Sunny
-
ప్రేమోన్మాది ఘాతుకం
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సన్నీ శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
యువతితో నటుడి నిశ్చితార్థం.. నిలదీసిన భార్యపై కత్తితో దాడి
బనశంకరి: మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడాన్ని ప్రశ్నించిన భార్యపై బుల్లితెర నటుడు చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సన్నిమహిపాల్ సీరియల్లో నటిస్తున్నాడు. జనవరిలో ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నట్లు నమ్మించి శారీరకంగా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్ చేయడంతో గతనెల 15న దేవస్థానంలో ఇద్దరికి వివాహమైంది.వివాహమైన అనంతరం వారం పాటు తనతో కలిసున్న భర్త తల్లిదండ్రులను ఒప్పిస్తానని మాటిచ్చాడు. అప్పటివరకు ఇద్దరు స్నేహితులుగా ఉండాలని అలాగే మేనేజ్ చేయాలని షరతు విధించాడు. అనంతరం మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెల్సి ఆ యువతి సన్నిమహిపాల్ను ప్రశ్నించడానికి అర్ధరాత్రి విజ్ఞాననగరలో అతడి నివాసానికి వెళ్లింది.ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సన్నిమహిపాల్ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్ అయిందని భార్య తెలిపింది. మరోవైపు తను బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్ సదరు యువతిపై హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
సన్నీ చంద్ర నుంచి అడివి శేష్ గా పేరు మార్చుకోవడానికి కారణం తెలిస్తే
-
తాంత్రికుడు వస్తున్నాడు
మహేందర్ వడ్లపట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటించిన చిత్రం ‘తాంత్రికుడు’. సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్‌ని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి రిలీజ్ చేశారు. ‘‘మంచి చిత్రం తీయాలని అమెరికా నుండి వచ్చి, ‘తాంత్రికుడు’ తీశా’’ అన్నారు మహేందర్ వడ్లపట్ల. ఈ చిత్రానికి సంగీతం: కె. ఆనంద్, కెమెరా: వంశీ. -
దాతలు దయచూపరూ..! నేను చదువుకుంటాను..!! విద్యార్థి సన్నీ..
మహబూబాబాద్: కడుపేదరికం.. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం.. కూలీకి వెళ్తేనే కూడు. లేనిపక్షంలో కుటుంబ మొత్తం ఆకలికి అలమటించుడే. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఓ విద్యార్థి పట్టుదలతో చదివాడు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. అయితే ఉన్నత చదువుకు లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైన ఆర్థిక సాయం అందిస్తే ఉన్నతంగా చదువుకుంటానని పేర్కొంటున్నాడు. దాతల సాయం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన మంతెన ప్రభుదాస్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు సన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు. 5వ నుంచి 10వ తరగతి వరకు మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ రాంపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. బీటెక్ చదవడానికి ఎంసెట్ రాశాడు. అలాగే, జేఈఈ మెయిన్స్ రాయడంతో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్ కళాశాలలో ప్రవేశం వచ్చినట్లు మెయిల్ద్వారా సమాచారం పంపించారు. దీంతో తనను ఎలాగైనా చదివించాలని తల్లిదండ్రులను ఒప్పించాడు. అప్పుతెచ్చి రూ. 20 వేలు ప్రవేశం కోసం ఆన్లైన్ ఫీజు చెల్లించారు. కళాశాలలో చేరగానే మరో రూ. 36 వేలు చెల్లించాలని తెలిపినట్లు చెప్పారు. అంతేకాకుండా సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చేతిలో డబ్బు లేక చదువు ఆపేయాల్సి వస్తుందని విద్యార్థి సన్నీ మనోవేదన చెందుతున్నాడు. పట్టుదలతో చదవగా సీటు వచ్చినా లక్ష్మీకటాక్షం లేకపోవడంతో కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 10 తేదీ వరకు కళా శాలలో చేరాలని సమాచారం అందించడంతో వారికి వేదన ఎక్కువైంది. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని సన్నీతోపాటు తల్లిదండ్రులు వేడుకుకుంటున్నారు. దాతలు 9052001950 ప్రభుదాస్, చెన్నారావుపేట ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62202764705, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021352 కి సాయం అందించాలని కోరారు. -
దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు
న్యూఢిల్లీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య భారతదేశంలో వచ్చే నాలుగు రోజుల్లో వడగాలులు వీసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులుంటాయని వివరించింది. దక్షిణ భారతంలోని ఏపీ తీరప్రాంతంలో బుధవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వరుసగా రెండో రోజు సాధారణం కంటే కనీసం 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. బుధవారం నాటికి వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశాలున్నాయంది. -
బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం విశేషం. సన్నీతో పాటు నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుంచి బయటికి వచ్చాక హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రమిది. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలి ఆడియన్స్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. -
భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వద్ద గురువారం అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చదవండి👉🏻 విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే! ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశాల్లో వచ్చే మూడురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మే తొలివారంలో వర్షాలు పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. బొగ్గు నిల్వలు అడుగంటడంతో థర్మల్ విద్యుత్ తయారీ సంకటంలో పడిందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం గమనార్హం. కొరత కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి. చదవండి👉 క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో -
స్టేజ్‌పై సన్నీ అన్న మాటలకు ఎమోషనల్ అయిన సిరి
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్‌లో రియల్ ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్‌బాస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నూ-సిరిల రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి. సిరి, అండ్ షణ్ముఖ్ అలాంటి ఫ్రెండిష్ దొరకడం అదృష్టం. నాకు, మానస్‌కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్ అయ్యింది. -
Bigg Boss5 Telugu: బిగ్‌బాస్-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్!
Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లలో టైటిల్ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్‌ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్‌లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. టైటిల్ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్ సహా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. -
బిగ్‌బాస్ బంపరాఫర్.. ‘ఫినాలే’కు చేరిందెవరు?
Bigg Boss 5 Telugu Today Promo, Ticket To Finale: బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ దిగ్విజయంగా 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. వారిలో కెప్టెన్ షణ్ముఖ్, సన్నీ మినహా.. మిగతా ఇంటి సభ్యులంతా నామినేషన్లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులంతా టాప్ 5లో ఉండాలని కలలు కంటున్నారు. ఈ ఒక్కవారం సేవ్ అయితే చాలు తర్వాత ఎలాగైనా నెట్టుకురావొచ్చనే భావనలో ఇంటి సభ్యులు ఉన్నారు. ఈక్రమంలో కంటెస్టెంట్స్‌కి బంపరాఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు నేరుగా ఫినాలేకు చేరుకునే అవకాశం కల్పించాడు. దానికోసం ‘టికెట్ టు ఫినాలే’అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా మూడు చాలెంజ్‌లు ఇచ్చాడు. వాటిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెలిస్తే వారే నేరుగా ఫినాలేకు సెలెక్ట్ అవుతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్’టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్ గెలిచిందెవరు? మిగతా రెండు టాస్క్‌లు ఏంటి? చివరకు ‘టికెట్ టు ఫినాలే’ ను ఎవరు సొంతం చేసుకున్నారు?అనేది తెలియాలంటే బిగ్‌బాస్ షోని ఫాలో కావాల్సిందే. -
బిగ్‌బాస్: స్నేహితుల మధ్య చిచ్చుపెట్టిన బిగ్‌బాస్.. గెలుపెవరిది?
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ స్నేహితుల మధ్య చిచ్చుపెట్టింది. హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉన్న మానస్-సన్నీ మధ్య విభేదాలు వచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా బెలూన్స్ పలగగొట్టే గేమ్‌లో ప్రియాంక, మానస్‌లో పోటీపడ్డారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి సన్నీతో పోటీ పడ్డాడు. స్విమ్మింగ్‌పూల్-టీషర్ట్ గేమ్‌లో మానస్, సన్నీ హోరా హోరీగా పోటీపడ్డారు. టీషర్ట్ ధరించి పూల్‌లోకి దూలి అవతలి వైపు వెళ్లాలి. అక్కడ టీషర్ట్ ధరించి మళ్లీ వెనక్కి రావాలి. ఇలా ఎక్కువ టీషర్ట్స్ ఎవరు ధరిస్తారో వారే విజేతలు. ఈ గేమ్‌లో సన్నీ ఇంటి సభ్యులపై ఫైర్ అయ్యాడు. తాను ధరించిన టీ షర్ట్‌కి లెబుల్ లేదంటూ రవిపై సీరియస్ అయ్యాడు. తనకు ఆడాలనే ఉత్సాహం కూడా లేదంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ‘గేమ్ ఆడే హడావుడిలో కూడా లెబుల్ ఉన్న టీషర్ట్‌నే ఎంచుకోవాలి. అదే గేమ్’అని కాజల్ చెప్పినప్పటికీ.. సన్నీ వినలేదు. ‘ప్రతిసారీ మీరే విజయం సాధించాలనుకుంటున్నారు. కాబట్టి మీరే ఆడుకోండి’అంటూ కాజల్, మానస్‌లపై పైర్ అయ్యాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు విజయం సాధించారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss: ఇదేందిరా భయ్.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా..సన్నీ ఫైర్
బిగ్‌బాస్ ఇంట్లో పత్తేపారం.. పలు గొడవలకు దారి తీస్తోంది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటి సభ్యులు ఓ రేంజ్లో కష్టపడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ కోసం కంటెస్టెంట్స్ నానా పాట్లు పడుతున్నారు. నాలుగు టీమ్‌లుగా విడిపోయి.. బద్ధ శత్రువుల్లా కొట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో సంచాలకురాలైన సిరిపై యానీ ఒంటికాలిపై లేచింది. ఇక నేటి ఎపిసోడ్లో కూడా ఓ రేంజ్లో గొడవలు జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సంచాలకులుగా కాజల్, సిరిలు సరిగా చేయడం లేదంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు నాలుగు టీమ్‌ల సభ్యులు. కన్వేయర్ బెల్ట్‌పై నుంచి వచ్చే రా మెటీరియల్ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ‘ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ’అని సన్నీ ఊగిపోగా.. ‘సంచాలకులపై ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు అందరి ముందు సారీ చెప్పాలి’అని సిరి డిమాండ్ చేసింది. దీన్ని తేలిగ్గా తీసుకున్న సన్నీ.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. ‘నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మరోవైపు కాజల్.. సంచాలకురాలిగా తనకు వచ్చి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంటి సభ్యులపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ‘మేం పెట్టిన రూల్‌ని అధిగమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలి’ అంటూ రూల్ పెట్టింది. దీనికి మేం ఒప్పుకోం అని ప్రియ విభేదించింది. అంతేకాదు ‘ నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు’ అంటూ ప్రియ సీరియస్ అయింది. ఈ సమయంలో సన్నీ విజిల్స్ వేస్తూ ‘అటు బస్సూ.. ఇటు బస్సూ ’అనే పాట పాడాడు. మరోవైపు బాగా డిస్టర్బ్ అయిన సిరిని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు షణ్ముఖ్. సిరిపై సన్నీ ఎందుకు ఫైర్ అయ్యాడు? కాజల్ అలాంటి రూల్ ఎందుకు పెట్టింది? తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 5 Telugu: చర్రితలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి బ్రేకప్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఐదు వారాలను దిగ్విజయంగా ముగించుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దీంతో హౌస్ అంతా గంభీరంగా మారిపోయింది. ప్రతి సోమవారం బిగ్‌బాస్ ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం కామన్. అయితే ఈ వారం గొడవల మోతాదు కాస్త ఎక్కువైంది. దీంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నామినేషన్ ప్రక్రియ ముగియగానే ఇంటి సభ్యులంతా మళ్లీ ఒక్కటైనట్లు తెలుస్తోంది. సన్నీ అయితే ఎప్పటి మాదిరే తనదైన పంచులతో ఇంటి సభ్యులను నవ్వించాడు. శ్రీరామ్‌ను ఇమిటేట్ చేస్తూ పలకించిన హావభావాలు హౌస్‌లో నవ్వులు పూయించాయి. అలాగే హమిదా ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. మరోవైపు కాజల్, శ్రీరామ్‌లు మధ్య నామినేషన్ ప్రక్రియ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్ అయిన కాజల్.. శ్రీఆమ్ని ఉద్దేశిస్తూ.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్రిమూర్తులు (షణ్ముఖ్, జెస్సీ, సిరి) ఎప్పటి మాదిరే ఇతర సభ్యులపై పంచులేశారు. ‘ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు. -
బిగ్‌బాస్ 5: కంటెస్టెంట్స్ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్!
ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ 5 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు స్పందించిన బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో అగష్టు 22 నుంచి కంటెస్టెంట్స్‌ను క్వారంటైన్ పంపించనున్నారని వినికిడి. కానీ బిగ్‌బాస్ 5 సీజన్ కంటస్టెంట్స్కు సంబంధించిన ఖచ్చితమైన జాబితాపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. చదవండి: బిగ్‌బాస్ 5: బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్, సింగర్! ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో జాబితా బయటకు వచ్చింది. అయితే ఇందులో కొంతమంది కొత్తవాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త జాబితాలో యాంకర్ రవి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్ ప్రత్యూష్, ఆట సందీప్/రఘు మాస్టర్ల పేర్లు ఉన్నాయి. చదవండి: బిగ్‌బాస్ 5 తెలుగు: బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అరియాన గ్లోరీ! ఇంతకుముందు వచ్చిన జాబితాలో యాంకర్ వర్షిణీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్, యానీ మాస్టర్, యూట్యూబర్ నిఖిల్ల పేర్లు ఉండగా.. ఈ కొత్త లిస్టులో వారి పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అని, అందులో డౌట్ లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల బిగ్‌బాస్ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షో హోస్ట్ ఎవరనే దానిపై ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ నాగార్జున ‘బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వచ్చేసింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5’ అంటూ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ కొత్త జాబితా: యాంకర్ రవి ఆర్జే కాజల్ శ్వేతా వర్మ లహరి షారి కమెడియన్ లోబో సిరి హన్మంతు నటి ప్రియ కార్తీకదీపం ఉమాదేవి 7 ఆర్ట్స్ నటి సరయు నటుడు మానస్ షా మోడల్ జస్వంత్ నటుడు సన్నీ విశ్వ టీవీ9 యాంకర్ ప్రత్యూష్ ఆట సందీప్/రఘు మాస్టర్లు -
సుశాంత్ సింగ్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా: హీరో సన్ని
‘నా ప్రయాణం మీడియా నుంచే ప్రారంభమైంది. నేను సినిమాల్లోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజపుత్గారే స్ఫూర్తి. ముందు సీరియల్లో లీడ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత హీరోగా ‘సకల గుణాభి రామ’ చిత్రం చేశాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని హీరో వీజే సన్ని అన్నాడు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సకల గుణాభి రామ’. వీజే సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వి. సంజీవ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘భార్యా భర్తల మధ్య ఎమోషన్స్, రొమాన్స్‌తో పాటు కామెడీ నేపథ్యంలో జరిగే సినిమా ఇది’ అని చెప్పాడు. త్వరలోనే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత సంజీవ రెడ్డి తెలిపాడు. -
ఆ వేసవి తిరిగి రానీ...
మిట్ట మధ్యాహ్నం ఎండను కసిరి వేపచెట్టు నీడ ఏసీ గాలులు వీస్తుంది. పెంకుటింటి వసారాలోని తాటాకు పందిరి చల్లగా... చలచల్లగా అని రాగం తీస్తుంది. కి టికీలకు కట్టిన గోతంపట్టాలు మగ్గు నీళ్లు ఒంపితే చాలు వేడిపై దండెత్తే కాలకేయులవుతాయి. మధ్యాహ్నం భోం చేశాక కబుర్లు రాత్రిళ్లు ఆరుబయట సందళ్లు వచ్చే పోయే చుట్టాలు పక్కాలు పిల్లలకు అనుదిన ఆటల పరమాన్నాలు ఎక్కడమ్మా ఎక్కడ ఆ వేసవి ఎక్కడ? కరోనా కరోనా ప్లీజ్ గో అవే. మా వేసవి మాకు ఇచ్చి పోవే. వీకెండ్ స్పెషల్. వానాకాలం కలిసే కాలం కాదు. శీతాకాలం ముడుక్కునే కాలం. కాని వేసవి కాలమే నలుగురినీ కలిపే కాలం. నలుగురూ కలిసే కాదు. ఎండ భళ్లున కాసి రాత్రిళ్లు వెన్నెలను ఆరబోసే కాలం. పగళ్లు ఉబ్బరింత కలిగించి రాత్రిళ్లు వెన్నవీవెనలను వీచే కాలం. వేసవి కాలం మనోహరం. వేసవి కాలం ప్రేమ మయం. ఈ కాలం గత సంవత్సరం మిస్సయ్యింది. ఈ సంవత్సరమూ మిస్సవుతోంది. కరోనాపై మెటికలు విరవాలా? దేవుడికి మొరపెట్టుకోవాలా? సంవత్సరం పొడుగూతా ఏవో పనులు. పిల్లల చదువులు. ఇంకేవో ఆరాటాలు. అటెండ్ కాలేని పోరాటాలు. వేసవి వస్తే అన్నీ పక్కకు వెళతాయి. వేసవి వస్తే అందరూ దగ్గర అవుతారు. వేసవిలో మన ఇంట్లో మనం మాత్రమే గడపడం నామోషీ గా భావిస్తారు. వేసవిలో మన ఇంటికి ఎవరో రావాలి... ఎవరింటికో మనం పోవాలి. అప్పుడే మనకు అయినవారు ఉన్నట్టు. అసలు ఆ మాటలు ఎక్కడ? మిద్దె మీద నీళ్లు కుమ్మరించి చల్లపడ్డాక పరిచే పక్కల మీద చేరి చెప్పుకునే కబుర్ల సంబరమెక్కడ? వెంట్రుకలు పొడువైన బుజ్జాయికి పూల జడ ఫలానా రోజు వేద్దామని నిశ్చయించుకున్నాక అబ్బో... ఆ హడావిడి.. ఉరుకులు పరుగులు... అంతా అయ్యాక ఫొటో తీసి ఆనెక దిష్టి తీసి... తిన్న తియ్య మామిడి టెంకెను మట్టిలో నాటి చెట్టు మొలిస్తే నా పేరు పెట్టు అనుకునే బాల్యం ఎక్కడ. ఆ నీళ్ల తొట్లలో పెద్దలు వారిస్తున్నా బుడుంగున దూకే గడుగ్గాయిలు ఏరి? గడ్డివాముల్లో ఆటలేవి. పొలం గట్ల మీద పరుగులేవి. ఏదీ ఆ సువర్ణ వేసవి. అదిగో వీధిలోకి పాలైసు బండి వచ్చింది. ద్రాక్షా ఐసు కూడా అమ్ముతారట. జేబులో చక్కెర పొట్లం స్మగుల్ చేసి నిమ్మరసం చేసుకుని రహస్యంగా పెదాలకు అంటించుకున్న తీపి. వి.సి.పి అద్దెకు తెస్తారు పెద్దవాళ్లు. సెకండ్ షో సినిమాలకు బయల్దేర తీస్తారు. ఇప్పుడైతే మినిమమ్ ఒక ఓటిటి చానల్‌కైనా చందా పడుతుంది. అవకాయ పెట్టడాన్ని చూడటానికి మించిన షో ఉండదు. వడియాలకు కావలి కాయడానికి మించిన పెద్ద బాధ్యత ఉండదు. బంధువుల్లో ఫలానా అబ్బాయి అమ్మాయికి స్నేహం కుదురుతుంది. బంధువుల్లో ఫలానా పిల్లలూ పిల్లలూ కలిసి మనం ఆజన్మాంతం కలిసి మెలిసి ఉందాం అని గట్టిగా అనేసుకుంటారు. బాదం చెట్టు వారిని చూసి కొన్ని కాయలను రాలుస్తుంది. సీమచింతగుబ్బలు గొంతు నస పెట్టించినా రుచిని ఇస్తాయి. జీడిమామిడి కాయలు ఉప్పును గుచ్చి తినమని పసుపురంగులో, ఎర్రరంగులో దోసిట్లో పడతాయి. ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్ ఫ్లాప్ అవుతుంది. చేసినమ్మ ఉసూరుమని ఐదు, పది రూపాయల వెనిల్లా కొనుక్కోమని పైసలు ఇస్తుంది. గోరింటాకు చెట్టు ఉంటే కనుక అబ్బాయి అరచేతుల్లో చందమామ దిద్దుకుంటుంది. అమ్మాయిలు ఎలా పండిందో చూసి కాబోయే మొగుడి గురించి కబుర్లాడితే సిగ్గుపడి తుర్రుమంటారు. వేసవి పండుగ ను ఇస్తుంది. వేసవి బాల్యాన్ని పండిస్తుంది. పోయిన సంవత్సరం కదలడానికి లేకుండా పోయింది. ఈ సంవత్సరం కదలకపోవడమే మంచిదనిపిస్తోంది. పిల్లలు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇల్లాళ్లు తమకు దొరికే ఈ పాటి ఆటవిడుపును జార్చుకుంటున్నందుకు విసుక్కుంటున్నారు. ఆనందం పండే సమయంలో చుట్టూ భయం వ్యాపించి ఉంది. ఇలా ఎంత కాలం? తప్పదు. ఇంకొంత కాలం. మరికొంత కాలం. అంతే. ఈ వేసవి పోతే ఏముంది. ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షుతో ఉంటే మరో వేసవి వస్తుంది. ఇంకో వేసవిని తెస్తుంది. ఈ సమయంలో జ్ఞాపకాలను పంచుకోవాలి. దూరంగా ఉన్నా సాంకేతికతతో దగ్గరగా ఉన్నామని కలిసి ఉన్నామని ఒకరికి ఒకరం ఉన్నామని చెప్పుకోవాలి. పెద్దలే పిల్లలకు పిల్లలు కావాలి. ఇద్దరికి నలుగురై ఆటలాడుకోవాలి. కాలం విసిరిన సవాలుకు బెంగటిల్లి లాభం లేదు. వచ్చే వేసవి కోసం మనం సంతోషాలను సంబరాలను దాచుకుందాం. క్షేమంగా ఉండండి. క్షేమం ఆశించండి. – సాక్షి ఫ్యామిలీ -
కాలేజీలో మొదలై ఆకాష్ అంబానీ పెళ్లి వరకు అతడే..
హిమాయత్‌నగర్: ఆ యువకుడు మైక్ పట్టుకుంటే స్టేడియంలోని క్రీడాభిమానుల్లో జోష్ పెరగాల్సిందే. వేడుకల్లో వేసే పంచ్‌లకు అతిథులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. కాలేజీలో జరిగిన చిన్న ఈవెంట్‌తో మొదలైన ప్రయాణం ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లిలో యాంకరింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. కాలేజీ క్రికెట్ కామెంట్రీనుంచి మొదలైన జర్నీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున యాంకరింగ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకునేంతగా ఎదిగాడు. అతడే ‘సన్నీ ఖండేల్వాల్’.. మన నగర యువకుడు. క్రికెటర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లో టెన్షన్‌గా ఉన్నప్పుడు వారికి నచ్చిన మ్యూజిక్‌ని ట్యూన్ చేస్తూ.. స్టెప్పులేస్తూ వారిని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ ‘ది ఫోర్త్ అంపైర్’గా గుర్తింపు పొందాడు మన సిటీ కుర్రాడు. నగరానికి చెందిన రమేష్ ఖండేల్వాల్, సీమ ఖండేల్వాల్ కుమారుడు సన్నీ ఖండేల్వాల్. అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్లో అక్షరాభ్యాసం చేసిన ఇతడు.. సెయింట్ మేరీస్‌లో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో నుంచే మంచి యాంకర్ అవ్వాలనే అభిలాష ఇతడిలో పెరిగింది. కాలేజీలో జరిగే చిన్నా, చితకా పార్టీలు, ఈవెంట్లకు సన్నీనే యాంకరింగ్ చేసేవాడు. కొడుకులోని తపనను చూసిన తండ్రి.. భవిష్యత్‌లో యాంకరింగ్‌కు మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇవ్వడంతో సన్నీ ఈవెంట్స్ కోర్సు కూడా చేశాడు. మిస్టర్ వలంటైన్ విన్నర్ ఏటా ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే ‘మిస్టర్ యూత్’ ప్రోగ్రాంకి కాలేజీ నుంచి సన్నీ పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోటీ పడగా ‘వీజే హంట్’ విభాగంలో, ‘స్టేజ్ అప్పీరెన్స్’లో సౌత్ ఇండియా–20గా నిలిచాడు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి ‘మిష్టర్ వలంటైన్’ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు మన హైదరాబాదీ. దుబాయ్‌లో సైతం.. దుబాయ్‌లో నిర్వహించే టీ–10 క్రికెట్ పోటీలకు సైతం సన్నీ యాంకరింగ్ చేస్తుడండం గమనార్హం. ఇందుకోసం అక్కడి నిర్వాహకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ యాంకర్లను ఆహ్వానించగా.. సన్నీ మాత్రమే ఎంపికయ్యాడు. దుబాయ్ లీగ్‌లో మన సన్నీ యాంకరింగ్ చూసిన అక్కడి అపర కుబేరుల్లో ఒకరైన రిజ్వాన్ నిజాన్ మంత్రముగ్ధుడై సన్నీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటా.. పాటా.. మాటలతో మైమరపించే సన్నీ ఖండేల్వాల్, ప్రొ కబడ్డీ పోటీల్లో సుస్మితాసేన్‌తో.. సచిన్‌నే మైమరిపించాడు మూడేళ్ల క్రితం నగరంలోని ఇనార్బిట్ మాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. ఆవేడుకను సన్నీనే యాంకర్. సచిన్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఈవెంట్‌కు పోటెత్తారు. వారందికీ ‘టైన్ టైంస్ సచిన్..సచిన్’.. అన్న నినాదాన్ని వారందరిలోకీ ఎక్కించాడు. సచిన్ వేదిక ఎక్కిన వెంటనే అభిమానులంతా ఒక్కసారిగా అదేవిధంగా స్పందించారు. ఆ కాంప్లిమెంట్‌కు ఫిదా అయిపోయాడు. ఐపీఎల్ సమయంలో యాంకరింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్‌ను గెలుపుదిశగా ప్రోత్సహిస్తున్న తనపై సచిన్ చూపించే అభిమానాన్ని వర్ణించలేనంటూ సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం పరిచాడు. సన్నీ ప్రొ కబడ్డీలోనూ అదే జోష్ చూపుతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు చెందిన కబడ్డీ టీమ్‌కి సన్నీ యాంకరింగ్ చేస్తూ తనకు మాత్రమే సొంతమైన చతురత.. చలోక్తులతో జట్టు సభ్యులను, యజమాని అక్షయ్ కుమార్ మన్ననలు అందుకున్నాడు. ఐపీఎల్‌లోకి అలా.. కాలేజీ ఈవెంట్లు, వేడుకల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సన్నీ.. ‘ఇండియన్ క్రికెట్ లీగ్’కు 2005–2006లో యాంకరింగ్ చేశాడు. ఇది చేస్తుండగా 2006లో ప్రారంభమైన ‘ఐపీఎల్’కి అనుకోకుండా యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్, అనంతరం పూణేకి ప్రాతినిధ్యం వహించాడు. వీటిలో సన్నీ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ ఆరో సీజన్‌కు యాంకరింగ్ చేసేందుకు ఆహ్వానించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌కు యాంకరింగ్ చేస్తూ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల కుటుంబానికి ‘సన్ని’హితుడిగా మారిపోయాడు. ఆకాష్ అంబానీ వివాహాన్ని ఎంత అట్టహాసంగా చేశారో దేశమంతా తెలిసిందే. ఆ పెళ్లిల్లో నీతూ అంబానీకి ఇష్టమైన ‘కృష్ణ రాసలీల’ గురించి తెలుసుకున్న సన్నీ.. ఆ థీమ్‌ను ‘ఎయిర్–వాటర్–ఎర్త్’ రూపంలో కళాకారులతో ప్రదర్శించి ఆ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథుల దృష్టిలో నిలిచిపోయాడు. ‘ఈ ప్రదర్శనకు ముఖేష్, నీతూ అంబానీలు సైతం ఆశ్చర్యంతో పులకించిపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. -
ఎండకు పార్క్ చేసిన బైక్‌లో మంటలు
-
మధ్యాహ్నపుటెండ
ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. ఒక యువకుడు చెరువు వైపు నడుచుకుంటూ పోతున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రంగా ఉంది. అతడు చాలా దిగులుగా ఉన్నాడు. తాను అనుకున్నది ఏమీ చేయలేకపోతున్నాననే వేదన అతడిని వెంటాడుతోంది. అదే చింతిస్తూ గట్టున ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడో కుక్క అటుగా వస్తోంది. ఎండకు అకరు కొడుతోంది. గట్టు దిగి చెరువు దగ్గరికి వెళ్లింది. అది దప్పికతో ఉన్నట్టుగా అర్థమవుతోంది. నీళ్ల దాకా వెళ్లింది. ఉన్నట్టుండి ‘భౌ’మని ఎగిరిపడి వెనక్కి పరుగెత్తింది. యువకుడు ఆసక్తిగా గమనిస్తున్నాడు. మళ్లీ కుక్క నీళ్ల దాకా వెళ్లింది. వెళ్లింది వెళ్లినట్టుగా ‘భౌ’ అని అరుస్తూ వెనక్కి వచ్చింది. అది దాని నీడను చూస్తోంది, అది మరో కుక్క అని భ్రమించి, భయపడుతోంది. ఏం జరుగుతుందా అని యువకుడు మరింత కుతూహలంతో చూస్తున్నాడు. కుక్క మళ్లీ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, నీటి దాకా పోయింది. ఈసారి అరుపులో అంత తీవ్రత లేదు. దానికదే ఒక రహస్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా, ముందు కొంచెం అనుమానంగా, తర్వాత తాపీగా నీళ్లను తాగి వెనక్కి వెళ్లిపోయింది. తన నీడను శత్రువుగా భావించిన కుక్క దాన్ని జయించగలిగింది. తాను సాధించవలసిన దానికి తానే అడ్డంకిగా ఉన్నానని నిశ్చయానికి వచ్చిన యువకుడు స్థిరంగా లేచి నిలబడ్డాడు. -
పసుపుపచ్చ దాహం
దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది. కీర దోస లెమనేడ్ కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: ఐస్ క్యూబ్స్ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి ♦ పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి ♦ వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి ♦ కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి. పుచ్చకాయ అల్లం లెమనేడ్ కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి. ♦ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి ♦ ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి ♦ ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి ♦ సబ్జా గింజలు జత చేయాలి ♦ సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి. కమలా – దానిమ్మ లెమనేడ్ కావలసినవి: చల్లటి గ్రీన్ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్ స్పూను; గార్నిషింగ్ కోసం – కమలా పండు చక్రం; ఐస్ – తగినంత తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి నిమ్మరసం జత చేయాలి ♦ కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి ♦ ఇది మంచి డిన్నర్ డ్రింక్. సోడా బదులు ఈ లెమనేడ్ వాడటం ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీ లెమనేడ్ కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ♦ దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి ♦ ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ రసం వేసి బాగా కలపాలి ♦ ఐస్ జత చేసి గ్లాసులలో అందించాలి. కొబ్బరి నీళ్ల లెమనేడ్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); ఐస్ క్యూబ్స్ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి ♦ నిమ్మ ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి ♦ పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ♦ నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది. ♦ నిమ్మలో ఉండే విటమిన్ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కారక కణాలను నిరోధిస్తాయి. ♦ కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ♦ తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ♦ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది. ♦ మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది. ♦ కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ♦ వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు. ♦ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. - సుజాత స్టీఫెన్ ,న్యూట్రిషనిస్ట్ -
సూరీడు@ 44.50
మరో నాలుగు రోజులు సెగలే జిల్లాలో అల్లాడుతున్న జనం తిరుపతి తుడా: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం తిరుపతి లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఈశాన్య వడగాడ్పులతోపాటు బంగా ళాఖాతం నుంచి వేడిగాలులు అధికంగా వీస్తున్నాయి. ఈ నేప«థ్యంలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఎండల వల్ల ఉక్కపోత అధికమయింది. దీంతో మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఇలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తిరుపతి.. చిత్తూరు గంగ జాతర వేడుకల్లో ఎండ ప్రభావం కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం వేళ రహదారులన్నీ పలుచగా మారాయి. పాదచారులు మండుటెండల్లో నరకం చూశారు. చిరు వ్యాపారులు ఇంటికే పరిమితమయ్యారు. వడదెబ్బకు జిల్లాలో మంగళవారం ఐదుగురు చనిపోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో 38.5 డిగ్రీలకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు 10 రోజుల వ్యవధిలోనే 44.5కు చేరాయి. ద్రోణి కారణంగా తగ్గుముఖంపట్టిన ఎండలు మళ్ళీ తీవ్రరూపం దాల్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పదిరోజుల్లోనే ఏకంగా ఆరు డిగ్రీల అధికంగా నమోదైంది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క మునుపెన్నడూ లేనివిధంగా జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. -
ఎండా, వానలతో జాగ్రత్త: రైల్వే జీఎం వినోద్
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత అధికంగా ఉండే మే నెల, వచ్చే వానాకాలాలను దృష్టిలో ఉంచుకు ని నిరంతరం జాగరూకతతో వ్యవహ రించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. సోమవారం రైల్ నిలయంలో అన్ని డివిజన్ల డీఆర్ఎంలు, ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే 20 రోజుల్లో ఎండ తీవ్రత గరిష్టంగా ఉండనున్నందున పట్టాల పగుళ్లు, జాయింట్ల వెల్డింగులు పరిశీలించాలన్నారు. వానాకాలంలో మెరుపు వరదలను అధిగమించేం దుకు ప్రణాళికలు అవసరమని పేర్కొ న్నారు. అప్రమత్తంగా వ్యవహరించి నందుకు గాను విజయవాడ డివిజన్ తాడేపల్లి గూడేనికి చెందిన ఉద్యోగి శ్రీనివాసరావుకు జీఎం ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. -
ఒకవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు కొన్నిచోట్ల ఎండలు కొనసాగుతున్నాయి. వడగాడ్పుల హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. రానున్న 4 రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంట ల్లో కొత్తగూడెంలో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నవాబుపేట, అశ్వారావుపేట, చంద్రు గొండ, టేకుల పల్లి, మద్దూరు, మోమినిపేట, నారాయణపేట్‌లలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు, నిజామా బాద్‌లో 42.5, రామగుండంలో 42.4, నల్లగొండలో 42, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మంలలో 41, హైదరాబాద్‌లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
సన్ డే..గరిష్టం 41.2 డిగ్రీలు..
సిటీబ్యూరో: నగరంపై భానుడి ప్రతాపం తగ్గడంలేదు. ఆదివారం గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 27.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, వేడిగాలుల తీవ్రత ఉంటుందని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.