Tax Department
-
రూ.1,000 కోట్ల ట్యాక్స్ స్కాం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ల చెల్లింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. వివిధ సంస్థలు దాదాపు రూ. 1,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లు నిగ్గుతేలింది. ఆయా సంస్థల అక్రమాలకు కొందరు ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సైతం నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. సోమేశ్ మౌఖిక ఆదేశాలతో.. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. స్రూ్కటినీ మాడ్యూల్లో పనిచేస్తూ వివిధ సంస్థలు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్‌లలో లోపాలను గుర్తించి వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశాన్నీ పర్యవేక్షించాలి. కానీ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు స్రూటినీ మాడ్యూల్లో మార్పుచేర్పులు చేశారు.ఈ కార్యకలాపాల కోసం సోమేశ్ కుమార్, శోభన్బాబులతోపాటు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరాంప్రసాద్ తదితరులతో వాట్సాప్‌లో ‘స్పెషల్ ఇనీíÙయేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీని ద్వారానే సోమేశ్ అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, ఇటు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (రెవెన్యూ) ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడూ కొనసాగింది.వాట్సాప్ గ్రూప్ ద్వారా శోభన్ బాబుకు ఆదేశాలు ఇచి్చన సోమేశ్ తాము చెప్పిన సంస్థలకు సంబంధించిన రిటర్న్‌లలో ఐజీఎస్టీ, సెస్‌లో ఉన్న లోపాలు బయటపడకుండా చేయాలని స్పష్టం చేశారు. స్రూ్కటినీ మాడ్యూల్లో మార్పులు చేసిన శోభన్‌బాబు కొన్ని సంస్థలు చేసిన స్కామ్‌లు బయటపడకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా అనేక సంస్థలు రూ.1000 కోట్ల వరకు స్కామ్‌కు పాల్పడ్డా బయటపెట్టలేదు. ఎట్టకేలకు బట్టబయలు.. ఇటీవల బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 25.51 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ.. సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) సహకారం కోరింది. డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సీ–డాక్... జరిగిన గోల్మాల్ను గుర్తించింది.దీని ఆధారంగా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఐఐటీ–హైదరాబాద్ సహా వివిధ సంస్థల నుంచి వివరాలు కోరారు. సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అభ్యర్థన మేరకే తాము స్రూ్కటినీ మాడ్యూ ల్లో మార్పులు చేశామన్న ఐఐటీ–హైదరా బాద్.. ఆ మేరకు వివరాలను సమరి్పంచింది. బయటి సిబ్బందితోనే ఐఐటీ–హైదరాబాద్ పర్యవేక్షణ సీ–డాక్ నివేదిక ప్రకారం దాదాపు 75 సంస్థలకు సంబం«ధించిన రిటర్న్‌లు పూర్తిస్థాయిలో స్క్రూటినీ కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు జరిగినట్లు వెలుగులోకి వచి్చంది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌లో మార్పులు చేసేందుకు వాడిన ఐపీ అడ్రస్‌లలో ఒకటి ఏపీలోని హిందూపూర్ నుంచి పనిచేసిందని, ఈ డేటాను యాక్సెస్ చేసిన వ్యక్తులు.. వారి పాస్‌వర్డ్‌గా పిలాంటో అనే పేరును వినియోగించినట్లు కూడా సీ–డాక్ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌ను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన ఐఐటీ–హైదరాబాద్ దీనికోసం కనీసం ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోలేదని బయటపడింది.సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ–హైదరాబాద్ చిరునామాతోనే రిజిస్టరై ఉన్న పిలాంటో టెక్నాలజీస్‌లో పనిచేసే వారినే ఈ పని కోసం వినియోగించుకుంది. సీ–డాక్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో కేవలం 11 సంస్థలు చేసిన స్కామ్ విలువే రూ. 400 కోట్ల వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. మొత్తమ్మీద దాదాపు 75 సంస్థలు రూ. 1,000 కో ట్ల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధి కారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, పి లాంటో టెక్నాలజీస్ తదితరులను నిందితులుగా చేర్చారు. -
‘ఇలా వేధించడం తగదు’.. కేంద్రంపై అశ్నీర్ ఆగ్రహం
ప్రముఖ ఫాంటసీ గేమింగ్ యాప్ ‘క్రిక్‌పే’ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ ట్యాక్స్ ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బకాయల పేరుతో వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విభాగం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ గట్టి షాకిచ్చింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్ఎంజీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారిచేసింది. ఆ నోటీసులపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. డీజీజీఐ విభాగాన్ని నిర్వహిస్తున్న వారి లక్ష్యం కేవలం వ్యాపారస్తులను వేధించడమే’ అని అన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రజలు భారీ పన్నులు చెల్లించరని, ప్రభుత్వం సైతం చెల్లించదు..కేవలం వాటిని సేకరించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా దీనిని 'రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్' (గత లావాదేవీలకు వర్తించే విధంగా) అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ వోడాఫోన్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధించగా, బీజేపీ గేమింగ్ జీఎస్టీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ దృక్పథానికి సహాయం చేయదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. జీఎస్టీ నిర్ణయంపై అసంతృప్తి ఆన్లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్‌పై 28 శాతం వస్తు సేవల పన్ను విధిస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రోవర్ తప్పుబట్టారు. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల కొత్త గేమ్‌లలో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని, ట్రాన్సాక్షన్లు, అలాగే వ్యాపార విస్తరణపై ప్రభావం చూపుతుందన్నారు. . అశ్నీర్ గ్రోవర్ ఏం చేస్తున్నారు? భారత్ పే కో-ఫౌండర్‌గా ఆ సంస్థలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురి జైన్ గ్రోవర్లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అశ్నీర్ను, ఆయన భార్యను భారత్ పే బోర్డ్ యాజమాన్యం ఆ సంస్థ నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ ఏడాది క్రిక్‌పే పేరుతో సొంత ఫాంటసీ గేమింగ్ సంస్థను ప్రారంభించారు. -
ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను శాఖ తాజాగా ఏఐఎస్ ట్యాక్స్‌పేయర్ పేరిట మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో తమ మొబైల్ ఫోన్లలో వార్షిక సమాచారాన్ని, పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశాని చూడవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారుల టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ల లావాదేవీలు మొదలైన వాటి సమగ్ర సమాచారాన్ని ఒకే దగ్గర చూసుకునేందుకు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. టీఏఎస్ అంటే టేక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీని, ఏఐఎస్ యాన్సువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ వివరాలు ఉంటాయి. ఈ సమాచారం అందించే యాప్ గూగుల్ ప్లే, యాప్ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ పాన్ నంబర్ ద్వారా ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ITD has launched a mobile app ‘AIS for Taxpayers’ to enable taxpayers to view their info as available in Annual Information Statement(AIS)/Tax Information Summary(TIS). This will provide enhanced taxpayer service & ease of compliance.(1/2) Press Release:https://t.co/WujCqyYQSe pic.twitter.com/Q6VaC2L2S2 — Income Tax India (@IncomeTaxIndia) March 22, 2023 -
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
కార్పొరేట్ వైద్యం మరింత ‘ప్రియం’
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ వైద్యాన్ని మరింత ప్రియం చేసేలా జీఎస్టీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. వైద్యసేవలపై విధించే జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తీసుకునే వెసులుబాటుపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్పొరేట్ లేదా ఖరీదైన వైద్య సేవలు పొందే రోగుల నుంచి ఆసుపత్రులు ఆమేరకు పన్నును వసూలు చేయనున్నాయి. గతంలో ఐసీయూ, సీసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ చికిత్సలు కాకుండా రూ.5 వేల కన్నా ఎక్కువ రోజువారీ అద్దె చెల్లించి ఆసుపత్రిలో ఉండే రోగులకు వైద్యసేవలపై జీఎస్టీ విధించేవారు. ఈ జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద తిరిగి మళ్లీ ఆ జీఎస్టీని మొత్తాన్ని పొందేవి. తదనుగుణంగా రోగులకు ఇతర సేవల రూపంలో కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించేవి. ఇప్పుడు తిరిగి ఐటీసీ పొందే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో జీఎస్టీకి అదనంగా ఇతర సేవలపై కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఫలితంగా రోగులపై పన్నుభారం పెరగనుంది. అయితే, ఈ నిబంధన మినహాయింపు రాష్ట్రస్థాయిలో జరిగేది కాదని, జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. -
‘రాబడి’ శాఖల్లో.. బదిలీల కదలిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కీలక శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నవారికి స్థాన చలనం కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, భూపరిపాలన, పన్నుల శాఖల్లో త్వరలోనే బదిలీలు జరగనున్నట్టు తెలిపాయి. ప్రభుత్వ పాలన, ఆదాయ సమీకరణలో కీలకంగా వ్యవహరించే ఈ నాలుగు శాఖల్లో చాలా కాలం నుంచి బదిలీలు లేకపోవడం, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తుండటం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం నేపథ్యంలో.. బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం. ఒక్కొక్కటిగా.. ఓ కొలిక్కి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో బదిలీలు జరిగి చాలాకాలం అవుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికత ప్రాతిపదికన ఇటీవలి కాలంలో జరిగిన మల్టీజోనల్, జోనల్, జిల్లా స్థాయి బదిలీలు, అప్పుడప్పుడు పదోన్నతులు వచ్చినప్పుడు చేసే బదిలీలు మాత్రమే జరిగాయి. కానీ పూర్తిస్థాయి సాధారణ బదిలీలు జరగలేదు. రిజిస్ట్రేషన్ల శాఖలో అయితే దశాబ్ద కాలం నుంచీ ఒకేచోట పనిచేస్తున్న సబ్రిజిస్ట్రార్లు కూడా ఉన్నారు. పన్నుల శాఖలో కూడా ఏళ్ల తరబడి పాతుకుపోయిన ‘వసూల్ రాజా’లు కీలక ప్రాంతాలను అంటిపెట్టుకుని వదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ బదిలీలు లేకపోవడంతో వారికి ప్రయోజనకరంగా మారింది. పలుచోట్ల అధికారులు కార్యాలయాలకు ðవెళ్లకుండానే.. సీనియర్ అసిస్టెంట్ స్థాయి సిబ్బందితో వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక కీలకమైన భూపరిపాలన శాఖ, ఎక్సైజ్ శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవలి పదోన్నతుల సమయంలో కొందరికి స్థాన చలనం కలిగిందే తప్ప.. సాధారణ బదిలీలు లేవు. ఈ శాఖలన్నింటిలో బదిలీలు అనివార్యమనే చర్చ జరుగుతోంది. కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు నిజానికి చాలా కాలం నుంచీ ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. బదిలీలపై నిషేధం అమల్లో ఉండటం, ఎత్తివేసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రక్రియ ముందుకు పడలేదు. ఈ క్రమంలో తాజాగా రిజిస్ట్రేషన్లశాఖ బదిలీలపై దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్లు ఎక్కడెక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? వారిపై ఏమైనా కేసులు న్నాయా? చర్యలు పెండింగ్‌లో ఉన్నాయా? అనే వివరాలను ఉన్నతాధికారులు సేకరించారు. ఇక పన్నుల శాఖలో వీలైనంత త్వరగా బదిలీల ప్రక్రియ పూర్తికావాలని, లేకుంటే ఆదాయ వనరుల సమీకరణపై ప్రభావం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్దేశించుకున్న రాబడి లక్ష్యం పూర్తి కావాలంటే.. ఐదారు నెలల ముందే బదిలీలు జరగాలని, అధికారులు కొత్త స్థానాల్లో కుదురుకుని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తారని పేర్కొంటున్నాయి. ఇప్పుడు జరగకుంటే ఎన్నికల తర్వాతే! ఈ ఏడాదిలో బదిలీలు జరగకపోతే.. వచ్చే ఏడాది ఎన్నికలతో బదిలీలకు అవకాశం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే బదిలీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక ఆదాయ శాఖల్లో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. -
కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్లాక్ మనీ చట్టం కింద పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ ఖాతాల్లో రూ. 814 కోట్ల మేర రహస్యంగా దాచిన నిధులపై రూ. 420 కోట్ల పన్నులను ఆయన ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని అభియోగాలు మోపింది. ఆయన కావాలనే విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించలేదని ఆరోపించింది. (భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి) దీనికి సంబంధించి ఆగస్టు తొలినాళ్లలో ఐటీ శాఖ అంబానీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2012-13 నుంచి 2019-20 అసెస్మెంట్ సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి విదేశాల్లోని అసెట్లను వెల్లడించక పోవడం ద్వారా అనిల్ అంబానీ పన్నులు ఎగవేశారని పేర్కొంది. ఆగస్టు 31లోగా అభియోగాలపై సమాధానమివ్వాలని సూచించింది. డైమండ్ ట్రస్ట్, నార్తర్న్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్ (ఎన్‌ఏటీయూ) అనే రెండు విదేశీ సంస్థల కూపీ లాగితే వాటి అంతిమ లబ్ధిదారు అనిల్ అంబానీయేనని తేలినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి : అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! -
పొగరాయుళ్లకు నకిలీ సెగ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ సిగరెట్లు హల్చల్ చేస్తున్నాయి. కోల్‌కతా లైన్ కేంద్రంగా ఢిల్లీ, బిహార్, రాయ్‌పూర్ నుంచి ఖరీదైన సిగరెట్ స్థానంలో నకిలీ రంగ ప్రవేశం చేస్తోంది. ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో బండిల్స్ కొద్దీ దొరికిన ఫేక్ సిగరెట్ బండిల్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ టొబాకో కంపెనీ(ఐటీసీ) ద్వారా మాత్రమే నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీలు సిగరెట్స్‌ని తయారు చేస్తుంటాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో దర్శనమిచ్చేవి. కేంద్రం విధించిన పన్ను భారంతో బ్రాండెడ్ సిగరెట్స్ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. నకిలీ సిగరెట్ తయారీ ఇలా? బ్రాండెడ్ కంపెనీలు వాడే పొగాకులో నాసిరకం పొగాకుని అతి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటారు. పొగాకుతో పాటు రంపపు పొట్టుని కూడా కలిపేసి చవగ్గా సిగరెట్స్ తయారు చేసేసి.. వాటిని మార్కెట్లోని బ్రాండెడ్ సిగరెట్స్ ప్యాకెట్స్ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. ఆ ప్యాకెట్స్‌పై ఎక్కడ తయారవుతున్నాయి.? వాటి కంపెనీ ఏమిటి.? అనే వివరాలు మాత్రం కనిపించవు. కొందరు తెలివిగా.. బ్రాండెడ్ ప్యాకెట్స్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లనే ముద్రించేస్తున్నారు. ఎలా వచ్చేస్తున్నాయ్..? గతంలో బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ సిగరెట్లు వచ్చేవి. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని తయారు చేసేస్తున్నారు. ఢిల్లీ, బిహార్, సూరత్, రాయ్‌పూర్, చంఢీగఢ్, కోల్‌కతా వంటి నగరాల్లో అసలు బ్రాండ్లను పోలిన సిగరెట్లు తయారవుతున్నాయి. వీటిని కోల్‌కతా కేంద్రంగా వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం రైలు మార్గంలోనే ఎక్కువగా రవాణా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల విశాఖ డివిజన్ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు రూ. లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు. వాటిని ఎవరు ఆర్డర్ చేశారన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. నకిలీ పొగ.. ప్రాణాంతకం సాధారణంగా బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు, నరాల బలహీనతలు, ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. ఈ వ్యాధులు వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్స్ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని.. సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గొలుసు తెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఇటీవల రైల్వేస్టేషన్లో భారీగా నకిలీ సిగరెట్ డంప్‌ని స్వాధీనం చేసుకున్నాం. వీటిని తీసుకొచ్చిన వ్యాపారి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. నకిలీ సిగరెట్ల వ్యాపారంపై గట్టి నిఘా ఉంచుతున్నాం. ప్రతి రైలు నుంచి వచ్చే పార్సిళ్లను పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీనివాసరావు, రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ -
జీఎస్టీ మోసం బట్టబయలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డివిజన్లో భారీ జీఎస్టీ మోసాన్ని రాష్ట్ర పన్నుల శాఖ బట్టబయలు చేసింది. రూ.వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. ఒక్క రూపాయి కూడా జీఎస్టీ రిటరŠన్స్ చెల్లించకుండా శ్రీపాద్ ఇన్ఫ్రా కంపెనీ రూ.69.06 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ నక్కు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జీఎస్టీ విశాఖ డివిజన్ కార్యాలయంలో ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. 2006లో యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్‌గా ప్రస్థానం ప్రారంభించి 2010లో యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, 2012లో వైఈపీఎల్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్గానూ, 2016 జూన్ 27న శ్రీపాద్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌గా పేర్లు మారుస్తూ వ్యాపార లావాదేవీలు సాగించారు. కంపెనీ ఎండీగా గొలుగూరి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్‌గా సూర శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న ఈ కంపెనీ.. వ్యాట్ చట్టంలో రిజిస్ట్రేషన్ చేయకుండానే నడిపించేశారు. జీఎస్టీ చట్టం వచ్చాక 2019 జూలై 7న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2019 జనవరిలో రిటర్న్స్–3బీ దాఖలు చేసి జీరో టర్నోవర్ కంపెనీగా చూపించారు. వరుసగా ఆరు నెలలు రిటరŠన్స్ దాఖలు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ రద్దయింది. అయినా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపిస్తూ ప్రాజెక్టులు దక్కించుకొని లావాదేవీలు సాగించారు. విస్తుపోయే నిజాలు.. శ్రీపాద్ ఇన్ఫ్రా గురించి జీఎస్టీ అధికారులకు సమాచారం రావడంతో పదిరోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం సీతమ్మధారలో సంస్థ కార్యాలయాన్ని గుర్తించి.. రికార్డులు పరిశీలించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2016–17లో రూ.75.94 కోట్లు, 2017–18లో రూ.92.04 కోట్లు, 2018–19లో రూ.122.87 కోట్లు, 2019–20లో రూ.147.44 కోట్ల చొప్పున మొత్తం నాలుగేళ్ల కాలంలో రూ.438.29 కోట్లు వ్యాపారం ద్వారా ఆర్జించినట్లు గుర్తించారు. నాలుగేళ్లలో మొత్తం రూ.385.33 కోట్లు రియల్ వ్యాపారానికి సంబంధించిన కొనుగోళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. గడువులోగా జీఎస్టీ చెల్లించకుంటే కస్టడీకి.. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసినా.. ఒక్క పైసా కూడా జీఎస్టీ చెల్లించకపోవడం దక్షిణ భారతదేశంలో ఇదే ప్రప్రథమమని జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ ప్రకారం రూ.69,06,85,140 పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశామని, నిర్ణీత గడువులోపు పన్నులు చెల్లించకపోతే ఎండీ, డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎండీ శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించగా ఆదాయపు పన్ను రిటర్న్స్, సీఏతో ధ్రువీకరించిన బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్స్, లాస్ అకౌంట్లు గుర్తించి వాటన్నింటినీ సీజ్ చేశామన్నారు. -
ఐటీఆర్1-4కు ఆఫ్‌లైన్ యుటిలిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల పత్రాలైన ఐటీఆర్1, 4 దాఖలు చేసే వారి కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీని ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. ఈఫైలింగ్ పోర్టల్‌లో ఈ ఆఫ్‌లైన్ యుటిలిటీ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ (జేఎస్వోఎన్) అనే నూతన టెక్నాలజీ ఆధారితంగా ఇది పనిచేస్తుందని పేర్కొంది. ‘‘విండోస్ 7, ఆ తర్వాతి వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన కంప్యూటర్లలో ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఐటీఆర్-1, ఐటీఆర్-4కు మాత్రమే పనిచేస్తుంది. ఇతర ఐటీఈఆర్లను తర్వాత జోడించడం జరుగుతుంది’’ అంటూ ఆదాయపన్ను శాఖా ప్రకటించింది. ఆదాయపన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్ నుంచి ముందుగా నింపిన డేటా ఆధారిత రిటర్నులను డౌన్లోడ్ చేసుకుని, మిగిలిన డేటాను నింపిన అనంతరం దాఖలు చేయవచ్చు. ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీఆర్ అప్లోడ్ చేసేందుకు ఇంకా అనుమతించనందున.. ఐటీఆర్‌ను పూర్తిగా నింపి ఆఫ్‌లైన్ యుటిలిటీలో సేవ్ చేసుకోవచ్చని ఆదాయపన్ను శాఖా తెలిపింది. నూతన యుటిలిటీ అన్నది రిటర్నుల దాఖలు చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని నాంజియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ నేహా మల్హోత్రా పేర్కొన్నారు. సాధారణ బీమా సంస్థలకు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సాధారణ బీమా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరలకు సంబంధించి ముసాయిదా నిబంధనలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) విడుదల చేసింది.ముఖ్యంగా బీమా పాలసీల తయారీ విషయంలో అనుసరించాల్సిన కనీస కార్యాచరణను ఇందులో నిర్దేశించింది. బీమా సంస్థల్లో సమర్థతను పెంచడం ద్వారా పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలూ ఇందులో ఉన్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అప్పుడు అన్ని సాధారణ బీమా ఉత్పత్తులు, యాడాన్ కవర్లకు ఇవి వర్తిస్తాయి. -
పల్లెకూ ఉంది ఓ బడ్జెట్
సత్తెనపల్లి: బడ్జెట్ అంటే బోలెడు లెక్కలు. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అవసరాలకు తగిన నిధులు కేటాయించాలి. రూపాయి రాక.. పోక వివరాలు పక్కాగా ఉండాలి. అది కేంద్ర బడ్జెట్ అయినా.. పల్లె పద్దు అయినా లెక్క పక్కాగా ఉండాల్సిందే. పంచాయతీల ఆదాయ మార్గాలు, పల్లెల ప్రగతికి ఉపకరించే నిధులు, వాటి పద్దుల బడ్జెట్ ఎలా ఉంటుందంటే.. కేంద్ర సహకారమే కీలకం పల్లెలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులే కీలకంగా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలయ్యాయి. ఒక్కో వ్యక్తికి సగటున రూ.550 నుంచి రూ.600 వరకు వస్తోంది. ప్రస్తుతం ఈ నిధుల్లో పంచాయతీలకు 70 శాతం, మండలాలకు 20 శాతం, జెడ్పీకీ 10 శాతం వంతున కేటాయిస్తారు. ఈ నిధుల్లో 50 శాతం టైడ్ ఫండ్స్ రూపంలో పంచాయతీలు కేంద్ర నిబంధనల ప్రకారం వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు, సిబ్బంది జీతభత్యాలు తదితర అవసరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం అన్‌టైడ్ ఫండ్స్‌ను ఒక్క జీతభత్యాలకు కాకుండా ఏ ఇతర పనికైనా వెచ్చించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని నిధులు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సచివాలయ భవనాలు, రహదారులు, ఇతర నిర్మాణాలు, భూగర్భ జల వనరుల పెంపు తదితరాలను ఈ పథకం కిందే అభివృద్ధి చేస్తున్నారు. అన్ని పంచాయతీలకు సమానంగా డబ్బులు ఇస్తారు. సాధారణ నిధుల వినియోగం ఇలా.. మొత్తం 47 రకాల పన్నులు విధించడానికి పంచాయతీ పాలకవర్గాలకు అధికారం ఉంది. పన్ను విధింపు, అమలుకు గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో ఇంటి పన్ను, వృత్తి, వినోదం, భూమి రిజిస్ట్రేషన్, వేలం, కాటా రుసుము తదితరాలు ఉన్నాయి. పన్నేతర ఆదాయం కింద చెరువుల వేలం, పరిశ్రమలు, మార్కెట్ యార్డు ప్రకటనలు, సెల్‌ఫోన్ టవర్లు తదితరాల నుంచి ఆదాయం లభిస్తుంది. వృత్తి పన్ను రూపంలో రాష్ట్ర పన్నుల శాఖ వసూలు చేసిన మొత్తంలో 95 శాతం తిరిగి పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. పంచాయతీలో తలసరి రూ.4 అందిస్తుంది. వినోదపు పన్నును 60:40 నిష్పత్తిలో ఇస్తారు. గనుల తవ్వకానికి సంబంధించి వసూలయ్యే సీనరేజిలో 25 శాతం చెల్లిస్తుంది. ఖర్చులకు ఉందో ఆడిట్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఆడిట్ రూపంలో లెక్క సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ లెక్క మాత్రం తప్పకూడదు. వ్యయ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర, పంచాయతీరాజ్ నిబంధనలు పాటించి తీరాలి. -
బ్యాంకు ఖాతాదారులపై మరో బాదుడు
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే సర్‌ఛార్జీల పేరుతో కస్టమర్లపై భారం వేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు , ఇకపై బ్యాంకింగ్ జీఎసీటీ ట్యాక్స్‌ను కూడా కస్టమర్లపైనే వేయనున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ మేయిన్‌టెన్ చేస్తున్నవారికి అందించే ఉచిత సర్వీసులమీద కూడా జీఎస్టీ బాదుడుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. అంటే కస్టమర్లకు అందించే సర్వీసులు ఇక భారం కానున్నాయి. ముఖ్యంగా చెక్ బుక్ జారీ, క్రెడిట్ కార్డ్ మంజూరు, ఏటీఎంల వాడకం, ఫ్యూయల్ సర్ఛార్జ్ రిఫండ్స్ వంటి సేవలపై ప్రభుత్వం జీఎస్టీ విధించనుంది. తద్వారా దాదాపు రూ. 40,000 కోట్ల ట్యాక్స్ , పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టనుంది. రెండు నెలల క్రితం ట్యాక్స్ డిపార్ట్ మెంట్, బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జీఎస్టీ విధింపుపై బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లాంటి బ్యాంకులు జీఎస్టీ బాదుడుకు సిద్ధం కానున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. దీంతో దేశంలో ఉన్న అన్ని మేజర్ బ్యాంకులు18శాతం జీఎస్టీ విధింపునకు తమ సమ్మతిని తెలియచేశాయట. అయితే ఎంత జీఎస్టీ విధించాలన్నదానిపై తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అలాగే చాలా బ్యాంకులు ఈ డిసెంబరునుంచే జీఎస్టీ వడ్డనకు సిద్ధమవుతున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో కేజీ కన్నన్ పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే కస్టమర్ల పన్ను చెల్లింపులు నేరుగా ప్రభుత్వానికే వెళ్ళిపోతాయని అభిప్రాయపడ్డారు. సీజీఎస్టీ చట్టం లోని షెడ్యూల్ 2 ప్రకారం ఇతర నాన్ బ్యాంకింగ్ రంగాల్లో కూడా జీఎస్టీ అమలుపై ఆదాయన పన్ను శాఖ కసరత్తులు చేస్తుంది. ఈ నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్ బ్యాంకులైన డీబీఎస్, సిటీబ్యాంక్ కూడా ఉన్నాయి. -
కాగితాలపై కార్యాలయం.. ఉద్యోగులకు బదిలీల భయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పన్నుల శాఖ ఉద్యోగుల్లో ‘బదిలీ’ల గుబులు మొదలయింది. సాధారణ బదిలీల్లో కాకుండా ప్రత్యేకంగా ఈ నెలలో బదిలీ ప్రక్రియ విడుదల చేయడం, అందులోనూ సర్కిళ్ల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడిన కొత్త సర్కిళ్ల కార్యాలయాలను ఏర్పాటు చేయకుండానే బదిలీలు చేపడుతుండడం ఆ శాఖ సిబ్బందికి సమస్యగా మారుతోంది. కొత్తగా ఏర్పాటయిన 20కిపైగా సర్కిళ్లకు ఎక్కడా కార్యాలయాలు తీసుకోకుండానే బదిలీలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంతో అక్కడకు బదిలీ అయితే తాము ఎక్కడ కూర్చుని పనిచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ శాఖ సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు బదిలీల నిబంధనల్లోనూ కొన్ని ఇబ్బందులున్నాయని, అన్నీ సరిచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని వారు కోరుతున్నారు. 91 నుంచి 100కు పెరిగిన సర్కిళ్లు వాస్తవానికి, పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడో జరగాల్సి ఉండగా, ఇటీవలే దానిని పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాలేదనే కారణంతోనే సాధారణ బదిలీల్లో ఈ శాఖ సిబ్బందికి అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు శాఖ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసి సర్కిళ్లను హేతుబద్ధీకరించారు. దీంతో అప్పటివరకు 91గా ఉన్న సర్కిళ్లను 100కు పెంచారు. అధికారికంగా 9 సర్కిళ్లే పెరిగినా, కొన్ని పాత సర్కిళ్లను తొలగించడంతో 20కిపైగా సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే, సర్కిళ్లలో పనిచేయాల్సిన అసిస్టెంట్ కమిషనర్లు, పన్నుల అధికారులు, డిప్యూటీ పన్నుల అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు ఎక్కడా కార్యాలయాలు కానీ, సీట్లు కానీ కేటాయించలేదు. కేవలం పేపర్ల మీద సర్కిళ్లను పెంచి తాజా బదిలీల ప్రక్రియలో ఈ సర్కిళ్లకు బదిలీ ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో సర్కిల్‌కు కనీసం 10 మంది సిబ్బంది చొప్పున ఆ 20 సర్కిళ్లకు కనీసం 200 మంది బదిలీ అవుతారని అంచనా. ఈనెల 27న ప్రారంభమైన బదిలీల ప్రక్రియ వచ్చేనెల 8తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త సర్కిళ్లకు బదిలీ అయిన ఉద్యోగులు ఎక్కడ కూర్చుని పనిచేయాలన్న దానిపై ఉన్నతాధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణకు గతంలో ఉన్న మాదాపూర్ సర్కిల్‌ను మాదాపూర్, మాదాపూర్ 1–4, వికారాబాద్‌ల పేరుతో 6 సర్కిళ్లుగా విడగొట్టారు. ఇందులో మాదాపూర్, మాదాపూర్–1 సర్కిళ్లకు గగన్‌విహార్ కాంప్లెక్స్‌లో కార్యాలయాలున్నాయి కానీ, మిగిలిన నాలుగు సర్కిళ్లకు ఎక్కడా కార్యాలయాలు లేవు. ఇప్పుడు ఆ 4 సర్కిళ్లకు బదిలీ అయితే తమ పరిస్థితేంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సిటీ డివిజన్లలో మూసివేసిన సర్కిళ్ల సిబ్బందిని, చెక్‌పోస్టుల ఎత్తివేత కారణంగా పోస్టింగ్‌లు లేని వారిని హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్లలోని సర్కిళ్లకు బదిలీ చేస్తామని, వీరిని కేటాయించిన తర్వాతే మిగిలిన వారికి ప్రాధాన్యం ఇస్తామని ఉన్నతాధికారులు చెపుతున్నట్టు తెలుస్తోంది. అలా అయితే తమకు అన్యాయం జరుగుతుందని హైదరాబాద్ రూరల్, సరూర్‌నగర్ డివిజన్లలోని సర్కిళ్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల ప్రక్రియలో మెరిట్ ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ వారిని రిలీవ్ చేయవద్దని, కార్యాలయాలు ఏర్పాటుచేసిన తర్వాత పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! 90% మందికి స్థాన చలనం తాజాగా పన్నుల శాఖలో చేపట్టిన బది లీల కారణంగా ఆ శాఖలోని 90శాతం మంది సిబ్బందికి స్థానచలనం తప్పడం లేదు. పన్ను ల శాఖలో గత నాలుగేళ్లుగా బదిలీలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయిన సిబ్బందిని బదిలీలు చేయాలని నిర్ణయించడంతో అడపాదడపా ఇటీవల బదిలీలయిన వారు, రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారు మిన హా అందరూ బదిలీ అవుతారని అంటున్నారు. అలా జరిగితే శాఖ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని, కనీసం మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే బదిలీలు చేయాలని సిబ్బంది కోరుతుండడం గమనార్హం? -
పన్నుల వసూళ్ల జోరు
విశాఖసిటీ: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుచేసిన మొదటి నెలలో తడబడ్డ రాష్ట్రం.. ఏడాది తిరిగేనాటికి వసూళ్లలో వేగం పుంజుకుంది. జూలైలో అన్ని రకాల జీఎస్టీలు రూ.9 కోట్లు మాత్రమే వసూలు కాగా.. తర్వాత నెల నుంచి సరాసరి రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. ఓ వైపు.. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు మందగమనంలో ఉండగా ఏపీలో మాత్రం వృద్ధి చెందుతున్నాయి. 11 నెలల్లో సెంట్రల్ జీఎస్టీ ఖజానాకు రూ.22,733 కోట్లు చేరాయి. క్రమంగా వేగం జీఎస్టీ అమలుచేసిన తొలి నెలలో వ్యాపారులు, రాష్ట్ర పన్నుల శాఖ మధ్య అవగాహన లేమి, ఇతర కారణాలతో పన్నుల వసూళ్లలో వెనుకబడిన రాష్ట్రం.. ఆ తర్వాత వేగం పుంజుకుంది. రిటర్న్స్, పన్ను వసూళ్లపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖాధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు, కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో గతేడాది ఆగస్ట్ నుంచి ఈ ఏడాది మే వరకూ వరుసగా పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2017 జూలై నుంచి 2018 మే నెల వరకు సెంట్రల్ ట్యాక్స్ (సీజీఎస్టీ) రూ.5,330.39 కోట్లు వసూలుకాగా.. ఐజీఎస్టీ రూ.7,950.23 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.9,028.52 కోట్లు వసూలైంది. ఈ 11 నెలల కాలంలో కొన్ని వస్తువులపై ప్రత్యేకంగా విధిస్తున్న సెస్ రూ.209.65 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమలైన 2017 జూలైలో అన్ని పన్నులు కలిపి రాష్ట్రంలో రూ.9.9 కోట్లు ఆదాయం రాగా.. 2018 మే నెలాఖరునాటికి 11 నెలల కాలంలో రూ.22,733.81 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుకున్నాయి. రిటర్న్స్ ఫైలింగ్‌లోనూ ముందంజ పన్నుల వసూళ్లలో టాప్‌గేర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. జీఎస్టీకి సంబంధించిన రిటర్న్స్ ఫైలింగ్‌లోనూ అదే జోరుతో ముందుకెళ్తోంది. దేశ సగటు కంటే ఏపీ సగటు అధికంగా ఉండటం గమనార్హం. కాంపోజిషన్ డీలర్లు ఫైల్ చేసే జీఎస్టీఆర్4 రిటర్న్స్ దేశవ్యాప్తంగా 70.03శాతం కాగా.. రాష్ట్రంలో ఈ సగటు 74.62 శాతం నమోదైంది. 3బీ రిటర్న్స్‌లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. దేశ వ్యాప్తంగా 67.85 శాతం 3బీ రిటర్న్స్ దాఖలు శాతం ఉండగా.. ఏపీలో 66.58 శాతం ఉంది. అంతర్రాష్ట్ర పన్నులకు సంబంధించిన ఐజీఎస్టీ రీఫండ్‌లోనూ రాష్ట్రం చురుగ్గా వ్యవహరిస్తోంది. 2018 మే నెలాఖరు వరకూ రూ.947.53కోట్ల రీఫండ్‌కు చెందిన 8,282 బిల్లులు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన కార్యాలయాలకు రాగా.. 5,242 బిల్లులకు సంబంధించిన రూ.812.90 కోట్లు వ్యాపారులకు రీఫండ్ ఇచ్చారు. వ్యాపారులకు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీపై ప్రతి నెలా అవగాహన కల్పిస్తుండటంతో ఈ వృద్ధి సాధ్యమైందని సెంట్రల్ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సృజన్‌కుమార్ చెప్పారు. ఇప్పటికీ పలువురు వ్యాపారులు కొన్ని ఇబ్బందుల కారణంగా రిటర్న్స్ దాఖలు చెయ్యడం లేదనీ, త్వరలోనే అన్ని వర్గాల వ్యాపారులూ రిటర్న్స్ దాఖలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. -
పన్నుల శాఖలో బదిలీలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పన్నుల శాఖలో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. శాఖ పునర్ వ్యవస్థీకరణ సాకుతో బదిలీలను అధికారులు నిలిపేశారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పునర్ వ్యవస్థీకరణ చేపడుతున్నందున అది పూర్తయ్యేవరకు బదిలీలుండవని తేల్చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పనిభారం పెరగడంతో సర్కిళ్లను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించిన అధికారులు.. ఒక్కో సర్కిల్లో 1,500–2,200 మంది డీలర్లు ఉండేలా ప్రస్తుత 91 సర్కిళ్లకు అదనంగా మరో 5 కలిపి 96 సర్కిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ డివిజన్ల పెంపుపై మాత్రం ప్రతిపాదన చేయలేదు. 8 నుంచి 10 సర్కిళ్లు కలిపి ఓ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే డివిజన్ల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. బదిలీల నిలిపివేతపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు.. పునర్ వ్యవస్థీకరణ చేయడంలో తమకు ఇబ్బంది లేదని, కానీ ఆ కారణంతో బదిలీలు నిలిపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. జీఎస్టీ నాటి ప్రతిపాదన గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. దీని వల్ల పన్నుల శాఖ పరిధిలోని ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని.. వెంటనే సర్కిళ్లు, డివిజన్లను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 120 సర్కిళ్లు, 15 డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. అయితే అప్పటి నుంచి ఆ ఫైలు పెండింగ్‌లో ఉంది. అదే సాకుతో పదోన్నతులనూ అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ పునర్ వ్యవస్థీకరణ అంటూ బదిలీలు ఆపుతుండటంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా బదిలీల్లేవని, ఈ సాకుతో మళ్లీ నిలిపితే ఇప్పట్లో బదిలీలు జరగవేమోనని ఆందోళన చెందుతున్నారు. -
బ్లాక్ మార్కెటింగ్‌తో పన్నుల ఎగవేత
న్యూఢిల్లీ: పన్నుల విధానాన్ని సమర్ధంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి జీఎస్టీ విధానం ప్రవేశపెట్టగా.. అది అమల్లోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో దిగుమతిదారులు భారీ స్థాయిలో పన్ను ఎగవేతలకు కొంగొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. దిగుమతుల విలువను తగ్గించి చూపడం, బ్లాక్ మార్కెట్ తదితర మార్గాల్లో దిగుమతిదారులు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దిగుమతిదారులు జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ, కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా విక్రయిస్తున్నట్లు గణాంకాల విశ్లేషణలో పన్నుల శాఖ గుర్తించింది. దిగుమతిదారులు చెల్లిస్తున్న జీఎస్టీకి, ఆ తర్వాత నమోదవుతున్న రీఫండ్ క్లెయిమ్‌లకు మధ్య వ్యత్యాసాలు ఉంటుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం 73,000 పైచిలుకు సంస్థలు రూ. 30,000 కోట్ల మేర ఐజీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించి రీఫండ్ మాత్రం క్లెయిమ్ చేయడం లేదు. లగ్జరీ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్స్ దిగుమతులకు సంబంధించి భారీ స్థాయిలో పన్నుల ఎగవేతలు ఉండవచ్చని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. వీటి దిగుమతి విలువను తక్కువగా చూపించి, బ్లాక్మార్కెట్లో విక్రయిస్తుండవచ్చని ఆయన తెలిపారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల విశ్లేషణ చేపట్టిన నేపథ్యంలో త్వరలోనే ఎగవేతదారులను గుర్తించి, చర్యలకు సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. -
6 నెలలు.. రూ.18 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఆరు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల శాఖ ద్వారా రూ.18వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత జూలై నుంచి డిసెంబర్ వరకు పన్నుల శాఖ గణాంకాల ప్రకారం మొత్తం రూ.18,081.25 కోట్లు ఖజానాకు చేరాయి. గతేడాది (2016–2017 ఆర్థిక సంవత్సరం) తో పోలిస్తే ఈ ఆరు నెలల్లో 10 శాతం వరకు పన్ను రాబడిలో వృద్ధి నమోదైంది. అయితే, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల ఆదాయం తగ్గిపోతుందనే అనుమానాలు పటాపంచలయ్యాయి. కేంద్రం నుంచి ఆశించిన మేర పరిహారం రాకపోయినా.. పన్నుల ద్వారా ఆదాయం పెరగడం పట్ల ఆ శాఖ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జీఎస్టీ లెక్క రూ.8వేల కోట్ల వరకు.. వాస్తవానికి మద్యం, పెట్రోలు తప్ప మిగిలిన అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ అమలవుతోంది. అయితే, పెట్రోల్ పన్నును కూడా వ్యాట్ కింద పన్నుల శాఖే వసూలు చేసి నమోదు చేస్తుంది. మద్యం ఆదాయాన్ని మాత్రం ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఆదాయాన్ని మినహాయించి పన్నుల శాఖ వసూలు చేసింది ఈ ఆరు నెలల్లో 18 వేల కోట్ల రూపాయలపైనే ఉండటం గమనార్హం. ఇందులో రూ.10 వేల కోట్ల వరకు పెట్రో, ఇతర వ్యాట్ వర్తింపు వస్తువుల నుంచి వసూలైంది. కాగా, జీఎస్టీ పేరుతో రూ.8వేల కోట్ల వరకు వచ్చాయి. ఇందులో కూడా రాష్ట్ర జీఎస్టీ కింద రూ.3,969 కోట్లు, ఐజీఎస్టీ (వస్తు వినియోగ పన్ను) కింద రూ.3,438 కోట్లు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు కేంద్రం నుంచి మూడు దఫాల్లో ఇప్పటివరకు రూ.338 కోట్లు పరిహారం కింద వచ్చింది. అయితే, రాష్ట్ర జీఎస్టీ జూలై నుంచి ప్రతి నెలా తగ్గుతుండగా, ఐజీఎస్టీలో ప్రతి నెలా వృద్ధి కనిపిస్తుండడం గమనార్హం. గతేడాది రూ.16,220 కోట్లే.. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ అమలు చేసిన ఈ ఏడాది పన్నుల శాఖ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి డిసెంబర్ వరకు రూ.16,220 కోట్లు ఆదాయం రాగా, ఈ సారి అది రూ.18వేల కోట్లకు చేరింది. అంటే గతేడాది కంటే 10 శాతం వృద్ధి నమోదైంది. మరో విశేషమేమిటంటే జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలైలో అత్యధికంగా రూ.3,251 కోట్ల పన్నులు వసూలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్నుల శాఖ ఆదాయ వివరాలు నెల 2016–17 2017–18 (రూ.కోట్లలో) జూలై 2,292.1 3,251.38 ఆగస్టు 2,799.56 2,675.21 సెప్టెంబర్ 2,815.44 2,976.59 అక్టోబర్ 2,756.79 3,125.18 నవంబర్ 2,880.8 3,075.93 డిసెంబర్ 2,675.54 2,976.96 మొత్తం 16,220.23 18,081.25 -
పార్టీ చేసుకొని.. పన్ను కట్టరా?
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ ఈవెంట్లకు కచ్చితంగా పన్ను కట్టాలని ముందే హెచ్చరించినా అనేక మంది ఈవెంట్ నిర్వాహకులు స్పందించకపోవడంతో పన్నుల శాఖ రంగంలోకి దిగింది. 40 ప్రత్యేక బృందాలతో నగరమంతా గాలించిన అధికారులు.. డిసెంబర్ 30, 31 తేదీలలో నగరంలో జరిగిన ఈవెంట్ల వివరాలు సేకరించి కార్యక్రమాలు జరిగిన ప్రదేశాల యజమానులు, ఈవెంట్ల నిర్వాహకులకు నోటీసులిచ్చారు. మొత్తంగా 40 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పట్టించుకోకపోవడంతో.. న్యూ ఇయర్ ఈవెంట్లన్నీ పన్ను పరిధిలోకొస్తాయని.. టీజీఎస్టీ, సీజీఎస్టీ చట్టాల్లోని సెక్షన్ 25 (1) ప్రకారం ఈవెంట్ల నిర్వాహకులు రిజిస్టర్ చేసుకుని పన్ను కట్టాలని పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ గత నెల 28నే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రకారం పన్నుల శాఖ కార్యాలయంలో ఈవెంట్లను రిజిస్టర్ చేయించుకొని ముందస్తు పన్ను చెల్లించాలి. కానీ, ఉత్తర్వులను అనేకమంది పట్టించుకోకపోవడంతో 40 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పన్నుల శాఖ ఉన్నతాధికారులతో కూడిన ఈ బృందాలు 30, 31 తేదీల్లో ఈవెంట్లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు. ఈవెంట్లకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ టికెట్ల అమ్మకాలు, అగ్రిమెంట్ కాపీల వివరాలు సేకరించారు. లభించిన సమాచారం ప్రకారం నిర్వాహకులతోపాటు ఈవెంట్ జరిగిన ప్రదేశాల బాధ్యులకూ నోటీసులిచ్చారు. రామోజీ ఫిలింసిటీ, ఫలక్‌నుమా ప్యాలెస్.. నగరమంతా గాలించిన బృందాలు 40 సంస్థలకు నోటీసులిచ్చాయి. జాబితాలో ప్రముఖ క్లబ్‌లు, హోటళ్లు ఉన్నాయి. రామోజీ ఫిలింసిటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్, ఫిలింనగర్ కల్చరల్ క్లబ్, కంట్రీక్లబ్, ఫలక్‌నుమా ప్యాలెస్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకూ నోటీసులిచ్చామని శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నగరంలో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ల పన్ను రూ.కోట్లల్లో వస్తుందని, చట్టం ప్రకారం నోటీసులిచ్చామని అధికారులు చెబుతున్నారు. అగ్రస్థానం సన్బర్న్దే.. హైదరాబాద్‌లో డిసెంబర్ 31న జరిగిన గ్రాండ్ పార్టీల్లో గచ్చిబౌలి సన్బర్న్దే అగ్రస్థానమని పన్నుల శాఖ పరిశీలనలో తేలింది. నగరంలోని ప్రముఖ క్లబ్‌లు, హోటళ్లలో వందల సంఖ్యలో ఈవెంట్లు జరిగినా సన్‌బర్న్ ఈవెంట్లో 90 శాతానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. చట్ట ప్రకారం ఈవెంట్ నిర్వాహకులు పన్ను చెల్లించాల్సిందేనని.. సన్‌బర్న్ నిర్వాహకుడు రిజిస్టర్డ్ డీలర్ కావడంతో చెల్లింపులో ఇబ్బంది తలెత్తే అవకాశం లేదంటున్నారు. -
జీఎస్టీ అమలు అస్తవ్యస్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు అస్తవ్యస్తంగా మారింది! పన్ను చెల్లించాల్సిన వ్యాపారులు ఏ వస్తువులు కొంటున్నారో, ఎన్ని వస్తువులు అమ్ము తున్నారో కూడా కనీస సమాచారం ఇచ్చే పరి స్థితి లేకుండా పోయింది. జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన 2 లక్షల మందికిపైగా డీలర్లలో ఒక్క రు కూడా 3 నెలలుగా జీఎస్టీ రిటర్న్స్–1 నమో దు చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తాము ఏం వస్తువులు కొంటున్నా మో ఇన్వాయిస్లతో సహా దాఖలు చేయాల్సి న వ్యాపారులు సాంకేతిక కారణాలతో జా ప్యం చేస్తుండటం, ఈ రిటర్న్స్ దాఖలు గడు వును కేంద్రం పదే పదే పొడిగిస్తుండటంతో ఏం వ్యాపారం జరుగుతుందో కూడా ప్రభుత్వానికి అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. జూలైలో తప్పిస్తే... జీఎస్టీ అమల్లో భాగంగా వ్యాపారులు మూడు రకాల రిటర్న్‌లను దాఖలు చేయడంతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందులో జీఎస్టీఆర్–1 ద్వారా ఒక డీలర్ ఏయే వస్తువులను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో ఇన్వాయిస్లతో సహా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్–2 ద్వారా ఏయే వస్తువులు ఎవరికి అమ్మారో బిల్లులతో సహా ఇవ్వాల్సి ఉంటుంది. జీఎస్టీఆర్–3 ద్వారా కొనుగోళ్లు, అమ్మకాల టర్నోవర్ లెక్కలను పేర్కొంటూ అమ్మిన వస్తువులున్న శ్లాబ్ ప్రకారం పన్నును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. జూలై తప్పిస్తే ఇప్పటివరకు ఒక్క డీలరూ జీఎస్టీఆర్–1ను దాఖలు చేయలేదు. రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకుతోడు కేంద్రం పొడిగిస్తున్న గడువు, పన్నులశాఖ మొక్కుబడి కార్యక్రమాలకు పరిమితమవుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఆ శాఖ అధికారులే అంటున్నారు. వ్యాట్ ఉన్నప్పుడే నయం జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి ప్రస్తుతం నెలకు రూ. వెయ్యి కోట్ల ఆదాయం రావట్లే దు. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు సగటున రూ. 1,500 నుంచి రూ. 1,600 కోట్ల వరకు పన్నుల ఆదాయం వచ్చేది. ఇప్పుడు జీఎస్టీ ద్వారా నికరంగా నెలకు రాష్ట్రం రూ. 500–600 కోట్లు నష్టపోతోందన్నమాట. జీఎస్టీ అమల్లోకి వచ్చి నాలుగు నెలలవుతున్న నేపథ్యం లో ఇప్పటికే రూ. 2 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందన్నమాట. మరి ఈ నష్టం ఎలా పూడుతుందో, జీఎస్టీ నెట్‌వర్క్‌లో సాంకేతి క సమస్యలన్నీ తొలగి వ్యాపారులు పన్ను ను సకాలంలో చెల్లించే పరిస్థితి ఎప్పటికి వస్తుందో, కేంద్రం ఇవ్వాల్సిన పరిహార మొత్తాన్ని ఎప్పుడు ఇస్తుందో పెరుమాళ్లకే ఎరుక! వచ్చేదెంత... పోయేదెంత? వ్యాపారుల పరిస్థితి అలా ఉంటే.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఎంత ఆదాయం వచ్చిందనే లెక్క కూడా సరిగ్గా తెలియకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి గుబులు పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఎస్టీఎన్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం తెలంగాణలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 22 వరకు రూ. 10,535 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం జీఎస్టీ కింద వచ్చిన పన్నులో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) కింద రూ. 2,129 కోట్లను కేంద్రం తీసుకుంటోంది. కేవలం రూ. 3,186 కోట్లు మాత్రమే రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) కింద వచ్చింది. మిగిలిన దాంట్లో రూ. 1,814 కోట్లను పరిహారం కింద చూపుతుండగా మరో రూ. 3,405 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఎస్జీఎస్టీ కింద చూపిన రూ. 3,186 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఈ నాలుగు నెలల్లో అధికారికంగా పన్ను కింద వచ్చింది. ఇక పరిహారం కోసం రాష్ట్రం ప్రతిపాదనలు పంపగా రూ. 300 కోట్లు ఇచ్చిన కేంద్రం... లెక్కల్లో మాత్రం రూ. 1,814 కోట్లను చూపుతుండటం గమనార్హం. ఆ మిగిలిన మొత్తం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు ఐజీఎస్టీ కింద చూపిన రూ. 3,405 కోట్లలో 50 శాతం మళ్లీ కేంద్రానికి వెళుతుంది. అందులో మిగిలే రూ. 1,700 కోట్లలో రూ. వెయ్యి కోట్లకు మించి రాదని (ఇతర రాష్ట్రాలకు ఐజీఎస్టీ కింద కేంద్రం పంచాల్సిన నేపథ్యంలో) పన్నులశాఖ అధికారులే అంటున్నారు. ఇది కూడా ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం గమనార్హం. -
పన్ను తగ్గించకపోతే చర్యలే
సాక్షి హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గిన వస్తువుల ధరలను వెంటనే తగ్గించి అమ్మాలని, లేదంటే చర్యలు తప్పవని రాష్ట్ర పన్నుల శాఖ హెచ్చరిం చింది. ఈ బాధ్యతను కంపెనీలే తీసుకోవా లంది. పన్నుల శాఖ కమిషనర్ వి. అనిల్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ జె.లక్ష్మీనారాయణ తదితర ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ చాలా వస్తువుల ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 10న తీసుకున్న నిర్ణయం 15 నుంచి అమల్లోకి వచ్చిందని, తగ్గిన పన్నుకు అనుగుణంగా వస్తువుల ధరలను తగ్గించాలని కోరారు. కేవలం 50 వస్తువులకు మాత్రమే 28 శాతం పన్ను వర్తిస్తుందని, మిగిలిన వస్తువుల ధరలు తగ్గిన పన్నుకు అనుగుణంగా తగ్గించాలని సూచించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ద్వారా జరిగే లబ్ధి వినియోగదా రునికి చేరేవరకు ఆయా కంపెనీలే బాధ్యతలు తీసుకోవాన్నారు. దరలు తగ్గించని పక్షంలో యాంటీప్రాఫిటరింగ్ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కాల్గేట్, పామోలి వ్, పీఅండ్‌జీ, గోద్రెజ్, డాబర్ ఇండియా, విప్రో, ఫ్యూచర్ రిటైల్ లాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రతినిధులతో పాటు మోర్, రిలయన్స్, డీమార్ట్, రత్నదీప్, మెట్రో, మ్యాక్స్ హైపర్, స్పార్, క్యూమార్ట్ సూపర్ మార్కెట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 28 నుంచి 18 శాతానికి పన్ను తగ్గిన వస్తువులివే వైర్లు, కేబుల్స్, ఎలక్ట్రికల్ ఫిట్టిం గులు, చెక్క వస్తువులు, ఫైబర్ బోర్డులు, ప్లైవుడ్, ఫర్నీచర్, పరుపులు, సూట్‌కేసులు, డిటర్జెంట్లు, చర్మ సౌందర్య సాధనాలు, షాంపూలు, రేజర్ బ్లేడులు, ఫ్యాన్లు, పంపులు, కంప్రెషర్లు, సంగీత సాధనాలు, చాక్లెట్లు. జీఎస్టీఆర్–3బీ అపరాధ రుసుము రద్దు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం ప్రకారం రాష్ట్రంలోని రిజిస్టర్డ్ డీలర్లు ఫైల్ చేయాల్సిన జీఎస్టీఆర్–3బీ రిటర్న్ లు సకాలంలో చేయకపోతే విధించే అపరాధ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించిన రుసుమును రద్దు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రెవెన్యూ రిక‘వర్రీ’!
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన బకాయిలు రాబట్టుకోవడం పన్నుల శాఖకు పెద్ద సమస్యగా మారింది. నోటీసులిచ్చినా, చివరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద తాఖీదులు జారీ చేసినా డీలర్ల నుంచి స్పందన లేకపోవడం, జీఎస్టీ అమలు నేపథ్యంలో డీలర్ల పట్ల పన్నుల శాఖ సిబ్బంది మెతక వైఖరి కారణంగా ఈ బకాయిలు ఇప్పట్లో వసూలయ్యేలా కనిపించట్లేదు. రూ.322 కోట్లకు పైగా పన్ను బకాయిల కోసం ఆర్ఆర్ చట్టం కింద నోటీసులు జారీ చేసి 4 నెలలవుతున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. లొసుగులే ఆసరాగా.. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు పన్నుల శాఖ ప్రయోగించే చివరి అస్త్రం రెవెన్యూ రికవరీ చట్టం. ఈ చట్టం కింద నోటీసులు జారీ చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి సదరు డీలర్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసుకోవడం, అవసర మైతే స్థిర, చరాస్తుల వేలం ద్వారా పన్నులను రాబట్టుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ చట్టంలోని లోసుగుల ఆధారంగా డీలర్లు కోర్టులకు వెళుతుండటం, అసెస్మెంట్లలో తప్పులున్నాయంటూ నోటీసులకు సమాధానా లిచ్చి కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. జీఎస్టీ రాకతో పెండింగ్‌లోకి.. జీఎస్టీ రాకతో మొండి బకాయిల ఫైల్ పెండిం గ్లో పడిపోయింది. జూన్ నుంచి జీఎస్టీ అమలు చేయడంలో మునిగిపోయిన అధికారులు బకాయిలపై దృష్టి సారించలేదు. ఆగస్టు తర్వాత ఉన్న తాధికారులు బకాయిల వసూలుకు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అయినా క్షేత్ర స్థాయిలో స్పందన లేకపోవడంతో పాత బకాయి లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దంటూ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ అమలు వల్ల డీలర్లను, అధికారులను సాంకేతిక సమస్యలు వేధిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆ పనిపై దృష్టి సారించలేక పోతున్నామని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
జీఎస్టీ షురూ..
♦ అమల్లోకి వచ్చిన నూతన విధానం ♦ పన్నులపై వినియోగదారుల ఆరా ♦ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో సదస్సులు సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్టీ అమలు విధానం ప్రారంభమైంది. నిన్నటి వరకు విలువ ఆధారిత పన్ను(వ్యాట్), టర్నోవర్ ట్యాక్స్, వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్ రూపంలో రాష్ట్రం, సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ సెంట్రల్ ఎక్సైజ్, సర్వీసు ట్యాక్స్ రూపంలో కేంద్రప్రభుత్వం పన్నులు వసూలు చేసేవి. అయితే ఈ పన్నులన్నీ రద్దయి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి వచ్చింది. దేశ వాణిజ్య విధానం ఇన్నాళ్లు వేర్వేరుగా ఉండేది. ఇప్పుడు జీఎస్టీ అమలులోకి రావడంతో ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నా రు. పన్నుల విధానాన్ని ఏడు రకాలుగా విభజించారు. దీంతో శనివారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యాపార సంస్థల యాజమాన్యాలు జీఎస్టీ పన్నుతో కూడిన బిల్లులను వినియోగదారులకు అందించారు. ఇక వినియోగదారులు తమపై ఎంత మేరకు జీఎస్టీ భారం పడుతుందని ఆసక్తిగా తెలుసుకోవడం కనిపించింది. కార్యాలయాల్లో.. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖల సర్కిల్ కార్యాలయాల్లో అధికారులు జీఎస్టీకి స్వాగతం పలుకుతూ శనివారం కేక్ కట్ చేశారు. ఆ తర్వాత వివిధ వ్యాపార సంస్థల డీలర్లు, సిబ్బందితో సమావేశం అయ్యారు. జీఎస్టీపై వారికి అవగాహన కల్పించడంతో పాటు పలు సూచనలు చేశారు. జీఎస్టీ కొత్త నిబంధనలను వివరించారు. సీటీఓ ఆఫీస్‌లో.. కరీమాబాద్: ‘ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్..’ విధానంతో దేశ చరిత్రలో ప్రతిష్టాత్మక గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు వరంగల్ హంటర్‌రోడ్డులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం(సీటీఓ)లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏసీ, సీటీఓ నేహా కేక్ కట్ చేసి ఉద్యోగులు, డీలర్లకు అందజేశారు. కార్యక్రమంలో సీటీఓలు, ఏసీటీఓలు, డీసీటీఓలతో పాటు వివిధ వ్యాపార సంస్థల డీలర్లు పాల్గొన్నారు. -
నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్నుశాఖ నోటీసులకు స్పందించనివారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఫైనాన్స్ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదాయం ప్రొఫైల్‌ను సరిపోలని రద్దయిన నోట్ల డిపాజిట్లపై స్పందించని 9.29లక్షల ఖాతాదారులపై చర్యలుంటాయని చెప్పారు. 50రోజులు డిమానిటైజేషన్ కాలంలో 18లక్షల ఖాతాల్లో రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్ అయ్యాయని ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానంగా జైట్లీ తెలిపారు. ఈ డాటా విశ్లేషణలో సీబీడీటీ, ఆదాయపన్నుశాఖ పరిశీలనలో ప్రాథమికంగా 18 లక్షల ఖాతాదారుల డిపాజిట్లు అనుమానాస్పదంగా తేలినట్టు చెప్పారు. వీరిని ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా వివరణకోరామనీ, అయితే 8.71 లక్షలమంది మాత్రమే స్పందించారని తెలిపారు. ఐటీ నోటీసులుకు స్పందించనివారిపై ఆదాయ పన్ను చట్టం ప్రకారం సంబంధిత చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి వెల్లడించారు. డిమానిటైజేషన్ కాలంలో జరిగిన మొత్తం డిపాజిట్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా నల్లధనాన్ని నిరోధించే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినోటును లెక్కిస్తోందని చెప్పారు. కచ్చితమైన ఫిగర్ వచ్చినప్పుడు, మొత్తం లెక్కలను వెల్లడిస్తుందని చెప్పారు. -
అవినీతి ఐటీ అధికారులపై కొరడా
న్యూఢిల్లీ: అవినీతి అధికారులపై సీబీఐ కొరడా ఝులిపించింది. ఆదాయపన్ను ముఖ్య కమిషనర్ (ఢిల్లీ) ఎస్కే మిట్టల్‌తోపాటు ఆదాయపు పన్ను శాఖకు చెందిన 9 మంది అధికారులు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదుచేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఖమ్మంలలో సోదాలు జరిగాయి. ఒక అధికారి ఇంట్లో రూ.2.6 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, 16 లక్షల నగదు, 4.25 కేజీల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
ఈ-మెయిల్ ద్వారా పన్ను నోటీసులు, వివరణలు
- కొత్త విధానంపై ఐటీ శాఖ కసరత్తు న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వడానికి ఈ మెయిల్ మార్గాన్ని ఆదాయపు పన్ను శాఖ ఉపయోగించుకోనున్నది. పన్ను చెల్లింపుదారులు తమ వివరణను కూడా ఈ మెయిల్ ద్వారా తెలిపే అవకాశం ఈ విధానంలో అందుబాటులోకి రానున్నది. మధ్య, అధిక స్థాయి పన్ను బ్రాకెట్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త విధానం మంచి ప్రయోజనకరమని నిపుణులంటున్నారు. అసెస్సీకి, అధికారులకు మధ్య భారం తగ్గించే దీనికి సంబంధించిన విధి విధానాలపై కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కసరత్తు చేస్తోంది. పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తగ్గించే క్రమంలో భాగంగా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని సీబీడీటీ చైర్పర్సన్ అనితా కపూర్ పేర్కొన్నారు. తనిఖీ అవసరమైన సందర్భాల్లో పన్ను చెల్లింపుదారుడు తన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లో ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్‌కు నోటీస్ ఇస్తామని తెలిపారు. ఇలాంటప్పుడు సదరు అసెస్సీ, అసెస్సింగ్ ఆఫీసర్‌ను (ఏఓ)ను కలిసి వివరణ ఇవ్వనసరం లేకుండా తన వివరణను ఈ మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుందని వివరించారు.