terrorists attacks
-
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్నాగ్ ప్రాంతం అహ్లాన్ గగర్‌మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్ సెర్ఛ్ చేపట్టాయి. తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ విడుదల జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
రష్యాలో మరో ఉగ్రఘాతుకం
మాస్కో: రష్యాలోని ముస్లిం ప్రాబల్య దక్షిణ ప్రాంత దగెస్తాన్ రిపబ్లిక్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆదివారం సాయంత్రం ఏకకాలంలో దగెస్తాన్ రాజధాని మఖచ్కాలా లోని ఓ చర్చి, ఓ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్‌పైనా కాల్పులు జరపడంతోపాటు డెర్బెంట్ నగరంలోని ఒక చర్చి, ఒక యూదు ప్రార్థనా మందిరంలో దాడి చేసి నిప్పుపెట్టారు. ఉగ్రవాదులు డెర్బెంట్ ట్రినిటీ సండే చర్చిలో ఉన్న రెవరెండ్ నికోలాయ్ కొటెల్నికోవ్ (66)గొంతుకోసి చంపడంతోపాటు ఆ చర్చికి నిప్పుపెట్టారని అధికా రులు తెలిపారు. రెండు ఘటనల్లో 15 మంది పోలీసులు, ఒక బోధకుడు సహా 20 మంది చనిపోయారు. క్షతగాత్రులైన 46 మందిలో 13 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. నలుగురు పోలీసు అధికారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాల ఎదురు దాడిలో ఆరుగురు ఉగ్రవా దులు హతమ య్యారన్నా రు. అయితే, ఈ ఘటనల్లో ఎందరు ఉగ్రవా దులు పాల్గొన్నదీ వారు వివరించలేదు. హతమైన వారిలో ఉగ్రవాదుల్లో ముగ్గురిని రష్యాలోని ప్రధాన యునైటెడ్ రష్యా పార్టీకి దగెస్తాన్ హెడ్‌గా ఉన్న మగొమెద్ ఒమరోవ్ ఇద్దరు కుమారులు, బంధువుగా అధికారులు గుర్తించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్‌ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్‌పోస్ట్‌పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్‌కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్‌పోస్ట్‌ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్‌పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
Targeted Attacks: కశ్మీర్లో నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేయగా.. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది. షోపియాన్‌లోని హర్మెన్ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడి నేపథ్యంలో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. గత శనివారం ఇదే షోపియాన్ ప్రాంతంలో పురాన్ క్రిషన్ భట్(56) అనే కశ్మీరీ పండిట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్ గ్రామంలో పూరాన్ భట్ తన ఇంటి వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రకటించింది. భట్ హత్యతో కశ్మీర్ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ 2న మునీర్ ఉల్ ఇస్లామ్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్.. పూజలు వికటించడంతో కక్షగట్టి! -
కశ్మీర్లో ఉగ్ర దాడి.. పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో పోలీసు అధికారి ఒకరు నేలకొరగగా, సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఈ ఘటన పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో తనిఖీల సమయంలో చోటుచేసుకుంది. వీరమరణం పొందిన పోలీసును స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన జావిద్ అహ్మద్ దార్గా గుర్తించారు. క్షతగాత్రుడైన జవానును ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఉగ్రదాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజకీయ పార్టీలు ఖండించాయి. మరోఘటన.. షోపియాన్ జిల్లా బస్కచాన్ ప్రాంతంలో చేపట్టిన కార్డన్ సెర్చ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన షోపియాన్ జిల్లా నౌపొరా వాసి అహ్మద్ భట్ హతమయ్యాడు. -
విషాదం.. టీవీ నటి, టిక్ టాక్ స్టార్ మృతి
TV Artist Amreen Bhat Dead.. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రాత్రి వరుస ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి కాల్పులకు తెగబడ్డారు. కాగా, బుధవారం రాత్రి.. ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్ జుబీర్‌కు కూడా బుల్లెట్ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. Jammu & Kashmir TV artist Amreen Bhat lost her life today. Terrorists fired upon one Amreen Bhat at her residence in Chadoora, Budgam today: J&K Police (Pic Source: Amreen Bhat's Instagram account) pic.twitter.com/d218Cs8UMW — ANI (@ANI) May 25, 2022 ఇది కూడా చదవండి: లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: నాగచైతన్య -
వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు
జమ్మూ: ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్‌లోని వలసకూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలకు పరుగులు తీస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఉగ్రవాదులు మైనారిటీలను, వలస కూలీలను లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా దాడులు కొనసాగిస్తుండటంతో ఈనెలలో ఇప్పటిదాకా అమాయకులైన 11 మంది పౌరులు మృతి చెందారు. ఇది భయోత్పాత వాతావరణాన్ని సృష్టించింది. వలసకూలీలు మంగళవారం వేలాదిగా జమ్మూలోని రైల్వేస్టేషన్లకు తరలివచ్చారు. జమ్మూ, ఉదంపూర్‌లలో ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రతను పెంచారు. ప్రతియేటా మూడు నుంచి నాలుగు లక్షల మంది వలస కూలీలు పనిని వెతుక్కుంటూ కశ్మీర్ లోయకు వస్తారు. మార్చిలో వచ్చి నవంబర్‌లో శీతాకాలం ఆరంభంలో వెళ్లిపోతారు. రాతిపని, వడ్రంగి, వెల్డింగ్, వ్యవసాయ కూలీలుగా వీరు పనిచేస్తారు. ఆదివారం కూల్గామ్ జిల్లాలో వలస కూలీల శిబిరాల్లోకి వచ్చి ఉగ్రవాదులు ఇద్దరు కార్మికులను కాల్చి చంపడంతో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు భీతిల్లిపోయారు. ఇక్కడుంటే ఏ క్షణం ఎటువైపు నుంచి కాల్పులు జరుగుతాయో, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందోననే భయంతో నిర్ణీత సమయానికి కంటే ముందే కశ్మీర్‌ను వదిలి స్వస్థలాలకు వెళ్లి పోతున్నారు. పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా న్యూఢిల్లీ: కశ్మీర్లో తాజా పరిస్థితులను వివరించడానికి హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భద్రతను మెరుగుపర్చడానికి కశ్మీర్ అధికార యంత్రాంగం, కేంద్ర హోంశాఖ తీసుకున్న చర్యలను వివరించారు. కశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టిస్తున్న భయోత్పాత వాతావరణం, ఫలితంగా కూలీలు పెద్దసంఖ్యలో స్వస్థలాలకు వెళ్లిపోతుండటం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. కాగా ఈనెల 23 నుంచి 25 వరకు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. భద్రతపై సమీక్షిస్తారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో జలవిలయం -
శ్రీనగర్‌లో దారుణం
శ్రీనగర్: శ్రీనగర్‌లో ఉగ్రవాదులు సామాన్య పౌరులే లక్ష్యంగా మరో దారుణానికి తెగబడ్డారు. గురువారం ఉదయం నగరం నడి»ొడ్డున ఉన్న పాఠశాలలోకి చొరబడి మహిళా ప్రిన్సిపాల్, మరో టీచర్‌ను కాల్చి చంపారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ బాలుర హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉదయం ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉండటంతో ఆ సమయంలో విద్యార్థులెవరూ పాఠశాలలో లేరు. క్లాసులు చెప్పడానికి సిద్ధమవుతున్న ప్రిన్సిపల్ సుపీందర్ కౌర్, మరో టీచర్ దీపక్ చాంద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. మైనారీ్టలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ ఉండడంతో లోయలో భయాందోళనలు పెరిగాయి. ఉగ్రవాదులు మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నారని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాంగ్ సింగ్ అన్నారు. లోయలో భయభ్రాంతుల్ని సృష్టించడానికే ఈ దాడులకు దిగుతున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే నెలకొంటున్న శాంతిని భగ్నం చేయడానికి పాక్ ఆడిస్తున్నట్టుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారి ఆట కట్టిస్తామని డీజీపీ అన్నారు. లోయలో వరుస దాడులు గత అయిదు రోజుల్లో కశీ్మర్ లోయలో జరిగిన వేర్వేరు దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకి చేరుకుంది. ఈ ఏడుగురిలో నలుగురు మైనార్టీ వర్గానికి చెందినవారు. పాఠశాలలో ప్రాణాలు కోల్పోయిన సుపీందర్ కౌర్ శ్రీనగర్‌కు చెందిన సిక్కు కాగా, దీపక్ చాంద్ హిందువు. రెండు రోజుల క్రితం ప్రముఖ కశ్మీర్ పండిట్ మఖాన్‌లాల్ బింద్రూని కాల్చి చంపడం, అదే రోజు మరో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకోవడం కలకలం రేపింది. ఈ దాడులపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘కశీ్మర్లో హింస పెరిగిపోతోంది. పెద్ద నోట్లు, ఆర్టికల్ 370 రద్దు ఉగ్రవాదుల్ని నిరోధించలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వం భద్రతని కలి్పంచడంలో పూర్తిగా విఫలమైంది’’ అని ట్వీట్ చేశారు. -
కశ్మీర్లో ఉగ్రదాడులు
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరో ట్రక్ డ్రైవర్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఉదంపూర్ జిల్లాలోని కట్రాకు చెందిన నారాయణ్ దత్‌ను సోమవారం సాయంత్రం తుపాకీతో కాల్చి చంపారు. కాల్పుల శబ్దం వినగానే దగ్గర్లోనే ఉన్న సీనియర్ పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని దగ్గర్లోనే ఉన్న మరో ఇద్దరు ట్రక్ డ్రైవర్లను కాపాడారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం నలుగురు ట్రక్ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చి చంపడం గమనార్హం. మరణించిన వారంతా కశ్మీరీయేతర ప్రాంతాలకు చెందినవారే. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి.. కశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. నగరంలోని ఓ బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న జనాలే లక్ష్యంగా గ్రెనేడ్ విసిరారు. ఈ పేలుడులో 20 మంది ప్రజలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన చుట్టుపక్కల్లో ప్రాంతాల్లో సోదాలు మొదలుపెట్టారు. -
మసీదులో కాల్పులు..
ఓవాగడౌగౌ: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఓవాగడౌగౌ నగరంలోని మసీదులో జరిగిన ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆయుధాలు ధరించిన కొందరు ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం మసీదులో ప్రవేశించి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రెంచ్, ఆమెరికన్, కెనడియన్, జర్మన్ బలగాలు తమ ప్రాంతంలో ప్రవేశించి ఉగ్రవాదులతో పోరాడుతున్నామని చెబుతున్నాయని, అయితే విదేశీయులు తమ దేశంలో ఉండటం ఇష్టం లేని ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడుతున్నాయని ఓ స్థానికుడు తెలిపారు. -
ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది. సెప్టెంబర్ 10వ తేదీన పంపినట్లు ఉన్న ఈ లేఖలో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. అలాగే ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిందన్‌లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, అదీ ఎయిర్‌బేస్ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
భారత్‌లోకి ఉగ్ర మూకలు?
భుజ్(గుజరాత్)/కోయంబత్తూరు: కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ తీరం కచ్ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్‌లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్ కమాండోలు సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్ తీరంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్‌కు చేరువలో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జామ్‌నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్ వద్ద రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆయిల్ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్ రేంజ్) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మురళీధర్ పవార్ తెలిపారు. ఐఎస్ లింకులపై ఎన్ఐఏ తనిఖీలు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, 5 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ మేలో కేసులు నమోదు చేసింది. -
తిరుమల, కాణిపాకంలో రెడ్ అలర్ట్
తిరుపతి క్రైం: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి కొందరు తీవ్రవాదులు సముద్ర మార్గాన ఏపీకి చేరే అవకాశం ఉందని సమాచారం రావడంతో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులను గమనిస్తే స్థానిక పోలీసులకు, 100, 8099999977 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే వ్యక్తుల పాస్‌పోర్టులు తనిఖీ చేయడంతోపాటు భద్రతను పెంచినట్లు తెలిపారు. నగర ప్రవేశ ప్రాంతాల వద్ద వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
కర్ణాటకలో హైఅలర్ట్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరుతో పాటు కలబురిగి, రాయచూర్, చిత్రదుర్గ, మంగళూరు, ఉడిపి, మైసూరు, తుమకూరు సహా ముఖ్యమైన పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా జనసమ్మర్ధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులుచేసే అవకాశముందని చెప్పాయి’ అని అన్నారు. కల్బుర్గీ హత్య కేసులో చార్జిషీట్ హేతువాదులు కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్య కేసులో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. షూటర్ గణేశ్ మిస్కిన్, అమోల్ కాలే, ప్రవీణ్‌ప్రకాశ్, వసుదేవ్ భగవాన్, శరద్ కలస్కర్, అమిత్ రామచంద్ర వీరి హత్యలకు కుట్రపన్నారని సిట్ తెలిపింది. హిందూ అతివాద గ్రూపు ‘సనాతన సంస్థ’ ప్రచురించిన ‘క్షేత్ర ధర్మ సాధన’ అనే పుస్తకంతో వీరంతా స్ఫూర్తి పొందారంది. 2014, జూన్ 9న మూఢనమ్మకాలపై కల్బుర్గీ ఇచ్చిన ప్రసంగంతో ఆయన్ను చంపాలని ఈ బృందం నిర్ణయించుకుందని పేర్కొంది. అనుకున్నట్లుగానే ఓ తుపాకీని సేకరించి తర్ఫీదు పొందారనీ, దాడికోసం బైక్‌ను దొంగిలించారని సిట్ చెప్పింది. కల్బుర్గిని ఇంట్లోనే మిస్కిన్ కాల్చిచంపాడని తెలిపింది. -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సెలవుల్లో ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్‌ను ఎత్తుకెళ్లారు. బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యాసిన్ భట్ ఆర్మీలోని లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చారు. యాసిన్ కదలికలపై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. కాగా, యాసిన్ భట్ అదృశ్యం నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ ఈ ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ ఔరంగజేబ్‌ను ఇదే తరహాలో కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారు. మరోవైపు బాలకోట్ దాడిని ప్రస్తావిస్తూ ఐఏఎఫ్ ఓ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈరోజు కొందరు(భారత వాయుసేన) సరిహద్దును దాటారు. ఎందుకంటే మరికొందరు(పాకిస్తాన్) అన్ని పరిమితుల్ని అతిక్రమించారు’ అని కవి బిపిన్ అలహాబాదీ రాసిన కవితలో రెండు చరణాలను ట్వీట్ చేసింది. -
చర్చి లక్ష్యంగా పేలుళ్లు
మనీలా: బాంబు పేలుళ్లతో ఫిలిప్పీన్స్ దేశం దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని కేథలిక్ చర్చ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆప్రాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 15 మంది పౌరులు, ఐదుగురు భద్రతాసిబ్బంది ఉన్నారు. సైనిక బలగాలు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఆదివారం చర్చి ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. తొలిబాంబు పేలుడుతో చర్చి ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. నిమిషం వ్యవధిలో మరో బాంబుపేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండో బాంబును చర్చివద్ద నిలిపివున్న బైక్‌కు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ముందు జాగ్రత్తగా అధికారులు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆపివేశారు. ‘ఇది దేశ విద్రోహుల చర్య, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు. ముష్కరులకు తగిన బుద్ధి చెబుతాం’అని దేశ అధ్యక్షుడు రోడ్రిగో దుతెరో ప్రకటించారు. అబూ సయ్యఫ్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొద్దికాలంగా బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నారు. అమెరికాలో ఐదుగుర్ని చంపిన ఉన్మాది న్యూఆర్లిన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో డకోటా థిరియట్(21) అనే ఉన్మాది రెచ్చిపోయాడు. సొంత తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిని కూడా హ్యాండ్‌గన్‌తో కాల్చిచంపాడు. అనంతరం ఓ కారులో పరారయ్యాడు. లూసియానాలోని అస్కెన్షన్ ప్రాంతానికి చెందిన థిరియట్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం(స్థానిక కాలమానం) ప్రియురాలు సమ్మర్ ఎర్నస్ట్(20) ఇంటికి వెళ్లిన నిందితుడు.. ఆమెతో పాటు యువతి తండ్రి బిల్లీ(43), తమ్ముడు టానర్(17)ను చంపేశాడు. అనంతరం అక్కడే ఉన్న కారులో లివింగ్‌స్టన్‌లో ఉంటున్న తల్లిదండ్రులు కీత్(50), ఎలిజబెత్(50) వద్దకు చేరుకుని వారిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న డకోటా థిరియట్ కోసం గాలింపును ప్రారంభించారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. -
కిష్టావర్‌లో బీజేపీ నేత ఆయన సోదరుడు హత్య
-
ఐదుగురిని కాల్చిచంపిన అల్ఫా మిలిటెంట్లు
ఖెరోనిబరి: అస్సాంలో నిషేధిత అల్ఫా(ఇండిపెండెంట్) తీవ్రవాదులు గురువారం రెచ్చిపోయారు. తిన్సుకియా జిల్లాలోని ఖెరోనిలో ఐదుగురు పౌరుల్ని కాల్చిచంపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కొందరు సాయుధ అల్ఫా తీవ్రవాదులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఖెరోనిలోని ధోలా–సదియా వంతెన వద్దకు చేరుకుని ఐదారుగురు గ్రామస్తుల పేర్లను పిలిచారని తెలిపారు. దీంతో బయటకు వచ్చినవారిపై సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిని ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కశ్మీర్లో బీజేపీ నేత హత్య
జమ్మూ: కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కిస్త్వర్ జిల్లా కేంద్రంలో తమ దుకాణం నుంచి గురువారం రాత్రి ఇంటికి వెళుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, అతని సోదరుడు అజిత్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కాల్పుల శబ్దాలు విన్న స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ విషయమై జమ్మూ డివిజినల్ కమిషనర్ సంజీవ్ వర్మ మాట్లాడుతూ.. అనిల్, అజిత్‌ల రాక కోసం ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేశారని తెలిపారు. వారు సమీపించడంతో పిస్టళ్లతో కాల్పులు జరిపి పారిపోయారని వెల్లడించారు. మరోవైపు ఈ హత్యలకు నిరసనగా ఆందోళనకు దిగిన ప్రజలు.. పోలీస్ సిబ్బందిపై చేయిచేసుకున్నారు. దీంతో అధికారులు కిస్త్వర్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు. -
కశ్మీర్లో పోలీస్ ఇన్స్పెక్టర్ హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) కార్యకర్తను ఆదివారం కాల్చిచంపారు. జమ్మూకశ్మీర్ సీఐడీ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ మిర్(30) పూల్వామా జిల్లాలోని తన ఇంటికి వెళుతుండగా కాపుకాసిన ఉగ్రవాదులు ఆయన్ను మార్గమధ్యంలోనే అడ్డుకుని హత్యచేశారు. ఈ విషయమై ఇంతియాజ్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను చూసి చాలాకాలం కావడంతో ఇంతియాజ్ సొంతబాగ్లోని ఇంటికి బయలుదేరాడని తెలిపారు. అయితే ఇప్పుడు పుల్వామాలో పరిస్థితి బాగోలేదనీ, ఉగ్రవాదులు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. కానీ ఇంతియాజ్ అంగీకరించలేదనీ, గడ్డం తీసేసి, వస్త్రధారణను మార్చుకుని సొంత వాహనంలో ఊరికి బయలుదేరాడన్నారు. ఇంతియాజ్ రాకపై సమాచారం అందుకున్న ఉగ్రవాదులు అతడిని చేవకలాన్లో కిరాతకంగా హతమార్చారని తెలిపారు. మరోవైపు పీడీపీ నేత సయ్యద్ అల్తాఫ్ బుఖారి అనుచరుడు మొహమ్మద్ అమిన్ దార్(40)ను కూడా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. -
నెత్తురోడిన పాక్
పెషావర్/కరాచీ: పాకిస్తాన్లో శుక్రవారం రెండు ఎన్నికల ర్యాలీలు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో ఓ జాతీయ స్థాయి నాయకుడు సహా మొత్తం 133 మంది మరణించారు. దాదాపు 162 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు ప్రచారంలో బిజీగా ఉండగా, ఆ పార్టీల నాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్సులోని మస్తుంగ్‌లో బలూచిస్తాన్ ఆవామీ పార్టీ నేత సిరాజ్ రైసాని నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిరాజ్ సహా మొత్తం 128 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోగా, 125 మందికిపైగా గాయపడ్డారని డాన్ పత్రిక తెలిపింది. ఈ దాడి తామే చేశామని ఐసిస్ ప్రకటించింది. 16 నుంచి 20 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాంబ్ స్క్వాడ్ తెలిపింది. అంతకు కొన్ని గంటల ముందే ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్సులోని బన్నూ ప్రాంతంలోనూ ముతహిద మజ్లిస్ అమల్ పార్టీ నేత అక్రం ఖాన్ దురానీ ర్యాలీ వద్ద కూడా ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 37 మందికిపైగా గాయపడ్డారు. దురానీ క్షేమంగా బయటపడ్డారు. దురానీ పాకిస్తాన్ తెహ్రీక్ –ఇ–ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల దాడులను పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్, ప్రధాని ముల్క్ ఖండించారు. గత మంగళవారం ఆవామీ నేషనల్ పార్టీ ర్యాలీలో తాలిబాన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడగా 20 మంది మరణించారు. -
‘సంజువాన్’ దాడిలో ఆరుగురి మృతి
సంజువాన్: జమ్మూ నగర శివార్లలోని సంజువాన్‌లో ఆర్మీ కుటుంబాలు నివసించే గృహసముదాయంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. క్వార్టర్స్‌లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు మిగిలిఉన్నారేమోనన్న అనుమానంతో సైన్యం సోదాలు కొనసాగిస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారని అధికారులు శనివారం చెప్పగా.. తాజా సమాచారం ప్రకారం ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారని వెల్లడించారు. ఓ మేజర్ సహా 10 మంది గాయపడ్డారని ఆదివారం చెప్పారు. చనిపోయిన వారిలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ (జేసీవో) ఉన్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు శనివారం ఆర్మీ క్వార్టర్స్‌లోకి సైనిక దుస్తుల్లో ప్రవేశించి దాడి చేయడం తెలిసిందే. మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇప్పటికి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను సిబ్బంది మట్టుబెట్టగా శనివారం రాత్రి నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదనీ, అయినా ఇంకా ఎక్కడైనా ముష్కరులు దాగి ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తొలుత ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలు లభించగా, క్వార్టర్స్‌ను శుభ్రం చేస్తుండగా మరో ముగ్గురు సిబ్బంది, ఒక పౌరుడి మృతదేహం కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ ఆరుగురూ శనివారం తెల్లవారుజామునే చనిపోయారన్నారు. సుబేదార్ మదన్ లాల్ చౌదరి, సుబేదార్ మహ్మద్ అష్రఫ్ మిర్, హవిల్దార్ హబీబ్ ఉల్లా ఖురేషీ, నాయక్ మంజూర్ అహ్మద్, లాన్స్ నాయక్ ఇక్బాల్‌తోపాటు ఇక్బాల్ తండ్రి కూడా మరణించారనీ చెప్పారు. మదన్ లాల్ తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఒట్టి చేతులతోనే ఉగ్రవాదులతో పోరాడాడనీ, ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు చొచ్చుకుపోయినా కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాడన్నారు. గాయపడిన వారిలో ఓ మహిళ గర్భవతి కాగా, వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డలను కాపాడగలిగారు. క్వార్టర్స్‌పై బాంబులు క్వార్టర్స్ నుంచి ఇప్పటికే ఆర్మీ కుటుంబాలను ఖాళీ చేయించిన ఇళ్లపై ఆర్మీ మోర్టారు బాంబులను వేసింది. ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా దాక్కొని ఉంటే వారినీ హతమార్చేందుకే ఈ చర్యకు పూనుకుంది. దీంతో ఆర్మీ క్వార్టర్స్‌కు మంటలంటుకున్నాయి. మరోవైపు ఈ దాడి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనేనన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. విచారణ కూడా ప్రారంభం కాకుండానే తమపై ఆరోపణలు చేయడం భారత మీడియాకు, అధికారులకు అలవాటైపోయిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. -
బార్సిలోనాపై టెర్రరిస్టుల దాడులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనందునే బార్సిలోనాను ఇస్లామిక్ తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిపారు. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని ఆధునిక తుపాకులు, బాంబులతో జనాలలోకి చొచ్చుకు పోవడం కుదరడంలేదు కనుకనే టెర్రరిస్టులు జనంపైకి వాహనాలను నడపడం ద్వారా దాడులకు పాల్పడుతున్నారు. అందుకే పర్యాటకులు లేదా జన సాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. టెర్రరిస్టులు తొలిసారిగా ఈ తరహ దాడిని ప్రాన్స్‌లోని నైస్ సిటీపై 2016లో దాడిచేశారు. అదే ఏడాది బెర్లిన్‌లో దాడి చేశారు. ఈ ఏడాది లండన్‌లో ఇప్పుడు బార్సిలోనాలో దాడి చేశారు. తాజా దాడిలో 13 మంది మరణించగా, ఎక్కువ మంది గాయపడ్డారు. 2001 సంవత్సరంలో అల్‌ఖాయిదా టెర్రరిస్టులు న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలపై వైమానిక దాడులు జరిపి కొత్త పంథాను అనుసరించిన విషయం తెల్సిందే. ఆ దాడుల్లో అపార ప్రాణ నష్టం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల వద్ద పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేయడంతో ముంబు నగరంపై మరో రకంగా దాడులకు పాల్పడ్డారు. వివిధ దేశాలు అనుసరిస్తున్న భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకొని టెర్రరిస్టులు ఎప్పటికప్పుడు తమ దాడుల పంథాను మార్చుకుంటున్నారు. నైస్ దాడి అనంతరం బెర్లిన్ నగరంలో కూడా వాహనంతో దాడి జరగడంతో పలు పాశ్చాత్య దేశాలు పర్యాటక లేదా ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటునారు. ప్రజలు గుంపులుగా ఉండే ప్రాంతాలకు ఎక్కువ దూరంలోనే వాహనాలు నిలిపివేసి వాటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ బార్సిలోనాలో దాడి జరగడం దురదృష్టకరం. సిరియాలో ఎక్కువగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులనును ర క్కా ప్రాంతం నుంచి కూడా తరిమేసినందున పాశ్చాత్య దేశాలపై వారి దాడులు తగ్గుతాయని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అయితే పాశ్చాత్య దేశాల కారణంగానే సిరియాలో తాము పట్టుకోల్పోయామని భావిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులు అసహనంతో ఇంకా ఎక్కువ దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తారు. టెర్రరిస్టుల అణచివేతలో ఇంగ్లండ్, ఫ్రాన్స్తోని చేతులు కలిపినందునే ఇప్పుడు తాము స్పెయిన్‌పై దాడి చేశామని ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రకటించుకోవడం ఇక్కడ గమనార్హం. -
సీఎం పర్యటన.. కాల్పుల కలకలం!
ఇంఫాల్: సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ పర్యటన నేపథ్యంలో మణిపూర్ లోని చందేల్ జిల్లాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. లోక్ చావ్(టెంగ్నోపాల్) లో ఉగ్రవాదులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాట్రోలింగ్ లో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరిపడంతో నలుగురు భద్రతా సిబ్బంది మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల్లో ఓ పోలీస్ అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. కొత్తగా ప్రకటించిన లోక్ చావ్(టెంగ్నోపాల్) జిల్లాను ప్రారంభించడానికి సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ ఆ మార్గంలో వెళ్లనున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. లోక్ చావ్(టెంగ్నోపాల్) లో మొదట కాల్పులు జరిపిన టెర్రరిస్టులు, ఆ వెంటనే బాంగ్ యాంగ్ లో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మృతిచెందిన వారిలో ఇద్దరు పోలీసులు మహ్మద్ ఆయుబ్ ఖాన్, హెచ్.సి. నగరేయ్ మర్రింగ్ ఉన్నారని అధికారులు తెలిపారు. నాగాల డామినేషన్ ఎక్కువగా ఉన్న చందేల్ జిల్లా నుంచి లోక్ చావ్ జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.