదల సమయంలో కాస్త భయం ఉండేది. ఇప్పుడా భయం లేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఎప్పుడు రిలీజవుతుందా? అని ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అన్నారు తమన్నా. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితర భారీ తారాగణంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ ఇండియాతో పాటు విదేశాల్లోనూ భారీ విజయం సాధించింది. దాంతో సెకండ్ పార్ట్‌పై విపరీతంగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు చేరుకుంటామనే నమ్మకం ఉందన్నారు తమన్నా. ‘బాహుబలి: ది బిగినింగ్’లో ఈ మిల్క్ బ్యూటీ కత్తిపట్టి యుద్ధం చేసినా ఎక్కువ సమయం ప్రభాస్‌తో ఆడుతూ పాడుతూ కనిపించారు. ‘బాహుబలి 2’లో తమన్నా రోల్ మరింత స్ట్రాంగ్‌గా, యాక్షన్ బేస్డ్గా ఉంటుందట. ‘‘పీరియాడికల్ యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా హీరోలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ‘బాహుబలి’లో హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఓ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలిందని తమన్నా చెప్పారు. ప్రస్తుతం క్లైమ్యాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దర్శకుడు రాజమౌళి నవంబర్ కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఉండడంతో ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ మీద దృష్టి పెడతారట. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
ఫిజీని వణికిస్తున్న తుఫాను
సువా: పసిఫిక్ దక్షిణ ప్రాంత దీవుల సముదాయం ఫిజీ దేశాన్ని అత్యంత బలమైన తుఫాను 'విన్స్టన్' వణికిస్తోంది. గతవారం టోంగా దీవులను తాకిన ఈ తుఫాను తిరిగి తీవ్రరూపం దాల్చి ఫిజీ రాజధాని సువా దిశగా దూసుకొస్తోంది. తుఫాను దాటికి శనివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. విన్స్టన్ ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు ఫిజీ వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని విమానసర్వీసులను రద్దు చేశారు. ఫిజీ ప్రధాని బైనీమరామ ప్రజలను సురక్షితంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావానికి గురికానున్న పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా 758 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజధాని సువా ప్రాంతంలో తుఫాను అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. పసిఫిక్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అత్యంత బలమైన తుఫానుగా యూఎన్ వాతావరణ విభాగం 'విన్స్టన్'ను పేర్కొంది.