suspicions
-
వివేకా హత్య వెనక వారసత్వం పోరు ఉందనే ప్రచారం: అవినాష్ రెడ్డి
-
Pulwama attack 2019: ‘పుల్వామా’పై అనుమానాలెన్నో
న్యూఢిల్లీ: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న 2019 పుల్వామా ఉగ్ర దాడిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఉగ్రదాడి ముప్పుందని తెలిసి కూడా జవాన్లను విమానంలో కాకుండా రోడ్డు మార్గాన ఎందుకు పంపాల్సి వచ్చిందో మోదీ సర్కారు చెప్పి తీరాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘పుల్వామా దాడిపై నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయట పెట్టిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. జైషే ముప్పును, ఏకంగా 11 నిఘా హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? ఉగ్ర దాడిపై విచారణ ఎంతదాకా వచ్చింది? బాధ్యులను గుర్తించారా?’’ అని ప్రశ్నించారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు?
సాక్షి, జడ్చర్ల: డిగ్రీ విద్యార్థిని మునావత్ మైన(19) ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కళాశాలలో అసలేం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో చరిత్ర కలిగి ఉండి ఇటీవలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల. దీనికితోడు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు, హెర్బేరియం గుర్తింపు తదితర కార్యక్రమాలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు ఉండగా.. మరోవైపు కొందరు ఆడపిల్లల పట్ల అనుచిత భావన కలిగి ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గురుశిష్యుల బందాన్ని తప్పుగా అర్థం చేసుకోలేరన్న భావనను కొందరు లెక్చరర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. వైరల్ అయిన ఫొటోలు విద్యార్ధిని మైన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఓ విద్యార్ధినితో ఓ లెక్చరర్ కలిసి ఉన్న ఫొటోలు గురువారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెస్టారెంట్ తదితర ప్రాంతాల్లో ఉన్న సమయంలో కొందరు వారిని అనుసరించి దూరంగా ఉండి తీసినట్లుగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ ఫొటోలలో ఉన్న విద్యార్థిని ఎవరన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. సంబంధిత వార్త: Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం వీడియో ఎవరు తీశారు? విద్యార్థిని మైనా ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న వీడియోను ఎవరు తీశారన్నది తెలియాల్సి ఉంది. డిగ్రీ కళాశాల తరగతి గదిలో ఆ రోజు ఎందుకు గొడవ జరిగింది. ప్రిన్సిపాల్, లెక్చరర్లు చెబుతున్నదే నిజమా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారించాల్సి ఉంది. అసలు ఈ గొడవలో దాడికి పాల్పడిన విద్యార్థిని, ఫొటో తీశారని చెబుతున్న మరో విద్యార్థిని, లెక్చరర్ల పాత్ర ఎంత మేరకు ఉందో కూడా విచారించాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్న మైన తాను తీసిన ఫోటోలను ఎవరికి పంపిందో కూడా తెలియాల్సి ఉంది. లెక్చరర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిఘా వేసి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా..? అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓ లెక్చరర్, ఓ విద్యార్థిని ఎక్కడెక్కడ తిరిగిన ఫొటోలో తీయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉందో కూడా తేలాల్సిన అవసరం ఉంది. విద్యాబోధన గాలికొదిలారా..? విద్యా బోధనను గాలికి వదిలేసి, బోధనేతర కార్యక్రమాలపై లెక్చరర్లు దృష్టి సారించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపాల్ చిన్నమ్మ అడ్మినిస్ట్రేషన్‌లో కొంత వీక్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది. పోలీసులు, ఉన్నత విద్యాధికారులు జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కళాశాల ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన మైన ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నాగర్‌కర్నూల్ సీఐ హన్మంతు ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రస్తుతానికి అలాంటిదేమి లేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కళాశాలలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ సస్పెండ్ చేశారు. -
హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అనుమానం.. కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి...
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: అనుమానం పెనుభూతమైంది. భర్త చేతిలో ఇల్లాలు హతమైంది. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన బోయ రాజప్ప, సావిత్రి (50) దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం నాలుగేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చారు. వాచ్‌మెన్‌గా, కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై రాజప్పకు అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అతను భార్యతో గొడవకు దిగాడు. రాజప్ప ఇటుక తీసుకుని సావిత్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో కుప్పకూలిన ఆమె కాళ్లు పట్టుకుని షెడ్లోకి లాక్కెళ్లి కొడవలితో తలపై నరికి హతమార్చాడు. శనివారం తెల్లవారుజామున రాజప్ప రుద్రంపేట బైపాస్ మీదుగా కాలినడకన వెళుతుంటే పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్ట్ చేసి, హతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసులమంటూ కిడ్నాప్‌లు) -
నాగరాజుది హత్యే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో బయటికి వస్తానని, లాయర్లతో మాట్లాడాలని చెప్పిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య స్వప్న, బావమరిది శేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య పలు సంచల న ఆరోపణలు చేశారు. ఆయన చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. అసలు రూ. కోటి పది లక్షల లంచం కేసు తప్పుడుదని.. ఆయన్ను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. తాను, పిల్లలంటే ప్రాణమిచ్చే వ్యక్తి తన ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నించారు. ఈ విషయంలో జైలు అధికారులు, పోలీసులు, ఏసీబీ మీద తమకు న మ్మకం లేదన్నారు. ఆయన మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసేందుకు సీబీఐ విచారణ జరగాల్సిందేనని స్వప్న డిమాండ్ చేశారు. దాడులు జరిగిన ఆగస్టు 14 రాత్రి ఏసీబీ అధికారులే నగదు బ్యాగుల్లో తీసుకువచ్చారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని నాగరాజు చెప్పారన్నారు. అసలు టర్కీ టవల్‌తో ఉరివేసుకోవడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఆ సమయం లో నాగరాజుతోపాటు ఉన్నవారంతా ఎందు కు లేవలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం 3.30 గంటలకు నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే.. 6 గంటలు దాటాక తమ కు సమాచారం ఇచ్చారని వాపోయారు. అది ముమ్మాటికీ తప్పుడు కేసు.. రూ.కోటి పది లక్షల కేసు తప్పుడుకేసని నాగరాజు బావమరిది శేఖర్ ఆరోపించారు. ఆ మొత్తం ఏసీబీ వాళ్లే తీసుకువచ్చారని ధ్వజమెత్తాడు. ఈ మేరకు తమ వద్ద సీసీ టీవీ ఫుటేజీ ఉందని, వాటిని హైకోర్టుకు అందజేస్తామన్నారు. అసలు రూ.కోటి పదిలక్షల కేసు నిలవదని తెలిసాకే, నాగరాజును ఇరికించేందుకు నకిలీ పాసు పుస్తకాల కేసు పెట్టారని తెలిపారు. ఆత్మహత్యకు ముందురోజు వీడియో కాల్ నకిలీ పాసు పుస్తకాల జారీ కేసులో కందాడి ధర్మారెడ్డితోపాటు నాగరాజు మరో నలుగురిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఈ నెల 13, 14 తేదీల్లో నాగరాజును ప్రశ్నించేందుకు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీకి ఒక్కరోజు ముందు.. అంటే ఈ నెల 12న కుటుంబ సభ్యులతో నాగరాజు వీడియో కాల్లో మాట్లాడారు. ఆ కాల్ రికార్డును కూడా కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేశారు. అందులో ఏముందంటే.. తాను అన్ని పత్రాలు పరిశీలించాకే ముందుకు వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో చెప్పడం కనిపించింది. భయపడాల్సిన పనిలేదని, బెయిల్ వస్తుందని న్యాయస్థానంలో పోరాటం చేద్దామని నాగరాజుకు శేఖర్ ధైర్యం చెప్పడం వీడియోలో కనిపించింది. -
ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల తేడాలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల శాతాన్ని లెక్కిం చేందుకు ఎన్నికల సంఘానికి రెండు రోజుల సమయం ఎందుకు పట్టింది? ఈవీఎంలలో, వీవీ ప్యాట్లలో ఓట్ల తేడాలెందుకొచ్చాయన్న అనుమా నాలు నివృత్తి చేయాలన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన ప్రతిపక్షాలు పుంజుకున్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తే తన సర్వే ఫలితాలు తప్పని క్షమాపణలు కోరు తా నన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను వెల్లడించిన ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని, దీనికి గల కారణాలు బేరీజు వేసు కొని పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఫలితాలతో పాటు వెల్లడిస్తానని చెప్పారు. ఇక నుంచి తాను ఎన్ని కలకు ముందే సర్వే ఫలితాలను వెల్లడించబోనని చెప్పారు. కొన్నేళ్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నానని, ఎన్నడూ తప్పు చెప్పలేదన్నారు. బెట్టింగులు చేసేవా డినైతే తనకు కావాల్సిన వారికి అనుకూలంగా చెప్పు కొనే వాడినన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్ర బాబును కలిసి చర్చించిన విషయాలు బయటకు చెప్పుకొనేవైతే లోపల కూర్చొని ఎందుకు మాట్లాడు కుంటామని ప్రశ్నించారు. బయటకు చెప్పుకొనే విషయాలు కాదు కాబట్టే లోపల కూర్చొని మాట్లా డుకున్నామని, లేదంటే మీడియా ముందుకొచ్చే మాట్లాడుకొనేవారమని చెప్పారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదని, ఎంతో మందిని కలుస్తుం టానని, అలాగే బాబును కలిశానని చెప్పారు. బాబు అండ్ కో మళ్లీ దొంగ ఎత్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లపై లగడపాటి అను మానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉంటే ఇటీ వల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయానికి చేరువగా ఉన్న చంద్రబాబు, ఆయన కోటరీ, ఎల్లో మీడియా దొంగ సర్వేలు, ఇతర ఎత్తుగడలతో ప్రజలను మభ్యపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఓటమి గండం నుంచి గట్టె క్కేందుకు బాబు పడరాని పాట్లు పడుతున్నారు. హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో ప్రజలను ఏమార్చేం దుకు యత్నిçస్తున్నారు. లగడపాటి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలతో అర్ధరాత్రి వరకు తన నివాసంలో మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా లగడపాటిని బాబు తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా తెలం గాణలో ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తా రని చెప్పిన లగడపాటి పోలింగ్‌కు ముందు రోజు కూటమిదే విజయమన్నారు. కానీ, కూటమికి పరాభవం తప్పలేదు. ఇప్పుడు కూడా అవే ఎత్తుగడలతో బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టేలా వ్యూహాలు పన్నుతున్నారు. -
ఆమెకు 60 ఇప్పుడు అనుమానం
ఇంతకుముందు ‘ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్’ గురించి మాట్లాడాం. వృద్ధ దంపతులు.. పిల్లలు దగ్గర లేకపోవడం వల్ల ఎన్నో మానసిక వ్య«థలకు గురి అవుతారు.అలాంటి వ్యధే.. ‘లేట్ ఆన్సెట్ సైకోసిస్’ కూడా.పిల్లల్లాగే, భర్తా దూరమైపోతాడేమోనన్న మానసిక స్థితి ఇది. షష్టిపూర్తి అయిపోయినా.. దంపతులు ప్రేమించుకోవడమే కాదు.. ప్రేమను వ్యక్తం చేసుకోవడమూ అవసరమే అంటున్నారు డాక్టర్లు. అమ్మ ఎలా ఉంది నాన్నా? వారానికి ఒకసారి ఫోన్ మోగుతుంది. అమెరికా నుంచి అబ్బాయి. ‘ఎలా ఉన్నావు నాన్నా’ ‘బాగున్నారా’ ‘అమ్మ ఎలా ఉంది?’ ‘బాగుంది. దానికేం?’ ‘ఏమైనా కావాలా నాన్నా’ ‘నాకేం కావాలిరా? నీకేమైనా కావాలంటే చెప్పు పంపుతా’ ‘ఏం అక్కర్లేదు నాన్నా.. ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతుంది. ఉండనా?’ ఫోన్ పెట్టేస్తాడు. మరి కాసేపట్లో ఫోన్ మోగుతుంది. అమెరికా నుంచే.ఈసారి అమ్మాయి. ‘ఫోన్ దగ్గర పెట్టుకోండి నాన్నా. కాల్ చేసినప్పుడు ఎత్తరు’ ‘వాకింగ్‌కు వెళ్లానమ్మా’ ‘కాదులెండీ... అమ్మ ఏదో తెమ్మనుంటుంది వెళ్లుంటారు’ ‘సరిగ్గా చెప్పావు’‘అమ్మను మరీ గారాం చేస్తారు మీరు. అమ్మ ఎలా ఉంది? బాగుంది కదా’‘అయ్యో... దానికేం తల్లీ... బ్రహ్మాండంగా ఉంది’‘ఈ సంవత్సరం కూడా రావడం కుదిరేలా లేదు నాన్నా. పిల్లలకు ఎగ్జామ్సు. ఇంకా ఈయనకు కూడా లీవు దొరకదు’‘పర్లేదమ్మా... ఏం పర్లేదు. మీరు హ్యాపీగా ఉండండీ చాలు’‘థ్యాంక్యూ నాన్నా. ఉంటాను’ పెట్టేస్తుంది.అబ్బాయి ఒక మాట అని ఉంటే బాగుండేది.‘అమెరికాలో అన్నీ దొరుకుతున్నాయి... ఒక్క అమ్మానాన్న ప్రేమ తప్ప’ అని.అమ్మాయి ఇంకో మాట కూడా అనాల్సింది– ‘ఈసారి ఏమైనా సరే వచ్చి ఒక నెల రోజులు ఉంటాం నాన్నా’ అని. కొడుకు, కూతురు ఇలా ఫోన్ పలకరింపులు కాకుండా నేరుగా ఆ అమ్మానాన్నలను చూసి ఉన్నా, తమతో తీసుకెళ్లి ఉన్నా కథ వేరేగా ఉండేది. శ్రీనివాసరావు, సీత ఇద్దరూ ఆ కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ఇద్దరినీ ఎవరూ పేర్లతో పిలువరు. ఆయనను ‘సారు గారు’ అనీ ఆమెను ‘మేడమ్ గారు’ అని పిలుస్తారు. ఇద్దరూ కాలేజీలో లెక్చరర్లుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరూ ఒకప్పుడు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని వార్తలు సృష్టించారు. కులాలు వేరు కావడం వల్ల ఇరు వర్గాల వాళ్లు పిల్లలు పుట్టి కొంచెం పెద్దవాళ్లు అయ్యేవరకు కూడా దూరం పెట్టారు. ఆ తర్వాత కలిసినా మునుపటి బంధం మిస్సయినట్టే. అంతవరకూ సీతా మేడమ్‌కు భర్తే తోడు. పిల్లలు తోడు. కాలనీవాసులు తోడు. ఆయనకు ఆమె అంటే చాలా ప్రేమ. కొంగు పట్టుకునే తిరుగుతాడు. తనకు క్లాసులు లేకపోయినా ఆమెకు క్లాసులు ఉన్నంత వరకూ ఉండి ఇంటికి తీసుకువెళతారు. ఇద్దరికీ చదువు విలువ తెలుసు. కనుక పిల్లలను బాగా చదివించారు. పిల్లలూ బాగా చదువుకున్నారు కనుక అమెరికాలో స్థిరపడ్డారు. కొడుక్కు కోడలు అమెరికాలోనే దొరికింది. కూతురుకు అల్లుడూ అమెరికాలోనే దొరికాడు.రిటైరయ్యాక ‘ఇన్నాళ్లూ అలవాటు పడ్డ ప్రాణాలు ఇక్కడే ఉంటాం’ అని వాళ్లు అన్నారు. ‘లేదు.. మీరొచ్చి మా దగ్గర ఉండాల్సిందే’ అని పిల్లలు బలవంత పెట్టడం మర్చిపోయారు. ఒకరోజు శ్రీనివాసరావు బజారు నుంచి వచ్చేసరికి సీత వీధిలోనే నిలబడి అనుమానంగా చూస్తూ ఉంది.‘ఏమిటి?’ అన్నాడాయన గేటు వరకూ వచ్చాక.‘అదే... ఎవత్తది’ అందామె.‘మీరు వీధి చివర ఎవర్తోనో కబుర్లు చెప్పి వచ్చారు. ఏమీ ఎరగనట్టు నాటకాలాడుతున్నారే’ అంది.శ్రీనివాసరావుకు అయోమయంగా అనిపించింది.‘ఎవర్తోనూ మాట్లాడలేదే’‘అన్నీ గమనిస్తున్నాను. ఈ వయసులో మీకు వేషాలు మొదలయ్యాయి. ఎవరితోనో పోయి నా కొంప ముంచడానికేగా’ ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుని పోయింది.శ్రీనివాసరావు జీవితంలో దురదృష్టకరమైన దశ నాటితో మొదలైంది. అతనికి అరవై ఆరు. ఆమెకు అరవై. ఈ వయసులో ఒక మధురమైన జీవితం గడపాలని అనుకున్నాడు శ్రీనివాసరావు. ప్రేమ వివాహం కావడం వల్ల, పెద్దల ఆదరణ లేకపోవడం వల్ల, పేదరికం నుంచి రావడం వల్ల, ఉద్యోగమే సర్వస్వమనుకుని చేశాడు. ఆమె కూడా అంతే కష్టపడింది. ఇన్నాళ్లకు బాధ్యతలు తీరి సంతోషాలు పంచుకుందామనుకుంటే ఈ సమస్య వచ్చిపడింది. అనుమానం. తీవ్ర అనుమానం. అతడు ఏం చేస్తున్నాడు... ఎవరితో మాట్లాడుతున్నాడు... ఇంట్లో నుంచి ఎన్నింటికి బయటకు వెళ్లి ఎన్నింటికి వస్తున్నాడు... ఇవన్నీ ఆమె ఆరా తీసేది. అసలు ఏమీ చేయకుండా కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నా ‘ఎవరిని చూస్తున్నారు?’ అని వెనగ్గా వచ్చి అడిగేది.శ్రీనివాసరావు మెల్లగా కాలనీలో ఆడవాళ్లతో మాట్లాడటం మానేశాడు. అప్పుడప్పుడు డౌట్స్ కోసం గర్ల్ స్టూడెంట్స్ వచ్చేవారు. వాళ్లను రాకుండా చేశాడు. సమస్య సాల్వ్ కాలేదు.చివరికి పనిమనిషిని కూడా తీసేయాల్సి వచ్చింది. ఊహు... లాభం లేకపోయింది. అతడికి కోపంగా ఉంది. బాధగా ఉంది. భార్య మీద ప్రేమ క్షణక్షణానికి తరిగిపోయి విసుగూ చిరాకూ ఎక్కువవుతున్నాయి. పిల్లలకు చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇరుగూ పొరుగూ వారికి చెప్తే పరువు పోతుందని అదో భయం.లోపల లోపల నలిగిపోయి ఒళ్లు అలసిపోయి ఒంటిమీద స్పృహలేనట్టు నిద్ర పోతున్నా ఆమె అనుమానంగా వచ్చి అతడి గదిలో తొంగి చూసేది. ‘దీనిని లేట్ ఆన్సెట్ సైకోసిస్ అంటారు’ అన్నాడు సైకియాట్రిస్ట్ ఆమెను తీసుకొని వచ్చిన శ్రీనివాసరావుతో.‘ఆమె లోలోపల ఏదో తీవ్రమైన భయం ఉంది. పిల్లలు ఎలా అయితే తనను వదిలి వెళ్లిపోయారో మీరు కూడా అలా వదిలివెళ్లిపోతారనే భయం గూడుకట్టిపోయింది. అనుమానం హేతువును తినేస్తుంది. మానసిక అస్థిమితం చిత్తాన్ని దెయ్యాల కార్ఖానా చేసేస్తుంది. మనం చాలా ప్రయత్నించాలి. మందులతోనూ మందులు లేకుండానూ’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘ఇదేం జబ్బు డాక్టర్. ఎవరికైనా చెప్పుకోవడానికైనా సిగ్గుగా ఉంది. ఈ వయసులో నా మీద అభాండాలు వేస్తుందంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ ట్రీట్మెంట్ను సీక్రెట్‌గా పెట్టి చేయండి’ రిక్వెస్ట్ చేశాడు శ్రీనివాసరావు.‘చూడండి శ్రీనివాసరావుగారూ... అసలు ముందు మనం చేయాల్సిన పని మీ పిల్లలను ఇన్వాల్వ్ చేయడమే. ఎందుకంటే, మీరు బయటి వ్యక్తి. కాని పిల్లలు ఆమె లోపలి నుంచి వచ్చారు. తల్లికి పిల్లల స్పర్శ, స్పందన, పరామర్శ, ఎదురుగా ఉండటం ఇవెప్పుడూ ఆమెకు బలాన్ని ఇస్తాయి. ఆమెకు ఏ అనారోగ్యం వచ్చిందో ఆమెకు తెలియదు. ఆమె బిహేవియర్ కూడా ఆమెకు గుర్తు ఉండదు. మెల్లగా ఆమెను పిల్లల్లో పడేయండి. మందులు ఇద్దాం. కౌన్సెలింగ్ కూడా చేద్దాం’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘అలాగే మీరు కూడా మీలో ఉన్న ప్రేమ ఆమెకు తెలిసేలా చేయండి. మీరు ఆమెను ప్రేమించే రోజుల్లో ఎన్నో ప్రేమలేఖలు రాసి ఉంటారు. నువ్వంటే నాకు ప్రేమ అని ఉంటారు. అని పెళ్లయ్యాక ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ మాట అని ఉండరు. అన్నారా?’‘లేదు డాక్టర్’‘అనుమానం జబ్బు కానీ ప్రేమ ఆశించడం జబ్బు కాదు. మీ ప్రేమ ప్రదర్శనే ఆమెకు సగం మందు. మగవాళ్ల ప్రపంచాన్ని ఫిల్ చేయడానికి చాలా ఉంటాయి. కాని స్త్రీల ప్రపంచాన్ని ఫిల్ చేసేది మాత్రం తన కుటుంబ సభ్యుల ఆప్యాయత, కన్సర్న్ మాత్రమే’.... రోజులు గడిచాయి. మొదటిసారి వీసాలు కట్టించుకుని శ్రీనివాసరావు, సీత అమెరికా వెళ్లారు.కొడుకు, కూతురు ఇద్దరూ అక్కడి నుంచే డాక్టర్‌తో ఆమెకు తెలియకుండా మాట్లాడారు.ఒడిలో ఎగిరొచ్చి కూచునే మనవడు ఆమెకు సగం నయం చేశాడు. ఆమె దగ్గర వేమన పద్యం అతి కష్టం మీద నేర్చుకున్న మనవరాలు మరో సగం నయం చేసింది. శ్రీనివాసరావు చాటుమాటుగా అందించే ప్రేమలేఖలు ఆమె సిగ్గులమొగై్గ అందుకుంటోంది.‘అమ్మ ఎలా ఉంది’ అని ఫోన్లో అడిగితే అమ్మకు ఎప్పుడూ నయం కాదు.అమ్మ సమక్షంలో అమ్మతో గడిపితేనే అమ్మ ఎలా ఉందో తెలుస్తుంది. ‘మా అమ్మ చాలా బాగుంది’ అని నమ్మకంగా చెప్పగలిగే పిల్లలు ఇప్పుడు ఎందరు ఉన్నారు? – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
వాట్శాపం.. పెనుభూతం
అనుమానం పెనుభూతం అంటారు. వాట్సాప్ ఇప్పుడు శాపంలా, భూతంలా తయారైంది!భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తెస్తోంది. వీళ్ల అపోహల్ని, అపార్థాల్నీ చూస్తుంటే..పెళ్లి ముందా... అనుమానం ముందా.. అనే డౌట్ వస్తోంది.ఏది ముందైనా.. నమ్మకం వాటికి ముందుంటే...దంపతులను ఈ వాట్సాప్‌లు శపించలేవు.భూతాలై ఆలూమగల అనురాగాన్ని కబళించలేవు. ఇదే ఈవారం మైండ్ స్టోరీ. ‘డాక్టర్ ఇదీ కేసు’ అన్నాడు భార్యాభర్తలు వారిరువురూ. ఆమె పేరు సంధ్య. అతడి పేరు విజయ్. పదేళ్లయ్యింది పెళ్లయ్యి. ఆమె ఇంట్లో ఉంటుంది. అతడు ఆఫీసుకు వెళతాడు. వాళ్లకో పాప. మూడో క్లాస్ చదువుతోంది. సంధ్య ఉదయాన్నే లేచి పాపను నిద్రలేపి స్కూల్‌కు రెడీ చేస్తుంది. విజయ్ ఈలోపు కొంచెం టీ పెట్టుకొని తాగి పాపను స్కూల్ బస్‌లో చేరవేస్తాడు. పాప వెళ్లిపోయాక విజయ్ రెడీ అయ్యేంత సేపు వాళ్లు గతంలో బాగా కబుర్లు చెప్పుకునేవారు. విజయ్ బాగా నవ్విస్తాడు. సంధ్య బాగా నవ్వుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయంలో ఈ పక్క ఫ్లాట్ వాళ్ల మీదో ఆ పక్క ఫ్లాట్ వాళ్ల మీదో ఏవో జోకులు నడుస్తాయి. ఆ తర్వాత అతను ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆమె ఇంటి పనుల్లో పడుతుంది. అయితే ఈ మధ్య బ్రేక్‌ఫాస్ట్ కబుర్లు నడవడం లేదు.ఆ సమయంలో ఇద్దరూ ఫోన్ చూసుకుంటూ ఉంటారు.అపార్ట్మెంట్లో ఉన్న 70 ఫ్లాట్లలోని ఆడవాళ్లందరూ ఒక గ్రూప్ పెట్టుకున్నారు. సంధ్య ఆ గ్రూప్‌లో బిజీగా ఉంటుంది. అది కాకుండా సంధ్య వాళ్ల పుట్టింటి గ్రూప్ ఒకటి ఉంది. ఆ తర్వాత కాలేజీ ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది. ఇవి కాకుండా తెలిసినవాళ్లతో పిచ్చాపాటి చాటింగ్ కూడా ఉంటుంది.విజయ్ కూడా వాట్సాప్‌లో తక్కువ తినలేదు. ఆఫీస్ గ్రూప్ ఒకటి తప్పనిసరి. ఇది కాకుండా అతడికి చేపలు పట్టడం సరదా. రెండు మూడు వారాలకు ఒక గ్రూప్‌తో కలిసి చుట్టుపక్కల చెరువులకు, ఒక్కోసారి చాలా దూరం వెళ్లి నదుల ఒడ్డున చేపలు పడుతుంటాడు. అదో గ్రూప్ ఉంది. జోకుల గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఆయుర్వేదం గ్రూప్ ఒకటి.ఈ గ్రూపుల్లోని బ్లింక్లతోటే కాలం గడుస్తూ ఉంది.కాలం అలాగే గడిచినా సమస్యలేమీ లేకపోవు.కానీ ఈలోపు ఉన్నట్టుండి ఒకరోజు సంధ్య స్నేహితురాలు భార్గవి సంధ్య ఇంటికి వచ్చింది. సమస్య అక్కణ్ణుంచే మొదలైంది. ‘ఓ... ఎంత బాగుందో మీ ఇల్లు’ అంది భార్గవి సంధ్య ఇంటిని చూస్తూ.‘ఇందులో నా టేస్ట్ కన్నా మా ఆయన టేస్టే ఎక్కువ’ అంది సంధ్య గర్వంగా.‘అబ్బో.. అంత మంచి టేస్ట్ ఉన్న మీ ఆయన్ను పరిచయం చేసుకోవాల్సిందే’ అంది భార్గవి.అది సాయంత్రం వేళ కావడం, ఆ రోజు విజయ్ అనుకోకుండా తొందరగా ఇల్లు చేరడంతో భార్గవికి విజయ్‌ని పరిచయం చేసింది సంధ్య.‘ఓ... మీరు కూడా గులాబీ టీమేనా?’ అన్నాడు నమస్తే పెడుతూ విజయ్.భార్గవి ఉలిక్కి పడింది.‘లె..లె..లేదే’‘మాకు తెలుసులేండీ. సంధ్య చెప్పింది. గులాబీ సినిమా చూసి ముక్కు మొహం తెలియనివారికి ఫోన్ చేసి ప్రేమిస్తున్నామంటూ ఏడిపించేవారంట గదా మీ ఫ్రెండ్సంతా. మీరా టీమ్‌లో లేరా?’‘నిజానికి ఆ అల్లరి మొదలెట్టిందే ఈ పిల్ల’ అంది సంధ్య.‘ఆ రోజుల్లో అంటే మీ అల్లరి నడిచింది. ఇప్పుడైతే ఏ నంబర్ నుంచి చేస్తున్నారో క్షణాల్లో తెలిసిపోతుంది’ నవ్వుతూ అన్నాడు విజయ్.‘తెలియని వాళ్లతో ఎందుకండీ. తెలిసినవాళ్లతోనే బోల్డన్ని కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు. అన్నీ ఫ్రీ సిమ్‌లు. వైఫైలు. వాట్సాప్‌లు’ భార్గవి కూడా నవ్వింది.వాళ్లు ఈ ఊరు కొత్తగా వచ్చారట. దొరక్క దొరక్క సంధ్య దొరకడంతో తరచూ రాకపోకలు సాగాయి. సంధ్య ఊరికే ఉండకుండా ‘ఒక్కోసారి ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాను. ఎందుకైనా మంచిది మా వారి నంబర్ కూడా పెట్టుకో’ అని విజయ్ నంబర్ ఇచ్చింది.‘మీ ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది. బావగారూ ఇవాళ సంధ్య దోసకాయ కూర చేసిందట. మీకు పస్తే. దానికా కూర చేయడం రాదు’ అని నవ్వాడు విజయ్.‘దానికి వంకాయ కూర చేయడం కూడా రాదు. నాకు వంకలు పెడుతుందా’ సంధ్య కూడా నవ్వింది.‘మీ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ చెప్పింది. పార్టీ కావాలట’‘దాందేముంది పచ్చిమిరపకాయ పులుసు రెడీగా ఉందని చెప్పండి’ సంధ్య జోక్‌గా అంది.వెంటనే భార్గవి వాట్సాప్ అకౌంట్లో విజయ్ పచ్చిమిరపకాయల గంప ఫొటో పెట్టి స్మైలీ పెట్టాడు. ఒకరోజు విజయ్ ఫోన్‌ను క్యాజువల్‌గా చూస్తూ ఉంది సంధ్య. ఫోల్డర్లో భార్గవి ఫొటో కనిపించింది. ఆశ్చర్యపోయింది. భార్గవి ఫొటో విజయ్ ఫోన్లో ఎందుకు ఉన్నట్టు?‘భార్గవి ఫొటో ఉందేంటి?’‘నీకు పెట్టబోయి నాకు పెట్టిందట. డిలీట్ చేసేలోపే నా ఫోల్డర్లో పడిపోయినట్టుంది’ అన్నాడు విజయ్ క్యాజువల్‌గా.సంధ్యకు కూడా గుర్తొచ్చింది అదే ఫొటోను తనకు కూడా పెట్టింది భార్గవి. కానీ ఎందుకో చిన్న అనుమానం.చిన్నదా?ఆ రోజు నుంచి సంధ్య గూఢచర్యం పెరిగింది. విజయ్ స్నానానికి వెళ్లినప్పుడు, వాకింగ్‌కు వెళ్లినప్పుడు, లేదా పాపను తీసుకుని కిందకు వెళ్లినప్పుడు ఫోన్ చెక్ చేసేది. వాట్సాప్‌లో భార్గవి అకౌంట్ ఓపెన్ చేసి చూసేది. గుడ్ మార్నింగ్ అని, నమస్తే అని, హ్యాపీ శాటర్డే అని ఇలాంటి మెసేజ్‌లు ఉండేవి. ఒక్కోసారి చాట్ క్లియర్ చేసినట్టుగా క్లీన్‌గా ఏ మెసేజ్ కనిపించేది కాదు. అంటే మాట్లాడుకుని చాట్ డిలీట్ చేశారా? అసలు వాళ్లు మాట్లాడుకునే ఉండకపోవచ్చు కదా అని ఆమె అనుకునేది కాదు. విజయ్ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘కొత్త ఫోన్ చాలా బాగుందండీ. థ్యాంక్యూ’‘నీ కోసమే కొన్నానోయ్. వాట్సాప్‌లో మాట్లాడుకోవచ్చుగా’‘అవును. అన్నింటికీ ఫోన్ చేయడం ఎందుకూ?’‘ఇక అన్నం పెడతావా?’‘అన్నం పెడతాను. దానికి ముందు హగ్ కూడా ఇస్తాను’ఆమె నవ్వేసింది. అతడు దగ్గరకు తీసుకున్నాడు. రాను రాను సంధ్యకు ఈ అనుమానం ముదిరింది.ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా తన ఫోన్లో వాట్సప్‌కు వెళ్లేది. అందులో విజయ్ అకౌంట్ చూసేది. లాస్ట్ సీన్ టైమ్‌కు, భార్గవి అకౌంట్లోని లాస్ట్ సీన్ టైమ్‌కు పొంతన లేకపోతే సంతృప్తిగా ఊపిరి పీల్చుకునేది. అవి రెండూ దగ్గర దగ్గరగా ఉంటే కలవర పడేది.ఇంకా ఘోరమైన విషయం ఎప్పుడు మొదలైందంటే ఒకరోజు విజయ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే భార్గవి అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. అదీ ఆన్లైన్ అని చూపిస్తూ ఉంది. ఒకేటైమ్‌లో ఆన్లైన్లో ఉన్నారంటే వీళ్లిద్దరూ చాటింగ్‌లో ఉన్నట్టేగా?ఆ క్షణమే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.‘డాక్టర్ ఇదీ కేసు’ అన్నాడు విజయ్ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘మీరు బయటకెళ్లండి’ అన్నాడు విజయ్‌తో.ఆ తర్వాత సంధ్యతో మాట్లాడటం మొదలెట్టాడు. ‘చూడమ్మా... నీ భర్త సంగతి తర్వాత ఆలోచిద్దాం.. ముందు నువ్వు నీ స్నేహితురాలిని అవమానిస్తున్నావని అనుకోవడం లేదా? ఆమె నిన్ను అక్కగా నీ భర్తను బావగారిలా భావించి గౌరవిస్తుంటే నువ్వు అవమానిస్తావా? ఈ సంగతి ఆమెకు తెలిస్తే ఎంత బాధ పడుతుంది? ఇక నీ భర్త ఇన్నాళ్లలో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. పరిచయం చేసింది నువ్వే. పలకరించేలా చేసిందీ నువ్వే. వాళ్లలా మాట్లాడుకుంటే కలవరపడుతున్నదీ నువ్వే. మనిషి కంటే ఎక్కువగా యంత్రాన్ని నమ్ముకుంటే వచ్చే ప్రమాదాలు ఇవి. వాట్సాప్ ఆన్ చేసి వేరే పనుల్లో పడినా ఆన్లైన్ అనే చూపిస్తుంది. ఆఫీస్ మెసేజుల్లో ఉన్నా ఆన్లైనే అని చూపిస్తుంది. అసలు మీ మధ్య ఫోన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే దూరం పెరిగి ఆ ఖాళీలో చేరవలసిన చెత్తంతా చేరుతోంది. టెక్నాలజీని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్ పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం. అందులో మీరూ మీ వారు భార్గవి భార్గవి భర్త ఉండండి. అక్కడ మాట్లాడుకోండి. మీ నలుగురూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడమే నేను ప్రిస్క్రైబ్ చేయగల మెడిసిన్. ఆ మెడిసిన్‌ను తీసుకుంటావా?’సంధ్య తెరిపిన పడ్డట్టు చూసి లేచింది.బహుశా వాళ్ల భోజనంలో ఏమేమి వండాలన్న చర్చ కొత్త గ్రూప్‌లో నలుగురి మధ్య నవ్వులతో సాగుతుండవచ్చు. – ఇన్పుట్స్: కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
డోపింగ్‌లో దొరికిన నిర్మల
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ నిర్మలా షెరాన్ డోపింగ్‌లో దొరికింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షల్లో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్మలపై వేటు వేసింది. జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పోటీపడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఈ డోపింగ్ వ్యవహారంపై ఏఎఫ్ఐ చీఫ్ అదిలె సుమరివాలా స్పందించారు. ‘ఆసియా క్రీడల కోసం ఏఎఫ్ఐ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలకు నిర్మలా ఎప్పుడూ హాజరు కాలేదు. ఎక్కడ ఉందో అనే వివరాలను మాకెప్పుడు చెప్పలేదు. అందుకే రిలే ఈవెంట్లలో ఆమెను ఎంపిక చేయలేదు. డోపీగా తేలడంతో నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం’ అని సుమరివాలా అన్నారు. -
అలోక్ వర్మ నివాసం వద్ద కలకలం
-
వర్మ నివాసం వద్ద నలుగురు అనుమానితుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ఉన్నతాధికారుల మధ్య విభేదాల నేపథ్యంలో సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచిరిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం ఉదయం సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను సెలవుపై పంపిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వీరు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులను ధరించి ఉన్నట్టు గుర్తించారు. వర్మ నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న అనుమానితులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరి గురించి ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను సమర్పించేందుకు ఆయన సహకరించడంలేదని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆరోపించింది. కమిషన్ విధినిర్వహణను ఉద్దేశపూర్వకంగా వర్మ అడ్డుకున్నారని తేటతెల్లమైందని సీవీసీ స్పష్టం చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ ఆస్ధానా దర్యాప్తు ఏజెన్సీ విచారణలకు ఆటంకాలు కల్పిస్తున్నారని వర్మ ఆరోపించారు. -
ఈసారైనా... వస్తారా
వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.. హిందీ మూవీ ‘పరమాణు’ థియేటర్లోకి రావడానికి. నిజానికి ఈ సినిమాను గతేడాది డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ‘పద్మావతి’ మూవీ ఎఫెక్ట్‌తో కుదర్లేదు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌కు మోక్షం లభించలేదు. రీసెంట్గా నిర్మాతలకు గొడవలు అయ్యాయి. అంతే.. సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు మరో రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది చిత్రబృందం. మే 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి.. ఈసారైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో? లేదో తెలియాలంటే మరో నెల రోజులు ఆగక తప్పదు. జాన్ అబ్రహాం, డయానా పెంటీ, బొమన్ ఇరానీ ముఖ్య తారలుగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పరమాణు’. క్రీర్జ్ ఎంటర్టైన్మెంట్, జేఏ ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియోస్, కైట ప్రొడక్షన్స్ నిర్మించాయి. పొఖ్రాన్–2 అణుపరీక్షల బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించారు. ‘‘చరిత్రను చూపించడం అంత ఈజీ కాదు. న్యూక్లియర్ స్టేట్‌కి వచ్చే దారి ఫుల్ ఆఫ్ చాలెంజెస్‌తో ఉంది. సినిమాను మే 25న రిలీజ్ చేయనున్నాం’’ అని జాన్ అబ్రహాం పేర్కొన్నారు. -
యూపీ ‘9వ అభ్యర్థి’ ఆశలపై నీళ్లు!
లక్నో: యూపీ రాజ్యసభ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెందిన తొమ్మిదో అభ్యర్ధి విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 23వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకుగాను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సహా తొమ్మిది మందిని బీజేపీ బరిలోకి దించింది. బీజేపీ సంఖ్యాబలం ప్రకారం 8మంది గెలుపు ఖాయం కాగా 9వ అభ్యర్ధి విజయానికి ఎస్బీఎస్పీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లే కీలకం కానున్నాయి. ‘మేం అధికార కూటమి పార్టీగా కొనసాగుతున్నాం. అయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల విషయం బీజేపీ మాతో చర్చించలేదు. వారి వద్దకు మేమే వెళ్లి మీకు ఓట్లేస్తాం అని చెప్పాలా? బీజేపీకి ఓటేసే విషయం చర్చించి నిర్ణయిస్తాం’ అని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ విలేకరులతో అన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని గోప్యంగా ఉంచడం, మీడియాను అనుమతించకపోవడం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాల నిరంకుశ, నియంత్రత్వ విధానాలకు నిదర్శనమన్నారు. నెత్తుటి మరక ఉండని తెలంగాణ అంటే ఇలాంటి పాలనేనా అని ప్రశ్నించారు. సుప్రీం జడ్జితో విచారణ చేయించాలి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ చంద్రన్న డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ట్రంప్ బుర్ర గట్టిదే..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71) మానసిక ఆరోగ్యంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో శ్వేతసౌధం వైద్యుడు డా.రానీ జాక్సన్ అధ్యక్షుడికి జరిపిన పరీక్షా ఫలితాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ట్రంప్ మానసిక స్థితి సరిగానే ఉందనీ, ఈ పరీక్షల్లో ట్రంప్ 30కి 30 పాయింట్లు సాధించారని తెలిపారు. జంక్ ఫుడ్ తీసుకున్నా ఆరోగ్యంగా ఉండటానికి ట్రంప్ జన్యువులే కారణమన్నారు. గత 20 ఏళ్లలో మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని ఉంటే మరో 200 ఏళ్లు బతికేవారని తాను ట్రంప్‌తో చెప్పినట్లు జాక్సన్ వెల్లడించారు. మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ పేరిట దేశాధ్యక్షుడికి ఉన్న ఏకాగ్రత, మనసును లగ్నంచేసే తీరు, జ్ఞాపకశక్తి, భాష, గణన సామర్థ్యం వంటి అనేక అంశాలపై ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో మెదడు పనితీరుకు సంబంధించి ట్రంప్‌నకు సమస్యలేవీ లేవని తేలిందన్నారు. ట్రంప్ స్వయంగా కోరడంతోనే ఈ పరీక్షను నిర్వహించినట్లు డా.జాక్సన్ స్పష్టం చేశారు. ఈ పరీక్షలో 30కి 26 పాయింట్లు వస్తే మెదడు సక్రమంగా పనిచేస్తున్నట్లేనని తెలిపారు. ఇటీవల విడుదలైన పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’లో అధ్యక్షుడి మానసిక ఆరోగ్యంపై ఆయన సహాయకులకే అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో సైనిక వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 6.3 అడుగుల ఎత్తున్న ట్రంప్ 108 కిలోల బరువున్నారని జాక్సన్ తెలిపారు. -
నా భర్తను హత్యచేశారు
నందలూరు : ఆడపూరు పంచాయతీ పరిధిలోని మర్రిపల్లె దళితవాడ సమీపంలో ఈనెల 18వ తేదీన కుప్పాల వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతుని భార్య వరలక్ష్మి, కుమారులు సాయి, మణిశేఖర్లు పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారాల నిమిత్తం తన భర్త ఒంటిమిట్టలోని బ్రాంది షాపులో రూ.8లక్షలు, నందలూరు మండలం మర్రిపల్లెలోని పూలతోటపై రూ.3లక్షలు పెట్టుబడి పెట్టాడని తెలిపారు. తన కుమారుడి ఉద్యోగం కోసం డబ్బులు కావాలని, తాను పెట్టుబడిన పెట్టిన డబ్బులు మొత్తం రూ.11 లక్షలు ఇవ్వాలని పూలతోట యజమానిని అడుగుతూ వచ్చాడన్నారు. దీంతో తోటయజమాని ప్రసాద్ నేడు, రేపు ఇస్తానంటూ తిప్పుకుని చివరకు హత్యచేశాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హత్య జరిగే ముందురోజు మధ్యాహ్నం కూడా తన భర్తతో తాను ఫోన్లో మాట్లాడానని, ఇంకా భోజనం చేయలేదని, తోట యజమాని ప్రసాద్ తనకు భోజనం తీసుకువస్తాడని చెప్పాడన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఫోన్ స్విచ్ఆఫ్ అని వచ్చిందని తెలిపారు. తన భర్త మరణించిన విషయం తోట పక్కన ఉన్న మరో వ్యక్తి తమకు తెలిపాడన్నారు. మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని ఆయన చేతులు, కాళ్లపై గాయాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ హత్యలో రాజంపేట మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, తోట కాపలాదారుడు పెంచలయ్యల హస్తం కూడా ఉందన్నారు. ఈ ముగ్గురిని విచారించి నిజానిజాలు వెలికితీసి తమకు న్యాయం చేయాలని స్థానిక ఎస్ఐ ప్రతాప్‌రెడ్డిని కోరారు. ఈ సంఘటనపై ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
రెవెన్యూ, బ్యాంకు అధికారుల హస్తం..?
♦ ‘నకిలీ పట్టా పాసుపుస్తకాల వ్యవహారంలో అనుమానాలు ♦ నగరంలోని బ్యాంకుల్లో పోలీసుల సోదాలు సంగెం(పరకాల) : నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో బ్యాంకు, రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పాసుపుస్తకాల కేసులో ప్రధాన నిందితుడు బిచ్చా దొరికితే ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందో వెల్లడయ్యే అవకాశముంది. కాగా బుధవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం ఎస్సై.. వరంగల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో విచారణ చేపట్టారు. సంగెం, నెక్కొండ మండలాల నుంచి రుణాల కోసం సుమారు 20కి పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో గుగులోత్ తారాచంద్(ఎల్గూర్ స్టేషన్), ధరావత్ రాంజీ, బానోత్ సరోజన(తీగరాజుపల్లి), లావుడ్యా వినోద (చంద్రుగొండ), ధరావత్ రాజు, ధరావత్ సురేష్, భూక్యా రేణుక(బంజరపల్లి)ల దరఖాస్తులను నకిలీవని గుర్తించి తిర స్కరించామని బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు ఎస్సై దీపక్ తెలిపారు. మిగిలినవి నకలీవని చెప్పలేమని వారు చెప్పినట్లు ఎస్సై దీపక్ తెలిపారు. అధికారులకు వాటాలు? ఈ ‘నకిలీ’ వ్యవహారం తెలిసి కూడా బ్యాంకు అధికారులు.. నిందితులతో కుమ్మక్కై తమ వాటాగా 15 శాతం తీసుకుని రుణాలు మం జూరు చేసినట్లు తెలుస్తోంది. సంగెం సొసైటీ, ఆంధ్రా బ్యాంకుతో పాటు గీసుకొండ మండలం ఊకల్‌లోని కార్పొరేషన్ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తెలిసంది. నిందితుడు బిచ్చా.. పాసుపుస్తకాలు తయారు చేసి ఎకరాకు రూ.10వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే, బ్యాంకుల వద్ద కొందరు ఏజెంట్లుగా వ్యవహరించి రుణాలు ఇప్పించారని, అందులో 15 శాతం అధికారులకు, 15 శాతం ఏజెంట్లు వసూలు చేయగా మిగిలిన మొత్తం సంబంధిత రైతులకు ఇచ్చేవారని సమాచారం. కాగా నిజమైన రైతులు వెళ్లి రుణం కావాలని బ్యాంకు అధికారులను అడిగితే ఎన్నో కొర్రీలు పెట్టే బ్యాంకు అధికా>రులు.. అక్రమార్కులతో చేతులు కలిపి అడ్డగోలుగా రుణాలు మంజూరు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. కాగా నిందితుడి ఇంటిలో భారీ మొత్తంలో ఖాళీ పాసుపుస్తకాలు లభించడంతో రెవెన్యూ శాఖ లోని సిబ్బంది హస్తం ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పాసుపుస్తకాలు సైతం నకిలివా లేదా కార్యాలయం నుంచే నిందితుడికి అందాయా అని చర్చించుకుంటున్నారు. నిందితుడు చదివింది పదో తరగతే.. వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, సబ్రిజిస్టార్ల సంతకాలను ఫోర్జరీ చేసిన నిందితుడు బిచ్చా చదివింది కేవలం పదో తరగతే. నకిలీ పాసుపుస్తకాల తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే నిందితుడికి కొందరు విద్యావంతులు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సహకరించిన అధికారులు.. తమ బండారం బయటపడుతుందేమోనని భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. బిచ్చాను పట్టుకుని విచారిస్తే ఈ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారుల వివరాలు వెలుగులోకి వస్తాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పెండ్లిమర్రి: కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని వైవీయూ బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్లటూరుకు చెందిన పుల్లయ్య(40), మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి(38) మృతి చెందారు. హరీష్(10)కు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వెల్లటూరుకు చెందిన పుల్లయ్య, శేఖర్‌రెడ్డిలు సొంత పని నిమిత్తం కడపకు వెళ్లి పని ముగించుకొని స్వగ్రామానికి రెండు ద్విచక్ర వాహనాల్లో మాట్లాడుకుంటూ వస్తుండగా వైవీయూ బైపాస్ రోడ్డు వద్ద వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పుల్లయ్య, శేఖర్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందారు. పుల్లయ్య కుమారుడు హరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని కడప రూరల్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐ రోషన్లు పరిశీలించారు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదామా...హత్యచేశారా? పుల్లయ్య,శేఖర్‌రెడ్డిలు ఇద్దరూ వ్యాపారులే. వ్యాపార లావాదేవీల కారణంగా ఎవరైనా రోడ్డు ప్రమాదం జరిగేలా చేశారా లేక వాహనాలతో గుద్ది చంపారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ ఒకే వాహనంలో కాకుండా రెండు వాహనాల్లో వస్తున్నా శేఖర్‌రెడ్డికి బలమైన గాయాలు ఉన్నాయి. పుల్లయ్యకు పెద్దగా గాయాలు కనిపించడం లేదు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
మూసీలో పసికందు మృతదేహం
చాదర్‌ఘాట్: రెండు రోజుల పసికందు మృతదేహం మూసీలో లభ్యమైంది. చాదర్‌ఘాట్ ఎస్ఐ సాయికుమార్ కథనం ప్రకారం...వాహెద్‌నగర్ ప్రాంతంలోని మూసీకాలువలో సోమవారం మగశిశువు మృతదేహం పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు వెలికి తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. శిశువు చనిపోతే ఎవరైనా కాలువలో పడేశారా? లేక బతికుండగానే కావాలని నీటిలోకి విసిరేశా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సివిల్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు
శేకూరు(చేబ్రోలు): ఓ సివిల్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు వ్యక్తం కావటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 25రోజుల తరువాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన చేబ్రోలు మండలం శేకూరుపాలెంలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... శేకూరుపాలెంకు చెందిన నెమలికంటి సురేష్‌బాబు (37) నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం లోయపల్లి ప్రాంతంలో ఓఎన్సీ ప్రైవేటు లిమిటెడ్ నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్కు సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 10వ తేదీన శేకూరుపాలెం వచ్చిన సురేష్‌బాబు అక్కడ విధులు నిర్వహించటం కష్టంగా ఉందని, కంపెనీ ఎండీ, జీఎంలు తనపై కక్ష పెట్టుకున్నట్టు భార్యకు తెలిపారు. నెల జీతం తీసుకుని రాజీనామా చేసి వస్తానని కూడా తెలిపినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, గతనెల 15వ తేదీన గుండె నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో సురేష్‌బాబు మృతిచెందినట్టు అక్కడ కంపెనీ యాజమాన్యం తెలిపింది. బిల్డింగ్ మెట్లపై పడిపోయిన సురేష్‌బాబును స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు, తరువాత వరంగల్లు తీసుకుని వెళ్లినట్లు కంపెనీ వారు చెబుతున్న మాటల్లో విశ్వసనీయత లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 16వ తేదీన మృతదేహాన్ని అక్కడ నుంచి తీసుకువచ్చి 17వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం ముఖంపై గాయాలు, శరీరం అంతా నల్లగా మారిపోవటంతో విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ భార్య నెమలికంటి చిన్ని వరంగల్లు పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ కమిషన్,మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై మెడికల్ ఫోరెనిక్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శేకూరుపాలెం శ్మశాన వాటికలో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. వరంగల్లు పోలీసులతో పాటు, చేబ్రోలు ఎస్ఐ కె.ఆరోగ్యరాజు, తహశీల్దారు కె.శివరామప్రసాద్, మతుని కుటుంబసభ్యులు హాజరయ్యారు. -
సాదా బైనామాపై పలు సందేహాలు
కొత్తగూడెం : సాదా బైనామాపై సవాలక్ష సందేహాలు.. అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడేందుకు.. మరికొందరు ఎలాగైనా తమ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సైతం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు పహాణీలోకి ఎక్కకపోవడం.. పట్టాదారు పాస్‌పుస్తకాలు సైతం లేకపోవడం తో ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భూములను పహాణీలో ఎక్కించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో మై దాన ప్రాంత పరి స్థితులు వేరే ఉండగా.. ఏజెన్సీలో మా త్రం దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1969 తర్వాత గిరిజనేతరు లు క్రయవిక్రయాలు చేస్తే అవి చట్టవిరుద్ధం కావడంతో.. 1970 తర్వాత గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూ ములను క్రమబద్ధీకరించుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అసలు అధికారులు విచారణ ఏ ప్రాతిపదికన చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడమే.. మైదాన ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో గతంలో అమ్మిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొంద రు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తమకున్న భూమిలో కొంత మేరకు మాత్రమే అమ్మిన వారు.. కొనుగోలు చేసిన వారు ఎంత మేరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై గందరగోళం నెల కొంది. మరికొన్ని చోట్ల అమ్మకం చేసిన వ్యక్తు లు కొనుగోలుదారుల వద్ద నుంచి ఎంతో కొం త రాబట్టుకునేందుకు అబ్జెక్షన్ దరఖాస్తులు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్ర స్తుతం మైదాన ప్రాంతంలో దీనిపైనే ప్రధాన చర్చ జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏజెన్సీ ప్రాంతంలో దీనికి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1969 తర్వాత గిరిజనేతరుల భూముల అమ్మకాలు, కొనుగోలు నిషేధించడంతో ఇప్పటికే వారి వద్ద నుంచి కొనుగోలు చేసి.. సాగు చేసుకుంటున్న రైతులు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులున్నాయి. ప్రహాసనమేనా.. సాదా బైనామా ప్రక్రియ ప్రహాసనంలా మారనుందనే ప్రశ్నకు రెవెన్యూ వర్గాలు అవుననే సమాధామిస్తున్నాయి. సాధారణంగా పహాణీ లో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుం టే.. కనీసం 6 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాకు సిద్ధం కావడంతో 2,01,762 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం డివిజన్లో అత్యధికంగా 1,28,769, కొత్తగూడెం డివిజన్లో 52,119, పాల్వంచ డివిజన్లో 19,337, భద్రాచలం డివిజన్లో 1,537 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో రెవెన్యూ శాఖ సతమతమవుతుండటం.. ఉన్న పనులే సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొనడంతో.. ప్రస్తు తం సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎన్నేళ్లు పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలెన్నో... ⇔ అధికారులు విచారణ సమయంలో అమ్మకం, కొనుగోలుదారుల వాంగ్మూలం స్వీకరిస్తారా? ⇔ హద్దులు లేని అగ్రిమెంట్లను ఏ ప్రాతిపదికన చేస్తారు? ⇔ అమ్మకందారులు మరణిస్తే వారి వారసుల వాంగ్మూలం సేకరిస్తారా? ⇔ పంపకాలు జరగని వారసత్వ భూములను ఎలా క్రమబద్ధీకరిస్తారు? ⇔ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ నిలిచేనా? ⇔ ఏజెన్సీలో నకిలీ డాక్యుమెంట్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? ⇔అమ్మకందారులు స్థానికంగా లేనిపక్షంలో వారి వాంగ్మూలం సేకరణ పరిస్థితి ఏమిటి? ⇔ సాదా బైనామాకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారా? ⇔ వివాదంలో ఉన్న భూముల అడ్డదారి క్రమబద్ధీకరణ నిలిచేనా? ⇔ డాక్యుమెంట్ రాత సమయంలో సాక్షుల సంతకాలు లేకుంటే వాటి పరిస్థితి ఏమిటి? -
‘కంచె’లేని భద్రత!
సబ్‌జైలు అంతర్గత భద్రతపై అనుమానాలు రక్షణగోడకు పూర్తిగా లేని పెన్షింగ్ సివిల్ పోలీసుల పాత్ర ఎంతవరకు..? నేరాలకు అలవాటుపడి..జైలు గదులు రుచించక చాకచక్యంగా పరారైన రిమాండ్ ఖైదీ బొబ్బిలి : నిత్యం ‘మత్తు’కు అలవాటు పడిన 25 ఏళ్ల యువకుడు... గంజాయి కోసం ఎటువంటి పని చేయడానికైనా వెనుకాడని నైజం.. తల్లిదండ్రులు పేదరికంలో ఉండడంతో బయట తిరుగుళ్లకు అలవాటు పడి, ఆలయాల బయట గంజాయి సేవించి రాత్రంతా మత్తులోనే జోగేవాడు. చివరికి ఓ దోపిడీ కేసులో కటకటాలపాలయ్యాడు. అలాంటి వ్యక్తికి జైలు శిక్ష రుచించలేదు.. రోజంతా బందీఖానాలో ఉండడం.. ధూమపానం, గంజాయి వంటివి అందుబాటులో లేకపోవడంతో ఎలాగైనా బయట పడాలని ప్లాన్ వేశాడు.. అనుకున్న ప్రణాళికను తు.చ. తప్పకుండా పక్కాగా అమలు చేసి, జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఇటు జైలు శాఖ సిబ్బందికి, అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఒడిషా రాష్ర్టం జైపూర్‌కు చెందిన ధనురాన అలియాస్ బడాపెట్టు (ఖైదీ నంబర్ 2576). నేరాలే అతని వృత్తి.. 2014లో రామభద్రపురం వద్ద లారీడ్రైవర్‌ను, క్లీనర్‌ను చితకబాది.. వాహనంతోపాటు ఉడాయించిన కేసులో ధనురాన ఎ2 నిందితుడిగా ఉన్నాడు. అప్పటివరకూ గంజాయికి అలవాటు పడిన అతను.. అది లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితి జైలులో ఏర్పడింది. నాలుగు మాసాలుగా బొబ్బిలి సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ధనురాన.. అవకాశం దొరికితే పరారవ్వడానికే నిర్ణయించుకున్నాడు. అదును చూసి.. గోడ దూకాడు! సహచర ఖైదీలతో కలసి 2వ నంబరు గదిలో ధనురాన ఉండేవాడు. జైలు చుట్టూ గోడపై విద్యుత్తు కంచె ఏర్పాటు చేసిన అధికారులు ఖైదీలుండే గదుల సమీపంలోని గోడకు మాత్రం పెట్టలేదు. అదే పరారైన ధనురానకు కలిసొచ్చింది... దారి దోపిడీ కేసులో నిందితుడు జైలులో ఉన్నా ఇటు జైలుశాఖ ఉద్యోగులు, అటు సివిల్ పోలీసులు.. సాధారణ ఖైదీలలాగానే బందోబస్తులను నిర్వహించారు. ప్రతిరోజూ ైఖైదీలను రోజుకు మూడుసార్లు బయటకు తీసుకువస్తారు. ఉదయం అల్పాహారం, పది గంటలకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం 5 గంటలకు రాత్రి భోజనం పెట్టి తిరిగి గదిలోనికి పంపించేస్తారు. ఈ నెల 24న సబ్‌జైలులో ఉండే 17 మంది నిందితులతోపాటు ధనురాన కూడా సాయంత్రం భోజనానికి వచ్చాడు. ఎప్పుడూ భోజనాన్ని ఆలస్యంగా చేసే నిందితుడు.. ఆ రోజు తొందరగా తినేసి తన గది వైపు వచ్చాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. గదులపై ఉండే సిమెంటును రేకు పట్టుకొని మీదకు చేరి అక్కడుండే పెన్షింగ్ జాయింట్ తొలగించి, దానిని సాగదీసి క్షణాల్లో బయటపడ్డాడు. పాత సబ్ట్రైజరీ కార్యాలయం వైపు దిగి జనాల్లో కలిసిపోయాడు. జైలు కట్టినప్పుడు వేసి ఇనుప పెన్షింగ్ ఎండకు ఎండటం, వానకు తడవడం వల్ల పూర్తిగా పాడైపోవడంతో దానిని సాగదీయడం అతనికి సులభతరమైంది. అక్కడ నుంచి అతను సొంత గ్రామం జైపూర్ వెళ్లిపోవడానికి రామభద్రపురం వైపు వెళ్తున్న లారీని పట్టుకొని పరారైనట్లు సమాచారం. ఖైదీల బేరక్స్‌కు తాళాలేసుంటే! ఖైదీలు గదుల్లో ఉన్నప్పుడు, వారంతా బయటకు వచ్చినప్పుడు వారుండే బేరక్స్‌కు తాళాలు వేయాలి. ఆ బాధ్యతను జైలు శాఖ నిర్వహిస్తుంటుంది. అయితే సాధారణంగా సబ్ జైలులో దీనిని పాటించరు. ముద్దాయిలు పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోరనే నమ్మకంతో వారిని లోపల కొంచెం చూసీచూడనట్లు వదిలేయడమే ఖైదీ పరారవ్వడానికి ఆస్కారం కలిగిందనే వాదన వినిపిస్తోంది. సివిల్ పోలీసుల పాత్ర ఎంత? ఖైదీ పరారవ్వడంతో దానికి బాధ్యతగా సివిల్ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలలని జైళ్ల శాఖ ఎస్పీకి ప్రతిపాదనలు పెట్టింది. సబ్ జైలులో ప్రతి రోజూ ఒక హెచ్‌సీ, నలుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుంటారు. వీరిని పట్టణ, రూరల్ పోలీసులు సంయుక్తంగా స్టేషన్ల నుంచి ఒక్కొక్కరిని ఈ విధులకు వేస్తుంటారు. సెంట్రీ డ్యూటీతోపాటు రక్షణకు వీరిని వినియోగిస్తారు. సివిల్ పోలీసులు వారి విధుల్లో సక్రమంగా లేకపోతే వెంటనే హౌస్ అధికారికి జైళ్ల శాఖ ఫిర్యాదు చేయాలి. ఈ విధుల్లో ఉన్న వారిలో ఒక కానిస్టేబుల్‌కు వీక్లీ ఆఫ్ తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఖైదీ పరారైన రోజు విధుల్లో ఉన్న సివిల్ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ నలుగురిని సిఫార్సు చేస్తూ జైళ్ల శాఖ జిల్లా ఎస్పీకి ప్రతిపాదనలు పంపింది. అయితే జైలు లోపల జరిగిన సంఘటనకు సివిల్ పోలీసులు ఎలా బాధ్యత వహిస్తారని ఆ శాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నా.. మరి జిల్లా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి -
ఎయిర్ టెల్ ఉద్యోగి మాయం
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వేముల సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. వేంపల్లె, రాయచోటి, కడప ప్రాంతాల్లో ఎయిర్ టెల్ టవర్స్ మేనేజర్‌గా పనిచేసే శివభాస్కర్‌రెడ్డి (35) శనివారం కడపలో స్నేహితుల వద్ద నుంచి బైక్ తీసుకుని వేముల కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల వద్ద పని ఉందని చెప్పి బయల్దేరాడు. సాయంత్రమైనా శివభాస్కర్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం వెతకగా, ఓ గుంటలో బైక్‌ను కనిపించింది. శివభాస్కర్‌రెడ్డి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీసులు జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
'అఖిల్ మృతిపై అనుమానాలున్నాయి'
కృష్ణా జిల్లా నిడమనూరులోని నారాయణ కళాశాల విద్యార్థి అఖిల్‌రెడ్డి ఆత్మహత్యపై అతడి తండ్రి సందేహాలు వ్యక్తం చేశారు. తన కుమారుడు మృతిపై అనుమానాలున్నాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కూడా లేవన్నారు. నారాయణ కాలేజీ యాజమాన్యం రకరకాల కథలు చెప్పుతోందని ఆయన అన్నారు. అఖిల్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణకు చెందిన కాబట్టి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అన్నారు. కాగా అఖిల్ రెడ్డి మృతదేహానికి శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. నిన్న సాయంత్రం అఖిల్ కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆధునిక టెక్నాలజీపై అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ‘డయాఫ్రమ్ వాల్’ పరిజ్ఞానంపై చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ‘పట్టిసీమలో వీరబాదుడు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనంలో పేర్కొన్న అనుమానాలే సోమవారం నాటి సమావేశంలోనూ వ్యక్తమయ్యాయి. ‘వెల్ సింకింగ్’ పరిజ్ఞానంలో పనులు చేయాలనేది ప్రభుత్వం, పట్టిసీమ కాంట్రాక్టర్ ‘మెగా’ మధ్య ఉన్న ఒప్పందం కాగా, ప్రభుత్వం నుంచి తగిన అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ డిజైన్‌ను మార్చి ‘డయాఫ్రమ్ వాల్’ పరిజ్ఞానాన్ని వాడుతున్న సంగతి తెలిసిందే. దీని వల్ల అదనంగా రూ.250 కోట్ల ఖర్చవుతుందని, ఆమేరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకున్న విషయమూ విదితమే. అలాగే సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా అడ్డగోలు నిర్ణయం తీసుకోలేక, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)తో ఇందుకు ఆమోదముద్ర వేయించేందుకు విఫలయత్నం చేసిన సంగతీ తెలిసిందే. కాంట్రాక్టర్ చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానం నమ్మశక్యంగా లేదని ఎస్ఎల్ఎస్సీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం కావడంతో, చీఫ్ ఇంజనీర్ల బోర్డుకు విషయాన్ని నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం చీఫ్ ఇంజనీర్ల బోర్డు భేటీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ చెబుతున్న కొత్త టెక్నాలజీ, ధరలు నమ్మశక్యంగా లేవనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. దీంతో అదనపు సమాచారం కాంట్రాక్టర్‌ను అడగాలని నిర్ణయిం చారు. ఈనెల 17న మరోసారి భేటీ అయి నిర్ణయాన్ని వెలువరించాలని భావిస్తున్నారు. ఆ సమావేశంలో కాంట్రాక్టర్ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడటం ఖాయమని, మీడియాలో వార్తలు నేపథ్యంలో వారం రోజులు వాయిదా వేశారని ఇంజనీర్లు చెబుతున్నారు.