team india coach
-
టీమిండియాకు కాదు.. ఐపీఎల్ కోచ్‌గా ఉండటం బెటర్: సెహ్వాగ్
టీమిండియా హెడ్‌కోచ్ పదవి గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టు శిక్షకుడిగా ఉండటం కంటే.. ఐపీఎల్ కోచ్‌గా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. భారత విధ్వంసకర ఓపెనర్‌గా గుర్తింపు పొందిన వీరూ భాయ్.. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అదే ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు చివరిసారిగా ప్రాతినిథ్యం వహించాడు.అనంతరం అదే జట్టుకు 2016లో మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు సెహ్వాగ్. 2018 వరకు అదే పదవిలో కొనసాగాడు. అయితే, 2017లోనే టీమిండియా హెడ్‌కోచ్ రేసులో నిలిచినా.. రవిశాస్త్రికి అవకాశం దక్కగా.. సెహ్వాగ్‌కు మొండిచేయి ఎదురైంది. అప్పటి నుంచి మళ్లీ అతడు ఎన్నడూ జాతీయ జట్టు కోచ్‌గా వెళ్లాలన్న ప్రయత్నం చేయలేదు.టీమిండియాకు కాదు.. ఐపీఎల్ కోచ్‌గా ఉండటం బెటర్‌ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ అందుకు గల కారణం వెల్లడించాడు. ‘‘టీమిండియా కోచ్‌గా ఉండటం కంటే ఐపీఎల్ జట్టు కోచ్‌గా ఉండటానికే నేను మొగ్గుచూపుతాను. నిజానికి నేను గనుక భారత జట్టు కోచ్‌ని అయితే.. మళ్లీ పాతరోజుల్లాగే గడుస్తుంది. సిరీస్‌లు ఉన్నపుడు ఇంటికి ఏడెనిమిది నెలలపాటు దూరంగా ఉండాల్సి వస్తుంది.నా కుమారులూ క్రికెటర్లేఇప్పుడు నా పిల్లల వయసు 14, 16 ఏళ్లు. వాళ్లకు నా అవసరం ఉంది. వాళ్లిద్దరు క్రికెటర్లే. ఒకరు ఆఫ్ స్పిన్నర్ అయితే.. మరొకరు ఓపెనింగ్ బ్యాటర్. నా కుమారులకు దిక్సూచిలా ఉంటూ.. వారికి తగినంత సమయం కేటాయించడమే నా ముందున్న కర్తవ్యం’’ అని సెహ్వాగ్ అమర్ ఉజాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కోచ్‌గా మారితే స్వల్పకాలం మాత్రమే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. అందుకే తన ఓటు అటు వేశానని పేర్కొన్నాడు.చదవండి: అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పా.. ఆ తర్వాత: భజ్జీ -
టీమిండియా కోచ్‌గా తమ్ముడు.. అన్న ఆసక్తికర వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సహాయక బృందంలోని ర్యాన్ టెన్ డస్కటే, అభిషేక్ నాయర్లతో అతడు కూడా చేరనున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా జరుగనున్న ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో మోర్నీ మోర్కెల్ అన్నయ్య, మాజీ క్రికెటర్ ఆల్బీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యే అవకాశం రావడం అరుదని.. ఇలాంటి బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తేనే అంతా సాఫీగా సాగిపోతుందని అన్నాడు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు ఆల్బీ మోర్కెల్ మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్లతో పోలిస్తే టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. సుదీర్ఘ కాలంగా విజయవంతమైన జట్టుగా భారత్ కొనసాగుతోంది. అలాంటి చోట పొరపాట్లకు తావుండదు. ఇక ఆ జట్టులో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.ముందుగా వారందరి నమ్మకం చూరగొనడం మోర్నీకి అత్యంత ముఖ్యమైనది. తమ నైపుణ్యాలకు మరింత మెరుగులుదిద్దుకునేలా మోర్నీ సహకరిస్తాడని వారు విశ్వసించాలి. అప్పుడే చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ బౌలర్‌గా మోర్నీకి ఎంతో అనుభవం ఉంది.అతడి మార్గదర్శనంలో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. మోర్నీ గనుక తన ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే.. భారత జట్టుకు తప్పక మేలు చేకూరుతుంది’’ అని పేర్కొన్నాడు. మిడ్ డే తో మాట్లాడుతూ ఆల్బీ మోర్కెల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మోర్నీ మోర్కెల్‌కు గంభీర్‌తో మంచి అనుబంధం ఉంది.ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడాడు మోర్నీ. అనంతరం... లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సమయంలో అతడు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇక సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడిన మోర్నీ మోర్కెల్.. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత
టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గైక్వాడ్ కేన్సర్ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆదుకోవాలని బీసీసీఐకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్యే విన్నవించిన సంగతి తెలిసిందే. స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈలోపే ఆయన కన్నుమూశారు. గైక్వాడ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు గైక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సానూభూతి ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. Shri Anshuman Gaekwad Ji will be remembered for his contribution to cricket. He was a gifted player and an outstanding coach. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti.— Narendra Modi (@narendramodi) July 31, 2024 My deepest condolences to the family and friends of Mr Aunshuman Gaekwad. Heartbreaking for the entire cricket fraternity. May his soul rest in peace🙏— Jay Shah (@JayShah) July 31, 2024 అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. మొత్తం 2,254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేశాడు. రెండుసార్లు టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అంతకు ముందు నైంటీస్‌లో ఆయన జాతీయ టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ పనిచేశారు. -
మూడు ఫార్మాట్లలో ఆడాల్సిందే: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
‘‘ఒక ఆటగాడు పూర్తి ఫిట్‌గా ఉంటే మూడు ఫార్మాట్లు తప్పక ఆడాలని నేను విశ్వసిస్తాను. గాయాల బెడద వెంటాడుతుందనే భయంతో ఆటకు దూరంగా ఉండటం నాకు నచ్చదు.గాయపడితే ఏమవుతుంది? తిరిగి కోలుకుంటారు కదా! అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టాప్ క్రికెటర్లలో ఎవరిని అడిగినా మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నామనే చెబుతారు.రెడ్ బాల్ బౌలర్లు లేదంటే వైట్ బాల్ బౌలర్లు అని ముద్ర వేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. గాయాలన్నవి ఆటగాళ్ల జీవితంలో భాగం. అంతేగానీ వాటి కారణంగా ఏదో ఒక ఫార్మాట్‌కే పరిమితం కావడం సరికాదు. ఒకవేళ గాయపడ్డా.. పట్టుదలతో కోలుకుని తిరిగి రావడం పెద్ద కష్టమేమీ కాదు.కొంతమందికి విశ్రాంతినిస్తూ ప్రత్యేకంగా చూడటం పట్ల నాకు సదభిప్రాయం లేదు. గాయాలు, పని ఒత్తిడి అంటూ ఆటకు దూరంగా ఉండకూడదు. నిజానికి ప్రొఫెషనల్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ వ్యవధి చాలా తక్కువ. అలాంటపుడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భావించాలే గానీ.. తప్పుకోకూడదు.ఏ ఆటగాడైనా ఫామ్‌లో ఉంటే.. మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు సాగాలి. నేనైతే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే ఫలితాల గురించి పట్టించుకోవడం మానేశాను.వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. విలువలతో, క్రీడాస్ఫూర్తితో ఆడితే అంతా సజావుగానే సాగిపోతుందని నమ్ముతాను. మనం నిజాయితీగా ఉన్నంత కాలం ప్రపంచం మొత్తం మనల్ని వ్యతిరేకించినా ఏమీ కాదు. జట్టు ప్రయోజనాలు మాత్రమే అంతిమ లక్ష్యంగా ఉండాలి.నేను క్రికెట్ మైదానంలో దూకుడుగానే ఉండేవాడిని. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో వాదనకు దిగాల్సి వచ్చేది. అదంతా కేవలం జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే.వ్యక్తిగత విజయాలకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు. జట్టే ముందు.. ఆ తర్వాతే మనం. అలాంటపుడే సమష్టిగా రాణించి గెలుపొందగలం. ఇది జట్టుగా ఆడే ఆట కాబట్టి.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు.ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడాలని పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యే కంటే ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ ఈ మేరకు గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవలంబించబోయే విధానాల గురించి ముందుగానే ఇలా సంకేతాలు ఇచ్చాడు. కాగా గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.గాయాల భయంతో హార్దిక్ ఎన్నో ఏళ్లుగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు కేవలం వన్డే, టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు.. గంభీర్ వచ్చే కంటే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్? -
‘కోహ్లితో చెప్పలేదట.. హార్దిక్ పాండ్యాకు తెలుసు’
భారత క్రికెట్లో ‘గంభీర్’ శకం ఆరంభం కానుంది. పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో ఉన్న టీమిండియాను తన మార్గదర్శనంలో సమర్థవంతంగా ముందుకు నడపటం ఆషామాషీ కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లను కొనసాగిస్తూనే యువకులకు అవకాశం ఇచ్చే విషయంలో గౌతీ ఎలా వ్యవహరిస్తాడనేది కీలకం.రానున్న మూడున్నరేళ్ల కాలం హెడ్ కోచ్‌గా కొనసాగనున్న గంభీర్‌కు తొలుత చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో సవాలు ఎదురుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్‌కప్-2027.ఈ ఐసీసీ టోర్నీలలో టీమిండియాను టాప్‌లో నిలపడం అంత తేలికేమీ కాదు. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బ్యాటర్‌గా కోహ్లి కీలకం.కాగా ఐపీఎల్-2023 సందర్భంగా కోహ్లితో గంభీర్‌కు వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయినట్లుగా కనిపించినా.. ఇప్పుడు కోచ్, ఆటగాడి పాత్రల్లో ఏ మేరకు సమన్వయం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. ద్రవిడ్‌నే హెడ్ కోచ్‌గా కొనసాగితేనే బాగుంటుందంటూ రోహిత్ బీసీసీఐ ఎదుట తన మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వీరిద్దరితో గంభీర్ ఎలా మెలుగుతాడన్నదే ప్రశ్న. రాహుల్ ద్రవిడ్‌లా పెద్దన్నలా వ్యవహరిస్తాడా? లేదంటే తనదైన సహజశైలిలో దూకుడుగానే ఉంటాడా? చూడాలి.ఇదిలా ఉంటే.. గంభీర్ నియామకం నేపథ్యంలో బీసీసీఐ ఒక్కసారి కూడా రోహిత్- కోహ్లి ద్వయాన్ని సంప్రదించలేదనే వార్త బయటకు వచ్చింది.అదే సమయంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాత్రం ఈ విషయం గురించి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘వీరంతా కూర్చుని మాట్లాడుకోవడానికి, జట్టు గురించి చర్చించడానికి చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏమీ ముగిసిపోలేదు.సమీప భవిష్యత్తులో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర కాబోతున్నందున ఆ దిశగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేస్తోంది’’ అని పేర్కొన్నాయి.కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విశ్రాంతి కోరుకుంటున్నారని.. ఇద్దరూ లాంగ్ లీవ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్‌తో కోచ్‌గా గంభీర్ అరంగేట్రం చేయనుండగా.. ఆ వన్డే సిరీస్‌కు వీరిద్దరు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. -
హెడ్ కోచ్‌గా గంభీర్ జీతం అన్ని కోట్లా?.. ద్రవిడ్ కంటే రెట్టింపు?!
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.రెండు పడవల మీద ప్రయాణం చేయలేననిబీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్.. కామెంటేటర్‌గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్.. పూర్తి స్థాయిలో క్రికెట్‌కే అంకితమయ్యాడు.ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరువలేనివి.ఈ క్రమంలోనే గౌతం గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.టీ20 ప్రపంచకప్-2024 అందించికాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024 అందించిన కోచ్‌గా ద్రవిడ్ పేరు సంపాదించాడు.ఇక హెడ్ కోచ్‌గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు?కాగా కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. హెడ్ కోచ్‌గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.జీతంతో పాటు అన్ని సదుపాయాలువార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్‌కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.అయితే, హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.ఎట్టకేలకు గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.అదే నా లక్ష్యం: గంభీర్‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా గంభీర్ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్!
టీమిండియా హెడ్‌కోచ్ ఎవరన్న అంశంపై ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నా.. డబ్ల్యూవీ రామన్ కూడా రేసులో ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా కొనసాగిస్తూనే.. రామన్ సేవలను కూడా వినియోగించుకునే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. తాను హెడ్‌కోచ్ పదవి చేపట్టాలంటే గంభీర్ బీసీసీఐకి కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. నవ్‌భారత్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఎదుట ఎదుట ఇంటర్వ్యూకి హాజరైన సమయంలో తన ఐదు షరతులను వెల్లడించినట్లు సమాచారం. అవేమిటంటే..తాను హెడ్‌కోచ్ పదవి చేపట్టినట్లయితే.. క్రికెటింగ్ ఆపరేషన్స్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. ఆటకు సంబంధించిన ప్రతి విషయం తన ఆధీనంలోనే ఉండాలి.అదే విధంగా.. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల సెలక్షన్ విషయం తనకే వదిలేయాలి.ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైనది.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి సీనియర్లకు పాకిస్తాన్ వేదికగా జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ-2025 అనేది చివరి అవకాశం.ఒకవేళ ఈ వన్డే టోర్నీలో వీళ్లు గనుక విఫలమైతే జట్టు నుంచి వాళ్లందరిని తప్పించే వీలు కల్పించాలి. అయితే, ఇది కేవలం ఈ ఒక్క ఫార్మాట్‌కే పరిమితమా? లేదంటే మూడు ఫార్మాట్ల జట్ల నుంచి వీరికి ఉద్వాసన పలకాలని గంభీర్ భావిస్తున్నాడా? అన్న అంశంపై స్పష్టత లేదు.నాలుగో కండిషన్ ఏమిటంటే.. వన్డే, టీ20 ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. టెస్టు ఫార్మాట్‌కు ప్రత్యేక జట్టు ఉండాలి.ఇక ఐదోది.. 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే తన ప్రణాళికలను నిక్కచ్చిగా అమలు చేయడం.ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లిలకు గడ్డు పరిస్థితులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ వీరిని టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయని టీమిండియా అభిమానులు చర్చించుకుంటున్నారు. -
పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్: భజ్జీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్‌స్టన్‌కు తొలి మెగా టోర్నీలోనే చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2024లో పాక్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఆతిథ్య అమెరికా, చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓడి పరాభవాన్ని మూటగట్టుకుంది. గ్రూప్-ఏలో మిగిలిన కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచినా సూపర్-8 రేసులో అమెరికాతో పోటీ పడలేక ఇంటిబాట పట్టింది.గత టీ20 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన బాబర్ ఆజం ఈసారి ఇలా పూర్తిగా విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్- షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలతో జట్టు రెండుగా చీలిందనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ సైతం జట్టులో ఐక్యత లోపించినందు వల్లే ఇలాంటి చెత్త ఫలితాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ఎన్నో జట్లకు మార్గదర్శనం చేశానని.. అయితే, ఇంత చెత్త జట్టును చూడలేదని గ్యారీ మండిపడినట్లు తెలుస్తోంది.టీమిండియా కోచ్‌గా వచ్చెయ్ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పాక్‌ను వదిలేసి కిర్‌స్టన్ ఇండియా హెడ్ కోచ్‌గా రావాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘అనవసరంగా నీ సమయాన్ని అక్కడ వృథా చేసుకోకు గ్యారీ.టీమిండియా కోచ్‌గా వచ్చెయ్. గ్యారీ కిర్‌స్టెన్.. అరుదైన వజ్రం, గొప్ప కోచ్‌లలో ఒకడు. మెంటార్, నిజాయితీ గల వ్యక్తి.. అంతేకాదు 2011 వరల్డ్‌కప్ గెలిపించిన కోచ్.2011 నాటి జట్టులో అందరికీ ప్రియమైన స్నేహితుడు కూడా! గ్యారీ ప్రత్యేకమైన వ్యక్తి’’ అని భజ్జీ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.గౌతం గంభీర్ పేరు ఖరారు!ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ పేరు ఖరారు కాగా.. భజ్జీ ఇలా పోస్ట్ పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. గంభీర్‌ను వ్యతిరేకిస్తూ.. విదేశీ కోచ్ వైపే మొగ్గుచూపాలని బీసీసీఐకి సంకేతాలు ఇస్తున్నాడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ గతంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచినపుడు అతడే కోచ్‌గా ఉన్నాడు. ఇక భజ్జీతో పాటు గంభీర్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో భారత జట్టు సూపర్-8కు చేరింది. ఇందులో భాగంగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్ఆడనుంది.చదవండి: Suryakumar Yadav: వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు Don’t waste ur time there Gary .. Come back to Coach Team INDIA .. Gary Kirsten One of the rare 💎.. A Great Coach ,Mentor, Honest nd very dear friend to all in the our 2011 Team .. our winning coach of 2011 worldcup . Special man Gary ❤️ @Gary_Kirsten https://t.co/q2vAZQbWC4— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2024 -
ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
టీమిండియా కొత్త కోచ్ నియామకం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ కాదని.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని బీసీసీఐకి సూచించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినా బీసీసీఐ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ద్రవిడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.అయితే, మెగా టోర్నీ తర్వాత మాత్రం ద్రవిడ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఇప్పటికే కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 27తో గడువు ముగిసింది.గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లే!కానీ ఇంతవరకు కొత్త కోచ్ ఎవరన్నా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. విదేశీ కోచ్‌ల వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చినా.. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో.. ఐపీఎల్-2024 చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా దాదాపు ఖరారైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.తెలివిగా వ్యవహరించాలి‘‘ఎవరి జీవితంలోనైనా కోచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మైదానం లోపల.. వెలుపలా.. ఒక వ్యక్తికి మార్గదర్శనం చేస్తూ వారిని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత. కాబట్టి కోచ్‌ని ఎంచుకునేటపుడు తెలివిగా వ్యవహరించాలి’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఎవరు పడితే వాళ్లను కోచ్‌లుగా నియమించొద్దని పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు.ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘గంభీర్‌కు వ్యతిరేకంగానే మీరు ఈ పోస్ట్ పెట్టారు కదా? ఆయన హెడ్‌కోచ్ అవటం మీకు ఇష్టం లేదా?’’ అంటూ గంగూలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, దాదా అభిమానులు మాత్రం.. ‘‘గ్రెగ్ చాపెల్ మాదిరి ఇంకో కోచ్ వస్తే ఆటగాళ్లను విభజించి జట్టును భిన్న వర్గాలుగా విడదీస్తాడనే భయంతోనే గంగూలీ ఇలా జాగ్రత్తలు చెబుతున్నారు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుThe coach's significance in one's life, their guidance, and relentless training shape the future of any person, both on and off the field. So choose the coach and institution wisely…— Sourav Ganguly (@SGanguly99) May 30, 2024 -
టీమిండియా హెడ్‌కోచ్‌గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత విదేశీ కోచ్‌ల పేర్లు వినిపించగా.. ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత మాత్రం ఇండియన్నే ఈ పదవి చేపట్టనున్నాడనే అభిప్రాయాలు బలపడ్డాయి.రాహుల్ ద్రవిడ్ స్థానంలో మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఐపీఎల్ తాజా సీజన్ ఫైనల్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా గౌతీతో సుదీర్ఘ చర్చలు జరపడం.. గంభీర్ సైతం హెడ్‌కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు ఇందుకు ఊతమిచ్చాయి.అయితే, తాజాగా గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాను భారత ప్రధాన కోచ్ పదవి చేపట్టడం లేదని గంభీర్ ఒక రకంగా స్పష్టం చేశాడు. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే..‘‘కేకేఆర్ మూడో ట్రోఫీ గెలిచింది కాబట్టి.. డ్రెస్సింగ్‌రూం వాతావరణం మొత్తం సంతోషంతో నిండిపోయిందని మీరు అంటున్నారు. అయితే, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మేము ఇంకా రెండు టైటిళ్లు వెనుకబడి ఉన్నాం.ఈ సీజన్ బాగా సాగింది. అయితే, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవాలంటే మేమింకా మూడుసార్లు చాంపియన్లుగా నిలవాలి. అందుకు ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది.కాబట్టి మా తదుపరి మిషన్.. అదే. కేకేఆర్‌ను మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌గా చేయగలగాలి. అంతకంటే గొప్ప అనుభూతి నాకు మరొకటి ఉండదు. అయితే, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది’’ అని స్పోర్ట్స్‌కీడా ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.ఈ వ్యాఖ్యలను బట్టి గంభీర్ కేకేఆర్‌తో తన ప్రయాణం కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండాలంటే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, ఇతర జట్లతో సదరు వ్యక్తికి సంబంధం ఉండకూడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్‌గా కొనసాగేందుకే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
టీమిండియా హెడ్ కోచ్‌గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
BCCI: రాహుల్ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్ లాంగర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ రేసులో వినిపిస్తున్న పేర్లలో జస్టిన్ లాంగర్ పేరు ఒకటి. గతంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన లాంగర్.. ఆటగాళ్లతో విభేదాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న జస్టిన్ లాంగర్ 2024లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జట్టుకట్టాడు. పదిహేడో సీజన్లో లక్నోకు కోచ్‌గా నియమితుడయ్యాడు ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్.లాంగర్ మార్గదర్శనంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో అద్భుతాలు సాధిస్తుందనుకుంటే కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.ద్రవిడ్ వారసుడు ఎవరు?ఇదిలా ఉంటే.. బీసీసీఐ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ వేట మొదలుపెట్టిన నేపథ్యంలో జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన జస్టిన్ లాంగర్ బీబీసీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్ రాహుల్ తనకు వివరించాడంటూ బాంబు పేల్చాడు.అంతకు మించి.. వెయ్యి రెట్లు అధికంగా‘‘కోచ్ పాత్ర ఎలాంటిదో నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుతో గడిపినపుడే నాకు అర్థమైంది. అప్పుడు నేనైతే పూర్తిగా అలసిపోయాను. ఇక భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయం గురించి నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడినపుడు ఆసక్తికర సమాధానం విన్నాను.‘ఐపీఎల్ జట్టు విషయంలో ఒత్తిడి, రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకు వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్ టీమిండియా కోచ్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు.అంతకంటే గొప్ప సలహా మరొకటి ఉంటుందని నేను అనుకోను’’ అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి విషయంలో తనకు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని తెలిపాడు. ఒక విధంగా కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడని పేర్కొన్నాడు.రిక్కీ పాంటింగ్ సైతంఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సైతం టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నానని.. అందుకే బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని తెలిపాడు.చదవండి: IPL 2024: టైమ్‌కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం? -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్‌కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
నెహ్రా వద్దన్నాడు.. మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు..!
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ప్రపంచకప్-2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత కోచ్‌గా మరో దఫా కొనసాగాలని బీసీసీఐ ద్రవిడ్‌ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీసీసీఐ పెద్దలు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డారు. స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఫుల్ టైమ్ కోచ్ వేటలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను కలిశారు. భారత్ జట్టు కోచింగ్ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తన ఐపీఎల్ కమిట్మెంట్ల కారణంగా ఈ పదవిని స్వీకరించలేనని చెప్పినట్లు వినికిడి. దీంతో గత్యంతరం లేక బీసీసీఐ మళ్లీ ద్రవిడ్‌నే సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కోచ్‌గా వ్యవహరించాలని ద్రవిడ్‌కు కబురు పంపారని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతనికి వీసా కూడా తీశారని సమాచారం. ఒకవేళ ద్రవిడ్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఓకే చెబితే కోచింగ్ స్టాఫ్‌గా విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. -
టీ20 జట్టు కోచ్‌గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..!
టీమిండియా కోచ్ పదవిపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఎంపీ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత టీ20 జట్టు కోచ్‌గా తన మాజీ సహచరుడు ఆశిష్ నెహ్రా అయితే బెటర్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశం కాదని, నెహ్రా అయితే టీ20 జట్టు కోచ్ పదవికి పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నానని మనసులో మాటను బయటపెట్టాడు. నెహ్రాకు పొట్టి ఫార్మాట్‌పై మంచి పట్టు ఉందని, కెరీర్ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, కేవలం ఇదే కారణంగానే ద్రవిడ్ బదులు నెహ్రాకు తను ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్‌ల ప్రతిపాదన తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, ఇందులో ఎవ్వరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నాడు. ఒకవేళ బీసీసీఐ ముగ్గురు కోచ్‌ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే.. ద్రవిడ్‌తో పాటు నెహ్రాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అపార అనుభవమున్న ద్రవిడ్‌ను భారత టెస్ట్ జట్టు కోచ్‌గా, నెహ్రాను టీ20 టీమ్ కోచ్‌గా నియమిస్తే..భారత్‌కు రెండు ఫార్మాట్లలో తిరుగుండదని అన్నాడు. ఇదే సందర్భంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పై కూడా భజ్జీ స్పందించాడు. మొదటి మూడూ స్థానాల్లో వచ్చే వీరు స్ట్రయిక్ రేట్ మరింత పెంచుకోవాలని, తద్వారా 4, 5 స్థానాల్లో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్ సెమీస్‌లో నిష్క్రమించాక కోచ్‌తో సహా జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అభిమానులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇప్పటినుంచే కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లను ఈ ఫార్మాట్ నుంచి తప్పించాలని, కోచ్‌గా ద్రవిడ్ కూడా ఈ ఫార్మాట్‌కు సూట్ కావట్లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. -
వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..!
పొట్టి క్రికెట్ ప్రభావం కారణంగా నానాటికీ శోభ తగ్గిపోతున్న వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు అంతరించిపోకుండా మనుగడ సాగించాలంటే ఓ కీలక మార్పు చేయాలని సూచించాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఆసన్నమైందని, లేకపోతే వన్డే క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. ఓవర్లను కుదించడం వల్ల వన్డేలకు మునపటి కంటే అధికమైన ఆదరణ లభిస్తుందని తెలిపాడు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్‌బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరాడు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవుతుంటే, ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నాడు. ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ప్రతిపాదించాడు. మరోవైపు వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది. చదవండి: 'అతడు డెత్ ఓవర్ల స్పెషలిస్టు.. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్‌కు ఎంపిక చేయండి' -
ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్న భారత మాజీ పేసర్
క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు. భారత క్రికెట్లో అయితే ఆ సంఖ్య మరీ తక్కువనే చెప్పాలి. భారత క్రికెట్ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కనీసం డిగ్రీ కూడా చదవలేదు. ఈ మధ్య జనరేషన్లో టీమిండియా తరఫున రాణించి, మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ఓ క్రికెటర్ లేటు వయసులో చదువుపై దృష్టి సారించాడు. రిటైర్మెంట్ తర్వాత డిగ్రీ, పీజీ పూర్తి చేసి చదువు మధ్యలోనే ఆపేసిన చాలామంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. అతనే టీమిండియా మాజీ పేసర్, భారత మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్. కర్ణాటకకు చెందిన వెంకటేశ్ ప్రసాద్ ఇటీవలే ప్రతిష్టాత్మక లండన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్లో పీజీ పట్టా పొందాడు. Never stop learning, because life never stops teaching. It was an honour and privilege to receive PG Cert in International Sports Management from @UoLondon . Look forward to contributing more in the field of Sports. pic.twitter.com/NYkdxQ1QK1 — Venkatesh Prasad (@venkateshprasad) July 15, 2022 ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో పీజీ పట్టా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. స్పోర్ట్స్ ఫీల్డ్‌లో మరింత సేవ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, దాదాపు రెండు దశబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ప్రసాద్.. 1996 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా హైలైట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అమీర్ సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత ప్రసాద్ ప్రదర్శించిన హావభావాలు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ మ్యాచ్‌లో ప్రసాద్ బౌలింగ్‌లో సోహైల్ బౌండరీ బాది వార్నింగ్ ఇచ్చాడు. ఆ మరుసటి బంతికే ప్రసాద్.. సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. చదవండి: 'కోహ్లిని గాడిలో పెట్టగల వ్యక్తి సచిన్ మాత్రమే' -
"గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Opens Up On His Alleged Spat With Ganguly In 2016: టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీమిండియా నిష్క్రమించిన అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2016లో తనకు నాటి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీకి మధ్య మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు. నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం జరిగిన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సీఏసీ సభ్యులుగా ఉన్నారని, ఆ ఇంటర్వ్యూకి వెళ్లేముందు తాను హెడ్ కోచ్‌గా అయితే ఏమేం చేయగలనో ఓ లెటర్ రాసి పెట్టుకున్నానని తెలిపాడు. అయితే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి ఆ లెటర్ మిస్ అయ్యిందని, కమిటీ ముందు ఆ విషయం చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించిందని, అందుకే ఉన్న విషయం కమిటీ ముందు చెప్పగా నా గురించి బాగా తెలిసిన గంగూలీకి అది నచ్చలేదని తెలిపాడు. ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ మీడియా దాన్ని ఎక్కువ చేసి ప్రచారం చేసిందన్నాడు. గంగూలీది, తనది చాలా పాత పరిచయమని, గంగూలీ తనకు జూనియర్ అని, గతంలో దాదా.. టైమ్స్ షీల్డ్ టోర్నీలో టాటా స్టీల్‌కి ఆడుతున్నప్పుడు తాను కెప్టెన్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా, 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక టీమిండియాపై కోచ్ రవిశాస్త్రి ప్రభావం తగ్గిందన్న వార్తలు చాలాకాలం వరకు వినిపించాయి. తాజాగా రవి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ వార్తలు వాస్తవమేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచ కప్-2021తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో.. గంగూలీ తన ఆప్తుడైన రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు -
Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు
Rohit Sharma And Virat Kohli Gift Their Bats To Ravi Shastri: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా పదవీకాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రికి టీమిండియా సారధి, ఉప సారధి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అపురూప కానుకలతో ఘనంగా వీడ్కోలు పలికారు. విరాట్, రోహిత్‌లు వారు సంతకాలు చేసిన బ్యాట్లను రవిశాస్త్రికి కానుకగా అందజేసి సెండాప్ ఇచ్చారు. డ్రెసింగ్ రూమ్‌లో రవిశాస్త్రి వీటిని పట్టుకుని దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి శకం టీ20 ప్రపంచకప్-2021తో ముగిసిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 8న నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు రవిశాస్త్రి చివరిసారిగా కోచింగ్ సేవలను అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పసికూన నమీబియాపై ఘన విజయం సాధించి హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు ఘనంగా వీడ్కోలు పలికింది. కోచింగ్ సిబ్బందికి, కెప్టెన్‌గా విరాట్‌కు చివరి రోజు కావడంతో భారత డ్రెసింగ్ రూమ్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొని ఉండింది. Must Watch: A stirring speech to sign off as the #TeamIndia Head Coach 👏 👏 Here's a snippet from @RaviShastriOfc's team address in the dressing room, reflecting on the team's journey in the last few years. 👍 👍 #T20WorldCup #INDvNAM Watch 🎥 🔽https://t.co/x05bg0dLKH pic.twitter.com/IlUIVxg6wp — BCCI (@BCCI) November 9, 2021 చదవండి: Ravi Shastri: టీమిండియా ఆటగాళ్లేమైనా యంత్రాలా, పెట్రోల్ పోసి నడపడానికి..? -
Ravi Shastri: టీమిండియా ఆటగాళ్లేమైనా యంత్రాలా, పెట్రోల్ పోసి నడపడానికి..?
Ravi Shastri Slams BCCI And ICC, Says Players Do Not Run On petrol: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి శకం టీ20 ప్రపంచకప్-2021తో ముగిసింది. మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 8న నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు రవిశాస్త్రి చివరిసారిగా కోచింగ్ సేవలను అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పసికూన నమీబియాపై ఘన విజయం సాధించి కోచ్‌గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలికింది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రవిశాస్త్రి.. బీసీసీఐ, ఐసీసీలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యాలపై మాట్లాడుతూ.. అందుకు పరోక్ష కారణమైన బీసీసీఐ, ఐసీసీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గత ఆరు నెలలుగా బయోబబుల్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫిజికల్‌గా, మెంటల్‌గా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్ బోర్డులు, అభిమానులు గుర్తించాలని అన్నాడు. ఊపిరి సడలనంత బిజీ షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసి ఐసీసీ, బీసీసీఐలు టీమిండియా వైఫల్యాలకు పరోక్ష కారణమయ్యాయని ధ్వజమెత్తాడు. ప్రపంచకప్‌కు ముందు ఏ జట్టైనా తాజాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ, భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని, టోర్నీ షెడ్యూల్ చేయడానికి ముందు ఐసీసీ ఈ ఆలోచన చేసి ఉండాల్సిందని ఆగ్రహించాడు. పెట్రోల్ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు యంత్రాలు కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, రవిశాస్త్రి 2014లో తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని ఆధ్వర్యంలో భారత జట్టు 2019 వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. రవిశాస్త్రి హయాంలో ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్ట్ సిరీస్‌లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఆసీస్‌తో పాటు సేన(SENA) దేశాలైన సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను టీమిండియా వారి స్వదేశాల్లో మట్టికరిపించింది. చదవండి: మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు.. -
టీమిండియా కోచ్ పదవి.. చివరి రోజు దరఖాస్తు చేసుకున్న మాజీ కెప్టెన్
Rahul Dravid Applies For Team India Head Coach Position: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు స్వీకరణకు చివరి రోజున(అక్టోబర్ 26) దరఖాస్తు చేసుకున్నాడు. హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఎంపిక దాదాపుగా ఖరారు అయిన నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నామమాత్రంగా సాగింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు దృవీకరించాయి. టీ20 ప్రపంచకప్-2021 అనంతరం ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో బీసీసీఐ టీమిండియా కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలు అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాటింగ్ కోచ్‌గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశం ఉండగా.. బౌలింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నిన్ననే అప్లై చేసుకున్నాడు. ద్రవిడ్ సహా మాంబ్రే పదవి కూడా దాదాపుగా ఖరారైనట్టేనని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, ద్రవిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బిగ్ అప్డేట్: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
Rahul Dravid Set To Take Over As Team India Coach: టీమిండియా అభిమానులకు బిగ్ అప్డేట్. భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అంగీకరించినట్లు సమాచారం. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఎంతో మంది మెరికల్లాంటి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన ద్రవిడ్... ఇకపై టీమిండియాకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ పదవి చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా.. ద్రవిడ్‌ను ఒప్పించినట్లు సమాచారం. ఈ మేరకు..‘‘టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించారు. త్వరలోనే ఎస్సీఏ పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ‘‘టీమిండియా యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇప్పుడిప్పుడే రూపాంతరం చెందుతోంది. ఇలాంటి సమయంలో... ఎన్సీఏ హెడ్‌గా వాళ్లతో మమేకమైన ద్రవిడ్.. హెడ్ కోచ్‌గా ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. అందుకే జై షా, గంగూలీ రంగంలోకి దిగారు. ద్రవిడ్‌కు నచ్చజెప్పారు. ఆయన ఒప్పుకొన్నారు. ఇక బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ కొనసాగుతారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఏఎన్ఐ కథనం ప్రచురించింది. కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే సహా పలువురు విదేశీ మాజీ ఆటగాళ్ల పేర్లు తెరమీదకు వచ్చినా... రాహుల్ ద్రవిడ్ వైపే బీసీసీఐ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి స్థానాన్ని ద్రవిడ్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే! Ind Vs NZ Series: న్యూజిలాండ్ సిరీస్‌కు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్! -
టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..!
BCCI Unlikely To Appoint Foreign Coach For Team India : టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్‌గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్‌గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్‌లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్.. -
భారత హెడ్ కోచ్ పదవి రేసులో జయవర్ధనే!
భారత క్రికెట్ హెడ్ కోచ్ పదవి కోసం శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. చివరి రోజైన మంగళవారం జయవర్ధనే దరఖాస్తు బీసీసీఐకి చేరినట్లు తెలిసింది. అతనితో పాటు మరో ఇద్దరు విదేశీయులు టామ్ మూడీ (ఆస్ట్రేలియా), మైక్ హెసన్ (న్యూజిలాండ్) కూడా కోచ్ పదవి రేసులో ఉన్నారని సమాచారం. భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ కూడా ఇప్పటికే కోచ్ పదవిని ఆశిస్తూ బరిలో నిలిచాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వీరందరికీ హెడ్ కోచ్‌గా ఏమాత్రం అవకాశం ఉందనేది ఆసక్తికరం. -
సమర్థించుకున్న రవిశాస్త్రి
మాంచెస్టర్: న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎంఎస్ ధోనిని ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సమర్థించుకున్నాడు. ధోనిని ముందుగా బ్యాటింగ్ పంపివుంటే బాగుండేదని మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడిన నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ధోని అనుభవం లోయర్ ఆర్డర్‌లోనే ఎక్కువ అవసరమన్న అభిప్రాయంతోనే దినేశ్ కార్తీర్, హార్దిక్ పాండ్యా తర్వాత అతడిని బ్యాటింగ్‌కు దించినట్టు వెల్లడించారు. ‘ఇది జట్టు సమిష్టి నిర్ణయం. మేమంతా ఆషామాషీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎంఎస్ ధోని ముందుగా వచ్చి తొందరగా ఔటవ్వాలని మీరు కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. ధోని త్వరగా ఔట్ అయితే ఛేజింగ్ మరింత కష్టమయ్యేది. అతడి అనుభవాన్ని చివర్లో వాడుకోవాలని అనుకున్నాం. ధోని గొప్ప ఫినిషర్ అన్న విషయం అందరికీ తెలుసు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. చివరి ఓవర్లో ఏ బంతిని ఎలా కొట్టాలో ముందుగా మైండ్‌లో లెక్కేసుకున్నట్టుగా కనిపించాడు. దురదృష్టవశాత్తు రనౌట్ అయి లెక్కలు తప్పడంతో అతడి ముఖంలో విచారం స్పష్టంగా కనబడింద’ని రవిశాస్త్రి వివరించాడు. కీలక సమయంలో చెత్త షాట్ ఆడి ఔటైన యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను ఆయన వెనకేసుకొచ్చాడు. పంత్‌కు పెద్దగా అనుభవం లేదని, మెల్లగా నేర్చుకుంటాడని సమర్థించాడు. పంత్, పాండ్యా అవుటైన తర్వాత అసమాన పోరాటపటిమ చూపి లక్ష్యానికి దగ్గర రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.