Title song
-
డ్యాన్సింగ్ మూడ్‌లో స్టార్ హీరోలు.. 1997 తర్వాత 'చిరు' మళ్లీ ఇలా
ఫ్యామిలీ సాంగ్ ఆనందోత్సాహలతో ఫ్యామిలీ పాట పాడుతున్నాడట ‘విశ్వంభర’. చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి హాయిగా డ్యాన్స్ చేస్తున్నాడట. ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్‌కు కారణమైన హ్యాపీ మూమెంట్స్ ఏంటో ‘విశ్వంభర’ సినిమాలో చూడాలి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ‘స్టాలిన్’ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు త్రిష. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర భీమవరం దొరబాబు అని, కథ రీత్యా దొరబాబుకు ఐదుగురు చెల్లెళ్లు ఉంటారనే ప్రచారం సాగుతోంది. చిరంజీవి చెల్లెళ్లుగా మీనాక్షీ చౌదరి, మృణాల్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కనిపిస్తారని భోగట్టా. కాగా ‘విశ్వంభర’ తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముందుగా కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ ఆరంభించారని తెలిసింది. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి స్వరకర్త. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘హిట్లర్’ (1997) సినిమాలో హీరో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్లకు చిరంజీవి మళ్లీ ఐదుగురు చెల్లెళ్లతో ‘విశ్వంభర’ చేస్తున్నారు. రొమాంటిక్ కల్కి ఇటలీ బీచ్‌లో ప్రేమ పాట పాడుతున్నారు ప్రభాస్. ఈ రొమాంటిక్ పాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పుష్పరాజ్ పాట మంచి ఫైర్ మీద ఉన్నాడు పుష్పరాజ్. తన సత్తా ఏంటో పాట రూపంలో మరోసారి చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఓ మాస్ సాంగ్ ఉంటుంది. ఈ తరహా సాంగ్ ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ ఉందట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడి యోలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటకు ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిన్నారు. తొలి భాగంలో శ్రీవల్లి పాత్రలో ప్రేయసిగా నటించిన హీరోయిన్ రష్మికా మందన్నా మలి భాగంలో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
సెట్స్‌లో నా సామిరంగ
నా సామిరంగ... డ్యాన్స్ అంటూ సెట్స్‌లో రెచ్చిపోతున్నారు నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ సెట్లో నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్‌లతో పాటు 300మంది డ్యాన్సర్స్ పాల్గొంటుండగా, టైటిల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. -
సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'పర్ఫ్యూమ్'.. టైటిల్ సాంగ్ రిలీజ్!
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పర్ఫ్యూమ్’. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను బిగ్‌బాస్ కంటెస్టెంట్ భోలె షావలి, భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పర్ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేయగా.. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. ఈ పాటను వరం, కీర్తన శర్మ ఆలపించారు. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇంతవరకు ఎప్పుడు రాని స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ సంగీతం అందిస్తున్నారు. -
మాస్ రింగు...
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్– కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మేçఘా లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘రింగు రింగు బిళ్ల..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకి దేవ్ పవార్ సాహిత్యం అందించగా, భోలే షావలి, రఘురామ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫుల్ మాస్‌గా ‘రింగు రింగు బిళ్ల..’ సాంగ్ ఉంటుంది. సోహైల్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్. -
విజయ్- సమంత 'ఖుషి'.. టైటిల్ సాంగ్ వచ్చేసింది!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. లైగర్ డిజాస్టర్ తర్వాత సూపర్ హిట్ కావడంతో విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. శివనిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి మూడో రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్లను మార్కును దాటేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. (ఇది చదవండి: తగ్గేదేలే అంటున్న ఖుషి.. మూడో రోజు అదే జోరు!) 'ఖుషి.. నువ్వు కనబడితే.. ఖుషి.. నీ మటా వినపడితే..' అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాగా.. కశ్మీర్ బ్యాప్ డ్రాప్లో తెరకెక్కించి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. మూవీ హిట్ కావడంతో కుటుంబ సమేతంగా వెళ్లి యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?) -
'అడ్డేలేదు.. అడ్డాలేదు'.. ఆసక్తిగా పెంచుతోన్న టైటిల్ సాంగ్
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ హీరోయిన్ అతుల్య రవి జోడీగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 'అడ్డేలేదు.. అడ్డాలేదు.. పడిలేచాడో ఉప్పెనలా ఒడ్డేలేదు' అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సాంగ్‌ను జనగామ డీసీపీ సీతారాం చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, అతల్యరవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో లవ్, రొమాన్స్, కామెడీ, పైట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. -
'భగ భగ భగ మండే.. మగాడు వీడే'.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా హైలెట్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలోని ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్, 'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా.. ' అ’నే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో దూసుకెళ్తున్నాయి. జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. ఇప్పటికే రిలీజైన పాటలు సినిమాపై క్రేజ్ మరింత పెంచాయి. తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్‌తో సినిమాపై మరింత హైప్ పెరగనుంది. -
'సుందరాంగుడు' టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్
ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబయ్యాడు. లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎమ్ఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేరట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ' టైటిల్ సాంగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు. ఈ సినిమా యూనిట్ సభ్యులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అని అన్నారు. -
మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ వచ్చేసింది
Sarkaru Vaari Paata Title Song Release: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 22న) గుమ్మడికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసి మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్ ‘సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఈ రోజు(ఏప్రిల్ 23) ఉదయం 11 గంటలకు విడుదలై అప్పుడే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: గుడ్‌న్యూస్, ‘సర్కారు వారి పాట’కు గుమ్మడికాయ కొట్టేశారు -
మారిందేమో నా రాత!
హీరోయిన్ హన్సిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట..’ అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు. మార్క్ రాబిన్ సంగీతం అందించారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మై నేమ్ ఈజ్ శృతి’ లాంటి ఇంటెన్స్ స్టోరీని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలోని ట్విస్ట్‌లు ఆశ్చర్యపరుస్తాయి’’ అన్నారు. ‘‘త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రమ్యా ప్రభాకర్. ‘మనిషి చర్మం వొలిచి వ్యాపారం చేసే గ్యాంగ్‌తో ఓ యువతి చేసే పోరాటమే మా చిత్రం’’ అని శ్రీనివాస్ ఓంకార్ అన్నారు. -
'నీ మొగుడేమన్నా మహేశ్బాబా? నువ్వేమైనా కత్రినా కైఫా'?..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్‌లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'అఖండ' టైటిల్ సాంగ్
Akhanda Title Song Released: బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అఖండ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్ భారీ విజువల్స్‌తో గూస్బంప్స్ తెప్పిస్తుంది. పాట విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సింహా’,‘లెజెండ్’వంటి బెగ్గెస్ట్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
Bheemla Nayak : లాలా భీమ్లా ఫుల్ సాంగ్ వచ్చేసింది..
Pawan Kalyan Bheemla Nayak Song Lala Bheemla: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్, ఫస్ట్సింగిల్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. పవన్ పాత్రను హైలైట్ చేస్తూ సాగిన ఈ పాటను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. ఆదివారం(నవంబర్7న) త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. పవన్.సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
ఐకానిక్ మహాభారత్ సాంగ్‌ను ఆలపించిన ముస్లిం: నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: అలనాటి పాపులర్ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ టైటిట్ సాంగ్‌ను ఆసాంతం అద్భుతంగా ఆలపించి ఒక ముస్లిం ప్రశంసలందుకుంటున్నారు. ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఐకానిక్ ట్రాక్‌ను హృద్యంగా ఆలపించిన ఈ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురైషి షేర్ చేశారు. బీటింగ్ ది స్టీరియోటైప్స్ అంటూ ఆయన షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన రామాయణ, మహాభారత సీరియల్స్ టెలివిజన్ చరిత్రలో గొప్ప సంచలనం రేపాయి. ఆదివారం ఉదయం ప్రసారమయ్యే వీటి కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేశారు. తాజా వీడియోతో ఈ ఐకానిక్ టైటిల్ సాంగ్ వినపడగానే అందరూ టెలివిజన్ సెట్ల ముందుకు చేరిపోయే వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నిమిషం, 9 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిస్ ఈజ్ ఇండియా అంటూ కమెంట్ చేస్తున్నారు. లక్షా12 వేలకు పైగా వ్యూస్, రీట్వీట్లు, లైక్స్‌తో ఈ వీడియో సందడి చేస్తోంది. -
భీమ్లా నాయక్ పాటపై వివాదం: ఐపీఎస్ అధికారి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’లోని పాటను విడుదల చేశారు. విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్ కల్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో పాటతో అర్ధమవుతోంది. అయితే ఆ పాటపై ఓ ఐపీఎస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్ చేశారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ భీమ్లా నాయక్ పాట విన్న అనంతరం ఓ ట్వీట్ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్ అధికారి రమేశ్ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు పాటలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నేరుగా రామజోగయ్యను ట్యాగ్ చేస్తూ చెప్పారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రామజోగయ్య స్పందించారు. ‘మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా ‘నెక్ట్స్ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్’ అని శాస్త్రి రిప్లయ్ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటను తెలంగాణ జానపద కళాకారుడు, అరుదైన కిన్నెరను వాయించే దర్శనం మొగులయ్య పాడడం ప్రత్యేకంగా ఉంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s — M. Ramesh IPS (@DCPEASTZONE) September 2, 2021 -
‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం. లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’లో ఇంట్రడక్షన్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. తమిళనాడు ప్రాంతంలో షూటింగ్.. భీమ్లానాయక్ చిత్రానికి అవసరమైన టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది. జానపద కళలంటే ప్రాణం తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట -
‘కచడ కచడ హో గయా... అర్థమైత లేదయా'...
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మించారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించిన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ‘కచడ కచడ హో గయా... అర్థమైత లేదయా, నేను ఆడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సెహరి...’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ‘సెహరి’ చిత్రం రూపొందుతోంది. టైటిల్ సాంగ్‌ని భాస్కరభట్ల రాయగా రామ్ మిరియాల పాడారు. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో హర్ష్ డ్యాన్సింగ్ స్కిల్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న మా చిత్రం త్వరలోనే విడుదల కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథ్. -
వెంకీ మామ టైటిల్ సాంగ్
-
నేడే పాడండి!
టైటిల్ సాంగులు విన్నాం. ఇప్పుడు సాంగులే టైటిళ్లు అవుతున్నాయి!అవును.పాటను వినేవాళ్లం.ఇప్పుడు పాటను చూస్తున్నాం. నేడే పాడండి. కథ.. హీరో.. హీరోయిన్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు అంతా ఓకే. మరి టైటిల్ ఏంటి? గతంలో అయితే కథను స్ట్రయిట్‌గా చెప్పేసే టైటిల్స్ పెట్టేవారు. క్రమంగా ట్రెండ్ మారింది. కథను అంతర్లీనంగా చెబుతూనే క్యాచీ టైటిల్ పెడుతున్నారు దర్శక–నిర్మాతలు. కొత్త టైటిల్స్ పెట్టడం కంటే ఇప్పటికే బాగా పాపులర్ అయిన, జనం నోళ్లలో నానుతున్న పాటల పల్లవులను టైటిల్స్‌గా కొందరు వాడుకుంటున్నారు. మరికొందరేమో తమ అభిమాన హీరోలు నటించిన హిట్ సినిమాల్లో పాటల పల్లవులను టైటిళ్లుగా పెట్టేసుకుంటున్నారు. ఎందుకిలా అంటే.. జనాల నోళ్లలో నానిన వి అయితే ఈజీగా ప్రేక్షకులకు చేరువవుతాయనేది నమ్మకం. ప్రేక్షకాదరణ పొందిన పాటలో పల్లవి అయితే సెంటిమెంట్‌గా కూడా వర్కవుట్ అవుతాయనేది మరికొందరి నమ్మకం. ఇలా.. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి సెంటిమెంట్ వారిది. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’, శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’, సుధీర్‌బాబు ‘నన్ను దోచుకుందువటే’, జొన్నలగడ్డ హరికృష్ణ ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రాల టైటిల్స్ పాటల పల్లవుల్లోంచి తీసుకున్నవే. వీటిపై ఓ లుక్కేద్దాం. హలో గురు ప్రేమ కోసమే ‘హలో గురు ప్రేమకోసమేరోయ్ ఈ జీవితం.. మగాడితో ఆడదానికేలా పౌరుషం’ అంటూ నాగార్జున పాట పాడుతూ తన ప్రేమను అమలకు చెబుతాడు. 1991లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘నిర్ణయం’ సినిమాలోని ఈ పాట ఎంత పాపులరో తెలిసిందే. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ టైమ్‌లో ఈ పాటను కుర్రాళ్లంతా తెగ పాడుకున్నారు. ఇప్పుడు ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ రామ్.. అనుపమా పరమేశ్వరన్ వెంటపడుతున్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమకోసమే’ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పడి పడి లేచే మనసు ‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచే మనసు’ అంటూ చిరంజీవి, రాధ వేసిన స్టెప్పులను అంత సులువుగా మరచిపోలేరు ప్రేక్షకులు. 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘లంకేశ్వరుడు’ చిత్రంలోని ఆ పాటకు స్టెప్పులేయని కుర్రకారు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదేమో. రాజ్–కోటి, సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలై 28ఏళ్లు అయినా ఇప్పటికీ ఆ పాట ఎక్కడ వినపడ్డా చిరంజీవి–రాధ మన కళ్లముందు మెదులుతారు.. అంతేనా.. మనకీ కాలు కదపాలనిపిస్తుంటుంది. అంతలా హిట్ అయిన ఆ పాటతో ఇప్పుడు శర్వానంద్‌కి, సాయిపల్లవికీ లింక్ కుదిరింది. వారిద్దరూ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రానికి ‘పడి పడి లేచే మనసు’ టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. సంగీతం విశాల్ చంద్రశేఖర్. నన్ను దోచుకుందువటే ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ’ అంటూ ఎన్టీఆర్–జమునలు పాడుకున్న పాట వింటుంటే ఇప్పటికీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో వచ్చిన ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఆ పాట ఎవర్గ్రీన్. విజయ్ కృష్ణమూర్తి, జోసెఫ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ మనోహరంగా ఉంటాయి. ఇప్పుడు సుధీర్ బాబు కూడా నభా నతేశ్తో ‘నన్ను దోచుకుందువటే’ అంటున్నారు. వారిద్దరూ జంటగా ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ హీరోగా నటించి, సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం నిర్మించారు. ఈ టైటిల్ ప్రకటించగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు. అజనీష్ బి.లోకనా«థ్ స్వరాలు సమకూర్చారు. ప్రేమెంత పనిచేసె నారాయణ చిన్న హీరో. కానీ ట్యూన్ క్యాచీగా ఉంటే పెద్ద పాపులార్టీ వస్తుంది. ‘ప్రేమెంత పనిచేసె నారాయణ.. సత్యనారాయణ’ పాట ఈ లిస్ట్‌లోకే వస్తుంది. రోహిత్, అనితా పాటిల్ పాడుకున్న ఈ పాట యువతని ఉర్రూతలూగించింది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలోనిది ఇది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించిన ఆ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇప్పుడదే టైటిల్‌తో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా పరిచయం అవుతున్నారు. హరికృష్ణ, అక్షిత జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ చిత్రం టైటిల్ ఇప్పటికే అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాజమాన్య స్వర పరచిన ఈ చిత్రం పాటలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. దట్ ఈజ్ మహాలక్ష్మి ‘దట్ ఈజ్ మహాలక్ష్మి...’ అంటూ ‘100% లవ్’ చిత్రంలో బాలు (నాగచైతన్య) ఎదుట కాలేజీలో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతుంది మహాలక్ష్మి (తమన్నా). నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బావా మరదళ్లుగా చైతూ, మిల్కీ బ్యూటీ చేసిన సందడి మరచిపోలేం. ఆ చిత్రంలోని ‘దట్ ఈజ్ మహాలక్ష్మి...’ పాట పేరుతో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘క్వీన్’ సినిమాకి రీ–మేక్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో తమన్నా లీడ్ రోల్ చేస్తుండటం విశేషం. యూరప్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. పెదవి దాటని మాటొకటుంది ‘పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా’ అంటూ ‘తమ్ముడు’ సినిమాలో తన ప్రేమను పవన్ కళ్యాణ్‌కి చెప్పకనే చెబుతుంటుంది ప్రీతి జింగానియా. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలై మంచి హిట్ అందుకుంది. రమణ గోగుల సంగీతం ఈ చిత్రానికి మరో ఎస్సెట్. అంత హిట్ అయిన ఆ పాటతో తాజాగా ‘పెదవి దాటని మాటొకటుంది’ సినిమా తెరకెక్కింది. రావణ్ రెడ్డి, పాయల్ వాద్వా జంటగా టి.గురుప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్ననే (శుక్రవారం) విడుదలైంది. ఈ చిత్రాన్ని ముగ్గురు స్నేహితులు (హీరో రావణ్ రెడ్డి, డైరెక్టర్ గురుప్రసాద్, సంగీత దర్శకుడు జీనిత్ రెడ్డి) కలసి తీశారు. పల్లవుల టైటిల్స్‌తో వచ్చిన చిత్రాలు ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం (అభినందన) సాహసం శ్వాసగా సాగిపో (ఒక్కడు) ఆటాడుకుందాం రా (సిసింద్రీ) సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (శుభసంకల్పం) మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (రాక్షసుడు) శ్రీరస్తు.. శుభమస్తు (పెళ్లి పుస్తకం) కళ్యాణ వైభోగమే (సీతారాముల కళ్యాణం) వెన్నెల్లో హాయ్ హాయ్ (ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు) సోగ్గాడే చిన్నినాయనా (ఆస్తిపరులు) ఎక్కడికి పోతావు చిన్నవాడా (ఆత్మబలం) నన్ను వదలి నీవు పోలేవులే (మంచి మనసులు) వీరి వీరి గుమ్మడి పండు (జయం) భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ (మనీ) ప్రేమంటే సులువు కాదురా (ఖుషి) చందమామ రావే (సిరివెన్నెల) చంద్రుళ్లో ఉండే కుందేలు (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) కన్నుల్లో నీ రూపమే (నిన్నే పెళ్ళాడతా) బంతిపూల జానకి (బాద్షా) – ఇన్పుట్స్ : డేరంగుల జగన్ -
రంగస్థలం దరువులకు.. తీన్మార్ చిందులే!
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. రంగా.. రంగా... రంగస్థలానా రంగుపూసుకోకున్నా... అంటూ సాంగే మాస్ బీట్‌ను కాసేపటి క్రితం మేకర్లు విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన సాహిత్యం.. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం... అందుకు దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ చెర్రీ వాయిస్ ఓవర్ తో ఊర మాస్ బీట్ సాంగ్‌ను దేవీ అందించాడు. రంగస్థలం ఊరు నేపథ్యంలో సాగే ఈ పాటలో చెర్రీ స్టైలింగ్ కూడా వైవిధ్యంగానే ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. హీరోయిన్గా సమంత, కీలక పాత్రల్లో ఆది, అనసూయ తదితరులు నటించగా.. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రంగస్థలం దరువులకు.. తీన్మార్ చిందులే!
-
మెగా ఫ్యాన్స్.. ఇంక పూనకాలే...
సాక్షి, సినిమా : రంగస్థలం చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేసేశారు. ఇప్పటికే తొలి సాంగ్ ఎంత సక్కగున్నవే ట్రెండ్‌లో కొనసాగుతుండగా.. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్లు అధికారికంగా ప్రకటించేశారు. ‘రంగా.. రంగా.. రంగస్థలానా’... అంటూ సాంగ్‌ను మార్చి 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్లు ఓ చిన్న వీడియోను వదిలారు. అంతకు ముందు ముందుగా ఎంత సక్కగున్నావే పాటను లెజెండరీ తార శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. పాటను అంతగా ఆదరించినందుకు దర్శకుడు సుకుమార్, రైటర్ చంద్రబోస్‌లు శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపై మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ సెకండ్ సాంగ్ రికార్డింగ్‌కు సంబంధించిన దృశ్యాలను చిన్న బైట్ రూపంలో విడుదల చేశారు. గ్రామ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ సాంగ్‌లో చెర్రీ గెటప్ కూడా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు స్పష్టమౌతోంది. మొత్తానికి ఊర మాస్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు దేవీ సిద్ధమైపోతున్నాడు. మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు నటిస్తుండగా.. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మెగా ఫ్యాన్స్.. ఇంక పూనకాలే...
-
పవన్ బర్త్‌డే కానుకగా.. జవాన్ టైటిల్ సాంగ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'జవాన్' టైటిల్ సాంగ్ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. మెగా ఫ్యామిలీ హీరో, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ టీజర్ విడుదల చేసింది. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తుందని దర్శకుడు బివిఎస్ రవి చెప్పారు. ఎస్.ఎస్ థమన్ అందించిన సంగీతం మూవీకి ప్లస్ పాయింట్ కానుంది. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో భారీ హైప్స్ క్రియేట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి జవాన్ లోని హీరో లాంటి వ్యక్తి ఉండాలని దర్శకుడు రవి చెబుతుండగా ఈ మూవీ తేజూకి మంచి పేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇన్నాళ్లు బబ్లీ హీరోగా కనిపించిన సాయిధరమ్ ఈ సినిమాలో కాస్త హుందాగా కనిపిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.