under-19 world cup
-
శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం.. వీడియో
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha) అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను త్రిష అందించింది. ఏడు ఇన్నింగ్స్‌లలో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా త్రిష నిలిచింది.అంతేకాకుండా బౌలింగ్‌లోనూ తొమ్మిది వికెట్లతో త్రిష సత్తా చాటింది. ఇక భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష సోమవారం ఆర్ద రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. స్వదేశానికి చేరుకున్న త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు ద్రితి కేసరి,టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా తమ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో త్రిష మాట్లాడారు."అండర్ 19 వరల్డ్ కప్‌లో మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో ఆడుతున్నప్పటికి నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్‌లో నా పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాను అని త్రిష పేర్కొంది.మరోవైపు తన సహచర ప్లేయర్ ద్రితిపై త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. "ద్రితి అద్భుతమైన ప్లేయర్. కానీ జట్టు కూర్పు వల్ల ఆమెకు ఈసారి ఆడే అవకాశం లభించలేదు. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆమె అద్భుతాలు సృష్టిస్తుందని" త్రిష కొనియాడింది.ద్రితి మాట్లాడుతూ.. "తొలుత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం కాస్త బాధగా అన్పించింది. కానీ రెండు మ్యాచ్‌ల తర్వాత దేశం కోసమే ఆలోచించాను. భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన టీమ్‌లో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో అద్బుతంగా రాణిస్తాన్న నమ్మకం నాకు ఉంది. ఈ టోర్నీలో త్రిష తీవ్రంగా శ్రమించింది" అని చెప్పుకొచ్చారు.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిGongadi Trisha, the Player of the Tournament, of #U19T20WorldCup receives a grand welcome at #Hyderabad Airport.HCA President Jagan Mohan Rao extended a grand welcome to the Women's Under-19 T20 World Cup star cricketers #GongadiTrisha, Drithi Kesari, Head Coach Nooshin and… pic.twitter.com/4P4yup74L4— Surya Reddy (@jsuryareddy) February 4, 2025 -
ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో త్రిష
అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి సాధించిన భారత జట్టులోని పలువురు ప్లేయర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్‌లో చోటు దక్కింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత అమ్మాయిల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన తెలంగాణ స్టార్ ఓపెనర్ గొంగడి త్రిష సహా మొత్తం నలుగురు భారత క్రికెటర్లకు ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో స్థానం లభించింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి కమలిని, లెఫ్టార్మ్ స్పిన్ ద్వయం వైష్ణవి శర్మ, ఆయుశి శుక్లాలు కూడా ఐసీసీ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హార్డ్ హిట్టర్ త్రిష ఈ టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీ సహా 309 పరుగులు చేసింది. లెగ్‌స్పిన్‌తో 7 వికెట్లను కూడా పడగొట్టింది. ఆమెతో జోడీగా దిగిన కమలిని 143 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కమలిని (50 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. భారత స్పిన్నర్లలో ఆయుశి 14 వికెట్లను చేజిక్కించుకోగా, వైష్ణవి 17 వికెట్లతో టోర్నీలోనే అగ్రస్థానంలో ఉంది. మలేసియాపై ‘హ్యాట్రిక్’తో ఆమె (5/5) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీ: కైలా రేనెకె (కెప్టెన్; దక్షిణాఫ్రికా), జెమ్మా బోతా (దక్షిణాఫ్రికా), త్రిష, కమలిని, ఆయుశి శుక్లా, వైష్ణవి శర్మ (భారత్), డేవినా పెరిన్, కేటీ జోన్స్ (ఇంగ్లండ్), కావొంహె బ్రే (ఆ్రస్టేలియా), చమొది ప్రబొద (శ్రీలంక), పూజ మహతో (నేపాల్), 12వ ప్లేయర్: ఎన్‌తబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా).చదవండి: అదరగొడుతున్న ‘అభి’ -
టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ 2025 ఛాంపియన్స్‌గా భారత జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన త్రిష.. అనంతరం బ్యాటింగ్‌లోనూ 44(నాటౌట్) సత్తాచాటింది. ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్.. 11.2 ఓవర్లలోనే ఊదిపడేసింది.బీసీసీఐ భారీ నజరానా..ఇక వరుసగా రెండోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. విజేత జట్టుకు రూ. 5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆదివారం బోర్డు వెల్లడించింది. ‘విశ్వ విజేతలకు శుభాకాంక్షలు. అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న జట్టు సభ్యులకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం.రెండోసారి వరల్డ్‌కప్ గెలిచిన జట్టు, సహాయక సిబ్బంది రూ. 5 కోట్లు అందిస్తాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టైటిల్ గెలిచిన భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన నౌషీన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించింది. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెంచుతుందని బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు.జట్టంతా సమష్టిగా రాణించడంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 2023లో తొలిసారి జరిగిన అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కూడా అప్పట్లో బోర్డు రూ. 5 కోట్ల నజరానా అందించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భవిష్యత్ బాగుంది!
ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ ఆసాంతం రాణించిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం కాదు కదా... కనీసం కోలుకునే చాన్స్ కూడా ఇవ్వకుండా చెలరేగిపోయింది. వరల్డ్‌కప్ మొత్తం పరాజయం అన్నదే ఎరగకుండా ముందుకు సాగిన యువ భారత్... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ చాంపియన్‌గా నిలిచింది.ఫైనల్‌కు ముందు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఛేజింగ్ చేసిన టీమిండియా... అన్నీ మ్యాచ్‌ల్లోనూ రెండు వికెట్లు కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని అధిగమించింది. తొలుత బ్యాటింగ్ చేసే చాన్స్ వస్తే దంచి కొట్టడం... బౌలింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని కట్టిపడేయడం టోర్నీ మొత్తం ఇదే ప్రణాళిక అవలంబించి విజయవంతమైంది.బ్యాటింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగితే... తమిళనాడు అమ్మాయి కమలిని ఆమెకు చక్కటి సహకారం అందించింది. బౌలింగ్‌లో స్పిన్ త్రయం వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పారుణిక సిసోడియా యువ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మెగా టోర్నీలో మన యంగ్ ‘స్టార్ల’ ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం కమలిని కమాల్ టోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తమిళనాడుకు చెందిన కమలిని 7 మ్యాచ్‌లాడి 143 పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానం దక్కించుకున్న కమిలిని 35.75 సగటుతో పరుగులు రాబట్టింది. అందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కమలిని ‘సూపర్ సిక్స్’లో స్కాట్లాండ్తో పోరులో 51 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో దంచికొట్టిన కమలిని 56 పరుగులు చేసి అజేయంగా జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ టోర్నీలో త్రిష విజృంభించడంతో ఆమె మెరుపుల ముందు కమలిని ప్రదర్శన మరుగున పడినా... జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఈ తమిళనాడు వికెట్ కీపర్ రాణించింది. అండర్–19 ఆసియా కప్‌లోనూ ఆకట్టుకున్న కమలినిని మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ రూ. 1 కోటీ 60 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఇంట్లో సోదరులను చూసి క్రికెట్ ఆడటం నేర్చుకున్న కమలిని కొంత కాలం తర్వాత ఆటనే కెరీర్‌గా ఎంచుకోవాలని భావించి తీవ్ర సాధన చేసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిలకడగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా కమలిని ముందుకు సాగుతోంది. ‘సూపర్’ సనిక దక్షిణాఫ్రికాతో తుదిపోరులో ఫోర్ కొట్టి భారత జట్టును విజయతీరాలకు చేర్చిన సనిక చాల్కె కూడా... ఈ టోర్నీలో తనదైన ముద్ర వేసింది. వెస్టిండీస్‌తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో రైజింగ్ స్టార్ త్రిష త్వరగా అవుటైన సమయంలో అజేయంగా జట్టును గెలిపించిన ముంబైకి చెందిన సనిక... ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో తుదిపోరులోనూ ఓపెనర్ కమలిని తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... త్రిషతో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసింది. వరల్డ్‌కప్‌లో వైస్కెపె్టన్గానూ వ్యవహరించిన సనిక... మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. వైష్ణవి స్పిన్ మాయ మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన వైష్ణవి శర్మ... తన లెఫ్టార్మ్ స్పిన్ మాయాజాలంతో భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం రాణించిన వైష్ణవి 17 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వైష్ణవి రికార్డుల్లోకెక్కింది. మలేసియాలోపై హ్యాట్రిక్ సహా కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన వైష్ణవి... మరో మూడు మ్యాచ్‌ల్లో మూడేసి వికెట్లు పడగొట్టింది. బంగ్లాదేశ్‌పై 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వైష్ణవి, స్కాట్లాండ్పై 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్పై 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఈ మధ్యప్రదేశ్ స్పిన్నర్... ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 23 పరుగులిచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ స్పిన్‌తో తనదైన ముద్రవేసిన వైష్ణవి శ్రీలంకపై మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టింది. పారుణిక ప్రతాపం భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించగా... అందులో పారుణిక కూడా ఉంది. వైష్ణవి, ఆయుశికి తోడు తన లెఫ్టార్మ్ స్పిన్‌తో ఢిల్లీకి చెందిన పారుణిక సిసోడియా ప్రత్యరి్థని వణికించింది. 6 మ్యాచ్‌లాడిన పారుణిక 5.80 సగటుతో 10 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 21 పరుగలిచ్చి 3 వికెట్లు పడగొట్టిన పారుణిక... ఫైనల్లో ప్రత్యరి్థని తన స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి... దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు వేయకుండా అడ్డుకట్ట వేసింది. ఆయుశి అదరహో ఒకవైపు తన స్పిన్‌తో వైష్ణవి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంటే... ఆమెకు ఆయుశీ శుక్లా తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను తికమిక పెట్టిన ఆయుశి వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లాడి 5.71 సగటుతో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్తో పోరులో 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఆయుశి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. వైష్ణవి బౌలింగ్‌లోనైనా ప్రత్యర్థులు అడపాదడపా భారీ షాట్లు ఆడగలిగారు కానీ... ఆయుశి మాత్రం బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వకుండా కట్టిపడేసింది. వైవిధ్యమైన బంతులతో ఫలితం సాధించింది. వెస్టిండీస్‌పై 2 వికెట్లు, మలేసియాపై 3 వికెట్లు, శ్రీలంకపై ఒక వికెట్, ఇంగ్లండ్‌పై 2 వికెట్లు తీసి సత్తా చాటింది. షబ్నమ్ సత్తా... భారత మహిళల జట్టు వరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలవడంలో... మరో తెలుగమ్మాయి పాత్ర కూడా ఉంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 17 ఏళ్ల షబ్నమ్ షకీల్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకుంది. గత ప్రపంచకప్‌లోనూ బరిలోకి దిగిన ఈ తెలుగమ్మాయి. ఈసారి ఏడు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించిన ఈ టోర్నీలో పేసర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించింది. మెరుగైన ఎకానమీ నమోదు చేయడంతో పాటు... ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచి సహచర బౌలర్లకు వికెట్లు దక్కడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు కేరళకు చెందిన జోషిత 6 మ్యాచ్‌లాడి 6 వికెట్లు పడగొట్టింది. -
తొలి కల నెరవేరింది
క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నానని... అలాంటిది అండర్–19 స్థాయిలోనే రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రైజింగ్ స్టార్ గొంగడి త్రిష పేర్కొంది. మలేసియా వేదికగా జరిగిన మహళల అండర్–19 టి20 వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన 19 ఏళ్ల త్రిష తన తొలి కల నెరవేరిందని పేర్కొంది. సీనియర్ జట్టులోనూ అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న తెలుగమ్మాయి త్రిషతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...రెండు సార్లు ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? ఈ ఆనందం మాటల్లో వర్ణించలేను. సాధారణంగా అండర్–19 ప్రపంచకప్‌లో ఒక్కసారి పాల్గొనే అవకాశం రావడమే కష్టం. అలాంటిది నాకు రెండుసార్లు ఆ చాన్స్ వచ్చింది. చిన్న వయసు నుంచే రాణిస్తుండటంతో రెండుసార్లు వరల్డ్‌కప్ ఆడగలిగా. జట్టు విజయాల్లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను. ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలవడంపై స్పందన? 2023లో జరిగిన ప్రపంచకప్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈసారి ఓపెనర్‌గా బరిలోకి దిగడం కలిసొచ్చింది. నా ప్రదర్శన జట్టు విజయానికి దోహదపడితే అంతకుమించి ఇంకేం కావాలి. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్‌కప్‌నకు ముందు ఎలాంటి సాధన చేశారు? కెరీర్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ చేశా. మిథాలీ రాజ్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అడుగు జాడల్లోనే సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. హైదరాబాద్‌కే చెందిన నౌషీన్ అల్ ఖదీర్ భారత అండర్–19 జట్టు హెడ్ కోచ్‌గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఆమెకు నా ఆటతీరు బాగా తెలియడంతో మెరుగయ్యేందుకు తగిన సూచనలు ఇస్తూ ప్రోత్సహించింది. జట్టు సభ్యులతో మీ అనుబంధం? చాన్నాళ్లుగా అండర్–19 జట్టు తరఫున ఆడుతున్నాను. ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అండర్–19 ఆసియా కప్‌లోనూ దాదాపు ఇదే జట్టుతో ఆడాం. అక్కడా విజేతగా నిలవగలిగాం. ఇప్పుడు అదే టీమ్ స్పిరిట్ ఇక్కడ కూడా కొనసాగించాం. ప్లేయర్లంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఈ వరల్డ్‌కప్‌లో మీకు అప్పగించిన బాధ్యతలు? ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే జట్టు యాజమాన్యం నా బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్ భారంమోయాల్సి ఉంటుందని ముందే తెలుసు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా... జట్టుగానూ అంతా కలిసి కట్టుగా కదంతొక్కడంతోనే రెండోసారి ప్రపంచకప్ గెలవగలిగాం. గత ప్రపంచకప్‌నకు, ఈ వరల్డ్‌కప్‌నకు మధ్య మీ ప్రదర్శనలో వచ్చిన తేడా ఏంటి? 2023లో జరిగిన ప్రపంచకప్‌లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశా. ఆ సమయంలో అంతర్జాతీయ అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో పాటు మరికొంత మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేడు. 2023 ఫైనల్లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచినా... చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేక పోయా. దీంతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ముందే అనుకున్నాను. నా ప్రణాళికలు ఫలించాయి. మీ ఆటతీరు వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది? కేవలం ఈ ప్రపంచకప్‌లో నా ప్రదర్శన అనే కాదు... నేనీస్థాయికి రావడం వెనక మా నాన్న రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజు నా బ్యాట్ నుంచి పరుగుల రూపంలో వస్తున్నాయనుకుంటా. ప్రతి దశలో మా నాన్న నాకు అండగా నిలవడంతోనే నిలకడైన ప్రదర్శన కనబర్చగలిగాను. ఎక్కడ మ్యాచ్ జరిగినా నా వెంట నాన్న ఉంటారు. వరల్డ్‌కప్ మొత్తం నా వెన్నంట నిలిచి... ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపారు. అందుకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును మా నాన్నకు అంకితమిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. వ్యక్తిగతంగా ఇప్పటికి నా మొదటి కల నెరవేరింది. అవకాశం వస్తే సీనియర్ జట్టు తరఫున కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. టోర్నీలో త్రిష గణాంకాలు మ్యాచ్‌లు 7 ఇన్నింగ్స్‌లు 7 పరుగులు 309 అత్యధిక స్కోరు 110 సగటు 77. 25 సెంచరీలు 1 ఫోర్లు 45సిక్స్‌లు 5 అభినందనల వెల్లువఅండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇది భారత నారీ శక్తికి నిదర్శనం. సమష్టి కృషి, సడలని సంకల్పానికి దక్కిన ఫలితం ఇది. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రివరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం చాలా మందికి స్ఫూర్తి. భవిష్యత్తు కోసం కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. –సచిన్ టెండూల్కర్ ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు. రెండోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ కీలకపాత్ర పోషించడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వరుసగా రెండోసారి మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలంగాణ ప్లేయర్ త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం. త్రిష భవిష్యత్తులో భారత సీనియర్ జట్టు తరఫునా రాణించాలి. –రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిఅండర్–19 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచి భారత్ తమ ఆధిపత్యం చాటుకుంది. ఇది అదిరిపోయే ప్రదర్శన, దీనికి సాటి ఏది లేదు. యావత్ దేశం గరి్వస్తోంది. –మిథాలీరాజ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ -
అజేయం... అద్వితీయం
త్రిష... త్రిష... త్రిష... ఈ ప్రపంచకప్‌ను అద్దం ముందు పెడితే తెలంగాణ ఆల్‌రౌండర్ ప్రదర్శనే ప్రతిబింబిస్తుందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్‌లో కనబరిచిన ఆల్‌రౌండ్ షోకే ఆమెను ఆకాశానికెత్తేయడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన శైలిలో ఓపెనింగ్ దూకుడు, బౌలింగ్‌లో జట్టుకు అవసరమొచ్చినప్పుడు కీలకమైన వికెట్లు తీయడం త్రిషకే చెల్లింది. సఫారీ జట్టుతో టైటిల్ సమరంలో త్రిషతోపాటు స్పిన్నర్లు పారుణిక (4–0–6–2), ఆయుశి (4–2–9–2), వైష్ణవి (2/23)ల మాయాజాలంతో ‘ఫైనల్ వార్’ వన్‌సైడ్ అయ్యింది. కౌలాలంపూర్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఆధిపత్యం అటు ఇటు కూడా మారలేదు. తొలి బంతి మొదలు విజయ తీరం చేరేదాకా భారత అమ్మాయిలదే హవా. ఏ లక్ష్యంతోనైనా మలేసియాలో అడుగు పెట్టారో ఆ లక్ష్యాన్ని అజేయంగా, అద్వితీయ ఆటతీరుతో మన అమ్మాయిలు అందుకున్నారు. వరుసగా రెండోసారి టి20 అండర్–19 ప్రపంచకప్ టైటిల్‌ను భారత అమ్మాయిలు సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరిలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన భారత్ తమ జైత్రయాత్రను అ‘ది్వతీయ’ంగా ముగించింది. టోర్నీ మొత్తంలో ఓటమెరుగని మన జట్టే మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత స్పిన్ వలలో సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. మరో ముగ్గురు పది పైచిలుకు పరుగులు చేశారంతే! లెగ్ స్పిన్‌తో గొంగడి త్రిష 4–0–15–3తో అద్బుతమైన స్పెల్ వేయగా... మిగతా స్పిన్నర్లు పారుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత జట్టు స్టార్ ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలిచింది. ఆల్‌రౌండ్ మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అది్వతీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుంది. స్పిన్ వలలో విలవిల దక్షిణాఫ్రికాకు సీనియర్, జూనియర్, జెండర్ (పురుషులు, మహిళలు) ఇలా ఏ స్థాయిలోనూ ప్రపంచకప్ భాగ్యం లేదన్నది మరోసారి నిరూపితమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోరుతో ‘కప్’ భాగ్యం దక్కించుకుందామనుకున్న సఫారీ యువ తుల జట్టు భారత స్పిన్ వలలో చిక్కి శల్యమైంది. రెండో ఓవర్లోనే పారుణికతో భారత్ మాయాజాలం నుంచి ఆఖరి దాకా బయట పడలేకపోయింది. సిమోన్ లౌరెన్స్ (0)ను పారుణిక డకౌట్ చేయగా, జెమ్మా బొథా (14 బంతుల్లో 16; 3 ఫోర్లు) బౌండరీల దూకుడుకు ఆదిలోనే షబ్నమ్ చెక్ పెట్టింది. ఇక అక్కడితో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. ధనాధన్ ప్రపంచకప్ కోసం 83 పరుగుల లక్ష్య దూరంలో ఉన్న భారత్‌ను ఓపెనర్ త్రిష తన షాన్‌దార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో మరింత సులువుగా, వేగంగా విజయతీరాలకు తీసుకెళ్లింది. బౌండరీలతో తనమార్క్ స్ట్రోక్ ప్లేతో అలరించిన ఆమె జట్టు గెలిచేదాకా క్రీజులో నిలిచింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: జెమ్మా (సి) కమలిని (బి) షబ్నమ్ 16; లౌరెన్స్ (బి) పారుణిక 0; దియార (బి) ఆయుశి 3; కైలా రేనెకె (సి) పారుణిక (బి) త్రిష 7; కరబో మెసో (బి) ఆయుశి 10; మీక్ వాన్ (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23; కోలింగ్ (బి) వైష్ణవి 15; శేషిని నాయుడు (బి) త్రిష 0; ఆష్లే వాన్విక్ (సి) వైష్ణవి (బి) పారుణిక 0; మోనాలిసా (బి) వైష్ణవి 0, ఎన్‌తబిసెంగ్ నిని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 82. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–20, 4–40, 5–44, 6–74, 7–74, 8–80, 9–80, 10–82. బౌలింగ్: జోషిత 2–0– 17–0, పారుణిక 4–0–6–2, షబ్నమ్ 2–0–7– 1, ఆయుశి 4–2–9–2, వైష్ణవి 4–0–23–2, త్రిష 4–0–15–3. భారత్ ఇన్నింగ్స్: కమలిని (సి) లౌరెన్స్ (బి) రేనెకె 8; త్రిష (నాటౌట్) 44; సనిక (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84. వికెట్ల పతనం: 1–36. బౌలింగ్: ఎన్‌తబిసెంగ్ 1–0–7–0, ఫే కోలింగ్ 2–0–19–0, కైలా రేనెకె 4–1–14–1, శేషిని 1–0–12–0, వాన్విక్ 1–0–12–0, మోనాలిసా 1.2–0–10–0, జెమ్మా బొథా 1–0–9–0. -
ఫైనల్లో సౌతాఫ్రికా చిత్తు.. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడారు. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.త్రిష స్పిన్ మ్యాజిక్..భారత స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు.బ్యాటింగ్‌లోనూ అదుర్స్.. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఊదిపడేసింది. త్రిష బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన త్రిష.. 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. త్రిషతో పాటు సానికా చాల్కే(26 నాటౌట్) కూడా రాణించింది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన త్రిష..67.25 సగటుతో 309 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచింది. -
INDW Vs SAW: ఫైనల్లో త్రిష మాయాజాలం.. 82 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌటయ్యారు. భారత స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మైకే వాన్ వూర్ట్స్(23), జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించగా..మిగితా బ్యాటర్లంతా దారుణంగా నిరాశపరిచారు.అదరగొట్టిన త్రిష.. కాగా ఈ టోర్నీ అసాంతం త్రిష తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్ వరుసగా రెండో సారి ఫైనల్ చేరడంలో ఆమెది కీలక పాత్ర. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో త్రిష 59 బాల్స్‌లో ఏకంగా 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన త్రిష..66.25 సగటుతో 265 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. అటు బౌలింగ్‌లోనూ 7 వికెట్లతో త్రిష సత్తాచాటింది.తుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినితుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినిచదవండి: #Virat Kohli: 'వావ్ వాట్ ఎ బాల్'.. తనను ఔట్ చేసిన బౌలర్‌పై కోహ్లి ప్రశంసలు -
గ్రూప్ దశలో అజేయంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా..
కౌలాలంపూర్: మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా లీగ్ దశను ముగించాయి. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 83 పరుగుల తేడాతో నేపాల్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.బ్రయ్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారోసా (31), హస్రత్ గిల్ (30) రాణించారు. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 56 పరుగులకే పరిమితమైంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా 6 పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలిచింది. గ్రూప్ ‘సి’లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 41 పరుగుల తేడాతో గెలుపొందింది.ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు 6 పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై... ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అమెరికా జట్టుపై... న్యూజిలాండ్ జట్టు 67 పరుగుల తేడాతో సమోవాపై... ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 13 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచాయి. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆతిథ్య మలేసియాతో వెస్టిండీస్; శ్రీలంకతో భారత్ తలపడతాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్, శ్రీలంక... గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, అమెరికా, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’ నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్... గ్రూప్ ‘డి’ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకున్నాయి. మలేసియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘ఎ’ నుంచి చివరిదైన సూపర్ సిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.చదవండి: ఆరంభం అదిరింది -
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్ మహిళలలతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. తద్వారా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండింట కూడా పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.ఐర్లాండ్ బ్యాటర్లలో వాల్ష్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్(10) రాణించారు. పాక్ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్ జెబ్, హషిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.పాక్ బ్యాటర్లలో కోమాల్ ఖాన్(12) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎల్లీ మెక్‌గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్‌బ్రైడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. -
అండర్–19 టి20 ప్రపంచకప్ భారత జట్టులో త్రిష, ధృతి, షబ్నమ్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియాలో జరిగే అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతి (తెలంగాణ), షబ్నమ్ (ఆంధ్రప్రదేశ్) చోటు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. భారత జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్ గా, సనికా చాల్కె వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. 2023లో తొలిసారి నిర్వహించిన మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. త్రిష, షబ్నమ్ నాటి విజేత జట్టులో సభ్యులుగా ఉన్నారు. త్రిష, షబ్నమ్లకిది రెండో టి20 ప్రపంచకప్ కానుంది. గత ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియా కప్ అండర్–19 టి20 టోర్నీలో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. టి20 ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీ పడనున్నాయి. ఆతిథ్య మలేసియా, వెస్టిండీస్, శ్రీలంకతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. తమ తొలి మ్యాచ్‌లో భాతర అమ్మాయిల జట్టు జనవరి 19న వెస్టిండీస్‌తో, 21న మలేసియాతో, 23న శ్రీలంకతో తలపడుతుంది. గ్రూప్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ సిక్స్’ను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. భారత టి20 జట్టు: నిక్కీ ప్రసాద్ (కెప్టెన్ ), సనికా చాల్కె (వైస్ కెప్టెన్ ), గొంగడి త్రిష, కమిళిని, భవిక అహిరె, ఈశ్వరి అవసారె, మిథిల, వీజే జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయూషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి. అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని. -
అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్‌లోనే! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ నుంచి మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్-19 అండర్ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన యువ పేసర్ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్ఎల్-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం లాహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హునైన్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసెన్ రాయ్‌ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. పీఎస్ఎల్లో హునైన్కు ఇదే తొలి వికెట్. కాగా హునైన్ షా ఎవరో కాదు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీం షాకు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్ఎల్ వికెట్ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటైడ్ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. hunain shah, remember the name pic.twitter.com/kkONIs1qXg — :) (@babardrive) February 22, 2024 -
అదే మా కొంపముంచింది.. కానీ చాలా గర్వంగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు. అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్‌మన్, రాఫ్ మెక్‌మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు. "ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయాం. బ్యాటింగ్‌లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్‌తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఫైనల్లో టీమిండియా ఓటమి.. మనోడే మనకు విలన్! ఎవరీ హర్జాస్ సింగ్?
140 కోట్ల మంది భారతీయులకు మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ అదే కథ.. అదే వ్యథ. అండర్-19 వరల్డ్ కప్ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లో మరోసారి ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గతేడాది వరల్డ్‌కప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు. కానీ కంగరూలు జోరు ముందు తల వంచిన జూనియర్లు.. కనీసం పోరాడకుండానే ఓటమిని అంగీకరించారు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో 74 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. బరువెక్కిన హృదయాలతో ఇంటిముఖం పట్టింది. మనోడో విలన్.. ఎవరీ హర్జాస్ సింగ్? ఇక ఆసీస్ నాలుగో సారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హర్జాస్ సింగ్‌ది కీలక పాత్ర. కీలక సమయంలో బ్యాటింగ్‌లో వచ్చిన హర్జాస్ సింగ్.. తన అద్బుతమైన ఆటతీరుతో భారత బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఆసీస్ 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అదుకున్నాడు. అచతూచి ఆడుతూ హాఫ్ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఈ టోర్నీ మొత్తం పేలవ ప్రదర్శన కనబరిచిన హర్జాస్ సింగ్ ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లో 55 పరుగులు చేశాడు. అయితే ఈ ఆసీస్ వరల్డ్‌కప్ హీరో భారత భారత మూలాలు కలిగిన క్రికెటర్ కావడం గమనార్హం. హర్జాస్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్ లోని చండీగడ్. హర్జాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. అయితే వారిద్దరూ హర్జాస్ పుట్టడానికి ఐదేళ్ల ముందే సిడ్నీకి వలసవెళ్లారు. అక్కడే హర్జాస్ 2005లో జన్మించాడు. 19 ఏళ్ల హర్జాస్ చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో హర్జాస్ సింగ్ తన ఎనిమిదేళ్ల వయస్సులో సిడ్నీలోని రెవ్స్బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాగా హర్జాస్ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా అంటే ఎంతో ఇష్టం. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ వైపు హర్జాస్ అడుగులు వేశాడు. అయితే హర్జాజ్ చివరగా 2015లో భారత్‌కు వచ్చాడు. అయితే -
కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్‌దే వరల్డ్‌కప్
అచ్చు సీనియర్లలాగే... జూనియర్లూ సమర్పించుకున్నారు. ఆఖరి పోరు దాకా అజేయంగా నిలిచిన యువ భారత్ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్ చేరింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలోనే కంగుతింది. ఇక్కడా భారత జూనియర్ జట్టు ఫైనల్ చేరే క్రమంలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి కీలకమైన తుది పోరులో ఆ్రస్టేలియా జట్టు చేతిలోనే ఓటమి చవిచూసింది. వెరసి మూడు నెలల వ్యవధిలో ఆ్రస్టేలియా సీనియర్, జూనియర్ జట్లు వన్డే ప్రపంచకప్ టైటిల్స్‌ను హాట్ ఫేవరెట్ అయిన భారత్‌పైనే గెలవడం పెద్ద విశేషం. బెనోని (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ కోసం ప్రతీ మ్యాచ్‌లో చిందించిన చెమటంతా ఫైనల్‌కు వచ్చేసరికి ఆవిరైంది. యువ భారత్ జైత్రయాత్ర కప్ అందుకోవాల్సిన మ్యాచ్‌లో పేలవంగా ముగిసింది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 79 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. మొదట ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జస్ సింగ్ (55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ హ్యూగ్ వీగెన్ (48; 5 ఫోర్లు) రాణించారు. సీమర్లు రాజ్ లింబాని 3, నమన్ తివారి 2 వికెట్లు తీశారు. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (77 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ (46 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బియర్డ్‌మన్ (3/15) కోలుకోలేని దెబ్బ తీయగా, రాఫ్ మెక్‌మిలన్ (3/43) ఇంకెవరినీ క్రీజులో నిలువనీయలేదు. చక్కగా కట్టడి చేసినప్పటికీ... టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా బ్యాటర్లెవరూ భారీ స్కోర్లు చేయకుండా భారత బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. హర్జస్ అర్ధసెంచరీ సాధించగా, వీగెన్, డిక్సన్ (56 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ఒలీవర్ (43 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అర్ధశతకాల వరకు రానివ్వలేదు. లింబాని, నమన్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అందువల్లే పెద్దస్కోరైతే నమోదు కాలేదు. రాణించిన ఆదర్శ్, అభిషేక్ కష్టమైన లక్ష్యం కాదు... ఈ మెగా ఈవెంట్లో మన కుర్రాళ్ల ఫామ్ ముందు ఛేదించే లక్ష్యమే! పెద్దగా కష్టపడకుండా ఏ ఇద్దరు ఫిఫ్టీలు బాదినా... ఇంకో ఇద్దరు 30 పైచిలుకు పరుగులు చేసినా చాలు గెలవాల్సిన మ్యాచ్ ఇది! కానీ టాపార్డర్‌లో అర్షిన్ (3), ముషీర్ ఖాన్ (22), మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్లు కెప్టెన్ ఉదయ్ సహారణ్ (8), సచిన్ దాస్ (8)ల వికెట్లను పారేసుకోవడంతో 68/4 స్కోరు వద్దే భారత్ పరాజయం ఖాయమైంది. ఎందుకంటే తర్వాత వచ్చిన వారెవరూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడలేనివారే! ఆదర్శ్, అభిషేక్‌ల పోరాటం అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. 1 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై నెగ్గడం ఆస్ట్రేలియాకిదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్‌లోనూ తలపడగా రెండుసార్లూ భారత జట్టే గెలిచింది. 4 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించిన నాలుగో జట్టు ఆ్రస్టేలియా. గతంలో పాకిస్తాన్ (2006), వెస్టిండీస్ (2016), బంగ్లాదేశ్ (2020) ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచాయి. 4 అండర్–19 ప్రపంచకప్ సాధించడం ఆ్రస్టేలియాకిది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది. 2012 భారత అండర్–19 జట్టుపై 2012 తర్వాత ఆస్ట్రేలియా యువ జట్టు మళ్లీ గెలుపొందడం విశేషం. గత 12 ఏళ్లలో ఆ్రస్టేలియా జూనియర్ జట్టుతో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: డిక్సన్ (సి) అభిషేక్ (బి) తివారి 42; కొన్‌స్టాస్ (బి) లింబాని 0; వీగెన్ (సి) ముషీర్ (బి) తివారి 48; హర్జస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌమీ పాండే 55; హిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 20; ఒలీవర్ (నాటౌట్) 46; మెక్‌మిలన్ (సి అండ్ బి) ముషీర్ 2; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 13; స్ట్రేకర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–16, 2–94, 3–99, 4–165, 5–181, 6–187, 7–221. బౌలింగ్: రాజ్ లింబాని 10–0–38–3, నమన్ తివారి 9–0–63–2, సౌమీ పాండే 10–0–41–1, ముషీర్ 9–0–46–1, అభి షేక్ 10–0–37–0, ప్రియాన్షు 2–0–17–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) హిక్స్ (బి) బియర్డ్‌మన్ 47; అర్షిన్ (సి) హిక్స్ (బి) విడ్లెర్ 3; ముషీర్ (బి) బియర్డ్‌మన్ 22; ఉదయ్ (సి) వీగెన్ (బి) బియర్డ్‌మన్ 8; సచిన్ (సి) హిక్స్ (బి) మెక్‌మిలన్ 9; ప్రియాన్షు (సి) విడ్లెర్ (బి) అండర్సన్ 9; అవనీశ్ రావు (సి అండ్ బి) మెక్‌మిలన్ 0; అభిషేక్ (సి) వీగెన్ (బి) విడ్లెర్ 42; లింబాని (బి) మెక్‌మిలన్ 0; నమన్ (నాటౌట్) 14; సౌమీ (సి) హిక్స్ (బి) స్ట్రేకర్ 2; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43.5 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–3, 2–40, 3–55, 4–68, 5–90, 6–91, 7–115, 8–122, 9–168, 10–174. బౌలింగ్: విడ్లెర్ 10–2–35–2, అండర్సన్ 9–0–42–1, స్ట్రేకర్ 7.5–1–32–1, బియర్డ్ మన్ 7–2–15–3, మెక్‌మిలన్ 10–0–43–3. -
వరల్డ్‌కప్ ఫైనల్లో బోల్తా పడ్డ భారత్.. నాలుగో సారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్‌మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 168 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కల్లమ్ ముల్దర్ బౌలింగ్‌లో మురుగన్ అశ్విన్ (42) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. 122 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మెక్‌మిలన్ బౌలింగ్‌లో రాజ్ లింబాని (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 115 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. బియర్డ్మ్యాన్ బౌలింగ్‌లో ఆదర్శ్ సింగ్ (47) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 139 పరుగులు చేయాలి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ డౌన్ 91 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్ రాఫ్ మెక్‌మిలన్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో భారత్ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఆండర్సన్ బౌలింగ్‌లో ప్రియాంశు మోలియా (9) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 164 పరుగులు చేయాలి. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ్ సింగ్ (32), అవీనశ్ రావు క్రీజ్‌లో ఉన్నారు. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఛేదనలో యంగ్ ఇండియా 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ త్రయం ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సహా అర్శిన్ కులకర్ణి ఔట్ కాగా.. ఆదర్శ్ సింగ్ (31), ప్రియాంశు మోలియా (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో మరో 170 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్ 40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బియర్డ్మెన్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ (12), ఉదయ్ సహారన్ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 213 పరుగులు చేయాలి. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ జట్టు 3 పరుగులకే వికెట్ కోల్పోయింది. కల్లమ్ విడ్లెర్ బౌలింగ్‌లో ర్యాన్ హిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ కులకర్ణి (3) ఔటయ్యాడు. ఆదర్శ్ సింగ్‌కు జతగా ముషీర్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో రాఫ్ మెక్‌మిలన్ (2) ఔట్ అయ్యాడు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/6గా ఉంది. ఒలివర్ పీక్ (10), చార్లీ ఆండర్సన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌమీ పాండే బౌలింగ్‌లో హర్జస్ సింగ్ (55) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 38 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 181/5గా ఉంది. ఒలివర్ పీక్ (6), రాఫ్ మెక్‌మిలన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబాని బౌలింగ్‌లో ర్యాన్ హెండ్రిక్స్ (20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 35 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 167/గా ఉంది. ఒలివర్ పీక్ (1), హర్జస్ సింగ్ (46) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. నమన్ తివారి బౌలింగ్‌లో మురుగన్ అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి హ్యారీ డిక్సన్ (42) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 100/3గా ఉంది. ర్యాన్ హిక్స్ (1), హర్జస్ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 94 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. నమర్ తివారి బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ క్యాచ్ పట్టడంతో హగ్ వెబ్జెన్ (48) ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 94/2గా ఉంది. హ్యారీ డిక్సన్ (39), హర్జస్ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 49/1 12 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(244), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(14), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ రాజ్ లింబానీ బౌలింగ్‌లో సామ్ కాన్స్టాస్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డిక్సాన్(15), సామ్ కాన్స్టాస్(0) పరుగులతో ఉన్నారు. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది. తుది జట్లు: ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్ భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్‌కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే -
టీమిండియా కెప్టెన్ ఒక సంచలనం.. రింకూ సింగ్‌లానే: అశ్విన్
అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరుకు యువ భారత్ సిద్దమైంది. ఆదివారం బెనోని వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆరోసారి ప్రపంచప్ టైటిల్‌ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. ఆసీస్ కూడా నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత అసాధారణ ఫామ్‌లో ఉంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. ముఖ్యంగా కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ పరంగా సత్తాచాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ సహారన్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో సహారాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అశ్విన్ కొనియాడు. ప్రోటీస్ సెమీఫైనల్లో ఉదయ్ 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. "ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఉదయ్ సహారాన్ కెప్టెన్సీకి కొత్త అర్ధాన్ని చెప్పాడు. తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టును కూడా అద్బుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు జూనియర్ వరల్డ్‌కప్‌లో చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఉదయ్ చేసిన పరుగులు చూసి నేను ఇదింతా చెప్పడం లేదు. అతడి మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టకుంది. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అదే కూల్‌నెస్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడు. ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాడు అతడిని చూస్తుంటే మరో రింకూ సింగ్లా కన్పిస్తున్నాడు. రింకూ కూడా అంతే చాలా కూల్‌గా ఉంటాడు. ఉదయ్ బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ మనదే అన్నట్లు అన్పిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. Final Ready 🙌 The two captains are all set for the #U19WorldCup Final 👌👌#TeamIndia | #BoysInBlue | #INDvAUS pic.twitter.com/9I4rsYdRGZ — BCCI (@BCCI) February 10, 2024 -
ఆరో ప్రపంచకప్ వేటలో భారత్.. ఫైనల్లో ఆసీస్‌తో ఢీ
బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆరో ప్రపంచకప్ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్‌లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించిన భారత్‌కు ఫైనల్ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ ఐదుసార్లు ఫైనల్ చేరింది. పాక్ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్‌కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్‌లో మాత్రం రెండు సార్లు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్ ఆల్‌రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఉదయ్ సహరణ్ (389 పరుగులు), ముషీర్ ఖాన్ (338), సచిన్ దాస్ (294) సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్ తరఫున ఓపెనర్ హ్యారీ డిక్సన్ (267 పరుగులు), కెప్టెన్ హ్యూగ్ వేగన్ (256) రాణించారు. బౌలింగ్‌లో కలమ్ విడ్లెర్ (12 వికెట్లు), టాస్ స్ట్రేకర్ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు. విజయాల పరంగా కూడా ఆసీస్... భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్‌లో విండీస్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. -
'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు'
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్ చేరడంలో స్పిన్నర్ సౌమీ పాండేది కీలక పాత్ర. ఈ టోర్నీ ఆసాంతం 19 ఏళ్ల సౌమీ పాండే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పాండే 17 వికెట్లు పడగొట్టి.. మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్లో సౌమీ మరో మూడు వికెట్లు పడగొడితే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అయితే ప్రతీమ్యాచ్‌లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సౌమీ పాండేను కొంతమంది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పోలుస్తున్నారు. భారత క్రికెట్‌కు మరో జడేజా దొరికేశాడని, జూనియర్ జడ్డూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన సౌమీ పాండే తండ్రి కృష్ణ కుమార్ పాండే స్పందించాడు. దయ చేసి తన కొడుకును జడేజాతో పోల్చవద్దని కృష్ణ కుమార్ విజ్ఞప్తి చేశాడు. జడేజాతో పోల్చవద్దు.. "కొంతమంది అభిమానులు సౌమీ పాండేను రవీంద్ర జడేతో పోలుస్తున్నారు. అయితే నా కొడుకును జడేజాతో పోల్చడం సరికాదు. సౌమీ ఇంకా నేర్చుకునే స్ధాయిలో ఉన్నాడు. జడేజా ఇప్పటికే తన పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. అతడు తన కెరీర్లో అత్యుత్తమ స్ధాయిలో ఉన్నాడు. అతడు ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. జడ్డూ ఈ స్ధాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. భారత్‌కు అతడు ఎన్నో అద్బుత విజయాలను అందిచాడు. సౌమీ ఇంకా మొదటి మెట్టు వద్దే ఉన్నాడు. దయచేసి ఇకనైనా సౌమీని జడేజాతో పోల్చవద్దు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ కుమార్ పేర్కొన్నాడు. చదవండి: ILT 20: నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్ -
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్ 19 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన ఆసీస్.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అంతకముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్.. 9వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా? కాగా గత ఏడాదికాలంలో ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడో సారి. గత రెండు ఈవెంట్ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్‌కప్ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది.. భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత జట్టు అయినా ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి. కంగారులపై మనదే పై చేయి.. ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో మాత్రం కంగారులపై టీమిండియాదే పై చేయి. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడో సారి. 2003 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్- టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్ వ్యవహరించగా.. భారత జట్టును సౌరవ్ గంగూలీ ముందుకు నడిపించాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్‌ను ఆసీస్ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీల్లో మాత్రం భారత్ జూలు విధిల్చింది. అనంతరం మళ్లీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆసీస్- భారత్ అమీతుమీ తెల్చుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టును ఆసీస్‌ను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. అదే విధంగా 2018 వరల్డ్‌కప్ తుదిపోరులోనూ యువ భారత్ మట్టికరిపించింది. ఈ సారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అద్భుత ఫామ్‌లో భారత్.. కాగా ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే ఆసీస్‌ను ఓడించి మరోసారి టైటిల్‌ను ఎగరేసుకోపోయేలా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్ చేరింది. భారత కెప్టెన్ ఉదయ్ సహారాన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ వంటి యువ సంచలనాలు అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిశిచ్చే అంశం. మరోవైపు బౌలర్లలో రాజ్ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్ అంటే ఆసీస్‌కు పూనకాలే. పరిస్థితులు ఎలా ఉన్న ఆఖరి వరకు పోరాడడమే ఆసీస్ ప్రధాన అస్త్రం. 17 runs for 10th Wicket Partnership! 𝗔𝘂𝘀𝘁𝗿𝗮𝗹𝗶𝗮 in to U19WC finals 💥 U19WC Finals 1988 - PAK vs AUS 1998 - NZ vs ENG 2000 - SL vs IND 2002 - SA vs AUS 2004 - PAK vs WI 2006 - PAK vs IND 2008 - IND vs SA 2010 - AUS vs PAK 2012 - AUS vs IND 2014 - PAK vs SA 2016 - WI… pic.twitter.com/gDjUfyJEnx — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 8, 2024 -
ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్లో ఆసీస్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్‌పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్‌ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది. జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్‌మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్ దాస్?
సచిన్ దాస్.. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ఈ యువ ఆటగాడిది కీలక పాత్ర. క్రికెట్ గాడ్ పేరు పెట్టుకున్న ఈ యువ సంచలనం.. అందుకు తగ్గట్టుగానే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో సచిన్ తనకు కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో జతకట్టిన సచిన్.. తన విరోచిత పోరాటంతో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్‌పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దాస్.. తన సంచలన ఇన్నింగ్స్‌తో మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న సచిన్ 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరీ సచిన్ దాస్ అని నెటిజన్లు అరాతీసున్నారు. ఎవరీ సచిన్ దాస్? సచిన్ దాస్.. 2005 ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. సచిన్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నాలుగున్నర ఏళ్ల వయస్సు నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కానీ అతడు ఉన్న చోట క్రికెట్ ఆడేందుకు అత్యుత్తమ సౌకర్యాలు లేవు. అతడు ప్రాక్టీస్ చేయడానికి పూర్తి స్ధాయి క్రికెట్ పిచ్‌లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దాస్ హాఫ్ టర్ఫ్లపైనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. సచిన్ తన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందిలు ఎదుర్కొన్నప్పటికీ తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. నిరంతరం శ్రమ, పట్టుదలతో భారత జెర్సీ ధరించే స్ధాయికి చేరుకున్నాడు. అయితే సచిన్ భారత్ అండర్-19 క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల కూడా కీలక పాత్ర. సచిన్ తండ్రి పేరు సంజయ్ దాస్. అతడు మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. సంజయ్ దాస్‌కు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువే. యూనివర్సిటీ స్థాయి వరకు అతడు క్రికెట్ ఆడాడు. కానీ అతడు అంతకంటే ముందుకు వెళ్లలేదు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకు తనయడు జన్మించిన వెంటనే ఎలాగైనా క్రికెటర్ చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు సచిన్ తల్లిపేరు సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోచ్ కూడా.. అదే విధంగా సచిన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో కోచ్ షేక్ అజార్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. సచిన్‌కు పేస్ బౌలర్లకు ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతూ వస్తుండేవాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో సచిన్.. కోచ్ షేక్ అజార్ సాయంతో తన సమస్యను అధిగమించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి సంజయ్ దాస్ తెలిపాడు. సచిన్ దాస్ పేరు ఎలా వచ్చిందంటే? సచిన్ దాస్ తండ్రి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమాని. అయితే తన ఆరాధ్య క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల సచిన్ దాస్ కూడా టెండూల్కర్‌కు వీరాభిమాని. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వరల్డ్‌కప్‌లో వేసుకుంటున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన సచిన్ దాస్.. 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు. -
శ్రమించి... ఛేదించి...
ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్ ఉదయ్ సహారణ్కు జతయిన సచిన్ దాస్ ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్ పోరుకు అర్హత పొందింది. బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్–19 ప్రపంచకప్‌లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు సెమీస్‌లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిచర్డ్ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రాజ్ లింబాని 3; ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉదయ్ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. సీన్ మార్చిన సచిన్ జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్ సింగ్ (0), కాసేపటికే ముషీర్ ఖాన్ (4), అర్షిన్ (12), ప్రియాన్షు (5) పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఉదయ్‌కి సచిన్ దాస్ జతయ్యాడు. కెప్టెన్ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్ దాస్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు. అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావు (10), అభిషేక్ మురుగన్ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్, 1 ఫోర్) జట్టును విజయ తీరానికి చేర్చాడు. గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) అభిõÙక్ (బి) ముషీర్ 76; స్టీవ్ స్టోల్క్ (సి) అవనీశ్ (బి) రాజ్ 14; టీగెర్ (బి) రాజ్ 0; రిచర్డ్ (సి) మొయిలా (బి) నమన్ 64; ఒలీవర్ (సి) సచిన్ (బి) ముషీర్ 22; మరయిస్ (సి) అభిషేక్ (బి) సౌమీ పాండే 3; జేమ్స్ (సి) అవనీశ్ (బి) రాజ్ 24; నార్టన్ నాటౌట్ 7; ట్రిస్టన్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్: రాజ్ లింబాని 9–0–60–3, నమన్ తివారి 8–0–52–1, అభిõÙక్ మురుగన్ 4–0–14–0, అర్షిన్ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) ప్రిటోరియస్ (బి) మఫక 0; అర్షిన్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 12; ముషీర్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 4; ఉదయ్ (రనౌట్) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్ (బి) ట్రిస్టన్ 5; సచిన్ (సి) టీగెర్ (బి) మఫక 96; అవనీశ్ (సి) నార్టన్ (బి) మఫక 10; అభిషేక్ (రనౌట్) 0; రాజ్ (నాటౌట్) 13; నమన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్: మఫక 10–0–32–3, ట్రిస్టన్ 10–1–37–3, నార్టన్ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్ 2–0–18–0, జేమ్స్ 8–0–44–0, వైట్‌హెడ్ 2–0–17–0. -
దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్ పోరు..
అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్–19 ప్రపంచకప్‌ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరిన భారత్... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని యువ జట్టు ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఉంది. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్‌లో సఫారీ జట్టును భారత్ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్‌కు ముందు యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌమీ కుమార్ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్ పోరును స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది.