Toyota Kirloskar Motor
-
మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ టైజర్’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్‌కి టీకేఎం వెర్షన్‌గా ఉంటుంది. టైజర్ పెట్రోల్, ఈ–సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్‌ప్లే, యాంటీ–థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్‌ను బుక్ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో తయారీ పెంచుతున్న టయోటా
టోక్యో: వాహన తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్.. భారత్‌లో పూర్తి సామర్థ్యంతో ప్లాంట్లు నడుస్తుండడంతో తయారీని పెంచే ప్రక్రియను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా టయోటా మోటార్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూప్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు బీదడి వద్ద రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల స్థాపిత సామర్థ్యం ఏటా 3.42 లక్షల యూనిట్లు. ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, లెజెండర్, కామ్రీ హైబ్రిడ్, అర్బన్ క్రూజర్ హైరైడర్, హైలక్స్ మోడళ్లను తయారు చేస్తోంది. సుజుకీ కార్పొరేషన్‌తో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా గ్లాంజా, రూమియన్ మోడళ్లను సైతం ఉత్పత్తి చేస్తోంది. పూర్తిగా తయారైన వెల్ఫైర్, ఎల్సీ 300 మోడళ్లను దిగుమతి చేసుకుంటోంది. కొన్ని మోడళ్లకు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీంతో మెరుగైన డిమాండ్ కారణంగా భారత్‌లో మూడవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. 2023 ప్రారంభంలో కొన్ని మోడళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 30 శాతం పెంచడానికి బీదడిలో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించింది. 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంపెనీ 1,23,939 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. డిమాండ్ బలంగా ఉంది.. భారత్‌లో పూర్తి ప్లాంట్ సామర్థ్యాన్ని వినియోగిస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోయిచి మియాజాకి జపాన్ మొబిలిటీ షో సందర్భంగా తెలిపారు. దేశంలో సామర్థ్య పెంపుపై తాజా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు మొదలయ్యాయని వెల్లడించారు. ‘కోవిడ్ తర్వాత భారత ఆటోమొబైల్స్ రంగంలో ముఖ్యంగా పెద్ద కార్లకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ తర్వాత ఇతర దేశాలతో పోలిస్తే మార్కెట్ రికవరీ భారత్‌లో చాలా బలంగా ఉంది. కాబట్టి డిమాండ్ కూడా బలంగా ఉందని మేము నమ్ముతున్నాము. మార్కెట్లో పెద్ద కార్ల పట్ల ఆసక్తి క్రమంగా పెరగడం కంపెనీకి మంచి సంకేతం’ అని వివరించారు. భారతీయ కార్ల విపణి చిన్న కార్ల నుండి పెద్ద కార్ల విభాగాలకు మారడం వల్ల మార్కెట్‌ను టయోటా మరింత ఆకర్షణీయంగా మారుస్తుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టయోటాకు సమయం ఆసన్నమైందని అన్నారు. -
టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!
టయోటా లగ్జరీ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. వీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతోపాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆ కంపెనీ కార్లను కొనడానికి ఇష్టపడతారు. అందుకే వాటి అమ్మకాలు భారీగా పెరిగాయి. తమ కార్ల అమ్మకాలు ఏడాదిలో 75 శాతం పెరిగి 2023 ఫిబ్రవరిలో 15,338 యూనిట్లకు చేరుకున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తాజాగా తెలియజేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ దేశీయ మార్కెట్లో 8,745 కార్లను విక్రయించింది. ‘మా ఉత్పత్తులపై కస్టమర్ల అమితమైన ఆసక్తి కొనసాగుతోంది. దీని ఫలితంగా 2023 ఫిబ్రవరిలో చాలా మంచి వృద్ధి నమోదైంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) ఈ అమ్మకాల వృద్ధిలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ అగ్రగామిగా ఉన్నాయని, కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి తమ భాగస్వాములతో కలిసి మరింతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభించిన టయోటా హిలక్స్ కోసం బుకింగ్‌లకు మంచి స్పందన వస్తోందని, దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే గ్లాంజా, ఫార్చూనర్, లెజెండర్ వంటి వాటికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్‌పర్సన్‌గా మానసి టాటా.. ఎవరీ మానసి?
సాక్షి,ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. తక్షణమే వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది. మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్లుక్"ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీఎండీ మసకాజు యోషిమురా అన్నారు" మానసి టాటా అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో నోయెల్ టాటా (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కిర్లోస్కర్ సామ్రాజ్యం ఐదోతరం ప్రతినిధిగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ గతేడాది నవంబర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబరులో, కిర్లోస్కర్ సిస్టమ్స్ కంపెనీ యొక్క JV కంపెనీలైన టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్టైల్ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ (KTTM), టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (TMHIN), DNKI బోర్డులో మానసి టాటాను డైరెక్టర్‌గా నియమించింది. -
టయోటా హైలక్స్ బుకింగ్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ప్రీమియం యుటిలిటీ వెహికిల్ హైలక్స్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. హైలక్స్ ధర ఎక్స్‌షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. చదవండి: నెలకు రూ.12వేలు పెన్షన్ కావాలా? ఇలా ట్రై చేయండి! -
టయోటా ఇన్నోవా హైక్రాస్.. అదిరే లుక్, డెలివరీ అప్పటినుంచే!
వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్.. హైబ్రిడ్ మల్టీపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వర్షన్ ధరను వేరియంట్‌ను బట్టి రూ.18.3– 19.2 లక్షలుగా నిర్ణయించింది. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. సెల్ఫ్‌చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్షన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.24–29 లక్షలుగా ఉంది. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 23.24 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లోనూ లభిస్తుంది. మైలేజీ లీటరుకు 16.13 కిలోమీటర్లు. బుకింగ్స్ నవంబర్ 25 నుంచే ప్రారంభం అయ్యాయి. 2005లో భారత్‌లో అడుగుపెట్టిన ఇన్నోవా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా యూనిట్లు రోడ్డెక్కాయి. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం పైమాటే. చదవండి: టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్! -
టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్ హఠాన్మరణం
బెంగళూరు: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ (64) కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారని కిర్లోస్కర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. (డీఎల్ఎఫ్కు షాక్: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు) బెంగళూరులోని హెబ్బాళ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించ నున్నారు. చివరిసారిగా నవంబర్ 25వతేదీన ముంబైలో జరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రమ్ కిర్లోస్కర్ పాల్గొన్నారు. కిర్లోస్కర్ అకాల మరణంపై పలువురు బిజినెస్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. -
హైబ్రిడ్ మోడళ్లపైనే టయోటా ఫోకస్
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను భవిష్యత్తులో ప్రవేశపెడతాం. ప్రస్తుతానికి హైబ్రిడ్ మోడళ్లపైనే టయోటా కిర్లోస్కర్ ఫోకస్ చేసిందని కంపెనీ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో హైబ్రిడ్లపై దృష్టిసారించారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడమే దేశ లక్ష్యం అని నేను భావిస్తున్నాను. మీరు దానిని సమగ్రంగా, శాస్త్రీయ ప్రాతిపదికన చూడాలి. అదే మేము చేస్తున్నాము’ అని చెప్పారు. సమీప కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పునరుత్పాదక విద్యుత్తు వాటా కనీసం 50–60 శాతానికి చేరితే తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నోవా హైక్రాస్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవీ ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు.. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవా ప్లాట్‌ఫామ్‌పై హైక్రాస్ పేరుతో హైబ్రిడ్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. బుకింగ్స్ మొదలయ్యాయి. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తోనూ లభిస్తుంది. సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో 2 లీటర్ పెట్రోల్ ఇంజిజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 21.1 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. డైనమిక్ రాడార్ క్రూజ్ కంట్రోల్, ప్రీ కొలీషన్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్, 7–8 సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ జోడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవా వాహనాలు 26 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2005లో భారత్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు ఇన్నోవాలు రోడ్డెక్కాయి. కంపెనీ మొత్తం అమ్మ కాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం ఉంది. చదవండి: బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ! -
టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు..! రేంజ్లో అదుర్స్..!
పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ ఆందోళనల కారణంగా...ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆయా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లలోకి రిలీజ్ చేశాయి. ఇక భారత్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా ఊపందుకుంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లను టార్గెట్ చేస్తూ పలు దిగ్గజ కంపెనీలు వినూత్న ఎలక్ట్రిక్ మోడళ్ల తయారీపై దృష్టి పెట్టాయి. కాగా టయోటా, మారుతి సుజుకి సంస్థలు ఒక అడుగు ముందుకేసి మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును భారత్‌లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రెండు ఎలక్ట్రిక్ కార్లను తయారుచేస్తున్నాయి. డిజైన్ విషయానికి వస్తే..! టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా రూపొందించిన మిడ్‌సైజ్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారు డిజైన్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ వాహనం 2.7 మీటర్ల వీల్‌బేస్‌తో 4.3 మీటర్ల పొడవు ఉండవచ్చునని తెలుస్తోంది. అంటే భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ టాటా నెక్సాన్ ఈవీ కంటే ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన జెడ్ఎస్ ఈవీతో సమానమైన పరిమాణంలో ఉండవచ్చు. స్థానిక , అంతర్జాతీయ మార్కెట్ల కోసం, సుజుకి ఈ రెండు మోడళ్లను దాని గుజరాత్ ఫెసిలిటీలో నిర్మిస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ పొడవైన వీల్‌బేస్ కారణంగా, క్యాబిన్ మరింత విశాలంగా ఉండనుంది. సెక్యూర్డ్ బ్యాటరీ ప్యాకేజింగ్‌తో రానుంది. మాడ్యులర్ eTNGA ప్లాట్‌ఫారమ్‌తో కూడిన డెడికేటెడ్ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్తో వచ్చే అవకాశం ఉంది. ధర ఎంతంటే..? భారత్‌లో మిడ్‌సైజ్ ఎస్యూవీ వాహనాలు భారీ ఆదరణను పొందాయి. టయోటా, మారుతి సుజుకీ సంయుక్తంగా రూపొందిస్తోన్న మిడ్ సైజ్ ఎస్యూవీ భారత ఈవీ మార్కెట్లలో తొలి కారుగా నిలుస్తోంది. ఈ రెండు కంపెనీలు తయారు చేస్తోన్న కారు ధర రూ. 13 నుంచి 15 లక్షల(ఎక్స్‌షోరూమ్)గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రేంజ్ ఎంతంటే..? ఈ కారులో రెండు రకాల బ్యాటరీ వేరియంట్స్‌తో వచ్చే అవకాశం ఉంది. 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 140పీఎస్ శక్తిని, ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 172 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తోంది. ఈ కారు సుమారు రియల్‌టైంలో 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. చదవండి: కళ్లు చెదిరే లుక్స్‌తో హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకి నయా కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
టయోటాలో అత్యంత సరసమైన ధరలో కార్..! ధర ఎంతంటే..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా దేశీయ మార్కెట్లోకి 2022 టయోటా గ్లాంజాను లాంచ్ చేసింది. భారత్‌లోని టయోటా కార్లలో 2022 టయోటా గ్లాంజా అత్యంత సరసమైన ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఇంజన్ విషయానికి వస్తే..! 2022 టయోటా గ్లాంజా 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ డ్యుయల్‌జెట్ కే12ఎన్ పెట్రోల్ ఇంజిన్ తో 90hp పవర్ తో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందులో 5 స్పీడ్ ఆటో, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరింయట్లలో అందుబాటులో ఉండనుంది. డిజైన్‌లో స్టైలిష్ లుక్‌తో..! 2022 టయోటా గ్లాంజా కార్ ముందుబాగం స్టైలిష్ లుక్ వచ్చేలా కంపెనీ డిజైన్ చేసింది. బంపర్, ముందు గ్రిల్, హెడ్ లైట్, ఎల్ఈడీ లైట్స్ గ్రాఫిక్స్ డిజైన్ లో గ్లాంజా కొత్తదనాన్ని కలిగి ఉండనుంది. వేరువేరు మోడళ్లలో లభించే ఫీచర్లు మారనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్‌తో కూడిన 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ‘టయోటా ఐ-కనెక్ట్’ కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ , టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో కూడిన స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో రానున్నాయి. బాలెనో, ఆల్ట్రోజ్ వంటి కార్లకు పోటీగా..! 2022 టయోటా గ్లాంజా కొద్ది వారాల క్రితం మారుతి సుజుకి లాంచ్ చేసిన బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్‌వేగన్ పోలో, హోండా జాజ్ కార్లకు పోటీగా నిలుస్తోందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధర ఏంతంటే..? టయోటా గ్లాంజా మొత్తంగా నాలుగు ట్రిమ్ లేవల్స్లో రానుంది. గ్లాంజా ధరలు రూ. 6.39 లక్షల నుంచి ప్రారంభంకానున్నాయి. కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌లు, వెబ్సైట్ ద్వారా కేవలం రూ.11,000తో ప్రి బుకింగ్స్‌ను టయోటా గత వారం ప్రారంభించింది. చదవండి: మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ రికార్డుల హోరు..! 10 లక్షలకుపైగా.. -
అదిరిపోయిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!
ఇప్పటికే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతున్న మనకు తెలిసిందే. ప్రముఖ దిగ్గజ కంపెనీలతో సహ ఇతర స్టార్టప్ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాయి. కొన్ని సంస్థల ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ దూసుకొని వెళ్తుంది. ఈవీ రంగంలో కాస్త వెనుక బడిన దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(ఎంఎస్ఐ) కూడా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) సెగ్మెంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌తో కలిసి గ్లోబల్ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మారుతి సుజుకి అభివృద్ధిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారుకి వైవై8 అనే కోడ్‌నేమ్ పెట్టాయి. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఈవీ కార్ల కంటే చాలా శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కారుగా నిల్వనున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విదేశాలకు కూడా ఎగుమతి చేసేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిని సుజుకికి చెందిన గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేయనుంది. నివేదిక ప్రకారం.. వైవై8 4.2 మీటర్ల పొడవైన బాడి, పొడవైన 2,700 మీ.మీ వీల్ బేస్ ఉండనుంది. ఇందులో 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 138 హెచ్‌పీ మోటార్ ఉంటుంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 170 హెచ్‌పీ మోటార్ గల మోడల్ కారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. మారుతి-టయోటా అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారులో వినియోగించే భారత్‌లో తయారు చేసిన బ్యాటరీలే వాడనున్నారు. గుజరాత్‌లోని లిథియం అయాన్ బ్యాటరీ మాన్యుఫాక్చరర్ టీడీఎస్జీ ఈ బ్యాటరీలు తయారు చేస్తున్నది. ఈ బ్యాటరీని సుజుకి మోటార్ కార్పొరేషన్, డెన్సో కార్పొరేషన్, తొషిబా కార్పొరేషన్ ఉమ్మడిగా అభివృద్ది చేస్తున్నాయి. 2025లో మారుతి-టయోటా వైవై8 ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి రానున్నది. ప్రస్తుతం రెండు కంపెనీలు కారు ధర తగ్గించడంపైనే ఫోకస్ చేస్తున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ కంటే మారుతి-టయోటా ఈవీ కారు ధర చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ కారు ధర రూ.13-15 లక్షలు ఉంటుందని అంచనా. (చదవండి: రయ్‌మంటూ దూసుకెళ్లిన రిలయన్స్..! డీలా పడ్డ టీసీఎస్..!) -
పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..! ధర ఎంతంటే..?
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఫేస్‌లిఫ్టెడ్ క్యామ్రీ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. టయోటా క్యామ్రీ సరికొత్త ఫీచర్స్‌తో, కొత్త కలర్ ఆప్షన్‌తో, ఇంటీరియర్స్‌లో సరికొత్త మార్పులతో రానుంది. 2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు ధర రూ. 41.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారులో 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్‌తో సీవీటీతో జతచేయబడి ఉంది. డిజైన్‌లో సరికొత్తగా..! టయోటా న్యూ క్యామ్రీ కొత్త బంపర్, క్రోమ్ ఇన్సర్ట్స్తో గ్రిల్ పొందుతుంది. టెయిల్‌ల్యాంప్‌లను సరికొత్తగా డిజైన్ చేశారు. అంతేకాకుండా బ్లాక్ బేస్ ఎక్స్టెన్షన్లతో కూడిన ఎరుపు ఎల్ఈడీ బ్రేక్ లైట్ల క్లస్టర్‌ను కలిగి ఉంది. డార్క్ మెటాలిక్ ఫినిషింగ్‌తో కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత ఆకర్షణీయంగా నిలవనుంది. ఇంటీరియర్స్ విషయానికి వస్తే..! సెంట్రల్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్‌లో బ్లాక్ ఇంజనీర్డ్ వుడ్ ఎఫెక్ట్ ఫిల్మ్‌ను జోడించడంతో క్యాబిన్ లోపల కొత్త లుక్ రానుంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండింటిలోనూ అందుబాటులో ఉంది. 9-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్‌తో జత చేయబడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఫ్లోటింగ్ డిస్ప్లేను కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో రానుంది. కారులో ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మెమరీ అసిస్టెడ్ టిల్ట్-టెలీస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్ప్లేను టయోటా ఏర్పాటుచేసింది. మరిన్నీ ఫీచర్స్..! కారులోని రిక్లైనింగ్ సీట్స్, పవర్ అసిస్టెడ్ రియర్ సన్‌షేడ్, క్లైమేట్ కంట్రోల్, ఆడియో సెట్టింగ్స్‌తో కూడిన టచ్ ప్యానెల్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అమర్చారు. టయోటా క్యామ్రీలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ అసిస్ట్, క్లియరెన్స్ అండ్ బ్యాక్ సోనార్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి యాక్టివ్, ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ 2.5-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కల్గి ఉంది. 218bhp శక్తిని ఉత్పత్తి చేయనుంది. 221ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తోంది. హైబ్రిడ్ సిస్టమ్‌లో భాగంగా 245V నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో రానుంది. కర్భన ఉద్గారాలను పూర్తిగా ఆపివేసే ప్రయత్నంలో భాగంగా టయోటా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని టీకేఎమ్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అతూల్ సూద్ అన్నారు. క్యామ్రీ భారతీయ మార్కెట్లలో 2013లోనే ప్రవేశపెట్టినప్పటీకీ, ఇప్పుడు వచ్చిన ఫేస్‌లిఫ్ట్ క్యామ్రీ భారతీయులను మరింత ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. చదవండి: సరికొత్తగా హోండా సీబీఆర్300ఆర్ బైక్..! ధర ఎంతంటే...? -
టయోటా వాహన కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!
టయోటా వాహనాలను కొనుగోలుచేసే కస్టమర్లకు కంపెనీ భారీ షాకిచ్చింది. భారత్‌లోని అన్ని రకాల మోడల్ వాహనాల ధరలను పెంచుతూ టయోటా నిర్ణయం తీసుకుంది. వాహనాల ధరల పెంపు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో టయోటాలోని బెస్ట్ సెల్లర్స్ ఫార్చ్యూనర్ ఎస్యూవీ, ఇన్నోవా క్రిస్టాల ధరలు భారీగా పెరగనున్నాయి. కారణం ఇదే..! ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది నుంచి వాహనధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారితో పాటుగా టయోటా కూడా చేరింది. ముడి పదార్థాలతో సహా ఇన్పుట్ ఖర్ఛులు స్థిరంగా పెరగడం కారణంగా ధరల పెంపు అనివార్యమైందని టయోటా ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ కస్టమర్లపై ఖర్చుల పెరుగుదల ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. చిప్ కొరత..పడిపోయిన అమ్మకాలు..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల తయారీ ఇన్పుట్లు ధరలు భారీగా పెరగడం, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా అనేక కంపెనీలకు పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి.దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఉత్పాదకలో, సరఫరా సమస్యలు 2022లో కూడా వెంటాడే అవకాశం ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అభిప్రాయపడింది. గడిచిన నెలలో పలు కంపెనీల కార్ల అమ్మకాలు అత్యంత దారుణంగా ఉందని పేర్కొంది. చిప్ కొరత ఆయా కంపెనీలకు ఉత్పత్తిలో ప్రభావితం చేశాయి. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 3,24,542 యూనిట్లుగా ఉండగా.., గత ఏడాది నవంబర్ నెలలో 4,39,564 యూనిట్ల నుంచి 26 శాతం మేర తగ్గాయి. చదవండి: టయోటా దూకుడు.. లైనప్‌లో 30 ఎలక్ట్రిక్ మోడళ్లు -
కొనుగోలుదారులకు షాకిచ్చిన టయోటా!
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టయోటా కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో తన అన్ని ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే, ధరలు ఎంత శాతం పెరగనుంది అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, అక్టోబర్ 1, 2021 నుంచి కార్ల ధరలు మరింత ప్రియం కానున్నట్లు ధృవీకరించింది. ధరల పెరుగుదల అనేది మోడల్స్, వాటి వ్యక్తిగత వేరియెంట్లను బట్టి మారవచ్చు. ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల టయోటా ఉత్పత్తుల ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్ ధరలు...!) ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం అధిక రేటు, అధిక ఇంధన ధరల కారణంగా ఆటోమోటివ్ భాగాలు, కమాడిటీస్ & సరుకు ఛార్జీల ధరలు పెరగడం కారణంగా ఆ ధరలను వినియోగదారుల మీద తయారీ కంపెనీలు వేస్తున్నాయి. ఇతర ఆటోమేకర్లు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ధరలను పెంచాలని భావిస్తున్నారు. టయోటా ప్రస్తుతం గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, ఇన్నోవా క్రైస్టా, ఫార్చ్యూనర్, క్యామ్రీ, వెల్ఫైర్లను సేల్ చేస్తుంది. యారిస్ సెడాన్ కారును మాత్రం టయోటా నిలిపివేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ మాదిరిగానే టయోటా యారిస్ స్థానంలో మారుతి సుజుకి సియాజ్ ఆధారంగా కొత్త క్రాస్ బ్యాడ్జ్డ్ సెడాన్ ను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. -
దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!
దేశంలో చాలా విదేశీ కంపెనీలు ఇక్కడ పోటీని తట్టుకోలేక ఏకంగా దుకాణం మూసేస్తుంటే? మరికొన్ని కొన్ని తక్కువగా సేల్ అవుతున్న మోడల్ కార్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ రోజు (సెప్టెంబర్ 27) నుంచి భారత మార్కెట్లో సెడాన్ కారు యారిస్ తయారిని/అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2022లో మరిన్ని ఇతర కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టయోటా తెలిపింది. టయోటా కిర్లోస్కర్ ప్రస్తుతం ఈ కారును కొనుగోలు చేసిన వినియోగదారులకు సేవలు, విడిభాగాలు అందిస్తామనీ హామీ ఇచ్చింది. "టయోటాకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ సర్వీస్ అవుట్ లెట్ ద్వారా యారిస్ కస్టమర్లకు అందించే సేవలలో ఎటువంటి అంతరాయం కలగదు. అలాగే, నిలిపివేసిన మోడల్ ఒరిజినల్ విడిభాగాలను కనీసం 10 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని" టయోటా వాగ్దానం చేస్తుంది.(చదవండి: ఆ విషయమై నన్నెవరూ సంప్రదించలేదు: రతన్ టాటా) టయోటా యారిస్ మొదటి కారును 2018 సంవత్సరం ఏప్రిల్‌లో రూ 9 లక్షల నుంచి రూ .14 లక్షల మధ్య లాంచ్ చేసింది. టయోటా యారిస్ కారును హోండా సిటీకి పోటీగా తీసుకొని వచ్చారు. ప్రీమియం సెడాన్ విభాగంలో హోండా సిటీతో పాటు హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, స్కోడా రాపిడ్, వోక్స్వ్యాగన్ వెంటోలతో ఈ టయోటా యారిస్ పోటీగా నిలిచింది. కానీ ఈ కారు ఈ విభాగంలో తన మార్క్ చూపద్యంలో విఫలమైంది అంతేగాకుండా లాంచ్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. -
టయోటా కార్ల ధరల మోత : ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, ఇసుజి, హీరో మోటోకార్ప్ కంపెనీలతో పాటు తాజాగా టయోటా కూడా ఈ జాబితాలో చేరింది. ఏప్రిల్ 1 నుంచి తమ వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహన మోడల్, వేరియంట్ బట్టి ధరల పెంపు ఉంటుందని వివరించింది. అధిక ముడి పదార్థాల రేట్లు, ఇతర కారణాల వల్ల ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, కస్టమర్‌పై కనీస స్థాయిలో మాత్రమే భారం మోపుతామని హామీ ఇచి్చంది. వాహనాల తయారీలో వినియోగించే స్టీల్, అల్యూమినియం సహా కీలకమైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో వాహన కంపెనీలు కూడా ఈ భారాన్నీ వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. -
ఆటోమొబైల్ రంగానికి టయోటా బంపర్ ఆఫర్..
ముంబై: దేశీయ ఆటోమొబైల్ రంగానికి వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ శుభవార్త తెలపింది. జపాన్‌కు చెందిన టయోటా త్వరలోనే భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో టయోటా కార్లను నిర్మించనున్నామని, రూ.2000 కోట్లపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. అయితే దేశంలో ఆటోమొబైల్ రంగానికి అధిక పన్నుల వల్ల టయోటా సంస్థ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. పెట్టుబడుల అంశంపై టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎండీ మసకాజు యోషిమురా స్పందిస్తూ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టయోటా సంస్థ ఎప్పుడు సిద్ధమేనని, భారత జాతీయ లక్ష్యాలను టయోటో గౌరవిస్తుందని, ఆటోమొబైల్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని యోషిమురా పేర్కొన్నారు. మరోవైపు టయోటా వ్యూహాలపై వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ స్పందిసూ చిన్న కార్లలో కూడా త్వరలో అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టనున్నామని, 2025 సంవత్సరం వరకు హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో రానున్న పెట్టుబడులలో ప్రపంచ వ్యాప్త సాంకేతికతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కాగా ఇటీవల సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ వెల్‌ఫైర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్ వేదికగా ఈ లగ్జరీ మల్టీ పర్పస్ వాహనాన్ని కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఆ కార్ల ధరలు పెరిగాయ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ తన కార్ల ధరలు పెంచేసింది. జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల పెద్ద కార్లు, ఎస్‌యూవీలు, మధ్య తరహా కార్లపై సెస్‌ను పెంచుతున్నట్టు ప్రకటించడంతో, తన మోడల్స్ అన్నింటిపై కూడా సెస్‌కు అనుకూలంగా ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. మిడ్ సైజు నుంచి పెద్ద సైజు కార్లు, ఎస్‌యూవీల వరకు 2-7 శాతం వరకు సెస్ పెరిగింది. ఈ మేరకు ఇన్నోవా క్రిస్టాపై టయోటా రూ.78వేల వరకు ధర పెంచింది. అదేవిధంగా అన్ని కొత్త ఫార్చ్యూనర్లపై రూ.1,60,000 వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని కొత్త కరోలా ఆల్టిస్‌లపై రూ.72వేల వరకు ధర పెంపును చూడొచ్చు. ప్లాటినం ఎతియోస్ ధరను రూ.13వేల వరకు పెంచింది. ఈ సమీక్షించిన ధరలు 2017 సెప్టెంబర్ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. హైబ్రిడ్, చిన్న కార్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పులను టయోటా చేపట్టలేదు. జీఎస్టీ సవరణలతో తమ ఉత్పత్తుల ధరలను పెంచామని, ప్రీ-జీఎస్టీకి ముందున్న రేట్లకు దగ్గర్లో ఇవి ఉన్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఎన్ రాజ చెప్పారు. -
టయోటా ‘ఇన్నోవా’లో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) తాజాగా తన ప్రముఖ మోడల్ ‘ఇన్నోవా’లో కొత్త స్పోర్టీ వేరియంట్ ‘ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.17.79 లక్షలు–రూ.22.15 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఈ కొత్త వేరియంట్లో ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో పలు మార్పులు చేశామని కంపెనీ పేర్కొంది. ఎస్యూవీ స్టైల్లో కనిపించే ఇన్నోవా ఎంయూవీ తన ప్రత్యేకతతో కస్టమర్లను కట్టిపడేస్తూ, మార్కెట్లో అగ్రపథంలో దూసుకెళ్తోందని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్.రాజా తెలిపారు. యువకులను, ఆధునికతను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన తాజా కొత్త వేరియంట్‌తో ఇన్నోవా బ్రాండ్ మరింత పటిష్టంగా తయారవుతుందని ధీమా వ్యక్తంచేశారు. ‘ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్’ తన విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యంకానున్న ఈ కొత్త ఇన్నోవాలో ఏడు ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్–స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. -
టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచింది. ‘ఇన్నోవా క్రిస్టా’ ధరను 1 శాతం, ‘ఫార్చునర్’ ధరను 2 శాతం పెంచినట్లు కంపెనీ తెలిపింది. తాజా పెంపు నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదలతో వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా తెలిపారు. -
నిస్సాన్ కూడా పెంచేసింది...
న్యూఢిల్లీ: జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ కూడా కార్ల ధరలను పెంచేస్తోంది. భారీ ఉత్పత్తి వ్యయాల కారణంగా వచ్చే నెలనుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు నిస్పాన్ మోటార్ ఇండియా మంగళవారం ప్రకటించింది. నిస్సాన్ డాట్సన్ మోడల్ కార్ల ధరను దేశంలో జనవరి, 2017 నుంచి రూ 30,000 వరకు పెంచుతున్నట్టు నిస్సాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్పాదక వ్యయం ఫలితంగా ధరలను పెంచుతున్నామనీ, పరిశ్రమలో నెలకొన్న పోటీని తట్టుకోవడానికి సవరించిన ఈ ధరలు తమకు సాయపడనున్నాయని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు. ఎంట్రీ లెవల్ చిన్న కారు డాట్సన్ గో (రూ.3.28 లక్షలు) మొదలు, నిస్సాన్, డాట్సన్ బ్రాండ్లతో నిస్సాన్ ఎస్యూవీ టెర్రానో (రూ.13.75లక్షలు) లాంటి వాహనాలను సంస్థ విక్రయిస్తోంది. కాగా టాటా మెటార్స్, టయోటా కూడా ఇటీవల తమ కార్లను ధరలను పెంచాయి. ప్యాసింజర్ వాహనాల ధరలను రూ .5,000 నుంచి రూ .25,000వరకుపెంచుతున్నట్టు వెల్లడించాయి. ఇన్పుట్ ఖర్చులు, విదేశీ మారక రేట్ల కారణగా టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) ధరలను 3 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
టయోటా రేట్లు పెరుగుతున్నాయ్
జనవరి నుంచి 1-3% మధ్య పెంపు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ వాహన ధరలు కొత్త ఏడాదిలో పెరుగుతున్నారుు. జనవరి 1 నుంచి వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు విదేశీ మారకపు విలువ పెరుగుదల వంటి పలు అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. ‘స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ వంటి ముడిపదార్థాల ధరలు గత ఆరు నెలలుగా పెరగుతూ వస్తున్నారుు. దీంతో తయారీ వ్యయం బాగా పెరిగింది. దీని వల్ల మేం వాహన ధరలను పెంచాల్సి వస్తోంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ డెరైక్టర్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్.రాజా వివరించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో జపనీస్ కరెన్సీ యెన్ మారకపు విలువ పెరగడం కూడా కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. యెన్ బలపడటం వల్ల జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వాహన విడిభాగాల ధర పెరిగిందని, దీని వల్ల కంపెనీ తయారీ వ్యయంపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. కాగా కంపెనీ రూ.5.39 లక్షలు-రూ.1.34 కోట్ల ధర శ్రేణిలో వాహనాలను విక్రరుుస్తోంది. -
టయోటా నుంచి ప్లాటినం ఎతియోస్, ఎతియోస్ లివా
హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ ఇటీవల ప్లాటినం ఎతియోస్, ఎతియోస్ లివా అనే రెండు మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడని టయోటా.. ఈ సరికొత్త మోడల్స్‌లో అందుబాటు ధరలోనే పలు భద్రతా ఫీచర్లను పొందుపరిచింది. అన్ని స్థాయిల్లో స్టెబిలైజ్డ్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఎతియోస్ తన విభాగానికి సంబంధించి పరిశ్రమలోనే ఇలాంటి ప్రత్యేకతలను కలిగిన తొలి మోడల్‌గా నిలిచిందని కంపెనీ వివరించింది. -
టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు తన మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవాను అప్డేట్ చేసింది. కంపెనీ తాజాగా ‘ఇన్నోవా క్రిస్టా’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.84 లక్షలు- రూ.20.78 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభ్యం కానున్నది. 2.8 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజ్‌ని, 2.4 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ‘ఇన్నోవా క్రిస్టా’ ప్రధానంగా జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యంకానుంది. వీటి బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, డెలివరీ మే 13 నుంచి జరుగుతుందని కంపెనీ తెలిపింది. -
800 కోట్లతో టయోటా ఇంజన్ ప్లాంట్
బెంగళూరు వద్ద ఏర్పాటు - 2014 మాదిరిగానే ఈ ఏడాది అమ్మకాలు కూడా... - కంపెనీ డిప్యూటీ ఎండీ జైశంకర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ బెంగళూరు సమీపంలో డీజిల్ ఇంజన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. రెండు మూడేళ్లలో పూర్తి కానున్న ఈ ప్లాంటుకు కంపెనీ రూ.700-800 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తు తం భారత్‌లో విక్రయిస్తున్న ఒకట్రెండు మినహా మిగిలిన మోడళ్ల ఇంజిన్లను థాయ్‌లాండ్, జపాన్ నుంచి దిగుమతి చేస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ టి.ఎస్.జైశంకర్ తెలిపారు. హర్ష టయోటా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఎండీ నవోమీ ఇషితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఇక కార్ల తయారీకి 70 శాతందాకా విడిభాగాలను కంపెనీ దేశీయంగా సేకరిస్తోంది. దీనిని కొద్ది రోజుల్లో 85 శాతానికి చేర్చాలన్నది కంపెనీ భావన. గతేడాది మాదిరిగానే.. టయోటా కిర్లోస్కర్ గతేడాది భారత్‌లో 1.60 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇందులో మన దేశం నుంచి 9 దేశాలకు చేసిన ఎగుమతులు 20 వేల యూనిట్లు. భారత ప్యాసింజర్ కార్ల విపణిలో కంపెనీకి 5% వాటా ఉంది. 2014 మాదిరిగానే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలు, మార్కెట్ వాటా ఆశిస్తున్నట్టు జైశంకర్ తెలిపారు. ‘కొత్త మోడళ్ల రాకతోనే వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది టయోటా నుంచి భారత్‌లో కొత్త మోడళ్ల ఆవిష్కరణలు ఏవీ లేవు. అయితే అమ్మకాల విషయంలో కంపెనీ వెనుకంజలో ఏమీ లేదు’ అని వెల్లడించారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే గత నెలలో 1.29 శాతం వృద్ధితో 12,547 యూనిట్లను కంపెనీ విక్రయించింది. మరిన్ని డ్రైవింగ్ స్కూళ్లు: టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మూడవ ‘టయోటా డ్రైవింగ్ స్కూల్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 2020 నాటికి దేశవ్యాప్తంగా స్కూళ్ల సంఖ్యను 50కి చేరుస్తామని నవోమీ ఇషి వెల్లడించారు. హైదరాబాద్‌లో టయోటా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఫెసిలిటీని సైతం కంపెనీ ప్రారంభించింది. ఇది భారత్‌లో 6వది కాగా, డిసెంబరు నాటికి మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా 60 నిమిషాల్లోనే వాహనానికి సర్వీస్ చేసి కస్టమర్‌కు అప్పగించడం ఈ కేంద్రాల ప్రత్యేకత. హర్ష టయోటా యాక్సెస్ బాక్స్ పేరిట రూపొం దించిన యాప్‌ను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కస్టమర్లు ఈ యాప్ సహాయంతో సర్వీస్ బుకింగ్, బీమా, ఎమర్జెన్సీ తదితర సేవలు పొందవచ్చు.