Student
-
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడ : అదరహో.. మిస్ బ్లాక్ షో, ర్యాంప్ వాక్‌తో సందడి (ఫొటోలు)
-
పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
వాషింగ్టన్ డీసీ : పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఓ సరదా అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితుడు ప్రాణ కోల్పోవడంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో ఉప్పల్ కళ్యాణ్ పురిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ఉప్పల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో నవంబర్ 13న అతని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అదే రోజు తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఆర్యన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇవాళ రాత్రి ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని తరలించనున్నారు. -
‘నేనేమైనా ఉర్ధు మాట్లాడుతున్నానా?’ విద్యార్థిపై కర్ణాటక మంత్రి ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖమంత్రి మధు బంగారప్ప తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రికి కన్నడ రాదని ఓ విద్యార్ధి వ్యాఖ్యానించడంతో ఆయన సీరియస్ అయ్యారు. విద్యార్ధి మాటలను మూర్ఖత్వంగా పేర్కొంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.. అసలేం జరిగిందంటేకర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహిక విద్యార్ధులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో సుమారు 25,000 మంది విద్యార్థులకు ఈ ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మధు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. విద్యామంత్రికి కన్నడ రాదు అని అన్నారు. దీనిపై మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఏంటి నేను ఏమైనా ఉర్ధూలో మాట్లాడుతున్నానా? టీవీ ఆన్ చేసి చూడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Hadn't Madhu Bangarappa publicly admitted that he doesn't know Kannada?? Why is the @INCKarnataka punishing the student who reminded him of this?? What are they trying to achieve here ?? What else can be expected of hopeless Congress??ತನಗೆ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಬರುವುದಿಲ್ಲ ಎಂದು ಈ ಹಿಂದೆ… pic.twitter.com/FPXnFGExqy— Pralhad Joshi (@JoshiPralhad) November 21, 2024 ఇక మంత్రి ప్రవర్తనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కర్నాటక బీజేపీ అధికారిక ఎక్స్‌లో మంత్రిని ఓ విద్యార్థి ప్రశ్న అడిగే కార్టూన్‌ను పోస్ట్ చేసింది. మంత్రి విద్యార్థులను బోల్డ్ ప్రశ్నలు అడగమని చెబుతున్న ఫోటోకు ‘ప్రశ్నించేవారిని తెలివితక్కువవాడిగా పిలుస్తుంది మీరే’ అని సూచించే క్యాప్షన్‌ను పేర్కొంది. ಅವಿದ್ಯಾಮಂತ್ರಿ @Madhu_Bangarapp ಅವರೆ, ಜ್ಞಾನ ದೇಗುಲವಿದು ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರಶ್ನಿಸು ಅಂತ ಹೇಳೋರು ನೀವೇ..!! ಪ್ರಶ್ನಿಸಿದವರನ್ನು ಸ್ಟುಪಿಡ್ ಅಂತ ಕರೆಯುವವರು ನೀವೇ..!!#DictatorCongress #UneducatedMinister pic.twitter.com/3ZY5kp3QB2— BJP Karnataka (@BJP4Karnataka) November 21, 2024 కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, ఎంపీ ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో స్పందిస్తూ.. మధు బంగారప్ప తనకు కన్నడ రాదని బహిరంగంగా ఒప్పుకోలేదా? ఈ విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థిని కర్ణాటక కాంగ్రెస్ ఎందుకు శిక్షిస్తోంది? వారు ఇక్కడ ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారు ? ఆశలేని కాంగ్రెస్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చని ప్రశ్నించారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు. -
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం
-
రాష్ట్రపతితో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల భేటీ
ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో ఫ్యూజన్ స్కూల్ విద్యార్థులు అర్హత సాధించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ సందర్భంగా ఆమె చూపిన ఆప్యాయతపై ఫ్యూజన్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూజన్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి రావు మాట్లాడుతూ,రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వకారణం. ఇది జీవితకాల జ్ఞాపకం’అని అన్నారు.కాగా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశం కేంద్రం కల్పిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు శారీరక, మానసిక, నాయకత్వ నైపుణ్యాల వంటి పరీక్షల్లో ప్రతిభను చాటాల్సి ఉంటుంది. -
Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి
గాంధీనగర్: విద్యాసంస్థలోని సీనియర్ల ర్యాగింగ్‌కు ఓ విద్యాకుసుమం నేల రాలింది. ఈ ఘటన గుజరాత్‌లోని ఓ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది ధర్పూర్ పటాన్‌లోని జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాడు.హాస్టల్లోని తృతీయ సంవత్సరం విద్యార్థులు అనిల్‌ను పరిచయం పేరిట మూడు గంటల పాటు కదలకుండా నిలబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతసేపు నిలుచుకున్న అనిల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి విద్యార్థులు అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థి తనను సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టారని కాలేజీ యాజమాన్యానికి తెలిపాడు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. పోలీసులు అనిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అనిల్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అనిల్ బంధువు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘అనిల్ కుటుంబం గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది పటాన్‌లోని కళాశాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతనిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. తాము ఇక్కడికి చేరుకోగా, అనిల్‌ను మూడవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసారని తెలిసింది. దీనిపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని’ కోరారు.మెడికల్ కాలేజీ డీన్ హార్దిక్ షా మాట్లాడుతూ ‘అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని గుర్తించిన వెంటనే, అతన్ని ఆస్పత్రికి తరలించాం. ఆ సమయంలో అనిల్ తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, మూడు గంటల పాటు నిలబెట్టాడని తెలిపాడు. ఈ విషయాన్ని మేము పోలీసులు, అనిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా ముందుగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కెకె పాండ్యా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక, దానిలోని వివరాల ఆధారంగా తదిపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోనే క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిషేధించింది. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కళాశాల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ.. -
బాలికలపై ఆగని అత్యాచారాలు
చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్ శనివారం ఎస్ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను మాయచేసి అత్యాచారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్ హాస్పిటల్ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైనాలో ఉన్మాది వీరంగం
బీజింగ్: చైనాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. విచ్చలవిడిగా కత్తిపోట్లకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 17 మందికి కత్తిపోట్ల గాయాలయ్యాయి. శనివారం చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. యిక్సింగ్ సిటీలోని వుక్సి వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో షూ అనే 21 ఏళ్ల ఉన్మాది శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఈ దాడికి తెగబడ్డాడు. కనిపించిన వారినల్లా కత్తితో పొడిచాడు.మొత్తం ఎనిమిది మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. తానే ఈ దాడికి పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడు. వుక్సి వృత్తివిద్య సంస్థలో పూర్వ విద్యార్థి అయిన షూ కొన్ని పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అలాగే ఇంటర్న్‌షిప్ కాలంలో తనకు చెల్లించిన సొమ్ముపై అసంతృప్తితో రగిలిపోయాడు. గ్రాడ్యుయేషన్ సర్టీఫికెట్ రాలేదనే కోపంతో ఇన్స్టిట్యూట్కు వచ్చి దాడికి తెగబడ్డాడు. పోలీసులు సహాయకచర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వారంలో ఇది సాధారణ పౌరులపై జరిగిన రెండోదాడి. ఈనెల 12న జుహాయ్ నగరంలో ఒక దుండగుడు జనంపైకి కారును తోలడంతో ఏకంగా 35 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి టౌన్: గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న స్వాతి (14) శనివారం ఉదయం పాఠశాల రెండో అంతస్తు భవనంలోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకొని.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబం మదీనాగూడ ఎంఏ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. స్వాతి తండ్రి పండు రాజు, తల్లి దివ్యవాణి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కాగా, తమ కూతురు ఆత్మహత్య వెనుక హాస్టల్ వారిపైనే అనుమానం ఉందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆమెతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వార్డెన్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
ఆడే వయసులో ఆగిన గుండె
చెన్నూర్: ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఆ బాలికను అకస్మాత్తుగా మృత్యువు కబళించింది. గుండెపోటు రూపంలో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్ కాలనీకి చెందిన కస్తూరి శ్రీనివాస్, రమాదేవి దంపతులకు ఓ కూతురు, కుమారుడు. కూతురు నివృతి (12) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు ఆ సందడిలో ఉన్నారు. నివృతి ఆలయానికి వెళ్లేందుకు సి ద్ధం అవుతోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెపోటుతో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ‘కార్తీక దీపాలు వెలిగించే ఇంట్లో దీపం లేకుండా చేశావా తల్లీ’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
ఫిలిప్పీన్స్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి
డాక్టర్ అన్న కోరికతో విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించ డానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది. పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాస ముంటున్నారు చింత అమృత్ రావు. మెదక్‌లోని ట్రాన్స్‌కో డీఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టిన రోజు విషెస్ చెబుతామని ఫోన్ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో అర్థంకావడం లేదని, తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ద తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్నిగ్ధ మరణానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టూడెంట్ల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
స్వాతిప్రియ.. శవమై..
భైంసా/బాసర: బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మరో విద్యా సుమం రాలిపోయింది. పీయూసీ2 చదువుతున్న పూరి స్వాతిప్రియ(18) ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని తిరుమలకాలనీకి చెందిన పూరి స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ2 చదువుతోంది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ అధికారులు ప్రధాన గేటు వద్దనే నిలిపివేశారు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన తల్లిదండ్రులు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. బంధువుల ప్రశ్నలకు అధికారులెవరూ సమాధానం చెప్పలేదు.పిల్లలను చదివిస్తూ...నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌కుచెందిన పూరి రవీందర్ – ఉజ్వల దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సరస్వతి బీటెక్ చదువుతోంది. రెండో కూతురు స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో చదువుతోంది. కొడుకు ఓంసాయిరాం హైసూ్కల్ చదువుతున్నాడు. ఆర్మూర్ మోడల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివిన స్వాతిప్రియకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. పూరి రవీందర్ ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరాచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను బాగా చదివిస్తే జీవితంలో స్థిరపడతారని ఎంతో కష్టపడుతున్నారు. కూతురు మృతిచెందడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.తల్లి ఆరోపణలు...పూరి స్వాతిప్రియను క్యాంపస్ అధికారులే హత్యచేసి ఆత్మహత్యగా చెబుతున్నారని మృతు రాలి తల్లి ఉజ్వల ఆరోపించారు. తాము రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ట్రిపుల్ఐటీకి చేరుకున్న తమను లోపలికి ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. కూతురు సెల్‌ఫోన్ ఇవ్వడంలేదని, సూసైడ్ నోట్ ఉందని చెప్పిన అధికారులు దానిని చూపించలేదని పేర్కొన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అవకాశమేలేదన్నారు. ఆదివారం ఫోన్లో మాట్లాడిందని ఉదయానికే ఎలా చనిపోయిందని ప్రశ్నించారు. క్యాంపస్ అధికారులు సాక్ష్యాలు మాయంచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. చదువు కోసం పంపితే శవాన్ని ఇంటికి పంపుతున్నారని విలపించారు. తల్లిదండ్రులు రాకముందే తరలింపు..స్వాతిప్రియ దసరా, దీపావళి పర్వదినాల్లోనూ ఇంటికి వెళ్లివచ్చింది. రోజూ తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడేది. సోమవారం ఉదయం క్యాంపస్ అధికారులు ఫోన్ చేసి స్వాతిప్రియ ఆత్మహత్యచేసుకుందని తెలుపడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో గంటలోపే బాసరకు చేరుకున్నారు. అయితే తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని క్యాంపస్ నుంచి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. -
ఇంట్లో చెబితే చంపేస్తానని చిన్నారికి టీచర్ బెదిరింపులు
-
విద్యార్థిని తొడ కొరికిన కీచక టీచర్
కోడూరు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో చోటుచేసుకుంది. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్‌ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
బీసీ వసతిగృహంలో విద్యార్థి మృతి
విజయనగరం అర్బన్/సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రం విజయనగరంలోని కాటవీధిలోగల బీసీ హాస్టల్లో ఓ విద్యార్థి ఆదివారం మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. శ్యామలరావు ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత మంచినీళ్లు తాగి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్తూ కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయినట్టు వార్టెన్ జానకిరావు తెలిపారు. అతడిని వెంటనే నగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే విద్యార్థి మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు తెలిపారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిని కాదని దూరంగా ఉన్న పెద్దాస్పత్రికి తీసుకువెళ్లడం వల్లే తమ మేనల్లుడి ప్రాణాలు పోయాయని శ్యామలరావు మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ శ్యామలరావు మృతికి కారణం ఏమిటనేది తెలియదని బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి ఈడీ పెంటోజీరావు చెప్పారు. హాస్టల్లో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో శ్యామలరావుకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం హాస్టల్లో విద్యార్థులెవరికీ అనారోగ్య సమస్యలు లేవని ఆయన తెలిపారు. నివేదిక ఇవ్వండి: మంత్రి సవిత ఆదేశం విజయనగరంలోని బీసీ హాస్టల్ విద్యార్థి కొణతాల శ్యామలరావు మృతికి కారణాలపై తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ విద్యార్థి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలను విచారించి నివేదించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
సూపర్ పవర్ ఉందంటూ..
సేలం: తనకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ ఓ కళాశాల విద్యార్థి నాలుగో అంతస్తుపై నుంచి అమాంతం కిందకు దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్న ఘటన కోవైలో కలకలం రేపింది. కాగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా మలుమిసంపట్టి సమీపంలో మైలేరిపాళయంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇందులో ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలో ఉన్న మేక్కూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రభు (19) హాస్టల్లో బస చేసి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు మంగళవారం సాయంత్రం అతను బస చేసి ఉన్న హాస్టల్లో నాలుగో అంతస్తుపై నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో చేతులు, కాళ్లు విరిగి పోయి తీవ్రంగా గాయపడిన ప్రభును సహ విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టిపాళయం పోలీసులు జరిపిన విచారణలో బాధితుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రభు అని తెలిసింది. తనకు సూపర్ పవర్ ఉందనే భ్రమలో ఉన్న ప్రభు తాను ఎంత ఎత్తయిన భవనం పై నుంచైనా దూకగలడని, తనకు ఏమీ కాదనే నమ్మకాన్ని పలు మార్లు స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదే విధంగా పక్క భవనం పైకి జంప్ చేసిన క్రమంలో కింద పడి గాయపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి ప్రభు కిందకు దూకిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.Shocking, a 19-year-old #BTech #student, believed he had #superpowers and jumped off the fourth floor of the students' hostel building in #Coimbatore , #TamilNadu The student from Mekkur village near Perundurai in Erode district suffered injuries. 28/10/24 pic.twitter.com/sGXqeMyRWF— Dilip kumar @DBN (@Dilipkumar_PTI) October 30, 2024 -
విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్ భూతం
-
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్‌గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్‌లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్‌తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్
కాశీబుగ్గ: కూటమి ప్రభుత్వహయాంలో అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిన్న తెనాలిలో కేంద్రమంత్రి అనుచరుడి దురాగతం.. మొన్న బద్వేలులో ఉన్మాది దారుణం.. అంతకుముందు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఇలా అత్యాచారాలు, వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం బయటకు వచ్చింది.పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు, ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న కాలనీకి చేరుకున్నారు.అక్కడ కేక్‌కట్ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడి నుంచి మరో విద్యార్థిని తప్పించుకోగలిగింది. తప్పించుకున్న విద్యార్థని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసినా పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో ప్రేమోన్మాదులు చెలరేగిపోతున్నారు. కర్నూలు జిల్లా ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. బద్వేల్లో యువకుడి చేతిలో గాయపడిన విద్యార్థిని మృతిచెందింది. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేష్ అనే యువకుడు ప్రెటోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది.విద్యార్థినిని బలవంతంగా రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విగ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థిని మృతి పట్ల బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సంతాపం తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళలకు దిశ చట్టం ద్వారా రక్షణ కల్పించామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక దిశ చట్టాన్ని రద్దు చేసిందని, ఆ యాప్ కూడా మనుగడలో లేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. మరో ఘటనలో..కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది.దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు.కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణని గాలికొదిలేసి.. గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్న @ncbn.#APisNotinSafeHands#IdhiMunchePrabhutvam#100DaysOfCBNSadistRule pic.twitter.com/AYYengnuC3— YSR Congress Party (@YSRCParty) October 19, 2024ఇదీ చదవండి: నేను నిన్ను మోసం చేసాను.. -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆంధ్రా యూనివర్సిటీ అర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ మహిళా విద్యార్థినులను సీనియర్ మహిళా విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చెయ్యలేం. డ్యాన్స్ రాదు అంటే అబ్బాయిలు దగ్గరకి వెళ్లి నేర్చుకొని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అయితే ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో వైస్‌ఛాన్సలర్ తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్లను 15 రోజులు పాటు సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అణిచి వేతలో కూటమి ప్రభుత్వం