TFCC
-
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు ఏర్పాట్లు
‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈమేరకు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ స్థాపించి 14 ఏళ్లు అయిందని తెలిపారు. ఇందులో వెయ్యికి పైగా నిర్మాతలతో పాటు సినిమాలో భాగమైన 24 శాఖలకు చెందిన 16వేల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు.టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనున్నటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. సెప్టెంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. టీఎఫ్‌సీసీ సభ్యులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇందులోని సభ్యులందరికీ ఇన్సూరెన్స్‌తో పాటు వారి పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. సభ్యుల సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. -
గద్దర్ అవార్డ్స్.. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్!
త్వరలోనే గద్దర్ అవార్డ్స్ పై విధి విధానాలను రూపొందించి సీఎం రేవంత్ గారికి అందచేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.గద్దర్ అవార్డ్స్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డ్స్ ప్రకటించడం పట్ల ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడంపై చర్చించడం జరిగిందని తెలిపారు. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను (ఎఫ్డీసీ) కోరినట్లు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని లేఖ విడుదల చేశారు.కాగా.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తే.. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి స్పందన రాలేదని ముఖ్యమంత్రి మాట్లాడారు. దీంతో ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. TFPC & TFCC thanking Telangana Chief Minister @revanth_anumula for Prestigious Gaddar Awards #GaddarAwards pic.twitter.com/y3LJg8IKlE— Telugu Film Producers Council (@tfpcin) July 31, 2024 -
తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ కుమార్ గెలిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఫిలిం ఛాంబర్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి.కాగా గతేడాది నిర్మాతల విభాగం నుంచి దిల్ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో నేడు మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాగూర్ మధు (నెల్లూరు), భరత్ భూషణ్ (విశాఖపట్టణం) బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవికి మాత్రం నిర్మాతలైన అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీపడ్డారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.చదవండి: నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ -
నేడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. రేసులో ఎవరున్నారంటే
టాలీవుడ్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవి కాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం నేడు (జులై 28) ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. అయితే, ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌కు చెందిన సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. గతేడాది నిర్మాతల సెక్టార్ నుంచి సి.కల్యాణ్ ఫ్యానల్‌పై 17 ఓట్ల తేడాతో దిల్ రాజు గెలుపొందారు.టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవి రేసులో ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాగూర్ మధు (నెల్లూరు), భరత్ భూషణ్ (విశాఖపట్టణం) బరిలో ఉన్నారు. బైలా ప్రకారం ఒక ఉపాధ్యక్ష పదవిని నిర్మాతల నుంచి ఎన్నుకోవాల్సివుంది. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీలో ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు.వీరిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నిక అయినట్లు ప్రకటిస్తారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఓటింగ్ జరుగుతుంది. -
తప్పుడు ప్రచారం జరుగుతోంది
‘‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబరులో దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఫంక్షన్‌కు, తమకు సంబంధం లేదని, టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదని తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంపై శనివారం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్పందిస్తూ– ‘‘మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలోని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వనున్నాం. దీన్ని కాదనే హక్కు దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్‌లకు లేదు. ‘టీఎఫ్‌సీసీ’ పేరుతో ట్రేడ్ మార్క్, టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించాం. టీఎఫ్‌సీసీ నంది ఈవెంట్స్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకున్నాం. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. -
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ గెలుపు
-
Live: TFCC ఎన్నికలు... గెలుపు ఎవరిదీ...?
-
TFCC Election: చిన్న నిర్మాతలను ఆదుకోవాలి..ఆర్. నారాయణమూర్తి
ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలిచినా 80శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలి. సినిమాలు నిర్మించి చాలా మంది లాస్ అవుతున్నారు. క్యూబ్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించాలి. పండగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలకు అవకాశాలు రావడం లేదు. సగటు సినిమాలకు కూడా అవకాశం కల్పించాలి. థియేటర్స్‌కి మార్నింగ్ షో సమస్యలు తీర్చాలి. ప్రస్తుతం కొద్ది మంది చేతుల్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. చిన్న నిర్మాతలను ఆదుకోండి’ అని నారాయణ మూర్తి అన్నారు. టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మరికాసేపట్లో ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
ఎలక్షన్స్ చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: తమ్మారెడ్డి
-
TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు. కాగా, టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
TFCC Election 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు
►తెలుగు ఫిలిం చాంబర్ ,ప్రెసిడెంట్ గా దిల్ రాజు ►వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు ►కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్ ►ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్ ►మొత్తం 48 ఓట్ల లో దిల్ రాజుకి 31 ఓట్లు ►తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ►ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్. ►డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్.. ►తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి గా దిల్ రాజు ఎన్నిక దాదాపు ఖాయం. ►తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు. ►ఫైనల్ రిజల్ట్ ►అధ్యక్ష పదవి కి పోటీపడుతున్న సి.కళ్యాణ్, దిల్ రాజు.. ►మొత్తం ఓట్లు - 48 ►మెజారిటీ మార్క్ - 25 ►ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5.. ►డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) దిల్ రాజుకి 6, సి కళ్యాణ్ కి 6. ►స్టూడియో ఎగ్జిక్యూటివ్ కమిటీ (4) దిల్ రాజుకి 3, సి కళ్యాణ్ కి 1. ►ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16) దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8. ►కీలకంగా మారిన సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4) ► తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ భారీ విజయం ► నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు ► దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. ► డిస్ట్రిబ్యూషన్ విభాగంలో ఇరు ప్యానెల్ నుంచి సమానంగా ఆరుగురి చొప్పున గెలుపొందారు. ► స్టూడియో సెక్టార్లో నలుగురికి గాను దిల్‌రాజ్ ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపొందారు. ► తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో దిల్ రాజ్ ప్యానల్ లీడింగ్ లో ఉంది. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి.కల్యాణ్ ప్యానెల్ కు 497 ఓట్లు వచ్చాయి. ► మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు అయిన తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఫైనల్‌గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ 3:30 నిమిషాలకు ముగిసింది. మొత్తం 1339 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 891,స్టూడియో సెక్టార్ నుంచి 68,డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 380 ఓట్లు నమోదయ్యాయి. ఈసారి రికార్టు స్థాయిలో పోలింగ్ జరిగింది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై.. 6 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు(మధ్యాహ్నం 3 గంటలు) 1233 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 810 , స్టూడియో సెక్టార్ నుంచి 68, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 355 ఓట్లు నమోదయ్యాయయి. ► ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ► మధ్యాహ్నం 1.30 గంటల వరకు 1035 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 650, స్టూడియో సెక్టార్ నుంచి 65, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 320 ఓట్లు నమోదయ్యాయి. ►సినీ ప్రముఖులు సురేశ్ బాబు, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, జీవిత తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటంన్నింటిని పరిష్కరించే సామర్థ్యం ఎవరికి ఉందో ఆలోచించి ఓటు వేయాలని నటి, దర్శకురాలు జీవిత విజ్ఞప్తి చేశారు. కోవిడ్ టైమ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ చూసిందని, అలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాను దిల్ రాజు వర్గానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటలకు మొత్తం 710 ఓట్లు పోలైయ్యాయి. వాటిలో ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 450, స్టూడియో సెక్టార్ నుంచి 50, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 210 ఓట్లు నమోదయ్యాయి. ► చాంబర్ ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గు పడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది’ అన్నారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఉదయం 10.45 వరకు దాదాపు 232 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ లో 95 ఓట్లు, స్టూడియో సెక్టార్ లో 35 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 102 ఓట్లు పోలైయ్యాయి. ► టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వస్తున్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన దిల్ రాజు, సి. కల్యాణ్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని పోలింగ్ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. విజేతలను సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ►ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. ► టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 1600 మంది సభ్యులు ఉన్నారు. ► ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. -
ఎన్టీఆర్ అవార్డ్స్‌కు అరుదైన గౌరవం.. !!
నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 8 రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు మురళీ మోహన్ పాల్గొని అవార్డులు అందజేశారు. తెలుగు సినీ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, దర్శకులు సురేష్ కృష్ణ, అశోక్, సత్యానంద్, సీనియర్ జర్నలిస్టులు వినాయక రావు, ధీరజ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్‌లకు ఈ అవార్డులు దక్కాయి. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ వేడుకను ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేదికపై 101 మందికి అవార్డులు అందజేయగా.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్టీపీసీ సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా - కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి లకు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ రాజీవ్ శ్రీవాత్సవ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. మురళి మోహన్ మాట్లాడుతూ.. 'జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం. అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని.' అని అన్నారు. నటన, సేవా రంగాలలో ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శ ప్రాయులని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. (ఇది చదవండి: Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?) ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, జెన్కో చైర్మన్ ప్రభాకర రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, కాశీ విశ్వనాధ్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్, తుమ్మల ప్రసన్న కుమార్, గౌతమ్ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను బహూకరించారు. -
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
ఆగస్టులో టీఎఫ్‌సీసీ నంది అవార్డులు
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక జరగనుంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆగస్టు 12న ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేసుకున్న సందర్బంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2021, 22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల వారు ఈ అవార్డుల కోసం టీఎఫ్‌సీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్‌కి సంబంధించిన లెటర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం సహకారం కూడా కోరనున్నాం. ఆగస్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘‘జ్యూరీ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమన్నారు. కానీ నేను జ్యూరీ మెంబర్‌గా ఉంటూ సపోర్ట్ చేస్తానని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు మురళీ మోహన్. సుమన్, బి. గోపాల్ తదితరులు మాట్లాడారు. -
అదే జరిగితే ' అంతకుముందు.. ఆ తర్వాత'.. డైరెక్టర్ లింగుస్వామి సీరియస్..!
అనువాద చిత్రాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'వారిసు' రిలీజ్‌పై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు లింగుస్వామి స్పందించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏం చేయాలో మాకు తెలుసన్నారు. (చదవండి: టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం) సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే థియేటర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు విమర్శలు చేశారు. ఇలా వ్యవహరించడం పద్ధ కాదని డైరెక్టర్ లింగుస్వామి అన్నారు. ఒకవేళ ఆ విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లింగుస్వామి హెచ్చరించారు. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారిసుకు రావాల్సిన థియేటర్లు లభించకపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. వారు ఇలాగే వ్యవహరిస్తే 'వారిసుకు ముందు, వారిసుకు తర్వాత' అనేలా ఉంటుందని దర్శకుడు లింగుసామి అన్నరు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించారు. -
నన్ను తొలగించలేదు: నిర్మాత కేఎస్ రామారావు
Producer KS Rama Rao React On Rumours: ‘ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్’ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. ఆ ఎఫ్ఎన్సీసీకి ఇప్పటికీ నేనే అధ్యక్షుడిగా ఉన్నాను’’ అని నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వైజాగ్ ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడిగా నేను, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా కాంతిరెడ్డి ఉన్నాం. విశాఖపట్నంలోని సినిమా రంగానికి చెందిన వివిధ శాఖలకు చెందిన పన్నెండువందలయాభై మంది సభ్యులుగా ఉన్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ అప్డేట్, 20న సెకండ్ సింగిల్ ఇటీవలే వైజాగ్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేసి, అధ్యక్షునిగా నన్నే ఉండమని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘వైజాగ్ ఎఫ్ఎన్సీసీ’ అధ్యక్షునిగా నన్ను తొలగించారనీ, సంస్థలో రూ. 30 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయనడం అవాస్తవం. అవగాహన లేనివారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ప్రోత్సాహకాలు ప్రకటించారు. నటీనటులకు స్థిరనివాసం, స్టూడియో నిర్మాణాలకు స్థలం ఇస్తామని పేర్కొన్నందుకు సీఎం జగన్‌గారికి, మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్. ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో తప్పుడు వార్తలు రావడం అభివృద్ధికి ఆటంకం’’ అన్నారు. -
'టీఎఫ్‌సీసీ' నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. చైర్మన్ గా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, టిఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్లు గా ఎ.గురురాజ్, నెహ్రు, సెక్రటరీగా జేవీఆర్. తెలంగాణ `మా` ప్రెసిడెంట్ గా రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రమేష్ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. కాగా ఈ రోజు టీఎఫ్‌సీసీ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, `మా` ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ చైర్మన్‌గా నాల్గోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్‌కు శుభాకాంక్షలు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులకు చేయూతనిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ.. చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం’అన్నారు. ‘మా’అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను వ్యక్తిగత హోదాలో మాత్రమే వచ్చాను. సినిమా నటులలో ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేదు. మనమందరం తెలుగు వారం. మనమంతా కలిసి తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను’అని అన్నారు. వైస్ చైర్మన్లు గురురాజ్, వెంక టేశ్వరరావు, నెహ్రు, సెక్రటరీగా జేవీఆర్,జనరల్ సెక్రటరీ బి.కిషోర్ పటేల్, ఆర్గనైజర్ సెక్రెటరీ డాక్టర్ వి.రామారావు గౌడ్, టి.మా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ వేణు గోపాల్ రావ్, కల్యాణి నాయుడు, రాజయ్య, జి.చెన్నారెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీస్ యమ్.అశోక్,కె.యల్. యన్.ప్రసాద్, ఈ.సి మెంబర్స్ లయన్ డి.ప్రేమ సాగర్, లయన్ సి.హెచ్.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై ‘రామ్‌చరణ్’ కంపెనీలోకి భారీ పెట్టుబడులు
ముంబై: దేశ కెమికల్స్ రంగంలోనే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల ఒప్పందం చోటుచేసుకుంది. చెన్నైకు చెందిన కెమికల్స్ డిస్ట్రిబ్యూటర్, స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ‘రామ్‌చరణ్ కో’లో న్యూయార్క్‌కు చెందిన టీఎఫ్‌సీసీ ఇంటర్నేషనల్ 46% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకోసం 4.14 బిలియన్ డాలర్లను (రూ.31,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయ నుంది. దీంతో రామచరణ్ కో 9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకున్నట్టు అయింది. వ్యర్థాల నుంచి ఇంధన తయారీ, నూనతతరం ఇంధన స్టోరేజ్ పరికరాలను రామచరణ్ కంపెనీ తయారు చేస్తోంది. భారత్‌లో పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు, పునరుత్పాదక ఇంధనాలు, తక్కువ వ్యయాలతో కూడిన ఇళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు టీఎఫ్‌సీసీ ప్రకటించింది. -
TFCC: నవంబర్ 14న టీఎఫ్‌సీసీ ఎన్నికలు
‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. నవంబరు 14న ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీ ఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘టీఎఫ్‌సీసీ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా చాంబర్లో 8000 మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది తెలంగాణ మూవీ ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. నవంబరు 14నే ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆసక్తిగలవారు పోటీ చేయవచ్చు’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ’ ప్రారంభమై ఏడేళ్లలో 8000 మంది సభ్యులుగా చేరడం సాధారణమైన విషయం కాదు. ‘టీఎఫ్‌సీసీ’ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం’’ అన్నారు టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్. -
టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (టీ మా) ఉపాధ్యక్షురాలిగా నటి జె.పూజిత నియమితులయ్యారు. ఈ మేరకు ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆదివారం ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఎఫ్‌సీసీ అనుబంధమైన టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజితను నియమించామని, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకూ ఆమె ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతారని అన్నారు. పూజిత మాట్లాడుతూ... ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు.బాధ్యతగా పనిచేసి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని అన్నారు. కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్, కార్యదర్శి కాచం సత్యనారాయణ, టీమా అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కరోనా విరాళం
బ్రహ్మానందం – 3 లక్షలు (’సీసీసీ మనకోసం’కి) చదలవాడ శ్రీనివాస్ – పది లక్షలా పదకొండు వేల నూట పదకొండు రూపాయిలు (’తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి’ కోసం ) తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ – 25 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి) రాజమౌళి, డీవీవీ దానయ్య – 10 లక్షలు. (‘సీసీసీ మన కోసం’కి). -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని
‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారునిగా నిర్మాత ఏ.యమ్ రత్నం, వైస్ ప్రెసిడెంట్‌గా నిర్మాత గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీ భాయ్, సెక్రెటరీలుగా కె.వి. రమణా రెడ్డి, కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్ సెక్రెటరీలుగా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీలుగా సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా ఈసీ మెంబర్స్‌గా వి. కృష్ణ రావు, హెచ్. కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్. వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి, బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రెసిడెంట్ పి.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థలం కేటాయిస్తాం. కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 శాఖల్లోని వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని తీర్మానించుకున్నాం’’ అన్నారు. -
చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్
శనివారం హైదరాబాద్‌లో చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎగ్జిబిటర్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో ఓనర్స్ సెక్టార్, నిర్మాతల మండలి.. ఇలా నాలుగు విభాగాలుంటాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో విభాగం నుండి ఒకర్ని అధ్యక్షునిగా ఎంపిక చేస్తారు. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ తరఫున ఏషియన్ ఫిలింస్ అధినేత నారాయణ్‌దాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యుల కోసం సి.కల్యాణ్ ఆధ్వర్యంలో ‘మన ప్యానెల్’, ‘దిల్’ రాజు సారధ్యంలోని ‘యాక్టివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్’ పోటీ పడ్డాయి. ‘మన ప్యానెల్’ నుండి తొమ్మిది మంది విజయం సాధిస్తే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుండి ఇద్దరు విజయం సాధించారు. మోహన్‌గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాదించారు. ఉపాధ్యక్షులుగా ముత్యాల రాందాసు, ‘దిల్’ రాజు, కొల్లి రామకృష్ణ, కార్యదర్శులుగా దామోదర్ ప్రసాద్, ముత్యాల రమేశ్, సహాయ కార్యదర్శులుగా భరత్ చౌదరి, నట్టికుమార్, జి. వీరనారాయణబాబు, జె. మోహన్ రెడ్డి, పి. భరత్ భూషణ్, ఎన్. నాగార్జున, కోశాధికారిగా విజయేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇంకా నాలుగు విభాగాల్లో నిర్మాతల విభాగానికి ఏలూరు సురేందర్ రెడ్డి, పంపిణీ విభాగానికి ఎన్. వెంకట్ అభిషేక్, స్టూడియో విభాగానికి వై. సుప్రియ, థియేటర్ అధినేతల విభాగానికి టీఎస్ రాంప్రసాద్ నియమితులయ్యారు. -
నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు
‘‘నిర్మాతల మండలి ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరూ ఒక్కటిగా ప్యానల్‌ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత సురేశ్‌బాబుతో కూడా మాట్లాడాను. చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే’’ అని తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఎన్నికల విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ని ఎంపిక చేసింది.ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి. అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి బాగా ఉంటున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్.ఎల్. పి అంటూ చానల్స్ విషయంలో సపరేట్గా ఉండటంతో కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తామని నిర్మాత సి. కళ్యాణ్‌గారు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేడు ఉపసంహరణ చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల ముందే అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్‌ని ఎంపిక చేస్తే బాగుంటుంది. నేడు నేను ఉపసంహరణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శంకర్ గౌడ్, జేవీఆర్, సాయి వెంకట్‌లతో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కు టీఎఫ్‌సీసీ అభినందనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ- హైదరాబాద్) తరపున అభినందనలు తెలిపారు. టీఎఫ్‌సీసీ గౌరవ సెక్రటరీ ముత్యాల రామదాసు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించినప్పటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి వెల్లువెలా అభినందనలు వస్తున్న సంగతి తెల్సిందే.