Super Six
-
ప్రజలకు షాక్‌లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్‌సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్‌రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. -
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
సూపర్ సిక్స్ ని నమ్మి ఓటేశారు.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది
-
‘హామీలిచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.. ఇది మోసం కాదా? చంద్రబాబూ’
సాక్షి, తాడేపల్లి: ‘చంద్రబాబూ.. ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు. నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు.ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?దీపం:ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?తల్లికి వందనం:ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?అన్నదాత:ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?ఉచిత బస్సు ప్రయాణం:రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.యువగళం:రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్ఇదీ చదవండి: హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు. నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు..@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?ఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024 -
అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు
-
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకు స్కెచ్..
-
హామీలు సూపర్ సిక్స్.. అమలులో క్లీన్ బౌల్డ్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనిగానీ.. నిర్దిష్ట కేటాయింపులుగానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్ సిక్స్ హామీలు డకౌట్ కావడంతో కూటమి సర్కారు తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత సామెతను తలపిస్తోంది. గత ఆర్ధిక ఏడాది కంటే ఈదఫా పన్ను ఆదాయం ఏకంగా రూ.23,894 కోట్లు అదనంగా వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే పన్నుల రూపేణా ప్రజలపై మరింత భారం మోపనున్నారు. ఇందులో మద్యం ద్వారా అదనంగా రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్ధిక ఏడాది మద్యం ద్వారా రూ.15,977 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్ధిక ఏడాది రూ.25,597 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పన్నేతర ఆదాయం గత ఆర్థిక ఏడాది కన్నా రూ.3,000 కోట్లకు పైగా అదనంగా వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. భారీ అప్పులు చేసి ప్రజలపై రుణం భారం మోపడమే లక్ష్యంగా 2024–25 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ ఆర్థిక ఏడాది ప్రజా రుణం ఏకంగా రూ.91,443 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. ‘సూపర్’.. బాదుడే! సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో చెప్పకుండా తూతూ మంత్రంగా రూ.1,000 కోట్లు విదిలించి మసిబూసి మారేడుకాయ చేశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించకుండా మహిళలను దగా చేశారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సూపర్ సిక్స్‌లో చెప్పిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్ బడ్జెట్లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లు చూపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి పైసా కేటాయింపుల చేయకపోగా త్వరలో అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి కేశవ్ ముక్తాయించారు. మరోపక్క విద్యుత్ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14,867.18 కోట్లు వ్యయం చేస్తే 2024–25లో సగానికిపైగా కోత విధించి కేవలం రూ.8,155.31 కోట్లను కేటాయించారు. అంటే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతుందని చెప్పకనే కూటమి ప్రభుత్వం చెప్పింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు అరకొర నిధుల కేటాయింపుతో సరిపుచ్చారు. 2023–24 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,866 కోట్ల వ్యయం చేయగా 2024–25లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.4,012 కోట్లు మాత్రమే కేటాయించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే భూమి విలువలను పెంచడం ద్వారా ప్రజలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో ప్రజలపై అదనపు పన్నుల భారం వేయనున్నారు. 2023–24 లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు రూ.9,542 కోట్లు ఆదాయం రాగా 2024–25లో రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్టెట్‌లో పేర్కొన్నారు. జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధిదారులకు ఇవి అందేవి ఆదాయం, అప్పులు భారీగా.. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు బడ్జెట్లో ఆ మాటే గుర్తు లేన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. మొత్తం మీద పన్నుల రూపంలో భారీ ఆదాయం, భారీ అప్పులతో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.బాబు మేనిఫెస్టోలో హామీలు ఘనం... బడ్జెట్లో కేటాయింపులు శూన్యంప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలతోపాటు మరికొన్ని హామీలు ఘనంగా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్లోనే వాటి అమలుకు పైసా కేటాయించలేదు.పూర్ టు రిచ్: పేదలకు సంపన్నులను చేసే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (పీ4) పథకాలు: అసలు ప్రస్తావనే లేదు.సౌభాగ్యపథం: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు సబ్సిడీ: ఈ ఊసే లేదు.యువత సంక్షేమం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్: దీని గురించి ఎలాంటి ఊసేలేదుఎంఎస్ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు: చిల్లిగవ్వ ఇవ్వలేదుపరీక్షలకు ప్రిపేర్ కావడానికి డిజిటల్ లైబ్రరీలు: ఈ ప్రస్తావనే లేదుబీసీ డిక్లరేషన్బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం: ఆ మేరకు కేటాయింపులు లేదుదామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు: చిన్న మాట కూడా లేదుస్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం: స్పష్టత లేదు.రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ: కేటాయింపు లేదుఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల వేతనం: ఊసే లేదు.వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం: పైసా లేదుమహిళా సంక్షేమంపీ4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం: ఊసే లేదు.అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ: దీని ప్రస్తావన లేదుఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు: దీని ప్రస్తావన లేదువిద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు: ఒక్క మాట లేదుఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర హామీలుప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్: పట్టించుకోలేదులేదుసీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అమోదయోగ్యమైన పరిష్కారం: ఆ ప్రసక్తే లేదుతక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు: ఊసే లేదువలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు: సున్నాకాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు: పైసా కేటాయించలేదు నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఏటా రూ.100 కోట్లు: పైసా లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ చొప్పున 20లక్షల మందికి ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి: ఊసే లేదుప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రతి హైవీ లైసెన్సు లారీ, టిప్పర్ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం: ఒక రూపాయి కేటాయించలేదువ్యవసాయంధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు: పైసా కేటాయించలేదు రాయితీతో సోలార్ పంపు సెట్లు: దీని ప్రస్తావనే లేదుడ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ: ఆ ఊసే లేదుసబ్సిడీపై వ్యవసాయ పరికరాలు: లక్ష మంది రైతులు, కిసాన్ డ్రోన్లకు రూ.342 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ.187.68 కోట్లు మాత్రమే పేదల గృహవసతిపేదలందరికీ గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు: బడ్జెట్లో ప్రస్తావన లేదుఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి: స్పష్టత ఇవ్వలేదుసాగునీటి రంగంగాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణం: ఆ మేరకు నిధుల కేటాయింపు లేదురాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి: బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు లేవు. ఈ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం -
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఏపీలో మాఫియా రాజ్యమేలుతోంది. ఈ రాక్షస పాలనలో ప్రజలకు అండగా నిలబడదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దాం. కూటమి అరాచకాలపై తిరుపతి నుంచే తిరుగుబాటు చేద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీలని చెప్పి చంద్రబాబు మోసం చేస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని, మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారని విమర్శించారు.ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి మనకు తిరిగి అధికారం ఇస్తారన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే సహించనని చెప్పిన పవన్‌కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారని ప్రశి్నంచారు. ఇది ‘ఈవీఎం’ ప్రొడక్షన్స్ వారి సీబీఎన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు: విజయసాయిరాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదని అన్నారు. ప్రజలకు సేవచేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు భూమన అని అన్నారు. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని.. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని.. 2027 ఆఖర్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించేందుకు భూమన కృషి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు సంక్షేమం దూరమైంది: వైవీ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారని గుర్తుచేశారు. నేడు ప్రజలు సంక్షేమ పథకాలు అందడంలేదని.. అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామని, 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తొలిరోజు నుంచే అరాచకాలు: సజ్జల చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నాటి నుంచే రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఓ మాఫియా రాజ్యం ఏలుతోందని.. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించడంలేదన్నారు. 4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని.. అయితే వాటిని జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో సీఎం చంద్రబాబు రూ.53వేల కోట్లు అప్పుచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని ప్రశి్నంచారు. ఇకపోతే.. బలమైన కార్యకర్తల పారీ్టగా ఈసారి అధికారంలోకి వస్తున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కష్టాల్లోనే వైఎస్ కుటుంబానికి మరింత అండగా.. : భూమన చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భూమన మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలు చేసే సమయంలో తాను తుపాకి కాల్పుల వరకు వెళ్లి వచ్చిన వాడినని, చంద్రబాబుని ఢీకొనడం అంటే బెండుతో ఢీకొనడడం లాంటిదేనన్నారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలో ఉన్నప్పటి కంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు మరింత అండగా నిలబడతానని భూమన స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఓడించడానికి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు చంద్రగిరిలో రంగంలోకి దించారని.. లోకేశ్ 6 రోజులు పాదయాత్ర చేసి మోహిత్ ఓటమి కోసం పనిచేశారని గుర్తుచేశారు. -
రైతులకు 20 వేలు ఎక్కడ చంద్రబాబు.. టీడీపీపై కారుమూరి ఫైర్
-
ఇసుక ఉచితమే.. చార్జీలు మాత్రమే తడిసి ముపేడు
-
Big Question: దీపాలు ఆర్పే డబ్బా బాబు!.. ఏపీ రాష్ట్ర ప్రజలు ఏమైనా ఎర్రి గొర్రెలా..
-
బాబు సర్కారు ప్రగతి.. 59,000 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల్లో గొప్పలు పోయిన చంద్రబాబు.. ఈ ఐదు నెలల్లో పైసా సృష్టించలేదు. అభివృద్ధి, సూపర్ సిక్స్ హామీలూ అటకెక్కేశాయి. ఉచిత ఇసుక అంటూ జనాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయిస్తున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పల్లెల్లో జ్వరం వచ్చినా మందు బిళ్లలు దొరకవు. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటీ అంటే.. అప్పులు. ఈ అప్పుల గ్రాఫ్ మాత్రం రాకెట్ స్పీడ్‌తో ఆకాశంలోకి దూసుకుపోతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలేవీ అమలు చేయని ప్రభుత్వం ఈ వేల కోట్ల అప్పుల సొమ్మంతటినీ దేనికి ఖర్చు చేస్తోందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.59,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ పరిధిలో చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 7.17 శాతం వడ్డీతో మరో రూ.3,000 కోట్లు అప్పు చేసింది. దీంతో బడ్జెట్ పరిధిలో చేసిన రుణాలు రూ.51,000 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.8,000 కోట్లు బడ్జెటేతర అప్పు చేశారు. తాజాగా తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 19 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 23 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణం తీసుకుంది. నాడు గగ్గోలు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అప్పు తెస్తే.. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ ఎల్లో మీడియా కథనాలను అచ్చేశాయి. చంద్రబాబు అండ్ కో కూడా లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలు, కేంద్ర అనుమతి మేరకు రుణాలు తెచ్చినా అప్పు చేయడం మహాపరాధంగా బాబు అండ్‌కో చిత్రీకరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.ఇప్పుడు చంద్రబాబు మంగళవారాల్లో అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు పెగలడంలేదు. వివిధ కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు సర్కారు మరో రూ.8,000 కోట్ల బడ్జెటేతర అప్పు చేసినా ఎల్లో మీడియా కిమ్మనడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కార్యకలాపాల కోసం అప్పు చేసేందుకు గ్యారెంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా తప్పుపట్టాయి. పైగా ఆ అప్పులను దాచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే తప్పు అని గగ్గోలు పెట్టిన వారికి అదే పని చంద్రబాబు సర్కారు చేస్తే ఒప్పవుతుందా అని అంటున్నారు. -
ప్రజలు ‘సూపర్‌సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స
సాక్షి,విశాఖపట్నం: సూపర్‌సిక్స్ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం(అక్టోబర్ 19) మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’అని బొత్స మండిపడ్డారు.బొత్స ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వానికి హామీలపై ఆరు నెలలు సమయం ఇద్దమనుకున్నాం.ఆరు నెలల తర్వాత కూడా ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.రెండున్నర ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెపుతున్నారు.వైఎస్సార్సీపీ పాలనలో పది వేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు 15 వేల లభిస్తుంది.ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినా కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు.గత ప్రభుత్వ హయాంలో సినరేజ్ చార్జీలు రూ.375 వసూలు చేసేవారు.సినరేజ్ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వచ్చేవి.కూటమి ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలు సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదు.ట్రాక్టర్‌తో ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇచ్చేవారు.టీడీపీ ప్రభుత్వం హయంలో కొత్తగా ఏమీ ఇవ్వలేదు.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు, ఎక్కడ తగ్గించారు.నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.అగ్గిపెట్టెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.ప్రభుత్వ అవినీతిపై వార్తలు రాస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.అగ్గి పెట్టె లెక్కలు మీ గెజిట్ పేపర్లోనే వచ్చాయి.టీడీపీ నేతల కుమ్ములాటలు వల్ల గుర్లలో పది మంది చనిపోయారు.నాలుగు నెలల నుంచి మంచి నీటిపై పర్యవేక్షణ లేదు.మంచినీటి సరఫరా కాంట్రాక్టు తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని కుమ్మూలడుకుంటున్నారు.ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ నిర్లక్ష్యం వలన డయేరియా మరణాలు సంభవించాయి.పరిశుభ్రమైన మంచి నీటిని అందించలేదు.డయేరియాతో చనిపోయిన పది మందికి నష్ట పరిహారం చెల్లించాలి.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
బాబు మాటలు నేతి బీర చందమే!
బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్ సిక్స్ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్‌పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అరిష్టం అవుతుంది!తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా, నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా 2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం అరిష్టం కాదట? జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నిరుద్యోగులకు సర్కార్ షాక్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. వారి పొట్టకొట్టే చర్యలు చేపట్టి.. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది. సూపర్ సిక్స్‌లో మొట్టమొదటి హామీగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, లేదంటే ఉద్యోగాల కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫేస్టోలోస్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమకు ఇక సర్కారు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడమే.. ఖాళీ అయిన పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులతోనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తేనే నిరుద్యోగ యువతకు అవకాశాలు ఉంటాయని, రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకపక్క రిటైర్డ్ వారికే మళ్లీ అవకాశం ఇస్తూ.. కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కారు కొలువులు నిరుద్యోగ యువతకు అందని ద్రాక్షగానే మిగిలిపోనున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి.. ఆ నియామక ప్రక్రియను తాత్సారం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది డీఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉస్సూరుమంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలోనూ గత ప్రభుత్వం ఇచి్చన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రెండు స్క్రీనింగ్ కమిటీలు డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్, ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కేడర్‌లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి (హెచ్ఆర్), సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మరో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల భర్తీ ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖల ప్రత్యేక సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు.. స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తరువాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను రెగ్యులర్ పోస్టుల్లోనే తీసుకోవాలని, మంజూరు కాని పోస్టుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లను 2018లో ఆరి్థక శాఖ జారీ చేసిన 48 జీవో మేరకు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు మాత్రమే వర్తిస్తాయని, అఖిల భారత సర్విసు, కేంద్ర సర్విసు ఉద్యోగులకు వర్తించవని పేర్కొన్నారు. -
బాబు ‘సూపర్‌సిక్స్’ అంటే ఇదే..! విజయసాయిరెడ్డి సెటైర్లు
సాక్షి,ఢిల్లీ:చంద్రబాబు వందరోజుల పాలనలో అమలు చేసిన సూపర్ సిక్స్ హామీలు ఇవే అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం (సెప్టెంబర్21) ఒక ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపించి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చంపించారు.మూడు నెలల్లో 19 వేల కోట్ల అప్పు చేశారు..కీలక సంక్షేమ పథకాలను ఆపేశారు.తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు విజయవాడ వరదలకు కారణమయ్యారు.వరద నిర్వహణలో చేతులెత్తేశారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను షట్ డౌన్ చేశారు.తమ మేనిఫెస్టో నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీటీడీ లడ్డుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. TDP of Chandrababu (@ncbn) ‘Super Six’ in his first 100 days of governance in Andhra Pradesh:1.Incited mass violence, including killings of YSRCP supporters.2.Borrowed ₹19,000 crore in under 3 months.3.Halted key welfare schemes.4.Caused and Mishandled the Vijayawada floods…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2024ఇదీ చదవండి.. నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బాబు: కొట్టు -
నారావారి వంచన.. ‘ఆరు’ నూరైనా అమలు చేయాలంటున్న జనం
నేను మారిన మనిషిని. ప్రజల మనిషినంటూ నరం లేని నాలుకలా వరాలు గుప్పించడం.. అందలమెక్కాక అబ్బే సాధ్యం కాదంటూ మాట మార్చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ కొండంత రాగం తీసిన చంద్రబాబు, పవన్ .. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కొట్టలేం.. డకౌట్ అయిపోతామంటూ చేతులెత్తేస్తున్నారు.ఎండమావులు దప్పిక తీర్చవు.. చంద్రబాబు మాటలేవీ వాస్తవాలు కావన్నది రాష్ట్రంలోని ఐదుకోట్ల మందికీ తెలుసు. కానీ.. సూపర్‌సిక్స్ పేరుతో ‘మాయ’ఫెస్టో తీసుకొచ్చి.. ఒక ఎత్తు కాకపోతే.. మరో ఎత్తు.. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం అన్నట్లుగా.. హామీల వర్షం కురిపించేసి జనంతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా.. హామీలు అమలు చేయకుండా మెల్లగా జారుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట.. ఇదీ చంద్రబాబు నైజం. నోటికొచ్చిన హామీలిచ్చి.. వాటిని తుంగలో తొక్కడం.. లేదంటే.. నిబంధనల చట్రంలో బందీలుగా మార్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సూపర్ సిక్స్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు అమ్మో భయమేస్తోంది.. సిక్స్ కొట్టడం సాధ్యం కాదు.. ప్రజలంతా గమనించాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లులందరికీ వందనమంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాదంటూ తెగేసి చెప్పేశారు. ఇంటికో ఉద్యోగమంటూ ప్రతి చోటా ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన బాబు.. ఇప్పుడు ఇంటికో అబద్ధమనే పథకాన్ని ప్రారంభించారు. నిరుద్యోగులకు భృతి అంటూ మరోసారి బూటకపు మాటలతో బురిడీ కొట్టించి.. యువత ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి మహిళకూ ఆర్థిక ఆసరా కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు అతివలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడొస్తాయా అంటూ ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బస్సెక్కిన ప్రతిసారీ ఫ్రీ ఎప్పుడని మహిళలంతా అడుగుతున్నారు.నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఇంటింటి తలుపు తట్టింది. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ క్యాలెండర్ ఏర్పాటు చేసి హామీలు అమలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా.. ఇలా ఒకటా రెండా.. ఇచ్చిన ప్రతి హామీ అమలైంది. ఇంటింటాసంక్షేమం వెల్లివిరిసింది. ఉచిత బస్సు వస్తుందా? ఎన్నికల్లో చంద్రబాబు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు. అసలు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నట్టా? లేనట్టా? – మరడాన మంగ, మహారాణిపేటఇంకా సిలిండర్ రాలేదు నిత్యావసర ధరలు పెరగడంతో కుటుంబ పోషణ తలకు మించిన భారం అవుతోంది. ఈ సమయంలో ప్రతీ ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో చాలా సంతోషించాం. మా వరకు ఏడాదికి 11 వరకు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. గ్యాస్ సిలిండర్లు అందిస్తే ఉపశమనంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించాలి. – వియ్యపు నాగమణి, త్రినాథపురం అమ్మ ఒడితో అండగా నిలిచారు నాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ఇంటర్, కుమార్తె 8వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు నాలుగు నెలలవుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా రూ.30 వేలు వస్తుందని ఆశపడ్డా. ఇంత వరకు ఈ పథకం ఊసే లేదు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని నిరీ్ణత సమయానికి అమలు చేసి అండగా నిలిచారు. – కూండ్రపు అరుణ, మంగప్పయ్యగారివూరు, పరవాడ మండలంమే లోనే సాయం అందించారుజగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఐదేళ్లూ క్రమం తప్పకుండా అమలు చేశారు. ముఖ్యంగా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. పెట్టుబడి సాయం, ఈ క్రాప్ నమోదు, రైతు భరోసా కేంద్రాలు, పంటల బీమా, పంట గిట్టుబాటు ధర, పంటల కొనుగోలుతో అండగా నిలిచారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి మేలోనే మొదటి విడతగా రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ఏడాదికి రూ.13,500 సాయం రైతులకు అందేది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేవాళ్లం.– చిల్ల వెంకటరమణ, చిప్పాడ‘తల్లికి వందనం’ ఊసేలేదు? నాకు ఇద్దరు పిల్లలు. పాప నాలుగో తరగతి, బాబు 8వ తరగతి చదువుతున్నాడు. కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉలుకూ.. పలుకూ లేదు. ఫీజులు కట్టాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నా యి. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఎంతో ప్రయోజనం పొందాను. – టి.వరలక్ష్మి, పాతకొవ్వాడరూ.1,500 ఎప్పుడిస్తారు? మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇంటర్ చదువుతున్నారు. నా భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 19 నుంచి 59 ఏళ్ల మధ్య గల ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారనే కూటమికి ఓటు వేశాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే.– మీసాల జయలక్షి్మ, సత్యానగర్భృతి అందేదెప్పుడో? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గతంలో ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. ఎన్నికల్లో గెలిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు/నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇవ్వడంతో.. పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. ప్రభుత్వం నిరుద్యోగభృతిపై ఊసే ఎత్తడం లేదు. కోచింగ్ సెంటర్, స్టడీ మెటీరియల్‌కు ఎంతో ఖర్చు అవుతోంది. ఇదంతా కుటుంబానికి ఆర్థికంగా భారం. వెంటనే నిరుద్యోగ భృతి అందజేయాలి.– కందుల సంతోష్ 62వ వార్డురైతుకు సాయం దక్కదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. మేము వరి, కొబ్బరి, మొక్కజొన్న, అరటి సాగుచేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ సాయం అందకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేయాలి. – నగిరెడ్ల రాంబాబు, వలందపేట -
చంద్రబాబు మరో మాయ.. ముందే లీకులు కూడా!
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త. ఇది నిజమే అయితే సంతోషించాల్సిన విషయమే. ఆ మొత్తం కథనం చదివితే ఎక్కడా సూపర్ సిక్స్ కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు కనిపించలేదు. వాటికి రోడ్ మ్యాప్ ఎందుకు తయారు చేయడం లేదో చెప్పలేదు.కొత్త రోడ్ మ్యాప్‌లో ప్రధానంగా జనాభా మేనేజ్మెంట్(డెమోగ్రాఫ్ మేనేజ్మెంట్) గురించి ప్రస్తావించడం ఒక విశేషమైతే.. పీ-4(పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్) పాలసీ మీద కేంద్రీకరించారు. చంద్రబాబు గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్దికి ఇంతకు మించి మార్గం లేదని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ ప్రతిక వెల్లడించింది. ఈ ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ప్రయోజనాలు సాధించి తద్వారా సంపాదించే డబ్బును సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు ఇప్పట్లో అయ్యేవికావని చెప్పడమేనా?.ప్రతీ మహిళకు నెలకు 15 వందలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి ఏడాదికి 15వేలు, ప్రతీ ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటికి బాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రచురించారు. దీనికి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఎక్కడా పీ-4 విధానాన్ని అమలు చేసి.. అంటే ప్రైవేటు రంగంతో కలిసి వ్యాపారాలు చేసి లేదా అభివృద్ది సాధించి అటు పిమ్మట వచ్చే డబ్బుతో ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎక్కడా రాయలేదు.ఇవి కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక హమీలు ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్లను కొనసాగిస్తానని, వారికి గౌరవ వేతనం ఐదు వేల నుంచి 10వేలకు పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ ష్యూరిటీలు.. భవిష్యత్ గ్యారంటీలు ఏమై పోయాయో కానీ ఇప్పుడు తాజాగా పీ-4 విజయవంతం అయితేనే సంక్షేమం మీద అధిక డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామని సెలవిస్తున్నారు. సో.. మీడియా మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఇదే ఏపీ గ్రోత్ అని.. దీనికి ఒక రోడ్ మ్యాప్ అని కథనాలు ఇప్పిస్తున్నారు.పరిశ్రమల అభివృద్ది, ఉపాధి, అమరావతి, పోలవరం, ఇంధన రంగం మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తారట. అందులోనూ నైపుణ్య గణన వచ్చే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందట. అన్న క్యాంటీన్లు, మౌళిక వసతులు అభివృద్ది, పోలవరం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అట. వాటిపై డాక్యుమెంట్ తయారు చేయడానికి సీనియర్ అధికారులతో చర్చ జరిపారట. ఈ ఫలితాలు సాధించడానికి చంద్రబాబు.. అధికారులకు సలహాలు ఇచ్చారట. ఈ మొత్తం వార్త చూస్తే ఏమనిపిస్తుంది. సూపర్ సిక్స్‌లోని అంశాలు ఏవీ ప్రధాన ఎజెండాలో లేవని కొంత ప్రత్యక్షంగా.. కొంత పరోక్షంగా చెప్పేస్తున్నట్టే కదా?. ఆ సూపర్ సిక్స్ రాష్ట్ర భవిష్యత్‌కు గ్యారంటీ అని కదా ఎన్నికలకు ముందు చెప్పింది. చంద్రబాబు ష్యూరిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారు.పరిశ్రమల అభివృద్ది, పోలవరం నిర్మాణాన్ని ఎవరు వద్దు అంటారు?. అది నిరంతర ప్రక్రియ. పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమి లేదు. ఈయన టైంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ముందుగా పునరుద్దరణ జరగాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయ అంచనాలను ఆమోదించాలి. ఆ తర్వాత డబ్బు కూడా కేంద్రమే ఇస్తుంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తాను చేపట్టి దానిని గందరగోళంలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే. అయినా ఇప్పుడు ఆ నెపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇరవై లక్షల ఉద్యోగాలు ఏలా ఇచ్చేది ఈ రోడ్ మ్యాప్‌లో చెప్పలేదు. తన స్పీచ్‌లలో కూడా చంద్రబాబు ఎక్కడా ఇది చెప్పడం లేదు. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను మరోసారి ప్రారంభించి అది తన ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు.ఇక అమరావతి చూస్తే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ ఫైనాన్స్‌గా తనే సమకూర్చుకుంటుందని ఇంత కాలం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15వేల కోట్ల రూపాయల అప్పును తీసుకువచ్చి అది ఏదో ఒక గొప్ప విషయంగా ఊదరగొడుతున్నారు. ఇక అక్కడే నాలుగేళ్లలో రూ. 60వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ‘అన్న క్యాంటీన్లు’ పెట్టడం పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవి తప్ప మిగతా వాటిన్నింటికీ ఆయన పీ-4 విధానం కింద సంపాదించడం ద్వారానే అధిక ఖర్చు చేయగలుగుతామని జనానికి చెబుతున్నట్టుగా ఉంది. 2014-2019 మధ్య ఇలాంటి డాక్యుమెంట్లు తయారు చేయలేకపోలేదు. ప్రతీ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోచర్ వేసి ప్రచారం చేసుకున్నట్టుగా ప్రభుత్వం అది చేస్తుంది.. ఇది చేస్తుంది అంటూ విమానాశ్రయాలు మొదలు అనేక హమీలు గుప్పించారు. కానీ, ఆచరణలో ఒక్కటి కూడా చేయలేకపోయారు.రుణ మాఫీ తదితర హామీలు సైతం అరకొరగా అమలు చేసి హుష్ కాకి అన్నారు. ఇప్పుడు ఏపాటి చేస్తారో కానీ.. పీ-4 విజన్ డాక్యుమెంట్, రోడ్ మ్యాప్ అంటూ జనాన్ని మాయ చేయడానికి వీలుగా మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. వీటికి తోడుగా ఇప్పుడు ఏపీలో జనాభాను పెంచుతారట. ఇప్పటికే జనాభా అధికమై దేశం అనేక సమస్యలు ఎదుర్కుంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలను అధికంగా కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. తన కుటుంబంలో అమలు చేయని విధానాన్ని ఇతరులు అంతా చేయాలని చెప్పడమే హైలెట్. పిల్లలను ఎంత మందిని కంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని ప్రచారం చేసిన ఈయన ఇంతవరకు ఆ స్కీమ్ అమలు గురించే మాట్లాడడం లేదు. ఈ ఏడాది దానిని అమలుచేయడం లేదని ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంటే చంద్రబాబును నమ్మి పిల్లలను కనేపనిలో ఉంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా!.పంచాయతీ, మున్సిపాలిటీ పదవుల కోసం ఆశపడి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటారని చంద్రబాబు ప్రభుత్వం కనిపెట్టడం మరో విడ్డూరం. గతంలో ఇద్దరు పిల్లలను మించి పిల్లలను కంటే స్థానిక ఎన్నికల్లో అనర్హులు అవుతారని తెచ్చిన చట్టాన్ని ఈయన తీసేశారు. ఒక పక్క జనాభా పెంచాలని అంటారు. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ అన్నారు. మరి వీటికి డబ్బులు ఎక్కడివీ అంటే పీ-4 అంటారు. ధనికులు పేదలను దత్తత తీసుకోవాలంట. ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి వ్యాపారాలు చేయాలట. తద్వారా లాభాలు సంపాదించాలట. తదుపరి ఆ డబ్బును సంక్షేమంపై ఖర్చు చేయాలట. ఇది అంతా ఆయన విజన్ అంట. ఏం చేస్తాం అధికారంలో ఉన్న వాళ్లు ఏం చెప్పిన గొప్ప విషయంగా జనం తీసుకోవాలి. లేదంటే ఏలిన వారికి కోపం రావచ్చు. ఇదే క్రమంలో ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు మీడియా చంద్రబాబుకు భజన చేసే పనిలో ఉంటే.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా కూడా తన పాత్రను పోషిస్తున్నట్టుగా ఉంది. ఏం చేసినా, చేయకపోయినా ఇలా బిల్డప్ ఇచ్చుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేడేమో!.- కొమ్మినేని శ్రీనివాస రావు.సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సూపర్‌సిక్స్ మరచిపోయారు’
సాక్షి,తిరుపతి: కూటమి నేతలు ప్రజాసమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.ఇటీవల కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాష, కౌన్సిలర్లు తిరిగి సోమవారం(సెప్టెంబర్2) వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘డీజీపీని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్ పంపించ లేదు అని ప్రశ్నిస్తున్నా. ఎవరైనా పార్టీ మారక పోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్‌ను, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు. సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మరచిపోయారు. వారు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అభివృద్ధిపై దృష్టిపెట్టాలి’ అని మిథున్‌రెడ్డి సూచించారు. కొన్ని కారణాల వల్ల తాము రాజీనామా చేసి వెళ్ళామని, ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చామని మున్సిపల్ చైర్మన్ అలీంబాష తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు. -
మనోడే.. విమానంలో తిప్పేద్దాం
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటున్న కూటమి ప్రభుత్వం.. తమ కార్యకర్తలకు జేబులు నింపడానికి అడ్డగోలుగా ప్రత్యేక జీవోలే ఇస్తోంది. ప్రజల సొమ్ముతో కార్యకర్తలు జల్సా చేసేలా ఒకే రోజు మూడు జీవోల్ని విడుదల చేసింది. మంత్రులతో పాటు వారి ఓఎస్డీలు, పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించింది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఒక జీవో జారీ చేశారు. మంత్రి ఓఎస్డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు మంత్రితో పాటు ప్రయాణించడానికి అనుమతించారు. జీతభత్యాలతో సంబంధం లేకుండా మంత్రి కార్యాలయ సిబ్బంది ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా మంత్రులు బయటి వ్యక్తులను ప్రైవేటు కార్యదర్శులుగా, వ్యక్తిగత సహాయకులుగా నియమించుకోవడానికి అనుమతించడమే కాకుండా, వారి వేతనాలను రెట్టింపు చేస్తూ మరో జీవో జారీ చేశారు. మంత్రి వ్యక్తిగత సహాయకుడి వేతనం రూ.18 వేల నుంచి రూ.36 వేలకు, ప్రైవేటు కార్యదర్శి వేతనం రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బంది ప్రతి మంత్రికి నలుగురు చొప్పున మొత్తం 24 మంత్రులకు 96 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిస్తూ సురేష్ కుమార్ మరో జీవో ఇచ్చారు. ప్రతి మంత్రి ఒక ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)తో పాటు స్వర్ణాంధ్ర విజన్ నిర్వహణకు ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ను నియమించుకోవచ్చు. సోషల్ మీడియా నిర్వహణకు ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చు. ఈ విధంగా కూటమి కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
Big Question: ఉచిత వైద్యం వేస్ట్.. మాంచి కిక్కిచ్చే మద్యం బెస్ట్.. బాబు మనసులో మాట
-
బాబు భవిష్యత్తు అంతా భయానకంగా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన తమాషాగా ఉంది. పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ఒక హెడింగ్ పెట్టింది. ఈ డైలాగు చదివితే ఒక సినిమా సన్నివేశం గుర్తుకు వస్తుంది. తీస్తా..నాలో ప్రతిభ అంతటిని వెలికితీస్తా..అంటూ ఒక టివీ చానల్ ప్రోగ్రాం హెడ్‌గా నటించిన బ్రహ్మానందం చానెల్ యజమానికి చెబుతారు. మహద్బాగ్యం అని ఆ యజమాని సంతోషపడతారు..ఇది వినడానికి సరదాగా, హాస్యంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అదే మాదిరిగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పాలన చేస్తున్న వ్యక్తి ఏమీ కాదు.. ఇప్పటికే పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేశారు. మరోసారి ఆయనకు అవకాశం వచ్చింది. ఆకాశమే హద్దుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా అమలు చేసేది చెప్పకుండా పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అని ఆయన అంటుంటే అది ఎలా ఉంటుందా? అని టీడీపీ నేతలే ఆశ్యర్చపోతున్నారు. ఇప్పటికే రెండు నెలల పాలన పూర్తి అయింది. దానిని జనం స్వయంగా చూశారు. హింసాకాండ, విధ్వంసకాండకు ఏపీ చిరునామాగా మారింది. ఇదేనా ఆ పాలన? ఎలా ఉండాలో చూపించడం అంటే అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆయన రాష్ట్రంలో ఎక్కడకు పర్యటనకు వెళ్లినా, తాను ఏమి చేసేది చెప్పకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఉన్నవి,లేనివి కలిపి విమర్శలు గుప్పించడం, గత ఐదేళ్లు రాష్ట్రం ఏదో నాశనమైపోయిందని ప్రచారం చేయడానికే ఆయన టైమ్ అంతా సరిపోతోంది. చరిత్రలో ఎన్నడూ చూడని నష్టాలను గడచిన ఐదేళ్లలో రాష్ట్రం చూసిందపి ఆయన అంటున్నారు. అదెలాగో చెప్పరు. విధ్వంసం అంటే జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమా?. రాష్ట్రంలో నాలుగు కొత్త ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తేవడం, మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు శ్రీకారం చుట్టడం వంటివి రాష్ట్రానికి నష్టం కలిగించాయా?వీటి గురించి ప్రస్తావించి ఏ రకంగా జగన్ టైమ్ లో రాష్ట్రానికి నష్టం జరిగిందో వివరిస్తే అర్ధం ఉంటుంది. అలాకాకుండా లేనిపోని పిచ్చి ఆరోపణలు చేస్తే జనానికి ఏమి ఉపయోగం. ఒకవైపు చాలా హామీలు ఇచ్చాం కాని, ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబే చెబుతారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా?అని ఎవరైనా అడిగితే ఆయన కస్సుమనవచ్చు.రిషికొండలో ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తే తప్పు పడుతుంటారు. మరి అమరావతి పేరుతో అవసరం ఉన్నా,లేకపోయినా భారీ టవర్ల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో చెప్పరు. ఆయన చేస్తే అభివృద్ది..ఎదుటివారు చేస్తే విలాసం అన్నమాట. ఒకవేళ జగన్ ఇచ్చిన హామీల అమలు వల్ల రాష్ట్రం నష్టపోయిందని,ధ్వంసం అయిందని చంద్రబాబు చెప్పదలిచారా?అది కరెక్టు అయితే తాను ఏకంగా జగన్ కంటే మూడు రెట్ల అధికంగా హామీలు ఇచ్చారు కదా?అప్పుడు ఇంకెంత విధ్వంసం అవుతుంది?తాను ఇచ్చిన సూపర్ సిక్స్ ఏ రకంగా అమలు చేసేది చెబితే అప్పుడు చంద్రబాబును సెహబాష్ అని అనవచ్చు.అది చెప్పకుండా మిగిలిన కధలు ఎన్ని చెబితే జనం ఎందుకు నమ్ముతారు? పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహ ఆయన నెరవేర్చిన హామీలేమిటో చెప్పే పరిస్థితి లేదు. అప్పులపై ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలు ప్రచారం చేశారు?ఇప్పటికీ అవే అబద్దాలను ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇదేనా పాలన అంటే ఏమిటో చూపించడం అంటే!ఉచిత ఇసుక అని ప్రకటించినా , ఏదో రూపంలో డబ్బులు వసూలు చేస్తుండడం కూటమి పాలనను రుచి చూపించడం. జగన్ ప్రభుత్వం నిల్వచేసిన ఇసుక సుమారు నలభై లక్షల టన్నుల మేర టీడీపీ, జనసేన క్యాడర్ దోచుకోవడం ద్వారా కూటమి పాలన ఎలా ఉందో చూపించారు కదా! .మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇచ్చి చూపిస్తే , పాలన ఎలా ఉండాలో చూపించడం అవుతుంది.రైతులకు ఇవ్వవలసిన ఇరవైవేల రూపాయల భరోసా ఇచ్చి ఉంటే ఇది పాలన అంటే జనం ఒప్పుకోవచ్చు. తల్లికి వందనం పేరుతో విద్యార్ధులకు చెల్లించవలసిన పదిహేనువేల రూపాయలను ఈ ఏడాది ఎగవేయకుండా ఉంటే దానిని కదా పాలన ఎలా ఉండాలో చూపించడం అంటే! నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల సంగతి ఏమైంది?వలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఏమైంది!ఇలా అనేక వాగ్దానాలను తన అనుభవంతో అమలు చేసి చూపించినట్లయితే, పాలన ఇలా ఉండాలి కదా..అని జనం అనుకుంటారు.వీటన్నిటిని పక్కనబెడితే జగన్ పై ,సాక్షి మీడియాపైన దుష్ప్రచారం చేస్తే ప్రజలకు ఏమి ఒరుగుతుంది. సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రభుత్వ ప్రచార ప్రకటనలను ఆయన తప్పు పడుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా తన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి మీడియాలో అడ్వర్టైజ్ మెంట్స్ ఇస్తుంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఈనాడు అధినేత రామోజీరావు సంస్మరణార్ధం పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిన వైనం గురించి ఏమి చెబుతారు?. 201419 మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలకు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసింది?సాక్షి మీడియాకు ఎంత మొత్తం ఇచ్చింది పోల్చి చెప్పి ఉంటే చంద్రబాబు కొంతలో కొంత నిజాయితీగా మాట్లాడినట్లు అయ్యేది.ఆంధ్రజ్యోతి మీడియాకు అర్హత లేకపోయినా వందల కోట్లు చెల్లించినవైనంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చేవి. అయినా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సాక్షి మీడియాపై బురద చల్లుతున్నారు.చంద్రబాబు ఒక వైపు తాను సంపద సృష్టిస్తానని అంటారు. మరో వైపు ఆర్ధికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరు పాతిక మందిని వృద్దిలోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందని చంద్రబాబు కొత్త ధీరీ చెబుతున్నారు.ఆయన కుటుంబం స్థితిమంతమైనదే కదా!ఎంతమందిని స్వయంగా పైకి తీసుకు వచ్చారో చెబితే జనానికి కాస్త అయినా నమ్మకం కుదిరేది కదా!రాయలసీమకు పరిశ్రమలు, నీటి ప్రాజెక్టుల గురించి ఎప్పటి మాదిరే ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆచరణ చేసి చూపించాలి తప్ప జగన్ పై దూషణలకు దిగితే ఉపయోగం ఏమి ఉంటుంది?గతంలో చంద్రబాబు లక్షకోట్ల రూపాయల రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి తీరా ఆచరణలో చేతులెత్తేశారు. ఇప్పుడు కూడా ఆ దిశలోనే చంద్రబాబు పాలన సాగుతోందని ఆయన మాటలను బట్టే అర్ధం అవుతుంది.పైగా సంక్షేమం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని సుభాషితాలు వల్లె వేస్తున్నారు. అది నిజమే అయితే సూపర్ సిక్స్ పేరుతో, ఎన్నికల ప్రణాళిక పేరుతో లెక్కకు మిక్కిలిగా వాగ్దానాలు ఎందుకు చేశారో చెప్పాలి కదా?అసలు సమస్య ఏమిటంటే.. చంద్రబాబుకు భవిష్యత్తు అంతా భయానకంగా కనిపిస్తోంది. తన పాలన తీరు ద్వారా ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఆయనకు అర్ధం అవుతోంది.అందుకే ఒక వైపు పాలన ఎలా ఉండాలో చూపిస్తాం..అంటూ మరో వైపు తనకు హామీలు అమలు చేసే శక్తి లేదని పరోక్షంగా అంగీకరిస్తూ భయమేస్తోందని చెబుతున్నారు. అదే ఆయన చూపించబోయే పాలన అని జనం అనుకుంటే తప్పు ఏమి ఉంటుంది! :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు సూపర్ సిక్స్ మీద నమ్మకం పోయింది.. టీడీపీపై NV ప్రసాద్ ఫైర్
-
అప్పుడు హామీ ఇచ్చాం.. ఇప్పుడు కుదరదు..
-
చంద్రబాబు సూపర్ సిక్స్ కు మంగళం..