Under-19
-
ICC Under 19 World Cup: ఆరో టైటిల్ లక్ష్యంగా...
రాబోయే క్రికెట్లో కాబోయే స్టార్లు అయ్యేందుకు అండర్–19 వన్డే ప్రపంచకప్‌కు మించిన టోర్నీ ఏదీ లేదు. అంతర్జాతీయ కెరీర్‌కు కచి్చతంగా సోపానమయ్యే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా సై అంటే సై అంటున్నారు. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఐదుసార్లు విజేత అయిన భారత జట్టు ఆరో టైటిల్ లక్ష్యంగా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్లూమ్ఫొంటెన్ (దక్షిణాఫ్రికా): గతంలో యువరాజ్ సింగ్ (2000–ప్రపంచకప్)... ప్రస్తుతం రోహిత్ శర్మ (2006), కోహ్లి (2008)... ఇకపై ఇషాన్ కిషన్ (2016), గిల్ (2018) భారత క్రికెట్ చరిత్రలో బంగారు బాట వేసుకున్నారు. వీళ్లంతా అండర్–19 ప్రపంచకప్ నుంచి వెలుగులోకి వచి్చనవారే! వీళ్లే కాదు... మనీశ్ పాండే, ఉన్ముక్త్ చంద్, యశ్ ధుల్, మన్జోత్ కల్రా, కమలేశ్ నాగర్కోటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. క్రికెట్ క్రేజీ భారత్‌ను మరో స్థాయిలో నిలబెట్టారు. అందువల్లే భారత్ కుర్రాళ్ల మెగా ఈవెంట్లో ఎప్పటికప్పుడు హాట్ ఫేవరెట్‌గా ఉంది. ఇప్పుడు కూడా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో సఫారీలో ఆరో ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. భారత్ మిగతా రెండు లీగ్ మ్యాచ్‌లను ఈనెల 25న ఐర్లాండ్‌తో, 28న అమెరికాతో ఆడుతుంది. ఇదీ ఫార్మాట్... ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మూడు లీగ్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ నెల 24వ తేదీ వరకు గ్రూప్ దశలో 24 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఓ రోజు విశ్రాంతి అనంతరం 30 నుంచి ‘సూపర్ సిక్స్’ దశ పోరు ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 6, 8 తేదీల్లో రెండు సెమీఫైనల్ పోటీలు జరుగుతాయి. టైటిల్ పోరు 11న జరుగనుంది. -
అండర్–19 ప్రపంచకప్ విజేతకు ఘనంగా సన్మానం
ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలను బీసీసీఐ గౌరవించుకుంది. బుధవారం టీమిండియా, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టి20 అందుకు వేదికైంది. తొలి అండర్-19 టి20 వరల్డ్‌కప్‌ను సాధించిన టీమిండియా సభ్యులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టి20 పోరుకు ముందు జరిగిన ఈ వేడుకలో బోర్డు ప్రకటించిన రూ. 5 కోట్ల నజరానాను భారత దిగ్గజం సచిన్ చేతుల మీదుగా అండర్–19 జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ అందుకుంది. అమ్మాయిలు అద్భుతంగా రాణించారని కితాబిచ్చిన ‘మాస్టర్’... ఈ ఘనతతో మరెంతో మంది మహిళా క్రికెటర్ల కలలకు ఊపిరి పోశారని అన్నారు. Honouring under19 Indian women team for becoming world champion at Ahmedabad @BCCI @sachin_rt @JayShah #INDvsNZ pic.twitter.com/L08NALkWYC — Rajeev Shukla (@ShuklaRajiv) February 1, 2023 This World Cup win has given birth to many dreams. Girls in India & across the world will aspire to be like you. You are role models to an entire generation and beyond. Heartiest congratulations on this stupendous #U19T20WorldCup win.@BCCIWomen @BCCI pic.twitter.com/VJvR0Ls60Z — Sachin Tendulkar (@sachin_rt) February 1, 2023 చదవండి: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్ చేశారా -
సచిన్ చేతుల మీదుగా సన్మానం
దక్షిణాఫ్రికాలో ఆదివారం ముగిసిన తొలి అండర్–19 మహిళల ప్రపంచకప్ టి20 క్రికెట్ టోరీ్నలో విజేతగా నిలిచిన భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ ప్రారంభానికి ముందు షఫాలీ వర్మ జట్టుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సచిన్ ముఖ్య అతిథిగా హాజరై భారత యువ జట్టును సత్కరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. -
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది
‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్– 19’ క్రికెట్ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి 20 మహిళా ప్రపంచకప్. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్ సాధించారు. మొత్తం 16 మంది టీమ్. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను అతి తక్కువ స్కోర్ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మూడవ వికెట్ పడేందుకు కారణమైంది. వరల్డ్ కప్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది. కష్టాలను తట్టుకుని అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది. కూతురి క్రికెట్ అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్‌ను బుద్ధిమాన్ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్‌వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బాల్ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ ‘అర్చనను క్రికెట్ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని. స్కూల్లో చేర్చి అర్చన క్రికెట్ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్ మొరాదాబాద్‌లోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్ స్కూల్లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది. దశ తిరిగింది బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్ వీడియోలు చూసిన కపిల్ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్ అసోసియేషన్‌లో జాయిన్ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్ పాండే క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా కోచ్ కావడంతో కుల్దీప్ యాదవ్ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు. అతిథులయ్యారు ‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది. అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే. ఇంగ్లాండ్‌తో ఫైనల్స్‌లో అర్చన క్యాచ్ ప్రపంచ విజేత మన జట్టు -
IPL 2022 Auction: షేక్ రషీద్ సహా మిగతా ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్ మెగావేలం ప్రారంభానికి ముందు అండర్-19 ఆటగాళ్లకు ఊరట లభించింది. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ ఇండియా జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు వేలంలో పేరును రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్, షేక్ రషీద్, విక్కీ ఒస్త్వాల్, రాజ్ బవా, రాజ్‌వర్దన్ హంగ్కర్కర్, దినేష్ బానా, రవి కుమార్, నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్, అంగ్క్రిష్ రఘువంశీలు ఈ లిస్టులో ఉన్నారు. కాగా నాలుగు రోజుల క్రితం కనీసం 19 ఏళ్ల ఏజ్ లిమిట్, స్టేట్ సీనియర్ టీమ్‌కు ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలని బీసీసీఐ నిబంధన తెచ్చింది. దీంతో యశ్ ధుల్ మినహా మిగతా ఆటగాళ్లు వేలానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇలాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్ వేలంలో అవకాశం కల్పిస్తే బాగుంటుందని మెజారిటీ వర్గం అభిప్రాయపడింది. దీంతో బీసీసీఐ కూడా అండర్-19 ఆటగాళ్లకు వేలంలో పాల్గొనేందుకు వేలానికి ఒక్కరోజు ముందు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా 10 మంది అండర్-19 ఆటగాళ్లకు లైన్ క్లియర్ కావడంతో ఆక్షన్‌లో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 600కు పెరిగింది. -
మనదే యువ ప్రపంచం
కరోనా కారణంగా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా... మెగా ఈవెంట్ ప్రారంభమయ్యాక జట్టులోని ఆరుగురు కరోనా బారిన పడటం... అదృష్టంకొద్దీ మ్యాచ్‌లో ఆడేందుకు 11 మంది అందుబాటులో ఉండటం... ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పోరాటం... వెరసి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ భారత్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది. యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నమెంట్‌ను అజేయంగా ముగించి సగర్వంగా స్వదేశానికి పయనమైంది. టోర్నీ మొత్తంలో ఏ ఒక్కరిపైనో భారత్ సంపూర్ణంగా ఆధారపడలేదు. అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్, రాజ్ బావా, విక్కీ ఒస్త్వాల్, రవి కుమార్... ఇలా ప్రతి సభ్యుడూ తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. తమ కెరీర్లో చిరస్మరణీయ ఘట్టాలను లిఖించుకున్నారు. న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన యువ భారత్ జట్టు అండర్–19 ప్రపంచకప్‌లో తమదైన ముద్ర వేసింది. ఏకంగా ఐదోసారి జగజ్జేతగా నిలిచి తమ పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు 14 సార్లు అండర్–19 ప్రపంచకప్ జరగ్గా... యువ భారత్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, మూడుసార్లు రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆంటిగ్వాలో శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ బౌలర్లు రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34) అదరగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ సింధు (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. రాజ్ బావా (54 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజ్ బావా ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు అందుకున్నాడు. టోర్నీ మొత్తంలో 506 పరుగులు చేసి, 7 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవల్డ్ బ్రెవిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు. బీసీసీఐ అభినందన... అన్ని విభాగాల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజేతగా అవతరించిన యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ప్రశంసల వర్షం కురిపించారు. రికార్డుస్థాయిలో ఐదోసారి ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 40 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. కోచ్, ఇతర సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేయనున్నారు. ‘అన్ని విభాగాల్లో మన కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తమ శిబిరంలో కరోనా కలకలం రేపినా అందుబాటులో ఉన్న వారితో ముందుకు దూసుకెళ్లారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నిరంతరం కుర్రాళ్లలో ఉత్సాహం నింపారు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. సత్కారం... ఇంగ్లండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత యువ భారత జట్టు అంటిగ్వా నుంచి గయానాలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. భారత హై కమిషనర్ కేజే శ్రీనివాస భారత జట్టును సన్మానించారు. ఆ తర్వాత టీమిండియా గయానా నుంచి ఆదివారం సాయంత్రం స్వదేశానికి పయనమైంది. అమ్‌స్టర్‌డామ్ మీదుగా బెంగళూరు చేరుకోనున్న భారత జట్టు సభ్యులు అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ సీనియర్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ చేరుకున్నాక బీసీసీఐ అధికారికంగా యువ జట్టును సత్కరించి రివార్డులు అందజేయనుంది. ప్రధాని శుభాకాంక్షలు ప్రపంచకప్ నెగ్గిన భారత అండర్–19 జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యువ జట్టు తమ ప్రదర్శనతో భారత భవిష్యత్ క్రికెట్ సురక్షితంగా ఉందని చాటి చెప్పిందని ఆయన అన్నారు. ‘యువ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నాను. అండర్–19 ప్రపంచకప్ సాధించినందుకు అభినందనలు. అత్యున్నతస్థాయి టోర్నీలో ఆద్యంతం వారు నిలకడగా రాణించి భారత క్రికెట్ భవితకు ఢోకా లేదని నిరూపించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువ జట్టు విజయం వెనుక బీసీసీఐ పాత్ర కూడా ఉంది. కొన్నేళ్లుగా అండర్–16, అండర్–19, అండర్–23 స్థాయిలో భారీ సంఖ్యలో మ్యాచ్‌లు, టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా కాస్త ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఈ నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా భారత యువ జట్టు ఈసారి ప్రపంచకప్‌ను సాధించడం గొప్ప ఘనతగా భావించాలి. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. –వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ హెడ్ -
వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు భారత్.. ఇంగ్లండ్‌తో తుది పోరు
U-19 World Cup Finals: ప్రపంచ కప్‌లో యువ భారత జట్టు తమ జోరును కొనసాగించింది. టోర్నీలో వరుసగా ఐదో విజయంతో దర్జాగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. 291 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 41.5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత అండర్–19కు 96 పరుగుల భారీ విజయం దక్కిం ది. ఆసీస్ బ్యాటర్లలో లచ్లన్ షా (66 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ సెం చరీ సాధించగా...కోరీ మిల్లర్ (38), క్యాంప్‌బెల్ కెల్‌అవే (30) ఫర్వాలేదనిపించారు. విక్కీ ఒస్వా ల్ 3 వికెట్లు పడగొట్టగా...నిశాంత్ సింధు, రవి కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. లచ్లన్ షా మినహా... రెండో ఓవర్లోనే టీగ్ విలీ (1) వికెట్ తీసి రవికుమార్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ దశలో కెల్‌అవే, మిల్లర్ ధాటిగా ఆడుతూ రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించడంతో ఆసీస్ నిలదొక్కుకుంది. అయితే వీరిద్దరిని రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ పంపించడంతో పాటు కెప్టెన్ కూపర్ కనోలీ (3)ని కూడా వెనువెంటనే అవుట్ చేసి భారత్ పట్టు బిగించింది. మరో ఎండ్‌లో లచ్లన్ షా పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మరో 8.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకు ముందు భారత అండర్–19 జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా...వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. భారత అండర్–19 జట్టుకు ఇది వరుసగా నాలుగో, మొత్తంగా ఎనిమిదో ఫైనల్ కావడం విశేషం. మరో వైపు 1998లో ప్రపంచ కప్ గెలుచుకున్న అనంతరం ఇంగ్లండ్ ఫైనల్‌కు రావడం ఇదే మొదటి సారి. భారత అండర్–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్ మొహమ్మద్ కైఫ్), 2008లో (కెప్టెన్ విరాట్ కోహ్లి), 2012లో (కెప్టెన్ ఉన్ముక్త్ చంద్), 2018 (కెప్టెన్ పృథ్వీ షా) జట్టు చాంపియన్‌గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అండర్–19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన మూడో భారత కెప్టెన్‌గా యష్ ధుల్ నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్ (2012) శతకాలు నమోదు చేశారు. ఈ ముగ్గురూ ఢిల్లీకి చెందినవారే కావడం విశేషం. -
చెలరేగిన టీమిండియా.. 326 పరుగుల తేడాతో ఘన విజయం
టరోబా (ట్రినిడాడ్): అండర్–19 ప్రపంచకప్‌లో ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఉగాండాకు అలసటే తప్ప 50 ఓవర్లపాటు ఊరటే లేదు. ఈ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఉప్పెనలా చెలరేగారు. మిడిలార్డర్ బ్యాటర్ రాజ్ బావా (108 బంతుల్లో 162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), ఓపెనర్ అంగ్కృష్ రఘువంశీ (120 బంతుల్లో 144; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) ఎదురే లేని బ్యాటింగ్‌తో ఉగాండా బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. గ్రూప్ ‘బి’ నుంచి ఇది వరకే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత అండర్–19 జట్టు అనామక జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు చేసింది. కాగా 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కెప్టెన్ నిశాంత్ సింధు నాలుగు వికెట్లు పడగొట్టగా, హంగర్గేకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. టాపార్డర్‌లో ఓపెనర్ హర్నూర్ సింగ్ (15), కెప్టెన్ నిషాంత్ సింధు (15) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే మరో ఓపెనర్ రఘువంశీ, రాజ్ బావా దుర్బేధ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు శతక్కొట్టడంతో పాటు మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 291 పరుగుల వద్ద రఘువంశీ పెవిలియన్ చేరడంతో... క్రీజులో పాతుకుపోయిన రాజ్ బావా తర్వాత వచ్చిన కౌశల్ తాంబే (15), దినేశ్ బన (22), అనీశ్వర్ గౌతమ్ (12 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు. మనోళ్లు ఇంతలా చెలరేగినప్పటికీ కుర్రాళ్ల వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కాదు. 2004 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై భారత అండర్–19 జట్టు 425/3తో అత్యధిక స్కోరు నమోదు చేసింది. భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. అండర్–19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా శిఖర్ ధావన్ (155) రికార్డును రాజ్ బావా అధిగమించాడు. -
సెమీఫైనల్లో యువ భారత్
U19 Asia Cup 2021, India Semi Finals: సెమీఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఆకట్టుకుంది. అండర్–19 ఆసియా కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఇజాజ్ అహ్మద్ (86 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్స్‌లు), కెప్టెన్ సులేమాన్ సఫీ (73; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులు సాధించింది. హర్నూర్ సింగ్ (65; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. రాజ్ బవా (43 నాటౌట్; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 197 పరుగుల వద్దే భారత్ ఆరో వికెట్ కోల్పోయినా... రాజ్, కౌశల్ తాంబే (35 నాటౌట్; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు అభేద్యంగా 65 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన భారత్‌తో పాటు ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచిన పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘బి’ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక సెమీస్ చేరాయి. నేడు బంగ్లాదేశ్, లంక మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో గురువారం జరిగే సెమీస్‌లో భారత్ తలపడుతుంది. -
IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన భారత్
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆ మ్యాజిక్కు పాక్‌పై రిపీట్ చేయలేకపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా పరుగులు చేయడంలో విఫలమైంది. ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో 150 మార్క్ చేరుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ ఆరాధ్య యాదవ్ అర్థసెంచరీ(83 బంతుల్లో 50 పరుగులు), కుషాల్ తంబే 32, రాజ్‌వర్దన్ హంగార్గేకర్ 33 పరుగులు సాధించడంతో టీమిండియా 237 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో జీషన్ జమీర్ 5 వికెట్లు తీయగా, అవైస్ అలీ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ముహమ్మద్ షెహజాద్ 81 పరుగులతో మెరవగా.. ఇర్ఫాన్ ఖాన్ 32, రిజ్వాన్ మెహమూద్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ భవా 4 వికెట్లతో మెరిశాడు. భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లను తమ బౌలింగ్‌తో ఇబ్బందిపెట్టినప్పటికి చేధించాల్సిన స్కోరు ఎక్కువగా లేకపోవడం పాక్‌కు కలిసివచ్చింది. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్‌కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్ వివరణ ఇచ్చారు. -
భారత్ ‘బి’ జట్టుకు టైటిల్
తిరువనంతపురం: అండర్–19 నాలుగు జట్ల క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ‘బి’ జట్టు విజేతగా నిలిచింది. భారత్ ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 72 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ ‘బి’ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 232 పరుగులు సాధించింది. హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ (38; 3 ఫోర్లు)తోపాటు రాహుల్ చంద్రోల్ (70; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమీర్ రిజ్వీ (67; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం భారత్ ‘ఎ’ జట్టు 38.3 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత్ ‘బి’ బౌలర్లలో సుశాంత్ మిశ్రా (4/41), కరణ్ లాల్ (3/25) ఆకట్టుకున్నారు. -
కుర్రాళ్లూ కొట్టేశారు
సీనియర్ల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందారేమో? కుర్రాళ్లూ వారి బాటలోనే నడిచారు. టీమిండియా ఆసియా కప్‌ను గెల్చుకున్న పది రోజుల్లోనే... అదే స్థాయి టోర్నీలో... అంతకుమించిన ప్రదర్శనతో... టైటిల్‌ను కొట్టేశారు. చక్కటి ఆటతీరుతో మొదటినుంచి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన యువ భారత్... తుది సమరంలోనూ అదరగొట్టింది. అద్వితీయ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో చాంపియన్‌గా అవతరించింది. కప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ మన జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఢాకా: అండర్–19 కుర్రాళ్లూ... ఆసియా వన్డే కప్‌ను ఒడిసి పట్టేశారు. ఇటీవల సీనియర్లు సాధించిన ఘనతను తామూ అందుకున్నారు. అర్ధ శతకాలతో బ్యాట్స్‌మెన్ సమష్టి రాణింపు... ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్ష్ త్యాగి (6/38) మెరుపులతో ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో టీమిండియా 144 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 85; 8 ఫోర్లు, 1 సిక్స్), అనూజ్ రావత్ (79 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేయగా... కెప్టెన్ సిమ్రన్ సింగ్ (37 బంతుల్లో 65; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆయుష్ బదోని (28 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో భారీ స్కోరు అందించారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ (43 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 41వ ఓవర్ వరకు భారత ఇన్నింగ్స్ సాధారణంగానే సాగినా సిమ్రన్, బదోని విజృంభణతో చివరి 55 బంతుల్లో 110 పరుగులు సమకూరాయి. భారీ లక్ష్య ఛేదనలో లంక ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. హర్ష్ త్యాగి, మరో స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ (2/37) ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్ మధుశక ఫెర్మాండో (67 బంతుల్లో 49; 1 ఫోర్, 2 సిక్స్‌లు), పరణవితన (61 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కాస్త ప్రతిఘటించారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 38.4 ఓవర్లలో 160 పరుగులకే పరిమితమై పరాజయం పాలైంది. టోర్నీలో శతకం, రెండు అర్ధ శతకాలతో 318 పరుగులు చేసిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కగా, బౌలర్ హర్‡్ష త్యాగిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం వరించింది. ►ఆసియా కప్ అండర్–19 టైటిల్‌ను నెగ్గడం భారత్‌కిది ఆరోసారి. గతంలో 1989, 2003, 2012, 2014, 2016లలో కూడా భారత్ విజేతగా నిలిచింది. -
యువ భారత్ విజయం
కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు... ఐదు వన్డేల సిరీస్‌లోనూ విజయంతో బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 38.4 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ ఆటగాడు అజయ్ దేవ్ గౌడ్ 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మోహిత్ జాంగ్రా (2/14), యతిన్ (2/35), ఆయూశ్ (2/37) కూడా లంకను దెబ్బ తీశారు. 144 పరుగుల లక్ష్యాన్ని భారత్ 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి అధిగమించింది. అనూజ్ రావత్ (50; 5 ఫోర్లు), సమీర్ (31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
అచ్చు నాన్నలాగే..!
కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతున్న యూత్ టెస్టులో భారత అండర్–19 జట్టు విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 589 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఆయుష్ బదోని (205 బంతుల్లో 185 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయాడు. సహకారం అందించే బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో 15 పరుగుల దూరంలో నిలిచాడు. మరో వైపు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్ టెండూల్కర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 11 బంతులాడి దుల్షాన్ బౌలింగ్‌లో సూర్యబండారకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 1989లో పాకిస్తాన్‌తో గుజ్రన్‌వాలాలో ఆడిన తన తొలి వన్డేలో సచిన్ టెండూల్కర్ సున్నాకే ఔటైన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆట నిలిచే సమయానికి 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఫెర్నాండో (118 బంతుల్లో 104; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. చేతిలో ఏడు వికెట్లున్న లంక ఇంకా 168 పరుగులు వెనుకబడి ఉంది. -
అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు..
కొలంబొ: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ తన అంతర్జాతీయ తొలి వికెట్‌ను సాధించాడు. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత అండర్-19 జట్టులో అర్జున్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా భారత్ తరపున ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేపట్టింది. టీమిండియా అండర్-19 సారథి అనుజ్ రావత్ బౌలింగ్ దాడి అర్జున్‌తో ప్రారంభించాడు. తొలి ఓవర్లో ఒక ఫోర్‌తో సహా ఆరు పరుగులిచ్చిన ఈ పేసర్ తన తరువాతి ఓవర్లో లంక ఓపెనర్ ఆర్వీపీకే మిశ్రా (9) వికెట్ సాధించాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ తన తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ఇక మిగతా బౌలర్లు హర్ష్ త్యాగి (4/92), ఆయూష్ బడొని (4/24) చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించాడు. వినోద్కాంబ్లి అనందభాష్పాలు అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ సాధించడం పట్ల టీమిండియా మాజీ ఆటగాడు, సచిన్ బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాడికి శుభాకాంక్షలు తెలపుతూ భావోద్వేగంగా ట్వీటర్లో ట్వీట్ చేశాడు. ‘అర్జున్ వికెట్ తీయడం చూసి ఆనందభాష్పాలతో నా నోట మాట రావడం లేదు. నీ ఆట చూస్తుంటే నువ్వు పడిన కష్టం కనబడుతోంది. ఈ వికెట్‌తోనే సంతోషపడకు.. ఇది కేవలం ప్రారంభమాత్రమే. నువ్వు సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తొలి వికెట్ ఆనందాన్ని ఆస్వాదించు’ అంటూ కాంబ్లీ ట్వీట్ చేశాడు. Tears of joy rolled down when I saw this, have seen him grow up and put in the hard work in his game. Could not be more happy for you, Arjun. This is just the beginning, I wish you tons and ton of success in the days to come. Cherish your first wicket and enjoy the moment.👌 pic.twitter.com/vB3OmbaTWM — VINOD KAMBLI (@vinodkambli349) July 17, 2018 -
మాజీ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తనకు అవకాశం రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన యువ క్రికెటర్ బలవన్మరణం చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్లో సోమవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఆమిర్ హనీఫ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1990 దశకంలో పాక్ వన్డే జట్టులో సభ్యుడిగా కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. హనీఫ్ పెద్ద కుమారుడు మహమ్మద్ జర్యాబ్. ఇటీవల లాహోర్‌లో నిర్వహించిన ఓ టోర్నమెంట్లో కరాచీ అండర్-19 టీమ్ తరపున జర్యాబ్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ గాయం కారణంగా జర్యాబ్ టోర్నీ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. గాయం కోలుకున్నాక మళ్లీ ఛాన్స్ ఇస్తామని జర్యాబ్‌కు కోచ్, టీమ్ మేనేజ్ మెంట్ హామీ ఇచ్చింది. అయితే తాజాగా జరిగిన పాక్ అండర్-19 టీమ్ ఎంపికలో జర్యాబ్ ను పక్కనపెట్టారు. వయసు ఎక్కువగా ఉందన్న కారణంగానే ఎంపిక చేయలేదని కారణం చెప్పారు. జర్యాబ్ తీవ్ర మనస్తాపానికి లోనై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి, మాజీ క్రికెటర్ ఆమిర్ హనీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ అండర్-19 రికార్డుల ప్రకారం జర్యాబ్‌కు ఇంకా 19 ఏళ్ల వయసు రాలేదని, కుమారుడి మృతికి కోచ్, క్రికెట్ ఉన్నతాధికారులు కారణమని హనీఫ్ ఆరోపించారు. -
అర్జున్‌కు ఐదు వికెట్లు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దేశవాళీ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీలో సత్తాచాటాడు. రైల్వేస్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఎడంచేతి వాటం పేసర్ అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అర్జున్ ధాటికి రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయిన అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హడలెత్తించాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 389 పరుగులు సాధించగా... రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. ఇదే టోర్నీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ మూడు వికెట్లు... అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
జాతీయ చాంపియన్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ మహిళల అండర్–19 వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి చాంపియన్‌గా నిలిచింది. గుంటూర్లో గురువారం జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై 47 పరుగులతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 49.5 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఇ.పద్మజ (93 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, వి. పుష్పలత (34; 3 ఫోర్లు) రాణించింది. ముంబై బౌలర్లలో జెమీమా రోడ్రిగ్స్ 3 వికెట్లు పడగొట్టగా... ఫాతిమా జఫర్, జాన్వి, వృషాలి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం 193 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ముంబై 43.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతోన్న 17 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 26; 4 ఫోర్లు)ను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంతో ఆంధ్ర పని సులువైంది. భావన బౌలింగ్‌లో పద్మజకు క్యాచ్ ఇచ్చి జెమీమా వెనుదిరిగింది. సయాలి సట్ఘరే (57 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు) చివరి వరకు పోరాడినా మరో ఎండ్ నుంచి ఆమెకు తగిన సహకారం లభించలేదు. ఆంధ్ర బౌలర్లలో పద్మజ, భావన, శిరీష తలా 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆకట్టుకున్న పద్మజకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ‘బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ద టోర్నీ’గా ముంబైకి చెందిన జెమీమా (1013 పరుగులు) ఎంపికవగా, ఫాతిమా జఫర్ (26 వికెట్లు) ‘బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెలుచుకుంది. -
అర్జున్ టెండూల్కర్‌కు ఐదు వికెట్లు
ముంబై: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 మ్యాచ్‌లో అదరగొట్టాడు. ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదువికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్న లెఫ్టార్మ్ సీమర్ అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసి 95 పరుగులిచ్చి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 361 పరుగులు చేయగా.. ముంబై 506 పరుగులతో దీటుగా సమాధానమిచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 8 వికెట్లకు 411 పరుగులు సాధించగా... మ్యాచ్ ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై మూడు పాయింట్లు సంపాదించింది. -
భారత కుర్రాళ్లదే సిరీస్
మూడో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై జయభేరి హోవ్: భారత అండర్–19 జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3–0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత యువ జట్టు 169 పరుగుల తేడాతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ (127 బంతుల్లో 147; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించాడు. జిగ్నేశ్ పటేల్ (38), అభిషేక్ శర్మ (31) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మ్యాటీ పాట్స్ 4 వికెట్లు పడగొట్టగా, జాక్ ప్లామ్, ట్రెవస్కిస్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.5 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఆలౌటైంది. బాంటన్ (59; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో నాగర్కోటి 3, అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ చెరో 2 వికెట్లు తీశారు. -
కుర్రాళ్ల చివరి మ్యాచ్ ‘టై’
భారత్ అండర్–19 జట్టుదే వన్డే సిరీస్ ముంబై: భారత్, ఇంగ్లండ్ అండర్–19 జట్ల మధ్య జరిగిన ఐదో వన్డే ‘టై’ అయింది. దీంతో 3–1తో సిరీస్‌ను యువ భారత్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖెడే స్టేడియంలో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతికి ఒక పరుగు చేస్తే గెలిచే స్థితిలో ఉండగా... తీవ్ర ఒత్తిడికి లోనైన ఇషాన్ పోరెల్ (6) ప్యాటర్సన్ వైట్ బౌలింగ్‌లో కీపర్ హోల్డెన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో భారత్ గెలవాల్సిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మొదట ఇంగ్లండ్ జూనియర్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసింది. బర్ట్లెట్ (47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (45; 2 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఆయుష్ 3, ఇషాన్ పోరెల్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ కూడా 50 ఓవర్లలో సరిగ్గా 226 పరుగులే చేసి ఆలౌటైంది. రాధాకృష్ణన్ (65; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. 137 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును ఆయుష్ (40; 4 ఫోర్లు, ఒక సిక్స్), యశ్ ఠాకూర్ (30; 2 ఫోర్లు) ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే చివర్లో వీరిద్దరూ వెంటవెంటనే అవుటవ్వడం... ఆఖరి బంతికి ఇషాన్ కూడా నిష్క్రమించడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రూక్స్ 3 వికెట్లు తీయగా, బ్లాతెర్విక్, గాడ్సల్, రాలిన్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు. -
శుభ్‌మాన్ గిల్ అజేయ శతకం
మూడో వన్డేలో భారత్ విజయం ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో సిరీస్ ముంబై: ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (157 బంతుల్లో 138 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. భారత లెగ్ స్పిన్నర్ రాహుల్ చహల్ (4/33), లెఫ్టార్మ్ స్పిన్నర్ అనుకూల్ రాయ్ (3/39) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. ఇంగ్లండ్ తరఫున రాలిన్స్ (96; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీని చేజార్చుకోగా... బార్ట్లెట్ (55; 6 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. రాహుల్ చహల్ బౌలింగ్‌లో బార్ట్లెట్ అవుటయ్యాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. 216 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (50 బంతుల్లో 37 నాటౌట్)తో కలిసి శుభ్‌మాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. సిరీస్‌లో నాలుగో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది. -
అండర్–19 బాస్కెట్‌బాల్ రాష్ట్ర జట్ల ఎంపిక
రామచంద్రపురం : స్కూల్‌గేమ్స్ ఫెడరేష¯Œ¯ŒS అండర్ –19 బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ రాష్ట్ర జట్లను పోటీల అబ్జర్వర్, పీడీ సీతాపతి, జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి శనివారం ప్రకటించారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో మూడురోజులు నిర్వహించిన అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్ర జట్లకు ఎంపిక చేశామని, ఈ నెల 9 నుంచి నూజివీడులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఈ జట్లు ఆడతాయన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాసు తదితరులు ఎంపికల్లో పాల్గొన్నారు. బాలుర జట్టు నాగదుర్గాప్రసాద్, సాయిపవ¯ŒSకుమార్, మణికంఠ, అశోక్‌సాయికుమార్, రామరాజు (తూర్పుగోదావరి), కె.రోహిత్‌సాయి, సురేష్, భాస్కర అవినాష్ (గుంటూరు), ఎస్కే అబ్దుల్‌నాగూర్, రామ్‌గోపాల్( కృష్ణా), ఇమ్రాన్, హర్షంత్‌కుమార్,(చిత్తూరు), డీఎస్ నిషాంక్ గుప్తా (అనంతపురం), ఆదిత్యరెడ్డి(పశ్చిమగోదావరి), రేవంత్‌కుమార్(విశాఖ), కె.సాయికుమార్, ఉల్లాస్ (కడప), నాగవంశీ(కర్నూల్). బాలికల జట్టు పద్మావతి, సుకన్య, ప్రమీల, యమున (అనంతపురం), కె.దీప్తిప్రియ, ఎస్.కె.జహరాసుహానా, దుర్గ, శ్వేత (తూర్పు గోదావరి), ఎస్కే సుష్మాభాను అఖిల్( చిత్తూరు), పూర్ణ, మాధురి (పశ్చిమగోదావరి), హిమబిందు, ప్రియాంక (కృష్ణా), నందిత, నిరోషా(విశాఖ), ఐ.డి.భారతి(కర్నూల్), మహేశ్వరి(నెల్లూరు). -
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ముగ్గురి ఎంపిక
ఈ నెల 21 నుంచి ఔరంగాబాద్‌లో పోరు శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర పోటీల్లో కనబర్చిన పోరాట స్ఫూర్తినే జాతీయ పోటీల్లో చూపించి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు వైఎస్సాఆర్ కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థారుు స్కూల్‌గేమ్స్ అండర్-19 (ఇండర్మీడియెట్ స్థారుు) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీ ల్లో సిక్కోలు జట్టు తృతీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జ ట్టుకు ఇప్పిలి పీడీ కె.రవికుమార్ కోచ్‌గా వ్యవహరించారు. అరుుతే చిన్నచిన్న తప్పిదాల కారణంగా ఫైనల్ బెర్తును కోల్పోరుున శ్రీకాకుళం జట్టు టోర్నీ అంతటా రాణించడం శుభసూచికం. అరుుతే ఇదే పోటీల్లో జిల్లా తరఫున అత్యద్భుతంగా రాణించిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ పో టీలకు ఎంపికకావడం విశేషం. జి.హరిప్రసాద్(ఇప్పిలి), టి.శ్రీను(ఇప్పి లి), ఎ.రమణమూర్తి(తొగరాం) క్రీడాకారులు ఎంపికై నవారిలో ఉన్నారు. జాతీయ పోటీలకు నేడు పయనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్కూల్‌గేమ్స్ పోటీల్లో వీరుముగ్గురు ఏపీ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ పోటీల కోసం వీరు శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కోడిరామ్మూర్తి స్టేడియంలో గురువారం జరిగిన అభినందన, వీడ్కోలు కార్యక్రమంలో డీఎస్డీఓ మాట్లాడుతూ అనతికాలంలో రాష్ట్రస్థారుు సాఫ్ట్‌బాల్ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు చెరగని ముద్ర వేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షులు, సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా ప్రధా న కార్యదర్శి ఎం.వి.రమణ, కార్యనిర్వహన కార్యదర్శి ఆర్.రవికుమార్ పీఈటీలు పాల్గొన్నారు. కాగా సాఫ్ట్‌బాల్ సంఘ జిల్లా చైర్మన్, ప్రభుత్వ విప్ కె.రవికుమార్, అధ్యక్షులు బి.హరిధరరావు, కన్వీనర్ కె.అరుణ్‌కుమార్‌గుప్త, ఆనంద్‌కిరణ్, ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా కార్యదర్శి కృష్ణ, ఒలింపిక్ సంఘ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి సుందరరావు, పీఈటీలు క్రీడాకారును అభినందించారు.